
బాధితురాలు మీన, దొంగలు బైక్‌పై వెళ్తుండగా తీసిన ఫొటో
యలహంక: గడ్డి మోపు మోసుకుంటూ వెళ్తున్న మహిళపై దాడులు దాడి చేసి మాంగళ్యం చైన్ తెంపుకొని ఉడాయించారు. ఈఘటన రాజ్జన్న కుంట్టె పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజన్నకుట్టె సమీపంలోని చల్లహళ్లి గ్రామనివాసి రైతు చెలువరాజు భార్య మీనా (25) గురువారం సాయంత్రం పోలానికెల్లి గడ్డి కోసుకొని మోపు తలపై పెట్టుకొని ఇంటికి బయల్దేరింది.
పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెను టవల్‌తో గొంతు బిగించి కడుపుపై పిడిగుద్దులు గుద్దారు. దీంతో ఆమె కుప్పకూలిపోయింది. అనంతరం ఆమె మెడలో ఉన్న మాంగళ్య గోలుసు లాక్కొని ఉడాయించారు. అయితే బాధితురాలు తేరుకొని తన సెల్‌ఫోన్‌తో దుండగులను ఫొటో తీసింది. అనంతరం రాజన్నకుట్టె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితురాలి సెల్‌ఫోన్‌లో ఉన్న దృశ్యాల ఆధారంగా దుండగుల కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment