job cuts
-
ట్రంప్‌పై అదే వ్యతిరేకత
వాషింగ్టన్: అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ దేశాన్ని ముందుకు నడిపించే విధానంపై ప్రజల్లో ఇప్పటికీ అనుకూల వైఖరి కంటే వ్యతిరేక వైఖరే ఎక్కువగా కనిపి స్తోంది. ట్రంప్‌పై ప్రజామోదం, పని తీరు, నిర్ణయాలు, దేశాన్ని ఆయన సరైన దిశగా నడిపిస్తున్నారా అంటే లేదనే ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తమ్మీద ట్రంప్ పని తీరుపై 52 శాతం మంది పెదవి విరిచారు. 48 శాతం మంది మాత్రమే ట్రంప్ పాలన బాగుందన్నారు. ఫిబ్రవరి మధ్యలో సర్వే చేపట్టినప్పుడు సైతం దాదాపు ఇదే ఫలితం రావడం గమనార్హం. ఉద్యో గులపై వేటు సహా ఆయన విధానాలకు సొంత రిపబ్లికన్లు 90 శాతం మంది సానుకూలత చూపగా, ప్రతిపక్ష డెమో క్రాట్లు 90 శాతం మంది వ్యతిరేకత తెలిపారు. స్వతంత్రుల్లో 59 మంది కూడా ట్రంప్ తీరు నచ్చలేదన్నారు. ట్రంప్ విధానాలు దేశాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తు న్నాయని 45 శాతం మంది చెప్పగా సరైన దిశగానే దేశం సాగుతోందని 39 శాతం మంది బదులిచ్చారు. 15 శాతం మంది ఏ సమాధానమూ చెప్పలేదు. దేశం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్ర సమస్యల పై ట్రంప్ దృష్టి పెట్టడం లేదని 52 శాతం మంది, ప్రాధాన్యతలు బాగానే ఉన్నాయని 40 శాతం మంది అభిప్రాయం వెలిబుచ్చారు. మొత్త మ్మీద 18–34 ఏళ్ల గ్రూపులో 51 శాతం మంది ట్రంప్ పాలన సరిగా లేదని కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో మహిళలు కూడా 57 శాతం మంది ట్రంప్ ప్రభుత్వంపై అసంతృప్తి వెలిబుచ్చారు. ఎస్ఎస్ఆర్ సంస్థ ఫిబ్రవరి 24–28వ తేదీల మధ్య దేశవ్యాప్తంగా ర్యాండమ్‌గా ఎంపిక చేసిన 2,212 మందితో సర్వే చేపట్టింది. ఆన్లైన్లో, టెలిఫోన్ ద్వారా లేదా లైవ్ ఇంటర్వ్యూ ద్వారా చేపట్టిన ఈ సర్వే కచ్చితత్వం మైనస్ 2.4 శాతం పాయింట్లు అటూఇటుగా ఉండొచ్చని సీఎన్ఎన్ పేర్కొంది. కాగా, శుక్రవారం వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో తీవ్ర వాదోపవాదం జరిగిన ముందు రోజే ఈ పోల్ ముగియడంతో, ఆ ప్రభావం దీనిపై కనిపించదు.అక్రమ వలసలు రికార్డు స్థాయిలో తగ్గాయి: ట్రంప్అమెరికాపై అక్రమ వలసల ఆక్రమణ ముగిసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘‘మెక్సికో సరిహద్దులో అక్రమ వలసలు ఫిబ్రవరిలో చరిత్రాత్మక స్థాయిలో తగ్గాయి. నా కఠిన నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. ‘‘నా పాలనలో మొదటి పూర్తి నెల అయిన ఫిబ్రవరిలో అతి తక్కువ సంఖ్యలో అక్రమ వలసదారులు అమెరికాలో ప్రవేశించడానికి ప్రయత్నించారు. మెక్సికో సరిహద్దులో కేవలం 8,326 మంది అరెస్టయ్యారు. వారందరినీ వెంటనే బహిష్కరించాం’’ అని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. బైడెన్ హయాంలో నెలకు 3ల క్షల మంది పై చిలుకు చొప్పున అక్రమంగా ప్రవేశించారని ఆరోపించారు. వలసలు గణనీయంగా తగ్గాయన్న ప్రకటనను వార్తా నివేదికలు తిప్పికొట్టాయి. ‘‘బైడెన్ అధికారంలో ఉన్న చివరి వారంలో రోజుకు సగటున 2,869 సరిహ ద్దు అరెస్టులు జరిగాయి. ట్రంప్ అధికారం చేపట్టాక తొలి వారంలో 7,287 అరెస్టులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 1,041. అంటే తగ్గుదల కేవలం 60 శాతమే. వైట్‌హౌస్ చెబుతున్నట్టు 95 శాతం కాదు’’ అని ఫాక్స్ న్యూస్ తెలిపింది. -
టెక్ దిగ్గజం కీలక నిర్ణయం: మరికొంతమంది ఉద్యోగులపై వేటు!
కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటూ ఉంటే.. మరికొన్ని దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తగ్గించుకునే పనిలో ఉన్నాయి. ఈ జాబితాలో గూగుల్ ఒకటి. ఈ కంపెనీ తాజాగా తన క్లౌడ్ డివిజన్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది.గూగుల్ ఉద్యోగులను తొలగించిన విషయం వెల్లడైనప్పటికీ.. ఎంతమంది ఉద్యోగులను తొలగించారు అనేదానికి సంబంధించిన విషయం వెల్లడికాలేదు. అయితే తొలగింపులు కొన్ని విభాగాలకు మాత్రమే పరిమితమైనట్లు తెలుస్తోంది. సంస్థ దీర్ఘకాలిక విజయాల కోసం కంపెనీ కీలకమైన కొన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి యోచిస్తోంది. ఈ సమయంలో కొన్ని సర్దుబాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఈ కారణంగానే.. కొంతమంది ఉద్యోగులను తొలగించినట్లు గూగుల్ ప్రతినిధి వెల్లడించారు.బెంగళూరులో గూగుల్ కొత్త ఆఫీస్టెక్ దిగ్గజం గూగుల్ (Google) బెంగళూరులో తమ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించింది. దీనికి ’అనంత’ అని పేరు కూడా పెట్టింది. అనంత అంటే 'అపరిమితం' అని అర్థం. ఇది టెక్నాలజీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అపరిమితమైన అవకాశాలను సూచిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న.. భారీ ఆఫీసులలో ఇది ఒకటని పేర్కొంది. -
డీబీఎస్‌లో 4000 ఉద్యోగాలు కట్
ముంబై: అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థ డీబీఎస్ గ్రూప్ కృత్రిమ మేధ (ఏఐ) అమలుతో వచ్చే మూడేళ్లలో 10 శాతం మేర సిబ్బందిని తగ్గించుకోనున్నట్టు ప్రకటించింది. తమ కార్యకలాపాల్లో ఏఐని మరింత పెద్ద ఎత్తున వినియోగించనున్నట్టు సంస్థ సీఈవో పీయూష్ గుప్తా తెలిపారు. డీబీఎస్ గ్రూప్‌లో 15 ఏళ్ల తన పదవీ కాలంలో మొదటిసారి ఉద్యోగాల సృష్టి పరంగా ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ఏఐ అన్నది భిన్నమైనదని, గతంలో వచ్చిన మరే ఇతర సాంకేతిక పరిజ్ఞానం మాదిరి కాదన్నారు. వచ్చే మూడేళ్లలో 4,000 మంది (10 శాతం) సిబ్బంది తగ్గిపోనున్నట్టు తన ప్రస్తుత అంచనాగా చెప్పారు. నాస్కామ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు. ‘‘ఏఐ ఎంతో శక్తిమంతమైనది. తనను తాను సొంతంగా ఆవిష్కరించుకోగలదు. మరొకరిని అనుసరించగలదు. ఇది ఎంతో భిన్నమైనది. గత పదేళ్లలో గ్రూప్‌లో ఉద్యోగాల కోత అన్నదే లేదు’’అని గుప్తా ఏఐ రాకతో గ్రూప్ స్థాయిలో చోటుచేసుకోనున్న మార్పులను వివరించారు. డీబీఎస్ గ్రూప్ రెండేళ్ల క్రితమే జెనరేటివ్ ఏఐ సొల్యూషన్లను అమలు చేయడం ప్రారంభించిందని, ఇందుకు సంబంధించి పూర్తి ప్రయోజనాలను ఇంకా చవిచూడాల్సి ఉందన్నారు. కస్టమర్లను చేరుకోవడం, క్రెడిట్ అండర్‌రైటింగ్ (రుణ వితరణ), నియామకాల్లో ఏఐని డీబీఎస్ గ్రూపు అమలు చేస్తోంది. కాంట్రాక్టు సిబ్బందే.. వచ్చే మూడేళ్లలో 4,000 మందితగ్గింపు అన్నది ప్రధానంగా కాంట్రాక్టు, తాత్కాలిక సిబ్బంది రూపంలోనే ఉంటుందని డీబీఎస్ గ్రూప్ వివరణ ఇచ్చింది. సహజంగా కంపెనీ నుంచి వెళ్లిపోయే ఉద్యోగుల రూపంలోనూ సిబ్బంది తగ్గనున్నట్టు తెలిపింది. -
మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగుల తొలగింపు
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. (Microsoft layoffs) మెరుగైన పనితీరు ప్రదర్శించని ఉద్యోగులపై తొలగింపు వేటు వేసింది. బిజినెస్ ఇన్సైడర్ పత్రికలో పేర్కొన్న కథనం ప్రకారం.. మైక్రోసాఫ్ట్ యూఎస్‌లో కొందరు ఉద్యోగులను వారి పనితీరు ఆధారంగా తొలగించడం ప్రారంభించింది.తాజాగా తొలగింపులకు గురైన ఉద్యోగులకు మెడికల్, ప్రిస్క్రిప్షన్, డెంటల్ హెల్త్‌కేర్ ప్రయోజనాలు తక్షణమే ముగుస్తాయని కంపెనీ తొలగింపు లేఖల్లో పేర్కొన్నట్లుగా ఇన్సైడర్ కథనంలో ఉదహరించింది. ముగ్గురు ఉద్యోగులకైతే తొలగింపు పరిహారాన్ని కూడా చెల్లించలేదని పేర్కొంది."మీ పనితీరు కనీస ప్రమాణాలను, అంచనాలను అందుకోలేకపోవడమే మీ తొలగింపునకు కారణం" అని తొలగింపు లేఖల్లో కంపెనీ పేర్కొంది. "మీరు తక్షణమే అన్ని విధుల నుండి వైదొలుగుతున్నారు. మైక్రోసాఫ్ట్ సిస్టమ్‌లు, ఖాతాలు, కార్యాలయాలకు యాక్సెస్‌ను ఈరోజు నుంచే తొగిస్తున్నాం. ఇక మైక్రోసాఫ్ట్ తరఫున మీరు ఇటువంటి పని చేయలేరు" అని వివరించింది.ఇది చదివారా? ఉద్యోగులకు మరో షాకిచ్చిన టీసీఎస్..ఇక తొలగింపునకు గురైన ఉద్యోగి భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్‌లో మరో కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు కంపెనీలో సదరు ఉద్యోగి గత పనితీరు, తొలగింపునకు గురైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కూడా ఆ లేఖల్లో పేర్కొన్నారు.గతేడాది జూన్ చివరి నాటికి మైక్రోసాఫ్ట్ సంస్థలో దాదాపు 2,28,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు ఉన్నారు. ఇవే కాదు.. మైక్రోసాఫ్ట్ ఇటీవల సెక్యూరిటీ, ఎక్స్పీరియన్స్ అండ్ డివైజెస్, సేల్స్, గేమింగ్‌లో విభాగాల్లోనూ పలువురు ఉద్యోగులను తొలగించింది. అయితే తొలగింపులు స్వల్ప స్థాయిలోనే ఉండటం, సమీప కాలంలోనే వీటిని భర్తీ చేయనుండటంతో మొత్తంగా కంపెనీ హెడ్‌కౌంట్‌లో పెద్దగా తగ్గింపు ఉండకపోవచ్చు.భారత్‌లో 2587 మంది టెకీలు2024 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో మొదటి ఐదు భారతీయ ఐటీ సంస్థల్లో నికరంగా 2,587 మంది ఉద్యోగులు తగ్గారు. (Job cuts) గత త్రైమాసికంతో పోలిస్తే ఇది పూర్తిగా విరుద్ధం. సెప్టెంబర్ త్రైమాసికంలో 15,033 మంది ఉద్యోగులు పెరిగారు. గడచిన మూడు నెలల కాలంలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్ 7,725 మంది ఉద్యోగులను పెంచుకోగా, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలు మాత్రం ఉద్యోగులను తగ్గించాయి. -
5 ఐటీ కంపెనీలు.. 3 నెలలు.. 2587 మంది టెకీలు..
దేశ ఐటీ రంగం (IT sector) ఆటోమేషన్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ద్వారా పరివర్తన చెందుతోంది. గతంలో సాంప్రదాయకంగా శ్రామికశక్తి విస్తరణపై దృష్టి సారించిన ఐటీ పరిశ్రమ ఇప్పుడు తక్కువ నుండి మధ్యస్థ సంక్లిష్టత కలిగిన పనులను ఆటోమేట్ చేస్తోంది. ఫలితంగా నియామక విధానాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి.2024 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో మొదటి ఐదు భారతీయ ఐటీ సంస్థల్లో నికరంగా 2,587 మంది ఉద్యోగులు తగ్గారు. (Job cuts) గత త్రైమాసికంతో పోలిస్తే ఇది పూర్తిగా విరుద్ధం. సెప్టెంబర్ త్రైమాసికంలో 15,033 మంది ఉద్యోగులు పెరిగారు. గడచిన మూడు నెలల కాలంలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్ 7,725 మంది ఉద్యోగులను పెంచుకోగా, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలు మాత్రం ఉద్యోగులను తగ్గించాయి.మార్చి త్రైమాసికంలోనూ ఇదే ట్రెండ్ఇలాంటి ట్రెండ్ 2024 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలోనూ కనిపించింది. ఐటీ సంస్థలు సమిష్టిగా 12,600 ఉద్యోగాలను తగ్గించాయి. అంతకు క్రితం ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం 60,000 మంది ఉద్యోగులను జోడించిన క్రమంలో వెంటనే ఈ స్థాయిలో ఉద్యోగులు తగ్గడం గమనార్హం.గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCC) ద్వారా వృద్ధి పెరుగుతున్న నేపథ్యంలో 2025 ఆర్థిక ఏడాదిలో ఐటీ రంగం గత ఆర్థిక సంవత్సరం శ్రామికశక్తిలో నాలుగింట ఒక వంతు కంటే తక్కువగానే జతవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్క్‌ఫోర్స్ జోడింపులో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు వరుసగా రెండవ సంవత్సరం కూడా సాంప్రదాయ ఐటీ సంస్థలను అధిగమిస్తాయని భావిస్తున్నారు.కోవిడ్ మహమ్మారి సమయంలో ఐటీ పరిశ్రమ దూకుడుగా నియామకాలు చేపట్టిందని, ఫలితంగా వర్క్‌ఫోర్స్ అధికంగా పోగుపడిందని ఎవరెస్ట్ గ్రూప్‌కు చెందిన పీటర్ బెండోర్-శామ్యూల్ చెబుతున్నారు. కంపెనీలు నియామకాలను తగ్గించడం, రీబ్యాలెన్స్ కోసం అట్రిషన్‌ను అనుమతించడం వలన ఉత్పాదకత లాభాలు కొంత ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. రాబడి వృద్ధి ఇకపై కేవలం హెడ్‌కౌంట్‌ను పెంచడంపై ఆధారపడి ఉండదని, నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం పెరుగుతున్న డిమాండ్‌తో అధిక బిల్లింగ్ రేట్లను పెంచుతుందని హెచ్‌సీఎల్‌టెక్ సీఈవో పేర్కొన్నారు.అమెరికా ఐటీలో అనిశ్చితిఅమెరికాలో వచ్చిన కొత్త పరిపాలనలో హెచ్ వన్ బీ (H1B) వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలతో సహా ఇమ్మిగ్రేషన్ విధానాలు మారవచ్చు కాబట్టి యూఎస్‌లోని భారతీయ ఐటీ నిపుణులు అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. కొంతమంది నిపుణులు యూరప్ వంటి దేశాల్లో అవకాశాలను అన్వేషిస్తున్నారు. అనిశ్చితి ఉన్నప్పటికీ నైపుణ్యం కలిగిన నిపుణులను నియమించుకునేందుకు యూఎస్ కంపెనీలు ప్రయత్నిస్తాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. -
బ్యాంకుల్లో 2 లక్షల ఉద్యోగాలకు ముప్పు..
విస్తృతంగా పెరుగుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత బ్యాంకింగ్ రంగంలో (banks) లక్షలాది ఉద్యోగాలకు ముప్పుగా పరిణమించింది. బ్లూమ్‌బెర్గ్ (Bloomberg) నివేదికల ప్రకారం.. ప్రస్తుతం మానవ కార్మికులు నిర్వహిస్తున్న పనులను కృత్రిమ మేధస్సు (AI) ఆక్రమించడంతో అంతర్జాతీయ బ్యాంకులు రాబోయే మూడు నుండి ఐదు సంవత్సరాలలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలను తొలగించనున్నాయి.ఆయా బ్యాంకుల చీఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అధికారులను బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ సర్వే చేసిన తాజాగా ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. ఒక్కో బ్యాంకు సగటున తమ వర్క్‌ఫోర్స్‌లో నికరంగా 3% మందిని తగ్గిస్తుందని భావిస్తున్నారు. క్లయింట్ ఫంక్షన్లను కూడా బాట్లు(ఏఐ) నిర్వహించడం వల్ల కస్టమర్ సేవల్లో మార్పులు రానున్నాయి. ఇక కేవైసీ విధులను నిర్వర్తించే పాత్రలకు ముప్పు తప్పదు.ఎక్కువ మంది ఇదే చెప్పారు..మొత్తం 93 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సర్వేలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది మొత్తం హెడ్‌కౌంట్‌లో 5% నుంచి 10% క్షీణించవచ్చని అంచనా వేస్తున్నారు. బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ చేసిన ఈ సర్వేలో సిటీ గ్రూప్ (Citigroup), జీపీ మోర్గాన్ చేజ్ & కో (JPMorgan Chase & Co), గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్ (Goldman Sachs) వంటి దిగ్గజ బ్యాంకింగ్ సంస్థలు ఉన్నాయి.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలపై ప్రభావం పడినా బ్యాంకులకు మాత్రం మెరుగైన ఆదాయాలను అందించనున్నాయి. బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ ప్రకారం.. జనరేటివ్ ఏఐ ఉత్పాదకతను పెంచడం వల్ల 2027లో బ్యాంకులు 12% నుండి 17% ప్రీ-టాక్స్ లాభాలను చూడగలవు. ప్రతి పది మందిలో ఎనిమిది మంది జనరేటివ్ ఏఐ ఉత్పాదకతను, ఆదాయ సృష్టిని రాబోయే మూడు నుండి ఐదు సంవత్సరాలలో కనీసం 5% పెంచుతుందని భావిస్తున్నారు.ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో నిర్వహణను వేగవంతం చేయడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి తమ ఐటీ వ్యవస్థలను ఆధునీకరణ కోసం సంవత్సరాలు గడిపిన బ్యాంకులు.. ఉత్పాదకతను మరింత మెరుగుపరచగల కొత్త తరం ఏఐ సాధనాల్లోకి ప్రవేశించాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇతర రంగాల కంటే బ్యాంకింగ్ పరిశ్రమలోనే ఎక్కువ ఉద్యోగాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిటీ గ్రూప్ గత జూన్‌లోనే ఒక నివేదికలో పేర్కొంది. బ్యాంకింగ్‌లో దాదాపు 54% ఉద్యోగాలు ఆటోమేటెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని సిటీ పేర్కొంది. -
ఒత్తిడిలో ఉన్నారా...? ఉద్యోగం ఉఫ్
సంస్థలో సరదాగా అంతర్గత సర్వే అంటే ప్రతి ఒక్క ఉద్యోగి ఖచ్చితంగా స్పందిస్తారు. సర్వేలో అడిగే ప్రశ్నలు వివాదాస్పదమైనవి కాకుండా సాధారణంగా ఉంటే ఏ ఉద్యోగి అయినా స్వేచ్ఛగా, నిర్మొహమాటంగా సమాధానమిస్తారు. తమ అభిప్రాయాలను సంస్థ యాజమాన్యంతో పంచుకుంటారు. అలా ఉద్యోగులు చెప్పిన విషయాలే తమ ఉద్యోగం ఊడటానికి కారణమని సదలు ఉద్యోగులు తెల్సుకుని షాక్‌కు గురయ్యారు. ఉద్యోగుల్ని తొలగించే ఉద్దేశ్యం ఉంటే నేరుగా ఆ ఉద్యోగులకు చెప్పాలిగానీ ఇలా సర్వే వంకతో ఉద్యోగం నుంచి తొలగించడమేంటని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. నోయిడా కేంద్రంగా పనిచేసే ఒక అంకుర సంస్థ చేసిన నిర్వాకం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. యస్ అని చెబుతున్నారా? పనివేళల్లో పని కారణంగా మీరు ఒత్తిడికి గురి అవుతున్నారా? అంటూ ‘యస్మేడమ్’అనే అంకురసంస్థ తన ఉద్యోగులతో అంతర్గత ఈమెయిల్ సర్వే చేపట్టింది. ఈ సంస్థ ఇంటి వద్ద హెయిర్ కటింగ్, మసాజ్, ఇతరత్రా బ్యూటీ, వెల్నెస్ సేవలను అందిస్తోంది. ఈ సర్వేలో భాగంగా చాలా మంది ఉద్యోగులు తమ తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేశారు. వీటిని సేకరించిన సంస్థ.. ఒత్తిడిగా ఫీల్ అవుతున్నాం అని సమాధానం చెప్పిన వారందరినీ తొలగిస్తున్నట్లు వాళ్లకు విడిగా ఈమెయిల్ సందేశాలు పంపింది. ఇతర ఉద్యోగులకు వివరణ సందేశాలు పంపింది. ‘‘ఒత్తిడి ఉందా అని మేం అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చి సర్వేలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీ స్పందనకు మేం చాలా విలువ ఇస్తున్నాం. పనిచేసేటప్పుడు ఒక్కరు కూడా ఒత్తిడిగా ఫీల్ అవ్వకూడదు అనేది సంస్థ సిద్ధాంతం. ఈ మేరకు ఉద్యోగుల విషయంలో సంస్థ ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. తదుపరి వివరాలు త్వరలో తెలియజేస్తాం’’అని కంపెనీ పేర్కొంది. కంపెనీ మానవవనరుల విభాగ సారథి అషు అరోరా ఝా పేరిట వచ్చిన ఈమెయిల్ సందేశాలను చూసి సదరు ఉద్యోగులు అవాక్కయ్యారు. ‘‘ఒత్తిడిగా ఉందని చెబితే పిలిచి మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలిగానీ ఇలా ఏకంగా ఉద్యోగం ఊడపీకేస్తారా? అంటూ జాబ్ కోల్పోయిన ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేశారు. సర్వేలో ‘యస్’అని చెప్పిన దాదాపు 100 మందిని సంస్థ తొలగించిందని తెలుస్తోంది. ఇండిగో డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ డైరెక్టర్ శితిజ్ డోగ్రా చేసిన ఒక పోస్ట్‌తో ఈ ‘ఉద్యోగుల ఉద్వాసన పర్వం’వెలుగులోకి వచ్చింది. ‘‘నిజాయతీగా సమాధానం చెబితే సంస్థ ఇలాంటి మతిలేని నిర్ణయం తీసుకుంటుందా?’’అని చాలా మంది నెటిజన్లు సంస్థ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఘటనపై ఆలిండియా ఎంప్లాయీ అసోసియేషన్ స్పందించింది. ‘‘కార్మిక వ్యవస్థలోని లోపాలను కొన్ని సంస్థలు పూర్తిగా దురి్వనియోగం చేస్తున్నాయి. ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చే స్తోమత లేకపోతే ముందుగా అసలు ఉద్యోగాల్లోకి తీసుకోకండి. ఆరోగ్యకరమైన ఉద్యోగ వాతావరణాన్ని కల్పించలేకపోతే ఎవరికీ ఉద్యోగం ఇవ్వకండి. పిచ్చిపిచ్చి కారణాలు చెప్పి ఉద్యోగులను మానసికంగా వేధించకండి’’అని వ్యాఖ్యానించింది. ‘‘హేతుబద్దత లోపించిన అనైతిక నిర్ణయం ఇది. ఉద్యోగుల సంఖ్య తగ్గించుకునేందుకు సంస్థలు ఇలాంటి చవకబారు నిర్ణయాలు తీసుకుంటారని ఇప్పుడే చూస్తున్నాం. ఉద్యోగలు పనిసమయాల్లో ఒత్తిడిగా ఫీల్ అయ్యారోలేదో తెలీదుగానీ ఈ వార్త తెల్సి నిజంగా చాలా ఒత్తిడికి గురై ఉంటారు. ఇది అందరూ ఒత్తిడిగా ఫీల్ అయ్యే ఘటన’’అని పలువురు పెదవి విరిచారు. -
నిస్సాన్‌లో భారీగా ఉద్యోగాల కోత
టోక్యో: ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటార్ కార్ప్ అమ్మకాలు క్షీణించి, నష్టాలు పెరిగిపోవడంతో భారీ ఉద్యోగాలు, వేతనాల కోత దిశగా కఠిన చర్యలు ప్రకటించింది. సెపె్టంబర్ త్రైమాసికంలో 9.3 బిలియన్ యెన్ల నష్టాన్ని మూటగట్టుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 191 బిలియన్ యెన్ల లాభం నుంచి, భారీ నష్టాల్లోకి వెళ్లడం గమనార్హం. అంతేకాదు త్రైమాసిక విక్రయాలు 3.1 ట్రిలియన్ యెన్ల నుంచి 2.9 ట్రిలియన్ యెన్లకు క్షీణించాయి. దీంతో అంతర్జాతీయంగా 9,000 మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నట్టు నిస్సాన్ ప్రకటించింది. సంస్థకున్న 1,33,000 మంది ఉద్యోగుల్లో ఇది 6 శాతానికి సమానం. అంతేకాదు తయారీని 20 శాతం తగ్గించుకోనున్నట్టు తెలిపింది. తన వేతనంలో 50 శాతం కోత విధించుకుంటున్నట్టు కంపెనీ సీఈవో మకోటో ఉచ్చిద ప్రకటించారు. అయితే, ఏ ప్రాంతంలో సంస్థ పనితీరుపై ప్రభావం పడిందన్నది ఉచ్చిద వెల్లడించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి కంపెనీ లాభం 19.2 బిలియన్ యెన్లకు తగ్గిపోయింది. -
త్వరలో 7,000 మందికి జాబ్ కట్! ఎక్కడంటే..
ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ రంగంలో సేవలందిస్తున్న బాష్ కంపెనీ తన ఉద్యోగులకు తగ్గించబోతున్నట్లు సంకేతాలిచ్చింది. జర్మనీలోని తన ప్లాంట్‌లో పని చేస్తున్న దాదాపు 7,000 మంది ఉద్యోగులను కొలువుల నుంచి తొలగించనున్నట్లు జెక్పోస్పోలిటా నివేదించింది.జెక్పోస్పోలిటా నివేదికలోని వివరాల ప్రకారం..బాష్ సీఈఓ స్టీఫెన్ హర్తంగ్ మాట్లాడుతూ..‘ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఆటోమోటివ్ సేవలందిస్తున్న బాష్ కంపెనీ ఉద్యోగులను తగ్గించే పనిలో నిమగ్నమైంది. జర్మనీ ప్లాంట్‌లోని దాదాపు 7,000 మంది సిబ్బందికి ఉద్వాసన కల్పించనుంది. ప్రధానంగా ఆటోమోటివ్ సప్లై సెక్టార్లో, టూల్స్ డివిజన్, గృహోపకరణాల విభాగంలో పనిచేసే వారు ఈ నిర్ణయం వల్ల త్వరలో ప్రభావం చెందవచ్చు’ అని చెప్పారు.విభిన్న రంగాల్లో సిబ్బంది సర్దుబాటు‘కంపెనీ 2023లో దాదాపు 98 బిలియన్ డాలర్ల(రూ.8.18 లక్షల కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. ఈ సంవత్సరం అమ్మకాలపై రాబడి అధికంగా 4 శాతంగా ఉంటుందని అంచనా వేశాం. 2026 నాటికి ఇది ఏడు శాతం ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే 2024లో కంపెనీ అంచనాలను చేరుకోకపోవచ్చు. ప్రస్తుతానికి మా సిబ్బందిని విభిన్న విభాగాల్లో మరింత సర్దుబాటు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నాను’ అని చెప్పారు.ఇదీ చదవండి: స్విగ్గీకి రూ.35,453 జరిమానా!రూ.66 వేలకోట్లతో కొనుగోలుబాష్ కంపెనీ ఉద్యోగులను తగ్గించాలని భావిస్తున్నప్పటికీ ఇతర కంపెనీల కొనుగోలుకు ఆసక్తిగా ఉందని నివేదిక ద్వారా తెలిసింది. బాష్ సంస్థ ఐరిష్ కంపెనీ జాన్సన్ కంట్రోల్స్‌ను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద కొనుగోలుగా ఉండబోతున్న ఈ డీల్ విలువ ఏకంగా ఎనిమిది బిలియన్ డాలర్లు(రూ.66 వేలకోట్లు)గా ఉంది. హీట్ పంప్, ఎయిర్ కండిషనింగ్ పరిశ్రమలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ కొనుగోలు ఎంతో ఉపయోగపడుతుందని నివేదిక తెలిపింది. -
‘ఎక్స్’లో ఉద్యోగాల కోత.. ఇంజినీర్లు ఇంటికి..!
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీల్లో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్) భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.‘ఎక్స్’ అమలు చేస్తున్న లేఆఫ్‌ల ప్రభావం ప్రధానంగా దాని ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులపై పడిందని సంస్థ వర్గాలు, వర్క్‌ప్లేస్ ఫోరమ్ బ్లైండ్‌లోని పోస్ట్‌లను ఉటంకిస్తూ ‘ది వెర్జ్’ నివేదిక పేర్కొంది. తొలగింపునకు గురైన ఉద్యోగుల సంఖ్య ఖచ్చితంగా తెలియరాలేదు. కంపెనీ కోసం మీరు చేసేందేంటో ఒక పేజీ సారాంశాన్ని సమర్పించాలని ఉద్యోగులను కోరిన రెండు నెలల తర్వాత లేఆఫ్‌లు వచ్చాయి.దీనిపై మస్క్ కానీ, ‘ఎక్స్’ అధికారులు గానీ ఇంకా వ్యాఖ్యానించలేదు. స్టాక్ గ్రాంట్ల గురించి ఎంతగానో ఎదురుచూస్తున్న సిబ్బందికి ఇటీవల ఎలాన్ మస్క్ ఈమెయిల్ పంపినట్లు వార్తా నివేదికలు వచ్చాయి. ఉద్యోగుల పనితీరు, ప్రభావం ఆధారంగా వారికి స్టాక్ ఆప్షన్స్ కేటాయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే స్టాక్‌ను పొందడానికి కంపెనీకి తాము చేశామో తెలియజేస్తూ నాయకత్వానికి ఒక పేజీ సారాంశాన్ని సమర్పించాలని సిబ్బందిని ఆదేశించిట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పరిస్థితేంటి? కలవరపెడుతున్న గూగుల్ సీఈవో ప్రకటన!ఎలాన్ మస్క్ యాజమాన్యంలో ఎంకెన్ని లేఆఫ్‌లు ఉంటాయోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 2022లో ట్విటర్‌ను కొనుగోలు చేసిన మస్క్ దాదాపు 80 శాతం అంటే 6,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించారు. డైవర్సిటీ, ఇన్‌క్లూషన్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, డిజైన్ వంటి అన్ని విభాగాల్లోనూ లేఆఫ్‌లు అమలు చేశారు. కంటెంట్ మోడరేషన్ టీమ్‌ను కూడా విడిచిపెట్టలేదు. -
నోకియాలో ఉద్యోగాల కోత.. ఈ సారి ఎంతమందంటే?
ఫిన్లాండ్కు చెందిన టెక్ కంపెనీ నోకియా ఉద్యోగాల కోతలను ప్రకటించింది. కంపెనీ చైనాలో దాదాపు 2,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. కంపెనీ ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా యూరప్‌లో కూడా అదనంగా మరో 350 మందిని తొలగించింది. యూరప్‌లో ఉద్యోగాల కోతలను గురించి సంస్థ ప్రతినిధి ధృవీకరించినప్పటికీ.. చైనాలో ఉద్యోగుల తొలగింపు గురించి ప్రస్తావించలేదు.చైనా నోకియా కంపెనీలో 10,400 మంది ఉద్యోగులు ఉండగా.. ఐరోపాలో వీరి సంఖ్య 37,400గా ఉంది. ఖర్చులను తగ్గించి 2026 నాటికి సుమారు 868 మిలియన్ డాలర్ల నుంచి 1.2 బిలియన్ డాలర్లు లేదా రూ.7,300 కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ఆదా చేయాలని నోకియా భావిస్తోంది.నోకియాకు కీలకమైన మార్కెట్లలో చైనా ఒకటి. అయితే.. హువావే, జెడ్‌టిఇ వంటి చైనా కంపెనీలను యుఎస్ నిషేధించడంతో, చైనా కంపెనీలు నోకియా, ఎరిక్సన్ వంటి వాటితో తమ ఒప్పందాలను తగ్గించుకున్నాయి. 2019లో నోకియా నికర అమ్మకాలలో చైనా వాటా 27 శాతం కాగా.. ప్రస్తుతం ఇది 6 శాతానికి తగ్గింది.నోకియా ఉద్యోగుల తొలగింపు చేపట్టకముందే.. ఈ వారం ప్రారంభంలో మెటా సంస్థ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్‌ల విభాగంలోని టీమ్‌లలో కూడా ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. అయితే ఏ విభాగంలో ఎంత మంది ఉద్యోగులను తొలగించారనేది కంపెనీ వెల్లడించలేదు. -
సమ్మె ఎఫెక్ట్.. 17వేల ఉద్యోగాల కోత
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్.. కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో సుమారు 10 శాతం మందిని తొలగించడానికి సన్నద్ధమైంది. సీఈఓ కెల్లీ ఓర్ట్బర్గ్ ప్రకారం.. ఏరోస్పేస్ దిగ్గజం 17,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.సియాటెల్ ప్రాంతంలో బోయింగ్ ఉద్యోగులు సుమారు 33,000 మంది నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె కారణంగా 737 మ్యాక్స్, 767, 777 జెట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కంపెనీ భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, ఉద్యోగులను తొలగించడానికి సంస్థ సిద్ధమైంది.ప్రస్తుతం బోయింగ్ ఉన్న పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు చాలా అవసరమని కంపెనీ సీఈఓ పేర్కొన్నారు. బోయింగ్ తొలగించనున్న ఉద్యోగులలో మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్స్ ఉండనున్నట్లు సమాచారం. అయితే ఏ విభాగంలో ఎంతమందిని తొలగించనున్నారు అనే వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.ఇదీ చదవండి: గూగుల్‌లో జాబ్ కోసం ఇవి తప్పనిసరి: సుందర్ పిచాయ్బోయింగ్ ఉద్యోగుల సమ్మె కారణంగా విమానాల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో 777ఎక్స్ జెట్ డెలివరీలు ఆలస్యం కానున్నాయి. ఈ జెట్ డెలివరీలు 2026లో జరగాల్సి ఉంది. కానీ ఉత్పత్తి ఆలస్యం కావడం వల్ల డెలివరీలు మరింత ఆలస్యమయ్యాయి. దీనివల్ల సంస్థ షేర్స్ కూడా 1.1 శాతం క్షీణించాయి. ప్రస్తుతం కంపెనీ ఆర్థికంగా నిలబడటానికి ఉద్యోగుల తొలగింపు చాలా అవసరం. -
టెకీల పాలిట దారుణంగా ఆగస్ట్ నెల..
గడిచిన ఆగస్ట్ నెల టెకీల పాలిట దారుణంగా పరిణమించింది. ఈ ఒక్క నెలలోనే టెక్ రంగంలో ఏకంగా 27,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. 40 కంటే ఎక్కువ కంపెనీలు లే-ఆఫ్‌లను ప్రకటించాయి. ఈ తాజా రౌండ్ తొలగింపులను కలుపుకొంటే గడిచిన ఏడాదిగా 422 కంపెనీలలో లేఆఫ్‌లు 136,000 లకు పెరిగాయి.ఈ ఉద్యోగ కోతల్లో ఇంటెల్ అగ్రగామిగా ఉంది. ఇది 15,000 మంది ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఇది దాని ఉద్యోగులలో 15%. సీపీయూ చిప్ టెక్నాలజీలో కంపెనీ అగ్రగామిగా ఉన్నప్పటికీ అధిక వ్యయాలు, తక్కువ మార్జిన్ల కారణంగా ఖర్చుల తగ్గింపు ప్రణాళికకు పూనుకుంది. 2020 నుంచి 2023 మధ్యకాలంలో కంపెనీ 10% ఎక్కువ మంది ఉద్యోగులను ఇంటెల్ నియమించుకుంది.ఇక టెలికమ్యూనికేషన్స్ పరికరాల తయారీ సంస్థ సిస్కో సిస్టమ్స్ తన వర్క్ ఫోర్స్‌లో దాదాపు 6,000 మంది లేదా 7 శాతం మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు తెలిపింది. జాబితాలో మరొక పెద్ద పేరు ఐబీఎం. ఈ కంపెనీ చైనాలో దాని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఇది వెయ్యి మందికి పైగా ఉద్యోగులను తొలగింపునకు దారితీసింది.మార్కెట్ పరిస్థితులు, మందగించిన ఆర్థిక కార్యకలాపాల కారణంగా జర్మన్ చిప్‌మేకర్ ఇన్ఫినియన్ కూడా 1,400 మంది ఉద్యోగులను తొలగించి, మరో 1,400 మందిని తక్కువ ఖర్చుతో కూడిన ప్రాంతాలకు బదిలీ చేయాలని ప్రణాళిక రచించింది. గోప్రో కంపెనీ తమ వర్క్‌ఫోర్స్‌లో 15% లేదా దాదాపు 140 మంది తగ్గించింది. ఇక యాపిల్ 100 మంది ఉద్యోగులను తొలగించింది.డెల్ టెక్నాలజీస్ కూడా భారీగానే తొలగింపులు చేపట్టనున్నట్లు వార్తల్లో నిలిచింది. బెంగళూరుకు చెందిన రేషామండి అనే అగ్రిటెక్ సంస్థ మొత్తం సిబ్బందిని తొలగించి మూతపడింది. వెబ్ బ్రౌజర్ కంపెనీ అయిన బ్రేవ్ 27 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.సోషల్ మీడియా సంస్థ షేర్‌చాట్ తన ఉద్యోగులలో 5% మందిని వదులుకుంటున్నట్లు ప్రకటించింది. -
వందలాది ఉద్యోగులను వదిలించుకోనున్న ప్రముఖ బ్యాంక్
ప్రముఖ అంతర్జాతీయ బ్యాంక్ గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ రానున్న వారాల్లో కొన్ని వందల మంది ఉద్యోగులను వదిలించుకోవాలని యోచిస్తోంది.తక్కువ-పనితీరు గల సిబ్బంది వార్షిక తొలగింపులో భాగంగా దీన్ని అమలు చేయబోతోందని ఈ విషయం గురించి తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ నివేదించింది.తాజా తొలగింపులతో కలుపుకొంటే 2024 ఏడాదిలో మొత్తంగా 3 నుంచి 4 శాతం సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతారు. వీటిలో చాలా చాలా వరకు ఏడాది ప్రారంభంలోనే జరినట్లు తెలుస్తోంది. ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు కొత్త ప్రతిభను చేర్చుకోవడానికి వీలుగా బ్యాంక్ ఈ చర్యలకు పూనుకుంటోంది. ఉద్యోగుల పనితీరు వార్షిక సమీక్షను కోవిడ్ సమయంలో తాత్కాలికంగా నిలిపేసిన బ్యాంక్ తిరిగి అమలు చేస్తోంది.గోల్డ్‌మ్యాన్ సాచ్స్ గ్రూప్ ఏడాది మధ్యలో 44,300 మందిని నియమించుకుంది. సిబ్బందికి సంబంధించిన బ్యాంక్ వార్షిక సమీక్ష సాధారణంగా జరిగే ప్రామాణిక ప్రక్రియ అని కంపెనీ ప్రతినిధి తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉండాలని కంపెనీ యోచిస్తోందని వివరించారు. -
'ఇదే జరిగితే వేలాదిమంది ఉద్యోగులు ఇంటికి'
ప్రపంచంలోనే అగ్రగామి నెట్వర్కింగ్ పరికరాల తయారీ సంస్థ సిస్కో, ఈ ఏడాది మరోసారి ఉద్యోగుల తొలగింపులను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే వేలాదిమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది.2024 ఫిబ్రవరిలో సుమారు 4000 మందిని సిస్కో ఇంటికి పంపింది. అయితే సిస్కో తన నాల్గవ త్రైమాసిక ఫలితాలతో వెల్లడించే సమయంలోనే ఎంతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఆగష్టు 14న వెల్లడయ్యే అవకాశం ఉంటుంది.డిమాండ్, సరఫరా గొలుసు అంతరాయాల కారణంగా కంపెనీ కొన్ని కఠినమైన సవాళ్ళను ఎదుర్కుంటోంది. ఈ తరుణంలో కంపెనీ మళ్ళీ ఓ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సారి ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తుంది, ఏ విభాగం నుంచి తొలగిస్తుంది అనే మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.ఇదీ చదవండి: ఇలాగే కొనసాగితే బంగారం కొనడం కష్టమే! మళ్ళీ పెరిగిన ధరలుఇదిలా ఉండగా.. సిస్కో కంపెనీ ఏఐ రంగంలో కూడా తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సంస్థ 2025 నాటికి మరింత వృద్ధి చెందటానికి ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఈ వ్యూహంలో వారి ప్రధాన ఉత్పత్తులలో AI-ఆధారిత పరిష్కారాలను అందించడం, 1 బిలియన్ పెట్టుబడుల ద్వారా AI స్టార్టప్‌లను ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి. -
ప్రముఖ కంపెనీ లేఆఫ్స్.. వేలాదిమంది టెకీలు బయటకు
2024లో కూడా ఐటీ ఉద్యోగుల పరిస్థితి గాల్లో దీపంలాగా అయిపోయింది. కరోనా సమయంలో ఉద్యోగాలు పోయి ఇబ్బందులు పడిన సంఘటనలు మరువకముందే.. దిగ్గజ కంపెనీలు సైతం ఇప్పటికే అదే బాటలో నడుస్తున్నాయి. ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. తాజాగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ 'కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్' ఏప్రిల్ - జూన్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఇందులో ఏకంగా 8వేలకంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు స్పష్టమవుతోంది.అమెరికా ప్రధాన కేంద్రంగా పనిచేసే కాగ్నిజెంట్ సంస్థలో ఎక్కువమంది భారతీయ ఉద్యోగులు ఉన్నారు. ఈ కంపెనీ జూన్ 2024తో ముగిసిన రెండవ త్రైమాసికంలో 566 మిలియన్ డాలర్ల నికర లాభం పొందింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే సుమారు 22.2 శాతం ఎక్కువని తెలుస్తోంది.కంపెనీ రాబోయే రోజుల్లో మరిన్ని లాభాలను ఆర్జించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే కంపెనీ ఎప్పటికప్పుడు తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే.. సంస్థ ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో దాపు 8100 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య 2024 మొదటి త్రైమాసికం కంటే ఎక్కువే.ఇప్పుడు కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 336300గా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 ప్రారంభం నుంచి పెద్ద పెద్ద కంపెనీలు కూడా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ వస్తున్నాయి. అయితే టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలో మాత్రం ఉద్యోగులు సంఖ్య కొంత పెరిగింది. కాగా హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గింది. -
భారీ ఉద్యోగాల కోత!.. ప్రముఖ కంపెనీ కీలక నిర్ణయం
2024లో కూడా ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి ప్రముఖ చిప్ తయారీ సంస్థ 'ఇంటెల్' (Intel) కూడా చేరింది.ఇంటెల్ లాభాలు గణనీయంగా తగ్గడం.. మార్కెట్ వాటాను కోల్పోయిన తర్వాత, ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఈ వారంలోనే వేలాదిమంది ఉద్యోగులను తొలగించున్నట్లు సమాచారం. అయితే ఎంతమందిని తొలగిస్తుందనే విషయం అధికారికంగా వెల్లడికాలేదు. ఉద్యోగుల తొలగింపులు ఈ వారంలోనే ఉండొచ్చని సమాచారం.ఇంటెల్ కంపెనీ సుమారు లక్ష కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది. అయితే ఇది అక్టోబర్ 2022 నుంచి డిసెంబర్ 2023 మధ్య భారీగా ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మరోసారి ఉద్యోగులను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే.. కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్‌కు షోకాజ్ నోటీసు.. ఎందుకంటే?చిప్ తయారీ రంగంలో ఖర్చులను తగ్గించి రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో ఇంటెల్ పెట్టుబడులు పెట్టనున్నట్లు సీఈఓ పాట్రిక్ పీ గెల్సింగర్ వెల్లడించారు. కంపెనీ ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల కోసం చిప్‌లను తయారుబ్ చేస్తోంది. ఇతర కంపెనీల కోసం కూడా సెమీకండక్టర్లను ఉత్పత్తి చేయడానికి ఫ్యాక్టరీలను నిర్మించడంపై దృష్టి సారించింది. సంస్థ ఇటీవల తన తయారీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి నాగ చంద్రశేఖరన్‌ను నియమించుకుంది. -
మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం.. ఉద్యోగుల్లో మళ్ళీ మొదలైన భయం
ఇప్పుడిప్పుడే టెక్ కంపెనీలు కోలుకుంటున్నాయి. ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నాయి. అంతా సజావుగా సాగుతున్న వేళ ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్ళీ ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియక.. కంపెనీలోని ఉద్యోగులలో ఒక్కసారిగా భయం మొదలైంది.వైర్డ్ గీక్ నివేదిక ప్రకారం.. ప్రొడక్ట్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ విభాగంలో కోతలు ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఎంత మందిని తొలగించనున్నారు, ఎప్పుడు తొలగించనున్నారు అనే విషయాలు అధికారికంగా వెల్లడికాలేదు. వ్యాపారాన్ని నిర్వహించడంలో శ్రామిక శక్తి సర్దుబాట్లు తప్పనిసరి. సంస్థ భవిష్యత్తు కోసం ఈ తొలగింపు చేపడుతున్నట్లు తెలుస్తోంది.మైక్రోసాఫ్ట్ 2023లో కూడా లేఆప్స్ కింద ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ విభాగంలో 2,000 ఉద్యోగాలను తగ్గించింది. గత నెలలో కంపెనీ అజూర్లోని పాత్రలతో సహా దాదాపు 1000 స్థానాలపై ప్రభావం చూపిన రౌండ్ తొలగింపులను చేపట్టింది. గత కొన్ని రోజులుగా కంపెనీ వేలాదిమంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మరోమారు సంస్థ తీసుకున్న నిర్ణయం ఉద్యోగుల్లో భయాన్ని కలిగిస్తోంది. -
యూఎస్ సాఫ్ట్వేర్ కంపెనీలో లేఆఫ్‌లు.. 2,200 మంది తొలగింపు
యూఎస్‌కు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ ‘యూకేజీ’ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. ఓ నివేదిక ప్రకారం కంపెనీ తన తాజా రౌండ్లో మొత్తం శ్రామికశక్తిలో దాదాపు 14% మందికి ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. ఈ లేఆఫ్‌లతో 2,200 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయినట్లు అంచానా వేస్తున్నారు.జూలై 4న సెలవు రోజు కావడంతో జూలై 3వ తేదీనే తొలగింపులు ప్రారంభించినట్లు చెబుతున్నారు. యూకేజీ లేఆఫ్‌ల గురించి బిజినెస్ జర్నల్ నివేదించింది. ఫ్లోరిడాకు చెందిన ఈ సాఫ్ట్వేర్ కంపెనీ భారీ లేఆఫ్‌లతో తన శ్రామిక శక్తిని ఎలా తగ్గించుకుందో వివరించింది. కంపెనీ సీఈవో క్రిస్ టాడ్ ఈమెయిల్ ప్రకారం కంపెనీ తన వర్క్‌ఫోర్స్‌లో 14% మందిని తగ్గించిందని నివేదిక పేర్కొంది.అనేక దేశాలలో ఉనికిని కలిగి ఉన్న అతిపెద్ద సాఫ్ట్వేర్ డెవలపర్లలో ఒకటైన యూకేజీ మొత్తం 15,882 మంది ఉద్యోగులను కలిగి ఉందని పేర్కొంది. కీలకమైన వృద్ధి రంగాలపై దృష్టి సారించడం, దీర్ఘకాలిక వ్యూహం లక్ష్యంగా చేస్తున్న సంస్థాగత మార్పుల్లో భాగంగా తొలగింపులను ప్రారంభించినట్లు యూకేజీ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. కంపెనీ సీఈవో క్రిస్ టాడ్ తొలగింపులను వచ్చే వారం ప్రకటించాలనుకున్నారు. అయితే ఇంతలోపే వార్తలు బయటకు రావడంతో కంపెనీ తన చర్యలను వేగవంతం చేయాల్సి వచ్చిందంటున్నారు. ప్రస్తుత ఉద్యోగాల కోతలు యునైటెడ్ స్టేట్స్కే పరిమితం అవుతాయని క్రిస్ టాడ్ ధ్రువీకరించారు. -
టాటా స్టీల్ కీలక నిర్ణయం.. 2500 ఉద్యోగాల కోత
గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ ఉత్పత్తులు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో యూకేలోని టాటా స్టీల్ తన సిబ్బందిలో 2500 మందిని తొలగించనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ టీవీ నరేంద్రన్ తెలిపారు.యూకే టాటా స్టీల్ సంస్థలో ఉద్యోగాలు పోతాయనే భయంతో కార్మికుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేఖిస్తూ.. నిరసనలు కూడా తెలియజేస్తున్నాయి. యూకే ప్రభుత్వం సాయంతో డీకార్బనైజేషన్ ప్లాన్‌లో భాగంగా.. కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించి, ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ ప్రక్రియకు మారుతోంది. కాబట్టి రాబోయే మూడేళ్ళలో కర్బన ఆధారిత తయారీ పూర్తిగా నిలిపిఈవేస్తున్నట్లు సమాచారం.టాటా స్టీల్ సంస్థ యూకేలో ఎలక్ట్రిక్ ఉత్పత్తులను పెంచనుంది. తద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించనుంది. భారత్ కేంద్రంగా పనిచేస్తున్న టాటా స్టీల్ యూకేలో అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థగా కీర్తి గడించింది. ఇక్కడ సుమారు 8000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. యూకే కంపెనీ ఏడాదికి 3 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేస్తోంది. ఇందులో సుమారు 2500 మంది ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది.సెప్టెంబర్ 2023లో టాటా స్టీల్ అండ్ యూకే ప్రభుత్వం బ్రిటన్‌లోని పోర్ట్ టాల్బోట్ స్టీల్ తయారీ సదుపాయంలో డీకార్బనైజేషన్ ప్లాన్లను అమలు చేయడానికి 1.25 బిలియన్ పౌండ్ల ఉమ్మడి పెట్టుబడి ప్రణాళికపై అంగీకరించాయి. ఇందులో 500 మిలియన్ పౌండ్లు యూకే ప్రభుత్వం అందించింది. -
సైలెంట్ లేఆఫ్‌లు.. 20 వేల మంది టెకీలు ఇంటికి..
ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ గత కొంత కాలంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. లేఆఫ్‌ల పేరుతో లక్షలాది మంది ఉద్యోగులను కంపెనీలు అధికారికంగా తొలిగించాయి. అప్రకటింతగానూ వేలాదిగా ఐటీ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. దేశంలోని ఐటీ పరిశ్రమలో 2023 క్యాలెండర్ సంవత్సరంలో దాదాపు 20 వేల మంది ‘సైలెంట్’గా ఉద్యోగాలు కోల్పోయారు.ఆలిండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐఐటీఈయూ) వెల్లడించిన వివరాల ప్రకారం 2023 క్యాలెండర్ ఇయర్లో దేశ ఐటీ రంగం దాదాపు 20,000 మంది టెకీలను ‘సైలెంట్ లేఆఫ్’ విధానంలో తొలగించింది. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. ఈ తొలగింపులు చిన్నా పెద్ద అన్ని ఐటీ కంపెనీలలో జరిగాయని, వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ఏఐటీఈయూ భావిస్తోంది.ఇలా అత్యధికంగా ఉద్యోగులను తొలగించిన ఐటీ కంపెనీల్లో ప్రముఖంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్టీఐ-మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఒక్క హెచ్‌సీఎల్ టెక్‌లో మాత్రమే ఉద్యోగుల సంఖ్య పెరిగింది. అప్రకటిత పద్ధతిలో ఉద్యోగులను తొలగించే పరిస్థితిని "సైలెంట్ లేఆఫ్" సూచిస్తుంది. అంటే కాంట్రాక్టులను పునరుద్ధరించకపోవడం, పని గంటలను తగ్గించడం, ముందస్తు పదవీ విరమణకు పురిగొల్పడం, ఖాళీలను భర్తీ చేయకపోవడం వంటివి. -
హమ్మయ్య.. ఇన్ఫోసిస్‌లో ఆ ముప్పు లేదు!
టెక్ పరిశ్రమలో ఎటు చూసినా జనరేటివ్ ఏఐ ప్రభంజనం.. అంతటా లేఆఫ్‌ల భయంతో ఐటీ ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. అయితే ఇన్ఫోసిస్‌లో మాత్రం ఆ ముప్పు లేదంటున్నారు సంస్థ సీఈవో సలీల్ పరేఖ్. జెన్ఏఐ కారణంగా పరిశ్రమలోని ఇతరుల మాదిరిగా తాము ఉద్యోగాలను తగ్గించబోమని సీఎన్‌బీసీ-టీవీ18 ఇంటర్వ్యూలో చెప్పారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతితో ఇన్ఫోసిస్ ఉద్యోగులను తొలగిస్తోందా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. "లేదు, మేము అలా చేయడం లేదు. నిజానికి ఇండస్ట్రీలో ఇతరులు అలా చేశారు. ఆ విధానం సరికాదని మేం చాలా స్పష్టంగా చెప్పాం' అని పేర్కొన్నారు. పెద్ద సంస్థలకు అన్ని సాంకేతికతలు కలిసి వస్తాయనేది తన అభిప్రాయమని ఆయన వివరించారు. వచ్చే కొన్నేళ్లలో కృత్రిమ మేధ (ఏఐ)లో నిపుణులుగా ఎదిగే వారు మరింత మంది తమతో చేరుతారని, ప్రపంచంలోని పెద్ద సంస్థలకు సేవలు అందిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో క్లయింట్ల పరంగా, ఉద్యోగుల సంఖ్య పరంగా మరింత విస్తరిస్తామని పరేఖ్ తెలిపారు.మరి నియామకాలు?లేఆఫ్‌ల విషయాన్ని పక్కన పెడితే 2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌లో నియామకాల పరిస్థితి ఎలా ఉండనుంది అన్నదానిపై తన దృక్పథాన్ని పరేఖ్ తెలియజేశారు. ఆర్థిక వాతావరణం మెరుగుపడటం, డిజిటల్ పరివర్తనపై వ్యయం పెరగడం జరిగితే నియామకాలు మళ్లీ ఊపందుకుంటాయని చెప్పారు. అయితే నియామకాలపై ఎటువంటి వార్షిక లక్ష్యం లేకపోయినా ఆర్థిక వాతావరణం ఆధారంగా నియామకాలు చేపడతామని వివరించారు. -
హెచ్1–బీ వీసాదారులకు తీపికబురు
వాషింగ్టన్: అమెరికాలోని ఐటీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. గూగుల్, మెటా, ఆపిల్, డెల్, ట్విటర్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. నాన్–ఇమ్మిగ్రెంట్లను తొలగిస్తున్నాయి. ఫలితంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా అమెరికాలో 237 ఐటీ కంపెనీలు 58,499 మందిని తొలగించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. లే–ఆఫ్‌ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రధానంగా హెచ్–1బీ వీసాలతో అమెరికా ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న భారతీయుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. కంపెనీ యాజమాన్యం జాబ్ నుంచి తొలగిస్తే 60 రోజుల్లోగా మరో ఉద్యోగం వెతుక్కోవాలి. లేకపోతే స్వదేశానికి వెళ్లిపోవాల్సిందే. ఇలాంటి వారికి యూఎస్ సిటిజెన్íÙప్ అండ్ ఇమిగ్రేషన్ సరీ్వసెస్(యూఎస్సీఐఎస్) తీపి కబురు అందించింది. హెచ్–1బీ వీసాదారులు ఉద్యోగం పోతే 60 రోజులు దాటినా కూడా అమెరికాలోనే చట్టబద్ధంగా ఉండొచ్చని వెల్లడించింది. అయితే, నాన్–ఇమిగ్రెంట్ వీసా స్టేటస్ మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికాలోనే ఉన్న జీవిత భాగస్వామిపై డిపెండెంట్‌గా మారొచ్చు. అంటే హెచ్–4, ఎల్–2 వీసా పొందొచ్చు. ఈ వీసాలు ఉన్నవారికి పని చేసుకొనేందుకు(వర్క్ ఆథరైజేషన్) అనుమతి లభిస్తుంది. స్టూడెంట్(ఎఫ్–1), విటిటర్ (బి–1/బి–2) స్టేటస్ కూడా పొందొచ్చు. కానీ, బి–1/బి–2 వీసా ఉన్నవారికి పని చేసుకొనేందుకు అనుమతి లేదు. 60 రోజుల గ్రేస్ పిరియడ్‌లోనే వీసా స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలని యూఎస్సీఐఎస్ సూచించింది. -
టెక్ ఉద్యోగులపై లేఆఫ్ కత్తి!
కరోనా ముగిసింది.. ఉద్యోగాలకు ఏం భయం లేదనుకుని 2024లో అడుగుపెట్టిన టెకీలకు ఈ ఏడాది కూడా చుక్కెదురవుతోంది. 2024 ప్రారంభమైన మొదటి నెల కావొస్తున్నా.. ఉద్యోగుల్లో లేఆప్స్ భయం పోవడం లేదు. ఎందుకంటే జనవరిలో ఇప్పటికి ఏకంగా 24,564 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోవడమే. మొదటి నెలలో లేఆఫ్స్.ఎఫ్‌వైఐ రిపోర్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం, సుమారు 91 టెక్ కంపెనీలు 24,564 మందిని తొలగించినట్లు తెలుస్తోంది. ప్రముఖ టెక్ దిగ్గజం సేల్స్ ఫోర్స్ కంపెనీ గత శుక్రవారమే తమ కంపెనీ సిబ్బందిలో 700 మందిని తొలగిస్తున్నట్ల ప్రకటించిన సంగతి అందరికి తెలుసు. 2023లో మొత్తం 1187 టెక్ కంపెనీల నుంచి 2,62,595 మంది ఉయోగాలను కోల్పోయినట్లు లేఆఫ్-ట్రాకింగ్ వెబ్సైట్ Layoffs.fyi నుంచి వచ్చిన డేటా ఆధారంగా తెలిసింది. 2024 ప్రారంభంలోనే ఆన్లైన్ రెంటల్ ప్లాట్‌ఫారమ్ ఫ్రంట్‌డెస్క్ రెండు నిమిషాల గూగుల్ మీట్ కాల్ ద్వారా ఏకంగా 200 మంది ఉద్యోగులను తొలగించేసింది. గేమింగ్ కంపెనీ యూనిటీ కూడా ఉన్న ఉద్యోగుల్లో సుమారు 25 శాతం మందిని లేదా 1800 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. హార్డ్‌వేర్, కోర్ ఇంజనీరింగ్ అండ్ గూగుల్ అసిస్టెంట్ టీమ్‌లలో అనేక వందల ఉద్యోగాలను తగ్గించినట్లు గూగుల్ కూడా ధృవీకరించింది. అంతే కాకుండా రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఒక మెమోలో వెల్లడించింది. ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం! అమెజాన్ యాజమాన్యంలోని ఆడియోబుక్ అండ్ పాడ్‌కాస్ట్ డివిజన్ ఆడిబుల్ ఈ-కామర్స్ దిగ్గజంలో మొత్తం ఉద్యోగాల కోతలో భాగంగా తన సిబ్బందిలో 5 శాతం లేదా 100 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ కూడా నూతన సంవత్సరంలోనే కొంతమంది టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్లను తొలగించింది. ఇవన్నీ చూస్తుంటే టెక్ ఉద్యోగులకు 2024 కూడా కలిసి రాదేమో అనే భావన చాలామందిలో మొదలైపోయింది. -
3000 మంది ఉద్యోగులకు 'టాటా' బైబై..!
ఈ ఏడాది ప్రారంభం నుంచే గూగుల్, అమెజాన్ కంపెనీలు లేఆప్స్ ప్రారంభించాయి. ఈ జాబితాలోకి తాజాగా టాటా స్టీల్ చేరనున్నట్లు సమాచారం. ఈ కంపెనీ వేల్స్‌లోని ప్లాంట్‌లో సుమారు 3,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిసింది. పోర్ట్ టాల్బోట్ స్టీల్వర్క్స్లోని రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లను కంపెనీ మూసివేసినట్లు.. ఇదే జరిగితే సుమారు మూడు వేలమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధ్రువీకరించలేదు. లేఆప్స్ గురించి కూడా ప్రస్తావించలేదు. టాటా స్టీల్ తన రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లను మూసివేయాలని నిర్ణయించే ముందు వర్కర్స్ యూనియన్‌తో సమావేశం నిర్వహించినట్లు, గ్రీన్ మెటల్ ఉత్పత్తికి నిధులు సమకూర్చడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఇప్పుడు పరిస్థితులు కొంత తీవ్రతరం కావడంతో ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా.. జర భద్రం! పోర్ట్ టాల్బోట్ స్టీల్‌వర్క్స్ అనేది యూకేలోని అతిపెద్ద సంస్థల్లో ఒకటి. కంపెనీ ఇబ్బందులను ఎదుర్కుంటున్న సమయంలో బ్రిటన్ ప్రభుత్వం గత ఏడాది చివర్లో సంస్థకు 500 మిలియన్స్ ఫౌండ్స్ (రూ. 5300 కోట్లు) సహాయం చేసింది. ఆ సమయంలోనే కంపెనీ నష్టాలు ఉద్యోగులపైన ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. -
ఉద్యోగులకు షాకిచ్చిన సుందర్ పిచాయ్ - మరిన్ని లేఆప్స్ పక్కా!
గత ఏడాది పెద్ద కంపెనీల దగ్గర నుంచి స్టార్టప్ కంపెనీల వరకు ఉద్యోగులను తొలగించిన సంఘటనలు కోకొల్లలు, 2024లో అయినా పరిస్థితులు చక్కబడుతాయనుకుంటే ఇప్పటికే లేఆప్స్ మొదలైపోయాయి. జనవరి 1 నుంచి వివిధ కంపెనీలు 7500 మంది ఉద్యోగులను తొలగించాయి. ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గూగుల్ సంస్థ ఈ ఏడాది కూడా ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. పనిభారాన్ని తగ్గించడానికి ఏఐ సాఫ్ట్వేర్ అండ్ ఆటోమేషన్ వంటి వాటిని అనుసరించనున్నట్లు, ఈ కారణంగా మరింత మంది ఉద్యోగుల తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని సమాచారం. గూగుల్ ఇప్పటికే జెమిని' (Gemini) పేరుతో అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ పరిచయం చేసింది. ఇది తప్పకుండా భవిష్యత్తులో పనిభారాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇది కూడా ఈ ఏడాది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవడానికి కారణమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదీ చదవండి: టీసీఎస్ కీలక నిర్ణయం.. 5 లక్షల మందికి ట్రైనింగ్! ఈ ఏడాది ఉద్యోగుల తొలగింపులు గతేడాది మాదిరిగా అన్ని విభాగాల్లో ఉండే అవకాశం ఉండదని పిచాయ్ వెల్లడించారు. అయితే గత వారం సంస్థ తన వాయిస్ అసిస్టెంట్ యూనిట్‌లోని పిక్సెల్, నెస్ట్, ఫిట్బిట్కి బాధ్యత వహించే హార్డ్‌వేర్ టీమ్‌లు, అడ్వర్టైజింగ్ సేల్స్ టీమ్ & ఆగ్మెంటెడ్ రియాలిటీ టీమ్‌లో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. -
గంటకు 23 మంది.. ఏడాదికి వేలల్లో.. ఆందోళనలో టెకీలు!
కరోనా లాక్డౌన్ సమయంలో కొన్ని కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించగా, మరికొన్ని సంస్థలు ఆర్ధిక పరిస్థితులను ఎదుర్కోవడానికి చాలామంది ఉద్యోగులను తొలగించాయి. ఇప్పటికీ తొలగింపుల పర్వం కొనసాగుతూనే ఉంది, ఇందులో భాగంగానే ఇటీవల లింక్డ్ఇన్ 668 మంది ఉద్యోగులను తొలగించింది. లింక్డ్ఇన్ తొలగించిన ఉద్యోగులలో ఇంజినీరింగ్, ప్రొడక్ట్, టాలెంట్, ఫైనాన్స్ టీమ్ ఎంప్లాయిస్ ఉన్నారు. కంపెనీ రెవెన్యూ ఇప్పటికీ పురోగతి చెందకపోవడమే ఉద్యోగుల తొలగింపులకు ప్రధాన కారణమని సంస్థ స్పష్టం చేసింది. ఐటీ పరిశ్రమల్లో ఉద్యోగాల కోత కొత్తేమీ కాదు. మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థల నుంచి చిన్న కంపెనీల వరకు వరకు లేఆఫ్స్ ప్రకటిస్తూనే ఉన్నాయి. గత రెండేళ్లలో భారీగా పెరిగిన ఉద్యోగాల కోతలు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. సగటున ప్రతి గంటకు 23 మంది టెక్కీలు ఉద్యోగాలు కోల్పోతున్నట్లు లేఆఫ్.ఫీ (layoff.fyi) వెబ్సైట్ పేర్కొంది. 2022 - 23 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా 2,120 టెక్ కంపెనీలు 4,04,962 మంది ఉద్యోగులను తొలగించాయి. 2022లో మాత్రం 1,061 టెక్ కంపెనీలు 164,769 మందిని, 2023 అక్టోబర్ 13 నాటికి 1,059 కంపెనీలు 2,40,193 మంది ఉద్యోగులను తొలగించాయి. ఇదీ చదవండి: ధనవంతుల జాబితాలో రైతు బిడ్డ - సంపద తెలిస్తే అవాక్కవుతారు! 2023 జనవరిలోనే 89,554 మంది టెకీలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. 2022లో ప్రారంభమైన ఉద్యోగాల కోతలు 2023 ప్రారంభం నాటికి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే ప్రస్తుతం లేఆప్స్ కొంత తక్కువయ్యాయి, కానీ ఇంకా పూర్తిగా ముగియలేదు. -
US Presidential Elections: మూడొంతుల మందిని సాగనంపుతా!
వాషింగ్టన్: తాను అధ్యక్షుడినైతే అమెరికా ప్రభుత్వంలోని ముప్పావు వంతు ఉద్యోగులను ఇంటికి పంపిస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యరి్థత్వం కోసం పోటీపడుతున్న వివేక్ రామస్వామి సంచలన ప్రకటన చేశారు. భారతీయ మూలాలున్న వివేక్.. అమెరికన్ వార్తా వెబ్సైట్ యాక్సియస్కు ఇచి్చన ప్రత్యేక ముఖాముఖిలో పలు విషయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘ రిపబ్లికన్ పార్టీ అభ్యరి్ధత్వం సాధించి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చుంటే వెంటనే నా పని మొదలుపెడతా. దేశవ్యాప్తంగా విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బందిలో 75 శాతం మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తా. ఇన్ని లక్షల మంది సిబ్బంది అమెరికా సర్కార్‌కు పెనుభారం. ఇక ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) వంటి ప్రధాన దర్యాప్తు సంస్థలను మూసేస్తా. విద్య, ఆల్కాహాల్, పొగాకు, ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, అణు నియంత్రణ కమిషన్, అంతర్గత ఆదాయ సేవలు, వాణిజ్య శాఖల ప్రక్షాళనకు కృషిచేస్తా. అధ్యక్షుడిగా తొలి ఏడాది పూర్తయ్యేలోపు సగం మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతా. మిగతా సగం మందిలో 30 శాతం మందితో వచ్చే ఐదేళ్లలో పదవీ విరమణ చేయిస్తా. ఇందులో అనుమానమేమీ లేదు. పిచి్చపని అస్సలుకాదు’ అని 38 ఏళ్ల వివేక్ అన్నారు. ప్రస్తుతం అమెరికాలో 22.5 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 75 శాతం మందిని అంటే దాదాపు 16 లక్షల మందిని వచ్చే నాలుగేళ్లలో ఉద్యోగాల నుంచి తీసేస్తానని వివేక్ లెక్కచెప్పారు. ఇన్ని లక్షల మందిని తీసేస్తే ప్రభుత్వంపై వేతన భారం భారీగా తగ్గుతుందని ఆయన అభిప్రాయం. -
అవాక్కయ్యే నిజం.. ఆరు నెలల్లో అంతమంది ఉద్యోగులా?
Job Cuts 2023 First Six Months: కరోనా మహమ్మారి భారతదేశంలో ప్రవేశించినప్పటి నుంచి ఐటీ కంపెనీలు నష్టాల బాట పట్టాయి. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు, ఆ ప్రభావం ఇప్పటికి కూడా ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. 2023లో కూడా కొన్ని కంపెనీలు లేఆప్స్ ప్రకటిస్తున్నాయి.. ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. ఈ ఏడాది అర్ధభాగంలో కొన్ని స్టార్టప్ కంపెనీలు లెక్కకు మించిన ఉద్యోగులను తొలగించాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, 2023 మొదటి ఆరు నెలల కాలంలో ఏకంగా 70 కంపెనీలు 17,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. పెట్టుబడిదారుల నిధుల క్షీణత కారణంగా సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడానికి.. నగదును ఆదా చేయడానికి కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉద్యోగులను తొలగించిన స్టార్టప్‌ల జాబితాలో.. ఈ-కామర్స్, ఫిన్-టెక్, ఎడ్టెక్, లాజిస్టిక్స్ టెక్ అండ్ హెల్త్-టెక్ కంపెనీలు ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు మీషో, అనాకాడెమీ, స్విగ్గీ, షేర్‌చాట్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. లేఆఫ్స్‌కి ప్రధాన కారణం కంపెనీలు లాభాలను పొందకపోవడమే అని స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: విడుదలకు సిద్దమవుతున్న స్మార్ట్‌ఫోన్స్ - షావోమి నుంచి రెడ్మీ వరకు.. పెరుగుతున్న మూలధన వ్యయం, వడ్డీ రేట్లు, టెక్నాలజీ స్టాక్‌ల విలువ క్షీణత కారణంగా స్థిరమైన స్టార్టప్ ఫండింగ్పై ప్రభావం కొనసాగుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికి కూడా కొన్ని కంపెనీలు మునుపటి వైభవం పొందలేకపోతున్నాయి. ఈ కారణంగానే 2023లో కూడా ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యోగులు మరిన్ని కష్టాలు పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. -
30 కోట్ల ఉద్యోగాలకు ఎసరు తప్పదా?.. ఏఐ ప్రతికూల ప్రభావం ఎంత?
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి): కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా అన్ని రంగాల్లోకి విస్తరించడం మొదలైంది! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో కార్యాలయాల పని తీరు, జీవన విధానాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐటీ) తీసుకొచ్చిన మార్పులు 50 ఏళ్ల క్రితం ఊహాతీతమైన అంశాలే. ఇప్పుడున్న అంచనాల మేరకు ఏఐని అన్ని రంగాలకు విస్తరిస్తే ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల ఉద్యోగాలకు ఎసరు తప్పదని నిపుణుల నివేదిక అంచనా వేస్తోంది. అయితే సరికొత్త అవకాశాలు ప్రపంచం ముందు ఆవిష్కృతమవుతాయని పేర్కొంటున్నారు. ఏఐ రాకతో గ్లోబల్ జీడీపీ 7 శాతం పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు. అమెరికాలో పారిశ్రామిక అవసరాలు, నైపుణ్యాలు, ప్రజల అవసరాలకు అనుగుణంగా 900 రకాల ఉద్యోగాలకు సంబంధించి ‘ఓనెట్’ డేటాబేస్‌ను రూపొందించింది. ఈ ఉద్యోగాలపై ‘ఏఐ’ ప్రభావం ఎంత మేరకు ఉంటుందనే అంశాన్ని ‘గోల్డ్‌మాన్ శాక్స్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్’ తాజా నివేదికలో విశ్లేషించింది. ‘ద పొటెన్షియల్లీ లార్జ్ ఎఫెక్టస్ ఆఫ్ ఏఐ ఆన్ ఎకనమిక్ గ్రోత్’ పేరిట వెలువరించిన ఈ నివేదికలో ఏఐ రాకతో పరిశ్రమల స్వరూపం, ఉద్యోగాల తీరుతెన్నులూ మారతాయని అంచనా వేసింది. కొత్త నైపుణ్యాలు అవసరమని పేర్కొంటూ ఇప్పుడున్న ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం తప్పదనే విషయాన్ని ప్రస్తావించింది. కోర్టు తీర్పులను అంచనా వేసే స్థాయికి.. ఏఐ ప్రతికూల ప్రభావం చూపే తదుపరి రంగం లీగల్. కాంట్రాక్ట్ ఒప్పందాల విశ్లేషణ లాంటి చాలా అంశాలు ‘ఆటోమేషన్’ పరిధిలోకి వస్తాయని నివేదిక పేర్కొంది. ఇంకో అడుగు ముందుకేసి న్యాయస్థానాల్లో గతంలో వెలువడ్డ తీర్పుల ఆధారంగా తాజా కేసులో ఎలాంటి తీర్పు వస్తుందనే విషయాన్ని ముందుగానే అంచనా వేసే స్థాయి ఏఐకి ఉందని నివేదికలో పేర్కొనడం గమనార్హం. కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే రంగాల్లో మాత్రం ఏఐ ప్రభావం పెద్దగా ఉండదని నివేదిక పేర్కొంది. ఏఐ ఇప్పటికి కొత్త సాంకేతిక పరిజ్ఞానమే! అభివృద్ధి చెందే సామర్థ్యం, వివిధ రంగాలు ఏఐని వినియోగించుకొనే శక్తిపై భవిష్యత్తు మార్పులు ఆధారపడి ఉంటాయి. కొత్త సాంకేతికతను ఆహ్వానించే తీరు అన్ని దేశాలు, రంగాలకు ఒకే రకంగా లేదని, కొన్ని మాత్రం ఏఐని ఆహ్వానించేందుకు తహతహలాడు తున్నాయని నివేదిక పేర్కొంది. సగం ఉద్యోగాలకు కోత! ఏఐ ప్రవేశంతో గరిష్టంగా ఆఫీస్, అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ఉద్యోగాల్లో 46 శాతం కోత ప్రభావం ఉంటుందని గోల్డ్‌మాన్ శాక్స్ నివేదిక అంచనా వేసింది. సమావేశాలను షెడ్యూ ల్ చేయడం, నివేదికలు రూపొందించడం, డేటా సిద్ధం చేసి అందించడం లాంటివి ఈ ఉద్యోగాలను నిర్వర్తించే వారి ప్రధాన విధు లు. ఏఐ వల్ల ఇలాంటి ఉద్యోగుల అవసరం దాదాపు సగం తగ్గుతుందని అంచనా. ముందు వరుసలో చైనా, సౌదీ, భారత్ ఏఐ రాకతో సేవలు, ఉత్పాదకత మరింత మెరుగుపడతాయా? క్షీణిస్తాయా? అనే అంశంపై మల్టీ నేషనల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘ఐపీఎస్వోఎస్’ వరల్డ్ ఎకనమిక్ ఫోరం కోసం పలు దేశాల్లో సర్వే చేసింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలున్న దేశాల్లో ప్రజలు కృత్రిమ మేధను ఆహ్వానించడానికి సానుకూలంగా ఉండగా ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో అంత సానుకూలంగా లేరని పేర్కొంది. చైనాలో 78 శాతం మంది, సౌదీ అరేబియాలో 76 శాతం, భారత్‌లో 71 శాతం మంది ఏఐ పట్ల సానుకూలంగా స్పందించారు. బ్రిటన్‌లో 38 శాతం, జర్మనీ, ఆ్రస్టేలియాలో 37 శాతం, అమెరికాలో 35 శాతం, కెనడాలో 32, ఫ్రాన్స్‌లో 31 శాతం మంది మాత్రమే ఏఐ పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. -
వెయ్యి మందికి బైజూస్ బైబై
న్యూఢిల్లీ: ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ తాజాగా వివిధ విభాగాల నుంచి 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థ పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. బిలియన్ డాలర్ల (రూ.8,200 కోట్లు) టర్మ్ లోన్ విషయమై అమెరికాలో రుణదాతలతో బైజూస్ న్యాయ పోరాటం చేస్తున్న తరుణంలో ఈ పరిణామం చేసుకోవడం గమనార్హం. కొత్త ఉద్యోగుల చేరికను కలిపి చూస్తే మొత్తం ఉద్యోగుల సంఖ్య 50,000 స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. బైజూస్ లోగడ 5 శాతం ఉద్యోగులు అంటే సుమారు 2,500 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. 2020 అక్టోబర్ నుంచి ఆరు నెలల కాలంలో ఇంత మందిని తగ్గించుకోనున్నట్టు తెలిపింది. 2023 మార్చి నాటికి లాభాల్లోకి రావాలన్న లక్ష్యంలో భాగంగా నాడు ఆ నిర్ణయం తీసుకుంది. వ్యయాలు తగ్గించుకోవడంలో భాగమే ఈ తొలగింపులు అన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
టెక్ బుడగ పేలుతోందా?
ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు... అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ వంటి అనేక దిగ్గజ ఐటీ కంపెనీల తాజా పరిస్థితి సైతం ఇదే. వరుసగా ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయి. ఒక్కసారిగా వేలాది మందిని తొలగిస్తున్నాయి. కోవిడ్ కాలంలో శరవేగంగా విస్తరించిన ఐటీ, ఆన్లైన్ సేవలతో లాభాలు పిండుకున్న టెక్ కంపెనీల అభివృద్ధి బుడగ ఇప్పుడు పేలడానికి సిద్ధంగా ఉందా? బేజారెత్తిన టెక్ కంపెనీల పరిస్థితికి కారణం ఏమిటి? భవిష్యత్తులో వాటి పునరుద్ధరణ జరిగే అవకాశం ఉందా? ‘‘రెండో డిజిటల్ విప్లవానికి నాంది పడింది. ప్రతి కంపెనీ, ప్రతి పరిశ్రమ ఆన్లైన్ సేవల వైపు మొగ్గుతోంది. ఇది మా కంపెనీకి లాభాలను ఒనగూర్చుతోంది’’ – ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఆంక్షల వేళ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల్ల వ్యాఖ్య ‘‘కోవిడ్ తర్వాత పరిస్థితులను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకోవడం కోసం 10 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాల్సి వస్తోంది’’ - కోవిడ్ వ్యాప్తి తగ్గిన ప్రస్తుత తరుణంలో సత్య నాదెళ్ల చేసిన తాజా ప్రకటన ఉద్వాసనల పర్వం.. కోవిడ్ కాలంలో అనుకోకుండా వచ్చి పడిన అవకాశంతో అభివృద్ధి పుంతలు తొక్కిన టెక్ సంస్థలు శరవేగంగా విస్తరణపర్వం మొదలుపెట్టాయి. ప్రపంచం నలుమూలలకు విస్తరించే క్రమంలో లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చాయి. అమెజాన్ ఒక్కటే 2022 సెప్టెంబర్ నాటికి ఏడాది మొత్తం 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాతోపాటు మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి ఐటీ దిగ్గజాలు కూడా లక్షలాది ఉద్యోగాలు కల్పించాయి. గతేడాది చివరికి వచ్చే సరికి పరిస్థితులు మారడం మొదలైంది. లాభాల్లో కోత పడతుండటంతో కంపెనీలు ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టాయి. ఒక్క 2022లోనే టెక్ కంపెనీలన్నీ కలిపి 1,64,411 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు లేఆఫ్స్ ఎఫ్‌వైఐ అనే సంస్థ సేకరించిన సమాచారంలో వెల్లడైంది. ఈ సంస్థ లెక్క ప్రకారం ఈ ఏడాది ఇప్పటికే 658 టెక్ కంపెనీలు 1,91,416 మంది ఉద్యోగులను తొలగించాయి. కేవలం టెక్ స్టార్టప్ కంపెనీలకు మాత్రమే నిధులు సమాకూర్చే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) ఈ ఏడాది మార్చిలో కుప్పకూలడం ఐటీ కంపెనీలకు మరో శరాఘాతంగా పరిణమించింది. నిధుల కొరతతో అనేక కంపెనీలు మూతపడటమో, ఉద్యోగాలను తొలగించడమో చేశాయి. గతేడాది నవంబర్‌లో 11,000 ఉద్యోగాల కోతపెట్టిన మెటా... మళ్లీ ఈ ఏడాది మార్చిలో మరో 10 వేల మందిని తొలగించింది. అమెజాన్ 2022 నవంబర్‌లో 10,000 మంది, 2023 జనవరిలో 8 వేల మంది, మార్చిలో 9 వేల మంది ఉద్యోగులను తొలగించింది. యాక్సెంచర్ ఈ ఏడాదిలో ఇప్పటికే తన ఉద్యోగుల్లో 2.5 శాతం అంటే దాదాపు 19 వేల మందిని తొలగించింది. ట్విట్టర్‌ను కైవశం చేసుకున్న తర్వాత ఆ సంస్థలోని 80 శాతం మంది ఉద్యోగులను తొలగించామని ఎలాన్ మస్క్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే దాదాపు 6 వేల మంది ఉద్యోగులను తొలగించారు. కాగ్నిజెంట్ ఈ నెల 4న 3,500 మందిని తొలగించింది. మైక్రోసాఫ్ట్ గత ఐదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది మొదటి క్వార్టర్లో అత్యల్ప ఆదాయం ఆర్జించింది. అమ్మకాలు 14 శాతం పడిపోయినట్లు సత్య నాదెళ్ల వెల్లడించారు. (వారెవ్వా టెక్నాలజీ.. ఫ్యూచర్ స్మార్ట్ఫోన్లు ఇలా ఉంటాయా?) ఎందుకీ పరిస్థితి టెక్ కంపెనీల తిరోగమ నానికి ఒక్కసారిగా వచ్చిపడ్డ అనేక పరిణామాలు కారణం. కృత్రిమ మేధ, ఆటోమేషన్ ఒక కారణమైతే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక మాంద్యం, డాలర్ విలువ పెరగడం, అధిక వడ్డీలు, స్థాయికి మించిన ఉద్యోగుల సంఖ్య వంటి కారణాలు టెక్ ప్రపంచాన్ని ఇప్పుడు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో మొదలైన ఆర్థిక మాంద్యం ఛాయలు క్రమేణా విస్తరిస్తూ ద్రవ్యోల్బణానికి ఆపై అధిక వడ్డీలకు దారితీశాయి. ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలోనే కృత్రిమ మేధ, ఆటోమేషన్ ఉప్పెనలా వచ్చిపడి టెక్నాలజీ సంస్థల అభివృద్ధికి గండికొడుతున్నాయి. ఏఐ అత్యంత నాణ్యమైన, నమ్మకమైన ప్రత్యామ్నాయాలను సృష్టిస్తూ శరవేగంగా అన్ని రంగాలను కమ్ముకుంటోంది. ఇంతవరకు మానవ సంపదపై ఆధారపడి పనిచేస్తున్న టెక్ కంపెనీల ఉత్పాదనలను కృత్రిమ మేధ క్షణాల్లో అతిచౌకగా రూపొందిస్తుడటంతో ఆయా కంపెనీల ఆదాయంపై దెబ్బపడుతోంది. దాంతో గత్యంతరం లేక కంపెనీలు ఉద్యోగులను భారీగా తగ్గించుకొని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. టెక్ ప్రపంచాన్ని వేధిస్తున్న మరో కారణం ద్రవ్యోల్బణం. ప్రస్తుత ధరల స్థాయి గత 40 ఏళ్లలోనే అత్యధికం. పెరుగుతున్న వస్తువులు, సేవల ధరలతో వినియోగదారులు టెక్ కంపెనీల ఉత్పాదనలు, సేవలను భరించలేని స్థాయికి చేరుకుంటున్నారు. ధరలను అదుపు చేయడానికి ప్రభుత్వాలు వడ్డీ రేట్లను పెంచుతుండటం టెక్ కంపెనీలకు దెబ్బమీద దెబ్బగా పరిణమిస్తోంది. అమ్మకాలు తగ్గి ఆదాయం పడిపోతుండటం కంపెనీలు నడపడానికి రుణాలు తీసుకోలేక ఉద్యోగుల ఉద్వాసనకు ఉపక్రమించాయి. కరోనా వేళ మార్కెట్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేక, తమ అభివృద్ధి శాశ్వతమని భావించి అడ్డగోలుగా ఉద్యోగులను తీసుకున్నామని మెటా అధిపతి జుకర్‌బర్గ్, సేల్స్‌ఫోర్స్ అధినేత మార్క్ బెన్యాఫ్ ఒప్పుకున్నారు. టెక్ దిగ్గజాలకు భిన్నంగా యాపిల్ కంపెనీ మాత్రం ఉద్యోగ నియామకాల్లో సంయమనం పాటించింది. కోవిడ్ కాలంలో ఉద్యోగుల సంఖ్యను కేవలం 20 శాతమే పెంచుకుంది. దాంతో ఇంతవరకు ఉద్యోగులను తొలగించని టెక్ దిగ్గజం యాపిల్ ఒక్కటే. టెక్ ప్రపంచంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు పాతికేళ్ల నాటి డాట్‌కామ్ బుడగను గుర్తుచేస్తోందని నిపుణులు అంటున్నారు. ఏమిటీ డాట్‌కామ్ బుడగ? గత శతాబ్దం చివర్లో ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చిన తరుణంలో దాని ఆధారంగా పుట్టుకొచ్చిన కంపెనీలు ఊహించని రీతిలో వృద్ధి చెందాయి. పేరు చివర డాట్‌కామ్ ఉన్న ప్రతి కంపెనీ విలువ వేలం వెర్రిగా పెరిగిపోయింది. 1995 నుంచి 2000 వరకు ఆన్లైన్ సేవల పేరిట వెలిసిన కంపెనీలన్నీ ఇబ్బడిముబ్బడిగా పెరిగి శతాబ్దం చివరికి వచ్చే సరికి గాలిబుడగలా పేలిపోయాయి. (Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్ ) ముందున్న కాలమంతా డాట్‌కామ్ కంపెనీలదే అని నిమ్మన వ్యక్తులు, సంస్థలు ఆయా కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఉదాహరణకు 1994లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పడిన నెట్‌స్కేప్ అనే సంస్థ 1995లో అంటే కేవలం ఏడాది తరువాత పబ్లిక్ ఫండింగ్‌కు వెళ్తే ఒక్క రోజులోనే దాని మార్కెట్ క్యాప్ 278 కోట్ల డాలర్లకు చేరుకుంది. జనరల్ మోటార్స్‌కు ఈ విలువ సాధించడానికి 40 ఏళ్లు పట్టింది. 2001 వచ్చే సరికి ఈ డాట్‌కామ్ కంపెనీల విలువ కేవలం ఊహాజనితమని అర్థమై అందరూ పెట్టుబడులు ఉపసంహరించుకోవడంతో ఈ కంపెనీలన్నీ కుప్పకూలిపోయాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్సే్ఛంజ్ ‘నాస్డాక్’లో 1995 నుంచి 2000 వరకు క్రమేపీ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ 800 శాతం పెరిగితే 2002 వచ్చే సరికి పెరిగిన మొత్తంలో 790 శాతం పడిపోయి దాదాపు మొదటికి వచ్చింది. దాంతో డాట్‌కామ్ బుడగ పేలిపోయింది. (ఇలాంటి టెక్ వార్తల కోసం చదవండి సాక్షిబిజినెస్) - దొడ్డ శ్రీనివాసరెడ్డి -
పెట్టుబడి పెట్టు.. ఈబీ–5 వీసా పట్టు
సాక్షి, అమరావతి: ఈబీ–5 వీసా.. ఇదీ ప్రస్తుతం అమెరికాలోని భారతీయ వృత్తి నిపుణుల సరికొత్త తారకమంత్రం. అమెరికాలోని ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగాల్లో కోత విధిస్తుండటంతో ఆ దేశంలో కొనసాగేందుకు భారతీయ వృత్తి నిపుణులకు కనిపిస్తున్న మరో ప్రత్యామ్నాయం. అమెరికాలో వృత్తి నిపుణులుగా కొనసాగేందుకు ఆ దేశంలో పెట్టుబడిదారులుగా మారుతున్నారు. ఇందులో భాగంగా అక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆ కేటగిరీలో ఈబీ–5 వీసాల కోసం అమెరికాలోని భారతీయులు అత్యధికంగా దరఖాస్తులు చేస్తున్నారని ‘యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రియల్ ఎస్టేట్‌లో మన వాళ్ల పెట్టుబడులు.. ఆర్థిక మాంద్యం ఛాయలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంలో అమెరికాలోని దిగ్గజ ఐటీ కంపెనీలతోపాటు ఇతర కంపెనీలు భారీగా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. దాంతో హెచ్1బీ వీసా మీద ఆ దేశం వెళ్లిన భారతీయులు వెనక్కి వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అమెరికాలోనే కొనసాగాలంటే మరో కంపెనీల్లో ఉద్యోగం దక్కించుకోవాలి. అందుకు అవకాశాలు కూడా పెద్దగా లేకపోవడంతో భారతీయ వృత్తి నిపుణులు ఈబీ–5 వీసా కోసం దరఖాస్తులు చేస్తున్నారు. అందుకోసం ఆ దేశంలో పెట్టుబడులు పెట్టే కన్సల్టెన్సీలతో భాగస్వాములుగా మారుతున్నారు. ఎక్కువగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతున్నారు. కన్సల్టెన్సీలు కనీసం 20 మందిని ఓ గ్రూప్‌గా ఏర్పరచి ఒక్కొక్కరి నుంచి 8 లక్షల అమెరికన్ డాలర్ల చొప్పున 16 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ.131.39 కోట్ల) నిధిని సేకరిస్తున్నాయి. ఆ నిధులను వివిధ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ చేపడుతున్న రెంటల్ అపార్ట్మెంట్లు, భవనాలు, హోటళ్లు తదితర ప్రాజెక్టుల్లో పెట్టుబడిగా పెడుతున్నాయి. ఆ విధంగా పెట్టుబడి పెడుతున్న వారు ఆ వ్యాపారంలో క్రియాశీలకంగా ఉండటంగానీ ప్రత్యక్షంగా ఎవరికీ ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరంగానీ లేదు. వారు పాసివ్ పెట్టుబడిదారులుగా ఉంటారు. పెట్టిన పెట్టుబడిపై వారికి వడ్డీ లభిస్తుంది కూడా. దాంతోపాటు పెట్టుబడిదారు హోదా దక్కుతుంది. ఆ హోదాపై ఈబీ–5 వీసాకు దరఖాస్తు చేసి పొందుతున్నారు. ఆ వీసాపై అమెరికాలో ఏ ప్రాంతంలోనైనా పనిచేసేందుకు వారికి అవకాశం దక్కుతుంది. ఈబీ–5 వీసా కింద ఐదుగురు కుటుంబ సభ్యులు అమెరికాలో నివసించేందుకు అవకాశముంది. పెరుగుతున్న ఈబీ–5 వీసాలు భారతీయులకు ఈబీ–5 వీసాల జారీ పెరుగుతోంది. 2019లో 756 మంది భారతీయులు ఈబీ–5 వీసాలు పొందగా.. 2022లో ఏకంగా 1,381 మందికి వీటిని జారీ చేయడం విశేషం. 2016తో పోలిస్తే ఈబీ–5 వీసాలు పొందిన భారతీయుల సంఖ్య 400 శాతం పెరిగింది. 2022లో అమెరికా మొత్తం 10,885 ఈబీ–5 వీసాలు జారీచేసింది. వాటిలో 1,381 వీసాలతో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో చైనా, మూడో స్థానంలో వియత్నాం ఉన్నాయి. ఇక 2023లో 14,200 ఈబీ–5 వీసాలు జారీచేయాలని యూఎస్సీఐఎస్ భావిస్తోంది. ఈబీ–5 వీసా అంటే.. అమెరికాలో గ్రీన్కార్డ్కు దాదాపు సమానమైన గుర్తింపు ఉన్నదే ఈబీ–5 వీసా. అంతటి ప్రాధాన్యమున్న ఈ వీసా పొందాలంటే వ్యక్తులు అమెరికాలో కనీసం 8 లక్షల అమెరికన్ డాలర్లను (భారతీయ కరెన్సీలో రూ.6.57 కోట్లు) పెట్టుబడిగా పెట్టడంతోపాటు కనీసం 10 ఉద్యోగాలను కల్పించాలి. దాంతో వారికి పెట్టుబడిదారుల హోదా కింద ఈబీ–5 వీసాను జారీచేస్తారు. ఈబీ–5 వీసాకు దరఖాస్తు చేయాలంటే గతంలో 5 లక్షల అమెరికన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలని నిబంధన ఉండేది. కానీ, ఈ వీసాల కోసం డిమాండ్ పెరుగుతుండడంతో యూఎస్సీఐఎస్ ఈ కనీస పెట్టుబడి మొత్తాన్ని 2022లో 8 లక్షల డాలర్లకు పెంచింది. -
World Economic Forum: వచ్చే ఐదేళ్లలో నికరంగా... 1.4 కోట్ల కొలువులకు కోత
జెనీవా: వచ్చే ఐదేళ్లలో ఉద్యోగాల సృష్టిలో భారీ తగ్గుదల నమోదవుతుందని వరల్డ్ ఎకనామిక్ ఫో రం (డబ్ల్యూఈఎఫ్) అంచనా వేసింది. కొత్తగా 6.9 కోట్ల ఉద్యోగాల సృష్టి జరగనుండగా ఏకంగా 8.3 కోట్ల ఉద్యోగాలు కనుమరుగవుతాయని పేర్కొంది. నికరంగా 1.4 కోట్ల ఉద్యోగాలకు కోత పడుతుందని ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్’ పేరిట ఆదివారం విడుదల చేసిన ద్వై వార్షిక నివేదికలో వివరించింది. ప్రస్తుతం మొత్తం ప్రపంచ ఉద్యోగితలో ఇది 2 శాతం. వచ్చే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 23 శాతం ఉద్యోగుల వలస చోటుచేసుకోవచ్చని పేర్కొంది. భారత్‌లో ఇది 22 శాతం దాకా ఉండొచ్చని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 45 పెద్ద ఆర్థిక వ్యవస్థలు, 27 భారీ పారిశ్రామిక క్లస్టర్లు, 800 దిగ్గజ కంపెనీల్లోని దాదాపు 67.3 కోట్ల ఉద్యోగాలపై డబ్ల్యూఈఎఫ్ విస్తృతంగా సర్వే జరిపింది. విశేషాలు... ► వచ్చే ఐదేళ్లలో సప్లై చైన్స్, రవాణా, మీడియా, వినోద, క్రీడా రంగాలకు ఉద్యోగుల వలసలు ఎక్కువగా ఉంటాయి. ► ప్రపంచవ్యాప్తంగా నూతన ఉద్యోగాల సృష్టిలో చాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీలదే కీలక పాత్ర. ► 75 శాతం కంపెనీలు, సంస్థలు, కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీలను అందిపుచ్చుకుంటాయి. ► ఫలితంగా ఏకంగా 44 శాతం మంది ఉద్యోగుల నైపుణ్యాలకు పూర్తిగా కాలదోషం పట్టనుంది. ► సమర్థ పనితీరును కొనసాగించాలంటే ప్రతి 10 మంది ఉద్యోగుల్లో కనీసం ఆరుగురికి శిక్షణ అవసరమవుతుంది. ► దాంతో ఏకంగా 45 శాతం వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, కంపెనీలు ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధిపై హెచ్చు నిధులు వెచ్చిస్తాయి. ► ప్రపంచవ్యాప్తంగా ఆటోమేషన్ వేగం గత అంచనాల కంటే తగ్గింది. ప్రస్తుతం కేవలం 34 శాతం టాస్కులు ఆటోమేషన్తో నడుస్తున్నాయి. ఇది 2020తో పోలిస్తే కేవలం 1 శాతమే ఎక్కువ. కంపెనీలు కూడా ఆటోమేషన్ అంచనాలను కుదించుకున్నాయి. తొలుత 2025 నాటికి 47 శాతం టాస్కులను ఆటోమేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా తాజాగా దాన్ని 2027 నాటికి కేవలం 42 శాతానికి పరిమితం చేసుకున్నాయి. ► కృత్రిమ మేధ రాకతో బ్యాంక్ క్యాషియర్లు, క్లర్కులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు వంటి 2.6 కోట్ల ఉద్యోగాలు కనుమరుగవుతాయి. ► ఏఐ, మెషీన్ లెర్నింగ్ స్పెషలిస్టులు, ఫిన్‌టెక్ ఇంజనీర్లు, డేటా అనలిస్టులు, సైంటిస్టులు, అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ ఆపరేటర్లు వంటి ఉద్యోగాలు బాగా పెరుగుతాయి. ► స్వచ్ఛ ఇంధనం, వ్యర్థాల నిర్వహణ, సహజ వనరుల సమర్థ వినియోగం వంటి రంగాల్లో మేనేజర్లు, విండ్ టర్బైన్ టెక్నీషియన్లు, సోలార్ కన్సల్టెంట్లు, ఎకాలజిస్టులు, పర్యావరణ స్పెషలిస్టుల వంటి ఉద్యోగాలు కూడా భారీగా పెరుగుతాయి. ఈ రంగంలో భారత్‌తో సహా టాప్ 10 దేశాలు పర్యావరణ లక్ష్యాలు చేరుకోవాలంటే కనీసం 1.2 కోట్ల ఉద్యోగాల సృష్టి జరగాలి. భారత్‌లో సామాజికేతర రంగాల్లోనే ఉద్యోగ సృష్టి ► కరోనా అనంతరం భారత్‌లో విద్య, ఆరోగ్యం వంటి సామాజిక రంగాలతో పోలిస్తే సామాజికేతర రంగాల్లోనే ఉద్యోగాల సృష్టి ఎక్కువగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. భారత్‌లో వచ్చే ఐదేళ్లలో కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీ ఆధారిత రంగాలకు ఉద్యోగుల వలస అత్యధికంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. ► పర్యావరణ, సామాజిక, పాలన రంగాల్లో ఉపాధి వృద్ధి ఊపందుకుంటుందని భారత్‌లో సర్వేలో పాల్గొన్న వారిలో 61 శాతం మంది పేర్కొన్నారు. తర్వాత కొత్త టెక్నాలజీలకు 59 శాతం, డిజిటల్ యాక్సెస్‌కు 55 శాతం, వాతావరణ మార్పులు, పెట్టుబడుల రంగాలకు 53 శాతం ఓటేశారు. ► అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలను పెంచుకునేందుకు తమ యాజమాన్యమే అవకాశం కల్పించడం మేలని సర్వేలో పాల్గొన్న భారతీయ ఉద్యోగుల్లో ఏకంగా 97 శాతం అభిప్రాయపడ్డారు. ఇది ప్రభుత్వపరంగా జరగాలన్నవారు 18 శాతమే. ► ఉపాధి సృష్టిపై డేటా అనలిటిక్స్ పెను ప్రభావం చూపుతుందని 62 శాతం కంపెనీలు నమ్ముతున్నాయి. తర్వాతి స్థానాన్ని ఎన్క్రిప్షన్–సైబర్ సెక్యూరిటీ (53 శాతం), డిజిటల్ ప్లాట్‌ఫాంలు, అప్లికేషన్లు (51), ఇ–కామర్స్ (46 శాతం)కు ఇచ్చాయి. భారత్‌లో వచ్చే ఐదేళ్లలో ఉద్యోగుల వలస ఏఐ, మెషీన్ లెర్నింగ్ 38% డేటా అనలిస్టులు, సైంటిస్టులు 33% డేటా ఎంట్రీ క్లర్కులు 32% ఫ్యాక్టరీ కార్మికులు 18% ఆపరేషన్స్ మేనేజర్స్ 14% అకౌంటెంట్లు, ఆడిటర్లు 5% -
అమెరికాలో మన టెకీల మెడపై... ‘గడువు’ కత్తి!
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన హెచ్–1బీ ప్రొఫెషనల్స్ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోందని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పొరా స్టడీస్ (ఎఫ్ఐఐడీఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘సదరు కుటుంబాలకు ఇది పెను సంక్షోభం. వారికి చూస్తుండగానే సమయం మించిపోతోంది. అమెరికాలో పుట్టిన తమ పిల్లలను వెంటపెట్టుకుని వారి త్వరలో దేశం వీడాల్సిన పరిస్థితులు దాపురించాయి’’ అంటూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగం పోయిన 60 రోజుల గ్రేస్ పీరియడ్లోగా మరో ఉద్యోగం గానీ, ఉపాధి గానీ చూసుకోని పక్షంలో అమెరికా వీడాల్సి ఉంటుంది. జాబ్ మార్కెట్ అత్యంత ప్రతికూలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అంత తక్కువ సమయంలో మరో ఉద్యోగం వెతుక్కోవడం చాలామందికి దాదాపుగా అసాధ్యంగా మారుతోంది. దొరికినా అత్యంత సంక్లిష్టంగా ఉన్న హెచ్–1బీ మార్పు తదితర నిబంధనల ప్రక్రియను గ్రేస్ పీరియడ్లోపు పూర్తి చేయడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో దాన్ని కనీసం 180 రోజులకు పెంచాలంటూ ఆసియా అమెరికన్ల వ్యవహారాలకు సంబంధించిన అధ్యక్షుని సలహా కమిటీ ఇటీవలే సిఫార్సు చేయడం తెలిసిందే. ‘‘దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించి చర్యలు తీసుకున్నా అవి ఆమోదం పొంది అమల్లోకి రావడానికి సమయం పడుతుంది. ఈలోపు 60 రోజుల గ్రేస్ పీరియడ్ పూర్తయ్యే వారికి నిస్సహాయంగా దేశం వీడటం మినహా మరో మార్గం లేదు’’ అంటూ ఎఫ్ఐఐడీఎస్ ఆవేదన వెలిబుచ్చింది. ఈ నేపథ్యంలో గ్రేస్ పీరియడ్ పెంపు సిఫార్సును పరిశీలించి నిర్ణయం తీసుకునే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది. భారీగా ఉద్వాసనలు...: గూగుల్, మైక్రోసాఫ్ట్ మొదలుకుని పలు దిగ్గజ కంపెనీలు కొన్నాళ్లుగా భారీగా ఉద్యోగుల తొలగింపు బాట పట్టడం తెలిసిందే. దాంతో గత నవంబర్ నుంచి అమెరికాలో కనీసం 2.5 లక్షల మందికి పైగా ఐటీ తదితర ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. ‘‘వీరిలో దాదాపు లక్ష మంది దాకా భారతీయులేనని అంచనా. ఆదాయ పన్ను చెల్లించే హెచ్–1బి ఇమిగ్రెంట్లయిన వీరు 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెదుక్కుని సదరు కంపెనీ ద్వారా హెచ్–1బికి దరఖాస్తు చేసుకోలేని పక్షంలో దేశం వీడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు’’ అని ఎఫ్ఐఐడీఎస్ పేర్కొంది. -
టెక్నాలజీ రంగంలో ఉపాధి కోతలు
వాషింగ్టన్: టెక్నాలజీ రంగంలో గతేడాది నుంచి ఆరంభమైన ఉద్యోగ కోతల క్రమం ఇప్పుడప్పుడే ఆగేట్టు కనిపించడం లేదు. తాజాగా కంప్యూటర్ తయారీ సంస్థ డెల్ 6,600 ఉద్యోగులను తగ్గించుకుంటున్నట్టు ప్రకటించింది. గత నెలలోనే టెక్నాలజీ రంగంలో 50వేల ఉద్యోగాలకు కోత పడింది. అయినప్పటికీ చాలా వరకు టెక్నాలజీ కంపెనీలు మూడేళ్ల క్రితం నాటితో పోలిస్తే ఇప్పటికీ అదనపు ఉద్యోగులతో ఉండడం గమనార్హం. ► డెల్ తన ఉద్యోగుల్లో 5 శాతాన్ని తొలగించుకోనుంది. ఈ సంస్థలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,33,000గా ఉంది. ► గత నెలలో అమెజాన్ 18వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. ► సేల్స్‌ఫోర్స్ 8,000 మంది ఉద్యోగులను తొలగించింది. ► మైక్రోసాఫ్ట్ 10వేల మంది, గూగుల్ 12వేల మంది చొప్పున ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. ► గూగుల్ 12,000 మంది (6 శాతం) ఇంటికి వెళ్లకతప్పదని ప్రకటించింది. ► స్పాటిఫై 6 శాతం మందిని తొలగించుకుంది. ► ఎస్ఏపీ అయితే ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది ఉద్యోగులను (2.5 శాతం) తగ్గించుకుంది. ► పేపాల్ సంస్థ 7 శాతం ఉద్యోగులను (2,000 మంది) తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ► ఐబీఎం సంస్థ కూడా 3,900 ఉద్యోగులను తొలగించింది. ► గతేడాది చివర్లో ట్విట్టర్ సైతం పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. ► మెటా సంస్థ 11,000 మందిని (13 శాతం), లిఫ్ట్ 700 మందికి ఉద్యోగులకు ఉద్వాసన చెప్పింది. -
టెక్ కంపెనీల్లో కోతల పర్వం..
న్యూయార్క్: ఉత్పత్తులు, సర్వీసులు, సాఫ్ట్వేర్ మొదలైన వాటికి డిమాండ్ నెలకొనడంతో గత కొన్నాళ్లుగా చిన్నా, పెద్ద టెక్నాలజీ కంపెనీలు జోరుగా నియామకాలు జరిపాయి. కానీ, ఇటీవల పరిస్థితులు మారడంతో భారీగా ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే టెక్నాలజీ కంపెనీలు దాదాపు 50,000 మందికి ఉద్వాసన పలికాయి. అయితే, ఇటీవల కొన్ని వారాలుగా భారీగా తొలగింపులు చేపట్టినప్పటికీ మూడేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పటికీ చాలా మటుకు టెక్ సంస్థల్లో సిబ్బంది సంఖ్య గణనీయంగానే పెరిగిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా.. ఈ మధ్య కాలంలో టెక్ రంగంలో ఉద్యోగాల కోతలను ఒకసారి చూస్తే.. 2022 ఆగస్టు స్నాప్: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం స్నాప్‌చాట్ మాతృ సంస్థ 20 శాతం మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. రాబిన్‌హుడ్: కొత్త తరం ఇన్వెస్టర్లకు మార్కెట్‌ను చేరువలోకి తెచ్చిన రాబిన్‌హుడ్ తమ ఉద్యోగుల సంఖ్యను 23 శాతం తగ్గించుకుంది. దాదాపు 780 మందిని తొలగించింది. 2022 నవంబర్ ట్విటర్: టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ చేతికి వచ్చే నాటికి ట్విటర్లో 7,500 మంది ఉద్యోగులు ఉండేవారు. అందులో దాదాపు సగం మందిని తొలగించారు. లిఫ్ట్: ట్యాక్సీ సేవల సంస్థ లిఫ్ట్ దాదాపు 700 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం. మెటా: ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా 11,000 మందికి ఉద్వాసన పలికింది. 2023 జనవరి అమెజాన్: ఈ–కామర్స్ కంపెనీ 18,000 మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది. కంపెనీకి అంతర్జాతీయంగా ఉన్న సిబ్బందిలో ఇది సుమారు 1 శాతం. సేల్స్‌ఫోర్స్: కంపెనీ సుమారు 8,000 మందిని (మొత్తం సిబ్బందిలో 10 శాతం) తొలగించింది. కాయిన్‌బేస్: ఈ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం 950 ఉద్యోగాల్లో కోత పెట్టింది. దాదాపు 20 శాతం మందిని తొలగించింది. మైక్రోసాఫ్ట్: ఈ సాఫ్ట్వేర్ దిగ్గజం మొత్తం సిబ్బందిలో 5 శాతం మందిని (సుమారు 10,000 ఉద్యోగాలు) తొలగిస్తోంది. గూగుల్: ఈ సెర్చి ఇంజిన్ దిగ్గజం 12,000 మందికి ఉద్వాసన పలుకుతోంది. మొత్తం సిబ్బందిలో ఇది దాదాపు 6 శాతం. స్పాటిఫై: ఈ మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవల సంస్థ అంతర్జాతీయంగా తమ ఉద్యోగుల సంఖ్యను 6 శాతం తగ్గించుకుంటోంది. నిర్దిష్టంగా సంఖ్యను పేర్కొనలేదు. ఇటీవలి స్పాటిఫై వార్షిక ఫలితాల నివేదిక ప్రకారం కంపెనీలో సుమారు 6,600 మంది ఉద్యోగులు ఉన్నారు. -
మైక్రోసాఫ్ట్‌లో 10 వేల ఉద్యోగాల కోత
న్యూయార్క్: టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా మైక్రోసాఫ్ట్ 10,000 మంది సిబ్బందిని తొలగించనుంది. ఇది కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో సుమారు అయిదు శాతం. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల బుధవారం ఈ విషయం వెల్లడించారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న నేపథ్యంలో కంపెనీ ముందుకు సాగాలంటే ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆయన పేర్కొన్నారు. ‘ప్రస్తుతం చేపడుతున్న మార్పుల కారణంగా 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఆఖరు నాటికి మొత్తం మీద 10,000 ఉద్యోగాలు తగ్గనున్నాయి. ఇది మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 5 శాతం లోపే ఉంటుంది‘ అని సిబ్బందికి పంపిన ఈమెయిల్లో సత్య నాదెళ్ల వివరించారు. తొలగించే ఉద్యోగులకు చెల్లించే పరిహారాలు మొదలైన వాటికి సంబంధించి 1.2 బిలియన్ డాలర్ల వ్యయాలను రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో మైక్రోసాఫ్ట్ చూపనుంది. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు పరిహారం, ఆరు నెలల పాటు ఆరోగ్య సంరక్షణ కవరేజీ మొదలైనవి ప్రయోజనాలు దక్కుతాయి. ప్రస్తుతం పరిస్థితులు గణనీయంగా మారిపోతున్నాయని నాదెళ్ల పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో ఇప్పటికే మాంద్యం నెలకొనగా, మరికొన్నింటిలో మాంద్యం తలెత్తవచ్చన్న అంచనాలుండటంతో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయని వివరించారు. ఇప్పటికే ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ తదితర సంస్థలు 11,000 పైచిలుకు ఉద్యోగాల్లో కోత విధించాయి. అమెజాన్ కూడా 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. -
‘నా ఉద్యోగం ఊడింది..జీవితం తలకిందులైంది’
ఆర్ధిక మాంద్యం భయాలు,మార్కెట్లో నెలకొన్న అనిశ్చితులు కారణంగా ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. తాజాగా ఇన్వెస్ట్మెంట్ బ్యాకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ సాచ్స్ (జీఎస్) గ్రూప్ దాదాపు 3,200 ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. వారిలో ఖరగ్ పూర్లో ఐఐటీ పూర్తి చేసి, బెంగళూరు కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న శుభం సాహు ఒకరు. అయితే తన పుట్టిన రోజు జరుపుకున్న కొన్ని రోజుల తర్వాత ఊహించని విధంగా గోల్డ్‌మన్ సాచ్స్ పింక్ స్లిప్‌లు జారీ చేసింది. దీంతో సాహు.. గోల్డ్ మన్ సాచ్స్‌లో జాబ్ ఎక్స్పీరియన్స్, తొలగింపులపై లింక్డిఇన్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు. అందులో.. ‘వావ్ ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకంగా ప్రారంభమైంది. సుమారు 6 నెలల క్రితం అనుకుంటా జీఎస్‌లో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా జాయిన్ అయ్యా. నా బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్న కొన్ని రోజులకే ఫైర్ చేసినట్లు తెలిసింది. ఉద్యోగం చేసింది కొద్ది కాలమే అయినా జీఎస్‌కు కృతజ్ఞతలు. నేర్చుకోవడానికి, కెరియర్లో ఎదిగేందుకు అనువైన ప్రదేశం’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఉన్న జాబ్ పోయింది కాబట్టి.. కొత్త జాబ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించానంటూ లింక్డ్ఇన్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇలా సాహూయే కాదు.. గోల్డ్ మెన్ సాచ్స్ విధుల నుంచి తొలగించిన అనేక మంది హెచ్1 బీ వీసా హోల్డర్ ఉద్యోగులు కొత్త జాబ్ కోసం ప్రయత్నిస్తూ సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. మన దేశానికి చెందిన శిల్పి సోనీ టెక్సాస్ ప్రాంతంలో ఉన్న జీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌గా ఏడాదిన్నర పాటు పని చేసింది. త్వరగానే జీవితం తలకిందులు అయ్యిందంటూ తన మనసులో మాట బయట పెట్టింది. ‘నా కుటుంబంలో విదేశాలలో మాస్టర్స్ పూర్తి చేసిన మొదటి వ్యక్తిగా నేను గర్వపడుతున్నారు. నేను గ్రామీణ కుటుంబం నుండి వచ్చాను. కాబట్టి సామాజిక, ఆర్థిక పరిమితులను అధిగమించి ఇక్కడకు రావడానికి ఇది ఒక రోలర్ కోస్టర్‌గా మారింది. నేను ఎక్కడ నుండి జీవితాన్ని ప్రారంభించానో.. అక్కడే ఉద్యోగం పోగొట్టుకోవడం బాధగా ఉంది. కానీ యూఎస్‌లో నా ప్రయాణం ముగిసిపోలేదు.ఇంకా ఉంది. కాబట్టి ఉద్యోగ వేటను కొనసాగిస్తా’. కొత్త ఉద్యోగ అన్వేషణలో నా పరిమిత సమయాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు లింక్డిఇన్ పోస్ట్‌లో చెప్పారు. చదవండి👉 ఉద్యోగులకు దిగ్గజ కంపెనీ భారీ షాక్.. ఇక వేలాది మంది ఇంటికే -
చావు కబురు చల్లగా అన్నట్టు: కార్పొరేట్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్!
న్యూఢిల్లీ: ఆర్థికమాంద్యం కారణంగా పలు కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ పలు దిగ్గజ సంస్థల్లో కొనసాగుతోంది. తాజాగా ఈ బాటలో మరో గ్లోబల్‌సంస్థ పెప్సీకో నిలిచింది. స్నాక్స్ అండ్ శీతల పానీయల కంపెనీ వందలాదిమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు పెప్సీకో అంతర్గత మెమో జారీ చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.ఉత్తర అమెరికాలో వందలాది కార్పొరేట్ ఉద్యోగాలను తొలగిస్తోందని తెలిపింది. ఈ వార్తలతో అంతర్జాతీయ దిగ్గజసంస్థ పెప్సీకో తన కంపెనీ ఉద్యోగుల్లు గుండెల్లో బాంబు పేలింది. పెప్సికో పెప్సి కోలా డ్రింక్‌తో పాటు డోరిటోస్, లేస్ చిప్స్ , క్వేకర్ ఓట్స్‌ని తయారు చేస్తుంది. పెప్సీకోలో ప్రపంచవ్యాప్తంగా 309,000 మంది ఉద్యోగులున్నారు. వీరిలో 40శాతానికి మంచి అమెరికాలోనే ఉన్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ కార్యక్రమం ద్వారా ఇప్పటికే స్నాక్స్ యూనిట్లో ఉద్యోగాల కోత నేపథ్యంలో ఇక పానీయాల వ్యాపారంలో కోతలు భారీగా ఉంటాయని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది. అయితే ఈ వార్తలపై పెప్సీకో కంపెనీ అధికారికంగా ఇంకా స్పందించలేదు. (లేఆఫ్స్ బాంబు: టాప్ మేనేజర్స్‌తో సహా 20 వేల మందిపై వేటు!) కాగా ప్రపంచం ఆర్థికమాంద్యం ముప్పు భయాలతో పలు దిగ్గజ కంపెనీలు ముందస్తు చర్యలకు దిగుతున్నాయి. దీనికి తోడు ఆదాయాలు పడిపోతూ ఉండటంతో నిర్వహణ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఇప్పటికే పలు టెక్, మీడియా కంపెనీల్లో లక్షల మంది ఉద్యోగులపై వేటు వేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెజాన్, ఆపిల్, మెటా, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఇంక్, సీఎన్ఎన్, కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులను తొలగించాయి. (రెండేళ్లలో 10వేల సినిమా హాళ్లు..సినిమా చూపిస్త మామా!) -
షేర్‌చాట్ ఉద్యోగుల కోత, ఫాంటసీ స్పోర్ట్స్ యాప్ మూత
సాక్షి,ముంబై: దేశంలో అత్యంత విలువైన స్టార్టప్‌లలో ఒకటి షేర్ చాట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల తొలగింపులతోపాటు, షేర్‌చాట్ పేరెంట్ కంపెనీ మొహల్లా టెక్ తన రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్, ఫాంటసీ స్పోర్ట్స్ యాప్‌ను మూసివేసింది. మెగా ఫండింగ్ తరువాత ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. బెంగళూరుకు చెందిన షేర్ చాట్ మొత్తం 100కు పైగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సోషల్ మీడియా కంపెనీగా సక్సెస్ కోసం తమ వ్యూహాన్ని క్రమం తప్పకుండా అంచనా వేసి అవసరమైన మార్పులు చేస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ జీట్11ని కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని ప్రకటించింది. తమ వర్క్‌ఫోర్స్‌లో 5 శాతంకంటే తక్కువమందిపైనే దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. మొత్తం సంస్థలో 2200 మందికి పైగా ఉద్యోగులున్నారు. గూగుల్, టైమ్స్ గ్రూప్ , టెమాసెక్ పెట్టుబడిదారుల నుండి 255 మిలియన్ల డాలర్ల విలువైన ఫండింగ్ రౌండ్‌ను కంపెనీ ప్రకటించిన ఐదు నెలల తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకుంది. కాగా పరిశ్రమ అంచనాల ప్రకారం 2022 ప్రారంభం నుండి, భారతీయ స్టార్టప్‌లు 16,000 మంది ఉద్యోగులను తొలగించాయి. -
షాకింగ్: ఇక ఆ రంగంలో ఉద్యోగాలకు ముప్పు, నేడో, రేపో నోటీసులు!
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థికమాంద్యం ప్రమాదం ఉద్యోగులు మెడకు చుట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇప్పటికే టెక్, ఐటీ దిగ్గజాలు ఉద్యోగులు ఉపాధిపై దెబ్బకొట్టాయి.ఆదాయాలు తగ్గిపోవడం, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగుల కోత ఆందోళన కొన సాగు తుండగానే తాజాగా ఈ భారీ తొలగింపుల సీజన్ సెగ మీడియా బిజినెస్‌ను తాకింది.(జొమాటోకు అలీబాబా ఝలక్, భారీగా షేర్ల అమ్మకం) వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ యాజమాన్యంలోని సీఎన్ఎన్ ఉద్యోగులపై వేటు వేయనుంది. ఈ మేరకు నెట్వర్క్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ క్రిస్ లిచ్ట్ బుధవారం మొత్తం టీమ్‌కు అంతర్గత సందేశంలో ఉద్యోగులను హెచ్చరించారు. ప్రధానంగా పెయిడ్ కాంట్రిబ్యూటర్స్పై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ట్వీట్ చేశారు. పొంచి ఉన్న మాంద్యం, పెరుగుతున్న స్ట్రీమింగ్ ఖర్చులను తగ్గించుకునేలా డిస్నీ ఉద్యోగుల తొలగింపులు, నియామక స్తంభన, ఇతర వ్యయాలను తగ్గించే కార్యక్రమాలను కూడా ప్రకటించింది. (వారికి భారీ ఊరట: రెండేళ్లలో కోటి ఉద్యోగాలు) ఆర్థికరంగ మందగమనం ప్రభావాన్ని ఎదుర్కొనే క్రమంలో వ్యయాలను నియంత్రించు కునేందుకు ప్రధానంగా ఉద్యోగాల్లోనే కోత విధిస్తున్నాయి. యాక్సియోస్ కథనం ప్రకారం, యాడ్ మార్కెట్ మందగింపుతో మీడియా వ్యాపారం కూడా దెబ్బతింటోంది. ఫలితంగా ఉద్యోగుల తొలగింపులు, నియామకాలు నిలిపివేత లాంటి ఇతర ఖర్చు తగ్గించే చర్యలను మీడియా సంస్థలు ప్రకటించాయి. సీబీఎస్, ఎంటీవీ, వీహెచ్1 లాంటి అనేక ఇతర నెట్‌వర్క్‌లను నిర్వహిస్తున్న మరో మీడియా పవర్‌హౌస్, పారామౌంట్ గ్లోబల్ ఇటీవల ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. (శాంసంగ్ గుడ్ న్యూస్: భారీ ఉద్యోగాలు) CNN boss Chris Licht informs employees in an all-staff note that layoffs are underway. Licht says those being notified today are largely paid contributors and then tomorrow CNN "will notify impacted employees." Licht will then provide an update to staff afterward. pic.twitter.com/nD0pt9Ruwj — Oliver Darcy (@oliverdarcy) November 30, 2022 -
ఈ ఉద్యోగాలకు ఏమైంది?
మొన్న మైక్రోసాఫ్ట్, ట్విట్టర్... నిన్న వాట్సప్, ఫేస్‌బుక్‌ల మాతృసంస్థ మెటావర్స్... నేడు అమెజాన్... హెచ్‌పీ! వరుసగా ఉద్యోగాల్లో కోతల వార్తలే. అమెరికన్ టెక్ సంస్థలు అనేకం ఉద్యోగస్థుల్ని తగ్గించుకొనే పనిలో పడడంతో వేలమంది వీధిన పడనున్నారు. సదరు సంస్థల భారతీయ శాఖల్లో పనిచేస్తున్న మనవాళ్ళ మీదా అనివార్యంగా ఆ ప్రభావం ఉండనుంది. ఏ రోజు ఏ కంపెనీ ‘పింక్ స్లిప్’ ఇస్తుందో తెలియని కంగారు పుట్టిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం సహా అనేక పరిణామాలతో ద్రవ్యోల్బణం పెరిగి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తుబిస్తుగా మారింది. లాభాలు పడిపోతూ, ప్రపంచమంతటా మాంద్యం తప్పదనే భయం నెలకొంది. అమెజాన్ నుంచి డిస్నీ దాకా దిగ్గజ టెక్ సంస్థలు శ్రామికశక్తిని పునర్వ్యవస్థీకరించు కుంటున్నదీ అందుకే. ఎక్కడికెళ్ళి ఆగుతుందో తెలియని ఈ పరిస్థితి భారత్ సైతం అప్రమత్తం కావాలని గుర్తుచేస్తోంది. శ్రామికశక్తి పునర్మూల్యాంకనంతో ఈ ఏడాది ఇప్పటి వరకు 850కి పైగా టెక్ కంపెనీల్లో లక్షా 37 వేల వైట్ కాలర్ ఉద్యోగులు ఇంటి బాట పట్టాల్సి వచ్చిందని ఓ అంతర్జాతీయ అంచనా. లిఫ్ట్, స్ట్రైప్, కాయిన్‌బేస్, షాపిఫై, నెట్‌ఫ్లిక్స్, శ్నాప్, రాబిన్‌హుడ్, చైమ్, టెస్లా అనేక సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికా కేంద్రంగా నడుస్తున్న భారీ సంస్థలు ఒక్క గత నెలలోనే 33,843 ఉద్యోగాలకు మంగళం పలికాయి. ఉద్యోగాల కోత సుమారు 13 శాతానికి ఎగబాకింది. 2021 ఫిబ్రవరి నుంచి గత నెల వరకు చూస్తే – ఒకే నెలలో ఇన్ని ఉద్యోగాలపై వేటు పడడం ఇదే అత్యధికం. పులి మీద పుట్రలా గూగుల్ సైతం ఈ వారం ఉద్వాసనల బాట పట్టింది. లక్షా 87 మందితో టెక్ రంగంలో అతి పెద్ద ఉద్యోగ సంస్థ అయిన గూగుల్ 10 వేల మందిని ఇంటికి సాగనంపడానికి సిద్ధమవుతోందని ప్రాథమిక వార్త. ఆ సంస్థకు అననుకూలమైన మార్కెట్ పరిస్థితులు నెలకొన్నాయి. పైపెచ్చు సంస్థలో గణనీయమైన వాటాతో యాజమాన్య నిర్ణయాలను ప్రభావితం చేసే ‘యాక్టివిస్ట్ హెడ్జ్ ఫండ్’ నుంచి ఒత్తిడి ఉంది. అలా 6 శాతం మంది ఉద్యోగులను తగ్గించుకొనే పనిలోకి దిగింది. పని తీరులో రేటింగు అతి తక్కువగా ఉన్నవారినే తొలగిస్తామన్నది గూగూల్ చెబుతున్న మాట. దానికి సమర్థమైన ర్యాంకింగ్ విధానం ఉందంటున్నా, అది ఏ మేరకు లోపరహితమో చెప్పలేం. ప్రస్తుత కోతల పరిస్థితి గూగుల్ స్వయంకృతమని నిపుణుల మాట. అవసరానికి మించి శ్రామిక శక్తి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా, పెడచెవిన పెట్టి గత త్రైమాసికంలో ఆ సంస్థ ఎడాపెడా కొత్త ఉద్యోగస్థుల్ని తీసుకుంది. అదీ భారీ వేతనాలకు తీసుకోవడం మెడకు గుదిబండైంది. లాక్డౌన్లలో పని నడపడానికి అమెరికా లాంటి చోట్ల తీసుకున్న ఉద్యోగాలు ఇప్పుడు వాటికి ఎక్కువయ్యాయి. ఉద్యోగస్థానాల్లో గణనీయంగా ఊపందుకున్న ఆటోమేషన్ ప్రభావం సరేసరి. వెన్నాడుతున్న ఆర్థిక మాంద్యానికి తోడు కరోనా అనంతర విక్రయాలు తగ్గాయి. ఫలితంగా పదేళ్ళుగా వీర విజృంభణలో ఉన్న టెక్‌సంస్థలు కొత్త వాస్తవాన్ని జీర్ణించుకోవాల్సి వచ్చింది. ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తి సంస్థ హెచ్‌పీ వచ్చే 2025 చివరికి 6 వేల ఉద్యోగాలను తగ్గించుకుంటామని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ 10 వేల మందికి పింక్ స్లిప్పులు ఇస్తామనేసరికి, మన దేశంలోని దాని శాఖలోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. ‘మీ అంతట మీరు ఉద్యోగాలు వదిలేయం’డంటూ అమెజాన్ ఇండియా తన ఉద్యోగులకు ‘స్వచ్ఛంద వీడ్కోలు పథకం’ (వీఎస్పీ) ప్రకటించడం చర్చ రేపుతోంది. మూకుమ్మడిగా ఇంటికి సాగనంపడాన్ని వ్యతిరేకిస్తూ మన కార్మిక శాఖకు ఫిర్యాదులు రావడం, వీఎస్పీ వివరాలను అందించాలంటూ మన ప్రభుత్వం ఇక్కడి శాఖను అడగడం చకచకా జరిగాయి. నిజానికి, కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా, ఐరోపాలు మూడూ బాగా మందగించాయి. అందుకే, వచ్చే 2023లో ప్రపంచానికి మాంద్యం తప్పదని వరల్డ్ బ్యాంక్ అధ్యయనం. ప్రపంచ ఆర్థికాభివృద్ధి నిదానించి, మరిన్ని దేశాలు మాంద్యం లోకి జారితే వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లోని ప్రజానీకం దుష్పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది. ప్రపంచానికి మెడ మీద కత్తిలా మాంద్యం భయపెడుతున్న వేళ, మనమూ అప్రమత్తం కావాలి. ప్రపంచీకరణతో ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ విపణికి మనం ముడిపడి ఉన్నాం. ముందు జాగ్రత్త చర్యలకు దిగాలంటున్నది అందుకే. రానున్న పరిణామాల్ని దీటుగా ఎదుర్కోవడానికి ఏ మేరకు సిద్ధంగా ఉన్నామన్నది కీలకం. ప్రపంచశ్రేణి టెక్ సంస్థల కార్యకలాపాల్లో మన ఐటీ సంస్థల ప్రమేయముంది గనక ఉద్యోగ విపణిలో సంక్షోభం తలెత్తకుండా ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి. ఐటీ రంగంలో మొదలైన కోతలు ఇతర రంగాలకూ పాకే ముప్పుంది. సత్వరం మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే మార్గాలు వెతకాలి. అదనపు పెట్టుబడులు వచ్చేలా, ఉత్పాదకత పెరిగేలా విధానాలు నిర్ణయించడం దారిద్య్ర నిర్మూలనకూ, వృద్ధికీ కీలకం. కార్మిక హక్కులను నీరుగార్చి, ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో తెలియని అనిశ్చితి, అభద్రత కల్పించడం ఏ రంగానికైనా మంచివి కావు. అసలే కరోనాలో ఉపాధి పోయి రోజువారీ శ్రామికులు చిక్కుల్లో ఉన్నారు. ఇప్పుడు వైట్ కాలర్ ఐటీ రంగ ఉద్యోగుల పరిస్థితీ అదే అంటే ఉన్న సంక్షోభం ఇంకా తీవ్రమవుతుంది. ఇప్పటికీ మన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) మెరుగ్గా ఉందంటున్న పాలకులు మేకిన్ ఇండియా స్వప్నాలను చూపడమే కాక, ఉద్యోగక్షేత్రంలోనూ దాని ఫలాలు అందించగలిగితే మంచిది. కిందపడ్డా మళ్ళీ పైకి లేస్తాం! -
Amazon Layoffs అమెజాన్ కొత్త ఎత్తుగడ, కేంద్రం భారీ షాక్!
న్యూఢిల్లీ: టెక్, ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 10వేల ఉద్యోగాల కోత ప్రకటన తరువాత వచ్చే పరిణామాలను ఎదుర్కొ నేందుకు మల్లగుల్లాలు పడుతోంది. ఈ మేరకు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ఇండియన్ టెకీలను వేడు కుంటోంది. అంతేకాదు అలా చేసిన వారికి భారీ ప్రయోజనాలు అందిస్తామని కూడా ప్రకటించింది. దీంతో ఈ అంశం హాట్‌టాపిక్‌గా నిలిచింది. (మరో టెక్ దిగ్గజం సంచలన నిర్ణయం: ఉద్యోగులకు ఇక గడ్డుకాలమేనా?) అమెజాన్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ టీమ్‌లో L1 నుండి L7 బ్యాండ్‌లో పని చేస్తున్న భారతీయ ఉద్యోగులు కంపెనీ వాలంటరీ సెపరేషన్ ప్రోగ్రామ్‌కు అర్హులని పేర్కొంది. ఈ పథకం కింద ఈ సంవత్సరం నవంబర్ 30 లోపు రాజీనామా చేస్తే వారికి కొన్ని ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇస్తోంది. దీంతో పలువరు ఇండియన్ ఉద్యోగులు స్వచ్ఛంద రాజీనామాలను ప్రారంభించినట్టు తెలుస్తోంది. (దోమలను తోలేసినంత తేలిగ్గా ఉద్యోగ కోతలు, ఎన్నాళ్లీ వేట?) కార్మిక మంత్రిత్వ శాఖ సమన్లు భారతీయఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విమరణకు అమెజాన్ ప్రయత్నాలపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు అమెజాన్‌కు కార్మిక మంత్రిత్వ శాఖ నోటీసు లిచ్చింది. దీనిపై విచారణకు హాజరు కావాలని మంగళవారం డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఏ అంజనప్ప కంపెనీకి నోటీసులు పంపారు. భారతదేశంలో అమెజాన్ చేసిన తొలగింపులపై ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ఫిర్యాదు మేరకు, బెంగళూరులోని ఈకామర్స్ దిగ్గజం సీనియర్ పబ్లిక్ పాలసీ మేనేజర్ స్మితా శర్మను (బుధవారం నవంబర్ 23న జరిగే) విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఐటి/ఐటిఇఎస్ ఉద్యోగుల యూనియన్ గత వారం కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్‌కు రాసిన లేఖలో, దేశంలోని అమెజాన్ ఉద్యోగులను స్వచ్ఛందంగా కంపెనీ నుండి వైదొలగాల్సి వస్తోందన్న ఫిర్యాదులు అందాయని పేర్కొంది. దేశంలోని కార్మిక చట్టాలను అమెజాన్ ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలగించిన ఉద్యోగులకు భారీ పరిహారం అందించాల్సి ఉంటుంది. అందుకే నవంబర్ 30, 2022న భారత ప్రామాణిక కాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటలలోపు స్మార్ట్ ఫారమ్‌ల ద్వారా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలంటూ ఉద్యోగులకు ఒక నోట్ పంపింది. అయితే ఉద్యోగులు రాజీనామా చేసిన తర్వాత ఎంత సమయంలోపు ఈ పరిహారం అందిస్తుంది అనేది అమెజాన్ స్పష్టం చేయలేదు. ఈ స్కీం కింద 22 వారాల బేస్ పే; అలాగే ప్రతి ఆరు నెలల సర్వీస్‌కు ఒక వారం మూల వేతనం (సమీప 6 నెలల వరకు ఉంటుంది) గరిష్ట ప్రయోజనం ఇరవై వారాల వరకు చెల్లింపు, బీమా బెనిఫిట్ పాలసీ ప్రకారం 6 నెలల పాటు మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేదా దానికి బదులుగా సమానమైన బీమా ప్రీమియం మొత్తం తదితర ప్రయోజనాలను ఆఫర్ చేసింది.ఒక ఉద్యోగిని కంపెనీ తొలగించినట్లయితే, తొలగింపును చట్టపరంగా సవాలు చేయవచ్చు. కానీ ఒక ఉద్యోగి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు, న్యాయస్థానంలో ఉద్యోగం కోల్పోవడంపై సవాలు చేసే హక్కును కోల్పోతారు. ఇదే కంపెనీ ఎత్తుగడ అని లానోజిఎమ్బిహెచ్ ఎంప్లాయిమెంట్ లా ప్రాక్టీషనర్, జనరల్ కౌన్సెల్ భాగ్యశ్రీ పాంచోలో వ్యాఖ్యానించారు. కాగా ఆర్థికమందగమనం, ఆదాయాలు క్షీణత నేపథ్యంలో తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను విభాగాల్లో 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు వచ్చే ఏడాది కూడా ఈ తొలగింపుల ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు: అమెజాన్ కీలక నిర్ణయం) -
దోమలను తోలేసినంత తేలిగ్గా ఉద్యోగ కోతలు, ఎన్నాళ్లీ వేట?
ఉదయాన్నే ఆఫీసు కెళ్లిన మనిషి సాయంత్రానికి నిరుద్యోగి అయిపోయి ఇంటికి వస్తున్నాడు. మధ్యాహ్నం వరకు కంపెనీలో హుషారుగా ఉన్న వారు సాయంత్రానికి ఉద్యోగం పోయిన బాధతో ఏ బారుకో పోతున్నారు. దోమలను తోలేసినంత తేలిగ్గా కంపెనీల యాజమాన్యాలు ఉద్యోగులను ఇంటికి తోలేస్తున్నాయి. ఐటీ రంగమంతటా ఈ ట్రెండ్ కొనసాగుతోంది. అయితే వీటికి ఆజ్యం పోసింది మాత్రం మస్కే. పాశ్చ్యాత్య దేశాల్లోని ఈ సంక్షోభం భారతీయ యువతపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో అన్న ఆందోళనలు వినపడుతున్నాయి. ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ వచ్చీ రావడంతోనే వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపేశాడు. అమెజాన్, మెటా కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను వీధిన పడేశాయి. బైజూస్, నెట్ ప్లిక్స్, మైక్రోసాఫ్ట్,స్నాప్ కంపెనీలు ఎంత మంది ఉద్యోగాలకు శఠగోపం పెట్టచ్చా అని ఆలోచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి ఐటీ రంగంలో ప్రస్తుతం ఉద్యోగాలు ఊడబీకే రుతువు మొదలైంది. కొద్ది నెలల పాటు ఈ ఉద్యోగ మేథం కొనసాగుతుంది. ఆర్ధికమాంద్యం తరుముకు వస్తోన్న నేపథ్యంలోనే ఉద్యోగాలు ఊడపీక్క తప్పడం లేదని యాజమాన్యాలు అంటున్నాయి. (మరో టెక్ దిగ్గజం సంచలన నిర్ణయం: ఉద్యోగులకు ఇక గడ్డుకాలమేనా?) ఎలాన్ మస్క్ ఏ ముహూర్తాన ట్విటర్ కంపెనీని సొంతం చేసుకున్నాడో కానీ అప్పట్నుంచే ఉద్యోగుల కుర్చీ కిందకు కుంపట్లు వచ్చి చేరాయి. కంపెనీ ఓనర్ గా సంస్థలో అడుగు పెట్టడానికి ముందే సంస్థలో సగానికి సగం మంది ఉద్యోగులను ఇంటికి పంపేసేందుకుసిద్ధమయ్యారు మస్క్. అలా ఉద్యోగాలు పీకేయకపోతే కంపెనీ దివాళా తీస్తుందని హెచ్చరించారు. వచ్చీ రావడంతోనే తనకు నచ్చని టాప్ బాసులను అవమానకరంగా ఇంటికి పంపిన మస్క్ ఆనందంతో ఓ డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత ఉద్యోగులను వేటాడ్డం మొదలు పెట్టారు. ఎంతమందిని పీకేయచ్చు? ఎవరెవరిని పీకేయాలి? అన్న కోణంలో కసరత్తులు మొదలు పెట్టారు. ఆ క్రమంలోనే ఉద్యోగులందరికీ ఓ మెయిల్ పంపారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని కష్టపడి పనిచేస్తారా? లేకపోతే ఇళ్లకు పోతారా? అని బెదిరింపు ధోరణితో కూడిన ఏక వాక్య సందేశాన్ని పంపారు. కష్టపడి పనిచేస్తామని ముందుకు వచ్చేవారికి ఒక ఫాం ఇచ్చి దాన్ని పూర్తి చేయించి సంతకం తీసుకోవాలన్నది మస్క్ ప్లాన్. అయితే ఆ ఫాంస్ పంపిణీ చేయడానికి ముందే ఉద్యోగులు మస్క్ వైఖరిపై మండిపోయారు. చీటికీ మాటికీ ఉద్యోగం పీకేస్తాను అనేవాడు ఏం బాస్? అటువంటి బాస్ దగ్గర పని చేస్తే ఎంత చెయ్యకపోతే ఎంత? అనుకున్న మెజారిటీ ఉద్యోగులు నువ్వూ వద్దు నీ ఉద్యోగమూ వద్దు నీకో దండం అనేసి సెల్యూట్ చేస్తోన్న ఎమోజీ ఒకటి పెట్టేసి ఊరుకున్నారు. ఇక ట్విటర్లో అనుక్షణం భయపడుతూ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదని ఉద్యోగులు నిశ్చయానికి వచ్చేశారు. అందరూ ఉద్యోగాలు మానేయడానికి మూకుమ్మడిగా సిద్దమవుతున్నారన్న సమాచారం అందగానే మస్క్ లో కంగారు మొదలైంది. అందరూ వెళ్లిపోతే కంపెనీని నడిపెదెవరు? అన్న ఆలోచన రాగానే ఇలాన్ మస్క్ దిద్దుబాటు చర్యలకు మొదలెట్టారు. ఉద్యోగుల్లో కొందరికి వర్క్ ఫ్రం హోం కొనసాగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాం అన్నారు. మరి కొందరు కీలక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఉద్యోగులు మాత్రం ఈ తాయిలాలకు లొంగేలా కనపడ్డం లేదు. బతికుంటే బలుసాకైనా తినచ్చు కానీ మస్క్ దగ్గర పనిచేయకూడదని నిర్ణయానికి వచ్చారు. (Google Layoffs ఉద్యోగులకు షాకింగ్ న్యూస్: 10 వేలమంది ఇంటికే!) ఉద్యోగాలు పీకేయడం అనేది ఇలాన్ మస్క్ ఒక్కరే చేస్తున్నది. కాదు. మస్క్ ఈ సంక్షోభంలో ఉండగానే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ పదివేల మంది ఉద్యోగులపై వేటు వేయడానికి సిద్ధమైంది. ఎవరెవరికి పింక్ స్లిప్లులు ఇవ్వాలో జాబితాలు సిద్దం చేయిస్తోంది. ట్విటర్, అమెజాన్ లేనా తానేమన్నా తక్కువ తిన్నానా అనుకున్న మెటా కంపెనీ అధినేత జుకర్ బర్గ్ 11 వేల మందిని అర్జంట్ గా ఇంటికి పంపేసి ఖర్చులు తగ్గించేసుకోవాలని డిసైడ్ అయిపోయారు. మైక్రోసాఫ్ట్, యాపిల్, స్నాప్, సేల్స్ ఫోర్స్, లిఫ్ట్, స్ట్రైప్, బైజూస్ ,ఇంటెల్ వంటి టాప్ బ్రాండ్ ఐటీ కంపెనీలన్నీ కూడా వీలైనంత మేరకు ఖర్చులు తగ్గించుకోడానికి ఎంతో కొంత మంది ఉద్యోగులను ఇంటికి పంపాలన్న ఆలోచనతోనే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో సాఫ్ట్ వేర్ రంగంలో ఇపుడు ఇదే అతి పెద్ద సంక్షోభం. దీని ప్రభావం యువతపై తీవ్రంగానే ఉంటుందంటున్నారు నిపుణులు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు వీధిన పడితే నిరుద్యోగ సమస్య వెక్కిరించడం ఖాయం. కొత్తగా ఐటీ రంగంలో అడుగు పెట్టాలనుకునే నిపుణులకు అవకాశాలు దొరుకుతాయో లేదో తెలీని సందిగ్ధ పరిస్థితి. ఇక దీని ప్రభావం భారత దేశంపై ఎలా ఉంటుందనే ఆందోళన తీవ్రమవుతోంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద ఐటీ రంగంలో అడుగుపెట్టే నిపుణులు ఎక్కువ సంఖ్యలో ఉండేది భారత్ నుంచే. చాలా దేశాలకు భారతీయ యువతే చీప్ లేబర్. అంతే కాదు భారతీయులే ఈ రంగంలో తిరుగులేని నైపుణ్యాలతో రాణించడమే కాకుండా కష్టపడి పనిచేస్తారన్న పేరూ ఉంది. అందుకే ఈ సంక్షోభం ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తే వణికించవచ్చు కానీ ఇది పరోక్షంగా భారతీయులకు వరమే అవుతుందని నిపుణులు అంటున్నారు. కాకపోతే భారతీయ ఐటీ కంపెనీలకు మాత్రం కాస్త కష్టాలు తప్పకపోవచ్చు. ఎందుకంటే మన ఐటీ కంపెనీలకు బిజినెస్ ఇచ్చేదే అమెరికా కంపెనీలు. ఆ కంపెనీలే సంక్షోభంలో ఉంటే దానికి అనుగుణంగా మన ఐటీ కంపెనీలకు వచ్చే బిజినెస్సూ తగ్గుతుంది. ఉద్యోగులకు మాత్రం ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఇంతకీ ఎందుకీ సంక్షోభం? ఎందుకిలా ఉన్నట్లుండి ఓ సీజన్ మొదలైనట్లు ఉద్యోగాలు ఊడబీకుతున్నారు. వేల సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేస్తున్నారు.? దీనికి బీజం 2020 ఆరంభంలోనే పడింది. ప్రపంచం మొత్తాన్ని గడ గడ లాడించిన కరోనా మహమ్మారి అన్ని రకాల వ్యవస్థలనూ చితక్కొట్టేసింది. ఆర్ధిక వ్యవస్థలయితే మరీ ఘోరంగా దెబ్బతినేశాయి. అప్పుడే వేలాది కంపెనీలు మూత పడ్డాయి. లక్షలాది మంది ఉద్యోగులు వీధిన పడ్డారు. ఆర్ధిక మాంద్యం అందరికీ నరకం చూపించింది. రెండేళ్ల పాటు దుర్భర పరిస్థితులే తిష్ట వేశాయి. కరోనా నుండి ప్రపంచం అయితే బయట పడింది. కాకపోతే కరోనా చావుదెబ్బ తీసిన వ్యవస్థలు మాత్రం ఇప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఇపుడిపుడే నెమ్మదిగా ఒక్కో వ్యవస్థా ఊపిరి పీల్చుకునే ప్రయత్నం చేస్తోంది. సరిగ్గా ఈ దశలోనే మరో ఆర్ధిక మాంద్యం తరుముకు వస్తోంది. ప్రపంచాన్ని భయపెట్టడానికి 2023లో మరో ఆర్ధిక మాంద్యం రాబోతోందన్నది ఆర్ధిక వేత్తల అంచనా. అది కనీసం ఎనిమిది నెలల పాటు పట్టి పీడిస్తుంది. ఇప్పటికే కరోనా కారణంగా వ్యాపారాలు లేక లాభాలు ఆవిరైపోయి నష్టాల ఊబిలో కూరుకుపోతోన్న సంస్థలకు ఆర్ధిక మాంద్యం పేరు చెబితేనే వణుకు పుడుతోంది. అందుకే కాస్ట్ కటింగ్ ఆలోచనలో పడ్డారు అంతా. అంటే ఉన్నంతలో అనవసర ఖర్చులను తగ్గించుకోవాలనుకున్నారు. అనవసర ఖర్చుల్లో కంపెనీలకు ముందుగా కనిపించేవి అదనపు ఉద్యోగులే. తమ దగ్గర పనిచేస్తోన్న ఉద్యోగుల్లో ఎంతమందికి చేతి నిండా పని ఉంది? ఎందరు పనిలేక కాలక్షేపం చేస్తున్నారు? అన్నది చూస్తారు. ఒక వేళ అందరికీ చేతి నిండా పని ఉన్నా అందులో నాణ్యమైన పని చేసేవాళ్లు ఎంత మంది? నామమాత్రంగా పని చేశామంటే చేశాం అనిపించుకునే వాళ్లు ఎంతమంది? అన్న అంశంపై దృష్టి సారిస్తారు. ఆ తర్వాత వారిలో ఎంతమందిపై వేటు వేస్తే ఎంత ఖర్చు తగ్గుతుంది? సంస్థకు ఎంత ఆదా అవుతుంది? అన్నది చూస్తారు. ఈ లెక్కలన్నీ చూసుకున్న తర్వాతనే ఉద్యోగాలు ఊడబీకే పనిలో పడతారు. మస్క్ కంపెనీ తన చేతికి రాకముందే సగానికి పైగా ఉద్యోగులను తీసేయాలని ముందస్తుగానే ఓ నిర్ణయానికి వచ్చేశాడు. వచ్చే ఆర్ధిక మాంద్యం ఎనిమిది నెలలే ఉంటుందా? లేక ఆ తర్వాత అది మరి కాస్త ముదురుతుందా అన్నది ఇపుడే చెప్పలేం. కాకపోతే ఆర్ధిక వేత్తలు గత అనుభవాల ఆధారంగా వేసుకున్న అంచనాల ప్రకారం ఎనిమిది నెలల కంటే మాంద్యం ఉండే అవకాశాలు లేవంటున్నారు. కాలం కలిసొస్తే ఎనిమిది నెలల లోపే సంక్షోభం కనుమరుగు కావచ్చునని కూడా అంటున్నారు. (Twitter Hirings: ఎట్టకేలకు శుభవార్త చెప్పిన మస్క్,ఇండియన్ టెకీలకు గుడ్ న్యూస్) ఆ పరిస్థితి వచ్చే వరకు ఐటీ కంపెనీలే కాదు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను కలిగి అంతంత మాత్రంగా వ్యాపారాలు చేస్తోన్న ప్రతీ ఒక్కరూ ఉద్యోగుల మెడపై కత్తులు వేలాడదీయడం ఖాయం అంటున్నారు మేథావులు. సంక్షోభం ముగిశాక మళ్లీ పెద్ద సంఖ్యలో మానవవనరులు అవసరం కాగానే కంపెనీలు రిక్రూట్ మెంట్ల వైపు మొగ్గు చూపుతాయి. అంటే చేతిలో పని రాగానే ఉద్యోగులను నియమించుకుంటారు. వ్యాపారం తగ్గిన తర్వాత ఉన్న ఉద్యోగులపై వేటు వేస్తారు. సరఫరాకీ డిమాండ్ కీ మద్య ఉన్న సంబంధమే కంపెనీల్లో ఉద్యోగుల హైరింగ్ కూ ఫైరింగ్ కూ మధ్య ఉంటుందంటున్నారు ఆర్ధిక రంగ నిపుణులు. (బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు: మరోసారి బ్రేక్, ఎందుకంటే?) అమెరికా వంటి దేశంలో ప్రస్తుతం మొదలైన సంక్షోభం కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఇంటికి వెళ్లక తప్పదు. వారికి కొత్తగా ఉద్యోగాలు దొరకాలంటే చాలా కష్టం. బాగా నైపుణ్యాలు ఉన్న కొద్ది మందికి ఎక్కడో ఒక చోట దొరకచ్చుకానీ ఓ మాదిరి నైపుణ్యాలతో కాలక్షేపం చేసేవారికి అంత ఈజీగా ఉద్యోగాలు దొరకవంటున్నారు నిపుణులు. మస్క్ భారత దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను వీధిన పడేశారు. అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు పోయే వారి భవిష్యత్ కొద్ది నెలల పాటు చీకటే. సాఫ్ట్వేర్ రంగంలో కొత్తగా పట్టభద్రులైన వారిల ప్రస్తుత ట్రెండ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఫ్రష్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు అంత తేలిగ్గా రావంటున్నారు నిపుణులు. ఉద్యోగులు ఇచ్చే పరిస్థితి లేనపుడు వీసాలూ కష్టమవుతాయి. ఇది భారత్ వంటి దేశాలపై ప్రభావం చూపచ్చు. కాకపోతే అది కలకాలం ఉండదంటున్నారు. ఈ సంక్షోభం నుండి అందరికన్నా ముందుగా బయటపడేది దీన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకునేది భారత్ ఒక్కటే అంటున్నారు. పాశ్చ్యాత్య దేశాల్లో నెలకొన్న సంక్షోభం భారతీయ యువతకు ఒక విధంగా వరమే అంటున్నారు మేథావులు. అమెరికా వంటి దేశాల్లో ఖర్చులు తగ్గించుకోడానికి ఉద్యోగులను ఇంటికి పంపుతోన్న కంపెనీలు తక్కువ వేతనాలకు దొరికే భారతీయ యువతను రిక్రూట్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు అంటున్నారు. కరోనా మహమ్మారి రెండేళ్ల పాటు అన్ని వ్యవస్థలనూ నమిలేయడం వల్లనే సంక్షోభం వెంటాడుతోందని మేథావులు అంటున్నారు. దీన్నుంచి పూర్తిగా బయట పడ్డానికి మరో అయిదేళ్లుకు పైనే పట్టచ్చన్నది వారి అంచనా. వచ్చే ఏడాది మొదటి ఆరు నెలలూ ఈ సంక్షోభం ఉండచ్చంటున్నారు నిపుణులు. ఆ తర్వాత మళ్లీ ఉద్యోగ మేళాలు పెద్ద ఎత్తున పుంజుకనే అవకాశాలుంటాయని వారు అంచనా వేస్తున్నారు. -సీఎన్ఎస్ యాజులు, కన్సల్టింగ్ ఎడిటర్, సాక్షి టీవీ -
మరో టెక్ దిగ్గజం సంచలన నిర్ణయం: ఉద్యోగులకు ఇక గడ్డుకాలమేనా?
న్యూఢిల్లీ: రానున్న సంవత్సరాల్లో టెక్ సంస్థల ఉద్యోగులకు మరిన్ని కష్టాలు పొంచి ఉన్నట్టు గోచరిస్తోంది. ఇప్పటికే మెటా, ట్విటర్, అమజాన్ లాంటి పాపులర్ సంస్థలు ఉద్యోగుల తొలగింపులకు నిర్ణయించగా, తాజాగా మరో ప్రముఖ టెక్ కంపెనీ ఉద్యోగాలను తగ్గించాలని నిర్ణయించింది. (Vu GloLED TV: క్రికెట్, సినిమా మోడ్‌తో అదిరిపోయే వీయూ టీవీ, ధర రూ. 30 వేలే!) ల్యాప్‌టాప్, ఎలక్ట్రానిక్స్ తయారీదారు హెచ్‌పీ సంస్థ దాదాపు 6,000 ఉద్యోగాలను కోతను ప్రకటించింది. ఫ్యూచర్ రెడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాన్‌లో భాగంగా 2025 ఆర్థిక సంవత్సరం చివరి వరకు ఉద్యోగుల తొలగింపులను విస్తరించాలని కంపెనీ నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు 12 శాతం మంది ఉద్యోగులపై వేటు వేయనుంది. (జియో జోరు, వొడాఫోన్ ఐడియాకు 40 లక్షల యూజర్లు గోవిందా!) హెచ్‌పీ కంపెనీలో ప్రస్తుతం దాదాపు 50,000 మంది ఉద్యోగులున్నారు. రాబోయే సంవత్సరాల్లో 12 శాతం అంటే దాదాపు 4 నుంచి 6వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో కొంతమందిని తొలగించాలని భావిస్తోంది. 2022 పూర్తి సంవత్సర నివేదిక సందర్భంగా ఈ ప్రకటన చేసింది. మహమ్మారి సమయంలో ల్యాప్టాప్స్ విక్రయాలు కాస్త పుంజుకున్నప్పటికీ, ప్రస్తుతం పడిపోయిన ఆదాయాలు, ప్రపంచ ద్రవ్యోల్బణం మాంద్యం ఆందోళనల మధ్య ఉద్యోగాలను తగ్గించాలనే నిర్ణయం తీసుకుంది. మరోవైపు బలహీనమైన డిమాండ్ కారణంగా మొదటి త్రైమాసికంలో ఆశించిన దానికంటే తక్కువ లాభాలను అంచనా వేస్తోంది. (ట్యాబ్లెట్ పీసీ మార్కెట్ జోరు: అదరగొట్టిన శాంసంగ్ ) -
గూగుల్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్: 10 వేలమంది ఇంటికే!
న్యూఢిల్లీ: ట్విటర్, మెటా, అమెజాన్ లాంటి దిగ్గజాల తరువాత ఉద్యోగులను తొలగిస్తున్న ప్రముఖ కంపెనీల జాబితాలో తాజాగా గూగుల్ చేరింది. టెక్ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ పనితీరు సరిగాలేని 10 వేలమంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. త్వరలోనే ఈ తొలగింపు ప్రక్రియ షురూ కానుంది. గూగుల్ తన ఉద్యోగులలో 6 శాతం మందిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అంటే దాదాపు 10 వేల మందిని పనితీరు సాకుతో ఇంటికి పంపించనుంది. గూగుల్ ర్యాంకింగ్ సిస్టమ్ ద్వారా త్యల్ప ర్యాంక్ ఉన్న ఉద్యోగులను కంపెనీ నుండి తొలగించాలని భావిస్తోంది. ఉద్యోగులను విశ్లేషించి, ర్యాంక్ ఇవ్వాల్సిందిగా సంస్థ మేనేజర్లను కోరినట్లు సమాచార నివేదిక పేర్కొంది. ఆల్ఫాబెట్ కొత్త పనితీరు సిస్టం బోనస్‌లు ,స్టాక్ గ్రాంట్లను చెల్లించకుండా ఉండేందుకు ఈ రేటింగ్స్నుపయోగించవచ్చని నివేదిక పేర్కొంది. అయితే దీనిపై ఆల్ఫాబెట్ ఇంకా స్పందించ లేదు. (ఎట్టకేలకు శుభవార్త చెప్పిన మస్క్: ఇండియన్ టెకీలకు గుడ్ న్యూస్) కాగా ఆల్ఫాబెట్ కింద దాదాపు 1,87,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ ఫైలింగ్ ప్రకారం, ఆల్ఫాబెట్ ఉద్యోగికి గత సంవత్సరం మధ్యస్థ పరిహారం సుమారు 295,884 డాలర్లుగా ఉంది. (బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు: మరోసారి బ్రేక్, ఎందుకంటే?) -
మాంద్యం ముప్పు ఎవరికి?
నవంబరు 9న ‘మెటా’ అనే కంపెనీ తన ఉద్యోగుల్లో 11 వేల మందిని తీసేస్తున్నట్టు ప్రకటించింది. ‘ట్విట్టర్’ అనే కంపెనీ 3 వేల 7 వందల మందినీ, ‘బైజూ’ అనే కంపెనీ 2 వేల 5 వందల మందినీ.. ఇలా అనేక డజన్ల కంపెనీలు తమ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల్ని వందల్లో, వేలల్లో తీసేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఉద్యోగాల కోత ప్రపంచవ్యాప్తంగా గత 6 నెలల నించీ జరుగుతూనే వుంది. మొన్న జులై నెలలో ‘అమెజాన్’ అనే కంపెనీ లక్షమందిని ఉద్యోగాల్లో నించీ తీసేసింది. ఈ జాబితా చాలా పొడుగ్గా వుంటుంది. ఈ ఉద్యోగాలు పోవడం అనేది కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలకే కాదు, వస్తువులు తయారు చేసే పరిశ్రమల్లో (మాన్యుఫ్యాక్చర్ రంగంలో) కూడా లక్షల్లో జరుగుతోంది. కొన్ని నెలలుగా ఆర్థిక రంగానికి సంబంధించిన సమాచారాన్ని ఒక పద్ధతి ప్రకారం సేకరించే సంస్థల (ఉదా: సి.ఎం.ఐ.ఇ) నివేదికలు చూస్తే నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్ధం అవుతుంది. అమెరికా లాంటి పెట్టుబడిదారీ దేశాల్లో కార్మికుల్ని ఉద్యోగాల్లో నించీ తీయదలుచుకుంటే వాళ్ళకి గులాబీ రంగు కాగితం (పింక్ స్లిప్) మీద ‘రేపటి నించీ నువ్వు పనిలోకి రానక్కరలేదు’ అని రాసిచ్చేవారు. ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ వచ్చాక ఎక్కడెక్కడో నివసించే ఉద్యోగులందరినీ ఒక తెర మీద కనిపించేలాగా సమా వేశపరిచి (దీన్ని బడాయిగా ‘జూమ్ మీటింగ్’ అని చెప్పుకుంటారు.) చల్లగా చావు కబురు చెపుతారు. ఆ మధ్య ‘బెటర్.కామ్’ అనే కంపెనీ ఒకే ఒక్క జూమ్ సమావేశం పెట్టి ఒక్క దెబ్బతో 3 వేలమంది ఉద్యోగుల్ని ‘రేపటినించీ మీరు పనిలోకి రానక్కర లేదు’ అని చెప్పేశారని ఒక వార్త! ఇంతగా ఉద్యోగాలు పోవడం అనేది చరిత్రలో ఎన్నడూ లేదు. కేవలం పెట్టుబడిదారీ విధానంతోనే అది మొదలైంది. గత సమా జాలలో లేదు. బానిసలకి నిరుద్యోగ సమస్య ఉండేది కాదు. ఫ్యూడల్ కౌలు రైతులకి నిరుద్యోగ సమస్య ఉండేది కాదు. ఎటొచ్చీ ఈనాటి కార్మికులకే (వీళ్ళది ‘వేతన బానిసత్వం’ అంటాడు మార్క్స్) ఈ నిరుద్యోగ సమస్య వుంది. కార్మికులు అన్నప్పుడు వాళ్ళు శారీరక శ్రమలు చేసేవారే అనుకోకూడదు. మేధాశ్రమలు చేసే వారందరూ (ఉదా: టీచర్లూ, డాక్టర్లూ, జర్నలిస్టులూ) కూడా కార్మికులే! ఉద్యోగుల్ని తీసేయడానికి కంపెనీల వాళ్ళు చెప్పుకునే కారణాలు (సాకులు) కొన్ని: 1. కంపెనీకి ఆదాయాన్ని మించిన ఖర్చులు అవుతున్నాయి. ఖర్చులు తగ్గించుకోడానికి ఉద్యోగుల సంఖ్యని తగ్గించుకోవడం మినహా మార్గం లేదు. 2. ఉద్యోగులు ఎక్కువగానూ, సమర్థంగానూ ఉత్పత్తి చెయ్యడం లేదు. (దీన్నే ఉత్పాదకత –ప్రొడక్టివిటీ – సమస్యగా చెపుతారు). 3. బ్యాంకులు వడ్డీరేట్లని పెంచేస్తూ పోతున్నాయి. ఇలాంటప్పుడు, వ్యాపారాన్ని నడపాలన్నా, పెంచాలన్నా అప్పులు తీసుకోవాలంటే పెంచిన వడ్డీ రేట్లు పెద్ద భారం. అందుకే ఉన్న ఉద్యోగుల్ని తగ్గించి, తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకోవడమే మార్గం. 4. ఇతర దేశాలలో కూడా ఇవే పరిస్థితులు ఉండడం వల్ల ఎగుమతులు కూడా తగ్గి పోతున్నాయి. 5. ఒకే రకమైన సరుకులు తయారు చేసే ఇతర కంపెనీలతో పోటీ ఒకటి తలనొప్పిగా వుంది. 6. తయారైన సరుకులు మందకొడిగా (నెమ్మదిగా) అమ్ముడవుతున్నాయి. (దీన్నే ‘మాంద్యం’ అంటారు. కాబట్టి, ఉన్న సరుకులు అమ్ముడు కాకుండా కొత్త సరుకులు తయారు చేయించడం కుదరదు. అందుచేత, కొంతమందిని ఉద్యోగాల్లోనించీ తీసివేయక తప్పదు). ఈ రకమైన పరిస్థితిని చూపించి ఆర్థికవేత్తలు ‘ముంచుకొస్తున్న మాంద్యం’ అని హెచ్చరికలు చేస్తారు. అంతేగానీ తయారైన సరుకుల అమ్మకాలు మందకొడిగా ఎందుకు జరుగుతాయి? దానికి పరిష్కారం ఏమిటి?– అనే ప్రశ్నలకు వారి దగ్గిర సరైన సమాధానం వుండదు. మార్క్స్ తన ‘కాపిటల్’ లో విమర్శించినట్టు, ‘‘పాఠ్య పుస్తకాల ప్రకారం ఉత్పత్తి విధానం సాగించి వుంటే సంక్షోభాలు సంభ వించవు.. అని నొక్కి చెప్పడం ద్వారా పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు సంతృప్తి పడతారు’’. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందంటే, అనేక కంపెనీల్లో సరుకుల గుట్టలు మార్కెట్ అవసరాల్ని మించిపోయి ఆకాశం ఎత్తున పెరిగిపోవడం వల్ల! ఈ గుట్టలు పెరగడం ఎందుకు జరుగు తుందంటే, ఆ ఉత్పత్తుల్ని తయారు చేయించే వాళ్ళ మధ్య సమష్టి ప్లాను లేకపోవడం వల్ల! ఆ సమిష్టి ప్లాను లేకపోవడం ఎందుకు జరుగుతుందంటే, వాళ్ళందరూ ప్రైవేటు పెట్టుబడిదారులు అవడం వల్ల! పెట్టుబడిదారీ జన్మ ప్రారంభమైన తర్వాత, ఆ జన్మకి లక్ష్యం లాభం రేటే! ఆ లక్ష్యానికి ఒక పరిమితీ, ఒక నీతీ, ఏదీ ఉండదు. ఆఖరికి మార్కెట్ అవసరాల్ని గమనించుకోవాలనే తెలివి అయినా ఉండదు. పోటీలో నిలబడడానికి ఏకైక మార్గం – ఉత్పత్తి శక్తుల్ని పెంచడం! అంటే, సరుకుల్ని తక్కువ ఖర్చులతో తయారుచేసి, వెనకటి ధరలతోనే అమ్మాలని ప్రయత్నం! ఆ రకంగా కొంతకాలం జరిగిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే కంపెనీల నిండా సరుకుల గుట్టలు పేరుకుపోయి కనపడతాయి. అమ్మకాలు మందగించిన ప్రమాద సంకేతాలు ఎదురవుతాయి. దాన్ని గమనించుకున్న కంపెనీ యజమాని, పునరుత్పత్తి క్రమాల్ని తగ్గించెయ్యడం గానీ, ఆపెయ్యడం గానీ చేస్తాడు. అలా ఆపెయ్యడం వల్ల కార్మికులతో అవసరం తగ్గిపోతుంది. ఆ కంపెనీ నించి ఒక పిడికెడు మంది కార్మికులు తప్ప, మిగతా అందరూ ఉద్యోగాలు పోయి వీధుల్లో పడతారు. అసలు కార్మిక వర్గంలో, కొంత జనం ఎప్పుడూ నిరుద్యోగంలోనే వుంటారు. కానీ, సంక్షోభాల కాలాల్లో ముంచుకువచ్చే నిరుద్యోగాల పరిస్థితి అలాంటిది కాదు. ఒక కంపెనీలో నిన్నటి దాకా 100 మంది కార్మికులు వుంటే, ఇవ్వాల్టికి కనీసం 90 మంది నిరుద్యోగులైపోతారు. ఇది ఒక్క శాఖలోనే కాదు, అనేక శాఖల్లో జరుగుతుంది. శారీరక శ్రమల్లోనూ, మేధా శ్రమల్లోనూ కూడా ఇది జరుగుతుంది. సరుకుల పునరుత్పత్తి క్రమాలే తగ్గిపోయి, యంత్రాలే ఆగిపోయినప్పుడు, ఇక కార్మికులతో ఏం అవసరం ఉంటుంది? అయితే, ఆ కార్మికులందరూ ఏమైపోతారు? రెగ్యులర్‌గా జీతాలు అందుతూ వున్నప్పుడే కార్మిక కుటుంబాలు, సమస్యల వలయాల్లో కూరుకుపోయి వుంటాయి. అలాంటి కుటుంబాలకు జీతాలే ఆగిపోతే, తిండే ఉండదు. అద్దె ఇళ్ళు ఖాళీ చేసి చెట్ల కిందకి చేరవలసి వస్తుంది, చెట్లయినా వుంటే! పిల్లల్ని స్కూళ్ళు మానిపించవలసి వస్తుంది. ఆకలి – జబ్బులు మొదలవుతాయి. వైద్యం ఉండదు. చావులు ప్రారంభం! బతికి వుంటే పిచ్చెత్తడాలూ, ఆత్మహత్యలూ, నేరాలూ పెరిగి పోతాయి. కార్మిక జనాలు పిట్టలు రాలినట్టు రాలి పోతారు. ఉదాహరణకి, ప్రభుత్వ లెక్కల ప్రకారమే భారతదేశంలో 2021లో లక్షా 64 వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళలో 43 వేలమంది రోజూ వారీ కూలీలూ, నిరుద్యోగులూనూ అని తేలింది. లెక్కకు రానివి ఎన్నో! రంగనాయకమ్మ, ప్రముఖ రచయిత్రి -
డిమాండ్ లేదు, షేర్లు ఢమాల్: కార్వానా సీఈవో సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన యూజ్డ్ కార్ డీలర్స్ కంపెనీ కార్వానా కూడా భారీ ఎత్తున ఉద్యోగాలపై కోత విధించింది. ఇటీవలికాలంలో తమ మార్కెట్ బాగా దెబ్బతినడం, భవిష్యత్‌పై ఆందోళనల కారణంగా దాదాపు 1,500 మంది అంటే మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 8 శాతం మందిని తొలగించింది. పెరుగుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, వాడిన కార్లకు డిమాండ్ పడిపోవడం ఇటీవలి కాలంలో కార్వానా షేరు రికార్డు స్థాయికి కుప్పకూలిన నేపథ్యంలో కంపెనీ సీఈవో ఒక ఉద్యోగులకు ఈమెయిల్ సందేశాన్ని పంపారు. "ఈ రోజు చాలా కష్టతరమైన రోజు" అంటూ కార్వానా సీఈవో ఎర్నీ గార్సియా శుక్రవారం ఉద్యోగులకుఇమెయిల్ సమాచారాన్ని అందించారు ఆకాశాన్నంటుతున్న ధరలు, సరఫరా కొరత నేపథ్యంలో ఉపయోగించిన కార్లకు డిమాండ్ తగ్గుతుండటంతో ఆర్థిక ప్రతికూలతలను ఎదుర్కొంటున్నట్టు పేర్కొన్నారు. ఇదంతా ఎలా జరుగుతుందో, వ్యాపారంపై దాని ప్రభావం ఎలా ఉంటుందో ఖచ్చితంగా అంచనా వేయడంలో కంపెనీ విఫలమైందని ఆయన చెప్పారు.(తగ్గేదేలే: మస్క్ కొత్త పాలసీ, అలా చేస్తే అంతే!) ఇదీ చదవండి: ఆకాశ ఎయిర్ దూకుడు:వైజాగ్-బెంగళూరు రూటు టార్గెట్ తాజాగా కార్వానా స్టాక్ 3.1శాతం క్షీణించి ఒక్కో షేరుకు 8.06 డాలర్లు వద్ద ముగిసింది. ఆగస్ట్ 10, 2021న ఒక్కో షేరుకు 376.83 డాలర్ల వద్ద ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. కాగా కార్వానా స్టాక్ ఈ సంవత్సరం దాదాపు 97శాతం క్షీణించింది. ఆటోమేటెడ్ కార్ వెండింగ్ మెషీన్లకు ప్రసిద్ధి చెందిన కంపెనీ, ఈ ఏడాది ప్రారంభంలో ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో దాదాపు 2,500 మంది ఉద్యోగులను లేదా 12 శాతం మంది ఉద్యోగులను తొలగించింది.(యూకే నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్..కాస్ట్లీ గిఫ్ట్..కట్ చేస్తే!) -
వచ్చే ఏడాదిలోనూ ఉద్యోగాల్లో కోతలు
న్యూయార్క్: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ప్రారంభమైన ఉద్యోగాల కోతలు వచ్చే ఏడాది వరకూ కొనసాగనున్నాయి. ఎంత మందిని తొలగించేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని కంపెనీ సీఈవో ఆండీ జస్సీ పేర్కొన్నారు. వార్షిక సమీక్ష ప్రక్రియ వచ్చే ఏడాది వరకు కొనసాగుతుందని, కస్టమర్ల అవసరాలు.. కంపెనీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏయే విభాగాల్లో ఎంత మంది సిబ్బందిని తగ్గించుకోవాలనే దానిపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఉద్యోగులకు పంపిన నోట్లో జస్సీ పేర్కొన్నారు. తీసివేతల గురించి డివైజ్‌లు, బుక్స్ విభాగాల సిబ్బందికి బుధవారం తెలియజేశామని, కొందరికి స్వచ్ఛందంగా పదవీ విరమణ అవకాశాలను కూడా ఆఫర్ చేశామని ఆయన వివరించారు. తాను సీఈవోగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నర కాలంలో సిబ్బందిని తగ్గించుకునే అంశం అత్యంత కష్టతరమైన నిర్ణయమని జస్సీ పేర్కొన్నారు. అమెజాన్‌లో ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది పైగా సిబ్బంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది గంటలవారీగా పని చేసే వర్కర్లు ఉన్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని తమ కార్యాలయాల్లో 260 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగిస్తున్న విషయాన్ని మూడు రోజుల క్రితం అధికారులకు తెలియజేసింది. ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్న పలు టెక్ కంపెనీలు .. తాజాగా సిబ్బందిని తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా 11,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ట్విటర్‌ను టేకోవర్ చేశాక ఎలాన్ మస్క్ సగానికి పైగా ఉద్యోగులను తీసివేశారు. -
ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు: అమెజాన్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఆన్లైన్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగాల కోతకు సంబంధించి మరో సంచలన ప్రకటన చేసింది. వచ్చే ఏడాది(2023)లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతుందని అమెజాన్ సీఈవో ఆండీ జస్సీ గురువారం తెలిపారు. ఈ మేరకు అమెజాన్ ఉద్యోగులకు సీఈవో ఒక లేఖ రాశారు. అమెజాన్ ఉద్యోగులకు పంపిన నోట్లో జస్సీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కార్పొరేట్ ర్యాంక్‌లలో ప్రారంభమైన భారీ తొలగింపులు వచ్చే ఏడాది దాకా కొనసాగుతాయని జస్సీ తెలిపారు. సుమారు ఒకటిన్నర సంవత్సరాల్లో ఎపుడూ ఇంత కఠినమైన నిర్ణయం ఇదే తొలిసారని, గత రెండు రోజులుగా చాలా కఠిన ఆదేశాలిచ్చామని తెలిపారు. (2021లో అమెజాన్ సీఈవోగా జస్సీ బాధ్యతలను చేపట్టారు) కంపెనీ వార్షిక నిర్వహణ ప్రణాళిక సమీక్ష మధ్యలో ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోప్రతి వ్యాపారంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయాలనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అయితే తమ తాజా నిర్ణయం ద్వారా ఎన్ని ఉద్యోగాలు ప్రభావితమవుతాయనే విషయాన్ని అమెజాన్ సీఈవో ధృవీకరించ లేదు. (ట్విటర్‌కు షాక్: ‘కూ’ దూకుడు, మస్క్‌కు నిద్ర కరువే!) ఆర్థికమాంద్యం, పడిపోతున్న కంపెనీ ఆదాయాలు నేపథ్యంలో అమెజాన్, గత కొన్ని నెలలుగా తన వ్యాపారంలోని వివిధ రంగాల్లో ఖర్చులను తగ్గించుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో కంపెనీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. (మస్క్ 13 కిలోల వెయిట్ లాస్ జర్నీ: ఫాస్టింగ్ యాప్‌పై ప్రశంసలు) -
మెటాలో వేల మందికి ఉద్వాసన: హెచ్1బీ వీసా హోల్డర్లలో కలవరం
న్యూఢిల్లీ: టెక్నాలజీ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. టెక్ పరిశ్రమకు సవాళ్లు పెరుగుతుండటం, ఆదాయాలు పడిపోతుండటం వంటి పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్ మాతృసంస్థ మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. మెటా మొత్తం సిబ్బంది సంఖ్యలో ఇది 13 శాతం. ఉద్యోగులకు రాసిన లేఖలో సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఈ విషయాలు వెల్లడించారు. ‘కోవిడ్ మహమ్మారి తర్వాత కూడా భారీ వృద్ధి ఉంటుందనే అంచనాతో పెద్ద యెత్తున ఉద్యోగులను తీసుకున్నాం. దురదృష్టవశాత్తు నేను ఊహించిన విధంగా జరగలేదు. (రూ.2 వేల నోట్లు: షాకింగ్ ఆర్టీఐ రిప్లై) ఆన్లైన్ కామర్స్ మళ్లీ పాత స్థాయికి వచ్చేసింది. స్థూల ఆర్థిక మందగమనం, పెరిగిన పోటీ, ప్రకటనలు తగ్గడం వంటి కారణాలతో ఆదాయాలు నేను ఊహించిన దానికన్నా తగ్గాయి. నేను పరిస్థితిని తప్పుగా అంచనా వేశాను. దీనికి బాధ్యుణ్ని నేనే‘ అని ఆయన పేర్కొన్నారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో కూడా కోతల పర్వం నడుస్తున్న నేపథ్యంలో మెటాలోనూ ఉద్వాసనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ మొదలైనవి మెటాలో భాగంగా ఉన్నాయి. తీసివేస్తున్న ఉద్యోగులకు ఈమెయిల్స్ వస్తాయని, వారికి కంపెనీ సిస్టమ్స్ ఇక అందుబాటులో ఉండవని జుకర్‌బర్గ్ తెలిపారు. మాజీ ఉద్యోగులకు 16 వారాల బేసిక్ పేతో పాటు కంపెనీలో పని చేసిన ప్రతి ఏడాదికిగాను 2 వారాల జీతం లభిస్తుంది. 6 నెలల పాటు వారితో పాటు వారి కుటుంబ సభ్యులకూ హెల్త్ ఇన్సూరెన్స్ పని చేస్తుంది. ఇదీ చదవండి: క్యూ కడుతున్న టాప్ కంపెనీలు: అయ్యయ్యో ఎలాన్ మస్క్! టెక్ సంస్థలకు సవాళ్లు.. కోవిడ్ సమయంలో లాక్డౌన్ల వల్ల ఇళ్లకే పరిమితం కావడంతో ప్రజలు సోషల్ మీడియాను గణనీయంగా ఉపయోగించారు. దీంతో ఆయా కంపెనీలకూ భారీగా ఆదాయాలు వచ్చాయి. అయితే, లాక్డౌన్లు ముగిసి, ప్రజలు తిరిగి దైనందిన జీవితాల్లో పడిపోయిన తర్వాత వాటి ఆదాయాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రత్యేకంగా మెటా విషయానికొస్తే.. డిజిటల్ యూనివర్స్ ’మెటావర్స్’ పై భారీగా పెట్టుబడులు పెడుతుండటం ఇన్వెస్టర్లను కలవరపరుస్తోంది. అటు టెక్ దిగ్గజం యాపిల్ ప్రైవసీ టూల్స్ సైతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు సమస్యగా మారుతున్నాయి. వీటి వల్ల యూజర్ల అనుమతి లేకుండా వారిని ట్రాక్ చేయడం, ప్రత్యేకంగా టార్గెట్ చేసే ప్రకటనలు చూపడం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్ లాంటి సంస్థలకు కష్టతరమవుతోంది. అలాగే యువత ఎక్కువగా టిక్‌టాక్ వైపు మళ్లుతుండటం ఇన్‌స్టాగ్రామ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. భారత్‌లోని ఉద్యోగుల్లో కలవరం.. ఏయే దేశాల్లో ఏ మేరకు కోతలు ఉంటాయనేది తెలియకపోవడంతో భారత్‌లోని మెటా ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌లకు సంబంధించి మెటాకు భారత్‌లో 300–400 మంది ఉద్యోగులు ఉన్నారు. వీటిలో 60 మంది సిబ్బంది గల వాట్సాప్ బృందమే చిన్నది. మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ ఇటీవలే రాజీనామా చేసి పోటీ సంస్థ స్నాప్‌లో చేరారు. హెచ్1బీ వీసా హోల్డర్లకు సహకారం ఉద్వాసనకు గురైన వారిలో హెచ్1బీ వీసాహోల్డర్లు ఉంటే ఇమ్మిగ్రేషన్ పరంగా వారికి అవసరమైన పూర్తి సహాయ, సహకారాలను కంపెనీ అందిస్తుందని జుకర్‌బర్గ్ తెలిపారు. తమ దేశంలో పని చేసేందుకు విదేశీయులకు అమెరికా ఈ వీసాలు జారీ చేస్తుంది. అకస్మాత్తుగా ఉద్యోగం పోతే, తమ వీసాను స్పాన్సర్ చేసే మరో కంపెనీలో ఉద్యోగాన్ని 60 రోజుల్లోగా చూసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వీసా గడువు ముగిసిపోతుంది. పలు అమెరికన్ కంపెనీల్లో భారత్, చైనా నుంచి చాలా మటుకు ఉద్యోగులు ఉన్నారు. ప్రధానంగా ఫేస్బుక్లో వీరి సంఖ్య 15శాతం పైనే. ఉద్యోగాల్లో కోతల వల్ల ఇలాంటి హెచ్1బీ వీసాహోల్డర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. -
మస్క్ బాస్ అయితే 75 శాతం జాబ్స్ ఫట్? ట్విటర్ స్పందన
న్యూఢిల్లీ: బిలియనీర్ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విటర్ కొనుగోలు డీల్ పూర్తయితే సంస్థలో 75 శాతం ఉద్యోగులపై వేటు వేయనున్నారనే వార్తలు కలకలం రేపాయి. ట్విటర్ కొనుగోలుకు మరోసారి పావులు కదుపుతున్న తరుణంలో ఉద్యోగాల తొలగింపు అనే నివేదికలు ఆందోళన రేపాయి. ఇదీ చదవండి: JioBook: రూ.15 వేలకే ల్యాప్‌టాప్, వారికి బంపర్ ఆఫర్ ఒక వేళ మస్క్ ట్విటర్ బాస్ అయితే ఆ తరువాత భారీగా సిబ్బందిని తగ్గించాలని యోచిస్తున్నట్లు తాజాగా ఒక నివేదిక తెలిపింది. కంపెనీలోని 7,500 మంది కార్మికులలో దాదాపు 75శాతం మందిని తొలగించాలని యోచిస్తున్నట్లు, కొనుగోలు డీల్‌లో కాబోయే పెట్టుబడిదారులతో మస్క్ చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. అయితే, ట్విటర్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగులను తొలగించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. అసలు అలాంటి ప్లాన్ ఏదీ లేదని గురువారం సిబ్బందికి సమాచారాన్ని అందించింది. ఈ మేరకు జనరల్ కౌన్సెల్ సీన్ ఎడ్జెట్ గురువారం ఉద్యోగులకు ఇమెయిల్ పంపించారు. (JioBook: రూ.15 వేలకే ల్యాప్‌టాప్, వారికి బంపర్ ఆపర్) -
ఉద్యోగాల కోత నిజమే ..కానీ: మైక్రోసాఫ్ట్
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ ఉద్యోగుల తొలగింపు వార్తలపై స్పందించింది. సుమారు 1000 మంది ఉద్యోగులను తొలగించినట్లు వస్తున్న వార్తలను తాజాగా కంపెనీ ధృవీకరించింది. అన్ని ఇతర కంపెనీల మాదిరిగానే, తాము కూడా వ్యాపార ప్రాధాన్యతలను సమీక్షిస్తూ, దానికనునుగుణంగా నిర్మాణాత్మక సర్దుబాట్లు చేయనున్నామని తెలిపింది. అలాగే తమ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తూనే, కీలక వృద్ధి రంగాల్లో కొత్త ఉద్యోగాలు సృష్టించనున్నామని సంస్థ ప్రతినిధి తెలిపారు. మైక్రోసాఫ్ట్ అనేక విభాగాల్లో సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించిందని ఈ వారం యాక్సియోస్ నివేదిక ఇటీవల పేర్కొంది. అంతేకాదు సమీప భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలకు ముప్పు తప్పదని కూడా తెలిపింది. దీనిపై స్పందించిన సంస్థ ఈ వివరాలను అందించింది. కేవలం తక్కువ సంఖ్యలో ఉద్యోగులను మాత్రమే తొలగించామని, ఇది మా మొత్తం ఉద్యోగుల సంఖ్యలో కేవలం 1 శాతం కంటే తక్కువ అని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి వెల్లడించారు. జూన్ 30 నాటికి మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో 221,000 మంది ప్రస్తుత తొలగింపులు 1శాతం కంటే తక్కువేనని వ్యాఖ్యానించారు. కాగా పీసీ అమ్మకాలు మందగించిన నేపథ్యంలో ఇంటెల్ కార్ప్ వేల సంఖ్యలో ఉద్యోగాల కోతలను యోచిస్తున్నట్లు వార్తల అనంతరం తాజా పరిణామం చోటు చేసుకుంది. మహమ్మారి సమయంలో టెక్ పరిశ్రమ చాలా లాభాలను పొందింది. జూమ్ వీడియో, స్లాక్ టెక్నాలజీస్ ,నెట్‌ఫ్లిక్స్ లాంటికి ఆదరణ బాగా పెరిగింది. సోషల్ మీడియా ,ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో నియామకాలు జోరందుకున్నాయి. వేలకొద్దీ స్టార్టప్‌లు కొత్త వెంచర్ క్యాపిటల్‌తో లబ్ది పొందాయి. కానీ ప్రపంచ ఆర్థిక మందగమనం , అధిక వడ్డీ రేట్లు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఐరోపాలో ఇంధన సంక్షోభం కారణాల రీత్యా అనేక టెక్నాలజీ కంపెనీలు ఖర్చులను తగ్గంచుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చేవారం వెలువడనున్న యాపిల్, మెటా, గూగుల్ ఫలితాలు, ఆదాయాల ప్రకటనపై ఆసక్తి నెలకొంది. -
ఆ ఉద్యోగుల గుండెల్లో గుబులే: అతిపెద్ద కోతలకు తెర!
న్యూఢిల్లీ:గ్లోబల్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ భారీ తొలగింపులకు తెరతీసింది. మహమ్మారి ప్రారంభమై నప్పటినుండి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించనుంది. వాల్ స్ట్రీట్ టైటన్ ఈ నెల (సెప్టెంబరు) నుండి అనేక వందల మందిని తొలగించాలని యోచిస్తోందట. కోవిడ్ తరువాత ఇది భారీ తొలగింపు అని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. గోల్డ్‌మన్ ఉద్యోగ కోతలకు సిద్ధమవుతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ సోమవారం నివేదించింది. అయితే దీనిపై వ్యాఖ్యానించేందుకు గోల్డ్‌మన్ ప్రతినిధి నిరాకరించారు. మొత్తం సంఖ్య కొన్ని మునుపటి కంటే తక్కువే అయినప్పటికీ, ఈ సెప్టెంబరు నుంచి వందల సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయనుంది. కోవిడ్ సంక్షోభం తరువాత ఇదే అతిపెద్ద కోత అని అంచనా. ఆదాయాలు భారీగా తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం, ఈ సంవత్సరం బ్యాంక్ ఆదాయాలు 40శాతానికి మించి పడిపోనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలైలో నియామకాలని తగ్గించడంతోపాటు, ఉద్యోగుల వార్షిక పనితీరు సమీక్షించాలని సంస్థ నిర్ణయించింది. సమీక్ష అనంతరం సాధారణంగా ఫెర్ఫామెన్స్ చెత్తగా ఉన్న సిబ్బందిని తొలగించనుంది. అలాగే అట్రిషన్ కారణంగా కోల్పోయిన సిబ్బందిని భర్తీ చేసే ప్రక్రియను కూడా తగ్గిస్తున్నట్టు సంస్థ సీఎఫ్‌వో డెనిస్ కోల్మన్ ఒక సందర్బంలో వెల్లడించారు. కంపెనీ రెండో త్రైమాసికం ముగింపు నాటికి సంస్థలో 47వేల ఉద్యోగులుండగా, రెండేళ్ల క్రితం 39,100 ఉద్యోగులు ఉన్నారు. అలాగే గత 12 నెలలుగా ఎస్అండ్పీ 500 ఫైనాన్షియల్స్ ఇండెక్స్ 7.5 శాతం క్షీణతతో పోలిస్తే గోల్డ్‌మ్యాన్ షేర్లు ఈ ఏడాది 10 శాతానికిపైగా పతనం కాగా గత ఏడాది క్రితం కంటే దాదాపు 15 శాతం క్షీణించాయి. -
ఆర్థిక ఇబ్బందులతో దేశీ స్టార్టప్ కంపెనీలు సతమతం
(కంచర్ల యాదగిరిరెడ్డి) దేశంలో గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న కొత్త మంత్రం స్టార్టప్.. స్టార్టప్.. వినూత్నమైన ఉత్పత్తులు, సేవలతో సరికొత్త వ్యాపారాలను సృష్టించి భారత యువత ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. రూ. వందల వేల కోట్ల విలువైన పెట్టుబడులు స్టార్టప్ కంపెనీల్లోకి ప్రవహిస్తూ ఎందరికో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే ప్రతి వ్యవస్థలో ఒడిదుడుకులు ఉన్నట్లే ప్రస్తుత మన స్టార్టప్ కంపెనీలూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రూ. లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు... దేశంలో ఇప్పటివరకు దాదాపు 72 వేల స్టార్టప్‌లు ఏర్పాట య్యాయి. ఈ ఏడాది జూన్ వరకూ భారత స్టార్టప్ కంపెనీలు ఆకర్షించిన పెట్టుబడులు సుమారు రూ. 1.36 లక్షల కోట్ల వరకు ఉంటాయని అంచనా. కేవలం 891 ఒప్పందాల ద్వారా ఈ స్థాయి పెట్టుబడులు రావడమన్నది చెప్పుకోదగ్గ విషయమే. ఈ సమయంలోనే సుమారు 18 స్టార్టప్ కంపెనీలు 100 కోట్ల డాలర్ల విలువైనవిగా (యూనికార్న్)గా మారిపోయాయి. గతేడాదితో పోలిస్తే వచ్చిన పెట్టుబడులు, యూనికార్న్‌లుగా ఎదిగిన కంపెనీల సంఖ్య రెండూ ఎక్కువే. సరిపెట్టుకుంటున్న స్టార్టప్‌లు.. పెట్టుబడులు తగ్గిపోయిన నేపథ్యంలో భారత స్టార్టప్ కంపెనీలు కూడా అందుకు తగ్గట్లుగా సర్దుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, మార్కెటింగ్ వ్యవహారాలను తగ్గించుకోవడం ద్వారా పొదుపును పాటించే ప్రయత్నం చేస్తున్నాయి. భారం తగ్గించుకొనే క్రమంలో వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 10 వేలకు పైనే. ఈ పరిస్థితి ఇంకో ఏడాదిన్నర వరకూ కొనసాగే అవకాశం ఉందని అంచనా. కోవిడ్ సమయంలో లాక్డౌన్ కారణంగా ఆన్లైన్ క్లాసులు ఉనికిలోకి రాగా విద్యకు సంబంధించిన స్టార్టప్‌లు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. వీడియో గేమింగ్ పరిస్థితి కూడా ఇదే. అయితే కోవిడ్ సద్దుమణుగుతున్న నేపథ్యంలో ఈ రంగాలకు నిధుల కొరత ఏర్పడిందని నిపుణులు అంటున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే చాలా రంగాల్లోని స్టార్టప్‌లు గత రెండేళ్లుగా నిధులు సేకరించలేదు. ప్రస్తుత పరిస్థితులు ఇలాంటి కంపెనీలకు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు వస్తేనే సమీప భవిష్యత్తులో మళ్లీ స్టార్టప్‌లు నిలదొక్కుకోగలవని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదుటపడితే నిధులు వస్తాయని, కాకపోతే వచ్చే ఈ నిధులను కొంచెం ఆచితూచి తగిన వ్యాపార ప్రణాళికతో ఖర్చు చేస్తే మేలన్నది వారి అభిప్రాయం. మే నెలలో మందగమనం.. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో పెట్టుబడుల మొత్తం రూ. 1.36 లక్షల కోట్లుగా పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నా అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఫలితంగా ఏప్రిల్ నుంచే మందగమనం మొదలైంది. మే నెలలో వచ్చిన పెట్టుబడులు రూ. 14 వేల కోట్లు మాత్రమే. ఇందులోనూ గతంలో కుది రిన ఒప్పందాల కారణంగా వచ్చినవే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్ల పతనం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, సరుకు రవాణా ఇబ్బందులు, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటివి భారత స్టార్టప్ వ్యవస్థపైనా ప్రభావం చూపాయని నిపుణులు విశ్లేస్తున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కూడా ఇందు కు ఒక కారణంగా చెబుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వెంచర్ క్యాపిటలిస్టులైన సాఫ్ట్ బ్యాంక్, టైగర్ గ్లోబల్ మేనేజ్ మెంట్లు మే నెలలోనే 2022 సంవత్సరానికిగాను నష్టాలను ప్రకటించడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ వరకూ ప్రతి త్రైమాసి కానికి 1,000–1,100 కోట్ల డాలర్ల పెట్టుబడులు రాగా మే–జూన్ త్రైమాసికంలో అది 40% దాకా తగ్గిపోయి 600–700 కోట్ల డాలర్లకు పరిమితమైంది. ( పాపం.. ఓలా అంచనా తల్లకిందులైందే!) నిపుణుల మాట ఇదీ.. ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కగలిగినవి మాత్రమే భవిష్యత్తులో దేశంలోని దిగ్గజ కంపెనీల జాబితాలోకి చేరిపోతాయి. 2021ని స్టార్టప్‌లకు ఊపిరి పోసిన ఏడాదిగా చెప్పుకోవాలి. ఇప్పుడు కొన్ని సమస్యల నుంచి గట్టెక్కగలిగితే వాటి భవిష్యత్తుకు ఢోకా ఉండదు. – ఆశిష్ శర్మ, ఇన్నోవెన్ క్యాపిటల్ ఇండియా మేనేజింగ్ పార్ట్నర్ భారత స్టార్టప్ వ్యవస్థకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. టెక్నాలజీ, ఇన్నొవేషన్, ఉత్పత్తులన్నీ యథాతథంగా కొనసాగుతాయనేది నా నమ్మకం. కంపెనీల వ్యాల్యుయేషన్‌లో తగ్గుదల ఉన్నా మొత్తమ్మీద పరిస్థితి బాగుంది. – సి.విజయ్ కుమార్, సీఈవో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గత 2 నెలల్లో స్టార్టప్ వ్యవస్థకు సమస్యల ముసురు పట్టుకుంది. పెట్టుబడులు తగ్గిపోయాయి. ఉన్న కంపె నీల వ్యాపార ప్రణాళికలు వెనుకంజ వేస్తుండగా కొత్త వాటికి నిధులు గగనమైపోతున్నాయి. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? సమస్యలు ఇలాగే ఉంటే వాటి భవిష్యత్తు ఏమవుతుంది? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం జరగాలి. – కేశవ్ ఆర్. మురుగేష్, నాస్కామ్ మాజీ చైర్మన్ స్టార్టప్ కంపెనీలు మౌలికాంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వెంచర్ క్యాపిటలిస్టులు లేదా పెట్టు బడిదారులు గతంలో మాదిరిగా సులువుగా పెట్టుబ డులు పెట్టడం లేదు. ఉత్పత్తి లేదా సేవ ఆదాయాన్ని ఇవ్వగలదా లేదా? అన్నది చూస్తున్నారు. ఇప్పటివరకూ చాలా వరకూ స్టార్టప్‌లు తమ ఉత్పత్తులు/సేవలను రాయితీ ధరలతో అమ్మే ప్రయత్నం చేశాయి. ఇలా కాకుండా వాస్తవ అవసరాలను గుర్తించి చేసే వ్యాపారం లాభదాయకమా కాదా? అని ఆలోచించుకుని ముందడుగు వేయడం మంచిది. – మురళి బుక్కపట్నం, టై గ్లోబల్ ఉపాధ్యక్షుడు స్టార్టప్‌లకు అకస్మాత్తుగా నిధులు మందగించడం ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో భాగమే. దీనిపై ఆందోళన అవ సరం లేదు. అయితే కేవలం వ్యాల్యుయేషన్పైనే ఆధార పడి కొంతకాలంగా స్టార్టప్ కంపెనీలు పనిచేస్తుండటం ప్రస్తుత పరిస్థితికి కారణం కావచ్చు. ఆదాయాన్ని సృష్టించగలమా? లాభాలు వస్తాయా అనే ఆలోచన లేకుండా కంపెనీలు పెట్టుబడిదారుల నుంచి వస్తున్న నిధులను ఖర్చు చేయడమే ఆందోళన కలిగించే విషయం. – ఇటీవలి నివేదికలో ఆర్బీఐ -
ఉద్యోగులకు షాకిచ్చిన మైక్రోసాఫ్ట్
సాక్షి, న్యూఢిల్లీ: టెక్ దిగ్గజంమైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు షాకిచ్చింది. దాదాపు 1800మందిని ఉద్యోగాలనుంచి తొలగించింది. జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబందించి మొత్తం లక్షా 80వేల మంది ఉద్యోగుల్లో దాదాపు ఒక శాతం మందిపై వేటు వేసింది. అయితే తరువాతి కాలంలో మైక్రోసాఫ్ట్ పునర్నిర్మాణంలో భాగంగా మరింతమందిని నియమించుకోనుందట. కన్సల్టింగ్, కస్టమర్, పార్టనర్ సొల్యూషన్ సహా పలు గ్రూపులలో ఈ తొలగింపులు చేసింది. మైక్రోసాఫ్ట్ సాధారణంగా కొత్త ఆర్థిక ఏడాదికి మార్పుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాలో జూలై 4 సెలవులు తరువాత తాజా ఉద్యోగ కోతలను ప్రకటించింది. అయితే చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉద్యోగులను తొలగించామని మైక్రోసాఫ్ట్ వివరించింది. అయితే అన్ని కంపెనీల మాదిరిగానే వ్యాపారాన్ని రివ్యూ చేసుకొని తదనుగుణంగా సర్దుబాట్లు చేసుకుంటామని వెల్లడించింది. అలాగే పెట్టుబడుల విస్తరణ కొనసాగుతుందని, ఫలితంగా మళ్లీ ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. -
సోషల్‌గా జర జాగ్రత్త! ఉద్యోగాలకే ఎసరు
మీరు ఉద్యోగులా? లేక కొలుకు కోసం వెదుకులాటలో ఉన్నారా? అయితే సోషల్ మీడియా వాడకంలో కాస్త జాగ్రత్త. అవి ఉన్నదే అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు కదా అంటారా? అలాంటి మాటలు వాదనకే బాగుంటాయి. సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్లు చాలామంది కొలువులకు ఎసరు పెడుతున్నాయి. పనిష్మెంట్ బదిలీలకు, ప్రమోషన్ల నిలిపివేతకు కారణమవుతున్నాయి. వివాదాస్పద కామెంట్లు పెట్టేవారికి ఉద్యోగాలిచ్చేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు కూడా... ప్రభుత్వ విధానాలను సోషల్ మీడియాలో విమర్శించినందుకు గత అక్టోబర్‌లో ఢిల్లీలో ఓ కానిస్టేబుల్ ఉద్యోగం కోల్పోయాడు. కేంద్ర మంత్రిపై విమర్శలు చేసినందుకు కర్ణాటకలో తాజాగా ఓ టీచర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. సోషల్ మీడియాలో పెట్టే కామెంట్ల ప్రకంపనలు చాలా దూరం ప్రయాణిస్తున్నాయి. ఉద్యోగులు, ఉద్యోగార్థుల ‘సోషల్’ లైఫ్ మీద యాజమాన్యాలు, కంపెనీల నిఘా కొన్నేళ్లుగా బాగా పెరిగింది. అభ్యంతరకర, వివాదాస్పద కామెంట్లు చేస్తే ఉపాధికే ఎసరొస్తోంది. మరీ ముఖ్యంగా జాతి వివక్ష, జాతీయ భద్రత, ఉగ్రవాదం, తీవ్రవాదం వంటివాటిపై సోషల్ మీడియాలో అస్సలు మాట్లాడకూడదని ఓ అంతర్జాతీయ అధ్యయనంలో తేలింది. ఈ మధ్య కాలంలో 28 శాతం మంది ఇలాంటి వాటిపై వ్యాఖ్యల వల్లే వీధిన పడ్డారట. వ్యక్తుల ఇష్టాయిష్టాలపై అనుచిత వ్యాఖ్యలు, మహిళలను ద్వేషించడం వల్ల 12 శాతం మంది ఉద్యోగాలకు ఎసరొచ్చిందట. ఆఫీసుల్లో గొడవలు పడి 17 శాతం, సోషల్ మీడియాలో కుళ్లుజోకులు, కనీస మానవత్వం లేని ప్రవర్తనతో 16 శాతం, బూతులు, హింసకు దిగుతామనే బెదిరింపులతో 8 శాతం, రాజకీయ విమర్శలతో 5 శాతం మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు!! సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలతో ఉద్యోగాలు కోల్పోయిన ఉదంతాలపై వచ్చిన వందలాది వార్తా కథనాల ఆధారంగా జరిగిన అధ్యయనంలో తేలిన విషయాలివి. మన దేశంలోనూ రాజకీయ విమర్శలు చేసినందుకు సామాజిక కార్యకర్తలు జైలుపాలవడం, కొందరిపై భౌతికదాడులు జరగడం తెలిసిందే. ఉద్యోగార్థులపై సోషల్ నిఘా గత పదేళ్లలో ఆధారంగా ఉద్యోగుల ఎంపికలో సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలను లోతుగా గమనించే ధోరణి పెరిగిందని వాషింగ్టన్ పోస్టు వెల్లడించింది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆపిల్ వంటి దిగ్గజాలు జాతి వివక్ష, వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేస్తే ఎంత టాలెంటున్నా ఉద్యోగాలివ్వడం లేదు. ‘సోషల్’ హిస్టరీ బాగా లేకపోవడం వల్ల కంపెనీకి ఎంతో ఉపయోగపడతారనుకున్న ప్రతిభావంతులను కూడా వదులుకోవాల్సి వస్తోంది. ఇది బాధాకరమే అయినా తప్పడం లేదు. పని చేసే చోట ఇబ్బందులు రాకూడదు కదా! అందుకే నాయకత్వ స్థానాల్లో ఉండేవారికి ఎలాంటి బలహీనతలూ ఉండొద్దన్న నియమాన్ని కచ్చితంగా పాటిస్తున్నాం’’ అని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వర్ణవివక్షపై జరిగిన ఓ సదస్సులో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ‘సేజ్ పబ్’ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం కంపెనీల మానవ వనరుల విభాగాలు ఏయే అంశాలను గమనిస్తున్నాయంటే... ► ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాంలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారు? ► ఏ అంశాలపై ఎక్కువగా స్పందిస్తున్నారు? ► సొంతగా ఏమైనా బ్లాగులు రన్ చేస్తున్నారా? ► వీటితో పాటు పలు ఇతర అంశాలపైనా నిఘా పెడుతున్నారు. ► పోలీసు (20%), టీచర్లు (24%), ప్రభుత్వోద్యోగులు (14%), ఆతిథ్య, రిటైల్ రంగాల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉందట. ► వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్టులతో ఉద్యోగాలు పోతాయని మన దేశంలో 40 శాతం మందికి భయమున్నట్టు గతేడాది ఓ అధ్యయనంలో తేలింది.నే పలు సోషల్ మీడియా పోస్టులను డిలీట్ చేసినట్లు చాలామంది అంగీకరించారు. ► పని చేస్తున్న కంపెనీ, సంస్థపై సోషల్ మీడియాలో చెడుగా రాశామని 25.7 శాతం మంది ఒప్పుకున్నారు. ► సోషల్ మీడియా పోస్టుల వల్ల తమకేమీ కాదని 46.9 శాతం మంది నమ్ముతున్నారు. భిన్నాభిప్రాయాలు సోషల్ మీడియా పోస్టులకు కెరీర్‌తో ముడి పెట్టడం సబబా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. బికినీతో ఫొటో దిగి ఇన్‌స్టాలో పెట్టినందుకు ఒకరి ఉద్యోగం పోయింది. ఇది వ్యక్తిగత జీవితంలోకి అనుచితంగా చొరబడటమేనన్న వాదన ఉంది. సున్నిత అంశాలపై వివాదాస్పదంగా పోస్టులు పెట్టకపోవడమే మేలన్నది 2021 గ్రహీత సాహిత్య నోబెల్ గ్రహీత అబ్దుల్ రజాక్ గుర్మా వంటివారి అభిప్రాయం. ఇది యువతలో అభద్రతా భావం పెంచుతున్న వాదనతో గూగుల్ హెచ్ఆర్ విభాగం హెడ్ ప్రీతి నారాయణ్ అంగీకరించారు. కానీ విశృంఖలతకు ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పడాల్సిందేనని అభిప్రాయపడ్డారు. :::కంచర్ల యాదగిరిరెడ్డి -
కరోనా : డిస్నీలో భారీగా ఉద్యోగాల కోత
కాలిఫోర్నియా : కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలను అతలాకుతలం చేసింది. ఆర్థికంగా తీవ్రంగా దెబ్బ తీసింది. ఈ సంక్షోభం భారీ ఉద్యోగాల కోతకు దారి తీస్తోంది. తాజాగా అమెరికా వ్యాపార దిగ్గజం డిస్నీ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాలో 28వేల థీమ్ పార్క్ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. ఈ మేరకు మంగళవారం డిస్నీ ఒక ప్రకటన విడుదల చేసింది. చాలా భారమైన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. కోవిడ్-19 ప్రభావం తమ వ్యాపారంపై పడటంతో ఉన్న ఉద్యోగుల్లో నాల్గవ వంతు 28 వేల మందిని తొలగిస్తున్నామని డిస్నీ పార్కు ఛైర్మన్ జోష్ డి అమారో తెలిపారు. ఇందులో 67 శాతం మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారన్నారు. గత కొన్ని నెలలుగా ఉద్యోగులు ఎవరినీ తీయకుండా ఉండేందుకు మేనేజ్మెంట్ అవిరామంగా కృషి చేసింది, ఖర్చులు తగ్గించుకున్నాం, కొన్ని కార్యక్రమాలను నిలిపివేశాం అయినా ఈ దురదృష్టకర నిర్ణయం తీసుకోక తప్పలేదని పేర్కొన్నారు. ఫ్లోరిడా, పారిస్, షాంఘై, జపాన్ హాంకాంగ్‌లోని డిస్నీ థీమ్ పార్కులు ఓపెన్ చేసినా లాభాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆయన తెలిపారు. కాలిఫోర్నియా, ఫ్లోరిడాలలోని డిస్నీ థీమ్ పార్కుల్లో ఉద్యోగుల తొలగింపు అనంతరం ఉద్యోగుల సంఖ్య 1,10,000 నుంచి 82,000లకు తగ్గుతుందన్నారు. -
ఉద్యోగులకు ఐటీ దిగ్గజం ‘డెల్’ షాక్..
బెంగుళూరు: కరోనా వైరస్ ఉదృతి నేపథ్యంలో దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ బాటలోనే ఐటీ దిగ్గజం డెల్ కంపెనీ సైతం పయనిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం డెల్ సంస్థలో జరిగిన త్రైమాసిక సమావేశంలో సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. అయితే డెల్ ఉన్నతాధికారి జెఫ్ క్లార్క్ స్పందిస్తూ ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని నిర్ణయం తీసుకుంటే ఏ ఒక్క విభాగానికో పరిమితం కాదని తెలిపారు. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చులు తగ్గించుకునేందుకు అన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే సంస్థాగతంగా కంపెనీ కార్యకలాపాల విశ్లేషణ ఉంటుందని, కొంతమంది సిబ్బందికి ఉద్వాసన పలకొచ్చని తెలిపారు. మరో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఇటీవలే భారత్‌లో వేలాది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డెల్ సంస్థలో లక్ష65వేల మంది ఉద్యోగులు సేవలంధిస్తున్నారు. అయితే నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఢోకా ఉండదని, ఉద్యోగులకు నైపుణ్యమున్న విభాగాలను కేటాయిస్తామని భారత్‌కు చెందిన డెల్ అధికారి తెలిపారు. కాగా డెల్ సంస్థకు బెంగుళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, పూణే, చెన్నై, కోల్‌కతా తదితర మహానగరాలలో కార్యాలయాలు ఉన్నాయి. ఇటీవల డెల్ ఇండియా ఎండీ అలోక్ ఓరీ స్పందిస్తూ డిజిటల్ నైపుణ్యాలకు, ఆరోగ్య రంగం, విద్య, టెలికం రంగంలో అత్యాధునిక సాంకితకతను ఉపయోగిస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. (చదవండి: డెల్ సూపర్ ల్యాప్‌టాప్ : అన్నీ ఎక్స్‌ప్రెస్ ఫీచర్లే) -
40 వేల మందిపై వేటు : అమెరికన్ ఎయిర్‌లైన్స్
కరోనా సంక్షోభంతో టెక్సాస్-ఆధారిత విమానయాన సంస్థ అమెరికన్ ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయి, కుదేలైన సంస్థ దాదాపు 40వేల మందిని ఉద్యోగాలనుంచి తొలగించేందుకు నిర్ణయించింది. డెల్టా ఎయిర్‌లైన్స్1,941 మంది పైలట్లకు ఉద్వాసన పలకనున్నట్టు ప్రకటించిన మరుసటి రోజు మరో సంస్థ ఈ బాట పట్టడం గమనార్హం. అక్టోబరులో 19వేల మంది సహా మొత్తం 40 వేల ఉద్యోగులను తగ్గించుకోనున్నామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ మంగళవారం తెలిపింది. యూనియన్ కార్మికులు 17500 మంది, 1600 మంది పైలట్లు, 8100 మంది విమాన సహాయకులు, మేనేజ్మెంట్ స్థాయిలో మరో 11,500 మంది ఇందులోఉంటారని తెలిపింది. మరో ఆరునెలల పాటు సిబ్బంది జీతాల చెల్లింపు, తదితర అవసరాల నిమిత్తం ఫెడరల్ ప్రభుత్వం మరో 25 బిలియన్ డాలర్లను విమానయాన సంస్థలకు ఇస్తే తప్ప ఈ తొలగింపులను నివారించే పరిస్థితి లేదని తెలిపింది. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు,సిబ్బంది వేతనాలు, తదితర అవసరాల నిమిత్తం మార్చిలో అమెరికా ప్రభుత్వం నుంచి 25 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని విమానయాన సంస్థలు అందుకున్నాయి. అయితే ఆ తరువాత కూడా విమాన సేవల పునరుద్ధరణకు నోచుకోకపోవడంతో మరో 25 బిలియన్ డాలర్ల ప్యాకేజీ కోసం ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరకు ఉద్యోగులపై వేటు వేయనుంది. ఈ మేరకు సంస్థ సీఈఓ డౌపార్కర్, ప్రెసిడెంట్ రాబర్ట్ ఐసోమ్ ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారం అందించారు. కొంతమంది ఉద్యోగులు బైఅవుట్స్, ముందస్తు పదవీ విరమణ, దీర్ఘకాలిక సెలవులకు అంగీకరించారనీ, అయినా కోతలు తప్పడం లేదని పేర్కొన్నారు. 140,000 మంది ఉద్యోగులతో ఉన్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ అక్టోబరు నాటికి లక్ష కన్నా తక్కువ ఉద్యోగులకే పరిమితం కానుంది. అమెరికాలో కరోనావైరస్ వ్యాప్తికి కొన్నివారాల తరువాత, ఏప్రిల్ నాటికి 95 శాతం విమాన ప్రయాణాలు క్షీణించాయి. ఆ తరువాత కొద్దిగా కోలుకున్నా, గత ఏడాదితో పోలిస్తే 70 శాతం పతనం నమోదైంది. దీంతో ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించలేని స్తితిలో అమెరికా విమానయాన సంస్థలు ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగుల తొలగింపు బాటపడుతున్నాయి. మరోవైపు మహమ్మారి సృష్టించిన మాంద్యంపై పోరుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయ్నతాలు, నాలుగు రోజుల రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ జరుగుతున్న క్రమంలో ఈ ప్రకటన రావడం విమానయాన సంస్థల సంక్షోభానికి అద్దం పడుతోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
వోడాఫోన్ ఐడియా: ఉద్యోగులపై వేటు
సాక్షి, ముంబై : ఆర్థిక కష్టాల్లో మునిగిపోయిన టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏజీఆర్ బకాయిల భారానికి తోడు నెట్ వర్క్ విస్తరణ పనులు నిలిచిపోవడం, డీల్స్ ఆలస్యం తదితర కారణాల రీత్యా పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసినట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో దేశవ్యాప్తంగా దాదాపు 1500 మంది ఉద్యోగులను తొలగించింది. ముఖ్యంగా వోడాఫోన్ ఐడియాకు సంబంధించి నోకియా, ఎరిక్సన్, హువావే, జెడ్‌టిఇ 4జీ పరికరాల కొత్త ఆర్డర్లు ఆలస్యం కావడంతో సంస్థ సంక్షోభంలో చిక్కుకుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే చైనా నుంచి కొత్త ఆర్డర్లను తీసుకోవడం కూడా ఆగిపోయి ఉండవచ్చని అంచనా. దీనికితోడు మే నెలలో 22 టెలికాం సర్కిల్స్ ను 10కి కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. అటు తాజా త్రైమాసికంలో వోడాఫోన్ ఐడియా చందాదారుల సంఖ్య భారీగా పడిపోయింది. ఏజీఆర్ మొత్తం బకాయిలు చెల్లిస్తే..తమ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందనీ, ఈ క్రమంలో ఈ చెల్లింపులకు ఇరవై ఏళ్లు సమయం కావాలని సంస్థ ఇటీవల సుప్రీంకోర్టును కోరిన సంగతి తెలిసిందే -
సీఎఫ్ఓ ఔట్, 700 ఉద్యోగాలు కట్
సాక్షి, న్యూఢిల్లీ:అమెరికాకు చెందిన ప్రసిద్ధ బైక్స్ తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్ కరోనా సంక్షోభంతో ఆర్థిక కష్టాల్లో పడింది. దీంతో ఖర్చులను తగ్గించుకునేందుకు వందలమంది ఉద్యోగాల తొలగింపునకు నిర్ణయించింది. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 700 మంది ఉద్యోగులను తొలగించనున్నామని ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారికారణంగా తీవ్రంగా దెబ్బతిన్న సంస్థను పునరుద్ధరించే తన కొత్త వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ తెలిపింది. 'ది రివైర్' పేరుతో హార్లే-డేవిడ్సన్ ఉద్యోగ కోతలు, పునర్నిర్మాణ ప్రణాళికను ప్రకటించింది. సంస్థ పునర్నిర్మాణం, ఖర్చులు తగ్గింపులాంటి చర్యల్లో భాగంగా 700మంది తొలగించనున్నామని, వీరిలో 200మంది ఇప్పటికే నిష్క్రమించగా, మిగిలిన 500మందిని 2020 చివరి నాటికి తొలగించాలని భావిస్తున్నామని హార్లే డేవిడ్సన్ గురువారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. తద్వారా కంపెనీకి 42 మిలియన్ల డాలర్లు ఖర్చు ఆదా అవుతుంది 17 సంవత్సరాల పాటు హార్లేతో ఉన్న చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జాన్ ఒలిన్ సంస్థకు రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో తాత్కాలిక ప్రాతిపదికన డారెల్ థామస్‌ను ఎంపిక చేసింది. హార్లే-డేవిడ్సన్ను విజయవంతమైన మార్గంలో తీసుకురావడానికి గణనీయమైన మార్పులు అవసరం, అందుకు సరికొత్త దశలో కృషి జరుగుతోందనీ, మొత్తం కంపెనీ అంతటా వేగంగా నిర్ణయాలు తీసుకుంటామని హార్లే-డేవిడ్సన్ సీఈఓ జోచెన్ జైట్జ్ ప్రకటించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా హార్లేలో 6,000 మంది ఉద్యోగులు ఉన్నారు. -
కువైట్‌లో 8 లక్షల మంది భారతీయులకు కత్తెర?
దుబాయ్: ఎడారి దేశం కువైట్‌లోని భారతీయులకు పెద్ద ముప్పు వచ్చిపడింది. దేశ జనాభాలో పెరిగిపోతున్న విదేశీయులను తగ్గించుకునేందుకు ఆ దేశ పార్లమెంటరీ కమిటీ ఓ ముసాయిదా చట్టాన్ని ఆమోదించింది. దీంతో సుమారు ఎనిమిది లక్షల మంది భారతీయులు తప్పనిసరిగా ఆ దేశం వదిలి రావల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. విదేశీయుల సంఖ్యను క్రమేపీ తగ్గించుకోవాలన్న కువైట్ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా సిద్ధం చేసిన ముసాయిదా బిల్లు దేశ రాజ్యాంగానికి అనుగుణంగానే ఉందని న్యాయ, చట్ట సంబంధిత కమిటీ నిర్ణయించడంతో త్వరలోనే అక్కడి భారతీయులు కువైట్‌ను వదిలి రావాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయి. కువైట్ జనాభా: 43 లక్షలు ఇందులో కువైటీలు: 13 లక్షలు భారతీయులు: 14.5 లక్షలు 2018లో కువైట్‌లోని భారతీయులు స్వదేశానికి పంపిన మొత్తం: 480 కోట్ల డాలర్లు విదేశీయులపై వ్యతిరేకత! ముసాయిదా బిల్లు ప్రకారం కువైట్ జనాభాలో భారతీయులు 15 శాతానికి మించకూడదు. ప్రస్తుతం కువైట్ జనాభా దాదాపు 43 లక్షలు కాగా ఇందులో కువైటీలు 13 లక్షల మంది ఉన్నారు. భారతీయుల సంఖ్య 14.5 లక్షల వరకూ ఉంది. ముడిచమురు ధరలు భారీగా పతనం కావడం, కోవిడ్–19 కారణంగా ఆర్థిక వ్యవహారాలు మందగించిన నేపథ్యంలో దేశం మొత్తమ్మీద విదేశీయులపై వ్యతిరేకత పెద్ద ఎత్తున పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా కరోనా బారిన పడ్డవారిలో విదేశీయులు ఎక్కువగా ఉండటం, కిక్కిరిసిపోయిన వలసకూలీల ఆవాసాలు దీనికి కారణమని భావిస్తూండటం కూడా ఒక కారణమైంది. కువైట్ జనాభాలో ఎవరెంతమంది? కువైటీలు: 30.36% ఇతర అరబ్ దేశాల వారు:27.29 ఆసియావాసులు:40.42% ఆఫ్రికావాసులు: 1.02% యూరప్‌వాసులు: 0.39% ఇతరులు: 0.52% ప్రస్తుతం కువైట్ మొత్తమ్మీద సుమారు 49 వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు కూడా విదేశీయుల సంఖ్యను తగ్గించాల్సిందిగా కోరుతున్నారు. కువైట్ ప్రధాని షేక్ సబా అల్ ఖలీద్ గత నెలలో విదేశీయుల సంఖ్యను ప్రస్తుతమున్న 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గిద్దామని ప్రతిపాదించినట్లు కథనాలు వచ్చాయి. అసెంబ్లీ స్పీకర్ మర్జూక్ అల్ ఘనేమ్ కువైట్ టీవీతో మాట్లాడుతూ దశలవారీగా విదేశీయులను తగ్గించే అంశంపై ఒక కమిటీ అసెంబ్లీకి సమగ్రమైన ముసాయిదా బిల్లును సమర్పిస్తుందని తెలిపారు కూడా. విదేశాల నుంచి వచ్చిన వారిలో అధిక శాతం మంది నిరక్షరాస్యులు లేదా కేవలం చదవడం, రాయడం మాత్రమే తెలిసిన వారు ఉన్నారని, కువైటీలకు వారి అవసరమేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘వేర్వేరు వృత్తుల్లో నైపుణ్యం ఉన్న వారిని నియమించుకుంటే ఫర్వాలేదు. కానీ వీసా వ్యాపారుల జిమ్మిక్కు కారణంగా నైపుణ్యం లేని కూలీల వలసలు దేశంలోకి ఎక్కువయ్యాయి’ అని అసెంబ్లీ స్పీకర్ మీడియాతో అన్నారు. సంబంధిత కమిటీలకు ముసాయిదా బిల్లు విదేశీయుల సంఖ్యపై కోటా అమలు చేసేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లు సంబంధిత కమిటీలకు వెళ్లనుంది. దాని ప్రకారం దేశ జనాభాలో భారతీయులు 15 శాతం కంటే ఎక్కువ ఉండరాదు. ఫలితంగా సుమారు ఎనిమిది లక్షల మంది కువైట్ వీడాల్సి ఉంటుంది. కువైట్‌లో భారతీయ ఎంబసీ లెక్కల ప్రకారం సుమారు 28 వేల మంది భారతీయులు ఆ దేశ ప్రభుత్వంలో నర్సులు, ఇంజనీర్లు, చమురు కంపెనీల్లోనూ పనిచేస్తున్నారు. సుమారు 5.23 లక్షల మంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తూండగా వీరిపై ఆధారపడ్డ వారు 1.16 లక్షల మంది ఉన్నారు. ఇందులోనూ సుమారు 60 వేల మంది భారతీయ సంతతి విద్యార్థులు దేశంలోని 23 పాఠశాలల్లో చదువుకుంటున్నారు. -
కరోనా : 7500 ఉద్యోగాల కోత
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నష్టాలతో కుదేలైన ఎయిర్‌ఫ్రాన్స్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించనుంది. ఎయిర్ ఫ్రాన్స్ , దాని ప్రాంతీయ అనుబంధ సంస్థ హాప్ సంయుక్తంగా 7,500 ఉద్యోగ కోతలను శుక్రవారం ప్రకటించాయి. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులు నిలిచిపోవడం, భవిష్యత్తులో విమాన ప్రయాణ అవకాశాలపై నీలి నీడలు కమ్ముకోవడంతో సంక్షోభంలో పడిన సంస్థ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఎయిర్ ఫ్రాన్స్ 6500 మందిని, హాప్లో వెయ్యిమందిని తొలగించనున్నామని వెల్లడించాయి. ఎయిర్ ఫ్రాన్స్‌లో మొత్తం 41వేలమంది ఉద్యోగులుండగా, హాప్లో 2400మంది పనిచేస్తున్నారు. కరోనా సంక్షోభంతో మూడు నెలల్లో తమ ట్రాఫిక్ 95 శాతం పడిపోయిందని, దీంతో రోజుకు 15 మిలియన్ యూరోల నష్టం వచ్చిందని ఎయిర్ ఫ్రాన్స్ ప్రకటించింది. 2024 వరకు కోలుకునే ఆశలు కూడా లేవని తెలిపింది. ఉద్యోగాల కోతపై యూనియన్లు ఆందోళనకు దిగాయి. సిబ్బంది ప్రతినిధులతో చర్చల అనంతరం 2022 నాటికి ఈ తొలగింపులు ఉంటాయని యాజమాన్యం శుక్రవారం రాత్రి ప్రకటించింది. కోవిడ్-19 ఒక సాకు మాత్రమేనని ఆందోళనకారుడు, హాప్ ఉద్యోగి జూలియన్ లెమరీ మండిపడ్డారు. కార్మికుల ఉపాధిని దెబ్బతీయడానికి బదులు, సంస్థ పునర్నిర్మాణం, బెయిల్ అవుట్ ప్యాకేజీపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. -
టాటా మోటార్స్ : ఉద్యోగులపై వేటు
సాక్షి, ముంబై : కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంతో టాటా మోటార్స్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. తన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) యూనిట్లో ఉద్యోగాల కోతకు నిర్ణయించింది. నష్టాలను పూడ్చుకునేందుకు, ఖర్చులు తగ్గింపు లక్ష్యంతో జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లను ఉత్పత్తి చేసే ప్లాంట్లలో పనిచేస్తున్న1100 తాత్కాలిక ఉద్యోగులను జులైలో తొలగించనున్నామని కంపెనీ ప్రకటించింది. తద్వారా టాటా మోటార్స్ లగ్జరీ యూనిట్ జేఎల్ఆర్ 1 బిలియన్ పౌండ్ల (1.26 బిలియన్ డాలర్లు)ను పొదుపు చేయాలని భావిస్తోంది. (పదవ రోజూ పెట్రో షాక్) టాటా మోటార్స్ తన వ్యాపారాలన్నింటినీ సమీక్షిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 2021నాటికి దేశీయ వ్యాపారంలో 5 బిలియన్ పౌండ్లను ఆదా చేయాలని భావిస్తున్నట్లు సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పీబీ బాలాజీ తెలిపారు. ఇందులో 3.5 బిలియన్ పౌండ్లను ఇప్పటికే సాధించామని చెప్పారు. అలాగే గత ఏడాది 3 బిలియన్ పౌండ్లతో పోలిస్తే మూలధన వ్యయాన్ని 2.5 బిలియన్ పౌండ్లకు తగ్గించనుంది. అయితే తమ అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన చైనా సహా యూరప్, అమెరికాలో ల్యాండ్ రోవర్ స్పోర్ట్-యుటిలిటీ వెహికల్ డిఫెండర్, రేంజ్ రోవర్ ఎవోక్ అమ్మకాలు పుంజుకునే సంకేతాలున్నా యని బాలాజీ చెప్పారు. (టాటా మోటార్స్ నష్టాలు 9,864 కోట్లు) కరోనా, లాక్డౌన్ కారణంగా తమ లగ్జరీ కార్ల విక్రయాలు 30.9 శాతం తగ్గాయని జెఎల్ఆర్ ప్రకటించింది. టాటా మోటార్స్ ఆదాయంలో కీలకమైన జేఎల్ఆర్ ఆదాయం మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో 27.7 శాతం క్షీణించినట్టు తెలిపింది. మరోవైపు 2010 నుండి జేఎల్ఆర్ బాస్ గా కొనసాగుతున్న రాల్ఫ్ స్పేత్ ఈ సెప్టెంబరులో పదవినుంచి తప్పుకోనున్నారు. -
22 వేల మందిని తొలగించనున్న లుఫ్తాన్సా
బెర్లిన్ : జర్మన్ కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సా షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుత అవసరాలకు మించి తమ వద్ద 22 వేల అదనపు ఉద్యోగాలున్నాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో సుమారు 22 వేల మందిని తొలగించే అవకాశం ఉందని బుధవారం వెల్లడించింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏర్పడిన తీవ్ర నష్టాలనుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నామని, దీంతో ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపు తప్పడం లేదని పేర్కొంది. కార్మిక సంఘాలతో సమావేశం తరువాత లుఫ్తాన్సా ప్రతినిధి ఈ విషయాన్ని ప్రకటించారు. ఇంతకుముందు అంచనా వేసిన 10,000 కంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ అని తెలిపారు. జూన్ 25 న అసాధారణ సర్వసభ్య సమావేశానికి ముందే సిబ్బందితో పార్ట్‌టైమ్ పని చేయించుకోవడం లాంటి అంశాలపై కార్మిక సంఘాలతో ఒప్పందం కుదుర్చుకోవడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని వివరించారు. మరోవైపు ఉద్యోగుల బలవంతపు తొలగింపులను విరమించుకోవాలని ఫ్లైట్ అటెండెంట్స్ యూనియన్ (యుఎఫ్ఓ) డిమాండ్ చేసింది. ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపింది. అటు పైలట్ల యూనియన్ సభ్యులు కూడా 45 శాతం వరకు వేతన తగ్గింపునకు ప్రతిపాదించారు. తద్వారా 350 మిలియన్ యూరోలు కంపెనీకి ఆదా అవుతుందని ప్రతిఫలంగా కంపెనీ వీలైనన్ని ఎక్కువ ఉద్యోగాలను కాపాడాలని యూనియన్ కోరుతోంది. కాగా 9 బిలియన్ యూరోల (10.26 బిలియన్ డాలర్ల) బెయిల్ అవుట్ ప్యాకేజీ తిరిగి చెల్లింపుతోపాటు, కోవిడ్-19 సంక్షోభంతో వేలాది ఉద్యోగాల కోత, ఆస్తి అమ్మకాలు వంటి భారీ పునర్నిర్మాణ వ్యూహాన్ని లుప్తాన్సా అమలు చేస్తోంది. రానున్న ఏజీఎంలో బెయిల్ అవుట్ ప్యాకేజీ చెల్లింపుపై వాటాదారులు ఓటు వేయాల్సి ఉంది. -
షాకింగ్ : 10,000 మంది ఉద్యోగులపై వేటు
లండన్ : కరోనా వైరస్ విజృంభణతో చమురుకు డిమాండ్ పడిపోవడంతో బ్రిటిష్ ఇంధన దిగ్గజం బీపీ 10,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో దాదాపు 15 శాతం సిబ్బందిపై వేటువేసేందుకు కంపెనీ సంసిద్ధమైంది. ఈ ఏడాది చివరికి దాదాపు 10,000 మంది ఉద్యోగులు కంపెనీ వీడే ప్రక్రియను తాము చేపట్టామని బీపీ సీఈఓ బెర్నార్డ్ లూనీ తమ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో పేర్కొన్నారు. కరోనా వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు మూతపడటం, ఎయిర్‌లైన్స్ విమానాలు ఎగరకపోవడంతో చమురు ధరలు పతనమై మైనస్‌లోకి జారుకున్నాయి. ప్రభుత్వాలు లాక్డౌన్లను సడలించిన నేపథ్యంలో వ్యాపారాలు క్రమంగా తెరుచుకోవడంతో చమురు ధరలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయని బీపీ చీఫ్ బెర్నార్డ్ లూనీ చెప్పారు. తమ ఖర్చులు విపరీతంగా పెరిగాయని, ఫలితంగా తొలి క్వార్టర్లో తమ రుణాలు 600 కోట్ల డాలర్లకు చేరుకున్నాయని అన్నారు. నిర్వహణ వ్యయం భారీగా పెరిగిపోవడంతో వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టామని వెల్లడించారు.ఈ ఏడాది సీనియర్ ఉద్యోగులకు వేతన పెంపు, బోనస్‌లను నిలిపివేశామని చెప్పారు. కాగా బీపీలో ఎక్కువ కార్యాలయ సిబ్బందిపైనే తొలగింపు వేటు ప్రభావం అధికంగా ఉండనుంది. చదవండి : అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు -
రెనాల్ట్ : 15 వేల మంది తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ సంక్షోభంగా కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల జాబితాలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ చేరింది. అమ్మకాలు మందగించడంతో 15 వేల మందిని తొలగిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. అలాగే కొన్ని ప్లాంట్లను పునర్వవస్థీకరణ చేయనున్నామనీ, ఇందుకు యూనియన్లతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 15 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని కంపెనీ ప్రకటించింది. వీరిలో ప్రధానంగా ఫ్రాన్స్‌కు చెందిన 4,600 మంది ఉన్నారు. ఇతర దేశాల్లో 10 వేల మందికి పైగా ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా1.80 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వచ్చేమూడేళ్లలో దాదాపు రూ.16,800 కోట్ల మేర ఖర్చులు తగ్గించుకోవాలనుకున్నట్టుగా వెల్లడించింది. ప్రస్తుత 40 లక్షల కార్ల ఉత్పత్తి సామర్ధ్యాన్ని 2024 నాటికి 33 లక్షలకు తగ్గించే యోచనలో ఉన్నట్టు వెల్లడించింది. ఉత్పత్తిలో కోత విధించి, మరింత లాభదాయకమైన మోడళ్లపై దృష్టిపెట్టనుంది. (12 వేల మందిని తొలగించనున్న బోయింగ్) కాగా కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా చిన్నా, పెద్ద వ్యాపార సంస్థలు ఆర్థికంగా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. దీంతో నష్టాలను పూడ్చుకోవడానికి, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో జీతాలలో కోత ఉద్యోగులను తొలగించడం చేస్తున్న సంగతి తెలిసిందే. (కోవిడ్-19: రోల్స్ రాయిస్‌లో వేలాదిమందికి ఉద్వాసన) -
12 వేల మందిని తొలగించనున్న బోయింగ్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ భారీ స్థాయిలో ఉద్యోగులపై వేటు వేయనుంది. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా విమానయాన రంగం కుదేలైంది. ఈ నేపథ్యంలో బోయింగ్ సుమారు 12వేల మందిని తొలగించేందుకు నిర్ణయించింది. రాబోయే కొద్ది నెలల్లో అనేక వేల ఉద్యోగాలను తొలగించనున్నామని బోయింగ్ ప్రతినిధి బుధవారం తెలిపారు. అయితే ఎంతమంది అనేది స్పష్టంగా పేర్కొనలేదు. కోవిడ్-19 మహమ్మారి వైమానిక పరిశ్రమను ఘోరంగా దెబ్బతీసిందని, దీంతో రాబోయే కొన్నేళ్లలో వాణిజ్య జెట్ల తయారీని బాగా తగ్గించనున్నామని బోయింగ్ సీఈవో డేవిడ్ కాల్హౌన్ ఉద్యోగులకు అందించిన సమాచారంలో తెలిపారు. 6770 అమెరికా ఉద్యోగులను ఈ వారంలో తొలగిస్తామనీ, మరో 5,520 మంది స్వచ్ఛందంగా సంస్థను వీడడానికి అంగీకరించారని వెల్లడించారు. తమ ఉద్యోగుల్లో 10 శాతం తగ్గించుకుంటామని డేవిడ్ చెప్పారు. అంతర్జాతీయంగా కూడా ఉద్యోగ కోతలు ఉంటాయన్నారు. (విమానం ఎక్కుతానని ఎప్పుడూ అనుకోలేదు) మరోవైపు ఏడాది క్రితం ఇదే సమయంతో పోలిస్తే విమాన ప్రయాణీకుల సంఖ్య 89 శాతం తగ్గిందని ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ మంగళవారం వెల్లడించింది. కాగా లాక్డౌన్ కఠిన ఆంక్షల కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలు స్థంబించిపోయాయి. ప్రస్తుతం కాస్త పుంజుకున్నప్పటికీ, అమెరికాలో విమానయాన రంగ ఆదాయం ఏప్రిల్ మధ్య కాలంలో 96 శాతం పడిపోయింది. -
రోల్స్ రాయిస్‌లో వేలాదిమందికి ఉద్వాసన
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. ఒక వైపు మానవ హననం, మరో వైపు ఆర్థిక సంక్షోభంతో కార్పొరేట్ దిగ్గజాలు సైతం అతలా కుతలమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూకే ఇంజనీరింగ్ దిగ్గజం రోల్స్ రాయిస్ హోల్డింగ్స్ 9,000 ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. కోవిడ్-19, లాక్డౌన్ ఆంక్షల సందర్భంగా తాము తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నామని, ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తప్పలేదని తెలిపింది. తద్వారా 1.3 బిలియన్ డాలర్లను ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జెట్ ఇంజిన్ తయారీదారు ప్రకటించింది. (కరోనా కాటు, ఓలా ఉద్యోగులపై వేటు) విమాన ఇంజిన్లను తయారు చేసే డెర్బీ ఆధారిత సంస్థ రోల్స్ రాయిస్ కోవిడ్-19 సంక్షోభంతో విలవిల్లాడుతోంది. దీంతో మొత్తం ఉద్యోగాల్లో దాదాపు 17వ వంతు కోతకు నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రధానంగా తన సివిల్ ఏరోస్పేస్ విభాగాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపింది. ఇది తయారీ సంక్షోభం కాకపోయినా, తాజా అనిశ్చితి, ఇతర సమస్యలను పరిష్కరించుకోవాల్సి వుందని సంస్థ సీఈవో బాస్ వారెన్ ఈస్ట్ అన్నారు. అయితే యూనియన్లతో సంప్రదింపుల కారణంగా ఉద్యోగ నష్టాలు ఎక్కడ ఉంటాయో కంపెనీ కచ్చితంగా తేల్చలేదు. ఉద్యోగ కోతల్లో ఎక్కువ భాగం ప్రధానంగా యూకేలోనే ఉంటుందని భావిస్తున్నారు. అలాగే లాక్డౌన్ ఆంక్షలతో ప్రపంచ వ్యాప్తంగా సేవలను నిలిపివేసిన వైమానిక పరిశ్రమ కోలుకోవడానికి "చాలా సంవత్సరాలు" పడుతుందని హెచ్చరించింది. మరోవైపు ఈ నిర్ణయంపై అక్కడి కార్మిక యూనియన్లు మండిపడుతున్నాయి. -
కరోనా: భారీగా ఉద్యోగాల కోత
కోవిడ్-19 మహమ్మారి పంజా విసరడంతో చాలామంది వైరస్ ధాటికి తట్టుకోలేక ప్రాణాలుకోల్పోయారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చివురుటాకులా వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వేలమందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయి, నిర్వహణ, వ్యయభారాలను తగ్గించుకునేందుకు ఉద్యోగాల కోత విధిస్తున్నాయి. ఈక్రమంలో వివిధ కంపెనీలలో పనిచేస్తోన్న కాంట్రాక్ట్(తాత్కాలిక) ఉద్యోగుల తొలగింపుకు మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఫైనాన్స్, ఇన్సురెన్స్, రిటైల్, ఈ-కామర్స్, ఎఫ్ఎంసీజీ కంపెనీలలో పనిచేస్తోన్న తాత్కాలిక ఉద్యోగులపై అధికంగా కోత విధిస్తున్నారు. తద్వారా కంపెనీల నిర్వహణ వ్యయాలను కొంతమేర తగ్గించుకోవచ్చని యజమాన్యాలు భావిస్తున్నాయి. ఆయా కంపెనీలకు వర్క్ ఆర్డర్లు ఇచ్చే క్లైంట్లు సైతం తమ ఆర్డర్లను తగ్గించేశారు. కొంత మంది ఆర్డర్లు ఇచ్చిన్పటికీ సర్వీసులపై డిస్కౌంట్లు అడుగుతున్నారు. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో వ్యాపారాలను సజీవంగా నిలుపుకునేందుకు డిస్కౌంట్లు ఇవ్వక తప్పని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అధిక సంఖ్యలో ఉన్న ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేక ఆయా కంపెనీల హెచ్ఆర్ టీమ్‌లు ఉద్యోగులకు తొలగింపు పత్రాలను పంపుతున్నాయి. మరికొన్ని కంపెనీలు అయితే ఉద్యోగుల సంఖ్య తగ్గించాలా?లేదా వేతనాల్లో కోత విధించాలా అని ఆలోచిస్తున్నాయి. బీ2బీ ఈ-కామర్స్ స్టార్టప్ కంపెనీ ఉడాన్ ఏప్రిల్ నెలలో 10-15 శాతం తాత్కాలిక ఉద్యోగులపై కోత విధించింది.దీని ప్రభావం 3000 మందిపై పడింది. ఇదే నెలలో ఆన్లైన్లో గోల్డ్లోన్లు నిర్వహించే రూపిక్ కంపెనీ సైతం ఉద్యోగులను తొలగించింది. ఈ తొలగింపు 600 మంది బ్లూ, గ్రే కాలర్ ఉద్యోగులను పరోక్షంగా ప్రభావితం చేసింది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాంలు అయిన జొమాటో, స్విగ్గీలు కూడా వేతనాల్లో సవరింపులు చేసి తిరిగి ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటామని తెలిపాయి. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా యాప్ షేర్‌చాట్ బుధవారం 101 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ సంఖ్య కంపెనీ సిబ్బందిలో నాలుగో వంతుగా ఉంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా అడ్వర్టైజింగ్ మార్కెట్ దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. -
దీర్ఘకాల లాక్‌డౌన్‌తో ఐటీ ఉద్యోగాలకు ముప్పు
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్డౌన్ .. దేశీయంగా ఐటీ రంగంలో ఉద్యోగాల కోతకు దారితీయొచ్చని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ మాజీ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ చెప్పారు. పరిస్థితి మరింతగా దిగజారితే.. వెంచర్ క్యాపిటలిస్టుల పెట్టుబడులతో మనుగడ సాగిస్తున్న స్టార్టప్ సంస్థలు.. ఇంకా గడ్డుకాలం ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. ‘పెద్ద కంపెనీలు రెండు కారణాలతో ఉద్యోగాలను తక్షణమే తీయకపోవచ్చు. ఉద్యోగులను పోగొట్టుకోవడం ఇష్టం లేకపోవడం ఒకటి కాగా.. వాటి దగ్గర జీతాల చెల్లింపునకు పుష్కలంగా నిధులు ఉండటం మరో కారణం. ఒకవేళ తగ్గించుకుంటే తాత్కాలిక సిబ్బంది, ఇంటర్న్‌షిప్ చేస్తున్న వారు ఉండొచ్చు. అయితే, ఒక స్థాయికి మించి.. రెండు మూడు నెలలు దాటేస్తే ఆ కంపెనీలు కూడా ఒత్తిడి తట్టుకోలేవు’ అని అన్నారు. -
కరోనా: ప్రతి ఆరుగురిలో ఒకరి ఉద్యోగం ఫట్
లండన్ : ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అవుతున్న విషయం తెల్సిందే. బ్రిటన్‌లో ఈ వైరస్ కారణంగా ప్రతి ఆరుగురులో ఒకరు ఉద్యోగం కోల్పోతున్నారు. ఇలా దేశవ్యాప్తంగా 3.2 ఓట్ల మంది ఉద్యోగుల్లో 56 లక్షల మంది ఉద్యోగులకున ముంపు పొంచి ఉందని ‘న్యూ ఎకనామిక్స్ ఫౌండేషన్’ నిపుణులు అంచనా వేశారు. కంపెనీలు మూత పడిన కారణంగా ఇప్పటికే 16 లక్షల మంది రోడ్డున పడ్డారు. కంపెనీల యజమానులు తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించని పరిస్థితుల్లో 80 శాతం వేతనాలు చెల్లించడం ద్వారా వారిని ఆదుకునేందుకు బ్రిటన్ ప్రభుత్వం 312 లక్షల కోట్ల రూపాయలతో ఓ స్కీమ్‌ను ప్రకటించింది. నిర్దిష్ట కాల పరిమితి, జీరో అవర్ కాల పరిమితి, పార్ట్‌టైమ్ ఉద్యోగులను కంపెనీలు తీసివేసిన పక్షంలో వారికి ఈ ప్రభుత్వం స్కీమ్ వర్తించదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అలాగే స్వయం ఉపాధి కింద పని చేస్తున్న వారికి జూన్ వరకు ఈ స్కీమ్ పని చేయదని, అప్పటి వరకు వారు ఏదో విధంగా మనుగడ సాగించగలరని అధికార వర్గాలు తెలిపాయి. జూన్ తర్వాత కూడా సంక్షోభ పరిస్థితులు కొన సాగితే అప్పుడు అలాంటి వారి గురించి ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పాయి. ఇది చదవండి: ఉద్యోగులకు బంపర్ బోనస్.. అయితే.. -
లాక్‌డౌన్‌తో ఉద్యోగాలకు ముప్పు
న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్‌తో దేశ ఎకానమీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. వీటితో భారీగా ఆదాయాలు, డిమాండ్ పడిపోవడంతో పాటు గణనీయంగా ఉద్యోగాల కోతలు కూడా ఉంటాయని కార్పొరేట్లు భావిస్తున్నారు. కంపెనీల సీఈవోలతో పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వివిధ రంగాల సంస్థలకు చెందిన సుమారు 200 మంది సీఈవోలు ఇందులో పాల్గొన్నారు. ‘గత త్రైమాసికంతో (జనవరి–మార్చి) పోలిస్తే ప్రస్తుత క్వార్టర్లో (ఏప్రిల్–జూన్) ఆదాయాలు 10 శాతం, లాభాలు 5 శాతం పైగా తగ్గిపోతాయని మెజారిటీ సంస్థలు భావిస్తున్నాయి. జీడీపీ వృద్ధిపై కరోనా ఏ మేరకు ప్రభావం చూపబోతోందన్నది ఇది తెలియజేస్తోంది. సర్వేలో పాల్గొన్న 52 శాతం సంస్థలు.. తమ తమ రంగాల్లో గణనీయంగా ఉద్యోగాల్లో కోతలు ఉంటాయని అంచనా వేస్తున్నాయి’ అని సీఐఐ వెల్లడించింది. -
మహమ్మారితో కొలువులు కుదేలు..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి, దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దిగజారుతుందని పరిశ్రమల సంస్థ సీఐఐ నిర్వహించిన సీఈఓల స్నాప్ పోల్‌లో వెల్లడైంది. మహమ్మారి వైరస్ ఎఫెక్ట్‌తో కంపెనీల రాబడి, డిమాండ్ గణనీయంగా పడిపోవడంతో పాటు ఉద్యోగాల్లో కోతకు దారితీస్తుందని పలువురు సీఈఓలు అభిప్రాయపడ్డారు. భిన్న రంగాలకు చెందిన దాదాపు 200 మంది సీఈఓలు ఈ ఆన్లైన్ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రస్తుత త్రైమాసంలో తమ రాబడులు పదిశాతం పైగా పడిపోతాయని, లాభాలు 5 శాతం మేర పతనమవుతాయని సర్వే పేర్కొంది. కంపెనీల రాబడులు, లాభాలపై వైరస్ ప్రతికూల ప్రభావం దేశ జీడీపీ వృద్ధి రేటునూ ప్రభావితం చేయనుందని సీఐఐ వ్యాఖ్యానించింది. ఇక ఆన్లైన్ సర్వేలో పాల్గొన్న సీఈఓల్లో పలువురు రాబోయే రోజుల్లో ఉద్యోగాల్లో కోత తప్పదని పేర్కొన్నారు. తమ తమ రంగాల్లో కరోనా వ్యాప్తి, లాక్డౌన్లతో పలు కొలువులు కోల్పోయే పరిస్థితి నెలకొందని సర్వేలో పాల్గొన్న 52 సంస్ధల ప్రతినిధులు వెల్లడించారు. ఇక 15 శాతం మేర ఉద్యోగాలు తగ్గుముఖం పడతాయని 47 శాతం మంది అంచనా వేయగా, లాక్డౌన్ ముగిసే నాటికి 15 నుంచి 30 శాతం ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆన్లైన్ సర్వేలో పాల్గొన్న వారిలో 32 శాతం సంస్థలు అభిప్రాయపడ్డాయి. మరోవైపు ప్రస్తుతం తమ ఆర్డర్ బుక్ ఖాళీగా ఉందని 80 సంస్ధలు పేర్కొనడం గమనార్హం. ఇక లాక్డౌన్ ముగిసిన తర్వాత తమ వద్ద ఉన్న స్టాక్ ఓ నెల వరకూ మాత్రమే సరిపడా ఉందని 40 శాతం పైగా సంస్ధలు వెల్లడించాయి. చదవండి : కరోనా కలకలం : 24 గంటల్లో 472 కేసులు లాక్డౌన్ సమయంలో సరుకు రవాణాకు ఇబ్బంది ఎదురవుతోందని నిత్యావసర వస్తువుల తయారీ, సరఫరా సంస్ధలు వెల్లడించాయి. నిత్యావసరాల వస్తువులు, ఉత్పత్తుల తయారీ, సరఫరాకు ప్రభుత్వం అనుమతించినా స్ధానిక అధికారులు మాత్రం నిత్యావసరాల సరఫరాలపైనా లాక్డౌన్ అమలు చేస్తున్నారని సీఐఐ ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ మహమ్మారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిశ్రమకు ప్రభుత్వం ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్‌ను ప్రకటించి ఆదుకోవాలని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కోరారు. -
దిగ్గజ బ్యాంకులో 35 వేల ఉద్యోగాల కోత
హాంకాంగ్: ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ భారీ నష్టాల కారణంగా వేలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించింది. గత ఏడాది లాభాలు మూడో వంతు పడిపోవడంతో ఖర్చులకు తగ్గించుకునే పనిలో పడింది. ముఖ్యంగా అమెరికా, ఐరోపాలో 35 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. కోతలు చాలావరకు యూరోపియన్ , అమెరికా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగాలలో ఉండనున్నాయి. అమెరికా-చైనా ట్రేడ్ వార్ కారణంగా అనేక అనిశ్చితులను ఎదుర్కొన్న బ్యాంకు తాజాగా ఉద్యోగాల కోత నిర్ణయం తీసుకుంది. అలాగే బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుండి నిష్క్రమించడం (బ్రెగ్జిట్), కొత్తగా చైనాలో విస్తరించిన కరోనా వైరస్ కోవిడ్-19 కూడా తీవ్ర ప్రభావాన్ని చూపనుందని కంపెనీ తెలిపింది. గత ఏడాది ఆగస్టులో జాన్ ఫ్లింట్కు అనూహ్యంగా ఉద్వాసన పలికిన తర్వాత యాక్టింగ్ సీఈవోగా నోయెల్ క్విన్ బాధ్యతలు స్వీకరించారు. 50కి పైగా దేశాలకు విస్తరించి ఉన్న హెచ్ఎస్బీసీని ఆసియాలో లాభాల బాట పట్టించి, విశాలమైన అంతర్జాతీయ బ్యాంకును మార్చే వ్యూహంలో ఉన్నారు. అయితే తమ వ్యాపారం ఆశించిన రాబడిని ఇవ్వడంలేదనీ, ఈ నేపథ్యంలోనే పెట్టుబడిదారులకు రాబడిని పెంచేలా కొత్త ప్రణాళికను రూపొందిస్తున్నామని క్విన్ చెప్పారు. ఖర్చులు తగ్గించడంతోపాటు, తమ సంక్షిష్ట సంస్థాగత నిర్మాణాన్ని సరళీకృతం చేయనున్నామని పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో గ్లోబల్ హెడ్‌కౌంట్‌ను 235,000 నుండి 200,000 కు తగ్గించనున్నట్లు వెల్లడించారని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ తెలిపింది. అమెరికాలో బ్యాంక్ తన బ్రాంచ్ నెట్‌వర్క్‌ను సుమారు 30 శాతం తగ్గించాలని, బ్యాక్ ,మిడిల్ ఆఫీస్ కార్యకలాపాలను ఏకీకృతం చేయాలని, నిర్వహణ ఖర్చులను 10-15 శాతం తగ్గించాలని యోచిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. మెక్సికన్ మనీలాండరింగ్ కుంభకోణంలో చిక్కుకున్న హెచ్ఎస్బిసి 2012నుండి కీలక పునర్నిర్మాణ ప్రణాళికలను చేపట్టింది. 2022 నాటికి 4.5 బిలియన్ డాలర్ల వ్యయ కోతలను లక్ష్యంగా పెట్టుకున్నామని, పునర్నిర్మాణ వ్యయాలు 6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని బ్యాంక్ ఒక తెలిపింది. చైనాలో ఘోరమైన కరోనావైరస్ వ్యాప్తి 2020 లో ఆసియాలో వృద్ధి అంచనాలను తగ్గించిందని హెచ్ఎస్బీసీ పేర్కొంది. దీంతో హాంకాంగ్‌లో హెచ్ఎస్బీసీ షేర్లు 2.2 శాతం పడిపోయాయి. -
బాష్‌లో 2000 ఉద్యోగాలు స్మాష్..
న్యూఢిల్లీ : ప్రపంచంలో అతిపెద్ద ఆటో విడిభాగాల సప్లయర్ బాష్ తన భారత్ యూనిట్లో పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించనుంది. ఆటోమొబైల్ అమ్మకాలు పడిపోవడంతో ఇండియన్ యూనిట్లో 2000 మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు సన్నద్ధమైంది. రానున్న నాలుగేళ్లలో రెండు వేల మంది ఉద్యోగులను తొలగిస్తామని బాష్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ర భట్టాచార్య వెల్లడించారు. ఉద్యోగాలు కోల్పోయే వారిలో బ్లూ, వైట్ కాలర్ సిబ్బంది ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. ఆటోమొబైల్ పరిశ్రమ అంతటా చోటుచేసుకుంటున్న మార్పుల్లో ఇది ఓ భాగమని అన్నారు. మార్పులకు అనుగుణంగా కంపెనీని మలచేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కాగా, ఆటోమొబైల్ విక్రయాలు ఊపందుకునేందుకు రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుందని బాష్ అంచనా వేస్తోంది. -
కాగ్నిజెంట్ నిర్ణయంతో టెకీలకు షాక్..
బెంగళూర్ : ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోతకు దిగుతుండటంతో రానున్న నెలల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఊపందుకోనుంది. ప్రాజెక్టులు లేని ఉద్యోగుల బెంచ్ టైమ్ గరిష్ట పరిమితిని ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తగ్గించడం ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. బిల్లింగ్ ప్రాజెక్టులపై లేని ఉద్యోగుల బెంచ్ టైమ్‌ను 60 రోజుల నుంచి 35 రోజులకు కాగ్నిజెంట్ తగ్గించింది. 35 రోజుల తర్వాత బెంచ్‌పై ఉన్న ఉద్యోగులను కంపెనీ సాగనంపుతుంది. ఈ ప్రక్రియ 60 నుంచి మూడు నెలల లోపు పూర్తవుతుంది. గతంలో బెంచ్‌పై ఉన్న ఉద్యోగులకు తమ బిజినెస్ యూనిట్లలో లేదా ఇతర ప్రాజెక్టుల్లో అవకాశం పొందేందుకు అధిక గ్రేస్ టైమ్‌ను కంపెనీ కల్పించేది. ఇతర నగరాలకు వెళ్లేందుకు ఇష్టపడని ఉద్యోగులు, ఇతర డొమైన్లను ఎంచుకోని వారు మాత్రమే కంపెనీని వీడాల్సివచ్చేది. బెంచ్‌పై ఉన్న ఉద్యోగులకు పలు అవకాశాలు ఇవ్వకుండా నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకునే నైపుణ్యాలను వారు విధిగా మెరుగుపరుచుకునేలా ఒత్తిడి పెంచేందుకే కాగ్నిజెంట్ నూతన బెంచ్ విధానాన్ని అనుసరిస్తున్నట్టు భావిస్తున్నారు. సంవత్సరాల తరబడి రెండంకెల వృద్ధిని నమోదు చేసిన కాగ్నిజెంట్ వృద్ధి రేటు ఇటీవల పడిపోవడంతో తిరిగి మెరుగైన వృద్ధిని సాధించేందుకు పలు చర్యలు చేపడుతోంది. మారుతున్న క్లయింట్ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులు నైపుణ్యాలను సంతరిచుకునేలా కసరత్తు చేపట్టింది. -
3 వేల ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ కూడా ఉద్యోగాలను తీసివేసే పనిలో పడింది. సంస్థ పునర్నిర్మాణంతోపాటు, ఖర్చులను తగ్గించే ప్రణాళికల్లో భాగంగా యూరోపియన్ యూనిట్లలో భారీగా ఉద్యోగులను తొలగించనుంది. బలహీన డిమాండ్, అధిక వ్యయాలతో కుస్తీలు పడుతున్న సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. టాటా యూరోపియన్ వ్యాపారంలో ఉద్యోగ కోతలను ప్రకటించబోతున్నట్లు యూరోపియన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెన్రిక్ ఆడమ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీన్ని ధృవీకరించిన టాటా స్టీల్ తీవ్రమైన మార్కెట్ ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని, కార్బన్-న్యూట్రల్ స్టీల్ మేకింగ్ వైపు ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ఈ మార్పులు అవసరమని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. సుమారు 3 వేలమందికి పైగా ఉద్యోగాలకు ఉద్వాసన పలకనుంది. ఐరోపాలో ఉక్కు తయారీ అంతర్జాతీయ పోటీ, అధిక ఇంధన వ్యయాల ఒత్తిడి నేపథ్యంలో భారీ వేతనాలు అందుకుంటున్న ఉద్యోగులకు ముప్పు పొంచి ఉందని భావిస్తున్నారు. మొత్తం తాజా కోతలో మూడింట రెండు వంతుల మంది వైట్ కాలర్ ఉద్యోగాలంటాయని అంచనా. యూరోపియన్ వ్యాపారంలో మొత్తం 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
టెకీలకు షాక్ : 40,000 ఉద్యోగాల కోత..
బెంగళూర్ : ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఈ ఏడాది 30,000 నుంచి 40,000 మంది మధ్యశ్రేణి ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఐటీ పరిశ్రమ ప్రముఖులు, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ టీవీ మోహన్‌దాస్ పాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలో మార్పుల పరంగా ప్రతి ఐదేళ్లలో ఒకసారి ఇలాంటివి సాధారణమేనని చెప్పుకొచ్చారు. పరిశ్రమ ఎదుగుతున్న క్రమంలో మధ్యశ్రేణి ఉద్యోగులు తమ వేతనానికి తగిన స్ధాయిలో కంపెనీకి విలువను జోడించలేరని వ్యాఖ్యానించారు. కంపెనీలు వేగంగా ఎదుగుతుంటే ప్రమోషన్లు వస్తాయని, స్లోడౌన్ వంటి ప్రతికూల పరిస్ధితుల్లో కంపెనీలు సహజంగానే అధిక వేతనాలు అందుకునే ఉద్యోగులపైనే తొలుత దృష్టిసారిస్తాయని చెప్పుకొచ్చారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి అత్యంత సహజంగా ఇలా జరుగుతూనే ఉంటుందని అన్నారు. మెరుగైన సామర్థ్యం కనబరిచేవరకే ఎవరైనా అధిక వేతనం పొందేందుకు అర్హులని, తీసుకునే వేతనానికి సమాన స్ధాయిలో కంపెనీకి విలువ జోడించాలని పాయ్ స్పష్టం చేశారు. ఐటీ పరిశ్రమలో ఈ ఏడాది భారత్‌లో 30,000 నుంచి 40,000 మంది మధ్యస్ధాయి ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతారని ఆయన అంచనా వేశారు. వీరిలో 80 శాతం మందికి తగిన నైపుణ్యాలు ఉంటే ఇతర పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. -
టెకీలను వెంటాడుతున్న లేఆఫ్స్..
న్యూఢిల్లీ : ఆర్థిక మందగడనం నేపథ్యంలో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఐటీ కంపెనీలు మధ్య, సీనియర్ ఐటీ ఉద్యోగుల్లో 5 నుంచి 8 శాతం మందిని తొలగించాలని యోచిస్తున్నాయి. రానున్న త్రైమాసికాల్లో దిగ్గజ ఐటీ కంపెనీలు దాదాపు 10,000 నుంచి 20,000 మంది ఐటీ ఉద్యోగులపై వేటు వేయవచ్చని బిజినెస్ స్టాండర్డ్ అంచనా వేసింది. మార్జిన్ల నిర్వహణ, అమెరికాలో నియామకాలు ఊపందుకోవడం, నూతన టెక్నాలజీల రాక వంటి అంశాలు టెకీల తొలగింపునకు దారితీశాయని ఆ కథనం పేర్కొంది. రూ 20 లక్షల నుంచి రూ 40 లక్షల వార్షిక వేతనం అందుకునే ప్రాజెక్టు మేనేజర్లకు ఉద్యోగాలు కోల్పోయే ముప్పు అధికమని నిపుణులు పేర్కొంటున్నారు. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి టాప్ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగుల కోతపై తమ ఉద్దేశాలను విస్పష్టంగా వెల్లడించిన క్రమంలో ఇతర కంపెనీలూ ఇదే బాట పట్టనున్నాయి. కాగ్నిజెంట్ 12,000 మంది ఉద్యోగులను ఇంటిబాట పట్టిస్తుండగా, ఇన్ఫోసిస్ 10,000 మంది ఉద్యోగులను సాగనంపనుందనే వార్తలు వెలువడ్డాయి. ఉద్యోగుల సామర్థ్యం, వార్షిక సమీక్షలో భాగంగా ఉద్యోగుల తొలగింపు సాధారణమేనని ఆయా కంపెనీలు చెబుతున్నాయి. -
ఇన్ఫోసిస్‌లో కొలువుల కోత..
బెంగళూర్ : కాగ్నిజెంట్ బాటలో దేశీ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సైతం ఉద్యోగాల్లో కోత విధించనుంది. పెద్దసంఖ్యలో ఎగువ శ్రేణి ఉద్యోగులను ఇంటికి పంపాలని యోచిస్తోంది. దాదాపు 2200 మంది సీనియర్ మేనేజర్లను సాగనంపాలని కంపెనీ నిర్ణయించినట్టు సమాచారం. జూనియర్, మిడిల్ లెవెల్ అసోసియేట్లను సైతం 2 నుంచి 5 శాతం వరకూ తొలగించవచ్చని ఓ ఆంగ్ల దినపత్రిక కథనం వెల్లడించింది. మరోవైపు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ వంటి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల్లో 50 మంది వరకూ ఉద్యోగాల నుంచి తప్పుకోవాలని కోరనుందని సమాచారం. గతంలో సామర్ధ్యం ఆధారంగా ఉద్యోగులను తొలగించే ఇన్ఫోసిస్ ఈసారి భారీ సంఖ్యలో సిబ్బందిపై వేటు వేయడం అసాధారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఆటోమేషన్ రాకతో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించే ధోరణి పెరిగిందని హెచ్ఆర్ నిపుణులు చెబుతున్నారు. -
కూలుతున్న కొలువులు..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం పలు రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అక్టోబర్‌లో భారత్‌లో నిరుద్యోగ రేటు మూడేళ్ల గరిష్ట స్ధాయిలో 8.5 శాతానికి ఎగబాకిందని తాజా సర్వే బాంబు పేల్చింది. అక్టోబర్‌లో నమోదైన నిరుద్యోగ రేటు ఆగస్ట్ 2016 నుంచి ఇదే అత్యధికమని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించిన నివేదిక పేర్కొంది. డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం పలు చర్యలు ప్రకటిస్తున్నా ఉద్యోగాలు తగ్గిపోవడం దేశ ఆర్థిక వృద్ధిపై స్లోడౌన్ ప్రభావమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సెప్టెంబర్‌లో దేశ మౌలిక ఉత్పాదన గత ఏడాది ఇదే మాసంతో పోలిస్తే 5.2 శాతం మేర పతనమవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఎనిమిది కోర్ ఇండస్ర్టీస్‌లో ఏడింటిలో ఉత్పత్తి తగ్గడం మందగమన ప్రభావంపై గుబులు రేపుతోంది. మరోవైపు 2011-12 నుంచి 2017-18 మధ్య భారత ఉపాథి రంగంలో గణనీయమైన తగ్గుదల చోటుచేసుకుందని సెంటర్ ఆప్ సస్టెయినబుల్ ఎంప్లాయ్మెంట్ విడుదల చేసిన పరిశోధనా పత్రం పేర్కొంది. పైన ఉదహరించిన కాలంలో దేశంలో మొత్తం ఉపాధి 90 లక్షల మేర పడిపోయిందని, దేశ చరిత్రలో ఈస్ధాయిలో ఉద్యోగాలు తగ్గుముఖ పట్టం ఇదే తొలిసారని పరిశోధనా పత్రాన్ని రూపొందించిన సంతోష్ మల్హోత్రా, జయతి కె పరిద ఆందోళన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగంలోనే ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పట్టాయని, దినసరి కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య పడిపోయిందని వివరించారు. -
7 వేల సీనియర్ ఉద్యోగులపై కాగ్నిజెంట్ వేటు
సాక్షి, బెంగళూరు: ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయమనుంది. రాబోయే కొద్ది త్రైమాసికాల్లో 7వేల ఉద్యోగాలను తగ్గించుకోనుంది. కంటెంట్ మోడరేషన్ వ్యాపారం నుండి నిష్క్రమించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే క్లౌడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి వృద్ధి రంగాలలో పెట్టుబడులు పెట్టడం తో సహా, కొన్ని వ్యూహాత్మక పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మరింత మంది ఉద్యోగులను తగ్గించుకోనుంది. ఇది మరో 6000 మంది ఉద్యోగులను ప్రభావితం చేయనుందని కంపెనీ తెలిపింది. కంటెంట్ మోడరేషన్ వ్యాపారంలో కొన్ని భాగాల నుండి నిష్క్రమించడం రాబోయే సంవత్సరంలో ఆర్థిక పనితీరును దెబ్బతీస్తుందని కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రియాన్ హంఫ్రీస్ చెప్పారు. న్యూజెర్సీ ప్రధాన కార్యాలయంలో విశ్లేషకులతో పోస్ట్-ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలను వెల్లడించారు. 10,000-12,000 మధ్య సీనియర్ ఉద్యోగులను వారి ప్రస్తుత పాత్రల నుండి తొలగించనున్నామని వెల్లడించారు. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 2 శాతమని కంపెనీ అధికారులు తెలిపారు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు కంటెంట్ రివ్యూ కాంట్రాక్టర్‌గా ఉన్న కాగ్నిజెంట్ తన కంటెంట్ మోడరేషన్ వ్యాపారం నుండి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించింది. ఈ చర్య సంస్థ కొత్త వ్యూహాన్ని ప్రతిబింబిస్తుందనీ, అయితే కంటెంట్ మోడరేషన్ నుండి పూర్తిగా నిష్క్రమించలేదని సంస్థ ప్రతినిధి చెప్పారు. -
పార్లేలో 10 వేల ఉద్యోగాలకు ఎసరు
ముంబై: అమ్మకాలు పడిపోతుండటంతో వివిధ రంగాల సంస్థలు ఉత్పత్తిని తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా బిస్కెట్ల తయారీ సంస్థ పార్లే కూడా ఈ జాబితాలో చేరనుంది. స్థూల ఆర్థిక పరిస్థితులు ఆశావహంగా లేకపోవడంతో వచ్చే ఏడాది కాలంలో సుమారు 10,000 మంది దాకా ఉద్యోగులను తొలగించాల్సి రావొచ్చని పార్లే ప్రోడక్ట్స్ విభాగం హెడ్ మయాంక్ షా తెలిపారు. సామాన్యుల కోసం ఉద్దేశించిన చౌక ఉత్పత్తులపై కూడా అధిక స్థాయిలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధింపు, డిమాండ్ మందగమనం వంటి అంశాలు ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. పార్లేకు సొంతంగా 10 తయారీ యూనిట్లు ఉండగా, థర్డ్ పార్టీ తయారీ సంస్థలు 125 దాకా ఉన్నాయి. బిస్కెట్ తయారీతో పాటు ఇతర వ్యాపార విభాగాల్లో పార్లేలో ప్రస్తుతం లక్ష మంది పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ‘ఇప్పటికైతే ఉద్యోగులెవరినీ తొలగించలేదు. కానీ పరిస్థితులు మెరుగుపడకపోతే ఈ చర్యలు తీసుకోవాల్సి రావొచ్చు’ అని మయాంక్ షా చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారీ విక్రయ పరిమాణం ఉండే చౌక ఉత్పత్తుల అమ్మకాలు 7–8 శాతం పడిపోగా, తక్కువ విక్రయ పరిమాణం.. అధిక ధర ఉండే ఉత్పత్తుల అమ్మకాలు 8–9 శాతం పెరిగాయని ఆయన తెలిపారు. మొత్తం మీద బిస్కెట్ల విభాగం అమ్మకాల వృద్ధి గతంలో రెండంకెల స్థాయిలో ఉండేదని.. ప్రస్తుతం 2.5 శాతానికి పడిపోయిందని షా పేర్కొన్నారు. చౌక ఉత్పత్తుల విభాగం మొత్తం బిస్కెట్ల వ్యాపారంలో నాలుగో వంతే ఉన్నప్పటికీ.. అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయాల్సినందున ఇందులో ఎక్కువ మంది సిబ్బంది ఉంటారని షా చెప్పారు. గతంలో కేజీకి రూ. 100 లోపు ధర ఉండే బిస్కెట్లకు ఎక్సైజ్ సుంకం నుంచి మినహాయింపు ఉండేదని ఆయన తెలిపారు. అయితే, 2017లో బిస్కెట్లను కూడా 18 శాతం జీఎస్టీ శ్లాబులో చేర్చినప్పట్నుంచీ పరిశ్రమకు సమస్యలు ప్రారంభమయ్యాయని షా చెప్పారు. అధిక జీఎస్టీ కారణంగా చౌక ఉత్పత్తుల రేట్లను కూడా తాము పెంచాల్సి వచ్చిందని, దీంతో డిమాండ్ పడిపోయిందని ఆయన తెలిపారు. జీఎస్‌టీపరమైన సమస్యలు సరిదిద్దాలంటూ పరిశ్రమ కోరుతున్నప్పటికీ .. ఇప్పటి వరకూ కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు. అయితే, ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
బండి కాదు..మొండి ఇది..!
సాక్షి, బిజినెస్ విభాగం: వాహన విక్రయాలు నానాటికి తగ్గిపోతుండటంతో ఆటోమొబైల్ రంగం తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో కూరుకుపోతోంది. జూలైలో అమ్మకాలు దాదాపు రెండు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో వాహన తయారీ సంస్థలు ఉత్పత్తిని తగ్గించేసుకుంటున్నాయి. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్యలో దేశీ ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి 13.18% తగ్గిపోయింది. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, ఫోర్డ్, టొయోటా, హోండా వంటి దిగ్గజాలన్నీ భారీగా ఉత్పత్తి తగ్గించుకుంటున్నాయి. హ్యుందాయ్, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా మాత్రమే ఉత్పత్తిని కాస్త పెంచుకున్నాయి. ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం గతేడాది ఏప్రిల్–జూలై మధ్య కాలంలో ద్విచక్ర వాహనాల ఉత్పత్తి 87,13,476 యూనిట్లుగా ఉండగా.. ఈ ఏడాది అదే వ్యవధిలో సుమారు 10% పడిపోయి 78,45,675గా నమోదైంది. ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి 13,97,404 యూనిట్ల నుంచి 13% క్షీణతతో 12,13,281 యూనిట్లకు పడిపోయింది. ఈ పరిణామాలతో ఏప్రిల్ నుంచి చూస్తే ఇప్పటిదాకా ఆటోమొబైల్ రంగంలో (వాహన తయారీ సంస్థలు, విడిభాగాల తయారీ సంస్థలు, డీలర్లు మొదలైన వర్గాలు) ఇప్పటిదాకా 3.5 లక్షల ఉద్యోగాల్లో కోత పడినట్లు అంచనా. తమ పరిధిలో 15,000 మంది దాకా ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని, వందలకొద్దీ డీలర్‌షిప్‌లు మూతబడటంతో వేలమంది ఉపాధి కోల్పోయారని సియామ్ స్వయంగా వెల్లడించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో.. ఇకపై తాత్కాలిక ఉద్యోగులు, సేల్స్.. మార్కెటింగ్ విభాగంలో సర్వీసులు అందించే వారు, పరిశోధన అభివృద్ధి (ఆర్ అండ్ డీ) విభాగాల్లో ఉద్యోగులపై ప్రతికూల ప్రభావాలు మరింతగా ఉండనున్నాయని మానవ వనరుల (హెచ్ఆర్) సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇదే ధోరణి.. అంతర్జాతీయంగా కూడా ఆటోమొబైల్ రంగంలో మందగమన ధోరణులే నెలకొన్నాయని, దీనికి భారత్ మినహాయింపేమీ కాదని సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ సీఈవో ఆదిత్య నారాయణ్ మిశ్రా తెలిపారు. దీంతో కంపెనీలు వ్యయాలు తగ్గించుకోవడానికి తమ పరిధిలో తీసుకోగలిగిన చర్యలన్నీ తీసుకుంటున్నాయన్నారు. ఇందులో భాగంగానే ఉత్పత్తి తగ్గించుకోవడం, తాత్కాలికంగా ప్లాంట్లు మూసివేయడం వంటివి చేస్తున్నాయని మిశ్రా చెప్పారు. మందగమనం ఇలాగే కొనసాగితే రోజువారీ కార్యకలాపాలకు అంతగా ముఖ్యం కాకపోయినా అధిక వేతనాలు అందుకునే వారిని తొలగించడంపై కూడా కంపెనీలు దృష్టి పెట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ‘తయారీ విభాగంపైనే ఎక్కువగా ప్రభావం ఉంటుంది. కంపెనీలు ఉత్పత్తిని తగ్గించడం వల్ల ముఖ్యంగా తాత్కాలిక సిబ్బందిపై ప్రభావం పడుతుంది. ఆ తర్వాత పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల విభాగంలో మధ్య స్థాయి నుంచి సీనియర్ స్థాయి ఉద్యోగాల్లో కూడా కోత పడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి‘ అని మిశ్రా చెప్పారు. పర్మనెంటు ఉద్యోగులను తొలగించడం అన్నది ఆఖర్న మాత్రమే జరగొచ్చని.. అయితే మందగమన ప్రభావాలు మరింత తీవ్రమైతే ఆయా ఉద్యోగుల బోనస్‌లు, ఇంక్రిమెంట్లు మొదలైన వాటిల్లో కోత పడొచ్చని తెలిపారు. మరోవైపు, సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాల్లోని సర్వీస్ సిబ్బందిపై ఎక్కువగా ప్రభావం పడుతుందని టీమ్‌లీజ్ సర్వీసెస్ సంస్థ బిజినెస్ హెడ్ మునీరా లోలివాలా అభిప్రాయపడ్డారు. ‘వచ్చే కొద్ది నెలల్లో మందగమనానికి అడ్డుకట్ట పడగలదని ఆశిస్తున్నాం. అయితే సేల్స్, ఆర్అండ్డీ విభాగాల్లోని ఉద్యోగాల్లో కొంత మేర కోత పడే అవకాశాలు ఉన్నాయి. ఇక డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు మొదలైన వారి స్థాయిల్లోనూ ఉద్యోగాల్లో కోత ఉంటుంది. పడిపోతున్న వాహన విక్రయాల కారణంగా పరికరాల తయారీ పరిశ్రమపైనా ప్రభావం తప్పదు‘ అని ఆమె చెప్పారు. మరో 10 లక్షలకు పైగా కొలువులకు గండం.. దేశీ ఆటోమొబైల్ రంగంలో దాదాపు 3.5 కోట్ల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. కానీ, గడిచిన ఏడాదిన్నర కాలంగా ఎలక్ట్రిక్ వాహనాలు తదితర అంశాలపై కేంద్రం పలు నిర్ణయాలు ప్రకటిస్తుండటం వల్ల విధానాల్లో స్పష్టత లోపించడంతో ఈ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇక రుణాల లభ్యత కూడా అంతంతమాత్రంగానే ఉండటం, వాహనాలకు డిమాండ్ పడిపోవడం ఆటోమొబైల్ రంగాన్ని మరింతగా కుంగదీస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆటోమొబైల్ రంగంలో ఏకంగా 10 లక్షల దాకా ఉద్యోగాల్లో కోత పడే అవకాశం ఉందంటూ ఆటోమోటివ్ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) గత నెలలోనే హెచ్చరించింది. ప్రభుత్వ మద్దతు కావాలి.. ఆటోరంగంలో పెను మా ర్పుల కారణంగా ఈ పరిస్థితులు తలెత్తాయని మైఖేల్ పేజ్ ఇండియా రీజనల్ డైరెక్టర్ మోహిత్ భారతి వ్యాఖ్యానించారు. ‘ఇదే ధోరణి మరికొంత కాలం సాగిందంటే ఆటో పరికరాల సంస్థలు, అనుబంధ సంస్థల్లోనూ ఉద్యోగాల్లో కోత తప్పకపోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గానీ తక్షణం జోక్యం చేసుకోకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటో రంగానికి పరిస్థితులు ఆశావహంగానైతే కనిపించడం లేదు‘ అని మోహిత్ పేర్కొన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని తగ్గించాలని, రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ప్రతిపాదనలను కొంత కాలం వాయిదా వేయడం ద్వారా పరిశ్రమ కోలుకునేందుకు కాస్త వెసులుబాటు కల్పించాంటూ ఆటో రంగ సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కారు.. బైక్ రివర్స్ గేర్..! -
10 లక్షల ఉద్యోగాలకు ఎసరు..
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమలో మందగమనం మరింత కాలం కొనసాగితే 10 లక్షల పైచిలుకు ఉద్యోగాలకు కోత పడే ముప్పు పొంచి ఉందని ఆటోమోటివ్ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో డిమాండ్‌ను పెంచే దిశగా జీఎస్టీ రేటు తగ్గింపు తదితర చర్యలతో ఆటోమొబైల్ రంగం కోలుకునేందుకు తోడ్పాటు అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. గత పది నెలలుగా అమ్మకాలు క్షీణిస్తూనే ఉండటంతో ఆటోమొబైల్ పరిశ్రమ సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోందని పేర్కొంది. ‘గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని విభాగాల వాహనాల విక్రయాలు చాలా నెలలుగా పడిపోతున్నాయి. దీంతో పరికరాల తయారీ విభాగంపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. వాహనాల రంగంపైనే పరికరాల తయారీ విభాగం కూడా ఆధారపడి ఉంటుంది. వాహనాల తయారీ 15–20 శాతం పడిపోవడంతో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సిబ్బందిని తొలగించక తప్పదు. కనీసం 10 లక్షల మంది పైగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని అంచనా‘ అని ఏసీఎంఏ అధ్యక్షుడు రామ్ వెంకటరమణి పేర్కొన్నారు. ఇప్పటికే ఉద్వాసనలు మొదలయ్యాయని చెప్పారు. పరికరాల తయారీ రంగంలో దాదాపు 70 శాతం మంది కాంట్రాక్టు వర్కర్లే ఉంటారని, డిమాండ్ లేకపోతే సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ స్థూల దేశీయోత్పత్తిలో 2.3 శాతం వాటాతో ఆటోమోటివ్ పరికరాల తయారీ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. జీఎస్టీ రేటు తగ్గించాలి.. డిమాండ్ లేకపోవడం, బీఎస్ సిక్స్ స్థాయి ఉద్గార ప్రమాణాల వాహనాల తయారీపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సి రావడం, విద్యుత్ వాహనాల విధానంపై స్పష్టత కొరవడటం తదితర అంశాలు ఆటోమొబైల్ పరిశ్రమ భవిష్యత్‌కు ప్రశ్నార్థకంగా మారాయని రామ్ చెప్పారు. దీంతో భవిష్యత్ పెట్టుబడులన్నీ నిల్చిపోయాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డిమాండ్‌కి ఎంతో కొంత ఊతమిచ్చేలా జీఎస్టీ రేటు తగ్గించాలని పేర్కొన్నారు. ఆటోమొబైల్, ఆటో పరికరాలన్నింటికీ ఒకే రకంగా 18 శాతం జీఎస్టీ రేటు పరిధిలోకే చేర్చాలని కోరారు. ప్రస్తుతం దాదాపు 70 శాతం ఆటో పరికరాలు 18 శాతం జీఎస్టీ శ్లాబ్‌లోనే ఉన్నప్పటికీ.. మిగతా 30 శాతం మాత్రం గరిష్ట శ్లాబ్ అయిన 28 శాతం విభాగంలో ఉన్నాయి. పైగా వాహనాల పొడవు, ఇంజిన్ సామర్థ్యం తదితర అంశాలను బట్టి 28 శాతం జీఎస్టీకి అదనంగా 1–15 శాతం దాకా అదనపు సెస్సు భారం కూడా ఉంటోందని రామ్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల విధానంపై కేంద్రం స్పష్టతనివ్వాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు మళ్లే క్రమంలో నీతి ఆయోగ్ నిర్దేశించిన లక్ష్యాలు.. ఆటో పరిశ్రమను ఆందోళనకు గురి చేసేవిగా ఉన్నాయని ఏసీఎంఏ డైరెక్టర్ జనరల్ విన్నీ మెహతా చెప్పారు. 2018–19లో ఆటో పరికరాల వ్యాపార విభాగం 14.5 శాతం వృద్ధితో రూ. 3.95 లక్షల కోట్లుగా ఉందని తెలిపారు. చైనాకు అవకాశాలు ఇవ్వొద్దు స్వేచ్చా వాణిజ్యానికి సంబంధించిన ప్రతిపాదిత ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్సెప్)లో ఆటో పరికరాలను చేర్చకుండా ఉండటం మంచిదని మెహతా తెలిపారు. అలా చేస్తే భారత మార్కెట్లో చైనా దొడ్డిదారిన ప్రవేశించేందుకు అవకాశం కల్పించినట్లవుతుందన్నారు. ఇప్పటికే చైనా నుంచే భారత్ అత్యధికంగా పరికరాలు దిగుమతి చేసుకుంటోందని మెహతా వివరించారు. 2018–19లో చైనా నుంచి దిగుమతులు 4.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయని, మొత్తం ఆటోమోటివ్ పరికరాల దిగుమతుల్లో ఇది 27 శాతమని తెలిపారు. చైనాతో పాటు జపాన్, కొరియా వంటి దేశాలతో కూడా భారత వాణిజ్యం లోటులోనే ఉందని చెప్పారు. -
10 వేల ఉద్యోగాలకు ఎసరు
టోక్యో: జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ నిస్సాన్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించే యోచనలో ఉంది. ఆర్థిక సంక్షోభం, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో గ్లోబల్‌గా 4వేల 800 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాలని నిర్ణయించిన కంపెనీ తాజాగా ఈ సంఖ్యను రెట్టింపు చేసిందట. కంపెనీ వర్గాలను ఉటంకిస్తూ జపాన్ మీడియా బుధవారం అందించిన సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 10వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాలని భావిస్తోంది. అమెరికా, ఐరోపాలో అమ్మకాలు పడిపోవడంతో ఈ సంస్థ దెబ్బతినడంతోపాటు, ఆర్థిక కుంభకోణం ఆరోపణలపై మాజీ బాస్ కార్లోస్ ఘోస్న్ అరెస్ట్ తరువాత నిస్సాన్ మరింత కుదేలైంది. అలాగే 43 శాతం వాటా ఉన్న ఫ్రెంచ్ భాగస్వామి రెనాల్ట్‌తో వివాదం ముదిరి సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీ ఉద్యోగుల్లో లక్షా 39వేల ఉద్యోగాల్లో 4,800 ఉద్యోగాల కోత పెట్టనున్నామని కంపెనీ మేలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజా కథనాలపై వ్యాఖ్యానించేందుకు నిస్సాన్ ప్రతినిధి నిరాకరించారు. కాగా నిస్సాన్ లాభాలు గత ఏడాది దశాబ్దం కనిష్టానికి పడిపోయింది. అలాగే భవిషత్తు మరింత కష్టంగా ఉండనుందని కూడా వ్యాఖ్యానించింది. 2019 మార్చి లో 319 బిలియన్ యెన్ల (2.9 బిలియన్ డాలర్లు) నికర లాభాలను నివేదించింది. మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 57 శాతం క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి లాభాలు 170 బిలియన్లకు పడిపోవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మొదటి త్రైమాసిక ఫలితాలను గురువారం ప్రకటించనుంది. -
సీమెన్స్ : భారీ ఉద్యోగాల కోత
జర్మనీకి పారిశ్రామిక దిగ్గజం సీమెన్స్ షాకింగ్ న్యూస్ చెప్పింది. తన గ్యాస్ అండ్ పవర్ యూనిట్లో ప్రపంచవ్యాప్తంగా 2,700 ఉద్యోగాల కోత పెడుతున్నట్టు వెల్లడించింది. ఇందులో స్వదేశంలో 14వందల మంది ఉన్నట్టు వెల్లడించింది. ఖర్చులను తగ్గించుకునే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. తద్వారా 2020 నాటికి 560 మిలియన్ డాలర్లును పొదుపు చేయాలని సంస్థ భావిస్తోంది. ఇప్పటికే 7వేల ఉద్యోగులను తీసివేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించినట్టు తెలిపింది. అయితే ఉద్యోగులకు చెల్లించాల్సిన ప్యాకేజీలకు సంబంధించి ఆయా ఉద్యోగ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పేర్కొంది. సామాజికంగా బాధ్యతగా ప్రణాళిక బద్దంగా వ్యవహరిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 80 దేశాలలో 64,000 మంది ఉద్యోగులలో కార్యకలాపాలనునిర్వహిస్తున్న సంస్థ 2018 ఏడాదిలో 12.4 బిలియన్ యూరోల అమ్మకాలతో 377 మిలియన్ యూరోల లాభాలను నమోదుచేసింది. అయితే ప్రపంచ శిలాజ ఇంధనాల నుండి పునరుత్పాదక శక్తికి మారిన ఫలితంగా విద్యుత్ ప్లాంట్ పరికరాల డిమాండ్ క్షీణించి సంవత్సర సంవత్సరానికి లాభదాయకత క్రమేపీ తగ్గుతూ వస్తోంది. -
హెచ్‌టీసీలో ఉద్యోగాల కోత!
తైపీ: తైవాన్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీ ‘హెచ్‌టీసీ’ తాజాగా ఉద్యోగులను ఇంటికి సాగనంపడానికి రెడీ అవుతోంది. 1,500 మందిని తీసివేస్తామని ప్రకటించింది. కంపెనీ భారీ నష్టాలు దీనికి ప్రధాన కారణం. గూగుల్‌తో కొత్త డీల్ నేపథ్యంలో ఉద్యోగాల కోత ప్రకటన వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఒక వెలుగు వెలిగిన హెచ్‌టీసీ.. ప్రస్తుతం యాపిల్, శాంసంగ్ సహా హువావే వంటి ఇతర చైనా బ్రాండ్ల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటోంది. ఇక ఉద్యోగాల తొలగింపు నిర్ణయం సెప్టెంబర్ చివరి నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ పేర్కొంది. -
టెకీలకు టీసీఎస్ గుడ్‌న్యూస్
దావోస్ : ఆటోమేషన్, కృత్రిమ మేథ (ఏఐ) వల్ల ఉద్యోగాలు కోల్పోతామనడం అవాస్తవమని టీసీఎస్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. వ్యాపారాలు పెరిగేందుకు ఆటోమేషన్, ఏఐ ఉపకరిస్తాయని..వీటితో ఉద్యోగాలకు ప్రమాదం ఉండబోదని టీసీఎస్ సీఓఓ ఎన్ గణపతి సుబ్రమణియన్ చెప్పారు. నూతన టెక్నాలజీలతో భారీగా ఉద్యోగాలు నష్టపోతామనే భయాందోళనలు అసమంజసమని తోసిపుచ్చారు. అయితే మారతున్న టెక్నాలజీలకు దీటుగా సిబ్బంది నైపుణ్యాలకు పదును పెట్టడం మాత్రం ఆయా సంస్థల బాధ్యతని గుర్తుచేశారు. ఐటీ పరిశ్రమ ప్రతి ఐదేళ్లకూ మార్పులకు లోనవుతుందని..అందుకు అనుగుణంగా ఉద్యోగులు పనితీరును అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. సాంకేతిక విజ్ఞానాన్ని శిక్షణ ద్వారా అందిపుచ్చుకోవాలని సూచించారు. ఐటీ పరిశ్రమలో ఆటోమేషన్, ఏఐల రాకతో ఉద్యోగాల కోత ఉండే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ పోటీకి దీటుగా ఎదిగే యువతకు ఉద్యోగాల విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. సవాళ్లకు ఎదురీదే తత్వం భారత యువతకు పుష్కలంగా ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
టాటాలో సంచలనం: భారీగా ఉద్యోగాల కోత
టాటా మోటార్స్ లో భారీ సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద పునర్ నిర్మాణ ప్రక్రియను టాటా మోటార్స్ చేపట్టింది. ఈ పునర్ నిర్మాణ చర్యలతో దాదాపు 1200-1300 మంది ఉద్యోగులను వివిధ ప్రాంతాలకు కేటాయిస్తున్నారు. అంతేకాక వేరే యూనిట్లకు తరలి వెళ్లాలని లేదంటే కంపెనీ విడిచిపెట్టాలని ఉద్యోగులకు నిర్మోహమాటంగా టాటా మోటార్స్ యాజమాన్యం చెప్పేస్తోంది. ఇప్పటికే 2500 పొజిషన్లను కంపెనీ తీసివేసింది. కంపెనీ తొలగించిన వీరిలో ఎక్కువగా కిందిస్థాయి వారే ఉన్నారని తెలిసింది. టాటా మోటార్స్ లో ఈ పునర్ నిర్మాణ చర్యలు చేపట్టకపోతే, ఉద్యోగుల ఖర్చులు రూ.400-రూ.500 కోట్లు పెరిగే అవకాశముందని కంపెనీ హ్యుమన్ రిసోర్సస్ హెడ్ గజేంద్ర చందెల్ అన్నారు. ప్రత్యక్ష, పరోక్ష ప్రయోజనాల్లో ఇది చాలా ఎక్కువని, ఈ ఏడాది బడ్జెట్ రూపొందించేటప్పుడే కొత్త రూపురేఖలను సిద్ధంచేశామని, దీంతో రూ.400 కోట్లను తగ్గించుకోవచ్చని అంచనావేసినట్టు చెప్పారు. సంస్థలో వైట్ కాలర్ పాపులేషన్ ఆందోళన కలిగిస్తోందని, 1500 మంది మేనేజింగ్ డైరెక్టర్లను తొలగించే యోచనలో ఉన్నట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గ్యుయెంటర్ బచక్ అంతకముందే పేర్కొన్నారు. గత 18 నెలల్లో టాటా మోటార్స్ లో 2500 వైట్-కాలర్ పొజిషన్లు ఖాళీ అయ్యాయని, ఇవి పొదుపుకు సహకరిస్తున్నాయని కంపెనీ చెప్పింది. వచ్చే రెండు-మూడేళ్లలో బ్లూ-కాలర్ ఉద్యోగాలు కూడా 3000 వరకు తగ్గిపోయే అవకాశముంది. ప్రస్తుతం కంపెనీలో 30వేల మంది బ్లూ-కాలర్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 10 శాతం తగ్గించుకోనున్నట్టు కంపెనీ ప్రకటించింది. తమ ప్లాంట్ల ఉత్పత్తిని మెరుగుపరచడానికి కంపెనీ 10 శాతం వేతనాన్ని పనితీరు ఆధారితానికి లింక్ చేసింది. అయితే టాటా మోటార్స్ వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి నష్టాలనే నమోదుచేస్తోంది. బీఎస్-3 వాహనాల ఇన్వెంటరీతో 2017 ఆర్థిక సంవత్సరంలో రూ.2,480 కోట్ల నష్టాలను కంపెనీ మూటగట్టుకుంది. -
ఐటీలో సీనియర్లు జీతాలు కొంత తగ్గించుకోవాలి
♦ అప్పుడే యువ ఉద్యోగుల కొలువులు కాపాడొచ్చు ♦ ఉద్యోగాల కోతపై ఇన్ఫీ మూర్తి బెంగళూరు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీనియర్ ఉద్యోగులు తమ జీతంలో కొంత త్యాగం చేయగలిగితే యువ ఉద్యోగుల కొలువులను కాపాడినట్లవుతుందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. పరిశ్రమ గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు అనేక సార్లు ఎదుర్కొందని ఒక టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వూ్యలో పేర్కొన్నారు. పరిశ్రమ దిగ్గజాలందరూ ఉద్యోగాల కోత సమస్యను పరిష్కరించాలనే సదుద్దేశంతోనే ఉన్నారని ఆయన చెప్పారు. ‘2008లో.. అంతకన్నా ముందు 2001లోనూ ఇలాంటిదే ఎదురైంది. ఇది కొత్తేమీ కాదు. ఆందోళన అక్కర్లేదు. ఇలాంటి సమస్యలకు గతంలోనూ పరిష్కారాలు కనుగొన్నాం‘ అని పేర్కొన్నారు. 2001లో మార్కెట్ కష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు యువత ఉద్యోగాలు కోల్పోకుండా కాపాడేందుకు ఇన్ఫోసిస్‌లో సీనియర్ ఉద్యోగులు తమ వేతనాలను కొంత తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకోవడాన్ని ఈ సందర్భంగా మూర్తి ఉదహరించారు. అప్పట్లో చాలా కంపెనీలు నియామకాలను డేట్‌ను వాయిదా వేస్తుంటే తాము మాత్రం 1,500 మంది ఇంజినీర్లకు ఉద్యోగాలు ఆఫర్ చేసినట్లు ఆయన తెలిపారు. మరోవైపు, పరిశ్రమ దిగ్గజాలు కొంగొత్త అవకాశాలను గుర్తించాలని, కొత్త టెక్నాలజీలను ఆకళింపు చేసుకునేందుకు యువతకు శిక్షణనివ్వడంపై దృష్టి పెట్టాలని మూర్తి సూచించారు. -
టాటా మోటార్స్ షాక్: 1500 మేనేజర్లపై వేటు
-
టాటా మోటార్స్ షాక్: 1500 మేనేజర్లపై వేటు
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స షాకింగ్ న్యూస్ చెప్పింది. తన వర్క్‌ఫోర్స్ లో టాప్ ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించింది. మేనేజర్ స్థాయిలో దాదాపు 1500 మంది ఉద్యోగులనుతొలగించనున్నట్టు బుధవారం ప్రకటించింది. దేశీయంగా సంస్థ పునర్నిర్మాణంలో భాగంగాఈ కోతలని తెలిపింది. వైట్ కాలర్ ఉద్యోగులకు సంబంధించి 10-12 శాతం (సుమారు1500)మందిని తొలగిస్తున్నట్టు టాటా మోటార్స్ ఎండీ, సీఈవో గుంటెర్ బుచ్చక్ ప్రకటించారు. టాటా మోటార్స్ వార్షిక ఫలితాల సందర్భంగా ఆయన వివరాలను తెలిపారు. అలాగే బ్లూకాలర్ ఉద్యోగుల్లోఎలాంటి తొలగింపులులేవని స్పష్టం చేశారు. అయితే పనితీరు మరియు నాయకత్వ లక్షణాల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నామని కంపెనీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సి రామకృష్ణన్ తెలిపారు. ఇది నిర్వహణ ఖర్చుల తగ్గింపులో భాగ కాదని వివరణ ఇచ్చారు. వీరిలో కొంతమంది స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని ఎంచుకున్నారనీ, మరికొంతమందిని ఇతర విభాగాలను బదిలీ చేసినట్టు చెప్పారు. కాగా 2016-17 క్యూ4లో టాటా మోటార్స్ బ్రిటిష్ అనుబంధ సంస్థ జేఎల్ఆర్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి-మార్చి)లో జేఎల్ఆర్ నికర లాభం 18 శాతం ఎగసి 55.7 కోట్ల పౌండ్లను తాకగా.. మొత్తం ఆదాయం 10 శాతం పుంజుకుని 726.8 కోట్ల పౌండ్లకు చేరింది. టాటా మోటార్స్ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 17 శాతం క్షీణించి రూ. 4296 కోట్లను, మొత్తం ఆదాయం 3 శాతం తగ్గి రూ. 78,747 కోట్లను తాకింది.ఈ నేపథ్యంలో ఒడిదుడుల మార్కెట్లో టాటా మోటార్స్ షేరు భారీ లాభాలతో టాప్ విన్నర్ గా నిలిచింది. -
ఇన్ఫోసిస్ మరో బ్యాడ్ న్యూస్
బెంగళూరు : ఉద్యోగాల కోతపై తీవ్ర భయాందోళనలు రేకెత్తుతున్న నేపథ్యంలో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల కోత భయాందోళనలను కొంత తగ్గించి, వేతనాల పెంపును వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.. వేతనాల పెంపును జూలై వరకు వాయిదా వేస్తున్నట్టు కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావు ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. జూలై వరకు వేతనాల పెంపుకు ఆగాల్సిందేనని, సీనియర్ ఉద్యోగులకు మరింత ఆలస్యమయ్యే అవకాశముందుని తెలిపారు. నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడానికి ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రవీణ్ రావు వివరించారు. అయితే ఇన్ఫోసిస్ లో ఎలాంటి ఉద్యోగాల కోతకు తాము ప్లాన్ చేయడం లేదని యూబీ ప్రవీణ్ రావు తెలిపారు. లేఆఫ్స్ ప్లాన్స్ పై టెక్కీల్లో నెలకొన్న ఊహాగానాలకు తాను స్వస్తి చెప్పుతున్నట్టు పేర్కొన్నారు. కానీ గతంలో మాదిరిగా కొంత ఫర్ఫార్మెన్స్ ఆధారితంగా వైదొలగాల్సి వస్తుందని చెప్పారు. వరుసగా కొంతకాలంపాటు మంచి పనితీరు కనబరచనివారిపై చర్యలు తీసుకోనున్నాం. ఇందులో భాగంగా కొందరు వైదొలగాల్సిన అవకాశముందని ప్రవీణ్ రావు ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. ఎనిమిదేళ్ల కంటే తక్కువ అనుభవమున్న జాబ్ లెవల్ 5 ర్యాంక్ ఉద్యోగుల పరిహారాల సమీక్ష జూలై నుంచి ప్రారంభమవుతుందని ప్రవీణ్ రావు తమ ఉద్యోగులకు బుధవారం ఈ-మెయిల్ ద్వారా తెలిపారు. సీనియర్ ఉద్యోగులకు పరిహారాల సమీక్ష తర్వాతి క్వార్టర్లలో ఉంటుందని ఈ లేఖలో పేర్కొన్నారు. వేతనాల పెంపు ఆలస్యం ఒకటి లేదా రెండు క్వార్టర్ల మార్జిన్లను కాపాడుకునేందుకు తాత్కాలిక మార్గమేనని అనాలిస్టులు చెబుతున్నారు. ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే కాక, టెక్ మహింద్రా సైతం వేతనాల పెంపును వాయిదా వేస్తుందని తెలిసింది. కానీ సీనియర్ ఉద్యోగులకు వేతన పెంపు ఆలస్యమనేది, వారు ఇతర ఉద్యోగాలు చూసుకునే స్థాయికి దారితీస్తుందని ముంబై బ్రోకరేజ్ కు చెందిన ఓ అనాలిస్టు చెప్పారు. ఉద్యోగంలో అభద్రతా వాతావరణాన్ని కల్పిస్తుందన్నారు. ఇటీవల టెక్ కంపెనీల్లో భారీగా లేఆఫ్స్ తో ఉద్యోగులు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్ సైతం 1000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకనుందని తెలుస్తోంది. కానీ ఉద్యోగాల కోతకు తాము ఎలాంటి ప్లాన్ చేయడం లేదని, రెగ్యులర్ ఫర్ ఫార్మెన్స్ ఆధారితంగానే కొందరు వైదొలగాల్సి వస్తుందని కంపెనీ చెబుతోంది. -
ఇన్ఫీ నిర్ణయంతో భారత్ లో ఉద్యోగాలు ఔట్
బెంగళూరు : భారత్ టెక్కీలకు షాకిస్తూ.. అమెరికాలో భారీ ఉద్యోగాల నియామకానికి రంగం సిద్ధంచేస్తున్నట్టు ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా చేసిన సంచలన ప్రకటన ప్రస్తుతం టెక్కీల్లో చర్చనీయాంశంగా మారింది. అమెరికాలోని ఇన్ఫీ కంపెనీల్లో 10వేల మంది అమెరికన్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో భారత్ లో భారీగా ఉద్యోగాలు కోత ఉండబోతున్నట్టు రిక్రూట్ మెంట్ సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అమెరికాలో స్థానిక రిక్రూట్ మెంట్ ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నదని హెడ్ హంటర్స్ ఇండియా వ్యవస్థాపకుడు, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కే. లక్ష్మీకాంత్ తెలిపారు. దీంతో భారత్ లో ఆఫ్ సోర్ ఉద్యోగాల కోత భారీగా ఉంటుందని పేర్కొన్నారు. హెచ్-1బీ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కఠితనరమైన నిబంధనలే ఈ మేరకు భారత ఐటీ ఇండస్ట్రీని దెబ్బకొడుతున్నాయని తెలిసింది. ఇన్ఫోసిస్ 500 అమెరికన్ టెక్కీలను నియమించుకుంటే, ఇండియాలో ఆఫ్ సోర్స్ ఆపరేషన్స్ కు చెందిన 2000 ఉద్యోగాలు పోతాయని లక్ష్మీకాంత్ తెలిపారు. ఆటోమేషన్, ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ అదనంగా మరో 30-40% శాతం నియామకాల్ని తగ్గిస్తాయని చెప్పారు.ఇలా భారీ మొత్తంలోనే ఉద్యోగాలు కోల్పోనున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతీయ ఐటీ సంస్థలు హెచ్-1బీ వీసాలపై ఉద్యోగాలు చేసే టెక్కీలకు ఏడాదికి 60వేల డాలర్ల నుంచి 65వేల డాలర్ల వరకు చెల్లిస్తున్నాయి. వచ్చే మూడేళ్లలో వీరు ఆన్ సైట్ వర్క్ నుంచి రిటర్న్ రావాల్సి ఉంటుందని తెలిసింది. ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే కాక, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహింద్రా, కాగ్నిజెంట్, క్యాప్ జెమ్మీ, మైక్రోసాప్ట్ వంటి సంస్థలు కూడా ఇదే బాటలో ప్రకటనలు చేస్తే భారత రిక్రూట్ మెంట్ పై భారీ ప్రభావమే ఉండనుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇన్ఫోసిస్ ఉద్యోగాల ప్రకటన చేసిన అనంతరమే హెచ్-1బీ వీసా ప్రక్రియలో దుర్వినియోగాన్ని సహించేది లేదంటూ అసిస్టెంట్ అటార్ని జనరల్ ఆఫ్ సివిల్ రైట్స్ డివిజన్ టామ్ వీలర్స్ మరో సారి భారత ఐటీ సంస్థలను హెచ్చరించారు. -
హెచ్‌యూఎల్‌లో ఉద్యోగాల కోత
ముంబై: దేశీయ వినియోగ వస్తువుల సంస్థ, మల్టీ నేషనల్ కంపెనీ హిందూస్థాన్ యునిలివర్ ఉద్యోగాల్లో కోత పెట్టనుంది. ఏప్రిల్ చివరికనాటికి 10-15శాతం ఉద్యోగాలు తొలగించేందుకు యోచిస్తోంది. డచ్‌కు చెందిన పేరెంటల్ కంపెనీ మాండేటరీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా మొత్తం మార్కెట్లలో ఖర్చులు తగ్గించుకోవాల్సిందిగా ఆదేశించిన నేపథ్యంలో కన్జూమర్ గూడ్స్ కంపెనీ హెచ్ యూఎల్ ఉద్యోగులను ఇంటికి పంపనుంది. దీంతోపాటు కొత్త నియామకాల్లో కూడా కోత పెట్టనుంది. అయితే ఈ వార్తలపై స్పందించడానికి హెచ్‌యూఎల్ నిరాకరించింది. మరోవైపు హెచ్‌యూఎల్ కంపెనీలనుంచి దరఖాస్తులను అందినట్టుగా కొన్ని మల్టీ నేషనల్ కంపనీలు దృవీకరించాయి. మార్జిన్ టార్గెట్లను పెంచుతున్నట్టు హెచ్‌యూఎల్ పేరెంటల్ కంపెనీ గురువారం ప్రకటించింది. యూకే, నెదర్లాండ్స్‌లో రెండు విడి కంపెనీలుగా ఆంగ్లో డచ్ కంపెనీ నిర్మాణాన్ని సమీక్షిస్తున్నట్టు తెలిపింది. కాగా 2015-16 వార్షిక నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా కంపెనీలోమొత్తం 18వేలమంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 15వందల మంది మేనేజర్ స్థాయి ఉద్యోగులు -
ఉద్యోగులపై వేటు వేస్తున్న స్నాప్‌డీల్
న్యూఢిల్లీ : దేశీయ ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ స్నాప్ డీల్ ఉద్యోగాల కోత పెడుతోంది. తమ ఈ-కామర్స్, లాజిస్టిక్స్, పేమెంట్స్ ఆపరేషన్లలో దాదాపు 600 మందిని స్నాప్ డీల్ తీసివేస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పారు. గత వారం నుంచే ఈ ప్రక్రియను స్నాప్ డీల్ ప్రారంభించిందని, మొత్తం 500 నుంచి 600 మందిని తీసివేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లోనే వీరిని తొలగించనున్నట్టు తెలుస్తోంది. రెండేళ్లలో లాభాలను ఆర్జించే తొలి ఈ-కామర్స్ కంపెనీగా తమ జర్నీ సాగుతుందని స్నాప్ డీల్ అధికార ప్రతినిధి చెప్పారు. అన్ని బిజినెస్ లలో ఈ వద్ధిని కొనసాగించడం తమకు ప్రధానమైన అంశంగా పేర్కొన్నారు. కంపెనీలో ఇప్పటివరకు 8000 మంది ఉద్యోగులున్నారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ నుంచి స్నాప్ డీల్ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ప్రెష్ క్యాపిటల్ ను ఆర్జించడానికి కూడా స్నాప్ డీల్ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. అయితే కంపెనీ నికర రెవెన్యూలు ఈ ఆర్థిక సంవత్సరంలో 3.5 సార్లు పైకి ఎగిశాయి. ఈ రెవెన్యూలతో స్నాప్ డీల్ దేశంలోనే లాభాలను ఆర్జించే తొలి ఈ-కామర్స్ కంపెనీగా పేరొందనున్నట్టు కంపెనీ అంచనావేస్తోంది. -
రోడ్డున పడనున్న 'యాహు' ఉద్యోగులు!
శాన్ ఫ్రాన్సిస్కో: ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం యాహు కంపెనీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంపెనీ ఉద్యోగుల సంఖ్యలో భారీగా కోత విధించనుంది. నేడు త్రైమాసిక లాభాల రిపోర్టు విడుదల చేసిన తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలున్నాయని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. సంస్థలో పనిచేసే 15 శాతం ఉద్యోగులు.. దాదాపు 1600 మందికి పైగా ఉద్యోగులను తొలగించే దిశగా అడుగులు వేస్తోందని యాహు చీఫ్ ఎగ్జిక్యూటీవ్ మరిస్సా మేయర్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. మేనేజ్ మెంట్ మార్పుల్లో భాగంగా డైరెకర్టపై ఒత్తిడి ఏర్పడినట్లు తెలుస్తోంది. యాహూ లాభాలు క్రమక్రమంగా తగ్గుతున్నందున సంస్థ నిర్వహణ ఖర్చును అదుపులో పెట్టేందుకు ఉద్యోగులను తీసేయడం మార్గంగా ఎంచుకుంది. చాలా మార్పులు రావాలని స్టార్ బోర్డ్ భావిస్తోంది. గతేడాది డిసెంబర్ లో యాహు కంపెనీలో ఓ ఇన్వెస్టర్ స్ప్రింగ్ ఓల్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ను నియమించడంతో పాటు 80శాతం ఉద్యోగాలకు కోతపెట్టింది. చైనాకు చెందిన అలిబాబా కంపెనీలో తన వాటాలు విక్రయించవద్దని నిర్ణయించుకుంది. గత మూడేళ్లుగా అనుకున్న రీతిలో యాహు ఫలితాలు సాధించలేదన్న విషయం తెలిసిందే. ఉద్యోగులపై వివక్ష చూపిస్తోదంటూ, చట్టాలను ఉల్లంఘిస్తుందన్న ఆరోపణలతో యాహుకే చెందిన ఓ ఉద్యోగి సిలికాన్ వ్యాలీలోని ఫెడరల్ కోర్టులో సొంత సంస్థపై దావా వేశాడు. సరిగ్గా అదేరోజు కంపెనీ ఉద్యోగుల కోత విషయం బయటకు రావడంతో సంస్థకు చెందిన ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. యాహు ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో ఉంది. -
భారీ నష్టాల్లో సోనీ కంపెనీ, 5 వేల ఉద్యోగాల కోత!
1.08 బిలియన్ అమెరికన్ డాలర్ల వార్షిక నష్టం దెబ్బకు ఎలక్ట్రానిక్ ఉత్పతులు, టెలివిజన్ తయారీ కంపెనీ సోని 5 వేల ఉద్యోగాలకు మంగళం పాడింది. మారుతున్న డిజిటల్ కాలంలో సోని కొత్తపోకడలను గుర్తించడంలో విఫలమవ్వడంతో పీసీ మార్కెట్ ను ఈ సంవత్సరం మూసివేయాలని సోని నిర్ణయించింది. సోని క్రెడిట్ రేటింగ్ ను మూడీ తక్కువ రేటింగ్ ఇచ్చిన తర్వాత వారం తర్వాత ఈ షాక్ న్యూస్ బయటకు వచ్చింది. టెలివిజన్ వ్యాపార రంగంలో అమెరికాకు చెందిన యాపిల్, దక్షిణ కోరియాకు చెందిన స్యామ్ సంగ్ కంపెనీల నుంచి జపాన్ దేశపు సోని, షార్ప్, పానాసోనిక్ కంపెనీలకు తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఒక బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయాన్ని కాపాడుకునే క్రమంలో ఉద్యోగాల కోత నిర్ణయం తీసుకోవడం జరిగింది అని సోని తెలిపింది. అంతేకాక సోనికి చెందిన వియో బ్రాండ్ పీసీ డివిజన్ ను ఓ జపనీస్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ కు అమ్ముతున్నట్టు ప్రకటన చేసింది. -
సీమెన్స్లో 15,000 ఉద్యోగాల కోత!
బెర్లిన్: వచ్చే ఏడాది(2014)లోగా ప్రపంచవ్యాప్తంగా 15,000 ఉద్యోగాలలో కోత పెట్టనున్నట్లు జర్మన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ దిగ్గజం సీమెన్స్ తెలిపింది. వీటిలో 5,000 మంది వరకూ ఉద్యోగులను ఒక్క జర్మనీలోనే తగ్గించుకోనున్నట్లు వెల్లడించింది. వ్యయాల కోతలో భాగంగా సిబ్బందిని తగ్గించుకోనున్నామని కంపెనీ పేర్కొంది. తద్వారా 810 కోట్ల డాలర్లను(రూ. 51,000 కోట్లు) ఆదా చేయనున్నట్లు వివరించింది. కంపెనీ గ్యాస్ టర్బైన్లు, రైల్ పరికరాలు, హెల్త్‌కేర్, ఎలక్ట్రానిక్ ఆధారిత పలు ఉత్పత్తులను తయారు చేస్తుంది. కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా 3,70,000 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్క జర్మనీలోనే 1,19,000 మంది సిబ్బందిని కలిగి ఉంది. తొలుత ఈ ఏడాది(2013) చివరికల్లా 10,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. కాగా, భారత్‌లో కూడా సీమెన్స్‌కు అనుబంధ సంస్థ ఉంది.