Rana Wife Miheeka Bajaj Clarifies on her Pregnancy Rumors
Sakshi News home page

Miheeka Bajaj: ఫోటోలు షేర్‌ చేసిన రానా భార్య.. రూమర్స్‌కి చెక్‌

Published Thu, Mar 31 2022 7:04 PM | Last Updated on Fri, Apr 1 2022 6:47 AM

Rana Wife Miheeka Pregnancy Rumours - Sakshi

టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్‌లో రానా ద‌గ్గుబాటి-మిహికా బ‌జాజ్ జంట ఒక‌టి. 2020 ఆగస్టు8న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ క్యూట్‌ కపుల్‌ వైవాహిక జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇ​క రానా భార్య సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలను మిహికా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది.

రీసెంట్‌గా ఓ ఫ్రెండ్‌ వెడ్డింగ్‌లో రానా-మిహికా దంపతులు సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను మిహికా షేర్‌ చేసింది. అయితే ఈ ఫోటోల్లో మిహికా కాస్త బొద్దుగా కనిపిస్తుండటంతో మీరు ప్రెగ్నెంటా అంటూ కొందరు కామెంట్స్‌ చేశారు. వీటిపై మిహికా ఆన్సర్‌ ఇచ్చింది. నాకు క్యూరియాసిటీగా ఉంది..అందుకే అడుగుతున్నా. మీరు ప్రెగ్నెంటా అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. నోనో మ్యారేజ్‌ వెయిట్‌ అంటూ రిప్లై ఇచ్చింది.

దీంతో మిహికా ప్రెగ్నెంట్‌ అంటూ వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లయ్యింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. రానా త్వరలోనే విరాటపర్వంతో పాటు ఓ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులకు పలకరించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement