
నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి
రిమోట్ వర్కింగ్‌పై నిపుణుల అభిప్రాయాలు
న్యూఢిల్లీ: ఐటీ రంగంలో రిమోట్ పని విధానంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ప్రొఫెషనల్స్‌కు అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ మౌలిక సదుపాయాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే, అంతర్జాతీయ ప్రాజెక్టులను కూడా అందిపుచ్చుకునేలా ప్రొఫెషనల్స్ నైపుణ్యాలను మెరుగుపర్చడంపైనా, తగిన వేదికలను ఏర్పాటు చేయడంపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
దేశ, విదేశ మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు జాతీయ స్థాయిలో అయిదు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. రిమోట్ ఐటీ వర్క్‌తో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని నిపుణులకు అవకాశాలు లభించడంతో ఆదాయ ఆర్జన సామర్థ్యాలు మెరుగుపడి, సమ్మిళిత వృద్ధికి దోహదపడుతుందని టెక్ మహీంద్రా సీవోవో అతుల్ సొనేజా తెలిపారు.
సామర్థ్యాల వెలికితీతకు అవకాశం..
చిన్న పట్టణాల్లోని ప్రతిభావంతుల సామర్థ్యాలను వెలికి తీసేందుకు డిజిటల్ ఇన్‌ఫ్రా, విశ్వసించతగిన ఇంటర్నెట్ కనెక్టివిటీ, కొత్త నైపుణ్యాల్లో శిక్షణా కార్యక్రమాలు అవసరమని జ్ఞానిడాట్‌ఏఐ సీఈవో గణేష్ గోపాలన్ చెప్పారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను పటిష్టం చేయడం, పరిశ్రమలో భాగస్వామ్యాలను పెంపొందించడం మొదలైనవి చిన్న పట్టణాల్లోని ప్రొఫెషనల్స్ అంతర్జాతీయంగా పోటీపడేందుకు ఉపయోగపడగలవని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment