GST
-
జీఎస్టీ శ్లాబులు తగ్గింపు..?
జీఎస్టీ శ్లాబులను మరింత సరళతరం చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ ఛైర్మన్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నిర్మాణాన్ని క్రమబద్ధీకరించేందుకు ప్రస్తుతం అమలవుతున్న నాలుగు శ్లాబులను మూడుకు తగ్గించేలా చర్చలు సాగుతున్నాయని చెప్పారు.ఈ సందర్భంగా సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం అమలవుతున్న జీఎస్టీ శ్లాబుల విధానంలో చాలా వస్తువుల వర్గీకరణపై వివాదాలున్నాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పన్ను చెల్లింపులను మరింత సరళతరం చేసేందుకు ప్రస్తుతం ఉన్న నాలుగు జీఎస్టీ శ్లాబులను మూడుకు తగ్గించేలా చర్చలు జరుగుతున్నాయి. జులై 2017లో జీఎస్టీను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆదాయ వృద్ధి మెరుగుపడింది’ అన్నారు.ఇదీ చదవండి: ఈఎస్ఐ పథకంలోకి భారీగా చేరిన ఉద్యోగులుకేంద్ర బడ్జెట్ 2024-25 ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..‘జీఎస్టీ ప్రయోజనాలను పెంచడం కోసం పన్ను నిర్మాణాన్ని మరింత సరళీకృతం చేసేందుకు ప్రయత్నిస్తాం. జీఎస్టీ పరిధిని ఇతర రంగాలకు విస్తరిస్తాం’ అని చెప్పారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రాబడుల్లో స్థిరమైన వృద్ధి నమోదైంది. ఏప్రిల్ 2024లో ఆల్ టైమ్హై రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. ప్రస్తుతం జీఎస్టీ శ్లాబులు 5%, 12%, 18%, 28%గా ఉన్నాయి. -
ఏడు నెలల తర్వాత జరుగబోతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ 53వ సమావేశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జూన్ 22న దిల్లీలో నిర్వహించనున్నట్లు ఎక్స్‌ఖాతాలో పోస్ట్ చేశారు.కౌన్సిల్ అక్టోబర్ 2023లో చివరిసారిగా సమావేశం నిర్వహించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తిరిగి సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. ఇటీవల ఎన్నికల పలితాలు వెలువడి మంత్రిత్వశాఖలు కేటాయించడంతో జూన్ 22న తిరిగి సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పింది. ఎన్నికల తరుణంలో ఫిబ్రవరిలో కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈసారి పూర్తికాల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జులైలో బడ్జెట్ సమావేశాలు జరుగనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జూన్ 22న జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కీలకంగా మారనుంది. ఏయే వస్తువులపై ఏమేరకు ట్యాక్స్‌లో మార్పులుంటాయో ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.ఇదీ చదవండి: తెలుగు వెబ్‌సిరీస్ తొలగించాలని కోర్టులో పిటిషన్కౌన్సిల్ సమావేశపు ఎజెండా ఇంకా వెలువడలేదు. ఈసమావేశానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షత వహించనున్నారు. ఇందులో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, సెక్రటరీలు హాజరవుతారు. ఇదిలాఉండగా, గత పదేళ్లుగా చేపట్టిన సంస్కరణలు ఇకపైనా కొనసాగుతాయని కేంద్ర ఆర్థికమంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యసాధనను వేగవంతం చేసే దిశగా చర్యలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు, జీవనాన్ని సులభతరం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్లో కీలక నిర్ణయాలు వెలువడుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్ఫారాలతో నష్టం ఎంతంటే..
భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కంపెనీలపై ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. ఆయా బెట్టింగ్ సంస్థల వల్ల ప్రభుత్వానికి 2.5 బిలియన్ డాలర్లు(రూ.20వేలకోట్లు) నష్టం కలుగుతోందని అఖిల భారత గేమింగ్ సమాఖ్య (ఏఐజీఎఫ్) తెలియజేసింది. విదేశీ కంపెనీలు భారత్‌లో తమ సంస్థలకు చెందిన ప్లాట్ఫామ్ల్లో చట్టవ్యతిరేక బెట్టింగ్, గ్యాంబ్లింగ్ గేమ్‌లను అందిస్తున్నాయి. అయితే వాటికి చట్టబద్ధత లేకపోవడంతో చాపకింద నీరులా అవి విస్తరిస్తున్నాయి. ఆ కంపెనీలకు చెందిన ప్లాట్‌ఫామ్‌లు వినియోగిస్తున్న వారు చట్టబద్ధత ఉన్నావాటికి లేని వాటిని మధ్య తేడాను గ్రహించలేకపోతున్నారని ఏఐజీఎఫ్ సీఈఓ రోలండ్ లాండర్స్ తెలిపారు. ఇలా విదేశీ కంపెనీలు భారత్‌లోని చట్టబద్ధ గేమింగ్ పరిశ్రమకు హాని కలిగించడంతో పాటు వినియోగదార్లకు నష్టం కలిగేంచేలా వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ ఆఫ్‌షోర్ ప్లాట్‌ఫామ్స్ ఏటా 12 బిలియన్ డాలర్ల (సుమారు రూ.లక్ష కోట్ల) వరకు యూజర్లు, ప్రకటన కంపెనీల నుంచి డిపాజిట్లను వసూలు చేస్తున్నాయి. అంటే జీఎస్టీ రూపంలో 2.5 బిలియన్ డాలర్ల(రూ.20వేల కోట్లు) మేర కేంద్రానికి నష్టం జరుగుతోందని చెప్పారు. ఇలాంటి కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందన్నారు. చాలా సంస్థలు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో వ్యాపార ప్రకటనలు పెంచాయి. తమ ప్లాట్‌ఫారాలపై జీఎస్టీ/ టీడీఎస్ వర్తించదనీ చెబుతున్నాయన్నారు. దాంతో ఆయా గేమింగ్ ప్లాట్‌ఫారాల్లో ప్రకటనలకోసం కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: గూగుల్‌లో నిరసన సెగ..రూ.10వేలకోట్ల ప్రాజెక్ట్ నిలిపేయాలని డిమాండ్.. -
సెల్ఫీ తీసుకుంటే జీఎస్టీ వేస్తారేమో?: ఎంకే స్టాలిన్
చెన్నై: ఎన్డీఏ, ఇండియా కూటమి త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుపు సాధించడమే లక్ష్యంగా పోటీ పడుతున్నాయి. ఈ తరుణంలో డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ జీఎస్టీని పేదల 'దోపిడీ'గా అభివర్ణించి కీలక వ్యాఖ్యలు చేశారు. హోటల్ నుంచి టూ వీలర్ రిపేర్ వరకు అన్నింటిపైనా జీఎస్టీ? ఒక మధ్యతరగతి కుటుంబం ఎంజాయ్ చేయడానికి హోటల్‌కి వెళితే బిల్లులో జీఎస్టీని చూసి 'గబ్బర్ సింగ్ టాక్స్' అని బాధపడుతున్నారు. భవిష్యత్తులో సెల్ఫీ తీసుకున్నా జీఎస్టీ పడుతుందా? అని తన ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రశ్నించారు. 1.45 లక్షల కోట్ల కార్పొరేట్ పన్ను మాఫీ బీజేపీ పేదల పట్ల కరుణ చూపలేదా? మొత్తం జీఎస్టీలో 64 శాతం అట్టడుగువర్గాల నుంచి సమకూరుతోంది. 33 శాతం మధ్యతరగతి ప్రజల నుంచి, కేవలం 3 శాతం సంపన్నుల నుంచి జీఎస్టీ సమకూరుతోందని ఎంకే స్టాలిన్ అన్నారు. పేదలను దోపిడీ చేసే ఈ వ్యవస్థను మార్చాలంటే #Vote4INDIA! అంటూ ట్వీట్ చేశారు. GST: வரி அல்ல… வழிப்பறி! “தன் பிணத்தின் மீதுதான் ஜி.எஸ்.டி.யை அமல்படுத்த முடியும்” என்று முதலமைச்சராக எதிர்த்த திரு. நரேந்திர மோடி, பிரதமரானதும், “ஜி.எஸ்.டி பொருளாதாரச் சுதந்திரம்’’ என்று ‘ஒரே நாடு ஒரே வரி’ கொண்டு வந்தார். பேச நா இரண்டுடையாய் போற்றி! ஹோட்டல் முதல் டூ வீலர்… pic.twitter.com/Nnk1YTMw3q — M.K.Stalin (@mkstalin) April 15, 2024 -
పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. ఎంతంటే..
జీఎస్టీ వసూళ్లు ప్రతినెల భారీగా వసూలు అవుతున్నాయి. మార్చి నెలకుగాను రూ.1.78 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన దానితో పోలిస్తే ఇది 11.5 శాతం అధికం. అలాగే జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత రెండో అతిపెద్ద వసూళ్లు కూడా ఇదే కావడం విశేషం. గరిష్ఠంగా ఏప్రిల్ 2023లో రూ.1.87 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇదే ఏడాది ఫిబ్రవరిలో వసూలైన రూ.1.68 లక్షలకోట్ల కంటే ఈసారి అధికంగానే జీఎస్టీ ఖజానాకు చేరింది. ఈసారి సెంట్రల్ జీఎస్టీ కింద రూ.34,532 కోట్లు వసూలవగా, స్టేట్ జీఎస్టీ కింద రూ.43,746 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.87,947 కోట్లు వసూలయ్యాయి. మరోవైపు, గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.20.14 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. అంతక్రితం ఏడాదికంటే 11.7 శాతం అధికం. గత నెలలో తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు 12 శాతం మేర పెరిగాయి. ఏడాది క్రితం మార్చి నెలలో రూ.4,804 కోట్లు వసూలవగా, ఈసారి ఇది రూ.5,399 కోట్లకు పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఏపీలో జీఎస్టీ వసూళ్లు 16 శాతం ఎగబాకి రూ.3,532 కోట్ల నుంచి రూ.4,082 కోట్లకు చేరుకున్నాయని వెల్లడించింది. ఇదీ చదవండి: ప్రయాణికులకు క్షమాపణ చెప్పిన ప్రముఖ సంస్థ -
ఎన్నికల నేపథ్యంలో వస్తువులకు అసాధారణ గిరాకీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొన్ని రకాల వస్తువులు, సేవలకు అసాధారణ రీతిలో గిరాకీ పెరుగుతోంది. అందుకుగల కారణాలు విశ్లేషించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈమేరకు జీఎస్టీ ఇ-వేబిల్లుల అనలటిక్స్‌ను ఉపయోగించి రియల్‌టైమ్‌లో ప్రభుత్వం ధరల ప్రభావాన్ని పరిశీలిస్తోందని భారత ఎన్నికల సంఘం తెలిపింది. జీఎస్టీ విధానంలో వస్తువుల మొత్తం విలువ రూ.50,000 మించితే అంతరాష్ట్ర రవాణాకు ఇ-వేబిల్లును తీసుకోవడం తప్పనిసరి. రూ.5 కోట్లకు పైగా టర్నోవరు ఉన్న వ్యాపార సంస్థలు కూడా 2024 మార్చి 1 నుంచి ఇ-వేబిల్లులు తీసుకోవాల్సి ఉంది. వస్తు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి. నిజంగా గిరాకీ ఏర్పడిందా.. లేదంటే కృత్రిమ కొరత సృష్టించేలా ఈ వ్యవహారం వెనుక ఎవరైనా ఉన్నారా అనే అంశాలను పరిగణలోకి తీసుకునేలా ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇదీ చదవండి: ఉద్యోగులు కంపెనీ ఎందుకు మారడం లేదో తెలుసా..? వస్తువులకు గిరాకీ పెరగడాన్ని పర్యవేక్షించేందుకు రియల్- టైం జీఎస్టీ ఇ-వేబిల్లు అనలటిక్స్ మంచి సాధనమని నిపుణులు భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్ రూపంలోని పత్రాలను విశ్లేషణ చేయడం ద్వారా మార్కెట్ల ధోరణి, పన్ను నిబంధనల పాటింపు వంటి వాటిని అధికారులు, వ్యాపారులు గుర్తించే అవకాశం ఉంది. దాంతో వెంటనే నిర్ణయాలు తీసుకునే వీలుంటుందని చెబుతున్నారు. -
మొత్తం కేంద్రానికే.. రాష్ట్రాలు గగ్గోలు!
కేంద్రం నుంచి రాష్ట్రాలకు సక్రమంగా నిధుల బదిలీ జరగడం లేదని చాలాకాలంగా రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. నిధుల బదిలీలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ రాష్ట్రాలు నిరసన గళం వినిపిస్తున్నాయి. పన్నులు, సెస్సుల రూపంలో కేంద్రం ఎక్కువ ఆదాయం ఆర్జిస్తోందని కథనాలు వస్తున్నాయి. పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ మొత్తం పన్ను వసూళ్లలో సెస్సుల ద్వారా సమకూరిన వాటా 18 శాతం. తాజాగా ఇప్పుడది 30శాతానికి పెరిగినట్లు కొన్ని కథనాల ద్వారా తెలిసింది. కేంద్రానికి పెరిగిన ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకోవడం లేదనే వాదనలున్నాయి. నిబంధనల ప్రకారం సెస్సుల ఆదాయంలోనూ రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మొత్తం పన్ను వసూళ్లలో 50శాతాన్ని రాష్ట్రాలకు పంచాలి. మిగిలిన 50శాతం నిధుల్లో 10శాతాన్ని వివిధ రాష్ట్రాల్లో జాతీయ ప్రాజెక్టులపై వెచ్చించాలి. ఇదీ చదవండి: ఒకసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ టు శ్రీకాకుళం! ఓటు బ్యాంకు రాజకీయాలు, ఉచిత వరాలు చాలా రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. పెట్టుబడులకు వాటి వద్ద నిధులు ఉండటం లేదు. ఉత్పత్తి పెంపుదల, ఉపాధిపట్ల అధిక దృష్టి సారించే రాష్ట్రాలకు నిధుల బదిలీలో ఆర్థిక సంఘం ప్రాధాన్యమివ్వాలని నిపుణులు చెబుతున్నారు. -
‘టానిక్’ వెనుక కీలక వ్యక్తులు ఎవరు?.. వెలుగులోకి సంచలనాలు
సాక్షి, హైదరాబాద్: నగరంతో పాటు శివారుల్లో టానిక్ వైన్ మార్ట్ పేరిట జరిగిన భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టానిక్ ఎలైట్ వైన్ షాపుల్లో 6 ఏళ్లలో వందల కోట్ల అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు. మిగతా 10 క్యూ బై టానిక్ వైన్ షాప్స్ లెక్కలపై జీఎస్టీ, ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్ కోసం 2016లో గత ప్రభుత్వ స్పెషల్ సెక్రెటరీ జీవో జారీ చేశారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ చిరునామాతో అమిత్ రాజ్ లక్ష్మారెడ్డి పేరుతో టానిక్ ఎలైట్ షాప్ లైసెన్స్ జారీ అయ్యింది. టానిక్ ఎలైట్ వైన్ షాప్‌కి ఇచ్చిన మినహాయింపులపై ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్‌కు భారీ మినహాయింపులు ఇచ్చినట్లు తెలిసింది. 2016 నుండి 2019వరకు అన్ లిమిటెడ్ లిక్కర్ విక్రయాలకు టానిక్కు అనుమతి లభించగా, ఐదేళ్లకు ఒకసారి షాప్ రెన్యూవల్ చేసుకొనేలా వెసులుబాటు కల్పించారు. ఇతర షాపుల కంటే టానిక్కు ఐదు లక్షలు మాత్రమే అదనంగా యానివల్ ఫీజు నిర్ణయించారు. టానిక్ ఎలైట్ వైన్ షాప్‌ల వెనుక ఉన్న కీలక వ్యక్తుల ఎవరనేదానిపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. పూర్తి దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ తెలిపింది. సులువుగా అనుమతులు పొందడం మొదలు.. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరపడం, ట్యాక్సులు ఎగ్గొట్టడం దాకా.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వంద కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు తేలగా.. ఇందుకు గత ప్రభుత్వ హయాంలోని కొందరు అధికారులు పూర్తి సహకారం అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇదీ చదవండి: టానిక్ మోసాలు.. 100 కోట్ల ట్యాక్స్ ఎగవేత! -
జీఎస్టీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లు
జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. గత ఫిబ్రవరిలో ఏడాది ప్రాతిపదికన 12.5 శాతం పెరిగి రూ.1.68 లక్షల కోట్ల పన్ను వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో వసూలైన రూ.1.50 లక్షల కోట్లతో పోలిస్తే ఇది పెరిగింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ 2023-24 ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ స్థూల వసూళ్లు రూ. 1.67 లక్షల కోట్లుగా ఉన్నాయని, ఈ మొత్తం గత ఏడాది కంటే ఎక్కువగా ఉందని తెలిపింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.9.57 లక్షల కోట్లను వసూలు చేయాలని కేంద్రం లక్క్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. -
అదే జరిగితే.. ఇళ్ల కొనుగోలుదారులకు ఊరటే!
స్థిరాస్తి నియంత్రణ అథారిటీ(రెరా) వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని చెల్లించాలా? వద్దా? అనే అంశంపై త్వరలోనే జీఎస్టీ కౌన్సిల్ స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై సంబంధం ఉన్న ఓ అధికారి మాట్లాడుతూ..రెరాలకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తాయని, అందువల్ల జీఎస్టీ విధించడం అంటే రాష్ట్ర ప్రభుత్వాలపై పన్ను విధించడమేనని తెలిపారు. ఏప్రిల్-మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విధించడానికి ముందు కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన, రాష్ట్ర మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోనుంది. జీఎస్టీ కౌన్సిల్ చివరి సమావేశం అక్టోబర్ 7, 2023న జరిగింది. ఇక రెరా జీఎస్టీ చెల్లించే విషయంపై అకౌంటింగ్ అండ్ అడ్వైజరీ నెట్ వర్క్ సంస్థ మూర్ సింఘి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజత్ మోహన్ మాట్లాడుతూ.. జూలై 18, 2022కి ముందు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ నెట్వర్క్ జీఎస్టీకి లోబడి లేవని అన్నారు. ఈ సందర్భంగా రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనుమతించబడదు అంటే జీఎస్టీ నుంచి రెరాను మినహాయిస్తే సానుకూల ఫలితాలే ఎక్కువ అని అన్నారు. రెరా జీఎస్టీ చెల్లించే అవసరం లేకపోతే డెవలపర్లు, గృహ కొనుగోలుదారులు ఇద్దరికీ ఖర్చులు తగ్గుతాయి. తత్ఫలితంగా రంగానికి గణనీయంగా లాభదాయకంగా ఉంటుందని అని మోహన్ తెలిపారు. -
రూ. లక్ష జరిమానా.. పొగాకు కంపెనీలకు షాక్!
పాన్ మసాలా, గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలకు జీఎస్టీ (GST) విభాగం భారీ షాక్ ఇచ్చింది. ఆయా ఉత్పత్తుతల ప్యాకింగ్ మెషినరీని తప్పనిసరిగా జీఎస్టీ పరిధిలో నమోదు చేసుకోవాలని, అలా చేసుకోకపోతే రూ.లక్ష జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది. ఈ నియమాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. పొగాకు తయారీ రంగంలో పన్ను ఎగవేతను నిరోధించడమే దీని ఉద్దేశం. ఈమేరకు కేంద్ర జీఎస్టీ చట్టానికి సవరణలను చేసినట్లు పేర్కొంది. జీసీస్టీ పరధిలో నమోదు కాని ప్రతి మెషిన్‌కు రూ. లక్ష జరిమానా విధిస్తారు. నిబంధనలు విరుద్ధంగా నిర్వహిస్తున్న మెషిన్లను కొన్ని సందర్భాల్లో సీజ్ కూడా చేస్తారు. పాన్ మసాలా, గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తుల ప్యాకింగ్ మెషినరీల జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక ప్రత్యేక ప్రక్రియను గత సంవత్సరమే జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేసింది. తాము వినియోగిస్తున్న ప్యాకింగ్ యంత్రాల వివరాలు, కొత్తగా ఇన్స్టాల్ చేసిన మెషీన్ల ప్యాకింగ్ సామర్థ్యం వంటి వివరాలను GST SRM-I ఫారంలో సమర్పించాలి. అయితే ఇలా వివరాలు ఇవ్వనివారికి ఇప్పటి వరకూ ఎలాంటి జరిమానా ఉండేది కాదు. కానీ ఇకపై జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. -
రాష్ట్రంలో పన్ను ఎగవేస్తున్న సంస్థలు ఎన్నంటే..
జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక పన్ను ఎగవేత అసాధ్యమనుకున్నా.. మోసపూరిత వ్యాపారులు దాన్ని సైతం ఛేదించి అక్రమాలకు పాల్పడుతున్నారు. అంతర్రాష్ట్ర వ్యాపారాల్లో పన్ను ఎగవేస్తున్న వ్యాపారులను పట్టుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 73 వేలకు పైగా జీఎస్టీ నంబర్లకు సంబంధించిన వ్యాపారులు పన్ను సరిగా కట్టకుండా మోసాలకు పాల్పడుతున్నట్లు కేంద్రం అంచనాకు వచ్చింది. క్షేత్రస్థాయిలో గట్టిగా తనిఖీలు చేసి వీరిపై కఠినచర్యలు తీసుకోవాలని తాజాగా అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ దిశగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వాణిజ్య పన్నులశాఖలు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి తనిఖీలు ప్రారంభించాయి. నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్లు, రిజిస్ట్రేషన్లను తొలగించేందుకు చేపట్టిన డ్రైవ్‌లో కేంద్రం రూ.44వేల కోట్ల పన్ను ఎగవేతలను గుర్తించింది. ఎగవేతకు పాల్పడిన 29వేల సంస్థలను పట్టుకుంది. మోసపూరిత పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడి రూ.4,646 కోట్లు ఆదా చేసింది. మొత్తం ఏడున్నర నెలల్లో దేశవ్యాప్తంగా నిర్వహించిన డ్రైవ్‌లో 29వేల నకిలీ సంస్థలను, రూ.44వేల కోట్లకు పైగా జీఎస్టీ పన్ను ఎగవేతలను గుర్తించామని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉనికిలో లేని, బోగస్ రిజిస్ట్రేషన్లను గుర్తించే ప్రత్యేక డ్రైవ్ ఫలితాలను మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎలాంటి వస్తువులు, సేవల సరఫరా లేకుండా చాలా బోగస్ కంపెనీలు ఇన్వాయిస్లను తయారు చేశాయని చెప్పింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో జీఎస్టీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇదీ చదవండి: పన్ను ఆదాలో ఎన్పీఎస్ టాప్.. రెండో స్థానంలో ఈఎల్ఎస్ఎస్ తెలంగాణలో 117 బోగస్ సంస్థల ద్వారా రూ.536 కోట్ల పన్ను ఎగవేతను గుర్తించారు. ఇందులో రూ.235 కోట్ల మొత్తాన్ని బ్లాక్/ రికవరీ చేయడంతోపాటు ఒకరిని అరెస్టు చేసినట్లు ఆర్థికశాఖ తెలిపింది. రాష్ట్రంలో ప్రతి లక్ష రిజిస్టర్డ్ సంస్థల్లో 23 నకిలీ సంస్థలు ఉన్నట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో 19 బోగస్ సంస్థలు రూ.765 కోట్ల పన్ను ఎగవేసినట్లు గుర్తించింది. ఇందులో రూ.11 కోట్ల మొత్తాన్ని బ్లాక్/రికవరీ చేసినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి లక్ష రిజిస్టర్డ్ సంస్థల్లో 5 నకిలీవి ఉన్నట్లు తెలిపింది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను బలోపేతం చేయడానికి ఆధార్ ధ్రువీకరణ విధానాన్ని గుజరాత్, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లలో పైలెట్ ప్రాజెక్ట్‌గా మొదలుపెట్టారు. -
29,273 బోగస్ కంపెనీలు.. రూ. 44,015 కోట్లు కొట్టేసేందుకు పన్నాగం!
నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్‌లకు పాల్పడిన వేలాది బోగస్ కంపెనీలను జీఎస్టీ అధికారులు గుర్తించారు. 2023 డిసెంబర్ వరకు ఎనిమిది నెలల్లో రూ. 44,015 కోట్ల క్లెయిమ్‌లకు పాల్పడిన 29,273 బోగస్ సంస్థలను జీఎస్టీ అధికారులు గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ప్రభుత్వానికి 4,646 కోట్లు ఆదా అయినట్లు పేర్కొంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దాదాపు రూ.12,036 కోట్ల ఐటీసీ ఎగవేతలకు పాల్పడిన 4,153 బోగస్ సంస్థలను గుర్తించగా వీటిలో 2,358 బోగస్ సంస్థలను కేంద్ర జీఎస్టీ అధికారులు గుర్తించారు. 926 బోగస్ కంపెనీల గుర్తింపుతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా రాజస్థాన్ (507), ఢిల్లీ (483), హర్యానా (424) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. డిసెంబరు త్రైమాసికంలో బోగస్ కంపెనీలను గుర్తించడం ద్వారా రూ. 1,317 కోట్లు దుర్వినియోగం కాకుండా అడ్డుకోగలిగారు. ఈ కేసుల్లో 41 మందిని అరెస్టు చేయగా, వీరిలో 31 మందిని సెంట్రల్ జీఎస్టీ అధికారులు అరెస్టు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘2023 మే నెల మధ్యలో నకిలీ రిజిస్ట్రేషన్లపై స్పెషల్ డ్రైవ్ ప్రారంభించినప్పటి నుంచి రూ. 44,015 కోట్ల అనుమానిత ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) ఎగవేతకు పాల్పడిన మొత్తం 29,273 బోగస్ సంస్థలను గుర్తించాం. దీని వల్ల రూ. 4,646 కోట్లు ఆదా అయ్యాయి. ఇప్పటి వరకు 121 మందిని అరెస్టు చేశాం’ అని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
Zomato: ఛార్జీలు ఎందుకు పెంచుతుందో తెలుసా..?
గత త్రైమాసిక ఫలితాల్లో క్రమంగా నష్టాలు పోస్ట్ చేసిన జొమాటో ఇటీవల కొంత లాభాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా సేవలందించే సంస్థలు వాటి అవసరాలకు తగినట్లు ఛార్జీలు పెంచుకునే వీలుంది. నూతన సంవత్సరం సందర్భంగా రికార్డు స్థాయిలో ఆర్డర్లను అందుకున్న ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో.. ప్లాట్‌ఫారమ్ ఛార్జీని రూ.3 నుంచి రూ.4కి పెంచింది. కొత్త సంవత్సరం సందర్భంగా జొమాటో తన ప్లాట్‌ఫారమ్ ఫీజును తాత్కాలికంగా కొన్ని మార్కెట్లలో ఆర్డర్‌కు రూ.9 వరకు పెంచింది. మార్జిన్లను మెరుగుపరచడానికి, లాభదాయకంగా మారడానికి గత ఏడాది ఆగస్టులో రూ.2 ప్లాట్‌ఫారమ్ ఛార్జీను ప్రవేశపెట్టింది. అనంతరం దీనిని రూ.3కు పెంచింది. జనవరి 1న దాన్ని మళ్లీ రూ.4కు తీసుకొచ్చింది. ఇదీ చదవండి: న్యూ ఇయర్ ఎఫెక్ట్ - నిమిషానికి 1244 బిర్యానీలు.. ఓయో బుకింగ్స్ ఎన్నంటే? కొత్త ప్లాట్‌ఫారమ్ ఛార్జీ ‘జొమాటో గోల్డ్’తో సహా వినియోగదారులందరికీ వర్తిస్తుంది. జొమాటో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ బ్లింకిట్ కూడా నూతన సంవత్సం సందర్భంగా అత్యధిక ఆర్డర్లు పొందినట్లు తెలిసింది. ఇదిలావుండగా, జొమాటోకు దిల్లీ, కర్ణాటకలోని పన్ను అధికారుల నుంచి రూ.4.2 కోట్ల జీఎస్టీ నోటీసులు అందాయి. పన్ను డిమాండ్ నోటీసులపై అప్పీల్ చేస్తామని సంస్థ పేర్కొంది. డెలివరీ ఛార్జీలుగా సేకరించిన మొత్తంపై జీఎస్టీ చెల్లించలేదంటూ గతంలోనూ సంస్థ నోటీసులు అందుకుంది. -
ఎల్ఐసీకి రూ.806 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) జీఎస్టీ నుంచి రూ.806 కోట్లకు సంబంధించిన డిమాండ్ ఆర్డర్ కమ్ పెనాల్టీ నోటీసును అందుకున్నట్లు సంస్థ రిగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఇందులో రూ.365 కోట్లు జీఎస్టీ చెల్లింపులుకాగా, రూ.405 కోట్లు జరిమానా, రూ.36 కోట్లు వడ్డీతో కలిపి మొత్తం రూ.806 కోట్లకు పైగా చెల్లించాలని తెలిపింది. ఇందుకు సంబంధించి జనవరి 1న నోటీసు అందినట్లు సంస్థ చెప్పింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ నోటీసులు అందినట్లు సమాచారం. నిర్దేశించిన గడువులోగా ఆర్డర్‌కు వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేయనున్నట్లు ఎల్ఐసీ పేర్కొంది. ప్రస్తుతం వచ్చిన నోటీసులతో ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని సంస్థ అధికారులు తెలిపారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, రీఇన్సూరెన్స్ నుంచి పొందిన ఐటీసీ రివర్సల్, జీఎస్టీఆర్కు చెల్లించిన ఆలస్య రుసుంపై వడ్డీ, అడ్వాన్స్‌పై వడ్డీ కలిపి సంస్థకు రూ.806 కోట్లకు నోటీసులు పంపించినట్లు తెలిసింది. -
రూ.13.83 కోట్ల జీఎస్టీ నోటీసు.. ఆ తేడాలే కారణం..
ఏషియన్ పెయింట్స్ కంపెనీ రూ.13.83 కోట్ల జీఎస్టీ, రూ.1.38 కోట్ల పెనాల్టీ చెల్లించాలని కేంద్ర పన్నుల డిప్యూటీ కమిషనర్ డిమాండ్ నోటీసు పంపినట్లు సంస్థ ఫైలింగ్‌లో తెలియజేసింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)లో తేడాలపై 2017–18 ఆర్థిక సంవత్సరానికి ఈ డిమాండ్ నోటీసు వచ్చినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ నోటిసుకు వ్యతిరేకంగా అప్పీల్ చేస్తామని సంస్థ ప్రకటించింది. ఏషియన్ పెయింట్స్ కంపెనీ చేసిన సరఫరాలపై ఐటీసీని పొందడానికి వర్తించే అన్ని పన్నులను చెల్లించినట్లు కంపెనీ చెప్పింది. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్, 2017 తమిళనాడు గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్, 2017 సంబంధిత నిబంధనల ప్రకారం ఈ నోటీసులు వచ్చినట్లు తెలిసింది. ఇదీ చదవండి: ప్యాకేజ్డ్ ఉత్పత్తుల ముద్రణలో కీలక మార్పులు.. ఏషియన్ పెయింట్స్ కంపెనీను 1942లో చంపక్లాల్ చోక్సీ, చిమన్లాల్ చోక్సీ స్థాపించారు. 1965 వరకు ఏషియన్ ఆయిల్ అండ్ పెయింట్ కంపెనీ ఉన్న సంస్థ పేరును ఏషియన్ పెయింట్స్‌గా మార్చారు. ఇండియాలో మొత్తం 10 తయారీ కేంద్రాలున్నాయి. తెలుగురాష్ట్రాల్లో హైదరాబాద్‌లోని పటాన్చెరు, విశాఖపట్నంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లున్నాయి. -
జీఎస్టీ వసూళ్లు రూ.1.64 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు డిసెంబర్లో రూ.1.64 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022 ఇదే నెలతో పోలిస్తే ఈ విలువ 10 శాతం అధికం. ఏప్రిల్–డిసెంబర్ 2023 మధ్య జీఎస్టీ వసూళ్లు 12 శాతం పెరిగి రూ.14.97 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో వసూళ్లు సగటున 12 శాతం వృద్ధితో రూ.1.66 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆర్థిక సంవత్సరంలో తీరిది... ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో చరిత్రాత్మక స్థాయిలో రూ.1.87 లక్షల కోట్ల అత్యధిక వసూళ్లు నమోదయ్యాయి. మే, జూన్ నెలల్లో వరుసగా రూ.1.57 లక్షల కోట్లు, రూ.1.61 లక్షల కోట్లు ఒనగూరాయి. జూలై వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు. ఆగస్టు వసూళ్లు రూ. 1.59 లక్షల కోట్లుకాగా, సెప్టెంబర్‌లో రూ. 1.63 లక్షల కోట్ల జీఎస్టీ రాబడి నమోదయ్యింది. ఇక అక్టోబర్ విషయానికి వస్తే. వసూళ్లు భారీగా రూ.1.72 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2017 జూలైలో ప్రారంభం తర్వాత ఇవి రెండవ భారీ స్థాయి వసూళ్లు (2023 ఏప్రిల్ తర్వాత). నవంబర్‌లో వసూళ్లు రూ.1.67 లక్షల కోట్లు. ఎకానమీ క్రియాశీలత, పన్నుల ఎగవేతలను అడ్డుకునేందుకు కేంద్రం చర్యలు, వసూళ్ల వ్యవస్థలో సామర్థ్యం పెంపు, పండుగల డిమాండ్ జీఎస్టీ భారీ వసూళ్లకు కారణమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రానున్న నెలల్లో సైతం ఇదే ధోరణి కొనసాగుతుందన్న విశ్వాసాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం ఆదాయం రూ.1,64,882 ఇందులో సీజీఎస్టీ రూ.30,443 ఎస్జీఎస్టీ రూ.37,935 ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 84,255 సెస్ రూ.12,249 -
యస్ బ్యాంక్‌కు భారీ పెనాల్టీ
ప్రైవేట్ రంగానికి చెందిన యస్ బ్యాంక్ తమిళనాడు వస్తు సేవల పన్ను (GST) విభాగం భారీ పెనాల్టీ విధించింది. జీఎస్టీ సంబంధిత సమస్యల కారణంగా తమిళనాడు జీఎస్టీ విభాగం నుంచి రూ.3 కోట్ల పన్ను నోటీసును యస్ బ్యాంక్ సోమవారం అందుకుంది. యస్ బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. తమిళనాడు జీఎస్టీ డిపార్ట్మెంట్ రూ. 3,01,50,149 జరిమానా విధించింది. అయితే దీని వల్ల బ్యాంక్ ఆర్థిక లేదా ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని, దీనిపై న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. ఇదీ చదవండి: వామ్మో.. కొత్త ఏడాదిలో బంగారం కొనగలమా? కలవరపెడుతున్న అంచనాలు! కాగా యస్ బ్యాంక్ గతంలోనూ జీఎస్టీ నోటీసులు అందుకుంది. గతేడాది డిసెంబర్లో బిహార్ జీఎస్టీ డిపార్ట్మెంట్ వరుసగా రూ. 20,000, రూ. 1,38,584 చొప్పున రెండు వేర్వేరు పన్ను నోటీసులను జారీ చేసింది. -
జొమాటోకి గట్టి షాక్.. ఆ చార్జీలపైనా జీఎస్టీ కట్టాల్సిందే!
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) షాకిచ్చింది. రూ.401.7 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లించాలని నోటీసులు పంపించింది. డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ చెల్లించనందుకు డీజీజీఐ తాజాగా ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీలకి పన్ను నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థలు వసూలు చేస్తున్న డెలివరీ ఛార్జీలు సేవల కేటగిరీ కిందకు వస్తాయని, వీటిపై 18 శాతం జీఎస్టీ చెల్లించాలని స్పష్టం చేసింది. పెనాల్టీలు, వడ్డీ కూడా.. జీఎస్టీ బకాయిలతోపాటు డెలివరీ భాగస్వాముల తరపున కస్టమర్ల నుంచి వసూలు చేసిన డెలివరీ ఛార్జీలపై పన్ను చెల్లించలేకపోవడంపై 2019 అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకు జరిమానాలు, వడ్డీని కూడా చెల్లించాలని జొమాటోను డీజీజీఐ ఆదేశించింది. జొమాటో స్పందన డీజీజీఐ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు జొమాటో స్పందించింది. తాము ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. "డెలివరీ ఛార్జ్‌ని డెలివరీ భాగస్వాముల తరపున కంపెనీ వసూలు చేస్తుంది. కానీ కంపెనీ నేరుగా డెలివరీ సర్వీసులు అందించదు. కాంట్రాక్టు నిబంధనలు, షరతుల మేరకు డెలివరీ భాగస్వాములు కస్టమర్లకు డెలివరీ సేవలు అందిస్తారు." అని పేర్కొంది. లీగల్, ట్యాక్స్ నిపుణుల అభిప్రాయాలను తీసుకుని షోకాజ్‌కు నోటీసుకు తగినవిధంగా స్పందన సమర్పిస్తామని ప్రకటనలో పేర్కొంది. -
రాష్ట్రాలకు రూ.72,961 కోట్లు విడుదల.. ఎందుకంటే..
కేంద్రప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్రాల వాటాను ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తూ ఉంటుంది. అయితే రానున్న నూతన సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల అవసరాలు తీర్చేలా రూ.72,961.21 కోట్ల పన్నుల పంపిణీకి కేంద్రం శుక్రవారం ఆమోదం తెలిపింది. వివిధ సామాజిక సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వాలను బలోపేతం చేయడానికి ఈ నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబరు 11, 2023న ఇప్పటికే విడుదలైన నిధులకు తాజాగా విడుదల చేస్తున్న రూ.72,961.21 కోట్లు అదనం అని కేంద్రం ప్రకటనలో చెప్పింది. ఈ నిధుల్లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు అత్యధికంగా రూ.13,088.51 కోట్లు, బిహార్ రూ.7338.44 కోట్లు, మధ్యప్రదేశ్ రూ.5727.44 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.5488.88 కోట్లు రానున్నాయి. ఇదీ చదవండి: 2024లో బ్యాంక్ సెలవులు ఇవే.. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో 41 శాతం నిధులను 14 విడతలుగా రాష్ట్రాలకు పంపిణీ చేసినట్లు సమాచారం. 2023-24 బడ్జెట్ ప్రకారం ఈ ఏడాది రాష్ట్రాలకు రూ.10.21 లక్షల కోట్లు బదిలీ చేయాలని కేంద్రం భావిస్తోంది. -
మరోసారి గెలుచుకునేదానిపైనా జీఎస్టీ ఉంటుందా? ఆర్థిక మంత్రి క్లారిటీ..
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్‌లో ప్రారంభ పందేలపై 28% జీఎస్టీ విధింపునకు సంబంధించి విలువ ఆధారిత నిబంధనలు ప్రభావవంతంగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ‘‘ఇందుకు సంబంధించి వివరణ జారీ అయింది. 28% పన్ను రేటు అమలవుతుంది. ఇది ఎవరికి వర్తిస్తుంది, ఎవరిపై భారం పడుతుందన్నది వివరంగా పేర్కొనడం జరిగింది. విలువకు సంబంధించి నిబంధనలు విజయాలను మినహాయిస్తున్నాయి. కనుక దీనిపై ఎలాంటి గందరగోళం ఉండదని భావిస్తున్నాను’’అని మంత్రి వివరించారు. దీని ప్రకారం.. ఆన్లైన్ గేమింగ్‌లో గెలుచు కున్న నగదుతో తిరిగి బెట్టింగ్‌లు వేసినప్పుడు వా టిపై 28% జీఎస్టీ అమలు కాదు. స్పష్టంగా చెప్పాలంటే మొదటిసారి బెట్టింగ్‌కు పెట్టే మొత్తంపై 28% జీఎస్టీ చెల్లించాలి. దానిపై గెలుచుకున్న మొత్తాన్ని తిరిగి వెచ్చించినప్పుడు జీఎస్టీ పడదు. లోక్ సభలో జీఎస్టీ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీతారామన్ మాట్లాడారు. అప్పిలేట్ ట్రిబ్యునల్ ప్రెసిడెంట్, సభ్యుల వయో పరిమితిని ఈ బిల్లులో సవరించారు. ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రి ఓ ఉదాహరణను కూడా వినిపించారు. ‘‘ఒక వ్యక్తి రూ.1,000 బెట్ చేసి, దానిపై రూ.300 గెలుచుకుని.. ఆ తర్వాత రూ.1,300తో మరోసారి గెలుచుకునే మొత్తంపై జీఎస్టీ పడదు’’అని వివరించారు. -
ఐదేళ్లలో రూ.10.57 లక్షల కోట్ల రుణ మాఫీ.. ఎన్పీఏల రికవరీ ఎంతంటే?
దేశంలో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీ) గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2018–19 నుంచి 2022–23) రూ.10.57 లక్షల కోట్లను మాఫీ (రైటాఫ్.. పద్దుల్లోంచి తొలగింపు) చేశాయని, అందులో రూ.5.52 లక్షల కోట్లు భారీ పరిశ్రమలకు సంబంధించిన రుణాలని ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు తెలియజేసింది. ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు గత ఐదేళ్ల కాలంలో రూ.7,15,507 కోట్ల నిరర్థక ఆస్తులను (ఎన్పీఏ) కూడా రికవరీ చేసినట్లు తెలిపారు. ఐదేళ్ల కాలంలో మోసాలకు సంబంధించి జరిగిన రైటాఫ్‌ల విలువ రూ.93,874 కోట్లని ఈ సందర్భంగా వెల్లడించారు. మాఫీతో రుణ గ్రహీతకు ప్రయోజనం ఉండదు... సంబంధిత బ్యాంక్ బోర్డుల మార్గదర్శకాలు– విధానాలకు అనుగుణంగా బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్‌ను క్లీన్ చేస్తాయని కరాద్ పేర్కొన్నారు. పన్ను ప్రయోజనాలను పొందేందడం, మూలధనాన్ని తగిన విధంగా వినియోగించుకోవడం వంటి అంశాలకు సంబంధించి బ్యాంకులు రైట్–ఆఫ్‌ల ప్రభావాన్ని క్రమం తప్పకుండా అంచనా వేస్తాయని కరాద్ చెప్పారు. ‘‘ఇటువంటి రైట్–ఆఫ్‌లు రుణగ్రహీతల తిరిగి చెల్లించాల్సిన బాధ్యతల మాఫీకి దారితీయదు. రైట్–ఆఫ్ రుణగ్రహీతలకు ఎటువంటి ప్రయోజనం కలిగించదు. రుణగ్రహీతలు బ్యాంకులకు తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సిందే. బ్యాంకులు వాటికి అందుబాటులో ఉన్న యంత్రాంగాల ద్వారా రికవరీ చర్యలను కొనసాగిస్తూనే ఉన్నాయి’’ అని కరాద్ స్పష్టం చేశారు. 21,791 నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు: నిర్మలా సీతారామన్ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అధికారులు 21,791 నకిలీ జీఎస్టీ రిజి్రస్టేషన్లను ఇందుకు సంబంధించి రూ.24,000 కోట్లకు పైగా పన్ను ఎగవేతలను గుర్తించారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. రెండు నెలలపాటు సాగిన స్పెషల్ డ్రైవ్‌లో అధికారులు ఈ విషయాలను గుర్తించినట్లు వెల్లడించారు. గుర్తించిన నకిలీ రిజి్రస్టేషన్లలో స్టేట్ ట్యాక్స్ న్యాయపరిధిలోని రిజి్రస్టేషన్లు 11,392 కాగా (రూ.8,805 కోట్లు), సీబీఐసీ న్యాయపరిధిలోనివి 10,399 (రూ.15,205 కోట్లు) అని ఆమె వివరించారు. నిజాయితీగల పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలను కాపాడటానికి, పన్ను చెల్లింపుదారులు ఎటువంటి తీవ్ర ఇబ్బందులు పడకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు జారీ అవుతుంటాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అధికారాల వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తున్నట్లు తెలిపారు. -
మరింత సులభంగా జీఎస్టీ సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పన్నుల చెల్లింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా సులభతరం చేస్తూ ప్రభుత్వం జీఎస్టీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా పన్ను చెల్లింపుల్లో అక్రమాలకు కూడా అడ్డుకట్ట పడనుంది. రిజిస్ట్రేషన్ విధానాన్ని కూడా సరళీకృతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 12 సేవా కేంద్రాలను ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. జ్ఞాన క్షేత్రం, కమర్షియల్ టాక్స్ విజన్, మిషన్ వాల్యూస్, ’జీఎస్టీ మిత్ర’ లోగోను ఆవిష్కరించారు. ఉత్తమ పనితీరు కనబర్చిన 195 మంది అధికారులు, సిబ్బందికి పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పన్ను చెల్లింపుదారులకు అనుకూల వాతావరణాన్ని కలి్పంచేలా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చేపడుతున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. సేవా కేంద్రాల ద్వారా వ్యాపార, వాణిజ్య వర్గాలకు ఉత్తమ సేవలు అందుతాయని, జీఎస్టీ ఎగవేతలను అరికట్టవచ్చని చెప్పారు. కొందరు ఇన్పుట్ టాక్స్ ఎగవేతకు పాల్పడటం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందన్నారు. జీఎస్టీ సేవా కేంద్రాల ద్వారా సులువుగా పన్నులు చెల్లించేందుకు, రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఉందని తెలిపారు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ నమోదు ప్రాజెక్టు ద్వారా నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లను అరికట్టగలుగుతామన్నారు. దేశంలో ఈ సేవా కేంద్రాల పద్ధతి మూడు రాష్ట్రాల్లోనే ఉందని తెలిపారు. పన్ను చెల్లించే వారిని దోపిడీదారులుగా కాకుండా వారితో టాక్స్ ఎలా కట్టించాలో ఆలోచించాలన్నారు. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లాం మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖలో పారదర్శకత, సరళతర విధానాలు మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పారు. టాక్స్ పేయర్, వాణిజ్య పన్నుల శాఖ సమన్వయంతోనే పారదర్శకత సాధ్యమైందన్నారు. పన్ను చెల్లింపుదారులకు సులభంగా అర్థమయ్యేలా వెబ్సైట్ ను తీర్చిదిద్దారని తెలిపారు. పన్ను చెల్లింపుల వ్యవహారంలో ఇతర దేశాల్లో మాదిరి మన రాష్ట్రంలో వేధింపులకు తావు లేదన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, విశాఖ కస్టమ్స్ అండ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్ సంజయ్ పంత్, జీఎస్టీఎన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ రస్తోగి, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జర్, స్టేట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్ ఎం.గిరిజా శంకర్, గుంటూరు సెంట్రల్ టాక్సెస్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ రాబడిలో మొదటి స్థానం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పూర్తి స్వేచ్ఛతో వాణిజ్య పన్నుల శాఖలో పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలందించేలా సంస్కరణలు చేపట్టామని చెప్పారు. నిజాయితీగా పన్నులు కట్టే వారిక సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పన్ను చెల్లింపుదారుల వివరాల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విధానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. నవంబర్ నెలలో జీఎస్టీ పన్నుల వసూళ్లలో 31 శాతం వృద్ధి రేటుతో తమిళనాడు (20%), కేరళ (20%), తెలంగాణ (18%), కర్ణాటక (17%), ఒడిశా (3%) కన్నా ఆంధ్రప్రదేశ్ అగ్రగ్రామిగా ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌నాటికి రూ.21,180.57 కోట్ల జీఎస్టీ వసూలు ద్వారా 90 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. గత ఏడాదితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 17.14 శాతం వృద్ధిని నమోదు చేశామన్నారు. -
రాష్ట్రంలో పన్నుల ప్రక్రియ మరింత సులభం
రాష్ట్రంలో పన్నుల చెల్లింపు ప్రక్రియ మరింత సులభం చేస్తూ పన్ను చెల్లింపు దారులకు, వ్యాపారులకు అనుకూల వాతావరణాన్ని కల్పించే దిశగా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నూతన ఆవిష్కరణలు చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞాన క్షేత్రం, కమర్షియల్ ట్యాక్స్ విజన్, మిషన్ వ్యాల్యూస్, 'జీఎస్టీ మిత్ర' లోగోను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆవిష్కరించారు. జీఎస్టీ నెట్ వర్క్, మొబైల్ నంబర్ నమోదుతో పన్నుదారులకు ఓటీపీ ఆధారంగా మరింత సులువుగా సేవలు అందించడంతో పాటు పన్ను చెల్లింపులు, ఆర్థిక సంవత్సరాల నివేదికలు సహా ఎన్నో సౌలభ్యాలు ఉన్నాయని పలువురు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖ నిర్వహణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పూర్తి స్వేచ్ఛ వల్లే పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవల కోసం అత్యాధునిక సాంకేతికత వినియోగించి వాణిజ్య శాఖలో వినూత్న ఆవిష్కరణలు, విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని తెలిపారు. నిజాయితీగా పన్నులు కట్టే వినియోగదారుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పన్ను చెల్లింపుదారుల వివరాలకు సంబంధించిన భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాము అవలంభిస్తున్న విధానాలతో గతేడాది నెలతో పోలిస్తే 31 శాతం గణనీయమైన వృద్ధితో పురోగతి సాధించామన్నారు. వృద్ధి రేటులో తమిళనాడు(20%), కేరళ(20%), తెలంగాణ(18%), కర్ణాటక(17%), ఒడిశా(3%) కన్నా ఆంధ్రప్రదేశ్ అగ్రగ్రామిగా ఉందని మంత్రి వివరించారు. అంతేగాక నవంబర్, 2023 వరకు రూ.21,180.57 కోట్ల జీఎస్టీ రెవెన్యూ వసూళ్లు చేసి 90 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. జీఎస్టీ వసూళ్లలో గతేడాది కన్నా 17.14 శాతం గణనీయమైన వృద్ధి సాధించామన్నారు. జీఎస్టీ ఎగవేతలను అరికట్టడంతో పాటు వ్యాపార, వాణిజ్య వర్గాలకు సేవలు అందుబాటులో ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా 12 జీఎస్టీ సేవాకేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు. ప్రత్యేకించి విజయవాడ నంబర్ 1 డివిజన్ లో మొదటి జీఎస్టీ సేవా కేంద్రం ప్రారంభించడం మైలురాయిగా భావిస్తున్నామన్నారు. కొందరు ఇన్పుట్ టాక్స్ ఎగవేతలకు దొడ్డిదారులను ఎంచుకుంటున్నారని తద్వారా రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందని మంత్రి అన్నారు. జీఎస్టీ సేవా కేంద్రాల ద్వారా సులువుగా పన్నులు చెల్లించేందుకు, రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఉందని మంత్రి అన్నారు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ నమోదు ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లను అరికట్టగలుగుతామన్నారు. భారత దేశంలో ఈ సేవా కేంద్రాల పద్ధతి మూడు రాష్ట్రాలలో మాత్రమే ఉందని తెలిపారు. ట్యాక్స్ కట్టే వారిని దోపిడీదారులుగా కాకుండా వారితో ట్యాక్స్ ఎలా కట్టించాలో ఆలోచించాలన్నారు. ట్యాక్స్ కట్టే వారి వల్లే దేశం నడుస్తుందని అన్నారు. గతంలో మాదిరి పన్నులు ఎగ్గొట్టే వారిని పట్టుకోవడం కన్నా.. పన్ను వసూళ్లను సరళతరం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. విజన్ స్టేట్ మెంట్ ఉండటం ప్రతి వ్యవస్థకు అవసరమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఆర్థిక శాఖకు సంబంధించి స్టేట్ ట్యాక్సెస్ కు ఒక విజన్ ఇచ్చిన రోజును తన జీవితంలో మరిచిపోలేనని మంత్రి చెప్పారు. పలువురు ఉన్నతాధికారులను కొన్ని బృందాలుగా ఏర్పాటు చేసి, వివిధ రాష్ట్రాల్లో పర్యటించి పలు అంశాలను అధ్యయనం చేశామన్నారు. ట్రేడ్ అడ్వైజరీ కమిటీలు, పదుల సంఖ్యలో సమీక్షలు చేయడం ద్వారా ఇబ్బందులను పరిష్కరించి, సవాళ్లను అధిగమించామని చెప్పారు. తాను పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఛైర్మన్ గా ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులకు 'శిక్షణ' ఆవశ్యకతను గుర్తించానన్నారు. గత కొన్నేళ్లలో నిర్వర్తించిన బాధ్యతలు సంతృప్తికరమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో పారదర్శకత, సరళతర విధానాలను స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లాం తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు సులభంగా అర్థమయ్యేలా వెబ్ సైట్ ను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. టాక్స్ పేయర్, వాణిజ్య పన్నుల శాఖ సమన్వయంతోనే పారదర్శకత సాధ్యమైందన్నారు. ఇతర దేశాల్లో మాదిరి పన్ను చెల్లింపుల వ్యవహారంలో మన రాష్ట్రంలో వేధింపులకు తావు లేదన్నారు. పన్ను చెల్లింపుదారులే లేకపోతే వాణిజ్య పన్నుల శాఖ లేదని ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్ తెలిపారు. వాణిజ్య పన్నులు, వసూళ్ల సరళతరం కోసం ఎన్నో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. పన్నుల వసూళ్లలో దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా ఏపీ ముందుందని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖలో పాత విధానాలకు స్వస్తి పలికి..సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికామన్నారు. పన్ను చెల్లించే వారికి ఏ ఇబ్బంది లేని విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రానున్న రెండు మూడేళ్లలో మరిన్ని కీలక మార్పులతో ముందుకు వెళ్తామన్నారు. వాణిజ్య పన్నులు, జీఎస్టీలో సాంకేతిక పరిజ్ఞానం అమలులో ఏపీ ముందడుగు వేసిందని జీఎస్టీఎన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ రస్తోగి అన్నారు. గొప్ప ఆవిష్కరణలు, సంస్కరణలకు వేదికగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. అర్ధశాస్త్రంలో పన్ను వసూలు గురించి కౌటిల్యుడు చెప్పిన 5 ప్రధాన అంశాలను ప్రామాణికంగా తీసుకున్నామని విశాఖపట్నం కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్ సంజయ్ పంత్ పేర్కొన్నారు. జీఎస్టీలో రూ.8 వేల కోట్ల నుంచి రూ.23 వేల కోట్ల వరకూ ఎదిగామని తెలిపారు. బోగస్ రిజిస్ట్రేషన్లు అరికట్టేలా వాణిజ్య శాఖలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని అవి సత్ఫలితాలిస్తున్నాయని వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్ పేర్కొన్నారు. వాణిజ్య పన్నుల విషయంలో పారదర్శక విధానాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రభుత్వ సంస్కరణల వల్ల జీఎస్టీలో ఏపీ మెరుగైన ప్రతిభను కనబరుస్తుందన్నారు. రాష్ట్ర పన్నుల శాఖ స్థితిని, గతిని, దశను, దిశను ఉన్నత స్థాయికి పెంచి దేశస్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ను పలువురు అధికారులు కొనియాడారు. రాష్ట్ర పన్నుల శాఖలో సంస్కరణలు తేవాలని, ఈ శాఖను సేవా విభాగంగా చేయాలని, పారదర్శకతను పెంచాలని, టెక్నాలజీని అందిపుచ్చుకొని మెరుగైన సేవలను అందిస్తూ ఆర్థిక వృద్ధిని సాధించాలని చెప్పి ఆచరణలో చూపించిన వ్యక్తి, అరుదైన ఆర్థిక నిపుణులు బుగ్గన రాజేంద్రనాథ్ అని పలువురు అధికారులు అభివర్ణించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీ ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ మల్లాది విష్ణు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, విశాఖపట్నం కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్ సంజయ్ పంత్, జీఎస్టీఎన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ రస్తోగి, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జర్, స్టేట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్ ఎం.గిరిజా శంకర్, గుంటూరు సెంట్రల్ టాక్సెస్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి, వాణిజ్యవేత్తలు, వాణిజ్యపన్నుల శాఖ అధికారులు, ఆడిటర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణను దాటేసిన ఏపీ..!
దేశంలో మరోసారి భారీగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. నవంబరు నెలలో జీఎస్టీ వసూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 31%, తెలంగాణలో 18% వృద్ధి నమోదు చేశాయి. కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన నవంబరు నెల లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వసూళ్లు గతేడాది నవంబరుతో పోలిస్తే ఈ నవంబరులో రూ.3,134 కోట్ల నుంచి రూ.4,093 కోట్లకు పెరిగాయి. ఈ నెలలో దేశవ్యాప్తంగా రూ.1,67,929 కోట్లు వసూలయ్యాయి. ఇందులో సీజీఎస్టీ వాటా రూ.30,420 కోట్లు, ఎస్జీఎస్టీ వాటా రూ.38,226 కోట్లు. ఐజీఎస్టీ రూపంలో రూ.87,009 కోట్ల సమకూరగా.. సెస్సుల రూపంలో రూ.12,274 కోట్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల తెలిపింది. ఐజీఎస్టీ రూపంలో వచ్చిన వసూళ్లను రూ.37,878 కోట్లు సీజీఎస్టీకి, రూ.31,557 కోట్లు ఎస్జీఎస్టీ కింద సర్దుబాటు చేసింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 15 శాతం పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది ఆరోసారి. రాష్ట్రాల వారీగా రూ.25,585 కోట్లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్‌లో రూ.4,093 కోట్లు వసూళ్లు జరిగాయి. గతేడాది రూ.3,134 కోట్లతో పోలిస్తే 31 శాతం అధికం. తెలంగాణలో గతేడాది రూ.4,228 కోట్లు వసూళ్లు ఈ సారి 18 శాతం వృద్ధితో రూ.4,986 కోట్లు వసూళ్లు నమోదయ్యాయి. ఇదీ చదవండి: ప్రపంచంలోనే నాసా కంటే ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్..! కానీ.. ఎస్జీఎస్టీని కేంద్ర, రాష్ట్రాల మధ్య పంపిణీ చేసిన తర్వాత ఏప్రిల్-నవంబరు మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన వాటా 2022తో (రూ.18,742కోట్లు) పోలిస్తే 2023లో (రూ.20,952కోట్లు) 12% పెరిగింది. తెలంగాణకు దక్కిన వాటా రూ.24,460 కోట్ల నుంచి రూ.26,691 కోట్లకు (9%) పెరిగింది. ఎస్జీఎస్టీ వాటా అన్ని రాష్ట్రాలకూ సగటున 12% వృద్ధి చెందింది.