professionals
-
డిజిటల్ ఇన్ఫ్రాపై పెట్టుబడులు పెట్టాలి
న్యూఢిల్లీ: ఐటీ రంగంలో రిమోట్ పని విధానంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ప్రొఫెషనల్స్‌కు అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ మౌలిక సదుపాయాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే, అంతర్జాతీయ ప్రాజెక్టులను కూడా అందిపుచ్చుకునేలా ప్రొఫెషనల్స్ నైపుణ్యాలను మెరుగుపర్చడంపైనా, తగిన వేదికలను ఏర్పాటు చేయడంపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దేశ, విదేశ మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు జాతీయ స్థాయిలో అయిదు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. రిమోట్ ఐటీ వర్క్‌తో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని నిపుణులకు అవకాశాలు లభించడంతో ఆదాయ ఆర్జన సామర్థ్యాలు మెరుగుపడి, సమ్మిళిత వృద్ధికి దోహదపడుతుందని టెక్ మహీంద్రా సీవోవో అతుల్ సొనేజా తెలిపారు. సామర్థ్యాల వెలికితీతకు అవకాశం.. చిన్న పట్టణాల్లోని ప్రతిభావంతుల సామర్థ్యాలను వెలికి తీసేందుకు డిజిటల్ ఇన్ఫ్రా, విశ్వసించతగిన ఇంటర్నెట్ కనెక్టివిటీ, కొత్త నైపుణ్యాల్లో శిక్షణా కార్యక్రమాలు అవసరమని జ్ఞానిడాట్‌ఏఐ సీఈవో గణేష్ గోపాలన్ చెప్పారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను పటిష్టం చేయడం, పరిశ్రమలో భాగస్వామ్యాలను పెంపొందించడం మొదలైనవి చిన్న పట్టణాల్లోని ప్రొఫెషనల్స్ అంతర్జాతీయంగా పోటీపడేందుకు ఉపయోగపడగలవని వివరించారు. -
కొత్త ఉద్యోగానికి సై
న్యూఢిల్లీ: వృత్తి నిపుణుల్లో ఎక్కువ మంది ఈ ఏడాది కొత్త ఉద్యోగం కోసం అన్వేషించనున్నారు. ఈ అన్వేషణ ఇంతకుముందెన్నడూ లేనంత కఠినంగా ఉండనున్నట్టు ప్రొఫెషనల్ నెట్వర్క్ ప్లాట్‌ఫామ్ లింక్డెన్ ఇండియా నిర్వహించిన అధ్యయనంలో తెలిపింది. అర్హతలు ఉన్న నిపుణులను గుర్తించడం సవాలుగా 69 శాతం మంది హెచ్ఆర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వచ్చిన దరఖాస్తుల పరిశీలన కోసం హెచ్ఆర్ నిపుణులు రోజులో 3–5 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారు. 49 శాతం మంది గతంలో కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అన్ని అర్హత ప్రమాణాలు సరితూగే దరఖాస్తుదారులు సగం కంటే తక్కువే ఉంటున్నట్టు 55 శాతం హెచ్ఆర్ నిపుణులు చెబుతున్నారు. ‘‘ఉద్యోగ మార్కెట్ కఠినంగా మారుతోంది. ఉద్యోగాన్వేషణ మరింత ఆలోచనాత్మకంగా ఉండాలని ఇది సంకేతమిస్తోంది. మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా సవాళ్లతో కూడిన ఉద్యోగ మార్కెట్లోనూ కొత్త అవకాశాలను సొంతం చేసుకోవడమే కాకుండా, కెరీర్లో మంచి వృద్ధిని చూడొచ్చు’’అని లింక్డెన్ ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్, కెరీర్ ఎక్స్పర్ట్ నిరజిత బెనర్జీ అన్నారు. గతేడాది నవంబర్ 27 నుంచి, డిసెంబర్ 16 మధ్య ఈ అధ్యయనం జరిగింది. ఇందులో 22,010 మంది నిపుణులు పాల్గొన్నారు. భారత్‌తోపాటు, స్పెయిన్, ఐర్లాండ్, బ్రెజిల్, యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, యూఏఈ, ఆస్ట్రేలియా, జపాన్, స్వీడన్, సింగపూర్, నెదర్లాండ్స్ తదితర దేశాల్లో అధ్యయనం కొనసాగింది. ఈ ఉద్యోగాల్లో వృద్ధి ఎక్కువ.. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్, రోబోటిక్స్ టెక్నీషియన్, క్లోజింగ్ మేనేజర్ ఈ ఏడాది భారత్‌లో ఎక్కువ వృద్ధి చెందే ఉద్యోగాలుగా లింక్డెన్ తెలిపింది. భారత్‌లో ప్రతి ఐదుగురు వృత్తి నిపుణుల్లో ముగ్గురు కొత్త రంగంలో, కొత్త విభాగంలో ఉద్యోగానికి సంసిద్ధంగా ఉండగా.. కొత్త అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలుగా నైపుణ్యాలను నేర్చుకోనున్నట్టు 39 శాతం మంది చెప్పారు. భవిష్యత్తులో ప్రతి ఉద్యోగానికి సంబంధించిన విలువను కృత్రిమ మేథ (ఏఐ) పెంచనున్నట్టు ఈ అధ్యయనం తెలిపింది. మహిళలు మరిన్ని ఉద్యోగ పాత్రల్లోకి అడుగుపెట్టున్నట్టు పేర్కొంది. నవంబర్‌లో పెరిగిన ఉపాధి ఈపీఎఫ్ఓ సభ్యత్వంలో 4.88 శాతం పెరుగుదల ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ)లో సభ్యత్వం నవంబర్‌లో 4.88 శాతం (2023 నవంబర్‌తో పోల్చి) పెరిగింది. ఉపాధి పెరుగుదలను సూచిస్తూ సమీక్షా నెల్లో ఈపీఎఫ్ఓలో 14.63 లక్షల నికర సభ్యత్వం నమోదయినట్లు తాజా పేరోల్ గణాంకాలు పేర్కొన్నాయి. ఇక 2024 అక్టోబర్‌తో పోల్చితే నికర సభ్యత్వం నెలవారీగా 9.07 శాతం పెరగడం గమనార్హం. నవంబర్‌లో నికర మహిళా సభ్యుల చేరిక 3.13 లక్షలు. అక్టోబర్‌తో పోల్చితే ఇది 12.16 శాతం అధికం. వార్షిక పెరుగుదల 11.75 శాతం. నెలలో 20.86 శాతం నికర సభ్యుల చేరికతో మహారాష్ట్ర ముందుంది. మహారాష్ట్ర తర్వాత ఐదు శాతానికిపైగా సభ్యత్వ నమోదులతో కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లు నిలిచాయి. -
కొత్త ఉద్యోగం కోసం నిపుణులు పడిగాపులు
భారతదేశంలో 82 శాతం మంది నిపుణులు 2025లో కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారని లింక్డ్ఇన్(LinkedIn) ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడించింది. ఉద్యోగం(new job) సంపాదించడం గతంలో కంటే ప్రస్తుతం మరింత సవాలుగా మారినట్లు తెలియజేసింది. గతేడాది కంటే ఈసారి ఉద్యోగం సంపాదించడం మరింత కష్టతరం కానుందని 55% ఉద్యోగార్థులు నమ్ముతున్నట్లు లింక్డ్ఇన్ తెలిపింది.లింక్డ్ఇన్ తెలిపిన వివరాల ప్రకారం..2024లో జాబ్ మార్కెట్ మందకొడిగా ఉంది. దాంతో ఉద్యోగం మారాలనుకున్న చాలా మంది తాము చేస్తున్న కంపెనీల్లోనే కొనసాగుతున్నారు.గతేడాది నుంచి కొత్త అవకాశాల కోసం వెతుకుతున్నవారు, ఇప్పటికే ఉద్యోగం మారాలనుకుంటున్నవారు అధికమయ్యారు.2025లో 82 శాతం మంది నిపుణులు కొత్త ఉద్యోగం కోసం చేస్తున్నారు.ఇదీ చదవండి: ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ పయనంకఠినమైన జాబ్ మార్కెట్ ఉన్నప్పటికీ, ఉద్యోగార్థుల్లో కొలువు సంపాదిస్తామనే ఆశావాదం పెరుగుతోంది.58% మంది జాబ్ మార్కెట్ మెరుగుపడుతుందని, 2025లో కొత్త అవకాశాలు వస్తాయని నమ్ముతున్నారు.గతేడాది కంటే ఈసారి ఉద్యోగం సంపాదించడం మరింత కష్టతరం కానుందని 55% ఉద్యోగార్థులు నమ్ముతున్నారు.ఉద్యోగులను అన్వేషించడంలో హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ కూడా ఒత్తిడిని అనుభవిస్తున్నారు.అర్హత కలిగిన ప్రతిభావంతులను(professionals) కనుగొనడం మరింత సవాలుగా మారిందని 69% మంది తెలిపారు. దీంతో 2025లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధానంలో మార్పు వచ్చింది. -
నిపుణులమైనా నేర్చుకుంటాం..
వృత్తిలో ఎంత అనుభవం సంపాదించినా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోకుంటే వెనుకబడిపోతాం. రోజువారీ విధుల్లో నెగ్గుకురాలేం. ఈ ఆవశ్యకతను హైదరాబాద్‌లో ప్రొఫెషనల్స్ గుర్తించారు. పనిలో ముందుకెళ్లేందుకు తోడ్పాటు కోసం అన్వేషిస్తున్నారు.ప్రొఫెషనల్ నెట్వర్క్ అయిన లింక్డ్ఇన్ కొత్త పరిశోధన ప్రకారం, మునుపెన్నడూ లేని విధంగా హైదరాబాద్‌లో 93 శాతం మంది ప్రొఫెషనల్స్ తమ వృత్తిలో ముందుకెళ్లేందుకు మరింత మార్గదర్శకత్వం, తోడ్పాటు కోసం చూస్తున్నారు. కొత్త కొత్త మార్పుల నేపథ్యంలో ఉద్యోగులకు తమ విధుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను మిలితం చేసుకునే అవకాశం ఉంది. దీంతో 63 శాతం మంది తమ కెరీర్లో ముందుకు సాగడం కోసం ఏఐపై ఆధారపడటం సౌకర్యంగా ఉంటుందని నమ్ముతున్నారు.ఫలితంగా ఏఐ ఆప్టిట్యూడ్‌తో కూడిన లింక్డ్ఇన్ లెర్నింగ్ కోర్సుల వినియోగం గత సంవత్సరంలో నాన్-టెక్నికల్ ప్రొఫెషనల్స్‌లో 117 శాతం పెరిగింది. అనుభవం ఒక్కటే సరిపోదని నిపుణులు గుర్తిస్తున్నారు. నగరంలోని 69 శాతం మంది ప్రొఫెషనల్స్ నిరంతరం నేర్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు. 41 శాతం మంది కెరీర్ వృద్ధికి నైపుణ్యం అవసరమని నమ్ముతున్నారు. వర్క్ ప్లేస్ మార్పును ఎదుర్కొంనేందుకు 60 శాతం మంది అవసరమైన నైపుణ్యాలపై మార్గదర్శకత్వం కోసం వెతుకుతున్నారు.ఇదీ చదవండి: వచ్చే ఏడాది ఎవరి జీతాలు పెరుగుతాయి?చాలా మంది సాంకేతిక పురోగతి (51 శాతం), సెక్టార్-నిర్దిష్ట మార్కెట్ విశ్లేషణ (42 శాతం), సామాజిక పోకడలు (34 శాతం) గురించి తెలుసుకొని భవిష్యత్తు అవకాశాల కోసం సిద్ధంగా ఉన్నారు. విషయ పరిజ్ఞానం కోసం హైదరాబాద్‌లోని 46 శాతం మంది నిపుణులు షార్ట్-ఫామ్ వీడియోలను ఆశ్రయిస్తున్నారు. 45 శాతం మంది నిర్దిష్ట నైపుణ్యాలను అందించే లాంగ్-ఫామ్ వీడియో కోర్సులను అత్యంత సహాయకరంగా భావిస్తున్నారు. -
నిలదొక్కుకోవాలంటే నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు ఆవిర్భవిస్తున్న కొత్త టెక్నాలజీల ఫలితంగా ఉద్యోగ భద్రత పట్ల మెజారిటీ నిపుణుల్లో (82 శాతం మంది) ఆందోళన వ్యక్తమవుతోంది. వేగంగా మార్పు చెందుతున్న పని వాతావరణాన్ని అధిగమించేందుకు నైపుణ్యాల పెంపు సాయపడుతుందని వారు భావిస్తున్నారు. విద్యార్థులు, నిపుణులు, విద్యావేత్తలు ఇలా రెండు లక్షల మంది అభిప్రాయాలను హీరో వేద్ (హీరో గ్రూప్ కంపెనీ) పరిగణనలోకి తీసుకుని ఒక నివేదికను విడుదల చేసింది. పని ప్రదేశాల్లో వస్తున్న నూతన మార్పులను, సవాళ్లను అధిగమించడానికి నైపుణ్యాల పెంపు పరిష్కారమని 78 శాతం మంది చెప్పారు. నేటి ఉద్యోగ మార్కెట్లో నిలిచి రాణించేందుకు వీలుగా ఎప్పటికప్పుడు అధ్యయనం, నైపుణ్యాల పెంపుపై అవగాహన పెరుగుతుందడానికి ఇది నిదర్శనమని హీరో వేద్ సీఈవో అక్షయ్ ముంజాల్ తెలిపారు. ‘‘సుస్థిరత, సామర్థ్యం, మానసిక ఆరోగ్యంపై నిపుణులు, కంపెనీలు ఒకే విధమైన దీర్ఘకాల దృష్టితో ఉన్నాయి. దీంతో ఈ రంగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుంది’’అని చెప్పారు. కృత్రిమ మేథ (ఏఐ) విజ్ఞానం కలిగి ఉండడం, తమ కెరీర్లో మెరుగైన అవకాశాలు అందుకోవడానికి కీలకమని 39 శాతం మంది అంగీకరించారు. తమ సంస్థలు ఏఐపై సరైన శిక్షణ అందించడం లేదని 43 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే ఏఐ విభాగంలో కావాల్సిన నైపుణ్యాలకు, అందిస్తున్న శిక్షణకు మధ్య అంతరాన్ని ఇది తెలియజేస్తున్నట్టు నివేదిక గుర్తు చేసింది. 18–55 ఏళ్ల మధ్య వయసున్న నిపుణుల్లో 43.5 శాతం మంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి అదనపు నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. అదనపు నైపుణ్యాలు, ముఖ్యంగా ఏఐ నైపుణ్యాలను నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని 83 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. -
అరచేతిలో అడిక్షన్
అర్ధరాత్రి.. మీరు గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా ఫోన్ మోగడంతో ఉలిక్కిపడి లేచారు. ఈ టైంలో ఫోనా?! ఎవరికి ఏమైందోనన్న ఆందోళనతో మంచం పక్కనే ఉన్న ఫోన్ అందుకుని కంగారుగా స్క్రీన్ వైపు చూశారు. అంతే, ఆశ్చర్యం, కాసింత గందరగోళం.. ఎందుకంటే మీకు అస్సలు ఫోనే రాలేదు. జన సమ్మర్థం ఉన్న ప్రాంతం.. అక్కడ మీరూ ఉన్నారు. అంతలో ఎవరిదో ఫోన్ రింగవుతోంది. ఆ వెంటనే మీ చేయి కూడా మీ జేబులో ఉన్న ఫోన్ మీదికి వెళ్లింది. మీ పక్కనే ఉన్న వ్యక్తి ‘హలో..’ అనడంతో మీకు అర్థమైంది.. రింగైంది మీ ఫోన్ కాదని. అసలు ఆ రింగ్ టోన్ కూడా మీ ఫోన్‌ది కాదు. ఆ విషయం మీకూ తెలుసు.. అయినా రింగ్ వినపడగానే మీ చేయి అలా మీ ఫోన్ మీదికి వెళ్లిపోయింది. ఫుల్ ట్రాఫిక్.. బైక్‌పై వెళుతున్నారు. జేబులో ఉన్న మీ ఫోన్ అప్పటికే రెండు మూడు సార్లు రింగైంది. కానీ ఫోన్ బయటకు తీసి మాట్లాడలేని పరిస్థితి. ఎవరు ఎందుకు కాల్ చేస్తున్నారో అని ఆలోచిస్తూ.. వేగంగా ట్రాఫిక్‌ను దాటి వెళ్లి బైక్‌ను అలా రోడ్డు పక్కన నిలిపి ఫోన్ బయటకు తీసి చూసి షాకయ్యారు. అక్కడ ఎలాంటి కాల్ రాలేదు. మరి రెండు మూడు సార్లు మీరు విన్న ఆ రింగ్ ఎక్కడిది? ఇల్లు.. ఇల్లాలు.. పిల్లలు.. ఓ అందమైన ఇల్లు.. ఆ ఇంట్లో మీరూ, మీ భార్య, ఇద్దరు పిల్లలు. మీరు బయటికి వెళ్లింది మొదలు.. ఇంట్లో ఎదురు చూపులు మొదలవుతాయి. ఉండబట్టలేక పిల్లలు అడిగేస్తారు.. నాన్న ఇంకెప్పుడొస్తారమ్మా? అని. ఆ నాన్న కోసమే ఎదురుచూస్తున్న అమ్మ.. ‘కాసేపట్లో వచ్చేస్తారులే’ అంటూ పిల్లలను సముదాయిస్తుంది. మీరు ఇంట్లోకి అడుగు పెట్టగానే.. ఇక ఆ ఇంట్లో సందడే సందడి. పిల్లల అల్లరితో అది తార స్థాయికి చేరుతుంది. అప్పుడు ఆ ఇల్లు.. నందనవనాన్ని తలపిస్తుంది. గృహమే కదా స్వర్గసీమ అన్న నానుడిని మరిపిస్తుంది. అలాకాకుండా, మీరు ఇంట్లోకి వచ్చీ రావడంతోనే జేబులోంచి మొబైల్ తీసి దానికి అంకితమైపోతే.. గంటల తరబడి దానికే దాసోహమైతే.. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయేంతగా మీ ఫోనే మీకు ప్రపంచమైతే.. మీ ఇల్లాలి సంగతేంటి? నాన్నతో కలిసి అల్లరిచేయడం కోసం ఎదురుచూస్తున్న ఆ పసిబిడ్డల పరిస్థితేంటి? అటు మొబైల్‌తో మీరు.. ఇటు మీ పలకరింపు కోసం నిరీక్షిస్తూ మీ ఇల్లాలు, మీకు బోలెడన్ని కబుర్లు చెప్పాలని పరితపిస్తూ మీ పిల్లలు. ఇంట్లో నలుగురు ఉన్నా.. అంతా నిశ్శబ్ధం! మీకు, మీ భార్యాపిల్లలకు మధ్య అంతులేని అగాథం! కుటుంబానికి టైం కేటాయించడానికి, మొబైల్‌తో టైంపాస్ చేయడానికి మధ్య ఎంత తేడా ఉందో చూడండి.. మనల్ని మనకు కాకుండా చేస్తుంది.. మన చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉందంటే యావత్ ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్టే. అవసరం మేరకు దానిని వినియోగించుకుంటే.. అరచేతిలో అద్భుతమవుతుంది. అంతకు మించి అదే పనిగా దానితో కాలక్షేపం చేస్తే మాత్రం అనర్థాలకు మూలమవుతుంది. ఇలా అతిగా ఫోన్ వాడేవారు దానికి బానిసలవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, విద్యార్థులు, యువత పలు మానసిక సమస్యల బారిన పడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వ్యసనం చాలా ప్రమాదకరం. మన జీవితంపై, మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మనల్ని మనకు కాకుండా చేస్తుంది. మన వారిని మనకు దూరం చేస్తుంది. సెల్‌ఫోనే మనకు జీవితమైనప్పుడు.. ఒంటరి తనాన్ని ఆశ్రయిస్తాం. స్నేహితులకు, బంధువులకు దూరమవుతాం. భార్యాబిడ్డలతోనే ఉంటున్నా.. వారికి అందనంత దూరంలో సెల్‌ఫోన్‌తో సేదదీరుతాం. నిద్ర రాదు.. ఆకలి వేయదు. కళ్లకు తప్ప మెదడుకు పని లేకపోవడంతో మెదడు మొద్దుబారి జ్ఞాపకశక్తి తగ్గడమేగాక.. పలు మానసిక రుగ్మతలకు ద్వారాలు తెరుస్తుంది. ఇలా అయితే బానిస అయినట్టే! మీరు అదే పనిగా ఫోన్ చెక్ చేసుకుంటున్నారా? ఎలాంటి కాల్ రాకుండానే.. వ చ్చినట్టు, ఏ నోటిఫికేషన్ రాకుండానే ఏదో మెసేజ్ వ చ్చినట్టు భ్రమపడుతున్నారా? మీకు ఎలాంటి కాల్ వచ్చే పరిస్థితి లేకున్నా.. ఎవరైనా కాల్ చేస్తారేమోనని ఎదురు చూస్తున్నారా? ఫోన్‌కు మెసేజ్ రావడమే ఆలస్యం.. చేస్తున్న పనిని ఉన్నఫళంగా వదిలేసి క్షణాల్లోనే వాటిని చూసేస్తున్నారా? సోషల్ మీడియాలో గంటల తరబడి గడుపుతున్నారా? అవసరం ఉన్నా లేకున్నా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ లక్షణాలు, లేదా వీటిలో కొన్ని అయినా మీలో కనిపిస్తే.. మీరు స్మార్ట్‌ఫోన్‌కు బానిస అయినట్టే లెక్క. ఒక్కసారి పరీక్షించుకుందాం.. మనం బయటికి వెళ్లేటప్పుడు ఎప్పుడైనా ఓ సారి మొబైల్‌ను ఇంట్లోనే ఉంచుదాం. ఆ తర్వాత మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో గమనిద్దాం. ఏదో పోగొట్టుకున్నట్టు.. దేని మీదా ధ్యాస లేనట్టు.. చేసే పనిమీద ఏకాగ్రత కుదరనట్టు.. ఫోన్లో మునిగిఉన్న వాళ్లను చూస్తే ఉక్రోషం తన్నుకొస్తున్నట్టు.. ఆకలేస్తున్నా అన్నం తినబుద్ధికానట్టు.. చికాకు.. చిరాకు.. పిచ్చెక్కుతున్నట్టు.. వెంటనే ఇంటికి వెళ్లి ఫోన్ తీసుకోవాలని తెగ ఆరాటపడిపోతున్నట్టు.. ఇలా మనలో మెదులుతున్న ఆలోచనల స్థాయిని బట్టి తెలుసుకోవచ్చు.. మనం ఏ స్థాయిలో మొబైల్‌కు బానిసయ్యామో. ఫోన్‌కు బానిసవ్వడం అన్నది తీవ్రంగా ఉందనిపించినప్పుడు వెంటనే మానసిక నిపుణుడిని సంప్రదించాలి. సైకలాజికల్ కౌన్సెలింగ్ అవసరం ప్రతి దానికి సెల్ ఫోన్ మీద ఆధారపడటం ఎక్కువైంది. ఈ అడిక్షన్ అనేది.. సెల్‌ఫోన్ లేకుంటే రోజు గడవదేమో అన్న స్థితికి చేరుకుంది. కొద్దిసేపు మొబైల్ కనపడకపోయినా, చార్జింగ్ పెట్టుకునే సౌకర్యం లేకపోయినా ఆందోళనకు గురవుతున్నారు. ఫోన్ రింగ్ కాకున్నా రింగ్ టోన్ వినిపిస్తున్నట్టు అనిపించడాన్ని రింగ్సైటీ అంటారు. అదేపనిగా ఫోన్ వినియోగించడం వల్ల, ఇన్ఫర్మేషన్ ఓవర్ లోడ్ వల్ల ఈ సమస్య సంభవిస్తుంది. ఈ సమస్యకు సైకలాజికల్ కౌన్సెలింగ్ అవసరం. – ఎం.లహరి, సైకాలజిస్ట్ నోటిఫికేషన్లు ఆపేద్దాం.. మన పనిలో మనం తలమునకలై ఉన్నప్పుడు ఫోన్‌కు వచ్చే అనవసర నోటిఫికేషన్లు మన ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. వాటి ప్రభావం మన పనితీరుపైనా పడుతుంది. ఫోన్‌కు నోటిఫికేషన్ రాగానే ఏదైనా ముఖ్యమైన మెస్సేజ్ వ చ్చిందేమోనని తెగ ఆరాటపడిపోతాం. అందుకే సోషల్ మీడియా యాప్‌లకు సంబంధించిన అన్ని నోటిఫికేషన్లను ఆఫ్‌లో పెట్టుకోవడం ఉత్తమం. అంతకు మించి సమయం ఇవ్వొద్దు.. రోజుకు ఎంత సేపు స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం.. ఏయే యాప్‌లలో ఎక్కువసేపు గడుపుతున్నామో స్పష్టంగా తెలుసుకోవాలి. ఇందుకోసం మన మొబైల్లోనే ఆప్షన్లుంటాయి. మొబైల్ స్క్రీన్‌పై మనం గడుపుతున్న సమయాన్ని వాటి సాయంతో అంచనా వేస్తూ.. మన అవసరం మేర మాత్రమే ఫోన్‌ను వినియోగిస్తూ.. ఫోన్ వాడకం సమయాన్ని క్రమంగా తగ్గించుకుందాం. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం.. సాధారణంగా మనం ఖాళీగా ఉన్నప్పుడే స్మార్ట్ ఫోన్‌కు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం. అలాగే వీకెండ్లలో వీడియోలు చూస్తూనో, గేమ్‌లు ఆడుతూనో లేదా ఫ్రెండ్స్‌తో చాటింగ్‌లు చేస్తూనో గంటల తరబడి గడిపేస్తాం. అలా కాకుండా ఖాళీ వేళల్లో,సెలవులు, వీకెండ్లలో విశ్రాంతి తీసుకోవడం, స్నేహితులను కలవడం, లేదా కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లడం వంటి కార్యక్రమాలు పెట్టుకోవాలి. ప్రతి సమాచారానికి ఫోన్ల మీదే ఆధారపడకుండా.. పుస్తకాల నుంచీ పొందుతుండాలి. బెడ్‌కు దూరంగా.. మొబైల్ మనకు పక్కనే ఉంటే దానిని వాడాలనిపిస్తుంది. నిద్రపట్టకపోయినా, మెలకువ వచ్చినా.. పక్కన ఫోన్ ఉంటే ఇట్టే అందుకుంటాం. ఈ అలవాటును అధిగమించాలంటే మన బెడ్‌కు దూరంగా.. మన చేతికి అందనంత దూరంలో ఫోన్ పెట్టుకోవడం ఉత్తమం. అసలు స్విచ్ఛాఫ్ చేసుకుంటే మరీ మేలు. – తమనంపల్లి రాజేశ్వరరావు,ఏపీ సెంట్రల్ డెస్క్ -
హెచ్–1బీ ప్రోగ్రాంలో మార్పులు
వాషింగ్టన్: ఐటీ తదితర కీలక రంగాలకు చెందిన విదేశీ వృత్తి నిపుణులకు అమెరికాలో పని చేసెందుకు వీలు కలి్పంచే కీలకమైన హెచ్–1బీ వీసా ప్రోగ్రాంలో మార్పుచేర్పులను బైడెన్ సర్కారు ప్రతిపాదించింది. అర్హత ప్రమాణాలు తదితరాలను మరింత క్రమబద్ధం చేయడం, తద్వారా వీసా ప్రక్రియ సామర్థ్యాన్ని పెంచడం, ఎఫ్–1 స్టూడెంట్లకు, పారిశ్రామికవేత్తలకు, నాన్ ఇమ్మిగ్రెంట్ వర్కర్లకు మెరుగైన పరిస్థితులు కలి్పంచేందుకు ఈ మార్పులు దోహదపడతాయని చెబుతోంది. సదరు నిబంధనలను సోమవారం విడుదల చేయనున్నారు... ► ప్రస్తుత ప్రక్రియలో ఒక దరఖాస్తుదారు తరఫున ఎన్ని ఎక్కువ రిజి్రస్టేషన్లు నమోదయితే లాటరీలో ఎంపికయ్యే అవకాశాలు అంత పెరుగుతాయి. ► ప్రతిపాదిత విధానంలో ఒకరి తరఫున ఎన్ని రిజిస్ట్రేషన్లు నమోదైనా ఎంపిక ప్రక్రియలో ఒక ఎంట్రీగానే పరిగణిస్తారు. ► తద్వారా కొందరికే ఎక్కువ అడ్వాంటేజీకి బదులు అర్హులందరికీ సమానావకాశం దక్కుతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. ► ఈ ప్రతిపాదనలపై అందరూ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు వెల్లడించవచ్చని డీహెచ్ఎస్ పేర్కొంది. ► అమెరికా ఏటా విడుదల చేసే 60 వేల హెచ్–1బీ వీసా కోటాలో మార్పుండదు. -
వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు కొత్త తరహా టర్మ్ ప్లాన్స్..
జీవిత బీమాకు సంబంధించి అత్యంత సరళమైన పాలసీ టర్మ్ ఇన్సూరెన్స్. ఇది పాలసీదారు కన్నుమూసిన పక్షంలో, వారు తమ జీవితకాలంలో చెల్లించిన ప్రీమియంలకు ప్రతిగా వారి కుటుంబసభ్యులకు (లబ్ధిదారులకు) నిర్దిష్ట మొత్తాన్ని చెల్లిస్తామంటూ బీమా కంపెనీ ఇచ్చే హామీ. కొత్త ఇన్వెస్టర్లు సాధారణంగానే సరళమైన, సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లను అన్వేషిస్తుంటారు కాబట్టి వారి కేటగిరీలో టర్మ్ ప్లాన్లకు ఆదరణ ఉంటోంది. ఈ పాలసీల కాలవ్యవధి 15 నుంచి 40 ఏళ్లు, అంతకు పైబడి ఉంటుంది. తమకు అనుకూలమైన కాలవ్యవధిని పాలసీదారు ఎంపిక చేసుకోవచ్చు. పాలసీ ప్రారంభమయ్యే సమయానికి పాలసీదారు వయస్సు, ఎంచుకున్న మొత్తం సమ్ అష్యూర్డ్ బట్టి ప్రీమియం ఉంటుంది. వార్షిక ప్రీమియం ఎంత కట్టాల్సి ఉంటుందనేది తెలుసుకునేందుకు చాలా మటుకు బీమా కంపెనీల వెబ్సైట్లలో ఉండే ఆన్లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాల్క్యులేటర్లను కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు. దురదృష్టవశాత్తూ ఒకవేళ పాలసీదారు మరణించిన పక్షంలో నామినీకి మొత్తం సమ్ అష్యూర్డ్ లభిస్తుంది. ఇన్సూరెన్స్ కాల వ్యవధి తీరేంత వరకు పాలసీదారు జీవించే ఉన్న పక్షంలో వారు మొత్తం సమ్ అష్యూర్డ్‌తో పాటు బోనస్‌ల రూపంలో వడ్డీని కూడా పొందే విధమైన పాలసీలూ ఉన్నాయి. కొన్ని కంపెనీలు దీనికి అదనంగా ప్రత్యేక అలవెన్సులు, బహుమతులు, లాయల్టీ అడిషన్ వంటివి కూడా ఇస్తున్నాయి. టర్మ్ ప్లాన్లకు ఎందుకింత ఆదరణ.. వివిధ ప్రొఫెషన్స్‌కు చెందిన కస్టమర్లు తమకు అవసరమైనవి ఎంపిక చేసుకునేలా వివిధ ఫీచర్లు, సరళమైన ఆప్షన్స్‌తో టర్మ్ ప్లాన్లు లభిస్తాయి. కొన్ని ప్లాన్లు డెత్ క్లాజ్‌తో వచ్చినప్పటికీ యాక్సిడెంటల్ డెత్, శాశ్వత వైకల్యం, తీవ్ర అనారోగ్యం వంటి ఆప్షన్స్‌తో పాటు నిర్దిష్ట వయస్సుకు వచ్చాకా పెన్షన్ పొందేటువంటి అదనపు క్లాజ్లతో కూడా లభిస్తుంటాయి. ఇక కొన్ని టర్మ్ ప్లాన్లలో మనీ బ్యాక్ ఫీచర్ ఉంటుంది. ఈ తరహా పాలసీలో ప్రతి 5 నుంచి 10 ఏళ్లకోసారి సమ్ అష్యూర్డ్‌లో నిర్దిష్ట శాతం మొత్తాన్ని పాలసీదారుకు బీమా సంస్థ తిరిగి చెల్లిస్తుంది. ఈ చెల్లింపులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10 కింద ఇన్‌కం ట్యాక్స్ నుంచి మినహాయింపు లభిస్తుంది. పిల్లల చదువు లేదా వివాహం లేదా వ్యాపారంపై పెట్టుబడి పెట్టుకోవడం వంటి ఖర్చుల కోసం పాలసీదారుకి ఈ మొత్తం ఉపయోగపడగలదు. కొన్ని టర్మ్ ప్లాన్లలో చెల్లించాల్సిన ప్రీమియాన్ని తగ్గించుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. కొందరు ప్రొఫెషనల్స్‌కు సంపద ఉండొచ్చు. దానితో పాటు కట్టాల్సిన బకాయిలు, అప్పులూ ఉండొచ్చు. అలాంటి వారు తమకు ఆర్థికంగా భారం కాకుండా తక్కువ ప్రీమియాన్ని చెల్లించే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. తద్వారా వారు పెట్టుబడి పెట్టడం కోసం పెద్ద మొత్తంలో నగదును కేటాయించాల్సిన అవసరం లేకుండా, అలాగే అదే సమయంలో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా తమ ఆర్థిక భవిష్యత్తును భద్రపర్చుకునేందుకు ఇది ఉపయోగపడగలదు. ఎండోమెంట్ పాలసీగా లేదా నెలవారీ యాన్యుయిటీలతో కూడుకున్న పెన్షన్ ఫండ్‌లాగా మార్చుకునే సౌలభ్యంతో కూడా పలు టర్మ్ పాలసీలు లభిస్తున్నాయి. ఆ విధంగానూ ఇవి ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ఇలాంటి కేసుల్లో బీమా కంపెనీ, ప్రీమియాన్ని సవరించే అవకాశం ఉన్నప్పటికీ, మారే తమ అవసరాలకు అనుగుణమైన బీమా పాలసీ ప్రయోజనాలను పాలసీదారు పొందవచ్చు. కొందరు ప్రొఫెషనల్స్ తమ టర్మ్ ప్లాన్లను హోల్ లైఫ్ పాలసీలుగా మార్చుకోవాలనుకోవచ్చు. అలాంటప్పుడు సర్వైవల్ ప్రయోజనాలు లభించవు. దానికి బదులుగా పాలసీదారు మరణానంతరం, పాలసీ మెచ్యూరిటీ మొత్తాన్ని వారి నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు బీమా కంపెనీ చెల్లిస్తుంది. కొత్త తరహా ప్లాన్స్ .. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా బీమా కంపెనీలు టర్మ్ పాలసీల్లో పలు కొత్త ఫీచర్లను అందిస్తున్నాయి. డెత్ క్లాజ్‌తో పాటు కొన్ని టర్మ్ ప్లాన్లు 64 పైచిలుకు కీలక అనారోగ్యాలు, వ్యాధులకు కవరేజీ అందిస్తున్నాయి. ఇక టర్మ్ ప్లాన్ 40 ఏళ్ల పైబడిన కాలానికి ఉన్నా, పాలసీదారులు 60 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేని విధమైన పాలసీలూ ఉన్నాయి. సదరు వయస్సుకు వచ్చాకా రిటైర్ అయ్యే ప్రొఫెషనల్స్ ఈ తరహా టర్మ్ పాలసీలతో ప్రయోజనం పొందవచ్చు. ఇక కొన్ని కొత్త రకం ప్లాన్లను చూస్తే.. వరుసగా పదేళ్ల పాటు ప్రీమియంలు చెల్లించిన తర్వాత కొన్ని ప్రీమియంలను దాటవేసేందుకు వీలు కల్పించేవీ ఉంటున్నాయి. తద్వారా పాలసీదారులకు ఒక ఏడాది, రెండేళ్ల పాటు కాస్త వెసులుబాటు లభించగలదు. ఏదైతేనేం.. తమ భవిష్యత్తు అలాగే తాము ప్రేమించే వారి భవిష్యత్తుకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు టర్మ్ పాలసీలపై ఇన్వెస్ట్ చేయడం వివేకవంతమైన నిర్ణయం కాగలదు. ఆలస్యం చేసే కొద్దీ వయస్సును బట్టి ప్రీమియం భారం కూడా పెరిగిపోతుంది కాబట్టి.. దీన్ని ఎంత ముందుగా తీసుకుంటే అంత మంచిది. -
భారత నిపుణుల్లో ఏఐ పట్ల మక్కువ
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్/ఏఐ)కు ప్రాధాన్యం పెరగడంతో, భారత నిపుణులు ఈ నైపుణ్యాలను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఏఐ నైపుణ్యాలు కలిగిన వారి సంఖ్య 2016 జనవరి తర్వాత 14 రెట్లు పెరిగినట్టు ప్రొఫెషనల్ సోషల్ మీడియా నెట్వర్క్ ‘లింక్డిన్’ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. దీంతో ఏఐ నైపుణ్యాల పరంగా టాప్–5 దేశాల్లో సింగపూర్, ఫిన్లాండ్, ఐర్లాండ్, కెనడాతోపాటు భారత్ ఒకటిగా ఉందని తెలిపింది. 2016 జనవరి నాటికి నిపుణుల ప్రొఫైల్స్, తాజా ప్రొఫైల్స్‌ను లింక్డెన్ విశ్లేషించింది. కనీసం రెండు రకాల ఏఐ నైపుణ్యాలు పెరిగిన ప్రొఫైల్స్‌ను పరిగణనలోకి తీసుకుంది. ‘‘గడిచిన ఏడాది కాలంలో పని ప్రదేశాల్లో ఏఐ వినియోగం పెరిగింది. దీంతో ఏఐ నైపుణ్యాలను సొంతం చేసుకుంటే కెరీర్ అవకాశాలు మరింత మెరుగుపడతాయని భారత్‌లో 60 శాతం మంది ఉద్యోగులు, 71 శాతం జనరేషన్ జెడ్ నిపుణులు గుర్తించారు’’అని లింక్డిన్ తెలిపింది. ఏఐ, ఎంఎల్‌కు ప్రాధాన్యం ప్రతి ముగ్గురిలో ఇద్దరు 2023లో కనీసం ఒక డిజిటల్ స్కిల్ నేర్చుకుంటామని లింక్డ్ఇన్ నిర్వహించిన సర్వేలో చెప్పారు. ముఖ్యంగా ఏఐ, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్న నైపుణ్యాల్లో అగ్రభాగాన ఉన్నా యి. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు సైతం ఏఐ నైపుణ్యాలపై శిక్షణ, నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వచ్చే ఏడాది తమ సంస్థల్లో ఏఐ వినియోగాన్ని పెంచే ప్రణాళికతో 57 శాతం మంది ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. మార్పులు స్వీకరించే విధంగా తమ ఉద్యోగులకు తిరిగి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి కంపెనీలు చురుగ్గా పనిచేస్తున్నాయి. ‘‘భవిష్యత్ పనితీరు విధానాన్ని ఏఐ మార్చనుంది. భవిష్యత్‌కు అనుగుణంగా ప్రపంచస్థాయి మానవ వనరుల అభివృద్ధికి వీలుగా నైపుణ్యాల ప్రాధాన్యం, ఉద్యోగుల సామర్థ్యాలను భారత్ గుర్తించింది’’అని లింక్డిన్ ఇండియా కంట్రీ మేనేజర్ అశుతోష్ గుప్తా తెలిపారు. -
వృత్తి నిపుణుల జాబితాలోకి కౌలు రైతులు
సాక్షి, అమలాపురం/కొత్తపేట: వైద్యులు.. ఇంజి నీర్లు.. ప్రభుత్వ ఉద్యోగులు.. వ్యాపారులు.. ప్రైవేట్ ఉద్యోగులతోపాటు వ్యవసాయ రంగంలోని కౌలు రైతులు కూడా వృత్తి నిపుణుల జాబితాలో చేరారు. ఇతర వృత్తి నిపుణులకు ఇస్తున్న మాదిరిగానే ఇకపై కౌలుదారులను కూడా అగ్రికల్చర్ ప్రొఫెషనల్స్ (వ్యవసాయ నిపుణులు)గా గుర్తిస్తూ ఇకపై వీరికి కూడా వ్యక్తిగత రుణాలు అందించేందుకు అంబేడ్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. పంట భూమి లేకపోయినా.. వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులను ‘అగ్రికల్చరల్ ప్రొఫెషనల్స్’గా గుర్తించి జిల్లా యంత్రాంగం రుణాలు మంజూరుకు శ్రీకారం చుట్టింది. రెవెన్యూ అధికారుల సిఫార్సులతో.. కౌలు కార్డులు (సీసీఆర్సీ) ఉన్నా రుణాలు అందుకోలేక ఇబ్బంది పడుతున్న కౌలుదారుల దుస్థితిని గుర్తించిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం రైతుల పేరిట సెంటు భూమి లేకున్నా.. సంబంధిత వీఆర్వో, వీఏవోలు, తహసీల్దార్ సిఫార్సు మేరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) రుణాలు మంజూరు చేసింది. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలో తొలివిడతగా 10 మండలాల్లోని 10 గ్రామాలను ఎంపిక చేసి.. ఆయా గ్రామాల్లో 540 మంది అగ్రికల్చరల్ ప్రొఫెషనల్స్‌కు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరిలో 323 మందికి మంగళవారం రుణాలు అందజేశారు. కొత్తపేట మండలం అవిడిలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎంపిక చేసిన రైతులకు రూ.1,40,58,100 చెక్కు రూపంలో అందజేశారు. విజయవంతమైతే అన్ని గ్రామాలకు విస్తరణ కలెక్టర్ శుక్లా మాట్లాడుతూ.. తొలి దశలో 10 మండలాల్లోను, రెండవ దశలో మిగిలిన 22 మండలాల్లోని 25 గ్రామాల్లోని ఈ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. వ్యక్తిగత రుణాలతోపాటు ఐదు మండలాల పరిధిలో 38 గ్రూపులకు చెందిన 526 మంది రైతులకు సైతం రుణాలు అందించనున్నారు. 6 నెలల్లో ఫలితాలు చూసి జిల్లాలోని అన్ని గ్రామాలకూ విస్తరిస్తామన్నారు. ఇందుకోసం డీసీసీబీతోపాటు యూనియన్ బ్యాంక్ సైతం ముందుకు వచ్చాయని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలో దీనిని అమలు చేయడం అభినందనీయమన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి కౌలు రైతులకు మేలు చేసేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు పాల్గొన్నారు. బ్యాంక్ రుణం ఇదే తొలిసారి నేను 30 ఏళ్లుగా వ్యవ సాయం చేస్తున్నా. నాకు సొంత భూమి లేదు. ఏటా పరిస్థితిని బట్టి 10 నుంచి 20 ఎకరాల వరకు సాగు చేస్తాను. ఎప్పుడూ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేయడం తప్ప ప్రభుత్వం నుంచి లేదా బ్యాంకుల నుంచి రుణం పొందలేదు. జగన్ హయాంలో తొలిసారిగా బ్యాంక్ రుణం వచ్చింది. రైతు భరోసా పేరుతో రైతుల అకౌంట్లలో సొమ్ములు వేస్తున్నట్టుగా ఇప్పుడు మా అకౌంట్లో రుణం సొమ్ములు వేశారు. చాలా సంతోషంగా ఉంది. – టి.వీరన్న, అవిడి, కొత్తపేట మండలం వడ్డీకి అప్పు తెచ్చేవాళ్లం ఇప్పటివరకు వ్యాపారుల వద్ద అప్పులు చేయడం.. నూటికి రూ.3 నుంచి రూ.5 చొప్పున ప్రతినెలా వడ్డీ చెల్లించే వాళ్లం. పైగా ధాన్యం వారు కట్టిన ధరకే అమ్మాల్సి వచ్చేది. సాగు మధ్యలో కాని అప్పులు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు రూ.1.20 వడ్డీ. సాగుకు ముందే రుణం ఇచ్చారు. తిరిగి చెల్లించడం ద్వారా మరిన్ని రుణాలు పొందుతాం. – డి.పెంటయ్య, అవిడి, కొత్తపేట మండలం -
ఇంకా.. ఇంకా ఎదగాలి.. పరుగెత్తయినా పాలే తాగుతాం!
ఉన్న దానితో సంతృప్తి చెందాలి అందలాలు ఆశించకూడదు అనే సనాతన భావాలను నేటి తరం తోసిరాజంటున్నారు. నిలబడి తాగే నీళ్లు తమకు వద్దని పరుగెత్తయినా పాలే తాగుతామని చెబుతున్నారు. ఐదు, ఆరు అంకెల జీతాలు, హోదాలు అందుకున్నా అక్కడితో ఆగిపోవడం చేత కాదని, ఎదుగుదల అనేది నిర్విరామ ప్రయత్నమని స్పష్టం చేస్తున్నారు. అత్యుత్తమ ఆదాయాలు, హోదాలు ఆశిస్తూ తమ నైపుణ్యాలకు సానపట్టడంలో మన ప్రొఫెషనల్స్ అంతర్జాతీయంగా ముందున్నారని నగరంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రొఫెషనల్స్‌పై నిర్వహించిన ఓ అధ్యయనం తేల్చింది. –సాక్షి, హైదరాబాద్ తమకున్న నైపుణ్యాలు, అవి తెచ్చిపెట్టిన ఉపాధి, ఆదాయాలతో ఐటీ సంబంధిత రంగాలకు చెందిన నిపుణులు సరిపుచ్చుకోవడం లేదు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ తమ సామర్థ్యాలను పదను పెట్టుకోవాలని మరింత మెరుగైన స్థితిని అందిపుచ్చుకోవాలనుకుంటున్నారు. ఈ విషయంలో అంతర్జాతీయంగా అన్ని దేశాల కన్నా మనవాళ్లు ముందే ఉన్నారని ప్రముఖ ఎడ్ టెక్ ప్లాట్ ఫామ్ అయిన గ్రేట్ లెర్నింగ్...తన ‘అప్ స్కిల్లింగ్ ట్రెండ్స్ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఈ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలివే... ♦ కెరీర్లలో ఎదుగుదల కోసం మన దేశంలో 85% మంది ప్రొఫెషనల్స్ అప్ స్కిల్లింగ్ ఎంతో ముఖ్యమైందిగా భావిస్తుంటే, అంతర్జాతీయంగా ఈ సగటు 76%గా ఉంది. ఇక అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల ప్రొఫెషనల్స్‌లో 64% మంది మాత్రమే అప్ స్కిల్లింగ్‌కు సై అంటున్నారు. ♦ మన ప్రొఫెషనల్స్ లో 71 % మంది తమ ఉద్యోగాలను నిలబెట్టుకోగలమని ఆత్మవిశ్వాసంతో ఉండగా, ఈ విషయంలో అంతర్జాతీయ సగటు 59% మాత్రమే. ♦ ఈ ఏడాది తమ ఉద్యోగాలను నిలబెట్టుకునే విషయంలో అంతర్జాతీయంగా చూస్తే లాటిన్ అమెరికా అత్యంత తక్కువ ఆత్మ విశ్వాస శాతాన్ని (44%) కలిగి ఉంది. ♦ భారతదేశం, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికాలలో ఆఫీస్ వర్క్ అనేది ప్రొఫెషనల్స్ ఎదుగుదలకు అడ్డంకిగా మారుతోంది. అదే సమయంలో అమెరికా, పశ్చిమాసియాలలో కుటుంబ బాధ్యతలు అనేవి ప్రొఫెషనల్స్ అప్ స్కిల్ కావడంలో అడ్డంకిగా ఉన్నాయి. ♦అప్ స్కిల్ కావడంలో ప్రొఫెషనల్స్‌కు ప్రేరణ కలిగించే అంశాల్లో పని చేస్తున్న సంస్థలో పెద్ద హోదా ప్రధాన కారణం కాగా, వ్యక్తిగత ఆస్తులు రెండో కారణంగా నిలిచింది. కొత్త ఉద్యోగాన్ని పొందడం అనేది 3వ స్థానంలో నిలిచింది. -
నైపుణ్యాలను పెంచుకుంటాం
న్యూఢిల్లీ: కెరీర్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకునేందుకు మన దేశంలో ఎక్కువ మంది నిపుణులు సానుకూల దృక్పథంతో ఉన్నారు. ఎడ్టెక్ ప్లాట్‌ఫామ్ ‘గ్రేట్ లెర్నింగ్’ ఈ మేరకు ఒక అధ్యయనం నిర్వహించి నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయంగా చూస్తే నైపుణ్యాల పెంపు విషయంలో భారత్‌లోనే ఎక్కువ మంది సానుకూల ధోరణితో ఉన్నారు. అలాగే, తమ ఉద్యోగాలను కాపాడుకోగలమని భారత్‌లో 71% మంది నిపుణులు చెప్పగా, అంతర్జాతీయంగా ఇలా చెప్పిన వారు 59 శాతంగానే ఉన్నారు. అంటే భారత్‌లోనే ఎక్కువ మంది ఉద్యోగ భద్రత విషయంలో నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది. నైపుణ్యాల పెంపు, ఈ దిశగా వారిని ప్రేరేపించే అంశాలు, నైపుణ్యాలను పెంచుకోకుండా అడ్డుపడే అంశాలు, కార్యాలయాలు తిరిగి తెరవడం వల్ల నైపుణ్యాల పెంపుపై ప్రభావం గురించి గ్రేట్ లెర్నింగ్ సంస్థ తన నివేదికలో వివరాలు వెల్లడించింది. సర్వే అంశాలు.. ► మన దేశంలో 85 శాతం మంది నిపుణులు అదనపు నైపుణ్యాలు సంపాదించడం ద్వారా తమ కెరీర్లో భవిష్యత్తు అవసరాలకు సన్నద్ధంగా ఉండాలని అనుకుంటున్నట్టు చెప్పారు. కానీ, అంతర్జాతీయంగా చూస్తే 76 శాతం మంది ఈ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ► ఆగ్నేయాసియా దేశాల నుంచి 84 శాతం మంది, ల్యాటిన్ అమెరికా నుంచి 76 శాతం మంది నిపుణులు అదనపు నైపుణ్యాల ప్రాముఖ్యాన్ని తెలియజేశారు. ► అభివృద్ధి చెందిన అమెరికాలో తమ కెరీర్ భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలను సముపార్జించుకుంటామని కేవలం 64 శాతం మంది చెప్పగా, మధ్య ప్రాచ్యం నుంచి 66 శాతం మంది ఈ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ► 2023లోనే తాము నైపుణ్యాలను పెంచుకుంటామని 83 శాతం మంది భారతీయులు చెప్పగా, అంతర్జాతీయంగా 74 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని తెలియజేశారు. ► 71 శాతం మంది భారతీయ నిపుణులు తమ ఉద్యోగాలను నిలుపుకుంటామని చెప్పగా, అంతర్జాతీయంగా 59 శాతం మంది ఈ విధమైన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ► మన దేశంలో 71 శాతం మంది నిపుణులు ప్రస్తుత ఉద్యోగాల్లో కొనసాగుతామని చెప్పారు. అంతర్జాతీయంగా ఇలా చెప్పిన వారు 59 శాతంగా ఉన్నారు. ► అమెరికాలో 59 శాతం మంది నిపుణులు ఉద్యోగ భద్రతను ప్రదర్శించారు. ఆగ్నేయాసియాలో ఇది 60 శాతంగా ఉంది. నేర్చుకోవడానికి సిద్ధం మెజారిటీ ఉద్యోగుల మనోగతం పియర్సన్ స్కిల్ అవుట్‌లుక్ సర్వేలో వెల్లడి తమ కెరీర్ అవసరాలకు అనుగుణంగా ఉండేందుకు తాము కెరీర్ అంతటా నేర్చుకునేందుకు, శిక్షణ తీసుకునేందుకు సుముఖంగా ఉన్నా మని 88% మంది ఉద్యోగులు తెలిపారు. కొత్త భాషను, ముఖ్యంగా ఇంగ్లిష్ నేర్చుకోవడం వల్ల తమ కెరీర్లో పురోగతికి తోడ్పడుతుందని వారు భావిస్తున్నారు. పియర్సన్ స్కిల్ అవుట్‌లుక్ సర్వే లో ఈ విషయాలు తెలిశాయి. అమెరికా, బ్రిటన్, భారత్, బ్రెజిల్లో 4,000 మంది ఉద్యోగుల అభిప్రాయాల ఆధారంగా సర్వే వివరాలు విడుదలయ్యాయి. ► ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా ఉండేందుకు నేర్చుకోవడాన్ని కొనసాగిస్తామని ప్రతి 10 మందిలో 9 మంది చెప్పారు. ► కంపెనీలు తమకు నైపుణ్య శిక్షణను ఆఫర్ చేస్తాయని 75 శాతం మంది చెప్పారు. ► మన దేశంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా ప్రాసెసింగ్, కోడింగ్ భవిష్యత్తు ప్రాధాన్య నైపుణ్యాలుగా ఉన్నాయి. ► భవిష్యత్ మానవ నైపుణ్యాలుగా భాషను జెనరేషన్ జెడ్ గ్రూపులోని వారు (1990– 2010 మధ్య జన్మించిన) చూస్తున్నారు. ► జెనరేషన్ ఎక్స్‌లోని వారు తమ కెరీర్ వృద్ధి పట్ల సానుకూల దృక్పథంతోఉన్నారు. ► గత మూడేళ్లలో ఎదురైన అనిశ్చితుల నేపథ్యంలో తమ కెరీర్‌పై పునరాలోచన చేస్తున్నట్టు 88 శాతం జెనరేషన్ జెడ్ వారు చెప్పారు. -
ప్రొఫెషన్ ఏదైనా.. యాక్టింగే ప్యాషన్, అదరగొడుతున్న భాగ్యనగర వాసులు
సికింద్రాబాద్‌కు చెందిన గిరి డయాబెటిక్ కన్సల్టేషన్ కోసం నగరంలోని ఓ ప్రముఖ ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్‌ను కలవడానికి వెళ్లాడు. డాక్టర్‌ను చూడగానే ఆయన్ను ఎక్కడో బాగా చూసినట్టు అనిపించింది. కాసేపటికి గుర్తొచ్చింది. మొహమాటం పడకుండా ‘మీరు ఫలానా వెబ్ సిరీస్‌లో నటించారు కదా డాక్టర్?..’అంటూ అడిగాడు. ఆయన అవునంటూ చిరునవ్వుతో సమాధానమివ్వడంతో సంబరపడి పోయాడు. గిరి లాంటి అనుభవాన్ని నగరంలో చాలామంది ఎదుర్కొంటున్నారు. సీరియల్స్, వెబ్ సిరీస్‌లు బాగా చూసేవారికి ఇలాంటి వారు ఎక్కడో ఒకచోట తారస పడుతున్నారు. వెబ్ సిరీస్‌లు, సీరియల్స్ రూపంలో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న నగరవాసులు, తమలో అప్పటివరకు అంతర్లీనంగా ఉన్న నటనా కౌశలాన్ని ప్రదర్శిస్తున్నారు. వీలైతే సినిమాల్లోనూ చాన్స్ కొట్టేస్తున్నారు. మొత్తం మీద ఏ వీధి వెదికినా ఆ వీధిలోనే గలరు యాక్టర్లు అన్నట్టుగా సిటీ మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. సాక్షి, హైదరాబాద్: గతంలో నటులు అంటే నాటకాలనో, సినిమాలనో కెరీర్‌గా ఎంచుకున్నవారే అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వృత్తిలా కాకుండా హాబీగా నటించేవారి సంఖ్య పెరిగిపోయింది. గత ఐదేళ్ల కాలంలో ఆన్లైన్ సరీ్వసుల మాదిరి ఈ హాబీ కూడా ఒక్కసారిగా ఊపందుకుంది. ముఖ్యంగా ఓటీటీ వేదికలు విస్తృతమవడం, పెద్దసంఖ్యలో సీరియల్స్, వెబ్ సిరీస్‌లు రూపుదిద్దుకుంటుండడంతో నటీనటులకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. పాత్రోచితంగా కనిపించే వ్యక్తులకు కాస్తంత శిక్షణ అందిస్తే చాలు పనై పోతోంది. వయసులకు అతీతంగా నగరంలో అనేకమందికి నటన ఓ ప్యాషన్‌గా మారిపోయింది. ప్రేక్షకాభిరుచిలో మార్పు... ► నటనలో పేరున్నవారు, బాగా తెలిసిన ముఖా లను మాత్రమే కాకుండా కొత్త వారిని కూడా ఆదరించే దిశగా ప్రేక్షకుల అభిరుచుల్లో స్పష్ట మైన మార్పు వచి్చంది. దీంతో నిర్మాతలు కొత్త నటీనటులతో ప్రయోగాలు చేయడానికి గతంలోలా భయపడడం లేదు. అంతేకాకుండా ఏ రంగంలో ఉన్నవారు ఆ రంగానికి సంబంధించిన పాత్ర లో కాస్త సులభంగా మమేకమ య్యే వీలుంటుంది. కాబట్టి వినూ త్న పద్ధతుల్లో సినిమాలో వైద్యుడిపాత్ర ఉంటే వైద్యుడిని, లాయర్ పాత్రకు లాయ ర్ని ఎంచుకుంటున్నారు. సర దాగా ఓ సీన్లో చేసేవారు కొందరైతే, ఇంకొందరు ప్రాధాన్యత కలిగిన పాత్రల్లోనూ తమ సత్తా చూపుతున్నారు. దీంతో రంగాలేమైనా తెరంగేట్రం సాధారణ విషయంగా మారిపోయింది. ఓ గంగవ్వ.. ఇంకో రామ్.. మరో శ్రీనివాస్ నటనపై ఉన్న ఆసక్తి కారణంగా సరదాగా టిక్ టాక్స్‌తో మొదలుపెట్టి రీల్స్, షార్ట్ వీడియోల్లో, సోషల్ మీడియా వేదికలపై కాస్తో కూస్తో పేరు సంపాదించుకున్నవారితో పాటు ఇతరత్రా రంగాల్లో ఉన్నవారు కూడా సీరియల్స్, వెబ్ సిరీస్‌ల్లో నటించేస్తున్నారు. సినిమా తారలుగానూ మారిపోతున్నారు. ఒక యూట్యూబ్ చానెల్ ప్రోగ్రామ్ ద్వారా పేరు తెచ్చుకున్న మారుమూల గ్రామానికి చెందిన గంగవ్వ దీనికో ఉదాహరణ. నగరానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ రామ్... గత కొంత కాలంగా సెలబ్రిటీల కోసం పనిచేస్తూ ఆ రంగంలో పేరొందారు. లుక్స్‌లో టాలీవుడ్ హీరోలకు తీసిపోని రామ్... గత లాక్ డౌన్ టైమ్‌లో దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ‘పచ్చీస్ ’పేరుతో రూపొందించిన ఓ సినిమాలో హీరోగా నటించారు. ఆ సినిమా ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది. నిర్మాణ రంగంలో ఉన్న మణికొండకు చెందిన శ్రీనివాస్‌కు కూడా నటనపై మక్కువ ఎక్కువ. కానీ ఎన్నో ఏళ్లపాటు తన అభిరుచిని, తనలోని నటనా కౌశలాన్ని తనలోనే దాచేసుకున్నారు. పిల్లలు పెద్దవాళ్లవడంతో వృత్తికి కాస్త విరామం ఇచ్చారు. సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ రాణిస్తున్నారు. ఇక నగరంలో స్టోరీ టెల్లింగ్‌కు కేరాఫ్‌గా పేరొందిన దీపా కిరణ్ కూడా ఇటీవల యాంగర్ టేల్స్ అనే ఓటీటీ చిత్రంలో నటించారు. అందులోని నాలుగు పొట్టి కథల్లో ఒకటైన ‘యాన్ ఆఫ్టర్ నూన్ న్యాప్’లో ఆమె కనిపిస్తారు. ఈ ఎక్స్పీరియన్స్ తనకు కొత్త అనుభూతిని అందించిందని ఆమె అంటున్నారు. కేరక్టర్‌కు ఓకే.. కెరీర్‌గా నాట్ ఓకే ఇలాంటి నటులు వరుస పెట్టి సినిమాలు చేసేయాలనే ఆత్రుత ఏమీ చూపడం లేదు. తమ వృత్తికో, ఉద్యోగానికో ప్రాధాన్యత ఇస్తూనే ‘జస్ట్ ఫర్ ఏ ఛేంజ్’అన్నట్టుగా అడపాదడపా వచి్చన అవకాశాల్ని సది్వనియోగం చేసుకుంటున్నారు. సినిమా అనేది తమకు కేవలం అభిరుచి మాత్రమేనని చాలామంది అంటున్నారు. ‘‘నాట్యం’అనేది నా అభిరుచికి, నా ఆలోచనలకు దగ్గరగా ఉన్న సినిమా కాబట్టి నటించాను. అంతే తప్ప సినిమాల్ని కెరీర్‌గా తీసుకునే ఆలోచన లేదు..’అంటున్నారు సంధ్యారాజు. ప్రముఖ పారిశ్రామికవేత్త సత్యం రామలింగరాజు కుటుంబ సభ్యురాలైన ఈ సంప్రదాయ నృత్య కారిణి... ఇటీవలే నాట్యం అనే సినిమాలో కథానాయికగా నటించారు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ పురస్కారాన్ని కూడా అందుకుంది. అయినప్పటికీ ఆమె మరో చిత్రంలో నటించలేదు. అదే విధంగా నగరానికి చెందిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఆకెళ్ల రాఘవేంద్ర కూడా ఒకటి రెండు చిత్రాల్లో కనిపించారు. -
వ్యాపారవేత్తలుగా వృత్తి పనివాళ్లు
న్యూఢిల్లీ: వృత్తి పనివాళ్లకు, చిన్న వ్యాపారాలకు మరింత తోడ్పాటు అందించాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. బడ్జెట్ వెబినార్లలో చివరిదైన ‘పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్’ పథకంపై ఆయన శనివారం మాట్లాడారు. గ్రామ స్థాయిలో ప్రతి వృత్తినీ విభాగాన్నీ బలోపేతం చేయడం దేశ ప్రగతి ప్రయాణానికి చాలా కీలకమన్నారు. ఇందుకోసం డెడ్లైన్లు పెట్టుకుని ఉద్యమ స్ఫూర్తితో పని చేయాల్సిన అవసరముందన్నారు. గొప్పవైన మన పురాతన సంప్రదాయాలను కాపాడటంతో పాటు చిన్న వ్యాపారాలను వాటిలో భాగస్వాములుగా ఉండే వృత్తి పనివాళ్లకు ఇతోధికంగా సాయం అందించడమే పీఎం విశ్వకర్మ సమ్మాన్ పథకం లక్ష్యమని చెప్పారు. సులభ రుణాలు, నైపుణ్య వృద్ధికి అవకాశాలు, సాంకేతిక, డిజిటల్ సాయం, బ్రాండ్ ప్రమోషన్, మార్కెటింగ్, ముడి సరుకు లభ్యత తదితరాల్లో వారికి ఈ పథకం అండగా నిలుస్తుందన్నారు. వృత్తి పనివాళ్లకు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అన్ని అవకాశాలూ కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మార్చి 13 నుంచి పార్లమెంటు మలి దశ బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో మోదీ శనివారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. మోదీ తల్లి స్మృతులపై మైక్రోసైట్ మోదీ మాతృమూర్తి హీరాబెన్ స్మృతుల సమాహారంగా ‘మా’ పేరిట మైక్రోసైట్ ఆయన అధికార వెబ్సైట్లో ప్రారంభమైంది. ఇటీవల మరణించిన ఆమెకు నివాళిగా దీన్ని తీర్చిదిద్దినట్టు అధికారులు తెలిపారు. ‘‘బిడ్డలకు హీరాబెన్ నేర్పిన విలువలు తదితరాల విశేషాలు సైట్లో ఉంటాయి. హీరాబా జీవితం, ఫొటోలు, వీడియోలు, ఆమె వందో పుట్టినరోజు సందర్భంగా మోదీ రాసిన బ్లాగ్, ఆమె మృతిపై పలు దేశాధినేతల స్పందన, నివాళులు కూడా ఉంటాయి’’ అని వివరించారు. -
యాప్.. ట్రాప్.. అత్యధిక యాప్‌లతో వ్యక్తిగత గోప్యతకు భంగం!
విజయనగరానికి చెందిన రమేశ్ కొన్ని రోజుల క్రితం తమ బంధువుల గృహప్రవేశం కోసం హైదరాబాద్‌లోని కోకాపేటకు వెళ్లారు. అక్కడ కాలక్షేపం కోసం ఫోన్లో ఫేస్బుక్ చూడసాగారు. అంతే.. హైదరాబాద్‌లోని కోకాపేట, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ ప్రకటనలు వరుసగా వచ్చేస్తున్నాయి. ఏనాడూ తన ఫేస్బుక్లో కనిపించని ఈ ప్రకటనలను చూసి ఆయన ఆశ్చర్యపోయారు. తాను హైదరాబాద్ వచ్చిన విషయం, కోకాపేట ప్రాంతంలో ఉన్న విషయం తనకు సంబంధం లేని వారికి తెలిసిపోయిందని గుర్తించారు. లోన్‌యాప్ కంపెనీల ఆగడాలు మరీ దుర్మార్గం. అప్పు తీసుకున్న వ్యక్తి ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నంబర్లు, ఫొటోలు అన్నీ ఆ కంపెనీలు తీసుకుంటాయి. అత్యధిక వడ్డీలు వేసి ఇచ్చిన రుణానికి నాలుగు, ఐదింతలు ఎక్కువ డిమాండ్ చేస్తాయి. అడిగినంత చెల్లించకపోతే ఫోన్ నుంచి తీసుకున్న రుణ గ్రహీత ఫొటోలను మార్ఫింగ్ చేసి, కాంటాక్ట్ నంబర్లలో ఉన్న బంధువులు, మిత్రులకు పంపించి వేధిస్తుంటాయి. సాక్షి, అమరావతి: మన ఫోన్లోని కాంటాక్ట్ నంబర్లు, ఫొటోలు, ఇతర సమాచారం తెలియాల్సింది మనకు ఒక్కరికే కదా! బయటకు ఎలా వెళ్తోంది? ఇదెలా సాధ్యం అంటే.. మొబైల్ యాప్‌లే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తుల ప్రమేయం లేకుండానే వారి కదలికలు, లావాదేవీలు, ఇతర సమాచారం మొత్తం గుర్తుతెలియని వ్యవస్థలకు యాప్‌ల ద్వారా చేరిపోతున్నాయి. మన అవసరాల కోసం స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొనే ఈ యాప్‌లతో సౌలభ్యం ఎంతుందో.. వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం కూడా అంతే ఉంది. వ్యక్తులు ఉన్న ప్రదేశం, వారి కదలికలు, సామాజిక మాధ్యమాల్లో చూసే వివిధ అంశాలు.. ఇలా అన్నీ యాప్‌లు నిరంతరం పరిశీలిస్తూనే ఉంటాయి. ఫోన్ కాంటాక్ట్ నంబర్లు, ఫోన్లోని ఫొటోలతోపాటు చివరికి వేలి ముద్రలు, ఎస్ఎంఎస్లు వేరెవరికో వెళ్లిపోతుంటాయి. అప్రమత్తతే శ్రీరామరక్ష.. ► యాప్‌ను డౌన్లోడ్ చేసుకునే ముందు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి ► మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు వివిధ అనుమతులు అడుగుతుంది. వాటిని నిశితంగా చదివిన తరువాతే అనుమతించాలి. డౌన్లోడ్ చేసుకునే తొందర్లో నిబంధనలను చదవకుండా అనుమతిస్తే తరువాత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ► మనమున్న ప్రదేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న యాప్‌లకే లొకేషన్ యాక్సెస్ ఇవ్వాలి. యాప్ వినియోగించేటప్పుడు మాత్రమే యాక్సెస్ అనుమతించేలా చూసుకోవాలి ► ప్రజల భద్రత కోసం పోలీసు శాఖ ప్రవేశపెట్టే యాప్‌లకు అన్నింటినీ యాక్సెస్ ఇవ్వాలి. అది అత్యవసర సమయాల్లో పోలీసులు మనకు సహకరించేందుకు ఉపయోగపడుతుంది ► నిషేధిత సంస్థలు, అనుమతి లేని ఆర్థిక సంస్థలు, నాన్ బ్యాంకింగ్ సంస్థల యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్ లోడ్ చేసుకోకూడదు ► ఎస్ఎంఎస్లు, వాట్సాప్ సందేశాలు చదివేందుకు, వేలిముద్రను తెలుసుకునేందుకు యాప్‌లకు అనుమతించకూడదు ఆండ్రాయిడ్ యాప్‌లు.. ► 75 శాతం ఇండియన్ ఆండ్రాయిడ్ యాప్‌లతో ఆ ఫోన్ యజమాని ఉన్న ప్రదేశం తెలిసిపోతోంది ► 59 శాతం యాప్‌లు వాటిని ఉపయోగించని సమయంలో కూడా మనం ఉన్న ప్రదేశాన్ని వెల్లడిస్తున్నాయి ► 57 శాతం యాప్‌లు ఫోన్లోని మైక్రోఫోన్‌ను వాడుకుంటున్నాయి ► 76 % యాప్‌లకు కెమెరా యాక్సెస్ ఉంది ► 43 శాతం యాప్‌లతో ఫోన్లోని కాంటాక్ట్ నంబర్లు తెలిసిపోతాయి ► 32 శాతం యాప్‌లతో ఫోన్‌కు వచ్చిన ఎస్ఎంఎస్లు కూడా తెలుసుకోవచ్చు ► 25 శాతం యాప్‌లతో ఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు వేసే వేలిముద్ర తెలిసిపోతుంది ఐవోఎస్ యాప్‌లు... ► 83 శాతం ఐవోఎస్ యాప్‌లతో మీరు ఉన్న ప్రదేశం తెలిసిపోతుంది ► 81 శాతం యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు కెమెరాతో యాక్సెస్ లభిస్తుంది ► 90 శాతం యాప్‌లతో ఫోన్ గేలరీలో ఉన్న ఫొటోలు బట్టబయలైపోతాయి ► 64 శాతం యాప్‌లతో ఫోన్లోని మైక్రోఫోన్‌తో యాక్సెస్ వస్తుంది ► 49 శాతం యాప్‌లతో ఫోన్లోని కాంటాక్ట్ నంబర్లు తెలిసిపోతాయి ► 36 శాతం యాప్‌లతో ఫోన్లోని క్యాలండర్‌తో యాక్సెస్ లభిస్తుంది. అర్కా సంస్థ అధ్యయనం.. ప్రముఖ ప్రైవసీ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫాం అర్కా కంపెనీ ‘స్టేట్ ఆఫ్ డాటా ప్రైవసీ’ పేరిట నిర్వహించిన సర్వేలో ఆందోళన కలిగించే ఇటువంటి పలు అంశాలు వెల్లడయ్యాయి. అర్కా సంస్థ 200 మొబైల్ యాప్‌లు, వెబ్సైట్లను అధ్యయనం చేసింది. వాటిలో మన దేశంలోని 25 రంగాలకు చెందిన 100 యాప్‌లు, వెబ్సైట్లు ఉన్నాయి. అమెరికాకు చెందినవి 76, యూరోపియన్ యూనియన్లకు చెందినవి 24 ఉన్నాయి. పిల్లలకు సంబంధించిన 30 యాప్‌ల గురించి కూడా ఈ సంస్థ ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. ఆ యాప్‌లను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మనం ఇచ్చే అనుమతులు, ట్రాకర్లు, కుకీలతో వ్యక్తిగత సమాచారం ఇతర సంస్థలకు చేరిపోతున్నాయి. వ్యక్తిగత గోప్యతకు అత్యధికంగా గూగుల్ కంపెనీ భంగం కలిగిస్తోందని ఈ నివేదిక వెల్లడించింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ యాప్‌లకు సంబంధించి ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలో ప్రధాన అంశాలను వెల్లడించింది. -
పన్ను మినహాయింపు పరిమితి పెంచాలి
న్యూఢిల్లీ: ప్రత్యామ్నాయ పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కేంద్రం పన్ను మినహాయింపు పరిమితిని, గరిష్ట పన్ను శ్లాబులోకి వచ్చే ఆదాయ పరిమితిని పెంచాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే కొన్ని మినహాయింపులను కూడా 2023–24 బడ్జెట్లో అనుమతించాలని వారు సూచించారు. 2020–21 బడ్జెట్లో కేంద్రం .. సాంప్రదాయ ట్యాక్స్ శ్లాబ్‌లకు ప్రత్యామ్నాయంగా ఐచ్ఛిక ఆదాయ పన్ను విధానాన్ని కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధానంలో హెచ్ఆర్ఏ, గృహ రుణంపై వడ్డీలు, ఇతరత్రా కొన్ని పెట్టుబడులకు మినహాయింపులను క్లెయిమ్ చేసుకోకుండా ఉంటే పన్ను భారం తక్కువగా ఉండేలా ప్రతిపాదనలు చేసింది. దీని ప్రకారం రూ. 2.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు. రూ. 15 లక్షలు దాటితే గరిష్టంగా 30 శాతం పన్ను ఉంటుంది. అయితే దీనివల్ల పన్ను భారం అధికంగా ఉంటోందని ఎవరూ ఈ ప్రత్యామ్నాయ విధానంపై ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలోనే దీన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. వారి సూచనలు ఏమిటంటే .. ► నాంగియా అండర్సన్ ఇండియా చైర్మన్ రాకేశ్ నాంగియా: పెట్టుబడులు, సామాజిక భద్రత సంబంధ డిడక్షన్లను ప్రత్యామ్నాయ పన్ను విధానంలోనూ అందుబాటులో ఉంచాలి. అలాగే పన్ను రేట్లను మరింతగా క్రమబద్ధీకరించాలి. ► డెలాయిట్ ఇండియా పార్ట్నర్ సుధాకర్ సేతురామన్: జీవిత బీమా ప్రీమియంలు, గృహ రుణ రీపేమెంట్, గృహ రుణాలపై వడ్డీ చెల్లింపుల్లాంటి మినహాయింపులను అనుమతించాలి. సింగపూర్, హాంకాంగ్ తదితర దేశాల తరహాలో గరిష్ట ట్యాక్స్ రేటును 30 శాతంగా కాకుండా 25 శాతానికి తగ్గించాలి. ► ఈవై ట్యాక్స్ పార్ట్నర్ అమర్‌పాల్ ఎస్ చడ్ఢా: రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్, రూ. 2.5 లక్షల వరకు ఇతరత్రా మినహాయింపులను అనుమతించాలి. ప్రాథమిక ఎగ్జెంప్షన్ పరిమితిని ప్రస్తుతమున్న రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలి. 30 శాతం ట్యాక్స్ రేటును రూ. 15 లక్షలు కాకుండా రూ. 20 లక్షలపైన ఆదాయానికి వర్తింపచేయాలి. ► ఏకేఎం గ్లోబల్ పార్ట్నర్ సందీప్ సెహ్గల్: 30 శాతం ట్యాక్స్ రేటును రూ. 20 లక్షల పైగా ఆదాయానికే వర్తింపచేయాలి. రూ. 5 లక్షల లోపు ఆదాయం గల వారికి రిబేటు ఇవ్వాలి. ఆలస్యంగా రిటర్ను వేసే వారికి కూడా ప్రత్యామ్నాయ పన్ను విధానం అందుబాటులో ఉంచాలి. -
వర్సిటీల్లో నిష్ణాతుల నియామకం
సాక్షి, అమరావతి: యూనివర్సిటీలు, కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థల్లో అనుభవజ్ఞులైన నిపుణుల సేవలను వినియోగించుకోవాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సూచించింది. ఇందుకోసం ‘ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ (పీవోపీ)’ హోదాను సృష్టించింది. ఈ విధానం కింద వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన వారిని, పారిశ్రామిక నిపుణుల సేవలను వినియోగించుకొని ప్రపంచస్థాయి అత్యున్నత ప్రమాణాలు సాధించవచ్చని పేర్కొంది. ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో పార్టు టైమ్, గెస్ట్, కాంట్రాక్టు ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తున్నారు. వీరికన్నా వివిధ రంగాల్లో నిపుణులైన వారి సేవల వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని యూజీసీ అభిప్రాయపడుతోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు పీవోపీ విధానంతో మంచి ఫలితాలు సాధిస్తున్నాయని వివరించింది. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఉన్నత విద్యా కళాశాలల ప్రిన్సిపాళ్లు వారి సంస్థల్లో పీవోపీ నియామకాలకు నిబంధనల మార్పునకు చర్యలు తీసుకోవడంతోపాటు, ఆ చర్యల నివేదికను కూడా పంపాలని యూజీసీ అన్ని సంస్థలను కోరింది. పీవోపీల నియామకాలపై గత నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి అధికారిక విద్యార్హతలు, ప్రచురణ తదితరాలు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఎమ్ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో అమలు ప్రాక్టీస్ ప్రొఫెసర్ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు అనుసరిస్తున్నాయి. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎమ్ఐటీ), హార్వర్డ్ విశ్వవిద్యాలయం, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (ఎస్ఓఏఎస్), యూనివర్సిటీ ఆఫ్ లండన్, కార్నెల్ విశ్వవిద్యాలయం, హెల్సింకి విశ్వవిద్యాలయం వంటి అనేక విశ్వవిద్యాలయాల్లో ఈ విధానంలో నిపుణుల నియామకం జరుగుతోంది. మన దేశంలోనూ ఢిల్లీ, మద్రాస్, గౌహతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (ఐఐటీలలో) పీవోపీలను నియమించారు. పీవోపీల నియామకానికి యూజీసీ మార్గదర్శకాలు.. ► ఈ నిపుణుల నియామకం విశ్వవిద్యాలయం, కళాశాలల మంజూరైన పోస్టుల పరిమితి మేరకు మాత్రమే ఉంటుంది. ► విద్యా సంస్థల్లో నియమించే పీవోపీల సంఖ్య మంజూరైన పోస్టుల్లో 10 శాతానికి మించకూడదు ► సంస్థలో మంజూరైన పోస్టుల సంఖ్యను లేదా రెగ్యులర్ ఫ్యాకల్టీ నియామకంపై ప్రభావం చూపకూడదు ► గౌరవ ప్రాతిపదికన ఈ నియామకాలు ఉండాలి ► పరిశ్రమల ద్వారా ఆయా సంస్థలకు వచ్చే నిధులు లేదా ఆయా ఉన్నత విద్యా సంస్థల్లోని సొంత నిధులతో నియామకాలు చేపట్టాలి ► పీవోపీల గరిష్ట పదవీ కాలం మూడేళ్లు. అవసరమైన సందర్భాల్లో ఒక సంవత్సరం పొడిగించవచ్చు ► ఇప్పటికే టీచింగ్ పొజిషన్లో ఉన్నవారికి లేదా పదవీ విరమణ చేసిన వారికి ఈ పథకం వర్తించదు. -
55% వృత్తి నిపుణుల్లో పని ఒత్తిడి
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ రంగాలు, విభాగాల్లో పనిచేస్తున్న వృత్తి నిపుణుల్లో 55 శాతం మంది పని ప్రదేశాల్లో ఒత్తిళ్లకు లోనవుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. గత 18 నెలలుగా కరోనా మిగిల్చిన చేదు జ్ఞాపకాలు, ఎదురైన ప్రతికూల పరిస్థితుల ప్రభావం ఈ ఒత్తిళ్లకు కారణమవుతున్నట్లు లింక్డ్ఇన్ సంస్థ చేపట్టిన ‘ద వర్క్‌ఫోర్స్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్’ సర్వే పేర్కొంది. ఈ ఏడాది జూలై 31 నుంచి సెస్టెంబర్ 24 వరకు దేశవ్యాప్తంగా వృత్తి నిపుణులపై నిర్వహించిన అధ్యయనంలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని మొత్తం వృత్తి నిపుణుల్లో (ఉద్యోగాలు చేస్తున్న వారు) 55 శాతం మంది పనిచేసే చోట్ల ఒత్తిళ్లకు గురవుతున్నట్లు ఈ పరిశీలన తేల్చింది. ఈ 55 శాతం మందిలో వృత్తిధర్మంలో భాగంగా చేసే పనులు–వ్యక్తిగత అవసరాల మధ్య తగిన సమన్వయం, పొంతన సాధించకపోవడం వల్ల 34 శాతం మంది, ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగాల్లో తగినంతగా సంపాదించలేకపోతున్నం దువల్ల 32 శాతం మంది, వృత్తిపరంగా పురోగతి చాలా నెమ్మదిగా సాగడం వల్ల 25 శాతం మంది వృత్తినిపుణులు ఒత్తిళ్లకు గురవుతున్నారు. నిత్యం ఆఫీసుల్లో పనిని నిర్ణీత కాలానికి ముగించాలని 47 శాతం మంది భావించినా పనిఒత్తిళ్ల కారణంగా వారిలో 15 శాతం మందే అనుకున్న సమయానికి పని ముగించుకోగలుగుతున్నట్టు సర్వే తెలిపింది. అయితే ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగాలు, పనిప్రదేశాలపట్ల ప్రతి ముగ్గురిలో ఒకరు (36 శాతం) సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము చేస్తున్న ఖర్చులపై పట్టు పెంచుకోగలిగామని 30 శాతం మంది తెలిపారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న క్రమంలో మార్కెట్లో ఉద్యోగాలు సాధించే విషయంలో పోటీ పెరిగినా క్రమంగా పరిస్థితులు మెరుగవుతున్నాయనే భావనను పలువురు వెలిబుచ్చారు. పని–జీవితం మధ్య సమతూకం సాధించాలి వృత్తి నిపుణులు, ఇతర ఉద్యోగుల పని ఒత్తిళ్లను పైస్థాయిలో యజమానులు అర్థం చేసుకొని వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తమ సర్వే ద్వారా వెల్లడైందని లింక్డ్ఇన్ ఇండియా కంట్రీ మేనేజర్ అశుతోష్ ఘోష్ పేర్కొన్నారు. మారుతున్న కాలాన్ని బట్టి వృత్తి నిపుణుల ప్రాధాన్యతలు మారుతుంటాయని, రాబోయే కాలానికి అనుగుణంగా భారతీయ వృత్తి నిపుణులు తమ పని–జీవితం మధ్య సమతూకాన్ని సాధించాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోందన్నారు. -
ఔత్సాహిక నేతల కోసం ట్రైనింగ్ సెంటర్
లక్నో: డాక్టర్లు, ఇంజనీర్లు వంటి వృత్తి నిపుణులుగా మారేందుకు ప్రత్యేకంగా కళాశాలలు ఉన్నాయి. అదే తరహాలో రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకునేందుకు ఓ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రాజకీయ శిక్షణా కేంద్రం కోసం రూ.198 కోట్ల నిధులను యూపీ ప్రభుత్వం కేటాయించింది. దాదాపు 16 ఎకరాల్లో ఇక్కడి ఘజియాబాద్ జిల్లా కేంద్రంలో దీని నిర్మాణం జరగనుంది. ఈ శిక్షణా కేంద్రంలో రాజకీయాల్లోకి రావాలనుకునే వ్యక్తులతో పాటు చట్టసభల ప్రతినిధులు చేరవచ్చని యూపీ పట్టణాభివృద్ధి మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా తెలిపారు. ఇక్కడి విద్యార్థులకు వేర్వేరు దేశాధినేతలు, నిపుణులు, రాయబారులు, రాజకీయ ప్రముఖులతో తరగతులు నిర్వహిస్తామన్నారు. ఢిల్లీ పర్యటనకు వచ్చే ప్రజలు సందర్శించేందుకు వీలుగా దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో ఉన్న ఘజియాబాద్‌లో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ శిక్షణా కేంద్రాన్ని యూపీ పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్వహిస్తుందనీ, దీనికి గుర్తింపు కోసం పలు జాతీయ విశ్వవిద్యాలయాలతో చర్చిస్తున్నామని సురేశ్ కుమార్ పేర్కొన్నారు. పాఠ్యాంశాల రూపకల్పనకు ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేశామనీ, మరో రెండేళ్లలో ఈ శిక్షణా కేంద్రం పూర్తిస్థాయిలో పనిచేస్తుందని చెప్పారు. -
‘50 ఏళ్లకే పింఛను ఇవ్వాలి’
శ్రీకాకుళం పాతబస్టాండ్ : 50 ఏళ్లు దాటిన వృత్తిదార్లందరికీ పింఛను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. కలెక్టరేట్ వద్ద వృత్తిదారులు సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ చేతివృత్తుల ద్వారా ఉపాధి పొందుతున్న వారు జిల్లాలో 9 లక్షల మంది వరకు ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు రుణాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవ్వలేదని వాపోయారు. మత్స్యకారులు, గొర్రెల పెంపకం దారులు, క్షౌ ర, రజక, చేనేత, గీత, వడ్రంగి, మేదరి, ఎరుకలి, వంటి కులాల వారు వెనుకబడి ఉన్నారని, వారిని ఆదుకోవాలన్నారు. బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదరణ పథకానికి వయోపరిమితి పెంచాలన్నారు. చనిపోయిన వృత్తిదారులకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. గీత కార్మికుల కల్లును నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ ధర్నాలో పి.సాంబమూర్తి, జి.పాపయ్య, ముగడ రాములు, ఎన్.రాజారావు, డి.అప్పారావు పాల్గొన్నారు. -
వృత్తి నిపుణులదే కీలకపాత్ర
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయాల్లో వృత్తి నిపుణుల పాత్ర కీలకం కాబోతోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్(ఏఐపీసీ) జాతీ య సదస్సులో టీపీసీసీ తరఫున పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రాజకీయాల్లో చేరేందుకు, క్రియాశీలంగా వ్యవహరించేందుకు ప్రొఫెషనల్స్ కాస్త వెనకడుగు వేస్తున్నారని, ఈ నేపథ్యంలో వృత్తి నిపుణులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వృత్తి నిపుణులు సభ్యులుగా ఉండే ఈ వేదిక ద్వారా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక (మ్యాని ఫెస్టో)ను రూపొందించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. రాజకీయాల్లో చేరేందుకు, రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు వెనుకాడుతు న్న వృత్తి నిపుణుల్లో ఏఐపీసీ ఉత్సాహం నింపుతోం దని వెల్లడించారు. వారిలో ని సృజనాత్మకతను దేశాభివృద్ధికి వినియోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ వృత్తినిపుణుల కాంగ్రెస్‌కు అనూహ్య స్పందన వస్తోందని, తెలంగాణ యూనిట్ ఈ ఏడాది ఫిబ్రవరిలో 7 చాప్టర్లను ప్రారంభించిందని, ఇందులో సభ్యుల సంఖ్య 432కు చేరడంతో ఉత్సాహం రెట్టింపు అయిందన్నారు. మొత్తం 25 ఈవెంట్స్‌ను నిర్వహించామని, ‘పెద్ద నోట్ల రద్దు–కుప్పకూలిన భారత ఆర్థిక వ్యవస్థ, ఈవీఎంల వల్ల అనర్థాలు–ప్రజాస్వామ్య పరిరక్షణ, బీమా బిల్లు–2017 వల్ల ప్రజలకు నష్టాలు, సమగ్రాభివృద్ధి–లక్ష్యాలు... వంటి 25 అంశాలపై వృత్తినిపుణులతో సదస్సులు నిర్వహించినట్లు డాక్టర్ శ్రవణ్ చెప్పారు. ఐటీ ఉద్యోగుల హక్కులు–కార్మిక చట్టాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి అంశాలపై గ్రూపుల్లో చర్చలు నిర్వహించామని వివరించారు. వీటితోపాటు కథువా, ఉన్నావ్ రేప్ సంఘటనలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించామని చెప్పారు. తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఒక్కో చాప్టర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాలకు ఒక్కో చాప్టర్‌ను వచ్చే మూడు, నాలుగు నెలల్లో ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్నికల ప్రణాళిక రూపకల్పనకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామ న్నారు. వృత్తి నిపుణుల సాయంతో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఎన్నికల ప్రణాళికను రూపకల్పన చేస్తామని శ్రవణ్ పేర్కొన్నారు. సదస్సులో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అఖిల భారత వృత్తి నిపుణుల కాంగ్రెస్ (ఏఐపీసీ) అధ్యక్షుడు శశిథరూర్, కేంద్ర మాజీమంత్రి మిలింద్ దేవరాతోపాటు పలువురు నిపుణులు హాజరయ్యారు. -
బ్రిటన్‌లో వీసాలపై భారతీయుల నిరసన
లండన్: బ్రిటన్‌లో వీసా విధానాలపై భారత వృత్తినిపుణులు నిరసనకు దిగారు. ఇందుకు ప్రధాని థెరిసా మే అధికారిక నివాసముండే డౌనింగ్ స్ట్రీట్‌నే వేదికగా ఎంచుకున్నారు. ప్రభుత్వ విధానాలు అమానవీయం, అన్యాయమని వారు విమర్శించారు. భారత వృత్తి నిపుణులతో పాటు ఇతర దేశాలకు చెందిన డాక్టర్లు, ఇంజినీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్, ఉపాధ్యాయులు లాంటి వలసదారులు కూడా బుధవారం జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. యూకే ప్రభుత్వ వీసా విధానాలను కోర్టులో సవాలుచేయడానికి 25 వేల పౌండ్లను సేకరించారు. యూకే హోం శాఖ అవలంబిస్తున్న విధానాల వల్ల తాము చాలా నష్టపోతున్నామని వృత్తినిపుణులు, వలసదారులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటన్‌లో శాశ్వత నివాసానికి వీలు కల్పించే ‘ఇన్డెఫినిట్ లీవ్ టు రిమేన్’(ఐఎల్ఆర్) దరఖాస్తులను హోం శాఖ తిరస్కరించడం లేదా వాయిదా వేయడానికి వ్యతిరేకంగానే తాజా ఆందోళన చేపట్టారు. నేరస్తులు, పన్ను ఎగవేతదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన చట్టంలోని నిబంధనల ఆధారంగా తమ దరఖాస్తులను నిలిపివేస్తున్నారని ఆరోపించారు. -
జీఎస్టీ వచ్చేస్తోంది: ఇక వారికే ఫుల్ డిమాండ్
ముంబై : దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానంలోకి తీసుకొచ్చే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) మరికొన్ని రోజుల్లో అమలుకాబోతుంది. జూన్ 30న అర్థరాత్రి పార్లమెంట్ వేదికగా దీన్ని గ్రాండ్ గా లాంచ్ చేసి, జూలై 1 నుంచి అమలుచేయబోతున్నారు. దీంతో అన్ని రంగాల కంపెనీలు ఇప్పటికే ఈ కొత్త జీఎస్టీ విధానానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పన్ను, టెక్నాలజీ నిపుణులకు భారీగా డిమాండ్ ఏర్పడునుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఎఫ్ఎంసీజీ రంగంలో వీరికి భారీగా డిమాండ్ ఉంటుందని, తర్వాత కన్జ్యూమర్ గూడ్స్, ఫార్మాస్యూటికల్స్, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో పన్ను, టెక్నాలజీ నిపుణుల అవసరం ఎక్కువగా ఉంటుందని తెలిసింది. ఈ కొత్త పన్ను విధానంతో ప్రయోజనాలు పొందడానికి సంస్థలు వీరిని నియమించుకుంటారని ఇండస్ట్రి నిపుణులు, నాలుగు అతిపెద్ద ఆడిట్ సంస్థల ఎగ్జిక్యూటివ్ లు చెబుతున్నారు. పన్ను అవగాహన అధికారులు, నిపుణులు చెబుతున్న ప్రకారం, జీఎస్టీని నమోదుచేసుకున్న కంపెనీలు చివరికి 90 లక్షలుగా ఉంటాయని, వారిలో 1 శాతం పెద్ద కంపెనీలుంటే, ఆ కంపెనీలకు జీఎస్టీ బాధ్యతలు నిర్వర్తించడానికి కనీసం ఐదుగురు నిపుణులు అవసరం పడతారని పేర్కొన్నారు. అంతేకాక 10 శాతం మధ్యస్థాయి కంపెనీల్లో కనీసం ఒకవ్యక్తి అవసరం పడతారని చెప్పారు. దీంతో ఈ కొత్త జీఎస్టీ విధానంతో 1.3 మిలియన్ నిపుణులకు డిమాండ్ ఏర్పడుతుందన్నారు. కొన్ని బాధ్యతలను ప్రస్తుతమున్న సేల్స్, ఇతర పన్నుల నిపుణులు నిర్వర్తించవచ్చు, కానీ కొత్తగా ప్రతిభావంతులును కూడా నియమించుకోవాల్సినవసరం ఎక్కువగా ఉంటుందన్నారు. పన్ను వైపుగా అయితే లాయర్లు, ఛార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు, ట్యాక్స్ కన్సల్టెంట్స్ కు భారీగా డిమాండ్ ఉంటుందని ఇండస్ట్రీ నిపుణులు చెప్పారు. టెక్నాలజీ వైపు అయితే సాఫ్ట్ వేర్ నిపుణులకు అవసరం ఎక్కువగా ఉంటుందన్నారు. అంతేకాక సెమీ-స్కిల్డ్ వర్కర్లకు కూడా డిమాండ్ ఏర్పడుతుందని నిపుణులు తెలిపారు. జీఎస్టీ రిటర్న్స్ లను, ప్రభుత్వ డేటా బేస్ లతో సమకాలీకరించాల్సి ఉంటుంది. జీఎస్టీ మేనేజర్, వీపీ-జీఎస్టీ లేదా జీఎస్టీ టీమ్ లీడర్ వంటి కొన్ని పొజిషన్లు క్రియేట్ అవుతాయని ఓ సంస్థ సీరియర్ డైరెక్టర్ చెప్పారు. కొత్త జీఎస్టీ విధానాన్ని సరిగ్గా అమలుచేయలేకపోతే, కంపెనీలకే రెవెన్యూలు, లాభాలు పోతాయని, దీంతో మార్కెట్ షేరును వారు కోల్పోతారని పలువురు పేర్కొంటున్నారు. కార్పొరేట్లలో జీఎస్టీపై ఎంతో బాధ్యతతో పనిచేసేవారిని తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మంచి ప్రణాళికతో దీన్ని అమలుచేస్తే, అన్ని సమస్యలను అధిగమించవచ్చని, ఆర్థిక పొదుపులో జీఎస్టీ ఎంతో కీలకమైనదని పేర్కొంటున్నారు. -
మన హెచ్1బి వీసాలు మనకే.. ఆందోళన వద్దు
న్యూఢిల్లీ: హెచ్ 1బి వీసాల అమెరికా కొత్త నిబంధనలపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కేంద్ర వాణిజ్య , పరిశ్రమల శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ చెప్పారు. వివాదాస్పద వీసా సమస్యలపై భారతీయ టెక్ నిపుణులు, ఐటీ పరిశ్రమను భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వీసా జారీ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది తప్ప, భారతీయులకు జారీ చేసే వీసాల సంఖ్య తగ్గదని తెలిపారు. ఇప్పటివరకు మనకు లభిస్తున్న హెచ్ 1 బీ వీసాలు మనకు దక్కుతాయని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. మూడు సంవత్సరాలకాలంలో మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలపై పుస్తకాన్ని సీతారామన్ శనివారం ఆవిష్కరించారు. అనతరం విలేఖరులతో మాట్లాడుతూ వీసాలపై భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఐటి పరిశ్రమను కోరారు. హెచ్ 1 బీ వీసాల జారీకి లాటరీ ప్రక్రియలో మార్పులు తేవాలని అమెరికా ప్రయత్నిస్తోందని తాను భావిస్తున్నానన్నారు. అంతే తప్పఇండియన్ టెకీలకు జారీ చేసి వీసాల సంఖ్య తగ్గదన్నారు. వీసా ఆందోళనలు అమెరికా అధ్యక్షుడుగా ఒబామా ఉన్నపుడు కూడా ఉన్నాయన్నారు. అయితే వీసా జారీ ప్రక్రియలో మాత్రమే ట్రంప్ కొత్తగా జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్దర్ మార్పు తీసుకొచ్చిందన్నారు. గత కొన్ని రోజులుగా అమెరికా సహా వివిధ అభివృద్ధి చెందిన దేశాలు తమ ఉద్యోగులను విదేశీ ఉద్యోగులకు కాకుండా స్థానికులకు దక్కేలా రక్షణాత్మక చర్యలు చేపడుతున్నాయన్నారు. ఇందులో భాగంగానే అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యంగా హెచ్ 1 బీ వీసాల జారీలో లాటరీ పద్దతికి స్వస్తి పలికి మెరిట్-ఆధారిత ఇమ్మిగ్రేషన్ పాలసీతో భర్తీ చేయాలని కోరుతోందని ఆమె చెప్పారు. అలాగే అమెరికా వీసాల్లో కేవలం 17 శాతం మాత్రమే భారతీయ కంపెనీలకు వెళ్తున్నాయనీ, భారతీయ కంపెనీలు అందిస్తున్న సేవల ద్వారా అనేక అమెరికా కంపెనీలు లబ్ది పొందుతున్నాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. హెచ్ 1బీ వీసాల జారీ రివ్యూపై భారత ఆందోళనలను అమెరికాకు ఇప్పటికే వ్యక్తం చేసినట్టు తెలిపారు. రెండు దేశాల మధ్య సానుకూల సంబంధాల నేపథ్యంలో వీటిని తిరిగి సమీక్షిస్తుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పోటీ పడుతున్న అమెరికన్ కంపెనీలను తయారు చేయడానికి అధిక నైపుణ్యం అవసరమైన చోట ఫస్ట్ గ్రాడ్యుయేట్లను కాకుండా కచ్చితంగా నిపుణులకోసం అమెరికా చూస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
రోబోలొస్తున్నాయ్ జాగ్రత్త..!
-
నిపుణుల కోసం డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా రంగానికి అవసరమైన వృత్తి నిపుణులను తీర్చిదిద్దడానికి లైఫ్ సెన్సైస్ సెక్టర్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎల్ఎస్ఎస్ఎస్డీసీ), విష్ణు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (వీఊపీఈఆర్)లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం ఫార్యాస్యూటికల్, బయోటెక్నాలజీ, క్లీనికల్ రీసెర్చ్ రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దుతారు. దీంతో దేశ ఆర్థిక జీడీపీలో కీలకపాత్ర పోషిస్తున్న ఫార్మారంగానికి నిపుణుల కొరత తీరుతుందని డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ సతీష్ రెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
నాన్న సినిమా చూడను..!
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నటీనటులు నటించిన చిత్రాలు ఒకేరోజు విడుదలైతే? ఆ ఇద్దరిలో ఎవరి సినిమా ఆడుతుంది? అనే చర్చ జరగడం ఖాయం. ప్రస్తుతం కమల్‌హాసన్, శ్రుతీహాసన్ నటించిన చిత్రాల గురించి అలాంటి చర్చే జరుగుతోంది. కమల్ నటించిన ‘ఉత్తమ విలన్’, శ్రుతి నటించిన హిందీ చిత్రం ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ - రెండూ మే 1న విడుదల కానున్నాయి. నటుడిగా కమల్ వయసు యాభైఏళ్లకు పైనే కాబట్టి, ఆయన నటనతో శ్రుతి నటనకు పోలిక పెట్టడం సరికాదు. కానీ, రెండు సినిమాలూ విజయం సాధించాలని ఇద్దరూ కోరుకోవడం సహజం. అయితే, ఈ ఇద్దరూ ముందు ఏ సినిమా చూస్తారు? ఇదే విషయాన్ని ఓ ఆంగ్ల పత్రిక శ్రుతీహాసన్‌ను అడిగితే... ‘‘ముందు మా నాన్న సినిమా చూడను. నేను నటించిన సినిమానే చూస్తా’’ అని ముక్కుసూటిగా చెప్పారు. మరి.. మీ నాన్నగారు ఏ సినిమా చూస్తారని ఊహిస్తున్నారు? అన్న ప్రశ్నకు -‘‘ఆయన కూడా ముందు నా సినిమా చూడరు. ఆయన నటించిన సినిమాయే చూస్తారు. ఆ విషయంలో మాకో స్పష్టత ఉంది. వృత్తిపరంగా ఒకరికొకరం మద్దతుగా నిలిచినా, ఎవరి సినిమా వాళ్లకు గొప్ప’’ అన్నారు. ఎంతైనా ప్రొఫెషనల్స్! -
నేడే ఎంసెట్ టెన్షన్ వద్దు
నిపుణుల సూచన పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి విద్యార్థులు గంటముందే రావాలి పెనమలూరు, న్యూస్‌లైన్ : ఎంసెట్-2014 గురువారం జరగనుంది. ఈ పరీక్ష నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎంసెట్ పరీక్ష హాలుకు విద్యార్థులు గంట ముందే హాజరు కావాల్సి ఉంది. విద్యార్థులు టెన్షన్ లేకుండా పరీక్ష రాయాలని నిపుణులు సూచిస్తున్నారు. విజయవాడ రీజియన్‌లో ఇంజనీరింగ్‌కు 22,050, మెడిసిన్‌కు 14,950 మంది హాజరుకానున్నారు. మొత్తం 37 వేల మంది పరీక్ష రాయనున్నారు. ఎంసెట్ కోసం ఇంజనీరింగ్‌కు 42, మెడిసిన్‌కు 28 చొప్పున విజయవాడ రీజియన్‌లో మొత్తం 70 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్ రాసేవారు ఉదయం 9.15 గంటలకు, మెడిసిన్ అభ్యర్థులు మధ్యాహ్నం 1.45 గంటలకు పరీక్ష హాలుకు హాజరు కావాలని అధికారులు తెలిపారు. ఎంసెట్‌కు ప్రత్యేక బస్సులు విజయవాడ సిటీ : విజయవాడ రీజియన్ పరిధిలో జరగనున్న ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం 130 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జి.సుదేష్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలో 50 సిటీ బస్సులు, గ్రామీణ ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం 80 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఆయన పేర్కొన్నారు.