
కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న వృత్తిదారులు
శ్రీకాకుళం పాతబస్టాండ్ : 50 ఏళ్లు దాటిన వృత్తిదార్లందరికీ పింఛను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. కలెక్టరేట్ వద్ద వృత్తిదారులు సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ చేతివృత్తుల ద్వారా ఉపాధి పొందుతున్న వారు జిల్లాలో 9 లక్షల మంది వరకు ఉన్నారని తెలిపారు.
ఇప్పటివరకు రుణాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవ్వలేదని వాపోయారు. మత్స్యకారులు, గొర్రెల పెంపకం దారులు, క్షౌ ర, రజక, చేనేత, గీత, వడ్రంగి, మేదరి, ఎరుకలి, వంటి కులాల వారు వెనుకబడి ఉన్నారని, వారిని ఆదుకోవాలన్నారు.
బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదరణ పథకానికి వయోపరిమితి పెంచాలన్నారు. చనిపోయిన వృత్తిదారులకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. గీత కార్మికుల కల్లును నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ ధర్నాలో పి.సాంబమూర్తి, జి.పాపయ్య, ముగడ రాములు, ఎన్.రాజారావు, డి.అప్పారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment