![Miheeka Bajaj Special Post on 4th Wedding Anniversary](/styles/webp/s3/article_images/2024/08/8/ranadaggubati.jpg.webp?itok=uYThDIn8)
చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి. రానా-మిహికాల పెళ్లి జరిగి అప్పుడే నాలుగేళ్లవుతోంది. వీరిద్దరూ 2020 ఆగస్టు 8న పెళ్లి చేసుకున్నారు. నేడు నాలుగో యానివర్సరీ సందర్భంగా మిహిక సోషల్ మీడియాలో ఓ భావోద్వేగపు పోస్ట్ షేర్ చేసింది.
జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎన్నో గందరగోళ పరిస్థితుల మధ్య మీరే నా ప్రశాంతత.. ఆనందం. సముద్రమంత మార్పులు వచ్చినా ఎల్లప్పుడూ నువ్వు నా పక్కనే ఉన్నందుకు సంతోషంగా ఉంది. నీ మీద నాకున్న ప్రేమ.. మరెవరి మీదా ఇంత లేదు అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. దీనికి విదేశాల్లో కలిసి చక్కర్లు కొట్టిన ఫోటోను జత చేసింది.
ఇది చూసిన సెలబ్రిటీలు, ఫ్యాన్స్ కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. హ్యాపీ యానివర్సరీ.. మీరెప్పటికీ ఇలాగే కలిసుండాలి.. జీవిత చరమాంకం వరకు ఇంతే సంతోషంగా ఉండాలి అని కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment