

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది.

సౌత్ సినిమాల్లో కేవలం ఐటమ్ సాంగ్స్‌లో మాత్రమే కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సికందర్ కా ముఖద్దర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో సందడి చేయనుంది.

తాజాగా ఈ మూవీ స్టిల్స్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది ముద్దుగుమ్మ.

మిల్కీ బ్యూటీ బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

అయితే పెళ్లి ఎప్పుడనేది మాత్రం వెల్లడించలేదు.

ఇద్దరు కూడా బాలీవుడ్ సినిమాలతో కెరీర్‌లో బిజీగా ఉన్నారు.

వచ్చే ఏడాదిలోనైనా పెళ్లి పీటలెక్కుతారేమో వేచి చూడాల్సిందే.