Miheeka Bajaj Insta Post Creates Confusion And Pregnancy Rumours - Sakshi
Sakshi News home page

Miheeka Bajaj : మిహికా ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌ .. రానా దంపతులకు శుభాకాంక్షల వెల్లువ!

Published Sat, Nov 5 2022 3:18 PM | Last Updated on Sat, Nov 5 2022 4:26 PM

Miheeka Bajaj Insta Post Creats Confusion Amid Pregnancy Rumours - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రానా దగ్గుబాటి-మిహికీ బజాజ్‌ దంపతులు పేరెంట్స్‌ కాబోతున్నట్లుగా గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె మిహికా షేర్‌చేసిన ఫోటోల్లో ఆమె కాస్త బొద్దుగా కనిపించడంతో ఈ రూమర్స్‌ తెరపైకి వచ్చాయి. అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్‌ రాకముందే మిహికా ప్రెగ్నెంట్‌ అంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి.

ఇదివరకే ఈ విషయంపై మిహికా క్లారిటీ ఇస్తూ.. హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌లో ఉన్నాను.. అందుకే కాస్త హెల్దీగా మారాను అంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ పాపని ఎత్తుకున్న ఫోటోని మిహికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. 'నా ఏంజెల్‌తో మొదటి ఫోటో..ప్రేమతో మిహికా బజాజ్‌' అంటూ పోస్ట్‌ చేసింది.

దీంతో ఆ పోస్ట్‌ చూసిన నెటిజన్లు.. పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు రానా, మిహికాలకు కంగ్రాట్స్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరేమో ఒకడుగు ముందుకేసి సరోగసా అంటూ ప్రశ్నించారు. దీంతో ఆ పాప తమ బిడ్డ కాదని, తన మేనకోడలు అంటూ మిహికా క్లారిటీ ఇచ్చింది.  ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement