IT sector
-
ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? అయితే తీపి కబురు
ఐటీ రంగంలో 2025లో 15–20 శాతం మేర అధిక నియామకాలు నమోదవుతాయని ఎన్ఎల్బీ సర్వీసెస్ అంచనా వేసింది. ముఖ్యంగా ఈ ఏడాది ద్వితీయ ఆరు నెల్లలో ఈ రంగంలో కదలిక వచ్చిందని, దీంతో 2025లో ఈ పరిశ్రమలోని పలు విభాగాల్లో నియామకాలు ఆశావహంగా ఉంటాయని తెలిపింది.కీలక నైపుణ్యాలు కలిగిన.. కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలైటిక్స్, క్లౌడ్ టెక్నాలజీలకి డిమాండ్ 30–35 శాతం మేర పెరుగుతుందని అంచనా వేసింది. డిమాండ్‌లో పెరుగుదల కేవలం ఈ నైపుణ్యాలకు మాత్రమే పరిమితం కాదని, టెక్నాలజీ నైపుణ్యాలను పెంచుకోవడంపైనా దృష్టి సారించాలని పేర్కొంది.మారుతున్న టెక్నాలజీల నేపథ్యంలో తమ మానవవనరులను అవసరమైన నైపుణ్యాలపై తర్ఫీదు ఇవ్వడంపై కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నట్టు వివరించింది. పెద్ద కంపెనీలకు ఇప్పటికీ క్యాంపస్ నియామకాలు ప్రాధాన్యంగా కొనసాగుతాయని, 2024–25 ద్వీతీయ ఆరు నెలల్లో ఇవి చురుగ్గా నియామకాలు చేపట్టొచ్చని పేర్కొంది.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్‌తో మాకు పోలికేంటి.. గూగుల్ సీఈవో కామెంట్స్ఏఐ, ఎంఎల్, డేటా అనలైటిక్స్, పైథాన్, క్లౌడ్ టెక్నాలజీలకు నెలకొన్న అధిక డిమాండ్ 2025లో ఐటీలో ఫ్రెషర్ల నియామకాలు పెరిగేందుకు దోహదం చేయనున్నట్టు తెలిపింది. గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లు (జీసీసీలు), తయారీ, బీఎఫ్ఎస్ఐ, హెల్త్‌కేర్ కంపెనీలు సైతం 30–35 శాతం అధికంగా ఐటీ నిపుణులను తీసుకోవచ్చని అంచనా వేసింది. -
ఇంటి పట్టు నుంచి ఐటీపై పట్టు
మహిళలకు కుటుంబ బాధ్యతలు కెరీర్ గ్యాప్‌కు కారణమవుతుంటాయి. కొంతమందిని పూర్తికాలం గృహిణిగానే ఉంచేస్తాయి. కానీ బిందు వినోష్ పడిలేచిన కెరటంలాగ సొంత కంపెనీ స్థాపించారు. బిందు స్థాపించిన వెబ్‌సికిల్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే దిశగా సాగుతోంది.కేరళకు చెందిన బిందు వినోష్ ఎంసీఏ చేసి కొంతకాలం ఐటీ రంగంలో ఉద్యోగం చేశారు. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతల్లో భాగంగా ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. దశాబ్దానికి పైగా ఇల్లే ప్రపంచంగా ఉండిపోయారామె. నలభై ఏళ్లు దాటేటప్పటికి ఐటీ రంగం మీదున్న ఇష్టం ఆమెను తిరిగి కెరీర్ వైపు అడుగులు వేయమని ప్రోత్సహించింది. 44 ఏళ్ల వయసులో ఓ పెద్ద ఐటీ కంపెనీ నుంచి ఫ్రాంచైజీ తీసుకున్నారు. ఫ్రాంచైజీకి, ఆఫీస్ ఏర్పాటు చేయడానికి 16 లక్షలతో ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారారు. అనతికాలంలోనే సొంతంగా వెబ్‌సికిల్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీని ప్రారంభించారు. 2023లో ఇద్దరు వ్యక్తులతో మొదలైన ఆమె వ్యాపార సంస్థ ఇప్పుడు ఏడుగురు నిపుణులతో ఏడాదికి పాతిక లక్షలతో నడుస్తోంది. వెబ్‌సికిల్ ఐటీ రంగంలో వెబ్సైట్ డెవలప్మెంట్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్తోపాటు కస్టమ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కూడా అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వెబ్‌సికిల్ సేవలందుకుంటున్న క్లయింట్లలో ప్రతిష్ఠాత్మకమైన కంపెనీలు పాతిక వరకు ఉన్నాయి. నేడామె ఐటీ సంస్థకు యజమానిగా కొత్తగా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. -
ఐటీలో కొత్త ట్రెండ్.. మీరొస్తామంటే మేమొద్దంటామా?
ఐటీ పరిశ్రమలో కాగ్నిజెంట్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. సంస్థను వీడి వెళ్లిన ఉద్యోగులు తిరిగి రావాలనుకుంటే వారికి ‘మీరొస్తామంటే మేమొద్దంటామా’ అంటూ సాదరంగా స్వాగతం పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లొ 13,000 మంది మాజీ ఉద్యోగులను తిరిగి నియమించుకుని సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.ఒక కంపెనీలో పనిచేసి వ్యక్తిగత లేదా వృత్తిపరమైన కారణాలతో సంస్థను వీడి తిరిగి అదే కంపెనీలో చేరేవారిని ‘బూమరాంగ్ ఉద్యోగులు’ అని వ్యవహరిస్తారు. కాగ్నిజెంట్‌లో ఇలాంటి పునర్నియామకాలు గత రెండు సంవత్సరాలలో 40% పెరిగాయి.కాగ్నిజెంట్.. ఇతర కంపెనీల మాదిరిగా కేవలం ఉన్న ఉద్యోగులను నిలుపుకోవడంపైన మాత్రమే దృష్టి పెట్టకుండా సంస్థను వీడి వెళ్లిన మాజీ ఉద్యోగులను సైతం స్వాగతిస్తోంది. సాధారణంగా బూమరాంగ్ సంస్కృతి ఇతర రంగాలతో పోలిస్తే ఐటీ పరిశ్రమలో చాలా అరుదు.ఇదీ చదవండి: నో బోనస్.. ఉద్యోగులకు టీసీఎస్ ఝలక్!మాజీ ఉద్యోగులను తిరిగి ఆకర్షించడం అనేది ఇప్పుడు పెద్ద ట్రెండ్‌లో భాగం. దీనిలో కంపెనీలు ఉద్యోగి నిష్క్రమణలను దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగించడానికి అవకాశాలుగా చూస్తాయి. సంస్థను వీడి వెళ్తున్న ఉద్యోగులతో మంచిగా వ్యవహరించడం, వారు తిరిగి రావడానికి తలుపులు తెరిచి ఉంచడం ద్వారా సరికొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నాయి. డెలాయిట్ వంటి ప్రముఖ కంపెనీలు మాజీ ఉద్యోగుల కోసం ఆలుమ్నీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. -
పట్టణాల్లో ఐటీ వెలవెల!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి పట్టణాలు, నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌లు వెలవెలబోతున్నాయి. లక్ష చదరపు అడుగుల నుంచి 1.75 లక్షల చదరపు అడుగుల్లో రూ. 50 కోట్ల నుంచి రూ. 90 కోట్ల వ్యయంతో నిర్మించిన భవనాలన్నీ కంపెనీలు పెద్దగా రాకపోవడంతో ఎక్కువ శాతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అట్టహాసంగా వాటిని ఏర్పాటు చేశారు. కానీ ఆ తరువాత సరైన నిర్వహణ లేదు. గతేడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఐటీ హబ్‌లపై దృష్టిపెట్టకపోవడంతో మొదట్లో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీల్లో చాలా వరకు వివిధ కారణాలతో వెనక్కి వెళ్లిపోతున్నాయి.సంప్రదింపులు జరిపే వారేరీ? తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్్క) నేతృత్వంలో 2019 నుంచి ఒక్కో పట్టణంలో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేసినా కంపెనీలతో సంప్రదింపులు జరిపే వారు లేక ప్రధాన కంపెనీలేవీ ముందుకు రావడం లేదు. నల్లగొండ, మహబూబ్‌నగర్, సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సూర్యాపేట పట్టణాల్లోని ఐటీ హబ్‌లకు చిన్నాచితక కంపెనీలు వచ్చినా యువతకు పెద్ద ఎత్తున వేతనాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో వాటిల్లో చేరే వారు కరువయ్యారు.ఇక హనుమకొండలోని మడికొండలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌లో దిగ్గజ ఐటీ సంస్థ టెక్ మహీంద్ర ఒక బ్రాంచీని ఏర్పాటు చేసినా ఆ తర్వాత అనివార్య కారణాలతో దాన్ని మూసేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొదట్లో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీల్లో చాలా వరకు వెనక్కి వెళ్లిపోవడంతో ఐటీ హబ్‌లు అలంకారప్రాయంగా మారుతున్నాయి. ఫలితంగా జిల్లా కేంద్రాల్లో నివసించే యువతకు స్థానికంగానే ఐటీ కొలువులు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.అడ్డగోలుగా అద్దెలు.. ప్రభుత్వ స్థలాల్లో, ప్రభుత్వ నిధులతో ఐటీ హబ్‌ల నిర్మాణం జరిగింది. వాటి నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతో వారు ఇష్టానుసారంగా భవనాల అద్దెలను నిర్ణయిస్తున్నారు. దీంతో వాటిలో కార్యాలయాల ఏర్పాటుకు కంపెనీలు ముందుకు రావడం లేదు. నల్లగొండ తదితర పట్టణాల్లో నిర్మించిన ఐటీ హబ్‌లలో ఒక చదరవు అడుగుకు (ఎస్ఎఫ్టీ) అద్దె రూ. 1,400కుపైగా నిర్ణయించడంతో అప్పట్లో పలు కంపెనీలు ముందుకు రాలేదన్న విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లోనే ఎస్ఎఫ్టీకి రూ.2 వేలు మొదలు 7 వేల వరకు ఉండగా జిల్లాల్లోని ఐటీ హబ్‌లలో అంతమొత్తం వెచి్చంచేందుకు కంపెనీలు ముందుకురావట్లేదు. స్కిల్ సెంటర్లన్నా ఏర్పాటు చేయాలి.. ఐటీ హబ్ భవనాల్లో ఇప్పటివరకు సగం అంతస్తుల్లోనూ కంపెనీలు ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలో వాటిని సది్వనియోగపరచుకునేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం రూ. కోట్లు వెచి్చంచి స్కిల్ సెంటర్ల నిర్మాణానికి చర్యలు చేపడుతుండటంతో ఐటీ టవర్లను స్వాధీనం చేసుకొని స్కిల్ సెంటర్లకు వినియోగించుకోవాలని ప్రజాప్రతినిధులు సూచిస్తున్నారు.పేరొందిన కంపెనీలు రావాలియువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే పేరొందిన ఐటీ కంపెనీలను పట్టణాలకు తీసుకురావాలి. ప్రభుత్వం అందుకు కృషి చేయాలి. – దుర్గాప్రసాద్, కట్టంగూరు -
ఐటీ పరిశ్రమలో కొత్త చిగురులు.. చాన్నాళ్లకు మారిన పరిస్థితులు
దేశంలోని ఐటీ పరిశ్రమలో సన్నగిల్లిన నియామకాలకు మళ్లీ కొత్త చిగురులు వచ్చాయి. దాదాపు ఏడు త్రైమాసికాల తర్వాత భారతీయ ఐటీ పరిశ్రమలో క్షీణిస్తున్న హెడ్‌కౌంట్ ట్రెండ్ మారింది. టాప్ ఆరు ఐటీ కంపెనీలలో ఐదు కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య పెరిగింది.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ సంస్థలు సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తంగా 17,500 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నాయి. ఒక్క హెచ్‌సీఎల్ టెక్‌లో మాత్రమే పరిస్థితి మారలేదు. గత త్రైమాసికంలో ఈ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 780 తగ్గింది.దేశంలో ఐదవ అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టెక్ మహీంద్రా అత్యధికంగా సెప్టెంబర్ త్రైమాసికంలో 6,653 మంది ఉద్యోగులను చేర్చుకుని తాజా నియామకాలకు నాయకత్వం వహించింది. దీని తర్వాత దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టీసీఎస్ తన 600,000 మంది ఉద్యోగులకు 5,726 మంది ఉద్యోగులను జోడించింది.ఇదీ చదవండి: ఇలా కూడా రిజెక్ట్ చేస్తారా? గూగుల్ టెకీ వింత అనుభవంరెండవ, నాల్గవ అతిపెద్ద ఐటీ సంస్థలైన ఇన్ఫోసిస్, విప్రో ఈ త్రైమాసికంలో వరుసగా 2,456, 978 మంది ఉద్యోగులను చేర్చుకున్నాయి. ఇన్ఫోసిస్ వరుసగా ఆరు త్రైమాసికాల తర్వాత తన వర్క్‌ఫోర్స్‌ను విస్తరించింది. పెండింగ్‌లో ఉన్న కాలేజీ రిక్రూట్లను కూడా ఆన్‌బోర్డింగ్ చేస్తామని ఇరు కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. -
సాఫ్ట్వేర్ సంస్థల ఎగుమతులు పెంపు
దేశీయ సాఫ్ట్వేర్ కంపెనీల ఎగుమతులు పెరుగుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.17.2 లక్షల కోట్ల విలువైన సాఫ్ట్వేర్ సేవలను ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. దేశీయ కంపెనీలు విదేశాల్లోని వాటి అనుబంధ సంస్థలతో కలిసి ఈ ఘనత సాధించాయి. ఈమేరకు భారతీయ రిజర్వ్ బ్యాంకు వివరాలు వెల్లడించింది.ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం..2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశీయ సాఫ్ట్వేర్ కంపెనీల సేవల ఎగుమతులు రూ.200.6 బిలియన్ డాలర్లు(రూ.16.8 లక్షల కోట్లు)గా ఉన్నాయి. 2023-24లో అది రూ.17.2 లక్షల కోట్లుకు పెరిగింది. దేశీయ కంపెనీలు విదేశాల్లోని తమ అనుబంధ సంస్థలతో కలిసి ఈ ఘనత సాధించాయి. రూ.17.2 లక్షల కోట్ల నుంచి విదేశీ అనుబంధ సంస్థల సేవలను మినహాయిస్తే కేవలం దేశీయ కంపెనీలే రూ.16 లక్షల కోట్ల విలువైన సేవలను ఎగుమతి చేశాయి. ఇది గతేడాదితో పోలిస్తే 2.8 శాతం ఎక్కువ. భారత కంపెనీలు అధికంగా అమెరికాకు ఈ సేవలను ఎగుమతి చేస్తున్నాయి. మొత్తం భారత కంపెనీల ఎగుమతుల్లో అమెరికా వాటా 53 శాతం కాగా, యూరప్ వాటా 31 శాతంగా ఉంది.ఇదీ చదవండి: రెండేళ్లలో రూ.5 లక్షల కోట్ల ఆదాయంఅంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక అస్థిరతలు పెరగడం వల్ల యుద్ధ భయాలు నెలకొంటున్నాయి. దాంతో బ్యాంకింగ్ రంగ సంస్థలతోపాటు ఇతర కంపెనీలు సాఫ్ట్వేర్ సేవలను అప్డేట్ చేయడంలో కొంత వెనుకంజ వేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణం రేటు కొంత స్థిరంగా కదలాడుతోంది. దాంతో సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. ఫలితంగా లోన్లు పెరిగి బ్యాంకింగ్ రంగ సంస్థలు తమ సాఫ్ట్వేర్ కేటాయింపులకు నిధులు పెంచే అవకాశం ఉంటుంది. దాంతో రానున్న రోజుల్లో సాఫ్ట్వేర్ ఎగమతులు మరింత పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఐటీ కొలువులు.. చిగురిస్తున్న ఆశలు!
ఐటీ రంగం ఉద్యోగాల విషయంలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికం (2023–24, క్యూ1)లో వరుసగా ఏడో క్వార్టర్లోనూ టాప్–5 ఐటీ దిగ్గజాల మొత్తం సిబ్బంది సంఖ్య తగ్గింది. అయితే, గతంతో పోలిస్తే తగ్గుదల జోరుకు భారీగా అడ్డుకట్ట పడటం సానుకూలాంశం. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా మళ్లీ ఐటీ రంగం పెరిగిన ఉద్యోగులతో కళకళలాడే పరిస్థితి వస్తుందంటున్నారు పరిశ్రమ విశ్లేషకులు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా... దేశీ ఐటీ రంగంలో ఇవి టాప్–5 కంపెనీలు. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో వీటి మొత్తం సిబ్బంది సంఖ్య సీక్వెన్షియల్‌గా (గతేడాది క్యూ4తో పోలిస్తే) 2,034 మంది తగ్గారు. అయితే, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా.. ఈ మూడు దిగ్గజాలు మాత్రం ఏప్రిల్–జూన్ క్వార్టర్లో నికరంగా ఉద్యోగులను జత చేసుకోవడం విశేషం.‘గడిచిన ఐదు క్వార్టర్లలో ఉద్యోగుల తగ్గుదల జోరుకు క్రమంగా అడ్డుకట్ట పడటం సానుకూల పరిణామం’ అని హైరింగ్ కంపెనీ ఎక్స్‌ఫెనో బిజినెస్ హెడ్ (టెక్నాలజీ సిబ్బంది నియామకాలు) దీప్తి ఎస్ పేర్కొన్నారు. టాప్–5లో మూడు దిగ్గజ సంస్థలు క్యూ1లో నికరంగా ఉద్యోగులను జత చేసుకోవడంతో నియామకాల రికవరీ ఆశలు చిగురిస్తున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఐటీ పరిశ్రమ మళ్లీ కొత్త ఉద్యోగుల చేరికలతో కళకళలాడే అవకాశం ఉందని కూడా ఆమె అంచనా వేస్తున్నారు. హైరింగ్‌పై ఆర్థిక అనిశ్చితి ఎఫెక్ట్... దేశీ ఐటీ కంపెనీలకు ప్రధాన మార్కెట్లయిన అమెరికా, యూరప్‌లలో ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుండటంతో గత ఏడాదిన్నరగా హైరింగ్‌కు ముఖం చాటేస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగాల్లో కోతలకు కూడా తెరతీశాయి. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1 ఫలితాల్లో ఈ ప్రతికూల పరిస్థితులు సద్దుమణుగుతున్న సంకేతాలు వెలువడ్డాయి. టాప్–5 కంపెనీల మొత్తం సిబ్బంది సంఖ్య ఈ జూన్ నాటికి 15,23,742కు చేరింది. మార్చి చివరికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 15,25,776గా నమోదైంది. టీసీఎస్ సిబ్బంది 6,06,998కి చేరింది. కొత్తగా 5,452 మంది జతయ్యారు. ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య 3.15 లక్షలకు చేరింది. 1,908 మంది తగ్గారు. హెచ్‌సీఎల్ టెక్‌లో దాదాపు 8,000 మంది తగ్గుదలతో మొత్తం సిబ్బంది 2.27 లక్షలకు చేరారు. విప్రోలో ఉద్యోగుల సంఖ్య క్యూ1లో స్వల్పంగా 337 మంది పెరిగి 2.34 లక్షలకు చేరింది. టెక్ మహీంద్రాకు నికరంగా 2,165 మంది జతకావడంతో మొత్తం ఉద్యోగులు 1.47 లక్షలకు పెరిగారు. అయితే, గతేడాది క్యూ1 నాటి సిబ్బంది సంఖ్యతో పోలిస్తే బిగ్–5 కంపెనీల్లో 46,325 మంది ఉద్యోగులు తగ్గారు. గడిచిన రెండేళ్లలో టాప్–5 కంపెనీల మొత్తం ఉద్యోగుల సంఖ్య 3 శాతం తగ్గగా... అంతక్రితం మూడేళ్ల కాలంతో పోలిస్తే 18 శాతం పెరిగారని దీప్తి తెలిపారు. ఐటీ హైరింగ్ విషయంలో సాధారణ స్థాయికి రావడానికి మరికొన్నాళ్లు పట్టే అవకాశం ఉన్నప్పటికీ, తాజా గణాంకాలు ఆశాజనకంగా ఉన్నాయని ఆమె చెబుతున్నారు. 2,034: టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా మొత్తం ఉద్యోగుల సంఖ్య క్యూ1లో సీక్వెన్షియల్‌గా తగ్గుదల.15,23,742: ఈ ఏడాది జూన్ (క్యూ1) చివరి నాటికి ఈ బిగ్5 కంపెనీల మొత్తం సిబ్బంది సంఖ్య 15,23,742. 5: గడిచిన ఐదు త్రైమాసికాలుగా సిబ్బంది తగ్గుదల క్రమంగా శాంతించడం సానుకూలాంశం. ఫ్రెషర్లకు చాన్స్.. ఐటీ రంగంలో ఫ్రెషర్ల హైరింగ్ భారీగా పుంజుకోనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 15,000–20,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ క్యూ1 ఫలితాల సందర్భంగా ప్రకటించింది. విప్రో సైతం 10,000–12,000 మందికి ఈ ఏడాది ఉద్యోగావకాశాలు కల్పిస్తా మని పేర్కొంది. ప్రధానంగా జెనరేటివ్ ఏఐ, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్ విభాగాల్లో కూడా అదనంగా ఉద్యోగులను తీసుకోనున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. క్యూ1లో 3,000 మంది ఫ్రెషర్లకు (న్యూ జెన్ అసోసియేట్స్) అవకాశం ఇచి్చనట్లు తెలిపింది. ఇక హెచ్‌సీఎల్ టెక్ కొత్తగా 10,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిస్తామని ప్రకటించింది. టీసీఎస్ సైతం క్యాంపస్ హైరింగ్‌పై దృష్టిపెడుతోంది. మొత్తంమీద ఈ ఐటీ పరిశ్రమ ఫ్రెష్ హైరింగ్ 1,00,000–1,20,000 స్థాయిలో ఉండొచ్చని హెచ్ఆర్ కన్సల్టెన్సీ ఎక్స్‌ఫెనో అంచనా. గతేడాది 60,000 స్థాయితో పోలిస్తే ఇది భారీగానే లెక్క. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఐటీలో మళ్లీ నియామకాల సందడి
ముంబై: ఐటీ రంగంలో మళ్లీ నియామకాలు పుంజుకోనున్నాయి. వచ్చే ఏడాది నాటికి 8.5 శాతం మేర పెరుగుతాయని హైరింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఇండీడ్’ అంచనా వేసింది. గత రెండేళ్లుగా ఐటీ రంగంలో నియామకాల పరంగా స్తబ్దత వాతావరణం చూస్తుండడం తెలిసిందే. గతేడాది వ్యాప్తంగా నిపుణులకు ఐటీ రంగంలో డిమాండ్ తగ్గగా.. ఇక మీదట ఇది పుంజుకోనున్నట్టు ఇండీడ్ తెలిపింది. ఇండీడ్ సంస్థకు చెందిన హైరింగ్ ట్రాకర్, ఇండీడ్ ప్లాట్‌ఫామ్ ఇండియా డేటా ఆధారంగా ఈ వివరాలు విడుదల చేసింది. ప్రస్తుతం ఇండీడ్ ప్లాట్‌ఫామ్‌పై నమోదయ్యే నియామకాల్లో 70 శాతం సాఫ్ట్వేర్ ఆధారితమేనని ఈ సంస్థ తెలిపింది. కంపెనీలు ఏఐ, మెషిన్ లెరి్నంగ్ (ఎంఎల్)బ్లాక్‌చైన్ వంటి సాంకేతికతలను వినియోగిస్తుండం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాలకు డిమాండ్‌ను పెంచుతున్నట్టు వివరించింది. స్టార్టప్ ఎకోసిస్టమ్ బలపడుతుండడాన్ని సైతం ప్రస్తావించింది. వీరికి డిమాండ్ ఎక్కువ.. అప్లికేషన్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫుల్ స్టాక్ డెవలపర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, పీహెచ్‌పీ డెవలపర్ నియామకాలకు కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు వెల్లడించింది. అలాగే, నెట్ డెవలపర్లు, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్, డెవ్ఆప్స్ ఇంజనీర్, డేటా ఇంజనీర్, ఫ్రంట్ ఎంట్ డెవలపర్లకు సైతం డిమాండ్ పెరుగుతున్నట్టు తెలిపింది. ఇప్పటికే ఉన్న సాఫ్ట్‌వేర్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్లు, సెక్యూరిటీ ప్యాచ్‌లు, కొత్త ఫీచర్లు తీసుకురావాల్సిన అవసరం సైతం డిమాండ్‌కు మద్దతునిస్తున్నట్టు తెలిపింది. ‘‘ఐటీ రంగం ఎక్కువ మందికి ఉపాధి కలి్పస్తోంది. కాకపోతే ఇటీవలి త్రైమాసికాల్లో నియామకాలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ అనిశి్చతుల నేపథ్యంలో కంపెనీలు అప్రమత్త ధోరణితో వ్యవహరించాయి. ఇప్పుడు ఈ పరిస్థితిలో మార్పు చోటు చేసుకుంటోంది. కంపెనీలు నియామకాలు పెంచుకోవడంపై దృష్టి సారించాయి. గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లు (జీసీసీలు) ఈ నియామకాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి’’అని ఇండీడ్ ఇండియా సేల్స్ హెడ్ శశి కుమార్ తెలిపారు. -
కాగ్నిజెంట్ భారీ విస్తరణ!
సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ హైదరాబాద్‌లో భారీ విస్తరణకు ముందుకు వచ్చింది. దాదాపు 15 వేల మంది ఉద్యోగు లకు పని కల్పించేలా, 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ఇతర ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరి గిన చర్చల అనంతరం కాగ్నిజెంట్ విస్తరణ ప్రణా ళికపై ఒప్పందం జరిగింది. వాస్తవానికి గత ఏడాది ముఖ్యమంత్రి బృందం దావోస్ పర్యటన సందర్భంగానే ఈ ఒప్పందానికి పునాదులు పడ్డాయి. సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నేపథ్యంలో కంపెనీ విస్తరణకు కాగ్నిజెంట్ ఈ నగరాన్ని ఎంచుకుంది. కాగా ఒప్పందం సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చెప్పారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్‌ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని అభిప్రాయపడ్డారు. కాగ్నిజెంట్‌కు తమ ప్రభుత్వం తగిన మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలు లభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని చెప్పారు. క్లయింట్లకు మెరుగైన సేవలుకాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ మాట్లాడుతూ.. టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్‌లో తమ కంపెనీ విస్తరించటం సంతోషంగా ఉందని అన్నారు. హైదరాబాద్‌లో నెలకొల్పే కొత్త సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్‌లో అత్యాధునిక పరిష్కారాలను అందిస్తామని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని తెలిపారు. కాగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర టైర్–2 నగరాలలో కూడా ఐటీ సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనపై కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని, ఇక్కడ కొత్త కేంద్రాన్ని స్థాపించాలనే కాగ్నిజెంట్ నిర్ణయం హైదరాబాద్ అభివృద్ధికి దోహదపడుతుందని శ్రీధర్‌బాబు అభిప్రాయపడ్డారు. -
ఐటీ నిరుద్యోగుల కష్టాలు తీరినట్టే..!!
గతేడాదినియామకాల మందగమనం తర్వాత, భారతీయ ఐటీ రంగం 2025 ఆర్థిక సంవత్సరం కోసం నియామక ప్రణాళికలను పునరుద్ధరిస్తోంది. దాదాపు 3,50,000 ఉద్యోగాలను జోడించడానికి సిద్ధంగా ఉంది. ఈ రంగానికి డిమాండ్ వాతావరణం మెరుగుపడటంతో కంపెనీలు నియామకాలపై దృష్టి పెట్టాయని స్టాఫింగ్ సంస్థల నిపుణులు చెబుతున్నారు.గడిచిన సంవత్సరంలో స్థూల ఆర్థిక ఎదురుగాలుల కారణంగా నియామక కార్యకలాపాలు బాగా తగ్గిపోయాయి. నాస్కామ్ ప్రకారం, టెక్ పరిశ్రమ 2024 ఆర్థికేడాదిలో 60,000 కొత్త ఉద్యోగాలను మాత్రమే జోడించింది. ఇది అంతకుముందు సంవత్సరంలో వచ్చిన 2,70,000 ఉద్యోగాల కంటే చాలా తక్కువ. ఐటీ మేజర్లు గత ఏడాది మొత్తం ఉద్యోగుల సంఖ్య వృద్ధిలో పడిపోయాయి. అయితే, నియామక ఔట్లుక్ ఇప్పుడు సానుకూలంగా మారుతోంది.ఎన్డీటీవీ నివేదిక ప్రకారం.. “హెడ్‌కౌంట్ తగ్గుదలతో FY25ని ప్రారంభించినందున, భారతీయ అగ్రశ్రేణి ఐటీ సంస్థలు నికర హెడ్‌కౌంట్ జోడింపులను నమోదు చేయడానికి ముందు క్షీణతను భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టెక్ రంగం నికర వృద్ధి కోసం ప్రస్తుత ఔట్లుక్ FY24లో చూసినట్లుగా 2,00,000-2,50,000 మధ్య ఉంది. అయితే క్షీణత, విస్తరణ నియామకాల కోసం 3,25,000-3,50,000 కంటే ఎక్కువ నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ వృద్ధిలో 60% పైగా అగ్రశ్రేణి ఐటీ సంస్థల నుంచి రావచ్చు’’ ఎక్స్‌ఫెనో ఐటీ స్టాఫింగ్ బిజినెస్ హెడ్ సుందర్ ఈశ్వర్ పేర్కొన్నారు.ఆర్థిక అనిశ్చితులు, ఖర్చు-అవసరాల కారణంగా మొత్తం నియామకాల్లో ఫ్రెషర్లు గణనీయమైన భాగాన్ని కలిగి ఉండే అవకాశం ఉందని టీమ్‌లీజ్ డిజిటల్ బిజినెస్ హెడ్ కృష్ణ విజ్ తెలిపారు. పెద్ద ఐటీ సంస్థలు ఇప్పటికే ఫ్రెషర్ హైరింగ్‌లో గణనీయమైన పెరుగుదలను సూచించాయి. FY25లో టీసీఎస్ 40,000 మంది, హెచ్‌సీఎల్ టెక్ 10,000 మంది, ఇన్ఫోసిస్ లిమిటెడ్ 15,000-20,000 మంది విప్రో 12,000 మంది వరకు ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించాయి. -
ఐటీ పుంజుకోదా..? ఎకనామిక్ సర్వే ఏం చెప్పిందంటే..
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో నియామకాలు గణనీయంగా మందగించాయని, ఇవి మరింతగా తగ్గకపోయినప్పటికీ గణనీయంగా పుంజుకునే అవకాశం లేదని ఆర్థిక సర్వే పేర్కొంది.దశాబ్దాల తర్వాత తొలిసారిగా కొన్ని పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో హెడ్‌కౌంట్ క్షీణించిన తరుణంలో ఆర్థిక సర్వేలో ఐటీ రంగంపై ప్రస్తావించారు. ఫిబ్రవరిలో, టెక్ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం కేవలం 60,000 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని పేర్కొంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం సృష్టించిన 2,70,000 ఉద్యోగాలతో పోలిస్తే చాలా తక్కువ.అయితే ప్రభుత్వం చేపట్టిన ప్రోత్సాహక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవడం, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఎక్కడా లేని సామర్థ్యాన్ని సంగ్రహించడం ద్వారా వ్యాపార, కన్సల్టెన్సీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతులను విస్తరించవచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. -
ఐటీలో కోతల కాలం!
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగం.. ఒకప్పుడు ఉద్యోగార్థుల కలల ప్రపంచం.. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వస్తే చాలు రెండు చేతులా సంపాదన, వీకెండ్ పార్టీలు, అప్పుడప్పుడూ టూర్లు. ఇక కరోనా వచ్చాక వర్క్ ఫ్రం హోం సౌలభ్యం. ఆ కలలన్నీ ఇప్పుడు సన్నగిల్లుతున్నాయి.. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం, రాజకీయ సంక్షోభం వంటి కారణాలతో ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఎడాపెడా తొలగించేస్తున్నాయి. ఖర్చు తగ్గించుకునే నెపంతో పింక్ స్లిప్ ఇచ్చేసి ఇంటికి పంపేస్తున్నాయి. ఇక కొత్తగా ప్లేస్‌మెంట్స్ ఇచ్చే విషయంలోనూ మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఒకవేళ రిక్రూట్ చేసుకున్నా ఆఫర్ లెటర్ ఇవ్వడం లేదు. అన్ని కంపెనీలదీ అదే బాట.. కరోనా సంక్షోభం తర్వాత ఐటీ రంగంలో చాలా ఒడిదుడుకులు వచ్చాయి. 2022, 2023 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 వేల కంపెనీలు 4 లక్షల పైచిలుకు ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు https://layoffs.fyi అనే సంస్థ వెల్లడించింది. ఉద్యోగాల కోత 2024లోనూ కొనసాగుతోంది. 2024లోమే నాటికి 326 కంపెనీలు 98 వేల మందికి కత్తెరవేశాయి. పెద్ద కంపెనీలే కాదు స్టార్టప్స్ సైతం ఇదే బాట పట్టాయి. ఇక కొన్ని కంపెనీలైతే నష్టాలను భరించలేక ఏకంగా తమ కార్యకలాపాలను నిలిపేశాయి. డెల్ కంపెనీ గత ఏడాది 13వేల మందికి పింక్ స్లిప్ ఇవ్వగా, ఈ ఏడాది 6వేల మందిని సాగనంపింది. టెస్లా కంపెనీలో ఎలాన్ మస్క్ రాత్రికి రాత్రే తమ ఉద్యోగులను ఇంటికి పంపుతున్నట్టు మెయిల్స్ పంపారు. దీంతో వందలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. మైక్రోసాఫ్ట్ 1,900 మందికి కోతపెట్టగా, తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయిన బైజూస్ 500 మందిని తొలగించింది. ఇంకా యాపిల్, డెల్, సోనీ, సిస్కో, స్విగ్గీ, యూట్యూబ్, గూగుల్, డుయోలింగో కంపెనీలు కూడా తమ సిబ్బందిని తగ్గించుకున్నాయి. ఇన్నొవేషన్ వల్లేనా.. ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెరి్నంగ్ (ఎంఎల్), ఆటోమేషన్ వల్ల ఉత్పాదకత పెరుగుతుందని అందరూ భావించారు. వీటి వాడకం వల్లే ఉద్యోగాల్లో కోత పడుతోందని లేఆఫ్స్ సంస్థ విశ్లేషించింది. ఇన్నొవేషన్ మూలంగా ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు. అయితే అందుకు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగ భద్రత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉద్యోగుల పనితీరును అంచనా వేసిన తర్వాతే అడ్జస్ట్మెంట్లో భాగంగా కంపెనీలు ఉద్యోగాల్లో కోత పెడతాయని అంటున్నారు. మంచి పర్ఫార్మెన్స్ చూపించినా.. కంపెనీకి క్లయింట్స్ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులున్నా కూడా తొలగించేస్తారు. ప్రాజెక్టులు లేకపోవడం కూడా ఉద్యోగులపై ప్రభావం పడుతుంది. ఎంతగా పర్ఫార్మెన్స్ చూపించినా కూడా వారికి అవసరం లేకపోయినా.. బడ్జెట్ లేకపోయినా ఉద్వాసన పలుకుతారు. ఎప్పుడు ఉద్యోగం తొలగిస్తారోనన్న భయంతో ఉద్యోగం చేయాల్సి వస్తోంది. –మౌనిక, సాఫ్ట్వేర్ డెవలపర్, హైదరాబాద్ ఇద్దరి పని ఒక్కరిపైనే.. ఎజైల్ స్క్రమ్ మెథడాలజీ వ్యవస్థతో ఉద్యోగుల పనితీరును ప్రతి రోజూ అంచనా వేస్తుంటారు. ఇచి్చన టార్గెట్‌ను ఎప్పటికప్పుడు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే అందుకు కారణాలను పై అధికారులకు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకటి రెండుసార్లు ఇలాగే జరిగితే చెప్పాపెట్టకుండా తొలగించేస్తారు. కంపెనీపై ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఇద్దరి ముగ్గురి పని కూడా ఒకరిపైనే వేసి.. మిగిలిన వారికి పింక్ స్లిప్ ఇస్తున్నారు. ఐటీ రంగం ఇప్పుడు అంత ఆశాజనకంగా లేదు. –పల్లె నరేశ్, ప్రిన్సిపల్ ఇంజనీర్ తప్పని పరిస్థితుల్లోనే.. కాస్త ఇబ్బందికరమే అయినా కంపెనీ ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగుల పనితీరు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని లే ఆఫ్స్ ప్రకటిస్తుంటాం. ఆర్థిక మాంద్యం ప్రభావాలను తట్టుకోవడం మార్కెట్లో పోటీ, ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తుంది. చాలా కంపెనీల్లో ఖాళీలు ఉన్నప్పటికీ నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కొరత చాలా ఉంది. సాంకేతికతకు అనుగుణంగా ఉద్యోగులు కూడా నైపుణ్యాలు నేర్చుకోకపోతే ఉద్యోగాలు కోల్పోక తప్పని పరిస్థితి ఉంది. –కీర్తి రెడ్డి, బోల్డ్ ఫ్యూజ్ కంపెనీ సీఈవో, వ్యవస్థాపకురాలు -
నాడు ఏడాదికి 2 లక్షలు.. ఇప్పుడు 60 వేలు
సాక్షి, హైదరాబాద్: భారత సాఫ్ట్వేర్ కంపెనీలు గత రెండు దశాబ్దాల్లోనే అత్యల్పంగా... 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్స్‌కు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, ఐటీ సేవల ఆర్డర్లు తగ్గుదలతో దేశీయ ఐటీ రంగం ఇప్పటికే ఇబ్బందుల్లో పడగా, తాజా పరిణామాలు మరింత ఆందోళన పరుస్తున్నాయి.కోవిడ్‌కు ముందు ఏడాదికి 2 లక్షల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌ను సాఫ్ట్వేర్ కంపెనీలు హైర్ చేయగా.. ఇప్పుడది 60–70 వేలకు పడిపోయింది. ఇదేకాకుండా వివిధ ఐటీ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన 10 వేల మందికి పైగా విద్యార్థులు ఆఫర్లెటర్స్తో ఉద్యోగాల్లో చేరేందుకు ఎదురుచూపులు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐఐటీలతో సహా ప్రతిష్టాత్మక కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌కు ప్లేస్‌మెంట్స్ గణనీయంగా తగ్గాయి. ఈ హైరింగ్‌లకు పెద్ద ఐటీ కంపెనీలు దూరంగా ఉండటంతో కాలేజీల యాజమాన్యాలు సైతం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అయితే, ఈ పరిస్థితుల్లోనూ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, విద్యార్థులు ఐటీ వైపే మొగ్గు చూపడం ఓ చిక్కుముడిగా మారుతోంది. ఇదీ వాస్తవ పరిస్థితి... దేశంలో ఐటీ రంగంలో ఫ్రెషర్స్ అవకాశాల కల్పన తగ్గుదలకు సంబంధించి ఎక్స్–ఫెనో అనే హెచ్ఆర్ సంస్థ అధ్యయనం నిర్వహించింది. క్యాంపస్ ప్లేస్మెంట్లకు సంబంధించి గతేడాది నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు వివిధ కాలేజీల యాజమాన్యాలు చెప్పాయి. పెద్ద కంపెనీలు మార్చి, ఏప్రిల్‌లో ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకునే ప్రక్రియలో భాగంగా అంతకు ముందు ఏడాది జూలై, ఆగస్టుల నుంచే డిగ్రీ పూర్తిచేయబోయే విద్యార్థులకు ట్రయల్స్ నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. అయితే ఈసారి క్యాంపస్‌లకు వచ్చేందుకూ కంపెనీలు సుముఖతను వ్యక్తంచేయకపోవడం యాజమాన్యాలు, విద్యార్థులను కలవరపరుస్తోంది. దాదాపు 70 శాతం విద్యార్థులు ఐటీ ఉద్యోగాలనే కోరుకుంటున్నా.. అందుకు తగ్గట్లు రిక్రూట్మెంట్ జరగకపోవడం వారిని నిరాశకు గురిచేస్తోంది. 2023లో కోర్సులను పూర్తిచేసిన విద్యార్థులను కూడా కొన్ని కంపెనీలు ఇంకా ప్లేస్‌మెంట్స్‌కు పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నారు. మొత్తంగా చూస్తే గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 70–80 శాతం దాకా ఆన్‌క్యాంపస్ హైరింగ్ తగ్గిపోయినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా వస్తున్న అవకాశాల్లో 85 శాతం దాకా ఏడాదికి రూ.3–6 లక్షల లోపు ప్యాకేజీల్లోనే వస్తున్నాయని చెబుతున్నారు. మరో 6 నెలలు ఇలాగే ఉండొచ్చు.. కనీసం వచ్చే ఆరునెలల దాకా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలున్నాయి. ఫ్రెషర్స్‌కు డిమాండ్ పెరిగే అవకాశాలపై ఇప్పుడే చెప్పలేం. కానీ రాబోయే రోజుల్లో పరిస్థితి మెరుగయ్యే అవకాశముంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగింపు, ఇజ్రాయెల్– హమాస్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగడం, వచ్చే నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు, యూఎస్, ఇతర దేశాల్లో వడ్డీరేట్లు ఎక్కువగా ఉండటం అనే అంశాలు ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. అదీగాక, ఉద్యోగాలపై కృత్రిమమేథ (ఏఐ) పాత్ర ఎలా ఉంటుందనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. 2008లోనూ ఇదే విధమైన గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. సాంకేతికంగా సమూలమార్పులు వస్తుండటంతో, అప్‌గ్రేడేషన్ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఆటోమేషన్ పెరుగుదలతో క్లౌడ్, అనలిటిక్స్ తదితరాలకు గణనీయంగా డిమాండ్ పెరిగింది. –వెంకారెడ్డి, వైస్‌ప్రెసిడెంట్, సీనియర్ హెచ్ఆర్ లీడర్, కో ఫోర్జ్ ఇప్పట్లో కొత్త ప్రాజెక్ట్‌లు కష్టమే.. ఫ్రెషర్స్, ఇంజనీరింగ్ విద్యార్థులు తమ సమయాన్ని వృథా చేసుకోకుండా నాన్‌ఐటీ ప్రాజెక్టులు, హెల్త్‌కేర్ సర్విసెస్, హాస్పిటల్ ఇన్సూరెన్స్ కలెక్షన్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి. కంటెంట్ మోడరేషన్, మ్యాపింగ్ వంటి వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఫ్రెషర్స్ 2025 సంవత్సరమంతా కూడా లర్నింగ్ జాబ్‌గా చూసుకుని, ఇండియాలోనే ఎంబీఏ, డేటా/బిజినెస్ అనలిటిక్ వంటి కోర్సులు చేస్తే మంచి అవకాశాలు వస్తాయి.అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాక... వడ్డీరేట్లు తగ్గించడం మొదలుపెడితే అక్కడ ఆర్థిక మాంద్యం మొదలయ్యే సూచనలున్నాయి. అందువల్ల మరో 6 నుంచి 9 నెలల దాకా అక్కడి నుంచి కొత్త ప్రాజెక్టులు రాకపోవచ్చు. ప్రస్తుతం దేశీయ సర్విస్ ప్రొవెడర్ సంస్థలు ‘డేటా మైగ్రేషన్’ ప్రాజెక్ట్‌లపై ఆధారపడుతున్నాయి. రాబోయేరోజుల్లోనూ ఈ ప్రాజెక్ట్‌లు పెద్ద ఎత్తున రాబోతున్నాయి. –ఎన్.లావణ్యకుమార్, సహ వ్యవస్థాపకుడు, స్మార్ట్‌స్టెప్స్ -
ఫస్ట్‌టైమ్.. ఐటీని వెనక్కినెట్టిన బ్యాంకింగ్
దేశంలో ఐటీ రంగాన్ని వెనక్కి నెట్టి బ్యాంకింగ్ రంగం సరికొత్త మైలురాయిని సాధించింది. తొలిసారిగా 2024 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగం నికర లాభం రూ. 3 లక్షల కోట్లను అధిగమించింది. లిస్టెడ్ పబ్లిక్, ప్రైవేట్ రంగ బ్యాంకుల సంయుక్త నికర లాభం 2023 ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ. 2.2 లక్షల కోట్లతో పోలిస్తే 39 శాతం పెరిగి రూ. 3.1 లక్షల కోట్లకు చేరుకుందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.ఐటీ రంగాన్ని దాటి.. ఇటీవలి కాలంలో సాంప్రదాయకంగా అత్యంత లాభదాయక రంగంగా ఉన్న ఐటీ సేవల రంగాన్ని బ్యాంకుల లాభాలు అధిగమించాయి. 2024లో లిస్టెడ్ ఐటీ సేవల కంపెనీలు రూ. 1.1 లక్షల కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి. ఇది బ్యాంకులు ఆర్జించిన లాభాల కంటే చాలా తక్కువ.ప్రభత్వ, ప్రైవేట్ బ్యాంకుల లాభాలు ఇలా.. ఏడాది కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు స్థాయిలో రూ.1.4 లక్షల కోట్ల నికర లాభాన్ని సాధించాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 34 శాతం పెరిగింది. ఇదిలా ఉండగా, ప్రైవేట్ రంగ బ్యాంకుల నికర లాభం 42 శాతం పెరిగి దాదాపు రూ.1.7 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది ఏడాది క్రితం రూ.1.2 లక్షల కోట్లుగా ఉంది.ప్రధాని ట్వీట్ దేశంలో బ్యాంకింగ్ రంగం రికార్డ్ స్థాయి లాభాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘గత 10 సంవత్సరాలలో చెప్పుకోదగ్గ మలుపు. భారతదేశ బ్యాంకింగ్ రంగ నికర లాభం మొదటిసారిగా రూ. 3 లక్షల కోట్లు దాటింది. బ్యాంకుల లాభాలు మెరుగుపడటం పేదలు, రైతులు, ఎంఎస్ఎంఈలకు రుణ లభ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది’ అని పేర్కొన్నారు.In a remarkable turnaround in the last 10 years, India's banking sector net profit crosses Rs 3 lakh crore for the first time ever.When we came to power, our banks were reeling with losses and high NPAs due to the phone-banking policy of UPA. The doors of the banks were closed…— Narendra Modi (@narendramodi) May 20, 2024 -
హెచ్1–బీ వీసాదారులకు తీపికబురు
వాషింగ్టన్: అమెరికాలోని ఐటీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. గూగుల్, మెటా, ఆపిల్, డెల్, ట్విటర్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. నాన్–ఇమ్మిగ్రెంట్లను తొలగిస్తున్నాయి. ఫలితంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా అమెరికాలో 237 ఐటీ కంపెనీలు 58,499 మందిని తొలగించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. లే–ఆఫ్‌ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రధానంగా హెచ్–1బీ వీసాలతో అమెరికా ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న భారతీయుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. కంపెనీ యాజమాన్యం జాబ్ నుంచి తొలగిస్తే 60 రోజుల్లోగా మరో ఉద్యోగం వెతుక్కోవాలి. లేకపోతే స్వదేశానికి వెళ్లిపోవాల్సిందే. ఇలాంటి వారికి యూఎస్ సిటిజెన్íÙప్ అండ్ ఇమిగ్రేషన్ సరీ్వసెస్(యూఎస్సీఐఎస్) తీపి కబురు అందించింది. హెచ్–1బీ వీసాదారులు ఉద్యోగం పోతే 60 రోజులు దాటినా కూడా అమెరికాలోనే చట్టబద్ధంగా ఉండొచ్చని వెల్లడించింది. అయితే, నాన్–ఇమిగ్రెంట్ వీసా స్టేటస్ మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికాలోనే ఉన్న జీవిత భాగస్వామిపై డిపెండెంట్‌గా మారొచ్చు. అంటే హెచ్–4, ఎల్–2 వీసా పొందొచ్చు. ఈ వీసాలు ఉన్నవారికి పని చేసుకొనేందుకు(వర్క్ ఆథరైజేషన్) అనుమతి లభిస్తుంది. స్టూడెంట్(ఎఫ్–1), విటిటర్ (బి–1/బి–2) స్టేటస్ కూడా పొందొచ్చు. కానీ, బి–1/బి–2 వీసా ఉన్నవారికి పని చేసుకొనేందుకు అనుమతి లేదు. 60 రోజుల గ్రేస్ పిరియడ్‌లోనే వీసా స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలని యూఎస్సీఐఎస్ సూచించింది. -
నిస్సిగ్గుగా నిజాలను కాలదన్ని..
చంద్రబాబు హయాంలో ఏమీ సాధించలేకున్నా... ప్రగతి పరుగులు తీసిందంటూ తప్పుడు రాతలు. పరిస్థితులు దిగజారినా... రాష్ట్రం పురోగమిస్తుందంటూ అడ్డగోలు అబద్ధాలు. ఐటీ కంపెనీ ఒక్కటైనా తీసుకురాలేకపోయినా... ఏదో సాధించారంటూనిస్సిగ్గుగా కితాబులు. ఇదీ పచ్చముసుగు వేసుకున్న రామోజీ పత్రికలో నిత్యం అచ్చవుతున్న అసత్య కథనాల తీరు. అదే జగన్ హయాంలో ఎంత ఉన్నతంగా ఎదిగినా... ఏమీలేదంటూ కబోది వ్యాఖ్యానాలు. కళ్లముందే దానికి సంబంధించిన రుజువులున్నా... దాచిపెట్టి అడ్డగోలు రోతలు. అవాస్తవాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ... జనానికి ఏమీ తెలియదులే అన్న అహంకార ధోరణి. ఇదీ రోజూ ఈనాడులో వండివారుస్తున్న అబద్ధాలు. గడచిన ఐదేళ్లలో ఐటీరంగం రాష్ట్రంలో అభివృద్ధి సాధిస్తే ‘కల్పతరువును కాలదన్నారు’ అంటూ అభాండాలు వేసేశారు. వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం... సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా ఐటీ రంగం వేగంగా విస్తరిస్తోంది. కరోనా వంటి విపత్కర పరిస్ధితుల్లో అంతర్జాతీయంగా ఐటీ రంగం కుదేలైనా రాష్ట్రంలో ఆ సమస్య ఎదురుకాలేదు. బహుళజాతి సంస్థలైన ఇన్ఫోసిస్,విప్రో,భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ వంటి సంస్థలు విశాఖలో డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయగా, రాండ్‌స్టాండ్ వంటి అంతర్జాతీయ సంస్థలు విశాఖ కేంద్రంగా కార్యకలాపాలను ప్రారంభించాయి. రాష్ట్రానికి 65కు పైగా కొత్త కంపెనీలు రాగా విశాఖలో డబ్ల్యూఎన్ఎస్, పల్సస్ గ్రూపులు భారీగా విస్తరించాయి. టెక్ మహీంద్రా విశాఖ నుంచి తన కార్యకలాపాలను విజయవాడకు విస్తరించింది. ‘ఐటీకి పితామహుడిని నేనే... సైబర్‌బాద్‌ను నేనే సృష్టించా...’ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు పాలనలో విశాఖకు వచ్చిన ఐటీ దిగ్గజం ఒక్కటంటే ఒక్కటైనా లేదు. ఆయన సీఎం పదవి ముగిసేనాటికి రాష్ట్రంలో ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 27,643 అయితే ఇప్పు డు ఆ సంఖ్య 75,551కు చేరింది. చంద్రబాబు దిగిపోయే నాటికి ఉన్న ఐటీ ఉద్యోగుల్లో సగంమందికి పైగా దివంగత నేత ముందుచూపుతో విశాఖ, కాకినాడ, విజయవాడల్లో అభివృద్ధి చేసిన∙ఐటీ పార్కుల్లో పనిచేస్తున్నవారే. కానీ ప్రస్తుత వైఎస్ జగన్ హయాంలో ఐటీ రంగంలో 47,908 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించినా కళ్లకు గంతలు కట్టుకున్న రామోజీకి అవేవీ కనిపించడం లేదు. పైగా ప్రజలను తప్పుదారి పట్టించేలా ఐటీ పాలసీ తుస్ అంటూ గురువారం ఒక అబద్ధాన్ని వండివార్చారు. తెలంగాణతో పోలికెందుకు రామోజీ... 2014–19 మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రానికి తీసుకువచ్చిన ఒక్క కంపెనీ పేరు కూడా ఆ కథనంలో రాసుకోలేకపోయారు. ఎంతసేపూ ప్రస్తుత ప్రభుత్వంపై విషం చిమ్మాలన్నదే వారి దుగ్ధ. అందుకే పొరుగు రాష్ట్రం తెలంగాణతో పోలుస్తూ అబద్దాలు అచ్చేశారు. బాబు పాలనలో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంటే ఆయన ఎందుకు ఉద్ధరించడానికి కృషి చేయలేదు? ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు వల్లే కదా విశాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కేవలం హైదరాబాద్‌ను మాత్రమే ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలువునా ముంచేసిన విషయం రాష్ట్ర ప్రజలు మరచిపోయారనుకుంటున్నారా? రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా కేవలం అమరావతి పేరుతో గ్రాఫిక్స్ చూపించి ఐటీ రంగాభివృద్ధిని గాలికి వదిలేసిన విషయం ఇక్కడి యువత గమనించలేదనుకుంటున్నారా? పైగా ఇప్పుడు ఐటీ రంగంలో విశాఖ పురోగమిస్తుంటే తప్పుడు కథనాలతో జనాన్ని ఏమార్చడానికి యత్నిస్తారా? నాడు ప్రచారం... నేడు ప్రోత్సాహం... చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఇంక్యుబేషన్ సెంటర్ పేరుతో ప్రచారానికే పరిమితం చేసి స్టార్టప్‌లలో రాష్ట్రం చతికిలబడితే వైఎస్ జగన్ ప్రభుత్వం స్టార్టప్‌ల ప్రోత్సాహానికి అనేక చర్యలు చేపట్టింది. స్టార్టప్‌లకు మెంటార్షిప్, ఫండింగ్, ఇండస్ట్రీ కనెక్ట్‌లతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలి నాలుగో తరం పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ 4కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ‘‘కల్పతరువు’’ పేరిట విశాఖలో ఏర్పాటు చేసింది. దీంతోపాటు నాస్కామ్ సహాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల స్టార్టప్‌ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను కూడా విశాఖలో ఏర్పాటు చేసింది. ఆంధ్రా యూనివర్సిటీలో ఓ హబ్, ఓడల నిర్మాణంపైన, మెడ్‌టెక్ జోన్‌లోనూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేసింది. ఈ విధంగా ఐటీ రంగంలో విశాఖను కల్పతరువుగా మార్చేలా ప్రభు త్వం చర్యలు తీసుకుంటే యువతను నైరాశ్యంలో నెట్టివేసేలా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈనాడు రామోజీ రాస్తున్న తప్పుడు రాతలను ప్రజలు గమనిస్తున్నారు. మూడు రెట్లు పెరిగిన స్టార్టప్‌ల సంఖ్య నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకువస్తూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల ఏర్పాటుతో రాష్ట్రంలో స్టార్టప్‌ల సంఖ్య భారీగా పెరిగింది. వీటి ద్వారా సాంకేతిక నిపుణులైన యువత స్వయం ఉపాధి పొందడమే గాకుండా, వేలాది మందికి ఉద్యోగాలూ వస్తున్నాయి. గడచిన ఐదేళ్లలో రాష్ట్రంలో స్టార్టప్‌ల సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వరంగ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఆ సంస్థ తాజా గణాంకాల ప్రకారం.. 2019లో రాష్ట్రంలో 161 స్టార్టప్‌లు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 586కు పెరిగింది. వీటిలో పనిచేసే ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగింది. 2019లో 1,552 మంది పనిచేస్తుండగా, ఆ సంఖ్య ఇప్పుడు 5,669కు చేరింది. -
నేను సాధించగలను అనే పట్టుదల ఉన్న వారికి ఏ ఫీల్డ్ అయినా ఒకటే
ఫీల్డ్ మారడం అనేది మంచి నీళ్లు తాగినంత సులభం కాదు.కాస్త అటూ ఇటూ అయితే మూడు చెరువుల నీళ్లు తాగాల్సి ఉంటుంది.‘నేను సాధించగలను’ అనే పట్టుదల ఉన్న వారికి మాత్రం ఏ ఫీల్డ్ అయినా ఒకటే. అలాంటి ప్రతిభావంతులలో తేజ ఒకరు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా పనిచేసిన తేజ ఐటీ రంగంలోకి అడుగుపెట్టి టెక్ లీడర్‌గా మంచి పేరు సంపాదించింది. కర్ణాటకలోని బెల్గాంలో పెరిగిన తేజ మనకమె డాక్టర్ అయిన తండ్రి నుంచి విజ్ఞానప్రపంచానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకునేది. డిఐవై (డూ ఇట్ యువర్ సెల్ఫ్) పాజెక్ట్స్ చేసేది. కర్ణాటక యూనివర్శిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సు చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలిసారిగా నాన్–మెడికల్ ఏరియాలలో మహిళల కోసం ద్వారాలు తెరుస్తున్న సమయం అది. తన సీనియర్స్ ఎయిర్ ఫోర్స్‌లో చేరిపోయారు. వారిని యూనిఫామ్‌లో చూడడం తేజాకు ఎగ్టయిటింగ్గా అనిపించింది. వారి స్ఫూర్తితోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోకి వచ్చింది. బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజీలోప్రాథమిక శిక్షణ తరువాత మౌంట్ అబూలో పాస్టింగ్ ఇచ్చారు. మౌంట్ అబూ స్టేషన్‌లోని ఉద్యోగులలో ఇద్దరు మాత్రమే మహిళలు. అందులో తాను ఒకరు. మహిళల కోసం ప్రత్యేక వాష్ రూమ్స్ ఉండేవి కావు. ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నా ఎప్పుడూ నిరాశపడేది కాదు తేజ,మౌంట్ అబూ తరువాత నాసిక్, బెంగళూరులలో కూడా పనిచేసింది. మన దేశాన్ని ఐటీ బూమ్ తాకిన సమయం అది.ఐటీ ఫీల్డ్‌లో ఉన్న సోదరుడు తేజాతో ఆ రంగానికి సంబంధించి ఎన్నో విషయాలు పంచుకునేవాడు. దీంతో ఐటీ రంగంపై తనకు ఆసక్తి పెరిగింది. అలా ఎయిర్ ఫోర్స్‌ను వదిలి ఐటీ రంగంలోకి అడుగు పెట్టింది. టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)లో డెవలపర్‌గా చేరింది. ఫ్రెషర్‌గా ఐటీ రంగంలో కెరీర్ మొదలు పెట్టిన తేజ అక్కడ ఎన్నో విషయాలు నేర్చుకుంది. ఆ తరువాత టెక్నాలజీస్‌లో పనిచేసింది. 2005లో డెల్ టెక్నాలజీలో మేనేజర్‌గా చేరింది. ఒక్కోమెట్టు ఎక్కుతూ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (ఐటీ) స్థాయికి చేరింది. జెండర్ స్టీరియో టైప్స్‌ను బ్రేక్ చేస్తూ డెల్ ఐటీ–ఇండియాలో కీలక స్థానంలో చేరిన తొలి మహిళగా గుర్తింపు ΄పోందింది.డెల్ ఫౌండేషన్‌లో సేల్స్ అండ్ మార్కెటింగ్, సప్లై చైన్, డేటా సైన్స్... మొదలైన విభాగాల్లో పట్టు సాధించింది. సీఎస్ఆర్ యాక్టివిటీస్‌పై బాగా ఆసక్తి చూపేది. ‘టెక్నాలజీ సహాయంతో ఎన్నో మంచిపనులు చేయవచ్చు’ అంటున్న తేజ రకరకాల స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది. కోవిడ్ మహమ్మారి సమయంలో బుద్ద ఫౌండేషన్‌తో కలిసి వలస కార్మికులకు పునరావాసం కల్పించింది.‘ప్రతి మహిళకు ఒక రోల్‌మోడల్, మెంటర్ ఉండాలి. అప్పుడే ఎన్నో విజయాలు సాధించగలరు’ అంటున్న తేజ డెల్లో ‘మెంటర్ సర్కిల్ కాన్సెప్ట్’ను అమలు చేసింది. ప్రతి సర్కిల్లో కొందరు మహిళలు ఉంటారు. వారికో మెంటర్ ఉంటారు. ఈ సర్కిల్లో తమ సమస్యలను చర్చించుకోవచ్చు, సలహాలు తీసుకోవచ్చు. ఒకరికొకరు సహాయంగా నిలవచ్చు. ‘ఇంజినీరింగ్ కాలేజీలో క్లాసులో నలుగురు అమ్మాయిలు మాత్రమే ఉండేవాళ్లం. ఇప్పటి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మా కుటుంబంలో నేను ఫస్ట్ ఉమెన్ ఇంజనీర్ని. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు. ఒక ముక్కలో చెపాలంటే సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఇది ఆహ్వానించదగిన మార్పు. నేను నేర్చుకున్న విషయాల ద్వారా ఇతరులకు ఏ రకంగా సహాయం చేయగలను అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంటాను. టైమ్ మేనేజ్మెంట్కు సంబంధించి ఎన్నో సమావేశాలు నిర్వహించాను’ అంటుంది తేజ. -
Fact Check: రాష్ట్ర ప్రగతికి ‘రామోజీ’ పొగ
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రగతికి రామోజీ పొగ పెడుతున్నారు. ఐటీ రంగంలో రాష్ట్రం అభివృద్ధి చెందకుండా విష ప్రచారంతో అడ్డుకుంటున్నారు. గత నాలుగు నెలలుగా ఈనాడులో నెలకో అసత్య కథనంతో ప్రగతికి ప్రతిబంధకంగా మారారు. శనివారమూ ఇలాగే ఓ విష కథనం ప్రచురించి యువతను, ఐటీ సంస్థలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు హయాంలో ఐటీ రంగం ఏమాత్రం అభివృద్ధి చెందకపోయినా ఒక్క ముక్కా రాయని రామోజీ.. ఇప్పుడు అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వచ్చినా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు. చంద్రబాబు హయాంలో హెచ్‌సీఎల్ తప్ప (అది కూడా 2020 మార్చిలో ప్రారంభమైంది) తప్ప పేరున్న ఒక్క ఐటీ సంస్థా రాలేదు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించింది. విప్రో కూడా డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభిస్తోంది. అమెజాన్, బీఈఎల్, రాండ్ శాండ్, టెక్నోటాస్క్, ఐజెన్ అమెరికా సాఫ్ట్వేర్, టెక్‌బుల్, కాంప్లెక్స్ సిస్టమ్స్ వంటి అనేక సంస్థలు వచ్చాయి. అదో పెద్ద కుంభకోణం డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్స్ పథకాన్ని రద్దు చేశారంటూ ఈనాడు గోల పెట్టింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ఓ పెద్ద కుంభకోణం. ఎటువంటి కంపెనీలూ రాకపోయినా రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా పథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద నిర్మించిన భవనాల్లో కంపెనీలు రాకపోతే 70 శాతం అద్దెను, అది కూడా బిల్డర్ ఎంత నిర్ణయిస్తే అంత రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. అందుకే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. మూడు రెట్లు పెరిగిన అంకురాలు అంకుర సంస్థలు మూడు రెట్లు పెరిగాయని శుక్రవారమే రాజ్య సభలో కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి చెప్పినప్పటికీ.., కళ్లకు, చెవులకు గంతలు కట్టుకున్న రామోజీ రాష్ట్ర యువత మెదళ్లలోకి విషం ఎక్కించే ప్రయత్నం చేశారు. 2019లో రాష్ట్రంలో 161 స్టార్టప్‌లు ఉండగా ఇప్పుడు 586కు చేరాయి. వీటిలో ఉద్యోగుల సంఖ్య 1,552 నుంచి 55,669కు పెరిగింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగో పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ 4కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని కల్పతరవు పేరిట విశాఖలో ఏర్పాటు చేశారు. అక్కడ పెద్ద ఎత్తున స్టార్టప్‌లు వస్తున్నాయి. అలాగే నాస్కామ్ సహాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల స్టార్టప్‌ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఏ హబ్, ఓడల నిర్మాణంపైన, మెడ్‌టెక్ జోన్‌లోనూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేశారు. విశాఖ నుంచి హెస్ఎస్బీసీ వెళ్లిపోయిందంటూ ఈనాడు వాపోయింది. వాస్తవంగా చైనాకు చెందిన ఆ సంస్థ విశాఖే కాదు.. దేశంలోని అన్ని కార్యాలయాలను మూసివేసింది. ఆ భవనంలో డబ్ల్యూఎన్ఎస్ కార్యాలయం నడుస్తోంది. ఐబీఎం వెళ్లిపోయిందంటూ ఈనాడు మరో అబద్ధం అచ్చేసింది. వాస్తవానికి ఐబీఎం అనుబంధ సంస్థ ఐబీఎం దక్ష 2007లో విశాఖలో ఏర్పాటైంది. ఆ తర్వాత ఐబీఎం దానిని కన్సంట్రిక్స్ అనే సంస్థకు విక్రయించింది. కన్సంట్రిక్స్ విశాఖ వెలుపల కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఇప్పుడు ఆ బిల్డింగ్‌లో ఇన్ఫినిటీ అనే సంస్థ పనిచేస్తోంది. 65 కంపెనీలు 47,908 మందికి ఉద్యోగాలు గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో ఐటీ రంగంలో కొత్తగా 65 కంపెనీలు ఏర్పాటైనట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. వీటి ద్వారా కొత్తగా 47,908 మందికి ఉద్యోగాలొచ్చాయి. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 27,643 కాగా, ఇప్పుడు 75,551 మందికి పెరిగింది. వైఎస్ జగన్ ప్రభుత్వ సహకారంతో దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి రావడంతోపాటు ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు విస్తరణ చేపట్టాయి. విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించిన టెక్ మహీంద్రా విజయవాడకు విస్తరించింది. హెచ్‌సీఎల్ విజయవాడ నుంచి తిరుపతికి విస్తరించింది. విశాఖలో ఉన్న డబ్ల్యూఎన్ఎస్, పల్సస్ ఐడీఏ వంటి 30కి పైగా ఐటీ కంపెనీలు విస్తరణ చేపట్టాయి. 2012లో 50 మందితో ప్రారంభమైన డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సరీ్వసెస్ ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 3,300 దాటింది. వీరిలో 2,000 మంది ఉద్యోగులు గత రెండేళ్లలోనే చేరినట్లు ఆ సంస్థ సీఈవో కేశవ్ ఆర్ మురుగేష్ స్వయంగా ప్రకటించారు. 2019లో 40 మందితో ప్రారంభించిన తమ సంస్థలో ఉద్యోగుల సంఖ్య 4,200 దాటినట్లు పల్సస్ సీఈవో గేదెల శ్రీనుబాబు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ రంగం ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు కాన్సెప్ట్ సిటీలు ఏర్పాటు చేస్తోంది. ప్రైవేటు రంగంలో ఐటీ పార్కులనూ ప్రోత్సహిస్తోంది. రూ.21,844 కోట్లతో అదానీ డేటా సెంటర్, భారీ ఐటీ టవర్‌ను ఏర్పాటు చేస్తోంది. రహేజా గ్రూపు ఇనార్బిట్ మాల్తో పాటు ఐటీ టవర్ నిరి్మస్తోంది. ఏపీఐసీసీ రూ.2,300 కోట్లతో మధురవాడలో 19 ఎకరాల్లో ‘ఐ స్పేస్’ పేరుతో ఐటీ టవర్ నిరి్మస్తోంది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఐటీ రంగానికి సంబంధించి 65 ఎంవోయూలు జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా రూ. 28,867 కోట్ల పెట్టుబడులతో పాటు 1.14,255 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. నిక్సీ వస్తే వెలుగులే విశాఖ కేంద్రంగా నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజి ఆఫ్ ఇండియా (నిక్సీ) ద్వారా ఇంటర్నెట్ ఎక్స్చేంజి కార్యకలాపాలు మొదలు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇటీవలే నిక్సీ బృందం విశాఖను సందర్శించింది. విశాఖలో ఈ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభించేందుకు అన్ని అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయని నిర్ధారించింది. ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఏర్పాటైతే ఇతర రాష్ట్రాల నుంచి డేటా కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. తక్కువ ఖర్చుతో కూడిన నాణ్యమైన, వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుతాయి. తద్వారా అనేక కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. -
ఎమ్మెస్.. టైమ్ పాస్!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం ఐటీ రంగాన్ని కుదిపివేస్తున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థులు విదేశీ చదువులపై దృష్టి పెట్టారు. సాఫ్ట్వేర్ రంగం గాడిన పడే వరకూ ఎంఎస్ చేయడమే మేలని భావిస్తున్నారు. ఈ కారణంగా ఈ ఏడాది విదేశీ విద్యకు వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగింది. కరోనా నేపథ్యంలో 2021 విద్యా సంవత్సరంలో 4.44 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, 2022లో ఈ సంఖ్య ఏకంగా 6.84 లక్షలకు పెరిగింది. 2023 చివరి నాటికి ఈ సంఖ్య మరో 10 వేల వరకు పెరిగిందని అంచనా. అమెరికా వంటి దేశాల్లో ఐటీ సెక్టార్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని తెలిసినా.. ఈ ఒక్క దేశానికే 2023లో 2.80 లక్షల మంది భారతీయులు విద్య కోసం వెళ్ళారు. మరోవైపు కెనడా వీసా ఆంక్షలకు నిబంధనలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నా, చదువు కోసం వెళ్ళేందుకే విద్యార్థులు ఇష్టపడుతున్నారు. ఎందుకీ పరిస్థితి..? దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 12 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వస్తున్నారు. వీరిలో కేవలం 8 శాతం మందికి మాత్రమే నైపుణ్యం ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. బహుళజాతి కంపెనీల్లో మంచి వేతనంతో ఉద్యోగాలు పొందుతున్నది వీళ్ళే. మిగతా వాళ్ళు వచ్చిన ఉద్యోగంతో సంతృప్తి పడుతున్నారు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఏదో ఒక సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకుని సంబంధం లేని ఉద్యోగానికి వెళ్తున్నారు. ఇంతకాలం వీళ్ళ అవసరం ఉండేది. అవసరమైన శిక్షణ ఇచ్చి కంపెనీలు వారి సేవలను వినియోగించుకునేవి. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. అమెరికాలో వచ్చిన ఆర్థిక సంక్షోభం ప్రభావం భారత్ ఐటీ రంగంపైనా ప్రభావం చూపించింది. ప్రధాన కంపెనీలన్నీ వరుసగా లే ఆఫ్‌లు ప్రకటించడంతో ఐటీ విభాగం కుదేలైంది. క్యాంపస్ నియామకాలు తగ్గాయి. కొన్ని కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చినా ఉద్యోగాలుమాత్రం ఇవ్వలేదు. దీంతో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలు వెతుక్కోవాల్సి వస్తోంది. పోటీ తీవ్రంగా ఉండటంతో ఫ్రెషర్స్ పోటీని తట్టుకుని నిలబడటం కష్టంగా ఉంది. ఈ కారణంగానే విదేశాల్లో విద్యాభ్యాసానికి వెళుతున్నారు. సమయం వృథా ఎందుకుని.. చాలా కంపెనీలు ఏడాది క్రితం ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు ఆఫర్ లెటర్స్ ఇచ్చాయి. కానీ చాలా సంస్థలు ఇంత వరకూ నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. నాస్కామ్ తాజాగా జరిపిన ఓ సర్వేలో ఇలాంటి వాళ్ళు భారత్‌లో 2.5 లక్షలు ఉంటారని తేలింది. మన రాష్ట్రంలోనే 24 వేల మందికి పైగా ఉన్నట్టు స్పష్టమైంది. మరో వైపు అమెరికా ప్రాజెక్టులు తగ్గుతున్నా యని కంపెనీలు చెబుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో నియామక ఉత్తర్వులు వస్తాయన్న భరోసా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉండటం దేనికి? అని యువత భావిస్తోంది. ఒకవేళ ఖాళీగా ఉంటే ఆ తర్వాత జాబ్‌లోకి తీసుకోవడానికి కంపెనీలు అంతగా ఆసక్తి చూపవు. దీన్ని దృష్టిలో ఉంచుకునే పరిస్థితి చక్కబడే వరకూ ఎమ్మెస్ లాంటిది చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. లభించని బ్యాంకు రుణాలు విదేశీ విద్యకు గతంలో తేలికగా రుణాలు లభించేవి. కానీ గత ఏడాది కాలంగా బ్యాంకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదనిన విద్యార్థులు అంటున్నారు. బ్యాంకు రుణాల విధానాన్ని సవరించడమే దీనికి కారణమని బ్యాంకర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్ళేందుకు అవసరమైన సెక్యూరిటీ మొత్తం, అక్కడి ఖర్చుల కోసం ఒక్కో విద్యార్థి కనీసం రూ.40 లక్షల వరకూ అప్పు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని విదేశాల్లో చదివేటప్పుడు తీర్చేద్దామన్న ధీమాతో వెళ్తున్నారు. విదేశాల్లో ఏదైనా పార్ట్‌టైం జాబ్ చేయొచ్చనేది వారి ఆలోచన. కానీ గతేడాది డిసెంబర్లో వెళ్ళిన విద్యార్థులకు అమెరికాలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. పార్ట్ టైం ఉద్యోగాలు దొరకడం కూడా కష్టంగా ఉందని అక్కడి విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. ఐటీ కోలుకోవడంపైనే ఆశలు బీటెక్ పూర్తయ్యాక ఇండియాలో ఏడాది పాటు ఉద్యోగం కోసంవిఫల ప్రయత్నం చేశా. చివరకు అమెరికా వెళ్ళి ఎమ్మెస్ చేయాలని నిర్ణయించుకున్నా. ఇంట్లో అర ఎకరం పొలం అమ్మి డబ్బులిచ్చారు. నేను కొంత అప్పు చేశా. డిసెంబర్లో అమెరికా వచ్చా. ఇక్కడ పార్ట్ టైం జాబ్ కష్టమని కన్సల్టెన్సీలు చెబుతున్నాయి. మళ్ళీ అప్పు చేయమని తల్లిదండ్రులకు చెప్పడం ఇబ్బందిగానేఉంది. ఐటీ కోలుకుంటే పరిస్థితి మారుతుందనే నమ్మకం ఉంది. –శశాంక్ (అమెరికా వెళ్ళిన వరంగల్ విద్యార్థి) ఏడాది క్రితం ఆఫర్ లెటర్ ఇచ్చారు బీటెక్ అవ్వగానే ఆఫ్ క్యాంపస్‌లో ఓ కంపెనీ ఉద్యోగం ఆఫర్ చేసింది. ఉద్యోగం వచ్చిందని నేను, మా వాళ్ళూ బంధువులందరికీ చెప్పుకున్నాం. ఆ లెటర్ పట్టుకుని ఏడాది నిరీక్షించా. ఎంతకీ అపాయింట్మెంట్ ఆర్డర్ రాలేదు. ఇప్పుడు చిన్నతనంగా ఉంది. అందుకే అప్పు చేసి మరీ అమెరికా వెళ్ళేందుకు సిద్ధమవుతున్నా. ఎమ్మెస్ అయిపోయే లోగా పరిస్థితి మారుతుందనే ఆశ ఉంది.– పి. నీలేశ్ కుమార్ (యూఎస్ వెళ్ళేందుకు సిద్ధమైన హైదరాబాద్ విద్యార్థి) -
కొత్త ఏడాదీ కోతలేనా?
ఆర్థిక మాంద్యంతో ఇబ్బందులు తప్పేలా లేవంటూ ఆందోళన.. ఉద్యోగాలు తొలగించేందుకు సిద్ధమవుతున్న కంపెనీలు మరోవైపు వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఏఐ వైపు మొగ్గు.. 2023లో ప్రపంచ వ్యాప్తంగా 2.40 లక్షల మంది తొలగింపు (సాక్షి ప్రత్యేక ప్రతినిధి) కొత్త సంవత్సరంలోనూ ఐటీ రంగానికి గడ్డు పరిస్థితేనా? ఆశించిన మేరకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం లేదా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. పలు అంతర్జాతీయ సంస్థలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 2023లో దాదాపు 2.40 లక్షల మంది లే ఆఫ్‌ల పేరుతో, తొలగింపు పేరుతో ఉద్యోగాలు కోల్పోయారు. ఇక వచ్చే సంవత్సరంలోనూ పరిస్థితి ఆశాజనకంగా ఉండే అవకాశం కనిపించడం లేదని, ఆర్థిక మాంద్యం ప్రభా వం ఈ రంగంపై ఎక్కువగా కనిపిస్తుందని, కోతలు తప్ప వని అంటున్నారు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగం ఎక్కువ ఉద్యోగా లను కల్పిస్తుందా? లేక ఉన్న ఉద్యోగాల తొలగింపునకు కారణం అవుతుందా అన్నది కూడా కొత్త సంవత్సరంలో తేలనుంది. తాజాగా మ్యూజిక్ స్పాటిఫై ఏకంగా 1,500 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఆ స్థానంలో ఏఐని ఉపయోగించనుంది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వ్యయా లను సాధ్యమైనంతగా తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఉన్న ఉద్యో గాల తొలగింపు, కొత్త ఉద్యోగాల కల్ప నకు మొగ్గు చూపకపోవడం లాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో మాదిరిగా క్యాంపస్ రిక్రూట్మెంట్లు కన్పించడం లేదు. గతంలో ప్రతి యేటా 40 నుంచి 80 శాతం వరకు కొత్త ఉద్యోగులను చేర్చుకోవడానికి సంస్థలు ముందుకు వచ్చేవని, కానీ ఇప్పుడు ఇది బాగా తగ్గిపోయినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏఐ నైపుణ్యాన్ని పెంచుకోవాలి.. వివిధ కంపెనీల పరిస్థితిని పరిశీలిస్తే.. ప్రముఖ స్టార్టప్ కంపెనీ, 4.1 బిలియన్ డాలర్ల విలువగల డేటామిర్ సంస్థ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో తన సంస్థలోని 20 శాతం ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. సంఖ్యాపరంగా పెద్దగా కనిపించక పోయినా పలు స్టార్టప్ కంపెనీలు క్యాష్‌ఫ్లో ఇబ్బందులను ఎదు ర్కొంటున్న నేపథ్యంలో.. మానవ వనరుల తగ్గింపునకే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. క్లార్నా సీఈవో సెబాస్టియన్ సిమి యాకోవిస్కీ.. ‘డజన్ల కొద్దీ ఉద్యోగులను నియమించుకునే కంటే ఒక ఏఐతో పని కానియ్యొచ్చు’ అన్నారంటే దాని ప్రభావం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్లార్నా సంస్థ ‘పర్సనల్ ఫైనాన్స్ అసిస్టెంటెన్స్’ కార్యకలాపాలను అందిస్తోంది. తాజాగా వచ్చిన ‘రాన్‌స్టడ్ రైజ్స్మార్ట్ గ్లోబల్ సెవరెన్స్’ నివేదిక ప్రకారం.. ఈ ఏడాదిలో 96 శాతం సాఫ్ట్వేర్ సంస్థలు ఉద్యోగులను తగ్గించే కార్యక్రమాలు చేట్టాయి. ఏఐతో నిర్వహణప్రమాణాలు పెరిగా యని, కొత్త ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడుతున్నదని నివేదిక వెల్లడించింది. అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏఐ నైపుణ్యాన్ని పెంచుకుంటే వారి ఉద్యోగాలకు ఢోకా ఉండదని తేల్చి చెప్పింది. 2023లో ఉద్యోగాలకు కోత పడగా, అదే సమయంలో ఏఐపై పెట్టుబడులు పెరిగాయని తెలిపింది. ‘ఐటీ కంపెనీలు ప్రధానంగా స్టాక్ మార్కెట్లపై, రుణాలపై ఆధారపడి ఉంటాయి. తెచ్చుకున్న రుణాలపై వడ్డీరేట్లు పెరిగితే భారం పెరుగుతుంది. అలాగే స్టాక్ మార్కెట్లో ఆ సంస్థ స్టాక్ పడిపోయినా ఆర్థిక ఇబ్బందులు వచ్చి పడతాయి. తద్వారా లే ఆఫ్‌లు అనివార్యం అవుతున్నాయి..’ అని రోమి గ్రూప్ ఎల్ఎల్సీ మేనేజింగ్ డైరెక్టర్ నిక్ గౌస్లింగ్ చెబుతున్నారు. భారతీయ కంపెనీలకు పురోగమనావకాశాలు ప్రస్తుతం ఐటీ రంగంలో ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదు. వారు పెట్టుబడులు పెట్టే ముందు ప్రధానంగా టెక్నాలజీ కొనడమో, అప్‌గ్రేడ్ చేయడమో చేస్తుంటారు. యూఎస్, ఐరోపాతో పాటు ఇతర దేశాల్లో మార్కెట్‌ను పరిశీలిస్తే సిలికాన్ వ్యాలీ బ్యాంక్, క్రెడిట్ సుయిజ్ బ్యాంక్ వంటివి క్షీణతకు గురయ్యాయి. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక స్టార్టప్ కంపెనీలపై ఇన్వెస్ట్ చేసింది. ఐతే పెట్టుబడు లకు తగ్గట్టుగా ఈ కంపెనీల నుంచి రిటర్న్‌లు రాకపోవడంతో సంస్థ పడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సెకండ్, థర్డ్ స్టేజ్ పెట్టుబడులు ఆగిపోయి స్టార్టప్‌లపై తీవ్ర ప్రభావం పడింది. తదుపరి కార్యాచరణలు, ముందుకెళ్లడాలు నిలిచిపోయాయి. ఫండింగ్ నెమ్మదించి ఆయా స్టార్టప్‌లలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. ఔట్‌సోర్సింగ్‌లో సపోర్టింగ్ ఉన్న యూఎస్‌లోని గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలపై కూడా ప్రభావం పడింది. ఇక ఏఐ, చాట్ జీపీటీ వల్ల కూడా ఖర్చు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే భారతీయ కంపెనీలు రాబోయే మూడు, నాలుగు నెలల్లో పరిస్థితులు మారి పురోగమనం వైపు అడుగులు వేసే అవకాశాలున్నాయి. ఇక గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్ (జీసీసీ) ద్వారా టార్గెటెడ్ టెక్నాలజీ వైపు మొగ్గు పెరుగుతోంది. వీటి విషయానికొస్తే మన దేశంలోని నగరాలు మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఈ సెంటర్లకు హబ్‌గా మారనుంది. – వెంకారెడ్డి, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ హెచ్ఆర్ లీడర్, కోఫోర్జ్ ఏడాది చివర్లో స్లో డౌన్ సహజం ఏడాది చివర్లో ఐటీ రంగం కొంత స్లోడౌన్ కావడం సహజమే. వచ్చే ఏడాది కూడా ఐటీ పరిశ్రమ ఔట్ సోర్సింగ్‌పైనే అధికంగా ఆధారపడాల్సి ఉంటుంది. ఐటీ రంగంలో ఉద్యోగాలు లేకపోవడం అనే కంటే.. మారుతున్న అత్యాధునిక సాంకేతికతలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకుని సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకపోవడమనేదే సమస్య. జనరేటివ్ ఏఐ, ఆటోమేషన్, క్లౌడ్ల ద్వారా వర్క్‌ఫోర్స్ తమ నైపుణ్యాలను మార్చు కునేలా చేయగలగడం ఐటీ సంస్థలకు పెద్దసవాల్. వీటి ద్వారా సంస్థలకు ప్రాజెక్ట్‌లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో డేటా సెంటర్స్‌పై, ఏఐ వంటి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్‌పై, ఐటీ సర్వీసెస్‌పై పెట్టుబడులు పెరుగుతాయి. 2024లో ఐటీ మార్కెట్ వృద్ధి ప్రపంచ వ్యాప్తంగా 8 శాతం, భారత్‌లో 10 శాతం ఉంటుందని ప్రతిష్టాత్మక గార్ట్నర్ సంస్థ తన నివేదికలో అంచనా వేసింది. – రమణ భూపతి, క్వాలిటీ థాట్‌గ్రూప్ చైర్మన్, ఎడ్టెక్ కంపెనీ -
ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కంపెనీల ఆటలు ఇక సాగవు!
ఏకపక్ష తొలగింపులు, ఐడీ బ్లాక్ చేయడం, సామూహిక ఉపసంహరణ, లైంగిక వేధింపులు, అధిక పని గంటలు వంటి ఇబ్బందలు ఎదుర్కొంటున్న ఐటీ ఉద్యోగులకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ బాసటగా నిలిచింది. ఉద్యోగులను వేధించే ఐటీ కంపెనీల ఆట కట్టిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-ఎనేబుల్డ్ సర్వీసెస్ (ఐటీఈఎస్) రంగంలో కంపెనీలు ఉద్యోగుల పట్ల అనుచిత విధానాలు అనుసరిస్తున్న నేపథ్యంలో వీటిని రాష్ట్ర కార్మిక శాఖ పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. చాలా ఐటీ కంపెనీల్లో ఏకపక్ష తొలగింపులు, ఐడీ బ్లాక్ చేయడం, సామూహిక ఉపసంహరణ, లైంగిక వేధింపులు, అధిక పని గంటల వంటి విషయాలు కార్మిక శాఖ దృష్టికి వచ్చాయని అదనపు లేబర్ కమిషనర్ డాక్టర్ జి.మంజునాథ్ తెలిపారు. వీటిలో కొన్నింటిని లేబర్, ఇండస్ట్రియల్ కోర్టులకు రిఫర్ చేసినట్లు చెప్పారు. ఇక మినహాయింపు లేదు! 'సన్‌రైజ్ ఇండస్ట్రీస్'గా పరిగణిస్తున్న ఐటీ కంపెనీలకు కర్ణాటక పారిశ్రామిక ఉపాధి (స్టాండింగ్ ఆర్డర్స్) చట్టం-1946 నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా మినహాయింపు ఇస్తూ వస్తోంది. చివరిసారిగా 2019 మే 21న ఐదేళ్లపాటు ఈ మినహాయింపును పొడిగించింది. కానీ ఈసారి మినహాయింపును పొడిగించకుండా ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ఆయా కంపెనీలను శాఖ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కర్ణాటకలో మొత్తం 8,785 ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు ఉన్నాయి. వీటిలో దాదాపు 18 లక్షల మంది పనిచేస్తున్నారు. కోవిడ్ తర్వాత, కంపెనీల వేధింపులపై అనేక ఫిర్యాదులు డిపార్ట్మెంట్లో నమోదయ్యాయి. ఈ ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించడానికి, ఈ రంగంలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించడానికి పారిశ్రామిక ఉపాధి (స్టాండింగ్ ఆర్డర్స్) చట్టం-1946ని ఆయా కంపెనీలకు వర్తింపజేయడం అవసరమని అదనపు లేబర్ కమిషనర్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: బెంగళూరులో యాక్సెంచర్ ఏఐ స్టూడియో.. ఏంటిది.. ఏం చేస్తుంది? -
విశాఖలో అమెరికా దిగ్గజ ఐటీ అనుబంధ సంస్థ
సాక్షి, విశాఖపట్నం : ఐటీ రంగంలో దూసుకుపోతున్న విశాఖ నగరంలో మరో దిగ్గజ సంస్థ కొలువుదీరనుంది. అమెరికాలోని ప్రముఖ ఐటీ కంపెనీ ట్రినిటీ సంస్థ హెల్త్‌రైజ్ పేరుతో విశాఖలో ఐటీ అనుబంధ సంస్థ ఏర్పాటుకు ముందుకొచ్చి ంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ విషయాన్ని శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. ఎపిటా, ఏసీఎన్ ఇన్ఫోటెక్ అనే బీపీవో సంస్థ సహకారంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ సుముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. ఇక్కడ 5 వేల మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. రుషికొండ ఐటీ హిల్స్‌లో మంత్రి అమర్నాద్తో హెల్త్‌రైజ్ సంస్థ సీఈవో డేవిడ్ ఫార్బ్మెన్, ఏసీఎన్ ఇన్ఫోటెక్ ఎండీ చమన్బైద్, ఎపిటా సీఈవో కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏపీ ఐటీ సలహాదారు శేషిరెడ్డి శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. సంస్థ అందించే సేవలు, కల్పించే ఉద్యోగావకాశాలపై చర్చించారు. ఏపీని అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేయడంతో అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి అమర్నాథ్ చెప్పారు. బీచ్ ఐటీ కారిడార్‌ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఏపీలో 300 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయని, ఏటా 1,20,000 మంది వివిధ కోర్సులు పూర్తి చేసుకుని బయటికి వస్తున్నారని తెలిపారు. ఇక్కడ ఇంజినీరింగ్ కాలేజీల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. అమెరికాలోని వివిధ టెక్ కంపెనీలలో పని చేస్తున్న ప్రతి నలుగురిలో ఒక తెలుగువాడు ఉంటాడని అమెరికా సంస్థ బృందానికి వివరించారు. స్టార్టప్స్‌లోనూ తెలుగు విద్యార్థులు బాగా రాణిస్తున్నారన్నారు. విశాఖలో మెడ్ టెక్ జోన్ మెడికల్ రీసెర్చ్‌కు, వైద్య రంగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. హెల్త్‌రైజ్ సంస్థ సీఈవో డేవిడ్ మాట్లాడుతూ తమ సంస్థ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడిచేందుకు హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్‌కు సహకారం అందిస్తుందన్నారు. రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్, హెల్త్ కోడింగ్, వైద్య సంస్థలకు ఐటీ సర్విసులు సైతం అందించేలా విశాఖ నుంచి సంస్థ పనిచేస్తుందని తెలిపారు. -
కష్టాల్లో ఐటీ రంగం: టెకీ ఉద్యోగాలపై సంచలన నివేదిక
White collar tech jobs take backseat: వైట్ కాలర్ జాబ్అంటే ముందుగా గుర్తొచ్చేది టెక్ ఉద్యోగమే. అయితే టెక్ ఉద్యోగాలకు సంబంధించిన సంచలన నివేదిక ఒకటి ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకు మరింత ఆజ్యం పోసింది. జాబ్ మార్కెట్లో ఐటీ రంగానికి ఎదురు గాలి తప్పడం లేదు. ప్రస్తుత టెక్ రంగాల్లో నెలకొన్న సంక్షోభం కారణంగా వెట్ కాలర్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి భారతీయ జాబ్ మార్కెట్లు 2,835 స్కోర్‌ను నమోదు చేశాయి, ఇది గత నెలతో పోలిస్తే దాదాపు 6 శాతం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబర్ 2023కి సంబంధించిన నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ ప్రకారం, భారతదేశంలో ఉపాధి ధోరణి నెలవారీగా మెరుగుపడుతున్నట్లు కనిపిస్తోంది. కానీ వార్షిక ప్రాతిపదికన ఇంకా బలహీన ధోరణే కనిపిస్తొంది. గత ఏడాదితో పోలిస్తే 8.6 శాతం క్షీణత నమోదు చేసింది. అయితే అనేక రంగాలు వృద్ధిని కనబరిచడం ఊరటనిస్తోంది. ముఖ్యంగా హాస్పిటాలిటీ , అండ్ ట్రావెల్ రంగం 22 శాతం వృద్ధిని సాధించి స్టార్ పెర్ఫార్మర్గా అవతరించింది. ఇటీవలి నెలల్లో నియామకాల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఐటీ రంగం వెలవెలబోయింది. కష్టాల్లో ఐటీరంగం ప్రపంచ ప్రకంపనల మధ్య ఐటీ రంగం కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవలి నెలల్లో నియామకాల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో, అయినప్పటికీ, బిగ్ డేటా టెస్టింగ్ ఇంజనీర్, IT, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ IT ఆపరేషన్స్ మేనేజర్ లాంటి ఉద్యోగాలకు అధిక డిమాండ్ ఉంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే వంటి ఐటీ-కేంద్రీకృత నగరాల్లో సెప్టెంబర్ 2023లో కొత్త జాబ్ ఆఫర్లు భారీగా తగ్గాయి. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేపనిలో వేలాది మందిని తొలగించాయి. మెటా, అమెజాన్ సంస్థల తాజాగా మరో రౌండ్ కోతల వార్తలు ప్రపంచవ్యాప్తంగా టెకీలను ఆందోళనలో పడేస్తున్నాయి. హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ సెక్టార్ హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ సెక్టార్ గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే సెప్టెంబర్ 2023లో 22 శాతం వృద్ధితో టాప్ ప్లేస్‌ను ఆక్రమించింది. ఈ సీజన్లో చేసుకునే కుటుంబాలు ,ఒంటరి ప్రయాణీకు టూర్లు ఈ వృద్ధికి దోహదపడినట్టు తెలుస్తోంది. రెస్టారెంట్ మేనేజర్ , గెస్ట్ సర్వీసెస్ రోల్స్ వంటి ఉద్యోగాలు డిమాండ్ నేపథ్యంలో ముంబై ఈ రంగంలో ఉద్యోగ ఆఫర్లలో ముందుంది. BFSI ,ఆరోగ్య సంరక్షణ రంగాలు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ (BFSI) సెక్టార్ , హెల్త్‌కేర్ సెక్టార్ కూడా కొంత పురోగతి సాధించాయి. ప్రతి ఒక్కటి సెప్టెంబర్ 2023లో సంవత్సరానికి 7 శాతం వృద్ధిని నమోదు చేశాయి. BFSI రంగంలో, అహ్మదాబాద్, చండీగఢ్ , జైపూర్ వంటి నగరాలు బ్రాంచ్ మేనేజర్ అండ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ వంటి పాత్రలకు డిమాండ్ పెరిగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, BFSIలోని బ్యాంకింగ్ సబ్ సెగ్మెంట్ ఇదే కాలంలో 40 శాతం వృద్ధిని సాధించింది. హెల్త్‌కేర్ సెక్టార్లో, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ రికార్డ్/ఇన్ఫర్మేటిక్స్ మేనేజర్ వంటి స్థానాలకు అధిక డిమాండ్ ఉంది. ఈ సెక్టార్లో హైరింగ్ ఊపందుకోవడంలో అహ్మదాబాద్, కోల్‌కతా ముందున్నాయి. ఆయిల్ & గ్యాస్ , ఆటో రంగాలు ఆయిల్ & గ్యాస్ , ఆటో రంగాలు కూడా సానుకూల ఉపాధి ధోరణులకు దోహదపడ్డాయి, గత సంవత్సరంతో పోలిస్తే సెప్టెంబర్ 2023లో రెండూ 6 శాతం వృద్ధిని నమోదు చేశాయి. BPO/ITES , FMCG రంగాలలో సవాళ్లు: మరోవైపు BPO/ITES, FMCG రంగాలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే సెప్టెంబర్ 2023లో వరుసగా 25 శాతం మరియు 23 శాతం ప్రతికూల వృద్ధిని సాధించింది. నాన్-మెట్రోలు షైన్ ఉద్యోగాల కల్పలనో మెట్రోలతు పోలిస్తే నాన్‌మెట్రో నగరాలుల మెరుగ్గా ఉండటం విశేషం. 2023, సెప్టెంబరులో ఉద్యోగాల కల్పనలో నాన్-మెట్రో నగరాలు మెట్రోలను అధిగమించాయి. వడోదర, అహ్మదాబాద్, జైపూర్ వంటి నగరాలు అదే నెలతో పోలిస్తే నియామకంలో వరుసగా 4 శాతం, 3, 2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత సంవత్సరం. వడోదర BPO/ITES,యు కన్స్ట్రక్షన్/ఇంజనీరింగ్ సెక్టార్ హైరింగ్‌లో రాణించింది. మరోవైపు నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ సోమవారం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వార్షిక నివేదిక 2022-2023 ప్రకారం, 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న నిరుద్యోగిత రేటు దేశంలో జులై 2022-జూన్ 2023 మధ్యకాలంలో ఆరేళ్ల కనిష్టం వద్ద 3.2 శాతంగా నమోదైంది. -
స్కిల్ పెంచండి బాబులూ..!
స్కిల్స్ పలు రకాలు.. ఏ ‘స్కిల్’ ప్రమాదకరమో మొన్నీమధ్యే చూశాం కదా, అలాంటివి కాదు. మనకూ జనానికీ ఉపయోగపడేవి. ఆ స్కిల్స్ చూడండి సరదాగా... సేల్స్.. స్కిల్ ఓ పెద్దమనిషి, అరవై ఏళ్లకు పైబడి ఉంటాడు. జోరు వర్షంలో గొడుగేసుకుని ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పుస్తకాలు అమ్ముతున్నాడు. అప్ప టికే బాగా చీకటి పడింది. ఇది ఆసక్తిగా అనిపించి ఓ యువకుడు కారులోనుంచే.. ‘పుస్తకం ఎంత’ అని అడిగాడు. ‘మూడువేల రూపాయలు. కానీ, నీకు అమ్మబోను. నీకు ఈ పుస్తకం చదివే ధైర్యం ఉన్నట్టు లేదు,’ అన్నాడు ‘‘నాకు చాలా ధైర్యం ఉంది. గంటలో లాగించేస్తాను.’ – అన్నాడా యువకుడు కాస్త రోషంతో. ‘‘..అయితే ఒక షరతు మీద ఈ పుస్తకం నీకు అమ్ముతా, అది ఓకే అయితే నీకు ఓ వంద డిస్కౌంట్ కూడా ఇస్తా..’’ అన్నాడా పెద్దమనిషి ‘‘ఏమిటా షరతు?’’ ‘‘నువ్వు జన్మలో చివరి పేజీ చదవనని ఒట్టు వెయ్యాలి. ఎందుకంటే అది చదివి నువ్వు తట్టుకోలేవు. చాలా బాధపడతావు.’’ ‘‘ఓకే ప్రామిస్!.. నేను ధైర్యవంతుడినే అయినా, చివరి పేజీ చదవను, ఇదిగో డిస్కౌంట్ పోను 2,900 రూపాయలు. పుస్తకం ఇవ్వు..’’ అంటూ మనీ పెద్దమనిషి చేతిలో పెట్టాడు. పెద్దమనిషి డబ్బులు తీసుకుని పుస్తకం ఇస్తూ షరతు గురించి మళ్లీ గుర్తు చేశాడు. పుస్తకం తీసుకున్న యువకుడు ఇంటికి వెళ్లి భయం, భయంగా పుస్తకం చదివేశాడు. క్రైమ్ థ్రిల్లర్ బుక్ అది.. కొంచెం క్రైమ్, కొంచెం సస్పెన్స్ ఉన్నా... మరీ అంత భయంకరంగా లేదు. చివరి పేజీ ఎందుకు చదవ వద్దన్నాడా పెద్దమనిషి? దానిలో అంత తట్టుకోలేని బాధ ఏముంటది? అని మనవాడికి డౌట్ వచ్చింది. చదువుదామని మనసు పీకింది. కాస్త భయం వేసింది. ప్రామిస్‌ను పక్కన పెట్టి... గుండె దిటవు చేసుకుని భయం భయంగా చివరి పేజీ చూస్తే నిజంగానే గుండె ఆగినంత పనైంది.. ఆ చివరి పేజీలో ఇలా ఉంది ‘పుస్తకం ఖరీదు 50 రూపాయలు...’ ఇదీ సేల్స్ స్కిల్... అంతే కదా? ... ఇక ఈ తరహా తెలివితేటలు చూడండి. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. మేడిన్ ఇండియా! ఒకసారి అమెరికా కంపెనీలో సబ్బుల ఫ్యాక్టరీలో ఒక పొరపాటు జరిగింది. కొన్ని కవర్లు ప్యాక్ అయ్యాయి కానీ, అందులో సబ్బుల్లేవు. డీలర్లు, కస్టమర్ల గొడవ.. పెద్దగోలయ్యింది. దానితో యాజమాన్యం కంపెనీలో ఇలాంటి సమస్యలు ఇంకెప్పుడూ రాకూడదనీ, పరువు పోకూడదనీ జాగ్రత్త కోసం ఆరు కోట్లు పెట్టి ఎక్స్‌రే మెషీన్ కొన్నదట. ప్యాకైన సబ్బులు వెళుతుంటే అందులో సబ్బు ఉన్నదీ లేనిదీ ఆ మెషీన్ ద్వారా కనుక్కుని తీసేయడానికి వీలయ్యింది. ఈ విషయం హైదరాబాద్ సబ్బుల కంపెనీలో మీటింగ్‌లో ప్రస్తావనకు వచ్చింది. ఆ అమెరికా కంపెనీలో పనిచేసి ఇక్కడికి వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఒకరు ఆ దేశ టెక్నాలజీని, వాళ్ల స్కిల్‌ను. శ్రద్ధను చిలవలు పలవలుగా వివరిస్తున్నాడు. ఆ మీటింగ్‌లో చాయ్ బిస్కట్ ఎంజాయ్ చేస్తున్న మనోడు లేచి,‘‘ఎందుకు సర్ 6 కోట్లు తగలేశారు. ఓ 3వేలు పెట్టి ‘పెడెస్టెల్ ఫ్యాన్’ కొని స్పీడ్‌గా తిప్పితే ఖాళీ ప్యాకెట్లు ఎగిరిపోతాయిగా. పొరపాటున ఖాళీగా వచ్చేవి ఒకటీ రెండేగా’’... అనేసి మళ్లీ చాయ్ బిస్కట్ మీద పడ్డాడు. దీనితో అమెరికా ఎగ్జిక్యూటివ్ అవాక్కయ్యాడు. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి.. అన్న సామెత అన్నిచోట్లా వర్తించదు. ఎంత పాముకు అంత కర్ర.. అదీ సరైన సమయంలో. – ఇదీ ఓ రకమైన జాబ్ స్కిల్లే కదా! నో స్కిల్... 81 పర్సెంట్... ఇంతకీ స్కిల్లు గురించి ఎందుకీ సొల్లు అంటారా? అత్యుత్తమ ఔట్పుట్ ఇవ్వగల నైపుణ్యాలు ఉద్యోగుల్లో ఉండటం లేదట. ఒకటో, రెండో కాదు.. ఐటీ రంగంలో ఏకంగా 81 శాతం సంస్థలు నైపుణ్యమున్న ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నాయని ఈవై, ఐమోచా సంస్థల అధ్యయనంలో వెల్లడైంది. మంచి నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల కోసం డిమాండ్ పెరుగుతోందని తేలింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల ఉద్యోగుల్లో పని నైపుణ్యాలు, కొత్త టెక్నాలజీలపై అవగాహన అంశాలపై ఈవై, ఐమోచా సంస్థలు అధ్యయనం నిర్వహించాయి. ‘టెక్ స్కిల్స్‌లో మార్పులు – ఆ తర్వాత పని పరిస్థితులు’ పేరిట ఇటీవల నివేదికను విడుదల చేశాయి. – ప్రస్తుత డిజిటల్ యుగంలో పోటీలో నిలిచేందుకు వీలుగా కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకుంటున్నాయనీ.. కానీ వాటికి తగినట్టుగా నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులు దొరకడం కష్టమవుతోందనీ నివేదిక వెల్లడించింది. ఒక్క ఐటీ రంగం మాత్రమే కాకుండా... బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికాం, డేటా అనాలసిస్ వంటి ఇతర రంగాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. – అప్లికేషన్ డెవలపర్లు, పవర్ యూజర్ స్కిల్స్ ఉన్నవారికి డిమాండ్ పెరగడం కూడా కొరత నెలకొనడానికి కారణమని నివేదిక పేర్కొంది. స్కిల్ ఉంటేనే జాబులు... – సర్వేలో పాల్గొన్న చాలా సంస్థలు డెవలపర్, పవర్ యూజర్ నైపుణ్యాల కొరతను ఎదుర్కొంటున్నట్టు తెలిపాయి. కొత్త టెక్నాలజీలు, అవసరాలకు అనుగుణంగా ఏ ఉద్యోగానికి ఏ నైపుణ్యాలు తప్పనిసరి అనే విభజనను అనుసరిస్తున్నామని 19 శాతం కంపెనీలు తెలిపాయి. 43 శాతం కంపెనీలు ఉద్యోగుల స్థాయిలో నైపుణ్యాల పరిశీలన చేపట్టామన్నాయి. ఈ విభజన/పరిశీలన క్రమంలో చాలా మంది ఉద్యోగుల్లో అవసరమైన నైపుణ్యాలు లేనట్టుగా గుర్తించామని వెల్లడించాయి. ఈ క్రమంలో ఓవైపు ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, మరోవైపు మంచి స్కిల్స్ ఉన్నవారిని చేర్చుకోవడంపై దృష్టి పెడుతున్నట్టు వివరించాయి. స్కిల్స్ పెంచేద్దాం... ప్రస్తుతం ఉద్యోగులు నిర్వర్తించాల్సిన విధులు, అందుకు అవసరమైన నైపుణ్యాల్లో ఎన్నడూ లేనంత వేగంగా మార్పులు వస్తున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. 2025 నాటికి తమ సంస్థల్లోని మూడో వంతు ఉద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యాలను గణనీయంగా పెంపొందించాల్సిన అవసరం ఉందని 28 శాతం సంస్థలు భావిస్తున్నాయనీ వివరిస్తోంది. మరో 62శాతం కంపెనీలు కనీసం 15 శాతం మంది ఉద్యోగుల్లో నైపుణ్యాల పెంపు తప్పనిసరి అని భావిస్తున్నట్టు తెలిపారు. ఇండియాలోనూ అంతే.. భారతదేశంలోని 60 శాతానికి పైగా కంపెనీలు నైపుణ్యమున్న ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నట్టు ఇటీవలి ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్’ నివేదికలో ప్రపంచ ఆర్థిక సంస్థ (డబ్ల్యూఈఎఫ్) కూడా పేర్కొంది. ముఖ్యంగా చదువు పూర్తిచేసుకుని కొత్తగా ఉద్యోగాల్లోకి వస్తున్నవారికి తగిన నైపుణ్యాలు ఏమాత్రం ఉండటం లేదని వెల్లడించింది. ఉద్యోగుల్లో నైపుణ్యాల కల్పనకు తోడ్పడే అప్రెంటిస్‌షిప్, ఇంటర్న్‌షిప్, ఆన్ జాబ్ ట్రైనింగ్ వంటి వాటిని భారత్‌లో ఉపేక్షిస్తున్నారని పేర్కొంది. ముఖ్యంగా కంపెనీలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన స్కిల్స్ కల్పించేలా విద్యా రంగంలో సంస్కరణలు రావాల్సి ఉందని అభిప్రాయపడింది. సరికొండ చలపతి -
అలా.. APకి బోలెడు అవకాశాలు
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంతవరకు ఇది చాలా ఆశాజనకమైన వార్త. ఏపీలో ఐటీ రంగం వ్యాప్తికి అనువైన వాతావరణం ఏర్పడుతోంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలు టైర్-2 అంటే.. ద్వితీయ శ్రేణి నగరాలుగా ఈ రంగంలో అభివృద్ది చెందబోతున్నాయని డెలాయిట్, నాస్కామ్ నివేదిక వెల్లడించింది. తెలంగాణలో వరంగల్ నగరం కూడా ఈ జాబితాలో ఉంది. తెలంగాణకు హైదరాబాద్ ఎలాగూ ఐటీ ప్రముఖ కేంద్రంగా ఉంది కనుక ఇక్కడ అభివృద్ది పుంతలు తొక్కడంలో ఇబ్బంది ఉండదు. హైదరాబాద్‌తో పాటు, దక్షిణాదిలో చెన్నై,బెంగుళూరులు కూడా ఐటీ కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. కాని ఆయా నగరాలలో భూమి ధరలు బాగా పెరిగిపోవడం ఒక ఇబ్బందిగా ఉంది. అద్దెలు అధికంగా ఉంటున్నాయి. ఉద్యోగులకు నివాసాలు ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. అయినా ఇక్కడి వాతావరణం, వివిధ కంపెనీలు ఇక్కడే స్థాపితం అవడం వల్ల ఐటి రంగం ఈ నగరాలలోనే కేంద్రీకృతం అయింది.ఈ నేపధ్యంలో ఖర్చులు తగ్గించుకోవడానికి కూడా ఆయా సంస్థలు ఆలోచన సాగిస్తున్నాయి.ఆ క్రమంలో దేశంలోని రెండో శ్రేణి నగరాల వైపు ఈ సంస్థలు దృష్టి పెడుతున్నాయి. అది ఏపీకి పెద్ద అవకాశంగా మారవచ్చు. ✍️ డెలాయిట్ నివేదిక శుభవార్తను అందించింది. దాని ప్రకారం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో ఐటీ సంస్థలు తమ శాఖలను విస్తరించవచ్చని, అలాగే కొత్త సంస్థలు ఏర్పాటు చేసే అవకాశాలు పెరుగుతున్నాయని నివేదిక అభిప్రాయపడింది. విశాఖలో ఇప్పటికే 250 టెక్ సంస్థలు ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో నెలకొల్పబోతున్న అదానీ డేటా సెంటర్ కనుక ఒక రూపానికి వచ్చిందంటే.. ఐటీ రంగంలో విశాఖ దశ మారినట్లే అవుతుందని భావించవచ్చు. ఎందుకంటే ఈ సెంటర్ ఒక్కదానిలోనే సుమారు 15 వేల మందికి ఉద్యోగావకాశాలు రావచ్చు. విశాఖలో ఐటీ సంస్థల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు. స్టార్టప్స్ కూడా అధిక సంఖ్యలోనే ఉన్నాయి. సుమారు 1,100 స్టార్టప్స్ ఉన్నాయని అంచనా. ఎనిమిది ఇంక్యుబేటర్లు ఏర్పాటయ్యాయి. విశాఖ నగరానికి మల్టీకల్చరల్, కాస్మోపాలిటన్ సిటీగా పేరొంది. ముఖ్యమంత్రి జగన్ ఆశిస్తున్నట్లు కార్యనిర్వాహక రాజధాని మొదలైతే.. ఇంకా వేగంగా అభివృద్ది చెందుతుంది. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు, అలాగే విశాఖ నుంచి అనకాపల్లి, పాయకరావు పేట వరకు విస్తరణకు అవకాశం ఉంది. విశాఖకు సముద్ర తీరం ఉండడం కలిసి వచ్చే పాయింట్. టూరిజం రంగంలో కూడా విశాఖకు మంచి గుర్తింపే ఉంది. భవిష్యత్తులో విశాఖ ఐటి రంగంలో మరింత ప్రగతి సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: అభివృద్ధిలో హవా.. ఏపీ నుంచి మూడు ✍️ ఇక విజయవాడ ప్రాంతంలో ఓ మోస్తరుగా ఐటీ సంస్థలు ఉన్నాయి. విజయవాడ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గన్నవరం వద్ద ఇప్పటికే ఒక ఐటీ భవనం ఉంది. అందులో కొన్ని సంస్థలు నడుస్తున్నాయి. ఏలూరు వరకు దీనిని విస్తరించడానికి అవకాశం ఉంది. గన్నవరం పక్కనుంచే విజయవాడకు బైపాస్ రోడ్డు వెళుతుంది. హైదరాబాద్, చెన్నై నగరాలకు వెళ్లడానికి ఇది అనువుగా ఉంటుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి టైమ్‌లో ఐటీ భవనాన్ని నిర్మించారు. ఇక్కడకు సమీపంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం.. ఐటీ రంగ నిపుణులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మరో నగరం తిరుపతిలో వేగంగా ఐటీ అభివృద్ది చెందుతోందని ఈ నివేదిక తెలిపింది. చెన్నైకి దగ్గరగా ఉండడం, భూమి అందుబాటులో ఉండడం,ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతుండడం వంటి కారణాల వల్ల ఐటి సంస్థలు కూడా ఆకర్షితం అవుతాయని అంచనా వేస్తున్నారు. విశాఖలో ఆంధ్రా యూనివర్శిటీ. ఐఐఎం. పెట్రో యూనివర్శిటీ తదితర విద్యా సంస్థలు, విజయవాడకు సమీపంలోనే నాగార్జున యూనివర్శిటీ, తిరుపతిలో ఐఐటీ, ఎస్వీ యూనివర్శిటీ ఉన్నాయి. అలాగే ప్రైవేటు రంగంలో పలు ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలు రాణిస్తున్నాయి. హైదరాబాద్, బెంగుళూరు,చెన్నైలలో పనిచేసే ఐటీ సంస్థ లకు ఎపి కాలేజీల నుంచి అనేక మంది రిక్రూట్ అవుతుంటారు.రెండో శ్రేణి నగరాలలో ఐటీని విస్తరించడం వల్ల కనీసం 25 శాతం వ్యయం తగ్గుతుందని అంటున్నారు. అలాగే కేంద్రీకృత అభివృద్ధి కాకుండా వికేంద్రీకరణకు కూడా అవకాశం ఉంటుంది. ఏపీ ప్రభుత్వం విద్యా రంగానికి విశేష ప్రాధాన్యత ఇస్తోంది. ఆంగ్ల మీడియంతో పాటు, అంతర్జాతీయ సిలబస్‌ను కూడా ప్రవేశపెట్టడానికి కృషి చేస్తోంది. అవన్నీ సత్ఫలితాలు ఇస్తే.. అక్కడ మరింతగా మెరికల్లాంటి నిపుణులు తయారవుతారు. అది కూడా ఈ నగరాలలో ఐటీ విస్తరణకు ఉపయోగపడవచ్చు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్, ఓడరేవు ఆధారిత పరిశ్రమలు, కొత్త పారిశ్రామిక క్లస్టర్లపై దృష్టి సారించింది. ఫార్మా రంగంలో ఏపీకి మంచి స్థానం ఉంది. కొత్తగా వస్తున్న నాలుగు ఓడరేవులు కూడా అభివృద్దికి దోహదపడతాయి. ఈ రంగాలన్నీ ఒకదానికి ఒకటి సహకరించుకునేలా సమన్వయం చేసుకోగలిగితే చాలా మేలు కలుగుతుంది. ఏది ఏమైనా ద్వితీయ శ్రేణి నగరాలైన విశాఖ, విజయవాడ, తిరుపతిలలో కొత్త అభివృద్దికి ఐటీ రంగం దోహదపడితే అంతకన్నా కావల్సి ఏముంటుంది?. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్