Kajal Aggarwal Pregnancy Rumours Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

‘అలాంటిదేమీ లేదు. కాజల్‌ గర్భవతి కాదు’

Published Sat, Jul 3 2021 12:44 AM | Last Updated on Sat, Jul 3 2021 6:51 PM

Kajal Agarwal is Pregnant Viral - Sakshi

పెళ్లయ్యేంతవరకూ ‘పెళ్లెప్పుడు’ అనే ప్రశ్న ఎదుర్కొంటుంటారు తారలు. పెళ్లయ్యాక ‘పిల్లలెప్పుడు?’ అనే ప్రశ్న వెంటాడుతుంటుంది. ప్రశ్నలడిగేవారు కొందరైతే, ఊహించుకుని వార్తలు ప్రచారం చేసేవాళ్లు కొందరు ఉంటారు. ఇప్పుడు కాజల్‌ అగర్వాల్‌ గురించి ఓ వార్త ప్రచారంలోకొచ్చింది. ‘కాజల్‌ గర్భవతి’ అన్నది ఆ వార్త సారాంశం. గత ఏడాది అక్టోబర్‌లో వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుతో కాజల్‌ పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తున్నారు కాజల్‌. ప్రస్తుతం చిరంజీవి సరసన ‘ఆచార్య’ చేస్తున్నారు. అలానే ‘ఉమ’ అనే చిత్రం కమిట్‌ అయ్యారు.

కమల్‌హాసన్‌–శంకర్‌ కాంబినేషన్‌ ‘ఇండియన్‌ 2’ కూడా కాజల్‌ ఖాతాలో ఉంది. అయితే కొత్త చిత్రాలేవీ కాజల్‌ అంగీకరించరని, ఎందుకంటే తల్లి కానున్నారనీ ఓ వార్త గుప్పుమంది. ఇటీవల కాజల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌ ‘త్వరలో కాజల్‌ తల్లి కావాలని కోరుకుంటున్నాను. అప్పుడు నా మూడేళ్ల కొడుకుతో ఆడుకోవడానికి ఒకరు తోడుంటారు’ అన్నారు. బహుశా కాజల్‌ గర్భవతి అనే వార్త ప్రచారంలోకి రావడానికి నిషా మాటలు ఓ కారణం అయ్యుండొచ్చు. అయితే ‘అలాంటిదేమీ లేదు. కాజల్‌ గర్భవతి కాదు’ అని ఆమె సన్నిహితులు స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement