
సైబర్ నేరాలు కావొచ్చు, ఎక్కువ డబ్బులిస్తామని ఆశపెట్టడం కావొచ్చు.. గత కొన్నేళ్లలో చాలామంది ప్రజలు మోసపోతూనే ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ఇలానే క్రిప్టో కరెన్సీ పేరుతో పుదేచ్చేరిలో పలువురు కోట్ల రూపాయల మోసపోయారు. ఇప్పుడీ కేసులో హీరోయిన్లు తమన్నా-కాజల్(Kajal Aggarwal)ని పోలీసులు విచారించబోతున్నారు?
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)
ఇంతకీ ఏం జరిగింది?
కోయంబత్తూర్ ప్రధాన కేంద్రంగా క్రిప్టో కరెన్సీ పేరుతో 2022లో ఓ కంపెనీ ప్రారంభించారు. దీనికి తమన్నా(Thamannah Bhatia) తదితరులు హాజరయ్యారు. అనంతరం మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్ లో జరిగిన సంస్థ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ హాజరైంది. తర్వాత ముంబైలోని క్రూయిజ్ నౌకలో గ్రాండ్ గా పార్టీ నిర్వహించి, పెట్టుబడులు పెట్టేలా ప్రజల్ని ఆకర్షించారు.
ఈ క్రమంలోనే అత్యధిక లాభాల్ని రిటర్న్ ఇస్తామని చెప్పిన క్రిప్టో కరెన్సీ సంస్థ.. పుదుచ్చేరిలో వేలాది మంది నుంచి రూ.3.4 కోట్లు వసూలు చేశారు. ఈ వ్యవహారంలో నితీష్ జైన్, అరవింద్ కుమార్ అనే వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
(ఇదీ చదవండి: నాన్న ఫోన్ చేసేసరికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు)
అశోకన్ అనే రిటైర్డ్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్ ను కూడా ఈ కేసులో భాగంగా ఇప్పుడు పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
పుదుచ్చేరి సైబర్ క్రైమ్ ఎస్పీ డాక్టర్ బాస్కరన్ మాట్లాడుతూ.. ఈ సంస్థపై ఢిల్లీ, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదయినట్టు చెప్పారు. మొత్తంగా రూ.50 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్టు పేర్కొన్నారు. ఈ కేసులో కోయంబత్తూరు, బెంగళూరు, చెన్నైకు చెందిన కనీసం 10 మందికిపైగా నిందితుల ఉన్నట్టు విచారణలో వెల్లడయ్యిందని వివరించారు.
(ఇదీ చదవండి: సీనియర్ నటి జయప్రద ఇంట్లో విషాదం)
Comments
Please login to add a commentAdd a comment