దాదాపు రెండేళ్లుగా సాగుతున్న వెండితెర ‘సైరా: నరసింహారెడ్డి’ ప్రయాణం తుది దశకు చేరుకుంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో హీరో రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈనెల 14న ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ స్టూడియోలో ఓ పాటను చిత్రీకరించనున్నారు.
అలాగే ఈ నెల చివరలో హీరోయిన్ అనుష్కపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇక్కడితో ఈ సినిమా చిత్రీకరణ ఆల్మోస్ట్ పూర్తయిపోతుందని సమాచారం. అనుష్క పాత్రతోనే థియేటర్‌లో ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమా ఆరంభం అవుతుందని తాజా సమాచారం. ఈ ఏడాది గాంధీ జయంతి రోజున (అక్టోబర్ 2) ‘సైరా’ చిత్రాన్ని విడుదల చేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు, తమన్నా కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment