Tamanna Bhatia
-
'ఆంటీ అన్నా ఫర్వాలేదు'.. స్టార్ కూతురితో మిల్కీ బ్యూటీ!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి టాలీవుడ్ ప్రియులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన మెప్పించింది. టాలీవుడ్లో శ్రీ మూవీతో మొదలైట్టిన తమన్నా పలు సూపర్ హిట్ చిత్రాలో నటించింది. హ్యాపీ డేస్, అల్లు అర్జున్ బద్రీనాథ్, 100% లవ్, ఊసరవెల్లి, బాహుబలి, ఎఫ్2, రచ్చ లాంటి సినిమాలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. అయితే గతేడాది జైలర్, స్త్రీ-2 చిత్రాల్లో ప్రత్యేక సాంగ్స్‌లో మెరిసిన ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది.తాజాగా బాలీవుడ్లో ఓ థియేటర్ వద్ద మెరిసింది. రవీనా టాండన్ ముద్దుల కూతురు రషా తడానీ నటించిన తొలి చిత్రం ఆజాద్ చూసేందుకు తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి థియేటర్‌కు వచ్చింది. ఈ సందర్భంగా రషా తడానీ, తమన్నా మధ్య ఆసక్తకర సంభాషణ చోటు చేసుకుంది. తనను ఆంటీ అని పిలవచ్చని రషా తడానీతో సరదాగా మాట్లాడింది తమన్నా. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.తమన్నా భాటియా- రషా తడానీ రిలేషన్..కాగా.. బాలీవుడ్ భామ రషా తడానీ (19), తమన్నా భాటియా (35) చాలా మంచి స్నేహితులు. గతంలో సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో తమన్నాను గురించి చెప్పమని రషాను అడిగినప్పుడు తాను నాకు మరో అమ్మలాంటి వ్యక్తి అని చెప్పింది. తమన్నా, విజయ్ వర్మ తనను దత్తత తీసుకున్నారంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. SHOCKINGLY #Tammana Says CALL ME AUNTY no issue #RashaTadani - Great Gesture From Tammu 😳😳😳😳😳pic.twitter.com/qJjC0iHLbh— GetsCinema (@GetsCinema) January 21, 2025 -
బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్.. తెలుగులోనూ సాంగ్ వచ్చేసింది!
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ స్త్రీ-2(Stree 2 Movie). గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రానికి స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అయితే ఈ మూవీ మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) ప్రత్యేక గీతంలో మెరిసింది. ఆజ్ కీ రాత్ అంటూ అభిమానులను అలరించింది. ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాజాగా ఈ మూవీ తెలుగు వర్షన్ ఫుల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా.. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. -
మినీ స్కర్ట్‌లో మిల్కీ బ్యూటీ.. తమన్నా లేటెస్ట్ ఫోటోస్ వైరల్
-
తమన్నా రెట్రో ఫ్యాషన్ : బ్లాక్ కోర్సెట్ డ్రెస్, కిల్లింగ్ లుక్స్ (ఫోటోలు)
-
ముద్దబంతిలా మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ.. (ఫొటోలు)
-
చీరలాంటి డ్రస్‌లో తమన్నా.. విచిత్రమైన డిజైన్! (ఫొటోలు)
-
క్రైమ్ థ్రిల్లర్‌తో వస్తోన్న మిల్కీ బ్యూటీ.. నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్!
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ముద్దుగుమ్మ ముంబయికి షిఫ్ట్ అయింది. దక్షిణాదిలో కేవలం ప్రత్యేక సాంగ్స్‌లో మాత్రమే కనిపిస్తోంది. గతేడాది జైలర్ మూవీ ఐటమ్ సాంగ్‌లో మెరిసిన తమన్నా.. ఇటీవల స్త్రీ-2 చిత్రంలో ప్రత్యేక సాంగ్‌తో అదరగొట్టింది.తాజాగా తమన్నా ప్రధాన పాత్రలో బాలీవుడ్లో తెరకెక్కించిన చిత్రం 'సికందక్ కా ముఖద్దర్'. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.నవంబర్ 29 నుంచి సికందర్ కా ముఖద్దర్ స్ట్రీమింగ్ కానుందని నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మూవీ పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ చిత్రంలో తమన్నాతో పాటు అవినాష్ తివారీ, జిమ్మీ షెర్గిల్, రాజీవ్ మెహతా, దివ్య దత్తా, జోయా అఫ్రోజ్ కీలక పాత్రల్లో నటించారు.సికందర్ కా ముకద్దర్ కథేంటంటే..స్పెషల్ 26, బేబీ, 'ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' వంటి చిత్రాలను రూపొందించిన డైరెక్టర్ నీరజ్ పాండే ఈ క్రైమ్ థిల్లర్‌కు దర్శకత్వం వహించారు. ఈ కథలో రూ.60 కోట్ల విలువైన వజ్రాన్ని ఎలా దొంగతనం చేశారు? దాన్ని వెతకడంతో పోలీసులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? దాదాపు 15 ఏళ్ల పాటు సాగిన ఈ కేసులో చివరికి ఏమైంది? ఆ కేసును పరిష్కరిస్తున్న పోలీసు ఆఫీసర్ చివరికి సక్సెస్ అయ్యాడా? లేదా? అన్నదే అసలు కథ. Teen aaropi, lekin kaun apradhi? Case jald hi khulega. Watch Sikandar ka Muqaddar, out 29 November, only on Netflix!#SikandarKaMuqaddarOnNetflix pic.twitter.com/apoIyTTe8p— Netflix India (@NetflixIndia) November 7, 2024 -
హీరోలతో పోటీ పడుతున్న సూపర్ లేడీస్.. ఇప్పుడిదే ట్రెండ్
సినిమాని జనరల్‌గా మేల్ లీడ్ చేస్తుంటారు. ఫిమేల్ లీడ్ చేయడం తక్కువ. అయితే ఈ మధ్య కాలంలో లేడీస్ లీడ్ చేసే సినిమాలు ఎక్కువయ్యాయి. ఒకవైపు హీరోల సరసన రెగ్యులర్ చిత్రాల్లో నటించడంతో అటు హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తున్నారు కొందరు కథానాయికలు. స్టోరీని లీడ్ చేస్తున్న ఆ లీడ్ లేడీస్ గురించి తెలుసుకుందాం. ప్రతీకారం కేసు పెడదామంటే..‘అరుంధతి, రుద్రమదేవి, భాగమతి, నిశ్శబ్దం’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేసిన అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘ఘాటీ’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా తర్వాత అనుష్క తెలుగులో కమిటైన చిత్రమిది. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘వేదం’ (2010) మంచి హిట్‌గా నిలిచింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ‘ఘాటీ’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట క్రిష్. బిజినెస్ ఉమన్‌గా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు కావాలని టార్గెట్ చేస్తారు. వ్యాపారంలో నష్టాలపాలైన ఆ మహిళ అందుకు కారకులైన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకునే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఆంధ్రా– ఒడిశా బోర్డర్లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శివశక్తిగా... తమన్నా లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. 2021లో విడుదలై, హిట్‌గా నిలిచిన ‘ఓదెల రైల్వేస్టేషన్ ’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. తొలి భాగాన్ని తెరకెక్కించిన అశోక్ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తన కెరీర్లో తొలిసారిగా శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటిస్తున్నారు తమన్నా. ఇప్పటికే విడుదలైన ఆమె ఫస్ట్ లుక్, పోస్టర్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ‘ఓదెల 2’ ఫైనల్ షెడ్యూల్ ఓదెల గ్రామంలోని ఓదెల మల్లన్న క్షేత్రంలో జరుగుతోంది. తన దర్శకత్వంలో వచ్చిన ‘రచ్చ’ సినిమాలో హీరోయిన్గా తమన్నాకి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సంపత్ నంది ‘ఓదెల 2’లో లీడ్ రోల్ చేసే చాన్స్ ఇచ్చారు. ఈ మూవీలో హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహా, మురళీ శర్మ, నాగమహేశ్, గగన్ విహారి వంటివారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. బంగారు బొమ్మ ‘యశోద, శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల తర్వాత సమంత నటించనున్న తాజా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మా ఇంటి బంగారం’. తన బర్త్ డే (ఏప్రిల్ 28న) సందర్భంగా ఈ సినిమాని ప్రకటించారు సమంత. తన సొంత డైరెక్షన్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించనున్నట్లు ఆమె ప్రకటించడం విశేషం. తెలుగులో ‘ఖుషి’ సినిమా తర్వాత ఆమె అంగీకరించిన చిత్రం ఇదే. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? అనే విషయాన్ని ప్రకటించలేదు. ఇప్పటిదాకా నటిగా మంచి విజయాలను అందుకున్న సమంత ఇప్పుడు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సినిమా డైరెక్టర్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. డబుల్ ధమాకా హీరోయిన్ రష్మికా మందన్నా ఒకేసారి రెండు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఓ వైపు ‘పుష్ప 2: ది రూల్’, ‘కుబేర’, ‘సికందర్’, ‘ఛావా’, వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో అల్లు అర్జున్, ధనుష్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్ వంటి హీరోలకి జోడీగా నటిస్తూ దూసుకెళుతున్న ఈ బ్యూటీ మరోవైపు ‘రెయిన్బో’, ‘ది గాళ్ ఫ్రెండ్’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లోనూ యాక్ట్ చేస్తున్నారు. శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్న ‘రెయిన్బో’లో రష్మికా మందన్నా లీడ్ రోల్ చేస్తున్నారు. రొమాంటిక్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్ఆర్. ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. అదేవిధంగా ‘చిలసౌ’ (2018) సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ కొంచెం గ్యాప్ తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ‘ది గాళ్ ఫ్రెండ్’. ఈ మూవీలోనూ రష్మికా మందన్నా లీడ్ రోల్ చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక కళాశాల విద్యార్థి పాత్ర చేస్తున్నారని సమాచారం. ఓ కాలేజ్ స్టూడెంట్ ప్రేమ, సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. ఈ మూవీలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, అనూ ఇమ్మాన్యుయేల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మహిళల పరదా పక్కింటి అమ్మాయి, హోమ్లీ గర్ల్ ఇమేజ్ ఉన్న అనుపమ పరమేశ్వరన్ ‘రౌడీ బాయ్స్, టిల్లు స్క్వేర్’ సినిమాలతో రూట్ మార్చారు. గ్లామరస్‌గా కనిపించడంతో పాటు ముద్దు సీన్స్‌లోనూ నటించి ఆశ్చర్యపరిచారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘పరదా’. ‘ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్’ అనేది ఉపశీర్షిక. ‘సినిమా బండి’ మూవీ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంగీత, దర్శన రాజేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి ‘పరదా’ అనే టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మహిళల చుట్టూ సాగే కథతో రూపొందుతోన్న ఈ సినిమా ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళుతుందని యూనిట్ పేర్కొంది. ఓ భక్తురాలి కథ మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్ కుమార్ మేగోటి దర్శకత్వం వహించారు. రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో ఎమ్ఎస్కే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘‘ఆదిపర్వం’ ఓ అమ్మవారి కథ. అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ. ఆ భక్తురాలిని దుష్ట శక్తుల నుండి కాపాడే ఓ క్షేత్రపాలకుడి కథ. ఎర్రగుడి నేపథ్యంలో దైవానికి, దుష్టశక్తికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. 1974 నుంచి 1992 మధ్యకాలంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో గ్రాఫిక్స్ ప్రధానాకర్షణగా నిలుస్తాయి. మంచు లక్ష్మి నటన సరికొత్తగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. సరికొత్త థ్రిల్లర్ మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ సంయుక్తా మీనన్. తెలుగులో ‘భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష’ వంటి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి హిట్ చిత్రాలు తీసిన నిర్మాత రాజేష్ దండా ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాగంటి పిక్చర్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రూపొందుతున్న ఈ సినిమాకి యోగేష్ కేఎంసీ దర్శకుడు. ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ‘‘సరికొత్త యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇది బలమైన మహిళా ప్రధాన పాత్రతో ఆకట్టుకునే కథ. స్క్రిప్ట్‌లో చాలా సామాజిక, రాజకీయ అంశాలు కూడా ఉన్నాయి. ఒక స్త్రీ తనదైన రీతిలో మొత్తం నెగిటివిటీని తగ్గించే మార్గం ఉంది. ఆమె ఎలా చేస్తుంది అనేది ఈ చిత్రకథ’’ అని సంయుక్తా మీనన్ తెలిపారు. కుమారి ఖండం నేపథ్యంలో..హీరోయిన్గా గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు శ్రద్ధా దాస్. ఆమె లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘త్రికాల’. ‘స్క్రిప్ట్ ఆఫ్ గాడ్’ అనేది ట్యాగ్‌లైన్. మణి తెల్లగూటి దర్శకత్వం వహించారు. రిత్విక్ సిద్ధార్థ్ సమర్పణలో మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై రాధికా శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘భారీ బడ్జెట్‌తో ఫ్యాంటసీ, హారర్ మూవీగా ‘త్రికాల’ రూపొందింది. కుమారి ఖండం నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని నేటి కాలానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశాం. పురాణ నేపథ్యంతో సాగే ఈ మూవీలో విజువల్ గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది’’ అని పేర్కొన్నారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. హత్యలు చేసిందెవరు? ప్రియమణి లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘క్యూజి: కొటేషన్ గ్యాంగ్’. ఎన్టీఆర్ శ్రీను సమర్పణలో వివేక్ కుమార్ కన్నన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. జాకీ ష్రాఫ్, సన్నీ లియోన్ , సారా అర్జున్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులను రుషికేశ్వర్ ఫిలింస్ అధినేత ఎం.వేణుగోపాల్ సొంతం చేసుకున్నారు. ‘‘మంచి మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్గా ‘క్యూజి: కొటేషన్’ గ్యాంగ్’ రూపొందింది. ముంబై, కశ్మీర్, చెన్నై ప్రాంతాల మధ్య కిరాయి హత్యలు చేసే గ్యాంగ్‌లకు సంబంధించిన కథ ఇది. ఒక హత్య కేసు ఈ మూడు ప్రాంతాలకు కనెక్ట్ అవుతుంది. అది ఏంటి అనేది సస్పెన్స్. నాలుగు స్టోరీలు, మూడు ప్రాంతాల్లో సాగుతాయి. స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే... హీరోయిన్లు నయనతార, కీర్తీ సురేష్. శ్రుతీహాసన్, హన్సిక, వరలక్ష్మీ శరత్‌కుమార్ వంటి వారు తమిళ భాషల్లో ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. -
నవరాత్రుల్లో ముద్దుగుమ్మల స్టన్నింగ్ ట్రెడిషనల్ లుక్స్..! (ఫొటోలు)
-
నా లైఫ్‌లో రెండు హార్ట్ బ్రేక్స్ ఉన్నాయి: తమన్నా
‘‘ఏ బంధంలో అయినా ఇచ్చి పుచ్చుకోవడం ప్రధానం. కానీ గతంలో నా భాగస్వామి నేను ఇచ్చినదానిని స్వీకరించే స్థితిలో ఉన్నారో లేదో కూడా ఆలోచించకుండా ఎక్కువే ఇచ్చేదాన్ని. అయితే ఇది సరికాదు. అలాగని ఇప్పుడు ఇవ్వడం మానేస్తానని కాదు... ఇచ్చి పుచ్చుకోవడంలోనే ఓ అనుబంధం బలం తెలుస్తుంది’’ అంటున్నారు తమన్నా. గతంలో తనకు రెండు ‘హార్ట్ బ్రేక్స్’ ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో పేర్కొని, ఈ విధంగా అన్నారామె. ఆ ఇంటర్వ్యూలో హార్ట్ బ్రేక్స్ గురించి తమన్నా మాట్లాడుతూ – ‘‘నా టీనేజ్‌లో ప్రేమలో పడ్డాను. అయితే అది సాగలేదు. ఎందుకంటే జీవితంలో ఏదో సాధించాలనే తపనతో ఉన్న నాకు ఒక వ్యక్తి కోసం జీవితాన్ని వదులుకోవాలనిపించలేదు. ఆ విధంగా తొలి హార్ట్ బ్రేక్ ఎదుర్కొన్నాను. ఆ తర్వాత మరో వ్యక్తితో ప్రేమలో పడ్డాను. ఆ ప్రేమ కూడా ముగిసి΄ోయింది. ప్రతి చిన్న విషయానికీ అబద్ధం ఆడే వ్యక్తితో కొనసాగలేననిపించింది. ఆ విధంగా రెండో హార్ట్ బ్రేక్ ఎదురైంది’’ అన్నారు. ఇక ప్రస్తుతం నటుడు విజయ్ వర్మ–తమన్నా ప్రేమలో ఉన్నారనే వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. -
వినాయక చవితి వేడుకల్లో తమన్నా సందడి!
వినాయక చవితి వచ్చిందంటే సినీతారల సందడి మామూలుగా ఉండదు. ఎప్పటిలాగే ముంబయిలోని ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలు గ్రాండ్ నిర్వహించారు. ముంబయిలోని ముకేశ్ నివాసం యాంటిలియాలో జరిగిన ఈ వేడుకల్లో బాలీవుడ్‌లోని ప్రముఖులంతా హాజరై సందడి చేశారు. కొందరు సతీసమేతంగా విచ్చేసి గణనాధుని పూజల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. అయితే ఈ వేడుకల్లో టాలీవుడ్ హీరోయిన్ తమన్నా కూడా సందడి చేసింది.ముకేశ్ అంబానీ నిర్వహించిన గణపతి పూజలో టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమన్నా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆమెతో పాటు కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ లాంటి సూపర్ స్టార్స్ పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఈ వేడుకల్లో మెరిశారు. అయితే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి మిస్సయిన సెలబ్రిటీ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ వినాయక చవితి వేడుకలకు హాజరు కావడం విశేషం.అంతేకాకుండా జాకీ ష్రాఫ్ తన కుమారుడైన టైగర్ ష్రాఫ్‌లో కలిసి వచ్చారు. ఈ వేడుకల్లో కాజల్ అగర్వాల్, అమీర్ ఖాన్ కుమారులు జునైద్, ఆజాద్‌లు కూడా పాల్గొన్నారు. ప్రముఖ నటి భాగ్యశ్రీ తన భర్త హిమాలయాతో కలిసి హాజరయ్యారు. గాయం నుంచి కోలుకున్న సల్మాన్ ఖాన్ తన మేనకోడలు అలీజ్ అగ్నిహోత్రితో కలిసి సందడి చేశారు. మరో బాలీవుడ్ జంట రితీష్, జెనీలియా దేశ్‌ముఖ్, శ్రద్ధా కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ జంట, రాజ్‌కుమార్‌రావు సతీమణి పాత్రలేఖతో కలిసి గణపతి ఉత్సవాలకు హాజరయ్యారు. -
మిల్కీ బ్యూటీ కాదు అంతకు మించి.. తమన్నా గ్లామర్‌కు కుర్రకారు ఫిదా (ఫోటోలు)
-
Tamannaah Bhatia: ఇప్పుడే ఏమీ చెప్పలేను..
సాక్షి, సిటీబ్యూరో: మిల్కీ బ్యూటీ, ప్రముఖ సినీతార తమన్నా భాటియా మంగళవారం నగరంలో తళుక్కున మెరిశారు. నగరంలో ఓ ప్రయివేటు కార్యక్రమానికి హాజరై తమన్నా ఈ సందర్భంగా మాట్లాడారు.. చాలా రోజుల తరువాత హైదరాబాద్ వచ్చాను, చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. మరి కొద్ది రోజుల్లో ఓదెల –2 సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నానని, ఆ సినిమాకు సంబంధించిన పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఇక సినిమాకు సంబంధించి చిన్న పార్ట్ మాత్రమే పెండింగ్ ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఎప్పటి నుంచో తన పెళ్లి విషయమై ఊరిస్తున్న తమన్నా, ఈ సారి కూడా పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు.., ‘పెళ్లి ఎప్పుడు అనేది ఇప్పుడే ఏం చెప్పలేనని’ దాటవేశారు. అయితే ఈ సందర్భంగా తమన్నా ప్రత్యేకంగా డిజైనింగ్ చేయించుకుని ధరించిన నీలి రంగు డ్రెస్ విశేషంగా ఆకట్టుకుంది. -
తమన్నా-విజయ్ వర్మ ప్రేమ.. ఏకంగా 5000 ఫొటోలు!
తమన్నా హీరోయిన్గా తెలుగులో చాలా ఫేమస్. బోలెడన్ని సినిమాలు చేసింది. అడపాదడపా స్పెషల్ సాంగ్స్‌లోనూ నర్తించింది. ఇప్పటికీ సినిమాలు-వెబ్ సిరీసులు అని బిజీగా ఉన్న తమన్నా.. నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. అప్పుడప్పుడు వీళ్ల జంటగా కనిపించడం లేటు. ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి విజయ్ వర్మ.. తమన్నాతో తన ప్రేమ గురించి, ప్రైవసీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'బంధమేదైనా సరే ఇద్దరు కలిసి సమయాన్ని గడుపుతూ, ప్రేమలో ఉన్నప్పుడు దాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో మా ఇద్దరు ఆలోచనలు ఒకటే. రిలేషన్‌షిప్‌ని దాచడం అంత తేలిక కాదు. ఒకవేళ దాస్తే కలిసి బయటకు వెళ్లడానికి, ఫొటోలు తీసుకోవడానికి అస్సలు వీలుపడదు. ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేయడం నాకు నచ్చదు. మా బంధం గురించి పబ్లిక్‌గా చెప్పినప్పటికీ కొన్ని రహస్యంగానే ఉంచాం'(ఇదీ చదవండి: సీరియల్ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం.. సీసీటీవీ వీడియో)'నా దగ్గర మేం తీసుకున్న ఫొటోలు 5000కి పైగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడా వీటిని షేర్ చేయలేదు. అవి మాకు మాత్రమే చెందినవి. ఈరోజుల్లో పక్కనోళ్ల జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రతిఒక్కరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఎదుటోళ్ల రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటారు. ఇదో రోగంలా అయిపోయింది. కాబట్టి దాన్ని నేను మార్చలేను' అని విజయ్ వర్మ చెప్పుకొచ్చాడు.'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ కోసం తొలిసారి కలిసి పనిచేసిన విజయ్ వర్మ-తమన్నా.. షూటింగ్ టైంలో ప్రేమలో పడ్డారు. కలిసున్న ఫొటోలు కొన్ని లీక్ కావడంతో స్వయంగా తమన్నానే రిలేషన్ గురించి బయటపెట్టింది. అప్పటినుంచి పలుమార్లు జంటగా కనిపించారు. మరి నిశ్చితార్థం, పెళ్లి ఎప్పుడనేది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.(ఇదీ చదవండి: సినిమా సూపర్ హిట్.. కానీ అద్దె ఇంట్లోకి స్టార్ హీరోయిన్) -
కృష్ణ ప్రేయసిగా, అచ్చమైన రాధగా తమన్నా లుక్స్ వైరల్
-
తమన్నా ‘స్పెషల్’ : ఐదు నిమిషాలు.. కోటి రూపాయలు?
ఏ సినిమాకు అయినా పాటలు ప్రత్యేక ఆకర్షణ. కథ, కథనం మాములుగా ఉన్నా.. పాటలతోనే హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇక స్పెషల్ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాకు హైప్ తీసుకురావడంతో అవి కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ దర్శకులు సైతం స్పెషల్ సాంగ్‌పై స్పెషల్ కేర్ తీసుకుంటారు. (చదవండి: సమంత సర్ప్రైజ్.. మొత్తానికి అదేంటో రివీల్ చేసింది!)స్టార్ హీరోయిన్లతో స్టెప్పులేయిస్తే.. కాసుల వర్షం కురుస్తుందని భావిస్తారు. అయితే నిజంగానే కొన్ని సినిమాలకు స్పెషల్ సాంగ్ బాగా కలిసొస్తుంది. అలా ఇటీవల స్పెషల్ సాంగ్‌తో భారీ హైప్ క్రియేట్ చేసుకున్న సినిమా స్త్రీ 2. రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ హారర్ ఫిల్మ్ ఆగస్ట్ 15న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది.(చదవండి: డ్రగ్ టెస్ట్ రిపోర్ట్స్.. నటి హేమ వైరల్ వీడియో) ‘ఆజ్ కి రాత్’ అంటూ సాగే ఈ పాటకి తమన్నా వేసిన స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి. సినిమాకు హైప్ తీసుకొచ్చిన అంశాల్లో ఈ పాట కూడా ఒకటి. అయితే స్పెషల్ సాంగ్ కోసం తమన్నా భారీగానే పారితోషికం తీసుకుందట. కేలవం 5 నిమిషాల నిడివి గల ఈ పాటకి రూ. కోటి తీసుకున్నట్లు బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అయితే తీసుకున్న పారితోషికానికి తమన్నా న్యాయం చేసిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఆమె కారణంగానే ఆ స్పెషల్ సాంగ్‌కి హైప్ వచ్చిందని..అది సినిమాకు బాగా ప్లస్ అయిందని చెబుతున్నారు. వాస్తవానికి ఈ సాంగ్ నోరా ఫతేహీ చేయాల్సింది. స్త్రీ పార్ట్ 1లో ఆమే ఐటమ్ సాంగ్ చేసింది. పార్ట్ 2 లో నోరానే చేయాల్సింది కానీ.. చివరి నిమిషంలో తమన్నాను సంప్రదించారట మేకర్స్. వాళ్లు తీసుకున్న నిర్ణయం సినిమాకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. -
మిల్కీ బ్యూటీ బిగ్ డీల్.. ఏకంగా నెలకు రూ.18 లక్షలు!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో అగ్ర హీరోల సరసన నటించింది. గతేడాది రజినీకాంత్ మూవీ జైలర్ మూవీలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌లో తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి నటించింది. హిందీ సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా.. ముంబయిలో ఖరీదైన ప్రాంతంలో కార్యాలయాన్ని రెంట్‌కు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.తాజాగా తమన్నా భాటియా ముంబయిలోని ఓ వాణిజ్య కార్యాలయం అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. నెలకు దాదాపు రూ. 18 లక్షలు చెల్లించనుంది. ఖరీదైన జుహు తార ప్రాంతంలో ఈ వాణిజ్య కార్యాలయం ఉంది. ఈ ఆఫీస్ దాదాపు 6,065 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా.. నానావతి కన్స్ట్రక్షన్ నుంచి ఐదేళ్ల కాలానికి లీజు ఒప్పందం చేసుకుంది. ఈ బిగ్ డీల్ జూన్ 27న జరగ్గా.. దీనికోసం తమన్నా రూ.72 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. అంతే కాదు ఆమెకు చెందిన అపార్ట్మెంట్లను కూడా భారీ మొత్తానికి బ్యాంకులో తనఖా పెట్టినట్లు సమాచారం. అంతే కాకుండా తమన్నా అంధేరీలోని వీర దేశాయ్ రోడ్ ప్రాంతంలో ఉన్న తన మూడు ఫ్లాట్లను ఇండియన్ బ్యాంక్‌లో రూ.7.84 కోట్లకు రుణం కోసం తనఖా పెట్టినట్లు సమాచారం. జూన్ 14న ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇందుకోసం నటి రూ.4.70 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించింది. ఇక సినిమాల విషయానికొస్తే తదుపరి చిత్రం వేదాలో కనిపించనుంది. ఇందులో జాన్ అబ్రహం, శర్వరీ వాగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఆగస్టు15న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు నటిస్తోన్న స్ట్రీ- 2లో ప్రత్యేక పాత్రలో పోషించనుంది. -
పాఠ్యాంశంగా నటి తమన్నా జీవితం!!
సాక్షి బెంగళూరు: సినీ నటి తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేయడంపై బెంగళూరులో విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. హెబ్బాళలోని సింధీ ఉన్నత పాఠశాలపై బాలల హక్కుల రక్షణ సంఘానికి వారు ఫిర్యాదు చేశారు. పాఠశాలలోని ఏడో తరగతి విద్యార్థుల పాఠ్యాంశాల్లో ఏడో చాప్టర్లో సింధీ వ్యక్తుల గురించి అంశాన్ని పొందుపరిచారు. ఇందులో నటి తమన్నా భాటియా, నటుడు రణ్వీర్ సింగ్ గురించి పాఠ్యాంశంగా చేర్చారు. పలు చిత్రాల్లో అర్ధనగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేంటని తల్లిదండ్రులు మండిపడ్డారు. సింధీ సామాజికవర్గంలో ఎంతో మంది కళాకారులున్నారని, వారి గురించి పాఠ్యాంశంగా ఇస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. దీన్ని వ్యతిరేకించినందుకు తమ పిల్లలకు టీసీ ఇస్తామని పాఠశాల యాజమాన్యం బెదిరిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం బుజ్జగిస్తోంది. అదొక పాఠ్యేతర అంశంగా చేర్చినట్లు, అందులో తమన్నా పాఠాలను ఇచ్చినట్లు తెలిపింది. స్వాతంత్య్రం అనంతరం సింధూ ప్రాంత విభజన అనంతరం ఆ సామాజిక వర్గ ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయనే విషయం విద్యార్థులకు తెలియజేసేందుకు పాఠ్యాంశంగా ముద్రించినట్లు తెలిపింది. సింధీ సామాజికవర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించడంతో ఆమె జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చినట్లు తెలిపింది. -
మళ్లీ అదే డైరెక్టర్‌తో తమన్నాకు సినిమా ఛాన్స్
కోలీవుడ్ దర్శకుడు సుందర్.సీ చిత్రాలు కచ్చితంగా కమర్శియల్ అంశాలతో నిండి ఉంటాయి. ఇదే ఆయన సక్సెస్ ఫార్ములా అని చెప్పవ చ్చు. ఇకపోతే హార్రర్ కామెడీ నేపథ్యంలో ఈయన చేసిన చిత్రాలన్నీ విజయం సాధించాయి. ఇటీవల తమన్నా, రాశీ ఖన్నాలతో కలిసి సుందర్.సీ నటించి దర్శకత్వం వహించిన అరణ్మణై – 4 చిత్రం (తెలుగులో బాకు) మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం వసూళ్ల పరంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరిందని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. తాజాగా మరోసారి దర్శకుడు సుందర్.సీ- తమన్నా కాంబోలో ఒక చిత్రం తెరకెక్కనుందని తెలిసింది. దర్శకుడు శివ శిష్యుడు భూపాలన్ నటి తమన్నాకు ఒక కథ చెప్పారనీ, అది నచ్చడంతో ఆమె అందులో నటించడానికి సమ్మతించినట్లు సమాచారం. అయితే ఆ చిత్రాన్ని నిర్మించతలపెట్టిన సంస్థ ఆ కథను మాత్రం తీసుకుని సుందర్.సీ దర్శకత్వంలో నిర్మించాలని భావించగా, కథ నచ్చడంతో సుందర్.సీ కూడా దర్శకత్వం వహించడానికి సమ్మతించినట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. దీంతో సుందర్.సీ, తమన్నాల హిట్ కాంబినేషన్ రీపీట్ కానుందన్నమాట. ఇకపోతే సుందర్.సీ ప్రస్తుతం తాను ఇంతకు ముందు రూపొందించిన కలగలప్పు చిత్రానికి సీక్కెల్‌ను చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. మరి ఈ రెండు చిత్రాల్లో దేన్ని ముందుగా చేస్తారో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
ప్రియుడితో అలాంటి సీన్స్.. అదే కావాలంటోన్న మిల్కీ బ్యూటీ!
మిల్కీ బ్యూటీగా అభిమానుల్లో గుండెల్లో పేరు సంపాదించుకున్న భామ తమన్నా భాటియా. గతేడాది జైలర్ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో అదరగొట్టేసింది. అంతే కాకుండా బాలీవుడ్లో వెబ్ సిరీస్‌లతో అలరించింది. లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌లో మరి బోల్డ్‌గా నటించి తన గ్లామర్‌ను మరోసారి పరిచయం చేసింది. ఈ సిరీస్‌లో విజయ్ వర్మతో చేసిన రొమాన్స్ వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది. తాజాగా ఈ సిరీస్‌లో అలా నటించడంపై తమన్నా ఆసక్తికర కామెంట్స్ చేసింది.లస్ట్ స్టోరీస్-2 ఫస్ట్ పార్ట్ చూశాక బోల్డ్ సీన్స్ పట్ల నా అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని తమన్నా తెలిపింది. అలా నటిస్తే తప్పేముందని నాలో నేనే ప్రశ్నించికున్నానని పేర్కొంది. అయితే అలాంటి సీన్స్‌లో నటిస్తే చూడాలని చాలామంది ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని వెల్లడించింది. అందుకే బోల్డ్ సీన్స్‌లో నటిస్తే తప్పేం లేదని అనిపించిందని తెలిపింది. అంతే కాదు.. ఒక నటిగా తాను అన్ని రకాల పాత్రలు చేయాల్సిన అవసరముందని చెప్పుకొచ్చింది. అందుకే ఒక నటిగా తాను ఏం చేయాలో అదే చేస్తానంటోంది మిల్కీ భామ. -
గ్లామర్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన తమన్నా
ప్రపంచమంతా డబ్బుతోనే, అది లేకపోతే జీవితమేలేదు అన్నది అక్షరాల నిజం. ఇక విజయంతో ఎంతటివాడికైనా రెక్కలు మొలుస్తాయన్నది వాస్తవం. అవకాశం వచ్చే వరకూ ఒక లెక్క, విజయం వచ్చిన తరువాత ఒక లెక్క ఇదీ లోకం. ఈ నగ్న సత్యానికి ఎవరూ అతీతం కాదు. నటి తమన్న విషయానికే వస్తే తొలుత హిందీలో నటిగా పరిచయం అయినా, ఆ తరువాత శ్రీ అనే తెలుగు చిత్రంలో నాయకిగా ఎంట్రీ ఇచ్చారు. 2005లో విడుదలైన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత తమిళంలోకి కేడీ చిత్రంతో దిగుమతి అయ్యారు. ఆ చిత్రం నిరాశ పరచింది. అలాంటిది కల్లూరి చిత్రంతో తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లో వరసగా అవకాశాలను అందుకున్నారు. అయితే ఎక్కువగా ఈమె అందాలారబోతకే పరిమితం అయ్యారు. నిజం చెప్పాలంటే అదే తమన్నను పాపులర్ చేసింది. మధ్యలో కొన్ని నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించినా ఇప్పటి వరకూ గ్లామర్‌నే మెయిన్టైన్ చేస్తున్నారు. ఇటీవల రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రంలోనూ తమన్న అందాల ప్రదర్శన ఆ చిత్రానికీ, ఆమెకు ప్లస్ అయ్యిందని చెప్పక తప్పదు. జైలర్ చిత్రంలో నువ్వు కావాలయ్యా అనే పాట యువతను ఉర్రూతలూగించింది. ఇకపోతే ఈ చిత్రంతో వచ్చిన క్రేజ్‌ను తమన్న పారితోషికం రూపంలో బాగానే వాడుకున్నారనే టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జైలర్ చిత్రం కోసం ఈ బ్యూటీ రూ.3 కోట్లు పారితోషికం పుచ్చుకున్నట్లు సమాచారం. ఆ తరువాత తమన్న తమిళంలో నటించిన చిత్రం అరణ్మణై 4. నటి రాశీఖన్నా మరో నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని సుందర్.సీ తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టాక్‌కు అతీతంగా మంచి వసూళ్లను సాధిస్తోంది. ఇకపోతే జైలర్ చిత్రం తరువాత తమన్న తన రెమ్యునరేషన్‌ను 30 శాతం పెంచినట్లు సమాచారం. అరణ్మణై 4 (తెలుగులో బాక్) చిత్రానికి రూ. 4 నుంచి రూ.5 కోట్ల మధ్యలో పుచ్చుకున్నట్లు ఇప్పుడు టాక్ స్ప్రెడ్ అవుతోంది. అలా విజయంతో తమన్నా రెమ్యునరేషన్‌కు రెక్కలోచ్చాయన్న మాట. నిజం చెప్పాలంటే తమన్నకు ప్రస్తుతం దక్షిణాదిలో అవకాశాలు లేవు. హిందీలో ఒకటి రెండు చిత్రాలు చేతిలో ఉన్నట్లుంది. ఏమైనా తమన్న లెక్కే వేరప్పా అంటున్నారు నెటిజన్లు. -
తెల్లటి చీరలో మెరిసిపోతున్న మిల్కీబ్యూటీ..ధర వింటే నోరెళ్లబెడతారు!
టాలీవుడ్ నటి తమన్నా ఎప్పటికప్పుడూ డిఫెరెంట్ లుక్‌తో ఉన్న ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ తన అభిమానుల ఆశ్చర్యపరుస్తుంటుంది. ఒకపక్క బాలీవుడ్ వెబ్ సీరిస్తో బిజీగా ఉన్నా కూడా ఎప్పటికప్పుడూ డిఫరెంట్ స్టయిల్ డిజైనర్ డ్రెస్‌లు ధరిస్తూ..తన క్యూట్ లుక్‌తో ఉన్న పోటోలను అభిమానులతో పంచుకుంటుంది. అలానే ఈ మిల్కీ బ్యూటీ తాజగా ఓ తెల్లటి చీరలో పాలరాతి శిల్పంలో మెరిపోతున్న ఫోటోలను షేర్ చేసింది. చూడటానికి దివి నుంచి భువికి వచ్చిన దేవతా మాదిరిగా అందంగా ఉంది. నిజానికి ఈ ఫోటో 2022 నాటిది. ఈ చీర సావన్ గాంధీ బ్రాండ్‌కి చెందిన సునేహ్రీ ఐవరీ పిట్టా కలెక్షన్స్‌కి సంబంధించిన డిజైనర్ శారీ. ఈ శారీ ప్రత్యేకత ఏంటంటే..శారీ బోర్డర్ అంతటా గోల్డ్ గొట్టా పట్టీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. నెక్‌లైన్‌ని కలిగి ఉన్న మ్యాచింగ్ గోల్డ్ బ్లౌజ్ ఆ చీరకు చక్కగా మ్యాచ్ అయ్యింది. దీనికి తగ్గట్టు గ్లిట్జీ పెర్ల్ చెవిపోగులు, కుందన బ్యాంగిల్స్ చాలా బాగా మ్యాచ్ అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే జుట్టుని చక్కగా ముడివేయడం మంచి అందాన్ని తెచ్చిపెట్టింది. ఈ చీర ఆర్గాన్జా సిల్క్ ఫ్రాబ్రిక్ కావడంతో శరీరంపై చక్కగా జాలువారుతున్నట్టు ఉంటుంది. అయితే ఈ చీర ధర ఏకంగా రూ. 1,28,000/-. ఈ బ్రాండ్ చీరలు డిజైన్వేర్కి తగ్గ రేంజ్లో కాస్టలీగా ఉంటాయి. ఇక తమన్నా ఇటీవలే తమిళ అరణ్మనై 4 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం పచ్చని చీరలో తళుక్కుమంది. ఆ చీర పల్లు చుట్టూ కూడా ఇలానే బంగారు బోర్డర్ ఉంది. ఆ ఈవెంట్లో తమన్నా ఈ చీరలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపించింది. (చదవండి: హాట్‌టాపిక్‌గా ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్క్లే గౌను!) -
ఆ సినిమా చూశాకే అలా చేయడం మానేశా: తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాక్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో అరణ్మనై-4తో వస్తోన్న ఈ చిత్రంలో రాశి ఖన్నా నటించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో తమన్నా, రాశి ఖన్నా బిజీ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముద్దుగుమ్మ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.ఓ హాలీవుడ్ ఫిల్మ్‌ని చూశాక వ్యాక్సింగ్ (చర్మంపై రోమాలు తొలగించడం) మానేశానని తెలిపారు. హాలీవుడ్ చిత్రం హౌజ్ ఆఫ్ వ్యాక్స్ చిత్రంలో వ్యాక్స్తోనే పలు రకాలుగా చంపేస్తుంటారు. ఆ సినిమా చూశాకే వ్యాక్సింగ్ మానేశానని చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసింది. రాశి ఖన్నాతో కలిసి వేదికపై మెరిసింది. కోలీవుడ్ దర్శకుడు సుందర్ నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన ఈ హారర్ కామెడీ చిత్రం మే 3న థియేటర్లలో సందడి చేయనుంది. -
చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)
-
క్షమించండి.. పోలీసుల విచారణకు రాలేను: తమన్నా
ఐపీఎల్ కేసులో చిక్కుకున్న సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ తమన్నాకు నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను ‘ఫెయిర్ ప్లే’ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకుగాను మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. నేడు ఎప్రిల్ 29న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను ‘పెయిర్ ప్లే’ యాప్‌లో స్ట్రీమింగ్ చేయడం కారణంగా తమకు రూ. కోట్లలో నష్టం జరిగిందని ప్రసార హక్కులను సొంతం చేసుకున్న ‘వయాకామ్’ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను చూడాలంటూ తమన్నా, సంజయ్ దత్తో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులు, గాయకులు ప్రచారం చేశారు. ఇదే కేసులో ఈ మధ్యే సంజయ్ దత్‌కి కూడా సమన్లు జారీ అయ్యాయి. తమన్నా నేడు విచారణకు రావాల్సి ఉంది. కానీ ఆమె హాజరుకాలేదు. షూటింగ్ పనుల వల్ల ఆమె అందుబాటులో లేదని, మరో రోజు విచారణకు వస్తారని ఆమె తరపున ఉన్న లాయర్ పేర్కొన్నారు. ప్రస్తుతం సాక్షిగా మాత్రమే ఆమెను విచారణకు పోలీసులు పిలిచారు. ఈ కేసులో నటుడు సాహిల్ ఖాన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.ఐపీఎల్ 2023 స్ట్రీమింగ్ రైట్స్‌ను రూ. 23 వేల కోట్లకు పైగానే వయాకామ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ హక్కులన్నీ కూడా ఆ సంస్థకు మాత్రమే ఉన్నాయి. కానీ, ఆ నిబంధనలను అతిక్రమిస్తూ ఫెయిర్‌ప్లే బెట్టింగ్ యాప్ తమ ఛానెల్లో ఐపీఎల్ మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో తమకు భారీగా నష్టం వాటిల్లిందని మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులకు 'వయాకామ్' వారు ఫిర్యాదుచేశారు. దీంతో ఆ యాప్‌ను ప్రమోట్ చేస్తున్న సినిమా ప్రముఖులకు కూడా నోటీసులు ఇచ్చారు. -
ఐపీఎల్ మ్యాచ్ స్ట్రీమింగ్ వివాదం... చిక్కుల్లో తమన్నా!
మిల్కీ బ్యూటీ తమన్నా చిక్కుల్లో పడింది. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను ‘ఫెయిర్ ప్లే’ యాప్‌లో స్ట్రీమింగ్ చేసినందుకుగాను మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను ‘పెయిర్ ప్లే’ యాప్‌లో స్ట్రీమింగ్ చేయడం కారణంగా తమకు రూ. కోట్లలో నష్టం జరిగిందని ప్రసార హక్కులను సొంతం చేసుకున్న ‘వయాకామ్’ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయితే ఈ యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను చూడాలంటూ తమన్నా, సంజయ్ దత్తో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులు, గాయకులు ప్రచారం చేశారు. ఇదే కేసులో ఈ మధ్యే సంజయ్ దదత్‌కి కూడా సమన్లు జారీ అయ్యాయి. ఆయన ఈ ఏప్రిల్ 23న విచారణకు రావాల్సి ఉండగా.. గైర్హాజరయ్యారు. ప్రస్తుతం తాను ముంబైలో లేనని.. వాంగ్మూలం ఇచ్చేందుకు మరో తేది కేటాయించాలని పోలీసులను కోరారు. ఈ కేసు విచారణలో భాగంగానే తాజాగా తమన్నాకు నోటీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఫెయిర్ ప్లే యాప్‌పై గతంలోనూ మనీలాండరింగ్ కేసు నమోదైంది. ఈ యాప్ మహదేవ్ ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్‌కు అనుబంధ సంస్థ. ఆన్లైన్ బెట్టింగ్ ముసుగులో మనీలాండరింగ్‌కి పాల్పడినట్లు ఈడీ గుర్తించి సదరు సంస్థపై కేసు నమోదు చేసింది. ఈ యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేయడానికి అధికారికంగా ఎలాంటి బ్రాడ్ కాస్టింగ్ హక్కులు లేవు. అయినప్పటకిఈ గతేడాది నిబంధనలకు విరుద్దంగా కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లను స్ట్రీమింగ్ చేశారు. వాటిని చూడలంటూ తమన్నా.. సంజయ్ దత్, జాక్వెలిన్ ఫెర్నాండెస్ లాంటి అగ్రతారలు ప్రచారం చేశారు. ఫలితంగా వయాకామ్‌కు రూ.కోట్లల్లో నష్టం రావడంతో ఆ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. -
గౌహతిలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన తమన్నా
-
ఆధ్యాత్మిక సేవలో తమన్నా: ట్రెడిషనల్ లుక్ పిక్స్ వైరల్
#TamannabhatiavisitsKamakhyaTemple సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్లో కూడా తన సత్తాను చాటుకున్న తమన్నా భాటియా ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనలు, సేవపై దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. అందం, ఆకర్షణతో మిల్కీ బ్యూటీగా పాపులర్ అయిన తమన్నా పర్సనల్ లైఫ్‌కి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది. రెండు రోజుల క్రితం రామమందిర ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో పాల్గొన్న తమన్నా కుటుంబ సమేతంగా కామాఖ్య ఆలయానికి వెళ్లింది. తాజాగా తల్లి దండ్రులతో కలిసి తమన్నా గౌహతిలోని ప్రఖ్యాత కామఖ్య ఆలయాన్ని సందర్శించింది. ప్రత్యేకంగా పూజలు నిర్వహించి. మాతా రాణి ఆశీస్సులు తీసుకుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. ఈ సందర్భంగా తమన్నా లుక్, గెటప్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) పసుపు కాషాయ రంగు మేళవింపుతో కూడిన సాంప్రదాయ దుస్తులు, నుదుటిన తిలకం, మెడలో పూమాల, దేవుడి శాలువ ఇలా ప్రత్యేకంగాట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టేస్తోంది. శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య దేవాలయం నీలాచల్ కొండపై ఉంది. -
డేటింగ్‌కు ఫుల్స్టాప్ పెట్టనున్న తమన్నా
నటన కంటే, గ్లామర్ డాల్ గానే ముద్ర వేసుకున్న హీరోయిన్లలో తమన్నా భాటియా ముందుంటుంది. అలాగని ఈమెలో మంచి నటి లేదని చెప్పలేం. బాహుబలి లాంటి చిత్రాల్లో తమన్నా ఇరగదీసింది. అయితే ప్రతిభను చాటే అవకాశాలు ఎక్కువగా ఈమెకు రాలేదన్నది వాస్తవం. అందుకు కారణం ఈమెలోని అందం, అభినయాన్ని డామినేట్ చేయడమే. ఇక నిజం చెప్పుకోవాలంటే గ్లామరస్ పాత్రలే ఈ మిల్కీ బ్యూటీని ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఏదేమైనా 18 ఏళ్లుగా కథానాయకిగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అగ్ర కథానాయకిగా రాణిస్తున్న తమన్నా తాజాగా మలయాళం ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అక్కడ మరిన్ని అవకాశాలు వస్తున్నాయని అంటున్నారు కానీ, నిజానికి ఈ అమ్మడికి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. మరో పక్క ఇప్పటి వరకూ నటనపైనే దృష్టి పెట్టినట్లు స్టేట్మెంట్స్ ఇచ్చిన తమన్నా ఇప్పుడు తన బాయ్‌ఫ్రెండ్‌తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తోందనిపిస్తోంది. బాలీవుడ్ నటుడు విజయవర్మతో చాలాకాలంగా సీక్రెట్ లవ్‌ను మెయింటైన్ చేస్తూ వచ్చిన ఈ బ్యూటీ ఇటీవలే తన ప్రేమ గుట్టును విప్పింది. ఆ తరువాత పార్టీలకు, ప్రైవేట్ ఫంక్షన్ లకు విచ్చలవిడిగా తిరిగే స్తున్నారు జంట. ఇక అసలు విషయానికి వస్తే ఈ సంచలన జంట కోసం పెళ్లి పీటలు ఎదురు చూస్తున్నాయని తాజా సమాచారం. ఇప్పటివరకు చేసిన డేటింగ్ చాలు, ఇకనైనా పెళ్లి చేసుకోమని తమన్నా భాటియా ఇంట్లో ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. దీంతో బ్యూటీ కూడా తాళి కట్టు శుభవేళకు సిద్ధం అవుతున్నారనే టాక్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా దీపావళి పండుగను ఈ జంట కలిసి జరుపుకోవడం కూడా తమన్నా భాటియా పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు వస్తున్న వార్తలకు బలాన్ని చేకూర్చుతోంది. -
అభిమాని అలాంటి ప్రశ్న అడగడంతో ఫైర్ అయిన తమన్నా..
నటి తమన్నా రూటే సెపరేటు. పాలరాతి బొమ్మలాంటి అందాలు ఈమెకే సొంతం. మొదటినుంచి గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యతనిస్తూ వచ్చిన తమన్నా అలాంటి పాత్రలపైనే తన నట జీవిత సౌధాలను ఏర్పాటు చేసుకుంది అని చెప్పవచ్చు. తాజాగా సమీప కాలంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన జైలర్ చిత్రంలో ఒక్క పాటకి, ఒకటి రెండు సన్నివేశాలకే పరిమితమైంది. అయినా ఆ చిత్ర ప్రమోషన్ అంతా ఆమె పాటపైనే సాగిందని చెప్పవచ్చు. అందులో నువ్వు కావాలయ్యా అనే పాటలో తమన్న డాన్స్ యువతను గిలిగింతలు పెట్టింది. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) అయితే ఆ పాటలో తమన్నా హద్దులు మీరి అందాలను ఆరబోసిందని విమర్శలను ఎదుర్కొంటుంది. ఇదే ప్రశ్నను ఇటీవల ఒక అభిమాని తమన్నాను అడగ్గా ఆమె అతనిపై ఫైర్ అయ్యింది. అవకాశాలు తగ్గడంతో ఆ విధంగా అందాలను విచ్చలవిడిగా తెరపై ఆరబోస్తున్నారా అన్న ఆ అభిమాని ప్రశ్నకు తమన్నా బదులిస్తూ తనకు అవకాశాలు లేవని ఎవరు చెప్పారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ఇప్పటికీ రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని చెప్పింది. అంత బిజీగా ఇంతకుముందు ఎప్పుడులేనని కూడా పేర్కొంది. అయినా తన హద్దులు ఏమిటన్నది తనకు తెలుసని తాను ధరించే దుస్తులు ఆయా పాత్రలకు తగ్గట్టుగా ఉంటాయని చెప్పింది. తాను పాత్రలు నచ్చితేనే నటించడానికి అంగీకరిస్తానని, అలా ఒప్పుకున్న తర్వాత ఆ పాత్రలకు పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉంటుందని పేర్కొంది. అరకొర తెలివితో ఇలాంటి ప్రశ్నలు వేయవద్దని హెచ్చరించింది. పెళ్లి ఎప్పుడు అన్న మరో అభిమాని ప్రశ్నకు తనకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుందో అప్పుడు చేసుకుంటానని తమన్నా బదులిచ్చింది. (ఇదీ చదవండి: దిల్‌రాజు అల్లుడి కారు చోరీ.. దొంగలించిన వ్యక్తి మాటలకు పోలీసులు షాక్) -
సౌత్‌లో ఈ హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎంతంటే.. టాప్‌లో ఎవరో తెలుసా?
సినీరంగంలో ఒక వ్యక్తికి 60 ఏళ్లు వచ్చినా తనదైన మార్కెట్‌తో దూసుకుపోతుంటారు. వారు ఇద్దరు పిల్లలకు తండ్రి అయినా కూడా సినిమా ఛాన్స్‌లు వస్తుంటాయి. ఈ విషయాన్ని స్వయంగా సినీరంగంలో పనిచేసే వారే చాలాసార్లు చెప్తుంటారు. సినిమాల్లో మగవాళ్లలా నటీమణులు కనీసం 40, 50 ఏళ్లు కూడా ఉండలేరు. ఒకవేళ ఉన్నా సపోర్టింగ్ రోల్స్‌లలో నటించేందుకు సిద్ధంగా ఉండాలి. ఒకవేళ వారు పెళ్లి చేసుకుంటే సినిమాల్లో మార్కెట్ పడిపోతుంది. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం కొన్ని సంవత్సరాలుగా నిరంతరం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్లుగా ఇంకా తమ సత్తా చాటుతున్నారు. త్రిష, నయనతార వంటి నటీమణులను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీరిద్దరూ 20 ఏళ్లకు పైగా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకానీ సపోర్టింగ్ రోల్స్ లో నటించడం లేదు. అనేక భారీ బడ్జెట్, పాన్-ఇండియన్ చిత్రాలలో ఇటీవలి కాలంలో హీరోలతో సమానంగా వారు కూడా రెరమ్యునరేషన్ పొందుతున్నారు. వీళ్లు రూ. 10 నుంచి 11 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటారని టాక్. ఒక సినిమాకు రూ. 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్న తొలి దక్షిణ భారత నటిగా నయనతారకు గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు సౌత్ ఇండియాలో నయనతార కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటి మరోకరు ఉన్నారు. ఆమె మరెవరో కాదు నటి త్రిష. ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి త్రిష. ప్రస్తుతం నయనతార పారితోషికం కంటే త్రిష ఎక్కువ తీసుకుంటున్నట్లు టాక్. దీనికి ప్రధాన కారణం త్రిష నటనా ప్రావీణ్యంతో పాటు.. 40 ఏళ్లు దాటినా యూత్ ఫుల్ అందం అని చెప్పవచ్చు. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో నటించినందుకు త్రిష 12 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే విషయం గూగుల్ కూడా తెలుపుతుంది. త్రిషకు ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు నిర్మాతలు కూడా ముందుకొచ్చారని తెలుస్తోంది. దీంతో సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి త్రిష అని పరిగణనలోకి తీసుకుంటే, నయనతార రెమ్యూనరేషన్ పెద్దగా తగ్గలేదు. జవాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నయనతార ఈ సినిమా కోసం 11 కోట్ల పారితోషికం తీసుకుందట. రెమ్యునరేషన్ పరంగా అనుష్క శెట్టి మూడో స్థానంలో నిలిచింది. ఆమె పారితోషికం రూ.6 కోట్లు. అనుష్క ప్రస్తుతం తెలుగు, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. సమంత రూ.6 నుంచి 8 కోట్లు ఒక సినిమాతో సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన యశోద, శకుంతలం, ఖుషి చిత్రాల తర్వాత సమంత ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. పూజా హెగ్డే సౌత్ ఇండియన్ బిజీ నటీమణులలో ఒకరు. పూజా హెగ్డే ఒక్కో సినిమాకు రెండున్నర కోట్ల నుంచి ఏడు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. రష్మిక మందన ఒక్కో సినిమాకు రూ. 4 నుంచి 7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. జైలర్ ద్వారా మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా.. రూ. 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోంది. కాజల్ అగర్వాల్ ఒక సినిమా కోసం ఒకటిన్నర నుంచి నాలుగు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. నటి ఏడాది క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. నటి రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కో సినిమాకు 1.5 నుంచి 3.5 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. నివేదికల ప్రకారం, కీర్తి సురేష్ ఒక సినిమాకు రూ.2.5 నుంచి 4 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్‌కు సరైన హిట్ దక్కలేదు. -
న్యూజెర్సీలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!
అమెరికాలోని న్యూజెర్సీలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇండియన్ బిజినెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇండియా డే పరేడ్ నిర్వహించారు. ఓక్ ట్రీ రోడ్ లోని ఎడిసన్ టు ఇసేలిన్ ఏరియాలో ఇండియా డే పరేడ్ వైభవంగా కొనసాగింది. ఈ వేడుకలకు గ్రాండ్ మార్షల్‌గా ప్రముఖ నటి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హాజరయ్యారు. తమన్నా ఇటువంటి పరేడ్ కార్యక్రమంలో పాల్గొనడం తొలిసారి కావడం విశేషం. ఇక న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీతో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై.. శుభాకాంక్షలు తెలిపారు. ఇండియా పరేడ్ డే కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని ప్రవాస భారతీయులంతా న్యూజెర్సీలోని ఓక్ ట్రీ రోడ్ కు చేరుకున్నారు. మువ్వన్నెల జెండాను చేతబూని వందేమాతరం, భారతమాతకి జై అంటూ నినాదాలు చేశారు. పలువురు చిన్నారులు భారతమాత వేషాధరణలో.. స్వాత్రంత్య యోధుల గెటప్పులలో ఆకట్టుకున్నారు. ఒకరికొకరు స్వాత్రంత్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పరేడ్ లో భాగంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు శకటాలను ప్రదర్శించారు. భారీ జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఇక న్యూజెర్సీ ప్రాంతం మినీ ఇండియాగా మారిందా అనేలా అక్కడి వాతావరణం కనిపించింది. న్యూజెర్సీలోని ఓక్ ట్రీ రోడ్ లో జరిగిన ఇండియా డే పరేడ్ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల నిర్వహకులతో పాటు ప్రవాసులు హర్షం వ్యక్తం చేశారు. (చదవండి: -
రజనీ కాంత్ రేంజ్ ఏంటో చెప్పే సంఘటన
సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. దీంతో తలైవా అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మలేషియా,జపాన్ సింగపూర్‌లో ఈయనకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ 'బాషా', 'ముత్తు' లాంటి సినిమాలు అక్కడి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. వాటిని రిపీటెడ్‌గా చూస్తారు. కానీ ఆయన నటించిన గత చివరి సినిమాలు 'పేట', 'దర్బార్', 'అన్నాత్తే' కమర్షియల్‌గా అక్కడ హిట్ కొట్టాయి. (ఇదీ చదవండి: నేను ఎక్కడున్నా ఆమె నా గుండెల్లోనే ఉంటుంది: సుడిగాలి సుధీర్) తాజాగా జైలర్ సినిమాను చూసేందకు జపాన్‌లోని ఒసాకా నుంచి ఒక జంట చెన్నైకి వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా జపాన్‌లో కూడా విడుదలైంది. కానీ తలైవా గడ్డపైనే జైలర్‌ను చూడాలని వారు ఇంత దూరం వచ్చినట్టు రజనీకాంత్ జపాన్ ఫ్యాన్స్ అసోషియేషన్ లీడర్ యసుదా హిడెతోషి తెలిపారు. ఆయన రజనీ పేరుతో జపాన్‌లో పలు సేవా కార్యక్రమాలు చేశారు. సినిమాకు సంబంధించిన కార్యక్రమాల కోసం జపాన్‌కు రజనీ వెళ్తే ఆ ఏర్పట్లాన్ని యసుదానే చూసుకుంటారు. ఇక, జపాన్‌లో అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ భారీగా ఉన్నారు. జపాన్‌లో రజనీకాంత్ తర్వాత అత్యంత అధికంగా ఫ్యాన్స్ బేస్ ఉన్న హీరో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ఆయన సినిమాలు అక్కడ కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. ఎన్నో రికార్డులు సృష్టించిన ఆర్ఆర్ఆర్.. కథల పుస్తక రూపంలో అక్కడ ఎంతగానో ఆకట్టుకుంది. -
నా దగ్గర ఇలాంటి మాటలే వద్దు: తమన్నా
గ్లామర్‌కు కేరాఫ్ మిల్కీబ్యూటీ తమన్న. ఈమె ఇంత కాలం నటిగా నిలబడ్డారంటే అందాలారబోత ప్రధాన కారణం అనడంలో అతిశయోక్తి లేదు. కాగా కథానాయకిగా నటిస్తూనే మరో పక్క ఐటమ్ సాంగ్‌లకు సై అంటున్న ఈ బ్యూటీ తాజాగా తెలుగులో చిరంజీవి సరసన భోళాశంకర్, తెలుగులో రజనీకాంత్‌తో జైలర్ చిత్రాల్లో నటించారు. విశేషం ఏమిటంటే ఈ రెండు చిత్రాలు ఒక్క రోజు తేడాతో విడుదల అవుతున్నాయి. మరో విషయం ఏమిటంటే జైలర్ చిత్రంలో తమన్న రజనీకాంత్‌కు ఫెయిర్ కాదు. ఇక భోళాశంకర్ చిత్రంలో చెల్లెలి పాత్రలో నటించిన కీర్తీసురేష్కే అధిక ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. కాగా ఇద్దరు సీనియర్ హీరోలతో నటించడం గురించి తమన్నపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. సీనియర్ నటులతో జత కట్టడానికి ఎందుకు అంగీకరిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు? అవకాశాలు రాకా, లేక డబ్బు కోసమా? అని విమర్శలు గుప్పిస్తున్నారు. (ఇదీ చదవండి: కీర్తి సురేష్ ఉంటే ఆ సినిమా రిజల్ట్ ఇదేనా?) దీనికి స్పందించిన తమన్న నటీనటుల మధ్య వయసు వ్యత్యాసం గురించి ఎందుకు మాట్లాడతారు? నటించే పాత్రలను చూడండి అని ఘాటుగా పేర్కొన్నారు. కాదూ కూడదూ అంటారా వయసు గురించి మాట్లాడాలంటే తాను హలీవుడ్ నటుడు టామ్ క్రూస్ మాదిరి సాహసాలు చేయగలను, డాన్స్ చేయగలను అని పేర్కొన్నారు. ఇకపోతే సీనియర్ నటులతో కలిసి నటించడం తనకు ఎప్పుడూ సంతోషమేనన్నారు. -
Jailer Audio Launch Photos: రజనీకాంత్ 'జైలర్' సినిమా ఆడియో లాంచ్.. సందడి చేసిన స్టార్లు (ఫోటోలు)
-
విజయ్ బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాపై తమన్నా కామెంట్
సౌత్ ఇండియాలో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. సినిమాలతో పాటు పలు వెబ్ సీరిస్‌లతో ఆమె మెప్పిస్తుంది. ఆగష్టు నెలలోనే ఆమె నటించిన జైలర్,భోళా శంకర్ రిలీజ్ కానున్నాయి. తాజాగ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా దళపతి విజయ్ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. (ఇదీ చదవండి: సుమన్ జైలుకు వెళ్లడంపై బయటికొచ్చిన అసలు నిజాలు.. ఇంతమంది ప్రమేయం ఉందా?) విజయ్- తమన్నా కలిసి 2010లో 'సుర' అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాలోని పాటలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. కానీ సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. అంతేకాకుండా ఈ సినిమా విజయ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. అలాంటి డిజాస్టార్పై తమన్నా తాజాగా ఇలా మాట్లాడింది. 'నాకు సుర సినిమా అంటే చాలా ఇష్టం. అందులోని పాటలు ఇప్పటికీ చాలా చోట్ల వినిపిస్తూనే ఉన్నాయి. అందులో నటిస్తున్నప్పుడు కొన్ని సన్నివేశాలు నాకు నచ్చలేదు. కొన్ని సీన్స్‌లలో అయితే నా నటన నాకే నచ్చలేదు. ఆ సీన్లు సరిగా రావడంలేదనే విషయాన్ని షూటింగ్ జరుగుతున్న సమయంలోనే గ్రహించాను. సీన్స్ బాగా రావడం లేదని సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అంచనా వేయొచ్చు. కానీ అప్పుడు సినిమా నుంచి తప్పుకోవడం జరగదు. ఎందుకంటే ఒక సినిమాను అంగీకరించిన తర్వాత కచ్చితంగా దాన్ని పూర్తిచేయాల్సిందే. ఏవో కొన్ని కారణాలు చెప్పి తప్పించుకోకూడదు. ఈ రంగంలో జయాపజయాలు సహజం. నటులందరికి ఇండస్ట్రీ చాలా విలువైనది. కాబట్టి ప్రతివారు బాధ్యతాయుతంగా ఉండాలి.' అని తమన్నా చెప్పింది. -
తమన్నా కోసం ఆ టాప్ హీరోయిన్ను టార్గెట్ చేసిన అజిత్
ఎవరైనా సక్సెస్ వెనుక పరిగెత్తం సాధారణ విషయమే. ఇక చిత్రాల విషయాని కొస్తే క్రేజ్ చాలా అవసరం. నటుడు అజిత్ కూడా ఈ పాలసీనే ఫాలో అవుతున్నారా..? అంటే అయ్యుండొచ్చు అనే కోలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈయన నటించిన తాజా చిత్రం తుణివు (తెగింపు) విడుదలై దాదాపు ఏడాది కావస్తోంది. ఇంతవరకు ఆయన తదుపరి చిత్రం ప్రారంభం కాలేదు. విడాముయిర్చి అనే చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించి చాలా కాలమే అయ్యింది. దీనికి ఆది నుంచి ఆటంకాలే ఎదురవుతున్నాయి. (ఇదీ చదవండి: జైలర్‌కు 'తెలుగు' సెంటిమెంట్.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు?) మొదట నయనతార భర్త విగ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. అందుకు సన్నహాలు కూడా చేసుకున్నారు. అలాంటి దశలో అనుహ్యంగా ఆయన్ని చిత్రం నుంచి తొలగించడం జరిగింది. ఈ విషయంలో అజిత్ ప్రమేయం ఉందనే ప్రచారం జరిగింది. వాస్తవం ఏమిటి అన్నది తెలియకపోయినా ఆ తరువాత విడాముయిర్చి చిత్ర యూనిట్ లోకి దర్శకుడు మగిళ్ తిరుమేణి వచ్చారు. దీంతో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభ పనులు వేగవంతం అవుతాయని అందరూ భావించారు. అయితే ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ఇంతకుముందే ఆగస్టు తొలి వారంలో విడాముయిర్చి సెట్స్ పైకి వెళుతుందని చెప్పారు. అయితే ఇది మరోసారి వాయిదా పడినట్టు, సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానున్నట్లు తాజా సమాచారం. అసలు ఈ చిత్రం విషయంలో ఏం జరుగుతుందనే గందరగోళ వాతావరణం అజిత్ అభిమానుల్లో నెలకొంది. ఇకపోతే ఈ చిత్రం షూటింగ్ పలుమార్లు వాయిదా పడటంతో ఇందులో నాయకిగా నటించాల్సిన త్రిష ఇతర చిత్రాలతో బిజీ అవ్వడం జరిగిపోయింది. (ఇదీ చదవండి: వాళ్లను చూస్తే నాకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది: చిరంజీవి) ఆమె అజిత్ చిత్రానికి కాల్ షీట్స్ సర్దుబాటు చేయలేని పరిస్థితి అనీ అయినప్పటికీ కాస్త ఆలస్యం అయినా ఎలాగో అలా విడాముయిర్చి చిత్రంలో నటిస్తానని త్రిష చెప్పినట్లు సమాచారం. అయితే నటుడు అజిత్ ఆమెకు అడ్డుపడుతున్నట్లు తాజాగా సామాజిక మాధ్యమాలలో వైరలవుతోంది. ఆయన దృష్టి ఇప్పుడు నటి తమన్నపై పడిందట. కారణం జైలర్ చిత్రంలోని కావాలా పాటతో ఫుల్ క్రేజ్ తెచ్చుకోవడమే అని టాక్. అజిత్ అంటేనే తమిళ పరిశ్రమలో పవర్ హౌస్ లాంటోడు. అలాంటిది మరోక హీరోయిన్‌కు వచ్చిన క్రేజ్‌ను సొంతం చేసుకోవాలనే మోజులో ఉండటం మంచిది కాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. త్రిష కూడా తమన్నా క్రేజ్‌కు ఏ మాత్రం తక్కువ కాదని వారు తెలుపుతున్నారు. కాగా అజిత్ చిత్రంలో నటించే నాయకి ఎవరన్నది చిత్రవర్గాలు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. -
జైలర్‌కు 'తెలుగు' సెంటిమెంట్.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు?
చిత్ర పరిశ్రమంలో సెంటిమెంట్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఒక చిత్రం హిట్ అయితే ఆ తరహాలోనే చిత్రాలను నిర్మించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇకపోతే ప్రస్తుతం జైలర్ చిత్రంలో తమన్నా నటించిన కావాలా పాట ట్రెండింగ్‌గా మారింది. రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం జైలర్. ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్, తెలుగు నటుడు సునీల్, యోగిబాబు, రమ్యకృష్ణ, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తదితరులు ముఖ్యపాత్ర పోషించారు. (ఇదీ చదవండి: తరుణ్ ఎవరింటి అల్లుడు?) అయితే వీటన్నింటినీ తమన్నా నటించిన కావాలా పాట పక్కకు నెట్టేసింది. ఇంతకుముందు ఇదేవిధంగా అల్లు అర్జున్ పుష్పాలో సమంత నటించిన ఐటెం సాంగ్ ఊ అంటావా మామ ట్రెండ్ సెట్టర్‌గా మారింది. పలువురు స్టార్ హీరోయిన్ల నుంచి విదేశీ భామల వరకు ఈ పాటకు డాన్స్ చేసి ముచ్చట తీర్చుకున్నారు. ఇప్పుడు తమన్నా నటించిన కావాలా పాట కూడా కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. 52 ఏళ్ల రమ్యకృష్ణ కూడా ముచ్చటపడి ఈ పాటకు డాన్స్ చేయడం విశేషం. ఇకపోతే ఈ చిత్ర కథానాయకుడు రజనీకాంత్ కూడా కావాలా పాటపై తన అసూయను వ్యక్తం చేశారు. ఆరు రోజులు చిత్రీకరించిన ఈ పాటలో తనకు ఒక పూట కూడా నటించే అవకాశాన్ని కల్పించలేదనే నిష్టూరాన్ని ఇటీవల జరిగిన ఆడియో వేడుకలో వెలిబుచ్చారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రంలో కావాలా అంటూ తెలుగు పదాలతో ఈ పాట మొదలవుతుంది. (ఇదీ చదవండి: తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్‌గా దిల్‌రాజు) ఇంతకుముందు కూడా రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చంద్రముఖి చిత్రంలో దేవుడ దేవుడా అనే పాట తెలుగు పదాలతో మొదలవుతుంది. ఆ పాట సూపర్ హిట్ కావడంతో పాటు చిత్రం కూడా ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ జైలర్ చిత్రానికి కూడా వర్క్ అవుట్ అవుతుందా..? లేదా..? అనే విషయం త్వరలో తేలిపోనుంది. -
ఈ పాప ఎవరో చెప్పుకోండి చూద్దాం? 18 ఏళ్లుగా టాలీవుడ్లో
యాక్టింగ్ చూడటానికి ఈజీగానే ఉంటుంది! కానీ చేస్తేనే అది ఎంత కష్టమో తెలుస్తుంది. అలానే ఈ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలబడాలంటే కష్టపడాలి, అదృష్టం కలిసి రావాలి. పైన ఫొటోలో కనిపిస్తున్న పాప కూడా అలానే టాలీవుడ్లో అడుగుపెట్టింది. ప్రారంభంలో చిన్న సినిమాలు చేసింది గానీ స్టార్ హీరోలతో చేసిన ఒకటి రెండు మూవీస్ హిట్ కావడంతో రేంజ్ పెంచేసుకుంది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? చెప్పేయమంటారా? ఇండస్ట్రీలో హీరోయిన్లు మహా అయితే ఓ 10 ఏళ్లు వరసగా అవకాశాలు అందుకుంటారు. ఆ తర్వాత మాత్రం కష్టమే. కానీ ఈ హీరోయిన్ మాత్రం అప్పుడెప్పుడో 2005లో 'శ్రీ' సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఇప్పటికీ ఈమె చేతిలో సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. పైన ఫొటోలో ఉన్న పాప తమన్నా. త్వరలో ఈమె నటించిన 'జైలర్', 'భోళా శంకర్' సినిమాలు.. ఒక్క రోజు వ్యవధిలో థియేటర్లలోకి రాబోతున్నాయి. (ఇదీ చదవండి: తమన్నాకు వింత పరిస్థితి.. ఒకే హీరోకి లవర్, సిస్టర్‌గా!) గతేడాది పరిస్థితి చూసుకుంటే తమన్నా కెరీర్ ఆల్మోస్ట్ అయిపోయిందనుకున్నారు. ఈ సంవత్సం వచ్చేసరికి మొత్తం మారిపోయింది. 'జీ కర్దా', 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీసుల్లో నటించిన మిల్కీబ్యూటీ.. అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఎందుకంటే ఇన్నాళ్లుగా స్క్రీన్ పై ముద్దు సీన్‌కి కూడా నో చెబుతూ వచ్చిన ఈ నటి.. ఓటీటీలు అనేసరికి ముద్దులు, శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ చేసింది. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో విడుదలకు రెడీ అయిపోయింది. మరోవైపు నటుడు విజయ్ వర్మతో ప్రేమ వ్యవహారంతోనూ తమన్నా తెగ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఎందుకంటే వీరిద్దరూ ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ (లస్ట్ స్టోరీస్ 2)లో అవాక్కయ్యేలా కెమిస్ట్రీ పండించేస్తున్నారు. ఇలా తమన్నా కెరీర్ ఖతం అయిందనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమెనే ట్రెండింగ్ లో ఉంటోంది. ఇప్పుడు ఆమె చిన్నప్పుడు ఫొటోలు కొన్ని వైరల్ అయ్యాయి. వాటిని చూసిన నెటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) -
Tamannaah White Corset Top Photos: తమన్నా అందాల విందు.. అస్సలు తగ్గట్లేదుగా! (ఫొటోలు)
-
తమన్నాతో పెళ్లి.. వారింట్లో నుంచి విజయ్‌పై పెరుగుతున్న ఒత్తిడి
మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. వీరిద్దరూ నిజంగా రిలేషన్లో లేరని, 'లస్ట్ స్టోరీస్ 2' ప్రచారం కోసం అలా చెప్పారని కూడా వార్తలు వచ్చాయి. అలాంటి ప్రచారాలకు చెక్ పెడుతూ తమన్నా, విజయ్ వర్మ ఇద్దరూ కూడా తమ రిలేషన్షిప్ గురించి ఓపెన్ అయ్యారు. తమన్నాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు ఈ మధ్య విజయ్ బహిరంగంగానే చెప్పాడు. తామిద్దరూ డేటింగ్లో ఉన్నామని ఇప్పుడు తనకు బాగా అర్థమవుతోందన్నాడు. ఆమెతో ఎంతో సంతోషంగా ఉన్నానంటూ.. తనను పిచ్చిగా ప్రేమిస్తున్నానని తెలిపాడు. ఆమె రాకతో తన జీవితంలో విలన్ దశ ముగిసిపోవడమే కాకుండా రొమాంటిక్ దశ మొదలైందని చెప్పాడు. తమన్నా భాటియాను పెళ్లి చేసుకోవాలని కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు వస్తున్న వార్తలపై విజయ్ వర్మ పలు విషయాలు వెల్లడించాడు. మళ్లీ తాజాగా తన పెళ్లి గురించి ఇంట్లో ఎలాంటి ఒత్తిడి ఉందో విజయ్ ఇలా స్పందించాడు. ' నా జీవితంలో పెళ్లిపై ఒత్తిడి ఎప్పుడో ప్రారంభమైంది. నేను మార్వాడీని. మా కమ్యూనిటీలో, అబ్బాయిలు 16 ఏళ్లు రాగానే పెళ్లి చేసుకోగల వయస్సుగా పరిగణించబడతారు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడో నా జీవితంలో ప్రారంభమయ్యాయి. కొన్నేళ్ల తర్వాత నా పెళ్లి గురించి ఆ ఒత్తిడి కొంచెం తగ్గింది.. ఎందుకంటే నేను పెళ్లి చేసుకునే వయస్సు ఎప్పుడో దాటిపోయింది. పైగా అప్పటికి నేను నటుడిని అయ్యాను. ఇదీ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: సినీ నటిపై రేప్.. ఇంటర్వ్యూ పేరుతో హోటల్‌కు తీసుకెళ్లి ఆపై..) మా అమ్మ మాత్రం పదేపదే పెళ్లి ప్రస్తావన తెచ్చేది. కానీ నేనే మాత్రం కెరీర్ వైపు మాత్రమే దృష్టి పెట్టాను. ఇప్పటికీ కూడా ఆమ్మ ఫోన్ కాల్ వస్తే మొదట అడిగే ప్రశ్న పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు..? అనే ఉంటుంది. సినిమాల వల్ల బిజీగా ఉండటంతో కుదరలేదని ఇంతవరకు చెప్పే వాడిని ఇప్పుడా అవకాశం లేదు. అని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: విజయ్‌సేతుపతితో మోస్ట్ కాంట్రవర్సీ హీరోయిన్ రొమాన్స్) ఈ వ్యాఖ్యలతో తమన్నా-విజయ్ వర్మ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, ఎప్పటి నుంచో పెళ్లి గురించి ఒత్తిడి తెస్తున్న తన తల్లి కోసం అయినా సాధ్యమైనంత త్వరలో తమన్నాతో ఏడడుగులు వేయడం ఖాయమని సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే పెళ్లికి విజయ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే. కానీ.. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న తమన్నా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. -
తమన్నాకు గోల్డెన్ ఛాన్స్.. మరోసారి ఆయనతో రొమాన్స్‌కు రెడీ
మిల్కీబ్యూటీ తమన్న తాజాగా మరోసారి 'అజిత్'తో రొమాన్స్ చేసే అవకాశం ఉందనే ప్రచారం సామాజకమాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన 'వీరం' చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. కాగా అజిత్ నటించిన 'తుణివు' తెలుగులో తెగింపు చిత్రం విడుదలై చాలా కాలం అవుతోంది. ఈ చిత్రంతో పాటు తెరపైకి వచ్చిన విజయ్ చిత్రం వారిసు తరువాత ఆయన నటిస్తున్న 'లియో' చిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అలాంటిది అజిత్ తాజా చిత్రం మాత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. దీనికి 'విడాముయిర్చి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముందుగా నయనతార భర్త 'విఘ్నేశ్ శివన్' దర్శకత్వం వహించడానికి సన్నాహాలు జరిగాయి. అయితే ఈ చిత్రం నుంచి ఆయనను తొలగించి దర్శకుడు మగిళ్ తిరుమేణిని ఎంపిక చేశారు. దీంతో చిత్రం మే నెలలో ప్రారంభం అవుతుందనే ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. తాజాగా ఆగస్ట్‌లో విడాముయిర్చి సెట్స్‌పైకి వెళ్లడం ఖాయం అనే టాక్ వినిసిస్తోంది. కాగా ఇందులో నటి త్రిష నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. (ఇదీ చదవండి: ఆ సీన్లు లేకుండా చేస్తారా.. నాకు మీరే న్యాయం చేయండి: విజయ్ ఆంటోని) అయితే చిత్ర షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతుండటంతో ప్రస్తుతం విజయ్‌కు జంటగా లియో చిత్రాన్ని పూర్తి చేసిన త్రిషకు తెలుగు, మలయాళం భాషల్లో అవకాశాలు వచ్చాయి. అలా ఆమె మలయాళంలో నటుడు 'టోవినో థామస్'కు జంటగా ఐడెంటీ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నారు. దీంతో అజిత్ సరనస నటించే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇకపోతే నటి తమన్న ప్రస్తుతం రజనీకాంత్ సరసన 'జైలర్' చిత్రంలో నటించి పూర్తి చేశారు.కాగా ఇందులోని 'కావాలయా అనే పాట'ను ఇటీవల చిత్ర వర్గాలు విడుదల చేశారు. ఆ పాటలో తమన్న కవ్వింపు డాన్స్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. అంతే కాదు ఈ పాట ఈ మిల్కీబ్యూటీకి మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందనేది తాజా సమాచారం. అందులో ఒకటి అజిత్ సరసన నటించే విడాముయిర్చి అని టాక్. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
టైగర్ కా హుకుం వచ్చేశాడు.. ఈ వీడియోతో ఫ్యాన్స్‌కు పండుగే
రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో శివరాజ్ కుమార్, మోహన్‌లాల్, జాకీష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, తమన్నా, మీర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్‌పై రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 10న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎంట్రీ.. స్టార్ మా ప్లాన్ ఇదేనా?) ఈ సినిమా నుంచి ఇప్పటికే మొదటి పాటతో 'నువ్వు కావాలయ్యా' అంటూ తమన్నా దుమ్ములేపింది. తాజాగా ఈ చిత్రంలోని రెండో పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ‘హుకుం...’ అంటూ సాగే ఈ పాట రజినీకాంత్ స్టైల్‌ని హైలెట్ చేస్తూ సాగుతుంది. ఈ సాంగ్‌లో రజినీకాంత్ స్టైల్‌ను ప్రధానంగా ఎలివేట్ చేస్తూ చిత్రీకరించారు. ఈ పాటకు సుబు రాసిన లిరిక్స్‌కు అనిరుధ్ కంపోజ్ చేసిన ట్యూన్ పక్కాగా సెట్ అయింది ‘హుకుమ్’ సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఆగస్టు 10 వరకు ఫ్యాన్స్‌కు పండుగే. -
తమన్నా మాస్ స్టెప్పులు.. అలా పోల్చిన విజయ్ వర్మ!
Tamannaah Vijay Varma: హీరోయిన్ తమన్నా ఈ మధ్య తెగ ట్రెండింగ్ అవుతోంది. నటుడు విజయ్ వర్మతో రిలేషన్, ముద్దుల దగ్గర నుంచి మొదలుపెడితే వెబ్ సిరీసుల్లో వీరిద్దరూ రెచ్చిపోవడం వరకు ఒకటా, రెండా.. ఎక్కడ చూసినా మిల్కీ బ్యూటీనే. చేతిలో ఉన్న సినిమాలు తక్కువేమో గానీ వస్తున్న వార్తలు మాత్రం బోలెడు. ఇప్పుడు ఇదంతా కాదన్నట్లు విజయ్ వర్మ.. ఈమె డ్యాన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమన్నా ఊరమాస్ సినిమాలు, వెబ్ సిరీసులతో బిజీగా ఉన్న తమన్నా.. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్'లో నటిస్తోంది. ఈ మూవీ నుంచి రీసెంట్ గా 'కావాలా..' లిరికల్ పాటని విడుదల చేశారు. ట్యూన్ క్యాచీగా ఉంది. ఇందులో తమన్నా డ్యాన్స్ సూపర్ గా ఉంది. ఊరమాస్ స్టెప్పులతో అదరగొట్టింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ తెగ ట్రెండ్ అవుతోంది. (ఇదీ చదవండి: రెచ్చిపోతున్న తమన్నా.. ఆ విషయం అర్థమైపోవడం వల్లే!) సినిమా దేవత గతేడాది వరకు సింగిల్ గానే ఉన్న తమన్నా.. ప్రస్తుతం నటుడు విజయ్ వర్మతో రిలేషన్షిప్ మెంటైన్ చేస్తోంది. వీళ్లిద్దరూ జంటగా నటించిన 'లస్ట్ స్టోరీస్ 2' ఈ మధ్యే రిలీజైంది. అందులో శృంగార సన్నివేశాలు, ముద్దులతో ఈ జోడీ రెచ్చిపోయింది. ఇక తమన్నా లేటెస్ట్ సాంగ్ చూసిన విజయ్ వర్మ ఫిదా అయిపోయాడు. 'పాట ఫైర్ పుట్టిస్తోంది. సినిమా దేవుడు, దేవత' అని విజయ్ రాసుకొచ్చాడు. లవర్ని ఓ రేంజులో అయితే ఈ క్యాప్షన్ లో రజినీకాంత్ ని సినిమా దేవుడు అని విజయ్ వర్మ చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ తమన్నాని ఏకంగా దేవత అని ఎలివేషన్ ఇవ్వడం మాత్రం ఆశ్చర్యపరిచింది. ఎంత లవర్ అయితే మాత్రం ఈ రేంజు ఎలివేషన్స్ ఎలా భయ్యా అని నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిన సామ్.. ఆ ఆరు నెలలు!) -
Lust stories 2: ఈ సీన్ల కోసం తమన్నా తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే..
స్టార్ హీరోయిన్ మిల్కీబ్యూటీ తమన్నా గురించి అందరికి తెలుసు.. టాలీవుడ్లో అడుగుపెట్టి ఇరవై ఏళ్లు పూర్తి కావొస్తున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు.. ఇప్పుడున్న కుర్ర హీరోయిన్లతో పోటి పడుతూ వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉంది. బాలీవుడ్లో ఆమె మొదట జీ కర్థ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఆ సిరీస్‌లో కూడా బోల్డ్ సన్నివేశాలలో రెచ్చిపోయింది. తాజాగా వచ్చిన వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్2'లో కూడా అవే సీన్లతో మరింత డోస్ పెంచింది. బాలీవుడ్లో అవకాశాల కోసమే మిల్కీబ్యూటీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుందానని కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఆమె సినీ కెరియర్లో ఏ సినిమాలో కూడా ఈ స్థాయిలో బోల్డ్‌గా నటించలేదు. అంతే కాకుండా విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది. ఈ సీరిస్‌లో వారిద్దరూ ఏకంగా లిప్ కిస్ సీన్స్‌తో పాటు బెడ్ రూం సీన్స్‌లో కూడా రెచ్చిపోయారు. (ఇదీ చదవండి: సినీ తారల ‘వ్యాపారం’.. సైడ్ బిజినెస్‌తో కోట్లు గడిస్తున్న స్టార్స్ వీరే!) ఈ సిరీస్ కోసం తమన్నాకు భారీ స్థాయిలోనే రెమ్యూనేషన్ ఇచ్చారని తెలుస్తోంది. ఒక సినిమా కోసం తమన్నా సుమారు రూ. ఐదు కోట్ల రూపాయల వరకు తీసుకుంటుందని ఇండస్ట్రీ టాక్. కానీ 'లస్ట్ స్టోరీస్2' కోసం ఏకంగా ఏడు కోట్ల రూపాయల వరకు తీసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. ఇందులో కూడా తను కేవలం 30 నిమిషాల నిడివి లోపే తన క్యారెక్టర్ ఉంటుంది. రొమాన్స్ సీన్లు చేసేందుకు ఎలాంటి అడ్డు చెప్పనందుకే ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ మేకర్స్ ఇచ్చారని తెలుస్తోంది. టాలీవుడ్లో భోళా శంకర్ సినిమాలో చిరంజీవితో జోడిగా తమన్నా నటిస్తుంది. ఈ సినిమా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. (ఇదీ చదవండి: 'భోళా శంకర్'కి లైన్ క్లియర్.. ఆ సినిమా వాయిదా వల్ల!) -
Rajinikanth: జైలర్‌కు షాక్ ఇచ్చిన తమన్నా
ఇప్పుడు కోలీవుడ్‌లో నటి తమన్నా గురించే చర్చ నడుస్తోంది. ఈ మిల్కీ బ్యూటీ తమన్నాకు ఏమైంది అంటూ పలువురు ఆమెను కార్నర్ చేస్తున్నారు. తమన్న గ్లామరస్ పాత్రలతోనే నటనను ప్రారంభించారు. ఇంతకుముందు గ్లామరస్ పాత్రలో నటించడానికి కొన్ని హద్దులు పెట్టుకున్న ఆమె ఇప్పుడు ఆ ఎల్లలను దాటేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకు కారణం జీ కర్దా అనే వెబ్ సిరీస్‌లో ఆమె శృతిమించిన అర్ధనగ్న దుస్తులతో కూడిన నటనే. ఈ వెబ్ సిరీస్‌లో పలు ద్వంద్వ అర్థాలు, అశ్లీల సన్నివేశాలతో పాటు, తమన్నా బెడ్ రూమ్ శృంగార సన్నివేశాలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. (ఇదీ చదవండి: తల్లిదండ్రులైన రామ్ చరణ్- ఉపాసన దంపతులు) ప్రస్తుతం ఆమె తమిళంలో రజనీకాంత్ సరసన జైలర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 10వ తేదీన తెరపైకి రానుంది. దీంతో జీ కర్దా వెబ్ సిరీస్‌లో ఆమె శృతిమించిన అందాల ఆరబోతకు తెరలేపింది. ఆపై విజయ్ వర్మతో ప్రేమ వ్యవహారం తెలిసిందే. లస్ట్ స్టోరీస్- 2లో కూడా మితిమీరిన రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. దీంతో జైలర్ చిత్ర యూనిట్ షాక్‌కు గురవుతోందని సమాచారం. ఆ ఎఫెక్ట్ తమ చిత్రంపై పడుతుందనే ఆందోళన చెందుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇకపోతే నటీమణులు డబ్బు కోసం ఎలాగైనా నటించడానికి సిద్ధం అవుతున్నారని, గతంలో కూడా కొందరు హద్దులు మీరి అందాల ఆరబోతను చూశామని, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో నటిస్తున్న నటి తమన్న ఇలాంటి వెబ్ సిరీస్‌ల్లో నటించడం సబబు కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఇలాంటి విమర్శలపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి. (ఇదీ చదవండి: నాకు ఫ్యామిలీ ఉంది.. అనవసర విషయాల్లోకి లాగొద్దు: అనసూయ) -
రెచ్చిపోతున్న తమన్నా..ఫీల్ అవుతున్న ఫ్యాన్స్
-
Social Hulchul: అందాల ప్రదర్శనలో అనుపమతో తమన్నా పోటీ
► బ్లాక్ డ్రెస్‌లో డోస్ పెంచుతున్న అనుపమ పరమేశ్వరన్.. ఘాటైన పోజులతో లేటెస్ట్ ఫోటలు వైరల్ ► భూమిపై నిజమైన స్వర్గం ఇదేనేమో అంటూ.. కుటుంబంతో పాటు స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న హనీరోజ్ ► ఎవర్గ్రీన్ అందంతో మెరిసిపోతున్న టబు ► లగ్జరీ బైక్‌పై సింగిల్‌గా రైడ్ చేస్తూ తగ్గేదెలే అంటున్న మంజు వారియర్ ►లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్ ఫోటో షూట్లో రెచ్చిపోయిన తమన్నా View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Suhasini Hasan (@suhasinihasan) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
ఆ సినిమాతోనే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది: తమన్నా
ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెరపై తన అందం, అభినయం, డాన్స్‌తో కుర్రకారును కట్టిపడేస్తుంది. అలా మిల్కీ బ్యూటీగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. అయితే డేటింగ్ రూమర్స్‌తో వార్తల్లో ఉంటున్న తమన్నా.. తాజాగా వాటికి ఫుల్స్టాప్ పెట్టింది. ఎట్టకేలకు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్షిప్ నిజమేనని ఒప్పుకుంది. వారిద్దరూ జంటగా నటించిన 'లస్ట్ స్టోరీస్ 2' సెట్స్‌లో ప్రేమ కథ ప్రారంభమైందని ఆమె వెల్లడించింది. తమన్నా, విజయ్ కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి. (ఇదీ చదవండి: ధనుష్‌కు షాక్ ఇచ్చిన కంగనా రనౌత్?) ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఇలా అన్నారు. ' సహనటుడు అనే కారణంగా విజయ్ వర్మను ఇష్టపడలేదు. నాకు చాలా మంది సహ నటులు ఉన్నారు. కానీ విజయ్ ప్రత్యేకమైన వ్యక్తి. నాకు రక్షణగా నిలబడుతాడు అనే నమ్మకం ఉంది. మా ఇద్దరి మధ్య చాలా ఆర్గానిక్ బంధం ఉంది. నన్ను కిందకు లాగే వారి నుంచి రక్షిస్తాడు. నా కోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. అనుకోకుండా ఆ ప్రపంచంలోకి నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి వచ్చాడు. అతను నా పట్ల చాలా శ్రద్ధ వహిస్తాడు. తను ఉన్న ప్రదేశమే నాకు సంతోషకరమైన ప్రదేశం' అని చెప్పింది. దీంతో అన్నీ అనుకూలిస్తే త్వరలో మరో జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధంగా ఉంది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Vijay Varma (@itsvijayvarma) (ఇదీ చదవండి: బాలీవుడ్లో కన్నా సౌత్‌లోనే నెపోటిజం ఎక్కువ: అవికా గోర్) -
తమన్నా ఏంటీ ఇలా?.. డబ్బుల కోసమే అలాంటి సీన్స్ చేస్తోందా?
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో నటించిన ఈ భామ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం మెగాస్టార్ సరసన భోశాశంకర్లో నటిస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్లో వెబ్ సిరీస్‌ల్లోనూ కనిపించనుంది. జీ కర్ధా, లస్ట్ స్టోరీస్-2 సిరీస్‌ల్లో నటించింది. వీటితో పాటు రజనీకాంత్‌తో కలిసి నటించిన జైలర్, అరణ్మణై–4, మలయాళం చిత్రం బాంద్రా, హిందీ చిత్రం బోల్ చుడియన్ చిత్రాలు లైన్లో ఉన్నాయి. అయితే తమన్నా నటించిన వెబ్ సిరీస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (ఇది చదవండి: తమన్నాకు రజినీకాంత్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?) ఇటీవల రిలీజైన జీ కర్దా వెబ్ సిరీస్ ట్రైలర్లో తమన్నా మీతిమీరిన రొమాంటిక్ సీన్స్‌లో నటించడంపై నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ రేంజ్లో బెడ్ రూమ్ సీన్లలో నటించిందా అంటూ షాకవుతున్నారు. దీంతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్న లస్ట్ స్టోరీస్-2 వెబ్ సీరిస్‌లోనూ బోల్డ్ సీన్స్‌లో నటించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మిల్కీ బ్యూటీ బ్యాక్ టూ బ్యాక్ అడల్ట్ సీరిస్‌ల్లో నటించడంపై విమర్శలు వస్తున్నాయి. ఏకంగా తమన్నా ఆర్థికంగా దివాళా తీసిందా? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సినీ తారలపై ఎప్పుడు విమర్శలు విరుచుకుపడుతూ.. తనకు తానుగా సినీ క్రిటిక్‌గా ఫీలయ్యే ఉమైర్ సంధు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం సన్నిలియోన్ స్థానాన్ని తమన్నా భర్తీ చేస్తోందంటూ వివాదస్పద ట్వీట్ చేశారు. 40 ఏళ్ల వయసులో గుర్తింపు కోసమే అన్ని హద్దులు చేరిపేసిందంటూ ఉమైర్ సంధు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: రామాలయానికి 100 టిక్కెట్లు ఉచితం) #TamannaahBhatia is the New “ Sunny Leone ” in India 🇮🇳 now. She is the Most Trending “ Naked Actress ” in Last 2 days. In her 40 age, She is crossing all limits to back in Position. As per insiders, she became bankrupt in Covid ! pic.twitter.com/aVOt2RmY87 — Umair Sandhu (@UmairSandu) June 9, 2023 View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
ఎవరికీ చెప్పొద్దు అంటూ లీక్ చేసిన చిరు
వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ‘చిరు లీక్స్’పేరుతో అభిమానులతో పంచుకున్నారు. సినిమాలోని ఓ పాటకు సంబంధించిన షాట్స్‌ను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇంకేముంది మెగా ఫ్యాన్స్‌కు పండుగే.. వెంటనే దానిని వైరల్ చేయడం కూడా మొదలైంది. (ఇదీ చదవండి: వరుణ్- లావణ్య త్రిపాఠి పెళ్లిపై ఎవరూ స్పందించరేంటి?) వీడియోను గమనిస్తే, సంగీత్ జరుగుతుండగా వచ్చే సాంగ్లా ఉంది. సనిమాలో నటించే ఆర్టిస్టులందరూ ఈ పాటలో హుషారుగా ఉన్నారు. చిరు ఇలా పంచుకున్నారు 'నాతో పాటు నా అభిమానులను కూడా హుషారుగా ఉంచాలని అనుకుంటున్నా. అందుకే ఈ పాట విషయాలు లీక్ చేద్దామనిపించింది. అక్కడ షూట్ చేసిన కొన్ని షాట్స్‌ను ఎడిట్ చేసి, ఇన్‌స్టాలో పంచుకుంటున్నా..ఇది 'చిరు లీక్స్' ఎవరికీ చెప్పొద్దు. మీరు మాత్రమే చూసి ఎంజాయ్ చేయండి' అని ట్వీట్ చేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సినిమా.. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇదీ చదవండి: వారి లిస్ట్ తీయండి.. ఫ్యాన్స్‌కు విజయ్ అదేశం) View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
ముంబై ఎయిర్ పోర్ట్ లో సినీ నటి తమన్నా భాటియా
-
ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకల్లో పాన్ ఇండియా బ్యూటీలు
మరో 8 రోజుల్లో (మార్చి 31) క్రికెట్ పండుగ ఐపీఎల్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఫ్యాన్స్‌కు మత్తెక్కిచే ఓ వార్త తెలిసింది. ఐపీఎల్ 2023 ఎడిషన్ ప్రారంభ వేడుకల్లో పాన్ ఇండియా బ్యూటీలు రష్మిక మంధన, తమన్నా భాటియా లైవ్ పెర్ఫార్మెన్స్ చేయనున్నారని సమాచారం. కోవిడ్ కారణంగా గత మూడేళ్లుగా ప్రారంభ వేడుకలు జరగని కారణంగా ఈసారి వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది. ఇందులో భాగంగానే సినీ గ్లామర్‌ను వాడుకోవాలని భారీ ప్రణాళికను రచించింది. రష్మిక, తమన్నా లతో పాటు మరికొంత మంది మేల్, ఫిమేల్ పాన్ ఇండియా ఆర్టిస్ట్‌లు ఈ వేడుకల్లో పాల్గొంటారని బీసీసీఐకి చెందిన కీలక అధికారి ఒకరు వెల్లడించారు. మూడేళ్ల తర్వాత హోమ్ అండ్ అవే ఫార్మాట్ తిరిగి అమల్లోకి వస్తున్నందున, ప్రేక్షకులను వేడుకతో మైదానాలకు ఆహ్వానించాలని భావిస్తున్నట్లు సదరు అధికారి తెలిపారు. కాగా, ఐపీఎల్ 16వ ఎడిషన్ ప్రారంభ వేడుకలు మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఐకానిక్ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు అరంగంట ముందు (సాయంత్రం 7:30 గంటలకు) ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉంటే, బీసీసీఐ.. మహిళల ఐపీఎల్ (WPL)కు ముందు కూడా ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించింది. అయితే, సినీ గ్లామర్ లేకపోవడంతో ఆ వేడుక ఫ్లాప్ అయ్యింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ భారీ తారాగణంతో ఐపీఎల్-2023 ప్రారంభ వేడుకను నిర్వహించాలని డిసైడైంది. -
జైలర్‌తో మిల్కీ బ్యూటీ
తమిళ సినిమా: జైలర్. ఈ పేరే ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. దీనికి ప్రధాన కారణం సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన నటిస్తున్న 169వ చిత్రం ఇది. సన్ పిక్చర్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బీస్ట్ ఫేమ్ నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్రానికి మరో విశేషం స్టార్ డమ్. రజనీకాంత్‌తో పాటు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, టాలీవుడ్ నటుడు సునీల్, వసంత రవి, యోగి బాబు, నటి రమ్యకృష్ణ, తమన్నా తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని, విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే 70 శాతం పూర్తి అయినట్లు సమాచారం. ఇక అసలు విషయం ఏమిటంటే నటి తమన్నా భాటియా తొలిసారిగా ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నటించనున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడీ చిత్రం షూటింగ్లో ఈమె పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆమె శుక్రవారం తన ఇన్ స్ట్రాగామ్‌లో విడుదల చేసిన చిన్న వీడియో ద్వారా తెలిపారు. నెల్సన్ దర్శకత్వంలో జైలర్ చిత్రం టాకీ పార్ట్ జరుగుతోందని, ఇందులో నటించడం హ్యాపీగా ఉందని పేర్కొన్నారు. జైలర్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతోంది. కాగా చిత్రాన్ని దీపావళి సందర్భంగా ఆగస్ట్‌లో విడుదల చేయడానికి సన్ పిక్చర్స్ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చిత్రంలో అనేక మంది పెద్ద నటులు ఉండడంతో జైలర్ చిత్రంపై అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయనే చెప్పాలి. -
తమన్నాతో డేటింగ్ పై స్పందించిన విజయ్ వర్మ
-
ముందులా భయపడటం లేదు: తమన్నా
వీలు కుదిరినప్పుడల్లా కొన్ని రోజులు ఆధ్యాత్మిక యాత్రలకు వెళుతున్నారు తమన్నా. గత ఏడాది వైష్ణవీ దేవి ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. ఇటీవల ఆమె హిమాలయాలకు వెళ్లి అక్కడి వైష్ణవి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తమన్నా కాషాయ వస్త్రాలు ధరించారు. ఈ హిమాలయా యాత్రకు సంబంధించిన ఓ వీడియోను తమన్నా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘ఓ ఆహ్వానం మేరకు హిమాలయాలకు వచ్చాను. ఇక్కడి లింగభైరవి దేవి ఆలయాన్ని సందర్శించి, పూజలు చేశాను. నాకు ప్రశాంతతతో కూడిన మానసిక ఉల్లాసం కలిగింది. జీవితం, అపజయాలు, మరణం పట్ల నెలకొని ఉండే భయాలు తగ్గాయనిపిస్తోంది. లింగభైరవి దేవి విగ్రహం నా ఇంట్లో కూడా ఉంటే బాగుంటుందని అనిపించింది’’ అని పేర్కొన్నారు తమన్నా. ఇక సినిమాల విషయానికొస్తే.. రజనీకాంత్ ‘జైలర్’, చిరంజీవి ‘బోళా శంకర్’, దిలీప్ ‘బాంద్రా’ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్నారామె. -
మీ లవర్ ఎక్కడ?.. తమన్నాను ఓ ఆటాడుకున్న నెటిజన్లు
తమన్నా భాటియా వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. న్యూ ఇయర్ వేడుకలకు గోవా చెక్కేసిన మిల్కీ బ్యూటీ సందడి చేసింది. ఆ వేడుకల్లో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను ముద్దాడిన వీడియో వైరల్ కావడంతో రూమర్స్ పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. తాజాగా తమన్నా తన ఇన్‌స్టాలో గోవా సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేసింది. తమన్నా ఇన్‌స్టాలో రాస్తూ..'కొత్త సంవత్సరంలోకి ట్వంటీ ట్వంటీ ఫ్రీ' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే కొందరు నెటిజన్లు మాత్రం తమన్నా పోస్టుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రియుడు విజయ్ వర్మ ఎక్కడా? అని పోస్టులు పెడుతున్నారు. విజయ్ వర్మతో ఉన్న ఫోటో పోస్ట్ చేయండి అంటూ మరొకరు ప్రశ్నించారు. కొందరేమో ఏకంగా మీ లవర్ ఎలా ఉన్నాడు? అంటూ కామెంట్స్ చేశారు. అంతకుముందు తమన్నా, విజయ్ డిసెంబర్ 2022లో ముంబైలో జరిగిన దిల్జిత్ దోసాంజ్ కచేరీలో కనిపించారు. ఈ ఏడాది తమన్నా నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి బోలే చుడియాన్‌లో కనిపించనుంది. విజయ్ చివరిసారిగా అలియా భట్‌తో కలిసి డార్లింగ్స్‌లో కనిపించాడు. -
తమన్నా ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా?
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. న్యూ ఇయర్ ఈవెంట్లో నటుడు విజయ వర్మను హగ్ చేసుకుని ముద్దు పెట్టిన వీడియో బయటకు వచ్చింది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ సింగిల్‌గా ఉంటూ ఇప్పటివరకు రూమర్లకు దూరంగా ఉన్న తమన్నా తాజాగా విజయ్ వర్మతో డేటింగ్ గాసిప్స్‌తో వార్తల్లోకెక్కింది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి తమన్నాపై పడింది. ఈ వార్తల్లో నిజమెంతుంది, తమన్నా నిజంగానే విజయ్ వర్మతో రిలేషన్లో ఉందా? అంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో తమన్నాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం చర్చనీయాంశమైంది. తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నటిగా ఆమె సంపాదించిన ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి. దశాబ్ద కాలంపైనే సినీ రంగంలో స్టార్ హీరోయిన్గా రాణించిన ఆమె 2007లో హ్యాపీడేస్ మూవీతో తొలి సక్సెస్‌ను అందుకుంది. ఇక ఆమె ఆస్తుల విషయానికి వస్తే.. ఇటివల ముంబైలో ఓ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిందట. దానికి విలువ దాదాపు రూ. 16 కోట్లు ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఆమె పలు వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన విషయం తెలిసిందే. పలు శారీ షోరూంలతో పాటు ఫాంటా, ఫ్రూటీ, సెల్కాన్ వంటి పలు బ్రాండ్లకు ఆమె ప్రచారం చేస్తుంది. ఈ ప్రకటనల ద్వారా ఆమె ఏడాది మొత్తం రూ. 12 కోట్లు అర్జీస్తుందట. ఈ లెక్కన నెలకు తమన్నా ఒక కోటి సంపాదిస్తుందన్నమాట. ఇలా ఇప్పటి వరకు తమన్నా సంపాదించిన మొత్తం ఆస్తి విలువ రూ. 110 కోట్లుపైనే ఉంటుందని సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె ఒక్క చిత్రానికి రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది. ఇక స్పెషల్ సాంగ్స్‌కు అయితే రూ. 50 లక్షలు నుంచి కోటి వరకు డిమాండ్ చేస్తుందట. ఇదిలా ఉంటే తమన్నా వ్యాపారవేత్తగా కూడా రాణిస్తోంది. 2015లో వైట్ అండ్ గోల్డ్ పేరిట ఒక డైమండ్ జువెల్లరి బ్రాండ్‌ను ప్రారంభించింది. అలాగే తమన్నా వద్ద రూ. 2 కోట్లు విలువ చేసిన అరుదైన వజ్రం ఉందట. దానిని మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల సైరా నరసింహా రెడ్డి మూవీ సమయంలో తమన్నాకు బహుమతిగా ఇచ్చింది. అది ప్రపంచంలోనే 5వ అతి పెద్ద డైమండ్ అని వినికిడి. దీని బరువు సుమారుగా 62.4 గ్రాములు ఉంటుందట. వీటితో పాటు ఆమె గ్యారేజిలో విలువైన కార్ల కలెక్షన్స్ కూడా ఉన్నాయట. అందులో లాండ్ రోవర్ డిస్కవరీ, బీఎమ్‌డబ్య్లూ 5 సిరీస్, బెంజ్ కార్లు ఉన్నాయి. ఇక తమన్నా వాడే హ్యాండ్ బ్యాగ్ ఖరీదు రూ. 3 లక్షలు పైచిలుకు ఉంటుందని తెలుస్తోంది. ఇలా తమన్నా భారీగానే ఆస్తులు వెనకేసుకుంది. చదవండి: నేను కోరుకుంది ఇదే.. చాలా సంతోషంగా ఉంది: తమన్నా వీడియోతో ట్రోలర్స్ నోరు మూయించిన హీరోయిన్ -
హీరోలలో పెద్ద, చిన్న అనే తేడా చూడను..కథ నచ్చాలి: తమన్నా
‘గుర్తుందా శీతాకాలం’ సినిమాను గీతాంజలి మూవీతో పోలుస్తున్నారు.అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక క్లాసిక్ సినిమాతో మా సినిమాను పోల్చారు.. ఆ అంచనాను మేము తప్పకుండా రీచ్ అవుతామనే నమ్మకం నాకుంది’ అని మిల్కీబ్యూటీ తమన్నా అన్నారు. యంగ్ హీరో సత్యదేవ్, తమన్నాజంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ గుర్తుందా శీతాకాలం. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించారు. వేదాక్షర ఫిల్మ్స్ , నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ లు సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తాజాగా తమన్నా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► రీమేక్ సినిమాలో నటించడం అనేది నాకు కొత్త కాదు. కానీ ఒరిజినాలిటీ ని మిస్ కాకుండా చాలెంజ్ లా తీసుకుని చేస్తాను. ఎందుకంటే వాళ్లు అప్పటికే క్యారెక్టర్స్ చేసి ఉంటారు కాబట్టి చూసే ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఆ క్యారెక్టర్ చేయడం చాలెంజింగ్ గా తీసుకున్నాం ► మిగతా సినిమాలతో చూస్తే లవ్ స్టోరీస్ లలో నటించి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం కొంచెం కష్టమే.. కానీ ఈ సినిమాలో నేను చేసిన ఎమోషన్స్ క్యారెక్టరైజేషన్ ఆకట్టుకుంటాయి ► సినిమా ను పోలిన సినిమాలు వస్తుంటాయి కానీ అందులో ఏదో కొత్త పాయింట్ ఉంటుంది ఇందులో కూడా కొత్త ఎమోషన్స్, కొత్త పాయింట్ ను ప్రేక్షకులకు చెబుతున్నాం. ► సత్యదేవ్ తో నటించడం చాలా సంతోషంగా ఉంది. తను నటించిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా చూసిన తర్వాత ఆయన యాక్టింగ్ చాలా నేచురల్ గా అనిపించి తనతో చెయ్యాలని ఇంట్రెస్ట్ కలిగింది. ఆ తర్వాత ఈ సినిమా ఆఫర్ రావడంతో ఆ కోరిక తీరింది. ఇద్దరం కలసి మంచి ఎమోషన్ పండించడానికి అవకాశం దొరికింది. ► హీరోల్లో పెద్ద హీరో, చిన్న హీరో అనే తేడాలు చూడను, ఎవరితోనైనా గాని నేను సినిమాను సినిమాగానే చూస్తాను. అయితే సినిమా కథ బాగుండాలి.. ఆ సినిమా ఆడియన్స్ కు నచ్చాలని కోరుకుంటాను . ► ఇప్పటివరకు నేను యాక్టర్, డైరెక్టర్ అయిన వారితో సినిమాలు ఎప్పుడు చేయలేదు. నాగ శేఖర్( గుర్తుందా శీతాకలం చిత్ర దర్శకుడు) యాక్టర్ కావడంతో క్యారెక్టర్స్, ఎమోషన్స్ చాలా కరెక్ట్ గా అర్ధం చేసుకుని మాతో చేయించాడు ► నేను ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అయింది. ఇప్పటికీ నాకు సినిమాపై ఉన్న క్రేజ్ తగ్గలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు సినిమాపై నాకు ఎలాంటి ప్యాషన్ ఉందో ఇప్పుడు అదే ప్యాషన్ తో ఉన్నాను. ► ఓటిటిలు వచ్చిన తరువాత రీమేక్ సినిమాల ప్రభావం తగ్గినా మంచి సినిమా ఎప్పుడొచ్చినా చూడ్డానికి అడియన్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు. ఇప్పుడు నేను కూడా ఓటిటి లకు వర్క్ చేస్తున్నాను. యాక్టింగ్ పరంగా నాకు ఇంకొక ప్లాట్ ఫామ్ దొరికిందని ఫీలవుతున్నాను. ► భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న ప్రతి కథకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. సీనియారిటీని పక్కన పెట్టి నటిగా నటించడానికి ప్రయత్నిస్తాను. ► ఈ ఏడాదిలో నేను నటించిన ఎఫ్3 విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు ‘గుర్తుందా శీతా కాలం’రిలీజ్ అవుతుంది. దీని తరువాత చిరంజీవి తో ‘భోళాశంకర్ ’ప్రాజెక్ట్ చేస్తున్నాను. అలాగే ఓటిటి లో మూడు ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. మలయాళంలో మొదటి సారిగా బాంద్రా సినిమా చేస్తున్నాను. ఈ సినిమతో మలయాళం ఇండస్ట్రీ కు పరిచయం అవుతున్నాను. -
కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు
హీరోయిన్ తమన్నా పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో త్వరలో ఏడడుగులు వేయబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆమె ఎక్కువగా సినిమాలు చేయకపోవడానికి కారణం కూడా ఇదేనంటూ కథనాలు అల్లుతున్నారు. తాజాగా తన పెళ్లి వార్తలపై స్పందించింది తమన్నా. ఈ సందర్భంగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది! దీంతో అది చూసి నెటిజన్లంత ఖంగుతిన్నారు. కొద్ది రోజులుగా వస్తున్న తన పెళ్లి రూమర్స్‌పై ఆమె స్పందిస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో షేర్ చేసింది. ‘నా భర్తను పరిచయం చేస్తున్నా.. ఆ వ్యాపారవేత్త ఇతనే’ అంటూ వీడియోను పంచుకుంది. అయితే అందులో ఉన్నది తమన్నా అని తెలిసి అంతా షాకయ్యారు. కాగా గతంలో తమన్నా మగాడి వేషంలో చేసిన ఓ రీల్‌కు సంబంధించిన వీడియో ఇది. ‘ఎఫ్ 3’ మూవీ సమయంలో తీసుకున్న వీడియో ఇది. ఈ చిత్రంలో తమన్నా పలు సన్నివేశాల్లో మగాడి వేషంలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తమన్నా తీసుకున్న వీడియో క్లిప్‌ను ఇప్పుడు షేర్ చేసి తన పెళ్లి వార్తలను ఖండించింది. కాగా ప్రస్తుతం తమన్నా చిరంజీవి భోళా శంకర్ సినిమాతో పాటు ఓ తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ఇక ఇటీవల ఆమె నటించిన గుర్తుందా శీతాకాలం మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. -
తమన్నాకు చెస్ ఆట నేర్పిస్తున్న ప్రభాస్, వైరల్‌గా త్రోబ్యాక్ వీడియో
‘డార్లింగ్’ ప్రభాస్ చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాల షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంత బిజీ షెడ్యుల్‌లో కూడా తిరిగ్గా ‘మిల్కీ బ్యూటీ’ తమన్నాతో కలిసి ప్రభాస్ చెస్ ఆడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు ఆలోచనలో పడిపోయారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమా ఎంటాని ఆరా తీస్తున్నారు. చదవండి: మరోసారి విష్ణుప్రియ ఫేస్బుక్లో అశ్లీల వీడియోలు కలకలం! ‘ఎందుకిలా చేస్తోంది?’ మరోవైపు తమన్నా కూడా భోళా శంకర్ సినిమాతో పాటు ఓ తమిళ చిత్రం షూటింగ్లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలిసి చెస్ ఆడటమేంటని అంతా షాక్ అవుతున్నారు. అయితే అది ఇప్పటి వీడియో కాదు. ప్రభాస్-తమన్నా జంటగా రెబల్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ గ్యాప్‌లో వీరిద్దరు సరదాగా చదరంగా ఆడుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియోలో ప్రభాస్ చదరంగంలో ఎత్తులు ఎలా వేయాలో తమన్నాకు వివరిస్తూ కనిపించాడు. చదవండి: ‘గాడ్ ఫాదర్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్? అంతేకాదు తన ఆటతో పాటు తమన్నా ఆటను కూడా తానే ఆడుతూ ఆమెకు చెస్ నేర్పిస్తున్న ఈ వీడియో ప్రభాస్ ఫ్యాన్స్‌ని, నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్ ప్యాన్ ఒకరు బిహైండ్ ది సీన్స్ అంటూ ఈ త్రోబ్యాక్ వీడియోను షేర్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 2012ay లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్-తమన్నా హీరోహీరోయిన్లుగా రెబల్ మూవీ తెరకెక్కింది. ఇందులో దివంగత నటుడు, ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు ప్రధాన పాత్ర పోషించారు. I also wanna learn chess ♟️ From .#Prabhas garu😁 Darling teaching .@tamannaahspeaks chess Rebel BTS rare unseen 🤩 pic.twitter.com/wJKzbYw5Tf — Raju Garu Prabhas 🏹 (@pubzudarlingye) November 2, 2022 -
పుష్ప 2 లో తమన్నా ..!
-
జ్ఞాపకశక్తిని కోల్పోతుంటాను..అదే నా భయం : తమన్నా
సెలబ్రిటీలు అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తుంటారు. తాజాగా ‘ఆస్క్ తమన్నా’ అంటూ తమన్నా ఫ్యాన్స్‌కు ఆఫర్ ఇచ్చారు. అంతే.. నెటిజన్లు ప్రశ్నలు సంధించారు. తమన్నా కూల్‌గా జవాబులు చెప్పారు. వాటిలో కొన్ని ఈ విధంగా... జీవితంలో మీరు నేర్చుకున్న ఏ అంశాన్ని ఇతరులతో షేర్ చేసుకోవాలనుకుటున్నారు? నీలో ఉన్న ధైర్యాన్ని నమ్ముతూ జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. మిమ్మల్ని బాగా భయపెట్టే విషయం? అప్పడప్పుడు నా జ్ఞాపకశక్తిని కోల్పోతుంటాను. ఇది నన్ను చాలా భయపెట్టే అంశం. మీరు చేసినవాటిలో స్పెషల్ రోల్స్‌గా భావించేవి? ‘ధర్మదురై’ చిత్రంలో సుభాషిణి, ‘బాహుబలి’లో అవంతిక. మీ కెరీర్లో చాలెంజింగ్ రోల్? ‘ఎఫ్ 3’లో నేను చేసిన అబ్బాయి పాత్ర. ఫుల్ ప్లెడ్జ్డ్ డ్యాన్స్ ఫిల్మ్ ఎప్పుడు చేస్తారు? నాకు చేయాలనే ఉంది. నాకు ఉన్న డ్రీమ్ ప్రాజెక్ట్స్‌లో ఇదొకటి. ఏ కల్పిత పాత్రలను మీరు మీ జీవితంలో నిజంగా కలవాలనుకుంటున్నారు? షెర్లాక్ హోమ్స్ పాత్రలు సక్సెస్ కావడానికి ఏం ఫాలో అవ్వాలంటారు? మీ ప్యాషన్‌ను ఫాలో అవ్వండి. మీ గోల్‌ను సాధించడానికి తీవ్రంగా శ్రమించండి. ఈ ప్రయత్నంలో విఫలమైనా మళ్లీ ప్రయత్నించండి. అదృష్టం అంటే మీ దృష్టిలో..? మన కష్టానికి విధి సహాయ పడడాన్ని నేను లక్‌గా భావిస్తాను. హాలీవుడ్లో సినిమాలు చేస్తారా? అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. మీ ఫేవరెట్ జానర్ మూవీస్? యాక్షన్ అండ్ రొమాన్స్. కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొనడం గురించి? కాన్స్ చిత్రోత్సవాల్లో భాగస్వామ్యంగా ఉన్న మన దేశం తరఫున ఓ నటిగా నేను ప్రాతినిథ్యం వహించడం చాలా హ్యాపీగా అనిపించింది. మ్యాజికల్‌గా ఉంది. చాలా గౌరవంగా ఫీలవుతున్నాను. మీ తర్వాతి చిత్రాలు? చిరంజీవిగారితో ‘బోళా శంకర్’ సినిమా చేస్తున్నాను. ‘బబ్లీ బౌన్సర్’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోకు ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. త్వరలో ఓ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించబోతున్నాను. -
F3 Telugu Movie Review: ఎఫ్3 మూవీ రివ్యూ
టైటిల్ : ఎఫ్3 నటీనటులు : వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్, రాజేంద్రప్రసాద్, అలీ సునీల్ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాత: దిల్ రాజు, శిరీష్ దర్శకుడు: అనిల్ రావిపూడి సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫి: సాయి శ్రీరామ్ ఎడిటర్: తమ్మిరాజు విడుదల తేది: మే27,2022 సీనియర్ హీరో వెంకటేశ్, యంగ్ హీరో వరుణ్ తేజ్ మల్టీస్టారర్‌గా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్2 చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది.ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్ల ఎంటర్టైన్మెంట్ అందిస్తామంటూ F3ని తీసుకొచ్చాడు అనిల్ రావిపూడి. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ శుక్రవారం(మే27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దీనికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్ చేయడంతో ఎఫ్3పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఎఫ్3 ఏమేరకు అందుకుంది? వెంకటేశ్, వరుణ్‌ల కామెడీ మరోసారి వర్కౌట్ అయిందా? హిట్ కాంబినేషన్‌గా పేరొందిన అనిల్, దిల్‌రాజు ఖాతాలో విజయం చేరిందా లేదా? ప్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఎఫ్2లో భార్యల వల్ల వచ్చే ఫ్రస్టేషన్ ను చూపించిన అనిల్ రావిపూడి.. ఎఫ్3లో డబ్బు వల్ల వచ్చే ఫ్రస్టేషన్‌ను చూపించాడు. ఈ సినిమాలోని పాత్రలన్నింటికీ డబ్బు పిచ్చి ఉంటుంది. వెంకీ(వెంకటేశ్) మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. సవతి తల్లి పోరుతో పాటు ఇంటినిండా సమస్యలు. వీటీని దూరం చేసేందుకు అడ్డదారుల్లో డబ్బులు సంపాదిస్తుంటాడు. ఇక అవారాగా తిరిగే వరుణ్ యాదవ్(వరుణ్‌తేజ్) కోటీశ్వరుడు కావాలని కలలు కంటుంటాడు. దీని కోసం బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మరోవైపు హనీ(మెహరీన్) కూడా తన కుటుంబ సమస్యలు తీర్చడం కోసం ధనవంతున్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఇలా ఇద్దరు ధనవంతులని అబద్దం చెప్పి ఒకరికొకరు దగ్గరవుతుంటారు. ఇక వరుణ్ని ధనవంతుడిగా నటింపజేసేందుకు వెంకీ తన ఇల్లుని తాకట్టు పెట్టి మరీ డబ్బులు అందిస్తుంటాడు. చివరకు హనీ ధనవంతుడి కూతురు కాదని తెలుస్తుంది. దీంతో ఈజీగా కోటీశ్వరులవుదామనుకునే వారి ఆశ అడియాశలైపోతాయి. అంతేకాదు వెంకీ, వరుణ్ మరింత అప్పుల్లో కూరుకుపోతారు. చివరకు తమకు చావే శరణ్యమని భావించి ఆత్మహత్య చేసుకోవాడానికి ప్రయత్నిస్తారు. ఆ సమయంలో విజయనగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనందప్రసాద్(మురళీ శర్మ)గురించి తెలుస్తుంది. అతని కొడుకు చిన్నప్పుడే పారిపోయాడని, వారసుడి కోసం ఆనందప్రసాద్ 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడని తెలిసి..వెంకీ అతని కుమారుడిగా ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అదేసమయంలో వరుణ్‌తో పాటు మరో ఇద్దరు కూడా నేనే వారసుడిని అని ఇంట్లోకి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? వీరిలో ఆనందప్రసాద్ వారసుడు ఎవరు? డబ్బు మీద అత్యాశ ఉన్న వీళ్లకు ఆనందప్రసాద్ ఎలా బుద్ది చెప్పాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఒకప్పుడు జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ సినిమాలు అంటే జనాలు పొట్టచెక్కలయ్యే కామెడీ పక్కా అని ఫిక్స్ అయ్యేవారు ప్రేక్షకులు. ఇప్పుడు అదే పంథాలో వెళ్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. కామెడీ సినిమాలకు పెట్టింది పేరు అన్నట్లుగా దూసుకుపోతున్నాడు. ఎఫ్2తో భార్యల వల్లే వచ్చే ఫ్రస్టేషన్ చూపించి, చివరిలో వారి గొప్పదనం ఏంటో అందరికి అర్థమయ్యేలా చెప్పాడు. ఇక ఎఫ్3లో డబ్బు వల్ల కలిగే ఫ్రస్టేషన్ చూపించి..చివరిలో మంచి సందేశాన్ని అందించాడు. అయితే ఈ సినిమాలో కామెడీనే ఆస్వాదించాలి తప్ప..స్టోరీ పెద్దగా ఉండదు. ఇక లాజిక్ లెక్కలను అసలే పట్టించుకోవద్దు. ఈ సినిమా క్లైమాక్స్‌లో ‘లాజిక్ అని, రియలిస్టిక్ అని మమ్మల్ని ఎంతకాలం దూరంపెడతారు రా’ అని పోలీసు వేషంలో ఉన్న తనికెళ్ల భరణితో ఓ డైలాగ్ చెప్పించి.. తమ మూవీలో అవేవి ఉండవని చెప్పకనే చెప్పాడు దర్శకుడు. స్టోరీని పక్కకు పెట్టి కామెడీనే నమ్ముకున్నాడు. హీరోలకు లోపం ఉన్న క్యారెక్టర్లు ఇచ్చి హాస్యాన్నీ పండించాడు. రేచీకటితో వెంకటేశ్, నత్తితో వరుణ్‌తేజ్ చేసే కామెడీ థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ఈజీగా డబ్బు సంపాదించేందుకు వెంకీ, వరుణ్ పడే పాట్లతో ఫస్టాఫ్ అంతా రొటీన్ కామెడీతో సాగుతుంది. రేచీకటి లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు వెంకీ పడే పాట్లు నవ్విస్తాయి. ముఖ్యంగా ‘వెంకట్రావు పెళ్లాన్ని చూశా..’అంటూ వెంకీ చెప్పే డైలాగ్‌కు ప్రేక్షకులు పడిపడి నవ్వుతారు. ఇక సెకండాఫ్‌లో నిజంగానే మూడురెట్ల ఎంటర్టైన్మెంట్ అందించారు. మేమే ఆనందప్రసాద్ నిజమైన వారసులం అంటూ వెంకీ, వరుణ్ పండించే ఫన్ హైలెట్. వీరితో హారిక(తమన్నా) కూడా పోటీ పడడం.. వాళ్లకు రకరకాల పరీక్షలు పెట్టడం ఇలా ప్రతీ సీన్ నవ్విస్తుంది. ముఖ్యంగా ‘ఆంబోతు’ సీన్ అయితే కడుపుబ్బా నవ్విస్తుంది. ఎఫ్3 టాయ్స్ అంటూ టాలీవుడ్ స్టార్ హీరోలను తెరపై చూపించడం సినిమాకు ప్లస్ పాయింట్. ఇక క్లైమాక్స్‌లో వెంకీ, వరుణ్‌ల ఫైట్ సీన్ అయితే అదిరిపోతుంది. వారి గెటప్‌లకు, చెప్పే డైలాగ్స్‌కు ప్రేక్షకుడు నవ్వుకుంటూ థియేటర్ నుంచి బయటకు వస్తాడు. లాజిక్‌ని పక్కకు పెట్టి, హాయిగా నవ్వుకోవడానికి అయితే F3 మూవీ చూడొచ్చు. టికెట్ల రేట్లు పెంచకపోవడం ఎఫ్3(F3)కి బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఎవరెలా చేశారంటే... వెంకటేశ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏడిపించాలన్నా.. నవ్వించాలన్నా వెంకటేశ్ తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఆయన కామెడీ చేస్తే ప్రేక్షకులు పడిపడి నవ్వాల్సిందే. రేచీకటి సమస్యతో బాధపడుతున్న వెంకీ పాత్రలో వెంకటేశ్ అద్భుతంగా నటించాడు. తన ఇమేజ్‌ని పూర్తిగా పక్కకు పెట్టి.. తనదైన కామెడీతో నవ్వించాడు. ఇక వెంకటేశ్‌తో పోటాపోటీగా నటించాడు వరుణ్ తేజ్. నత్తి ఉన్న వరుణ్ యాదవ్ పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగ్స్ బాగా పేలాయి. మంగ టిఫిన్ సెంటర్ నడిపే యువతి హారికగా తమన్నా, ఆమె చెల్లిగా హనీగా మెహ్రీన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సెకండాఫ్‌లో తమన్నా సరికొత్త గెటప్‌లో కనిపిస్తుంది.సీఐ నాగరాజుగా రాజేంద్రప్రసాద్ తనదైన కామెడీతో నవ్వించాడు. వరుణ్ స్న్నేహితుడు కత్తి శీనుగా సునీల్ మెప్పించాడు. చాలా కాలం తర్వాత ఒకప్పటి కామెడీ సునీల్‌ని తెరపై చూడొచ్చు. ఇక వడ్డీ వ్యాపారీ పాల బాజ్జీగా అలీ, వ్యాపారవేత్త ఆనందప్రసాద్‌గా మురళీ శర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం చాలా బాగుంది. పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు.పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
సంక్రాంతి స్పెషల్: పోస్టర్లు, పాటలతో సందడే సందడి
సంక్రాంతి పండగ సందర్భంగా పండగే పండగ అంటే కనువిందైన పోస్టర్లు, వీనుల విందైన పాటలు, టైటిల్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి... సినిమా ప్రియులకు పండగ తెచ్చాయి. కుటుంబసమేతంగా రామారావు వచ్చాడు. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మార్చి 25న థియేటర్లకి వస్తామని పేర్కొంటూ పోస్టర్ని విడుదల చేసింది చిత్రబృందం. రవితేజ ఫ్యామిలీతో వస్తే... హాట్ హాట్‌గా దూసుకొచ్చారు తమన్నా. వరుణ్ తేజ్‌తో కలసి ‘గని’ చిత్రంలో ఈ బ్యూటీ స్టెప్పులేసిన ప్రత్యేక పాట ‘కొడితే..’ విడుదలైంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించిన ఈ చిత్రం మార్చి 18న విడుదల కానుంది. ఇక పందెం కోళ్లలా బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నట్లు ‘భీమ్లా నాయక్’ నుంచి పవన్ కల్యాణ్, రానా మాస్ లుక్ పోస్టర్ విడుదలైంది. పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానాకు జంటగా సంయుక్తా మీనన్ నటించిన ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కావాల్సింది. అయితే ఫిబ్రవరి 25కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. మరోవైపు రోట్లో ఏదో నూరుతూ చిరునవ్వులు చిందిస్తూ సందడి చేసింది జయమ్మ. సుమ కనకాల టైటిల్ రోల్లో నటిస్తున్న ‘జయమ్మ పంచాయతీ’ టైటిల్ సాంగ్‌ని పండగ సందర్భంగా వినిపించారు. ఈ పాటను దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆవిష్కరించారు. ఎం.ఎం. కీరవాణి స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా శ్రీకృష్ణ పాడారు. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకోవైపు యువహీరో నవీన్ పోలిశెట్టి నటించనున్న తాజా చిత్రానికి ‘అనగనగా ఒక రాజు’ అనే టైటిల్ ఖరారైంది. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ఆరంభం కానుంది. ఈ సినిమా టైటిల్‌ని ప్రకటిస్తూ, ఓ వీడియోను విడుదల చేశారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న మరో చిత్రం ‘స్వాతిముత్యం’ ప్రచార చిత్రం విడుదలైంది. ఈ చిత్రం ద్వారా గణేష్ బెల్లంకొండ హీరోగా పరిచయం అవుతున్నారు. లక్ష్మణ్.కె. కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తున్నారు. త్వరలో పూర్తి కానున్న ఈ చిత్రం వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇంకా కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ‘సమ్మతమే’ పోస్టర్ విడుదలైంది. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చాందినీ చౌదరి హీరోయిన్. అలాగే వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ‘మన్మథలీల’ పోస్టర్ విడుదలైంది. అశోక్ సెల్వన్, సంయుక్తా హెగ్డే, స్మృతీ వెంకట్, రియా సుమన్ హీరో హీరోయిన్లుగా టి.మురుగానందం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పండగ సందర్భంగా ఇంకా పలు చిత్రాల లుక్స్, పాటలు తదితర అప్డేట్స్ వచ్చాయి. -
Tamannaah Bhatia Birthday Special: హ్యాపీ బర్త్‌డే మిల్కీ బ్యూటీ
-
మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ మూవీ ప్రారంభం ఫోటోలు
-
అనసూయ ఎంట్రీ.. షో నిర్వాహకులకి షాకిచ్చిన తమన్నా!
టాలీవుడ్ పరిశ్రమలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన నటన, గ్లామర్‌తో ఆకట్టుకుని ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇటీవల వెబ్ సిరీస్‌లోనూ అడుగుపెట్టి తన హవాని అక్కడ కూడా కొనసాగిస్తోంది ఈ అమ్మడు. తాజాగా టెలివిజన్‌లో ‘మాస్టర్ చెఫ్ తెలుగు’ షోతో ప్రేక్షకుల మందుకు తమన్నా వచ్చింది. అయితే పలు కారణాల వల్ల ఈ షో నుంచి ఆమెను తప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రోగ్రాం విషయంలో తమన్నా కోర్టను ఆశ్రయించి ప్రొడక్షన్ హౌజ్‌కి షాకిచ్చిందట. వివరాల్లోకి వెళితే.. తమన్నా హోస్ట్‌గా టీవీలో ‘మాస్టర్ చెఫ్ తెలుగు’ కార్యక్రమం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ షో రేటింగ్స్ విషయానికి వస్తే.. మొదట్లో బాగానే వచ్చినా, ఇటీవల మాత్రం ఆశించినంతగా రేటింగ్ లేకపోవడంతో తమన్నాను తప్పించి టాప్ యాంకర్ అనసూయను తెరపైకి తీసుకొచ్చింది ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ. అనసూయ ఎంట్రీతో ఈ షోకి మళ్లీ మంచి రేటింగ్ సాధిస్తుందని ప్రొడక్షన్ హౌస్ నిర్వాహకులు ఆశాభావంతో ఉన్నారు. ఇదిలా ఉండగా తనను తొలగించడంపై అసంతృప్తితో ఉన్న మిల్కీ బ్యూటీ.. ఆమెకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రొడక్షన్ హౌజ్‌కు లీగల్ నోటీసులు పంపించింది. ఈ అంశంపై తమన్నా తరపు లాయర్ మాట్లాడుతూ.. మాస్టర్ చెఫ్ కార్యక్రమం కోసం తమన్నా పలు ప్రాజెక్టులు వదులుకొన్నారు. ఈ షోకు సంబంధించిన తొలి సీజన్‌ను పూర్తి చేయడానికి కొన్ని ముఖ్యమైన పనులను కూడా ఆమె రద్దు చేసుకోవాల్సి వచ్చింది. తన క్లయింట్‌తో షో నిర్వాహకులు అన్ ప్రొఫెషనల్‌గా వ్యవహరించారు. అంతేకాకుండా తన క్లయింటతో ప్రొడక్షన్ హౌస్ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కమ్యునికేషన్ కూడా ఆపివేశారని వెల్లడించారు. చదవండి: తమన్నా ప్లేస్‌లో అనసూయ, బ్లాక్ సూట్, హాట్ లుక్స్‌తో అదుర్స్ -
‘మ్యాస్ట్రో’ మూవీ రివ్యూ
టైటిల్ : మ్యాస్ట్రో నటీనటులు :నితిన్, తమన్నా భాటియా, నభా నటేష్, జిషు సేన్ గుప్తా, నరేష్, శ్రీముఖి, అనన్య, హర్షవర్ధన్, రచ్చ రవి, మంగ్లీ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రేష్ట్ మూవీస్ నిర్మాతలు : సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి దర్శకత్వం: మేర్లపాక గాంధీ సంగీతం : మహతి స్వర సాగర్ సినిమాటోగ్రఫీ : వై యువరాజ్ ఎడిటింగ్: ఎస్ఆర్ శేఖర్ విడుదల తేది : సెప్టెంబర్ 17, 2021(డిస్నీ+హాట్‌స్టార్) భీష్మ సూపర్ హిట్ కావడంతో అదే జోష్‌తో వరుస సినిమాలు చేస్తున్నాడు యంగ్ హీరో నితిన్. కాని భీష్మ రేంజ్ హిట్‌ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఆయన ఇటీవల చేసిన చెక్, రంగ్ దే మూవీస్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయాయి. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలని మాస్ట్రో లుక్‌లోకి మారాడు నితిన్. బాలీవుడ్లో వచ్చిన సూపర్ హిట్ అంధాధున్‌కు తెలుగు రీమేక్. ఈ మూవీ శుక్రవారం(సెప్టెంబర్ 17)న ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తొలిసారి నితిన్ అంధుడి పాత్ర పోషించడంతో మ్యాస్ట్రోపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలు ‘మ్యాస్ట్రో’ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. చూపు ఉన్న అంధుడిగా నటిస్తాడు అరుణ్(నితిన్). అతనిలో ఉన్న గొప్ప టాలెండ్ ఏంటంటే పియానో చక్కగా వాయించడం. ఒకసారి తన పియానో పాడవడంతో కొత్తది కొనాలని చూస్తాడు. ఈ క్రమంలో పెడ్రో అనే రెస్టారెంట్లో పియానో అమ్మకానికి పెట్టినట్లు తెలుసుకొని,చూసేందుకు వెళ్తాడు. అక్కడ తన మ్యూజిక్ ప్రతిభ చూపించి అందరి మన్ననలు పొందుతాడు. అరుణ్ టాలెంట్ నచ్చి అతనితో ప్రేమలో పడిపోతుంది రెస్టారెంట్ ఓనర్ కూతురు సోఫీ(నభా నటేశ్). ఆ రెస్టారెంట్‌కు తరచు వచ్చే సినీ హీరో మోహన్ (వీకే నరేష్).. అరుణ్ పియానో సంగీతానికి ఫిదా అవుతాడు. తన భార్య సిమ్రన్ (తమన్నా భాటియా) బర్త్‌డే సందర్భంగా ప్రైవేట్ కన్సర్ట్ను ఏర్పాటు చేయాలని అరుణ్‌ను తన ఇంటికి పిలుస్తాడు. అరుణ్ మోహన్ ఇంటికి వెళ్లేసరికి అతను హత్యకు గురవుతాడు. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? ఈ హత్యకు సిమ్రాన్, సీఐ బాబీ ( జిషు సేన్ గుప్తా)లకు సంబంధం ఏంటి? అరుణ్ అంధుడిగా ఎందుకు నటించాలనుకున్నాడు? మోహన్ హత్యతో అరుణ్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనేది తెలియాలంటే డిస్నీ+హాట్‌స్టార్‌లో సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. నితిన్ తొలిసారి అంధుడిగా నటించిన సినిమా ఇది. బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానా పోషించిన పాత్రను తెలుగులో నితిన్ చేశాడు. ఆయుష్మాన్‌కు సమానంగా అంధుడి పాత్రలో నటించి మెప్పించే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్‌లో అంధుడిగా నవ్వించిన నితిన్.. సెకండాఫ్‌లో భావోద్వేగాలపరంగా చక్కటి హావభావాలు పలికించాడు. అంధుడు అరుణ్ పాత్రకు న్యాయం చేసేందుకు శాయశక్తులా కృషి చేశాడు. ఇక ఈ సినిమాలో నితిన్ తర్వాత బాగా పండిన పాత్ర తమన్నాది. సిమ్రన్ పాత్రలో ఆమె పరకాయ ప్రవేశం చేసింది. హిందీలో టబు పోషించిన పాత్ర అది. విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో తమన్నా ఒదిగిపోయింది. ఎమోషనల్ సన్నివేశాల్లో తనదైన నటన కనబరిచింది. సోఫి పాత్రలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ మెప్పించింది. జిషు సేన్ గుప్త, నభా నటేశ్, శ్రీముఖి, రచ్చ రవి, మంగ్లీ, అనన్య నాగళ్ల, హర్ష వర్దన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎలా ఉందంటే.. హిందీలో వచ్చి, సూపర్ హిట్ అయినా ‘అంధాధున్’ మూవీకి తెలుగు రీమేకే‘మ్యాస్ట్రో’.సాధారణంగా రీమేక్ అనగానే మాతృకతో పోల్చి చూస్తారు. అందులో ఉన్నది.. ఇందులో లేనిది ఏంటని నిశితంగా పరిశీలిస్తారు. ఉన్నది ఉన్నట్లు తీస్తే కాపీ అంటారు. ఏదైనా యాడ్ చేస్తే.. అనవసరంగా యాడ్ చేసి మంచి సినిమాను చెడగొట్టారని చెబుతారు. అందుకే రీమేక్ అనేది దర్శకుడికి కత్తిమీద సాము లాంటిదనే చెప్పాలి. ఈ విషయంలో దర్శకుడు మేర్లపాక గాంధీ విజయవంతం అయ్యాడు. మాతృకలోని ఆత్మను ఏమాత్రం చెడకుండా ‘అంధాదున్’ని తెలుగు ప్రేక్షకులు మ్యాస్ట్రోగా అందించాడు. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే లాంటి దిగ్గజ నటులు సెట్ చేసిన టార్గెట్‌ని వందశాతం అందుకోలేకపోయినా.. తెలుగు నేటివిటీకి అనుగుణంగా సినిమాను తెరకెక్కించాడు. ఫస్టాఫ్‌లో అంధుడిగా నితిన్ చేసే సరదా సీన్స్ ప్రేక్షకులను నవ్విస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సీఐ బాబీ అరుణ్ణి చంపాలనుకోవడం.. దాని నుంచి అరుణ్ తప్పించుకొని గోవాకు వెళ్లేందుకు ప్రయత్నించే సీన్స్ ఆసక్తిని కలిగిస్తాయి. సెకండాఫ్‌లో అరుణ్, సిమ్రన్ మధ్యల వచ్చే కొన్ని సీన్స్ నెమ్మదిగా సాగడం సినిమాకు కాస్త మైనస్. ఇక క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు దర్శకుడు. అంధాదున్ సినిమా చూడకుండా డెరెక్ట్‌గా మాస్ట్రో చూసేవారిని థ్రిల్లింగ్ మూవీ చూశామనే అనుభూతి కలుగుతుంది. మహతి స్వర సాగర్ బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. వై యువరాజ్ సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ముక్కుకు ముక్కెరతో సమంత...ఆకుపచ్చ రంగు డ్రెస్సులో తమన్నా
ఆకుపచ్చ రంగు దుస్తుల్లో దర్శనమిచ్చింది తమన్నా. ఆ రంగు అంటే ఇష్టమని చెప్పుతూ ఫోటోలనే అభిమానులతో పంచుకుంది హాట్ ఫోటోతో కుర్రకారు మతులు పొగొడుతోంది నభా నటేశ్ పాల రోజా కలర్ చోళీ, లెహంగా ధరించి, ముక్కుకు ముక్కెరతో సరికొత్త లుక్ లో దర్శనం ఇచ్చింది అక్కినేని కోడలు సమంత. View this post on Instagram A post shared by S (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) -
బుల్లితెరపై సందడి చేయనున్న తమన్నా!
-
బుల్లితెర ఎంట్రీకి సిద్ధమైన తమన్నా, ఎలాంటి షో అంటే... !
మిల్కీ బ్యూటీ తమన్నా ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఒకపక్క వరుస సినిమాలు చేస్తూనే డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ ఆహాలో ‘లెవన్త్ అవర్’, డిస్నీ హాట్ స్టార్‌లో ‘నవంబర్ స్టోరీ’ అనే వెబ్‌సిరీస్‌ల్లో నటించి డిజిటల్ ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను కూడా పలకరించేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ టీవీ ఛానెల్ కోసం హోస్ట్‌గా మారనుందట. ‘మాస్టర్ చెఫ్’ తరహాలో ఓ షోని ప్లాన్ చేయగా, ఈ షోకి తమన్నా జడ్జ్‌గా ఉంటుందని, ఇప్పటికే సైన్ చేయడం కూడా అయిపోందని వినికిడి. త్వరలోనే దీనికి సబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం తమన్నా తెలుగులో ఎఫ్ 3, సీటీమార్, మ్యాస్ట్రో చిత్రాలతో పాటు గుర్తుందా శీతాకాలం అనే మూవీలో కూడా నటిస్తోంది. చదవండి: NTR 31: ఎన్టీఆర్ సినిమాపై క్రేజీ రూమర్ లాక్డౌన్ టైంలోనూ రెండు చేతులా సంపాదిస్తున్న సుమ.. ఎలాగంటే.. బుల్లితెరపై శివగామిలా అదరగొడుతున్న రాశీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? -
OTT: మేలో అలరించనున్న సినిమాలివే!
కరోనా వల్ల ఈ ఏడాది కూడా థియేటర్లకు సమ్మర్ హాలీడేస్ వచ్చాయి. దీంతో చిన్నపాటి చిత్రాల నుంచి పెద్ద స్థాయి సినిమాలు కూడా రిలీజ్‌ను వాయిదా వేసుకుంటుండగా మరికొన్ని మాత్రం ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు ఓటీటీతో మంచి డీల్ కుదుర్చుకోవడంతో డిజిటల్ ప్లాట్ఫామ్లోనే రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ నెలలో ఏయే సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి? ఇంకా ఏయే చిత్రాలు రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయో ఓసారి చూసేద్దాం.. బట్టల రామస్వామి బయోపిక్కు అల్తాఫ్ హాసన్, శాంతి రావు, సాత్విక, లావణ్యరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బట్టల రామస్వామి బయెపిక్కు. రామ్ నారాయణ్ డైరెక్షన్ చేయగా సెవెన్ హిల్స్ సతీష్ కుమార్, ఐ మ్యాంగో మీడియా రామకృష్ణ వీరపనేని నిర్మాతలుగా వ్యవహరించారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. ఈ సినిమా జీ 5లో మే 14 నుంచి అందుబాటులోకి రానుంది. సినిమా బండి వెరైటీ టైటిల్‌తో తెరకెక్కిన చిత్రం సినిమా బండి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో ప్రవీణ్ కండ్రిగుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సినిమా బండిని నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. మే 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా బండి ప్రసారం కానుంది. డీ కంపెనీ దావూద్ ఇబ్రహీం జీవితకథ ఆధారంగా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం డి-కంపెనీ. అష్వత్ కాంత్, ఇర్రా మోహన్, నైనా గంగూలీ, రుద్రకాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మే 15న ఓటీటీ ప్లాట్‌ఫామ్ స్పార్క్‌లో విడుదల కానుంది. నవంబర్ స్టోరీ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ నవంబర్ స్టోరీ. జీఎం కుమార్, పసుపతి, వివేక్ ప్రసన్న, అరుళ్ దాస్, నందిని తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇంద్ర సుబ్రమణియన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆనంద వికటన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైంది. ఈ చిత్రం మే 20న డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏ1 ఎక్స్‌ప్రెస్ సందీప్ కిషన్ హాకీ ఆటగాడిగా నటించిన చిత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్. లావణ్య త్రిపాఠి కథానాయిక. మురళీ శర్మ, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు. మార్చి 5న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చేసింది. సన్ నెక్స్ట్లో మే 1 నుంచి ప్రసారమవుతోంది. థ్యాంక్ యు బ్రదర్ అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా థ్యాంక్ యు బ్రదర్. ఏప్రిల్ 30న థియేటర్లలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ థియేటర్లు మూత పడటంతో ఓటీటీ వైపు అడుగులు వేసింది. అలా ఈ సినిమా ఆహాలో మే 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఏక్ మినీ కథ.. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కిన చిన్న బడ్జెట్ చిత్రం ఏక్ మినీ కథ. సంతోష్ శోభన్, కావ్య థాపర్, శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ రచయితగా పని చేశాడు. కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను చేజిక్కించుకోవాలని చూస్తోందట. ఇప్పటికే చర్చలు కూడా కొనసాగుతున్నాయట. మంచి డీల్ కుదిరితే థియేటర్లు ఓపెన్ అయ్యేవరకు ఆగకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అరణ్య రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన సినిమా అరణ్య. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ 5 ప్లాట్‌ఫామ్ కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. అంతేగాక అరణ్య మే 14 లేదా ఈ నెలాఖరులో జీ 5లో ప్రసారం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచిచూడాల్సిందే. సల్మాన్ ఖాన్ 'రాధే' జీ 5లో మే 13 నుంచి ప్రసారం కానున్న విషయం తెలిసిందే. నితిన్ ప్రధాన పాత్రలో నటించిన చెక్, రంగ్ దే సినిమాలు కూడా ఇదే నెలలో ఓటీటీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ప్రభాస్ రాధేశ్యామ్ కూడా పే పర్ వ్యూ విధానంలో డిజిటల్ రిలీజ్ చేయడానికి పూనుకుంటున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఇక హీరో ధనుష్ జగమే తంత్రం ఈ నెలలో కాకుండా వచ్చే నెల 18న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. చదవండి: గోవా బ్యూటీ డిజిటల్ ఎంట్రీ.. త్వరలోనే ‘ఇలియానా టాక్ షో’ -
చీరకట్టులో ఇస్మార్ట్ బ్యూటీ..సెల్ఫీ అంటున్న మిల్కీ బ్యూటీ
నాన్న పుట్టిన రోజులు వేడుకలు జరిపిన నాగశౌర్య ముఖానికి మాస్క్ పెట్టుకోవాల్సిన సమయం ఇంకా ఉందంటున్నారు బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ లంగా ఓణిలో అదరగొడుతున్న అందాల యాంకర్ శ్రీముఖి చీర కట్టులో మరింత అందంగా కనిపిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ సెల్ఫీ తీసుకుంటూ కవ్విస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sameera Sherief (@sameerasherief) View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by Naga Shaurya (@actorshaurya) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) -
మిల్కీ బ్యూటీ అందాల విందు.. సెగలు రేపుతున్న మాళవికా
► సముద్రతీరంలో సరదాగా గడుపుతోంది అను ఇమ్మాన్యుయెల్ ► కాలానికి.. ప్రపంచానికి దూరంగా.. అంటూ మాళవిక మోహనన్ ఒక ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది ► పింక్ కలర్ డ్రెస్‌లో ఫోటోకి ఫోజులిచ్చి కుర్రకారుల మతులు పొగొడుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా ► సండే రెస్ట్‌డే అంటూ తన పెట్ డాగ్‌పై తలపెట్టి నిద్రపోతున్న సమంత View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) -
గోపీచంద్ 'సీటీ మార్' మూవీ స్టిల్స్ ఫోటోలు
-
కబడ్డీ బయట ఆడితే వేట : సీటీమార్ టీజర్
సాక్షి,హైదరాబాద్: యాక్షన్ హీరో గోపీచంద్ తాజా చిత్రం ‘సిటీమార్’ టీజర్ వచ్చేసింది. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ సోమవారం రిలీజ్ చేసింది. కబడ్డీ నేపథ్యంలో సంపత్‌నంది దర్శకత్వంలో రానున్న మూవీలో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. ‘మైదానంలో ఆడితే ఆట... బయట ఆడితే వేట’ అంటూ కార్తీ పాత్రలో గోపీచంద్ డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. (లూసిఫర్: మరో ఇంట్రస్టింగ్ అప్డేట్) స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కుతున్న ‘సీటీమార్’ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్ చేసే ఫీమేల్ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుండగా, తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా నటింస్తోంది. సూర్యవంశీ, భూమికా చావ్లా, రెహ్మాన్, రావు రమేష్, తరుణ్ అరోరా, పోసాని కృష్ణ మురళి, రోహిత్ పాథక్, అంకూర్ సింగ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీకి, సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. -
నితిన్ అంధుడిగా కనిపించేది అప్పుడే!
బాలీవుడ్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న చిత్రం 'అంధాధున్'. తెలుగులో నితిన్ హీరోగా ఈ సినిమా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ రీమేక్ బాధ్యతను తన భుజానెత్తుకున్నాడు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జూన్ 11న థియేటర్లలో సందడి చేయనున్నట్లు వెల్లడించారు. నితిన్ అంధుడిగా, సంగీతకారుడిగా కనిపించనున్న ఈ సినిమాలో హీరోయిన్ నభా నటేశ్ అతడితో జోడీ కడుతోంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న టబు పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనుంది. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మిస్తున్నారు. హరి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. JUNE 11th is the Date!! #Nithiin30 @tamannaahspeaks @NabhaNatesh @GandhiMerlapaka @SreshthMovies_ pic.twitter.com/jTGdMRLslA — nithiin (@actor_nithiin) February 19, 2021 అంధుడైన హీరో ఓ హత్యకు ఎలా సాక్షిగా మారతాడనేది ఈ చిత్ర ప్రధాన కథ. బాలీవుడ్లో ఈ సినిమా ఆయుష్మాన్ ఖురానాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. మరి నితిన్‌కు ఈ సినిమా ఎన్ని ఫలాలనిస్తుందో వేచి చూడాలి. ఇప్పటికే అతడు దేశదద్రోహిగా నటించిన 'చెక్' ఫిబ్రవరి 26న విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు 'రంగ్‌దే' మార్చి 26న ప్రేక్షకులను పలకరించనుంది. ఆ తర్వాత రెండు నెలల గ్యాప్ తీసుకుని 'అంధాధున్' రీమేక్‌తో అభిమానులను అలరించేందుకు రానున్నాడు. చదవండి: 15 నిమిషాల కథ విని ఒప్పుకున్నా: నితిన్ ముంబైలో ఇళ్లు కొన్న బుట్టబొమ్మ -
'నైలూ నది'' పాటను రిలీజ్ చేసిన తమన్నా
సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు). అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి.రాజు ధాట్ల తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం హీరోయిన్ తమన్నా ఈ సినిమాలోని 'నైలూ నది' అనే పాటను రిలీజ్ చేశారు. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో వైవా హర్ష, ప్రియదర్శి, దివ్య శ్రీపాద కీలక పాత్రలు పోషించారు. (డియర్ కామ్రేడ్ నా ఫస్ట్ సినిమా అయ్యుండేది) ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 55 సెకన్ల నిడివి గల టీజర్లో సినిమా ఎలా ఉండబోతుందో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కెమెరా మెన్‌గా పని చేసిన గుహన్ మెగా ఫోన్ పట్టుకుని చేసిన మొదటి సినిమా 118. కళ్యాణ్ రాం హీరోగా తెరకెక్కిన ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది.ఈ చిత్రానికి సిమాన్ కే కింగ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా.. డాక్టర్ రవి పీ రాజు దట్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (చిన్నప్పటి మహేంద్ర బాహుబలి ఇప్పుడెలా ఉందో చూడండి..) Team #WWWMovie Thanks @tamannaahspeaks for launching Melodious #NailuNadi Telugu song 💕 ICYMI, ▶️https://t.co/6reYS6uMoi 🎵 @simonkking ✍️ @ramjowrites 🎤 @sidsriram@kvguhan @AdithOfficial @Rshivani_1 @RamantraCreate @DrRaviPRaju @VijayDharan_D @baraju_SuperHit @adityamusic pic.twitter.com/DactvRXdyT — BARaju (@baraju_SuperHit) January 29, 2021 -
తమన్నా పాటకు.. అనుష్క ఫిదా
తమన్నా.. ఈ పేరు వింటేనే ఓ పాలరాతి బొమ్మ కళ్ల ముందు కదలాడుతుంది. అంతటి అందం తమ్మన్నా సొంతం. తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంటూ.. టాలీవుడ్, బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దుసుకెళ్తోంది ఈ మిల్కీ బ్యూటీ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. తెలుగులో వెంకటేశ్ సరసన ఎఫ్3, గోపిచంద్‌తో సిటీమార్, నితిన్‌తో ‘అంధా ధున్’ తెలుగు రీమేక్, సత్యదేవ్‌తో ‘గుర్తుందా శీతాకాలం’సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఇన్ని రోజులు తన నటన, డాన్స్‌తో అందరిని ఆకట్టుకున్న ఈ భామ.. తాజాగా తనలోని మరో టాలెంట్‌ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. తనలో దాగిఉన్న సింగర్‌ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) హృతిక్ రోషన్, ప్రీతి జింటా నటించిన మిషన్ కశ్మీర్ చిత్రంలోని సోచే కే జీలోన్ పాటను పాడి, ఆ వీడియని సోషల్ మీడియాలో షేర్ చేసింది. బెంగళూరులో ఉన్న వాతావరణం తనకు ఇలా ఉందంటూ తమన్నా.. ఆ పాటను ఆలపించింది. ప్రస్తుతం తమన్నా సాంగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమన్నా గాత్రానికి నెటిజన్లు వందకు వంద మార్కులు వేస్తున్నారు. హీరోయిన్ అనుష్క శెట్టి కూడా మిల్కీబ్యూటీ సాంగ్‌కి ఫిదా అయింది. లవ్ సింబల్‌తో పాటు, హగ్ ఎమోజీని కామెంట్‌గా పెట్టింది. కాగా, తమన్నా తెలుగు సినిమాలతో పాటు హిందీలో భోలే చూడియాన్ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. ఇక వీటితో పాటు తెలుగులో తమన్నా.. క్వీన్ రీమేక్ దటీజ్ మహాలక్ష్మిలో నటించింది. ఈ మూవీ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.