chain snatching
-
చైన్ స్నాచింగ్‌కు మహిళ బలి
గజ్వేల్‌రూరల్: మహిళ మెడపై ఉన్న బంగారు ఆభరణాలను ఓ ఆగంతకుడు చోరీకి యత్నించాడు. ప్రతిఘటించేక్రమంలో ఆమెకు గాయాలై అపస్మారక స్థితిలో వెళ్లింది. ఆపై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరులో చోటు చేసుకుంది. అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాల ప్రకారం..కొల్గూరుకు చెందిన చెన్న శ్రీనివాస్– శ్యామలత(55) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. అందరికీ వివాహాలు జరగ్గా, కొడుకు హైదరాబాద్‌లో జాబ్ చేస్తూ అక్కడే ఉంటున్నాడు. దంపతులిద్దరూ స్థానికంగా ఉంటూ కిరాణ దుకాణం నడుపుతున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు నిద్రలేచిన శ్యామలత ఇంటి వెనుక భాగంలో ఉన్న డోర్ తీసి బాత్రూమ్కు వెళ్లింది. ఇదే సమయంలో ఓ ఆగంతకుడు ఇంటి వెనుక నుంచి లోపలికి ప్రవేశించాడు. శ్యామలత భర్త శ్రీనివాస్ బెడ్రూమ్లో నిద్రిస్తుండగా, ఆగంతకుడు తలుపు లకు గొళ్లెం పెట్టాడు. బాత్ రూమ్ నుంచి శ్యామలత ఇంట్లోకి వస్తున్న సమ యంలో ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు గొ లుసు, చెవికి ఉన్న అరతులం కమ్మలను దొంగిలించేందుకు ప్రయత్నించాడు. శ్యామలత ప్రతిఘటిండంతో ఆమె ముఖంపై దిండు(మెత్త)ను అదిమి పట్టి ఆభరణాలను దొంగిలించాడు. ఈ క్రమంలోనే ఆమె చెవికి గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. భారతమ్మ పాలు పోసేందుకు వస్తుండగా, మంకీ క్యాప్ పెట్టుకున్న ఆగంతకుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లడాన్ని గమనించింది. ఇంట్లోకి వెళ్లి బెడ్రూమ్ గొళ్లెం తీయగా భర్త శ్రీనివాస్ బయటకు వచ్చాడు. శ్యామలతను వెంటనే గజ్వేల్‌లోని ప్రైవే టు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు మెరుగైన చికిత్స అవసరమని చెప్పడంతో గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ శ్యామలత మృతి చెందింది. -
తాడిపత్రిలో చైన్‌స్నాచింగ్
తాడిపత్రి: స్థానిక రూరల్ పరిధిలోని గన్నెవారిపల్లి కాలనీలో నివాసముంటున్న కృష్ణవేణి మెడలోని బంగారు గొలుసును దుండగులు అపహరించుకెళ్లారు. పోలీసులు తెలిపిన మేరకు... మంగళవారం తెల్లవారుజామున తన ఇంటి వద్ద ఉన్న పశువుల పాక వద్ద చెత్తను కృష్ణవేణి శుభ్రం చేస్తుండగా ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై అక్కడకు చేరుకున్నారు. వీరిలో ఒకరు కిందకు దిగి కృష్ణవేణి మెడలోని 3 తులాల బంగారు గొలుసును లాక్కొని ద్విచక్ర వాహనంపై ఉడాయించాడు. మంకీక్యాప్ ధరించడం వల్ల వారు ఎవరైంది తెలియకుండా పోయింది. కృష్ణవేణి కేకలతో చుట్టపక్కల వారు అక్కడకు చేరుకునే లోపు దుండగులు కంటికి కనిపించకుండా పోయారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు తాడిపత్రి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రదేశంలోని ఓ ఇంటి వద్ద ఉన్న సీసీకెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
రెచ్చిపోతున్న చైన్ స్నాచింగ్ నేరగాళ్లు
-
గొలుసు దొంగను ప్రతిఘటించిన చిన్నారి
క్రైమ్: సమయస్ఫూర్తితో వ్యవహరించడం.. ఆపద సమయంలోనూ అక్కరకు వస్తుంది. కానీ, సమయస్ఫూర్తితో పాటు ధైర్యంగా ఉంటేనే పరిస్థితులను ఎదుర్కోవచ్చని ఇక్కడ ఓ పదేళ్ల చిన్నారి నిరూపించింది. తన బామ్మ మెడలో గొలుసు దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని.. ప్రతిఘటించింది ఆమె పదేళ్ల మనవరాలు. తన ఇద్దరు మనవరాళ్లతో ఆ బామ్మ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో స్కూటీ మీద వచ్చిన ఓ ఆగంతకుడు.. ఆమె మెడలోని చెయిన్ లాక్కోబోయాడు. దీంతో ఆ వృద్ధురాలు ప్రతిఘటించింది. ఇది గమనించిన ఆమె పదేళ్ల మనవరాలు.. చేతిలోని బ్యాగు తీసుకుని ఆ దొంగను యెడా పెడా బాదేసింది. ఆ దెబ్బకు ఆ దొంగ అక్కడి నుంచి ఉడాయించాడు. మహారాష్ట్రలోని పూణేలో ఫిబ్రవరి 25వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. సీసీటీవీ ఫుటేజీలోని చోరీయత్నం- ఆ చిన్నారి అడ్డుకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీంతో పూణే సిటీ పోలీసులు స్పందించారు. గురువారం(మార్చి 9న) కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. #WATCH | A 10-year-old girl foiled an attempt by a chain snatcher to snatch her grandmother's chain in Maharashtra's Pune City The incident took place on February 25 & an FIR was registered yesterday after the video of the incident went viral. (CCTV visuals confirmed by police) pic.twitter.com/LnTur7pTeU — ANI (@ANI) March 10, 2023 -
ఇంటరాగేషన్‌లో గాయాలు.. వ్యక్తి మృతి!
మెదక్ జోన్: చైన్ స్నాచింగ్ చేశాడనే అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి.. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు చిత్రహింసలు పెట్టి, ఇష్టం వచ్చినట్టుగా కొట్టారని.. దానితో కిడ్నీలు దెబ్బతిని మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెదక్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మృతుడి భార్య ఎస్పీకి ఫిర్యాదు చేసింది. భర్త చావుకు కారణమైన పోలీసులపై హత్యకేసు పెట్టి, అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. అసలు ఏం జరిగింది? మెదక్ పట్టణంలోని అరబ్ గల్లీలో జనవరి 27న గుర్తు తెలియని దుండగుడు ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు తెంపుకెళ్లాడు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించిన పోలీసులు.. ఆ దుండగుడు మహ్మద్ ఖదీర్ అని అనుమానించారు. మెదక్ పట్టణంలో చిన్న పాన్‌షాపు నడుపుకొనే ఖదీర్.. అది సరిగా నడవకపోవడంతో కొన్నిరోజులుగా హైదరాబాద్‌లోని తన సోదరి ఇంట్లో ఉంటూ కూలిపనులు చేసుకుంటున్నాడు. అతడి గురించి ఆరా తీసిన పోలీసులు జనవరి 29న హైదరాబాద్ వెళ్లి, సోదరి ఇంట్లో ఖదీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మెదక్ ఠాణాకు తరలించి ఐదు రోజులపాటు అదుపులో ఉంచుకున్నారు. ఏమీ తేలకపోవడంతో ఫిబ్రవరి 3న మెదక్ తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసి వదిలేశారు. దెబ్బలకు కిడ్నీలు దెబ్బతిని.. పోలీసులు వదిలేసిన తర్వాత ఖదీర్ తీవ్రంగా అస్వస్థతకు లోనయ్యాడు. ఫిబ్రవరి 6న మెదక్ ప్రభుత్వాస్పత్రిలో చేరాడు. పరీక్షలు చేసిన వైద్యులు బలమైన దెబ్బలు తగిలి కిడ్నీలు చెడిపోయాయని, మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. దీనితో ఖదీర్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, మూడు రోజులు చికిత్స చేయించారు. ఈ ఖర్చులను పోలీసులే భరించారని ఖదీర్ భార్య తెలిపింది. కానీ ఖదీర్ పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 12న గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ 16న రాత్రి మృతి చెందాడు. గురువారం రాత్రే ఖదీర్ చనిపోయినా.. కేసు నమోదవకపోవడం, ఎఫ్ఐఆర్ కాకపోవడంతో మృతదేహానికి శుక్రవారం రాత్రి వరకు పోస్టుమార్టం చేయలేదు. దీనితో పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. ఎస్సై, కానిస్టేబుళ్లు బదిలీ ఖదీర్ మృతి నేపథ్యంలో మెదక్ పట్టణ ఎస్సై రాజశేఖర్‌ను డీసీఆర్బీకి అటాచ్ చేస్తూ.. కానిస్టేబుల్ పవన్ కుమార్‌ను రేగోడుకు, ప్రశాంత్‌ను పాపన్న పేటకు బదిలీ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. అకారణంగా నా భర్తను చంపేశారు దొంగతనం నెపంతో తన భర్తను దారుణంగా కొట్టి చావుకు కారణమైన పోలీసులపై హత్యకేసు నమో దు చేయాలని ఖదీర్ భార్య సిద్దేశ్వరి డిమాండ్ చేశా రు. దీనిపై శుక్రవారం మెదక్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన భర్తను అకారణంగా చంపి తనను, తన ముగ్గురు పిల్లలను రోడ్డున పడేసిన పోలీసులకు ఉసురు తగులుతుందంటూ ఆమె రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. కాగా.. హైదరాబాద్‌లోని తమ ఇంట్లో ఖదీర్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులు దారుణంగా కొట్టారని, కాళ్లు మొక్కినా వినలేదని ఖదీర్ సోదరి తపసుల్ పేర్కొన్నారు. పాత నేరస్తుడని అదుపులోకి.. ‘‘ఖదీర్ పాత నేరస్తుడు. అరబ్‌గల్లీలో ఓ మహిళ మెడలోంచి గొలుసు తెంపుకెళ్లిన వ్యక్తి సీసీ పుటేజీలో ఖదీర్లా ఉండటంతోనే అదుపులోకి తీసుకున్నాం. ప్రశ్నించిన తర్వాత ఫిబ్రవరి 3వ తేదీన తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసి వదిలేశాం. 6వ తేదీన అతడు ఆస్పత్రిలో చేరాడు. మధ్య ఏం జరిగిందో మాకు తెలియదు..’’ – మెదక్ డీఎస్పీ సైదులు -
దొరకని సీరియల్ చైన్ స్నాచర్ల జాడ.. తిరిగొస్తేనే పట్టుకునేది!
సాక్షి, హైదరాబాద్: సీరియల్ చైన్ స్నాచింగ్‌లలో కలకలం రేపిన బవారియా ముఠా జాడ ఇంకా చిక్కలేదు. పక్షం రోజుల క్రితం హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏడు ప్రాంతాలలో స్నాచింగ్‌లకు పాల్పడిన పింకు గ్యాంగ్.. పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని శామ్లీ జిల్లాలకు చెందిన ముఠా కోసం వెళ్లిన పోలీసు బృందాలు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవటంతో తిరిగి వెనక్కి వచ్చేసినట్టు తెలిసింది. చేతిలోని డబ్బు అయిపోయాక మళ్లీ స్నాచింగ్‌ల కోసం తిరిగి ఈ పింకు గ్యాంగ్ నగరానికి వస్తేనే పట్టుకునే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు. పంథా మార్చిన స్నాచర్లు.. ఆరేడేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం బవారియా గ్యాంగ్ స్నాచింగ్ పంథా మారింది. గతంలో వేరే రాష్ట్రంలో బైక్‌ను దొంగిలించి స్నాచింగ్ గూడ్స్ రైలులో బైక్‌ను పార్శిల్ చేసి తీసుకొచ్చేవారు. స్నాచింగ్ చేసేశాక బైక్‌లను ఇక్కడే వదిలేసి పరారయ్యేవాళ్లు. ప్రస్తుతం గూడ్స్ రైళ్లలో తనిఖీలు పెరగడంతో నేరస్తులు పంథా మార్చారని, స్థానికంగానే బైక్‌ను దొంగిలించే స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారని ఓ పోలీసు ఉన్నతాధికారి వివరించారు. అలాగే గతంలో ఒక వృద్దురాలిని వెంట తీసుకొచ్చి దుస్తులు విక్రయించేందుకో లేదా ఆసుపత్రికి వచ్చామనో స్థానిక ఇంటి యజమానికి నకిలీ గుర్తింపు పత్రాలను సమర్పించి అద్దెకు తీసుకునేవాళ్లు. ఆపైన పలు ప్రాంతాలలో రెక్కీ చేసి ఉదయం 6 నుంచి 8 గంటలు లేదా సాయంత్రం 7 నుంచి 9 గంటల మధ్య మ్యాత్రమే స్నాచింగ్‌లకు పాల్పడేవాళ్లు. కానీ, ఇప్పుడు నగరంలో షెల్టర్ తీసుకోకుండా ఒకేసారి పలు నగరాలలో చోరీ చేసి నేరుగా సొంతూళ్లకు పరారవుతున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 6న బెంగళూరులో వరుస చోరీలు చేసిన నిందితులు 7న నగరానికి వచి్చ.. ఉప్పల్, నాచారం, సికింద్రాబాద్‌లో వరుసగా ఏడు ఘటనల్లో 24 తులాల బంగారు గొలుసులను స్నాచింగ్ చేశారు. పక్కా ప్లానింగ్.. ఉత్తరప్రదేశ్‌లోని శామ్లీ జిల్లాలోని 10–12 గ్రామస్తులు బవారియా ముఠాగా ఏర్పడ్డాయి బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలలో మాత్రమే ఈ ముఠా స్నాచింగ్‌లకు పాల్పడుతుంటాయి. రూట్లు తెలిసిన 4 నుంచి 6 మంది వరుసగా 6 నుంచి 10 ప్రాంతాల్లో స్నాచింగ్ చేస్తారు. ఒక్కో చోట 3 నుంచి 5 తులాలు బంగారం స్నాచింగ్‌లు చేస్తుంటారు. పోలీసులకు దొరికిపోతామని స్నాచింగ్ కోసం దిగే సమయంలో సెల్ఫోన్లను అసలు వాడరు. పని పూర్తయ్యాక ఎక్కడ కలుసుకోవాలి? ఎలా పరారవ్వాలో ముందుగా ప్లానింగ్ చేసుకున్నాకే రంగంలోకి దిగుతారు. ఈ ముఠాపై హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి చాలా రాష్ట్రాలలో చాలా కేసులున్నాయని.. వీళ్లను పట్టుకునేందుకు వెళ్లితే పోలీసులపైనా కూడా దాడులు చేస్తారని, బయటి వాళ్లు వచ్చారనే సమాచారం సెకన్లలో వీరికి చేరిపోతుందని ఓ అధికారి తెలిపారు. -
తాళిబొట్టు దొంగతనం.. పట్టించిన కన్నతల్లి
క్రైమ్: డబ్బు ప్రతీ మనిషికి అవసరమే. కానీ, ఆ అవసరం తీర్చుకోవడానికి తప్పుడు దారిలో వెళ్తే మాత్రం సహించనంటోంది ఆ అమ్మ. తన కొడుకు దొంగతనం తెలిసిన వెంటనే గుండె పగిలినంత పని అయ్యింది ఆమెకు. అయినా దుఖాన్ని దిగమింగుకుని మనస్సాక్షి చెప్పినట్లు నడుచుకుని.. కొడుకుని పోలీసులకు పట్టించింది. ముంబై విష్ణు నగర్ దేవి చౌక్‌లో సోమవారం ఉదయం పూట ఓ దొంగతనం జరిగింది. ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న 85 ఏళ్ల ఓ వృద్ధురాలి మెడ నుంచి తాళి బొట్టును లాక్కుని వెళ్లాడు ఓ వ్యక్తి. ఆ పెనుగులాటలో ఆమె కాలికి గాయం అయ్యింది కూడా. ఆలస్యం చేకుండా ఆమె పోలీసులను ఆశ్రయించింది. విష్ణు నగర్ పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పసుపు రంగు చొక్కా వేసుకున్న ఓ వ్యక్తి ఆ దొంగతనం చేసినట్లు గుర్తించారు. ఆపై ఆ వ్యక్తి ఫొటోను వాట్సాప్ గ్రూపుల్లో పంపించి.. అతన్ని ట్రేస్ చేసే యత్నం చేశారు. ఈ క్రమంలో.. ఫూలే నగర్ వాసి నుంచి అతని గురించి తెలుసనే సమాచారం అందుకున్నారు విష్ణు నగర్ పోలీసులు. అదే రోజు సాయంత్రం ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లారు. ఆమె పేరు తానిబాయి రాజు వాఘ్రి. ఆ ఫొటోలో ఉంది తన కొడుకు కణు అని చెప్పిందామె. అయితే అతని గురించి ఎందుకు అడుగుతున్నారని పోలీసులను నిలదీసింది. దీంతో పోలీసులు.. అతనికి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పారు. అయితే.. అతను ఇంటి దగ్గరే ఉన్నాడని చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. దీంతో అతను చేసిన పనిని ఆమె వివరించారు. తన కొడుకు మంగళసూత్రం దొంగతనం చేశాడన్న వార్త విని ఆ తల్లి కుమిలిపోయింది. పోలీసులను దగ్గర ఉండి మరీ ఇంటికి తీసుకెళ్లి అప్పగించింది. తన భార్యకు సర్జరీ అయ్యిందని, పూల వ్యాపారం సరిగా నడవకపోవడంతో డబ్బు కోసం ఇలా దొంగతనం చేయాల్సి వచ్చిందని కణు నేరం ఒప్పుకున్నాడు. అయితే తమకు డబ్బు అవసరం అయిన మాట వాస్తవమే అయినా.. ఇలా మంగళసూత్రం ఓ పెద్దావిడ నుంచి దొంగతనం చేయడం, ఆమెను గాయపర్చడం తాను భరించలేకపోతున్నానని కన్నీళ్లతో చెప్పింది కణు తల్లి. -
Hyderabad: చదివేది బీటెక్, సీఏ.. చేసే పనులేమో చైన్ స్నాచింగ్‌లు..
సాక్షి, హైదరాబాద్(నాగోలు): జల్సాకు కోసం గొలుసు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థులను ఎల్బీనగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.4,80 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ కథనం ప్రకారం... వరంగల్ జిల్లా దుగంటి మండలం, చెల్లపల్లికి చెందిన ముస్కు రాకేష్(24) చైతన్యపురిలోని హాస్టల్లో ఉంటూ చిక్కడపల్లి సీఏ చదువుతున్నారు. మహబూబ్‌బాద్ జిల్లా కొత్తగూడ మండలం, గాంధీనగర్‌కు చెందిన పగిళ్ల అఖిల్(25) చైతన్యపురిలో హాస్టల్ ఉంటూ హయత్‌నగర్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. రాకేష్ ఏడాది కాలంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు బానిసయ్యాడు. ఆన్లైన్ లోన్ యాప్‌ల నుంచి రుణాలు తీసుకున్న అతడు వాటిని చెల్లించలేక ఇబ్బంది పడుతున్నాడు. జాల్సాకు, ఇతర ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో గొలుసు దొంగతనాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. భర్త పలుమార్లు హెచ్చరించినా..) తన చిన్ననాటి స్నేహితుడైన పగిళ్ల అఖిల్‌తో విషయం చెప్పాడు. ఇద్దరూ కలిసి గొలుసు చోరీలకు ప్లాన్ చేశారు. హోండా యాక్టివాపై సాయంత్రం సమయంలో కాలనీలో తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళలును, వృద్ధులైన పురుషులను లక్ష్యంగా చేసుకుని వారి వద్ద ఉన్న బంగారు గొలుసులు స్నాచింగ్ చేసుకొని పారిపోతున్నారు. ఇదే క్రమంలో ఇద్దరూ కలిసి జూలై 2న మన్సురాబాద్‌లో కిరాణా షాప్ నుంచి తన ఇంటికి తిరిగి వస్తున్న వనం చంద్రకళ మెడలో ఉన్న బంగారు గొలుసును స్నాచింగ్ చేశారు. ఈనెల ఒకటో తేదీన మన్సూరాబాద్ శ్రీరాంనగర్ కాలనీలో పున్నా భిక్షమయ్య మెడలో ఉన్న 25 గ్రాముల బంగారు గొలుసుని తెంచుకొని పారిపోయారు. ఈ నెల 11 బోడుప్పల్లో చంద్రకళావతి వద్ద మెడలో ఉన్న 3 తులాలు బంగారు గొలుసు స్నాచింగ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎల్బీనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు. నిందితులు యూట్యూబ్‌లో వీడియోలు చూసి చోరీలు చేసినట్లు సమాచారం. చదవండి: (ఒకే మహిళతో ఇద్దరు ఎఫైర్.. చివరికి దారుణంగా..!) -
Hyderabad: చైన్ లాగుతూ దొరికిన కానిస్టేబుల్.. 2 కిలోమీటర్లు వెంబడించి
సాక్షి, హైదరాబాద్: వాకింగ్ చేస్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును స్నాచింగ్ చేసిన కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. మాదాపూర్ ఏసీపీ రఘునందన్‌రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 26న సాయంత్రం 6 గంటలకు నేరెళ్ల చెరువు వాకింగ్ ట్రాక్‌లో కేతావత్ రాధ వాకింగ్ చేస్తున్నారు. వెనుకనుంచి రన్నింగ్ చేస్తూ వచ్చిన కొండాపూర్ టీఎస్ఎస్పీ 8వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ కంటు రమేష్ (31).. రాధ మెడలోని 10 తులాల బంగారు గొలుసును లాక్కొని ఉడాయించాడు. అక్కడే వాకింగ్ చేస్తున్న ఇద్దరు యువకులు రెండు కిలోమీటర్లు వెంబడించి కానిస్టేబుల్‌ను పట్టుకొని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. నిందితుడి నుంచి రూ.3.90 లక్షల విలువ చేసే బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. విధులకు సరిగా హాజరు కాకపోవడంతో కానిస్టేబుల్ రమేష్‌ను 8 నెలల క్రితం అధికారులు సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని స్వగ్రామం ఆలవరంలో ఉద్యోగం పోయినప్పటి నుంచి నివాసముంటున్నాడు. ఇటీవలే మళ్లీ డ్యూటీలో చేరేందుకు అధికారులను కలవాలని హైదరాబాద్‌కు వచ్చాడు. అతనికి జీతం రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగానే స్నాచింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. చదవండి: Vikarabad: కొడుకు ప్రశ్నించాడని.. భోజనంలో విషం కలిపి -
చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతూ పట్టుబడ్డ మహిళ.. చితకబాదిన స్థానికులు
సాక్షి, బెంగళూరు: చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతూ పట్టుబడ్డ మహిళను పట్టుకుని చితకబాదిన స్థానికులు ఆమెను పోలీసులకు అప్పగించిన సంఘటన దొడ్డ తాలూకా మధురె గ్రామంలో చోటుచేసుకుంది. హెసరఘట్ట గ్రామానికి చెందిన రాజమ్మ అనే వృద్ధురాలు పని నిమిత్తం మధురె గ్రామానికి వచ్చింది. పని ముగించుకుని బస్సు కోసం మధురె గ్రామం బస్టాప్‌లో వేచి ఉండగా బైక్‌పై వచ్చిన ఒక మహిళ, మరో వ్యక్తి తాము దంపతులమని చెప్పుకుని రాజమ్మతో మాటలు కలిపారు. హఠాత్తుగా మహిళ రాజమ్మ మెడలోని బంగారు గొలుసు తెంపుకుని పరారవడానికి ప్రయత్నించింది. అయితే స్థానికులు రావడం గమనించి బైక్‌పై పరారవడానికి చేసిన ప్రయత్నంలో మహిళ కిందపడిపోగా వ్యక్తి బైక్‌పై పరారయ్యాడు. పట్టుబడ్డ మహిళను చితకబాదిన స్థానికులు అనంతరం ఆమెను దొడ్డబెళవంగల పోలీసులకు అప్పగించారు. పట్టుబడ్డ మహిళ పేరు నందినిగా తెలిసింది. -
ఘరానా దొంగ! విమానంలో వచ్చి మరీ చైన్‌స్నాచింగ్...
హిమాయత్‌నగర/శంషాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అతని పేరు హేమంత్‌కుమార్ గుప్త (30).. ఢిల్లీలో నివాసముంటున్నాడు. విమానంలో హైదరాబాద్‌కు వచ్చి చైన్‌స్నాచింగ్ చేసి తిరిగి విమానంలోనే ఢిల్లీ వెళ్లడం అతడి తీరు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పి. కమల (55) పుస్తెలతాడును లాక్కొని వెళ్లాడు. పుస్తెలతాడు లాగుతున్న సమయంలో కిందపడ్డ ఆమె తలకు బలమైన గాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని కదలికలను పోలీసులు సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. ఎయిర్‌పోర్టువైపు వచ్చినట్లు తెలియడంతో ఆర్జీఐఏ ఔట్‌పోస్టులోని కానిస్టేబుళ్లు శ్రీశైలం, భాను, లింగం విమానాశ్రయంలోని భద్రతాధికారులతో కలిసి అన్ని విమానాల్లో క్షుణంగా తనిఖీలు చేశారు. బుధవారం తెల్లవారు జామున 5.45 గంటలకు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న స్పైస్‌జెట్ విమానంలో అతడిని పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న నాలుగు తులాల బంగారు పుస్తెలతాడును స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇలాంటి తరహాలోనే ఆరు స్నాచింగ్‌లు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని రాచకొండ పోలీసులకు అప్పగించారు. చాకచక్యంగా వ్యవహరించిన ఆర్జీఐఏ ఔట్‌పోస్టు కానిస్టేబుళ్లను శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి అభినందించారు. ఇదిలా ఉండగా ఓఎల్‌ఎక్స్‌లోచూసి ఎల్బీనగర్కు చెందిన వ్యక్తినుంచి మంగళవారం ద్విచక్రవాహనం కొనుగోలు చేసి అదే వాహనాన్ని వాడి స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. (చదవండి: నిర్లక్ష్యం చూపారు.. నిలువెల్లా దోచారు) -
సీరియల్ స్నాచర్ ఖతిక్ కేసులో మరో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ వ్యవహారంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇతగాడు శనివారం అహ్మదాబాద్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. అతడిని ఇక్కడకు తరలించడానికి పీటీ వారెంట్‌తో వెళ్లిన పేట్ బషీరాబాద్ పోలీసులకు ఈ విషయం తెలిసింది. నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ ఎస్కేప్పై మన పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమేష్ ఖతిక్ నేరాంగీకార వాంగ్మూలం సహా పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు ‘బంగారం కోసమే’ ఈ వ్యవహారమా? అని భావిస్తున్నారు. తాజా పరిణామం నేపథ్యంలో ఉమేష్ కోసం అహ్మదాబాద్ పోలీసులతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ అధికారులు మళ్లీ గాలింపు చేపట్టారు. అగమ్యగోచరంగా పరిస్థితి... ఉమేష్ ఖతిక్ అంశంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ‘ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెండ్ డైడ్’ అన్నట్లు ఉందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. రాజధానిలో అయిదు స్నాచింగ్స్ చేసిన 24 గంటల్లోనే ఇతడిని గుర్తించారు. అహ్మదాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకుని రికవరీల్లో ఇబ్బంది ఉండకూడదనే అక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీన్నే ఆ పోలీసులు తమకు అనువుగా మార్చుకుంటూ ఉమేష్‌ను అరెస్టు చేయడంతో పాటు ఇక్కడి ఐదు నేరాలకు సంబంధించిన 18.5 తులాలను రికవరీ చేశారు. చదవండి: Chain Snatcher: తెంచిన గొలుసులన్నీ ఇక్కడే పడిపోయాయి! ఆ బంగారాన్ని తమ కేసుల ఖాతాలో వేసేసుకున్నారు. ఉమేష్ అరెస్టు ప్రకటించిన అహ్మదాబాద్‌లోని వడాజ్ పోలీసుస్టేషన్ అధికారులు చిత్రంగా అతడి నేరాంగీకార వాంగ్మూలం నమోదు చేశారు. అందులో హైదరాబాద్‌లో నేరాలు చేస్తున్నట్లు చూపిస్తూనే.. ఒక నేరంలో తస్కరించిన గొలుసు మరో స్నాచింగ్ చేస్తున్నప్పుడు పడిపోయినట్లు రికార్డు చేశారు. ఉద్దేశపూర్వకంగానే అలా రికార్డు... అంతర్రాష్ట్ర, అంతర్జిల్లా నేరగాళ్లు వివిధ ప్రాంతాల్లో నేరాలు చేస్తుంటారు. వీరిని ఒక విభాగానికి చెందిన పోలీసులు పట్టుకున్నప్పుడు నేరాంగీకార వాంగ్మూలం నమోదు చేస్తారు. అందులో కేవలం సదరు నేరగాడు తమ ప్రాంతంతో పాటు ఫలానా చోట్లా నేరాలు చేశాడని పొందుపరుస్తారు. మరో జిల్లా, రాష్ట్ర పోలీసులు అతడిని పీటీ వారెంట్‌పై తీసుకురావాలంటే ఇది కచ్చితం. పట్టుకున్న సందర్భంలో రికవరీ చేసిన సొత్తు పూర్వాపరాలు పరిశీలిస్తారు. సమయం, సందర్భాలను బట్టి అది వేరే ప్రాంతానికి చెందినదనే ఆధారాలు లభిస్తే తమ వద్ద భద్రపరిచి ఆ పోలీసులకు అప్పగిస్తుంటారు. చదవండి: Chain Snatcher: ఉమేష్ ఖతిక్‌ను ఇచ్చేదేలే ఉమేష్ వ్యవహారంలో అహ్మదాబాద్ పోలీసులు నమోదు చేసిన వాంగ్మూలం ఉద్దేశపూర్వకంగానే ఉన్నట్లు కనిపిస్తోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. సాధారణంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లోనూ నేరాలు చేసినట్లు మాత్రమే రాస్తారని, దీనికి భిన్నంగా ఆ నేరాల్లో లాక్కున్న గొలుసులు పడిపోయాయంటూ రాయడం, తాము వెళ్లినా అప్పగించకపోవడంతోనే వారి ఉద్దేశం అర్థమవుతోందన్నారు. వ్యవహారం ముదరడంతో మరో ట్విస్ట్..? ఈ వ్యవహారం ఉన్నతాధికారుల వద్దకు వెళ్లడంతో అహ్మదాబాద్ పోలీసులతో మాట్లాడారు. దీంతో విషయం సీరియస్‌గా మారుతోందని భావించిన అక్కడి అధికారులు ఈ కొత్త ట్విస్ట్‌కు కారణమై ఉంటారని మన పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలోనే ఉమేష్‌కు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఇతడికి అరెస్టు ప్రకటించిన వడాజ్ పోలీసులు న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్నారు. విచారిస్తున్నప్పుడు ఫిట్స్ వచ్చిపడిపోయాడని, అందుకే అహ్మదాబాద్‌లో శారదబెన్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి శనివారం పారిపోయాడంటూ చెప్తున్నారు. గతంలో కస్టడీ నుంచి పారిపోయిన చరిత్ర ఉన్న ఈ కరుడుగట్టిన స్నాచర్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారో అర్థం కావట్లేదని, దీని వెనుకా ఏదైనా మతలబ్ ఉందా? అనేది పరిశీలించాలని సైబరాబాద్‌కు చెందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
Chain Snatcher: తెంచిన గొలుసులన్నీ ఇక్కడే పడిపోయాయి!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో రెండు రోజుల్లో అయిదు స్నాచింగ్స్ సహా ఎనిమిది నేరాలు చేసిన సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ వ్యవహారంలో గుజరాత్ పోలీసులు షాక్ ఇచ్చారు. అతగాడు ఇక్కడ స్నాచ్ చేసిన 18.5 తులాల బంగారాన్నీ వాళ్లు ‘కాజేశారు’. దాన్ని తమ వద్ద జరిగిన నేరాల్లో రికవరీ చూపించిన అధికారులు ఇక్కడ ఒక స్నాచింగ్‌లో తెంచిన గొలుసు మరో నేరం చేస్తున్నప్పుడు రోడ్డుపై పడిపోయినట్లు రికార్డుల్లో పొందుపరిచారు. ఉమేష్ నేరాంగీకార వాంగ్మూలంలో ఈ విధంగానే రికార్డు చేశారు. దీన్ని చూసిన తెలంగాణ పోలీసుల అధికారులు కంగుతిన్నారు. మరోపక్క ఉమేష్‌ను ఇక్కడకు తరలించడానికి అనుమతి కోరుతూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు స్థానిక కోర్టుల్లో పీటీ వారెంట్లు దాఖలు చేశారు. రికవరీలు కష్టం కావడంతో.. ► చాలా కాలం క్రితం తమ ప్రాంతాల్లో జరిగిన నేరాలకు సంబంధించిన సొత్తు ఇప్పుడు రికవరీ కావడం కష్టం కావడంతో గుజరాత్ పోలీసులు అతి తెలివితో వ్యవహరించారు. ఉమేష్ ఈ నెల 19న హైదరాబాద్ చేరుకున్నాడు. అదే రోజు ఆసిఫ్‌నగర్‌లో యాక్టివా చోరీ చేశాడు. దానిపై సంచరిస్తూ 20న పేట్ బషీరాబాద్ మొదలుపెట్టి మేడిపల్లి వరకు అయిదు స్నాచింగ్స్ చేశాడు. మరో ఇద్దరు మెడలోని గొలుసులు లాగేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇక్కడ స్నాచ్ చేసిన 18.5 తులాల బంగారంతో నేరుగా అహ్మదాబాద్‌లోని చంద్లోడియా ప్రాంతంలో ఉన్న తన ఇంటికి చేరుకున్నాడు. ► సుదీర్ఘ దర్యాప్తు నేపథ్యంలో ఈ విషయం 21 రాత్రి గుర్తించిన సిటీ పోలీసులు అహ్మదాబాద్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో 22న తెల్లవారుజామున ఉమేష్‌ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈలోపు అతడు ఇక్కడ నుంచి ‘లాక్కెళ్లిన’ బంగారాన్ని అమ్మేందుకు ఆస్కారం లేదు. అయినప్పటికీ అతడి నేరాంగీకార వాంగ్మూలంలో ఎక్కడా మన బంగారం రికవరీ చూపించలేదు. దీన్ని ఆ అధికారులు తమ వద్ద జరిగిన నేరాల లెక్కలో వేసేసుకున్నారు. వరుసపెట్టి పడిపోయిందంటూ.. ► ఇక్కడి పోలీసులు ఉమేష్ ఖతిక్‌ను తీసుకురావాలన్నా, నగరంలో నేరాలకు సంబంధించిన బంగారం రికవరీ చేయాలన్నా దానికి అక్కడి పోలీసులకు అతడిచ్చిన నేరాంగీకార వాంగ్మూలమే ఆధారం. ఈ నేపథ్యంలోనే అహ్మదాబాద్ పోలీసులను సంప్రదించిన ఇక్కడి అధికారులు దాన్ని సేకరించారు. అందులోని అంశాలను చూసిన మూడు కమిషనరేట్ల పోలీసులూ షాక్ తిన్నారు. మేడిపల్లిలో స్నాచింగ్ మినహా మిగిలిన అన్ని నేరాలను ఇందులో పొందుపరిచారు. వీటిలో కొన్ని స్నాచింగ్‌కు యత్నాలు ఉన్నాయి. ► తాను ఓ నేరంలో మహిళ మెడ నుంచి లాక్కున్న గొలుసు మరో నేరం చేస్తున్న సమయంలో రోడ్డు పైనో, ఎక్కడో తెలియని ప్రాంతంలోనే పడిపోయిందని ఉమేష్ చెప్పినట్లు నమోదు చేశారు. దీని ప్రకారం చూస్తే ఉమేష్ నగరంలో స్నాచ్ చేసిన 18.5 తులాల బంగారం ఇక్కడే పడిపోయానట్లు లెక్క. ఫలితంగా అహ్మదాబాద్ పోలీసులను అడగడానికి కానీ, ఉమేష్ నుంచి రికవరీ చేయడానికి కానీ ఆస్కారం లేకుండా పోయింది. ఈ విషయంలో ఏం చేయాలనే అంశంపై మూడు కమిషనరేట్లకు చెందిన అధికారులు మల్లగుల్లాలుపడుతున్నారు. అక్కడివి అమ్మినట్లు రికార్డుల్లో.. ఉమేష్ ఖతిక్‌పై గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలోనూ అనేక కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్టు చేసినట్లు అహ్మదాబాద్‌లోని వడజ్ పోలీసుస్టేషన్ అధికారులు మంగళవారం ప్రకటించారు. అతడిని కోర్టులో హాజరుపరుస్తున్న సమయంలో నేరాంగీకార వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇందులో ఉమేష్ గేర్లు లేని వాహనాలను చోరీ చేసి వాటిపై సంచరిస్తూ చైన్ స్నాచింగ్స్ చేశాడని పొందుపరిచారు. ఇవన్నీ గతేడాది మే నుంచి నవంబర్ మధ్య చోటు చేసుకున్నవే అని చూపించారు. ఆ సొత్తును అహ్మదాబాద్‌లోని ఆనంద్‌నగర్‌కు చెందిన లబ్ధి జ్యువెలర్స్ యజమాని హర్ష భాయ్, మానిక్ చౌక్‌లోని హిమ్మత్ చౌక్, చాణక్యపురి ప్రాంతానికి చెందిన మహంకాళి జ్యువెలర్స్ యజమాని గిరీష్ భాయ్లకు అమ్మినట్లు రికార్డు చేశారు. -
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్
-
కళ్లల్లో కారం కొట్టి చైన్‌స్నాచింగ్.. దొంగకు చుక్కలు చూపించిన సూపర్ ఉమెన్
సాక్షి, కామారెడ్డి: చైన్‌స్నాచింగ్ యత్నించిన నిందితుడిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి అనంతరం పొలీసులకు అప్పగించిన సంఘటన కామారెడ్డి పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. పట్టణంలోని శివాజీ రోడ్డు చౌరస్తాలో కృష్ణమూర్తి అనే వ్యక్తి కిరాణాషాపు నిర్వహిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి షాపులో ఉన్న ఆయన భార్య కంట్లో కారంపొడి చల్లి మెడలో ఉన్న బంగారం గొలుసును లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో అక్కడికి సరుకులు కొనేందుకు వచ్చిన భారతి అనే మహిళ ఆ దొంగను అడ్డుకొని కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల ఉన్న వారు వచ్చి నిందితుడిని పట్టుకుని దేహశుధ్ది చేసి గొలుసును బాధిత మహిళకు అప్పగించారు. నిందితుడి వద్దనున్న డ్రైవింగ్ లైసెన్సులో యాదగిరి, సదాశివనగర్ అని, ద్విచక్రవాహనానికి చెందిన ఆర్సీ కార్డుపై అజంపుర, మెదక్ అని వేర్వేరు అడ్రస్‌లు ఉన్నట్లు గుర్తించారు. కౌన్సిలర్లు పిట్ల వేణు, కోయల్కర్ కన్నయ్యలు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దొంగను అడ్డగించిన భారతి అనే మహిళను స్థానికులు అభినందించారు. చదవండి: ఒకే ఎఫ్ఐఆర్తో రెండు కేసులు, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి.. సీపీ సీరియస్ -
పల్లీపట్టీలు కావాలని వచ్చి... పుస్తెలు అపహరణ!
నాగోలు: పల్లీపట్టీ కావాలని వచ్చిన ఓ దుండగుడు షాపులో ఉన్న మహిళ మెడలోని బంగారు పుస్తెలు తెంచుకొని పారిపోయాడు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... హస్తినాపురం, అనుపమనగర్‌లో నివసించే పెబ్బేటి స్వప్న (35) అదే కాలనీలో జై సంతోషిమాత పింగి గిర్నీ నిర్వహిస్తోంది. గురువారం మధ్యాహ్నం గుర్తుతెలియని యువకుడు దుకాణానికి వచ్చి పల్లీపట్టి కావాలని అడిగి ఆమె మెడలోని పుస్తెలతాడు తెచ్చేందుకు యత్నించాడు. ఆమె తాడును గట్టిగా పట్టుకోవడంతో రెండు పుస్తెలు తెంచుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాపమని లిఫ్ట్ ఇచ్చిన పోలీసుకే షాకిచ్చిన యువతి!
సాక్షి, పంజగుట్ట(హైదరాబాద్): మానవత్వంతో లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఓ కానిస్టేబుల్ మెడలోని చైన్‌ను దొంగిలించిన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. సన్‌సిటీలో నివాసం ఉండే ఈశ్వర్ ప్రసాద్ ఏఆర్ కానిస్టేబుల్. ఈ నెల 12న రాత్రి 8:30 సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా గ్రీన్‌ల్యాండ్స్ వద్ద ఓ యువతి లిఫ్ట్ అడగగా ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడు. రాత్రి 9 గంటలకు ఆమెను పంజగుట్టలో దింపి ఇంటికి వెళ్లిపోయాడు. ఇంట్లో స్నానం చేసే సమయంలో తన బంగారు గొలుసు మాయమైనట్లు తెలుసుకున్నాడు. పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితురాలు మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా ఇలానే దొంగతనం చేసేందుకు యత్నించగా అక్కడి పోలీసులు ఆమెను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా పంజగుట్టలో కానిస్టేబుల్ వద్ద కూడా చైన్ కొట్టేసినట్లు తెలిపింది. కాగా ఆమె ట్రాన్స్‌జెండర్‌గా పోలీసులు గుర్తించారు. బెంగళూరుకు చెందిన అంజూన్ అని నిర్ధారించారు. అంజూన్ బెంగళూరు నుండి హైదరాబాద్‌కు వచ్చి దొంగతనాలు చేసి తిరిగి వెల్లిపోతుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యాక్సిన్ వేసుకుంటే డబ్బు ఇస్తాం.. వృద్ధురాలిపై అమానుషం
కూసుమంచి: కరోనా వ్యాక్సిన్ రెండు డోస్‌లు వేసుకున్న వారికి ప్రభుత్వం నగదు ఇస్తోందంటూ నమ్మబలికిన ఓ వ్యక్తి వృద్ధురాలి నోటికి ప్లాస్టర్ వేసి మూడున్నర తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన ఇది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చిన్న పోచారం గ్రామంలో గురువారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చదవండి: చిన్న పోచారం గ్రామానికి చెందిన రామసహాయం వసుమతి (75) ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఈక్రమంలో గురువారం మధ్యాహ్నం వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కరోనా టీకా రెండు డోసులు వేసుకున్నారా అంటూ ప్రశ్నించాడు. దీనికి ఆమె టీకా వేయించుకున్నట్లు సమాధానం చెప్పగా.. ప్రభుత్వం రూ.వెయ్యి నగదు ఇవ్వమని పంపించిందని జేబులోని నగదు తీసి ఇచ్చాడు. అనంతరం ఫొటో తీసుకోవాలని చెబుతూ కుర్చీలో కూర్చున్న ఆమె ఫొటో తీస్తున్నట్లు నటిస్తూ నోటికి ప్లాస్టర్ వేశాడు. ఆ వెంటనే ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసు లాక్కుని పారిపోయాడు. తేరుకున్న వృద్ధురాలు బయటకు వచ్చి స్థానికులకు చెప్పగా వారు పోలీసులకు సమాచారం అందించారు. శిక్షణ ఎస్సై విజయ్‌కుమార్ గ్రామానికి చేరుకుని బాధిత మహిళతో మాట్లాడి వివరాలు సేకరించారు. కాగా, అదే దుండగుడు బుధవారం మధ్యహ్నం కూడా తన ఇంటికి వచ్చి టీకా వేసుకున్నారా అని అడిగి వెళ్లినట్లు మరో మహిళ చెప్పింది. దీంతో పక్కాగా రెక్కీ నిర్వహించాకే చోరీకి పాల్పడినట్లు భావిస్తున్నారు. -
చైన్ స్నాచింగ్ అంటూ హైడ్రామా.. కథ భలే అల్లింది!
సాక్షి, హిమాయత్‌నగర్: తన చైన్ స్నాచింగ్ అయిందంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీసులు అలర్ట్ అయ్యారు. గంటలోపే ఆమె చెప్పింది కట్టుకథని అని తేల్చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...దోమలగూడ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ఓ మహిళ జ్యువెలరీస్‌లో హౌస్ కీపర్‌గా పనిచేస్తుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు పని పూర్తి చేసుకొని తెలుగు అకాడమీ లేన్‌లో నుంచి నడుచుకుంటూ వస్తుండగా రాంగ్రూట్లో బైక్‌పై వచ్చి ఇద్దరు యువకులు.. ఓ అడ్రస్ చెప్పమని అడుగుతూ తన మెడలోని మూడు తులాల బంగారపు పుస్తెల తాడును లాక్కుని పరారైనట్లు పోలీసులకు ఆమె తెలిపింది. అయితే, సీసీ కెమెరా ఫుటేజీలను గమనించిన నారాయణగూడ ఇన్స్పెక్టర్ భపతి గట్టుమల్లు ఆమె చెప్పేది కట్టుకథ అని, ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసిందని గుర్తించారు. ఆమెను ప్రశ్నించగా.. చేసిన తప్పును ఒప్పుకుంది. డబ్బులు అవసరం కావడంతో తనతో పనిచేసే ఓ వ్యక్తికి పుస్తెల తాడును కుదవ పెట్టమని ఇచ్చానని, రెండు, మూడు రోజుల్లో కుదవ పెట్టి రూ.30వేలు తెస్తానని మాట ఇచ్చాడని చెప్పింది. డబ్బులు ఆలస్యం అవుతుండటంతో తన అవసరాన్ని తీర్చుకోవడానికి ఈ కట్టుకథ అల్లిందని ఇన్స్పెక్టర్ గట్టుమల్లు వెల్లడించారు. చదవండి: మరియమ్మ కుమారుడికి ఉద్యోగం, రూ.35 లక్షల చెక్కు -
హైదరాబాద్: సీసీటీవీలో చైన్ స్నాచింగ్ దృశ్యాలు
-
చూస్తుండగానే మాయం.. సీసీటీవీలో చైన్ స్నాచింగ్ దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్: జగద్గిరి గుట్ట పీఎస్ పరిధి శ్రీనివాస్ నగర్లో చైన్ స్నాచింగ్ జరిగింది. కవిత అనే మహిళ టైలర్ షాపుకి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఓ వ్యక్తి వెనుక నుండి ఆమెను వెంబడిస్తూ మెడలో నుండి 3.2 తులాల బంగారు గోలుసును లాక్కొని వెళ్లిపోయాడు. ఆ మహిళ అతడిని వెంబడించగా.. రోడ్డుపై మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై సిద్ధంగా ఉండడంతో దానిపై పరారయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పీఎస్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. చోరీ చేసిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. చదవండి: ఏడాది కిత్రమే పెళ్లి: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. జర జాగ్రత్త.. లాక్డౌన్ ఎత్తేశారని.. లైట్ తీసుకోవద్దు! -
రూటు మార్చిన దొంగలు: పల్లెలు టార్గెట్‌గా..
సాక్షి, కృష్ణా : మెడలో గొలుసులు తెంచుకుపోయే దొంగలు తమ రూటు మార్చుకున్నారు. నిన్నటి వరకు పట్టణాల్లో, నగరాల్లోనే ఇటువంటి దొంగతనాలు చేసేవారు. ప్రస్తుతం గ్రామాలను టార్గెట్ చేసుకున్నారు. శుక్రవారం పామర్రు మండలంలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్ ఘటనలు జరిగాయి. పామర్రులో ఉదయం 7 గంటల సమయంలో సుబ్బరత్తమ్మ వైష్ణవాలయం ముందు ఉన్న తన ఇంటి నుంచి కిరాణా షాపునకు వెళ్తుండగా దుండగులు బైక్‌పై వచ్చి బండిని ఆమె పక్కగా పోనిచ్చారు. ఇది గమనించిన ఆమె పక్కకు జరిగింది. ఆ గుర్తు తెలియని ఆగంతకులు వెనుక నుండి వచ్చి ఆమె ముందుగా బండి తిప్పి మెడలో ఉన్న నానుతాడు లాక్కెళ్లడానికి యత్నించారు. ఆ మహిళ గట్టిగా ప్రతిఘటించటంతో బలంగా గొంతునొక్కారు. ( ట్రాఫిక్ పోలీస్ చొక్కా పట్టుకుని..) ఇది గమనించిన మరో మహిళ గట్టిగా కేకలు వేయటంతో దుండగులు పారిపోయారు. ఈ సంఘటన నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో జరగటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా మండల పరిధిలోని జమీగొల్వేపల్లిలో మహిళ మెడలోని రెండున్నర కాసుల బంగారు నానుతాడును దొంగలు తెంపుకుపోయారు. జమీగొల్వేపల్లి గ్రామానికి చెందిన నాగమణి ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇంట్లోని చెత్తను బయట పారబోసి వస్తుండగా దొంగలు ఆమె మెడలోని గొలుసును లాక్కొని పారిపోయారు. పామర్రులో జరిగిన దొంగతన యత్నం, జమీగొల్వేపల్లి లో జరిగిన దొంగతనం ఒకే మాదిరిగా ఉండటంతో ఈ రెండు ఒకరే చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
డిన్నర్లో మత్తు మందు ఇచ్చి.. భారీ చోరీ
సాక్షి, గచ్చిబౌలి: కూర, గ్రీన్ టీలో మత్తు మందు కలిపిన నేపాల్ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడింది. రూ.15.10 లక్షల నగదు, రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతో ఉడాయించింది. మత్తు నుంచి 11 గంటల తర్వాత తేరుకున్న ఐదేళ్ల బాలుడు అయాన్ నాన్నమ్మకు కట్టిన తాళ్లను కత్తిరించడంతో ఆ కుటుంబం ప్రాణాపాయం నుంచి బయటపడింది. సోమవారం రాత్రి రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీఎన్ రెడ్డి హిల్స్‌లో చోటుచేసుకున్న ఘటన వివరాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. చౌటుప్పల్‌కు చెందిన బోర్వెల్ వ్యాపారి గూడూరు మధుసూదన్ రెడ్డి, శైలజ దంపతులు కుమారుడు నితీష్‌రెడ్డి, కోడలు దీప్తి, అయిదేళ్ల మనవడు అయాన్ రెడ్డితో కలిసి బీఎన్ రెడ్డి హిల్స్‌లో నివసిస్తున్నారు. రెండేళ్ల క్రితం నవీన్ అనే మధ్యవర్తి ద్వారా నేపాల్‌కు చెందిన రవి అలియాస్ రాజేందర్, అతని చెల్లెలు సీతతో కలిసి మధుసూధన్‌రెడ్డి ఇంట్లో హౌస్‌కీపింగ్ పనుల్లో చేరారు. రవి ద్వారా 15 రోజుల క్రితం నేపాల్‌కు చెందిన మనోజ్ క్లీనింగ్, అతని భార్య జానకి వంట మనిషిగా చేరారు. అక్కడే సెల్లార్‌లోని సర్వెంట్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. పప్పులో కలిపి.. సోమవారం రాత్రి డిన్నర్ కోసం రైస్, చపాతి, పప్పు రెడీ చేశారు. పప్పులో మత్తు మందు కలిపారు. రాత్రి 8 గంటలకు మధుసూదన్ రెడ్డి, నితీష్, దీప్తి, అయాన్ పప్పుతో రైస్, చపాతి తిన్నారు. శైలజ మాత్రం ఉదయం వండిన కూరతో చపాతి తిన్నారు. దీంతో శైలజకు నిందితులు గ్రీన్ టీలో మత్తు మందు కలిపి ఇచ్చారు. అరగంట తర్వాత అందరూ స్పృహ తప్పారు. మధుసూదన్‌రెడ్డి బాత్రూంలో పడిపోయారు. ఆయన కుమారుడు, కోడలు, మనవడు బెడ్రూంలో పడిపోయారు. శైలజ హాల్లోని కుర్చీలోనే కూర్చుని స్వల్పంగా స్పృహ తప్పారు. ఆమెను నిందితులు కుర్చీకి తాళ్లతో కట్టి, బెదిరించి వివరాలు తెలుసుకుని రూ.15.10 లక్షల నగదు, రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు సెల్ఫోన్లు చోరీ చేశారు. సెల్లార్లో ఉన్న శునకానికికూడా పెరుగన్నంలో మత్తు మందు కలిపిపెట్టారు. సర్వెంట్ క్వార్టర్ వద్ద ఓ లాకర్‌ను పగలగొట్టడంతో పాటు సీసీ టీవీ ఫుటేజీని తీసుకొని ఉడాయించారు. ఈ ఘటన రాత్రి 9 నుంచి 10 గంటలలోపే చోరీ జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయాన్ తేరుకుని.. మంగళవారం ఉదయం 7 గంటలకు అయాన్ తేరుకొని నాన్నమ్మ శైలజ వద్దకు వచ్చాడు. ఆమెకు ఉన్న తాళ్లను నాన్నమ్మ చెప్పినవిధంగా కత్తిరించాడు. వారు బయటికొచ్చి సమీపంలోని సైట్ వద్ద ఉన్న వాచ్‌మన్ రాములును పిలిచి విషయం చెప్పారు. అతను.. శైలజ బంధువులు సూర్యారెడ్డి, ఆనంద్‌రెడ్డిలను తీసుకొచ్చాడు. అనంతరం 100కు కాల్ చేసి సమాచారమిచ్చారు. మధుసూదన్ రెడ్డితో పాటు కొడుకు, కోడలు, మనవడిని కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్‌ఆస్పత్రికి తరలించారు. మధుసూదన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని, మిగతావారు కోలుకుంటున్నట్లు డీసీపీ చెప్పారు. నిందితులు ఏడుగురు.. పక్కా ప్లాన్‌నే నేపాల్ గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. మొదట పనిలో చేసిన రవి ఆ తర్వాత సీతను పనిలో పెట్టించాడు. చోరీ చేయాలని ప్లాన్ చేసుకున్న తర్వాత మనోజ్, జానకిలను చేర్పించాడు. చోరీ సమయంలో వీరితో పాటు మరో ముగ్గురు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సమీప రోడ్లపై ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ట్యాబ్లెట్ల పౌడర్ కలిపి ఉండొచ్చు.. నిందితులు మత్తునిచ్చే ట్యాబ్లెట్ల పౌడర్.. కూర, గ్రీన్ టీలో కలిపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత నిందితులు వేర్వేరుగా నడుచుకుంటూ వెళ్లినట్లు వారు నిర్ధారణకు వచ్చారు. సెల్‌ఫోన్ నంబర్ల లొకేషన్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 44, 45 వరకు చూపించిందని పోలీసులు తెలిపారు. సంవత్సరం క్రితం శామీర్‌పేట్ పీఎస్ పరిధిలో, గత జనవరిలో నార్సింగి పీఎస్ పరిధిలో నేపాల్ గ్యాంగ్ ఇదే తరహాలో చోరీ పాల్పడినట్లుగా పోలీసులు పేర్కొంటున్నారు. తాజా చోరీ కేసులోనూ పాత నేరస్తులు ఉండే అవకాశం ఉందనే కోణంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ముమైత్ ఖాన్‌పై పోలీసులకు ఫిర్యాదు పంజగుట్ట: సినీ నటి మొమైత్ ఖాన్ ఒప్పందం ప్రకారం తనకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిందని ఓ క్యాబ్ డ్రైవర్ మంగళవారం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి .. గత నెల 16న సినీ నటి మొమైత్ ఖాన్ కొంపల్లికి చెందిన రాజును సంప్రదించి గోవాకు వెళ్లాలని నాలుగు రోజులకు గాను రూ.22 వేలు చెల్లించేలా, రూ. 1500 బత్తా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఒప్పందం ప్రకారం నాలుగు రోజులు కాకుండా మరో నాలుగు రోజులు అదనంగా ఉందని, అదనంగా ఉన్న రోజులకు డబ్బులు చెల్లించాలని కోరగా ఇవ్వకపోగా తనను బెదిరిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. గోవా అడ్డాగా ఐపీఎల్ బెట్టింగ్! సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్స్పై రాజధానిలో పోలీసుల నిఘా పెరిగింది. నగరంలో టాస్క్‌ఫోర్స్, సైబరాబాద్, రాచకొండల్లో స్పెషల్ ఆపరేషన్ టీమ్ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన బుకీలు ఇతర మెట్రో నగరాలను అడ్డాగా చేసుకుని తమ దందా కొనసాగిస్తున్నారు. గోవా కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ముగ్గురు హైదరాబాదీలను అక్కడి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. మోర్జిమ్ ప్రాంతంలోని ఓ హోటల్‌పై సోమవారం దాడి చేసిన ప్రత్యేక బృందం వీరిని అదుపులోకి తీసుకుంది. ప్రత్యేక యాప్‌తో బెట్టింగ్స్ ఈ త్రయం బెట్టింగ్స్ నిర్వహణకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన యాప్ వినియోగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన సందీప్ పటేల్, కృష్ణకాంత్, భోజ భూపాల్ యాదవ్ క్రికెట్ బుకీలుగా మారారు. కొన్నేళ్లుగా ఈ దందా చేస్తున్న వీరు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ, ఎలాంటి మ్యాచ్‌లు జరుగుతున్నా తమ ‘పని’ ప్రారంభిస్తూ ఉంటారు. అయితే పోలీసుల నిఘా తప్పించుకునేందుకు వివిధ నగరాల్లో అడ్డాలు ఏర్పాటు చేసుకునే వీరికి దేశ వ్యాప్తంగా అనేక మంది పంటర్లతో (పందాలు కాసేవారు) సంబంధాలు ఉన్నాయి. లావాదేవీలను ప్రత్యేక సాఫ్ట్వేర్ కూడిన బెట్టింగ్ యాప్ ద్వారా నిర్వహిస్తున్నారు. పంటర్లకు యూజర్ ఐడీ ఆన్లైన్ ద్వారానే పరిచయమైన పంటర్లకు ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్వర్డ్ కేటాయిస్తున్న వీరు అతడితో ఆన్లైన్లోనే బెట్టింగ్ కాయిస్తున్నారు. నగదు లావాదేవీలను వివిధ ఈ–వాలెట్స్ ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రతి బాల్‌కు సంబంధించిన మ్యాచ్ వివరాలు, బెట్టింగ్ రేష్యో తదితరాలను ఆ యాప్ వీరికి అందిస్తూ ఉంటుంది. ఈ వ్యవహారాల్లో తమకు సహకరించడానికి వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. నెల రోజులుగా గోవాలో మకాం నెల రోజుల క్రితం గోవా వెళ్లిన వీరు మోర్జిమ్ ప్రాంతంలోని ఓ హోటల్లో టూరిస్టుల ముసుగులో బస చేశారు. ఐపీఎల్ మొదలైన నాటి నుంచి పందాలు నిర్వహిస్తున్నారు. దీనిపై అక్కడి క్రైమ్ బ్రాంచ్ అధికారులకు సోమవారం సమాచారం అందడంతో దాడి చేసిన అధికారులు ముగ్గురినీ అరెస్టు చేసి, సాఫ్ట్వేర్, యాప్‌లతో కూడిన సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్, ఎల్ఈడీ స్క్రీన్లతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. గోవాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, లాడ్జిల్లో ఇలాంటి ముఠాలు మరికొన్ని మకాం వేశాయని అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారాలపై కన్నేసి ఉంచడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. గోవాలో హైదరాబాద్‌కు చెందిన సందీప్ పటేల్, కృష్ణకాంత్, భోజ భూపాల్ యాదవ్ అరెస్టు అయిన విషయాన్ని తెలుసుకున్న ఇక్కడి పోలీసులు స్థానికంగా వీరి వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. బహుమతులిస్తాడు...ఆ తర్వాత దోచేస్తాడు సాక్షి, హైదరాబాద్: వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుని అమ్మాయిలను నమ్మించి బహూమతులతో వారిని మెప్పించి...అవసరమైతే వివాహేతర సంబంధం కొనసాగించి మరీ ఆ తర్వాత బంగారు ఆభరణాలతో ఉడాయిస్తున్న కరుడుగట్టిన నేరగాడిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఇతడి అరెస్టుతో సైబరాబాద్‌తో పాటు ఏపీ, తమిళనాడు, గోవా రాష్ట్రాల్లో 12 కేసులు ఛేదించినట్లయ్యింది. ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సందీప్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా, టంగుటూరు శివాలయం వీధికి చెందిన అబ్దూరి సోమయ్య అలియాస్ సోమయ్య చౌదరి అలియాస్ అక్కినేని కార్తీక్ దారి మళ్లించి సొత్తు దోచుకోవడంలో దిట్ట. సైబరాబాద్‌తో పాటు, ఏపీ, గోవా, తమిళనాడు ప్రాంతాల్లో 12 దొంగతనాలు చేశాడు. లగ్జరీ హోటల్స్‌లో మకాం.. తరచూ హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే సోమయ్య మాదాపూర్, గచ్చిబౌలిలోని లగ్జరీహోటల్స్, గెస్ట్ హౌస్‌లలో బస చేసేవాడు ఉండేవాడు. అక్కడికి వచ్చే యువతులతో వ్యాపారవేత్తగా పరిచయం చేసుకునేవాడు. అనంతరం వారితో సన్నిహితంగా ఉంటూ బహుమతులు ఇచ్చేవాడు. కొన్నిసార్లు వివాహేతర సంబంధం కూడా కొనసాగించేవాడు. అనంతరం అదను చూసుకుని వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలతో పాటు ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లను కొట్టేసేవాడు. సొంతూరికెళ్లి జల్సాలు తన సొంతూరుకు వెళ్లి చోరీ సొత్తును విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సా చేసేవాడు. ఇతని నేరాలపై మాదాపూర్ ఠాణాలో ఫిర్యాదు అందడంతో ఎస్ఓటీ బృందం రంగంలోకి దిగింది. టెక్నికల్ డాటాతో అతనిపై నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు మంగళవారం నగరానికి వచ్చిన అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 12 కేసులకు సంబంధించి రూ.36 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. సోమయ్యపై గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 80 కేసులు ఉన్నాయి. ఆయా కేసుల్లో స్థానిక పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయినా అతని బుద్ధి కూడా మారలేదని, మళ్లీ దొంగతనాల బాట పట్టినట్లు అదనపు డీసీపీ తెలిపారు. అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. నిందితుడిని అరెస్టు చేసిన ఇన్స్పెక్టర్ సుధీర్‌తో పాటు సిబ్బందిని రివార్డులతో సత్కరించారు. సెల్‌ఫోన్ స్నాచింగ్ గ్యాంగ్‌కు చెక్ సాక్షి, హైదరాబాద్: నగరంలోని రద్దీ మార్కెట్లను టార్గెట్‌గా చేసుకుని సెల్‌ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠాకు మొఘల్‌పుర పోలీసులు చెక్ చెప్పారు. ఈ గ్యాంగ్ సూత్రధారి పరారీలో ఉండగా పాత్రధారులైన ఐదుగురిని పట్టుకున్నామని, వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. దక్షిణ మండల డీసీపీ గజరావ్ భూపాల్‌తో కలిసి మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు. అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ నగరంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన బండి రాము, అక్షింతల కళ్యాణ్, మేకల జగపతి బాబు, తోట పోతురాజు, రామ్ చంద్ర ప్రధాన్, సహా ఇద్దరు మైనర్లతో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ప్రశాంత్ ఆదేశాల మేరకు వీరు రద్దీగా ఉన్న మార్కెట్లు, ఇతర ప్రాంతాలకు వెళతారు. టార్గెట్‌గా చేసుకున్న వ్యక్తి చుట్టూ చేరే ఈ ముఠా అతడి దృష్టిని మళ్లిస్తుంది. మిగిలిన వారు అదును చూసుకుని అతడి జేబులోని సెల్‌ఫోన్ తస్కరిస్తారు. దొంగతనం చేసిన ఫోన్‌ను వీరు నేరుగా ప్రశాంత్‌కు అప్పగిస్తారు. అతగాడు దానిని విక్రయించగా వచ్చిన సొమ్ములో కొంత మొత్తం ముఠా సభ్యులకు ఇచ్చేవాడు. వీరు ఇదే పంథాలో నగర వ్యాప్తంగా 26 చోరీలు చేశారు. ఈ గ్యాంగ్ వ్యవహారాలపై పాతబస్తీలోని మొఘల్‌పుర పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన అధికారులు సూత్రధారి మినహా మిగిలిన వారిని పట్టుకున్నారు. -
పిల్లి కోసం కిందకు వంగడంతో..
సాక్షి, గన్నవరం: పాత సామాను కొంటానని నమ్మించిన ఓ దుండగుడు మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కొని ఉడాయించాడు. గన్నవరం మండలం కేసరపల్లిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి వివరాల మేరకు.. కేసరపల్లిలోని పంచాయతీ కార్యాలయం సమీపంలో మూల్పూరు పద్మావతి అనే వివాహిత నివాసముంటోంది. శుక్రవారం మధ్యాహ్నం బైక్‌పై వచ్చిన ఓ యువకుడు.. మీ ఇంట్లో పాత టీవీలు, లేదా సామానులు ఉంటే కొనుగోలు చేస్తాను ఉన్నాయా అని అడిగాడు. అలాంటివేమీ లేవని పద్మావతి సమాధానం ఇచ్చింది. అదే సమయంలో ఇంట్లో ఉన్న పిల్లి పిల్లలను చూసిన అతను ఒక పిల్లను ఇస్తే పెంచుకుంటానని కోరాడు. దీనికి అంగీకరించిన పద్మావతి పిల్లి పిల్లను యువకుడికి అందించేందుకు కిందకు వంగింది. అదే సమయంలో యువకుడు ఆమె మెడలో ఉన్న 6 కాసుల బంగారు గొలుసు లాక్కొని, అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న బైక్‌పై పరారయ్యాడని బాధితురాలు తెలిపింది. రెప్పపాటులో మెడలో గొలుసు లాక్కొని దుండగుడు జారుకున్నాడని వాపోయింది. ఈమేరకు గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పంచాయతీ కార్యాలయంలో ఉన్న సీసీ టీవీ పుటేజ్ పరిశీలించిన పోలీసులు నిందితుడు కోసం గాలిస్తున్నారు. (చదవండి: కరోనా బాధితురాలిపై డ్రైవర్ లైంగిక దాడి) -
సింగిల్ హ్యాండ్ స్నాచర్!
సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా చైన్ స్నాచింగ్ కేసుల్లో కనీసం ఇద్దరు నిందితులు ఉంటుంటారు. ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ పంజా విసురుతుంటారు. ఒకరు వాహనం నడిపితే... మరొకరు వెనుక కూర్చుని టార్గెట్ చేసిన వారి మెళ్లో గొలుసులు లాగేస్తుంటారు. అయితే మహారాష్ట్రకు చెందిన అంతరాష్ట్ర నేరగాడు శంకర్రావు బిరాదర్ స్టైలే డిఫరెంట్ ఇతగాడు సింగిల్‌గానే సంచరిస్తూ స్నాచింగ్స్ చేయడం మొదలెట్టాడు. ఈ ఘరానా నేరగాడిని తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి బషీర్‌బాగ్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. పౌల్ట్రీ ఫామ్ సోదరుడి పాలుకావడంతో... మహారాష్ట్రలోని లాథూర్ జిల్లా, ప్రకాష్‌నగర్‌కు చెందిన శంకర్రావు తన స్వస్థలంలో సోదరుడితో కలిసి పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేశాడు. కొన్నేళ్ల పాటు వీరి వ్యాపారం సజావుగానే సాగింది. వ్యాపారంలో భారీ లాభాలు వస్తుండటంతో శంకర్రావు తమ్ముడి బుద్ధి మారింది. ఆ ఫౌల్ట్రీ ఫామ్‌ను సొంతం చేసుకున్న అతగాడు శంకర్రావును వెళ్లగొట్టాడు. దీంతో తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం నేరాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. లాథూర్‌కు చెందిన రాజు అనే పాత నేరగాడితో కలిసి రంగంలోకి దిగాడు. వీరిద్దరూ 2018లో కేవలం మూడు నెలల్లోనే 47 నేరాలు చేశారు. వీటిలో 33 చైన్ స్నాచింగ్స్ కాగా... 14 బైక్ చోరీ కేసులు ఉన్నాయి. పుణే కమిషనరేట్ పరిధిలోని 20 పోలీసుస్టేషన్లలో నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. వివిధ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించిన అక్కడి పోలీసులు రాజును గుర్తించారు. దీంతో వలపన్ని అతడితో పాటు శంకర్రావును 2018 సెప్టెంబర్‌లో పుణేలోని హడప్సర్ పోలీసులు అరెస్టు చేశారు. అలా కాకూడదనే... పుణేలో తాను చిక్కడానికి రాజుతో జట్టు కట్టడమే కారణమని భావించిన శంకర్రావు మరోసారి అలా జరగకూడదని జైల్లో ఉండగానే నిర్ణయించుకున్నాడు. యరవాడ సెంట్రల్ జైలు నుంచి ఈ ఏడాది జనవరిలో బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తర్వాత కొన్ని రోజులు మిన్నకుండిపోయిన ఇతగాడు ఆపై తాను ఎవరో తెలియని హైదరాబాద్ నగరాన్ని టార్గెట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వరుసపెట్టి 20–30 స్నాచింగ్స్ చేసి స్వస్థలానికి వెళ్ళిపోవాలని పథకం వేశాడు. ఈ నెల మొదటి వారంలో నగరానికి వచ్చిన ఇతను దినసరి కూలీగా చెప్పుకుంటూ కాటేదాన్ ప్రాంతంలో ఓ చిన్న గది అద్దెకు తీసుకున్నాడు. ఈ నెల 19న లంగర్‌హౌస్ పరిధిలో ఓ బైక్ చోరీ చేశాడు. దానిపై తిరుగుతూ రెక్కీ చేసిన ఇతగాడు ఆదివారం రంగంలోకి దిగాడు. కాచిగూడ, ఎస్సార్‌నగర్ పరిధిల్లో రెండు స్నాచింగ్స్ చేశాడు. దీనిపై స్థానిక పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సైలు సి.వెంకటేష్, జి.శ్రీనివాస్‌రెడ్డి, గోవింద్ స్వామిలతో కూడిన బృందం రంగంలోకి దిగింది. ఘటనాస్థలాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో ఫీడ్ సేకరించిన వారు దానిని ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఫలితంగా నిందితుడి గుర్తించి గురువారం పట్టుకున్నారు. ఇతడి నుంచి బైక్, 5.5 తులాల బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. -
స్నాచింగ్ చేసిన మరుసటి రోజు మరో చోరీ
సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడి, మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన ద్వయం శక్తి మయూర్, కాలా వికాస్ విచారణలో మరో నేరం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శక్తి మయూర్ ప్రోద్బలంతో ఈ ద్వయం స్నాచింగ్ చేసిన మరుసటి రోజు మరో ఇద్దరితో కలిసి అఫ్జల్‌గంజ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ బార్లో చోరీ చేసినట్లు తేలింది. మయూర్,వికాస్‌లను సోమవారం అరెస్టు చేసిన సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఈ విషయం గుర్తించింది. దీంతో మంగళవారం మిగిలిన ఇద్దరు నిందితుల్నీ పట్టుకుంది. వీరిని తదుపరి చర్యల నిమిత్తం అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. ఇప్పటికే ముషీరాబాద్ పోలీసులు రిమాండ్‌కు తరలించిన మయూర్‌ను ఈ కేసులో పీటీ వారెంట్‌పై అరెస్టు చేయనున్నారు. జల్సాల కోసం జత కలిసి.. పురానాపూల్‌లోని ఎస్వీనగర్‌కు చెందిన శక్తి మయూర్ తారామండల్ కాంప్లెక్స్‌లోని ఓ ప్రైవేట్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. పదో తరగతి వరకు గజ్వేల్‌లో చదివిన ఇతగాడు ఆపై చదువుకు స్వస్తి చెప్పి సిటీకి వచ్చేశాడు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చెడు వ్యసనాలకు లోనయ్యాడు. స్నేహితులతో కలిసి జల్సాలు చేయడానికి అలవాటుపడ్డాడు. మద్యం, జూదం తదితర వ్యసనాలకు బానిసైన ఇతగాడికి పురానాపూల్‌కు చెందిన కాలా వికాస్‌లో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరూ కలిసి సంచరించడం మొదలెట్టారు. వీరికి తాము చేస్తున్న ఉద్యోగాల్లో నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఆదాయం వచ్చేది. వ్యసనాలకు బానిసలైన వీరికి ఆ మొత్తం సరిపోయేది కాదు. దీంతో తేలిగ్గా డబ్బు పంపాదించడానికి నేరాలు చేయాలని శక్తి మయూర్ పథకం వేశాడు. దీనికి వికాస్ కూడా అంగీకరించడంతో ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై మధ్య మండల పరిధిలోని అనేక ప్రాంతాల్లో రెక్కీ చేశారు. రెండుమూడు రోజుల పరిశీలన అనంతరం ముషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఎస్బీఐ కాలనీలో స్నాచింగ్ చేయడం అనువని గుర్తించారు. దీంతో ఈ నెల 7న తమ వాహనంపై మరోసారి అక్కడికి వెళ్లారు. వాకింగ్‌కు వచ్చిన పార్వతిదేవి అనే వృద్ధురాలి మెడలోంచి మూడు తులాల బంగారం గొలుసు లాక్కుపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో ముషీరాబాద్ ఠాణాలో కేసు నమోదైంది. కేసు ఛేదించిన క్రమంలో.. కేసును ఛేదించేందుకు మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల్ జావేద్ నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీనివాసులు, మహ్మద్ షానవాజ్ షరీఫ్ టి.శ్రీధర్ రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌తో పాటు సాంకేతిక ఆధారాలతో కేసు ఛేదించి మయూర్, వికాస్‌లను పట్టుకున్నారు. మయూర్ వ్యవహారాన్ని అధికారులు అనుమానించారు. అతడు మరికొన్ని నేరాలు చేసి ఉండవచ్చని భావించారు. ఈ కోణంలో లోతుగా ఆరా తీయగా.. మరో ముగ్గురితో కలిసి ఈ నెల 8 రాత్రి అఫ్జల్‌గంజ్ పరిధిలోని ఓ మూసి ఉన్న బార్లో చోరీ చేసినట్లు వెల్లడైంది. పురానాపూల్‌కు చెందిన కె.ఆతిష్, షాహినాయత్‌గంజ్‌కు చెందిన ఎం.కనిష్క్లతో కలిసి మయూర్, వికాష్‌లు చోరీలకు స్కెచ్ వేశారు. కోవిడ్ నిబంధనల్లో భాగంగా నగర వ్యాప్తంగా బార్ అండ్ రెస్టారెంట్లు మూసి ఉంటాయని, వాటిని టార్గెట్ చేసుకుంటే తాము చిక్కబోమని పథక రచన చేశారు. అఫ్జల్‌గంజ్ పరిధిలో సీబీఎస్‌కు సమీపంలో ఉన్న రవీంద్ర బార్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు. ఈ నెల 8న తెల్లవారుజామున నలుగురూ కలిసి అక్కడకు చేరుకున్నారు. మయూర్, వికాస్‌లు బయట ఉండి పరిస్థితులు గమనిస్తుండగా.. మిగిలిన ఇద్దరూ కిటికీ పగల కొట్టడం ద్వారా బార్లోకి ప్రవేశించారు. ఆ బార్ మొదటి అంతస్తు నుంచి 20 మద్యం బాటిళ్లను చోరీ చేసుకువచ్చారు. వీటిలో 18 బాటిళ్లను విక్రయించిన ఈ నలుగురూ ఆ డబ్బును పంచుకుని జల్సాలు చేశారు. దీనిపై అఫ్జల్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సోమవారం మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన మయూర్, వికాస్‌ల విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆతిష్, కనిష్క్లను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ వీరి నుంచి రూ.10 వేల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుంది. వీరిని తదుపరి చర్యల నిమిత్తం అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించింది. ఇప్పటికే మయూర్, వికాస్‌లను ముషీరాబాద్ పోలీసులు స్నాచింగ్ కేసులో రిమాండ్ చేశారు. దీంతో అఫ్జల్‌గంజ్ పోలీసులు బార్ చోరీ కేసులో వీరిపై కోర్టు ద్వారా పీటీ వారెంట్ తీసుకుని అరెస్టు చేయనున్నారు. -
లాక్డౌన్: చైన్ స్నాచింగ్..!
ఒడిశా, బరంపురం: కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కఠినతరంగా అమలు చేస్తున్నారు. ఇదే అదను చూసుకుని కొంతమంది దుండగులు రెచ్చిపోతున్నారు. ఒకప్పుడు నేరాలకు నిలయంగా ఉన్న బరంపురం నగరం లాక్డౌన్ కారణంగా ప్రశాతంగా ఉందనుకున్న తరుణంలో నగరంలో ఆదివారం జరిగిన చైన్‌స్నాచింగ్ సంఘటన కలకలం రేపింది. ఉదయం పెద్దబజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంద్రమా వీధిలో ఉన్న మార్కెట్‌కు వచ్చిన ఓ మహిళ మెడలో నుంచి 2 తులాల బంగారం చైన్‌ను కొంతమంది దుండగులు లాక్కొని పరారయ్యారు. మోటారుబైక్‌లపై వచ్చిన వారు బాధితురాలు తిరిగి చూసేంతలోపే వారు అక్కడి నుంచి పరారుకావడం గమనార్హం. ఇదే విషయంపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల జాడ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. చోరీ విఫలయత్నం బరంపురం: బీఎన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాబానగర్ 3వ లైన్లో ఓ మహిళ మెడలో నుంచి బంగారం చైన్‌ను లాక్కొని పరారయ్యేందుకు దుండగులు చేసిన ప్రయత్నం విఫలమైంది. పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అక్కడి మహిళ మెడలో చైన్‌ను లాగేందుకు ప్రయత్నించారు. అయితే అది సకాలంలో తెగకపోవడంతో బాధిత మహిళ అప్రమత్తమైంది. దీంతో వారు అక్కడి నుంచి హుటాహుటిన పరారయ్యారు. అనంతరం బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లాక్డౌన్ వేళ.. దుండగుల ఆగడాలకు అడ్డు లేకుండా పోతోందని నగరవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోలింగ్ చర్యలు ముమ్మరం చేయాలని పోలీసులను కోరుతున్నారు. -
మైనర్ డ్రైవింగ్... మేజర్ స్నాచింగ్!
సాక్షి, సిటీబ్యూరో: మైనర్‌తో కలిసి ముఠా కట్టిన ఓ పాత నేరగాడు సెల్‌ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. బాలుడు వాహనాన్ని నడుపుతుండగా... మేజర్ ఈ నేరం చేశాడు. వీరిద్దరినీ శుక్రవారం పట్టుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు వాహనం, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారని డీసీపీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా బాలాజీనగర్‌కు చెందిన వేముల బాలరాజ్ తొమ్మిదో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పి లేథ్ మిషన్ వర్కర్‌గా మారాడు. వ్యవసనాలకు బానిసకావడంతో తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించాడు. గత ఏడాది తన స్నేహితుడితో కలిసి ముఠా కట్టి కొన్ని నేరాలు చేశాడు. కుషాయిగూడ పోలీసులు ఈ ఇద్దరినీ అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన బాలరాజ్ తన ప్రాంతానికే చెందిన ఓ మైనర్‌తో కలిసి రంగంలోకి దిగాడు. సెల్‌ఫోన్ స్నాచింగ్ చేయాలని నిర్ణయించుకున్న ఇద్దరూ నాంపల్లి పరిధిలో ఓ నేరం చేశారు. మైనర్ వాహనం నడుపుతుండగా వెనుక కూర్చున్న బాలరాజ్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి నుంచి సెల్‌ఫోన్ లాక్కుపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నాంపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరిద్దరి కదలికలపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల్ జావేద్ నేతృత్వంలో ఎస్ఐలు మహ్మద్ షానవాజ్ షఫీ, కె.శ్రీనివాసులు వలపన్ని శుక్రవారం పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం ఇద్దరినీ నాంపల్లి పోలీసులకు అప్పగించారు. -
రగ్బీ టీం కోసం దొంగయ్యాడు!
అడ్డగుట్ట: రైల్వే ప్రయాణికులను టార్గెట్ చేసుకొని వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ తాత్కాలిక హోంగార్డును నిజామాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం సికింద్రాబాద్‌లోని రైల్వే ఎస్పీ కార్యాలయంలో దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ అనురాధ మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన మోహన్‌దేవ్‌రావు చావన్ (28) నాందేడ్ జిల్లాలో హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఒక టీంను తయారు చేసి రగ్బీ ఆడిపించాలనే ఉద్దేశంతో పలువురికి ఉచితంగా కోచింగ్ ఇచ్చేవాడు. ఈ క్రమంలో గేమ్‌కు సంబంధించి బాల్స్, డ్రెస్‌లు, ఇతర మెటీరియల్స్‌కు డబ్బులు లేకపోవడంతో ఈజీ మనీకి అలవాటుపడ్డాడు. నాందేడ్ జిల్లాలోని చిక్కల తండాకు చెందిన ప్రదీప్‌తో కలసి చైన్ స్నాచింగ్‌లు ప్రారంభించాడు. ఒకే ట్రైన్లో 8 స్నాచింగ్‌లు 2019 నుంచి మోహన్‌దేవ్‌రావు, ప్రదీప్‌లు ఒకే ఏడాదిలో 8 చోరీలు చేశారు. బాసర రైల్వే స్టేషన్లో నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులోనే ఈ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఆభరణాలను ముంబైలో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. మిగతా వాటిని విక్రయించేందుకు మోహన్ దేవ్‌రావు నిజామాబాద్ వచ్చాడు. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు స్టేషన్లో అతన్ని పట్టుకున్నారు. విచారణ జరుపగా నేరాలను ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి 116 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.50 లక్షలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు ప్రదీప్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
మూడు నెలల్లో మూడోసారి!
సాక్షి, సిటీబ్యూరో: ద్విచక్ర వాహనాలు చోరీ, సెల్‌ఫోన్స్ స్నాచింగ్స్ చేస్తూ రెచ్చిపోతున్న చోరులు మరోసారి చిక్కారు. దీంతో కలిపి వీరిలో ఓ నిందితుడు, గడచిన మూడు నెలల్లో వీరు కటకటాల్లోకి చేరడం ఇది మూడోసారి. తాజాగా రెండు వాహనచోరీలు, రెండ్ సెల్‌ఫోన్ స్నాచింగ్ కేసుల్లో ఇద్దరిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి ఓ బైక్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. ఫీల్‌ఖానా ప్రాంతానికి చెందిన షేక్ అస్లం వస్త్రదుకాణంలో సహాయకుడిగా పని చేస్తున్నాడు. హబీబ్‌నగర్ పరిధిలోని శాంతి నగర్‌కు చెందిన నసీర్ ఖాన్ మల్లేపల్లిలోని కిరాణా దుకాణంలో పని చేస్తున్నాడు. వీరిద్దరూ బాల్యస్నేహితులు. మల్లేపల్లికి చెందిన విద్యార్థి సోహైల్ ఫర్దీన్ ఖాన్ వీరితో జట్టుకట్టాడు. ఈ త్రయం జల్సాలకు అవసరమైన డబ్బు కోసం వాహన దొంగతనాలు, సెల్‌ఫోన్ స్నాచింగ్స్ చేయడం మొదలెట్టారు. గతంలో నాంపల్లి, హుమాయున్‌నగర్, సైఫాబాద్, కూకట్పల్లి, రాజేంద్రనగర్ పరిధుల్లో చోరీలు, దోపిడీలకు పాల్పడ్డారు. సాహిల్, నసీర్లను గత ఏడాది డిసెంబర్ 19న సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజులకు సోహైల్, 12 రోజులకు నసీర్ బెయిల్‌పై బయటకు వచ్చారు. గత నెలలో సోహైల్‌ను హబీబ్‌నగర్ పోలీసులు మరో కేసులో జైలుకు పంపారు. ఈ కేసులో బయటకు వచ్చిన అతగాడు మిగిలిన ఇద్దరినీ తరచు కలుస్తుండేవాడు. మద్యం, గంజాయి తదితరాలకు అవసరమైన ఖర్చుల కోసం మళ్లీ నేరాలు చేయడానికి సిద్ధమయ్యారు. అర్ధరాత్రి వేళల్లో సంచరిస్తూ ద్విచక్ర వాహనాల దొంగతనాలు, రోడ్డుపై వెళ్తున్న వ్యక్తుల నుంచి సెల్‌ఫోన్ స్నాచింగ్స్ ప్రారంభించారు. మార్కెట్, బేగంపేట ఠాణాల పరిధి నుంచి వాహనాలు, షాహినాయత్‌గంజ్, సైఫాబాద్ పరిధుల నుంచి సెల్ఫోన్లు తస్కరించారు. వాహనంపై అనుమానాస్పదంగా సంచరిస్తున్న సోహైల్‌ను పట్టుకున్న హబీబ్‌నగర్ పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో ఆ వాహనం మార్కెట్ పరిధి నుంచి చోరీ చేసిందని తేలడంతో ఆ ఠాణాకు అప్పగించారు. ఇతడితో కలిసి నేరాలు చేసిన మిగిలిన ఇద్దరి కోసం వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు, పి.మల్లికార్జున్, మహ్మద్ ముజఫర్ అలీ, ఎన్.రంజిత్‌కుమార్ రంగంలోకి దిగారు. మంగళవారం ఇరువురినీ పట్టుకుని వీరి నుంచి మరో బైక్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుల్ని మార్కెట్ పోలీసులకు అప్పగించారు. -
గర్ల్‌ఫ్రెండ్.. లగ్జరీ లైఫ్
సాక్షి, సిటీబ్యూరో: అభివృద్ధి చెందిన కొత్త కాలనీల్లో నిర్మానుష్యంగా ఉన్న ఇళ్లలోని ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలను దొంగిలిస్తున్న ఇద్దరిని మల్కాజిగిరి సెంట్రల్ క్రైమ్ స్టేషన్, మేడిపల్లి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చెంగిచర్లలోని కనకదుర్గా కాలనీలో నివాసముంటున్న అసురెడ్డి బాలమణి ఇంట్లో గతేడాది డిసెంబర్ 19న చోరీ చేసిన పప్పుల భానువికాస్, సకినాల మానసను పట్టుకున్నారు. రాచకొండ క్రైమ్స్ డీసీపీ పి.యాదగిరి కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామానికి చెందిన భానువికాస్ ప్రస్తుతం మేడిపల్లిలోని కమలానగర్లో ఉంటున్నాడు. వరంగల్ జిల్లా ఆరెపల్లిలో పదో తరగతి చదివిన సమయంలో భానువికాస్‌కు అతని సోదరి క్లాస్మేట్ మానస పరిచయంతో స్నేహితులుగా మారారు. ప్రస్తుతం ఆమె ఉప్పల్ శాంతినగర్‌లో ఉంటోంది. 2012– 16 మధ్యకాలంలో యనంపేటలోని ఎస్ఎన్ఐటీ కాలేజీ నుంచి బీటెక్ ఈసీఈ చదివిన భానువికాస్ ప్రస్తుతం జోమాటాలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడటంతో పాటు లగ్జరీ లైఫ్ కోసం గర్ల్‌ఫ్రెండ్ మానసతో కలిసి చోరీలకు ప్లాన్ చేశాడు. మంచినీళ్లు కావాలంటారు..పెప్పర్‌స్ప్రే చల్లుతారు భానువికాస్, మానసలు కలిసి బైక్‌పై వెళ్లి నిర్మానుష్య ప్రాంతం, కొత్తగా అభివృద్ధి చెందిన కాలనీలో దూరం దూరంగా ఉండే ఇళ్లలోని ఒంటరి మహిళలను గుర్తిస్తారు. మంచినీళ్లు కావాలంటూ మాటల్లో దింపుతారు. పెప్పర్‌స్ప్రే చల్లి మహిళల మెడలోని బంగారు నగలతో ఉడాయిస్తుంటారు. ఈ క్రమంలో చెంగిచర్లలో గత ఏడాది డిసెంబర్ 19న చోరీ చేశారు. పోచారం ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న తన కూతురు శ్రావణిని బస్‌స్టాప్ వద్దకు పంపించి తిరిగి చెంగిచర్లలోని తన ఇంటికి వచ్చిన బాలమణి ఒంటరిగా ఉంది. ఇది గుర్తించిన భానువికాస్, మాసనలు మంచినీళ్లు కావాలంటూ అడిగారు. నీరు తీసుకొస్తున్న సమయంలో ఆమె ముఖంపై పెప్పర్ స్ప్రే కొట్టి మూడు తులాల బంగారు పుస్తెలతాడును తెంచుకొని పరారయ్యారు. పట్టించిన బైక్.. బాధితురాలు చెప్పిన వివరాలతో పాటు ఆయా కాలనీల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా టీఎస్03 ఈటీ 1326 హోండా యాక్టివా మోటార్ సైకిల్‌ను గుర్తించారు. చోరీ జరిగిన నాటి నుంచి ఈ వాహనంపై పోలీసులు నిఘా వేస్తారని గమనించిన నిందితులు చాకచక్యంగా వ్యవహరించి దానిని వినియోగించలేదు. తమపై నిఘా తగ్గిందన్న ఉద్దేశంతో 40 రోజుల తర్వాత ఆ బైక్‌పైనే నిందితులిద్దరూ బోడుప్పల్ కమాన్ వైపు వెళుతున్నారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు వాహన తనిఖీ చేస్తున్నారు. దీంతో ఆ బైక్‌తో పాటు ఆ ఇద్దరిని పట్టుకున్నారు. మూడు తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. -
కళ్లల్లో కారం చల్లి గొలుసు చోరీ
ప్రకాశం,పెదకండ్లగుంట (కొండపి): మండలంలోని పెదకండ్లగుంటలో పొలానికి వెళ్లిన ఇద్దరు మహిళల కళ్లల్లో కారం కొట్టిన ఆగంతకుడు ఒకరి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన సంఘటన సోమవారం జరిగింది. బాధితురాలు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొల్లా రమణమ్మ తన తోటి కోడలు నారాయణమ్మతో కలిసి గ్రామానికి దక్షిణం పైపున ఉన్న తమ పొలంలో సాగు చేసిన కంది, శనగ పైరును చూసేందుకు బయల్దేరారు. పెదకండ్లగుంట–ఇలవర మెటల్ రహదారి మీదగా గ్రామానికి సుమారు కిలోమీటరు దూరం నడిచిన తర్వాత ద్విచక్ర వాహనంపై ఆగంతకుడు వారిని రెండుసార్లు దాటి వెనక్కి ముందుకు వెళ్లాడు. మహిళలను మూడోసారి క్రాస్ చేస్తూ వెనుక నడుస్తున్న నారాయణమ్మ కళ్లల్లో ముందుగా కారం కొట్టాడు. ఆమె అరుస్తూ కళ్లు నలుపుకుంటుండగా ముందు నడుస్తున్న రమణమ్మ కళ్లల్లో సైతం కారం కొట్టాడు. అమాంతం ఆమె మెడలోని 2.5 సవర్ల బంగారు చైనును లాక్కున్నాడు. రమణమ్మ సైతం అరుస్తూ ఆగంతకుడి చొక్కా పట్టుకోగా గింజుకుని చొక్కాను వదిలించుకుని పొలాల్లో నుంచి కొత్తపాలెం వైపు పారిపోయాడు. మహిళల అరుపులు విన్న పక్క పొలాల్లోని కొందరు వచ్చి గ్రామస్తులకు ఫోన్లో సమాచారం అందించారు. ఆంగంతకుడు బ్లూ టీషర్ట్, లుంగీ కట్టుకుని ఉన్నాడని, బట్టతల కూడా ఉందని బాధిత మహిళలు చెప్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. చుట్టు పక్కల గాలించినా నిందితుడి ఆచూకీ దొరకలేదు. విషయం తెలుసుకున్న సింగరాయకొండ సీఐ టీఎక్స్ అజయ్‌కుమార్ సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. అనంతరం బాధితులు, గ్రామస్తులతో మాట్లాడారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. -
గోపాలపట్నంలో స్నాచింగ్ కలకలం
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): గోపాలపట్నంలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. కారులో కూర్చుని ఉన్న మహిళ మెడలో సుమారు పదిన్నర తులాల బంగారు నగలు తెంచుకుని పారిపోయాడు. గోపాలపట్నం నేర విభాగం పోలీసులు తెలిపిన వివరాలు.. గురువారం సాయంత్రం గృహ ప్రవేశం కార్యక్రమానికి పెదగంట్యాడ వుడాకాలనీ నుంచి కుటుంబ సభ్యులతో గోపాలపట్నం మౌర్య సినిమాహాలు ఎదురుగా ఉన్న ఇంటికి వచ్చారు. అయితే గానుగుల వరలక్ష్మి మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆమెను కారులో ఉంచి గృహప్రవేశం జరుగుతున్న ఇంటికి కుటుంబ సభ్యులు వెళ్లారు. వరలక్ష్మి గాలి ఆడకపోవడంతో కారు తలుపు తెరిచి విశ్రాంతి తీసుకుంటోంది. ఇది గమనించిన దొంగ నడుచుకుంటూ వచ్చి ఒక్కసారిగా మెడలో ఉన్న రెండున్నర తులాల నల్లపూసల దండ, 3 తులాల పుస్తెల తాడు, మూడు తులాల మూడు పేటల గొలుసు, 2 తులాల పగడాల గొలుసు తెంచుకొని గోపాలపట్నం వైపు పారిపోయాడు. అప్రమత్తమైనా.. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఆమె గొలుసు పట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో చేతిలో పుస్తెలు.. గొలుసుల్లో చిన్నచిన్న ముక్కలు ఆమె చేతిలో ఉన్నాయి. ఆభరణాలు పట్టుకునే ప్రయత్నంలో ఆమె చేతికి గాయాలయ్యాయి. సుమారు పదిన్నర తులాల బంగారు ఆభరణాలు పోయినట్లు బాధితులు చెబుతున్నారు. సీఐ కాళిదాసు, ఎస్ఐలు బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఏఎస్ఐ సత్యనారాయణ, రైటర్ సామ్యూల్ దర్యాప్తు చేస్తున్నారు. చురుగ్గా సాగిన దర్యాప్తు అప్రమత్తమైన గోపాలపట్నం నేర విభాగం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. స్థానికంగా ఉన్న దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీలను పరిశీలించి పారిపోయిన దొంగ ఫుటేజీ సేకరించారు. దీని ద్వారా దొంగను పట్టుకుంటామని చెబుతున్నారు. -
కుమార్తె దావత్ కోసం చైన్‌స్నాచింగ్
చిలకలగూడ : ఓ వ్యక్తి అప్పు చేసి కుమార్తె పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించాడు. అప్పు తీర్చేందుకు ఇద్దరు మిత్రులతో కలిసి అదే రోజు చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులకు చిక్కి కటకటాల పాలైన సంఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. సీఐ బాలగంగిరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చిలకలగూడ శ్రీనివాసనగర్‌కు చెందిన గోవింద్ తండ్రి రాజేందర్ అస్వస్థతకు గురై వారాసిగూడలోని శ్రీదేవి నర్సింగ్‌హోంలో చికిత్స పొందుతున్నాడు. గతనెల 30న రాత్రి గోవింద్ మందులు తీసుకుని వారాసిగూడ మీదుగా ఆస్పత్రికి వెళుతుండగా శివాజీ విగ్రహం సమీపంలో ఎదురుగా బైక్‌పై వచ్చిన ముగ్గురు అగంతకులు అతడిపై దాడిచేసి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజీ ఆధారంగా పట్టివేత తార్నాక, మాణికేశ్వరీనగర్కు చెందిన గండికోట ప్రభు ప్యారడైజ్‌లోని సన్‌షైన్ ఆస్పత్రిలో ట్రాన్స్పోర్ట్ బాయ్‌గా పని చేసేవాడు. గత నెల 30న తన కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా సన్నిహితుల వద్ద అప్పు చేసి బంధువులకు విందు ఇచ్చాడు. అదే రోజు రాత్రి స్నేహితుడి బైక్‌పై తన మిత్రులు వెంకటేష్, సందీప్‌తో కలిసి వారాసిగూడలో మద్యం తాగారు. అనంతరం ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్ తదితర ప్రాంతాల్లో తిరిగి చిలకలగూడ మీదుగా ఇంటికి వస్తుండగా ఒంటరిగా నడిచి వెళుతున్న గోవింద్ కనిపించాడు. వెంకటేష్ బైక్ నడుపుతుండగా, ప్రభు, సందీప్ వెనుక కూర్చున్నారు. గోవింద్ వద్దకు రాగానే సందీప్ గట్టిగా కేక వేసి అతడిని ఉలిక్కిపడేలా చేయగా, ప్రభు అతని మెడలోని బంగారు గొలుసు లాక్కున్నాడు. ముగ్గురు క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు. నాలుగు నంబర్లతో ఆచూకీ... బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. 5838 నంబర్ ఆధారంగా ముందుకు వెళ్లిన పోలీసులు బైక్ నంబర్ ఏపీ 10ఏకే 5838 గా గుర్తించి వాహన యజమానిని అదుపులోకి తీసుకుని విచారించారు. గండికోట ప్రభు తన వాహనాన్ని తీసుకువెళ్లాడని, ఇంతవరకు తిరిగి ఇవ్వలేదని అతను చెప్పాడు. దీంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు బుధవారం రాత్రి వారాసిగూడ చౌరస్తాలో నిందితుడు ప్రభును అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించాడు. ఆరు ఠాణాలు.. ఎనిమిది కేసులు... ప్రధాన నిందితుడు గండికోట ప్రభు అలియాస్ బన్నీపై ఉస్మానియా యూనివర్సిటీ, చిలకలగూడ, ఉప్పల్, గోపాలపురం, అంబర్‌పేట, కరీంనగర్జిల్లా పెద్దపల్లి ఠాణాల్లో ఎనిమిది కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి 8 గ్రాముల బంగారు గొలుసు, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసును చేధించిన చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, డీఐ సంజయ్‌కుమార్, డీఎస్ఐ శ్రీనివాస్, క్రైంటీం చక్రపాణి, మజహర్, వెంకటరమణ, ప్రకాశ్, విజయ్, వసీ, లక్ష్మణ్, నాగేశ్వర్, వెంకటేష్, రాయుడు, పెంచలయ్యలను నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్, గోపాలపురం ఏసీపీ వెంకటరమణ అభినందించి ప్రత్యేక రివార్డులు అందించారు. -
పట్టపగలే షాకింగ్ ఘటన..
-
ఒంటరి మహిళలే టార్గెట్
నేరేడ్మెట్: బైక్‌పై కాలనీల్లో తిరుగుతూ అతి చిన్న కత్తితో ఒంటరి మహిళలను బెదిరించి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న యువకుడిని ఎల్బీ.నగర్ సీసీఎస్, క్రైం పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్‌లో సీపీ మహేష్‌భగవత్ వివరాలు వెల్లడించారు. హర్యానా రాష్ట్రం, బివాని జిల్లా, బర్సి గ్రామానికి చెందిన ఖుసారియా దతారామ్ బాలాపూర్‌లోని జిల్లెలగూడ దత్తునగర్‌లో ఉంటూ కొత్తపేటలోని మోర్ సూపర్ మార్కెట్లో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. డ్యూటీ ముగిసిన అనంతరం బైక్‌పై ఎల్బీనగర్, సరూర్‌నగర్, మీర్పేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని కాలనీల్లో తిరుగుతూ..ఒంటరి మహిళలు, యువతులను వెంబడించి చెయిన్ స్నాచింగ్‌కు పాల్పడటంతోపాటు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. మంగళవారం ఎల్బీ.నగర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన దతారామ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నేరాలు అంగీకరించాడు. అతడి నుంచి బుల్లి కత్తి, రూ.35వేల విలువైన చోరీ సొత్తుతోపాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. క్రైం ఇన్చార్జి డీసీపీ నారాయణరెడ్డి, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
చైన్ స్నాచింగ్ ఇరానీ గ్యాంగ్ పనే..
సాక్షి, జోగిపేట : జోగిపేట పట్టణంలో వరుస చైన్ స్నాచింగ్‌లతో బెంబేలెత్తించిన బీదర్ దొంగలను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వరుసగా మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులను ఎత్తుకెళ్తున్న సంఘటనలు జరుగుతుండడంతో అప్రమత్తమైన పోలీసులు నిఘా పెంచారు. అనుమానంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోని తీసుకొని విచారించగా పట్టణంలో జరిగిన దొంగతనాలను తామే చేశామని, తమతో పాటు మహేష్, మమ్ములు ఉన్నారని ఒప్పుకున్నారు. బీదర్‌లోని ఇరానీ గ్యాంగ్‌గా పోలీసులు నిర్దారణకు వచ్చారు. పట్టణంలో ఇప్పటి వరకు జరిగిన చైన్ స్నాచింగ్ కేసుల్లో సుమారుగా 35 తులాల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. దొంగతనాన్ని అంగీకరించిన ఇద్దరు దొంగలు బంగారం తమ వద్ద లేదని, అమ్ముకొని ఖర్చు చేశామని చెప్పినట్లు సమాచారం. నిందితుల వద్ద ఉన్న బైకు, రూ.3 వేలు మాత్రం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. దొంగల వద్ద నుంచి రికవరీ చేసేందుకు పోలీసులు అష్టకష్టాలు పడ్డా లాభం లేకుండా పోయింది. అయితే మరో ఇద్దరిని పట్టుకొని వారి వద్ద నుంచి రికవరీ చేస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. చైన్ స్నాచింగ్ దొంగలు దొరకడంతో స్థానికంగా మహిళలు ఊపిరి పీల్చుకున్నారు. ఇది కచ్చితంగా ఇరానీ గ్యాంగ్ పనే.. జోగిపేటలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసుల్లో ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు జోగిపేట సీఐ తిరుపతిరాజు తెలిపారు. సోమవారం సీఐ కార్యాలయంలో ఎస్ఐలు వెంకటరాజాగౌడ్, ప్రభాకర్లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ దొంగతనాలకు పాల్పడింది బీదర్‌లోని ఇరానీ గ్యాంగ్ సభ్యులేనని విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి సీఐ వివరిస్తూ.. జోగిపేటలో ఆదివారం హనుమాన్ చౌరస్తాలో ఎస్ఐ వాహనాలను తనిఖీ చేస్తుండగా బీదర్‌కు చెందిన జాఫర్ అలీ, సత్తాజ్ అలీ అనే ఇద్దరు వ్యక్తులు బైకుపై అనుమానస్పదంగా కనిపించారని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా జోగిపేట, జహీరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, తాండూర్, బాల్కిలలో ఇప్పటి వరకు దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారని తెలిపారు. జనవరిలో జోగిపేట క్లాక్‌టవర్ వద్ద మూడున్నర తులాలు, వడ్డెర బస్తీ వద్ద మూడు తులాలు, మేలో వాసవీనగర్‌లో తొమ్మిదిన్నర తులాల బంగారు గొలుసులు, అదే నెలలో నారాయణఖేడ్‌లో రెండు తులాల బంగారు గొలుసులు దొంగిలించినట్లుగా ఒప్పుకొని దొంగతనం చేసిన ప్రదేశాలను సైతం చూపించారని సీఐ వివరించారు. వట్పల్లి బ్యాంకు వద్ద గత నెల ప్రస్తుతం దొరికిన జాఫర్‌తో పాటు బీదర్‌కు చెందిన నవాబ్లు బ్యాంకు వచ్చిన వ్యక్తికి మాయమాటలు చెప్పి తప్పుదోవ పట్టించి రూ.15 వేలు ఎత్తుకెళ్లారని తెలిపారు. పరారీలో ఉన్న మమ్ము, మహేష్ అలియాస్ సోనియాలను కూడా పట్టుకుంటామని సీఐ పేర్కొన్నారు. ఈ కేసులో జోగిపేట, వట్పల్లి ఎస్ఐలు కష్టపడ్డారని, వీరితో పాటు కానిస్టేబుల్, హెడ్కానిస్టేబుల్లు రశీద్, ఏసయ్యలు కూడా దొంగలను పట్టుకోవడానికి కృషి చేశారని తెలిపారు. వీరికి అవార్డు ఇచ్చేందుకు ఉన్నత అధికారులకు లెటర్ రాసినట్లు సీఐ తెలిపారు. -
మహిళ వద్ద చైన్ స్నాచింగ్
చెన్నై ,అన్నానగర్: రైలులో మహిళ వద్ద చైన్ స్నాచింగ్ చేసిన దొంగని పట్టుకోవడానికి యత్నించిన యువకుడు రైలు ఢీకొని మృతి చెందాడు. వివరాలు.. మదురై జిల్లా పుదూర్ సమీపంలోని పరశురామ్‌పట్టికి చెందిన వెల్లైస్వామి కుమారుడు బాలాజీ (27). ఇతను తన తల్లి ఇంద్రాణి, బంధువులు వల్లి (50), ప్రకాష్ సహా 10 మంది తిరుచ్చి జిల్లా సమయపురం మారియమ్మన్ ఆలయానికి వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. గురువారం మదురై నుంచి విల్లుపురం వెళ్లే రైలులో ఎక్కారు. ఆ రైలు దిండుక్కల్ జిల్లా, కొడైరోడ్డు రైల్వే స్టేషన్‌కి వచ్చింది. కొడైరోడ్డు రైల్వే స్టేషన్ నుంచి రైలు బయలుదేరింది. అప్పుడు వల్లి మెడలో ఉన్న చైన్‌ని ఓ వ్యక్తి స్నాచింగ్ చేసుకుని పరుగెత్తాడు. ఇది చూసిన బాలాజీ ఆ దొంగని పట్టుకోవడానికి యత్నించాడు. వెంటనే ఆ దొంగ కనురెప్ప పాటుతో వెళుతున్న రైలు నుంచి దూకి పరారయ్యాడు. అతన్ని పట్టుకోవడానికి బాలాజీ వెళ్లే రైలు నుంచి దూకాడు. రైలు కోడైరోడ్డు రైల్వే స్టేషన్‌ని దాటింది. దీనిపై కోడై రోడ్డు రైల్వే పోలీసులకు బాలాజీ బంధువులు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు కోడై రోడ్డు రైల్వే స్టేషన్లో వెతికారు. అప్పుడు రైలులో ఢీకొని దేహం ముక్కలై బాలాజీ మృతి చెంది ఉన్నాడు. పోలీసులు అతని బంధువుకి సెల్ఫోన్లో సమాచారం తెలిపారు. రైలు అంబత్తూర్ రైల్వే స్టేషన్ రాగానే వారు అక్కడ నుంచి కారులో కోడైరోడ్డు రైల్వే స్టేషన్‌కి వచ్చారు. బాలాజీ మృతదేహాన్ని చూసి తల్లి, బంధువులు బోరున ఏడ్చారు. సమాచారంతో దిండుక్కల్ రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి బాలాజీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో వల్లి మెడలో ఉన్నది కవరింగ్ చైన్ అని తెలిసింది. పరారైన దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుడు బాలాజీ భార్య కన్నగి. కాగా ఇతను ఫ్యాన్సీ దుకాణం నడుపుతున్నాడు. -
30 గంటల్లో పట్టేశారు..!
సాక్షి, సిటీబ్యూరో: ఈస్ట్‌జోన్ పరిధిలో ఉన్న అంబర్‌పేటలోని సాయిబాబ దేవాలయం వద్ద చోటు చేసుకున్న చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు 30 గంటల్లో ఛేదించారు. ఈ నేరానికి పాల్పడిన ఇద్దరు యువకులతో పాటు వారికి సహకరించిన మరొకరినీ ఆదివారం అరెస్టు చేశారు. శనివారం ఉదయం 9.40 గంటలకు జరిగిన ఈ నేరంపై మధ్యాహ్నం 11 గంటలకు ఫిర్యాదు అందిందని, ఆదివారం సాయంత్రం 5 గంటలకు నిందితులను పట్టుకోవడంతో పాటు సొత్తు రికవరీ చేసినట్లు నగరపోలీస్ కమిసనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈస్ట్‌జోన్ అదనపు డీసీపీ గోవింద్‌రెడ్డి, మలక్‌పేట ఏసీపీ ఎం.సుదర్శన్‌లతో కలిసి ఆదివారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాచిగూడ ప్రాంతానికి చెందిన హర్షజోషి, పట్లకూరి మనోజ్‌కుమార్, ఠాకూర్ అశ్విన్ సింగ్ స్నేహితులు. హర్ష ఇంటర్మీడియట్ ఫెయిల్ కావడంతో ప్రస్తుతం ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. మనోజ్ ఓ సంస్థలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా, అశ్విన్ ఏసీ టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. రెండు రోజుల క్రితం మనోజ్ తన స్నేహితుడైన అశ్విన్ ఇంటి వెళ్లి రూ.3 వేలు చేబదులు కావాలని కోరాడు. తన వద్ద కూడా డబ్బు లేదని చెప్పిన అశ్విన్ తనకూ ఆ అవసరం ఉందని చెప్పాడు. దీంతో అశ్విన్ చైన్ స్నాచింగ్ చేయడం ద్వారా తేలిగ్గా డబ్బు సంపాదించవచ్చని, ఆ నేరాలు చేద్దామని చెప్పడంతో దీనికి అంగీకరించిన మనోజ్ స్నాచింగ్ చేయడానికి బైక్ వేగంగా డ్రైవ్ చేయాలని, ఆ నైపుణ్యం ఉన్న హర్షను తమతో కలుపుకుందామని చెప్పాడు. ఈ విషయం హర్షకు చెప్పడంతో అతనూ అంగీకరించాడు. తన పల్సర్ బైక్‌ను వారిద్దరికీ ఇచ్చిన అశ్విన్ ఓ యాక్టివాను తీసుకున్నాడు. పల్సర్‌పై హర్ష, మనోజ్ ఉండగా.. యాక్టివాను అశ్విన్ డ్రైవ్ చేస్తున్నాడు. వీరు ముగ్గురూ కలిసి శనివారం ఉదయం అంబర్‌పేటలోని పలు ప్రాంతాల్లో కలియ తిరిగారు. పల్సర్‌కు 50 మీటర్ల ముందు యాక్టివాపై వెళుతున్న అశ్విన్ టార్గెట్స్ ఎంచుకోవడంలో మిగిలిన ఇద్దరికీ సహకరించాడు. అదే సమయంలో డీడీ కాలనీకి చెందిన అనసూయ తన సోదరి విట్చయతో కలిసి టీఆర్టీ కాలనీలోని దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా వారి వద్దకు వెళ్లిన హర్ష, మనోజ్ అనసూయ మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు లాక్కుపోయారు. అనంతరం ముగ్గురూ విద్యానగర్ మీదుగా కాచిగూడ వెళ్లి చోరీ సొత్తును పంచుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిని ఛాలెంజ్‌గా తీసుకున్న ఈస్ట్‌జోన్ పోలీసులు డీఐలు నేను నాయక్, సైదులు, బి.రమేష్‌లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఘటనాస్థలితో పాటు వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల అధ్యయనం చేశారు. స్నాచింగ్ సమయంలో హెల్మెట్ పెట్టుకుని, నెంబర్ ప్లేట్ లేని పల్సర్ నడిపిన హర్ష అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిన కొద్దిసేపటికి హెల్మెట్ తీసేయడంతో పాటు తాను వేసుకున్న డ్రస్ కూడా మార్చేశాడు. ప్రత్యేక బృందంలో ఉన్న మలక్‌పేట కానిస్టేబుల్ అమర్నాథ్ సీసీ కెమెరా ఫీడ్‌లో మనోజ్‌ను గుర్తించాడు. ఈ ఆధారంతో పోలీసులు ఆదివారం కాచిగూడ ప్రాంతంలో ముగ్గురినీ అదుపులోకి తీసుకుని వాహనాలు, సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
ఆ బస్సు ఎక్కితే అంతే సంగతులు..!
చాంద్రాయణగుట్ట: ‘300 రూట్’ నంబర్ ఆర్టీసీ బస్సులే లక్ష్యంగా చేసుకొని గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న మహిళను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. డీఎస్సై కొండల్‌రావ్‌తో కలిసి ఇన్స్పెక్టర్ రుద్ర భాస్కర్ వివరాలు వెల్లడించారు. సరూర్‌నగర్, శంకర్‌నగర్‌కు చెందిన బండి కీర్తి అలియాస్ దుర్గ (30) దొంగతనాలు వృత్తిగా మార్చుకుంది. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే రూట్ నంబర్–300 (ఉప్పల్–మెహదీపట్నం) బస్సులను ఎంచుకుని చోరీలకు పాల్పడేది. సాగర్ రింగ్ రోడ్డు, ఎలబీ నగర్ ప్రాంతాల్లో బస్సు ఎక్కే కీర్తి కాటేదాన్ వెళ్లేలోగా అదను చూసి ప్రయాణికుల నగలను చోరీ చేసేది. ఫుట్‌బోర్డుపై నిలుచుని బస్సుదిగే ప్రయత్నంలో ఉన్న ప్రయాణికుల గొలుసులు కొట్టేసి ముందు స్టాప్‌లో దిగిపోయేది. వివరాలు వెల్లడిస్తున్న ఇన్స్పెక్టర్ రుద్ర భాస్కర్ ఉదయం 8.30 నుంచి 11 గంటలు, తిరిగి సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్య మాత్రమే ఈమె పంజావిసిరేది. బుధవారం ఉదయం హఫీజ్‌బాబానగర్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న డీఎస్సై కొండల్రావు, క్రైం కానిస్టేబుళ్లు ప్రశాంత్, నిఖిల్ సాయి, దినేశ్వర్‌లకు అనుమానాస్పదంగా కనిపించిన కీర్తిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలు అంగీకరించింది. ఇదే తరహాలో ఇప్పటి వరకు చాంద్రాయణగుట్ట పరిధిలో మూడు చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. 2012లో మేడిపల్లి ఠాణా పరిధిలో నమోదైన చోరీ కేసులో జైలుకు వెళ్లివచ్చింది. బస్సుల్లో నలుగురైదుగురు ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నరని, ప్రస్తుతం ప్రధాన నిందితురాలు కీర్తి పట్టుబడినట్లు తెలిపారు. ఆమె నుంచి 4.8 తులాల బంగారు నగలు, 20 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. నిందితురాలిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన క్రైం సిబ్బందికి రివార్డు అందజేశారు. -
అన్నదమ్ములు దారితప్పి..దొంగలయ్యారు
సాక్షి, విశాఖపట్నం: ఉన్నత చదువులు చదివే క్రమంలో వ్యసనాలకు బానిసలయ్యారు. జల్సాల కోసం సులువుగా డబ్బు సంపాదించేందుకు చైన్‌స్నాచింగ్‌ల బాట పట్టారు. ఈ క్రమంలో కన్నతల్లే సలహాలు ఇస్తూ... చోరీ సొత్తును భద్రపరుస్తుండడంతో మరింతగా చెలరేగిపోయారు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కి ముగ్గురూ జైలు పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా బుధవారం వెల్ల డించారు. స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగి ఎంపాడ వెంకటరమణ కుమారులు ఎంపాడ చంద్రశేఖర్‌రెడ్డి బీటెక్, ఎంపాడ గోపీనాథ్ రెడ్డి డిప్లమో చదువుకున్నారు. డ్రగ్స్ తీసుకుంటూ వ్యసనాలకు బానిసలైన వీరు జల్సాల కోసం డబ్బు సంపాదించేందుకు దొంగతనాల బాటపట్టారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసుకొని 2016 నుంచి ఇప్పటి వరకు 51 చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. చంద్రశేఖర్ 22, గోపీనాథ్ 11, ఇద్దరూ కలిపి 18 చైన్‌స్నాచింగ్‌లు చేశారు. ఈ బంగారు ఆభరణాలను విక్రయించి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేశారు. కొన్ని సందర్భాల్లో ఈ బంగారాన్ని వీరి తల్లి సరోజిని భద్రపరిచేది. మరికొన్ని సందార్భల్లో ఎక్కడైనా ఒంటరి మహిళలు ఉంటే వారి సమాచారాన్ని కుమారులకు చేరవేసేది. మొత్తంగా నగరంలో చైన్‌స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోవడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా వీరిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అనేక విషయాలు వెలుగుచూశాయి. మొత్తం 51 దొంగతనాల్లో 1382.90 గ్రాముల బంగారం అపహరించారు. వీరి నుంచి 1142.50 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు బంగారంతోపాటు ఐదు బైక్‌లు అపహరించారని సీపీ తెలిపారు. ఈ దొంగతనాల వ్యవహారంలో మిగిలిన కుటుంబ సభ్యులకు సంబంధం లేదని ఆయన తెలిపారు. 2016 నుంచి 2019 వరకు చైన్ స్నాచింగ్ కేసులు తగ్గుతూ వచ్చాయని, 2017లో 1727 కేసులు, 2018లో 1261 కేసులు, 2019 ఏప్రిల్ వరకు 261 కేసులు నమోదయ్యాయన్నారు. సమావేశంలో ఏడీసీపీ సురేష్‌బాబు, ఏసీపీ ప్రభాకర్ బాబు, ఏసీపీ త్రినాథ్‌రావు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. నిందితులు గోపీనాథ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి నిందితులపై కేసుల వివరాలివీ నిందితులు చంద్రశేఖర్, గోపీనాథ్‌లపై గాజువాక పోలీస్ స్టేషన్లో 21 కేసులు, దువ్వాడ పీఎస్‌లో 5, ఎంవీపీ పోలీస్ స్టేషన్లో 6, స్టీల్‌ప్లాంట్ పీఎస్‌లో 4, న్యూ పోర్ట్ పీఎస్‌లో 4, కంచరపాలెం పీఎస్‌లో 1, త్రీటౌన్‌లో 2, ఫోర్త్ టౌన్లో 1, మల్కాపురం పీఎస్‌లో 1, పెందుర్తి స్టేషన్లో 2, గోపాలపట్నం స్టేషన్లో 2, అనకాపల్లి స్టేషన్లో 3, మునగపాక స్టేషన్లో 2 కేసులు నమోదయయ్యాయి. ప్రత్యేక బృందానికి అభినందనలు విశాఖ నగరంలో చైన్ స్నాచింగ్స్ తరచూ జరుగుతుండడంతో ప్రత్యేక బృందాన్ని సీపీ ఏర్పాటు చేశారు. ఈ బృందానికి ఇన్స్పెక్టర్ ఎం.అవతారం నాయకత్వం వహించారు. దర్యాప్తులో భాగంగా చంద్రశేఖర్‌రెడ్డి, గోపీనాథ్‌రెడ్డి, వారి తల్లిపై అనుమానం రావడంతో ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో వారు నివాసం ఉంటున్న పరవాడలోని అనూష అపార్ట్‌మెంట్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చాకచక్యంగా పట్టుకున్నారు. సీఐ అవతారంతోపాటుగా సౌత్ సబ్ డివిజన్ క్రైం విభాగంలో ఎస్సైలు జి.తేజేశ్వరరావు, ఎల్.దామోదర్‌రావు, బి.లూథర్‌బాబు, డి.సూరిబాబు, మిగతా సిబ్బందిని సీపీ మహేష్‌చంద్ర లడ్డా అభినందించారు. -
చైన్ స్నాచర్ అరెస్ట్
తూర్పుగోదావరి, ఆలమూరు (కొత్తపేట): ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన నాతి వెంకటేష్ (వెంకన్న) ఆలమూరు పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసు స్టేషన్లో ఎస్సై టి.క్రాంతికుమార్ అధ్యక్షతన బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండపేట రూరల్ సీఐ కె.లక్ష్మణరెడ్డి కేసులకు సంబంధించి వివరాలను వెల్లడించారు. ఆలమూరుకు చెందిన వెంకన్న కొన్నేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇప్పటికే నిందితుడు వెంకన్నపై భార్యపై హత్యాయత్నం కేసుతో పాటు మరో ఏడు కేసులు స్థానిక పోలీసు స్టేషన్లో నమోదయ్యాయి. అప్పటి నుంచి అతడి కోసం ఎస్సై క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ఐడీ పార్టీ ప్రతినిధులు ఇళ్ల శ్రీనివాసు, సీహెచ్ యేసుకుమార్ తదితరులు గాలింపు చర్యలు చేపట్టారు. జొన్నాడ సెంటర్లో మంగళవారం సాయంకాలం అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడు వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి గొలుసుల రూపంలో ఉన్న 190 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితుడు వెంకన్నను స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్ విధించారు. పోలీసు శాఖలో కీలక అరెస్ట్‌లు ఆలమూరు పోలీసు స్టేషన్లో నమోదైన కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండు నెలల కాలంలో కీలకమైన ఆరుగురు దారి దోపిడీ దొంగలను, ఒక గొలుసు దొంగను అరెస్ట్ చేసినట్టు మండపేట రూరల్ సీఐ కె.లక్ష్మణరెడ్డి తెలిపారు. మార్చి 31న దారి దోపిడీ దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకోగా, బుధవారం చైన్ స్నాచర్‌ను అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిబంధనల మేరకు బాధితులకు అప్పగించనున్నామన్నారు. -
వీడియో : మహిళ మెడలో చైన్ ఎలా కొట్టేసాడో చూడండి
సాక్షి, న్యూఢిల్లీ : చైన్ స్నాచింగ్‌లు దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు నడిరోడ్డుపై చైన్‌స్నాచింగ్ జరిగింది. ఈ నెల 13వ తేదీన ఢిల్లీలోని ఇందేర్‌పూరి ఏరియాకు చెందిన ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగుల్లో ఒకరు బైక్ దిగి, వెనుక నుంచి మహిళ వద్దకు బలవంతంగా ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లాడు. అతని నుంచి తప్పించుకునేందుకు మహిళ ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కిందపడేసీ మరీ గొలుసు లాక్కెళ్లాడు. కాగా ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వీడియో : ఢిల్లీలో చైన్ స్నాచింగ్
-
పునరావాసం లేకే పునరావృతం
సాక్షి, సిటీబ్యూరో: మాన్గార్‌బస్తీ... ఈ పేరు వింటే పోలీసులు సైతం ఉలిక్కిపడతారు. చైన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్, దోపిడీ, దొంగతనాలు చేసే నేరగాళ్లకు ఈ ప్రాంతం కేరాఫ్ అడ్రస్. ఎన్నిసార్లు జైలుకు వెళ్లినా, చివరకు పీడీ యాక్ట్‌లు ప్రయోగించినా వీరిలో మార్పు రాలేదు. ఆ ప్రాంతంలో రైడింగ్‌కు వెళ్లి సురక్షితంగా తిరిగి వచ్చిన పోలీసులూ ఉండరు. వీరిలో మార్పు తీసుకురావడానికి హబీబ్‌నగర్ పోలీసులు అహర్నిశలు కృషి చేశారు. అయితే ప్రభుత్వ విభాగాల నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో వారు మళ్లీ నేరబాటపట్టారు. ఉప్పల్ స్టేడియం కేంద్రంగా చేతివాటం చూపిస్తున్న ముఠాను ఇటీవల రాచకొండ సీసీఎస్ పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. ఎనిమిది గ్యాంగులు...25 మంది సభ్యులు... మహారాష్ట్రకు చెందిన మాన్గరోడి కులానికి చెందిన వారు గండిపేట చెరువు నిర్మాణం సమయంలో నగరానికి వలస వచ్చారు. ఆపై హబీబ్‌నగర్ పరిధిలో స్థిరపడిపోవడంతో అది మాన్గార్బస్తీగా మారిపోయింది. కొన్నాళ్లకు వీరు నేరగాళ్ళుగా మారిపోయి గ్రేటర్ పరిధిలో పంజా విసరడం మొదలెట్టారు. ఏటా వందల సంఖ్యలో నేరాలు చేçస్తూ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. దీంతో గత ఏడాది వీరిలో మార్పు తీసుకురావాలని హబీబ్‌నగర్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఎనిమిది ప్రధాన గ్యాంగుల్ని గుర్తించిన పోలీసులు వాటినే ‘టార్గెట్’గా చేసుకున్నారు. వివిధ నేరాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న వీటిలోని 25 మంది సభ్యులను సన్మార్గంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేశారు. ఫలితంగా ఆ 25 మందీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరు అప్పటికే సిటీలోని 32 ఠాణాల పరిధిలో నమోదైన 200 కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లివచ్చారు. వివిధ పోలీసుస్టేషన్లలో 106 నాన్–బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మరో 194 కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నారు. ఒక్కొ క్కరి పైగా పదుల సంఖ్యలోనే కేసులు ఉన్నాయి. వీటిలో జేబు దొంగతనాల నుంచి దోపిడీల వరకు వివిధ నేరాలకు సంబంధించినవి ఉన్నాయి. వీలున్నంత వరకు వీటిని క్లియర్ అయ్యేలా హబీబ్‌నగర్ పోలీసులు ప్రయత్నించారు. ఇందుకు గాను ఈ ఠాణా మాజీ ఇన్స్పెక్టర్ పరవస్తు మధుకర్‌స్వామి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. శిక్షణ ఇప్పించినప్పటికీ... ‘మాన్గార్’ నేరగాళ్లలో మార్పు తీసుకురావడం, పోలీసులకు లొంగిపోయేలా చేయడం ఒక ఎత్తయితే... వారు మళ్లీ పాతబాట పట్టకుండా చూడటం మరో ఎత్తని మధుకర్‌స్వామి భావించారు. ఇందుకుగాను వారికి మరో జీవనాధారం చూపించాలని ప్రయత్నించారు. అయితే కేవలం నేరాలు చేయడం మాత్రమే తెలిసిన మాన్గార్‌బస్తీ వాసులకు ఏ ఇతర స్కిల్ లేవు. ఎక్కడైనా చిన్నాచితక పనులు ఇప్పిద్దామని ప్రయత్నించినా వీరి ప్రవర్తన, గత చరిత్ర తెలిసిన వారు దగ్గరకు రానీయలేదు. వీటిని దృష్టిలో పెట్టుకున్న ఆయన విడతల వారీగా వారికి చిలుకూరులోని ఆర్ఎస్ఈటీఐలో వృత్తి విద్యా శిక్షణ ఇప్పించారు. వైద్య శిబిరాల నిర్వహణతో పాటు యోగ, ధ్యానం, ప్రాథమిక విద్యలతో పాటు కారు డ్రైవింగ్, బేసిక్ మెకానిజం నేర్పించారు. భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లు ఎదురైనా మళ్లీ నేరబాట పట్టకుండా ఉండేలా వీరిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ క్లాసులు ఏర్పాటు చేయించారు. తమ పేరు, కుటుంబీకుల పేర్లు ఇంగ్లీషులో రాయడం, సంతకం చేయడంతో పాటు క్యాబ్ డ్రైవర్లుగా మారితే జీపీఎస్ పరిజ్ఞానం వినియోగించడాన్నీ నేర్పారు. బస్తీ మహిళల కోసం ఫుడ్ ప్రాసెసింగ్‌లో శిక్షణ ఇవ్వడానికి మాన్గార్బస్తీలోని కమ్యూనిటీ హాల్లోనే శిబిరం ఏర్పాటు చేయించేందుకు ప్రయత్నాలు సైతం చేశారు. ప్రభుత్వ విభాగాలు స్పందించకపోవడంతో... పోలీసుల సహకారంతో డ్రైవింగ్‌లో పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు దొరికే ఆస్కారం లేదు. దీంతో అనివార్యంగా కొందరు క్యాబ్ డ్రైవర్లుగా మారాల్సి వచ్చింది. మాన్గార్బస్తీకి చెందిన వీరంతా మహారాష్ట్ర నుంచి వలసవచ్చారు. అక్కడ వీరిని ఎస్సీలుగా పరిగణిస్తూ ఆ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని సేకరించిన పోలీసులు రెవెన్యూ అధికారుల సాయం తో అందరికీ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయించడానికి ప్రయత్నించారు. ఇలా చేస్తే ఆ కార్పొరేషన్ నుంచి రుణాలు ఇప్పించి జీవనోపాధి కల్పించవచ్చని భావించారు. అయితే ఓ పక్క ఈ కులధ్రువీకణ పత్రాలు జారీ, మరోపక్క ప్రభుత్వ విభాగాల స్పందన సైతం అంతంత మాత్రంగానే ఉండటంతో సన్మార్గం పట్టిన వారు సైతం పునరావాసం లేక కనీస అవసరాల కోసం అవస్థలు ఎదుర్కొన్నారు. ఈ లోగా ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి సైతం బదిలీ కావడంతో ‘మార్పు కార్యక్రమాలూ’ మూలనపడ్డాయి. దీంతో కొత్త జీవితాలపై ఆశ కోల్పోయిన మాన్గార్‌బస్తీ వాసులు మళ్లీ పాతబాటే పట్టారు. ఈ నేపథ్యంలోనే జుబ్బా ఆకాష్ గ్యాంగ్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం కేంద్రంగా నేరాలు చూస్తూ రాచకొండ సీసీఎస్‌కు చిక్కి జైలుకు వెళ్ళింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి పోలీసు విభాగంతో కలిసి పని చేయకపోతే మాన్గార్‌బస్తీ మార్పునకు ఆమడదూరంలో ఉండిపోతుంది. -
చోరీ చేసిన బైక్‌లతోనే స్నాచింగ్‌లు
గచ్చిబౌలి: బైక్‌లు చోరీ చేసి వాటిపై తిరుగుతూ చైన్ స్నాచింగ్‌లు, సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ, కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో సీపీ వీసీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. బోరబండకు చెందిన దస్తగిరి, శివ కుమార్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బండారి సాయిరాం అలియాస్ సాయి, మరో బాలుడు ముఠాగా ఏర్పడి బైక్‌ల చోరీ, చైన్, సెల్ ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో అపాచీ, యూనికాన్ బైక్‌లతో పాటు స్కూటీని చోరీ చేసిన వీరు అదే బైక్‌లపై కాలనీల్లో తిరుగుతూ తెల్లవారు జామున 4.30 గంటల నుంచి 5 .30 గంటల ప్రాంతంలో ఒంటరిగా వెళుతున్న మహిళలను టార్గెట్ చేసుకుని స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ Ðð వెళుతున్న మహిళల నుంచి ఫోన్లు లాక్కెళ్లేవారు. ఇదే తరహాలో వీరు కేపీహెచ్‌బీ పరిధిలో మూడు చైన్ స్నాచింగ్‌లు, బాచుపల్లి, మాదాపూర్, నార్సింగి పరిధిలో ఒక చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బైక్‌లు, మాదాపూర్ పీఎస్ పరిధిలో సెల్‌ఫోన్ చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వారి కోసం గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.4 లక్షల విలువైన 86 గ్రాముల బంగారు నగలు, మూడు బైక్‌లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరైన దస్తగిరిపై 11 బైక్ చోరీ కేసులు ఉన్నట్లు తెలిపారు. జైలుకు వెళ్లి వచ్చిన అతను జల్సాలకు అలవాటు పడి మళ్లీ చోరీలకు పాల్పడుతున్నాడన్నారు. నిందితులతో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేస్తున్న మహబూబ్ పాషా అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: సీపీ ప్రతి ఒక్కరూ విధిగా ఇంటి ముందు సీసీ కెమెరా అమర్చుకోవాలని సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. నేరాలను చేధించడమే కాకుండా నేరాల సంఖ్య తగ్గించేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. 13 నెలల్లో సైబరాబాద్ కమిషనరేట్‌లో 75వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, త్వరలో వాటి సంఖ్య లక్షకు చేరుకుంటుందన్నారు. సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు స్థానిక పీఎస్‌లో సంప్రదిస్తే సహకారం అందిస్తామన్నారు. సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు, ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ దయానంద్‌రెడ్డి, కూకట్పల్లి ఏసీపీ బి. సురేందర్‌రావు, డీఐ సైదులు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడల్లో ప్రతిభావంతులు.. సరదా కోసం వాహనాల చోరీలు
సాక్షి, సిటీబ్యూరో: మర్కా అరుణ్‌కుమార్.. వయసు 20 ఏళ్లు. డిగ్రీ విద్యార్థి.. నమోదైన కేసులు 19మనీష్ ఉపాధ్యాయ.. వయసు 20.. ఇంటర్మీడియట్ స్టూడెంట్.. కేసులు 18సంజయ్ సింగ్.. వయసు 22.. ఇంటర్ విద్యార్థి.. కేసులు 25అఖిల్ కుమార్.. వయసు 20 ఏళ్లు..ఇంటర్ విద్యార్థి.. కేసులు 9 నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన ఘరానా గ్యాంగ్ లీడర్‌తో పాటు మరో ముగ్గురు సభ్యుల నేపథ్యమిది. క్రైమ్ చేయాల్సిన అవసరం లేని ఈ గ్యాంగ్ నేరబాట పట్టడం వెనుక జాయ్ రైడింగ్, గంజాయికి బానిసత్వం ప్రధాన కారణాలుగా మారాయి. ఈ నలుగురినీ చిలకలగూడ పోలీసులు శుక్రవారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. నగర పోలీసులకు.. అందునా టాస్క్‌ఫోర్స్‌కు నిత్యం అనేక మంది నేరగాళ్లు చిక్కుతూ ఉంటారు. విచారణలో హృదయవిదార అంశాలు బయటకు వస్తుంటాయి. కుటుంబ నేపథ్యం, అవసరాలు, బాధలు, కష్టాలు, వైద్యావసరాలు.. ఇలా వివిధ కారణాలతో నేరబాటపట్టామని చాలామంది చెబుతుంటారు. అయితే, ఈ స్టూడెంట్స్ గ్యాంగ్ తీరే వేరు. ఈ నలుగురు విద్యార్థుల్లో అందరి తండ్రులూ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు చేస్తున్నవారే. అరుణ్ తండ్రి ఆర్మీ రిటైర్డ్ కాగా, మనీష్ తండ్రి ప్రైవేట్ ఉన్నతోద్యోగి, సంజయ్ తండ్రి వ్యాపారం చేస్తుండగా అఖిల్ తండ్రి నేవీలో పని చేసేవారు. ఈ నేపథ్యంలో ఈ నలుగురిలో ఎవరికీ కుటుంబ బాధ్యతలు, బా ధలు, సంపాదించాల్సిన అవసరాలు గాని లేవు. సరదా కోసం మొదలై.. అయినప్పటికీ వీరు నేరబాట పట్టడం వెనుక సరదా కోణం ఉంది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విద్యాసంస్థలో విద్యనభ్యసించిన అరుణ్, అఖిల్ స్నేహితులు. ఈ నలుగురిలో కొందరికి ద్విచక్ర వాహనాలపై షికార్లు చేయడమంటే చాలా ఇష్టం. అయితే, ఆ వయసులో తల్లిదండ్రులను అడిగినా వాహనాలు కొనివ్వరనే ఉద్దేశంతో అనువైన ప్రదేశాల నుంచి వాహనాలను దొంగిలించడం మొదలెట్టారు. తొలినాళ్లలో వీటిని కేవలం విహరించడానికి మాత్రమే వాడేవారు. పెట్రోల్ ఎక్కడ అయిపోతే అక్కడే వాహనాన్ని పడేసి పోయేవారు. దీన్నే పోలీసుల సాంకేతిక పరిభాషలో ‘జాయ్ రైడింగ్’ అంటారు. ఇలా కొన్నాళ్లు చేసిన తర్వాత ఒక్కోక్కరికీ ‘కొత్త పరిచయాలు’ ఏర్పడ్డాయి. క్రికెట్లో ఒకరు..ఫుట్‌బాల్‌లో మరొకరు.. ఈ గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరించిన అరుణ్ కుమార్లో మంచి క్రికెట్ ప్లేయర్ కూడా ఉన్నాడు. గతంలో హైదరాబాద్ తరఫున అండర్ 16 మ్యాచెస్‌లో ప్రాతినిథ్యం వహించాడు. ఖాళీ దొరికినప్పుడల్లా పరేడ్ గ్రౌండ్స్‌కు వచ్చి ప్రాక్టీసు చేస్తూ ఉండే ఇతడికి అక్కడే టొమాటో సంజయ్ పరిచయమయ్యాడు. అప్పటికే గంజాయికి అలవాటుపడ్డ ఇతగాడు ఆ జాఢ్యాన్ని అరుణ్‌కూ అంటించాడు. మంచి ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన అఖిల్ స్పోర్ట్స్ కోటాతో పాటు తన ప్రతిభతో ఆర్మీకి ఎంపికయ్యాడు. అయితే, గతేడాది ఇతడిపై కుషాయిగూడ ఠాణాలో ఓ బెదిరింపుల కేసు నమోదైంది. ఈ కేసులో జైలుకు కూడా వెళ్లి రావడంతో పోలీసుల నుంచి నిరభ్యంతర పత్రం జారీ కాలేదు. దీంతో ఆ ఉద్యోగంలో చేరలేకపోయాడు. దీంతో అరుణ్‌తో స్నేహం కొనసాగించాడు. నలుగురూ కలిసి ‘కొత్త బాట’ ఈ ముగ్గురికీ మనీష్ ఉపాధ్యాయ కూడా తోడవడంతో నలుగురూ కలిసి ముఠా కట్టారు. గంజాయి తాగడంతో పాటు జల్సాలు పెరిగాయి. దీంతో జాయ్ రైడింగ్ కోసం మొదలైన బైక్ చోరీలు వాటిని విక్రయించే వరకు వెళ్లాయి. ఇలా వస్తున్న డబ్బు కూడా చాలకపోవడం, తమ ‘ఖర్చులకు’ ఇళ్లల్లో అడిగే ఆస్కారం లేకపోవడంతో ‘ప్రత్యామ్నాయ’ మార్గాలు అన్వేషించారు. దీంతో చోరీ చేసిన వాహనాలపై నిషాలో తిరుగుతూ స్నాచింగ్స్ చేయడం మొదలెట్టారు. ఓ దశలో ఇళ్లల్లోనూ చోరీలు చేయడం మొదలెట్టి రాచకొండ పోలీస్ కమిషరేట్ పరిధిలోని మేడిపల్లిలో ఓ ఇంటికి కన్నం వేశారు. అక్కడ నుంచి 20 గ్రాములు వెండి వస్తువులు, డబ్బు ఎత్తుకుపోయారు. పీటీ వారెంట్ల దాఖలుకు సన్నాహాలు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్న ఈ ముఠాను ప్రాథమికంగా చిలకలగూడ ఠాణాకు అప్పగించారు. కోర్టులో హాజరు పరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన అధికారులు.. తదుపరి విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ గ్యాంగ్‌పై చిలకలగూడతో పాటు గోల్కొండ, మారేడ్‌పల్లి, ఉస్మానియా యూనివర్శిటీ, మేడిపల్లి, నేరేడ్మెట్లో కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయా ఠాణాల అధికారులు ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై ఆయా కేసుల్లో నిందితులను అరెస్టు చేయనున్నారు. తల్లిదండ్రులు టీనేజ్‌లో ఉన్న తమ పిల్లలపై కన్నేసి ఉంచాలని అధికారులు కోరుతున్నారు. వారిపై పర్యవేక్షణ కొరవడితే ఇలాంటి దుష్ఫరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
గంజాయి కోసం గతి తప్పారు!
సాక్షి, సిటీబ్యూరో: గంజాయి... ఎంజాయ్... ఈ రెండు ఆ విద్యార్థులను గతి తప్పేలా చేశాయి. డిగ్రీ, ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ నలుగురూ జట్టు కట్టారు. మత్తు కోసం నేరాలు చేస్తూ.. ఆ నిషాలో స్నాచింగ్స్‌కు పాల్పడుతున్నారు...ఈ గ్యాంగ్ గుట్టురట్టు చేసిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ నలుగురు విద్యార్థుల్లో ఒక్కొక్కరిపై ఒకటి నుంచి 17 కేసులు ఉండటం గమనార్హం. డీసీపీ రాధాకిషన్‌రావు గురువారం కేసు వివరాలు వెల్లడించారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదువు... మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన, ప్రస్తుతం కొత్తపేటలో నివసిస్తున్న అరుణ్‌కుమార్ తండ్రి ఆర్మీలో పని చేస్తున్నారు. అలాగే నెల్లూరు నుంచి వచ్చి బోయిన్‌పల్లిలో స్థిరపడిన రామ్‌కోటి అఖిల్‌కుమార్ తండ్రి నేవీలో పని చేసేవారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పని చేసే విద్యా సంస్థలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివారు. అక్కడే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం అరుణ్ సికింద్రాబాద్‌లోని ఓ ప్రతిష్టాత్మక సంస్థలో డిగ్రీ, అఖిల్ మరో సంస్థలో ఇంటర్మీడియేట్ చదువుతున్నాడు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి మౌలాలీలో ఉంటున్న మనీష్ ఉపాధ్యాయ, తుకారామ్ గేట్‌కు చెందిన సంజయ్ సింగ్ ఓ విద్యా సంస్థలో ఇంటర్మీడియేట్ చదువుతున్నారు. గంజాయి నేపథ్యంలో పరిచయం... ఈ నలుగురూ సికింద్రాబాద్ సమీపంలోని ఓ ప్రాంతంలో గంజాయి తాగేవారు. అక్కడే అరుణ్, అఖిల్‌లకు మిగిలిన ఇద్దరితో పరిచయం ఏర్పడింది. ఓ దశలో మత్తుకు పూర్తిగా బానిసలైన వీరికి గంజాయి కొనుగోలు చేసేందుకు డబ్బు అందుబాటులో ఉండేది కాదు. దీనికితోడు తల్లిదండ్రులను అడిగి తీసుకోలేని పరిస్థితి. దీంతో నేరాలు చేయడం ద్వారా తేలిగ్గా డబ్బు సంపాదించే అవకాశం ఉందని అరుణ్ సలహా ఇవ్వడంతో మిగిలిన ముగ్గురూ అంగీకరించారు. దీంతో కొన్నాళ్లుగా ఎవరికి వారుగా, ఒక్కోసారి ముఠాగా నేరాలు చేయడం మొదలెట్టారు. నల్లకుంట, బేగంపేట, మహంకాళి, ఉస్మానియా వర్శిటీ, మల్కాజ్గిరి, తుకారామ్‌గేట్, మారేడ్‌పల్లి, నేరేడ్మెట్, కుషాయిగూడ, సికింద్రాబాద్ గవర్నమెంట్ రైల్వే పోలీసు ఠాణాల్లో అరుణ్‌పై 11, మనీష్‌పై 10, సంజయ్‌పై 17, అఖిల్‌పై ఒక కేసు నమోదయ్యాయి. పలుమార్లు కటకటాల్లోకి వెళ్లి వచ్చినా వీరి బుద్ధిమారలేదు. బైక్‌లు కొట్టేసి స్నాచింగ్‌లు చేస్తూ... గత ఏడాదిగా ఈ నలుగురూ రెండు రకాలైన దొంగతనాలు మొదలెట్టారు. పార్కింగ్ కాంప్లెక్స్‌లు, మెట్రో స్టేషన్లు వద్ద సంచరిస్తూ అదును చూసుకుని వాటిలో ఉన్న ద్విచక్ర వాహనాలు ఎత్తుకుపోయే వారు. వాటిపై తిరుగుతూ నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా వెళుతున్న మహిళల మెడలో నుంచి పుస్తెల తాళ్లు, పురుషుల నుంచి సెల్ఫోన్లు లాక్కెళ్లేవారు. ఇలా చిలకలగూడలో చైన్, సెల్‌ఫోన్ స్నాచింగ్, గోల్కొండ, మారేడ్‌పల్లి, ఉస్మానియా యూనివర్శిటీ, చిలకలగూడల్లో ద్విచక్ర వాహనాలు, మేడిపల్లిలో స్నాచింగ్స్తో పాటు ఓ ఇంట్లో చోరీ, చిలకలగూడ, నేరేడ్మెట్ల్లో స్నాచింగ్స్‌కు యత్నాలు చేయడంతో కేసులు నమోదయ్యాయి. దొంగిలించిన వాహనాలు, బంగారాన్ని పరిచయస్తులకే తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకునే వారు. వీరు చేసిన నేరాల్లో అత్యధికం గంజాయి మత్తులోనే చేయడం గమనార్హం. వలపన్ని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్... ఈ నలుగురి ముఠా ఆరు ఠాణాల పరిధిలో ఎనిమిది నేరాలు చేయడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్పైలు కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్, కేఎస్ రవి, జి.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన బృందం వీరి కదలికలపై నిఘా ఏర్పాటు చేసింది. ఆయా నేరాలు జరిగిన ప్రాంతాల్లో 200 సీసీ కెమెరాల నుంచి ఆయా సమయాల్లో రికార్డైన ఫీడ్‌ను సేకరించి అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలోనే నిందితుల ఆచూకీ టాస్క్‌ఫోర్స్‌కు లభించింది. దీంతో వలపన్నిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్ వలపన్ని గురువారం ఈ నలుగురినీ అదుపులోకి తీసుకుంది. లోతుగా విచారించగా నేరాలు అంగీకరించారు. దీంతో నాలుగు ద్విచక్ర వాహనాలు, 10 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి ఆభరణాలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం చిలకలగూడ పోలీసులకు అప్పగించారు. -
‘బండి’ దొరికిందని.. బరితెగించారు
సాక్షి, సిటీబ్యూరో: ఒకే ప్రాంతానికి చెందిన వారిద్దరూ స్నేహితులు. కూలీ, చిరుద్యోగి అయిన వారు ఆ సంపాదనతో తృప్తి చెందలేదు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు స్నాచింగ్స్ చేయాలని పథకం పన్నారు. కేవలం రూ.8 వేలు చెల్లిస్తే ఫైనాన్స్‌లో వాహనం వస్తుండటంతో దానిని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి రెండు కిస్తీలు చెల్లించే లోగా మూడు స్నాచింగ్స్ చేశారు. వీరి వ్యవహారాన్ని కనిపెట్టిన పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి సోమవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా, జరాసాగరం, కాకరవాడకు చెందిన రవి నగరానికి వలసవచ్చి సూరారంలో ఉంటున్నాడు. మెదక్ జిల్లా, నర్సాపూర్ సమీపంలోని రెడ్డిపల్లికి చెందిన ఆంజనేయులు సైతం అదే ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డాడు. నిరక్షరాస్యుడైన రవి కూలీ పనులు చేస్తుండగా కొద్దిగా చదువుకున్న ఆంజనేయులు సూరారంలోని ఓ కంపెనీలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తూ పేరు మార్చుకుని అంజన్‌గా చెలామణి అవుతున్నాడు. ఒకే ప్రాంతంలో ఉంటున్న వీరు తరచూ కలుసుకుంటూ ఉండేవారు. తమకు వచ్చే ఆదాయంతో తృప్తి చెందని ఇరువురూ తేలిగ్గా డబ్బు సంపాదించడం ఎలా? అనే అంశంపై తరచు చర్చలు జరిపైవారు. నగరంలో స్నాచింగ్స్ చేస్తే తేలిగ్గా, తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించే ఆస్కారం ఉందని రవి సలహా ఇచ్చాడు. దీనికి అంజన్ కూడా అంగీకరించడంతో ఆ నేరాలు చేయాలంటే ద్విచక్ర వాహనం ఉండాలని వారు భావించారు. అది కొనే స్థోమత లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ అతి తక్కువ మొత్తం చెల్లించినా ఫైనాన్స్‌పై బైకులు ఇస్తున్నట్లు తెలియడంతో సదరు సంస్థను సంప్రదించిన వీరు రూ.8 వేలు చెల్లించి రెండు నెలల క్రితం బజాజ్ పల్సర్ బైక్ ఖరీదు చేశారు. దీనిపై తిరుగుతూ నగరంలోని అనేక ప్రాంతాల్లో రెక్కీలు చేశారు. నిర్మానుష్య ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళల్లో ఒంటరి వారిని గుర్తించి టార్గెట్‌గా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రతి సందర్భంలోనూ అంజన్ హెల్మెట్ పెట్టుకుని వాహనం నడుపుతుండగా వెనుక కూర్చునే రవి స్నాచింగ్స్ చేసేవాడు. ఇలా ఫిబ్రవరి 20 నుంచి మార్చ్ 17 (ఆదివారం) మధ్య ఎస్సార్‌నగర్‌లో ఒకటి, సైబరాబాద్‌లోని కూకట్‌పల్లిలో రెండు స్నాచింగ్స్ చేశారు. ఇలా తస్కరించిన పది తులాల బంగారాన్ని విక్రయించేందుకు నగరంలో సంచరిస్తున్నారు. ఈ చోరీలపై దృష్టి పెట్టిన పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్‌రెడ్డి, బి.దుర్గారావు, మహ్మద్ ముజఫర్ అలీ, కానిస్టేబుళ్లు సి.ప్రదీప్ సాగర్, జి.వినయ్ యాదవ్, ఎ.సత్యనారాయణ, కె.నయన్ దర్యాప్తు చేపట్టారు. ఎస్సార్ నగర్, కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లోని దాదాపు 300 సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను సేకరించి అధ్యయనం చేశారు. ఫలితంగా స్నాచర్లకు సంబంధించిన కీలక ఆధారాలు చిక్కడంతో నగర వ్యాప్తంగా వలపన్నారు. చోరీ సొత్తును విక్రయించడానికి సోమవారం నగరానికి వచ్చిన వీరి కదలికలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.3 లక్షల విలువైన 10 తులాల బంగారం, బైక్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసును ఎస్సార్‌నగర్ పోలీసులకు అప్పగించారు. ప్రైవేట్ సంస్థదే పాపం... ఈ ఇద్దరూ స్నాచర్లుగా మారడానికి ప్రధాన కారణం తక్కువ డౌన్ పేమెంట్‌తో బైక్ ఖరీదు చేసే అవకాశం ఉండటమే. కేవలం రూ.8 వేలు కట్టించుకుని మిగిలిన మొత్తం ఫైనాన్స్ ఇస్తూ ఓ ప్రైవేట్ సంస్థ వీరికి పల్సర్ వాహనం ఇచ్చింది. దీంతో రెండు కిస్తీలు చెల్లించేలోపే మూడు స్నాచింగ్స్ చేశారు. ఈ సంస్థలు సైతం బ్యాంకుల తరహాలో కనీసం 25 శాతం చెల్లిస్తే తప్ప వాహనాలు ఇవ్వకూడదు. అలాగే నగరానికి చెందిన ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నేనుసైతం ప్రాజెక్టు కింద సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. అలా చేస్తే నేరాలు నిరోధించడం, కేసుల్ని కొలిక్కి తీసుకురావడం కూడా సాధ్యమవుతాయి.– నగర పోలీసులు -
బైక్‌ల చోరీ.. వాటిపైనే స్నాచింగ్
గచ్చిబౌలి: జల్సాలకు అలవాటుపడి స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరితో పాటు కొట్టుకొచ్చిన సొత్తును అమ్మిస్తున్న మరో వ్యక్తిని అరెస్టు మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ ఎ.వెంకటేశ్వర్రావు శుక్రవారం వెల్లడించారు. మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అబ్రార్‌నగర్, హస్మత్‌పేట్‌కు చెందిన సోహిల్ ఖాన్(19), బీదర్‌కు చెందిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎరుదుగా ఉండే మహ్మద్ అమీర్ అలియాస్ ప్రిన్స్ (20)లు జల్సాలకు అలవాటుపడ్డారు. ఇందుకోసం సులువుగా డబ్బు సంపాదించాలని భావించారు. ఎవరికీ అనుమానం రాకుండా బైకులను చోరీ చేసుకొచ్చేవారు. ఆ బైకులపై తిరుగుతూ ఒంటిరిగా వెళ్తున్న మహిళలను టార్గెచే చేసుకొని బంగారు ఆభరణాలను లాక్కెళ్లేవారు. ఈ క్రమం లో ఫిబ్రవరి 8న తెల్లవారుజామున భర్తతో కలిసి వేములవాడకు వెళ్లేందుకు మాదాపూర్‌కు చెందిన స్వరూపరాణి నడుచుకుంటూ వస్తోంది. ఎదురుగా బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమెను దాటి వెళ్లి తిరిగి వెనుకవైపు నుంచి వచ్చి ఆమె మెడలోని బంగారు పుస్తుల తాడును లాక్కొనిక్ష ణాల్లో ఉడాయించారు. బాధితురాలి ఫిర్యాదు మే రకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశా రు. సీసీ కెమెరా ఫుటేజీలను చర్లపల్లి జైలు అధికారులకు చూపింపారు. స్నాచింగ్‌లకు పాల్పడింది పాత నేరస్తులు సోహిల్ ఖాన్, మహ్మద్ అమీర్లుగా గుర్తించారు. గతంలో స్నాచింగ్‌లకు పాల్ప డి జైలుకు వెళ్లిన ఇద్దరు మాదాపూర్ పీఎస్ పరిధిలో మూడు స్నాచింగ్‌లు, బైక్ చోరీ, నార్సింగి పీఎస్ పరిధిలో ఒక స్నాచింగ్‌కు పాల్పడ్డారు. సోహిల్ ఐదు చోరీలతో పాటు గతంలో మార్కెట్ పీఎస్ పరిధిలో ఒకటి, బేగంపేట్ పీఎస్ పరిధిలో మూడు, బోయిన్పల్లి పీఎస్ పరిధిలో ఒకటి, మహంకాళీ పీఎస్ పరిధిలో ఒక స్నాచింగ్‌తో కలిపి 12 కేసుల్లో నిందితుడు. అమీర్ గతంలో మార్కెట్, బోయిన్పల్లి పీఎస్ పరిధిలో రెండు స్నాచింగ్‌లతో కలిపి ఏడు కేసుల్లో నిందితుడు. జమిస్తాన్పూర్ ముషీరాబాద్‌కు చెందిన మహ్మద్ జావెద్(25) చోరీ చేసిన సొత్తును కమీషన్ తీసుకొని విక్రయిస్తాడు. నిందితుల నుంచి రూ. 10 లక్షల విలువైన 15 తులాల బంగారు ఆభరణాలు, రెండు మోటార్ సైకిళ్లు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఒంటరి మహిళలను గుర్తించి... సోహిల్, మహ్మద్ అమీర్లు మొదట బైక్ చోరీ చేస్తారు. అనంతరం మహిళలు ఒంటరిగా నడిచే వెళ్లే ప్రాంతాలను గుర్తిస్తారు. ఆయా ప్రాంతాల్లో నడుచుకుంటూ వచ్చే ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ స్నాచింగ్‌లకు పాల్పడతారు. అప్రమత్తంగా ఉండాలి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళలు నగలు కనిపించకుండా జాగ్రత పడాలని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు సూచించారు. నగలు ధరించకుండా వెళితే మరీ మంచిదన్నారు. సెల్ ఫోన్లను మాట్లాడుకుంటూ వెళ్లవద్దన్నారు. ఎవరైనా వెంబడిస్తున్నట్లు అనుమానం వస్తే జన సంచారం ఉన్న చోటకి వెళ్లాలన్నారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. –డీసీపీ వెంకటేశ్వర్రావు -
దొంగల చేతికి నగరం
అనంతపురం సెంట్రల్: నగరంలో పోలీసుస్టేషన్లు గాడి తప్పుతున్నాయి. నేరాలకు అడ్డుకట్ట వేయడంలో పోలీసులు చతికిలపడుతున్నారు. ఇక్కడే తిష్ట వేశామన్న చందంగా దొంగలు ఒకే కాలనీలో వరుసగా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. అయినా కూడా పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. నేరాల తీవ్రత తక్కువగా ఉన్నా సంఖ్య మాత్రం రెట్టింపు అవుతోంది. దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు నిత్యకృత్యమవుతున్నాయి. నగరంలో రాత్రి వేళల్లో గస్తీ విషయంలో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాత్రి సమయాల్లో గస్తీ సన్నగిల్లుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీని వలన నేరస్తులు అవకాశం దొరికినపుడల్లా నేరాలకు పాల్పడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు నిలయం నేరాలతో పాటు అసాంఘిక కార్యకలాపాలు కూడా అధికమవుతున్నాయి. లక్ష్మీనగర్‌లో ఇటీవల నలుగురు విటులు, ఇద్దరు నిర్వాహకులను నాల్గవ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు ముందు ఇదే కాలనీలో పట్టుబడ్డారు. దీంతో పాటు లాడ్జిల్లో వ్యభిచారం సర్వసాధారణంగా జరిగిపోతోంది. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంతో పాటు పలు హైక్లాస్ వాటిల్లో కూడా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండడం గమనార్హం. లాడ్జి మానిటరింగ్ సిస్టం యాప్ ద్వారా లాడ్జిలపై నిఘా ఉంచినట్లు పోలీసులు అధికారులు ప్రకటిస్తున్నా ఆచరణలో కనిపించడం లేదు. ఇందుకు లాడ్జి నిర్వాహకుల్లో చిత్తశుద్ధి లేకపోవడం వలనే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల నగరంలో ప్రధాన లాడ్జిలు పెరిగిపోతుండడం వలన చిన్నా చితక లాడ్జిలు మూత పడుతున్నాయి. ఇలాంటి వాటిల్లో వ్యభిచారం, పేకాట లాంటి అసాంఘిక కార్యకలపాలు సాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాటిపై నిఘా ఉంచడంతో పాటు రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేస్తే నేరాలకు అడ్డుకట్ట పడే అవకాశముంది. ఆ దిశగా పోలీసులులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ♦ వరుస చైన్‌స్నాచింగ్‌లతో నగరంలోని లక్ష్మీనగర్ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. నాలుగురోజుల క్రితం లక్ష్మీ నరసమ్మ అనే వృద్ధురాలి మెడలో నుంచి 4 తులాల బంగారు గొలుసును దుండగులు అపహరించుకెళ్లారు. అంతకుముంద వారంలో ఓ మహిళ మెడలో 3 తులాల చైన్ లాక్కెళ్లారు. ♦ ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసుల నిఘా కరువైంది. ప్రయాణికుల విలువైన వస్తువులు దొంగల వశమవుతున్నాయి. తాజాగా ఆదివారం బెంగుళూరు మహిళకు చెందిన బ్యాగు ఆర్టీసీ బస్టాండ్‌లో మిస్ అయింది. అందులో 4 తులాల బంగారు నగలు ఉన్నట్లు బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నెలలో రెండు, మూడు ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. బస్టాండ్‌లో పోలీసుల నిఘా కరువవడంతోనే దొంగలు వారి పని వారు కానిచ్చేస్తున్నారు. -
నోటితోనే తెంచేస్తాడు..
ఖైరతాబాద్: బస్సుల్లో ప్రయాణికుల దృష్టిమరల్చి మెడలోని బంగారు ఆభరణాలను క్షణాల్లో మాయం చేస్తున్న ముఠా సభ్యులను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఆదివారం సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి వివరాలు వెల్లడించారు.. నాంపల్లి మాన్గార్ బస్తీకి చెందిన శ్యాంసుందర్, దశరథ్, లక్కీ, సాయికుమార్, అరుణ్‌రాజ్ లతో పాటు మరో నలుగురు యువకులు శ్యాంసుందర్ నేతృత్వంలో ముఠాగా ఏర్పడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పురుషులను టార్గెట్ చేసుకుని వారి మెడలో ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేసేవారు. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఐదు, నాంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు, నారాయణగూడలో ఒక చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సైఫాబాద్ డీఐ బి.నర్సింహులు నేతృత్వంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు శనివారం సాయంత్రం లక్డీకాపూల్ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో వారు ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. బస్సును ఆపి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యుల్లో మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరి నుంచి 7తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సైఫాబాద్ ఇన్స్పెక్టర్ చింతల సైదిరెడ్డి, డిఎస్ఐ ఎం.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాసబ్ ట్యాంక్ అడ్డాగా .. శ్యాంసుందర్ గ్యాంగ్ మాసబ్‌ట్యాంక్ అడ్డాగా చేసుకొని చోరీలకు పాల్పడుతోంది. రద్దీగా ఉన్న బస్సులో ఎంపిక చేసుకున్న వ్యక్తికి ముందు ముగ్గురు, వెనుక ముగ్గురు, ఫుట్‌బోర్డుపై మరో ముగ్గురు నిలుచుంటారు. టార్గెట్ చేసిన వ్యక్తి ముందు ఉన్న వ్యక్తి తన మోచేతులతో వ్యక్తి మెడముందు భాగం నుంచి పైకి లేపుతాడు. అదే సమయంలో వెనుక ఉండే మరొకరు బాధితుడి మెడలోని బంగారు ఆభరణాలను నోటితో కట్ చేస్తాడు. అనంతరం చోరీ చేసిన సొత్తును మరొకరికి అందజేస్తాడు. పని ముగిసిన తర్వాత ఒకొక్కరు ఒక్కో స్టాప్‌లో బస్సు దిగిపోతారు. చివరగా మాసబ్‌ట్యాంక్‌లో కలుసుకొని అక్కడినుంచి మాన్గార్ బస్తీకి చేరుకుంటారు. ముఠా నాయకుడు శ్యాంసుందర్‌గౌడ్ గతంలో మలక్‌పేట పరిధిలో పీడీ యాక్ట్ కింద అరెస్టై జైలుకు వెళ్లినట్లు తెలిపారు. ఆభరణాలను నోటితో కొరికి తెంపడంలో అతను సిద్ధహస్తుడని ఏసీపీ వివరించారు. -
ముగ్గురు స్నాచర్ల అరెస్ట్
రాంగోపాల్‌పేట్: నడుచుకుంటూ వెళ్తున్న వారి నుంచి మొబైల్ ఫోన్లు లాక్కుని వెళుతున్న ఇద్దరు మైనర్లతో పాటు మరో వ్యక్తిని రాంగోపాల్‌పేట్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ బాబుతో కలిసి వివరాలు వెల్లడించారు. నల్లగుట్టకు చెందిన ప్రభాకర్, అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లతో కలిసి ముఠా ఏర్పాటు చేశారు. ముగ్గురూ కలిసి రోడ్డుపై నడిచి వెళుతున్న వారి నుంచి సెల్ఫోన్లు లాక్కెళ్లేవారు. ఆదివారం అర్ధరాత్రి శైలేందర్‌కుమార్ శుక్లా అనే వ్యక్తి ఎంజీరోడ్డులో నడుచుకుంటూ వస్తుండగా ఆల్ కరీం ట్రేడ్ సెంటర్ సమీపంలో వెనునక నుంచి బైక్‌పై వచ్చిన నిందితులు అతడి చేతిలో ఉన్న సెల్‌ఫోన్ లాక్కుని ట్యాంక్‌బండ్ వైపు పరారయ్యారు. సోమవారం ఉదయం శుక్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు నల్లగుట్టకు చెందిన వారిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరం అంగీకరించారు. మైనర్లను జువైనల్ హోంకు, నిందితుడి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీపీ తెలిపారు. -
చైన్‌స్నాచింగ్.. పురుషులనూ వదలట్లేదు
రాజేంద్రనగర్: చైన్ స్నాచింగ్ అంటే ఇన్నాళ్లు మహిళలకే జరిగేది. కానీ ఇప్పుడు చైన్ స్నాచర్లు పురుషులను కూడా వదలడం లేదు. తాజాగా పురుషుడి మెడలోని బంగారు గొలుసు తెంచుకుని ఉడాయించిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ న్యూ ఫ్రెండ్స్ కాలనీలో రాఘవరెడ్డి మైత్రి కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రాఘవరెడ్డి దుకాణంలో కూర్చుని ఉన్నాడు. ఈ సమయంలో ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించి వచ్చిన ఓ యువకుడు సిగరెట్ కావాలని అడిగాడు. సిగరేట్ ఇచ్చేందుకు రాఘవరెడ్డి కిందకు వంగాడు. ఇదే సమయంలో నిందితుడు రాఘవరెడ్డి మెడలోని మూడు తులాల బంగారు గొలుసును తెంచుకుని ఉడాయించాడు. రెప్పపాటులో జరిగిన ఈ సంఘటనతో రాఘవరెడ్డి షాక్‌కు గురయ్యాడు. తెరుకుని బయటకు వచ్చేచూసేసరికి చైన్‌స్నాచర్ ద్విచక్రవాహనంపై పారిపోయాడు. రోడ్డుపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో చైన్ స్నాచర్ పారిపోయిన దృశ్యాలు నమోదయ్యాయి. ఇదే ప్రాంతంలో చైన్‌స్నాచర్ రెండు రోజులుగా రెక్కి నిర్వహిస్తూ సీసీ కెమెరాలో నమోదయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భవానీ భక్తుల ముసుగులో...
అల్లిపురం(విశాఖ దక్షిణం): ఇటీవల నగర పరిధిలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులతోపాటు, ఇంటి దొంగతనానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను నగర పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి సుమారు రూ.8లక్షల విలువ గల బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర క్రైం డీసీపీ ఎ.ఆర్.దామోదర్ వివరాలు వెల్లడించారు. భవానీ భక్తుల ముసుగులో... పెందుర్తి మండలం, నరవ గ్రామంలో గత ఏడాది డిసెంబర్ 28న ఉదయం 6గంటల సమయంలో ఒక మహిళ మెడలోని పుస్తెల తాడు తెంపుకుపోయిన కేసులో ముగ్గురు వ్యక్తులను నగర క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.87,900ల విలువ గల బంగారు పుస్తెలు, గొలుసు స్వాధీనం చేసుకొన్నారు. వారు ఉపయోగించిన ఆటో, బైక్ స్వాధీనం చేసుకున్నారు. అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన పెద్దిశెట్టి రూపేష్, దంగుడుబొయిన వెంకటేష్, పోలిపిల్లి మహేష్ స్నేహితులు. వీరు ముగ్గురూ భవానీ మాల ధరిం చారు. ఆటోలో అక్కయ్యపాలెం నుంచి రెక్కీ చేసుకుంటూ గోపాలపట్నం, నరవ వైపు ప్రయాణం చేసి... డిసెంబర్ 28న ఉదయం 6గంటల సమయంలో నరవ దగ్గర ఒంటరిగా నడుచుకుని వెళ్తున్న మహిళ మెడలోని పుస్తెల తాడు తెంపుకుని ఆటోలోనే పరారయ్యారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితులు ముగ్గురుని పెందుర్తి క్రైం ఇన్స్పెక్టర్ టి.నవీన్‌కుమార్, ఎస్ఐ జీడీ బాబు, కానిస్టేబుల్ వై.చిన్నారావు, కె.అప్పలరాజు అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు రికవరీ చేశారు. నిందితుల్లో పెద్దిశెట్టి రూపేష్పై ఫోర్తుటౌన్ పోలీస్ స్టేషన్లో సస్పెట్ సీటు ఉంది. ఇతనిపై రెండు రోబరీ కేసులు, రెండు చైన్ స్నాచింగ్‌లు, రెండు ఆటో టైర్లు దొంగతనం కేసులు ఉన్నాయి. వీటిలో అరెస్ట్ అయి జైలు శిక్ష కూడా అనుభవించాడు. రెండో నిందితుడు దంగుడుబోయిన వెంకటేష్‌పై కూడా చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయి. ఈ ఏడాది తగ్గిన నేరాలు : ఏటా పండగ రోజుల్లో దొంగతనాలు ఎక్కువుగా జరిగేవని, ఈ ఏడాది తీసుకున్న జాగ్రత్తల వల్ల తగ్గుముఖం పట్టాయని నగర క్రైం డీసీపీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఈ ఏడాది రద్దీగా గల దుకాణాలులో, ఇంటి దొంగతనాలు తక్కువుగా నమోదయ్యాయన్నారు. దొంగతనం కేసుల్లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు కీలకంగా మారుతున్నారని క్రైం డీసీపీ దామోదర్ తెలిపారు. పెందుర్తి చైన్ స్నాచింగ్ కేసులో నిందితులను పట్టుకోవటంతో తమకు సహకరించిన ఇ.మణికంఠను ఆయన ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డు అందజేశారు. అదేవిధంగా నిందితులను పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన పోలీస్ సిబ్బందికి నగదు రివార్డులు అందజేసి అభినందించారు. ఇంటి తాళం పగులగొట్టి.. రాత్రి పూట ఇంటికి వేసి ఉన్న తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడిన వ్యక్తితో పాటు, దొంగ సొత్తును కలిగి ఉన్న వ్యక్తులను ఆరిలోవ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.3.60లక్షల నగదు, రూ.7.28లక్షల విలువ గల 122.91 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. విశాలాక్షినగర్ ప్రాంతానికి చెందిన చింతపల్లి వెంకటరావు ఈ నెల 16వ తేదీన ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా బయటకు వెళ్లారు. అదే రోజు ఆర్కేబీచ్లో మూరి మిక్చర్ అమ్ముకునే దంగేటి సతీష్, అతని స్నేహితుడు మేడిశెట్టి వరప్రసాద్ మద్యం సేవించారు. తరువాత దంగేటి సతీష్ తన అత్తగారింటికి వెళ్తూ విశాలాక్షినగర్ రామాలయం వీధిలో గల మూడో అంతస్తుపైన గల ఇంటికి తాళం వేసి ఉన్న సంగతి గమనించాడు. సతీష్ తన దగ్గర గల గుణపంతో తాళం విరగ్గొట్టి ఇంటిలోకి ప్రవేశించాడు. ఇంటిలో గల బంగారం, నగదు దొంగిలించాడు. తరువాత వంట గదిలోని కారం, పసుపు ఇంట్లో జల్లి తన వేలి ముద్రలు పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. తరువాత దొంగలించిన సొత్తును తన స్నేహితుడు మేడిశెట్టి వరప్రసాద్‌కు అప్పగించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఆరిలోవ పోలీసులు ద్వారకా సబ్‌డివిజన్ క్రైం ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసరావు, ఆరిలోవ క్రైం ఎస్ఐ పి.విజయకుమార్, ఎస్ఐ డి.సూరి తమ సిబ్బందితో దర్యాప్తు చేపట్టారు. తాజాగా హనుమంతువాక వద్ద దంగేటి సతీష్‌ని, మేడిశెట్టి వరప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వ్యసనాలకు బానిసైన దంగేటి సతీష్‌పై వన్టౌప్ పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. వాటిలో ఎనిమిది నెలల శిక్ష కూడా అనుభవించాడు. త్రీటౌన్‌లో ఒక కేసులో మూడు నెలల జైలు శిక్ష పడింది. రెండో నిందితుడు మేడిశెట్టి వరప్రసాద్‌పై రౌడీషీట్ ఉంది. చనిపోయిన రౌడీ షీటర్ కాశీంకు సన్నిహితుడు కూడా. ఇతనిపై ఒక హత్యకేసు, ఒక రోబరీ కేసు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులు ఉన్నాయి. -
రెండు చోట్ల చైన్ స్నాచింగ్
గుంటూరు ఈస్ట్: రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో కొద్ది నిమిషాల వ్యవధిలో ఇద్దరు మహిళల మెడలోని బంగారు గొలుసులు తెంచుకుని పోయిన ఘటన గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో కలకలం రేపింది. సేకరించిన సమాచారం మేరకు... లాలాపేట పరిధిలోని చలమయ్య కళాశాల రోడ్డులో మిట్టపల్లి రాజశేఖర్ భార్య రాణి మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో నడిచి వెళుతుంది. ఓ అగంతకుడు తలకు హెల్మెట్ పెట్టుకుని ద్విచక్రవాహనంపై వచ్చి రాణి మెడలోని ఎనిమిది సవర్ల బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. చైన్‌కు ఉన్న రాకెట్ మాత్రమే కిందపడింది. 20 నిమిషాల తేడాతో అదేగంతకుడు పాతగుంటూరు పోలీసు స్టేషన్ పరిధిలోని బూరెల వారివీధిలో నడిచి వెళుతున్న పాదర్తి ఎస్.ఎన్.మూర్తి భార్య సుగుణ మెడలోని నాలుగు సవర్ల బంగారు గొలుసు తెంచుకుని పరారయ్యాడు. ఒకే వ్యక్తి రెండు చైన్‌స్నాచింగ్‌లు చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రెండు చైన్‌స్నాచింగ్‌లు జరగడంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్నారు. ఈస్ట్, వెస్ట్ పరిధిలోని అన్ని స్టేషన్ల సీఐలు, స్పెషల్ బ్రాంచ్‌ల పోలీసులు సంఘటనా స్థలాలకు వెళ్లి విచారణ మొదలు పెట్టారు. ఉన్నతాధికారులు పలు బృందాలను నిందితుడిని పట్టుకునేందుకు నియమించారు. -
గొలుసుల బరువెక్కువని.. దక్షిణాదిపై మొగ్గు
సాక్షి,సిటీబ్యూరో: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల్లో తొమ్మిది స్నాచింగ్‌లకు పాల్పడి హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన సీరియల్ స్నాచర్ల విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో పట్టుకున్న వీరిని పోలీసులు మంగళవారం నగరానికి తరలించారు. వీరు తస్కరించిన దాదాపు 30 తులాల బంగారం స్వాధీనం చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉదంతం క్షేత్రస్థాయి లోని అనేక లోపాలను వెలుగులోకి తెచ్చింది. స్థానికులు, యూపీ వాసులతో కూడిన ఈ ముఠా ను బుధవారం అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. రెండు రోజుల్లో వరుస హల్చల్... ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్నాచర్లు పక్షం క్రితం రెండు రోజుల్లో హల్చల్ చేశారు. తొమ్మిది స్నాచింగ్స్ చేయడంతో పాటు మరో యత్నానికీ పాల్పడ్డారు. మొదటి రోజు ఉదయం మలక్‌పేటలో బైక్ (టీఎస్ 08 ఈపీ 4005) అద్దెకు తీసుకున్న వీరు అదే రోజు సాయంత్రం గంట వ్యవధిలో మీర్‌పేట, వనస్థలిపురం, హయత్‌నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఐదు చోట్ల పంజా విసిరారు. అక్కడి నుంచి నల్లగొండ చౌరస్తా మీదుగా మలక్‌పేట వరకు వచ్చిన వీరు మళ్లీ వెనక్కు వెళ్లి చైతన్యపురి ప్రాంతంలో అదృశ్యమయ్యారు. ఆ రాత్రి ఓ లాడ్జిలో తలదాచుకున్న ఈ ద్వయం గురువారం ఉదయం నాగోల్‌లో ఓ స్నాచింగ్‌కు యత్నించింది. ఆపై 7 గంటలకు చైతన్యపురిలో మొదలెట్టి 40 నిమిషాల్లో వనస్థలిపురం, హయత్‌నగర్‌ల్లో నాలుగు స్నాచింగ్స్ చేసింది. హయత్‌నగర్ నుంచి తిరిగి ఎల్బీనగర్ మీదుగా సాగర్ రోడ్డు వరకు వెళ్లి అదృశ్యమైంది. అద్దెకు ఇచ్చిన వారిని విచారిస్తే... స్నాచింగ్ ఉదంతాల నేపథ్యంలో రికార్డైన సీసీ కెమెరా ఫుటేజ్‌లో కేటీఎం వాహనం వెనుక కూర్చున్న స్నాచర్ ఓ ట్రావెల్ బ్యాగ్‌ను వెనుక వేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు బయటి నుంచి వచ్చిన దుండగులే ఈ పని చేశారని ప్రాథమికంగా నిర్థారించారు. ఆపై వాహనం సైతం లభించడంతో లోతుగా ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు స్నాచర్లు వాహనాన్ని మలక్‌పేటలో అద్దెకు తీసుకున్నట్లు తేలింది. వారు వినియోగించిన కేటీఎం వాహనం మహేశ్వర్‌రెడ్డి పేరుతో ఉండటంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా రెండేళ్ల క్రితం అతను దానిని మహ్మద్ ముఘాయిజ్‌ను విక్రయించినట్లు తేలింది. ఇతడి అనుచరుడైన సూఫియాన్ సదరు వాహనాన్ని కొన్నాళ్లుగా అద్దెకు ఇస్తున్నాడు. సూఫియాన్ వద్దే ఉత్తరాది స్నాచర్లకు ఈ వాహనాన్ని నగరానికి చెందిన ఓ వ్యక్తి అద్దెకు ఇప్పించినట్లు తేలింది. అతడిని పట్టుకుని విచారించగా సూత్రధారిగా బయటపడటంతో పాటు పాత్రధారుల వివరాలూ తెలిశాయి. యూపీ వెళ్లిన టాస్క్‌ఫోర్స్ ముమ్మరంగా గాలించి స్నాచర్లను పట్టుకుంది. మూడు తులాలకు పైనే.. వీరి విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీరిని విచారించిన అధికారులు ఉత్తరాదికి చెందిన ముఠాలు దక్షిణాదితో పాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలపై ఎందుకు కన్నేస్తున్నారని ప్రశ్నించారు. దీనికి వారు చెప్పిన సమాధానం విని అధికారులే అవాక్కయ్యారు. ఉత్తర భారతదేశంలో మహిళలు మెడలో పుస్తెలతాడు లేదా బంగారు గొలుసులు ధరించి తిరగడం చాలా తక్కువట. ఒకవేళ ఎవరైనా తిరిగినా దాని బరువు గరిష్టంగా తులం, అంతకంటే తక్కువగానే ఉంటుందని ఈ ముఠా వెల్లడించింది. అదే దక్షిణ భారతదేశం విషయానికి వస్తే... ఇక్కడ మహిళలు కచ్చితంగా పుస్తెలతాడు ధరించడంతో పాటు ఏ గొలుసు చూసినా కనిష్టంగా మూడు తులాలు ఉంటుందని గుర్తించామన్నారు. దీంతోపాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో భాష సమస్య లేకపోవడంతో పాటు ప్రధాన రహదారులకు అనుసంధానంగా ఉండే లైన్లు, బైలైన్లు ఎక్కువ కావడంతో తప్పించుకోవడమూ సులువని వారు వివరించారు. -
మహిళ మెడలో గొలుసు చోరీ
కుషాయిగూడ: గుడికి వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లిన సంఘటన గురువారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాప్రాలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాప్రా, ప్రశాంత్‌నగర్ కాలనీ, సాయినివాస్కు చెందిన కర్రె మాధవి గురువారం సమీపంలోని చాముండేశ్వరీ ఆలయాని కి నడిచి వెళుతుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఓ ఆగంతకుడు ఆమె వీపుపై కొట్టి మెడలో ఉన్న 7 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. దీనిపై సమాచారం అందడంతో మల్కాజిగిరి డీసీపీ ఉమా మహేశ్వరశర్మ, క్రైం డీసీపీ సలీమా, డిఐ భాస్కర్, ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, డిఎస్సై విజయకృష్ణ, ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గూగుల్ మ్యాప్ సాయంతో పరార్..?
సాక్షి, సిటీబ్యూరో: రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల వ్యవధిలో 9 స్నాచింగ్స్, మరో యత్నానికి పాల్పడిన దుండగులు వినియోగించిన ద్విచక్ర వాహనం ఆచూకీని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కనిపెట్టారు. భవానీనగర్ ఠాణా పరిధిలోని ఓ వ్యక్తి దీన్ని ఆ చోరులకు అద్దెకు ఇచ్చినట్లు తేల్చారు. సీసీ కెమెరాల్లో లభించిన ఫీడ్ ఆధారంగా స్నాచర్లు వాడిన కేటీఎం వాహనంనెంబర్ ‘టీఎస్ 08 ఈపీ 4005’గా గుర్తించిన పోలీసులు దీని ద్వారా ముందుకు వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు దక్షిణ మండలంలోని భవానీనగర్ ఠాణాలకు తరలించారు. దీని యజమానితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. స్నాచర్లను పట్టుకోవడానికి సిటీ, రాచకొండలకు చెందిన టీమ్స్ బీహార్, యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల్లో గాలిస్తున్నాయి. విమానంలో వచ్చి ఉంటారా? ఉత్తరాదికి చెందిన అనేక వ్యవస్థీకృత ముఠాలు కొన్నేళ్లుగా సిటీని టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్నాయి. కొన్ని ముఠాలు వాహనాలను తీసుకుని వస్తుండగా... మరికొన్ని సిటీలో, చుట్టు పక్కల జిల్లాల్లో చోరీ చేసినవి వినియోగించాయి. తాజాగా పంజా విసిరిన ముఠాను ఉత్తరప్రదేశ్‌కు చెందినదిగా అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్ విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ఉంటుందని భావిస్తున్నారు. బుధవారం నాటి ఉదంతాల నేపథ్యంలో రికార్డు అయిన సీసీ కెమెరా ఫుటేజ్‌లో వెనుక కూర్చున్న స్నాచర్ ఓ ట్రావెల్ బ్యాగ్‌ను వెనుక వేసుకున్నట్లు కనిపి స్తోంది. ఈ నేపథ్యంలోనే బయట నుంచి వచ్చిన దుండగులే ఈ పని చేశారని అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. శుక్రవారం వారు వినియోగించిన వాహనం దొరకడంతో ఈ అనుమానాలకు బలమైన ఆధారాలు సైతం లభించాయి. వాహనం అద్దెకు తీసుకుని... ఇద్దరు స్నాచర్లు వాహనాన్ని పాతబస్తీలో అద్దెకు తీసుకున్నారు. వారు వినియోగించిన కేటీఎం వాహనం మహేశ్వర్‌రెడ్డి పేరుతో ఉంది. సీసీ కెమెరాల ఆధారంగా దాని నెంబర్ గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రెండేళ్ల క్రితం దాన్ని పాతబస్తీకి చెందిన మహ్మద్ ముఘాయిజ్కు విక్రయించినట్లు తేలింది. ఇతడి అనుచరుడైన సూఫియాన్ ఆ వాహనాన్ని కొన్నాళ్లుగా అద్దె కు ఇస్తున్నాడు. సూఫియాన్ వద్దే ఉత్తరాది స్నాచ ర్లు బుధవారం ఉదయం వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఆ రోజు సాయంత్రం వరకు రెక్కీలు చేసి గంట వ్యవధిలో మీర్‌పేట, వనస్థలిపురం, హయత్‌నగర్, ఎల్బీనగర్ల్లో ఐదు చోట్ల పంజా విసిరారు. అక్కడ నుంచి నల్లగొండ చౌరస్తా మీదుగా మలక్‌పేట వరకు వచ్చిన వీళ్లు మళ్లీ వెనక్కు వెళ్లి చైతన్యపురి ప్రాంతంలో అదృశ్యమయ్యారు. గూగుల్ మ్యాప్ సాయంతో పరార్..? ఆ రాత్రి చైతన్యపురి–నాగోల్ మధ్య ఓ ప్రాంతంలో తలదాచుకున్న ఈ ద్వయం గురువారం ఉదయం మళ్లీ పంజా విసిరింది. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో నాగోల్‌లో ఓ స్నాచింగ్‌కు యత్నించింది. ఆపై 7 గంటలకు చైతన్యపురిలో మొదలెట్టి 40 నిమిషాల్లో వనస్థలిపురం, హయత్‌నగర్‌ల్లో నాలుగు స్నాచింగ్స్ చేసింది. హయత్‌నగర్ నుంచి తిరిగి ఎల్బీనగర్ మీదు గా నాగార్జునసాగర్ రోడ్డు వరకు వెళ్లి అదృశ్యమైంది. దీన్ని బట్టి ఈ దుండగులు ట్రాఫిక్ లేని మార్గాలను, తాము చేరాల్సిన గమ్యాలను గుర్తించడం కోసం గూగుల్ మ్యాప్స్ సహాయం తీసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం ఉదయం వీరు వినియోగించిన బైక్ భవానీనగర్ పరిధిలోని ఓ ప్రాంతంలో ఉండటాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకుని స్థానిక ఠాణాకు తరలించారు. ఐడీ లేకుండా అద్దెకు ఎలా..? వాహనం నెంబర్ ఆధారంగా మహేశ్వర్‌రెడ్డిని, ముఘాయిజ్‌ను, సూఫియాన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే దాన్ని సూఫియాన్ ఆ ఇద్దరు స్నాచర్లకు అద్దెకు ఇచ్చినట్లు తేలింది. సాధారణంగా ఇలా వాహనాలు అద్దెకు ఇచ్చే వాళ్లు అవతలి వారి గుర్తింపుకార్డులు తీసుకుంటారు. తాను మాత్రం అలా చేయలేదని సూఫియాన్ పోలీసులకు చెప్పాడు. దీంతో ఇతడి వ్యవహారాన్నీ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. తనకు పరిచయస్తుడైన ఓ వ్యక్తి చెప్పడంతో వాహనం ఇచ్చానని సూఫియాన్ చెప్పడంతో అతడినీ అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో స్నాచర్లకు స్థానికులు సహకరించారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. స్నాచింగ్ చేసిన తర్వాత దుండగులు తమ వద్ద ఉన్న దాదాపు 30 తులాల బంగారం గొలుసులతో విమానంలో వెళ్లారని పోలీసులు అంటున్నారు. దీంతో బస్సు లేదా రైలులో నగరం దాటడమో, ఒకరు సొత్తుతో వెళ్లిపోగా.. వేరే వారు విమానంలో వెళ్లడమో జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ వాహనంపై 2017ఏప్రిల్ 3 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 27 వరకు మూడు పోలీసు కమిషనరేట్లకు సంబంధించిన 12 ఈ–చలాన్ల మొత్తం రూ.2785 పెండింగ్‌లో ఉంది. -
తస్మాత్ జాగ్రత్త..! ఇలా వచ్చి అలా తెంచుకెళ్తారు
సాక్షినెట్‌వర్క్, హైదరాబాద్ : చైన్ స్నాచర్లు చెలరేగిపోయారు. బుధవారం సాయంత్రం ఎల్బీనగర్ జోన్లో వరుసగా చేసిన ఐదు చోరీలతో పోలీసులు అప్రమత్తమైనా గురువారం తెల్లవారుజామున కూడా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఠాగా భావిస్తున్న ఇద్దరు దొంగలు మరో నాలుగు గొలుసు దొంగతనాలు చేయడం నిఘా డొల్లతనాన్ని బయటపెడుతోంది. ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ రంగంలోకి దిగి అన్ని ఠాణాల ఎస్హెచ్ఓలను అప్రమత్తం చేసినా దొంగలను మాత్రం పట్టుకోలేకపోయారు. కేటీఎం బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు దాదాపు 15 గంటల వ్యవధిలో తొమ్మిది చైన్ స్నాచింగ్‌లు చేసి పోలీసులకు సవాల్ విసరడం చర్చనీయాంశమైంది. ఈ వరుస చోరీలతో మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. వరుస చోరీలను సవాల్‌గా తీసుకున్న రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ ప్రత్యేకంగా ఎనిమిది బృందాలను రంగంలోకి దింపారు. ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్లతో పాటు ప్రధాన చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. నంబర్ ప్లేట్ లేని బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ఈ చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. నిందితులున్న సీసీటీవీ ఫుటేజీలను ఇతర రాష్ట్రాల పోలీసులకు పంపించగా వారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇరానీ గ్యాంగ్‌లోని వ్యక్తులుగా గుర్తించారు. వీరు విమానాల్లో నగరానికి వచ్చి చోరీలకు తెగబడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శివార్లలోని అన్ని ప్రాంతాల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఈ ఇద్దరు చైన్ స్నాచర్ల కోసం వెతుకుతున్నారు. బుధవారం సాయంత్రం గంట వ్యవధిలో ఐదు చైన్‌స్నాచింగ్‌లు చేసిన ఈ ముఠా.. చివరగా అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద కనిపించిందని, అక్కడే బస చేసి మళ్లీ గురువారం తెల్లవారుజామున చైన్ స్నాచింగ్‌లు చేసి ఉంటారన్న అనుమానిస్తున్నారు. వరుస చైన్ స్నాచింగ్‌లతో సైబరాబాద్ కమిషనరేట్‌లోని పోలీసులు కూడా అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. 15 గంటల్లో 32 తులాలు చోరీ వనస్థలిపురం, ఎల్బీనగర్, మీర్‌పేట, హయత్‌నగర్ ఠాణాల పరిధుల్లో గొలుసు దొంగలు ఐదు చోట్ల 19 తులాలకు పైగా బంగారు నగలు అపహరించుకపోయిన స్నాచర్లు గురువారం ఉదయం 7 నుంచి 7.40 లోపు చైతన్యపురి, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో నాలుగు చోరీలకు పాల్పడ్డారు. ఇందులో 13 తులాల బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు. బుధ, గురువారాల్లో మొత్తం 32 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి చైతన్యపురికి గురువారం ఉదయం 6.45 గంటలకు చేరుకున్న చైన్‌స్నాచర్లు టెలిఫోన్‌కాలనీ రోడ్ నెం.3లో ఉదయం 7 గంటలకు ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న ఈశ్వరి(40) మెడలోని ఐదు తులాల పుస్తెలతాడును తెంపబోతుండగా ప్రతిఘటించింది. దీంతో చేతికి వచ్చిన సగం గొలుసుతో స్నాచర్లు పరారయ్యారు. వెంటనే వనస్థలిపురం పోలీస్ స్టేషన్ సహారారోడ్డులోని ఇందిరానగర్ కాలనీ వాసి ధనలక్ష్మి(46) ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లి వస్తుండగా ఎంఈ రెడ్డి ఫంక్షన్‌హాల్ వద్ద ఆమె మెడలోని నాలుగు తులాల పుస్తెల తాడును తెంచుకుని పారిపోయారు. లెక్చరర్స్ కాలనీలో బాదితురాలు లక్ష్మమ్మ, కుంట్లూర్ రోడ్డులో బాధితురాలు నిర్మల హయత్‌నగర్‌లో పది నిమిషాల వ్యవధిలో ఇద్దరు మహిళల మెడ లోనుంచి ఆరున్నర తులాల బంగారు గొలుసులను లాక్కుపోయారు. నల్లగొండకు చెందిన కుంభం లక్ష్మమ్మ(52) బందువుల ఇంట్లో పెళ్లి కోసమని వారం క్రితం హయత్‌నగర్‌లోని లెక్చరర్స్ కాలనీకి వచ్చింది. గురువారం పెళ్లి ఉదయం 7.30కి ఇంటి ముందు నిలబడగా నల్లటి బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కుని పారిపోయారు. అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన దోనూరు నిర్మల(37) కుంట్లూర్‌లో తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు బస్సులో హయత్‌నగర్ వరకు వచ్చి కుంట్లూర్ రోడ్డులోని ఎస్సార్ పెట్రోల్ బంకు సమీపంలో ఆటో కోసం నిలబడింది. వేగంగా బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నిర్మల మెడలోని 2.5 తులాల బంగారు గొలుసును తెంచుకుపోయారు. అయితే, లెక్చరర్స్ కాలనీలో లక్ష్మమ్మ చైన్‌ను లాక్కున్న దుండగులు పది నిమిషాల వ్యవధిలో కుంట్లూర్ రోడ్డు వైపు వెళ్లి నిర్మల గొలుసును లాక్కున్నట్టు సీసీటీవీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. విజయవాడ జాతీయ రహదారి వెంట చైన్‌స్నాచర్లు పారిపోయే అవకాశం ఉండడంతో పోలీసు బృందాలు తనిఖీలు చేపట్టాయి. రంగంలోకి యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్స్? చైన్ స్నాచింగ్ ముఠా ఒకప్పుడు నడుచుకుంటు వేళ్లే మహిళలనే టార్గెట్ చేసేవారు. అయితే, గత కొద్దికాలంగా జరుగుతున్న గొలుసు దొంగతనాలను చూస్తే, రోడ్డు పై నుంచి ఏకంగా ఇళ్లల్లోకే వచ్చేస్తున్నారు. స్నాచింగ్ సమయంలో మహిళలను తీవ్రంగా గాయపరుస్తున్నారు. ఒక్కోసారి ప్రాణాలు పోయే స్థితికి తీసుకొస్తున్నారు. చైన్ స్నాచర్ల ఆగడాలను ఆటకట్టించేందుకు అప్పటి ఉమ్మడి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆలోచనలకు అనుగుణంగా ప్రత్యేక ‘యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్’ రంగంలోకి దిగింది. కానిస్టేబుల్‌గా విధి నిర్వహణలో సమర్థులైన 110 మందిని ఎంపిక చేసి ప్రత్యేక తర్పీదునిచ్చారు. ఒక్కో బృందంలో ఇద్దరేసి సభ్యులతో 55 టీమ్‌లను ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ సమకూర్చిన బైక్‌లతో సాధారణ పౌరుడిగా నగరంలో 24 గంటల పాటు పహారా కాయడమే వీరి విధి. మానసికంగా, శారీరకంగా వీరిని సంసిద్ధులను చేసేందుకు మోటివేనల్ క్లాసులు, షార్ట్ వెపన్ హ్యండిల్ చేయడం, బైక్‌లపై వేగంగా వెళ్లడంలో అనుభవజ్ఞులతో శిక్షణను ఇచ్చారు. ఈ జట్లు రంగంలోకి దిగినకొత్తలో కొంత మంది చైన్ స్నాచర్లను ప్రత్యక్షంగా పట్టుకొని దొంగల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి. ఆత్మరక్షణ కోసం ఎల్బీనగర్లో చైన్స్నాచర్లపైకి గాల్లోకి కాల్పులు జరిపిన ఉదంతం సంచలనం సృష్టించింది. ఈ టీమ్‌ల రాకతో అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ గ్యాంగ్‌లు ఇటువైపు చూడడమే మానేశాయి. అయితే సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లుగా విడిపోయాక యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్ ప్రాధాన్యత తగ్గింది. ఈ బృందాలను రంగంలోకి దింపితే ఊహించని రీతిలో జరిగే చైన్ స్నాచింగ్‌లను నిలువరించే అవకాశం ఉందనే వాదన పోలీసు శాఖలోనే వినబడుతోంది. సిటీలోనూ అప్రమత్తం రాచకొండ కమిషనరేట్ పరిధిలో బుధవారం నుంచి జరుగుతున్న వరుస చైన్ స్నాచింగ్‌ల నేపథ్యంలో సిటీ పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. స్నాచర్ల కదలికలు, ఆచూకీ కనిపెట్టడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. రహదారుల వెంట తనిఖీలు ముమ్మరం చేశాం. స్నాచర్లు బస చేశారనే అనుమానంతో లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు చేస్తున్నాం. నగరం మొత్తం అలర్ట్ ప్రకటించాం. – అంజనీకుమార్, నగర పోలీస్ కమిషనర్ -
పూలు కోస్తుండగా పుస్తెలతాడు చోరీ
రాజేంద్రనగర్: దేవుడి పూజ కోసం ఇంటి పక్కన ఉన్న చెట్ల నుంచి పూలు కోస్తున్న ఓ గృహిణి మెడలోని ఐదున్నర తులాల బంగారు గొలుసును బైక్‌పై వెనుక నుంచి వచ్చిన యువకుడు తెంపుకెళ్లాడు. విషయాన్ని గమనించి స్థానికుడు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హుడాకాలనీ శివాజీనగర్ ప్రాంతానికి చెందిన అనసూయ(56), నర్సింహ భార్యాభర్తలు. నర్సింహ పోలీస్ శాఖలో పని చేసి రిటైర్డ్ అయ్యాడు. అనసూయ రోజూ మా దిరిగానే సోమవారం ఉదయం పూజ చేసేందుకు గాను బయట ఉన్న మొక్కల నుంచి పూలు కోసేందుకు బయటకు వచ్చింది. పూలు కోస్తున్న సమయంలో స్కూటీపై హెల్మెట్ ధరించిన యువకుడు అటూ ఇటూ తిరుగుతున్నాడు. అతడిని అనసూ య అంతగా పట్టించుకోలేదు. ఆ యువకుడు వెను క నుంచి హఠాత్తు వచ్చి ఆమె మెడలోని పుస్తెలతాడును పట్టుకొని వాహ నంపై ముందుకు దూసుకువెళ్లాడు. అప్రమత్తమైన అనసూయ బం గారు గొలుసును పట్టుకొని దొంగా దొంగా అ ంటూ అరుపులు పెడుతూ ముం దుకు వెళ్లింది. చైన్‌స్నాచర్ ఒక్కసారిగా బలంగా లాగి పుస్తెలతాడును తెంచుకొని పరారయ్యాడు. ఈ విషయాన్ని గ్రహించిన పక్కనే ఉండే జీవన్ అనే వ్యక్తి చైన్స్నాచ ర్ వాహనానికి అడ్డు వచ్చి పట్టుకునేందుకు ప్ర య త్నించాడు. ఈ సమయం లో చైన్‌స్నాచర్ కిందపడ్డాడు. పక్కనే ఉన్న కర్ర దుంగను తీసుకొని చైన్ స్నాచర్ జీవన్‌పై దాడిచేసి వెంటనే వాహనంపై ప్రధాన రహదారి మీదుగా పరారయ్యాడు. పక్కనే ఉన్న మరో ఇద్దరు ముగ్గురు యువకులు ఈ సమయంలో చైన్స్నాచర్ను ప్రతిఘటిస్తే చిక్కేవాడు. కానీ ఏ ఒక్కరు ము ందుకు రాలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ సురేష్, రాజేంద్రనగర్ డివిజన్ ఏసీపీ అశోక చక్రవర్తి పరిశీలించారు. బాధితురాలి ని వివరాలు అడి గి తెలుసుకున్నారు. ఘటనా స మయంలో చైన్‌స్నాచర్ ఫోన్లో మాట్లాడుతున్నట్లు సీసీ కెమెరాలో నిక్షిప్తమైందని, ఆ సమయ ంలో ఫో న్ డేటాను సేకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలో నిందితుడిని అరెస్తు చేస్తామని ఏసీపీ వెల్లడించారు. -
ఘరానా దొంగ ఆటకట్టు
సాక్షి, సిటీబ్యూరో: బైక్‌లు దొంగతనం చేసి నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్న మహిళల మెడలో నుంచి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న పాత నేరస్తుడితోపాటు రిసీవర్‌ను వనస్థలిపురం పోలీసులు, ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. క్రైమ్స్ డీసీపీ కేఆర్ నాగరాజు, ఎల్బీనగర్ సీసీఎస్ అడిషనల్ డీసీపీ డి.శ్రీనివాస్‌తో కలిసి సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. చాంద్రాయణగుట్టకు చెందిన మహమ్మద్ అమీర్ ఓ కంపెనీలో గ్లాస్ ఫిట్టర్‌గా పని చేసేవాడు. వస్తున్న ఆదాయం చాలక చోరీల బాట పట్టాడు. ఒంటరిగానే వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసి ఉన్న బైక్‌లను దొంగిలించి సీసీటీవీ కెమెరాలు లేని ప్రాంతాల్లో మాటువేసి ఒంటరిగా వచ్చే మహిళల మెడలో నుంచి బంగారు ఆభరణాలు లాక్కెళ్లేవాడు. వాటిని సరూర్‌నగర్‌లోని కనకమహలక్ష్మీ జ్యువెల్లరీ షాప్‌లో పనిచేసే సయ్యద్ తౌఫిక్‌కు ఇచ్చి డబ్బులు తీసుకునేవాడు. ఇలా 2014లో చైన్ స్నాచింగ్ కేసులో చిక్కడపల్లి పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారించగా సైబరాబాద్, హైదరాబాద్‌లో 18 చోరీలు చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. బయటకు వచ్చాక మళ్లీ చైన్ స్నాచింగ్‌లు చేస్తూ తుకారాంగేట్ పోలీసులకు దొరికాడు. చివరిసారిగా గాంధీనగర్ పోలీసులు పట్టుబడగా నాన్‌బెయిలెబుల్ వారంట్ జారీ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 11న జైలు నుంచి బయటకు వచ్చిన అమీర్ ఎల్బీనగర్, వనస్థలిపురంలో ఆరు బైక్‌లు చోరీలు చేయడంతో పాటు మూడు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. వేలిముద్రల ఆధారంగా నిందితుడు అమీర్‌గా గుర్తించిన పోలీసులు అతడి కదలికలపై నిఘా ఉంచారు.ఈ నేపథ్యంలో ఎఫ్‌సీఐ కాలనీలో అతడిని అదుపులోకి విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో చోరీ సొత్తును కొనుగోలు చేసిన రిసీవర్ సయ్యద్ తౌఫిక్‌ను కూడా అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.3లక్షల విలువైన బంగారు ఆభరణాలు, బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. -
నగరంలో చైన్ స్నాచర్ల అలజడి
అల్లిపురం(విశాఖ దక్షిణ): నగరంలో చైన్‌స్నాచర్లు మరోసారి చెలరేగిపోయారు. డాబా గార్డెన్స్, మురళీనగర్ ప్రాంతాల్లో ఇద్దరు మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలు తెంపుకునిపోయి పోలీసులకు సవాల్ విసిరారు. ముఖ్యంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు, నగర పోలీస్ కమిషనరేట్‌కు మధ్యన చైన్‌స్నాచర్లు గురువారం ఉదయం అలజడి సృష్టించడం అందరినీ విస్మయపరిచింది. నిత్యం రద్దీగా ఉండే డాబాగార్డెన్స్ ప్రాంతంలో ఈ ఘటన జరగడం నగర ప్రజలను ఆందోళనకు గురిచేసింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... కంచరపాలెం, బర్మాక్యాంపునకు చెందిన ఉండ్రాజనవరపు అన్నపూర్ణ డాబాగార్డెన్స్‌లో గల ఎం.ఎన్.ఆర్ స్కూల్లో గత 12 సంవత్సరాలుగా టీచరుగా ఉద్యోగం చేస్తున్నారు. గురువారం ఉదయం 8.10గంటల సమయంలో ఆమె ఆటోలో స్కూలుకి బయలుదేరారు. డాబాగార్డెన్స్‌లో గల ఎం.ఎఫ్.ఖాన్ షాపు వద్ద ఆటో దిగి రోడ్డు దాటి హెచ్డీఎఫ్సీ బ్యాంకు వీధిలో నుంచి ఎం.ఎన్.ఆర్ స్కూలుకు వెళ్తున్నారు. ఆ సమయంలో ఆమె అదే వీధిలో గల పయనీర్ షూ షాప్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎదురుగా వచ్చి ఆమె మెడలో గల తులమున్నర చైన్ తెంపుకుని పరారయ్యారు. ఈ హఠాత్ పరిణామంతో ఆమె తేరుకునేలోపు దుండగులు ఆర్కే ఫ్యామిలీ షాపు వైపు వెళ్లిపోయారు. వారిలో వాహనం నడుపుతున్న వ్యక్తి తలకు హెల్మెట్ ధరించి ఉండగా, వెనుక కూర్చున్న మరొక వ్యక్తి సాధారణంగా ఉన్నాడు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు మేరకు క్రైం ఏడీసీపీ వి.సురేష్‌బాబు, ఈస్ట్ ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, ఈస్ట్ క్రైం సీఐ కృష్ణారావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సమీపంలోని పయనీర్ చెప్పుల దుకాణం, ఇతర ఫర్నీచర్ షాపుల్లో గల సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. దుకాణదారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దుండుగులు ప్రయాణిస్తున్న వాహనం వివరాలు సేకరించారు. బాధతురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడినవారే.! గత నెలలో సుజాతనగర్, గోపాలపట్నం, బాలయ్యశాస్త్రి లే అవుట్ ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడిన వారే ప్రస్తుతం మహిళల మెడలోని చైన్లు తెంపుకుపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వాహనం నంబరు సీసీ కెమెరా దృశ్యాల్లో అస్పష్టంగా ఉందని తెలిపారు. దుండుగులు వాడిన వాహనం హోండా యూనికార్న్‌గా గుర్తించారు. వీరి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఆలయానికి వచ్చి వెళ్తుండగా... ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): మురళీనగర్ వైభవ వేంకటేశ్వరస్వామి గుడి సమీపంలో ఓ మహిళ మెడలో నుంచి రెండు తులాల పుస్తెలతాడును దుండగులు తెంపుకునిపోయారు. మురళీనగర్‌కు చెందిన లక్ష్మీ కొండమ్మ(45) గురువారం ఉదయం 10 గంటల సమయంలో స్థానిక వైభవ వేంకటేవ్వర స్వామి ఆలయానికి వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆలయానికి సమీపంలోనే గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని రెండు తులాల పుస్తెల తాడు తెంపుకునిపోయారు. జరిగిన ఘటనపై కంచరపాలెం నేర విభాగం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. వెంటనే ఎస్ఐ కుమార్, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సిటీలో స్నాచింగ్స్... ఫారెస్ట్‌లో మకాం!
సాక్షి, సిటీబ్యూరో: ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులకు చిక్కకుండా ఉండాలనే ఉద్దేశంతో సిటీలో స్నాచింగ్స్ చేసే సయ్యద్ అస్లాం జహీరాబాద్ అడవుల్లో మకాం వేస్తాడు. కేవలం నేరాలు చేయడానికి మాత్రమే తన అనుచరుడితో కలిసి బయటకు వస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు నేరం చేసినా ఇతగాడిని పట్టుకోవడానికి పోలీసులు కనీసం నెల రోజులు కష్టపడాల్సిందే. ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మాత్రం ఈసారి కేవలం నాలుగు రోజుల్లోనే అతడిని పట్టుకోగలిగారు. సైదాబాద్‌లో గురువారం చోటు చేసుకున్న కేసులో పట్టుబడగా, మరో రెండు నేరాలు వెలుగులోకి వచ్చాయని, చిక్కే సందర్భంలో ఇంకో నేరం చేశాడని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చైతన్యకుమార్‌లతో కలిసి సోమవారం వివరాలు వెల్లడించారు. ఎనిమిదేళ్లుగా నేరాలు.. జహీరాబాద్‌కు చెందిన సయ్యద్ అస్లం నగరంలోని ఓల్డ్ మలక్‌పేటలో స్థిరపడ్డాడు. కేవలం ఏడో తరగతి మాత్రమే చదివిన అతను కొన్నాళ్లపాటు వెల్డింగ్ పని చేశాడు. ఇలా వస్తున్న ఆదాయం జల్సాలకు సరిపోకపోవడంతో చైన్‌స్నాచర్‌గా మారాడు. 2010 నుంచి నేరాలు ప్రారంభించిన ఇతను ప్రతి సందర్భంలోనూ ఓ ‘కొత్త తోడు’ వెతుక్కుంటాడు. అతడితో కలిసే బైక్‌పై తిరుగుతూ స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. ఇలా ఇప్పటి వరకు మూడు కమిషనరేట్ల పరిధిలో 47 నేరాలు చేశాడు. గతంలో సంతోష్‌నగర్, చంద్రాయణగుట్ట, మీర్‌చౌక్, పంజగుట్ట, మీర్పేట్, మైలార్‌దేవ్‌పల్లి, కంచన్‌బాగ్, బోయిన్పల్లి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఇతడి నేర చరిత్రను పరిగణలోకి తీసుకున్న సిటీ పోలీసులు 2015లో పీడీ యాక్ట్ ప్రయోగించారు. దీంతో ఏడాది కాలం జైల్లో గడిపినా అతడి పంథాలో మార్పు రాలేదు. బోయిన్పల్లి పరిధిలో నేరాలు చేసి గత ఏడాది ఫిబ్రవరిలో పోలీసులకు చిక్కాడు. ఈ నెల 12 వరకు జైల్లోనే గడిపిన ఇతను బయటకు వచ్చాడు. పోలీసు దర్యాప్తుపై పట్టుండటంతో.... ఇప్పటికే అనేకసార్లు జైలుకు వెళ్లిన అస్లంకు పోలీసుల దర్యాప్తు తీరుతెన్నులపై మంచి పట్టుంది. ఈ నేపథ్యంలోనే నేరం చేసిన ప్రతిసారీ ఆ సొత్తును సొమ్ముగా మార్చుకుని అనుచరుడితో సహా జహీరాబాద్ అడవుల్లోకి పారిపోతాడు. కేవలం మరో నేరం చేయడానికి మాత్రమే బయటకు వస్తాడు. ఆహారాన్ని సైతం రహస్యంగా తీసుకుని వెళ్తుంటాడు. ఎవరైనా అతికష్టమ్మీద ఇతడి ఉనికి గుర్తించి ఆ అడవుల్లోకి వెళ్లినా పోలీసుల కదలికలను గుర్తించి పారిపోతాడు. ఈ నేపథ్యంలోనే ఇతడిని పట్టుకోవడానికి పోలీసులు కనీసం నెల రోజుల పాటు కష్టపడాల్సి ఉంటుంది. జైలుకు వెళ్లి బయటకు వచ్చిన తర్వాత మాత్రం మరో నేరం చేసే వరకు ఓల్డ్‌మలక్‌పేటలో ఉంటాడు. ఇతడి స్వస్థలం జహీరాబాద్ కావడంతో ఆ ప్రాంతంపై ఇతడికి పూర్తి పట్టుంది. వలపన్ని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్... ఈసారి కారాగారంలోనే పరిచయమైన ఓ నేరగాడి సమీప బంధువు, పాత నేరస్తుడు మహ్మద్ అమీర్‌తో కలిసి అస్లం రంగంలోకి దిగాడు. బైక్‌పై తిరుగుతూ గురువారం సైదాబాద్ ప్రాంతంలో పంజా విసిరి 2 తులాల బంగారు గొలుసు స్నాచింగ్ చేసుకుపోయాడు. ఈ కేసు దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా శుక్రవారమే నిందితుడు అస్లంగా గుర్తించింది. సైదాబాద్ ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్‌కుమార్‌తో కలిసి సోమవారం సైదాబాద్ ప్రాంతంలో వాహన తనిఖీలు చేస్తుండగా బైక్‌పై వస్తున్న అస్లం, అమీర్లను ఆపే ప్రయత్నం చేశారు. దీంతో అతను కత్తితో దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించగా ఒడిసిపట్టుకున్నారు తొలుత ఉన్న స్నాచింగ్ కేసుతో పాటు ఈ ఉదంతంతో ఈ ద్వయంపై దాడి కేసు నమోదైంది. వారు ప్రయాణిస్తున్న బండి విషయం ఆరాతీ యగా తాండూరులో చోరీ చేసిందని తేలింది.వారి వద్ద లభించిన ఓ బ్యాగ్‌పై నిందుతులను విచారించగా అది సంతోష్‌నగర్ పరిధిలో స్నాచింగ్ చేసిందిగా వెల్లడైంది. దీంతో వీరు ఈ రెండు నేరాలు కూడా చేసినట్లు వెలుగులోకి వచ్చింది. -
డబ్బుల కోసం ప్రేమికుల చైన్ స్నాచింగ్‌లు
నాగోలు: సినీ ఫక్కీలో బైక్‌పై తిరుగుతూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఓ వ్యక్తితో పాటు మరో మహిళను ఎల్బీనగర్ సీసీఎస్, యాచారం పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో ఇన్చార్జి డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ వివరాలు వెల్లడించారు. సూర్యపేటకు చెందిన నందిపాటి వినోద్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. నగరానికి వలస వచ్చిన ఇతను సరూర్‌నగర్‌లోని జనప్రియ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. 2015లో పెళ్లి చేసుకున్న అనంతరం సంతోష్ శివశక్తి గ్యాస్ ఏజెన్సీ గోదాములో ఇన్చార్జిగా చేరాడు. విధినిర్వహణలో అక్రమాలకు పాల్పడటంతో నిర్వాహకులు అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. అనంతరం కర్మన్‌ఘాట్‌లోని ఐశ్వర్య గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌గా చేరి గోదాము ఇన్చార్జిగా పదోన్నతి పొందాడు. సరూర్‌నగర్ తపోవన్కాలనీకి చెందిన గోవూరి కీర్తితో అతడికి పరిచయం ఏర్పడింది. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో చైన్ స్నాచింగ్‌లకు పథకం పన్నారు. ఒక చాకు, కారం పొడి తీసుకుని బైక్‌పై తిరుగుతూ ఒంటరిగా వెళుతున్న మహిళల కళ్లల్లో కారంకొట్టి చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో యాచారం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళ నుంచి 4.5 తులాల బంగారు గొలుసు, రూ.1000 నగదు లాక్కెళ్లారు. మంచాల పోలీసు స్టేషన్ పరిధిలో 4.5 తులాల బంగారు ఆభరణాలు, సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో 3 తులాల బంగారం చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎల్బీనగర్ సీసీఎస్, యాచారం పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి బంగారం, వాహనాలు, నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో క్రైమ్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఇబ్రాహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, సీఐ శివశంకర్, ప్రవీణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు చైన్‌స్నాచర్ల అరెస్టు
ప్రకాశం, కందుకూరు: వ్యవసనాలకు బానిసలైన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు చైన్‌స్నాచర్ల అవతారమెత్తారు. మహిళల మెడల్లో బంగారు గొలుసులు దొంగలిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రకాశరావు నిందితుల వివరాలు వెల్లడించారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం గ్రామానికి చెందిన మెలకులపల్లి రవితేజ అమరావతిలోని చలపతి కాలేజీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన దామచర్ల కార్తీక్ ఫేస్ ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. బెట్టింగ్, తాగుడు వంటి వ్యసనాలకు బానిసైన రవితేజ చదువు మానేసి ప్రస్తుతం ఒంగోలు డీటీడీసీలో పనిచేస్తున్నాడు. కార్తీక్ కూడా వ్యవసనాలకు బానిసయ్యాడు. వీరు స్నేహితులుగా మారారు. జల్సాల కోసం డబ్బులు అవసరమై చైన్‌స్నాచర్ల అవతారం ఎత్తి కందుకూరు ప్రాంతంలో ఇద్దరు మహిళల మెడల్లో బంగారు గొలుసులు లాక్కెళ్లారు. గత జులై నెలలో కందుకూరు మండలం విక్కిరాలపేట గ్రామం వద్ద గేదెలు కాస్తూ ఒంటరిగా ఉన్న మహిల మెడలోంచి తాళిబొట్టు సరుడు, ఆగస్టు 2వ తేదీ పట్టణంలోని కోటారెడ్డినగర్లో ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలోంచి తాళిబొట్టు సరుడు లాక్కొని వెళ్లారు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పట్టణంలో జరిగిన దొంగతనంలో సీసీ పుటేజ్‌లో ఇద్దరూ నమోదయ్యారు. వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వీరి నుంచి రూ.1.40 లక్షల విలువ చేసే 66 గ్రామల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రకాశరావు వివరించారు. ఆయనతో పాటు సీఐ వెంకటేశ్వరరావు, పట్టణ ఎస్ఐ ఉన్నం వేమన ఉన్నారు. -
వృద్ధురాలి మెడలో ఆభరణాల అపహరణ
విజయవాడ: అవనిగడ్డ ఆర్టీసీ బస్టాండ్ వద్ద నాంచారమ్మ అనే వృద్ధురాలి ఆభరణాలు చోరీకి గురయ్యారు. నాంచారమ్మకు మత్తుమందు ఇచ్చి ఆమె మెడలో ఉన్న 4 కాసుల బంగారు గొలుసును గుర్తుతెలియని మహిళ దోచుకెళ్లింది. వృద్ధురాలికి సహాయం చేస్తున్నట్లుగా నమ్మించి ఆభరణాలు మాయం చేసింది. తన ఆభరణాలు చోరీకి గురైన సంగతి తెల్సుకున్న తరవాత నాంచారమ్మ పోలీసులను ఆశ్రయించింది. నాంచారమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ద్వారా ఆధారాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
చైన్‌స్నాచింగ్‌లో ఘనుడు
యశవంతపుర : చైన్స్నాచింగ్ల్లో ఆరితేరిన నేరస్తుడిని కెంగేరి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ. కోటి విలువైన 3.5 కేజీల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ధారవాడ జిల్లా హుబ్బళ్లి తాలూకా కోళివాడకు చెందిన అచ్యుత్ కుమార్ గణి అలియాస్ విశ్వనాథ్ కోళివాడ్ను అరెస్ట్ చేశారు. ఇక్కడి కెంగేరిలో నివాసం ఉంటున్న అచ్యుత్ అరెస్ట్‌తో 105 చైన్‌స్నాచింగ్ కేసులు బయటపడ్డాయి. బెంగళూరు పశ్చిమ విభాగంలో 37, నగర విభాగంలో 40, బళ్లారి జిల్లాలో 10, తుమకూరు జిల్లాలో 6, బెంగళూరు గ్రామీణ జిల్లా 4, హసన జిల్లాలో 3, రామనగర జిల్లా 2, ధారవాడ జిల్లాలో 2, దావణగెరె జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. చోరీ సొత్తును నిందితుడు కొప్పళకు చెందిన స్నేహితుడు గవి సిద్దేశ్‌కు అమ్మేవాడు. దీంతో ఇతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నగరంలో స్నాచింగ్‌లు ఎక్కువ కావటంతో కమిషనర్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నిఘా పెట్టిన బృందాలు మంగళవారం అచ్యుత్ ఆచూకీ కెంగేరిలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు పట్టుకోవడానికి యత్నించారు. దీంతో అచ్యుత్ మారణాయుధాలతో పోలీసులపై ఎదురుదాడికి దిగాడు. దీంతో కెంగేరి సీఐ కాల్పులు జరపడంతో అచ్యుత్ పడిపోయాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. అచ్యుత్కుమార్పై హుబ్లీ నగర, హవేరి, గదగ, ఉత్తరకన్నడ జిల్లా 34 కేసుల్లో నిందితుడు. 18 కేసులకు సంబంధించి అరెస్టు వారెంట్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దోపిడీలకు ఉపయోగించిన 5 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇతని భార్య మహదేవి కూడ భర్తను దొంగతనాలకు పోత్సాహించేది. ప్రస్తుతం ఆమె తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. జనవరిలో హోవిన హడగలి వద్ద స్కార్పియోలో వెళ్లతుండగా పోలీసుల కంట పడి తప్పించుకున్నాడు. కారును అక్కడే వదిలి వెళ్లటంతో అందు మూడు లక్షల నగదు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2009 నుండి దొంగతనాలు చేస్తూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అచ్యుత్‌ను కరుడు గట్టిన నేరస్థుడిగా పోలీసులు ప్రకటించారు. జూన్ 17న జ్ఞాననభారతి కానిస్టేబుల్ చంద్రకుమార్ పట్టుకునే క్రమంలో తప్పించుకుని పారిపోయాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులను సిటీ పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ అభినందించారు. -
ఐదేళ్లకు వచ్చి చిక్కాడు!
సాక్షి, సిటీబ్యూరో: విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన డబ్బు కోసం స్నాచింగ్స్‌కు పాల్పడి, ఆ డబ్బుతోనే సౌదీ పారిపోయిన గొలుసు దొంగ మహ్మద్ జలాల్ ఇస్మాయిల్ ఎట్టకేలకు చిక్కాడు. ఐదేళ్లుగా నగర పోలీసులకు వాంటెడ్‌గా ఉన్న ఇతడిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఇన్నాళ్లు విదేశాల్లో జలాల్ రాక కోసం ఎదురు చూస్తూ, క్రమం తప్పకుండా నిఘా ఉంచిన టాస్క్‌ఫోర్స్ టీమ్ ఇతడిని పట్టుకోగలిగింది. ఫలక్నుమలోని తీగలకుంట ప్రాంతానికి చెందిన జలాల్, అఫ్జల్‌గంజ్ ఫ్రూట్ మార్కెట్లో పండ్ల వ్యాపారం చేసేవాడు. ఇలా వచ్చిన సొమ్ముతో తాను ఆశించిన విధంగా బతకలేకపోవడంతో సౌదీకి వెళ్లి డబ్బు సంపాదించాలని భావించాడు. అందుకు తన వద్ద నగదు లేకపోవడంతో చైన్ స్నాచింగ్స్ చేయాలని నిర్ణయించుకున్నాడు. 2013లో సిటీలో స్నాచర్ల హల్చల్ ఎక్కువగా ఉండటంతో ఈ మార్గం ఎంచుకున్నాడు. కాలాపత్తర్‌లోని మిశ్రీగంజ్‌కు చెందిన ఆటోడ్రైవర్ సయ్యద్ అస్ఘర్ అలీ జలాల్‌తో జట్టు కట్టాడు. నల్లరంగు కరిజ్మా ఖరీదు చేసిన ఈ ద్వయం రంగంలోకి దిగింది. అస్ఘర్ బైక్ నడుపుతుండగా వెనుక కూర్చునే జలాల్ నిర్మానుష్య ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసేవాడు. కొద్ది రోజుల్లోనే వరుసపెట్టి ఎనిమిది స్నాచింగ్స్ చేసిన ఈ ద్వయం ఆ సొత్తును అమ్మగా వచ్చిన సొమ్మును పంచుకుంది. ఈ డబ్బుతో 2013 జూలై 31న జలాల్ సౌదీకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కాలాపత్తర్కే చెందిన షేక్ మాజిద్‌తో ముఠా కట్టిన అస్ఘర్ అలీ తన ‘పరంపర’ను కొనసాగించాడు. మొత్తం 28 స్నాచింగ్స్ చేసిన తర్వాత 2013 సెప్టెంబర్ 2న అస్ఘర్, మాజిద్ సైదాబాద్ పోలీసులకు చిక్కారు. వీరి నుంచి పోలీసులు 1.8 కేజీల బంగారం తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి విచారణలోనే జలాల్ పేరు వెలుగులోకి వచ్చింది. ఇతడి కోసం ఆరా తీయగా అప్పటికే సౌదీకి వెళ్లిపోయినట్లు తేలింది. సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం ఇటీవల వాంటెడ్ నేరగాళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా జలాల్ తరహాలో పరారీలో ఉన్న వారి కదలికలను ఎప్పకప్పుడు గమనిస్తూ ఓ కన్నేసి ఉంచింది. ఈ నేపథ్యంలోనే గత నెల 26న ఇతగాడు సౌదీ నుంచి వచ్చినట్లు గుర్తించింది. సిటీకి వచ్చిన జలాల్ పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తన మకాం ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చాడు. నిఘా ముమ్మరం చేసిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం శుక్రవారం జలాల్‌ను పట్టుకుంది. దాదాపు ఐదేళ్లుగా వాంటెడ్‌గా ఉన్న ఇతడిని సైదాబాద్ పోలీసులకు అప్పగించారు. -
పట్టపగలే దొంగలు బీభత్సం
-
వీడియో వైరల్: వెంబడించి మరీ లాక్కెళ్లారు
సాక్షి, పలాస/శ్రీకాకుళం: జిల్లాలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలోని గోల్డ్ చైన్‌ను బైక్‌పై వచ్చి లాక్కెళ్లారు. వివరాలు.. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని రోటరీనగర్‌కు చెందిన ఉషారాణి శుక్రవారం సాయత్రం తమ ఇంటివైపు నడుచుకుంటు వెళ్తుండగా వెనకే వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని బైక్‌పై పరారయ్యారు. దొంగతనం అడ్డుకునే క్రమంలో ఉషారాణికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఓ సీసీటీవీలో నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్నామనీ, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగల్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
సీఈవో కాదు.. చైన్ స్నాచర్
సాక్షి, బొమ్మనహళ్లి(కర్ణాటక) : ఉన్నత విద్యావంతుడు, జీవితంలో పైకెదగాలని ఐటీ కంపెనీ పెట్టాడు. సంస్థ ఏర్పాటు చేయడానికి చేసిన అప్పులను తీర్చడానికి ఎంచుకున్న దారి చైన్ స్నాచింగ్‌లు. వీలు దొరికినప్పుడల్లా చైన్‌స్నాచింగ్‌లు చేసి సుమారు రూ. 10 లక్షలకు పైన అప్పులూ తీర్చాడు. చివరికి ఖాకీలకు చిక్కాడు. ఘరానా సీఈవోని హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. పగలు సాప్ట్వేర్ కంపెనీని చూసుకుంటూ, సెలవురోజులు, రాత్రివేళల్లో స్నాచర్‌గా అవతారమెత్తేవాడు. ఇప్పటివరకు సుమారు 25 స్నాచింగ్‌లు చేసినట్లు తేలింది. పగలు డ్యూటీ, తీరిక వేళల్లో చోరీలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభాకర్ అలియాస్ భాస్కర్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్లో నివాసం ఉంటున్నాడు. ఇతను తానే సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకోసం అప్పులు కూడా చేశాడు. కంపెనీని సమర్థంగా నడిపించి అప్పులను తీర్చాల్సిన ప్రభాకర్ వినూత్నంగా చైన్‌స్నాచింగ్‌లను ఎంచుకున్నాడు. ఒంటరిగా నడిచి వెళ్తున్న మహిళల మెడల్లో ఉన్న బంగారు గొలుసులు చోరీ చేయసాగాడు. ఇప్పటివరకు హెచ్ఎస్ఆర్ లేఔట్, కోరమంగళ, మడివాళ, జయనగర చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 25కు పైగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. హెచ్ఎస్ఆర్ లేఔట్లో సైతం తనను ఎవరూ గుర్తుపట్టకుండా హెల్మెట్ ధరించి గొలుసు చోరీలకు పాల్పడుతున్నాడు. ఇతను స్నాచింగ్‌కు పాల్పడిన దృశ్యాలు పలుచోట్ల సీసీ కెమెరాల్లో రికార్డు కావడం జరిగింది. రెండు రోజుల క్రితం తెల్లవారుజామున ఒక మహిళ మెడలో చైన్ లాక్కుని వెళ్తుండగా, బీట్ విధుల్లో ఉన్న హెచ్ఎస్ఆర్ లేఔట్ పొలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మాళప్ప చేజ్ చేశాడు. ఇద్దరూ బైక్‌లతో సందులు తిరుగుతూ దూసుకెళ్లినా చివరకు ఐటీ కంపెనీ సీఈవో దొరికిపోక తప్పలేదు. పోలీసులు ఇతన్ని తమదైన శైలిలో విచారించగా, భాస్కర్ అసలు సంగతిని బయటపెట్టాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
టవల్‌తో మహిళ గొంతు బిగించి దోపిడీ
యలహంక: గడ్డి మోపు మోసుకుంటూ వెళ్తున్న మహిళపై దాడులు దాడి చేసి మాంగళ్యం చైన్ తెంపుకొని ఉడాయించారు. ఈఘటన రాజ్జన్న కుంట్టె పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజన్నకుట్టె సమీపంలోని చల్లహళ్లి గ్రామనివాసి రైతు చెలువరాజు భార్య మీనా (25) గురువారం సాయంత్రం పోలానికెల్లి గడ్డి కోసుకొని మోపు తలపై పెట్టుకొని ఇంటికి బయల్దేరింది. పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెను టవల్‌తో గొంతు బిగించి కడుపుపై పిడిగుద్దులు గుద్దారు. దీంతో ఆమె కుప్పకూలిపోయింది. అనంతరం ఆమె మెడలో ఉన్న మాంగళ్య గోలుసు లాక్కొని ఉడాయించారు. అయితే బాధితురాలు తేరుకొని తన సెల్‌ఫోన్‌తో దుండగులను ఫొటో తీసింది. అనంతరం రాజన్నకుట్టె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితురాలి సెల్ఫోన్లో ఉన్న దృశ్యాల ఆధారంగా దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చైన్ స్నాచింగ్
-
గొలుసు కోసం గొంతు కోశారు..
సాక్షి, నల్గొండ/కోదాడ: పట్టణంలో గురువారం దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. స్థానికంగా బాలాజీ నగర్లో నివాసముండే లక్ష్మీ (50) అనే మహిళను గొంతుకోసి హతమార్చారు. మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడలో ఉన్న బంగారు నగలను చోరీకి యత్నించారు. అయితే మహిళ మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లే క్రమంలో ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో గొంతు కోసి ఈ అఘయిత్యానికి పాల్పడ్డారు. రక్తపు మడుగులో పడివున్న లక్ష్మీని కుటుంబీకులు గమనించి ఆస్పత్రికి తరలించగా దారిలోనే ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు మాట్లాడుతూ.. తమకు ఎవరిపై అనుమానం లేదని, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదంటూ విలపిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
దోపిడీ దొంగలు రెచ్చిపోయారు
-
చైన్ స్నాచింగ్‌పై రైల్వేను నిందించలేం
సాక్షి, న్యూఢిలీ : రైలు కిటికీల గుండా జరిగే చైన్ స్నాచింగ్ వంటి దొంగతనాలకు రైల్వే ఎంతమాత్రం బాధ్యత వహించదని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ (ఎన్సీడీఆర్సీ) స్పష్టం చేసింది. ఆ మేరకు రాజస్థాన్ వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. ట్రెయిన్ బయటనుంచి స్నాచింగ్.. 2012లో రాజస్థాన్‌కు చెందిన నందకిశోర్ చెన్నై నుంచి ఢిల్లీకి దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తుండగా మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రెయిన్ ఆగింది. కిటికీ పక్కన కూర్చున్న నందకిశోర్ మెడలోని తులం విలువైన బంగారు గొలుసును ఆగంతకుడు ట్రెయిన్ బయటనుంచి తెంచుకుని వెళ్లాడు. రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించగా ఎవరూ అందుబాటులో లేరని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పరిహారం చెల్లింపు.. రైల్వే సంస్థ ప్రయాణికుల రక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమైనందునే తాను బంగారు గొలుసు కోల్పోయానని కిశోర్ రాజస్థాన్‌లోని వినియోగదారుల ఫోరంలో పిటిషన్ వేశాడు. ఇరు వర్గాల వాదనలు విన్న ఫోరం చైన్ స్నాచింగ్‌కు రైల్వే సంస్థ బాధ్యత వహించాలని తీర్పునిచ్చింది. బాధితునికి 36 వేల రూపాయలు నష్ట పరిహారంగా చెల్లించాలని రైల్వేను ఆదేశించింది. ఫోరం ఆదేశాల మేరకు రైల్వే సంస్థ కిశోర్‌కు పరిహారం చెల్లించింది. దీనిపై ఎన్‌సీడీఆర్‌సీలో భారతీయ రైల్వే రివ్యూ పిటిషన్ వేసింది. తీర్పు తిరగబడిందిలా.. జస్టిస్ అజిత్ భరిహోకే నేతృత్వంలోని బెంచ్.. దిగువ ఫోరాలు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి తక్కువ మొత్తమే కదా అని పరిహారం చెల్లించవద్దని రైల్వే సంస్థను మందలించింది. ‘రైలు లోపల ప్రయాణించే ప్యాసెంజర్ రక్షణ బాధ్యతలు చూసుకోవడమే రైల్వే విధి. వారి రక్షణ బాద్యతలు చూసుకోవడంలో రైల్వే విఫలమైందన్న వాదనతో మేము ఏకీభవించం. చైన్ స్నాచింగ్ జరిగింది కిటికీ గుండా కాబట్టి దానికి రైల్వే బాధ్యత వహించాల్సిన అవసరం లేదు’ అని బెంచ్ అభిప్రాయ పడింది. రైల్వే సర్వీసుల్లో లోపం కారణంగానే బాధితుడు తన గొలుసు కోల్పోయాడనే రాజస్థాన్ ఫోరం వాదనను తోసిపుచ్చింది. కేవలం రైల్వే సంస్థ రక్షణ చర్యల ద్వారానే ఇలాంటి దొంగతనాలు ఆగవు అని కమీషన్ పేర్కొంది. -
బీ'టెక్' చైన్ స్నాచర్ అరెస్టు
అతను ఉన్నత చదువు చదివాడు. మంచి ఉద్యోగం చేసి తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిన సమయంలో అతని బుద్ధి వక్రమార్గం పట్టింది. జల్సాలకు అలవాటుపడి డబ్బు కోసం చోరీలు చేయడం మొదలుపెట్టాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు. తిరుపతి క్రైం : బీటెక్ చదివి చైన్ స్నాచింగులకు పాల్పడుతున్న దొంగను అర్బన్ జిల్లా క్రైం పోలీసులు బుధవారం సాయంత్రం తనపల్లిలోని మార్కెట్ యార్డు వద్ద అరెస్టు చేశారు. క్రైం పోలీసు స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. తిరుచానూరులోని కొత్తపాలెం లేఔట్లో నివాసముంటున్న కాటయ్య కుమారుడు కంపా ఈశ్వర్‌కిశోర్ (29) 2010లో బీటెక్‌లో ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) చదివాడు. ప్రభుత్వ ఉద్యోగం పలు పరీక్షలు రాశాడు. ఇందుకోసం తిరుపతి నగరంతోపాటు నంద్యాలలోని కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకున్నాడు. ఉద్యోగం రాకపోవడంతోపాటు జల్సాలకు అలవాటుపడి తిరుపతికి చేరుకుని ద్విచక్ర వాహనంపై తిరుగుతూ మొదట బ్యాగుల దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. అలా వచ్చిన డబ్బులు తీసుకుని నంద్యాలకు వెళ్లిపోయాడు. బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో తప్పించుకుని తిరిగాడు. మళ్లీ తిరుపతికి చేరుకుని.. 2013 నుంచి 2015 వరకు తిరుపతిలో ఉంటూ ఉద్యోగాల కోసం ముమ్మరంగా ప్రయత్నించాడు. ఫలితం లేకపోవడంతో డబ్బు అవసరాల కోసం తిరిగి చైన్ స్నాచింగ్‌లు చేయాలని నిర్ణయించుకున్నాడు. తిరుపతి, శ్రీకాళహస్తి, తిరుచానూరు పరిసర ప్రాంతాల్లో ఒంటరిగా వెళుతున్న మహిళలను గుర్తించి తన ద్విచక్ర వాహనంలో వెళుతూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు జల్సాలకు అలవాటు పడిన ఈశ్వర్ కిశోరే చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. అతనిపై తిరుపతి క్రైం పోలీసు స్టేషన్లో 7, ఎంఆర్‌పల్లి పోలీసు స్టేషన్లో 7, ఎస్వీయూ పోలీసు స్టేషన్లో 2, శ్రీకాళహస్తి టూటౌన్లో ఒకటి, తిరుచానూరులో 2 మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. నిందితుడు ఈశ్వర్ కిశోర్ నగలను అమ్మి వచ్చిన డబ్బును వడ్డీలకు ఇచ్చేవాడు. ఈ నెల 7న స్నేహితులు డబ్బు కావాలని అడగడంతో తన వద్ద ఉన్న బంగారు నగలు అమ్మేందుకు బయలుదేరాడు. సమాచారం అందుకున్న క్రైం సీఐ మధు చాకచక్యంగా నిందితుడిని అరెస్టు చేశారు. అతని నుంచి రూ.13.40 లక్షలు విలువ చేసే 383 గ్రాముల బంగారు ఆభరణాలు, 422 గ్రాముల వెండి, రూ.1.70 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇదే మొదటి సారి డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ నిందితుడు ఈశ్వర్‌కిశోర్ ఇన్ని దొంగతనాలకు పాల్పడ్డా ఇంతవరకు ఒక్కసారి కూడా పోలీసులకు చిక్కలేదన్నారు. 2017లో జరిగిన 16 చోరీలపై బాధితులు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయడంలో సీఐలు అబ్బన్న, శరత్చంద్ర, భాస్కర్‌రెడ్డి, పద్మలత, ఎస్ఐలు రమేష్‌బాబు, సిబ్బంది ఎంతగానో కృషి చేశారని డీఎస్పీ పేర్కొన్నారు. అదేవిధంగా క్రైం పార్టీ ఇన్చార్జి అబ్బన్న, ఎస్ఐ రమేష్‌బాబు, ఐడీ పార్టీ సిబ్బంది కీలకంగా వ్యవహరించారని, వీరందరికీ అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతి ద్వారా రివార్డులు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో కష్టపడిన సిబ్బంది స్వయం ప్రకాష్, రవిప్రకాష్, గౌరినాయుడులను ప్రత్యేకంగా అభినందించారు. -
పట్టపగలే చైన్ స్నాచింగ్
జోగిపేట(అందోల్): జోగిపేట పట్టణంలో పట్ట పగలు మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు ఇలాఉన్నాయి. వాసవీనగర్‌లో నివాసం ఉంటున్న కొన్యాల అనూష జాతీయ రహదారి పక్కన ఉన్న దుకాణానికి వెళ్లి తన భర్తకు టిఫిన్ ఇచ్చి తిరిగి వస్తోంది. ఇంటికి దగ్గరలోనే ఇద్దరు యువకులు బైక్‌పై ఆమెను వెంబడించారు. ముందుకు వెళ్లిన వారు వాహనాన్ని మలుపుకొని ఎదురుగా వచ్చి అనూష మెడలో నుంచి బంగారు చైన్‌ను తెంపే ప్రయత్న చేశారు. ఆమె ప్రతిఘటించడంతో దొంగల చేతికి కొంత భాగం మాత్రమే దక్కింది. అనూష మాట్లాడుతూ తన మెడలో మూడు తులాల బంగారు చైన్ ఉందని, ఎదురుగా వచ్చి దుండగులు లాగుతున్న క్రమంలో తాను చైన్‌ను గట్టిగా పట్టుకున్నాని చెప్పింది. దీంతో కొంత భాగం సుమారుగా అర్ధ తులం చైన్‌ను లాక్కెళ్లినట్లు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. -
ఘరానా చైన్ స్నాచర్ అరెస్టు.. భారీ సొత్తు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పరిధిలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఘరానా దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఎనిమిది నెలలుగా లంగర్ హౌజ్, గాంధీనగర్, మలక్ పేట్, నార్సింగి, ఉప్పల్, మేడిపల్లి, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస స్నాచింగ్‌లు జరిగాయి. దీంతో నిఘా పెట్టిన పోలీసులు చైన్ స్నాచర్ అయా అలీఖాన్‌ను గురువారం అరెస్టు చేశారు. నిందితుడు వద్ద నుంచి రూ. 12 లక్షల రూపాయల విలువైన 311 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు లక్షా ఇరవైదు వేల నగదు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా... వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అలీఖాన్ అరెస్టుతో 11 కేసులు పరిష్కారమయ్యామని అధికారులు తెలిపారు.