Pregnancy Rumors
-
ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన మిహికా
టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి త్వరలో తండ్రి కాబోతున్నాడంటూ ఓ వార్త ఇటీవల సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. రానా భార్య మిహికా బజాజ్ బీచ్ ఒడ్డున నడుస్తున్న వీడియో షేర్ చేయగా తను కాస్త బొద్దుగా తయారైందని, చూస్తుంటే గర్భవతిలా అనిపిస్తోందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. తాజాగా ప్రెగ్నెన్సీ రూమర్స్‌కు చెక్ పెట్టింది మిహికా. 'నేను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. వైవాహిక జీవితంలో నేను సంతోషంగా ఉన్నాను. ఈ మధ్య కాస్త బరువు పెరిగి బొద్దుగా కనిపిస్తున్నాననంతే! అంతే తప్ప నేను గర్భవతిని కాదు. నిజంగా నేను గర్భం దాల్చినప్పుడు ఆ విషయాన్ని మీ అందరితో పంచుకుంటాను' అని చెప్పుకొచ్చింది. అలాగే సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ తనకు యాక్ట్ చేయాలన్న ఆసక్తి లేదని పేర్కొంది. ఇకపోతే రానా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ గతంలోనూ ప్రచారం జరిగింది. ఈ వార్తలను దంపతులిద్దరూ కొట్టిపారేశారు. కాగా రానా, మిహికా 2020 ఆగస్టు 8న పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మిహికా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. చదవండి: కొందరిని నమ్మి రూ.60 లక్షలు పోగొట్టుకున్నా: కమెడియన్ -
ప్రెగ్నెన్సీ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన సింగర్ సునీత
తన మాటే ఒక పాటలా అనిపిస్తుంది అభిమానులకు. అలాంటిది ఆమె పాడుతుంటే అచ్చంగా అమృతం కురిసినట్లుంటుంది. అంతటి మధురమైన గొంతు ఉన్న గాయని మరెవరో కాదు సునీత. తీయటి స్వరం, చక్కని రూపం, అద్భుత గానంతో అలరిస్తున్న ఆమె త్వరలో తల్లి కాబోతుందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై సునీత స్వయంగా స్పందించింది. 'నేను ప్రెగ్నెంటా? ఆ విషయం నాకే తెలియదు. అలా రూమర్ పుట్టిస్తున్నారు అంటే వారి ఆలోచనా విధానానికే వదిలేస్తున్నా. వారు నన్ను, నా జీవితాన్ని ఏం చేయలేరు' అని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే సునీత తనయుడు ఆకాశ్ హీరోగా పరిచయం కానున్నాడు. సర్కారు నౌకరి అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్కే టెలీషో బ్యానర్‌పై కె.రాఘవేంద్రరావు నిర్మిస్తున్నాడు. చదవండి: ధైర్యం కోల్పోకూడదు.. రేణూ దేశాయ్ పోస్ట్ -
గేతో పునర్నవి ప్రెగ్నెంట్ అంటూ పిచ్చిరాతలు.. స్పందించిన నటి
బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఉయ్యాల జంపాల సినిమాలో తొలిసారి కనిపించిన పునర్నవి ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్ సీజన్-3లో పాల్గొని యూత్ క్రష్‌గా మారిపోయిందీ బ్యూటీ. ఆ మధ్య వెబ్‌సిరీస్‌లో కనిపించినా ఆ తర్వాత సినిమాలు, సిరీస్‌లకు గుడ్‌బై చెప్పేసి లండన్‌కు వెళ్లిపోయింది. సోషల్ మీడియా ద్వారా యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అప్డేట్స్ని షేర్చేసుకునేది. ఈ క్రమంలో రీసెంట్గా పునర్నవి పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఈ మధ్యకాలంలో ఆమె షేర్ చేసిన ఫోటోల్లో పునర్నవి పొట్ట భాగం కాస్త పెద్దదిగా కనిపించడంతో ఈ రూమర్స్‌కి మరింత వైరల్ అయ్యాయి. ఈ విషయం పునర్నవి దాకా చేరడంతో ఆమె కాస్త బోల్డ్‌గానే స్పందించింది. ''నా గే బెస్టీతో ప్రెగ్నెన్సీ వచ్చిందని కొన్ని యూట్యూబ్ చానెల్స్‌లో ఇష్టారీతిన వార్తలు రాసేశారు. ఇది నాన్ సెన్స్. గత నెలలో నేను కాస్త సిక్ అయ్యాయని చెబితే, ప్రాణాపాయం అని రూమర్స్ సృష్టించారు. ఇప్పుడేమో నేను ప్రెగ్నెంట్ అని రాశారు. సోషల్ మీడియాలో చూసి నమ్మేయకండి. ఏది నిజమో, కాదో తెలుసుకోండి. మీరు రాసే పిచ్చిరాతలు అవతలి మనిషిని ఎంతలా ప్రభావితం చేస్తాయో ఆలోచించండి'' అంటూ ఘుటుగానే బదులిచ్చింది. ప్రస్తుతం పునర్నవి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
భార్య ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన రానా.. ఏమన్నారంటే?
టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి-మిహికీ బజాజ్ దంపతులు పేరెంట్స్ కాబోతున్నట్లుగా గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె మిహికా షేర్చేసిన ఫోటోల్లో ఆమె కాస్త బొద్దుగా కనిపించడంతో ఈ రూమర్స్ తెరపైకి వచ్చాయి. అఫీషియల్‌గా అనౌన్స్మెంట్ రాకముందే మిహికా ప్రెగ్నెంట్ అంటూ నెట్టింట్లో వైరలయ్యాయి. ఇటీవలే ఆమె ఓ పాపను ఎత్తుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో పలువురు అభినందనలు కూడా తెలిపారు. అయితే తాజాగా నటుడు దగ్గుబాటి రానా తాజాగా స్పందించారు. (చదవండి: మిహికా ఇన్‌స్టా పోస్ట్ వైరల్ .. రానా దంపతులకు శుభాకాంక్షల వెల్లువ!) గాయని కనికా కపూర్ సైతం ఈ జంటకు అభినందనలు తెలపడంంతో తాజాగా రానా క్లారిటీ ఇచ్చారు. తాను తండ్రి కాబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమని అన్నారు. తన భార్య మిహీకా గర్భవతి కాదని స్పష్టం చేశారు. దీంతో నెట్టింట్లో హల్చల్ రూమర్లకు ముగింపు పలికారు. టాలీవుడ్‌లోని ఆరాధ్య జంటలలో ఒకరైన రానా, మిహీకా ఆగస్టు 8, 2020న వివాహం చేసుకున్నారు. పెళ్లయాక రానా, మిహీక సోషల్ మీడియాలో తక్కువగా కనిపిస్తున్నారు. రానా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. -
రానా తండ్రి కాబోతున్నాడా? క్లారిటీ ఇచ్చేసిన మిహికా
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో రానా దగ్గుబాటి-మిహికా బజాజ్ జంట ఒకటి. 2020 ఆగస్టు8న కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వారి పెళ్లి ఫోటోలు కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు రానా భార్య ప్రెగ్నెంట్ అంటూ టాక్ వినిపిస్తుంది. మిహికా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలను మిహికా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అయితే రీసెంట్గా మిహికా షేర్చేసిన ఫోటోల్లో ఆమె కాస్త బొద్దుగా కనిపించడంతో ఈ రూమర్స్ తెరపైకి వచ్చాయి. దీంతో ఓ ఫ్యాన్ మిహికా పోస్టుపై స్పందిస్తూ.. మీరు ప్రెగ్నెంటా అని అడగ్గా.. నేను హ్యాపీ మ్యారీడ్ లైఫ్‌లో ఉన్నాను. అందుకే ఈ మధ్య కాస్త హెల్దీగా మారాను అంటూ మిహికా రిప్లై ఇచ్చింది. దీంతో మిహికా ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలకు ఫుల్స్టాప్ పడినట్లయ్యింది. -
కరీనా కపూర్ మళ్లీ ప్రెగ్నెంట్ !.. అతను ఇప్పటికే చాలా చేశాడని పోస్ట్
Kareena Kapoor Denies Pregnancy Rumours: బాలీవుడ్ దివా కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం, అభినయంతో బీటౌన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన బ్యూటీ కరీనా. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌తో కరీనా కపూర్‌కు 2012 అక్టోబర్ 16న ముంబైలోని బాంద్రాలో వివాహమైన విషయం తెలిసిందే. కరీనా-సైఫ్ దంపతులకు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ (జేహ్) ఇద్దరు కుమారులు. అయితే తాజాగా కరీనా కపూర్ మరోసారి ప్రెగ్నెంట్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై స్పందించిన కరీనా ఆసక్తికరమైన పోస్ట్‌తో సమాధానమిచ్చింది. ప్రస్తుతం సైఫ్, ఇద్దరి పిల్లలతో వెకేషన్లో ఉంది కరీనా. ఈ వెకెషన్‌కు సంబంధించిన ఒక ఫొటోను ఇటీవల పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ చేసిన అతికొద్ది సమయంలోనే ఆ ఫొటో నెట్టింట తెగ వైరల్ అయింది. అందుకు కారణం ఆ ఫొటోలో కరీనా పొట్ట కొంచెం ఉబ్బుగా కనిపించడమే. దీంతో కరీనా మళ్లీ గర్భవతి అయిందని పుకార్లు చెలరేగాయి. ఈ వార్తలపై కరీనా స్పందిస్తూ 'ఇది కేవలం పాస్తా, వైన్ వల్లే. ప్రశాంతంగా ఉండండి అబ్బాయిలు. నేను గర్భవతిని కాదు. మన దేశ జనాభా కోసం అతను ఇప్పటికే చాలా ఎక్కువ చేశాను అని సైఫ్ చెప్పాడు' అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. దీంతో కరీనా ప్రెగ్నెంట్ రూమర్స్‌కు చెక్ పడినట్లయింది. కాగా కరీనా కపూర్ తాజాగా అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' సినిమాలో 'రూప'గా నటించిన విషయం తెలిసిందే. చదవండి: చిక్కుల్లో సింగర్ శ్రావణ భార్గవి.. కోర్టుకు వెళతానని అన్నమయ్య వంశస్తుల హెచ్చరిక సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికి.. అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి.. Kareena and Saif spotted in London with friends pic.twitter.com/HBhGOQvKtm — Kareena Kapoor Khan (@KareenaK_FC) July 15, 2022 చదవండి: ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు -
ఎమోషనల్‌గా ఎంత బాధ పెడుతుందో మీకు చెప్పలేను: శివజ్యోతి
యాంకర్ శివజ్యోతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలంగాణ యాస, కట్టుతో సావిత్రక్కగా గుర్తింపు సంపాదించుకున్న శివజ్యోతి బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయ్యింది. బిగ్‌బాస్ సీజన్-3లో పాల్గొని టాప్ 6 కంటెస్టెంట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. షో తర్వాత వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా మారిన శివజ్యోతి తన యూట్యూబ్ చానల్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో శివజ్యోతి స్పందించింది. ఈ సందర్బంగా ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. 'నా గురించి నాకు తెలియకుండానే వార్తలు వస్తున్నాయి. రీసెంట్గా ఓ ఈవెంట్‌కి వెళుతూ మామిడి కాయతో ఫోటో పెట్టా. ఇక అంతే.. అప్పటి నుంచి నేను ప్రెగ్నెంట్ అంటూ ఫేక్‌న్యూస్ సృష్టిస్తున్నారు. వ్యూస్ కోసం కక్కుర్తి పడి ఇష్టం వచ్చినట్లు థంబ్‌నైల్స్ వేస్తున్నారు. పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా నాపై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అవును మాకు పెళ్లయి చాలా సంవత్సరాలు అయ్యింది. మా పిల్లల కోసం మా ఫ్యామిలీ అంతా ఎంతో ఎదురుచూస్తుంది. నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఇది ఎమోషనల్‌గా ఎంత బాధపెడుతుందో మీకు చెప్పలేను. నేను ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తుండటంతో కొన్ని ఈవెంట్స్ చేయనేమో అని అనుకుంటున్నారు. అలా నా వర్క్‌ని కూడా దెబ్బతీస్తున్నారు. ఇందులో నా ఫ్రెండ్స్‌ని, ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. అందుకే ఇలా వీడియో చేస్తున్నా. ప్లీజ్.. ప్రెగ్నెన్సీ అన్నది నా జీవితంలో చాలా పెద్ద విషయం. కాబట్టి నిజంగా నా లైఫ్‌లో ఆ గుడ్‌న్యూస్ ఉంటే నేనే మీ అందరితో షేర్ చేస్తాను. అప్పటివరకు ఇలా ఫేక్ న్యూస్ ప్రచారం చేయకండి' అంటూ చెప్పుకొచ్చింది. -
సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటే గర్భవతి అని తేల్చేశారు : హీరోయిన్
రాక్‌స్టార్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ నర్గీస్ ఫక్రి. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మాత్రం ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేయలేకపోయింది. దీంతో బ్రేక్ తీసుకొని మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే కొంతకాలంగా కాశ్మీరి వ్యాపారవేత్త టోనీ బేగ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వస్తోన్న వార్తలపై ఈ బ్యూటీ స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. జీవితంలో అందరూ ప్రేమలో పడతారు. కానీ నేను సెలబ్రిటీ కావడంతో దాన్ని ప్రత్యేకంగా చూస్తారు. అంతేకాకుండా సెలబ్రిటీల శరీరాల గురించి మాట్లాడుకుంటారు. అనుకోకుండా నేను బ్రేక్ తీసుకుంటే మెటర్నిటీ లీవ్ అని తేల్చేశారు. నేను ఇండియాకు వచ్చిన కొత్తలో చాలా సన్నగా ఉండేదాన్ని. అప్పుడు బరువు పెరగాలని కొంతమంది సలహా ఇచ్చారు. దీంతో నేను కొంచెం బరువు పెరిగాను. అయితే కాస్త లావుగా కనిపించేసరికి నన్ను బాడీ షేమింగ్ చేశారు. నేను గర్భవతినంటూ ప్రచారం చేశారు. ఆ కామెంట్స్ నన్నెంతో బాధపెట్టాయి. ఇక నేనే రియలైజ్ అయ్యి నా ఆరోగ్యం కోసం బరువు తగ్గాను అంటూ చెప్పుకొచ్చింది. కాగా 2016లొ అజహర్ చిత్రం తర్వాత సుమారు మూడేళ్లు విరామం తీసుకున్న నర్గీస్ 2018లో మరలా 5 వెడ్డింగ్స్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. చివరగా టొర్బాజ్ సినిమాలో నటించింది. ఇందులో సంజయ్ దత్, రాహుల్ దేవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలోనే పవన్‌కల్యాణ్‌తో 'హరిహర వీరమల్లు' చిత్రంతో తెలుగులోకి పరిచయం కానుంది. -
త్వరలోనే తల్లి కాబోతున్న రానా భార్య? పోస్టుతో క్లారిటీ
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో రానా దగ్గుబాటి-మిహికా బజాజ్ జంట ఒకటి. 2020 ఆగస్టు8న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ క్యూట్ కపుల్ వైవాహిక జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక రానా భార్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలను మిహికా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. రీసెంట్గా ఓ ఫ్రెండ్ వెడ్డింగ్‌లో రానా-మిహికా దంపతులు సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను మిహికా షేర్ చేసింది. అయితే ఈ ఫోటోల్లో మిహికా కాస్త బొద్దుగా కనిపిస్తుండటంతో మీరు ప్రెగ్నెంటా అంటూ కొందరు కామెంట్స్ చేశారు. వీటిపై మిహికా ఆన్సర్ ఇచ్చింది. నాకు క్యూరియాసిటీగా ఉంది..అందుకే అడుగుతున్నా. మీరు ప్రెగ్నెంటా అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. నోనో మ్యారేజ్ వెయిట్ అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో మిహికా ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలకు ఫుల్స్టాప్ పడినట్లయ్యింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. రానా త్వరలోనే విరాటపర్వంతో పాటు ఓ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులకు పలకరించనున్నారు. -
రెండోసారి గర్భవతి అయిన ఐశ్వర్యరాయ్?వీడియోతో లీక్!
Is Aishwarya Rai Bachchan Pregnant For Second Time: అందాల తార ఐశ్వర్యరాయ్ మరోసారి గర్భవతి అయ్యిందా? బచ్చన్ ఫ్యామిలీకి మరో వారసుడు రానున్నాడా అనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ముంబై విమానాశ్రయంలో ఐశ్వర్య.. భర్త అభిషేక్, కూతురు ఆరాధ్యలతో కలిసి మీడియా కంటపడింది. ఆ సమయంలో ఒక్కసారిగా చేతిలో ఉన్న హ్యండ్‌బ్యాగ్‌ని ఐశ్వర్య పొత్తి కడుపుకి అడ్డుగా పెట్టుకుంది. అంతేకాకుండా కూతురు ఆరాధ్యను సైతం దగ్గరికి తీసుకుంది. బెల్లీని చాలా వరకు దాచి ఉంచే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీంతో ఐశ్వర్య రెండోసారి గర్భవతి అయ్యిందనే రూమర్స్‌కి బలం చేకూరినట్లయ్యింది. అయితే ఇప్పటివరకు ఐశ్వర్య కాని, బచ్చన్ ఫ్యామిలీ కానీ ఈ విషయంపై స్పందించలేదు. కాగా 2007 ఏప్రిల్ 20న ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌లకు వివాహమైంది. 2011 నవంబర్ 16న వీరికి ఆరాధ్య జన్మించింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఐష్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ ఫిక్షన్ స్టోరీ ‘పొన్నియన్ సెల్వన్’లో నటిస్తున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. View this post on Instagram A post shared by Koimoi.com (@koimoi) -
హీరోయిన్ కాజల్ ముఖ్యమైన ప్రకటన..ఇన్‌స్టాలో పోస్ట్
Kajal Aggarwal To Make An Important Announcement: హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ అటు అటు పర్సనల్, ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. గతడాది అక్టోబర్30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడిన కాజల్ ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య, నాగార్జునతో ఘోస్ట్ చిత్రాల్లో నటిస్తుంది. అయతే గత కొంతకాలంగా ఆమె కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయడం లేదని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సెట్స్ మీద ఉన్న సినిమాలను త్వరగా పూర్తి చేయాలని మేకర్స్‌ను కోరిందట. చదవండి: మనసులోని బాధను బయటపెట్టిన సమంత.. పోస్ట్ వైరల్ తాజాగా కాజల్.. 'ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కమింగ్ సూన్..స్టే ట్యూన్డ్' అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. దీంతో కాజల్ ఏం ప్రకటన ఏం చేయబోతుందా అన్న క్యూరియాసిటీ పెరిగింది. ఈ పోస్ట్‌కు లవ్సింబల్తో పాటు డాన్స్ చేస్తున్న ఏమోజీని కూడా జత చేయడంతో ఇది సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంటా లేక పర్సనల్ లైఫ్‌కి సంబంధించి విషయమా అన్న చర్చ మొదలైంది. గత కొంతకాలంగా ఆమె గర్భవతి అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో దాని గురించి ఏమైనా ప్రకటన చేయనుందా అన్న సందేహం వ్యక్తమవుతుంది. దీనిపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. చదవండి: విడాకుల తర్వాత..నెంబర్1 స్థానంలోకి సమంత -
తల్లి కాబోతున్న కాజల్! త్వరలోనే సినిమాలకు గుడ్‌బై?
Pregnancy Rumours On Kajal Aggarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పనుందా అంటే అవుననే సమాధానం జోరుగా వినిపిస్తుంది. గతడాది అక్టోబర్30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో కాజల్ వివాహం అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె గర్భవతిగా ఉందని, అందుకే కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయడం లేదని టాక్ వినిపిస్తోంది. పెళ్లి తర్వాత కూడా కాజల్ వరుసగా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె చిరంజీవితో ఆచార్య, నాగార్జునతో ఘోస్ట్ చిత్రాల్లో నటిస్తుంది. ఈ సినిమాలకు సంబంధించి తన షూటింగ్ పార్ట్‌ను త్వరగా పూర్తి చేయాలని కాజల్ మేకర్స్‌ను కోరిందట. తల్లి కాబోతున్న సందర్భంగా విశ్రాంతి తీసుకోవాలని కాజల్ భావిస్తుందని, ఈ క్రమంలోనే కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదని సోషల్ మీడియా కోడై కూస్తుంది. మరో ఏడాది వరకు షూటింగులకు పూర్తిగా గుడ్ డై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చదవండి : ఆ ప్రశ్న అడగటంతో రిపోర్టర్‌పై సమంత సీరియస్ మాస్ట్రో: తమన్నాను అలా చూసి ఏడ్చిన డైరెక్టర్ గాంధీ కూతురు -
ప్రెగ్నెన్సీ రూమర్లకు చెక్ పెట్టిన హీరోయిన్!
Sonam Kapoor On Pregnancy Rumours: బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఏడాది తర్వాత లండన్ నుంచి భారత్‌కు తిరిగొచ్చింది. ఇటీవలే ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన ఆమె ఈ సందర్భంగా వదులైన జాకెట్‌ను ధరించింది. ఫ్యాషన్ ఐకాన్‌గా చెప్పుకునే సోనమ్ అలా లూజ్ డ్రెస్ వేయడంతో ఆమె గర్భవతంటూ నెటిజన్లు డౌటు పడ్డారు. కొంతమందైతే ఆమె ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేస్తూ విషెస్ కూడా తెలియజేశారు. దీంతో ఎట్టకేలకు సోనమ్ ఈ పుకార్లపై స్పందించింది. బుధవారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తనకు పీరియడ్స్ వచ్చినట్లు స్పష్టం చేసింది. 'పీరియడ్స్ మొదటి రోజున వేడి నీళ్లు, అల్లం టీ తాగుతున్నాను' అని క్లారిటీ ఇవ్వడంతో రూమర్లకు చెక్ పెట్టినట్లైంది. ఇటీవల ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనమ్ మాట్లాడుతూ.. 'లండన్‌లో లభించే స్వేచ్ఛ నాకు చాలా ఇష్టం. ఇక్కడ నేను ఉండే చోటును నేనే శుభ్రం చేసుకుంటాను, నాకవసరమైనవి నేనే కొని తెచ్చుకుంటాను, నాకేది కావాలో అది వండుకుని తింటాను. నాకిక్కడ ఉండటం చాలా ఇష్టం, కానీ ఫైనల్‌గా నాకు ఇండియా అంటేనే ప్రాణం' అని చెప్పుకొచ్చింది. -
నిజం చెప్పండి తారలూ.. మీరు ప్రెగ్నెంట్స్ కదూ!
Is Sonam Kapoor, Neha Kakkar pregnant?: బాలీవుడ్ భామలు కొంచెం లావెక్కితే చాలు గర్భం దాల్చారా? అంటూ అనుమానాలు, కాస్త బక్కచిక్కితే మరీ అంత డైటింగ్ అవసరం లేదంటూ వెటకారాలు సోషల్ మీడియాలో కామన్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే మీడియాకు చిక్కిన ఇద్దరు తారలు సోనమ్ కపూర్, నేహా కక్కర్లకు కూడా ప్రశ్నల బాణాలను సంధిస్తున్నారు నెటిజన్లు. కోవిడ్ వల్ల ఏడాది కాలంగా లండన్‌లోనే ఉండిపోయిన సోనమ్ ఇటీవలే ముంబైకు తిరిగొచ్చింది. తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి ముంబై ఎయిర్‌పోర్టులో దిగింది. ఫ్యాషన్ ఐకాన్‌గా చెప్పుకునే ఆమె ఈ సమయంలో వదులైన జాకెట్‌ను ధరించింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఆమె గర్భవతని అభిప్రాయపడుతున్నారు. అందుకే లూజ్ జాకెట్ వేసుకుందని కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో ఎంతమేరకు నిజముందో సోనమ్ దంపతులకే తెలియాలి. కాగా సోనమ్ వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను 2018లో పెళ్లాడింది. మరోవైపు బాలీవుడ్ టాప్ సింగర్ నేహా కక్కర్ కూడా గర్భం దాల్చిందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు. గతేడాది రోహన్‌ప్రీత్‌ను పెళ్లి చేసుకున్న ఆమె తాజాగా భర్తతో కలిసి ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చింది. ఈ సమయంలో ఆమె వదులైన టీ షర్టు ధరించింది. పైగా ప్రయాణం చేసి కాస్త అలిసిపోయినట్లు కనిపిస్తోంది. దీంతో ఆమె భర్త రోహన్‌ప్రీత్ ముందుగా నేహాను కారులో కూర్చోబెట్టాకే తను కారెక్కాడు. అయితే నేహా వాలకం, ఆమె మీద రోహన్ కేరింగ్ చూస్తుంటే కన్ఫామ్గా ఆమె గర్భవతే అని డిసైడ్ అయిపోతున్నారు ఫ్యాన్స్. దీనికి తోడు 'ఇండియన్ ఐడల్ 12' షో నుంచి నేహా తప్పుకోవడం కూడా ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది. #sonamkapoor returns to India after more than a year. She had left with hubby #anandahuja and they have been in London due to to Covid-19. Father #anilkapoor comes to pick her up at the Mumbai airport. pic.twitter.com/qnMiJxPfHA — Viral Bhayani (@viralbhayani77) July 13, 2021 -
చిన్మయి ప్రెగ్నెన్సీ రూమర్స్.. సింగర్ రియాక్షన్
సింగర్ చిన్మయి పేరు వినని సినీ ప్రేక్షకులెవ్వరూ ఉండరు. దక్షిణాదిలో ఆమె గాత్రాన్ని ఆస్వాదిచని సంగీత ప్రేమికులు కూడా ఉండరు. అయితే ప్లేబ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు సంపాదించిన చిన్మయి మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని దక్షిణాదిని ఉవ్వెతున ప్రచారం చేశారు. కోలీవుడ్ స్టార్ రైటర్ వైరముత్తు లాంటి వారికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ మహిళల తరఫున ధైర్యంగా నిలబడ్డ మనిషి చిన్మయి. తాజాగా ఈ గాయని తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న రూమర్‌పై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల చిన్మయి తన భర్త రాహుల్ రవిచంద్రన్ సోదరుడి వివాహానికి హాజరయ్యారు. ఈ ఫోటోలను రాహుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో చిన్మయి చీర కట్టు ఉంది. అయితే చీర కట్టిన విధానం వల్ల ఆమె బేబి బంప్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో చిన్మయి గర్భవతి అని, ఆమె తమ తొలి బిడ్డకు త్వరలో జన్మనివ్వబోతుందని నెట్టింట్లో, యూట్యూబ్‌లో పుకార్లు రేగాయి. రూమర్స్‌పై స్పందించిన చిన్మయి.. తను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలను ఖండించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో సుధీర్ఘ పోస్టు పెట్టారు. Wishing my babies @subiksharaman and @Rohit_Ravindran an amazing life together 😍😍❤️ pic.twitter.com/h2FLZ6Mr18 — Rahul Ravindran (@23_rahulr) July 1, 2021 ‘ఇది మా పెళ్లి ఫోటో. ఇందులో నేను మడిసార్ ధరించారు. దాన్ని క్యారీ చేయడంలో నాకు సమస్యలు ఉన్నాయి. మడిసార్ కారణంగా నా ఉదరం పెద్దదిగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ నేను గర్భవతిని కాదు. చిన్మయి బేబీ బంప్ అంటూ యూట్యూబ్ ఛానల్స్ తప్పుగా పెట్టిన ఫోటోలను నేను ఈ రోజు చూశాను. వీటితో విసిగిపోయాను. మడిసార్తో ఎక్కువగా నడవడంతో చీర వదులుగా అయ్యింది. అయిన నా పర్సనల్ లైఫ్ విషయాలు షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా గురించి, సన్నిహితుల గురించి అస్సలు షేర్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అలాగే ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయిన సమయం వచ్చినప్పుడు ఆ విషయాలు మీతో పంచుకోవచ్చు లేదా చెప్పకపోవచ్చు. అనా నా నిర్ణయం. మేము 100% పిల్లల ఫోటోలను ఎప్పుడూ సోషల్ మీడియాలో పంచుకోము. వారు సోషల్ మీడియాలో ఉండరు. ఈ వార్తలతో అలసిపోయాను. ఇప్పుడైతే ప్రెగ్నెన్సీ రూమర్స్‌ను ఆపండి’ అంటూ పుకా రాయుళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. -
ప్రెగ్నెన్సీ రూమర్లు: నన్ను అడగండి అంటున్న నటి
అమ్మా అని పిలిపించుకోవాలని పెళ్లైన ప్రతి మహిళా కోరుకుంటుంది. పొత్తిళ్లలో పాపాయిని పడుకోబెట్టి ఆడించాలని తెగ ఉవ్విళ్లూరుతుంటుంది. గర్భవతి అయ్యానన్న విషయం తెలిసినప్పటి నుంచి ఆమె ఆనందం చెప్పతరం కాదనుకోండి. కానీ తనకు మాత్రం గర్భం దాల్చానని తెలుసుకోవడం బాధించే వార్త అంటోంది బాలీవుడ్ నటి పూనమ్ పాండే. పూనమ్-సామ్ బాంబే దంపతులు పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన నటి ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ తప్పుడు కథనాల ద్వారా తనను అనవసరంగా గర్భవతిని చేసేయకండి అని వ్యాఖ్యానించింది. ప్రెగ్నెంట్ అని తెలియగానే ప్రతి మహిళ సంబరపడుతుంది కానీ తన విషయంలో అలా జరగడం లేదని ఎందుకంటే ఇప్పుడు తాను గర్భవతిని కాదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటివి రాసేముందు కనీసం ఒక మాటైనా తనను అడగమని కోరింది. తన జీవితం తెరిచిన పుస్తకం అన్న పూనమ్ నిజంగా గర్భం దాల్చిన రోజు మిఠాయిలు పంచుతానని పేర్కొంది. కాగా పూనమ్.. దర్శకుడు సామ్ బాంబేను గతేడాది సెప్టెంబర్ 1న పెళ్లాడింది. కానీ పెళ్లైన నెల రోజులకే భర్త చిత్రహింసలు పెడుతున్నాడంటూ అతడిపై గృహహింస కేసు పెట్టింది. మళ్లీ అంతలోనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటూ వైవాహిక బంధంలో ఇలాంటి ఆటుపోట్లు సాధారణమని చెప్తూ తామిద్దరం కలిసిపోయామని చెప్పింది. చదవండి: ఎక్కువ కాలం హీరోయిన్గా ఉండాలంటే సమంతలా రాణించాల్సిందే -
మా అమ్మాయి పెళ్లికి పనికొస్తుందా?
మా అమ్మాయి వయసు 17 ఏళ్లు. ఇంతవరకు రజస్వల కాలేదు. వైద్యపరీక్షలు చేయించితే, అమ్మాయికి యుటెరస్, ఓవరీస్ లేవని చెప్పారు. మా అమ్మాయి పెళ్లికి పనికొస్తుందా? – త్రివేణి, మైసూరు ఆడవారిలో గర్భాశయం, అండాశయాలు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తయారవుతాయి. కాని కొందరిలో కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల, ఎలాగైతే వేరే అవయవాలు సరిగా ఏర్పడవో అలాగే పుట్టుకతోనే కొందరిలో గర్భాశయం ఉండదు. కొందరు గర్భాశయంతోపాటు అండాశయాలు కూడా లేకుండా పుడతారు. వీరికి ఏ విధంగాను పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. వీరిలో కొందరిలో యోని భాగం బాగానే ఉంటుంది. కొందరిలో సరిగా ఉండదు. మూసుకుపోయి ఉంటుంది. యోని ద్వారం సరిగా ఉంటే పెళ్ళి చేసుకుంటే వైవాహిక జీవితానికి ఇబ్బంది ఉండదు. ఒకవేళ యోనిద్వారం మూసుకుపోయి ఉంటే పెళ్ళికి ముందే వెజైనోప్లాస్టీ అనే ఆపరేషన్ ద్వారా క్రింద నుండి యోనిభాగాన్ని తయారుచెయ్యడం జరుగుతుంది. దీనివల్ల కలయికకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ సమస్యలను పెళ్ళికి ముందే అబ్బాయికి, వారి తరఫు వారికి చెప్పి పెళ్ళి చెయ్యవలసి ఉంటుంది. లేకపోతే తర్వాత మనస్పర్థలు ఏర్పడి గొడవలు వస్తాయి. వీరికి అండాశయాలు లేకపోవడం వల్ల వీరి శరీరంలో నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి ఉండదు. దీనివల్ల వారికి వక్షోజాలు సరిగా పెరగక చిన్నగా ఉండటం, చంకల్లో, జననేంద్రియాల వద్ద రోమాలు లేకపోవడం, స్త్రీ శరీరాకృతి అంతగా ఉండకపోవడం, వయసుపెరిగే కొద్దీ ఎముకల దృఢత్వం తగ్గి ఆస్టియోపోరోసిస్ సమస్య తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరికి వారి శరీరతత్వాన్ని బట్టి డాక్టర్ పర్యవేక్షణలో సమయానుగుణంగా అవసరమైతే ఈస్ట్రోజన్ హార్మోన్స్‌లో చికిత్స (హార్మోన్ రీప్లేస్మెంట్) ఇవ్వవలసి ఉంటుంది. - డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
టీనేజీలో గర్భం.. రిస్క్ ఉంటుందా?
లేటు వయసులో పిల్లల్ని కంటే మానసిక లోపాలతో పుట్టే ప్రమాదం ఉన్నట్టే చిన్న వయసులో కంటే కూడా అలాంటి రిస్క్ ఉంటుందా? ఎందుకంటే నాకు పదహారేళ్లకే పెళ్లయింది. ఇప్పుడు నాకు పందొమ్మిదేళ్లు. పిల్లల కోసం మా ఇంట్లో ఒత్తిడి ఎక్కువైంది. నేనేమో చదువు మీద దృష్టిపెట్టాను. మీ సమాధానం మీద నా భవిష్యత్ ఆధారపడి ఉంది మేడం... – దీపికా వత్సల, చెన్నూరు సాధారణంగా అమ్మాయి గర్భధారణకు శారీరకంగా మానసికంగా సిద్ధం అవ్వడానికి 21 సంవత్సరాలు నిండితే ప్రెగ్నెన్సీ సమయంలో కాంప్లికేషన్స్ ఎక్కువగా లేకుండా తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడున్న ఆధునిక కాలంలో అమ్మాయి తన కాళ్ల మీద తను నిలబడటానికి, లోకజ్ఞానం తెలియడానికి చదువు కూడా చాలా ముఖ్యం. 21 సంవత్సరాలకు డిగ్రీ పూర్తవుతుంది. పెళ్లి తర్వాత పిల్లలను కని, పెంచడానికి, చదివించుకోవడానికి, కుటుంబం సజావుగా సాగడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ సామాజిక పరమైన ఉపయోగాలు. తల్లీ, బిడ్డ ఆరోగ్యం గురించి ఆలోచిస్తే, అమ్మాయి శారీరకంగా పెరగడాని, పెల్విక్ ఎముకలు ధృడంగా తయారుకావడానికి, హర్మోన్స్ సక్రమంగా పనిచేయడానికి 20 సంవత్సరాలు అవసరం. అంతకంటే ముందు గర్భధారణ వల్ల గర్భం సమయంలో రక్తహీనత, బీపీ పెరిగే అవకాశాలు, బిడ్డ ఎదుగుదల సరిగా లేకపోవడం, పెల్విక్ ఎముకలు దృఢంగా లేకపోవడం వల్ల సాధారణ కాన్పుకి ఇబ్బందులు వంటి ఎన్నో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, కుటుంబ సమస్యలను బట్టి మామూలు వయసు వారి కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. తల్లిలో పోషకాల లోపం వల్ల కూడా బిడ్డలో మానసిక శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. ఎలాగైతే 35 సంవత్సరాలు దాటాక పుట్టబోయే పిల్లల్లో మానసిక లోపాలతో కూడిన డౌన్స్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో, అలాగే మరీ చిన్న వయసులో గర్భం దాలిస్తే కూడా పుట్టబోయే పిల్లల్లో ఈ సమస్యలు ఉండే అవకాశాలు కొద్దిగా ఉన్నాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. మీ ఇంట్లో వాళ్లకి పెళ్లయి మూడు నాలుగు సంవత్సరాలు దాటింది కనిపిస్తుంది కాని, నీ వయసు కనిపించట్లేదు. అందుకే వాళ్లు కంగారు పడుతున్నారు. ఇంతకు ముందు కాలంలో అయితే 15–20 సంవత్సరాల లోపలే పిల్లలను కనేవాళ్లు. అప్పటి కాలం పరిస్థితులు, వారి శరీరతత్వాలు, ఆహారపు అలవాట్లు, పనులు చేయడం వంటివి ఇప్పటి పిల్లలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేవి. కాబట్టి అప్పటి వారిలో, ఇప్పడు ఉన్నంత సమస్యలు ఉండేవి కావు. అలాగే తరాలు మారే కొద్దీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జన్యువులలో కూడా మెల్లగా మార్పులు వచ్చి, తద్వారా పుట్టబోయే పిల్లల్లో మానసిక, శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయాలు మీవారికి అర్థం అయ్యేటట్లు వివరించి, నీ చదువు పూర్తి చేసుకొని 21 సంవత్సరాలకు పిల్లల కోసం ప్రయత్నం చేయవచ్చు. మా దూరపు బంధువుల ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్లది ఉమ్మడి కుటుంబం. అన్నదమ్ముల పిల్లలు అంటే వరుసకు అన్నా, చెల్లి అయ్యేవాళ్లు ప్రేమలో పడ్డారు. ఇంట్లోవాళ్లంతా షాక్ అయ్యి, కౌన్సెలింగ్ ఇప్పించి పెళ్లి ఆలోచనను మాన్పించి చదువు కోసం ఇద్దరినీ చెరో దేశం పంపించారు. అయితే ఆ పిల్లలిద్దరి వాదన ఏంటంటే.. సైంటిఫిక్‌గా బావామరదళ్ల వరస ఎలాగో అన్నదమ్ముల పిల్లల వరస కూడా అలాంటిదే. వాళ్లిద్దరి పెళ్లి సమ్మతమైనప్పుడు ఇది కూడా సమ్మతమే కావాలి కదా అని. నిజంగా ఈ వాదనలో నాకు నిజమే ఉన్నట్టనిపించింది. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే మా ఇంట్లోవాళ్లు మా అమ్మాయిని మా ఆడపడచు కొడుకుకి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. నాకస్సలు ఇష్టం లేదు. మా చుట్టాల పిల్లల వాదనకు సరిపడా మీ జవాబు ఉంటే ఇది చూపించి పెళ్లి ఆపించాలని నా ప్రయత్నం మేడం.. అర్థం చేసుకోగలరు. నిజం వివరించగలరు. – పేరు, ఊరు వివరాలు రాయలేదు. మన హిందూ సంప్రదాయంలో సాధారణంగా ముందు నుంచీ కూడా మేనమామ, మేనత్త పిల్లలను వరుస కలుపుకొని పెళ్ళి చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే పెద్దమ్మ, పెద్దనాన్న, చిన్నాన్న, చిన్నమ్మ పిల్లలను తోబుట్టువులుగా, అన్నా చెల్లెలుగా పరిగణించడం జరుగుతుంది. అదే కొన్ని ఇతర మతాలలో పెద్దమ్మ, చిన్నమ్మ పిల్లలను వరుస కలుపుకుని పెళ్లి చేస్తుంటారు. ఇవన్నీ ఎవరి సంప్రదాయాలలో మత పెద్దలు నిర్ణయించిన దాన్నిబట్టి, వారి వారి ఆచారాలు, నమ్మకాలను బట్టి జరుగుతూ ఉంటాయి. ఇది ఎంతవరకు సమంజసం, సామాజికంగా తప్పా, ఒప్పా అని చెప్పడం కష్టం. కాని సైంటిఫిక్‌గా, మెడికల్‌గా వైద్యభాషలో చెప్పాలి అంటే ఇలాంటి సంబంధాలు ఏమైనా మొదటితరం, రెండవతరంలో దగ్గరి రక్తసంబంధీకులలో పెళ్ళిళ్లు అంటే అదీ ఏవిధంగానైనా మేనరికం లేదా కన్సాంగ్వినస్ consanguinous పెళ్ళిళ్ళ కిందకే వస్తుంది. ఎలాగైతే మేనత్త, మేనమామ పిల్లలను పెళ్ళి చేసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలలో కొన్ని జన్యుపరమైన సమస్యలు, పిల్లలలో అవయవ లోపాలు వచ్చే అవకాశాలు, చుట్టరికం లేని వారికి పిల్లలలలో కంటే రెట్టింపు ఉంటాయో, అలాగే పెద్దనాన్న, పెద్దమ్మ, చిన్నాన్న, చిన్నమ్మ పిల్లలతో పెళ్ళిళ్లు అయితే, వారి పిల్లలలో కూడా ఇలాంటి సమస్యల అవకాశం రెట్టింపే ఉంటుంది. కాబట్టి దగ్గర చుట్టాలలో, బంధువులలో పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదించి తగిన నిర్ణయం తీసుకోవడం మంచిది. -
ఆ సమస్య ఉంటే... గర్భం దాల్చవచ్చా?
నాకు ఈమధ్య కొత్తగా పెళ్లయింది. అయితే నాకు ఫిట్స్ సమస్య ఉంది. ఫిట్స్ సమస్య ఉన్నవాళ్లు గర్భం దాల్చవచ్చా? ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా? – బి.సంగీత, రామగుండం ఫిట్స్ సమస్య ఉన్నవాళ్లు గర్భందాల్చక ముందే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. వారు ఫిట్స్ మందులను, మోతాదును గర్భందాల్చాక బిడ్డ మీద అతి తక్కువ దుష్ఫలితాలు ఉండేలా మార్చి ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు గర్భం దాల్చక ముందు నుంచే ఫోలిక్ యాసిడ్–5ఎంజీ మాత్ర రోజుకొకటి చొప్పున వేసుకోవడం తప్పనిసరి. ఫిట్స్‌కు వాడే చాలామందుల వల్ల పుట్టబోయే బిడ్డలో నాడీవ్యవస్థ, మెదడు, వెన్నుపూసకు సంబంధించిన అవయవ లోపాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గర్భం దాల్చిన తర్వాత మందులు సక్రమంగా వాడుతూ మూడో నెలలో ఎన్టీ స్కాన్, ఐదో నెలలో టిఫ్ఫా స్కాన్ వంటి పరీక్షలు చేయించుకుని, అవయవ లోపాలు ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకోవడం మంచిది. కొందరిలో గర్భందాల్చిన తర్వాత హార్మోన్లలో మార్పులు, ఒత్తిడి వంటి కారణాల వల్ల ఫిట్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫిట్స్ ఎక్కువసార్లు రావడం వల్ల బిడ్డకు ఆక్సిజన్ సరఫరా సరిగా అందకపోవడం, బిడ్డ బరువు సరిగా పెరగకపోవడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కాన్పు సమయంలో మానసిక, శారీరక ఒత్తిడి వల్ల ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాన్పు సమయంలో ఫిట్స్ రాకుండా ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయినా కూడా ఒక్కోసారి ప్రాణాపాయ స్థితి ఏర్పడవచ్చు. ఫిట్స్ సమస్య ఉన్నవాళ్లు అన్ని వసతులూ ఉన్న హాస్పిటల్లో కాన్పు చేయించుకోవడం మంచిది. ఈమధ్య ‘బేబీ మిల్క్ స్టోరేజీ బ్యాగు’ల గురించి విన్నాను. వీటి గురించి తెలియజేయగలరు. ఇలా స్టోరేజీ మిల్క్‌ను పిల్లలకు ఇవ్వడం మంచిదేనా? జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? తల్లికి జలుబు చేసినప్పుడు పిల్లలకు పాలు ఇవ్వవచ్చా? – ఆర్. సులోచన, హైదరాబాద్ ఆధునిక కాలంలో ఎక్కువగా తల్లులు ఉద్యోగాలు చేస్తూ ఉండటం వల్ల కాన్పు తర్వాత తిరిగి ఉద్యోగానికి వెళ్లవలసిన పరిస్థితుల్లో బిడ్డకు పాలు పట్టించలేని పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటప్పుడు రోజూ ఉద్యోగానికి వెళ్లేటప్పుడు తల్లిపాలను పిండి బయటకు తీసి, జాగ్రత్తపరచి మళ్లీ ఇంటికి తిరిగి వచ్చే వరకు వాటిని బిడ్డకు పట్టవచ్చు. కాకపోతే ఈ పాలను సరైన విధానంలో భద్రపరచవలసి ఉంటుంది. దీనికి అనుగుణంగానే బేబీ మిల్క్ స్టోరేజీ బ్యాగులు తయారు చేయబడ్డాయి. ఇవి ‘బీపీఏ ఫ్రీ’ ఉండి, ఇన్ఫెక్షన్లు లేకుండా స్టెరైల్గా ఉండి, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడానికి వీలుగా, పగలకుండా, ఫ్రిజ్ నుంచి తియ్యగానే తొందరగా సాధారణ టెంపరేచర్‌లోకి రావడానికి వీలుగా, అలాగే కొద్దిగా వేడిని తట్టుకునేలా దృఢంగా ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో బిడ్డకు నేరుగా తల్లిపాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఫార్ములా పాల బదులు తగిన జాగ్రత్తలతో స్టోరేజీ బ్యాగులో నిల్వచేసిన రొమ్ముపాలను ఇవ్వవచ్చు. పాలను స్టోరేజీ బ్యాగు నుంచి బాటిల్లోకి తీసుకునేటప్పుడు, వాటిని సాధారణ టెంపరేచర్‌కు తీసుకొచ్చేటప్పుడు, వాటిని రీఫ్రీజ్ చేసేటప్పుడు శుభ్రమైన పరిస్థితుల్లో చెయ్యవలసి ఉంటుంది. కంపెనీని బట్టి కొన్ని బ్యాగులు ఒక్కసారి వాడటానికి మాత్రమే పనికొస్తాయి. మరికొన్ని జాగ్రత్తగా శుభ్రం చేసుకుని, తిరిగి వాడుకోవడానికి పనికొస్తాయి. వాటి మీద రాసిన సూచనలను చూసుకుని, జాగ్రత్తగా వాడుకుంటే మంచిది. తల్లికి జలుబు చేసినప్పుడు బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల బిడ్డకు జలుబు రాదు. తల్లిపాల వల్ల జలుబు వైరస్ బిడ్డకు సోకదు. తల్లి పాలలో బిడ్డకు రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి అవి బిడ్డకు చాలా వరకు జలుబు, విరోచనాలు కలిగించే క్రిముల నుంచి దూరంగా ఉంచుతాయి. గాలి ద్వారా బ్యాక్టీరియా, వైరస్ క్రిములు చేరడం ద్వారా బిడ్డకు జలుబు వస్తుంది గాని, తల్లిపాల ద్వారా కాదు. తల్లికి జలుబు ఉంటే ముక్కుకు, నోటికి టిష్యూ లేదా కర్చీఫ్ అడ్డుపెట్టుకుని పాలు ఇవ్వవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో ‘విటమిన్–డి’ అవసరమని చెబుతారు కదా... దీనివల్ల ఉపయోగాలు ఏమిటి? నేను యోగా చేస్తుంటాను. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు చేయవచ్చా? ఎలాంటి ఆసనాలకు దూరంగా ఉండాలి? – కె.రమ్య, కాజీపేట్ విటమిన్–డి ప్రెగ్నెన్సీ సమయంలో తల్లికే కాకుండా, బిడ్డ ఎదుగుదలకు కూడా చాలా అవసరం. విటమిన్–డి వల్ల తీసుకునే ఆహారం నుంచి ఎక్కువగా క్యాల్షియం రక్తంలోకి, ఎముకల్లోకి చేరుతుంది. దీనివల్ల తల్లిలో క్యాల్షియం నిల్వలు పెరుగుతాయి. తద్వారా తల్లిలో జరిగే శారీరక మార్పులకు, రక్తంలో జరిగే మార్పులకు, అవయవాల పనితీరుకు దోహదపడుతుంది. తద్వారా తల్లిలో ఒంటినొప్పులు, నడుంనొప్పి, కీళ్లనొప్పులు ఎక్కువగా లేకుండా ఉంటాయి. అలాగే కాన్పు సమయంలో పెల్విక్ ఎముకలు, కండరాలు సాగడానికి ఉపయోగపడుతుంది. బిడ్డకు తల్లి నుంచి క్యాల్షియం అందుతుంది. తద్వారా బిడ్డలోని అవయవాలు ఏర్పడటానికి, ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా తయారవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సరైన పాళ్లలో విటమిన్–డి తీసుకుంటే బిడ్డ, తల్లి ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. గర్భవతిగా ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు గర్భం సరిగా ఉండి, బిడ్డ, మాయ పొజిషన్ పైకి ఉండి, గర్భాశయ ముఖద్వారం లూజుగా లేకపోతే మూడు నెలల తర్వాతి నుంచి మెల్లగా యోగాసనాలు చేసుకోవచ్చు. ఐదో నెల పూర్తయినప్పటినుంచి సక్రమంగా యోగాసనాలు చేసుకోవచ్చు. అయితే పొట్టమీద బరువు పడకుండా, ఆయాసం లేకుండా ఉండే యోగాసనాలు చేసుకోవచ్చు. - డా.వేనాటి శోభ, బర్త్‌రైట్ బై రెయిన్బో, హైదర్‌నగర్, హైదరాబాద్ -
స్నేహ అమ్మతనానికి దగ్గరవుతున్నారా?
నటి స్నేహ అమ్మతనానికి దగ్గరవుతున్నారా? అవుననే ప్రచారానికి మీడియా తెర లేపింది. స్నేహ ప్రస్తుతం గర్భం దాల్చినట్లు 2015 ఆరంభంలో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారనే ప్రచారం సాగుతోంది. తమిళం, తెలుగు భాషలో ప్రముఖ హీరోయిన్గా వెలుగొందిన నటి స్నేహ. పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఎక్స్పోజింగ్ జోలికి అంతగా పోలేదనే చెప్పాలి. తెలుగులో శ్రీరామదాస్ వంటి భక్తిరస చిత్రాల్లోనూ నటించి మెప్పించిన స్నేహ ఇప్పుడు 32 ఏళ్ల ప్రౌడ. నటుడు ప్రసన్నను ప్రేమించి, పెద్దల సమ్మతితో 2012 మే 11న పెళ్లి చేసుకుంది. అంటే ఈ ముద్దుగుమ్మ సంసార జీవితంలోకి అడుగుపెట్టి రెండేళ్లు దాటింది. ప్రస్తుతం అమ్మతనానికి దగ్గరవుతున్నట్లు మీడియా ప్రచారం అయితే ఈ విషయాన్ని స్నేహ ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివాహానంతరం అడపా దడపా చిత్రాల్లో నటిస్తున్నా ఎక్కువ సమయాన్ని సంసార జీవితంలోనే గడుపుతున్నారన్నారు. ఈ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానని తెలిపారు. ఆ మధ్య ప్రకాష్‌రాజ్ సరసన ఉన్ సమయిల్ అరైయిల్ చిత్రంలో నటించానని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం తాను గర్భిణీగా ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి వదంతులు తన వివాహానికి ముందు ఆ తరువాత కూడా చాలా ప్రచారం అయ్యాయని నవ్వేశారు. నిజానికి తాము పేరెంట్ హుడ్ కావాలనే నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మరో విషయం ఏమిటంటే కథానాయికగా తెలుగులో ఒక చిత్రం చేయనున్నానని తెలిపారు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం కథ చాలా కొత్తగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాణం : తాను, ప్రసన్న సొంతంగా చిత్ర నిర్మా ణం చేపట్టాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. చిత్ర పరిశ్రమలో పది కాలాలు గుర్తుండిపోయే మంచి చిత్రాలను నిర్మించాలనుకుంటున్నామన్నారు. ఈ చిత్రా ల్లో ప్రసన్న మాత్రం నటిస్తారని చెప్పా రు. ప్రసన్నను ఇప్ప టివరకు చాక్లెట్ బాయ్‌గాను, ప్రతినాయకుడిగాను చూశారన్నారు. ఇప్పుడు గ్రామీణ పాత్రల్లో చూపిస్తూ ఒకటి రెండు చిత్రాలు చేయాలనుకుంటున్నట్లు నటి స్నేహ తెలిపారు. -
దర్శకుడు ఓకే అంటే..గర్భవతినైనా రెడీ!
ముంబై:తాను గర్భవతినైన సమయంలో దర్శకుడు షూటింగ్ చేయడానికి రెడీ అయితే తనకు ఎటువంటి అభ్యంతరం లేదని బాలీవుడ్ భామ రాణీ ముఖర్జీ స్పష్టం చేసింది. హాలీవుడ్ లో ఆ సాంప్రదాయం ఇప్పటికే కొనసాగుతుందని తాజాగా గుర్తు చేసింది. అక్కడ హీరోయిన్స్ గర్భవతులుగా ఉన్నా కూడా షూటింగ్ యాథావిధిగా పాల్గొంటారని రాణీ తెలిపింది. ఆదిత్య చోప్రాను పెళ్లి చేసుకున్న అనంతరం సినిమాలకు కాస్త దూరమైనట్లున్నారు అన్న ప్రశ్నకు రాణీ పై విధంగా బదులిచ్చింది. ప్రస్తుతం యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించబోయే చిత్రంలో నటించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొంది. 'మహిళలు గర్భవతులైన సమయంలో పని చేయడానికి పెద్దగా ఆసక్తి చూపరు. అప్పుడు వారికి శారీరకంగా అలసట ఉండటమే ప్రధాన కారణం. హాలీవుడ్ లో అయితే చాలామంది హీరోయిన్స్ గర్భం ధరించాక కూడా షూటింగ్ లో పాల్గొంటారు'అని తెలిపింది. 'నేను గర్భం దాల్చాక దర్శకుడు షూటింగ్ చేస్తానంటే ఎట్టిపరిస్థితుల్లోనూ వెనుకాడబోనని' రాణీ ముఖర్జీ పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో దర్శక-నిర్మాత ఆదిత్య చోప్రాను పెళ్లాడిన రాణీ ముఖర్జీ, త్వరలోనే తాను బిడ్డను కనాలనుకుంటున్నానని చెప్పింది. అయితే, తాను గర్భం దాల్చినట్లు ప్రచారంలోకి వచ్చిన కథనాలన్నీ వదంతులేనని ఆమె పేర్కొంది. -
గర్భవతినైతే.. అంతకంటే ఆనందమా..
తాను గర్భం దాల్చినట్లు వచ్చిన వార్తలపై బాలీవుడ్ భామ రాణీ ముఖర్జీ స్పందిస్తూ ‘అవే నిజమైతే అంతకంటే ఆనందమా..’ అంటూ వ్యాఖ్యానించింది. ఈ ఏడాది ప్రారంభంలో దర్శక-నిర్మాత ఆదిత్య చోప్రాను పెళ్లాడిన రాణీ ముఖర్జీ, త్వరలోనే తాను బిడ్డను కనాలనుకుంటున్నానని చెప్పింది. అయితే, తాను గర్భం దాల్చినట్లు ప్రచారంలోకి వచ్చిన కథనాలన్నీ వదంతులేనని ఆమె స్పష్టం చేసింది. ఇక్కడంతా అభద్రతే.. ‘ఇక్కడంతా అభద్రతే... ఈ రంగం ఎవరినైనా అభద్రతలోకి నెట్టేస్తుంది’ అంటూ సినీరంగం గురించి వ్యాఖ్యానిస్తోంది బిపాసా బసు. ఈ రంగంలో అనుక్షణం గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని, పోటీ ఫలితంగా ఎలాంటి వారికైనా అభద్రతాభావం తప్పదని చెబుతోంది. భూషణ్ పటేల్ రూపొందిస్తున్న ‘అలోన్’ హారర్ సినిమా షూటింగ్లో ప్రస్తుతం ఆమె బిజీగా ఉంది. హారర్ సినిమాల్లోనే నటిస్తారా అని ప్రశ్నిస్తే, తాను అన్ని రకాల సినిమాల్లోనూ నటించానని, మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే, తాను కాస్త ఎక్కువగా హారర్ సినిమాల్లో నటించానని చెప్పుకొచ్చింది. వారు చాలా గ్రేట్.. హీరోయిన్లు సాటి హీరయిన్లపై ప్రశంసలు కురిపించడం చాలా అరుదు. అదితిరావు హైదరి మాత్రం తోటి హీరోయిన్లను ప్రశంసలతో ముంచెత్తుతోంది. దీపికా పడుకొనే, కంగనా రనౌత్, సోనమ్ కపూర్లు ఫ్యాషనబుల్‌గా దుస్తులు ధరించడంలో చాలా గ్రేట్ అంటోంది ఈమె. హాలీవుడ్లో జెన్నిఫర్ లారెన్స్ స్టైల్‌ను ఎక్కువగా ఇష్టపడతానని అదితిరావు చెబుతోంది. -
అనవసరంగా ఏదో ఊహించుకున్నారు
తాను ప్రెగ్నెంట్ అని మీడియాలో వస్తున్న వార్తలను అస్కార్ అవార్డు విజేత, హాలీవుడ్ తార జూలియా రాబర్ట్స్ ఖండించారు. జూలియా రాబర్ట్స్ నాల్గవ బిడ్డకు తల్లి కాబోతుందని మీడియాలో రూమార్లు షికారు చేస్తున్నాయి. తాను వదులుగా ఉండే స్వెట్టర్‌ను ధరించడమే ఈ రూమర్లకు కారణమని ఆమె పేర్కొన్నారు. తన దుస్తుల స్టైల్ కారణంగానే ఏదో ఓ యాంగిల్లో ఫొటోలు తీసుకుని.. అనవసరంగా ఏదో ఉహించుకున్నారని జులియా ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఓ టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొన్న జూలియాను ‘మరో బిడ్డను కనడం మీకు ఇష్టమేనా?’ అని అడిగిన ప్రశ్నకు ‘అవును’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు. జూలియా, డానియల్ మోడర్లకు కవల అమ్మాయిలతో పాటు ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.