గుర్రపుస్వారీలో మిల్కీ బ్యూటీ | Tamannah Riding Horse at Baahubali - 2 Movie Sets | Sakshi
Sakshi News home page

గుర్రపుస్వారీలో మిల్కీ బ్యూటీ

Published Fri, Jun 10 2016 1:24 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

గుర్రపుస్వారీలో మిల్కీ బ్యూటీ - Sakshi

గుర్రపుస్వారీలో మిల్కీ బ్యూటీ

 గుర్రపు స్వారీ, కత్తిసాములు చేయడానికి కథానాయకులే రిస్క్ తీసుకుంటారనేవారు. అది ఇంతకు ముందు. ఇప్పుడు కథానాయికలు రిస్క్‌కు రెడీ అంటున్నారు. నటి అనుష్క రుద్రమదేవి చిత్రం కోసం గుర్రపుస్వారి, కత్తిసాము వంటి విద్యల్లో శిక్షణ పొంది నటించారు. దీంతో ఆ చిత్రంలో ఆ సన్నివేశాలు అబ్బుర పరచాయి. ఇప్పుడు మిల్కీబ్యూటీ తమన్నా అలాంటి సాహసాలకు సిద్ధమవుతున్నారు.
 
  బాహుబలి చిత్రంలో పోరాట యోధురాలిగా,ప్రభాస్ ప్రియురాలిగా అద్భుతమైన నటనను ప్రదర్శించి ఆ చిత్ర విజయంలో పెద్ద క్రెడిట్ కొట్టేసిన తమన్నా తాజాగా బాహుబలి-2లోనూ అంతగా పేరు తెచ్చుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారట. బాహుబలికి సీక్వెల్‌లో తమన్నాకు శత్రువులపై కత్తి దూసే పోరు సన్నివేశాలు చోటు చేసుకుంటాయట.
 
 ఆ సన్నివేశాలు సహజంగా ఉండడం కోసం అమ్మడు గుర్రపుస్వారీలో శిక్షణ పొందుతున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న స్టంట్ కళాకారుడు జిత్తువర్మ వద్ద గుర్రపు స్వారీలో శిక్షణ పొందుతున్నారట. దీని గురించి తమన్నా తెలుపుతూ జూలైనుంచి బాహుబలి-2 చిత్రం కోసం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరగనుందన్నారు. అందులో తాను గుర్రంపై వేగంగా స్వారీ చేస్తూ పోరాడే దృశ్యాలు చోటుకున్నాయన్నారు.
 
 ఆ సన్నివేశాలు యథార్థంగా ఉండాలన్న భావనతో గుర్రపుస్వారీలో శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు.అంతే కాదు కత్తిసాము పోరాటాల కోసం హాలీవుడ్ స్టంట్ శిక్షకుడు లీ రానున్నారని ఆయన నేతృత్వంలో ఆయన అసిస్టెంట్స్ నుంచి కత్తిసాములో శిక్షణ పొందనున్నట్లు చెప్పారు. బాహుబలి-2 చిత్ర పోరాట సన్నివేశాల్లో డమ్మీ కత్తులను ఉపయోగించినా సహజత్వంగా ఉండాలని బరువైన కత్తులతోనే శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. మొత్తం మీద బాహుబలి-2లో మిక్కీబ్యూటీ అదిరిపోయే వార్ సన్నివేశాలను చూడవచ్చునన్నమాట.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement