అనుష్కకు నిశ్చితార్ధమా ? | Prabhas and Anushka to get married soon? | Sakshi
Sakshi News home page

అనుష్కకు నిశ్చితార్ధమా ?

Published Thu, Oct 5 2017 5:07 AM | Last Updated on Thu, Oct 5 2017 5:08 AM

Prabhas and Anushka to get married soon?

తమిళసినిమా: అందాల అపరంజి బొమ్మ నటి అనుష్క పెళ్లికి సిద్ధమవుతోంది. వివాహ నిశ్చితార్థానికి ముహూర్తం కుదిరింది లాంటి ప్రచారం చాలా కాలంగా జరుగుతున్నా, తాజాగా ఇంకాస్త బలంగా వినిపిస్తోంది. బాహుబలి–2 చిత్రం తరువాత అనుష్క ఒక్క కొత్త చిత్రాన్ని అంగీకరించలేదు.ఆ చిత్ర సమయంలో అంగీకరించిన భాగమతి చిత్రాన్నే ఇటీవల పూర్తి చేసింది. ఈ చిత్రం సంక్రాంతికి తెరపైకి రానున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. బాహుబలి పార్టు–1, పార్టు–2 చిత్రాల్లో ప్రభాస్‌కు జంటగా నటించింది.

ఈ రెండు చిత్రాల చిత్రీకరణే దాదాపు నాలుగైదేళ్లు పట్టింది. అయితే మధ్యలో ఇంజి ఇడుప్పళగి (తెలుగులో సైజ్‌ జీరో) చిత్రం కోసం తన బరువును భారీగా పెంచి నటించిన అనుష్క ఆ తరువాత బరువు తగ్గడానికి నానా తంటాలు పడక తప్పలేదు. బాహుబలి–2 చిత్రంలో కూడా ఆ ఎఫెక్ట్‌ పడింది.అనుష్కను ఆ చిత్రంలో స్లిమ్‌గా చూపించడానికి ఆ చిత్ర వర్గాలు పెట్టిన ఖర్చు కోట్లలోనేనని ప్రచారం జరిగింది. ఏదైతేనేమి ఎక్సర్‌సైజ్, జిమ్, యోగా వంటి కసరత్తులతో ఇప్పటికి అనుష్క తిరిగి అందగత్తెగా తయారైంది.

వదంతుల హోరు
బహుబలి చిత్ర హీరో ప్రభాస్‌తో అనుష్క సన్నిహితం, చెట్టా పట్టాలు, ప్రేమ అంటూ రకరకాల వదంతులు చాలా కాలంగానే హోరెత్తుతున్నాయి. ఈ ప్రేమ జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారనే ప్రచారం హల్‌చల్‌ చేసింది. ఇలాంటి ప్రచారాలపై అనుష్క మౌనం వహించినా, ప్రభాస్‌ మాత్రం ఖండించారు. ప్రభాస్‌కు ఆయన కుటుంబసభ్యులు పెళ్లి ప్రయత్రాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్, అనుష్కల పెళ్లి చేసుకోవడం ఖాయం అని పెళ్లి నిశ్చితార్థం డిసెంబర్‌లో జరగనుందనే ప్రచారం మళ్లీ మొదలైంది.

అంతే కాదు అనుష్క బరువు తగ్గి స్లిమ్‌గా మారడానికి కారణం సినిమాల్లో నటించడానికి కాదని, పెళ్లి కోసమేనని టాక్‌ వినిపిస్తోంది. అనుష్క నటించాలంటే ఆమెకున్న క్రేజ్‌కు అవకాశాలు వరుస కట్టేవని, వస్తున్న అవకాశాలను తను నిరాకరిస్తుందనే మాట వినిపిస్తోంది. ఈ విషయం గురించి అడిగిన ప్రశ్నకు ప్రభాస్‌ చిర్రుబుర్రులాడుతున్నారట. పెళ్లి అనేది తన వ్యక్తిగతం అని, దాని గురించి అడిగితే తనకు చిరాకు పుడుతుందని, నిజంగా పెళ్లి కుదిరితే అందరికీ చెబుతానని అంటున్నారట.

వీరి పెళ్లి గురించి అడిగితే చిరాకు పడుతున్నాడట. ఇంతకీ ప్రభాస్, అనుష్కలకు డిసెంబర్‌లో వివాహ నిశ్చితార్థం అని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న దాంట్లో నిజం ఎంత? ఎప్పటిలానే ఇదీ ఫేకేనా? రియల్‌ ఏమిటన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం అనుష్క చేతిలో సినిమాలు లేకపోయినా, ప్రభాస్‌ మాత్రం సాహో చిత్రంతో చాలా బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళం, హిందీ అంటూ మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ నటిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement