
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయపడ్డారు. లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిపై ఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు, ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మృతి చెందారు. కారులో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులకి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిని శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు పాతపట్నం మండలం లోగిడి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న దువ్వారి మీనమ్మ, భాస్కరరావు ,లక్మీపతి మృతి చెందగా దువ్వారి కాళిదాసు, కుసుమ తీవ్రంగా గాయపడ్డారు. పాత పట్నం మండలం లోగిడి గ్రామం నుంచి విశాఖపట్నం పుట్టినరోజు వేడుకల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment