Pregnant
-
విద్యార్థినిని గర్భవతిని చేసిన కెమిస్ట్రీ టీచర్..
అన్నానగర్: కడలూరు జిల్లా సేతియాతోపు పక్కన ఉన్న మంగళం ప్రాంతానికి చెందిన మలర్ సెల్వం (50). ఇతనికి పైళ్లె పిల్లలు కూడా ఉన్నారు. అదే ప్రాంతంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కెమిస్ట్రీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ పాఠశాలలో చదువుతున్న ప్లస్–2 విద్యార్థినిని లైంగికంగా వేధించేవాడని తెలుస్తోంది. ఈ విద్యార్థి ప్రస్తుతం చైన్నెలోని ఓ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుంది. ఈ స్థితిలో 15వ తేదీన కడుపునొప్పి రావడంతో విద్యార్థిని చికిత్స నిమిత్తం చైన్నెలోని కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. అప్పుడు ఆమెకి అబ్బాయి పుట్టాడు. దీంతో విద్యార్థిని విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది చూసిన ఆసుపత్రి సిబ్బంది విద్యార్థిని రక్షించి విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం విద్యార్థిని బంధువులు సెంఽబియం తోప్పు ఆల్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఉపాధ్యాయుడు మలర్ సెల్వంను గురువారం అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ప్రాక్టికల్స్‌లో మార్కులు తగ్గిస్తానని బెదిరించి గతేడాది స్కూల్లో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. -
వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం.. అనంతపురం సర్వజనాస్పత్రిలో తల్లీబిడ్డ మృతి
అనంతపురం మెడికల్: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో సోమవారం తల్లీబిడ్డ ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. బాత్రూంకు వెళ్లిన గర్భిణి అక్కడ కళ్లు తిరిగి కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గైనిక్ విభాగం వైద్యులు, సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో తల్లి, బిడ్డ ప్రాణాలు దక్కలేదు. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన మంజునాథ్ తన భార్య జ్యోతి (30)ని మూడో కాన్పునకు గత నెల 27న సర్వజనాస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. హైరిస్క్ కేసు కావడంతో వైద్యులు, సిబ్బంది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉన్నా.. ఆ స్థాయిలో పట్టించుకోలేదు. జ్యోతికి సోమవారం ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్ ఇచ్చారు. కాసేపటికి కళ్లు తిరుగుతున్నాయని, బాత్రూంకు వెళ్లాలని చెప్పింది. బాత్రూంకు పంపించడంలో స్టాఫ్‌నర్సులు, ఎఫ్‌ఎన్‌వోల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కుటుంబసభ్యులే జ్యోతిని బాత్రూంకు తీసుకెళ్లారు. అక్కడే ఆమె కింద పడిపోయింది. భర్త మంజునాథ్ తదితరులు గట్టిగా కేకలు వేసినా సిబ్బంది వెంటనే స్పందించలేదు. కొద్దిసేపటి తరువాత వచ్చిన సిబ్బంది జ్యోతిని పరీక్షించి లేబర్ వార్డుకు తరలించి సీపీఆర్ ద్వారా శ్వాసనందించే ప్రయత్నం చేశారు. జ్యోతి పరిస్థితి అర్థంగాక దిక్కుతోచని స్థితిలో ఉన్న మంజనాథ్‌ను బయటకు వెళ్లి ఇంజక్షన్ తీసుకురమ్మని గైనిక్ వైద్యులు, స్టాఫ్‌నర్సులు చెప్పారు. దీంతో అతడు పరుగెత్తుకుంటూ వెళ్లి స్థానిక సప్తగిరి సర్కిల్లోని ఓ ప్రైవేటు మందుల షాపులో రూ.170 వెచ్చించి యాంటీ బయోటిక్ ఇంజెక్షన్ తీసుకొచ్చాడు.తర్వాత జ్యోతికి సిజేరియన్ చేశారు. అప్పటికే ఆడబిడ్డ చనిపోయింది. జ్యోతిని అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ) యూనిట్లో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. ఆమె కన్నుమూసింది. తొమ్మిదేళ్ల పాప, ఏడేళ్ల బాబు ఉన్నారని, తల్లి మృతితో వాళ్ల పరిస్థితేంటని మంజునాథ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.తల్లిని బతికించాలని చూశాంజ్యోతికి రక్తహీనత ఉండడంతో రెండు యూనిట్ల రక్తం అందించాం. నెలలు నిండకపోవడంతో పాటు బాత్రూంకు వెళ్లిన సమయంలో కళ్లు తిరిగి పడిందని చెప్పారు. అప్పటికే పల్స్ లేదు. తల్లిని రక్షించాలనే ఉద్దేశంతో సిజేరియన్ చేశాం. కార్డియాక్ అరెస్టు అయి ఆమె మరణించింది. – డాక్టర్ షంషాద్‌బేగం, హెచ్‌వోడీ, గైనిక్ విభాగం, అనంతపురం సర్వజనాస్పత్రి -
రోజంతా ఆ తల్లి నరకయాతన!
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) : పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది.. నొప్పులతో నరక యాతన అనుభవిస్తున్నా.. పాపం ఆ తల్లికి కనీసం ఆస్పత్రిలో వీల్ చైర్ కూడా ఇవ్వలేదు. ఉదయం నుంచి ఆస్పత్రి బయటే ఉంచేశారు. అర్ధరాత్రి వరకూ అదే పరిస్థితి.. ఆ తర్వాత నొప్పులు తీవ్ర మయ్యాయి. ఓ వైపు రక్త స్రావం.. మరో వైపు బిడ్డ తల కూడా బయటికి వచ్చింది.. అయినా సరే ఆస్పత్రి సిబ్బంది కరగలేదు. ఇక చేసేది లేక బయటికి వచ్చిన బిడ్డ తలతోనే ఆ గర్భిణిని తల్లి ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఏరియా ఆస్పత్రిలో జరిగిన అమానవీయ ఘటన ఇది. సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చిం ది. ప్రాధేయపడ్డా ఫలితం లేదుఅనపర్తికి చెందిన నిండు గర్భిణి వినీత సుఖ ప్రసవం కోసం సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం అనపర్తి ఏరియా ఆస్పత్రికి వెళ్లింది. ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆమెకు కనీసం వీల్ చైర్ కూడా సిబ్బంది ఏర్పాటు చేయలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆస్పత్రి బయటే ఉంచేశారు. ప్రసూతి వేదన అనుభవిస్తున్న కూతురి బాధను తట్టుకోలేని ఆమె తల్లి.. ఎంత ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. ఆ రోజు అర్ధరాత్రి వరకూ ఆ గర్భిణి వైద్య సాయం కోసం ఎదురుచూసింది. అదే రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆమెకు నొప్పులొచ్చాయి.నొప్పుల సంగతి ఆస్పత్రి సిబ్బందికి తెలియపరచగా.. మత్తు ఇచ్చే డాక్టర్లు లేరంటూ సమాధానం చెప్పారు. అప్పటికే రక్తస్రావం అధికంగా అవడంతో పాటు శిశువు తల బయటికొచ్చి నరకయాతన అనుభవిస్తున్నా.. ఆమె బాధను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆస్పత్రికి వచ్చిన జనం ఈ ఘటన చూసి చలించిపోయారు. దీంతో బయటికి వచ్చిన శిశువు తలతో ఉన్న తన కూతురిని బాధితురాలి తల్లి ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించింది. ఈ విషయం తెలుసుకున్న బొమ్మూరుకు చెందిన సామాజిక కార్యకర్త దివిలి ప్రభాకరరావు డీసీహెచ్ఎస్ పద్మశ్రీరాణికి సోమవారం ఫిర్యాదు చేశారు. -
ఇంట్లోనే అబార్షన్.. గర్భిణీ మృతి
ముంబై: మహారాష్ట్రలోని పుణెలో విషాదం చోటుచేసుకుంది. గర్భిణికి ఇంట్లోనే అబార్షన్ చేయడం వల్ల 24 ఏళ్ల మహిళ మృతిచెందింది. ఈ కేసులో ఆమె భర్త, మామలను పోలీసులు అరెస్ట్ చేయగా.. అత్తపై కూడా కేసు నమోదు చేశారు. ఇక అబార్షన్ చేసేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకొచి విచారిస్తున్నారు. నాలుగు నెలల పిండాన్ని కుటుంబీకులు పొలంలో పాతిపెట్టినట్లు తేలింది.వివరాలు.. 2017లో యువతికి వివాహం జరిగింది. ఇప్పటికే ఈ జంటకు ఇద్దరు పిల్లలు( ఒక బాలిక, బాలుడు) ఉన్నారు. ఇటీవల ఆమె మూడోసారి గర్భం దాల్చింది. అయితే కడుపులో పెరుగుతుంది ఆడపిల్ల అని తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. మహిళకు ఇంట్లోనే అబార్షన్ చేయాని ప్లాన్ చేశారు. ఇందుకు ఓ వైద్యుడిని కూడా పిలిపించారు. నాలుగు నెలల గర్బిణీకి ఇంట్లోనే అబార్షన్ చేయించారు. పిండాన్ని కుటుంబీకులు పొలంలో పాతిపెట్టారు. అనంతరం అధిక రక్తస్రావం కారణంగా మహిళ పరిస్థితి విషమంగా మారింది. మరుసటి రోజు ఆమెను ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే మరణించింది.మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి ఆమె భర్త, మామలను అరెస్ట్ చేశారు. పొలం నుంచి పిండాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. అబార్షన్ చేసేందుకు పిలిచిన ఓ ప్రైవేట్ వైద్యుడిని కూడా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఇందాపూర్ పోలీసులు పేర్కొన్నారు. -
గర్భంతో ఉన్నాం కదా అని.. అన్నీ లాగించేయకూడదు!
మన ఇంట్లోకి చిన్ని బుజ్జాయి రాబోతోంది అంటే అటు కాబోయే తల్లిదండ్రులతోపాటు, ఇరు కుటుంబాల్లోనూ ఆనందోత్సాహాలు నెలకొంటాయి. అయితే తొమ్మిది నెలలు నిండి, పండంటి బిడ్డ పుట్టేదాకా కొంచెం ఆందోళన ఉంటుంది. ముఖ్యంగా గర్భం ధరించినమహిళల్లో ఎన్నో తెలియని సందేహాలు, భయాలు ఉంటాయి. ముఖ్యంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం జోలికి వెళ్లకూడదు లాంటి సందేహాలుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే సౌష్టికాహారం, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం, తాజాగా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. శిశువుకు అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు లభించేలా జాగ్రత్త పడాలి. అలాగే వైద్యుల పర్యవేక్షణలో అవసరమైన సప్లిమెంట్లను వాడుతూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, బిడ్డ ఎదుగుదల, కదలికలు ఎలా ఉన్నాయి అనేది పరిశీలించుకోవడమే పాపాయికి శ్రీరామ రక్ష. అయితే సురక్షితమైన, ఆరోగ్యకరమైన బిడ్డ కావాలంటే మాత్రం కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అంతేకాదు తల్లీ బిడ్డకోసం అంటూ మరీ ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవాలి. మన ఆకలిని బట్టి మాత్రమే తినాలి. లేదంటే అజీర్తి,కడుపు ఉబ్బరం లాంటి సమస్యలొస్తాయి. అలాగే మసాలాలు, ఉప్పు,కారం, పులుపు ఎక్కువగా ఉండే పదార్థాలను కూడా తగ్గించాలి. ఆహారం, జాగ్రత్తలుకోలిఫాం బాక్టీరియా, టాక్సోప్లాస్మోసిస్ , సాల్మొనెల్లా లాంటి హానికరమైన బాక్టీరియా సోకే ప్రమాదం ఉన్నందున గర్భధారణ సమయంలో పచ్చి లేదా, ఉడికీ ఉడకని ఆహారం జోలికి వెళ్ల కూడదు. వీటికి కారణంగా ఒక్కోసారి గర్భస్రావం లేదా అకాల జననం లేదా పుట్టుకతో వచ్చే లోపాలు వంటి సమస్యలకు దారి తీస్తాయి. పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులు మంచిది కాదు పాలు, గుడ్లు పౌష్టికాహారం. కానీ పచ్చి గుడ్లలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉండవచ్చు. అందుకే పూర్తిగా ఉడికిన గుడ్డు, మరిగించిన పాలను తీసుకోవాలి.శుభ్రం చేయని పండ్లు, కూరగాయలు: తాజాగా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. వీటిని వండేటపుడు, వాటిని శుభ్రంగా కడగాలి. లేదంటే వాటిపై ఉండే పురుగుమందుల అవశేషాలు, రసాయనాలు బిడ్డకు హానికరంగా మారతాయి. కొన్ని రకాలు చేపలు : మెర్క్యురీ ఎక్కువగా ఉండే చేపలకు దూరంగా ఉండాలి. ఇవి శిశువు నాడీ వ్యవస్థకు హాని చేస్తాయి. సొరచేప, కత్తి చేప, కింగ్ మాకేరెల్, టైల్ ఫిష్ వంటి కొన్ని రకాల చేపలలో మెర్క్యురీ ఎక్కువగా ఉంటుంది. సాల్మన్, ట్రౌట్, సార్డినెస్ వంటి తక్కువ మెర్క్యురీ చేపలను పరిమితంగా తినవచ్చు.కూల్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్ కూడా తగ్గించాలి. దీనివల్ల బిడ్డ ఎదుగుదలపైప్రభావాన్ని చూపిస్తాయి. ఇంకా మద్యం, ధూమపానాన్ని పూర్తిగా మానివేయాలి. ఓపిక ఉన్నంత వరకు, కనీసం అరగంట వ్యాయామం చేయవచ్చు. నిపుణుల పర్యవేక్షణలో కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలు కూడా వేయవచ్చు. -
తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. గతేడాది పోలీస్ ఆఫీసర్‌తో పెళ్లి (ఫోటోలు)
-
ఆస్పత్రి దరిచేర్చని రోడ్డు.. లోకం చూడకుండానే కన్నుమూసిన పసిగుడ్డు
కాగజ్‌నగర్ రూరల్/పెంచికల్పేట్: రోడ్డంతా బురద.. అడుగుతీసి అడుగు వేయలేని దారిలో సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేని పరిస్థితుల్లో లోకం చూడకుండానే ఓ పసిగుడ్డు తల్లి గర్భంలో కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన సోమవారం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ గ్రామ పంచాయతీ పరిధి మేరగూడ గ్రామానికి చెందిన దుర్గం పోచన్న భార్య పంచపూల నిండు గర్భిణి. సోమవారం వేకువజామున ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. కుటుంబసభ్యులు 108కు సమాచారమిచ్చారు. మేరగూడకు వెళ్లే దారి పూర్తిగా బురదగా మారడంతో సిబ్బంది ఎల్లూర్ వరకు రావాలని సూచించారు. దీంతో తెల్లవారుజామున 4 గంటలకు కుటుంబసభ్యులు పంచపూలను ఎడ్లబండిలో ఎక్కించారు. మేరగూడ నుంచి ఎల్లూర్ వరకు ఐదుకిలోమీటర్ల దూరం వెళ్లడానికి ఆ బురద మార్గంలో రెండు గంటలకుపైగా పట్టింది. అక్కడి నుంచి గర్భిణిని 108లో కాగజ్‌నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో గర్భంలోనే శిశువు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆపరేషన్ చేసి ఆడ మృతశిశువును బయటకు తీశారు. ప్రస్తుతం పంచపూలకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. తమ గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడం వల్లే బిడ్డ మృతిచెందిందని పోచన్న కన్నీటిపర్యంతమయ్యాడు. -
ప్రేమ పేరుతో వంచన
హిందూపురం అర్బన్: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం గోళ్లాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఓ బాలిక (16)ను ప్రేమ పేరుతో లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోళ్లాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రాజేష్ ఇటీవల జరిగిన అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త సతీష్ హత్య కేసులో ప్రధాన నిందితుడు. అతను ఈ కేసులో ప్రస్తుతం జైల్లో రిమాండ్‌లో ఉన్నాడు. రాజేష్ రిమాండ్‌కు వెళ్లకముందు గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో నమ్మించాడు. శారీరకంగా లొంగదీసుకొని గర్భవతిని చేశాడు.రెండు రోజుల క్రితం బాలిక కడుపునొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో కర్ణాటక రాష్ట్రం గౌరీబిదనూరు ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించారు. వైద్యులు పరీక్షించి ఆమె గర్భవతి అని తేలి్చ.. అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు బాలికను అక్కడి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. చిక్‌బళ్లాపుర ఎస్పీ కార్యాలయం నుంచి కేసును సోమవారం హిందూపురం అప్‌గ్రేడ్ పోలీస్‌స్టేషన్‌కు బదలాయించారు. దీంతో అప్‌గ్రేడ్ సీఐ ఆంజనేయులు బాధిత బాలికను గౌరీబిదనూరు నుంచి హిందూపురం తీసుకువచ్చి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆమె గర్భిణి అని నిర్ధారణ కావడంతో రాజే‹Ùపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
ప్రియుడి మోసానికి యువతి బలి
ఒంగోలు టౌన్: ప్రేమ పేరుతో ఓ యువకుడి చేతిలో వంచనకు గురైన యువతి చివరకు ప్రాణాలొదిలింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో నమ్మించడంతో పాటు శారీరకంగా దగ్గరై యువతిని గర్భిణిని చేశాడు. ఆ యువతి ఆరోగ్యం క్షీణించడంతో ఒంగోలు జీజీహెచ్‌లో అడ్మిట్ చేసి పరారయ్యాడు. చికిత్స పొందుతూ యువతి మృతిచెందింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు రాజీవ్‌కాలనీకి చెందిన చప్పిడి రాజేంద్రప్రసాద్, అరుణకుమారి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులిద్దరూ పనిచేస్తున్నారు. తండ్రి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా, తల్లి కూలి పనులకు వెళ్లి పిల్లలను చదివించుకుంటోంది. పెద్ద కూతురు ప్రియ తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. మిగతా ఇద్దరు కూతుళ్లు చీమకుర్తిలో పదో తరగతి చదువుకుంటున్నారు. ప్రియ కూడా 3వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చీమకుర్తి గురుకుల పాఠశాలలో చదివింది. తన క్లాస్మేట్, దూరపు బంధువైన శివకళ్యాణ్తో ఏడాది క్రితం ఆమెకు పరిచయమైంది. సంతనూతలపాడు మండలంలోని తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన శివకళ్యాణ్ పెయింటర్‌గా పనిచేస్తుంటాడు. వారి పరిచయం ప్రేమగా మారింది. ఎస్వీ యూనివర్శిటీలో బీటెక్ చదువుకుంటున్న ప్రియ.. తన తల్లిదండ్రులకు తెలియకుండా తక్కెళ్లపాడు వచ్చి తరచూ ప్రియుడితో కలుస్తుండేది. ఈ క్రమంలో శారీరకంగా కూడా దగ్గరైంది. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ప్రియుడు శివకళ్యాణ్కు చెప్పింది. జూలై చివరి వారంలో యూనివర్శిటీ నుంచి వచ్చేసి తక్కెళ్లపాడులో ప్రియుడితో కలిసి జీవిస్తోంది. శుక్రవారం రాత్రి ప్రియ ఆరోగ్యం దెబ్బతింది. ఎగశ్వాస వస్తుండటంతో ఆమెను ఒంగోలులోని జీజీహెచ్‌కి శివకళ్యాణ్ తీసుకొచ్చాడు. హాస్పిటల్లో చేర్పించి ప్రియ తండ్రి రాజేంద్ర ప్రసాద్‌కు గుర్తు తెలియని వ్యక్తిలా ఫోన్ చేశాడు. తిరుపతి నుంచి రైలులో వస్తుండగా మీ అమ్మాయికి ఫిట్స్ వచ్చాయని, ఆమెను ఒంగోలు జీజీహెచ్‌లో జాయిన్ చేశానని చెప్పాడు. ఆందోళనకు గురైన రాజేంద్ర ప్రసాద్ హడావిడిగా జీజీహెచ్‌కి వచ్చాడు. ఆస్పత్రిలో వాకబు చేయగా, మీ కూతురు ఆరో నెల గర్భిణి అని, ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంతనూతలపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ప్రియ ప్రియుడు శివకళ్యాణ్ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.నా బిడ్డను చంపిన హంతకులను శిక్షించండి సారూ...నా బిడ్డతో రెండు రోజుల క్రితమే మాట్లాడాను. బాగానే మాట్లాడింది. కాస్త దగ్గు వస్తుందని చెప్పింది. ఇంతలో ఇలా చనిపోతుందని అనుకోలేదంటూ ప్రియ తల్లి అరుణకుమారి గుండెలవిసేలా రోదిస్తోంది. తన బిడ్డను మోసం చేసి ఆమె చావుకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని, తన బిడ్డలాగా మరొకరి బిడ్డ బలికాకూడదని కన్నీరు పెట్టింది. ప్రియ కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు కోరుతున్నారు. ప్రియ నోటి నుంచి నురగ వస్తుండటంతో ఆమె మరణం సహజ మరణం కాదన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమైపె హత్యా ప్రయత్నం జరిగి ఉండవచ్చని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు పూర్తిగా విచారణ జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. -
క్రీడా నైపుణ్యం, మాతృత్వం రెండింటిని ప్రదర్శించిన ఆర్చర్ !
పారిస్ ఒలింపిక్స్‌లో అసమానతలు ధిక్కరించిన అథ్లెట్లలో అజర్బైజాన్ ఆర్చర్ యైలగుల్ రమజనోవా ఒకరు. 35 ఏళ్ల ఈ ఆర్చర్ ఆరు నెలల నిండు గర్భిణి. ప్రతిష్టాత్మకమైన పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొని క్రీడా నైపుణ్యాన్ని, మాతృత్వం రెండింటిని ప్రదర్శించి అందరిచే ప్రశంసలందుకుంది. బేబీ బంప్ ఉన్నప్పటికీ ప్రతి షాట్‌ని ఆత్మవిశ్వాసం, సంకల్పబలంతో ప్రదర్శించింది. హృదయాన్ని కదిలించే ఆమె గాథ ఏంటో సవివరంగా చూద్దామా..!చరిత్రలో ఒలింపిక్స్‌లో పాల్గొన్న రెండవ ఆర్చర్ యైలగుల్ రమజనోవా . రియో 2016లో ఓల్కా సెన్యుక్ తర్వాత అజర్‌బైజాన్‌కు తొలిసారిగా ప్రాతినిధ్య వహించిన రెండో ఆర్చర్ ఈ 34 ఏళ్ల రమజనోవా. ఆమె మహిళల వ్యక్తిగత ఆర్చరీ ఈవెంట్లో పాల్గొంది. ఆమె ఎలిమినేషన్ రౌండ్ 1/32లో 28వ ర్యాంక్ చైనీస్ ఆర్చర్ ఆన్ క్విక్సువాన్ను ఓడించింది. అయితే ఆ తర్వాత 1/16 రౌండ్లో జర్మనీకి చెందని మిచెల్ క్రోపెన్ చేతిలో నిష్క్రమించింది. గర్భవతిగా ఉన్న ఒలింపియన్‌గా తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అందులో పర్ఫెక్ట్ 10 షూట్ చేయడానికి ముందు తన బేబీ కిక్‌ను అనుభవించిన అనుభవాన్ని వివరించింది. "నేను ఈ చివరి బాణాన్ని వేసే ముందు నా బిడ్డ నన్ను తన్నినట్లు నేను భావించాను, ఆపై నేను 10 షూట్స్ ప్రదర్శించాను. అలాగే ఈ ఒలింపిక్స్ కోసం శిక్షణ సమయంలో నా గర్భంతో నేను అసౌకర్యంగా భావించలేదు. బదులుగా, నేను ఒంటరిగా పోరాడడం లేదని, నా బిడ్డతో కలిసి పోరాడుతున్నానని నాకు అనిపించింది… నా పిల్లవాడికి లేదా ఆమెకు ఆసక్తి ఉంటే నేను విలువిద్య నేర్పిస్తాను, ” అని రమజనోవా ఇన్‌స్టాగ్రాంలో రాసింది. 127వ ర్యాంక్‌లో ఉన్న రమజనోవా ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో పాల్లొన్న తొలి గర్భిణీ క్రీడాకారిణి కాదు. ఈజిప్టుకు చెందిన 26 ఏళ్ల ఫెన్సర్ నాడా హఫీజ్ కూడా ఏడు నెలల గర్భవతిగా పోటీ పడింది. మహిళల సాబర్ పోటీలో హఫీజ్ తన మొదటి రౌండ్ మ్యాచ్‌లో యూఎస్ఏకి చెందిన మాజీ ఎన్సీఏఏ ఛాంపియన్ ఎలిజబెత్ టార్టకోవ్స్కీని ఓడించింది. ఇక్కడ ఈ అద్భుతమైన మహిళలు తమ పుట్టబోయే పిల్లలను మోస్తూనే అత్యున్నత స్థాయిలో పోటీ చేసి అంచనాలను ధిక్కరించి, మాతృత్వపు బలాన్ని ప్రదర్శించారు. గర్భవతులుగా ఒలింపిక్స్‌లో పోటీ పడి స్ఫూర్తిగా నిలవడమేగాక ఈ మహిళలు సంకల్పం, సామర్థ్యానికి హద్దులు లేవని ప్రపంచానికి చాటిచెప్పారు.(చదవండి: ఆన్లైన్లో ఆక్యుపంక్చర్ నేర్చుకుని ఏకంగా ఓ వ్యక్తికి చికిత్స చేసింది..కట్ చేస్తే..!) -
ఈ సమస్యను.. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు! ఇదీ..
నా వయసు 24 సంవత్సరాలు. నాకు ఆరు నెలలుగా వెజైనల్ దురద, పెయిన్, అప్పుడప్పుడు ఫీవర్ వస్తున్నాయి. నాకు ప్రెగ్నెన్సీ కూడా రావట్లేదు. ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కంప్లీట్ రిలీఫ్ రావడం లేదు. – అమృత, విజయవాడమీరు చెప్పిన లక్షణాలను బట్టి దాన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్. అది వెజైనల్ / యూరిన్‌లో ఉండవచ్చు. భర్త నుంచి వ్యాపించవచ్చు. అందుకే మీరు గైనకాలజిస్ట్‌ను కలసి వెజైనల్, యూరిన్ శాంపిల్స్ తీసుకుని, బ్యాక్టీరియల్ లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా అని నిర్ధారణ చేసి దానికి తగిన యాంటీబయాటిక్స్ ఇస్తారు. మీ భర్తని కూడా యూరాలజిస్ట్‌ని కలసి యురేటరల్ స్వాబ్ తీసుకోమని చెబుతారు.ఇద్దరికీ ట్రీట్మెంట్ చేసిన తరువాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యమని చెప్తారు. ఇన్ఫెక్షన్స్ సరిగ్గా ట్రీట్ చెయ్యనప్పుడు ఫాలోపియన్ ట్యూబ్‌కి ఏ ఇన్ఫెక్షన్ వ్యాపించినా ట్యూబ్స్ బ్లాక్ కావచ్చు. అప్పుడు ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. వచ్చినా ట్యూబ్‌లోనే ప్రెగ్నెన్సీ రావడం.. అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవుతుంది. ఇది ప్రమాదం. గర్భసంచికి కూడా ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశాలు ఉంటాయి. లక్షణాలు మొదలైన రెండుమూడు రోజుల్లో వెంటనే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్‌కి ట్రీట్మెంట్ మొదలుపెడితే ఈ లాంగ్‌టర్మ్ రిస్క్స్ ఏమీ ఉండవు.డాక్టర్ చెప్పిన యాంటీబయాటిక్స్ కూడా సరైన టైమ్‌కి సరైన డోస్, చెప్పినన్ని రోజులు కరెక్ట్‌గా తీసుకోవాలి. వాళ్లకి ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్ రాకుండా ఏడాదికి చెకప్‌కి వెళ్లమని చెప్తారు. ప్రెగ్నెన్సీ ఆలస్యం అవుతుంటే అల్ట్రాసౌండ్ ద్వారా ట్యూబ్స్‌లో బ్లాక్ ఉందా అని చెక్ చేస్తారు. కొన్ని బ్లడ్ టెస్ట్‌ల ద్వారా కూడా ప్రెగ్నెన్సీ ఆలస్యం అవ్వడానికి కారణాలను కనిపెడతారు. సరైన సమయానికి ట్రీట్మెంట్ ఇస్తే, మళ్లీ వెజైనల్∙ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
ప్యారిస్ ఒలింపిక్స్‌లో ఓ అద్భుతం ఫెన్సర్ ‘నడా హఫేజ్’
ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులు పోటీ పడే విశ్వ క్రీడా వేదిక ప్యారిస్ ఒలింపిక్స్‌లో అద్భుతం చోటు చేసుకుంది. ఏ రంగంలోనైనా రాణించాలంటే మహిళలు మరింత కష్టపడాలి. అయితే తాము అనుకున్నది సాధించే క్రమంలో మహిళలు ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తారు. ఈ మాటలను అక్షరాలా నిజం చేశారు. ఈజిప్ట్ ఫెన్సర్ నడా హఫేజ్. ఆమె ఏడు నెలల గర్భంతో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగారు. ఒలింపిక్ చరిత్రలో ఏడు నెలల గర్భిణి పోటీలో నిలవడం, అదీ టాప్ టెన్‌లో నిలవడం విశేషంగా నిలిచింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా స్వయంగా హఫేజ్ వివరించారు. జీవితం, క్రీడలు ప్రయాణం ఎంత శ్రమతో కూడుకున్నదో వివరించింది. ‘నేను లిటిల్ ఒలింపియన్‌ను మోస్తున్నాను. శారీరకంగా, మానసికంగా ఎదురవుతున్న సవాళ్లలో మా ఇద్దరికీ సమాన వాటా ఉంది. జీవితం, ఆటను బ్యాలెన్స్ చేసేందుకు పోరాడాల్సి వస్తోంది’ అంటూ తొలి రౌండ్ గెలిచిన తర్వాత 26 ఏండ్ల హఫేజ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Nada Hafez (@nada_hafez)పోడియంపై మీకు ఇద్దరు ఆటగాళ్ళుగా కనిపిస్తున్నారు, వారు నిజానికి ఇక్కడ ముగ్గురున్నారు. అది నేను, నా పోటీదారు, నా చిన్న పాప! శారీరక, మానసిక శ్రమ సవాళ్లలో నాతోపాటు, ఆ చిన్నిపాపాయికి కూడా వాటా ఉంది. అంతేకాదు తన ఈ ప్రయాణంలో తన భర్త సహకారం కూడా ఏంతో ఉందని, తన ఫ్యామిలీ తనపై నమ్మకాన్ని ఉంచడం తన అదృష్టమని కూడా తెలిపింది. అలాగే ప్రపంచ 10వ ర్యాంకర్ ఎలిజబెత్ టార్టకోవ్స్కీపై ఓపెనింగ్‌లో ఎలా విజయం సాధించిందో వివరించింది. టార్టకోవ్స్కీతో జరిగిన మహిళల వ్యక్తిగత ఫెన్సింగ్‌లో హఫీజ్ 15-13తేడాతో తన మొదటి బౌట్‌ను గెలుచుకుంది, అయితే పారిస్ గేమ్స్‌లో 16వ రౌండ్లో దక్షిణ కొరియాకు చెందిన జియోన్ హయోంగ్ చేతిలో ఓడిపోయింది. గతంలో ఈజిప్ట్ తరపున 2016 , 2020 ఒలింపిక్స్‌లో సాబ్రే క్రీడలో పోటీ పడింది. -
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి...!
గాజా నగరం. జనవరి మాసం. రాత్రి 10 గంటలు. ఎముకలు కొరికే చలి. ఇజ్రాయేల్ దాడులతో బాంబుల మోత మోగిపోతోంది. 34 ఏళ్ల ఆలా అల్ నిమర్. అప్పటికే నిండు గర్భిణి. నడిరోడ్డు మీద పురిటినొప్పులు పడుతోంది. నేపథ్యంలో దూరంగా బాంబుల మోతలు. అంబులెన్స్‌కు కాల్ చేయడానికి నెట్వర్క్ లేదు. ట్యాక్సీ కోసం వెళ్లిన భర్త అబ్దుల్లా ఇంకా తిరిగి రాలేదు. ‘ఎలాగైనా నేను ఆస్పత్రికి చేరుకున్నాకే ప్రసవించేలా చూడు తండ్రీ’ అన్న ఆలా వేడుకోళ్లు ఫలించలేదు. దాంతో నిస్సహాయురాలిగా రోడ్డు మీదే ప్రసవించింది. ట్యాక్సీ దొరక్క వెనక్కి పరుగెత్తుకొచ్చిన భర్త నెత్తుటి కూనను చేతుల్లోకి తీసుకున్నాడు. బొడ్డుతాడు కత్తిరించేందుకు కూడా ఏమీ లేదు. సోదరుడు తెచి్చన మెడికల్ కిట్‌లో ఉన్న కత్తెరతో బొడ్డుతాడు కత్తిరించారు. హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి ఎట్టకేలకు ఓ కారు దొరికినా పెట్రోల్ అయిపోవడంతో అదీ ఆగిపోయింది. భర్త, సోదరుడు మొబైల్ ఫ్లాష్ లైట్‌తో దారి చూపుతుంటే పసికందును స్వెటర్లో చుట్టుకుని రక్తమోడుతూ గంటసేపు నడిచిందా పచ్చి బాలింత. దారంతా ‘హెల్ప్ హెల్ప్’ అని అరుస్తూనే ఉన్నారంతా. ఎట్టకేలకు ఓ మినీ బస్సు వారిని ఆస్పత్రి చేర్చింది. అప్పటికీ విపరీతమైన ని్రస్తాణతో ఆలా కళ్లు మూతలు పడ్డాయి. తెల్లవారి గానీ స్పృహలోకి రాలేదు. వెంటనే బిడ్డ కోసం తడుముకుంది. పాపాయి ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు చెప్పాక గానీ కుదుట పడలేదు. యుద్ధం మొదలయ్యాక అదే ఆమెకు అత్యంత సంతోషాన్నిచి్చన ఉదయం. పది నెలలు.. పదకొండు దాడులు... ఇది ఒక ఘటన మాత్రమే. గత అక్టోబర్‌లో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టిన నాటినుంచి ఇలాంటి ఘటనలు కోకొల్లలు. బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు. తల్లిదండ్రులను పోగొట్టు్టకుని అనాథలైన పిల్లలు. కళ్లముందే పిల్లలు మరణిస్తుంటే నిస్సహాయంగా చూసిన వృద్ధులు. తను ప్రసవించే నాటికన్నా యుద్ధం ఆగిపోవాలనిదేవుడుని వేడుకుంది ఆలా. అలా జరగకపోయినా నడి రోడ్డుపైనే ఈ లోకంలోకి వచి్చన తన చిన్నారి నిమాకు మాత్రం ఇప్పుడు ఆర్నెల్లు నిండాయి. నిమా ఆమెకు మూడో సంతానం. ముగ్గురు పిల్లలకు సరైన ఆహారాన్ని ఇవ్వలేకపోతున్నాననే బాధ ఆలాను వెంటాడుతోంది. పిల్లలకు రోజుకు కనీసం ఒక్క రొట్టె దొరకడమే గగనంగా ఉంది. పూటకు పావు రొట్టెతో సరిపుచ్చుకుని అర్ధాకలితోనే పడుకుంటున్నారు. యుద్ధం మొదలవగానే గాజాలోని జైటౌన్లో ఉన్న ఆలా ఇంటిపై తొలి దాడి జరిగింది. దాంతో బంధువుల ఇంటికి వెళ్లారు. అదీ బాంబు దాడులకు బలవడంతో పొరుగు వాళ్ల ఇళ్లకు. అలా ఈ పది నెలల్లో ఆలా కుటుంబం ఏకంగా పదకొండు బాంబుదాడులు తప్పించుకుంది. కాకపోతే అన్నిసార్లూ నిరాశ్రయమవుతూ వచి్చంది. ఆలా ఎనిమిది నెలల గర్భవతిగా ఉండగా ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు వారుంటున్న ఇంటిని చుట్టుముట్టాయి. అప్పుడు ఆలా కుటుంబంతో పాటు 25 మంది దాకా ఇంట్లో ఉన్నారు. కేవలం దైవకృప వల్లే ఆ దాడి నుంచి బతికి బట్ట కట్టామని గుర్తు చేసుకున్నారామె. నెలకే మరో బాంబుదాడి ఆమె 26 ఏళ్ల సోదరుడిని పొట్టన పెట్టుకుంది. ‘చీకటి రోజుల్లో మాత్రం ఆశల గానాలు ఉండవా!? ఉంటాయి. కాకపోతే చీకటిరోజుల గురించే ఉంటాయి’ అన్నారో ఫ్రెంచ్ నాటకకర్త. ఇంతటి యుద్ధ మధ్యంలో, అంతులేని విషాదాల పరంపరలో ఆలా కుటుంబాన్ని నడిపిస్తున్నది ఒకే ఒక్కటి.. చిన్నారి నిమా బోసినవ్వులు... 39,324 మంది మృతి... గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పటివరకు 39,324 మంది మరణించారు. 90,830 మంది గాయపడ్డారు. గత 24 గంటల్లో ఇజ్రాయేల్ జరిపిన దాడుల్లో 66 మంది మృతి చెందారు. 241 మంది గాయపడ్డారు. అక్టోబ రు 7న హమాస్ నేతృత్వంలోని దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,139 మంది మరణించడం, అది యుద్ధానికి దారితీయడం తెలిసిందే.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఘోరం: గర్భిణి అని కూడా చూడకుండా..
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కట్నం కోసం అత్తమామలు కోడలిని హింసించి, అత్యంత దారుణంగా హతమార్చిన ఉదంతం వెలుగుచూసింది. స్థానికంగా ఈ ఘటన సంచలంగా మారింది.వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో రీనా తన్వర్ అనే 23 ఏళ్ల గర్భిణి దారుణ హత్యకు గురైంది. ఆమె చేతులు, కాళ్లు నరికి, మిగిలిన శరీరానికి నిప్పంటించారు. విషయం తెలుసుకున్న రీనా పుట్టింటివారు తమ కుమార్తెను ఆమె భర్త మిథున్, అత్తమామలు కట్నం కోసం వేధింపులకు గురిచేసి, హత్య చేశారని ఆరోపించారు.ఈ విషాదకర సంఘటన కలిపిత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాండి ఖుర్ద్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రీనా హత్య గురించి ఆమె కుటుంబసభ్యులకు తెలిపాడు. వెంటనే రీనా తండ్రి రాంప్రసాద్ తన్వర్ పోలీసులతో పాటు తాండి ఖుర్ద్‌కు చేరుకున్నాడు. వీరిని గమనించిన రీనా అత్తమామలు కోడలి చితి దగ్గర నుంచి పారిపోయారు. దీంతో రీనా తండ్రి అక్కడ మండుతున్న చితిని ఆర్పివేసి సగం కాలిన కుమార్తె మృతదేహాన్ని ఒక గుడ్డలో చుట్టారు. అనంతరం పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రీనా తన్వర్‌కు మిథున్ తన్వర్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఏడాదిన్నర వయసున్న కుమార్తె ఉంది. ప్రస్తుతం రీనా నాలుగు నెలల గర్భవతి. రీనా అత్తమామలు అనునిత్యం డబ్బులు డిమాండ్ చేస్తూ, తమ కుమార్తెను వేధిస్తున్నారని ఆమె తండ్రి రాంప్రసాద్ తన్వర్ పోలీసుల ముందు ఆరోపించారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కలిపిత్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రజనీష్ సిరోథియా తెలిపారు. -
మౌత్ అల్సర్‌తో.. పుట్టబోయే బిడ్డకేమైనా ప్రమాదమా?
నాకిప్పుడు మూడవ నెల. మౌత్ అల్సర్స్, మెడ దగ్గర గడ్డలు వచ్చిపోతున్నాయి. ఇంతకుముందు కూడా ఇలాగే వస్తే నాకు, మావారికి ఇద్దరికీ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారు. వాడాము. తగ్గాయి. ఇప్పుడు మళ్లీ వస్తున్నాయి. వీటి వల్ల పుట్టబోయే బిడ్డకేమైనా ప్రమాదమా? – ఊరు, పేరు రాయలేదు.మీరు చెప్పినదాన్ని బట్టి ఇది రిపీటెడ్ ఇన్ఫెక్షన్లా ఉంది. నొటిలో లేదా వెజైనా దగ్గర అల్సర్స్ రావడం, మీవారికి కూడా రావడం లాంటివి చాలావరకు సిఫిలిస్ అనే సుఖవ్యాధిలో కనిపిస్తాయి. ఇది గనక ప్రెగ్నెన్సీలో వస్తే తల్లి నుంచి బిడ్డకు వ్యాపిస్తుంది. వెంటనే సరైన చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది.ఒకవేళ ట్రీట్మెంట్ అందకపోతే బిడ్డ మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది. కొంతమందిలో ఏ సింప్టమ్స్ లేకుండా ఇన్ఫెక్షన్ ఉందని మూడవ నెల తర్వాతే తెలుస్తుంది. అందుకే అల్సర్స్ వచ్చాయనగానే వీడీఆర్ఎల్ టెస్ట్ చేయించుకోవాలి. ఇప్పుడు గర్భిణీలకు చేసే రొటీన్ టెస్ట్‌లలో భాగంగా వీడీఆర్ఎల్ టెస్ట్‌నూ చేస్తున్నారు. లైంగిక సంపర్కమప్పుడు కండోమ్‌ని వాడితే ఈ ఇన్ఫెక్షన్ రాకుండా నివారించవచ్చు. మీరు వెంటనే మీ దగ్గర్లోని గైనకాలజిస్ట్‌ని సంప్రదించండి.కొన్ని రకాల రక్తపరీక్షలు, కొన్నిసార్లు ఈ అల్సర్స్ నుంచి స్వాబ్ టెస్ట్, వెజైనల్ స్వాబ్ టెస్ట్‌లు చేస్తారు. ఈ రక్తపరీక్షలన్నిటిని కూడా గర్భిణీలకు మూడవ, ఏడవ, తొమ్మిదవ నెలల్లో రిపీట్ చేసి, ట్రీట్మెంట్ ఇచ్చాక.. క్యూర్ అయిందా లేదా అని కూడా చెక్ చేయాలి. ఇది పెన్సిలిన్ ఇంజెక్షన్‌తో బాగా క్యూర్ అవుతుంది. వీడీఆర్ఎల్ టెస్ట్ పాజిటివ్ ఉన్నవారిలో తర్వాత టెస్ట్ టీపీపీఏ (ఖ్కీ్కఅ), టీపీహెచ్ఏ (ఖ్కీఏఅ) చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ పరీక్షల్లో ఏమీ తెలియకపోతే ట్రీట్మెంట్ ఇచ్చి, రెండుమూడు వారాల తర్వాత మళ్లీ శాంపుల్ పంపించాలి.ఎర్లీ సిఫిలిస్ ఇంజెక్షన్ ఇస్తే.. ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్‌తో బాడీ స్కాన్ చేయించుకోవాలి. అయిదవ, ఏడవ నెలల్లో చేసే స్కాన్‌లో ఈ ఇంజెక్షన్ వల్ల పొట్టలోని బిడ్డలో ఏమైనా మార్పులు వచ్చాయా అని చెక్ చేస్తారు. వెజైనల్ ఏరియాలోనూ అల్సర్స్ ఉంటే తొమ్మిదవ నెలలో మళ్లీ టెస్ట్ చేసి.. సిజేరియన్ డెలివరీని రికమెండ్ చేస్తారు. డెలివరీ తర్వాత బిడ్డకు తల్లి పాలివ్వవచ్చు. బ్రెస్ట్ మీద యాక్టివ్ లీజన్స్ లేకపోతే డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడ్‌ని సజెస్ట్ చేస్తారు. అయితే పిల్లల డాక్టర్‌కి ముందుగానే ఈ టెస్ట్ రిజల్ట్స్ గురించి తెలియజేయాలి. బిడ్డను కూడా మూడవ నెలలో ఒకసారి, ఏడాదిన్నర వయసప్పుడు ఒకసారి టెస్ట్స్ చేస్తారు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ఇవి చదవండి: అందరూ మెచ్చుకుంటున్నా.. లోలోపల అనుమానం!? -
‘అమ్మ’ వద్దంది.. ఆస్పత్రి అమ్మేసింది!
కామారెడ్డి క్రైం: పుట్టబోయే బిడ్డను వదిలించుకోవాలనుకున్న ఓ గర్భిణి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా డెలివరీ చేయడంతోపాటు నవజాత శిశువును విక్రయించిన ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బట్టబయలైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రి వైద్యుడు, సిబ్బంది సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పెళ్లికి ముందే గర్భం దాల్చడంతో.. జిల్లాలోని తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన లావణ్యకు కామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన మహేశ్‌తో ఫిబ్రవరిలో వివాహం జరిగింది. పెళ్లికి ముందే ఆమెకు మరొకరితో సాన్నిహిత్యం ఉండటంతో ఆ కారణంగా పెళ్లి సమయానికే ఆమె గర్భం దాలి్చంది. పెళ్లయిన నెల రోజులకు భర్తకు ఈ విషయం తెలియడంతో నాటి నుంచి లావణ్య పుట్టింట్లోనే ఉంటోంది. పుట్టబోయే బిడ్డ తనతో లేకపోతే భర్త మళ్లీ చేరదీస్తాడని భావించిన లావణ్య.. ఏప్రిల్‌లో శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సమని్వత ఆస్పత్రిని సంప్రదించింది. గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వైద్యుడు ఇట్టం ప్రవీణ్‌కుమార్, ఆయన తండ్రి నడిపి సిద్దిరాములు ఈ ఆస్పత్రిని నడుపుతున్నారు. అందుకు అంగీకరించిన వారు మొత్తం రూ. 2 లక్షలకు లావణ్య, ఆమె కుటుంబ సభ్యులతో బేరం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా కాస్త నగదు, ఫోన్ పే ద్వారా రూ. లక్షా 30 వేలను లావణ్య కుటుంబ సభ్యులు చెల్లించారు.ఏప్రిల్ 11న అర్ధరాత్రి లావణ్యకు డెలివరీ చేయగా ఆడపిల్లకు జన్మనిచి్చంది. అప్పటికే రాజంపేటకు చెందిన ఇట్టం బాలకృష్ణ ద్వారా అతని బంధువైన సిరిసిల్లకు చెందిన దేవయ్యతో బిడ్డను కొనే వారితో డాక్టర్, ఆయన తండ్రి ఒప్పందం చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాన గ్రామానికి చెందిన భూపతి అనే వ్యక్తికి పిల్లలు లేకపోవడంతో పసిబిడ్డను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాడు. రూ. 20 వేలు తీసుకుని ఏప్రిల్ 12న పాపను భూపతి దంపతులకు అప్పగించారు. మహేశ్ ఫిర్యాదుతో విషయం వెలుగులోకి.. విషయం తెలుసుకున్న లావణ్య భర్త మహేశ్ డీసీపీవో స్రవంతికి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యుడు ఇట్టం ప్రవీణ్ కుమార్, ఆయన తండ్రి నడిపి సిద్దిరాములు, ఆస్పత్రి మేనేజర్ ఉదయ్ కిరణ్, వాచ్‌మన్ బాలరాజుతోపాటు లావణ్య, మధ్యవర్తులు బాలకృష్ణ, దేవయ్య, భూపతిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. పసిపాపను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. 2021లో కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నడిపిన డాక్టర్ ప్రవీణ్, ఆయన తండ్రి ఓ గర్భిణికి లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తేలడంతో సిద్దిరాములుతోపాటు కొందరిని అరెస్టు చేసి ఆస్పత్రిని సీజ్ చేశారు. -
గర్భిణికి సాయం చేసిన ఆర్టీసీ సిబ్బందికి సజ్జనార్ సన్మానం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సిటీ బస్సులో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి సాయం అందించి సుఖ ప్రసవానికి కారకులైన సంస్థ కండక్టర్, డ్రైవర్‌ను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. ఈ మేరకు కండక్టర్ సరోజ, డ్రైవర్ ఎంఎం అలీలను హైదరాబాద్ బస్ భవన్లో శనివారం ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారి.. తమ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్‌ను అందిస్తున్నట్లు ప్రకటించారు.ఆర్టీసీ బస్సులు, బస్స్టేషన్లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్ ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ ఆడపిల్లకు పుట్టిన రోజు కానుకగా బస్ పాస్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ముషీరాబాద్ డిపోకు చెందిన 1 జెడ్ రూట్ బస్సులో శుక్రవారం ఉదయం ఆరాంఘర్‌లో శ్వేతా రత్నం అనే గర్భిణికి పురిటి నొప్పులు రాగా.. కండక్టర్ ఆర్.సరోజ అప్రమత్తమై మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేయడం తెలిసిందే. గర్భిణి పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. సన్మాన కార్యక్రమంలో సీవోవో డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, హైదరాబాద్ ఆర్ఎం వరప్రసాద్, ముషీరాబాద్ డీఎం కిషన్ తదితరులు పాల్గొన్నారు. శిశువుకు బర్త్ సర్టిఫికెట్ఆర్టీసీ బస్సులో ప్రసవించిన మహిళ బిడ్డకు భవిష్యత్‌లో ఇబ్బంది లేకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ అధికారులు జనన ధ్రువపత్రం జారీ చేశారు. ప్రసవం జరిగిన ప్రదేశం జీహెచ్ఎంసీ మూడు సర్కిళ్ల పరిధిలో ఉన్నందున, జనన ధ్రువ పత్రం ఎక్కడ తీసుకోవాలో అన్న అవగాహన లేక భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అధికారులు గుర్తించారు. సంబంధిత బర్త్, రిజిస్ట్రార్ ద్వారా బేబీ ఆఫ్ శ్వేతా రత్నం అని పేర్కొంటూ బర్త్ సర్టిఫికెట్ ఇప్పించారు. -
ప్రసవం కోసం వస్తే ప్రాణాలుపోయాయి!
లబ్బీపేట(విజయవాడతూర్పు): పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణీతోపాటు ఆమె కవల శిశువులు మరణించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పటమటలోని పద్మావతి హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. డాక్టర్ సకాలంలో స్పందించకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా పోరంకికి చెందిన బండ్రపల్లి ప్రశాంత్, మాధవి(25) దంపతులకు ఒక బాబు(2) ఉన్నాడు. మాధవి రెండోసారి గర్భం దాల్చడంతో పటమటలోని పద్మావతి హాస్పిటల్లో రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. సోమవారం రాత్రి మాధవికి పురిటినొప్పులు రావడంతో ప్రసవం కోసం కుటుంబ సభ్యులు అదే ఆస్పత్రికి తీసుకొచ్చారు. మాధవిని పరీక్షించిన డాక్టర్ వెంకటరమణ సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించారు. తొలుత నార్మల్ డెలివరీలో ఒక శిశువు జన్మించినా, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. రెండో శిశువు అడ్డం తిరగడంతో సిజేరియన్ చేశారు. అప్పటికే రెండో శిశువు కూడా మృతిచెందింది. సిజేరియన్ చేసిన అనంతరం మాధవి ఆరోగ్య పరిస్థితి కూడా విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మాధవి బుధవారం ఉదయం మృతిచెందారు. ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన తన భార్య, ఇద్దరు శిశువులు మృతిచెందడంతో పద్మావతి ఆస్పత్రి వద్ద మాధవి భర్త ప్రశాంత్‌తోపాటు బంధువులు ఆందోళనకు దిగారు. తాము ఆస్పత్రికి వచ్చిన వెంటనే డాక్టర్ వెంకటరమణ స్పందించి సిజేరియన్ చేసి ఉంటే తల్లీబిడ్డలు బతికేవాళ్లని, డాక్టర్ నిర్లక్ష్యంవల్లే మరణించారని ప్రశాంత్ ఆవేదన వ్యక్తంచేశారు. డాక్టర్ వెంకటరమణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పటమట పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.వైద్యశాఖ విచారణ తల్లీ, ఇద్దరు బిడ్డలు మృతిచెందడంతో ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని బుధవారం పద్మావతి ఆస్పత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. వాస్తవాలను తెలుసుకునేందుకు నిపుణులైన వైద్యులను నియమించాలని విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు.ఈ మేరకు జీజీహెచ్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ హిమబిందు, పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ పరుచూరి అనిల్‌కుమార్, ఎనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ ఏవీ రావు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఇందిర ఆస్పత్రికి చేరుకుని విచారణ చేశారు.డాక్టర్ వెంకటరమణ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. వైద్య రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే మాధవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నట్లు సమాచారం. పోస్టుమార్టం రిపోర్టు, విచారణ కమిటీ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. -
‘తిక్క తీరింది బిడ్డకు’..! పగలబడి నవ్వుతారు: వైరల్ వీడియో
ప్రయాణాల్లో గర్భంతో ఉన్న మహిళను చూస్తే ఎవరికైనా లేచి సీటు ఇవ్వాలనిపిస్తుంది. నిజానికి అది కనీస ధర్మం కూడా. కానీ చాలామంది యువకులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఆడవాళ్లను, అందులోనూ గర్భిణీలను గౌరవించాలనే కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారు. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఒక బస్సులో గర్భిణీ స్వయంగా వచ్చి సీటు అడిగినా ఇవ్వలేదు ఒక యువకుడు. సరికదా... అసభ్యంగా ప్రవర్తించాడు. తన ఒళ్ళో కూచోమన్నట్టుగా సైగ చేశాడు. దీంతో వెనక కూర్చున్న పెద్దాయనకు ఒళ్లు మండింది. వీడికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించు కున్నాడు. ఇక క్షణం ఆలస్యం చేయకుండా..వెంటనే లేచి ఆ మహిళను తన సీట్లో కూర్చోమని చెప్పి, ఠపీమని ఆ పోరగాడి ఓళ్లో కూచున్నాడు. అటు వాడి తిక్క తీరింది. లబోదిబోమన్నాడు. దీంతో ఆ మహిళతో సహా, బస్సులోని వాళ్లందరూ నవ్వుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వేలకొద్దీ కామెంట్లు, రీషేర్లతో నెట్టింట్ వైరల్‌గా మారింది.😂😂pic.twitter.com/yp5QDTfMVc— Figen (@TheFigen_) June 19, 2024 తిక్క తీరింది బిడ్డకు.. లేకపోతే.. ఏంటా యాటిట్యూడ్ అంటూ నెటిజన్లు కమెంట్స్ చేశారు. ‘బుర్రా..బుద్ధీ ఉండాలి కదరా! మారండిరా’ అని మరి కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్‌లో షేర్ అయిన ఈ వీడియో ఇప్పటికే కోటి 1.30 కోట్లకు పైగా వ్యూస్‌ను దక్కించుఉంది. -
పెళ్లిలో గర్భిణీని అలా చూసి ‘నెత్తికెత్తుకున్నాడు’: తరువాత ఏమైందంటే..!
పెళ్లిళ్లు, జాతర్లు, ఊరేగింపుల్లో బలిష్ఠమైన పురుషులు పెద్ద పెద్ద విద్యుత్తు దీపాలను తలపై పెట్టుకుని మోస్తూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. చాలాసార్లు అలాంటి దృశ్యాలను అలా చూసి వెళ్లిపోతాం. చిన్న చిన్న పిల్లలు, ఆడవాళ్లు ఇలాంటి దీపాల్ని మోస్తున్నపుడు.. మహా అయితే... అయ్యో అనుకుంటాం. కూటి కోసం కోటి విద్యలు అనుకుంటాం. మరుక్షణం ఆ విషయాన్ని మర్చిపోతాం. ఇంతకుమించి పెద్దగా పట్టించుకోం. లేదంటే సాయానికి ముందు కెళ్లదామని అనిపించినా.. ఏదో తెలియని మొహమాటం వెంటాడుతుంది.. కదా. కానీ ఒక వ్యక్తి మాత్రం మానవత్వంతో ఆలోచించి, చురుగ్గా స్పందించారు. అంతేకాదు ఆయన చేసిన పని మరో నలుగురికి ఆదర్శప్రాయమైంది. విషయం ఏమిటంటే..తన స్నేహితుడి కుమారుడి వివాహ వేడుకలో తలపై దీపాన్ని మోస్తున్న గర్భిణీని చూశారు తన్వీర్ మహ్మద్. అది చూడగానే ఆయనకు తల్లి గుర్తొచ్చిందో ఏమో గానీ, వెంటనే స్పందించారు. ఆమె నెత్తిపై ఉన్న దీపాన్ని తన నెత్తిపైకి తీసుకున్నారు.At a wedding event of my friend’s son, I noticed a pregnant lady carrying light on her head. I offered to carry it for her. Inspired by my gesture, my friends also took turns carrying it and gave her three times payment and twice to the group. No heroism greater than Mother. pic.twitter.com/OkWkVJYOnN— Tanveer Ahmed 🇮🇳 (@TheTanveerAhmed) June 18, 2024ఆగండి..ఆగండి..కథ ఇక్కడితో అయిపోలేదు..తన్వీర్‌ను చూసిన ఆయన స్నేహితులు కూడా ముందు కొచ్చారు. వంతుల వారీగా ఆమె బరువును తమ నెత్తికెత్తుకున్నారు.అంతేకాదు స్నేహితులంతా కలిసి ఈ పనికోసం చెల్లించే దానికంటే రెండు రెట్లు ఎక్కువ చెల్లించారట ఆ బృందానికి. ‘తల్లిని మించిన హీరో లేరు’ అంటూ తన్వీర్ ఈ విషయాన్ని వీడియోతోపాటు ఎక్స్‌లో షేర్ చేశారు. దీంతో పలువురు మంచి పని చేశారు భయ్యా అంటూ అభినందించారు. ఆయన ఆలోచనలు, భావాలతో విభేదించేవారు కూడా తన్వీర్ స్పందించిన తీరుపై ప్రశంసలు కురిపించడం విశేషం. -
నేచురల్‌గానే వచ్చింది! జాగ్రత్తలు ఎలా?
నాకు 42 ఏళ్లు. ప్రెగ్నెంట్‌ని. మూడో నెల. పిల్లల కోసం కొన్నేళ్లు ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు నేచ్యురల్గానే వచ్చింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – ఆకునూరి శైలజ, వైరాఈరోజుల్లో చాలామంది 35 ఏళ్ల తర్వాతే గర్భం దాలుస్తున్నారు. 40 ఏళ్లు దాటినా ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టే అవకాశాలున్నాయి. పౌష్టికాహారం, క్రమం తప్పని వ్యాయామం, సరైన మందులు, చెకప్స్ ఉండాలి. పాజిటివ్‌గా ఉండాలి. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్‌ని డీల్ చేసే ఆసుపత్రిలో చూపించుకోవాలి. ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ద్వారా 40 ఏళ్లు దాటిన వాళ్లకు కూడా ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కలుగుతున్నారు. అయితే ఈ వయసులో గర్భం దాల్చినవాళ్లకు బీపీ, సుగర్, థైరాయిడ్ సమస్యలు ఎక్కువ రావచ్చు.బిడ్డకీ జన్యుపరమైన సమస్యలు, బరువు తక్కువగా ఉండటం, నెలలు నిండకముందే ప్రసవించడం వంటి చాన్సెస్ పెరగొచ్చు. అయితే కరెక్ట్ డయాగ్నసిస్, ట్రీట్మెంట్తో వీటిని మేనేజ్ చేయవచ్చు. ఇది తొలి చూలు అయితే ఆరోగ్య సమస్యలు వచ్చే రిస్క్ తక్కువుంటుంది. మలి చూలు అయి.. ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ లేదా గర్భస్రావం అయినా.. 40 ఏళ్ల తర్వాత ఇంకా రిస్క్ పెరుగుతుంది. జెస్టేషనల్ డయాబెటిస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే సుగర్ వ్యాధి రిస్క్ నాలుగు రెట్లు ఎక్కువ. అందుకే ప్రతి చెకప్‌లో యూరిన్‌లో సుగర్ టెస్ట్ చేస్తారు. ఒకవేళ యూరిన్‌లో సుగర్ నిర్ధారణ అయితే అప్పుడు బ్లడ్ సుగర్ టెస్ట్ చేస్తారు. డయాబెటాలజిస్ట్, డైటీషియన్ కన్సల్టేషన్తో మేనేజ్ చేస్తారు.సుగర్ కంట్రోల్ కానప్పుడు మాత్రమే తల్లికి, బిడ్డకి కాంప్లికేషన్స్ వస్తాయి. రెగ్యులర్‌గా బిడ్డ ఎదుగుదలను చెక్ చేస్తే స్కాన్స్‌ని రిఫర్ చేస్తారు. అయితే 40 ఏళ్లు దాటిన గర్భిణీల్లో అయిదవ నెల లోపు గర్భస్రావం అయ్యే రిస్క్ ఎక్కువ. అందుకే 3 నుంచి 5 నెలల్లో డాక్టర్ సూచించిన మందులను తప్పకుండా వాడాలి. శారీరకంగా ఎక్కువ శ్రమ లేకుండా చూసుకోవాలి. 7 వ నెల నుంచి ప్రతి రెండు వారాలకు ఒకసారి చెకప్‌కి వెళ్లాలి. బిడ్డ కదలికలను ఎలా ట్రాక్ చేయాలో వివరిస్తారు. కదలికలు తక్కువగా అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.తొమ్మిదవ నెల నిండుతున్నప్పుడు ప్రసవానికి ప్లాన్ చేస్తారు. సిజేరియన్ డెలివరీ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. బిడ్డ బరువు, తల్లి ఆరోగ్యపరిస్థితిని బట్టి డెలివరీ ప్లాన్ చేస్తారు. బీపీ, సుగర్ ఉన్నవారిలో ప్రసవం తర్వాత బ్లీడింగ్ ఎక్కువ ఉండొచ్చు. దానికి సిద్ధపడే మందులు ఇస్తారు. ప్రెగ్నెన్సీ, ప్రసవం.. ఆరోగ్యంగా.. సుఖంగా జరిగిపోవడానికి బరువును నియంత్రణలో పెట్టుకోవాలి.సమతుల, పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. జంక్, ప్రాసెస్డ్ ఫుడ్ జోలికి వెళ్లకూడదు. నిపుణుల పర్యవేక్షణలో యోగా, వ్యాయామం వంటివి చేయాలి. కాఫీ, ఆల్కహాల్ వంటివి మానెయ్యాలి. ఇన్ఫెక్షన్స్ సోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్‌తో క్రమం తప్పకుండా మూడవ నెల, అయిదవ నెలల్లో స్కాన్స్ చేయించుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే ప్రెగ్నెన్సీ రిస్క్‌ని తగ్గించవచ్చు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
Deepika Padukone: ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న స్టార్ హీరోయిన్ (ఫోటోలు)
-
అవసరానికి మించి సిజేరియన్లు..
గుంటూరు మెడికల్: రాష్ట్రవ్యాప్తంగా అవసరానికి మించి గర్భిణులకు సిజేరియన్లు చేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో.. గుంటూరు జిల్లాలోని ఐదు ఆసుపత్రులకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు నోటీసులు జారీచేశారు. దీంతో.. కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, నందనా హాస్పిటల్, డీవీసీ హాస్పిటల్, వీ కార్డియాలజీ కేర్ హాస్పిటల్, శ్రీవెంకటేశ్వర హాస్పిటళ్లకు చెందిన వైద్యులు వివరణ ఇవ్వాలంటూ జిల్లా వైద్య అధికారులు ఆదేశాలు జారీచేశారు. మరో 20 ఆస్పత్రులకు సైతం నోటీసులు సిద్ధంచేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. కాన్పుకు రూ.70 వేల నుంచి రూ.1.50 లక్షలు వసూలు సాధారణ కాన్పు అయ్యేవారికి సైతం సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీస్తున్నారనే ఫిర్యాదులు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులపై తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ సాధారణ కాన్పుకు రూ.50 వేల వరకు వసూలుచేస్తున్నారు. సిజేరియన్‌కు రూ.70వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలుచేస్తున్నారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు 10,320 జరుగగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో 15,555 కాన్పులు జరిగాయి.ప్రభుత్వాసుపత్రుల్లో సిజేరియన్ డెలివరీలు 4,128 జరగ్గా, ప్రైవేటు ఆసుపత్రుల్లో 9,333 జరిగాయి. ఇక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న వారిని సిజేరియన్ల పేరుతో అధిక సంఖ్యలో ఫీజులు వసూలుచేస్తూ ఆరి్థకంగా, ఆరోగ్యపరంగా వారిని ఇబ్బందిపడేలా చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే.. అది కూడా శిశువు లేదా తల్లి ప్రాణాలకు అపాయం వాటిల్లుతుందనుకున్న సమయాల్లో మాత్రమే చేయాల్సిన సిజేరియన్లు ఎడాపెడా చేసేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది. అనవసరంగా ఆపరేషన్లు చేస్తే చర్యలు తప్పవు నిబంధనల ప్రకారం చేయాల్సిన దానికంటే ఎక్కువ సిజేరియన్లు చేసిన ఆస్పత్రులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. నూరు శాతం సిజేరియన్లు చేసిన ఐదు ఆస్పత్రులకు నోటీసులు జారీచేశాం. మరో 20 ఆస్పత్రులకు సైతం నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధంచేశాం. సాధ్యమైనంత మేరకు సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రతి ఒక్కరూ చూడాలి. సాధారణ ప్రసవాలతో బాలింతలు త్వరితగతిన కోలుకుంటారు. – డాక్టర్ కొర్రా విజయలక్షి్మ, డీఎంహెచ్ఓ, గుంటూరు -
మైనర్‌ను గర్భవతిని చేసి నిమ్స్‌లో వదిలేశాడు!
లక్డీకాపూల్ (హైదరాబాద్): నల్లగొండ జిల్లాకు చెందిన ఓ యువకుడు.. మాయమాటలు చెప్పి ఓ మైనర్ బాలికను లోబర్చుకున్నాడు.. ఆమె గర్భం దాల్చడంతో గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌లోని ‘నిమ్స్ (నిజాం వైద్య విజ్ఞాన సంస్థ)’ఆస్పత్రికి తీసుకువచ్చాడు.. తనకు పరిచయం ఉన్న ఓ ఉద్యోగి సాయంతో నిమ్స్ అధికారిని కలిశాడు.. ఆ అధికారి సహకారంతో మైనర్ గర్భిణిని నిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయించాడు. కానీ ఈ విషయం బయటికి లీకైంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. మూడు రోజులుగా ఆస్పత్రిలో.. నల్లగొండ జిల్లా నకిరేకల్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక (16 ఏళ్లు) కడుపులో నొప్పితో బాధపడుతోందని చెప్తూ.. ఒక యువకుడు మూడు రోజుల క్రితం నిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. అప్పటికే ఆమె నాలుగు నెలల గర్భవతి అని, ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే తీసుకువచ్చాడని సమాచారం. ఈ విషయం వెలుగులోకి రాకుండా ఉంచేందుకు నిమ్స్‌లో తనకు తెలిసినవారితో కలసి ప్రయత్నించాడ ని తెలిసింది.వైద్యులు బాలికకు వైద్య పరీక్షలు చేసినప్పుడు.. ఆమె గర్భవతి అని గుర్తించినా, కప్పిపుచ్చే ప్రయ త్నం జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆమెకు చికిత్స ఏదీ అవసరం లేకున్నా.. ఆశ్రయం ఇచ్చే ఉద్దేశంతో మిలీనియం బ్లాక్ రూమ్ నంబర్ 322లో ఇన్‌పేషెంట్‌గా చేర్చుకున్నట్టు తెలిసింది. వారు ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ విషయం బయటికి పొక్కింది. విషయం సీరియస్‌గా మారుతోందని గుర్తించిన నిమ్స్ వర్గాలు.. బుధవారం బాలికను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి చేతులు దులుపుకొనేందుకు ప్రయత్నించాయని సమాచారం. అయితే పోలీసులు నిమ్స్‌కు చేరుకుని బాలికను నల్లగొండకు తరలించినట్టు ప్రచారం జరుగుతోంది. బాలికను మోసం చేసిన సదరు యువకుడు ఆమెకు బావ అవుతాడని ఓవైపు.. ఓ మాజీ ప్రజాప్రతినిధి కుమారుడే కారణమని మరోవైపు ప్రచారం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఈ వ్యవహా రంపై మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.మెడికో లీగల్ కేసు కిందే వైద్యం చేశాంసదరు బాలిక కడుపులో నొప్పితో బాధపడుతూ నిమ్స్‌కు వచ్చింది. ఆమెకు వైద్య పరీక్షలు చేయించిన తర్వాతే గర్భవతి అని తేలింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం. మెడికో లీగల్ కేసు (ఎంఎల్సీ)గా పరిగణించే, ఆ తరహాలో నమోదు చేశాకే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. – ప్రొఫెసర్ నగరి బీరప్ప, నిమ్స్ డైరెక్టర్ -
భర్త పై పోస్ట్ వైరల్: అమలాపాల్