మన జీవితంలో అదే గొప్ప అదృష్టం: మిహికా పోస్ట్ వైరల్ | Rana Wife Miheeka Bajaj Instagram post On Life Balance Goes Viral | Sakshi

Miheeka: జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి : మిహికా పోస్ట్ వైరల్

Aug 12 2023 9:49 PM | Updated on Aug 12 2023 9:54 PM

Rana Wife Miheeka Bajaj Instagram post On Life Balance Goes Viral - Sakshi

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, మిహిక బజాజ్ జంట టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్  కపుల్స్‌లో ఒకరు. 2020 ఆగస్టు 8న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. రానా భార్య మిహికా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలను మిహికా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేశారు. అంతేకాకుండా ఓ నోట్ కూడా రాసుకొచ్చారు. పనితో పాటు జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటూ తన మెడపై బ్యాలెన్స్ అని టాటూ ఉన్న ఫోటోను పంచుకుంది.

(ఇది చదవండి: మిహికా ఇన్‌స్టా పోస్ట్.. ప్రెగ్నెన్సీ అంటూ నెటిజన్స్ కామెంట్స్!)

మిహికా తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'జీవితంలో గొప్ప అదృష్టం ఏంటంటే సమతుల్యత. మన జీవితంలో బాధ్యతలు, అభిరుచుల మధ్య సామరస్యాన్ని కనుగొనడం. మీరు నైపుణ్య స్థాయిని అదుపులో ఉంచే శక్తిని మీరు కలిగి ఉన్నారని గుర్తుంచుకోండి. మీరు పని, సంబంధాలు, ఆటలతో జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. జీవితంలో ఉన్న లయను ఆనందించండి. మీరు వేసే ప్రతి అడుగు.. మీ ప్రత్యేకమైన ప్రయాణానికి మరింత ఆనందాన్ని ఇస్తుంది.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.  మీరు సూపర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. 

(ఇది చదవండి: అపస్మారక స్థితిలో ఉన్న మహిళపై అత్యాచారం.. ప్రముఖ నటుడు అరెస్ట్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement