photo
-
దీపికా పదుకొణె లైఫ్ రీస్టార్ట్.. సింగర్‌కి కన్నడ నేర్పిస్తూ (ఫొటోలు)
-
త్వరలోనే నాగచైతన్య-శోభిత పెళ్లి.. ఆ ఫోటోను డిలీట్ చేసిన చైతూ!
అక్కినేని హీరో నాగచైతన్య త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఇప్పటికే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్న చైతూ ఈ ఏడాది డిసెంబర్లో వివాహబంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం తర్వాత వీరిద్దరు తొలిసారిగా జంటగా కనిపించారు. అంతేకాకుండా ఇటీవలే పెళ్లి పనులు మొదలైన ఫోటోలను శోభిత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి.అయితే గతంలో సమంతను పెళ్లాడిన నాగ చైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు 2021లో తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే ఆగస్టులో శోభిత-చైతూ ఎంగేజ్మెంట్ తర్వాత కూడా ఆయన ఇన్‌స్టాలో సమంతతో ఉన్న ఫోటోలను నెటిజన్స్ గుర్తించారు. అందులో విడాకులకు సంబంధించిన పోస్ట్, 2018లో మజిలీ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఉన్నాయి. అంతేకాకుండా సమంతతో కలిసి రేస్ ట్రాక్‌పై తీసిన చిత్రం కూడా ఉంది. అందులో "బ్యాక్ త్రో ...మిసెస్ అండ్ ది గర్ల్‌ఫ్రెండ్" అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు.అయితే తాజాగా ఆ ఫోటోను నాగ చైతన్య తన ఇన్‌స్టా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఇటీవల చైతూ నిశ్చితార్థం సమయంలో ఆమెపై గౌరవంతో ఆ పోస్ట్‌ను తొలగించాలంటూ సమంత అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరారు. దీంతో శోభితతో పెళ్లికి ముందే ఆ పోస్ట్ నాగచైతన్య తొలగించినట్లు అర్థమవుతోంది. కాగా.. 2017లో పెళ్లి చేసుకున్న సమంత- చైతూ వ్యక్తిగత కారణాలతో 2021లో విడిపోయారు. -
30 ఏళ్ల క్రితం ఫోటో.. చిరుతో ఉన్నదెవరో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవితో ఉన్న ఒక బాలుడి ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అతని పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. ఇందులో ఉన్నది ఎవరో కనిపెట్టండి అంటూ ఒక క్యాప్షన్‌తో వారు షేర్ చేస్తున్నారు. గుర్తుపట్టిన అభిమానులు మాత్రం వెంటనే శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. ఇంతకు చిరు చేతిలో ఉన్న ఆ బాలుడు ఎవరంటే..? టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్.మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన సాయిధరమ్ తేజ్ అక్టోబర్ 15న తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సినిమాల పరంగా తన కెరీర్ ప్రారంభంలో వరస హిట్స్ కొట్టిన ఆయన ఆ తర్వాత రొటీన్ కమర్షియల్ సినిమాలతో ఘోరంగా దెబ్బతిన్నాడు. మధ్యలో 'రిపబ్లిక్' లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అయితే, విరూపాక్ష, బ్రో చిత్రాలతో అభిమానులను మెప్పించాడని చెప్పవచ్చు.రాబోయే సినిమా విషయానికొస్తే.. సాయి ధరమ్ తేజ్ టైటిల్ రోల్లో ‘గాంజా శంకర్’గా రానున్నాడు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాదిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే, సినిమా టైటిల్ మార్చాలని పలు అభ్యంతరాలు వచ్చాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. -
వీళ్లు.. ఈ కుర్రాడి తల్లిదండ్రులా?
సోషల్ మీడియా ఎప్పటికప్పుడు కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంటుంది. కొన్నిసార్లు షాకింగ్ వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వీటిని చూసినప్పుడు ఎవరికీ ఏమాత్రం నమ్మాలని అనిపించదు.తాజాగా ఒక ఫొటో వైరల్‌గా మారింది. దీనిని చూసినవారు తెగ ఆశ్యర్యపోవడానికి తోడు కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కుర్రాడికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫారం తెగ వైరల్ అవుతోంది. ఆ కుర్రాడు బీఏ ఆనర్స్ విద్యార్థి అని తెలుస్తోంది. అతనికి సంబంధించిన ఫారంలో తండ్రి పేరు ‘ఇమ్రాన్ హష్మీ’ అని, తల్లి పేరు ‘సన్నీ లియోన్’ అని రాసి ఉంది. వీరు బాలీవుడ్ ప్రముఖులనే విషయం తెలిసిందే.ఈ ఫోటో వైరల్ అవడానికి ఆ కుర్రాడి తల్లిదండ్రుల పేర్లే ప్రధాన కారణం. అయితే ఇది నిజమా లేక ఎవరైనా ఫోటోను ఎడిట్ చేశారా అనేది స్పష్టం కాలేదు. ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫోటో ఇండియన్ రేర్ ఇమేజస్ అనే పేజీ నుండి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయ్యింది. ఈ పోస్ట్‌ను ఇప్పటివరకూ 2 లక్షల 28 వేల మందికి పైగా యూజర్లు వీక్షించారు. ఈ పోస్ట్ చూసిన ఒక యూజర్ ఆ కుర్రాడి తాత పేరు మహేష్ భట్ అని రాయగా, మరొక యూజర్ దీనిని ఫేక్ అని పేర్కొన్నాడు.ఇది కూడా చదవండి: సహారాలో భారీ వర్షాలు.. ఆశ్చర్యపరుస్తున్న దృశ్యాలు -
చిత్ర కథలు (ఫొటోలు)
‘ఉద్యోగ’ దీక్షబూని..‘కొడితే కొట్టాలిరా.. సిక్స్ కొట్టాలి.. పడితే పట్టాలిరా.. కొలువు పట్టాలి’ అన్నట్టుగా ఉద్యోగ సాధన దీక్ష చేపట్టారు విజయనగరంలోని నిరుద్యోగులు. ప్రశాంత వాతావరణంలో తదేక దీక్షతో చదువుతూ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. విజయనగరం కోటలోను, చుట్టుపక్కల గట్లు, చెట్ల కింద పదుల సంఖ్యలో నిరుద్యోగ యువత ఇలా చదువుతూ కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం రైల్ బస్సు.. ప్రయాణం మిస్సుప్రకృతి అందాల నడుమ విశేష సేవలందించిన రైల్ బస్సు మూలనపడింది. బొబ్బిలి–సాలూరు మధ్య 21 కి.మీ. మేర ఒక ఇంజిన్, రెండు బోగీలతో నడిచే ఈ రైల్ బస్సును 1993లో ప్రారంభించారు. 15 గిరిజన గ్రామాల మధ్య ఇది నడిచేది. ఈ రైలు బస్సును నడపలేక రైల్వే అధికారులు మూలనపెట్టేశారు. ప్రస్తుతం ఇది విశాఖలోని రైల్వే స్విమ్మింగ్ పూల్ ప్రాంతంలో ఇలా ఉండిపోయింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం ఇదేంటన్నా.. పోలీసన్నావాహన చోదకులు రహదారి నిబంధనలను అతిక్రమిస్తే.. అడ్డుకోవాల్సిన పోలీసులే నిబంధనల్ని అతిక్రమిస్తే ఏమనాలి. ఏమైనా అందామంటే.. వాళ్లు ఊరుకుంటారా. హెల్మెట్ ధరించకుండా మోటార్ సైకిల్‌పై నడపడమే కాకుండా.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ కొందరు పోలీసులు ఇలా ముందుకు సాగిపోతున్నారు. నిబంధనల్ని తోసిరాజని నెల్లూరు ఓ కానిస్టేబుల్ మాగుంట లేఅవుట్ ప్రాంతంలో కెమెరా కంటికి చిక్కారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు ఫిలిప్పీన్స్‌ను భీకర తుపాను క్రతోన్ వణికిస్తోంది. ఇలొకొస్ నార్టె ప్రావిన్స్‌లోని బకర్రాలో వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను తరలిస్తున్న సహాయక సిబ్బంది క్రతోన్ తుపానుతో ఓ వైపు వర్షం కురుస్తుండగా ఆకాశంలో ఆహ్లాదం కలిగిస్తున్న ఇంద్రధనుస్సు. తైవాన్ రాజధాని తైపీలోనిదీ దృశ్యం. గ్రీస్‌లో కార్చిచ్చు వ్యాపించింది. ఆదివారం కొరింతియా ప్రాంతంలోని అనో లౌట్రో గ్రామం వైపు దూసుకొస్తున్న మంటల దృశ్యమిది. పితృ పక్షం సందర్భంగా సోమవారం బిహార్ రాష్ట్ర గయలోని దేవ్ఘాట్లో పిండ ప్రదానం చేస్తున్న ఓ విదేశీ భక్తురాలు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో సోమవారం ‘మిస్ యూనివర్స్ కొరియా’ పోటీల్లో హొయలొలికిస్తున్న 81 ఏళ్ల చోయి సూన్ హ్వా. -
Raai Laxmi : మోడ్రన్ లుక్‌లో అదరగొట్టిన రాయ్ లక్ష్మీ
-
Kalyani Priya darshan : తెల్ల చీరలో కల్యాణి ప్రియదర్శన్ సోయగాలు..!
-
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఇపుడు రాజ్యసభ ఎంపీ!
రాజ్యసభ, ఎంపీ, రచయిత సుధానారాయణమూర్తి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అనేక సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. ఒక్కోసారి తన వ్యక్తిగత విషయాలను జోడిస్తూ, మరికొన్ని అవగాహన కల్పించే అంశాలను తన అభిమానులతో కూడా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా తన చిన్నప్పటి ఫోటో ఒకటి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది.‘‘ఈ ఫోటో నాకు సంవత్సరం వయస్సులో ఉన్నప్పుడు హుబ్లీలోని ఒక స్టూడియోలో తీసింది. ఆ సమయంలో, మేము షిగ్గావ్‌లో ఉండేవాళ్లం, కానీ అక్కడ స్టూడియోలు లేనందున, మేము ఈ ఫోటో కోసం హుబ్లీకి వెళ్లాం’’ అంటూ సుధామూర్తి తన బాల్య స్మృతులను నెమరు వేసుకున్నారు.This picture was taken in a studio in Hubli when I was around 1 year old. At the time, we were living in Shiggaon, but since there were no studios there, we travelled to Hubli for this photograph. pic.twitter.com/YjhjJ3Aw5L— Smt. Sudha Murty (@SmtSudhaMurty) July 30, 2024 -
అప్పటి పిల్లాడే.. నేడు ప్రపంచ కుబేరుడు - ఎవరో చెప్పుకోండి
ఈ ఫొటోలో కనిపిస్తున్న పాలబుగ్గల పాపాయి ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఇతడే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఇప్పటికే మీ మనసులో ఓ పేరు తళుక్కుమని మెరిసి ఉంటుంది. మీరు ఊహించింది నిజమే.. ఇతడే టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్'.ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన 'ఇలాన్ మస్క్' గురించి అందరికి తెలుసు. జూన్ 28 నాటికి 53ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మస్క్ తన 30వ ఏట తీయించుకున్న ఫోటో కూడా షేర్ చేశారు.మస్క్ సంపద సుమారు రూ. 20 లక్షల కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తుంది. ఇటీవల ఈయన తన మూడో భార్య ద్వారా మరో బిడ్డను పొందారు. దీంతో ఈయనకు మొత్తం 12 మంది సంతానం ఉన్నట్లు తెలుస్తోంది.Elon Musk is one of the most well-known CEOs in the world, born on June 28, 1971 in South Africa1. He is the founder, chairman, and CEO of SpaceX, as well as an investor, CEO, and product designer at Tesla1. Musk uses memes on social media, including popular jokes involving 69… pic.twitter.com/4UlBBjuSz7— Troll Media Center (@TrollCTO69420) June 28, 2024 -
ఎంపీలు కంగనా-చిరాగ్.. అదిరిపోయే లుక్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎంపీగా మారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి, కంగనా విజయం సాధించారు. దీంతో ఇప్పుడు మీడియా దృష్టి కంగనాపై నిలిచింది.లోక్ సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా బుధవారం ఎంపీలంతా పార్లమెంట్‌కు వచ్చారు. ఇదే కోవలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ లోక్ సభ మెట్లు ఎక్కగానే మీడియా కెమెరాలు ఆమెను చుట్టుముట్టాయి. ఈ సమయంలో కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా ఆమెకు సమీపంలో కనిపించారు. పార్లమెంట్ మెట్ల మీద వారిద్దరూ కలుసుకుని, నవ్వుతూ పరస్పరం పలుకరించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూజర్స్ తమ అభిమాన నేతలను చూసి సంబరపడుతున్నారు.కంగనా రనౌత్, చిరాగ్ పాశ్వాన్ గతంలో ఒక చిత్రంలో కలిసి నటించారు. 2011లో విడుదలైన ‘మిలే నా మిలే హమ్’లో వీరిద్దరూ కనిపించారు. ఈ చిత్రం అంతగా విజయవంతం కాలేదు. అయితే ఇప్పుడు వీరిద్దరూ ఎంపీలుగా మారి రాజకీయాల్లో విజయం సాధించారు. వీరు నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన తర్వాత చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ సారధ్యంలో రాజకీయాల వైపు పయనం మొదలుపెట్టారు. 2024లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన కంగనా తొలి ఇన్నింగ్స్‌లోనే విజయాన్ని అందుకున్నారు. #WATCH | Union Minister Chirag Paswan and BJP MP Kangana Ranaut arrive at the Parliament. pic.twitter.com/ZZZk61z7d0— ANI (@ANI) June 26, 2024 -
న్యూ లుక్‌లో రాహుల్.. పీక్‌లో 20 ఏళ్ల పొలిటికల్ కెరియర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా మారారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. ఇండియా కూటమిలోని అన్ని భాగస్వామ్య పార్టీల సమ్మతి మేరకు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.ఈ బాధ్యతలు స్వీకరించి అనంతరం రాహుల్ గాంధీ ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. అతని ఎక్స్‌ప్రెషన్స్‌లో ఆత్మవిశ్వాసం తొంగిచూస్తోంది. ఈ నేపధ్యంలో రాహుల్ గాంధీకి సంబంధించిన రెండు ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. వీటిలో తాను ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యానన్న ఆనందం, ఉత్సాహం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఇంట్లో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి భాగస్వామ్య పార్టీల నేతలంతా హాజరయ్యారు. వారంతా రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ప్రకటించిన వెంటనే రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ ముఖం వెలిగిపోయింది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ప్రకటనకు ముందు రాహుల్ సమావేశంలో నిశ్శబ్దంగా ఉంటూ అందరి మాటలు ఆలకిస్తూ కనిపించారు.తనను ప్రతిపక్ష నేతగా ఎన్నిక చేసిన అనంతరం రాహుల్ ఆనందంతో తన గుండెపై చేయి వేసుకున్నారు. తరువాత చేతులు జోడించి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో 20 మంది నేతలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ 2004లో తొలిసారి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాది తొలిసారిగా అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. నాటి నుంచి ఆయన ప్రతిపక్ష నేత పదవిని చేపట్టలేదు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత బాధ్యతలు చేపట్టారు. -
నా అనుమతి లేకుండానే ఆ ఫోటోలు లీక్ చేశారు: కస్తూరి
కస్తూరి శంకర్.. ఒకప్పుడు హీరోయిన్గా నటించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేసింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది. తమిళ బిగ్‌బాస్ షోలోనూ పార్టిసిపేట్ చేసిన ఈ నటి ఆ మధ్య బుల్లితెర సీరియల్స్‌లో మెరిసింది. 50 ఏళ్లు వయసు దాటినా ఆమె అందం చెక్కు చెదురలేదు. ఇప్పటికీ ఆమె నవ్వులో తెలియని మ్యాజిక్ ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫోటో షూట్‌కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.2000 సంవత్సరంలో కస్తూరి ఒక డాక్టర్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె యూరప్ వెళ్లిపోయింది. ఆ తర్వాత అమెరికాలో కొంత కాలం ఉంది. ఆ సమయంలో రోజుల వ్యవధి ఉన్న తన బాబుతో అమ్మతనాన్ని చాటి చెబుతూ అర్ధనగ్నంగా ఫోటోలు దిగింది. అవి కాస్త నెట్టింట వైరల్ కావడంతో కొందురు ఆమెను విమర్శిస్తే.. మరికొందరు అభినందించారు. తాజాగా కస్తూరి ఆ సందర్భం గురించి ఇలా చెప్పుకొచ్చింది.'ఆ ఫోటో షూట్ నేను చేసింది ఇండియా కోసం కాదు.. అమెరికాలో ఒక మ్యాగ్జైన్ కోసం ఇచ్చాను. అది భారత్‌లో పబ్లీష్ కాకూడదు. కానీ, భారత్‌లో ఉన్న మీడియా వారు సెన్స్ లేకుండా ప్రచురించారు. దేశంలో పేరున్న మీడియా సంస్థనే ముందుగా భారత్‌లో ప్రచురించింది. కనీసం నన్ను కూడా అడగలేదు. ఇక్కడ ఉన్న వారికి నేను ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. కొంత కాలం తర్వాత ఒక ఆంగ్ల పత్రిక నన్ను సంప్రదించి ప్రచురించుకుంది. అందరూ దొంగతనంగా ఆ ఫోటోలు వేసుకున్నారు. భారత కల్చర్‌కు ఆ ఫొటోలు పెద్దగా నచ్చవు. అది అమెరికన్ ప్రాజెక్టు. ఒక మహిళ డెలివరీ అయిన తర్వాత శరీరంలో మార్పులు వస్తాయి. దానిని అవగాహాన కల్పించేందుకే ఆ ప్రాజెక్ట్ చేశాను. మాతృత్వానికి అమెరికా వాళ్లు ఇచ్చే మర్యాద, మనం ఇచ్చే మర్యాద వేరుగా ఉంటుంది. ఆ ఫొటోలు లీక్ కావడం నాకు కూడా చాలా బాధగా అనిపించింది. బిడ్డకు పాలిచ్చే ఫొటోలను ఇక్కడి వారు చూసే విధానం వేరుగా ఉంటుంది. కానీ, అది తప్పని తెలుసుకున్నా. కానీ, ఎవరూ ఊహించని విధంగా భారత్ నుంచి కూడా కొందరు మహిళలు నాకు నాకు ఎంతో మద్దతు ఇచ్చారు. ఎందుకంటే వారు కూడా అమ్మ స్థానం నుంచే వచ్చారు కాబట్టి దాని విలువ తెలుస్తోంది. గ్రామీణ మహిళలు నుంచి కూడా నాకు సపోర్ట్ దక్కింది. కొంత కాలం తర్వాత పెళ్లి అయిన పురుషులు కూడా నాకు అండగా నిలిచారు.' అని కస్తూరి తెలిపింది. -
సెల్ఫీ అడిగిన అభిమాని.. ఓవర్ యాటిట్యూడ్ చూపించిన హీరో!
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాదిలో తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది చిన్నా సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్ చిత్రం ఇండియన్-2 లో కనిపించనున్నారు. తాజాగా సిద్ధార్థ్ ముంబయిలోని బాంద్రాలో సందడి చేశారు.సిద్ధార్థ్ తన కారు వద్దకు వెళ్తుండగా ఫోటో దిగేందుకు యత్నించాడు. దీంతో అతనిపై హీరో సిద్ధార్థ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి ఇక్కడ సౌండ్ చేయొద్దంటూ అతన్ని వారించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ సిద్ధార్థ్ తీరుపై మండిపడుతున్నారు. అభిమానులతో ఇలాంటి ప్రవర్తన సరికాదని సూచిస్తున్నారు.కాగా.. ఈ ఏడాదిలోనే సిద్ధార్థ్, ఆదితి రావు హైదరీ నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వనపర్తిలోని ఓ ఆలయంలో ఈ జంట సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆదితి రావు హైదరీ ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి వెబ్ సిరీస్‌లో మెరిసింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
ఉద్యోగులు ఇంటికెళ్లాక.. మస్క్ గురించి ఆసక్తికర విషయం!
ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు, టెస్లా, స్పేస్ ఎక్స్‌ల బిగ్ బాస్ ఎలాన్ మస్క్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆటోమొబైల్, అంతరిక్షం, అంతర్జాలం (ఇంటర్నెట్, సోషల్ మీడియా) రంగాల్లో విజయవంతమైన కంపెనీలను ఆయన నడుపుతున్నారు.అయితే ఎలాన్ మస్క్ గురించి తాజాగా ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఓ యూజర్ మస్క్ శ్రద్ధగా పనిచేస్తున్న త్రోబ్యాక్ ఫోటోను పంచుకున్నాడు. "జిప్2 (మస్క్ స్థాపించిన సాఫ్ట్వేర్ కంపెనీ)లో పనిచేసే ఇంజనీర్లు ఇళ్లకు వెళ్లగానే వారు రాసిన కోడ్‌ను తిరిగి రాసేవాడు. అలా వారానికి 120 గంటలు పనిచేసేవాడు. ఒక సీఈఓలా ఉండాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు" అని రాసుకొచ్చారు. నిజమే..ఎక్స్ యూజర్ తన గురించి పెట్టిన పోస్టుపై ఎలాన్ మస్క్ స్పందించారు. 'నిజమే' అంటూ ఆ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ పోస్ట్‌కు 2.3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. విపరీతంగా కామెంట్లు, రీ పోస్టులు, లైక్‌లతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. Elon Musk used to rewrite code of engineers working at Zip2 after they went home, and used to work 120 hours a week. He never really wanted to be a CEO. pic.twitter.com/fQOyNRM0QD— DogeDesigner (@cb_doge) May 30, 2024 -
భార్యకు స్పెషల్‌గా విష్ చెప్పిన టాలీవుడ్ హీరో.. పోస్ట్ వైరల్!
టాలీవుడ్ యంగ్ హీరో మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం హరోం హర. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో మాళవిక శర్మ జంటగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని మే 31న రిలీజ్ చేయాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలతో వాయిదా వేశారు. వచ్చేనెల జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు సుధీర్‌బాబు ప్రకటించారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.అయితే సుధీర్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ కూతురు ప్రియదర్శినిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే సుధీర్, ప్రియదర్శినిల పెళ్లి మే 29,0 2006లో ఘనంగా జరిగింది. తాజాగా వివాహా వార్షికోత్సవం సందర్భంగా అరుదైన ఫోటోను పంచుకున్నారు సుధీర్. తన భార్య ప్రియదర్శిని పెళ్లిచూపుల ఫోటోను ట్విటర్లో పంచుకున్నారు. ఈ సందర్భంగా వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. నాతో ఉన్నప్పటి తన మొదటి ఫోటో.. అంతేకాదు పెళ్లిచూపుల ఫోటో అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు హీరో జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. Happy Anniversary my love 'Priya' 💐 You complete me 😘🤗…. First pic of hers I have with me. Pellichoopulu photo 😄 pic.twitter.com/005YWnBIzZ— Sudheer Babu (@isudheerbabu) May 29, 2024 -
ఢిల్లీ మెట్రోలో రాహుల్.. ఫొటో వైరల్
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఐదు దశల ఎన్నికలు ఇప్పటికే ముగియగా, ఇంకా మరో రెండు దశల ఎన్నికలు మిగిలివున్నాయి. ఈ క్రమంలో మే 25న ఢిల్లీలో ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సామాన్య ప్రజలకు చేరువయ్యేందుకు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. రాహుల్ గాంధీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న రాహుల్ గాంధీ సామాన్య ప్రజలతో మమేకమై, వారితో ఫొటోలు కూడా దిగారు. రాహుల్ గాంధీ ఢిల్లీ మెట్రోలో మంగోల్‌పురిలో జరిగే ర్యాలీకి బయలుదేరారు. ఆయనతో పాటు ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ కూడా ఉన్నారు. ఢిల్లీలో మే 25వ తేదీన ఓటింగ్ జరగనుంది. -
భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
దుబాయ్‌లో నివశిసిస్తున్న భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీలసులచే ఘన సత్కారం లభించింది. ఈ విషయాన్ని దుబాయ్ పోలీసులు తమ అధికారిక ఖాతాలో వెల్లడించారు. దుబాయ్ పోలీస్ వెబ్సైట్ కథనం ప్రకారం..ముహమ్మద్ అయాన్ యూనిస్ తన తండ్రితో కలిసి ఒక పర్యాటక ప్రాంతంలో వెళ్తుండగా ఒక టూరిస్ట్ వాచ్‌ని దొరికింది. దానిని పోగొట్టుకున్న టూరిస్ట్‌కి అందేలా దుబాయ్ పోలీసులకు అప్పగించాడు. ఆ వాచ్‌ని అందుకున్న బాధితుడు దుబాయ్‌లో ఉన్నత స్థాయ భద్రత, సమగ్రత పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రశంసించాడు.తాము ఆ వాచ్‌ని బాదితుడికి విజయవంతంగా అందించేలా సాయం చేసినందుకు గాను ఆ బాలుడిని దుబాయ పోలీసులు సత్కరించారు. అతడి నిజాయితీకి అవార్డును అందించి, సర్టిఫికేట్‌ను ప్రదానం చేశారు అధికారులు. పర్యాటకులు పోగొట్టుకున్న వాచ్‌ని నిజాయితీగా ఇచ్చినందుకు గానూ ఆ బాలుడు దుబాయ్ పోలీసుల చేత ఈ గౌరవాన్ని అందుకున్నాడు. ఈ మేరకు టూరిస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఖాల్ఫాన్ ఒబీద్ అల్ జల్లాఫ్, అతని డిప్యూటీ లెఫ్టినెంట్ కల్నల్ ముహ్మద్ అబ్దుల రెహ్మాన్, టూరిస్ట్ హ్యీపీనెస్ విభాగం అధిపతి కెప్టెన్ షహబ్ అల్ సాదీ తదితరులు బాలుకుడికి ఈ సర్టిఫికేట్లను అందజేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్‌లో తెలుపుతూ అందుకు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేసింది. ఇది యూఏఈలో పిల్లల ప్రవర్తన, ఉన్నతమైన నైతిక ప్రమాణాలు, భద్రతను ప్రతిబింబిస్తుందని, ముఖ్యంగా దాని కీలకమైన పర్యాటక రంగంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుందని జల్లాఫ్ అన్నారు. అందరూ యూనిస్ అడుగుజాడల్లో నడవాలని అన్నారు. అలానే గతనెలలో జుమేరా బీచ్‌లో దొరికిన విలువైన వస్తువుని అప్పగించినందుకు ఒక యువకుడిని దుబాయ్ పోలీసులు సత్కరించడం జరిగింది. #News | Dubai Police Honours Child for Honesty After Returning Tourist's Lost WatchDetails:https://t.co/6dFnBky55r#YourSecurityOurHappiness#SmartSecureTogether pic.twitter.com/bVccqxabP5— Dubai Policeشرطة دبي (@DubaiPoliceHQ) May 12, 2024(చదవండి: భారత న్యూయార్క్ కాన్సులేట్ ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది!) -
వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని ఫొటో ఎటు పోయింది: మీసా భారతి
పాట్నా: కొవిడ్ వ్యాక్సిన్‌పై అనుమనాలు వ్యక్తం అవుతుండటం వల్లే ప్రధాని ఫొటోవ్యాక్సిన్ సర్టిఫికెట్లపై తొలగించారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాదా్ యాదవ్ కుమార్త్ మీసా భారతి అన్నారు. మీసా భారతి బిహార్‌లోని పాటలిపుత్ర నియోజకవర్గం నుంచి ఎంపీ పదవికి పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా మీసా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ‘వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై వస్తున్న వార్తలతో ప్రధాని భయపడుతున్నారు. ప్రధానికి ప్రతి దానిపై క్రెడిట్ తీసుకోవడం అలవాటు. అయితే కరోనా వ్యాక్సిన్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నందున ప్రధాని పక్కకు తప్పుకుంటున్నారు.వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై తన ఫొటోలను తొలగించారు. వ్యాక్సిన్‌పై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి’ అని మీసా డిమాండ్ చేశారు. కాగా, ఎన్నికల కోడ్ ఉన్నందు వల్లే కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని ఫొటో తొలగించారని బీజేపీ నేతలు మీసాకు కౌంటర్ ఇస్తున్నారు. -
ALT Text Testing- Photos
-
మే 15 నుంచి ‘గూగుల్ ఫొటోస్’లో మార్పులు
మొబైల్ కొనేముందు ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ, స్క్రీన్ సైజ్‌తోపాటు ప్రధానంగా కెమెరా గురించి తెలుసుకుంటారు. అందులో ప్రత్యేక ఫీచర్లు ఉంటే మరింత ఆసక్తి చూపుతారు. కొన్ని మొబైల్ తయారీ సంస్థలు ఇంటర్నల్‌గా ఫోన్ కెమెరా టూల్లోనే ఏఐ ఆధారిత ఫీచర్లును వాడుతున్నాయి. దానికితోడు ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న చాలా ఫొటో ఎడిటింగ్ యాప్‌లు సైతం ఏఐను వినియోగిస్తున్నాయి. వాటికి ధీటుగా ‘గూగుల్ ఫోటోస్’ యాప్‌లోనూ కొన్ని మార్పులు చేస్తున్నట్లు గూగుల్ తాజాగా ప్రకటించింది. ఈ మార్పులు మే 15 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. గూగుల్ తన వినియోగదారులకు మెరుగైన ఫొటో ఫీచర్లను అందించేందుకు ఎడిటింగ్ ఆప్షన్లలో మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపింది. గూగుల్ ఫొటోస్ యాప్‌లో మ్యాజిక్ ఎడిటర్, మ్యాజిక్ ఎరేజర్‌తోపాటు ఫోటో బ్లర్, పోట్రైట్ లైట్ వంటి ఇతర ఏఐ టూల్స్‌ను అందించనున్నట్లు చెప్పింది. గూగుల్ సంస్థ ఇప్పటికే ఈ టూల్స్‌ను కొన్ని మొబైల్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 2023 మేలో వీటిని పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ యూజర్లకు పరిచయం చేసింది. మే 15, 2024 తర్వాత ఈ ఏఐ ఆధారిత ఫొటో ఎడిటర్ టూల్స్‌ను గూగుల్ ఫొటోస్ వాడుతున్న ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరూ వినియోగించవచ్చని తెలిపింది. ఇదీ చదవండి: ‘వాటిలో పెట్టుబడి పెడితే రూ.కోట్లే..’ యూజర్లు ఈ ఫీచర్లును వాడుకోవాలంటే మాత్రం ఆండ్రాయిడ్ 8.0, ఐఓఎస్ 15 సహా ఆపై వచ్చిన ఓఎస్‌లనే ఇన్స్టాల్ చేసుకోవాలని కంపెనీ పేర్కొంది. దాంతోపాటు మొబైల్ ర్యామ్ 3జీబీ కంటే ఎక్కువ ఉండాలని చెప్పింది. -
‘హిజాబ్’ ఉదంతంలో న్యాయం.. బాధితులకు రూ. 146 కోట్ల పరిహారం!
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 2017లో ఇద్దరు ముస్లిం మహిళలకు అవమానం జరిగింది. ఇన్నేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత వారికి న్యాయం లభించింది. ఇందుకు పరిహారంగా బాధితులకు 17.5 మిలియన్ అమెరికన్ డాలర్లు చెల్లించడానికి న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ అంగీకరించింది. వివరాల్లోకి వెళితే 2017లో స్థానిక చట్టాలను, నిబంధనలను అతిక్రమించారనే ఆరోపణలతో న్యూయార్క్ పోలీసులు ఇద్దరు ముస్లిం మహిళలను అరెస్టు చేశారు. ఆ తరువాత వారిని జైలుకు పంపే ముందు నిబంధనలలో భాగంగా వారికి ఫొటోలు తీశారు. వీటిని మగ్ షాట్ అంటారు. ఈ ఫొటోల కోసం పోలీసులు ఆ మహిళల హిజాబ్‌ను తొలగించారు. దీనిని బాధిత మహిళలు అవమానంగా భావించారు. ఈ ఉదంతంపై బాధితులు 2018లో కోర్టును ఆశ్రయించారు. కోర్టులో బాధితురాలి తరపు న్యాయవాది మాట్లాడుతూ బాధితుల మత విశ్వాసాలను పరిగణించకుండా పోలీసులు వారి హిజాబ్ తొలగించి తీవ్రంగా అవమానించారని, వారి మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. ఈ కేసు నేపధ్యంలో మగ్ షాట్ నిబంధనలపై అమెరికా అంతటా చర్చ జరిగింది. దీనిపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం కావడంతో 2020లో మగ్ షాట్ నిబంధనలలో పోలీసులు పలు మార్పులు చేశారు. ఈ ఫొటోల కోసం ముస్లిం మహిళలు హిజాబ్ తొలగించనవసరంలేదని, ముఖం కనిపించేలా ఉంటేచాలని పేర్కొన్నారు. ఈ నిబంధన మిగతా మతాల వారికీ వర్తిస్తుందని, సిక్కులు కూడా తమ టర్బన్‌ను తొలగించాల్సిన అవసరం పోలీసులు వివరించారు. ఆదేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం పోలీసులు బాధిత మహిళలతో పాటు గతంలో ఈ విధంగా ఇబ్బంది పడిన వారికీ కూడా పరిహారం చెల్లించేందుకు అంగీకరించారు. ఈ ఇద్దరు బాధిత మహిళలకు ఒక్కొక్కరికీ 7 వేల నుంచి పది వేల డాలర్ల చొప్పున మొత్తం 17.5 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ అంగీకరించింది. మన రూపాయల్లో ఇది సుమారు రూ. 146 కోట్లకు సమానం. -
అలాంటి కథతో వస్తోన్న నిత్యా మీనన్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!
అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నటి నిత్యామీనన్. ఆ తర్వాత నితిన్ సరసన ఇష్క్ సినిమాతో గుర్తింపు దక్కించుకుంది. ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళంలో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో గుండెజారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, 100 డేస్ ఆఫ్ లవ్, ఒక్క అమ్మాయి తప్ప, ఇంకొక్కడు లాంటి చిత్రాల్లో నటించింది. నిత్యా మీనన్ ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా మరో ఆసక్తికర స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఓ యువతి ప్రేమకథా ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రంలో ఆమె నటిస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో సత్యజిత్ రే.. ఠాగూర్ చిన్న కథ ఆధారంగా తెరకెక్కించిన సమాప్తి పేరుతో సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో మృణ్మోయి అనే యువతి పాత్రను చూపించారు. తాజాగా నిత్యా మీనన్ పోస్టర్ చూస్తే అదే కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) -
సన్నాఫ్ విరాట్ కోహ్లీ
అనుష్క శర్మ ఈ నెల 15న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అబ్బాయికి ‘అకాయ్’ అని పేరు పెట్టినట్లు తెలియజేశాడు విరాట్ కోహ్లీ. అయితే ‘అకాయ్’ ఫొటోను ఎక్కడా షేర్ చేయలేదు. దీంతో ‘అకాయ్’ రూ΄ాన్ని రకరకాలుగా ఊహించుకుంటూ అభిమానులు ఏఐ జెనరేటెడ్ ఫొటోలను క్రియేట్ చేశారు. అకాయ్‌ను విరాట్ ఎత్తుకున్నట్లు, విరాట్–అనుష్కలు అకాయ్‌తో ఆడుకుంటున్నట్లు... ఇలా రకరకాలుగా క్రియేట్ చేశారు. ‘అకాయ్ ఫొటో షేర్ చేయకుండా విరాట్ కోహ్లీ మంచి పని చేశాడు. చేసి ఉంటే ఇంత అద్భుతమైన చిత్రాలను చూసి ఉండేవాళ్లం కాదు’ అంటూ నెటిజనులు ప్రశంసల జల్లు కురిపించారు. ప్రశంసల వర్షం ఒక కోణం అయితే... సాంకేతిక ఆసక్తి మరో కోణం. ‘మీరు ఉపయోగించిన ఏఐ టూల్స్ గురించి వివరంగా తెలుసుకోవాలని ఉంది’ అంటూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. -
ఆయనే మళ్లీ పుట్టాడు.. నిఖిల్ ఎమోషనల్ పోస్ట్!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తండ్రిగా ప్రమోషన్ పొందారు. ఆయన భార్య పల్లవి బుధవారం ఉదయం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నిఖిల్, డాక్టర్ పల్లవి 2020లో పెద్దల సమక్షంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. కొడుకు పుట్టిన సందర్భంగా హీరో నిఖిల్ ఎమోషనలయ్యారు. తన తండ్రి మళ్లీ తిరిగి వచ్చాడంటూ పోస్ట్ చేశారు. నిఖిల్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'ఏడాది క్రితమే మా నాన్న మిస్సయ్యాను. ఇప్పుడు మా కుటుంబంలోకి మగ బిడ్డ అడుగుపెట్టారు. ఆయనే మళ్లీ తిరిగి వచ్చాడని అనుకుంటున్నా. మాకు అబ్బాయి జన్మించినందుకు చాలా సంతోషంగా ఉంది.' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మా కుటుంబంలోకి తన తండ్రే మళ్లీ తిరిగి వచ్చాడంటూ ఎమోషనలయ్యారు నిఖిల్. ఇక నిఖిల్ సినీ కెరీర్ విషయాకొస్తే.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘హ్యాపీ డేస్’ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు. కార్తికేయ, స్వామిరారా సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. కార్తికేయ 2తో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ప్రస్తుతం మరో పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. . చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) View this post on Instagram A post shared by CelebrityNews (@industrycelebritynews) -
‘జల్లికట్టు’లో సీఎం జగన్ ఫొటో
పలమనేరు(చిత్తూరు జిల్లా): తమిళనాడు వాసులు కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. తమిళనాడులో ప్రస్తుతం జల్లికట్టు మైలేర్ల సీజన్ కొనసాగుతోంది. మైలేర్లలో వేగంగా పరుగెత్తిన ఎద్దుకు బహుమతులు రూ.10 లక్షల దాకా ఉన్నాయి. ఇప్పటిదాకా పరుగు పందెంలో కచ్చితంగా గెలిచే ఎద్దులకు కొండ గుర్తుగా రజనీకాంత్, విజయ్, సూర్య ఫొటోలను మాత్రం కొమ్ములకు ప్రభలను కట్టి పందేల్లో వదిలేవారు. ఇప్పుడు వేలూరు, క్రిష్ణగిరి, తిరప్పత్తూరు జిల్లాలోని చాలాచోట్ల జరిగే జల్లికట్టు, మైలేర్లలో ఆంధ్రా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోలున్న ప్రభలతో ఎద్దులు కనిపిస్తున్నాయి. పందేలు జరిగేచోట సైతం మైక్‌లో కామెంటరీ చేసేవాళ్లు ఆంధ్రా టైగర్ జగన్ వద్దాండ్రా, సిద్ధం అంటూ పొగడటం విశేషం.