గర్భవతినైతే.. అంతకంటే ఆనందమా..
తాను గర్భం దాల్చినట్లు వచ్చిన వార్తలపై బాలీవుడ్ భామ రాణీ ముఖర్జీ స్పందిస్తూ ‘అవే నిజమైతే అంతకంటే ఆనందమా..’ అంటూ వ్యాఖ్యానించింది. ఈ ఏడాది ప్రారంభంలో దర్శక-నిర్మాత ఆదిత్య చోప్రాను పెళ్లాడిన రాణీ ముఖర్జీ, త్వరలోనే తాను బిడ్డను కనాలనుకుంటున్నానని చెప్పింది. అయితే, తాను గర్భం దాల్చినట్లు ప్రచారంలోకి వచ్చిన కథనాలన్నీ వదంతులేనని ఆమె స్పష్టం చేసింది.
ఇక్కడంతా అభద్రతే..
‘ఇక్కడంతా అభద్రతే... ఈ రంగం ఎవరినైనా అభద్రతలోకి నెట్టేస్తుంది’ అంటూ సినీరంగం గురించి వ్యాఖ్యానిస్తోంది బిపాసా బసు. ఈ రంగంలో అనుక్షణం గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని, పోటీ ఫలితంగా ఎలాంటి వారికైనా అభద్రతాభావం తప్పదని చెబుతోంది. భూషణ్ పటేల్ రూపొందిస్తున్న ‘అలోన్’ హారర్ సినిమా షూటింగ్‌లో ప్రస్తుతం ఆమె బిజీగా ఉంది. హారర్ సినిమాల్లోనే నటిస్తారా అని ప్రశ్నిస్తే, తాను అన్ని రకాల సినిమాల్లోనూ నటించానని, మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే, తాను కాస్త ఎక్కువగా హారర్ సినిమాల్లో నటించానని చెప్పుకొచ్చింది.
వారు చాలా గ్రేట్..
హీరోయిన్లు సాటి హీరయిన్లపై ప్రశంసలు కురిపించడం చాలా అరుదు. అదితిరావు హైదరి మాత్రం తోటి హీరోయిన్లను ప్రశంసలతో ముంచెత్తుతోంది. దీపికా పడుకొనే, కంగనా రనౌత్, సోనమ్ కపూర్‌లు ఫ్యాషనబుల్‌గా దుస్తులు ధరించడంలో చాలా గ్రేట్ అంటోంది ఈమె. హాలీవుడ్‌లో జెన్నిఫర్ లారెన్స్ స్టైల్‌ను ఎక్కువగా ఇష్టపడతానని అదితిరావు చెబుతోంది.