హైదరాబాద్ : సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కామేశ్వరనగర్ కాలనీలో శనివారం మధ్యాహ్నం చైన్ స్నాచింగ్ చోటుచేసుకుంది. కాలనీకి చెందిన ప్రమీల(65) తమ ఇంటి ముందు నిలబడి ఉండగా గుర్తుతెలియని యువకుడు బైక్‌పై ఆమె వద్దకు వచ్చాడు. ఏదో అడుగుతున్నట్లు నటిస్తూ.. అకస్మాత్తుగా ఆమె మెడలోని నాలుగు తులాల పుస్తెల తాడును లాక్కుని ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.