Anushka
-
డిజిటల్ దివా ఆఫ్ ది ఇయర్: ఎవరీ సిండ్రిల్లా
-
అనుష్క.. నీ ఇంటిపేరును అలాగే ఉంచు: విరుష్క జోడీకి నాడు రోహిత్ శర్మ విషెస్(ఫొటోలు)
-
కోహ్లి-అనుష్క తాగే నీరు ఎక్కడ నుంచి దిగుమతి అవుతుందో తెలుసా..!
విరాట్ కోహ్లి-అనుష్క జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందమైన సెలబ్రిటీ జంటగా పేరుగాంచిన ఈ ఇద్దరు ఏ వేడుకకైన జంటగానే హాజరవ్వుతారు. ఫ్యాషన్ పరంగా కూడా ఇద్దరూ స్టైలిష్ ఐకాన్లుగా ట్రెండ్‌కి తగ్గట్టు ఉంటారు. అలాగే ఇద్దరు కూడా ఫిట్నెస్ విషయంలో చాలా కేర్‌గా ఉంటారు. వ్యాయామ సెషన్ నుంచి నిద్ర వరకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడంలో ఈ జంట చాలా ప్రత్యేకం. మాములుగా ఏజ్‌ని బట్టి, పరిస్థితుల రీత్యా డైట్‌ని మారుస్తు కాస్త హెల్తీగా మార్పులు చేసకోవడం సహజం. కానీ వీళ్లు ఏకంగా తాగే నీళ్ల విషయంలో కూడా మార్పులు చేశారు. అదికూడా వేరే దేశం నుంచి దిగుమతి చేసుకున్న నీళ్లను తాగుతారట. వీళ్లు ఎవియన్ అనే సరస్సు నుంచి వచ్చే నేచురల్ స్ప్రింగ్ వాటర్ (భూమి నుంచి సహజసిద్ధంగా వచ్చేది) తాగుతారట. అంతేగాదు నివేదికల ప్రకారం ఎవియన్-లెస్-బెయిన్స్ సరస్సులోని నీరు ఎటువంటి రసాయనాలతో కలుషితం కాలేదని వెల్లడయ్యింది. ముఖ్యంగా ఈ వాటర్ ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతుందట. ఎవియన్-లెస్-బెయిన్స్ జెనీవా సరస్సు దక్షిణ భాగంలో ఉంటుంది. ఇది పశ్చిమ ఐరోపాలోని అతి పెద్ద సరస్సులలో ఒకటి. దీన్ని స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లు పంచుకుంటున్నాయి. అంతేగాదు ఒక లీటరు ఎవియన్ బాటిల్ ధర దాదాపు రూ. 600ల దాక ఉంటుంది. అంటే ప్రతిరోజు రెండు లీటర్ల నీటిని తీసుకుంటే రూ. 1200 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో ఒక లీటర్ ఎవియాన్ బాటిళ్లు డజను వచ్చేటప్పటికీ ఏకంగా రూ. 4200/ పలుకుతుంది.(చదవండి: వర్కౌట్ సెషన్లో రకుల్‌కి వెన్ను గాయం..అలా జరగకూడదంటే..!) -
'అమ్మ చేతి వంటే కంఫర్ట్ ఫుడ్'..!
చాలామంది ఇంటి భోజనం కంటే పొరిగింటి పుల్లకూరే రుచిగా ఉందంటూ లొట్టలేసుకుని మరి తింటుంటారు. ఎంతలా వండినా ఏవోవే వంకలతో అమ్మను బాధపెట్టే పిల్లలు ఎక్కువనే చెప్పొచ్చు. మన ఆరోగ్యం కోసమని వండినా..అమ్మ బాధ అర్థం చేసుకోం. ఎప్పుడైనా తినేందుకు ఏమి దొరకనప్పుడూ,..తిన్నవా అని అడిగేనాథుడు లేనప్పుడు కచ్చితం ఇంటి భోజనం, అమ్మచేతి వంట తప్పక గుర్తొస్తుంది ఎవరికైనా.. కదూ..!. ఇప్పుడిదంతా ఎందుకంటే ఎంత పెద్ద నాయకుడైనా, సెలబ్రిటీలైనా ఓ అమ్మకు పిల్లలమే..!. దిగ్గిజ క్రికెటర్ విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్ నటి అనుష్కా తనకు నచ్చిన ఫుడ్ గురించి చెబతుంటే ఇదంతా స్ఫురిస్తుంది. ఆమె మాటలు వింటే కచ్చితంగా అమ్మ చేతి వంట అమృతాని కన్నా మిన్నా అని ఒప్పుకోక తప్పదు. ఇంతకీ ఆమె ఏమందంటే..నటి అనుష్క శర్మ 2024లో కొడుకు అకాయ్ కోహ్లీకి జన్మనిచ్చిన తర్వాత అక్కడ కొన్ని నెలలు గడిపి ఇటీవలే ముంబైకి తిరిగొచ్చింది. ఆమె ఓ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె తన అభిమానులు, మీడియాతో మళ్లీ కనెక్ట్ అవ్వడం గురించి మాట్లాడుతూ తను సంబంధించిన ఆసక్తికకర విషయాలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. మాతృత్వం, తన కాలేజ్ జ్ఞాపకాల గురించి మాట్లాడింది. ఆ టైంలో తన అమ్మ చేసే ఫుడ్ అయినా ఇష్టంగా తినేదాన్ని అని చెప్పుకొచ్చింది. తాను ఇంటి ఫుడ్‌కి పెద్ద అభిమానిని అని తెలిపింది. మనసు బాగోలేనప్పుడూ అమ్మ చేతి వంటే తనకూ మంచి బూస్టప్ అని అంటోంది. అందుకే తానెప్పుడూ అమ్మ చేతి ఫుడ్‌నే కంఫర్ట్ ఫుడ్‌గా భావిస్తానని చెప్పింది. బాగా సంతోషంగా లేదా గ్రేట్‌గా అనపించినప్పుడూ వెంటే అమ్మ చేతి భోజనం తినాల్సిందేనని అంటోంది. అలాగే కత్రినా విక్కీ కౌశల్ తమను డిన్నర్‌కి ఆహ్వానించారని..అయితే తాము ఆరు గంటల కల్లా తిని 9.30 గంటలకే పడుకుంటామని అందువల్ల 7-7.30 కల్లా తిందామని చెప్పినట్లు కూడా చెప్పుకొచ్చింది. అలాగే అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసుకుంది. సక్రమమైన జీవనశైలితో కెరీర్‌ను అందంగా మలుచుకోవచ్చు అనడానికి విరాట్-అనుష్కాలే గొప్ప ఉదాహరణ కదూ..!(చదవండి: బ్రూనైలో మోదీ లంచ్ మెనూ ఇదే..!) -
ఈ చిన్నారి ఇప్పుడు గ్లోబల్ స్టార్.. ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
Anushka Sen: బాల నటిగా.. మోడల్‌గా.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా..
అనుష్కా సేన్.. టీవీ.. సినిమా.. ఓటీటీ స్క్రీన్స్‌కి న్యూ ఫేస్ కాదు.. గ్లామర్ ఫీల్డ్కి న్యూ నేమ్ కాదు. ఆ ఫేమ్ కూడా ఆమెకు కొత్త కాదు. బాల నటిగా.. మోడల్‌గా.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా చిన్న వయసులోనే ఎంతో ఘనతను సాధించేసింది.అనుష్కా పుట్టింది రాంచీ (జార్ఖండ్)లో. పెరిగింది ముంబైలో. నాన్న.. అనిర్వాణ్ సేన్, బయోమెడికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్. అమ్మ.. రాజ్రూపా సేన్, గృహిణి. కూతురి ఉన్నతి వెనుకున్నది ఆ ఇద్దరే! అనుష్కా ప్రస్తుతం.. సినిమాటోగ్రఫీలో డిగ్రీ చదువుతోంది.చైల్డ్ ఆర్టిస్ట్‌గా జీటీవీ ‘యహా మై ఘర్ ఘర్ ఖేలీ’ అనే సీరియల్‌తో పరిచయం అయింది. ‘దేవోంకా దేవ్ మహాదేవ్’లో బాల పార్వతి, ‘బాల్ వీర్’లో మెహెర్ పాత్రతో పాపులర్ అయింది. తర్వాత క్రికెటర్ ధోనీతో కలసి చేసిన ఒక కమర్షియల్ యాడ్‌తో మరింత ఫేమస్ అయింది. అంతేకాదు ఆ యాడ్‌తో ధోనీకి ఆమెకూ మధ్య చిక్కీ అండ్ చాచూ (చిక్కీ అండ్ బాబాయ్)గా అనుబంధమూ బలపడింది.చైల్డ్ ఆర్టిస్ట్‌గానే అనుష్కా ‘క్రేజీ కుక్కడ్ ఫ్యామిలీ’తో బాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. దాని తర్వాత కొంత గ్యాప్ తీసుకుని చదువు మీద శ్రద్ధ పెట్టింది. 2018లో ‘ఇంటర్నెట్ వాలా లవ్’తో మళ్లీ బుల్లితెర మీద కనిపించసాగింది. యంగ్ ఆర్టిస్ట్‌గా అనుష్కాకు కీర్తి సంపాదించిపెట్టిన సీరియల్ ‘ఝాన్సీ కీ రాణీ’. అందులో ఆమెది టైటిల్ రోల్! ‘లిహాఫ్ .. ద క్విల్ట్’ అనే సినిమాలో అనుష్కా సేన్ యుక్తవయసు ఇస్మత్ చుగ్తాయ్గా నటించింది. అది ఆమెకు మంచి నటిగా గుర్తింపునిచ్చింది.ఓ వైపు సీరియళ్లు, సినిమాలు చేస్తూనే ఇంకో వైపు వీడియో ఆల్బమ్స్‌లోనూ తన అభినయ కళను చాటసాగింది. ఇటు ఓటీటీ అవకాశాలూ వరుసకట్టాయి. అలా ‘క్రాష్’, ‘స్వాంగ్’ సిరీస్‌లలో నటించింది. తాజాగా ‘దిల్ దోస్తీ డైలమా’లోనూ ప్రధాన భూమిక పోషించింది. అందులోని ఆమె నటన అభిమానులవే కాదు విమర్శకుల ప్రశంసలూ అందుకుంటోంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమ్ అవుతోంది.అనుష్కా సినిమాలు, సీరియళ్లు, సిరీస్‌లకే కాదు సోషల్ మీడియా పోస్ట్‌లకూ వీర ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లక్షల్లో సబ్స్క్రైబర్స్, కోట్లలో ఫాలోవర్స్‌తో చిన్నవయసులోనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారింది. ఈ పాపులారిటే ఆమెకు కొరియన్ సినిమా చాన్స్‌నూ తెచ్చిపెట్టింది. అలా అనుష్కా ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయింది.కొరియన్ డ్రామాస్ అంటే కళ్లింత చేసుకుంటా. అలాంటి నాకు కొరియన్ మూవీలో చాన్స్ వచ్చిందని తెలియగానే క్లౌడ్ 9లో తేలిపోయా! ఇదంతా నా అభిమానుల బ్లెస్సింగ్స్ వల్లే పాజిబుల్ అయిందని నమ్ముతా! ఫ్యాన్సే నా సైన్యం! సోషల్ మీడియాలో వాళ్లతో ఇంటరాక్ట్ అయినప్పుడల్లా పాజిటివ్ ఎనర్జీతో చార్జ్ అవుతాను. కాన్ఫిడెంట్‌గా ఫీలవుతాను! – అనుష్కా సేన్ -
Anushka Jag: హ్యాపీ హ్యాపీగా.. హాయి హాయిగా..
‘రీబర్త్’, ‘టాబూ’ ‘హరికేన్’లాంటి పాటలతో ఆకట్టుకున్న ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఆర్టిస్ట్ అనుష్క జగ్ లేటెస్ట్ సింగిల్ ‘ఖుషీ ఖుషీ’ వైబ్రెంట్ యానిమేటెడ్ వీడియోతో విడుదల అయింది. తన యూనిక్ వాయిస్‌తో శ్రోతలను ఆకట్టుకుంటున్న అనుష్క తాజాగా ‘ఖుషీ ఖుషీ’తో స్వరసందడి చేస్తోంది. ‘ఖుషీ ఖుషీ అనేది స్పిరిచ్యువల్ పాప్’ అంటుంది అనుష్క.కాలేజీ రోజుల నుంచి అనుష్కకు ఫిలాసఫీ అంటే ఇష్టం. తాజా పాటలో ఫిలాసఫీ కనిపిస్తుంది. అయితే భారంగా, సంక్లిష్టంగా కాకుండా యూత్‌ఫుల్ స్టైల్లో లిరిక్స్ ఉంటాయి. టైటిల్ హిందీలో ఉన్నప్పటికీ లిరిక్స్ మాత్రం ఇంగ్లీష్‌లో ఉంటాయి.‘హ్యాపీ ఈజ్ ఏ ఫీలింగ్ ఐ హ్యావ్ గాట్ హ్యాపీ ఈజ్ ఏ స్విచ్ ఇన్ మై హార్ట్’లాంటి లిరిక్స్‌తో ‘ఖుషీ ఖుషీ’ దూసుకుపోతోంది. తనను తాను ‘మ్యూజికల్ టూరిస్ట్’గా చెప్పుకునే అనుష్క ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ్రపాంతాలలో కచేరీలు ఇచ్చింది. జెన్నిఫర్ ఓనీల్, జాన్ జోన్స్, డడ్డీ బ్రౌన్, డానీ పాపిట్, కైల్ కెల్పోలాంటి సంగీతకారులతో కలిసి పనిచేసింది. ప్రతి కొత్త ్రపాజెక్ట్లో తనదైన ప్రతిభ చూపుతుంది అనుష్క. ఇండియన్ మెలోడీలు, రిథమ్లతో ప్రవాసభారతీయులనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకట్టుకుంది అనుష్క జగ్. -
స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. మళ్లీ ఆమెనా?
లియో కాంబో మళ్లీ రిపీట్ కాబోతోందా? అంటే దీనికి కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమధానమే వినిపిస్తోంది. నటుడు విజయ్, నటి త్రిష సూపర్ హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఈ జంట ఇప్పుటికే ఆది, గిల్లీ, తిరుపాచ్చి, కురువి, లియోతో పాటు దాదాపు ఐదు చిత్రాల్లో జంటగా నటించారు. ఇందులో గిల్లీ, తిరుపాచ్చి, లియో చిత్రాలు మంచి విజయా న్ని సాధించాయి. కాగా తాజాగా మరోసారి ముచ్చటగా రెండో హ్యాట్రిక్‌కు సిద్ధం అవుతున్నారన్నమాట. కాగా.. విజయ్ ప్రస్తుతం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్) చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముమ్మరంగా జరుగుతోంది. ఈ సినిమాలో నటి మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఇందులో విజయ్ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలోనే విజయ్‌తో నటి త్రిష మరోసారి జత కడుతున్నట్లు తాజా సమాచారం. ఇందు తండ్రి పాత్రలో నటిస్తున్న విజయ్ సరసన త్రిష నటించనున్నారు. అయితే ఇది ప్రత్యేక పాత్రేనని సమాచారం. కాగా ముందు ఈ పాత్రకు నటి అనుష్కను నటింపజేసే ప్రయత్నం చేసినట్లు.. ఆమె తిరస్కరించడంతో ఈ అవకాశం నటి త్రిషకు వచ్చినట్లు టాక్. కాగా.. గోట్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చైన్నెలో జరుగుతోంది. కాగా ప్రస్తుతం త్రిష నటుడు కమలహాసన్‌కు జంటగా థగ్స్ లైఫ్, అజిత్ సరసన విడాముయర్చి చిత్రాలతో పాటు, ఓ మలయాళ, తెలుగు చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
షేర్ ఎట్ డోర్ స్టెప్: దానానికి దగ్గరి దారి
దానాలు, విరాళాల ప్రక్రియను సులభతరం చేయడానికి ‘షేర్ ఎట్ డోర్ స్టెప్’ అనే సోషల్ వెంచర్‌కు శ్రీకారం చుట్టింది దిల్లీకి చెందిన అనుష్క జైన్. దాతల ఇంటికి వెళ్లి వారు ఇచ్చే దుస్తులు, పుస్తకాలు... మొదలైన వాటిని తీసుకొని ఎన్జీవోలకు పంపిణీ చేస్తుంది షేర్ ఎట్ డోర్ స్టెప్. ఏఐ టెక్నాలజీ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలతో కనెక్ట్ అవుతోంది.... ‘ప్రతిరోజు పిల్లల బట్టలు, యూనిఫాంను చేతితో ఉతికేదాన్ని. షేర్ ఎట్ డోర్ స్టెప్ ద్వారా వాషింగ్ మెషిన్ అందిన తరువాత నాకు చాలా శ్రమ తప్పింది. ఎంతో టైమ్ మిగులుతోంది. ఈ టైమ్‌లో పిల్లలకు కథలు చెబుతున్నాను’ అంటోంది బెంగళూరుకు చెందిన ఒక బామ్మ. బెంగుళూరు నుంచి జైపూర్ వరకు ‘షేర్ ఎట్ డోర్ స్టెప్’ను ఎంతోమంది ప్రశంసిస్తున్నారు. దిల్లీకి చెందిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అయిన అనుష్కకు ‘షేరింగ్’ కాన్సెప్ట్ కొత్త కాదు. గతంలోకి వెళితే... తన ప్రతి పుట్టినరోజుకి ‘ఇవి కావాలి అవి కావాలి’ అని కాకుండా ‘ఈరోజు ఏ ఎన్జీవోకు వెళదాం’ అని తల్లిని అడిగేది. నగరంలో ఉన్న ఏదో ఒక ఎన్జీవోకు వెళ్లి అక్కడ ఉన్నవారికి స్వీట్లు పంచేది. అలా ‘షేరింగ్’ అనే కాన్సెప్ట్ తనతోపాటు పెరిగి పెద్దదైంది. దాతృత్వానికి సంబంధించి కాలేజీ రోజుల్లో తనకు స్పష్టత వచ్చింది. చాలామందికి దానం చేయాలనే కోరిక ఉన్నా, సమయం లేకపోవడం వల్ల దూరభారం వల్ల చేయలేకపోతున్నారు. ‘డొనేషన్ ఏ స్వచ్ఛంద సంస్థకు ఇస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది;’ అనే విషయంలో చాలామందికి అవగాహన ఉండదు’ అంటున్న అనుష్క ఈ సమస్యకు ఒక పరిష్కారం వెదకాలనుకుంది. తన డ్రీమ్ కంపెనీలో ఉద్యోగంలో చేరిన అనుష్క నైట్‌షిఫ్ట్‌లో డ్యూటీ చేసేది. పగటిపూట సేవాకార్యక్రమాలపై దృష్టి పెట్టేది. ఉద్యోగంలో చేరినా ఎన్జీవోలకు డొనేట్ చేయాలనే ఆలోచన అనుష్కను వదలలేదు. దీంతో ఒక వెబ్సైట్ రూపొందించి డొనేట్ చేయాలనుకుంటున్నవారు తమ ఐటమ్స్‌ను రిజిస్టర్ చేసుకోవాలని కోరింది. రిజిస్టర్ కాగానే పొద్దున్నే వెళ్లి వాటిని కలెక్ట్ చేసుకొని వచ్చేది. పికప్స్ రెండు వందలు దాటిన తరువాత ‘ఇంకా ఏదైనా చేయాలి’ అనే ఆలోచనతో బెంగళూరులోకి అడుగుపెట్టింది అనుష్క. అక్కడ మరో కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్‌గా ఉద్యోగంలో చేరింది. 2018లో ‘షేర్ ఎట్ డోర్ స్టెప్’కు పూర్తి సమయాన్ని కేటాయించింది. ‘ఇంకా ఏదైనా చేయాలి’ అనే ఆలోచనతో బెంగళూరులోకి అడుగుపెట్టింది అనుష్క. 2018లో ‘షేర్ ఎట్ డోర్ స్టెప్’కు పూర్తి సమయాన్ని కేటాయించింది. ‘మా వెబ్సైట్లోకి వచ్చి పికప్ బుక్ చేయండి. మీరు విరాళంగా ఇవ్వాలనుకుంటున్న వస్తువు, అది తేలికైనదా, బరువైనదా అనేది తెలియజేయండి. మా ఏజెంట్లు నిర్ణీత సమయంలో మీ ఇంటి ముందు ఉంటారు. మీ విరాళాన్ని మాకు అనుబంధంగా ఉన్న ఎన్జీవోలలో ఒకదానికి పంపిస్తాం’ అంటూ అనుష్క చేసిన ప్రకటనకు అద్భుత స్పందన వచ్చింది. ఏ వస్తువులు ఏ ఎన్జీవోకు వెళ్లాలి... అనే విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికత సహాయం తీసుకుంటుంది అనుష్క. ‘షేర్ ఎట్ డోర్ స్టెప్’ ద్వారా కంపెనీలకు మార్కెటింగ్ సొల్యూషన్స్‌ను అందించడంతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)కు సంబంధించిన కార్యక్రమాలకు సహకారం అందిస్తోంది. ఇండివిడ్యువల్స్‌తో పాటు కార్పొరేట్ డోనర్స్ కోసం డోర్‌స్టెప్ డొనేషన్ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘షేర్ ఎట్ డోర్ స్టెప్’ దేశీయంగా తిరుగులేని విజయం సాధించిన తరువాత ఈ కాన్సెప్ట్‌ను విదేశాలలో ప్రచారం చేయాలని ఆలోచన చేసింది. తొలి అడుగుగా సింగపూర్‌లో ప్రచారం చేసింది. అక్కడ లభించిన స్పందన అమితమైన ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో మరింత వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది అనుష్క. ఎంతో శక్తి ఇస్తుంది దానం చేయడానికి అవసరమైన స్ఫూర్తిæ ఒక్కో దేశంలో ఒక్కోరకంగా ఉండవచ్చు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలనే ఉన్నత ఆలోచన మాత్రం దేశాల సరిహద్దులను చెరిపేసి అందరినీ ఒకటి చేస్తుంది. ఇతరులకు సహాయం చేయడం అనే పని మనకు ఎంతో శక్తి ఇస్తుంది. – అనుష్క జైన్ -
పదేళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా అనుష్క సినిమా
‘అరుంధతి’, ‘భాగమతి’.. ఇలా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో తనదైన శైలిని చాటుకుని సక్సెస్ అయ్యారు అనుష్క. తాజాగా ఆమె కథానాయిక ప్రాధాన్యంగా సాగే మరో సినిమా అంగీకరించారు. క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) ఈ సినిమాకు దర్శకుడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో పదేళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే ఓ సాధారణ అమ్మాయిగా అనుష్క పాత్ర ఉంటుందట. ఇటీవల ఒడిస్సాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారని తెలిసింది. కాగా ఈ సినిమాకు ‘శీలవతి’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పరిశీలిస్తోందనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఓ లీడ్ రోల్ చేస్తున్నారని, ఈ సినిమా ఈ ఏడాదే దక్షిణాది భాషల్లో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
కళ్లు చెదిరే లగ్జరీ ఇల్లు : యువ నటి అనుష్క కల నెరవేరిందట!
ప్రముఖ టీవీ షో బాల్ వీర్లో నటించి పాపులర్ అయిన యువ నటి అనుష్క సేన్ ఒక కొత్త లగ్జరీ ఇల్లును కొనుగోలు చేసింది. ఈ మేరకు అనుష్క తన ఇన్‌స్టా హ్యాండిల్లో అందమైన ఫోటోలను షేర్ చేసింది.. సేన్ ఫ్యామిలీ.. కొత్త ఇల్లు. మరో కల నెలవేరింది అంటూ ముంబైలో తన కొత్తింటోల అమ్మానాన్నలతో పోజిలిచ్చిన స్నాప్‌షాట్ ఫోటోలను అభిమానులకు పంచుకుంది. దీంతో ఫ్యాన్స్ ఆమెకు అభినందనలు తెలిపారు. విలాసవంతమైన ఇంటి ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అంతేకాదు చక్కటి ఇంటీరియర్స్ , అత్యుధునికి ఫీచర్స్‌తో ఉన్న ముంబై స్కైలైన్ ఫ్లాట్ అదిరి పోతోంది. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు కరియర్లో ఒక్కో మెట్టూ ఎక్కుతోంది. ఈ క్రమంలో18 ఏళ్లకే రూ.55 లక్షల విలువ చేసే (2020లో) బిఎమ్‌డబ్ల్యూ స్పోర్ట్స్ లిమిటెడ్ ఎడిషన్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ యువ టీవీ నటి మెహర్ పాత్రతో ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ జీవిత విశేషాలను తన అనుచరులతో పంచుకుంటుంది. ఇటీవల,పాపులర్ బ్రాండ్ జైపురి అదాహ్కు చెందిన అద్భుత జైపురి సూట్ ఫోటోలతో తన అభిమానులకు బ్యూటిఫుల్ ట్రీట్ ఇచ్చింది. అనుష్క సేన్ 2009లో యహా మై ఘర్ ఘర్ ఖేలీ సీరియల్‌తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. అదే సంవత్సరం, ఆమె తన మొదటి మ్యూజిక్ వీడియో హమ్కో హై ఆషాతో తనదైన ముద్ర వేసింది. 2015లో క్రేజీ కుక్కాడ్ ఫ్యామిలీ చిత్రంలో అనుష్క ఒక పాత్రతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. దీంతోపాటు స్టంట్ ఆధారిత రియాలిటీ టీవీ షో ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 11లో తన టాలెంట్‌ను అందర్నీ మెస్మరైజ్ చేసింది. -
Anushka Shetty Birthday: లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి బర్త్‌డే ఫోటోలు
-
ప్రభాస్, అనుష్క పెళ్లి పై అదిరిపోయే అప్డేట్
-
ప్రభాస్ అనుష్క పెళ్లి..ఒక పాప కూడా !
-
ఏఐ మాయ.. ప్రభాస్ భార్య, పిల్లలు ఫోటోలు వైరల్
-
జాతి రత్నాలు తర్వాత ఒత్తిడికి గురయ్యాను
‘‘ఒక యాక్సిడెంట్లో గాయాలైన ఒక మహిళా అభిమాని డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు నా ‘జాతి రత్నాలు’ సినిమాని రోజూ చూస్తానని చెప్పింది. ఇంతకంటే సంతృప్తి నటుడిగా నాకు దొరకదు. అందుకే ‘జాతి రత్నాలు’ హిట్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలా అని ఒత్తిడికి గురయ్యాను. ఆ క్రమంలో మహేశ్ చెప్పిన కథ చాలా ఎగ్జయిట్ చేసింది. మానవ సంబంధాల మీద మంచి ఎంటర్టైనింగ్ స్టోరీ రాసుకున్నాడు మహేశ్. స్టాండప్ కామెడీ క్యారెక్టర్‌తో ఫుల్ లెంగ్త్ సినిమా తెలుగులో రాలేదు. అది నచ్చింది. అలాగే అనుష్క హీరోయిన్ అనగానే హ్యాపీ ఫీలయ్యా’’ అన్నారు నవీన్ పొలిశెట్టి. మిస్ శెట్టిగా అనుష్కా శెట్టి, మిస్టర్ పొలిశెట్టిగా నవీన్ పొలిశెట్టి నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. మహేష్ బాబు పి. దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. సోమవారం ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘‘పెళ్లి ఒక్కటే కాదు.. ప్రతి రిలేషన్లో యువత ఆలోచించే తీరు ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు పి. మహేశ్ బాబు. -
అలా చేశానని ఇంట్లోవాళ్లే తిట్టారు: నవీన్ పోలిశెట్టి
నవీన్ పోలిశెట్టి పేరు చెప్పగానే మీకు తెలియకుండానే 'ఈవ్..' అనే సౌండ్ చేస్తారు. ఎందుకంటే 'ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ' మూవీతో హిట్ కొట్టినప్పటికీ 'జాతిరత్నాలు' చిత్రంతో ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'గా రాబోతున్నాడు. సెప్టెంబరు 7న రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు. (ఇదీ చదవండి: చెల్లెలిగా కీర్తి సురేశ్.. చిరు-రజనీ ఇద్దరూ బలైపోయారు!) అప్పుడు కోప్పడ్డారు 'నేను ఓ ఇంజినీర్. చేతిలో ఉన్న ఉద్యోగం పక్కనబెట్టి ఇండస్ట్రీలోకి వచ్చాను. బాగా డబ్బులొచ్చే పని వదిలేసి వచ్చానని అమ్మనాన్న చాలా కోప్పడ్డారు. 'ఏజెంట్ ఆత్రేయ'కి ముందు పదేళ్లపాటు ఇంటిపేరు పాడుచేస్తున్నానని తిట్టారు. నా వల్ల మావాళ్లు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు టైటిల్లోనే ఇంటిపేరు ఉండటం చూసి నాన్న హ్యాపీగా ఫీలయ్యారు' అందుకే ఈ మూవీ ''జాతిరత్నాలు' ఈ రేంజులో అలరిస్తుందని మేం అస్సలు ఊహించలేదు. ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి ఒత్తిడికి లోనయ్యాను. అలాంటి టైంలో ఓ మహిళా అభిమానిని కలిశాను. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడంతో నేను ఏడ్చేశాను. ఇలా నన్ను ఆదరిస్తున్న వాళ్లకి మంచి ఎంటర్టైన్ మెంట్ ఇవ్వాలని ఫిక్సయ్యా. అలా ఎన్నో కథలు విని.. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఓకే చేశాను. అనుష్కతో కలిసి వర్క్ చేయడం సరదాగా అనిపించింది' అని నవీన్ పోలిశెట్టి చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'ఖుషి' ఈవెంట్లో విజయ్ వింత డ్రస్.. ధరెంతో తెలుసా?) -
Anushka Malhotra: చిరంజీవి డాడీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత అందంగా ఉందో చూశారా? (ఫోటోలు)
-
మళ్లీ ఒక్కటవబోతున్న ప్రభాస్ అనుష్క
-
ప్రభాస్ పక్కన అనుష్క స్థానం ఆక్రమించిన కృతి ప్రూఫ్ ఇదే
-
మళ్ళి ఒక్కటి కాబోతున్న అనుష్క ప్రభాస్
-
ఇండస్ట్రీ కళకళ.. లేడీస్ స్పెషల్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘లేడీస్ స్పెషల్’ అంటూ కొత్త పోస్టర్స్‌తో ఇండస్ట్రీ కళకళలాడింది. ఆయా చిత్రబృందాలు వారి సినిమాల్లోని కథానాయికల పో స్టర్స్ను రిలీజ్ చేశాయి. ఆ పో స్టర్స్ పై ఓ లుక్ వేయండి. ఫారిన్ అన్విత ఫారిన్ వీధుల్లో ఎంచక్కా హ్యాపీగా వాక్ చేస్తున్నారు మిస్ అన్వితా రవళి శెట్టి. ఆమె సంతోషానికి గల కారణాలను వేసవిలో థియేటర్స్‌లో చూడాల్సిందే. అనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం వేసవిలో రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రంలో చెఫ్ అన్విత రవళి పాత్రలో అనుష్క నటిస్తున్నారు. అన్వి త కొత్త పో స్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. శకుంతల ప్రేమ ప్రముఖ కవి కాళిదాసు రచించిన ప్రేమకావ్యం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపోందిన చిత్రం ‘శాకుంతలం’. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. గుణశేఖర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ చిత్రంలోని సమంత కొత్త పో స్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే బుధవారం నుంచి సమంత ‘ఖుషి’ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రమాదానికి చేరువలో.. ఉమెన్స్ డే రోజున ‘మ్యాన్’ సినిమాను అనౌన్స్ చేశారు హన్సిక. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌గా రూపోందు తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. మద్రాస్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇగోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘వేటాడాలి. లేకపో తే మరొకరు మనల్ని వేటాడతారు. ఒక నిజానికి మనం దగ్గరవుతున్నామంటే అర్థం ప్రమాదానికి కూడా చేరువ అవుతున్నట్లే లెక్క’’ అని ఈ సినిమా గురించి పేర్కొన్నారు హన్సిక. మిస్ భైరవి ‘రామబాణం’ కోసం భైరవిలా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు డింపుల్ హయతి. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపోందుతున్న ‘రామబాణం’లో డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ఆమె ఫస్ట్ లుక్ పో స్టర్‌ను రిలీజ్ చేసి, భైరవి పాత్రలో నటిస్తున్నట్లుగా వెల్లడించారు మేకర్స్. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొ ట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం మే 5న విడుదల కానుంది. గీత సాక్షిగా.. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపోందిన చిత్రం ‘గీత సాక్షిగా’. లాయర్ పాత్రలో చిత్రా శుక్లా నటించిన ఈ చిత్రకథ మరో తార చరిష్మా చుట్టూ తిరుగుతుంది. ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా రూపోందిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 22న రిలీజ్ కానుంది. ఈ చిత్రం నుంచి చిత్రా శుక్లా లుక్‌ని రిలీజ్ చేశారు. ఆంథోని మట్టిపల్లి స్క్రీన్‌ప్లే రాసి, దర్శకత్వం వహించారు. చేతన్ రాజ్ కథ అందించి, నిర్మించారు. ఇవే కాదు.. మహిళా దినోత్సవానికి మరికొందరు తారల కొత్త పో స్టర్స్ కూడా విడుదలయ్యాయి. -
అజిత్ కూతురు అనౌష్కను చూశారా? ఎంత అందంగా తయారైందో!
తమిళ స్టార్ హీరో అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైవిధ్యమైన కథలు, పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తెలుగులోనూ అజిత్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్. ఇండస్ట్రీలో ఆయనకు వివాదా రహితుడు. పొగడ్తలైన, విమర్శలనై ఒకేలా తీసుకుంటూ తన పనేంటో తాను చూసుకుంటాడు. ఇక తన పని తర్వాత అజిత్ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది కుటుంబానికే. హీరోగా ఎంత బిజీగా కుటుంబానికి ఎప్పుడు సమాయాన్ని కెటాయిస్తాడు. చదవండి: వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ లిరిక్స్ వివాదం.. యండమూరికి చంద్రబోస్ గట్టి కౌంటర్ ముఖ్యంగా పండుగలు, పుట్టిన రోజు వేడుకుల, స్పెషల్ డేస్ అసలు మిస్ అవ్వడు. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త సంవత్సరాన్ని కుటుంబంతో కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాడు అజిత్. అయితే అజిత్ కుటుంబం విషయంలో చాలా గోప్యత పాటిస్తాడనే విషయం తెలిసిందే. తన వ్యక్తిగత విషమాలను, కుటుంబానికి సంబంధించిన ఎలాంటి విషయమైన బయటకు చెప్పేందుకు ఆసక్తి చూపడు. ఈ నేపథ్యంలతో న్యూ ఇయర్‌ను కుటుంబంతో కలిసి విదేశాల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు అజిత్. భార్య షాలిని, కూతురు అనౌష్క, కుమారుడు ఆద్విక్లతో కలిసి విదేశాల్లో సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఇందులో అజిత్ కూతురు అనుష్క స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. మీడియా ముందు పెద్దగా కనిపించని అనౌష్క హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో కనిపించి షాకిచ్చింది. మీడియాకు, సోషల్ మీడియా దూరంగా ఉండే అజిత్ కూతురు సడెన్‌గా ఇలా కనిపించడంతో ఆమె హాట్‌టాపిక్‌గా నిలిచింది. దీంతో ఆమె ఏం చేస్తుంది, ఏం చదువుతుంది, సినిమాల్లోకి ఎప్పుడు ఇస్తుంది? అంటూ ఆరా తీసే పనిలో పడ్డారు నెటిజన్లు. చదవండి: నటి నయని పావని ఇంట తీవ్ర విషాదం, తండ్రి మృతి.. ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ View this post on Instagram A post shared by வீர சென்னை (@ajithkumar_fansclup) -
Kantara Movie: కాంతార సినిమా పై ప్రభాస్, అనుష్క కామెంట్స్.. దిమ్మతిరిగే కలెక్షన్స్ తో దుసుకుపోతుంది
-
ఒకపక్క సీరియళ్లు, సినిమాలు, మరోపక్క యాడ్స్..19 ఏళ్లలోనే అనుష్క రికార్డ్
చదువు, ఆటపాటల్లో చురుకుగా ఉండే ఈ అమ్మాయికి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. స్కూల్లో జరిగే వివిధ ఈవెంట్స్‌లో యాక్టివ్‌గా పాల్గొనేది. ఒకసారి డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొంది కానీ తొలిరౌండ్లో ఎలిమినేట్ అయ్యింది. ఆ తరువాత టీవీ సీరియళ్లలో నటించే అవకాశం రావడంతో మంచి నటిగా, సింగర్‌గా, డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క సేన్. 19 ఏళ్ల అనుష్క వివిధ సీరియల్స్‌లో నటించి పాపులర్ అవడమేగాక, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లక్షలమంది వ్యూయర్స్‌ను ఆకట్టుకుంటోంది. చిన్న వయసులో సీరియల్స్, యాడ్స్‌లో నటిస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తూ ఎంతో మంది యువతీ యువకులకు ప్రేరణగా నిలుస్తోంది. జార్ఖండ్‌కు చెందిన అనిర్బన్, రాజ్‌రూప సేన్ దంపతుల ఒక్కగానొక్క సంతానం అనుష్కసేన్. 2002 ఆగస్టు 4న రాంచీలో పుట్టిన అనుష్క కొన్ని రోజులు అక్కడే ఉన్న తరువాత, కుటుంబం ముంబైకి మకాం మార్చడంతో ముంబైలోని ‘రయాన్ ఇంటర్నేషనల్ స్కూల్’లో చదివింది. చిన్నప్పటి నుంచి క్యూట్‌గా, యాక్టివ్‌గా ఉండే అనుష్కకు డ్యాన్స్ అంటే ఇష్టం. ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ పోటీలో పాల్గొంది. కానీ కాళ్లకు సమస్య ఎదురవడంతో వెంటనే ఎలిమినేట్ అయ్యింది. డ్యాన్స్ కాంపిటీషన్ నుంచి వెనుతిరిగాక, అదే సమయంలో ‘యహాన్ మే ఘర్ ఘర్ ఖేలీ’ అనే హిందీ టీవీ సీరియల్లో నటించే అవకాశం అనుష్కను బిజీ చేసేసింది. రాణి లక్ష్మిగా... సీరియల్స్‌లో నటిస్తూనే... రాకేష్ ఓమ్ ప్రకాష్ మెహ్రా కంపోజ్ చేసిన ‘హమ్కో హై ఆశా’ మ్యూజిక్ వీడియోలో(2012) నటించింది. మరుసటి ఏడాది బాల్ వీర్, దేవన్ కి దేవ్ మహదేవ్ సీరియల్లో చిన్నప్పటి పార్వతీ దేవిగా, ఫియర్ ఫైల్స్, క్రైమ్ పెట్రోల్, కామెడీ క్లాసెస్, ఇంటర్నెట్ వాలా లవ్ , అప్నా టైమ్ భీ ఆయేగా వంటి సీరియల్స్‌లో నటించింది. కలర్స్ టీవీలో ప్రసారమైన ఝాన్సీ కీ రాణి సీరియల్లో అనుష్క పోషించిన రాణి లక్ష్మి పాత్ర తనకి మంచి నటిగా గుర్తింపు తెచ్చింది. అంతేగాక బాల్ వీర్లో మెహర్‌గా క్యారెక్టర్లో ఒదిగిపోయి ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఇక్కడినుంచి అనుష్క వెనక్కి తిరిగి చూసుకోలేదు. నటనలో కాస్త నిలదొక్కుకున్నాక ‘షియామక్ దేవర్ డ్యాన్స్ అకాడమీ’లో చేరి డ్యాన్స్ నేర్చుకుంది. యాక్టింగ్ చేస్తున్నప్పటికీ, చదువును నిర్లక్ష్యం చేయలేదు. పదోతరగతి, ఇంటర్మీడియట్లలో ఎనభైఐదు శాతం పైగా మార్కులు సాధించింది. భవిష్యత్‌లో మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేయాలని అనుష్క భావిస్తోంది. యాడ్స్‌లో.. సీరియల్ ద్వారా అనుష్కకు వచ్చిన పాపులారిటీతో ఆమెకు అనేక యాడ్లలో నటించే అవకాశాలు వచ్చాయి. వీటిలో అమూల్ చీజ్, హార్లిక్స్, హరిదర్శన్ దూప్ స్టిక్స్, డీఎన్ఏ, అబ్సల్యూట్ ఇండియా, ఏరియల్ డిటర్జెంట్, కొరియో ఎలక్ట్రానిక్స్, ఇమేజ్ బజార్, నయి దునియా వంటి అనేక యాడ్లలో నటించింది. ఎమ్ఎస్ ధోనీతో కలిసి కమర్షియల్ యాడ్‌లో కూడా నటించింది. ఇవేగాక అర్బన్ క్లాప్, కూవ్స్, మింత్రా వంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా... అనుష్కకు కంగనా రనౌత్ అంటే బాగా ఇష్టం. దీంతో ఆమె నటించిన క్వీన్ సినిమాను అనేకసార్లు చూసింది. 2015లో ‘క్రేజీ కుక్కడ్ ఫ్యామిలీ’ సినిమాలో నటించి బాలీవుడ్లో అడుగు పెట్టింది. లిహాఫ్: ద క్విల్ట్, షార్ట్ ఫిల్మ్ సమ్మదిత్తిలో నటించింది. చాలా మ్యూజిక్ వీడియోలలో అనుష్క నటించింది. వీటిలో ‘గల్ కర్కే’, ‘వియా’, ‘సూపర్ స్టార్’ వంటివి బాగా పాపులర్ అయ్యాయి. రామ్ కపూర్ నిర్మించిన బడే అచ్చే లగతే హై సీరియల్, డ్యాన్స్ టెలివిజన్ రియాలిటీ షో జలక్ ధికలాజా, కామెడీ సర్కస్‌లో పాల్గొంది. ఒకపక్క సీరియళ్లు, సినిమాలు, మరోపక్క యాడ్లు చేస్తూనే ఖాళీ సమయాల్లో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యూట్యూబ్(2017) చానల్లో తనకు సంబంధించిన కంటెంట్, ఫన్నీ, కామెడీ, బ్యూటీ రెమిడీ వీడియోలను పోస్టు చేస్తూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆరు మిలియన్ల ఫాలోవర్స్‌తో పాపులర్ సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగింది. ఇండియాలో టిక్‌టాక్ నడిచినంతకాలం టిక్‌టాక్ సెలబ్రిటీగా, సింగర్, డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అనుష్క యూట్యూబ్ చానల్‌కు దాదాపు 24 లక్షలమంది మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 2.32 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ‘ఖతరోంకే ఖిలాడీ– 11’లో పాల్గొని ఎలిమినేట్ అయ్యింది. ఈ షోలో పాల్గొన్న 19 ఏళ్ల పిన్న వయస్కురాలిగా అనుష్క సేన్ నిలవడం విశేషం. తల్లిదండ్రులతో అనుష్కసేన్ సోషల్ స్టార్