Punarnavi Bhupalam Reaction On Pregnancy Rumors With Her Gay Bestie - Sakshi
Sakshi News home page

Punarnavi Bhupalam : పెళ్లి కాకుండానే పునర్నవి ప్రెగ్నెంట్‌ అంటూ వార్తలు.. స్పందించిన పున్నూ

Published Fri, Feb 10 2023 4:31 PM | Last Updated on Fri, Feb 10 2023 5:51 PM

Punarnavi Bhupalam Reaction On Pregnancy Rumors - Sakshi

బిగ్‌బాస్‌ బ్యూటీ పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఉయ్యాల జంపాల సినిమాలో తొలిసారి కనిపించిన పునర్నవి ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్‌ సీజన్‌-3లో పాల్గొని యూత్‌ క్రష్‌గా మారిపోయిందీ బ్యూటీ. ఆ మధ్య వెబ్‌సిరీస్‌లో కనిపించినా ఆ తర్వాత సినిమాలు, సిరీస్‌లకు గుడ్‌బై చెప్పేసి లండన్‌కు వెళ్లిపోయింది.

సోషల్‌ మీడియా ద్వారా యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ని షేర్‌చేసుకునేది. ఈ క్రమంలో రీసెంట్‌గా పునర్నవి పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఈ మధ్యకాలంలో ఆమె షేర్‌ చేసిన ఫోటోల్లో పునర్నవి పొట్ట భాగం కాస్త పెద్దదిగా కనిపించడంతో ఈ రూమర్స్‌కి మరింత వైరల్‌ అయ్యాయి.

ఈ విషయం పునర్నవి దాకా చేరడంతో ఆమె కాస్త బోల్డ్‌గానే స్పందించింది. ''నా గే బెస్టీతో ప్రెగ్నెన్సీ వచ్చిందని కొన్ని యూట్యూబ్‌ చానెల్స్‌లో ఇష్టారీతిన వార్తలు రాసేశారు. ఇది నాన్‌ సెన్స్‌. గత నెలలో నేను కాస్త సిక్‌ అయ్యాయని చెబితే, ప్రాణాపాయం అని రూమర్స్‌ సృష్టించారు. ఇప్పుడేమో నేను ప్రెగ్నెంట్‌ అని రాశారు.

సోషల్‌ మీడియాలో చూసి నమ్మేయకండి. ఏది నిజమో, కాదో తెలుసుకోండి. మీరు రాసే పిచ్చిరాతలు అవతలి మనిషిని ఎంతలా ప్రభావితం చేస్తాయో ఆలోచించండి'' అంటూ ఘుటుగానే బదులిచ్చింది. ప్రస్తుతం పునర్నవి చేసిన ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement