జీఎస్టీ వచ్చేస్తోంది: ఇక వారికే ఫుల్ డిమాండ్
జీఎస్టీ వచ్చేస్తోంది: ఇక వారికే ఫుల్ డిమాండ్
Published Fri, Jun 23 2017 11:54 AM | Last Updated on Tue, Sep 5 2017 2:18 PM
ముంబై : దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానంలోకి తీసుకొచ్చే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) మరికొన్ని రోజుల్లో అమలుకాబోతుంది. జూన్ 30న అర్థరాత్రి పార్లమెంట్ వేదికగా దీన్ని గ్రాండ్ గా లాంచ్ చేసి, జూలై 1 నుంచి అమలుచేయబోతున్నారు. దీంతో అన్ని రంగాల కంపెనీలు ఇప్పటికే ఈ కొత్త జీఎస్టీ విధానానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పన్ను, టెక్నాలజీ నిపుణులకు భారీగా డిమాండ్ ఏర్పడునుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఎఫ్ఎంసీజీ రంగంలో వీరికి భారీగా డిమాండ్ ఉంటుందని, తర్వాత కన్జ్యూమర్ గూడ్స్, ఫార్మాస్యూటికల్స్, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో పన్ను, టెక్నాలజీ నిపుణుల అవసరం ఎక్కువగా ఉంటుందని తెలిసింది.
ఈ కొత్త పన్ను విధానంతో ప్రయోజనాలు పొందడానికి సంస్థలు వీరిని నియమించుకుంటారని ఇండస్ట్రి నిపుణులు, నాలుగు అతిపెద్ద ఆడిట్ సంస్థల ఎగ్జిక్యూటివ్ లు చెబుతున్నారు. పన్ను అవగాహన అధికారులు, నిపుణులు చెబుతున్న ప్రకారం, జీఎస్టీని నమోదుచేసుకున్న కంపెనీలు చివరికి 90 లక్షలుగా ఉంటాయని, వారిలో 1 శాతం పెద్ద కంపెనీలుంటే, ఆ కంపెనీలకు జీఎస్టీ బాధ్యతలు నిర్వర్తించడానికి కనీసం ఐదుగురు నిపుణులు అవసరం పడతారని పేర్కొన్నారు. అంతేకాక 10 శాతం మధ్యస్థాయి కంపెనీల్లో కనీసం ఒకవ్యక్తి అవసరం పడతారని చెప్పారు. దీంతో ఈ కొత్త జీఎస్టీ విధానంతో 1.3 మిలియన్ నిపుణులకు డిమాండ్ ఏర్పడుతుందన్నారు.
కొన్ని బాధ్యతలను ప్రస్తుతమున్న సేల్స్, ఇతర పన్నుల నిపుణులు నిర్వర్తించవచ్చు, కానీ కొత్తగా ప్రతిభావంతులును కూడా నియమించుకోవాల్సినవసరం ఎక్కువగా ఉంటుందన్నారు. పన్ను వైపుగా అయితే లాయర్లు, ఛార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు, ట్యాక్స్ కన్సల్టెంట్స్ కు భారీగా డిమాండ్ ఉంటుందని ఇండస్ట్రీ నిపుణులు చెప్పారు. టెక్నాలజీ వైపు అయితే సాఫ్ట్ వేర్ నిపుణులకు అవసరం ఎక్కువగా ఉంటుందన్నారు. అంతేకాక సెమీ-స్కిల్డ్ వర్కర్లకు కూడా డిమాండ్ ఏర్పడుతుందని నిపుణులు తెలిపారు. జీఎస్టీ రిటర్న్స్ లను, ప్రభుత్వ డేటా బేస్ లతో సమకాలీకరించాల్సి ఉంటుంది.
జీఎస్టీ మేనేజర్, వీపీ-జీఎస్టీ లేదా జీఎస్టీ టీమ్ లీడర్ వంటి కొన్ని పొజిషన్లు క్రియేట్ అవుతాయని ఓ సంస్థ సీరియర్ డైరెక్టర్ చెప్పారు. కొత్త జీఎస్టీ విధానాన్ని సరిగ్గా అమలుచేయలేకపోతే, కంపెనీలకే రెవెన్యూలు, లాభాలు పోతాయని, దీంతో మార్కెట్ షేరును వారు కోల్పోతారని పలువురు పేర్కొంటున్నారు. కార్పొరేట్లలో జీఎస్టీపై ఎంతో బాధ్యతతో పనిచేసేవారిని తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మంచి ప్రణాళికతో దీన్ని అమలుచేస్తే, అన్ని సమస్యలను అధిగమించవచ్చని, ఆర్థిక పొదుపులో జీఎస్టీ ఎంతో కీలకమైనదని పేర్కొంటున్నారు.
Advertisement