
సాక్షి, సరూర్ నగర్: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సరూర్ నగర్‌లో జీఎస్టీ సీనియర్ అధికారిపై దాడి పాల్పడి అతడిని కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ క్రమంలో పోలీసులు కిడ్నాప్‌ను చేధించారు.
వివరాల ప్రకారం.. సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జీఎస్టీ సీనియర్ అధికారి మణిశర్మ కిడ్నాప్‌నకు గురయ్యారు. అయితే, దిల్‌షుక్‌నగర్‌లోని కృష్ణానగర్‌లో జీఎస్టీ కట్టని ఓ షాప్‌ను సీజ్ చేసేందుకు ఆఫీసర్ మణిశర్మ అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆఫీసర్ మణిశర్మ, మరో అధికారి ఆనంద్‌లను షాప్ ఓనర్, మరో ముగ్గురు కలిసి కిడ్నాప్ చేశారు. జీఎస్టీ ఆఫీసర్‌పై వారు దాడికి పాల్పడ్డారు.
ఇక, కిడ్నాప్ సమయంలో నిందితులు వాడిన కారుపై టీడీపీ నేత ముజీబ్ పేరుతో స్టికర్ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితుల్లో టీడీపీ నేత ముజీబ్ అనుచరులు ఉన్నట్టు తెలుస్తోంది. ముజీబ్ గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత.
ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగి అధికారిని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా కిడ్నాప్‌నకు పాల్పడిన నిందితులను పట్టుకున్నారు. అనంతరం, నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: బండ్లగూడ కారు ప్రమాదం.. సినిమాను తలపించే ట్విస్టులు..
Comments
Please login to add a commentAdd a comment