
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్‌డౌన్ .. దేశీయంగా ఐటీ రంగంలో ఉద్యోగాల కోతకు దారితీయొచ్చని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ మాజీ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ చెప్పారు. పరిస్థితి మరింతగా దిగజారితే.. వెంచర్ క్యాపిటలిస్టుల పెట్టుబడులతో మనుగడ సాగిస్తున్న స్టార్టప్ సంస్థలు.. ఇంకా గడ్డుకాలం ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. ‘పెద్ద కంపెనీలు రెండు కారణాలతో ఉద్యోగాలను తక్షణమే తీయకపోవచ్చు. ఉద్యోగులను పోగొట్టుకోవడం ఇష్టం లేకపోవడం ఒకటి కాగా.. వాటి దగ్గర జీతాల చెల్లింపునకు పుష్కలంగా నిధులు ఉండటం మరో కారణం. ఒకవేళ తగ్గించుకుంటే తాత్కాలిక సిబ్బంది, ఇంటర్న్‌షిప్ చేస్తున్న వారు ఉండొచ్చు. అయితే, ఒక స్థాయికి మించి.. రెండు మూడు నెలలు దాటేస్తే ఆ కంపెనీలు కూడా ఒత్తిడి తట్టుకోలేవు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment