saroornagar
-
సరూర్‌నగర్‌లో ప్రేమోన్మాది కాల్పులు
సాక్షి, హైదరాబాద్: సరూర్ నగర్లో కాల్పుల కలకలం రేగింది. ప్రేమోన్మాది.. యువతి తండ్రిపై గన్‌తో కాల్పులు జరిపాడు. యువతి తండ్రి కంటిలో నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. స్థానికుల వివరాలు ప్రకారం.. కొన్నాళ్లుగా బల్వీందర్ సింగ్, మన్విత ప్రేమించుకుంటున్నారు. దీంతో మన్వితను ఆమె తండ్రి రేవంత్ ఆనంద్ దూరంగా పంపేశాడు. దీంతో కక్ష పెంచుకున్న బల్వీందర్‌సింగ్.. యువతి తండ్రిపై కాల్పులు జరిపినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
డ్రైనేజీతో డేంజర్ వర్షం పడితే నరకమే..
-
HYD: జీఎస్టీ అధికారి కిడ్నాప్ కలకలం..
సాక్షి, సరూర్ నగర్: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సరూర్ నగర్లో జీఎస్టీ సీనియర్ అధికారిపై దాడి పాల్పడి అతడిని కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ క్రమంలో పోలీసులు కిడ్నాప్‌ను చేధించారు. వివరాల ప్రకారం.. సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జీఎస్టీ సీనియర్ అధికారి మణిశర్మ కిడ్నాప్‌నకు గురయ్యారు. అయితే, దిల్‌షుక్‌నగర్‌లోని కృష్ణానగర్‌లో జీఎస్టీ కట్టని ఓ షాప్‌ను సీజ్ చేసేందుకు ఆఫీసర్ మణిశర్మ అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆఫీసర్ మణిశర్మ, మరో అధికారి ఆనంద్‌లను షాప్ ఓనర్, మరో ముగ్గురు కలిసి కిడ్నాప్ చేశారు. జీఎస్టీ ఆఫీసర్‌పై వారు దాడికి పాల్పడ్డారు. ఇక, కిడ్నాప్ సమయంలో నిందితులు వాడిన కారుపై టీడీపీ నేత ముజీబ్ పేరుతో స్టికర్ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితుల్లో టీడీపీ నేత ముజీబ్ అనుచరులు ఉన్నట్టు తెలుస్తోంది. ముజీబ్ గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగి అధికారిని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా కిడ్నాప్‌నకు పాల్పడిన నిందితులను పట్టుకున్నారు. అనంతరం, నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: బండ్లగూడ కారు ప్రమాదం.. సినిమాను తలపించే ట్విస్టులు.. -
అప్సరకు గతంలోనే వివాహం ?
-
అప్సర కేసు.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముందంటే?
సాక్షి, హైదరాబాద్: తన కూతురు అలాంటి అమ్మాయి కాదని.. చాలా కిరాతకంగా చంపాడంటూ కాశీ నుంచి ఇంటికి చేరుకున్న అప్సర తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ.. తమకు, సాయికృష్ణ కుటుంబానికి ఎటువంటి రిలేషన్ లేదని, ఇలా అవుతుందనుకోలేదన్నారు. తెలిసిన వెంటనే ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వచ్చానన్నారు. పూజారి అయి ఉండి ఇలా చేశాడని, నిందితుడికి కఠిన శిక్ష పడాలని అప్సర తల్లిదండ్రులు కోరారు. కాగా, ఉస్మానియా మార్చురీలో అప్సర మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసిన వైద్యులు.. ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. తలకు బలమైన గాయాలు కావడంతోనే అప్సర మృతి చెందినట్లు అప్సర ప్రిలిమినరీ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. జరిగింది ఇదే.. గుడికి వచ్చిన అప్సరతో వివాహితుడైన పూజారికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లు బాగానే గడిపారు. తీరా తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆమె నుంచి ఒత్తిడి పెరగడంతో చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం నగర శివార్లలోకి తీసుకువెళ్లి దారుణంగా హతమార్చాడు. చదవండి: అప్సర కేసు: సాయికృష్ణ అమాయకుడా? మృతదేహాన్ని సరూర్‌నగర్ మండల ఆఫీసు వెనుక ఉన్న పాత సెప్టిక్ ట్యాంక్‌లో పడేసి ఉప్పు, ఎర్రమట్టి నింపాడు. వాసన బయటకు రాకుండా దానికి ఉన్న రెండు మ్యాన్‌హోల్స్‌కు కాంక్రీట్ చేశాడు. తర్వాత ఆమె అదృశ్యమైనట్లు ఆర్జీఐఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సాంకేతిక ఆధారాలతో ముందుకు వెళ్లిన పోలీసులు ఆమె హత్యకు గురైనట్లు తేల్చారు. అప్సరను దారుణంగా హతమార్చిన నిందితుడు, పూజారి సాయికృష్ణను పోలీసులు, శుక్రవారం అర్ధరాత్రి జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఐపీసీ సెక్షన్ 201, 302 ప్రకారం అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించగా.. చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. -
అప్సర కేసు: సాయికృష్ణ అమాయకుడా?
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధం, ఆపై గొడవల నేపథ్యంలో అప్సరను దారుణంగా హతమార్చిన నిందితుడు, పూజారి సాయికృష్ణను పోలీసులు, శుక్రవారం అర్ధరాత్రి జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఐపీసీ సెక్షన్ 201, 302 ప్రకారం అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించగా.. చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. మరోవైపు అప్సర మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో ఇంకా శవ పరీక్ష(అటాప్సీ) పూర్తి కాలేదు. ఆ ఆలస్యానికి గల కారణాలను అధికారులు ప్రకటించాల్సి ఉంది. చాలాకాలం కిందట చెన్నై నుంచి హైదారాబాద్‌కు వలస వచ్చింది అప్సర కుటుంబం. ఆమె తండ్రి కాశీలో స్థిరపడిపోగా.. తల్లితో కలిసి సరూర్‌నగర్‌లో అద్దె ఇంట్లోంది అప్సర. ఈ క్రమంలో స్థానికంగా ఓ ఆలయంలో పెద్దపూజారిగా పని చేస్తున్న సాయికృష్ణతో గుడిలో అప్సరకు పరిచయం ఏర్పడింది. శంషాబాద్‌లో తాను నిర్వహించే గోశాలకు తరచూ ఆమెను తీసుకెళ్తూ ఉండేవాడు ఆ పూజారి. ఈ క్రమంలో సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ తరచూ ఆమెను కలిసే వంకతో వాళ్ల ఇంటికి సైతం వెళ్తూ వచ్చాడు సాయికృష్ణ. అప్సర తల్లిని అక్కా అని పిలుస్తూ.. ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. వివాహితుడు అని తెలిసి కూడా అప్సర అతనితో చనువుగా ఉంటూ వచ్చింది. ఆ పరిచయం కాస్త ప్రేమ, ఆపై శారీరక సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్ సైతం చేయించాడు. చివరకు పెళ్లి కోసం ఒత్తిడి చేయడాన్ని టార్చర్‌గా భావించి.. అప్సరను హత్య చేశానని నిందితుడు సాయికృష్ణ అంగీకరించాడు. సాయికృష్ణ అమాయకుడు! ఇక ఈ కేసులో తన కొడుకు సాయికృష్ణ అమాయకుడని అంటున్నాడు అతని తండ్రి. అప్సరతో సంబంధం ఉన్నట్లు తమకు, అంతెందుకు సాయికృష్ణ భార్యకు సైతం తెలియదని అంటున్నాడు. కేవలం డబ్బు కోసమే తన కొడుకును అప్సర కుటుంబం ట్రాప్ చేసి ఉంటుందని ఆయన అరోపిస్తున్నాడు. కూతురిని కంట్రోల్లో పెట్టుకోవాల్సింది తల్లే కదా అంటున్నాడాయన. ఓసారి అప్సర బ్యాంక్ అకౌంట్లను పరిశీలించండి.. ఆమె కుటుంబానికి ఆదాయం ఎలా వస్తుంది? అంటూ నిలదీస్తున్నాడాయన. మరోవైపు సాయికృష్ణ భార్య సైతం తన భర్తను వెనకేసుకొస్తోంది. ‘‘నా భర్తకు అప్సరతో సంబంధం లేదు. అప్సర చేసింది కరెక్ట్ కాదు. ఆమెకు ఎవరివల్ల గర్భం వచ్చిందో?. బహుశా నా భర్తను అప్సర నిజంగానే టార్చర్ చేసి ఉండొచ్చ’’ని అంటోందామె. -
చెన్నై టూ హైదరాబాద్: అప్సర కేసులో సినిమా రేంజ్ ట్విస్ట్‌లు..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ పరిధిలో నర్కుడ వద్ద అప్సర అనే యువతిని పూజారి సాయికృష్ణ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా, హత్య కేసు వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్బంగా వారి మధ్య శారీరక సంబంధమే హత్యకు కారణమని స్పష్టం చేశారు. కాగా, డీసీపీ నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘తమిళనాడులోని చెన్నైకి చెందిన అప్సర హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అప్సర డిగ్రీ పూర్తి చేసింది. సినీ రంగంలో కొద్దిరోజులు పనిచేసింది. 2022లో ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. అప్సర తండ్రి కాశీ ఆశ్రమంలో నివసిస్తున్నారు. కోనసీమ జిల్లా గన్నవరానికి చెందిన సాయికృష్ణ మార్కెటింగ్‌లో ఎంబీఏ చేశాడు. 2010లో సాయికి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం పూజారిగా ఉన్నాడు. బిల్డింగ్ కాంట్రాక్టర్‌గా కూడా పనిచేస్తున్నాడు. అయితే, ఇద్దరికీ బంధుత్వం లేదు, ఒక్కటే కమ్యూనిటీ. అప్సర సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయానికి వచ్చేది. అదే ఆలయంలో సాయి పూజరిగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆమెతో సాయి పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఇదే వారి మధ్య శారీరక సంబంధానికి దారి తీసింది. ఇటీవలే సాయికి వివాహం జరిగినట్టు అప్సరకు తెలిసింది. దీంతో, తనను పెళ్లి చేసుకోవాలని 2023 మార్చి నుంచి సాయిపై ఒత్తిడి చేసింది. ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశ్యంతోనే సాయి.. అప్సరను హత్య చేశాడు. ఈనెల 3వ తేదీన కోయంబత్తూరుకు వెళ్దామని చెప్పి అప్సరను సాయి తన కారులో ఎక్కించుకున్నాడు. ఆరోజు రాత్రి 8.15 గంటలకు సరూర్ నగర్ నుంచి కారులో స్టార్ట్ అయ్యారు. 11 గంటలకు శంషాబాద్ సరిహద్దుల్లోకి తీసుకెళ్లాడు. అప్పటికే అప్సర కారు ముందు సీటులో పడుకుని ఉంది. ఈ క్రమంలో సుల్తాన్‌పూర్‌వద్ద ఉన్న గోశాల వైపు కారును మళ్లించాడు. ముందు సీటులో ఉన్న అప్సర ముఖంపై కారు కవరింగ్ షీట్ సాయంలో బలవంతంగా నొక్కాడు. దీంతో, అప్సర ప్రతిఘటించింది. అయితే, సాయి అప్పటికే తన వద్ద ఉన్న రాయితో అప్సర తలపై కొట్టాడు. ఇలా అప్సర తలపై 10సార్లు కొట్టడంతో ఆమె చనిపోయింది’ అని తెలిపారు. మరోవైపు.. సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని మ్యాన్ హోల్లో నుండి అప్సర మృతదేహన్ని పోలీసులు వెలికితీశారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆమె రెండోసారి గర్భం దాల్చిందని అనుమానాలు ఉన్నాయి. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఇతరులతో చనువుగా ఉన్న అప్సర.. వాళ్ల ద్వారా గర్భం దాల్చి ఉంటుందని సాయికృష్ణ అనుమానించినట్టు తెలుస్తోంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే.. ఈ చిక్కుముడి వీడే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: హాయ్ డియర్.. హోటల్లో కలుద్దామా.. యువకులతో మాటలు కలిపి.. -
అప్సరను పూజారి సాయికృష్ణ అందుకే చంపాడు
సాక్షి, క్రైమ్: శంషాబాద్ పరిధిలో నర్కుడ వద్ద జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు చేధించారు. పక్కా క్రిమినల్ ఆలోచనతోనే అప్సర(30)ను పూజారి సాయికృష్ణ(36) చంపాడని పోలీసులు వెల్లడించారు. అప్సరను గాఢంగా ప్రేమించానని చెప్పుకుని తిరిగిన సాయికృష్ణ ఎందుకు చంపాల్సి వచ్చింది?, చంపి ఆపై సాక్ష్యాలను మాయం చేసేందుకు ఏం చేశాడనే వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. నిందితుడు సాయికృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు.. సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలో ఉన్న గుడిలో సాయికృష్ణ పెద్దపూజారి. ఆ దగ్గర్లోనే శ్రీ వెంకటేశ్వరకాలనీలో అతను ఉంటున్నాడు. ఇక ఈ గుడి పక్కనే ఉండే ఇంటిలో అప్సర ఉంటోంది. గుడికి వచ్చే క్రమంలో అప్సరతో సాయికృష్ణకు పరిచయం ఏర్పడింది. శంషాబాద్ గోశాలకు ఇద్దరూ కలిసి వెళ్లేవారు. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. నిందితుడు సాయికృష్ణకు ఇదివరకే వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా అప్సర సాయికృష్ణను ఇష్టపడింది. గతంలో అప్సర గర్భం దాల్చడంతో.. అబార్షన్ చేయించినట్లు సాయికృష్ణ చెప్పాడు. ఇతరులతో చనువుగా ఉండడం, పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి చేయడంతోనే ఘాతుకానికి పాల్పడ్డాడని ఇప్పుడు అంటున్నాడు. శంషాబాద్ సీఐ శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 5వ తేదీన తన అక్క కూతురు కనిపించకుండాపోయిందని సాయికృష్ణ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. అయితే.. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఈ కేసును ఛేదించాం. జూన్ 3వ తేదీన నర్కుడ దగ్గర్లో చంపేశాడు. ఆపై మృతదేహాన్ని ఓ కవర్లో చుట్టి కారులో వేసుకుని.. సరూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వెనకాల ఉన్న డ్రైనేజీలో పడేశాడు. ఈ విషయం అప్సర కుటుంబ సభ్యులెవరికీ తెలియదు. అప్సర మిస్సింగ్ కేసులో అనుమానం రావడంతోనే సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నాం. విచారణలో.. నిజం ఒప్పుకున్నాడు. రెండోసారి గర్భం? సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని మ్యాన్ హోల్ లో నుండి అప్సర మృతదేహన్ని పోలీసులు శుక్రవారంనాడు వెలికితీశారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆమె రెండోసారి గర్భం దాల్చిందని అనుమానాలు ఉన్నాయి. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఇతరులతో చనువుగా ఉన్న అప్సర.. వాళ్ల ద్వారా గర్భం దాల్చి ఉంటుందని సాయికృష్ణ అనుమానించి ఉంటాడని, దీనికి తోడు ఆమె పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో చంపేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే.. ఈ చిక్కుముడి వీడే అవకాశం ఉంది. సాయికృష్ణ అలా చెప్పాడు: అప్సర తల్లి పూజారి ఘాతుకంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పూజారి అయ్యి ఉండి ఇలా చేస్తాడని ఊహించలేదని అప్సర తల్లి వాపోతోంది. అప్సర గతంలో తమిళ చిత్రంలో నటించింది. అయితే ఆవైపు వద్దని చెప్పి చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చేశాం. ఆ తర్వాత గుడిలో అప్సర-సాయికృష్ణకు పరిచయం ఏర్పడింది. సాయికృష్ణ తరచూ మా ఇంటికి వస్తుండేవాడు. మా అమ్మాయితో సాయికృష్ణకు ఉన్న సంబంధం ఏంటో నాకు తెలియదు. అయితే.. జూన్ 3వ తేదీన మా అమ్మాయి కోయంబత్తూరు వెళ్తున్నట్లుగా చెప్పి వెళ్లింది. సాయి తనను శంషాబాద్‌లో దించుతాడని చెప్పింది. కానీ, మరుసటి రోజున మా అమ్మాయి నుంచి ఎలాంటి సమాచారం లేదు. సాయి కృష్ణని అడిగితే.. తన స్నేహితులతో అప్సర భద్రాచలం వెళ్లిందని చెప్పాడు. అంబేద్కర్ స్టాచ్యూ వద్ద దించానని అన్నాడు. కానీ, ఆమె భద్రాచలం వెళ్లిన ఆనవాలు లభించలేదు. మా అమ్మాయిని ఎవరితో భద్రాచలం పంపావని నిలదీశాను. కానీ, అతని దగ్గరి నుంచి బదులు రాలేదు. సాయికృష్ణని పోలీసులు గట్టిగా నిలదీస్తే.. అప్పుడు అప్సరను చంపానని చెప్పాడు. వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే అప్సరను చంపానని సాయి కృష్ణ అంటున్నాడు. అందులో వాస్తవం ఉండకపోవచ్చు. సాయికృష్ణకు ఉరి శిక్ష పడాల్సిందే అని అప్సర తల్లి డిమాండ్ చేస్తోంది. అప్సర మంచిది ఈ ఏరియాలోనే సాయికృష్ణ పెద్ద పూజారి. అప్సరతో అతనికి మంచి స్నేహం ఉంది. సాయికృష్ణ రాత్రి 11 గంటల వరకు అప్సర ఇంట్లోనే ఉండేవాడు. ఒక్కోసారి ఇద్దరూ కలిసి రాత్రి 12 తర్వాత కూడా బైక్ మీద బయటకు వెళ్లేవాళ్లు. కానీ, అప్సర చాలా మంచిది. పూజారి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడంటే నమ్మలేకపోతున్నాం అని అప్సర ఉంటున్న ఇంటి యజమాని చెప్తున్నాడు. వెలుగులోకి కీలక విషయాలు కోయంబత్తూరు వెళ్తున్నానని, సాయికృష్ణ తనను డ్రాప్ చేస్తాడని తల్లికి చెప్పి ఇంట్లో చెప్పి బయల్దేరింది అప్సర. ఇద్దరూ కలిసి ఫోర్డ్ కారులో శంషాబాద్ రాళ్ల గూడ వైపు వెళ్లారు. అక్కడ భోజనం చేశారు. ఆపై కారులో ఫ్రంట్ సీట్లో రిలాక్స్ మోడ్‌లో పడుకుంది అప్సర. ఇదే అదనుగా హత్య కోసమే తెచ్చిన బెల్లం దంచే దుడ్డుకర్రను బయటకు తీశాడు సాయికృష్ణ. ఆ కర్రతోనే ఆమె తలపై బాది చంపేశాడు. ఆపై కవర్లో ఆమె డెడ్‌బాడీని ఉంచి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ కారు రోజంతా ఇంటి ముందే పార్క్ చేశాడు. ఆ మరుసటి రోజు మ్యాన్‌హోల్‌లో అప్సర మృతదేహాన్ని పడేసి.. పైన మట్టి కప్పి వెళ్లిపోయాడు. హత్యకు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. -
ప్రియాంక సభలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎక్కడ..?
-
హామీలు నెరవేర్చకుంటే దించేయండి: ప్రియాంక గాంధీ
-
తెలంగాణను కేసీఆర్ తన జాగీరు అనుకుంటున్నారు: ప్రియాంక గాంధీ
Updates.. ► సరూర్‌నగర్ నుంచి రోడ్డుమార్గంలో ప్రియాంక గాంధీ బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు. ► ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణ మీకు నేల కాదు.. తల్లిలాంటిది. నీరు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ కోసం ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నారు. మా కుటుంబం కూడా దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఆ బాధ ఏంటో మాకు తెలుసు. బలిదానాలు వృథా కాకూడదని ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి. తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం అంత ఈజీగా చేసింది కాదు. ► బలిదానాలు వృథా కాకూడదని ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి 9ఏళ్లు అవుతోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇప్పటి వరకు నెరవేరలేదు. కేసీఆర్ తెలంగాణను తన జాగీరు అనుకుంటున్నారు. రుణమాఫీ చేస్తామన్న హామీ ఇంకా నెరవేరలేదు. ► తెలంగాణలో అధికారం కోసం రాష్ట్రం ఇవ్వలేదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి 9ఏళ్లు అవుతోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇప్పటి వరకు నెరవేరలేదు. కేసీఆర్ తెలంగాణను తన జాగీరు అనుకుంటున్నారు. రుణమాఫీ చేస్తామన్న హామీ ఇంకా నెరవేరలేదు. ► 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క యూనివర్సిటీని కొత్తగా ఏర్పాటు చేయలేదు. మీ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయో ఆలోచించండి. నిరుదోగ్యులకు భృతి ఇవ్వడం లేదు. ప్రతీ ఒక్కరిపై అప్పుల భారం పడుతోంది. ► ప్రభుత్వ స్కూల్స్‌లో చేరేవారి సంఖ్య తగ్గింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయినా ఎలాంటి చర్యలు లేవు. ► నేను తప్పుడు వాగ్దానాలు ఇవ్వలేను. నన్ను మరో ఇందిర అంటారు. అలా అన్నప్పుడు నా బాధ్యత తెలుస్తుంది. ఈ డిక్లరేషన్ అమలు చేయలేకపోతే మా సర్కార్‌ను కూల్చేయండి. ఈ సభా వేదికపై ఉన్న నేతలంతా ఈ డిక్లరేషన్‌ను అమలుచేస్తారు. ► మిత్రులారా అంటూ తెలుగులో మాట్లాడారు. శ్రీకాంతా చారి గురించి ప్రస్తావించారు. ► జై బోలో తెలంగాణ అని ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రియాంక గాంధీ. ► ఐదు అంశాలతో కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ 1. ఉద్యమ అమరుల కుటుంబానికి నెలకు రూ.25వేల పెన్షన్ 2. ప్రతీ నిరుద్యోగికి నెలకు రూ.4వేల భృతి. 3. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాల భర్తీ. 4. ప్రభుత్వం నుంచి రాయితీలు పొందిన కంపెనీల్లో స్థానికులకే 75శాతం ఉద్యోగాలు. 5. నిరుద్యోగ యువతకు రూ. 10లక్షల చొప్పున వడ్డీ రుణాలు. ► తెలంగాణలో ప్రియాంక గాంధీ తొలి రాజకీయ సభ ఇది. ► టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ► 140 మంది కాంగ్రెస్ సభ్యత్వ బీమా చెక్కులు అందజేసిన ప్రియాంక గాంధీ. ► ప్రియాంకకు భట్టి విక్రమార్క పోచంపల్లి చీర ప్రదానం చేశారు. ఈ సందర్బంగా పోచంపల్లి చీరల ప్రత్యేకతను తెలిపారు. ► సరూర్‌నగర్ సభ వద్దకు చేరుకున్న ప్రియాంక గాంధీ. ► కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ► కాంగ్రెస్ సభకు గద్దర్ వచ్చారు. ఈ సందర్బంగా గద్దర్ మీడియాతో మాట్లాడుతూ.. నెలరోజుల్లో పార్టీ ప్రకటన చేస్తాను. పీసీసీ ఆహ్వానంతో కాంగ్రెస్ యువ గర్జన సభకు వచ్చాను. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. అన్ని రాజకీయ పార్టీలు కలిసి వస్తాయి. కేసీఆర్‌పైనే నేను పోటీ చేస్తాను. సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్స్ రచిస్తోంది. ఇందులో భాగంగానే సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే ‘యువ సంఘర్షణ సభ’కోసం కాంగ్రెస్ స్థానిక నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సభకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ రానున్నారు. ► ఈ సభలో ప్రియాంక.. యూత్ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. 140 మందికి కాంగ్రెస్ సభ్యత్వ బీమా చెక్కులను ప్రియాంక అందజేయనున్నారు. ► వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బీనగర్ శ్రీకాంతాచారి విగ్రహం నుంచి సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వరకు కాంగ్రెస్ ‘నిరుద్యోగ జంగ్ సైరన్’ర్యాలీ నిర్వహించనుంది. ► కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఈ ర్యాలీలో, సరూర్‌నగర్ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ► సరూర్నగ ర్, ఎల్బీనగర్ పరిసరాల్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నా యి. విజయవాడ హైవే, సాగర్‌రోడ్డు నుంచి వచ్చే వాహనాలను ఇటు చంపాపేట వైపు, అటు నాగోల్ వైపు మళ్లించనున్నారు. దిల్సుఖ్నగర్ నుంచి వచ్చే వాహనాలను చైతన్యపురి సిగ్నల్ నుంచి నాగోల్ వైపు మళ్లిస్తారు. -
ప్రియాంక ‘యువ సంఘర్షణ సభ’.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా: రానున్న ఎన్నికల్లో యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోమవారం ‘యూత్ మేనిఫెస్టో’ప్రకటించనుంది. గత ఏడాది వరంగల్‌లో నిర్వహించిన సభలో రాహుల్‌గాంధీ ‘రైతు డిక్లరేషన్’ప్రకటించిన విధంగానే.. సోమవారం సాయంత్రం సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే ‘యువ సంఘర్షణ సభ’లో ప్రియాంకా గాంధీ ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’ను ప్రకటించనున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ.4వేల చొప్పున భృతి ఇస్తామని ప్రకటించనున్నట్టు టీపీసీసీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో 18 నుంచి 40 ఏళ్ల మధ్య నిరుద్యోగులు 60 లక్షల మంది ఉంటారని.. అందులో 25 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉంటారనే అంచనా మేరకు ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ప్రకటనలు చేయాలని నిర్ణయించామని వెల్లడించాయి. విద్య–ఉత్పాదకత సృష్టి ద్వారా చదువుకున్న అందరికీ వారి విద్యార్హతల మేరకు ఉపాధి కల్పింస్తామనే హామీ ఇవ్వనున్నట్టు పేర్కొన్నా యి. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ పనితీరును తీర్చిదిద్దుతామని, ఏటా జాబ్ కేలండర్‌ను ప్రకటిస్తామని భరోసా కల్పించనున్నట్టు తెలిపాయి. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు టెలి కమ్యూనికేషన్స్ మాజీ ఇంజనీర్ శ్యామ్ పిట్రోడా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ‘నాలెడ్జ్ సొసైటీ’అధ్యయన నివేదిక మేరకు.. విద్య, ఉపాధి రంగాల్లో రాష్ట్ర యువతకు పలు వరాలు ప్రకటిస్తామని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. విద్యా రంగంలోనూ ‘భరోసా’ ఉపాధి కల్పనతోపాటు విద్యా రంగంలో భరో సా ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీ, ఈబీసీలకు పూర్తిస్థాయి లో ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని.. ప్రతి ఉమ్మడి జిల్లాలో ఐఐటీ ఏర్పాటుకు కృషి చేస్తామని ప్రకటించనుంది. పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలో సర్వేల్ గురుకులాన్ని ఏర్పాటు చేసి.. రెసిడెన్షియల్ విద్యకు శ్రీకారం చుట్టినది కాంగ్రెస్ పారీ్టనేనని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఆ గురుకుల వ్యవస్థను మెరుగైన సౌకర్యాలతో నడిపిస్తామని హామీ ఇవ్వనున్నట్టు తెలిపాయి. మొత్తమ్మీద యువకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకట్టుకునే దిశలో ప్రియాంకా గాంధీ ‘యూత్ మేనిఫెస్టో’ప్రకటించనున్నట్టు వెల్లడించాయి. అమరవీరుల కుటుంబాలకు పింఛన్లు తెలంగాణ కోసం తనువు చాలించిన అమరవీరుల కుటుంబాలకు ప్రియాంకా గాంధీ సభలో భరోసా కలి్పంచనున్నట్టు టీపీసీసీ నేతలు చెప్తు న్నారు. తొలి, మలిదశ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని, వారికి నెలవారీ పింఛన్ ఇస్తామని హామీనివ్వనున్నట్టు చెబుతున్నారు. సాయంత్రం 4 గంటలకు రానున్న ప్రియాంక కర్ణాటక నుంచి సోమవారం సాయంత్రం 4కి శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి బయలుదేరి 4:45 గంటలకు సరూర్‌నగర్ స్టేడియానికి చేరుకుంటారు. 5:45 గంటల వరకు సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి.. 6.30 సమయంలో ఢిల్లీ బయలుదేరుతారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. సభకు ఏర్పాట్లు పూర్తి.. సభ కోసం టీపీసీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, యువ నాయకులు మానవతారాయ్, చరణ్ కౌశిక్, మహ్మద్ రియాజ్, చెనగోని దయాకర్, బాలలక్ష్మి, చారగొండ వెంకటేశ్ రెండురోజులు గా సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆదివారం మాణిక్‌రావ్ ఠాక్రే, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరు లు సభ ఏర్పాట్లను పరిశీలించారు. మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి దేప భాస్కర్‌రెడ్డి సభా వేదిక ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 50మంది కూర్చొనేలా విశాల వేదికను ఏర్పాటు చేశారు. స్టేజీ ముందు భాగంలో వీఐపీలకు, మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ‘నిరుద్యోగ ర్యాలీ’.. ట్రాఫిక్ మళ్లింపులు వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బీనగర్ శ్రీకాంతాచారి విగ్రహం నుంచి సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వరకు కాంగ్రెస్ ‘నిరుద్యోగ జంగ్ సైరన్’ర్యాలీ నిర్వహించనుంది. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఈ ర్యాలీలో, సరూర్‌నగర్ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సరూర్నగ ర్, ఎల్బీనగర్ పరిసరాల్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నా యి. విజయవాడ హైవే, సాగర్‌రోడ్డు నుంచి వచ్చే వాహనాలను ఇటు చంపాపేట వైపు, అటు నాగోల్ వైపు మళ్లించనున్నారు. దిల్సుఖ్నగర్ నుంచి వచ్చే వాహనాలను చైతన్యపురి సిగ్నల్ నుంచి నాగోల్ వైపు మళ్లిస్తారు. -
700 మంది విద్యార్థులకు ఒకటే టాయిలెట్
-
Vikarabad: ‘ప్రియురాలిలో అమ్మా నాన్నల ప్రేమను చూశా.. కానీ’
సాక్షి, హైదరాబాద్: ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని ప్రేమించి వివాహం చేసుకుంటుందన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాలప్పడ్డాడు. ఈ సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మాధవరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ గ్రామానికి చెందిన కటిక కృష్ణాజీ కుమారుడు ప్రవీణ్‌కుమార్ (26) బీఈడీ పూర్తి చేశాడు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు సరూర్‌నగర్ శ్రీనివాస కాలనీలోన ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. బీఈడీ చదివే సమయంలో పరిచయమైన ఓ యువతిని ప్రేమించాడు. నాలుగు సంవత్సరాలుగా వీరు కలిసిమెలసి ఉంటున్నారు. అయితే కొంత కాలంగా తనను కాదని వేరే యువకుడిని యువతి ప్రేమిస్తుండటంతో ప్రవీణ్‌కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం తెల్లవారు జామున ఒక సెల్ఫీ వీడియా తీసి, సూసైడ్ నోట్ రాసుకున్నాడు. సెల్ఫీ వీడియోను తన స్నేహితులు, బంధువులకు పంపంచి..వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. అనంతరం నైలాన్ తాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. వాట్సాప్ స్టేటస్‌లో వీడియో చూసిన స్నేహితులు ప్రవీణ్ ఉండే గదికి చేరుకుని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రవీణ్ రాసిన సూసైడ్ నోట్‌ను స్వా«దీనం చేసుకున్నారు. తనతోనే జీవితం ఊహించుకున్నా ‘చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాను. బీఈడీలో పరిచయం అయిన యువతిని మనసారా ప్రేమించాను. ఇద్దరం నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకున్నాం. అమ్మ, నాన్నల ప్రేమను తాను చూపించింది. నా జీవితం మొత్తాన్ని తనతో ఊహించుకున్నాను. ఆ అమ్మాయి లేకుండా బతకలేను. వేరొకరితో ప్రేమలో పడటాన్ని జీర్ణించుకోలేక పోతున్నా... అందుకే చనిపోతున్నా. నన్ను క్షమించండి. మిస్ యూ ఫ్రండ్స్...నా చివరి చూపు చూసేందుకు రండి..బై.’ అని ప్రవీణ్‌కుమార్ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. చదవండి: Hyderabad: నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం -
రాజ్యాంగస్ఫూర్తే విరుగుడు!
ఇటీవల దేశంలోనూ, రాష్ట్రంలోనూ పరువు హత్యల పేరుతో వందలాది మంది యువతీ, యువకులను హత మారుస్తున్నారు. వర్ణం, కులం రెండూ కల్పించబడినవే. మానవుల నుండి మానవులే ఆవిర్భవిస్తారని మానవ పరిణామ శాస్త్రం చెబుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఈ విషయం మీద అనంత పరిశోధన చేశారు. మానవ పుట్టుక మీదా, మానవ పరివర్తన మీదా ఆయన అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనా పత్రాలు సమర్పించారు. మనుస్మృతి నిర్మించిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణ వ్యవస్థ కల్పితమైనదని రుజువు చేశారు. 1927 డిసెంబర్ 25వ తేదీ ‘మహద్ చెరువు’ పోరాటంలో భాగంగా మనుస్మృతిని దహనం చేశారు కూడా! ప్రత్యామ్నాయంగా, భారత రాజ్యాంగంలో కులం, మతం, ప్రాంతం, జాతి, భాషలకు సంబంధించి భేద భావం లేకుండా ఎవరు ఎవరినైనా వివాహం చేసుకునే అవకాశం కల్పించారు. అయితే భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, రిజర్వేషన్లు వంటివాటిని అనుభవిస్తున్నవారే తమ పిల్లలు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటే సహించలేక వారిని చంపివేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి కారణం మతవాదులు, కుల వాదులు రాజ్యాంగ సంస్కృతికి భిన్నంగా చేసే ప్రబోధమే కారణం. మొదటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరా ప్రియదర్శిని పారశీకుడైన ఫిరోజ్‌ను ప్రేమించి పెళ్లాడింది. కరమ్ చంద్ గాంధీ వారి వివాహాన్ని నిర్వహించారు. అయితే నెహ్రూ, ఇందిరాగాంధీ పాలనల్లో గానీ, ఆ తర్వాత వచ్చిన పాలకుల కాలంలో కానీ కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించలేదు. భారత దేశాన్ని పాలించిన రాజ వంశీకులు మౌర్యులు, మొగలాయీలు, గుప్తులు – అందరూ వర్ణాంతర వివాహితులే. అలాగే హిందూ మతానికి పునాదులు వేసిన వైదిక రుషులు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు వంటి వారందరూ వర్ణాంతర వివాహితులే. అయితే వారు సమాజంలో కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించకపోవడం గమనార్హం. ప్రస్తుత కాలంలో సినిమా, పారిశ్రామిక, కళా, క్రీడా రంగాలలో ఉన్నవారు వర్ణాంతరులైనా, కులాంతరులైనా అభినందనీయులే అవుతున్నారు. భారతీయ సినిమా మార్కెట్ విస్తరణ కోసం బ్రాహ్మణ నాయకి, ఒక ముస్లిం హీరోల కెమిస్ట్రీని పెద్ద పెద్ద పోస్టర్లు ఆవిష్కరించి హిందూ, ముస్లిం వర్గాలను థియేటర్‌కు తేగలుగుతున్నారు. అదే వాస్తవ జీవితంలో హిందూ, ముస్లిం వివాహ సందర్భం వస్తే దాడులు జరుగుతున్నాయి. ఇటీవల ముస్లిం, దళిత కులాల వాళ్ళు ప్రేమ వివాహం చేసుకుంటే దళిత యువకుడిని హత్య జేశారు. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి విద్యార్జనావకాశం వల్ల ఈ 70 ఏళ్లలో చదువుకుని అన్ని రంగాల్లో పైకి వస్తున్న దళితులు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునే స్థాయికి వస్తున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు పెరగడానికి... దళిత, బహుజన, మైనారిటీ వర్గాల్లో పెరుగుతున్న రాజ్యాంగ స్ఫూర్తి; వర్ణ, కులాధిపత్య భావజాలంలో కొట్టు మిట్టాడుతున్న వారి మూఢత్వాల మధ్య తలెత్తుతున్న ఘర్షణే కారణం. ఇప్పటికీ రాజ్యమేలుతున్న మనుస్మృతికి వ్యతిరేకంగా భారతదేశం సెక్యులర్‌గా ఎదగాలంటే బౌద్ధ జీవన వ్యవస్థను, భారత రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలి. కరుణ, ప్రేమ, ప్రజ్ఞ అనే సూత్రాలను ప్రజల మెదళ్లలోకి వెళ్ళేటట్లు చూడాలి. రాజకీయమంటే ఆధిపత్యం కాదు. ప్రజాస్వామ్య లౌకిక సామ్యవాద భావజాల ఆచరణ అని ప్రతి ఒక్కరూ తెల్సుకోవాల్సి ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళనాడులో కులాంతర వివాహితులకు పది లక్షల నగదు కానుక, ఉద్యోగావకాశం, భూవసతి, నివాస వసతి కల్పిస్తున్నారు. దీని కొరకు చట్టం తెచ్చారు. కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కులాంతర వివాహితులకు రక్షణ గృహాలు ఏర్పాటు చేశారు. దీని వల్ల ఆ రెండు రాష్ట్రాల్లో కులాంతర, మతాంతర వివాహాలు విస్తరిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా రాజ్యాంగ స్పూర్తితో కులాంతర, మతాంతర వివాహాల వేదికలను ప్రభుత్వమే నిర్వహించవలసిన బాధ్యత ఉంది. అంతే కాకుండా దీని కొరకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. పరువు హత్యలకు పాల్పడిన వారిని ప్రత్యేక కోర్టులో విచారించి మరణ శిక్షను విధించడమే కాకుండా వారి ఆస్తులను జప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వాలు కూడా రాజ్యాంగ స్ఫూర్తితో కుల నిర్మూలనా భావజాల ఆచరణ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేపట్టాలి. (చదవండి: నల్ల చట్టానికి అమృతోత్సవాలా?) - డా. కత్తి పద్మారావు -
ఇంత క్రూరమైన సమాజంలో నివసిస్తున్నామా?
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడి బొడ్డున ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగరాజు అనే దళిత యువకుని దారుణ హత్య... మనం ఎటువంటి సమాజంలో జీవిస్తున్నామో స్పష్టం చేస్తున్నది. హైదరాబాద్‌కు చెందిన అస్రీన్ సుల్తానా అనే యువతి, వికారాబాద్‌కు చెందిన నాగరాజు ప్రేమించుకొని మూడు నెలల క్రితం ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. దీన్ని సహించలేకపోయిన సుల్తానా సోదరుడు, అతడి స్నేహితులు హైదరాబాద్‌లో నాగరాజుపై దాడి చేసి, హత్య చేశారు. నాగరాజుపై పదిహేను నిముషాల పాటు వరుసగా రాడ్లతో దాడి చేసారనీ... జనం చూస్తూ వీడియోలు తీస్తున్నారు తప్ప ఆపేందుకు ప్రయత్నించలేదనీ, తాను ఎంత వేడుకున్నా ఎవరూ ముందుకొచ్చి సాయపడలేదనీ, వాళ్ళను వేడుకొంటూ తాను సమ యాన్ని వృథా చేసాననీ సుల్తానా మీడియా ముందు వాపోయింది. గతంలోనే తన సోదరుడు ఈ పెళ్ళి చేసు కోవద్దని తనను బాగా కొట్టాడనీ, ఉరివేసి చంపడానికి ప్రయత్నించాడనీ, తనను ఉరి వేసుకుని చనిపొమ్మని ఆదేశించాడనీ కూడా తెలిపింది. గతంలో రెండుసార్లు తాము పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి తమకు ప్రాణహాని ఉందనీ, రక్షణ కలిగించాలనీ విజ్ఞప్తి చేసినట్లుగా కూడా ఆమె తెలియజేసింది. ఇక్కడ అనేక విషయాలు మనల్ని ఆలోచింప జేస్తున్నాయి. మన వ్యవస్థలన్నీ ఇంత నిర్వీర్యం అయిపోయాయా? మనం ఇంత క్రూరమైన సమాజంలో నివసిస్తున్నామా? వీటిని నిరోధించే అవకాశమే లేదా? మనలో కూడా తెలిసిగానీ తెలియకుండా గానీ ఇలాంటి అమానుషత్వం దాగి ఉన్నదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇంకా ఈ అంశం ఇవ్వాళ ఎన్నో రకాల చర్చలకు, సమాలోచనలకు కేంద్రంగా నిలిచింది. సాధారణంగానే దళిత సంఘాలు ముస్లిం సంఘాల మీద కోపాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ముస్లింలపై హిందూత్వ శక్తులు దాడులు చేసిన ఎన్నో సందర్భాలలో ఆ బాధ తెలిసిన దళితులుగా తాము ముస్లింలకు మద్ధతుగా నిలిచామనీ, ఇప్పుడు ముస్లింల చేతిలో దళిత యువకుడు హత్యకు గురికావడం తట్టు కోలేనిదిగా ఉందనీ అభిప్రాయాలు వచ్చాయి. పలు ముస్లిం సంఘాలు కూడా తమకు దళితులపై గౌరవం ఉందనీ, ఈ హత్యను ఖండిస్తున్నామనీ, నిందితులను కఠినంగా శిక్షించాలనీ ప్రకటనలు చేశాయి. ఈ హత్యను వ్యక్తిగతంగానే చూడాలనీ, ఇది రాజకీయమైనది కాదనీ కొందర న్నారు. (ఆ హత్యను ఖండిస్తున్నాం) పైకి ఇది పరువు హత్యగా కనిపిస్తుంది. కానీ దీని వెనక సమాజంలో వేళ్ళూనుకు పోయి ఉన్న మౌఢ్యాల చరిత్ర, కొత్త తరాలకు సరైన విలువలు, ఆదర్శాల్ని ఇవ్వలేకపోతున్న ఆధునికతా వైఫల్యాలు దాగి ఉన్నాయి. – జి. కళావతి ‘అధ్యాపక జ్వాల’ సహాయ సంపాదకులు -
ఆ హత్యను ఖండిస్తున్నాం
ముస్లిం అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారన్న ఆక్రోశంతో దళితుడైన నాగరాజును ఆమె బంధువులు హత్య చేయడాన్ని ముస్లిం ఆలోచనాపరులం నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం. ఏ విధంగా చూసినా ఈ చర్య అమానుషమైనది. మరీ ముఖ్యంగా ఇస్లామిక్ విలువలకు పూర్తిగా విరుద్ధమైనది. తీవ్రంగా వివక్షకు గురైన నల్లజాతి వారిని హృదయానికి హత్తుకున్న మొహమ్మద్ ప్రవక్త ఆదర్శానికి వ్యతిరేకమైనది. కులాన్ని పాటించడమంటే పవిత్ర ఖురాన్‌ను నిరాకరించడమే! ముస్లిం సమాజం ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. నాగరాజు కుటుంబానికి మేము తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ఈ విషమ సమయంలో తీవ్ర బాధితురాలైన ఆశ్రీన్ సుల్తానా గుండె నిబ్బరంతో ఉండాలని కోరుతున్నాము. నాగరాజును హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమే కాకుండా ఆశ్రీన్ సుల్తానాకూ, నాగరాజు కుటుం బాలకూ పూర్తి రక్షణ కల్పించాలనీ, ఆశ్రీన్ సుల్తానాను ఆదుకోవాలనీ కోరుతున్నాము. ఈ సంఘటనను సాకుగా చూపి దళితులకూ ముస్లింలకూ మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాలనుకుంటున్నారు కొందరు మహనుభావులు. వీరి విష రాజకీయాలకు గురి కావద్దని దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ( కాపాడమని కాళ్లు పట్టుకున్నా.. ఎవరూ ముందుకు రాలేదు) – ముస్లిం థింకర్స్ డయాస్ (సయ్యద్ సలీంపాషా, డా. ఖాజా, డా. రియాజ్, స్కైబాబ, ఖుర్షీద్, హుసేన్, డా. మాలిక్, ఇనాయతుల్లా, వహీద్ మహమ్మద్, డా. రఫీ, షఫీ, నస్రీన్ ఖాన్, డా. మహబూబ్ బాషా, షేక్ పీర్ల మహమూద్, అక్బర్ ఆర్టిస్ట్, నబి కరీమ్ ఖాన్, డా. అఫ్సర్, డా. యాకూబ్) -
సరూర్‌నగర్ పరువుహత్యపై స్పందించిన ఒవైసీ
హైదరాబాద్: తెలంగాణలోనే కాదు.. యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించించింది సరూర్‌నగర్ పరువు హత్య ఉదంతం. ఈ ఘటనపై తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. దళిత యువకుడు నాగరాజు హత్యను ఒవైసీ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ దారుస్సలాంలో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఒవైసీ ప్రసంగిస్తూ.. సరూర్‌నగర్‌లో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె(ఆశ్రిన్ సుల్తానా) తన ఇష్టపూర్వకంగానే ఆ వ్యక్తిని (నాగరాజు) పెళ్లి చేసుకుంది. అది సరైన చర్యే. కానీ, సుల్తాన్ సోదరుడికి ఆమె భర్తను చంపే హక్కు ఎక్కడిది? రాజ్యాంగం ప్రకారం హత్య చేయడం క్రూరమైన చర్య, ఇస్లాం ప్రకారం దారుణమైన నేరం కూడా. సరూర్ నగర్ హత్య ఘటనకు వేరే రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా బీజేపీ నేతలను ఉద్దేశించి ఒవైసీ కామెంట్స్ చేశారు. హత్య ఘటనలో నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారని.. తాము హంతకుల పక్షాన నిలబడేవాళ్లం కాదని అన్నారు ఆయన. #Nagraju की नृशंस हत्या पर साफ़ साफ़ बोले @asadowaisi - “जुर्म है ये , क़ानूनन जुर्म है ये।मैं खुलेआम condemn करता हूँ। अल्लाह से डरो” याद नहीं आता कि किसी मुस्लिम युवक की हत्या पर आज तक किसी भाजपा या हिंदूवादी नेता ने एक भी शब्द कहा हो। pic.twitter.com/yTZoVQL0FN — Vinod Kapri (@vinodkapri) May 6, 2022 ► ఖార్గోన్(మధ్యప్రదేశ్), జహంగీర్‌పురి(ఢిల్లీ) మత ఘర్షణలపైనా స్పందిస్తూ.. ఇకపై ఏ మతానికి సంబంధించి ఉరేగింపులు జరిగినా మసీదులపై హైరెజల్యూషన్‌తో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఉరేగింపులు జరిగేటప్పుడు లైవ్ టెలికాస్టింగ్ చేయాలని, అప్పుడు రాళ్లు రువ్వేది ఎవరో ప్రపంచం మొత్తానికి తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడ ముస్లింలపై దాడులు జరిగినా స్పందించే ఒవైసీ... సరూర్ నగర్ ఘటనపై మాత్రం ఎందుకు స్పందించట్లేదని బీజేపీ నేతలు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఒవైసీ స్పందించకపోవడం హత్యకు మద్దతునిచ్చినట్లేనని వాళ్లు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హత్య ఘటనను ఖండిస్తూ ఒవైసీ స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చదవండి: కాపాడమని కాళ్లు పట్టుకున్నాను, ఎవరూ ముందుకు రాలేదు-అశ్రిన్ -
సరూర్‌నగర్ పరువు హత్యపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ
సాక్షి, హైదరాబాద్ : నగరంలో సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యోదంతంపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా.. నాగరాజు హత్య కేసుపై ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి(సీఎస్), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) నోటీసులు పంపింది. సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యోదంతంపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక అందజేయాల్సిందిగా శుక్రవారం ఆదేశించింది. ఇక ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ వేగంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు తమ దృష్టికొచ్చిందని, అయితే పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఇలాంటి ఘటనలు అరాచకత్వానికి నిదర్శమని, ఇది తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన అని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. మతాంతర, కులాంతర వివాహాలు జరిగినప్పుడు పరువుహత్యలు జరగకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఏదైనా విధానం ఉందా? అంటూ చీఫ్ సెక్రటరీని కమిషన్ ప్రశ్నించింది. సీఎస్ తన నివేదికలో ఈ అంశంపై బదులివ్వాలని పేర్కొంది. ఈ హత్యోదంతం దర్యాప్తు స్థితిగతులు, బాధిత కుటుంబానికి కల్పిస్తున్న భద్రత, దర్యాప్తులో అధికారుల నిర్లక్ష్యం ఏదైనా ఉంటే అలాంటివారిపై తీసుకున్న చర్యల గురించి నివేదిక సమర్పించాల్సిందిగా డీజీపీని ఆదేశించింది. చదవండి: సరూర్‌నగర్ పరువు హత్యపై స్పందించిన గవర్నర్ తమిళిసై -
సరూర్ నగర్ హత్య: ‘కాపాడమని కాళ్లు పట్టుకున్నా.. ఎవరూ ముందుకు రాలేదు’
సాక్షి, హైదరాబాద్: సరూర్‌నగర్‌లో పరువు హత్య చేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హంతకులను గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. మతాంతర వివాహమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా సరూర్ నగర్లో బుధవారం రాత్రి పరువు హత్య చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నాగరాజు, అశ్రీన్ దంపతులు బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు వారిని అడ్డుకొని దాడి చేశారు. నాగరాజును ఇనుప రాడ్‌తో తీవ్రంగా కొట్టి చంపేశారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరి 31న ఆర్య సమాజ్‌లో ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. నాగరాజు కార్ల షోరూంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ మేరకు మృతుడు నాగరాజు భార్య అశ్రీన్ మాట్లాడుతూ.. ఇద్దరూ కలిసి బంధువుల ఇంటికి వెళ్తుండగా తన భర్తపై అయిదుగురు వ్యక్తులు దాడి చేశారని పేర్కొంది. వెనకాల నుంచి వచ్చి నాగరాజును బండి మీద నుంచి కిందపడేశారని, నడిరోడ్డుపై ఇనుపరాడ్‌తో విచక్షణారహితంగా కొట్టి చంపారని తెలిపింది. హెల్మెట్ ఉన్నప్పటికీ హెల్మెట్ మీది నుంచి కొట్టి తలను తీవ్రంగా గాయపరిచారని వాపోయింది. ‘నాగరాజును కొట్టొద్దంటూ నేను అతని మీద పడ్డాను. నన్ను నెట్టేసి మిగిలిన నలుగురు నా భర్త నాగరాజును తీవ్రంగా కొట్టారు. కాపాడమని గుమిగూడిన వారందరిని కాళ్లు పట్టుకున్నాను. కానీ ఎవరూ ముందుకు రాలేదు. నా భర్తను చంపి అక్కడి నుంచి పరారయ్యారు పదేళ్ల నుంచి నాగరాజుతో నాకు పరిచయం ఉంది. పెళ్లి చేసుకుంటానంటే చంపుతారని నాగరాజుకు కూడా చెప్పాను. మూడు నెలల పాటు నాగరాజుతో మాట్లాడకుండా ఉన్నాను. చినరికి నాగరాజు ప్రేమకు ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాను. చంపుతారు అని తెలిసిన నాగరాజు నన్ను పెళ్లి చేసుకున్నాడు. నాకు న్యాయం చేయాలి’ అని మీడియా ముందు వాపోయింది. ఇద్దరే నిందితులు: ఏసీపీ నాగరాజు హత్య కేసులో అన్ని రకాల ఆధారాలను సేకరిస్తున్నామని ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ తెలిపారు. నాగరాజును హత్య చేసింది ఇద్దరేనని, సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఆ ఇద్దరు నిందితులను పట్టుకున్నామని వెల్లడించారు. అయితే అశ్రిన్ అయిదుగురు అని చెబుతోంది కాని ఇద్దరే హత్య చేశారని పేర్కొన్నారు. ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందని తేలితే వారిపై చర్యలు తీసుకంటామని ఏసీపీ తెలిపారు. నెల రోజుల నుంచి నాగరాజు కోసం వెతుకుతున్నారు: డీసీపీ ఎల్బీ నగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. సరూర్ నగర్ పీఎస్ పరిధిలో గత రాత్రి నాగరాజు అనే వ్యక్తి పై ఇద్దరు దుండగులు దాడి చేశారని సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసామన్నారు. సీసీటీవీ కెమెరాల ద్వారా ఇద్దరు హత్య చేసినట్లు గుర్తించి ఇద్దరిని ట్రెస్ చేసి పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులు సయ్యద్ మోబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్ లుగా గుర్తించామన్నారు. వికారాబాద్ జిల్లా స్టేషన్ మరపల్లి చెందిన బిల్లపురం నాగరాజు జనవరిలో మోబిన్ అహ్మద్ సోదరి సుల్తానా అశ్విన్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి సుల్తానా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. దీంతో వాళ్లు నాగరాజు పై కక్ష్య పెంచుకున్నారు. ఈ క్రమంలో గత నెల రోజుల నుంచి నాగరాజు కోసం వెతుకుతున్నారు. నిన్న నాగరాజు పనిచేస్తున్న మలక్ పేట మారుతి షోరూం వద్ద మోబిన్ గుర్తించాడు. జనం ఎక్కువగా ఉండటంతో ఇంటికి వెళ్తున్న సమయంలో వెంబడించి హత్య చేశారని చెప్పారు. బంధువు మసూద్ తో కలిసి మోబిన్ సుల్తానా ను పక్కకు తోసి నాగరాజు తలపై సెంట్రింగ్ రాడ్డు తో దాడి చేసి పారిపోయారని డీసీపీ తెలిపారు. ఫాస్ట్రాక్ కోర్టు లో ట్రయల్ చేసి నిందితులకు త్వరగా శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. -
సరూర్‌నగర్‌లో పరువు హత్య
చైతన్యపురి (హైదరాబాద్): రాచకొండ కమిషనరేట్‌లోని సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పరువు హత్య చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడిని దుండగులు దారుణంగా హతమార్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన ఓ యువకుడు (25), అదే జిల్లా పోతిరెడ్డిపల్లి మండలం మర్పల్లి ఘనపూర్‌కు చెందిన యువతి (23) కళాశాలలో స్నేహితులు. వేర్వేరు మతాలకు చెందిన వీరు పెద్దలకు ఇష్టం లేకుండా ఈ ఏడాది జనవరి 31న ఓల్డ్ సిటీ లాల్‌దర్వాజాలోని ఆర్య సమాజంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. యువకుడు మలక్‌పేటలోని ఓ కార్ల షోరూంలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వారు సరూర్‌నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. బుధవారం రాత్రి 9గంటల సమయంలో దంపతులిద్దరూ బైక్‌పై వీఎం హోం నుంచి సరూర్‌నగర్ పోస్టాఫీస్ వైపు వెళుతున్నారు. అదే సమయంలో బైక్‌పై వచ్చిన దుండగులు బైక్‌ను ఆపారు. యువకుడి హెల్మెట్‌ను తీయించి సెంట్రింగ్ రాడ్‌తో అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతను రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. తమ కళ్లెదుటే జరిగిన దారుణాన్ని చూసిన ప్రజలు భయకంపితులయ్యారు. మతాంతర వివాహం నేపథ్యంలో యువతి బంధువులే ఈ పాశవిక హత్యకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లి జరిగిన నాటి నుంచి కక్ష పెంచుకున్న యువతి సోదరుడు, అతని బావలు కలిసి యువకుడిని హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల యువతి తరఫు బంధువులు తమను వెంబడించడంతో, తమకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ దంపతులు వికారాబాద్, బాలాపూర్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ప్రేమ వివాహమే కారణం: ఏసీపీ హత్యోదంతం తెలుసుకున్న ఎల్బీనగర్ క్రైమ్ డీసీపీ యాదగిరి, ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, సరూర్‌నగర్ సీఐ సీతారాం, ఎస్ఐ లక్ష్మయ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హత్యకు ప్రేమ వివాహమే కారణమని, నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని ఏసీపీ తెలిపారు. -
Saroornagar Lake: మారని కథ.. నెరవేరని సీఎం కేసీఆర్ హామీ!
సాక్షి, చైతన్యపురి: నగరంలో మినీ ట్యాంక్ బండ్‌గా ప్రసిద్ధి చెందిన సరూర్‌నగర్‌చెరువు నానాటికి దుర్గంధ భరితంగా తయారైంది. సందర్శకులు సేదతీరేందుకు రావాలంటేనే బయపడే పరిస్థితి నెలకొంది. దుర్వాసన కారణంగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సరూర్‌నగర్ మినీట్యాంక్ బండ్‌ను హుస్సేన్ సాగర్లా అభివృద్ధి చేస్తామని స్వయాన ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కూడా నెరవేరకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు సరూర్‌నగర్ చెరువు సుందరీకరణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 1906లో అప్పటి నైజాం రాజు తాగు, సాగునీటి అవసరాల కోసం 99 ఎకారాల విస్తీర్ణంలో సరూర్‌నగర్ చెరువును తవ్వించారు. ఇటలీ నుంచి పక్షులు సరూర్‌నగర్ చెరువుకు విడిదికి వచ్చేవి. చదవండి: ‘విషం తాగించి, హత్యాయత్నం చేశారు.. నా భర్తతో ప్రాణహాని ఉంది’ ► నగరం అభివృద్ధి చెందటం, చెరువు చుట్టూ ఆక్రమణలకు గురైంది. ప్రస్తుతం చెరువు 60 ఎకరాలు మిగిలింది. ► పాత సరూర్‌నగర్ మండలంలోని గ్రామాలనుంచి, అక్కడి చెరువుల నుంచి మురుగునీరు సరూర్‌నగర్ చెరువులో కలుస్తుండటంతో మురికి కూపంలా తయారైంది. ► దీనికి తోడు పరిసర కాలనీల ప్రజలు వ్యర్థాలను వేయటంతో పరిస్థితిదారుణంగా మారింది. దీంతో వలస పక్షులు రావటం మానేశాయి. ► 2003లో స్థానికుల ఆందోళనతో రూ.3 కోట్లతో సివరేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేసినప్పటికీ సక్రమంగా పనిచేయక పోవటంతో చెరువు మురుగునీటితో నిండి పోయింది. ► చెరువు అభివృద్ధిలో భాగంగా ఇందిరా ప్రియదర్శిని పార్కును ఏర్పాటు చేసి బోటింగ్ సౌకర్యం కల్పించారు. అయితే, నీరు దుర్గంధ భరితంగా మారడంతో బోటింగ్‌కు ఆదరణలేకుండా పోయింది. ►చెరువులోకి వచ్చే మురుగు నీటి శుద్ధికి ఏర్పాటు చేసిన ట్రీట్మెంట్ ప్లాంట్ పనిచేయకపోవటంలో సమీప ప్రాంత కాలనీల ప్రజలు దుర్వాసనతో ఇబ్బందిపడుతున్నారు. దోమల బెడదతో కూడా ఎక్కువగా ఉంది. ► దుర్వాసన కారణంగా సందర్శకులు కూడా మినీట్యాంక్ బండ్‌పై ఉండలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి హామీ ఏమైంది ? ► తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి ముఖ్యమంత్రి కేసీఆర్ మినీ ట్యాంక్ బండ్‌ను సందర్శించి హుస్సేన్ సాగర్లా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అంతేకాక రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ సరూర్‌నగర్ మినీట్యాంక్ బండ్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి చేయకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం జీహెచ్ఎంసీ, లేక్ అభివృద్ధి శాఖల మధ్య సమన్వయం లేకపోవటం వల్లే మినీట్యాంక్‌బండ్ అభివృద్ధి జరగటం లేదు. చెరువులోకి మురుగు చేరకుండా చర్యలు తీసుకోవాలని పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేశాం. చెరువులో వ్యర్థాలు వేయకుండా చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరాం. చెరువు ఔట్లెట్ వద్ద నాలాల్లోకి చెత్త చేరకుండా జాలీ ఏర్పాటు చేయాలని కోరాం.మా జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. –బద్దం ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి, కార్పొరేటర్, గడ్డిఅన్నారం డివిజన్ -
సరూర్ నగర్ చెరువు ను సందర్శించిన రాచకొండ సీపీ మహేష్ భగత్
-
Hyderabad: చిట్టి ఇన్ టౌన్.. రోబో@ రెస్టారెంట్
ఏడాదిన్నర కాలంగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మనిషి జీవనశైలిలోనే కాదు ఆతిథ్య రంగంలోనూ మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో వెయిటర్లు వడ్డిస్తే తినడానికి ప్రజలు ఆలోచిస్తున్నారు. దీంతో ఓ రెస్టారెంట్ నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించి వెయిటర్ల స్థానంలో రోబోలను తీసు కొచ్చారు. వినియోగదారులు ఇచ్చే ఆర్డర్లను తీసుకొని సర్వ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీనికి సరూర్‌నగర్ హూడాకాంప్లెక్స్లోని ‘చిట్టి ఇన్ టౌన్’ రోబో రెస్టారెంట్ వేదికగా మారింది. సాక్షి, హుడాకాంప్లెక్స్: కరోనాకు భయపడి చాలా మంది రెస్టారెంట్ ఫుడ్‌కు దూరంగా ఉంటున్నారు. ఫుడ్ సర్వ్ చేసే వాళ్లకి కరోనా లక్షణాలు ఉంటే తమకు ఎక్కడ సోకుతుందోనని ప్రజలు హోటల్, రెస్టారెంట్‌కి వెళ్లడానికి జంకుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మలక్‌పేట్‌కు చెందిన మణికాంత్‌గౌడ్ వినూత్నంగా ఆలోచించాడు. వెయిటర్ల స్థానంలో రోబోలను పెట్టి ఫుడ్ సర్వ్ చేసేలా.. ఆర్డర్ తీసుకునేలా ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించాలని పూనుకున్నాడు. కొత్తపేట్‌లోని హుడాకాంప్లెక్స్‌లో ‘చిట్టి ఇన్ టౌన్’పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ నాలుగు రోబోలను అందుబాటులో ఉంచారు. రెస్టారెంట్‌కు వచ్చే వారి ఆర్డర్లు తీసుకోవడం.. వచి్చన ఆర్డర్లను షెఫ్‌కు అందజేయడం... ఆహారం రెడీ అయిన తర్వాత ఆహారప్రియులకు వడ్డిస్తున్నాయి. అంతే కాకుండా తిన్న తరువాత ప్లేట్లను తీసుకెళ్లి శుభ్రం చేయడం.. బిల్లు జారీ చేయడం.. కస్టమర్ ఇచ్చిన డబ్బులను తీసుకెళ్లి కౌంటర్లో జమ చేయడం పనులన్నీ రోబోలే చేస్తుండటం విశేషం. రోబోలు చేస్తున్న ఈ పనులను చూసి కస్టమర్లు మంత్రముగ్ధులవుతున్నారు. మరో రోబో వచ్చి రెస్టారెంట్‌కు వచ్చిన వారితో ముచ్చటిస్తుంది. వచి్చన వారికి బోరు కొట్టకుండా చూస్తూ అతిథులను అమితంగా ఆకట్టుకుంటోంది. మంచి ఆదరణ.. కోవిడ్భయంతో రెస్టారెంట్‌కు రావడానికి జనాలు భయపడేవారు. నలుగురు మిత్రులం కలిసి వినూత్నంగా ఈరెస్టారెంట్ను ప్రారంభించాం. ఇప్పటికే మేం రోబోటిక్ కోర్సులను పూర్తి చేసి ఉండటంతో రోబోల తయారీ, పనితీరుపై మాకు అవగాహన ఉంది. ఇది మాకు కలిసి వచ్చింది. వీటిని చూసేందుకు చాలా మంది వస్తున్నారు. 120 సీటింగ్ సామర్థ్యం ఉన్నరెస్టారెంట్కు రావాలంటే ఆన్లైన్ బుకింగ్ తప్పని సరి. నేరుగా వచ్చేవారు వేచిఉండాల్సి ఉంటుంది. ఈ రోబోలతో రెస్టారెంట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. – మణికాంత్ గౌడ్, రెస్టారెంట్ యజమాని -
హైదరాబాద్ సరూర్‌నగర్‌లో హైటెక్ తరహాలో మాస్ కాపీయింగ్