Milky Beauty Tamanna
-
ముద్దబంతిలా మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ.. (ఫొటోలు)
-
మిల్కీ బ్యూటీ కాదు అంతకు మించి.. తమన్నా గ్లామర్‌కు కుర్రకారు ఫిదా (ఫోటోలు)
-
సినిమాలో కథ అక్కర్లే.. మిల్కి బ్యూటీ ఉంటే చాలు..
-
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా మోడ్రన్ డ్రెస్‌లలో అదరహో (ఫోటోలు)
-
Tamannaah Bhatia Birthday Special: హ్యాపీ బర్త్‌డే మిల్కీ బ్యూటీ
-
గుర్రపుస్వారీలో మిల్కీ బ్యూటీ
గుర్రపు స్వారీ, కత్తిసాములు చేయడానికి కథానాయకులే రిస్క్ తీసుకుంటారనేవారు. అది ఇంతకు ముందు. ఇప్పుడు కథానాయికలు రిస్క్‌కు రెడీ అంటున్నారు. నటి అనుష్క రుద్రమదేవి చిత్రం కోసం గుర్రపుస్వారి, కత్తిసాము వంటి విద్యల్లో శిక్షణ పొంది నటించారు. దీంతో ఆ చిత్రంలో ఆ సన్నివేశాలు అబ్బుర పరచాయి. ఇప్పుడు మిల్కీబ్యూటీ తమన్నా అలాంటి సాహసాలకు సిద్ధమవుతున్నారు. బాహుబలి చిత్రంలో పోరాట యోధురాలిగా,ప్రభాస్ ప్రియురాలిగా అద్భుతమైన నటనను ప్రదర్శించి ఆ చిత్ర విజయంలో పెద్ద క్రెడిట్ కొట్టేసిన తమన్నా తాజాగా బాహుబలి-2లోనూ అంతగా పేరు తెచ్చుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారట. బాహుబలికి సీక్వెల్లో తమన్నాకు శత్రువులపై కత్తి దూసే పోరు సన్నివేశాలు చోటు చేసుకుంటాయట. ఆ సన్నివేశాలు సహజంగా ఉండడం కోసం అమ్మడు గుర్రపుస్వారీలో శిక్షణ పొందుతున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న స్టంట్ కళాకారుడు జిత్తువర్మ వద్ద గుర్రపు స్వారీలో శిక్షణ పొందుతున్నారట. దీని గురించి తమన్నా తెలుపుతూ జూలైనుంచి బాహుబలి-2 చిత్రం కోసం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరగనుందన్నారు. అందులో తాను గుర్రంపై వేగంగా స్వారీ చేస్తూ పోరాడే దృశ్యాలు చోటుకున్నాయన్నారు. ఆ సన్నివేశాలు యథార్థంగా ఉండాలన్న భావనతో గుర్రపుస్వారీలో శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు.అంతే కాదు కత్తిసాము పోరాటాల కోసం హాలీవుడ్ స్టంట్ శిక్షకుడు లీ రానున్నారని ఆయన నేతృత్వంలో ఆయన అసిస్టెంట్స్ నుంచి కత్తిసాములో శిక్షణ పొందనున్నట్లు చెప్పారు. బాహుబలి-2 చిత్ర పోరాట సన్నివేశాల్లో డమ్మీ కత్తులను ఉపయోగించినా సహజత్వంగా ఉండాలని బరువైన కత్తులతోనే శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. మొత్తం మీద బాహుబలి-2లో మిక్కీబ్యూటీ అదిరిపోయే వార్ సన్నివేశాలను చూడవచ్చునన్నమాట. -
పుకార్లు పట్టించుకోను!
‘బాహుబలి’ తెచ్చిన కొత్త ఊపుతో మిల్కీబ్యూటీ తమన్నా ఇప్పుడు ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఏడాది రానున్న సినిమాలపై బోలెడంత ఆశాభావంతో కనిపిస్తున్నారు. నాగార్జున కీలకపాత్ర ధరిస్తుంటే, కార్తీ సరసన తమన్నా నటిస్తున్న ‘ఊపిరి’ ఈ వేసవికే రానుంది. ‘‘ ‘ఊపిరి’లో నాకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. డబ్బింగ్ చెప్పడం బోలెడంత పెద్ద పని. ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నా’’ అని తమన్నా అన్నారు. ఒకప్పుడు కార్తీతో తమన్నాను జత కట్టి, పుకార్లు వచ్చాయి. మళ్ళీ కార్తీతో జతకట్టడం గురించి అడిగితే, ‘‘పనికిమాలిన పుకార్లు పట్టించుకోను’’ అంటూ, కార్తీతో నటించడం సరదాగా ఉందన్నారు. పది నిమిషాల్లో ఫిక్స్! 2005లో ‘శ్రీ’ సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన తమన్నా సరిగ్గా పదేళ్ళ కెరీర్ పూర్తయిన వేళ ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ త్రిభాషా చిత్రంలో ప్రభుదేవా పక్కన నటిస్తున్నారు. ‘‘డ్యాన్స్‌లో నేను ఎంతోకాలంగా ఆరాధించే ప్రభుదేవా పక్కన నటించడం, డ్యాన్స్ చేయనుండడం ఉద్విగ్నంగా ఉంది. దర్శకుడు ఎల్. విజయ్ (నటి అమలాపాల్ భర్త) ఈ చిత్రకథ చెప్పడం మొదలుపెట్టిన 10 నిమిషాల కల్లా ఈ సినిమా తప్పకుండా చేయాలని ఫిక్స్ అయిపోయా’’ అని తమన్నా వివరించారు. ఇటీవలే ముంబయ్‌లో షూటింగ్ మొదలైన ఈ సినిమా అందరూ అనుకుంటున్నట్లు ‘హార్రర్’ కాదనీ, ఒక్క క్షణం కూడా నిస్సత్తువగా అనిపించని ‘ఫన్ థ్రిల్లర్’ అనీ ఈ సుందరీమణి చెప్పుకొచ్చారు. ‘గ్లోబల్ యాక్టర్’ అనిపించుకోవాలని... ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ చిత్రసీమల్లో పనిచేసిన తమన్నా ‘‘ఇవాళ ప్రపంచమే కుగ్రామమైపోయిన వేళ గిరి గీసుకొని ఉండదలుచుకోలేదు. భాష, ప్రాంతం, వయస్సుకు కట్టుబడని గ్లోబల్ యాక్టర్ అనిపించుకోవాలనుంది’’ అని మనసులో మాట బయట పెట్టారు. ‘బాహుబలి’కి ముందు కెరీర్లో కొద్దిగా జోరు తగ్గిన ఈ పంజాబీ అమ్మాయి ‘‘నేను నటించిన సినిమాలు ఆడినా, ఆడకపోయినా, భవిష్యత్తు మీద దృష్టి పెట్టి ముందుకు సాగడం మీదే నా ఆలోచన’’ అని అన్నారు. వైఫల్యాలు వచ్చినా నిరాశతో కుంగిపోకుండా, తదుపరి పని మీద దృష్టి పెట్టాలన్న అమ్మడి సూత్రం నిత్యజీవితంలోనూ అందరికీ పనికొచ్చేదే! -
జీవా సరసన మిల్కీబ్యూటీ
మిల్కీబ్యూటీ తమన్నాకు కోలీవుడ్‌లో మళ్లీ అవకాశాలు పెరుగుతున్నాయి. ఆ మధ్య సూర్యతో రొమాన్స్ చేసిన అయన్ చిత్రం, ఆ తరువాత అజిత్‌కు జంటగా నటించిన వీరం చిత్రం తమన్నాకు మంచి విజయాలను అందించాయి. అయినా ఇక్కడ అవకాశాలు దోబూచులాడాయి. అయితే బాహుబలి చిత్రం తరువాత తమన్నాకు తెలుగులో కంటే తమిళంలోనే దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని చెప్పవచ్చు. ఇప్పటికే విజయ్‌సేతుపతికి జంటగా నటించే అవకాశం వరించగా తాజాగా నటుడు జీవాలో జతకట్టే అవకాశం తలుపు తట్టింది. జీవా ఇప్పటికే వరుసగా తిరునాళ్ చిత్రంలో నయనతారతో, పోకిరిరాజా చిత్రంలో హన్సికతో,కవలై వేండామ్ చిత్రంలో కాజల్‌అగర్వాల్‌తో రొమాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు తమన్నాతో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత మైఖెల్ రాయప్పన్ తన గ్లోబల్ ఇన్ఫోటైన్మెంట్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయన జయంరవి, లక్ష్మీమీనన్ జంటగా నిర్మించిన మిరుదన్ చిత్రం ఈ నెల 19న తెరపైకి రానుంది. జీవా హీరోగా నటించనున్న చిత్రం ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. దర్శకుడు సెల్వరాఘవన్ శిష్యుడు కాళీశ్వరన్ ఈ చిత్రం ద్వారా మెగాఫోన్ పట్టనున్నారు. ఇందులో హీరోయిన్గా తమన్నాను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. తమన్నా నటించిన ద్విభాషా చిత్రం తోళా చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. -
తమన్న సౌందర్య రహస్యం ఇదే!
అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అన్నారో కవి. అంతటి మధురానందం ఉన్న అందం కోసం అందరూ ఆశ పడతారు.మగువలు మరీనూ. అయితే అందాన్ని కాపాడుకోవడం ఎలా? అన్నది చాలా మందిలో కలిగే ప్రశ్న. అలాంటి వారికి మిల్కీ బ్యూటీ తమన్న సౌందర్య రహస్యం సమాధానం కావచ్చు. అందానికి అందం తమన్న. నవ నవలాడే ఆమె మేను అందాల సీక్రెట్ తమన్న మాటల్లోనే చూద్దాం. నా దినచర్య చాలా నిబద్ధతతో కూడి ఉంటుంది. ఆహార నియమాలు పాటిస్తాను. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్ శాండ్విచ్,ఆమ్లేట్‌ను తీసుకుంటాను. మధ్యాహ్నం ఒక్క చపాతి, రైస్,చికెన్ ఫ్రై తింటాను. నేను ముంబైలో పుట్టి పెరిగినా చపాతీ అంటే అంతగా ఇష్టం ఉండదు. అందుకే మధ్యాహ్నం వరి అన్నమే తింటాను. మధ్యలో గంటకోసారి కాయగూరల సూప్ తీసుకుంటాను. ఇక ఆయిల్ ఫుడ్‌ను తక్కువ మోతాదులో తింటుంటాను. రోజుకు మూడు పూటలా ఫుల్‌గా భోజనం లాగించేయకుండా కొంచెం కొంచెం ఆరు సార్లు తింటాను. ఇక సౌందర్య టిప్స్ గురించి చెప్పాలంటే షూటింగ్ సమయంలో లైట్స్ ముందు, ఎండల్లో నిలబడటం వల్ల ముఖం నల్లబడుతుంది. అందువల్ల రోజూ శెనగపిండిలో పెరుగు కలిపి ఆ గుజ్జును ముఖానికి పట్టించి కొంత సేపు తరువాత చల్లని నీళ్లతో కడిగితే ముఖచాయ పెరుగుతుంది. రాత్రి వేళల్లో పడుకునే ముందు తలకు కొబ్బరి నూనె పట్టించి మసాజ్ చేసుకుంటే రక్తప్రసరణ జరిగి జుత్తు రాలకుండా ఉంటుంది.చల్లని నీళ్లతో స్నానం చేయడం మంచిది. అన్నిటికంటే ప్రశాంతమైన నిద్ర చాలా మేలు చేస్తుంది. సమయం దొరికినప్పుడల్లా మంచి కవితలు చదువుతాను. టెన్షన్‌గా ఉంటే మంచి సినిమా పాటలు వింటాను.ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటాను.మంచినీళ్లు, పళ్ల రసాలు అధికంగా తీసుకుంటాను. షూటింగ్ లేకుంటే ముఖానికి మేకప్ వేసుకోను. అదే విధంగా షూటింగ్‌ను రాత్రి ఎంత ఆలస్యంగా ఇంటికి వచ్చినా మేకప్ కడిగే పడుకుంటాను.చదువుకునే రోజుల్లో ఎక్కువగా చుడీదారులే ధరించేదాన్ని. నటిని అయిన తరువాత రకరకాల నా దుస్తులను చూసి స్నేహితురాలు ఆశ్చర్యపోతుంటారు. బయట కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు చీరలు ధరించడానికే ఇష్టపడతాను. ఇంట్లో ఉంటే నా ఫేవరేట్ డ్రస్ టీషర్టు, జీన్స్ పాంటు. శారీరక కసరత్తులు చాలా అవసరం. నేను నిత్యం ఎక్సర్సైజులు చేస్తాను. స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. చివరిగా యోగా చేస్తాను. ఇవీ నేను పాటించే బ్యూటీ టిప్స్. -
చూడగానే హృదయం బరువెక్కి పోతుంది!
సొంత ఊరు అనేది ఓ అందమైన జ్ఞాపకం. జీవనం ఎక్కడ సాగుతున్నా... జీవితాన్నిచ్చిన ఊరుని మాత్రం ఎవరూ మరచిపో(లే)రు. ఉదాహరణకు మిల్కీబ్యూటీ తమన్నానే తీసుకోండి. తాను పుట్టి, పెరిగిన ముంబయ్ మహానగరాన్ని ఆమె ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉంటారు. ఖాళీ దొరికితే చాలు... ఓ పక్షిలా మారిపోయి ముంబాయిలో వాలిపోతుంటారు తమన్నా. ముంబయ్ అంటే తనకెంత అభిమానమో... ఇటీవల సామాజిక మాధ్యమం ద్వారా చాలా అందంగా తెలియజేశారామె ‘‘ఎప్పుడూ షూటింగుల పనిమీద గాల్లోనే ప్రయాణిస్తుంటాను. ప్రపంచ దేశాలన్నింటినీ తిరుగుతుంటాను. ఒక్కోసారి విదేశాల్లో షూటింగులు ముగించుకొని షూటింగ్ నిమిత్తం డెరైక్ట్‌గా చెన్నయ్కే వెళ్లిపోవాల్సొస్తుంది. అలాంటప్పుడు కొన్ని విమా నాలు ముంబయ్ మీదుగానే వెళ్తుంటాయి. ఒక్కోసారి ముంబయ్‌లో ల్యాండ్ అవుతుంటాయి కూడా. అప్పుడు చూడాలి నా పరిస్థితి. విండో లోంచి ముంబయ్‌ని చూస్తుంటే.. హృదయం బరువెక్కిపోతుంటుంది. దిగి ఇంటికెళ్లిపోదాం, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుంది. కానీ... ఏం చేస్తాం? బాధ్యతలు. రాత్రి వేళల్లో విమాన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకాశం నుంచి ముంబయ్ అందాలను చూస్తుంటే... ‘ఇంతటి గొప్ప మహానగరం నాదేనా!’ అని నాకు తెలీకుండానే ఉద్వేగానికి గురవుతుంటాను’’ అని పేర్కొన్నారు తమన్నా.