ఇప్పుడిప్పుడే టెక్ కంపెనీలు కోలుకుంటున్నాయి. ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నాయి. అంతా సజావుగా సాగుతున్న వేళ ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్ళీ ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియక.. కంపెనీలోని ఉద్యోగులలో ఒక్కసారిగా భయం మొదలైంది.
వైర్డ్ గీక్ నివేదిక ప్రకారం.. ప్రొడక్ట్, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ విభాగంలో కోతలు ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఎంత మందిని తొలగించనున్నారు, ఎప్పుడు తొలగించనున్నారు అనే విషయాలు అధికారికంగా వెల్లడికాలేదు. వ్యాపారాన్ని నిర్వహించడంలో శ్రామిక శక్తి సర్దుబాట్లు తప్పనిసరి. సంస్థ భవిష్యత్తు కోసం ఈ తొలగింపు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
మైక్రోసాఫ్ట్ 2023లో కూడా లేఆప్స్ కింద ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ విభాగంలో 2,000 ఉద్యోగాలను తగ్గించింది. గత నెలలో కంపెనీ అజూర్‌లోని పాత్రలతో సహా దాదాపు 1000 స్థానాలపై ప్రభావం చూపిన రౌండ్ తొలగింపులను చేపట్టింది. గత కొన్ని రోజులుగా కంపెనీ వేలాదిమంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మరోమారు సంస్థ తీసుకున్న నిర్ణయం ఉద్యోగుల్లో భయాన్ని కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment