gandhi jayanthi
-
ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్.. పవన్‌పై మళ్లీ సెటైర్!
గత కొన్నిరోజుల నుంచి ప్రకాశ్ రాజ్-పవన్ కల్యాణ్ మధ్య ట్విటర్ వార్ నడుస్తూనే ఉంది. తిరుపతి లడ్డూ విషయమై మొదలైన ఈ రచ్చ కాస్త ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తప్పు ఎక్కడ జరిగింది? ఎవరు చేశారనేది పక్కనబెట్టి కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని చంద్రబాబు దెబ్బతీశారు. ఈయనకు వంతపాడటం అన్నట్లు లడ్డూ వ్యవహారాన్ని రాజకీయాంగా ఉపయోగించుకోవాలని ఉద్దేశంతో రెచ్చగొట్టేలా పవన్ పలు కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ?.. డిప్యూటీ సీఎం పవన్‌పై వ్యంగ్యాస్త్రాలు!)గత కొన్నిరోజుల నుంచి పవన్‌ని సోషల్ మీడియాలో ఓ రేంజులో ఆడుకుంటున్న ప్రకాశ్ రాజ్.. మరోసారి సెటైరికల్ ట్వీట్ వేశాడు. గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వాళ్లు చెప్పిన కొటేషన్స్ చెబుతూ పవన్‌పై కౌంటర్ వేశాడు.'నువ్వు మైనారిటీవి అయినా నిజం ఎప్పటికీ నిజమే -మహాత్మా గాంధీ. మనకు దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు ఉన్నాయి. కానీ వీటిని ఎప్పుడూ రాజకీయాల్లోకి తీసుకురాలేదు. ఇదే భారత్, పాకిస్థాన్‌ల మధ్య తేడా. -లాల్ బహదూర్ శాస్త్రి. మీ అందరికీ #గాంధీ జయంతి #లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు … ఈ సత్యాన్ని మనందరిలో నింపనివ్వండి జస్ట్ ఆస్కింగ్' అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఫీల్ గుడ్ మూవీ.. ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిందే!)Wishing you all happy #GandhiJayanti #LalBahadurShastriJayanti … Let this TRUTH sink into all of us 🙏🙏🙏 #justasking pic.twitter.com/AQV92znBHc— Prakash Raj (@prakashraaj) October 2, 2024 -
ఇళ్లు కూల్చేందుకా ఓట్లు వేసింది: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: పోరాట యోధుడిగా ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన యోధుడు మహాత్మాగాంధీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం(అక్టోబర్2) గాంధీజయంతి సందర్భంగా తెలంగాణభవన్‌లో జాతిపితకు కేటీఆర్ నివాళులర్పించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ‘ప్రపంచం మొత్తం విశ్వగురువుగా కీర్తించిన నేత గాంధీ.మార్టిన్ లూథర్ కింగ్‌కు కూడా మహాత్మా గాంధీ ఆదర్శంగా నిలిచారు. తెలంగాణలో పేదల పట్ల ప్రభుత్వం మానవీయంగా వ్యవహరిస్తోంది.మమ్మల్ని వేరే పని అని తీసుకువచ్చి ఇల్లు కూలగొట్టమంటున్నారని కూలీలు చెప్తున్నారు.మీకు ఓట్లు వేసింది ఇళ్ళు కూలగొట్టడానికి కాదు. ఈ విషయంలో పైన ఢిల్లీలో ఉన్న గాంధీలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ ఆలోచించాలి. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: అక్రమమైనా.. ఇళ్ల జోలికి వెళ్లం: రంగనాథ్ -
గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: జాతిపిత మహాత్మాగాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ నేత కొమ్మూరి కనకారావు తదితరులు పాల్గొన్నారు. -
గాంధీ జయంతి సందర్బంగా సీఎం జగన్ నివాళులు
-
ఘనంగా మహాత్మ గాంధీ 154వ జయంతి వేడుకలు
-
గాంధీ జయంతి.. ప్రధాని మోదీ, ఖర్గే నివాళులు
న్యూఢిల్లీ: అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సోమవారం పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదే విధంగా విజయ్ ఘాట్‌లో లాల్ బహదూర్‌శాస్త్రీకి మోదీ నివాళులు అర్పించారు. VIDEO | PM Modi pays floral tributes to Mahatma Gandhi at Rajghat in Delhi on the occasion of #GandhiJayanti. pic.twitter.com/IVe0uhaNGC — Press Trust of India (@PTI_News) October 2, 2023 మరోవైపు జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛతా కీ సేవా’ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలో లాంఛనంగా శ్రీకారం చుట్టారు. స్వయంగా చీపురు చేతపట్టి రహదారిని శుభ్రం చేశారు. ఆయన ఈ శ్రమదాన కార్యక్రమంతో వినూత్నంగా ఫిట్నెస్, ఆరోగ్య సంరక్షణను కూడా జోడించారు. ప్రముఖ ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్ అంకిత్ బైయాన్‌పూరియాతో కలిసి శ్రమదానంలో పాల్గొన్నారు. I bow to Mahatma Gandhi on the special occasion of Gandhi Jayanti. His timeless teachings continue to illuminate our path. Mahatma Gandhi's impact is global, motivating the entire humankind to further the spirit of unity and compassion. May we always work towards fulfilling his… — Narendra Modi (@narendramodi) October 2, 2023 -
బాపూని మరిచారా?
కర్ణాటక: నిరాడంబరత, అహింస ద్వారా మహాత్మాగాంధీ యావత్ ప్రపంచానికే ఆదర్శనీయులయ్యారు. కాలగమనంలో కొన్ని సిద్ధాంతాలు పాతబడతాయి. కొందరు ప్రముఖులు కనుమరుగవుతారు. అయితే ఆయన మాత్రం జాతిపితగా గౌరవాన్ని అందుకుంటున్నారు. దేశాన్ని తెల్లదొరల దాస్యశృంఖలాల నుంచి విముక్తి కల్పించిన పోరాటంలో గాంధీ పాత్ర ఎనలేనిది. అలాగే కర్ణాటకకు గాంధీజీతో ఎనలేని అనుబంధం ఉంది. పాడుబడిన గాంధీ బావి 1934లో మొట్టమొదటి సారిగా బెంగళూరుకు వచ్చిన మహాత్మాగాంధీ కెంగేరి ప్రాంతాన్ని సందర్శించారు. అంటరానితనంపై పోరాటంలో భాగంగా కెంగేరిలోని ఓ హరిజన వాడను సందర్శించారు. ఆ ప్రాంతంలోని గ్రామ సేవా కేంద్రంవారు తవ్విన ఓ బావిని ఆయన ఈ పర్యటనలో ప్రారంభించారు. బావిలోని నీటిని ఓ వెండి చెంబుతో తోడి వాటిని అక్కడే ఉన్న దళితులకు అందించారు. అప్పటి నుంచి ఆ బావిని గాంధీ బావిగా పిలుస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎటువంటి సంరక్షణ లేక ఆ బావి పాడుబడింది. సమరయోధుల మొర గాంధీ పర్యటించిన స్థలాలు, భవనాలను భావితరాల కోసం కాపాడుకోవాలి. కానీ పాలకుల నిర్లక్ష్యంతో పాడుబడిపోతున్నాయని పలువురు స్వాతంత్య్ర సమరయోధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాపూజీ జ్ఞాపకాలను కాపాడుకోవడానికి ఇప్పటికై నా చొరవ చూపాలని సూచించారు. 1934లో మొదటిసారి రాక 1934లో గాంధీజీ మొట్టమొదటిసారిగా ఉద్యాన నగరాన్ని సందర్శించారు. తరువాత 18 సార్లు రాష్ట్రాన్ని సందర్శిస్తే అందులో 14 సార్లు నగరానికి వచ్చారు. ఆయన బెంగళూరులో అనేక ప్రాంతాలలో సభలు, సమాలోచనలు జరిపారు. అయితే ఆ ప్రాంతాలను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. జాతిపిత జ్ఞాపకాలను స్మారక స్థలాలుగా అభివృద్ధి చేయాల్సింది పోయి అవి పాడుబడుతున్నా పట్టించుకోవడం లేదు. జాతిపిత నడయాడిన చోట వినోద క్లబ్‌లు! మద్యపానం మంచిది కాదని పోరాటాన్ని సాగించిన మహాత్ముడు నడిచిన చోటనే ఇప్పుడు విలాసవంత క్లబ్‌లు వెలిశాయి. ఇందులో ఎప్పుడూ మద్యం పొంగుతూ, జూదం సాగుతూ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. మహాత్ముడు మల్లేశ్వరంలో అనేకసార్లు స్వాతంత్య్ర పోరాట సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు ఇక్కడే ఓ క్లబ్ ఏర్పాటైంది. నందీ హిల్స్‌లో గాంధీజీ మూడు నెలల పాటు గడిపారు. ఆ ప్రాంతంలో కూడా ప్రస్తుతం ఓ క్లబ్ నడుస్తోంది. ప్రార్థనలు నిర్వహించిన కుమార పార్క్‌లో ప్రస్తుతం ఓ ఫైవ్‌స్టార్ హోటల్ వెలసింది. -
మహాత్ముడి అవసరం పెరిగింది
గాంధీజీ ఆలోచనలు, భావాలు, సిద్ధాంతాలు ఎందరికో స్ఫూర్తిగా నిలిచాయి. తన సిద్ధాంత బలంతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఓడించి దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చారు. ఆయన పోరాట పంథా వినూత్నమైనది. అహింస అనే ఆయుధంతో, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటి పోరాట రూపాలతో ఆయన యుద్ధం చేశారు. ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో గాంధీ ఇచ్చిన నినాదం ‘డూ ఆర్ డై’ ఎంద రినో ఉత్తేజితులను చేసింది. ‘విజయమో, వీర స్వర్గమో’ అనే నినాదంతో యావత్ దేశ ప్రజలు ముందుకురికి భారత గడ్డ మీద నుంచి బ్రిటిష్ వారిని తరిమేశారు. మువ్వన్నెల జెండా రెపరెప లాడింది. స్వాతంత్య్రం సిద్ధించి సంవత్సరం తిరగకుండానే 1948 జనవరి 30న ఆయన హత్యకు గురై దేశాన్ని శోకసంద్రంలో ముంచారు. ఆయన ఘనత ప్రపంచ మంతా గుర్తించింది. అయితే భారతదేశంలో ఆయన్ని మెల్లగా మరచిపోతున్న ధోరణి కనిపించడం బాధాకరం. గాంధీజీ జయంతి సందర్బంగా ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను మరోసారి గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది. ‘అర్ధరాత్రి ఒంటరిగా ఆడవాళ్లు ఎప్పుడైతే క్షేమంగా వెళతారో ఆరోజే నా దేశానికి నిజమైన స్వాతంత్య్రం’ అని ప్రకటించారు గాంధీ. గాంధీ సహించనివి– మగువలపై అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, హత్యలు, కక్షలు, వైషమ్యాలు. కానీ ఇవే ఎక్కువైన ఈ సమాజంలో ఆయన ఆదర్శం గాలికి కొట్టుకుపోయిందని చెప్పక తప్పదు. మతసామరస్యాన్ని ఆయన ప్రగాఢంగా వాంఛించారు. కానీ ఇవాళ మత అసహనం పెచ్చరిల్లుతోంది. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నవారిని వెంటాడి చంపేసే దృశ్యాలు అనేకం చూస్తున్నాం. నేడు అంతటా, అన్ని రంగాలలో అవినీతి పెచ్చరిల్లింది. గాంధీజీ స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉండాలని కోరుకున్నారు. ముఖ్యంగా గ్రామాలు స్వయం పోషకత్వం సాధించి ఏ గ్రామానికది ‘స్వరాజ్యం’గా అభివృద్ధి చెందా లనుకున్నారు. మరి ఆయన కలలను మన పాలకులు ఎంతవరకు నెరవేర్చారో సమీక్షించుకోవాలి. – కనుమ ఎల్లారెడ్డి, పౌరశాస్త్ర అధ్యాపకులు, తాడిపత్రి ‘ 93915 23027 -
చరిత్రలో తొలిసారి.. 'ఆడుదాం ఆంధ్ర' పేరుతో క్రీడా సంబరాలు
తిరుపతి: ఏపీ చరిత్రలోనే తొలిసారి క్రీడా సంబరాలు జరపాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆర్.కే రోజా పేర్కొన్నారు. తిరుపతిలో ఆమె మాట్లాడుతూ.. ఆడుదాం ఆంధ్ర" పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ఆటల వల్ల ఆరోగ్యం, శారీరక దృఢత్వం వస్తుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభించనున్నాం. 15,004 గ్రామ, సచివాలయం పరిధిలో , మండల, జిల్లా,రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు నిర్వహణ. మొత్తం 2లక్షల94 వేల మ్యాచ్ లు నిర్వహిస్తాం. ఐదు కేటగిరిలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. వాటిలో క్రికెట్, వాలీబాల్,బ్యాడ్మింటన్, ఖోకో ఉన్నాయి. కాగా ప్రైజ్‌ల కోసం రూ.12 కోట్లు ఖర్చు చేయనున్నాం. రూ. 42 కోట్లతో క్రీడా సామగ్రి కిట్లు అందించనున్నాం. మొత్తంగా ఈ కార్యక్రమానికి రూ. 58.94 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 46 రోజులు పాటు ఒక పండగ వాతావరణంలో నిర్వహించనున్నాం. 17 ఏళ్లు పైబడిన వారు అందరూ పాల్గొనవచ్చు. యువతలో టాలెంట్ గుర్తించేందుకు ఇది మంచి అవకాశం'' అని మంత్రి రోజా పేర్కొన్నారు. -
అవమానించిన ప్రతిసారి గాంధీనే తలచుకున్నా: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రపంచానికి శాంతి, సౌభ్రాతృత్వాలను అందించిన మహనీయుడు మహాత్మాగాంధీ. అలాంటి మహాత్ముడిని కించపరిచేలా సమాజాన్ని చీల్చే కొన్ని చిల్లరమల్లర శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. అవి విన్నప్పుడల్లా హృదయం బాధపడుతుంది. వారి వెకిలి ప్రయత్నాల వల్ల మహాత్ముడి ప్రభ తగ్గదు. మరుగుజ్జులు ఏనాటికీ మహాత్ములు కాలేరు. వెకిలిగానే చరిత్రలో మిగి లిపోతారు..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొ న్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం బయలుదేరిన తనను కూడా చాలా మంది ఎగతాళి చేసేవారని గుర్తు చేసుకున్నా రు. ఈ బక్కపల్చటోడు ఏం చేస్తాడు, వీడితో ఏం అవుతుందని అవహేళన చేశారని.. అలాంటి సమయంలో తాను కళ్లుమూసుకుని మహాత్మా గాంధీని స్మరించుకునే వాడినని చెప్పారు. గాంధీజీ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు ప్రేరణ మహాత్ముడేనన్నారు. గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన 16 అడుగుల మహాత్ముడి కాంస్య విగ్రహాన్ని కేసీఆర్ ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. మేధావులు మౌనం పాటించొద్దు నిస్వార్ధ సేవాపరుడు, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి కూడా గాంధీ జయంతి రోజునే అని కేసీఆర్ గుర్తుచేశారు. ఈ దేశాన్ని రక్షించేవాడు జవాన్ అయితే, అన్నం పెట్టేవాడు కిసాన్ అనే గొప్ప నినాదం ఇచ్చిన గొప్ప వ్యక్తి ఆయన అని కొనియాడారు. కానీ ఈ రోజు మన కళ్లముందు ఏం జరుగుతుందో మేధావులు గమనించాలని.. మౌనం పాటించొద్దని కోరారు. తప్పును విమర్శించి, మంచిని ప్రోత్సహించినప్పుడే ఈ సమాజం ఆరోగ్యంగా ముందుకెళుతుందన్నారు. ఇప్పుడు దేశంలో జవాన్ అగ్నిపథ్‌లో కాలిపోతుంటే.. కిసాన్ మద్దతు ధర లేక కృషించిపోతున్నాడని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. మేధావి లోకం ముందుకొచ్చి దీనిని ఖండించాలన్నారు. అందరికీ ఆయన ఆదర్శం. ఎన్నో కులాలు, మతాలు, జాతులు, భాషలు, భిన్న సంస్కృతులు ఉన్న దేశంలో ప్రతి ఒక్కరిలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించి.. నడిపించిన సేనాని మహాత్మాగాంధీ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆయన చేసిన ప్రతిపని, చెప్పిన ప్రతి మాట ఆచరణీయమే అన్నారు. నెహ్రూ, వల్లబ్‌భాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోస్‌లతోపాటు మార్టిన్ లూథర్‌కింగ్, దలైలామా, నెల్సన్ మండేలా వంటి ప్రపంచ నేతలకూ మహాత్ముడే ఆదర్శమని చెప్పారు. మహాత్మా గాంధీ పుట్టి ఉండకపోతే తాను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాడిని కాదని బరాక్ ఒబామా పేర్కొన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. కరోనా మహమ్మారిపై ‘గాంధీ’యుద్ధం! ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి కాలంలో మన రాష్ట్రంలో అత్యంత ధైర్యంగా ప్రజల ప్రాణాలను కాపాడిన ఆరోగ్య సంస్థ గాంధీ ఆస్పత్రి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఇక్కడి వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది గాంధీ ఆదర్శాన్ని పుణికి పుచ్చుకుని.. ప్రజలకు సేవలు అందించారని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా రోగులను తిప్పిపంపితే.. గాంధీ ఆస్పత్రి అక్కున చేర్చుకుని వేలాది మంది ప్రాణాలను కాపాడిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, జీవన్‌రెడ్డి, ముఠాగోపాల్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ సురభి వాణి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
అలాంటి వాళ్ల వల్ల మహాత్ముడి ఔన్నత్యం ఏమాత్రం తగ్గదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: గాంధీ జయంతిని (అక్టోబర్ 2) పురస్కరించుకొని సీఎం కేసీఆర్ మహత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన 16 ఫీట్ల గాంధీజీ విగ్రాహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. అంతకుముందు గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ ఎంజీరోడ్‌లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విగ్రహావిష్కరణ అనంతరం.. ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రి వైద్యులు విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. గాంధీ వైద్యులు కరోనాపై యుద్ధం చేశారన్నారు. మంచి జరిగితే తప్పక ప్రశంసలు వస్తాయన్నారు. ‘మహాత్ముడి సిద్ధాంతం విశ్వజనీనం. మహాత్ముడు జన్మించిన దేశంలో మనం పుట్టడం ఎంతో పుణ్యం. ఆనాడు యావత్తు భారతాన్ని నడిపించిన సేనాని మహాత్మా గాంధీ. గాంధీ ఏ కార్యక్రమం చేసినా అద్భుతమే, గొప్ప సందేశమే. గాంధీ ప్రతి మాట, పలుకు ఆచరణాత్మకం. పట్టణ, పల్లె ప్రగతికి ప్రేరణ గాంధీయే. గాంధీ మార్గంలోనే తెలంగాణ సాధించుకున్నాం. ఈ మధ్య వేదాంత ధోరణిలో నా మాటలు ఉన్నాయని చాలా మంది అంటున్నారు. ప్రపంచంలో శాంతి ఉంటేనే మనమంతా సుఖంగా ఉంటాం. ఎన్ని ఆస్తులు ఉన్నా శాంతి లేకపోతే, జీవితం ఆటవికమే. ఈ మధ్య మహాత్ముడినే కించపరిచే మాటలు మనం వింటున్నాం. ఆయనను కించపరిచే మాటలు విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. అలాంటి వాళ్ల వల్ల మహాత్ముడి ఔన్నత్యం ఏమాత్రం తగ్గదు’ అని కేసీఆర్ పేర్కొన్నారు. -
సీఎం కేసీఆర్ పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: గాంధీ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ► సెయింట్ జాన్స్ రోటరీ, క్లాక్‌టవర్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు చిలకలగూడ చౌరస్తాకు అనుమతించరు. సంగీత్ క్రాస్‌రోడ్డు నుంచి ఆలుగడ్డబావి మీదుగా మళ్లిస్తారు. ► ఆలుగడ్డబావి నుంచి ముషీరాబాద్ మార్గం మూసివేస్తారు. ఆలుగడ్డబావి నుంచి వచ్చే వాహనాలు చిలకలగూడ క్రాస్‌రోడ్డు నుంచి సీతాఫల్మండి, వారాసిగూడ, విద్యానగర్, నల్లకుంట మీదుగా మళ్లిస్తారు. ► ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి సికింద్రాబాద్ మార్గంలో వాహనాలకు అనుమతించరు. ముషీరాబాద్ క్రాస్‌రోడ్డు నుంచి కవాడిగూడ, ఆర్పీరోడ్డు మీదుగా మళ్లిస్తారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు అమలులో ఉంటాయి. ► గాంధీ ఆస్పత్రి ఎదుట మహాత్ముని విగ్రహావిష్కరణ, బహిరంగ సభలకు వచ్చే వాహనాలను బోయిగూడ వై జంక్షన్ వద్దగల పారామౌంట్ అపార్ట్మెంట్, అపార్ట్మెంట్ పక్కనగల గ్రేవియార్డ్ రోడ్డులో ఫోర్‌వీలర్ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. వాటర్‌బోర్డు ఆఫీస్ వద్ద ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పించారు. -
మహాత్ముడి స్ఫూర్తితో కరోనాపై పోరు
ఐక్యరాజ్యసమితి: గాంధీజీ ఇచ్చిన శాంతి సందేశాన్ని ప్రపంచ సమాజం అందిపుచ్చుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకోవడం కాదు, మనందరి ఉమ్మడి శత్రువైన కరోనా మహమ్మారిపై మహాత్ముడి స్ఫూర్తితో కలిసికట్టుగా యుద్ధం సాగిద్దామని సూచించారు. కరోనాను ఓడించడమే మన లక్ష్యం కావాలని చెప్పారు. గాంధీజీ జయంతి రోజే అంతర్జాతీయ అహింసా దినం కావడం యాదృచ్ఛికం కాదని అన్నారు. ఆయన పాటించిన అహింసా, శాంతియుత నిరసనలు, గౌరవం, సమానత్వం అనేవి మాటలకు అతీతమైనవని తెలిపారు. మానవాళి భవిష్యత్తుకు అవి చోదక శక్తులని ఉద్ఘాటించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులకు ఇవి చక్కటి పరిష్కార మార్గాలని వివరించారు. ఈ మేరకు అంతర్జాతీయ అహింసా దినం సందర్భంగా గుటెరస్ శనివారం ఒక సందేశం విడుదల చేశారు. ఘర్షణలు, వాతావరణ మార్పులు, పేదరికం, అసమానతలు, అపనమ్మకం, ప్రజల మధ్య విభజనలు ప్రపంచానికి పెద్ద సమస్యగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
గాంధీ జయంతి రోజు స్వచ్ఛ కార్యక్రమాలతో అలరించిన నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గాంధీ జయంతి తోపాటు స్వచ్ఛ భారత్ అభియన్ 4వ వార్షికత్సవం సందర్భంగా బీచ్ క్లినింగ్ మిషన్ కార్యక్రమాలు చేపట్టింది. ఆమెకు సంబంధించిన యోలో ఫౌండేషన్ సాయంతో మిథి నది ఒడ్డున శుభ్రపరచడమే కాకా తాను చేసిన స్వచ్ఛ కార్యక్రమాల ఫోటోలతో పాటు మీరు కూడా ఈ విధంగా చేయండి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఒకే రోజు రెండు ప్రత్యేకతలు సంతరించుకున్న రోజున ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలతోనే వారికి నివాళులర్పించాలంటూ నటి ఫెర్నాండ్జ్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. (చదవండి: ఎయిర్ అంబులెన్స్ కూలి నలుగురు మృతి) అంతేకాదు ఇన్‌స్టాగ్రాంలో మాట్లాడుతూ......"ఆమె ఈ రోజు నావంతు పని నేను స్వచ్ఛందంగా చేశాను, అలాగే మీరు మీ వంతు భాగస్వామ్యంకండి. ఈ బీచ్ క్లీన్ క్యాంప్‌లనూ సేవా సంస్థలు ఎల్లప్పుడూ నిర్వహిస్తారు. అందులో మీరు కూడా స్వచ్ఛందంగా పాల్గోండి. ఇప్పుడూ అందరం మన నగరాన్ని, మన దేశాన్ని మన మాతృభూమిని పరిశుభ్రంగా ఉంచుకుంటాం అని ప్రతిజ్ఞ చేయండి " అంటూ పిలుపు నిచ్చింది. (చదవండి: రెండో పెళ్లి కోసం తొమ్మిది నెలల పసికందుని 'అమ్మే'సింది) -
వ్యాపారం ఏదైనా. దేవుడు అతడే
Gandhi Jayanti Special Story: అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తెచ్చిన మోనన్దాస్ కరమ్‌చంద్ గాంధీజీ నేరుగా ఎక్కడ వ్యాపారం చేయలేదు. కానీ వ్యాపారానికి సంబంధించి మహాత్ముడు చెప్పినట్టుగా ప్రచారంలో ఉన్న ఓ చిన్న సలహా వెలకట్టలేనిదిగా నిలిచింది. బాపు చూపిన బాటలో నడిచిన బిల్‌గేట్స్, జెఫ్ బేజోస్, స్టీవ్ జాబ్స్లు సక్సెస్ అయ్యారు. బ్రిటీషర్ల వల్లే పారిశ్రామీకరణలో భాగంగా ఇంగ్లండ్‌లో తయారయ్యే వస్తువులను ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో బ్రిటీషర్లు మార్కెట్ చేసేవారు. వాళ్ల వస్తువులను ప్రపంచ వ్యాప్తంగా అమ్ముకుంటున్నప్పటికీ వినియోగదారులైన ఆయా దేశాల ప్రజలకు సరైన మర్యాద గుర్తింపు ఇచ్చే వారు కాదు. కస్టమర్లను హీనంగా చూసేవారు. అధికార బలంతో, ఆయుధ బలంతో వస్తువులు అమ్ముకునేవారు. ఆ ఘటనతో గాంధీజీ బారిస్టర్ పూర్తి చేసిన తర్వాత సౌతాఫ్రికాలో లాయర్‌గా ప్రాక్టీస్ చేసేవారు. ఈ సందర్భంగా ఓ సారి రైలులో ప్రయాణిస్తున్న గాంధీజీని మార్గమధ్యంలో పీట్స్‌బర్గ్ రైల్వే స్టేషన్లో దించేశారు. దీంతో ఆయన సౌతాఫ్రికాలో ఆత్మగౌరవ పోరాటం మొదలు పెట్టి, మన దేశానికి బ్రిటీషర్ల నుంచి స్వాతంత్రం సాధించి పెట్టారు. ఈ పోరాటంలో భాగంగా గాంధీజి తరచుగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను జాగృతం చేసేవారు. అతనే దేవుడు 1980లో ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినియోగదారులపట్ల వ్యాపారులు ఎలా మెలగాలో గాంధీజి ప్రత్యేకంగా వివరించారు... ‘ మన ప్రాంగణంలో కస్టమర్ అత్యంత ముఖ్యమైన వ్యక్తి. అతను మనపై ఆధారపడి లేడు. మనమే అతనిపై అధారపడి ఉన్నాం. అతను మన పనిని ఆటంకపరిచే వ్యక్తి కాదు. మనం ఉన్నదే అతని కోసం. కస్టమర్ మన వ్యాపారానికి అవతలి వ్యక్తి కాదు. మన వ్యాపారంలో కీలక వ్యక్తి వినియోగదారుడు. అతనికి అవసరమైన వస్తువులు అందించి మనం అతనికి సేవ చేయడం లేదు. మన దగ్గర వస్తువులు కొనుగోలు చేసి అతనే మనకు సేవ చేస్తున్నాడు. అందువల్ల కస్టమరే మన దేవుడు’ అంటూ గాంధీజీ ప్రసంగించారు. ఆ సూక్తే ఆదర్శం 19వ శతాబ్ధంలో గాంధీజీ చెప్పిన కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ అనే సూక్తి ఇప్పటికీ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్టులతో పాటు అనేక వ్యాపార వాణిజ్య సముదాయాల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడయితే ప్రత్యేకంగా కస్టమర్ కేర్ సెంటర్లు కూడా వచ్చాయి. వినియోగదారుడికి మర్యాద ఇచ్చి అతని మన్నన పొందిన ఎంతో మంది ఎంట్రప్యూనర్లు వ్యాపారంలో ఎంతోపైకి ఎదిగారు. మహాత్ముడు చూపిన బాటలోనే వినియోగదారుడి పట్ల ఎలా ప్రవర్తించాలనే అంశాలపై తమదైన అనుభవాలను భావి తరాలకు అందించారు. బాపు చూపిన బాటలో - మీ ప్రొడక్టు పట్ల అత్యంత అసంతృప్తితో ఉన్న కస్టమర్ దగ్గరే మీరు ఆ ప్రొడక్టుకు సంబంధించి అనేక విషయాలు నేర్చుకోగలుతారు అంటూ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ అన్నారు. అందువల్లే మైక్రోసాఫ్ట్‌ని లోపరహితంగా నడిపేందుకు ప్రయత్నిస్తారు. విండోస్ ఫోన్ పట్ల వినియోగదారులు అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసన వెంటనే ఆ ఫోన్ల తయారీని ఆపేశారు. లోపరహితంగా మళ్లీ మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. - మన ఇంట్లో ఇచ్చే ఒక పార్టీకి వచ్చిన అతిథి లాంటి వ్యక్తి కస్టమర్. అతనికేం కావాలో మనం ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. అతన్ని కంఫర్ట్‌గా ఉంచాలి అనే వ్యాపార సూత్రాన్ని అనుసరించారు అమెజాన్ ఫౌండర జెఫ్ బేజోస్. అంత మర్యాద ఇచ్చారు కాబట్టే ముఖ పరిచయం లేకుండానే ఈ కామర్స్ రంగాన్ని ప్రపంచ వ్యాప్తం చేశారు. సామాన్యుల నమ్మకాన్ని చూరగొన్నారు. తిరుగులేని వ్యాపారవేత్తగా నిలిచారు. - ఏ కంపెనీ వెళ్లనంత దగ్గరగా కస్టమర్ దగ్గరకి వెళ్లండి. ఎంత దగ్గరగా అంటే అతనికే ఏం కావాలో వారు గుర్తించేలోగా మీర అది ఇచ్చేంతంగా అంటూ చెప్పారు యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్. ఆయన మాటలకు తగ్గట్టే యాపిల్ ఫోన్ తెచ్చి వినియోగదారులను ఆశ్చర్యపరిచారు. - క్లిక్జ్ డాట్‌కామ్ కో ఫౌండర్, రచయిత అన్ హాండ్లే అభిప్రాయం ప్రకారం ఎంట్రప్యూనర్ రాసే కథలో హీరో కస్టమరే. ఆ సూత్రానికి కట్టుబడే ఆమె వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించారు. - ప్రముఖ రచయిత సెథ్ గోడిన్ అభిప్రాయం ప్రకారం ఉత్పత్తుల కోసం కస్టమర్లను వెతకొద్దు.. కస్టమర్లకు ఏం కావాలో చూసి అవే ఉత్పత్తి చేయాలని చెబుతారు. చదవండి : Gandhi Jayanti: జాతిపిత ముచ్చట్లు -
‘క్లీన్ ఆంధ్రప్రదేశ్-జగనన్న స్వచ్ఛ సంకల్పం’ ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
పవన్ టూర్‌ని ఆపాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి సజ్జల నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మహాత్మాగాంధీ ఒక యుగపురుషుడు. ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థంలో గాంధీ సూక్తులు బోధించారు. కోట్లాది మందిలో స్ఫూర్తిని రగిల్చారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో జగన్ పాలన గాంధీ ఆలోచనా రూపాన్ని ఆచరణలో పెట్టిన విషయం అర్థం అవుతుంది. గాంధీ మార్గంలో ప్రయాణించడానికి పునరంకితమవుదాం. ప్రజలందరూ భాగస్వాములు కావాలి' అని కోరారు. కోవిడ్ నిబంధనలు అందరికీ సమానమే. ప్రజల ఆరోగ్యం కోసమే నిబంధనలు. ఇలాంటి సమయంలో బలప్రదర్శన వల్ల ఇబ్బంది పడేది ప్రజలే. అక్టోబర్‌లో కోవిడ్ పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెప్తున్నారు. పవన్ టూర్‌ని ఆపాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. రోడ్ల గుంతలు మీరు పూడ్చడం ఏమిటి?. అందుకు సీఎం జగన్ రూ.2,200 కోట్లు కేటాయించారు. వర్షాలు తగ్గగానే రోడ్లు మరమ్మత్తులు చేస్తాం. ఈలోపు టెండర్ల ప్రక్రియ జరుగుతుంది. టీడీపీ హయాంలో రూ.800 కోట్లు ఇచ్చారు. వాళ్లు బిల్లులు ఇవ్వకపోతే మేము ఇచ్చాం. టీడీపీ ఐదేళ్లలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు. పవన్ ఆనాడు ఏమయ్యారు? అప్పుడు ఎందుకు శ్రమదానం చెయ్యలేదు' అంటూ సజ్జల మండిపడ్డారు. చదవండి: (పవన్ చీప్ పబ్లిసిటీ మానుకోవాలి: సజ్జల) -
జాతిపిత గొప్పదనం తెలిపే చిత్రాలివే..
భారత దేశం గర్వించదగిన మహనీయులలో మహాత్మా గాంధీ ఒకరు. భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్య్రం అందించడం కోసం చేసిన పోరాటానికి గాంధీజీ ఎంచుకున్న శాంతి, అహింస మార్గం భారతీయులకే కాదు.. యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. అందుకే ఆయన మహాత్ముడు అయ్యారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జాతిపితను మరోసారి స్మరించుకుంటూ.. గాంధీజీ జీవిత చరిత్ర ఆధారంగా, ఆయన సాగించిన స్వాతంత్య్ర పోరాట పటిమ ఆధారంగా తెరకెక్కిన చిత్రాలపై ఓ ఇక్కడ ఓ లుక్కేయండి. 1) గాంధీ (1982) బ్రిటీష్ ఫిలిం మేకర్ రిచర్డ్ అటెన్ బర్గ్ తెరకెక్కించిన చిత్రం ‘గాంధీ’. 1982 లో విడుదలైన ఈ సినిమాలో బ్రిటీష్ యాక్టర్ బెన్ కింగ్స్లే మహాత్మా గాంధీ పాత్రలో నటించాడు. బ్రిటీష్ పాలనకు బాపూజీ ఎలా చరమగీతం పాడారనేది ఇందులో చూపించారు. సినిమా తెరకెక్కించిన తీరు ఆస్కార్ అవార్డుకు సైతం ఎన్నికైంది . బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ లాంటి కేటగిరీలు అన్నీ కలిపి గాంధీ మూవీకి మొత్తం 8 ఆస్కార్ అవార్డులు వరించడం విశేషం. 2) ‘ది మేకింగ్ ఆఫ్ మహాత్మ’ (1996) మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అనే సాధారణ పౌరుడు దేశం గర్వించేలా ‘మహాత్మా గాంధీ’ ఎలా అయ్యారనే అంశంతో ‘ది మేకింగ్ ఆఫ్ మహాత్మ’ సినిమా తెరకెక్కింది. దక్షిణాఫ్రికాలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం నుంచి కసితో స్ఫూర్తిని పొందిన గాంధీ.. భారత్‌కి తిరిగొచ్చి స్వాతంత్య్ర ఉద్యమానికి ఎలా నాయకత్వం వహించారు?.. బ్రిటిషర్లను దేశం నుంచి ఎలా తరిమి కొట్టారనే అంశాలను ఈ మూవీలో చూపించారు. 3) హే రామ్ (2000) కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘హే రామ్’. ఈ మూవీ గాంధీ హత్యోదంతంపై ఫోకస్ చేస్తూ తెరకెక్కించారు. గాంధీ హత్యకు దారి తీసిన పరిస్థితులు ఏంటనే కోణంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. 4) గాంధీ మై ఫాదర్ (2007) ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ తెరకెక్కించిన చిత్రం ‘గాంధీ మై ఫాదర్’. ఈ మూవీ గాంధీలోని మరో కోణాన్ని చూపించింది. యావత్ జాతికి జాతి పితగా నిలిచిన గాంధీ తన సొంత కుమారుడి చేత మాత్రం ఒక మంచి తండ్రి అనిపించుకోలేకపోయారనే ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శన్ జరివాలా, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో నిజ జీవితంలో గాంధీకి, ఆయన వారసుడు హీరాలాల్‌కి మధ్య దూరం విధానం గురించి తెరకెక్కించారు. గాంధీ హత్య తర్వాత కొద్ది రోజులకే అత్యంత పేదిరకంతో హీరాలాల్ చనిపోయినట్టు ఈ చిత్రంలో చూపించారు. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఈ సినిమాను నిర్మించారు. 5)‘మహాత్మ’ (2009) శ్రీకాంత్ హీరోగా, భావన హీరోయిన్గా కృష్ణవంశీ తెలుగులో తెరకెక్కించిన చిత్రం ‘మహాత్మా’. ఈ మూవీలో రౌడీగా ఉన్న కథనాయకుడు గాంధీజీ ప్రేరణతో ఎలా మారాడు అనేది ఈ సినిమా వృత్తాంతం. హింసే సమస్యలకు మార్గం అనుకునే హీరోను బాపూజీ అహింస సిద్ధాంతంతో హీరోయిన్ ఎలా మార్చింది.. అతడు మారిన తర్వాత ఎదుర్కొన్న పరిణామాలను ఇందులో చక్కగా చూపించారు. 6) లగేరహో మున్నా భాయ్ (2010) ఈ సినిమా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఈతరం ఆడియెన్స్ చూసిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ఇది ఒకటి. పైగా ఇదే సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ అనే టైటిల్‌తో రీమేక్ అయి భారీ విజయాన్ని అందుకుంది. గాంధీగిరితో ఏదైనా సాధించొచ్చనే స్టోరీలైన్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇవే కాకుండా ఇంకా మరెన్నో చిత్రాలు గాంధీజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కాయి. బాపూజీ జీవితంలో అందరికీ తెలిసిన విషయాల నుంచి ఎవరికీ తెలియని కోణాల వరకు వివిధ రకాల అంశాలను ఆ సినిమాల్లో చూపించారు. -
‘క్లీన్ ఆంధ్రప్రదేశ్ –జగనన్న స్వచ్ఛ సంకల్పం’ ప్రారంభం
సాక్షి, అమరావతి: గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన ‘క్లీన్ ఆంద్రప్రదేశ్ (క్లాప్)–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా శనివారం విజయవాడ బెంజి సర్కిల్ వద్ద సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం సీడీని ఆవిష్కరించారు. 4,097 చెత్త వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యకరమైన పరిసరాల్లో ఆహ్లాదంగా గడపాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. క్లాప్‌కార్యక్రమంలో భాగంగా బిన్ ఫ్రీ, లిటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే జాతీయస్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో ఉత్తమ ర్యాంక్ సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 100 రోజులపాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కొనసాగనుంది. 1.20 కోట్ల డస్ట్ బిన్ల పంపిణీ గృహాల్లోనే తడి, పొడి, ప్రమాదకర (నాప్కిన్స్, సూదులు, గ్లౌజ్‌లు, ఎలక్ట్రికల్) చెత్తను వేరు చేసేలా ప్రతి ఇంటికి మూడు డస్ట్ బిన్ల చొప్పున క్లాప్ కార్యక్రమంలో భాగంగా మునిసిపాలిటీల్లో ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 123 కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లోని 40 లక్షల గృహాలకు 1.20 కోట్ల డస్ట్ బిన్లు పంపిణీ చేస్తారు. ఇందుకు రూ.100 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చిస్తోంది. జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాలలో 1,500 పబ్లిక్ టాయిలెట్లు నిర్మించనున్నారు. మరింత మెరుగ్గా చెత్త సేకరణ, తరలింపు కోసం 3,097 ఆటో టిప్పర్లు, 1,771 ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేయనున్నారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను 5,868 జీపీఎస్ ఆధారిత గార్బేజ్ టిప్పర్ల ద్వారా గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలిస్తారు. 124 మునిసిపాలిటీలలో 231 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్(జీటీఎస్)లు ఏర్పాటు చేయడంతో పాటు 72 మునిసిపాలిటీలలో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఐఎస్‌డబ్ల్యూఎమ్) ప్రాజెక్టుల కోసం ఏజెన్సీల ఖరారుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. లక్ష పైచిలుకు జనాభా కలిగిన 32 మునిసిపాలిటీలలోని డంప్ సైట్లలో వ్యర్థాల నిర్మూలనకు టెండర్లు పిలవాలని మున్సిపాలిటీలను ఆదేశించారు. రాష్ట్రంలోని 65 నాన్ అమృత్ సిటీలలో సెప్టిక్ ట్యాంక్‌ల నుంచి సేకరించిన వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎఫ్ఎస్టీపీ) ఏర్పాటు చేయనున్నారు. నిర్వహణకు సిబ్బంది నియామకం.. చెత్త సేకరణ, రవాణా, శుద్ధీకరణ, పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలలో ఎక్కువ భాగం సరైన నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. ఈ కేంద్రాల వద్ద నలుగురు చొప్పున సిబ్బందిని నియమించి జీతభత్యాలు, నిర్వహణకు చర్యలు చేపట్టనున్నారు. కొత్తగా 4,171 చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలను నిర్మించనున్నారు. గ్రామాల్లో 14 వేల త్రిచక్ర వాహనాల పంపిణీ చెత్త రవాణా కోసం గ్రామ పంచాయతీలకు 14 వేల త్రిచక్ర వాహనాలు పంపిణీ చేస్తారు. చెత్త సేకరణ–రవాణాను మరింత మెరుగుపరిచేందుకు వెయ్యి ఆటోలు సమకూరుస్తారు. వ్యర్థాలను ఉష్ణోగ్రతల వద్ద భస్మం చేసి పర్యావరణ హితంగా మార్చేందుకు 6,417 ఇన్సినరేటర్ పరికరాలను కూడా ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ప్రజా మరుగుదొడ్లలో పరిశుభ్రత కోసం 10,731 హై ప్రెజర్ టాయిలెట్ క్లీనర్లు కేటాయించారు. దోమల నివారణకు 10,628 థర్మల్ ఫాగింగ్ మిషన్ల పంపిణీ చేపడతారు. 135 మేజర్ పంచాయతీలలో సమగ్ర ద్రవ వ్యర్థాల నిర్వహణ, 10,645 పంచాయతీలలో వర్మి కంపోస్ట్ నిర్వహణ, నాన్ రీసైక్లింగ్ వ్యర్థాలను సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీలు, సంపద తయారీ కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకుంటారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: గాంధీ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా 4 వేల సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వాహనాలను సీఎం ప్రారంభించనున్నారు. బెంజ్ సర్కిల్లో ఏర్పాటు చేయనున్న సీఎం ప్రోగామ్ ఏర్పాట్లను మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ జె.నివాస్ , విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు, ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, సీఎం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్‌తో కలిసి పరిశీలించారు. చదవండి: (ఏపీ: అత్యుత్తమంగా ఆలయాల నిర్వహణ) -
గాంధీ జయంతి నాడు ఖైదీలకు విముక్తి
సాక్షి, వరంగల్: జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాలతో 38 మంది ఖైదీలను వరంగల్ సెంట్రల్ జైలు అధికారులు శనివారం రాత్రి విడుదల చేశారు. గాంధీ జయంతి సందర్భంగా సత్ప్రవర్తనతో శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక రెమిషన్ జారీ చేసింది. ఈ మేరకు వరంగల్ సెంట్రల్ జైలులో 66 శాతం శిక్ష పూర్తి చేసిన 41 మంది విడుదలకు అర్హులుగా పేర్కొంటూ జాబితా రూపొందించారు. ఈ జాబితాను పరిశీలించిన ఉన్నతాధికారులు 38 మంది విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. సత్ప్రవర్తనతో మెలగాలని సూచిస్తున్న జైలు సూపరింటెండెంట్ మురళీబాబు ఈసందర్భంగా ఫైల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 1వ తేదీన గవర్నర్ ఆమోదానికి పంపించగా శుక్రవారం గవర్నర్ నుంచి ఆమోదం లభించింది. అయితే, దుబ్బాక ఉప ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నికల కమిషన్ ఆమోదం కోసం వేచి చూడగా, శనివారం అనుమతి వచ్చింది. అయితే, ప్రభుత్వం జీఓ విడుదల చేసినా జైళ్ల శాఖ నుంచి శనివారం సాయంత్రం 6 గంటలకు ఆదేశాలు రాగానే అధికారులు ఖైదీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి నేరాలకు పాల్పడబోమని, సత్ప్రవర్తనతో సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తామని మహాత్మాగాంధీ చిత్రపటం ముందు వారితో జైలు సూపరింటెండెంట్ మురళీబాబు ప్రమాణం చేయించారు. ఆదుకున్న ‘చాంబర్’ కమలాపురం మండలానికి చెందిన మొగిలిచర్ల బిక్షపతి పేరు విడుదలయ్యే వారి జాబితాలో ఉంది. అయితే, ఆయన కోర్టు విధించిన రూ.17,500 జరిమానా చెల్లించాల్సి ఉండగా, అంత డబ్బు లేకపోవడంతో నిరాశ చెందారు. ఈ విషయాన్ని జైలు అధికారులు వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యుల దృష్టికి తీసుకెళ్లగా వారు డబ్బు కట్టడంలో బిక్షపతి కూడా విడుదలయ్యారు. కాగా, ఖైదీలు విడుదల సందర్భంగా పలువురి కుటుంబ సభ్యులు శనివారం ఉదయం నుంచి జైలు వద్ద వేచి ఉన్నారు. తమ కుటుంబీకులు బయటకు రాగానే ఆలింగనం చేసుకుని కన్నీరు పెట్టుకోవడంతో ఉద్విఘ్న భరిత వాతావరణం నెలకొంది. అయితే, కొందరికి సంబంధించి బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడం గమనార్హం. తల్లి లక్ష్మిని తీసుకెళ్తున్న కుమారుడు 38మంది విడుదలయ్యారు... గాంధీ జయంతి సందర్భంగా జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయం ఉత్తర్వుల మేరకు సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 38 మంది ఖైదీలను విడుదల చేశారు. వీరిలో 14 ఏళ్లకు పైగా శిక్ష పూర్తి చేసిన 27 మంది పురుషులు, ఎనిమిదేళ్లకు పైగా శిక్ష పూర్తిచేసుకున్న 11 మంది మహిళలు ఉన్నారు. వీరందరూ పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వారు. – ఎన్.మురళీబాబు, జైలు సూపరింటెండెంట్ ఆదుకున్నారు.. కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. ఇప్పుడు విడుదలకు అన్ని అర్హతలు ఉన్నా జరిమానా చెల్లించేందుకు డబ్బు లేక పోవడంతో పెండింగ్‌లో పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా జైలు అధికారులు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు తెలపగా వారు డబ్బు చెల్లించారు. చాంబర్ ప్రతినిధులతో పాటు జైలు అధికారులకు రుణపడి ఉంటాను. – మొగిలిచెర్ల భిక్షపతి, కమలాపురం -
వాస్తవాలు వెలికి తీస్తే ఆశ్చర్యం కలుగుతుంది..
సాక్షి, గుంటూరు: జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా హిమని సెంటర్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, లక్ష్మణ్ రెడ్డి, యేసురత్నం తదితరులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. గాంధీ ఆలోచనలు నేడు దేశానికి అవసరం. మత సహనం,దళితుల, ముస్లింలు, పేదలపై దాడులను గాంధీజీ ఖండించారు. అన్నీ కులాలను కలుపుకుని ముందుకు నడిపిన సమగ్ర నాయకత్వం ఆయన సిద్దాంతాలలో ఉంది. దళితులు, దేవాలయాలపై దాడులు దేశానికి మంచిది కాదు. గాంధీజీ ఆలోచనలతో సమస్యలను పరిష్కరించుకోవాలి. యుపిలో దళిత మహిళను రేప్ చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అన్నారు. (చదవండి: మహాత్ముడికి సీఎం జగన్ నివాళి) ‘నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ సాధిస్తోంది. ఆ ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారికి దక్కుతుంది. మా ప్రభుత్వం వచ్చాక అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయి. వారిలో 85 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ దళితులపై ఏదో ప్రేమ ఉన్నట్లు ప్రవర్తిస్తోంది. వారి హయాంలో దళితులపై దాడి జరిగితే చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. జగన్ సీఎం అయ్యాక చట్టపరంగా సీఐ, ఎస్సై స్థాయి వారిపైనా చర్యలు ఉన్నాయి. కొన్ని మీడియా సంస్థలు, పార్టీలు దళిత ఎజెండాను అమలు చేస్తున్నాయి. దేవాలయాలపై దాడులు జరిగాయని టీడీపీ ఆందోళన చేసింది. వాస్తవాలు వెలికి తీస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రభుత్వానికి అండగా ఉన్న దళితులను దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దళిత సంఘాలు వారి మాటలు నమ్మొద్దు. మీకు అండగా ఉండేది మా ప్రభుత్వం. ఆర్థిక వేత్తలు చెప్తున్న ప్రజల్లోకి మనీ ఫ్లో అనే సూత్రాన్ని ఒక్క జగన్ గారు అమలు చేస్తున్నారు’ అని మాణిక్య వరప్రసాద్ అన్నారు. ‘వైఎస్సార్ కుటుంబానికి కులం లేదు.. మతం లేదు. ప్రతిపక్షానికి దేవాలయాలపై, దళితులపై మీకు ప్రేమ లేదు. దళితులను రెచ్చగొట్టడం, మత కలహాలు సృష్టించడమే పని. ప్రభుత్వాన్ని, జగన్‌ను మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా అతని ఎజెండా ఎస్సీ, ఎస్టీ, బీసీల ఎజెండా నుంచి జగన్ ఎప్పుడూ పక్కకి వెళ్ళారు. ఆయా వర్గాలన్నీ జగన్ వెనుకనే ఉన్నాయి. చిత్తూరు సంఘటనలో ప్రభుత్వం చక్కగా పని చేస్తోంది. కొన్ని దళిత సంఘాలు వాస్తవాలను తెలుసుకోవాలి. పేదలకు, దళితులకు ఇల్లు ఇస్తామంటే అడ్డుకున్న వ్యక్తులెవరో అందరికీ తెలుసు. ఏదయినా సంఘటన జరిగినా రాజకీయాలకు అతీతంగా దళిత సంఘాలు స్పందించాల్సిన అవసరం ఉంది’ అన్నారు. (చదవండి: ‘ఏడాది కాలంగా నిశ్శబ్ధ యుద్ధం జరుగుతోంది’) అలానే ‘కోర్టులు పరిపాలనలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. రాజ్యాంగం ప్రకారం ప్రజలకు న్యాయాన్ని అందించాల్సిన బాధ్యత న్యాయ స్థానాలపై ఉంది. న్యాయ పరిపాలనను వదిలేసి ప్రజా పరిపాలనలో జోక్యం చేసుకుంటే రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చినట్టు అవుతుంది. కోర్టులు న్యాయ సమీక్ష ద్వారా ప్రజలకు న్యాయం అందించాలి. కాని కోర్టు పరిపాలన చేస్తామంటే రాజ్యాంగం అనుమతించదు. కోర్టుకు అలాంటి పోకడలు మంచిది కాదు గాంధీజీ విలువలకు అది విరుద్దం. మహానుభావులు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం కోర్టులు పని చేయాలి. హైకోర్టులో జరుగుతున్న ఘటనలు ప్రజలను కలచి వేస్తున్నాయి. ప్రభుత్వంలో జోక్యం చేసుకునే న్యాయ వ్యవస్థను ప్రజలు కోరుకోవడం లేదు. పరిపాలనలో జోక్యం చేసుకుంటే రాజ్యాంగం ఉద్దేశాలే కనుమరుగవుతాయి. దీనిపై న్యాయ వ్యవస్థలు ఆలోచనలు చేయాలి. కోర్టులు కూడా సహనం కోల్పోవడం సరికాదు ఓర్పుతో వ్యవహరించాలి’ అని డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. -
జాతిపితపై గుడ్లు, రాళ్లు రువ్విన వేళ
(వెబ్ స్పెషల్): మహాత్మ గాంధీ గురించి ప్రసిద్ధ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ చేసిన ఓ వ్యాఖ్య ఆయన జీవితాన్ని అత్యంత అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. జాతిపితను ఉద్దేశించి ఐన్‌స్టీన్ ‘ఇలాంటి వ్యక్తి ఒకరు, రక్తమాంసాలతో ఈ నేలమీద నడిచారు అనే విషయాన్ని ముందు తరాలవారు విశ్వసించటం కూడా కష్టమే!’ అన్నారు. ఈ ఒక్క మాట చాలు ఆయన గొప్పతనాన్ని వెల్లడించడానికి. బ్రిటిషర్లు దాదాపు రెండు వందల ఏళ్ల పాటు మనల్ని పాలించారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గాంధీ ఎలాంటి ఆయుధం వాడకుండా తరిమి కొట్టారంటే ఇప్పటికి వింతగానే ఉంటుంది. ఆయన అహింసా వాదం ఆ తర్వాత ఎందరికో ఆదర్శంగా నిలిచింది. హింసకు వ్యతిరేకి అయిన గాంధీ ఓ సారి దారుణ హింసకు గురయ్యారు. అది దక్షిణాఫ్రికాలో. దాదాపు 6వేల మంది తెల్ల యూరోపియన్లు గాంధీ మీద రాళ్లు రువ్వి, కోడి గుడ్లు విసిరి.. పిడి గుద్దులు కురిపించారు. అయితే అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం లేకుండా ఆయన ఆ దాడి నుంచి బయటపడగలిగారు. ఈ సంఘటన 1897, జనవరి 13న చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా పని చేస్తున్న గాంధీ భారత పర్యటన తర్వాత కుటుంబంతో కలిసి డర్బన్‌కి తిరిగి వచ్చారు. గాంధీ రెండు ఓడల కాన్వాయ్‌లో దక్షిణాఫ్రికా చేరుకున్నారు. అయితే ఆ సమయంలో గాంధీకి వ్యతిరేకంగా తెల్ల యూరోపియన్లు ఆందోళన చెపట్టడంతో ఆయన కొంత సమయం ఓడలోనే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటికే గాంధీ నాటల్ ప్రాంతంలోని భారతీయ ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారు. దాంతో వారు ఆయన మీద కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలో వారు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. బ్రిటీషర్లతో పాటు భారతీయుల సమానత్వం కోసం ఆయన కృషి చేశారు. దాంతో వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఆందోళన నేపథ్యంలో ఓడ కెప్టెన్ మహాత్మ గాంధీని కిందకు దిగవద్దని హెచ్చరించాడు. ఆ సమయంలో యూరోపియన్లు గాంధీ వచ్చిన ఓడ తిరిగి భారతదేశానికి వెళ్లాలని డిమాండ్ చేశారు. తిరిగి వెళ్లందుకు అవసరమైన డబ్బులు తామే ఇస్తామన్నారు. తమ మాట వినకపోతే దాడి చేస్తామని హెచ్చరించారు. (చదవండి: ఇప్పటికీ 'ఆమె' పోరాడుతూనే ఉంది) కొంత సమయం తర్వాత ప్రమాదం లేదని తెలియడంతో గాంధీ కిందకు దిగారు. పక్కనే ఉన్న ఓ వీధిలోకి వెళ్తుండగా దాదాపు 6 వేల మంది ఆయనను చుట్టు ముట్టారు. వారు చాలా కోపంగా ఉన్నారు. వారిలో కొందరు గాంధీ మీద రాళ్లు రువ్వారు.. కోడి గుడ్లతో దాడి చేశారు. ఓ వ్యక్తి గాంధీ తలపాగాను కింద పడేశాడు. కొందరు ఆయన మీద పిడిగుద్దులు కురిపించారు. ఈ దాడిలో గాంధీ స్పృహ కోల్పోయాడు. పోలీసులు గాంధీని దాడి చేసిన వారి నుంచి సురక్షితంగా రక్షించారు. గాంధీ తన స్నేహితుడు పార్సీ రుస్తమీ ఇంటికి చేరుకున్నారు. కానీ వందలాది మంది గుంపు ఆ ఇంటిని చుట్టుముట్టి, "గాంధీని తిరిగి మాకు అప్పగించండి" అని అరవడం ప్రారంభించింది. ఆందోళనకారులు ఇంటికి నిప్పంటించాలని ప్లాన్ చేశారు. ఆ సమయంలో ఇంటి లోపల పిల్లలు, మహిళలు సహా సుమారు 20 మంది ఉన్నారు. అప్పుడు చీఫ్ కానిస్టేబుల్ అలెగ్జాండర్ గాంధీని ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి గుంపు నుంచి రక్షిస్తాడు. (చదవండి: మహమ్మారులపై మహాత్ముడి మంత్రోపదేశం) అలెగ్జాండర్ బ్రిటిషర్ కాని గాంధీ స్నేహితుడు. అతను గాంధీని భారత పోలీసు కానిస్టేబుల్‌గా తయారు చేసి, సమీప పోలీస్ స్టేషన్‌కు సురక్షితంగా రవాణా చేయడానికి ఏర్పాట్లు చేశాడు. అలెగ్జాండర్ స్వయంగా జనసమూహంలో కలిసి గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆయనను అక్కడి నుంచి తప్పిస్తాడు. అలా భారతదేశం స్వాతంత్ర్యం పొందటానికి 50 సంవత్సరాల కంటే ముందే మహాత్మా గాంధీ ప్రాణాంతకమైన మూక దాడి నుంచి తప్పించుకున్నారు. ఆయన 1915 లో దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు.. ఆ తర్వాత స్వాతంత్య్ర సంగ్రామానికి కొత్త దిశను ఇచ్చారు. -
మహాత్ముడికి వైఎస్ఆర్సీపీ నేతల నివాళి
-
మహాత్మ!
-
సంఘ సంస్కరణకర్తగా గాంధీజీ
పుత్లీభాయి కరంచంద్ గాంధీలకు 1869 అక్టోబర్ 2న జన్మించిన మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ మహాత్ముడై మనదేశానికి ఖ్యాతి తెచ్చినవారిలో అగ్రగణ్యుడుగా నిలిచాడు. మానవాళికి ఎన్నో క్రొత్త మార్గాలతో తనదైన సరళిలో వెలుగు చూపిన ఆ మహా త్ముని జీవితం నుంచి మనం నేర్చుకోదగినవి ఎన్నో వున్నాయి. వారు ప్రవేశపెట్టిన సంఘసంస్కరణల గురించి పరిశీలిద్దాం. రెండు శతాబ్దాల పాటు బ్రిటిష్ వారు మనపై అధికారం చెలాయించడానికి రెండు కారణాలు ప్రధానమైనవిగా గమనించారు గాంధీజీ. వారి ఆధునిక సాంకేతిక ఆయుధబలం మొదటి కారణమైతే భారతీయులలో నాడు లోపించిన ఐకమత్యం రెండోది. బ్రిటిష్ వారి ఆయుధబలానికి ప్రతిగా మన సంఖ్యాబలాన్ని ఒడ్డడానికి అనుకూలమైన అహింసామార్గాన్ని అవలంబించారు. ఇటీవలకాలంలో దేశవిదేశాలలోని పెక్కు విశ్వవిద్యాలయాలు అహింసామార్గాన్ని పరిశోధించి అవిష్కరించిన రెండు సత్యాలు– (1) సామాన్యమానవునికి సాయుధపోరాటంలో కన్నా అహింసామార్గంతోకూడిన పోరాటంలో పాల్గొనడానికి పదకొండు రెట్లు అవకాశముంటుంది. (2) గత శతాబ్ద కాలంలో జరిపిన సాయుధపోరాటాలు 27% విజయం సాధించగా అహింసామార్గంతోకూడిన పోరాటాలు 51% విజయం సాధించినవి. మనలో ఐకమత్య లేమికి ప్రధాన కారణాలు కులమత భేదాలన్న విషయం గమనించిన బాపూజీ వాటిని రూపుమాపడానికి ఎన్నో సంఘసంస్కరణలు ప్రవేశపెట్టారు. తండ్రి పోర్బందర్ సంస్థానంలో దీవాన్ కావడంతో వారిం టికి అన్యమతస్తుల బడుగువర్గాలవారి రాకపోకలు మెండుగా వుండేవి. దాంతో గాంధీజీకి సహజంగానే విశాల దృక్పథం వుండేది. మార్గాలు వేరైనా అన్నిమతాల గమ్యం ఒకటేనన్నారు. అనామధేయుడైన భగవంతునికి సహస్రనామాలన్న సత్యాన్ని నొక్కి వక్కాణించారు. ఎవరేపేరుతో పిలిచినా పలికే భగవంతుడొక్కడేనన్నారు. గాంధీజీ ప్రవేశపెట్టిన సంఘసంస్కరణలన్నిటికీ మూలం తాను నమ్మిన ఈ అద్వైతంలో దొరుకుతుంది. స్వాతంత్య్ర సమరంలో గాంధీజీ మొదటి అధ్యాయం చంపారణ్ రైతుసమస్య పరిష్కారం. ఆనాటి జమీందారి వ్యవస్థ బ్రిటిష్ వారి పరిపాలనలో ప్రథమాంకం. శిస్తువసూలులో వారిది ప్రముఖపాత్ర. నూటికి తొంభైఐదుమంది రైతులు జమిందారులవద్ద పొలం కౌలుకి తీసుకొనేవారు. కౌలుకి తీసుకొన్న పొలంలో కొంతభాగం నాటి ప్రముఖ వాణిజ్య పంట అయిన ఇండిగోను పండించి మొత్తం ఇండిగో పంటని జమీందారుకివ్వాలన్నది నియమం. గత్యంతరంలేని రైతులు ఆ నియమాన్ని ఏనాడూ ఉల్లంఘించలేదు. అద్దకంలో ఇండిగో ప్రముఖపాత్ర వహించినంతకాలం జమీందారులు తృప్తిగావున్నారు. జర్మనీవారు ఇండిగోకి ప్రత్యామ్నాయంగా కృత్రిమ డై కనిపెట్టడంతో ఇండిగో ధరలు గణనీయంగా పడిపోయాయి. దానితో రైతులపై జమీందారుల దౌర్జన్యం మితిమీరింది. ఇండిగోతోపాటూ రైతుల పంటధాన్యాలను కూడా చెల్లించుకోవల్సివచ్చింది. గాంధీజీ రైతులను, జమీందారులను విస్తృతంగా కలిసి పరిష్కారాన్వేషణలో నిమగ్నమైనారు. దక్షిణాఫ్రికాలో సాధించిన విజయాలు తెలుసుకొన్న కలెక్టరు ఆ ప్రాంతం నుంచి తక్షణమే గాంధీని వెళ్లిపోవాలని ఆదేశించారు. గాంధీజీ సహజంగానే ఆ ఆదేశాన్ని ఉల్లంఘించారు. అంతే సహజంగా గాంధీజీని బోనెక్కించారు కలెక్టరు. సమస్యా పరిష్కారం నేరమైతే నిస్సందేహంగా నేరస్తుడనని ఒప్పుకొంటానన్నారు గాంధీజీ. చట్టప్రకారం శిక్షార్హుడనని అందుకు తను సిద్ధంగా వున్నానని చెప్పారు. విషయం తెలిసిన గవర్నర్ హుటాహుటిన కలెక్టరు చేత కేసు విరమణ చేయించారు. పత్రికలద్వారా విపులంగా తెలుసుకొన్న ప్రజానీకానికి అసలుసిసలు శాసనోల్లంఘన అంటే ఏమిటో తెలి సింది. గాంధీగారు నాటినుంచి బాపూజీ ఐనారు. చంపారణ్లో రైతులపై జమిందారుల దోపిడీని కట్టడంచేయడంతో గాంధీజీ సరిపెట్టుకోలేదు. పొట్టకోస్తే అక్షరం ముక్క రాని రైతులు దోపిడీకి గురికావడంలో ఆశ్చర్యంలేదని గమనించిన గాంధీజీ పాఠశాలల్ని ఏర్పరచారు. స్త్రీపురుషుల అసమానతలను అంటరానితనాన్ని ఖండించారు. పరిసర పరిశుభ్రతను ప్రోత్సహించారు. సంఘసంస్కరణ బాధ్యతను కూడా చంపారణ్‌లోనే తన భుజాలపై వేసుకొన్నారు. స్వాతంత్య్ర సమరానికి తిరుగులేని నాయకుడైనాడు. అలనాడు బడుగువర్గాలకు ఆలయప్రవేశంలేదు వారిని మతం మార్పించడంలో మిషనరీలు అంతగా కృతకృత్యులవడానికి ముఖ్యకారణమిదే కావచ్చు. నలుగురు మంచినీళ్ళు తెచ్చుకొనే బావి దగ్గరకొచ్చే ఆస్కారం లేదు. వారి పిల్లలు పాఠశాలకెళ్లే అవకాశాలు తక్కువ. ఒకవేళ వెళ్లగలిగినా అక్కడ వారెదుర్కొనే అవమానాలు అన్నీఇన్నీకావు. అందుకు బీఆర్ అంబేడ్కర్ పడ్డ అగచాట్లే తార్కాణం. పైగా వారికి చతుర్వర్ణాలలో తావివ్వక పంచములన్నారు. అంటరానివారని ఊరివెలుపల బ్రతకమన్నారు. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు గురై అవమానాలకు గురైన గాంధీజీ అంటరానితనం అమానుషం అని ఎలుగెత్తిచాటడంలో ఆశ్చర్యమేముంది? నేటికి స్వాతంత్య్రభారతం సాధించిన ఘనవిజయాలలో అతిముఖ్యమైనది అంటరానితనాన్ని దాదాపుగా రూపుమాపడమని చెప్పవచ్చు. వారికి నేడున్న విద్యావుద్యోగావకాశాలు బ్రిటిష్ పాలనలో కలలోకూడా ఊహించుకోలేము. అలనాడు స్త్రీల పరిస్థితి కూడా దారుణంగా వుండేది. వారికి చదువుకొనే అవకాశాలు బహుతక్కువ. ఇంతెందుకు కస్తూరి గాంధీనే పెద్దగా చదువుకోలేదంటే సామాన్య వనితల విషయం చెప్పపనిలేదు. స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబమంతా ఆరోగ్యకరమైన వాతావరణంలో వుంటుందని గాంధీజీ చెప్పేవారు. వేదకాలంలో స్త్రీలు విద్యావంతులుగా ఉండేవారని చెప్పటానికి వేదోత్తములైన గార్గివాచక్నవి సులభ మైత్రేయి గురించి ఉదహరించేవారు. జనక మహారాజు రాజసూయ యాగసమయంలో జరిగిన చర్చలో యాజ్ఞవల్క్యుడు గార్గివాచక్నవి పోటీపడ్డ కథను బృహదారణ్యకోపనిషత్‌లో ప్రస్తావించిన విషయం గుర్తుచేసేవారు. శారీరకంగా పురుషులది పైచేయి అయినా మానసికంగా స్త్రీలది పైచేయి అన్న నిజం గాంధీ ఆనాడే గ్రహించారు. స్వాతంత్య్రపోరాటంలో సైతం వారిని ప్రోత్సహించారు. అరుణా అసఫ్ ఆలీ సరోజినీ నాయుడు వంటి వారికి నాయకత్వపు అవకాశాలు కల్పించారు. కులమతభేదం వలదని నినాదాలివ్వడమే కాకుండా ఆచరణలో కూడా చూపించారు. ప్రేమవివాహాలపై కూడా గాంధీగారిది విశాలదృక్పథమే. కులాలు వేరైనా రాజాజీ కుమార్తెతో తన తనయుడికి వివాహం జరిపించారు. మతాలు వేరైనా ఇందిరానెహ్రూకి ఫిరోజ్ గాంధీతో దగ్గరుండి వివాహం జరిపించారు. గాంధీజీకే కాదు ఆయన శిష్యులకి కూడా కులమత భేదాలు లేవు. హిందూ కుటుంబంలో పుట్టిన అరుణా గంగూలీ ఒక ముస్లింని ప్రేమించి పెండ్లి చేసుకొని అరుణా అసఫాలీ అయినారు. అగ్రవర్ణాలకి చెందిన సరోజినీ రైతు కుటుంబానికి చెందిన వారిని పెండ్లాడారు. గాంధీజీ వితంతు వివాహాలను కూడా ప్రోత్సహించారు. ప్రముఖ గాంధేయవాది కమలాదేవి ఛటోపాధ్యాయ గారి ద్వితీయ వివాహం ఇందుకు నిదర్శనం. స్త్రీల అభ్యున్నతికి ఎంతో కృషిచేసిన గాంధీగారి గురించి రాజ కుమారి అమృత కౌర్ చెప్పిన నాలుగు మాటలతో ఈ వ్యాసాన్ని ముగిద్దాం. ‘గాంధీగారిలో మేము జ్ఞానసంపన్నులైన తండ్రినేకాదు అమృతతుల్యమైన తల్లినికూడా చూశాము. మా కష్టసుఖాలను ఆయనతో అరమరికలు లేకుండా పంచుకొనేవారిమి. అహింసామార్గం పుణ్యమా అని స్వాతంత్య్ర పోరాటంలో స్త్రీలు అధికసంఖ్యలో పాల్గొనే అవకాశం దొరికింది’. (నేడు గాంధీజీ 151వ జయంతి సందర్భంగా) ఎంఆర్కే కృష్ణారావు, రిటైర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్, బ్రిస్బేన్, ఆస్ట్రేలియా -
గాంధీ జయంతి నాడు గిరిజనులకు నజరానా
సాక్షి, అమరావతి: అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి నాడు గిరిజన ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ట్వీట్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా చేసిన ఈ ట్వీట్లో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ‘దేశీయంగా ఉన్న విభిన్న జాతులకు ఆంధ్రప్రదేశ్ నిలయం. మా గిరిజన వారసత్వం గురించి మేము గర్విస్తున్నాము. వారి సంస్కృతి, గిరిజన జాతిని ఉద్ధరించడానికి, సంరక్షించడానికి మా శక్తి సామర్థ్యం మేరకు అన్నీ చేస్తున్నాము. కోవిడ్–19 వల్ల గిరిజనులకు పంపిణీ చేయాల్సిన ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ అక్టోబర్ 2కి వాయిదా వేశాము. అదే రోజు కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజీ, పాడేరులో మెడికల్ కాలేజీ, గిరిజన విశ్వవిద్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నాము. అదే రోజు ఏడు ఐటీడీఏల పరిధిలో ఏడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నాము.’’ -
'గిరిజన సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తాం'
సాక్షి, అమరావతి : ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ట్విటర్ వేదికగా స్పందించారు. గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని గిరిజనులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. గాంధీ జయంతి రోజున కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల, పాడేరులో వైద్య కళాశాల, గిరిజన వర్సిటీకి శంకుస్థాపన చేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఐటీడీఏ పరిధిలోని 7 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపడతాన్నారు. -
వైరల్ : మనసుల్ని తట్టిలేపే అద్భుతమైన వీడియో
న్యూఢిల్లీ : మహాత్ముని 150వ జయంత్యుత్సవాలను అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. దానిలో భాగంగా బాలీవుడ్ ప్రముఖ నటులు, నిర్మాతలతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భేటీ అయ్యారు. ‘గాంధీ ఎట్ 150’ ఇతివృత్తంగా తీసిన వీడియోలను లోక కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో మోదీ విడుదల చేశారు. గాంధీజీ బోధనల ఆధారంగా #ChangeWithin పేరుతో రాజ్‌కుమార్ హిరాణీ రూపొందించిన 100 సెకండ్ల వీడియోలో ఆమిర్‌ఖాన్, షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్, సోనమ్‌కపూర్ అహుజా, కంగనా రనౌత్, విక్కీ కౌశల్ భాగమయ్యారు. గాంధీజీ గొప్ప ఆలోచనలు ప్రతిధ్వనించేల ఎంతో మందికి స్ఫూర్తి కలిగించే బాపు మాటలు, ఆలోచనలతో వీడియో రూపొందించారని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. మోదీని కలిసిన వారిలో బోనీ కపూర్, అనిల్ కపూర్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ సహా పలువురు సినీ, టెలివిజన్ ప్రముఖలు ఉన్నారు. 2022లో జరుపుకునే 75వ స్వాతంత్య్ర దిన వేడుకలపైనా ఈ సమావేశంలో చర్చించారు. (చదవండి : ప్రధానిపై మెగా కోడలి సంచలన ట్వీట్) #ChangeWithin లో రాజ్‌కుమార్ హిరాణీ తననూ భాగం చేసినందుకు ధన్యవాదాలు అంటూ షారుఖ్ ట్వీట్ చేశారు. ‘ఒక వ్యక్తి మన యావత్ జాతిని మార్చగలిగారు. ఆయన ఆలోచనలు, ఆయన వారసత్వం ఎప్పుడూ నిలిచి ఉంటాయి. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా #ChangeWithin లో భాగం అయ్యాను. థాంక్స్ రాజ్‌కుమార్’ అని సల్మాన్ ట్విటర్లో రాసుకొచ్చారు. వీరితోపాటు అలియా, సోనమ్, అనిల్ కపూర్, రాజ్‌కుమార్ హిరాణీ ట్విటర్లో ఈ వీడియోను ట్విటర్లో పోస్టు చేశారు. (చదవండి : బాలీవుడ్ ప్రముఖులతో ప్రధాని భేటీ) -
మహాత్మా.. అనాథల్ని చేసి వెళ్లిపోయావా!!
‘అయ్యో.. మహాత్మా.. దేశానికి స్వాతంత్య్రాన్ని సముపార్జించి.. మమ్మల్ని అనాథల్ని చేసి వెళ్లిపోయావా.. ఇంత పెద్ద దేశానికి స్వాతంత్య్రాన్నిచ్చావు. మా కోసం, మా పిల్లల కోసం స్వతంత్ర దేశాన్ని ఇచ్చి మీరు ఎక్కడికి వెళ్లిపోయారు. ఎందుకు త్వరగా వెళ్లిపోయారు’ అంటూ.. ఈ కింది వీడియోలో కనిపిస్తున్న నాయకులు వెక్కివెక్కి ఏడ్చారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ.. సదరు నాయకులు కన్నీటి పర్యంతమయ్యారు. గాంధీ విగ్రహానికి తల ఆనించి.. కర్చీఫ్‌లు కళ్లకు అడ్డుపెట్టుకొని.. వెక్కివెక్కి ఏడ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. సమాజ్‌వాదీ పార్టీ సంబాల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్, అతని అనుచరులు ఇలా గాంధీ జయంతినాడు కన్నీరు కార్చారు. వీరు కన్నీరు కారుస్తున్న తతంగాన్ని అక్కడే ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘అబ్బా.. ఇది ఏమన్నా యాక్టింగ్. వీరిని ఉత్తమ నటుడి కేటగిరి కింద ఆస్కార్‌కు భారత్ తరఫున అధికారికంగా పంపాలం’టూ నెటిజన్లు సైటెర్లు వేస్తున్నారు. మహాత్ముడికి మనస్ఫూర్తిగా నివాళులర్పించడం వేరు.. మీడియా అటెన్షన్ కోసం, ప్రజల దృష్టిలో పడేందుకు ఇంతగా నటించాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఈ వీడియోలో సదరు నాయకుల ఎడుపుగొట్టు ఎక్స్ప్రెషన్స్ చూస్తే.. ఆస్కార్ అవార్డును స్వయంగా ఇంటికి మోసుకొచ్చి మరీ వీళ్లకు ఇస్తారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తాజాగా మంచు మనోజ్ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవర్ అంటూ ఈ వీడియోను రీట్వీట్ చేశారు. మొత్తానికి ఈ వీడియో నెటిజన్లకు కితకితలు పెడుతోంది. -
సామాన్యుడి వద్దకు సర్కారు
‘‘నాకో కల ఉంది.. పేదల ముఖంలో సంతోషం చూడాలని. నాకో కల ఉంది.. రైతులందరూ సుఖ సంతోషాలతో గడపాలని. నాకో కల ఉంది.. లంచాలు, అవినీతి లేని సమాజాన్ని తేవాలని. నాకో కల ఉంది.. నిరక్షరాస్యులే ఉండకూడదు.. చదువుకున్న యువతకు ఉపాధికి ఢోకా ఉండకూడదని’ అంటూ మొన్న అమెరికాలో సీఎం జగన్ చెప్పడం విన్నాం. ఈ రోజు ఆయన కల సాకారం చేసుకునే దిశగా అడుగులేశారు. ఆ అడుగు జాడల్లో నడిచేందుకు మేమంతా సిద్ధం.’’ – కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలువురు యువకులు ‘‘వైఎస్ జగన్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో, పేదవాడికి సంక్షేమ పథకాలు చేర్చడంలో నిజాయితీగా పని చేస్తాం. ఇది మా ఆన’ అంటూ రాజధాని ప్రాంతానికి సమీపంలోని గొల్లపూడి, కంచికచర్లలో గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన యువత ప్రతిజ్ఞ చేశారు’’. ‘మా ప్రభుత్వం వచ్చిందయ్యా.. మా పల్లెకే పాలన తెచ్చిందయ్యా..’ అంటూ అన్ని వర్గాల ప్రజలు మమేకమైన అపురూప సన్నివేశాలు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కనువిందు చేశాయి. జాతర వస్తే ఊరంతా సందడి చేసినట్లు, పండుగొస్తే అందరూ కలసి ఆనందం పంచుకున్నట్టు ఊరూవాడా ఏకమై కదిలింది. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు రాష్ట్ర ప్రజలు బుధవారం మనస్ఫూర్తిగా సమష్టిగా ఘన స్వాగతం పలికారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ ముంగిటకే పాలనా వ్యవస్థను తీసుకురావడంతో అంతటా సంబరాలు చేసుకున్నారు. అటు అనంతపురం, కర్నూలు మొదలు మధ్యలో రాజధాని ప్రాంతం.. చివరనున్న విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని మారుమూల పల్లెల వరకూ అదే పండుగ వాతావరణం వెల్లివిరిసింది. – ప్రజా క్షేత్రం నుంచి సాక్షి అమరావతి ప్రతినిధుల బృందం సచివాలయాల్లో నవతరం ‘గాంధీ 150వ జయంతి సందర్భంగా ఓ పక్క వందేమాతరం గీతాలాపన, మరోపక్క పల్లె పాలన ఆవిష్కృత కేరింతలతో రాయలసీమ బుధవారం మార్మోగింది. పల్లెలు కళకళలాడాయి. వార్డులు కొత్త శోభను సంతరించుకున్నాయి. దసరా ముందే వచ్చేసిందా అన్నట్టు ఆట పాటలు, తీన్మార్ నృత్యాలతో హోరెత్తాయి. పల్లెల సమగ్రాభివద్ధి, పౌర సేవలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన వెంటనే సీమలోని 52 నియోజకవర్గాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంఎల్సీలు ఆయా ప్రాంతాలలో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో ఎటుచూసినా సందడే సందడి. ఉత్సాహ, ఉద్వేగభరిత వాతావరణమే. కరచాలనాలు, పరస్పరం అభినందనలు, ఆలింగనాలు, సెల్ఫీలు, కుశల ప్రశ్నలు.. నీ పోస్టింగ్ ఎక్కడ? నీ సీటు ఎక్కడంటూ ప్రశ్నల పరంపరలు.. ఉన్నతాధికారుల హడావిడి మధ్య ప్రతి చోటా పండగ వాతావరణమే. ఎటుచూసినా ఫుల్ జోష్. ‘గ్రామ స్వరాజ్యం, గ్రామ పాలన అంటూ 40, 50 ఏళ్లుగా వింటున్నామే తప్ప అదెలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నా అన్నారు అనంతపురం నగరానికి చెందిన 65 ఏళ్ల డి.వెంకటప్పయ్య. ఇది దేశ చరిత్రలోనే అరుదైన రికార్డు అని వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లకు చెందిన సుధీర్‌రెడ్డి చెప్పారు. గ్రామ స్వరాజ్యం అనేది ఓ సుపరిపాలనా ప్రక్రియ అని, ఇందులో పాల్గొంటున్న వారందరూ చరితార్ధులేనని చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన చంద్రయ్య యాదవ్ కీర్తించారు. బడుగు, బలహీనవర్గాలు, మహిళలు, చిన్న సన్నకారు, అల్పాదాయ వర్గాలు సహా అందరికీ సమాన అవకాశాలు కల్పించడంలో గ్రామ సచివాలయాలు తోడ్పడతాయని కర్నూలు జిల్లా పెద్దపాడు పంచాయతీ కార్యదర్శి చెన్నయ్య అన్నారు. జగనన్న చెప్పినట్లు గ్రామీణ పేదల జీవితాల్లో మార్పు తేవడమే తమ లక్ష్యమని మహిళా పోలీసు, సహాయకురాలిగా ఎంపికైన కోడుమూరు యువతి శ్రీలత, టెక్నికల్ అసిస్టెంట్‌గా ఎంపికైన జాఫర్, ఇతర ఉద్యోగాలు సాధించిన వెంకటేశ్, ఆర్.రవికుమార్, సంగా కిషోర్ శపథం చేశారు. చిన్న వయసులో పెద్ద బాధ్యత ‘నాకు 20 సంవత్సరాలు.. డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. నేను 40 ఏళ్లపాటు ప్రభుత్వ ఉద్యోగం చేస్తాను. 25 ఏళ్ల లోపు వయసున్న వారెందరో ప్రస్తుత ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అందరిదీ ఒక్కటే అభిప్రాయం.. అదేమంటే జగనన్న ఆశయ సిద్ధి కోసం కృషి చేయడం’ అని నెల్లూరు జిల్లాకు చెందిన ఎంఎస్ సాయి శరత్ అన్నారు. పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం సాధించిన శ్రావణి కూడా ఇదే మాట అంది. సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం గ్రామ సచివాలయ కార్యాలయంలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది 25 సంవత్సరాలలోపు వారే. ‘ఈ రోజు కొంత మంది లబ్ధిదారులు గృహ నిర్మాణానికి సంబంధించిన సమస్యలు మాకు వివరించారు. వాటిన్నంటినీ చిన్న వయసులోనే పరిశీలించి ప్రభుత్వానికి సిఫారసు చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాం’ అని వారు అన్నారు. ‘వైఎస్ జగన్ చేతల సీఎం అని నిరూపించుకున్నారన్నారు. సీఎం సార్.. థాంక్యూ ఉభయ గోదావరి జిల్లాల్లో తాజాగా సచివాలయ ఉద్యోగాలు పొందిన వారందరిదీ ఇదే మాట. బుధవారం సచివాలయాల ప్రారంభోత్సవానికి తరలి వచ్చిన యువత, వారి తల్లిదండ్రులు, ప్రజలు భారీగా తరలి వచ్చారు. వైఎస్ జగన్ సాహసోపేత నిర్ణయాలను ప్రశంసించారు. ఉన్న ఊరికి దగ్గర్లోŠ.. కన్నవారి కళ్ల ముందే ప్రభుత్వ కొలువుకు సిద్ధమైన యువత ఈ అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు థాంక్యూ సీఎం సార్ అంటూ నిండు మనస్సుతో చెబుతున్నారు. తమ బిడ్డలకు మంచి భవిష్యత్ కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కు పలువురు తల్లిదండ్రులు రుణపడి ఉంటామని చెప్పారు. ‘సొంతంగా ఇంటి జాగా కూడా లేని మేము కాయ కష్టం చేసి మా బిడ్డలను చదివించాం. కొడుక్కు ఉద్యోగం రాకపోతుందా? మా కష్టాలు తీరకపోతాయా? అని ఐదేళ్లుగా కన్న కలలు ఈ రోజు నిజమయ్యాయి’ అని ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించిన సురేష్ తల్లి నామవరపు లక్ష్మి ఆనందం వ్యక్తం చేసింది. ‘ఎవరికీ ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా నా కుమారుడు వెంకన్న నాయుడికి ఈరోజు ఉద్యోగం వచ్చిందంటే కారణం సీఎం జగనే’ అని రేకపల్లి నారాయణ అన్నారు. కృష్ణాజిల్లా గొల్లపూడిలో ప్రతిజ్ఞ చేస్తున్న నూతన సచివాలయ ఉద్యోగులు ‘‘అది రాజధాని ప్రాంతానికి సమీపంలోని చిల్లకల్లు గ్రామ సచివాలయం.. కూలి పని చేసుకునే కుటుంబానికి చెందిన పల్లవి అక్కడికొచ్చింది.. ‘ఐదేళ్లుగా ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాం. మా అమ్మ అనారోగ్యంతో ఉంటూ కూడా కూలి పని చేసి నా కోచింగ్ కోసం డబ్బులిచ్చింది. ఈ విషయం తలుచుకున్నప్పుడల్లా గుండె తరుక్కుపోయేది సార్.. జగనన్న నెల రోజుల్లోనే పరీక్ష పెట్టి, మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు సార్. గ్రామ స్వరాజ్య వ్యవస్థలో నేను కూడా భాగస్వామి అవుతున్నందుకు ఆనందంగా ఉంది’ అని భావోద్వేగంతో చెప్పింది’’. యువతోత్సాహం విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గంభీరంలో గ్రామ సచివాలయం ప్రారంభోత్సవాన్ని ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తప్పెట గుళ్లు, కోలాటాలతో సందడి చేశారు. నవరత్నాల పథకాలను గ్రామ సచివాలయం గోడ మీద అందంగా చిత్రీకరించారు. విజయనగరం జిల్లా అంతటా ఇదే సందడి కనిపించింది. ఎల్.కోటలో ప్రభుత్వ సంక్షేమ పథకాల స్టాళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రజలకు ప్రభుత్వ పథకాలపట్ల అవగాహన కల్పించడం అందర్నీ ఆకర్షించింది. ఎలాంటి సిఫార్సులతో నిమిత్తం లేకుండా ప్రతిభ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయడంతో యువత ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఉత్సాహంతో యువత గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవంలో పాల్గొంటూ ప్రభుత్వం పట్ల కృతజ్ఞతను ప్రదర్శించింది. శ్రీకాకుళం జిల్లాలోనూ అదే ఉత్సాహం సర్వత్రా తొణికిసలాడింది. గాంధీ జయంతి రోజున నిజమైన గ్రామ స్వరాజ్యం వచ్చిందని ఎచ్చెర్ల నియోజకవర్గంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర పల్లెలు, వాడల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ‘జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన అగత్యం తప్పింది. 72 గంటల్లో స్థానికంగా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది’ అని ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హెచ్.సుబ్రహ్మణ్యం అన్నారు. గాంధీజీ ఉండుంటే ఎంత సంతోష పడేవారో.. ‘బాపూజీ జయంతి అంటే ఆయన చిత్ర పటానికి దండేసి దండం పెట్టడమే తెలుసు. అన్ని చోట్ల ఈసారి భిన్నంగా కన్పించింది. నిజంగా ఆయన బతికొచ్చినట్టుంది. ఇప్పుడు ఆయనే గనుక బతికి ఉండుంటే ఎంతగానో సంతోషపడేవారు’ అని గొల్లపూడి పంచాయతీ దగ్గర 70 ఏళ్ల పోల రంగయ్య భావోద్వేగంతో మాట్లాడారు. కృష్ణా జిల్లా గొల్లపూడి, కంచికచర్ల, నందిగామ, పెనుగంచిప్రోలు, చిల్లకల్లు, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో జనం గుండెలోతుల్లోంచి ఇవే మాటలు వచ్చాయి. గొల్లపూడిలో దళిత కుటుంబానికి చెందిన 68 ఏళ్ల సారయ్య కొత్త దుస్తులేసుకుని గ్రామ సచివాలయం వద్ద కొచ్చాడు. అక్కడ కొత్తగా ఎంపికైన గ్రామ సచివాలయం సిబ్బందిని చూస్తూ పరవశించిపోయాడు. ‘దిక్కులేదయ్యా! కూలీ చేసి పొట్టపోసుకుంటున్నాను. కూలిపోయే ఇంట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాను. ఓ ఇల్లివ్వమని ఐదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా. ఇక్కడ చెబితే జగనన్న ఇల్లిస్తాడట కదాయ్యా’ అంటూ కొన్నాళ్ల క్రితం భర్తను కోల్పోయిన శంకులమ్మ కన్నీళ్లు కొంగుతో తుడుచుకుంటుండగా అక్కడున్నవాళ్లు ఓదార్చారు. ‘ఐదేళ్లుగా అయ్యా.. రేషన్ కార్డు అంటూ తిరుగుతున్నా.. ఇప్పుడు మా వూళ్లోనే.. మా బజారునే గ్రామ సచివాలయం పెట్టారు. ఇక నాకు కార్డు వస్తుంది’ అని పెనుగంచిప్రోలులో లక్ష్మి ఆనందం వ్యక్తం చేసింది. వ్యవస్థనే కదిలించిన సీఎం సంకల్పానికి మేం ఆఖరి వరకూ అండగానే ఉంటాం’ అని గొల్లపూడిలో తేజస్వీ, మాలతిలత, దుర్గారాణి, మృదుల, శ్రీలక్ష్మి, హరికుమార్, శ్యామల, రవి, శిరీష, రుద్రలత అన్నారు. గుంటూరు జిల్లా వినుకొండలో మహిళలు సంబరాలు చేసుకున్నారు. మహిళలు రంగవల్లులు దిద్ది పూలబాటలు వేశారు. ఒకరికొకరు తోడై ఆనందంగా ఆడిపాడారు. -
గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం
సాక్షి, హైదరాబాద్: దేశంలో కొంతమంది గాంధీ పేరు పెట్టుకొని.. ఆయన ఆశయాలను గాలికి వదిలేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. గాంధీ పేరు తగిలించున్నంత మాత్రాన వారంతా ఆయన వారసులు కాలేరని పేర్కొన్నారు. గాంధీ ఆశయాలను తాము ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి లక్ష్మణ్, ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులు అరి్పంచారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. బుధవారం నుంచి జనవరి 30 వరకు గాంధీజీ 150వ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ ఎంపీలు గాంధీ సంకల్ప్యాత్ర చేపట్టారని తెలిపారు. మోదీ పిలుపు మేరకు రాష్ట్రంలోనూ ఒక కమిటీ ఏర్పాటు చేసి జయంతి వేడుకలను నిర్వహిస్తామని చెప్పారు. మోదీని జాతిపిత అని ట్రంప్ చేసిన వాఖ్యలపై కొంతమంది రాద్దాంతం, రాజకీయం చేసే ప్రయత్నం చేశారన్నారు. మోదీ ఒక తండ్రిలా వ్యవహరిస్తున్నారని, ఆ ఉద్దేశంతోనే మోదీని ట్రంప్ దేశానికి తండ్రిలాంటి వారు అని అన్నారన్నారు. గాం«దీజీ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చారని, మోదీ కూడా పరిశుభ్రతకు పెద్దపీట వేశారన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌కు సుధా పద్మినీ చారిటబుల్ ఫౌండేషన్ గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేసింది. -
కేసీఆర్‌ది గాంధీ మార్గం: హరీశ్‌రావు
గజ్వేల్: గాంధీ మహాత్ముడు చూపిన మార్గంలో సత్యాగ్రహాన్ని ఆయుధంగా మలచుకొని సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించగలిగారని, నేడు ఆ మహనీయుని బాటలో ముందుకెళ్తూ.. 30 రోజుల ప్రణాళిక అమలు తో ‘స్వచ్ఛ తెలంగాణ’కు బాటలు వేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ కోర్టు వద్ద ఆర్యౖ వెశ్య సంఘం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని బుధవారం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి ఆవిష్కరించారు. గాంధీ చూపిన బాటలో పయనించినపుడే ఆయనకు నిజమై న నివాళి అర్పించినట్లవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ భూపతిరెడ్డి, టీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, ‘గడా’ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
370 అధికరణ 1953లోనే రద్దయిందా?
ఇలా కుతూహలాన్ని రేకెత్తించే మరిన్ని ప్రశ్న లు.. వాటికి సమాధానాలకు బుధవారం హైదరాబాద్‌లోని ‘శిల్పకళా వేదిక’సాక్ష్యంగా నిలిచింది. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సం దర్భంగా ఏర్పాటు చేసిన ‘మంథన్ సంవాద్’లో దేశంలో ప్రస్తుత పరిస్థితులు.. ఎదుర్కొంటున్న సమస్యలపై పలువురు తమ భావాలు వెల్లడిం చారు. ఆర్థిక వ్యవస్థ లక్ష్యాలు మందగమనంపై కేంద్ర ఆర్థిక సలహాదారు కె.వి.సుబ్రమణియన్ తన గళాన్ని వినిపించారు. కశ్మీర్ పరిస్థితిపై చరిత్రకారుడు శ్రీనాథ్ రాఘవన్ తనదైన విశ్లేషణ చేశారు. ఈ కాలానికి గాంధీతత్వం ఎలా అనుసరణీయమో ప్రొఫెసర్ సుదర్శన్ అయ్యంగార్ వివరించారు. భారత రాజ్యాంగం ప్రజలకిచ్చిన హక్కులేంటి.. వాటిని కాపాడుకునేందుకు అంద రూ గళమెత్తాల్సిన అవసరమేంటన్న దానిపై సుప్రీంకోర్టు న్యాయవాది మేనక గురుస్వామి ఉపన్యసించారు. – సాక్షి, హైదరాబాద్ అందరూ రాజ్యాంగ పరిరక్షకులే ఇంకొకరి స్వాతంత్య్రంపై నిర్బంధాలు విధిస్తే పౌరులు తమకేంటని అనుకుంటే పొరపాటేనని.. భవిష్యత్తులో అది వారి స్వేచ్ఛ ను హరించే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనక గురుస్వామి అన్నారు. హక్కుల ఉల్లంఘన జరిగిన ప్రతిసారి న్యాయస్థానాల్లో సవాల్ చేయడం ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని సూచించారు. జమ్మూ, కశ్మీర్లో రెండు నెలలుగా ప్రజలకు వైద్య సేవలు అందట్లేదని, అధికారాన్ని ప్రశ్నించేందుకు, హక్కులను కాపాడుకునేందుకు అందు బాటులో ఉన్న అత్యంత శక్తిమంతమైన హెబియస్ కార్పస్ పిటిషన్లకూ దిక్కులేకుండా పోతోందన్నారు. ఎమర్జెన్సీ సమయం లోనూ ఈ పిటిషన్లపై 24 గంటల్లో విచారణ జరిగేదని గుర్తు చేశారు. – మేనక గురుస్వామి అందుకోదగ్గ లక్ష్యమే 2014–19 మధ్య కాలంలో 7.5 శాతం సగటు వృద్ధితో ముందుకెళ్తున్న భారత్.. ప్రధాని మోదీ ఆశిస్తున్నట్లు ఐదు ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యమేమీ కాదని కె.వి.సుబ్రమణియన్ స్పష్టం చేశారు. ఈ లక్ష్యం చేరాలంటే ఏటా ఎనిమిది శాతం వృద్ధి రేటు, కొన్ని విధానపర మార్పులు అవసరమని తెలిపారు. జీడీపీపై ప్రభుత్వం ఇస్తున్న అంకెలు సరైనవేనని భావిస్తు న్నట్లు చెప్పారు. ఆర్థిక మంద గమనాన్ని ఎదుర్కొనేందుకు పెట్టుబడులను ఆకర్షిం చాల్సిన అవసరముందని, ఇది ఉత్పాదకతను పెంచు తుందని.. ఫలితంగా మరిన్ని ఉద్యోగాలు, ఎగుమతులు జరు గుతాయని.. వీటన్నింటి కారణంగా వస్తు, సేవలకు డిమాండ్ పెరిగి ఆర్థిక వ్యవస్థ మరిన్ని పెట్టుబడులు ఆకర్షిస్తుందని వివరించారు. – కె.వి.సుబ్రమణియన్ 1953లోనే తూట్లు జమ్మూ, కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు సాంకేతికంగా 2019లో జరిగినా.. ఆ చట్టం తాలూకు అసలు స్ఫూర్తికి 1953లోనే తూట్లు మొదలయ్యాయని చరిత్రకారుడు, మాజీ సైనికాధికారి శ్రీనాథ్ రాఘవన్ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు భారత ప్రధానిగా నెహ్రూ స్థానంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఉండి ఉంటే కశ్మీర్ సమస్య వచ్చి ఉండేది కాదనే వారు.. ఆనాటి కేబినెట్ సమావేశాల వివరాలు చదువుకోవాలని, 370 అధికరణ రూపకల్పనలో అప్పటి రక్షణ మంత్రి అయిన వల్లభ్‌భాయ్ పటేల్ ఎంత కీలక పాత్ర పోషించారో.. అప్పటి కేంద్ర మంత్రి శ్యామాప్రసాద్ ముఖర్జీ ఎలా మద్దతిచ్చారో తెలుసుకోవాలని హితవు పలికారు. 1953లో షేక్ అబ్దుల్లాను నెహ్రూ గద్దె దింపడంతోనే 370 అధికరణ స్ఫూర్తికి తూట్లుపడటం మొదలైందని, తర్వాతి కాలంలో రాష్ట్రపతి ఉత్తర్వుల పేరుతో భారత రాజ్యాంగం ముప్పావు వంతు అక్కడ అమల్లోకి వచ్చిందని తెలిపారు. – శ్రీనాథ్ రాఘవన్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవసరమా? ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న వ్యక్తిగత, సామాజిక, ప్రాకృతిక సమస్యలకు మహాత్మాగాంధీ ఎప్పుడో సమాధానం చెప్పారని.. ఈ కాలంలోనూ గాంధీతత్వం అనుసరణీయమన్నారు సుదర్శన్ అయ్యంగార్. మహాత్ముడి సిద్ధాం తాలను పరిపూర్ణంగా ఆచరించడం ఈ కాలపు అవసరమని తెలిపారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థపై అందరూ మాట్లాడుతున్నారని.. కానీ అది ఎందుకన్న ప్రశ్న మాత్రం ఎవరూ వేయకపోవడం శోచనీయమన్నారు. ఒకరమైన ఆందోళ నకరమైన వాతావరణం నెలకొన్న ఈ తరుణంలో అధికారంలో ఉన్న వారికి కీలకమైన ప్రశ్నలు వేయాల్సిన అవసరం ఉందన్నారు. – సుదర్శన్ అయ్యంగార్ -
అంతర్జాతీయ వేదికపై భారత్ వెలుగులు
అహ్మదాబాద్ : మహాత్మగాంధీ 150వ జయంతి వేడుకలను ఐక్యరాజ్యసమితి ఘనంగా నిర్వహిస్తోందని, బాపూ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ ప్రపంచంలో ప్రతి సవాల్‌కూ మహాత్మ గాంధీ పరిష్కారాలు సూచించారని చెప్పారు. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట ఇనుమడిస్తోందని చెప్పుకొచ్చారు. అమెరికాలో తాను యోగ ప్రాధాన్యత వివరించిన తర్వాత అమెరికా ప్రపంచ యోగా డేను గుర్తించిందని అన్నారు. బాపూ మార్గం నిత్యం అనుసరణీయమని స్పష్టం చేశారు. అనంతరం సబర్మతీ ఆశ్రమంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆశ్రమంలో పిల్లలు, వలంటీర్లతో ముచ్చటించిన మోదీ, కొద్దిసేపు సబర్మతీ నదీ తీరంలో గడిపారు. గాంధీజీ సైకత శిల్పాలను వీక్షించారు. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఆయా కార్యక్రమాల్లో ప్రధాని వెంట ఉన్నారు. -
బిగ్ బీ అమితాబ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, సినిమా : తనకు ఏమతం లేదనీ, తాను ఒక భారతీయుడినని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రత్యేక కార్యక్రమంలో సామాజిక వేత్త బిందేశ్వర్ పాఠక్ అడిగిన ప్రశ్నకు అమితాబ్ పై విధంగా స్పందించారు. అంతేకాక, బచ్చన్ అనే పేరు నిజానికి తమ ఇంటి పేరు కాదని తమ ఇంటి పేరు శ్రీవాస్తవ అని వెల్లడించారు. తన తండ్రి హరివంశరాయ్ తనను స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఇంటి పేరు శ్రీవాస్తవ అని కాకుండా తన కలం పేరైన బచ్చన్ అని రాయించారని, దాంతో తనకు అదే పేరు స్థిరపడిపోయిందని వెల్లడించారు. అంతేకాక, బచ్చన్ అనే పేరు ఏమతాన్నీ సూచించదని చెప్పుకొచ్చారు. మరోవైపు అమితాబ్ కుటుంబ సంప్రదాయం ప్రకారం కుటుంబ పెద్దకు రంగులు పూసిన తర్వాతే హోళీ పండుగను ప్రారంభిస్తారు. ఈ విషయం గురించి అడుగగా, కుటుంబ సంప్రదాయం ప్రకారం ఇంట్లోని పెద్ద మనిషికి ఆ రకంగా గౌరవం ఇస్తామని స్పష్టం చేశారు. తన తండ్రి ఐతే ఇంట్లో టాయిలెట్లను శుభ్రం చేసే వ్యక్తి పాదాలకు రంగు పూసి ఆ తర్వాతే పండుగను జరుపుకుంటారని తెలిపారు. ఈ విషయంలో మాకెలాంటి సిగ్గూ అనిపించదని అమితాబ్ పేర్కొన్నారు. కాగా, అమితాబ్ బచ్చన్‌కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అత్యున్నత సినీ పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. -
గాంధీ మార్గం.. అనుసరణీయం
బ్రిటిష్ పాలన నుంచి భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి ప్రధాన కారణం మహాత్మాగాంధీ. ఓ సామాన్యుడిలా జీవితాన్ని ప్రారంభించిన గాంధీ... తర్వాతి రోజుల్లో మహాత్ముడిగా మారిన తీరు అమోఘం. అహింస అనే ఆయుధంతో బ్రిటిషర్లను దేశం నుంచి తరిమికొట్టిన తీరు అద్భుతం. ఒక్క భారతావనికే కాకుండా ప్రపంచం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచిన మహోన్నత వ్యక్తి బాపూజీ. తరాలు.... యుగాలు గడిచినా జాతిపిత మహాత్మాగాంధీ జీవనం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. గాంధీ అహింస సిద్ధాంతం కాలాతీతం. దానికి మరణం లేదు. ఈ నేపథ్యంలోనే మహాత్ముడి 150వ జయంతిని బుధవారం ఉత్సవంలా అంగరంగవైభవంగా చేయడానికి జిల్లా సిద్ధమైంది. ఇందులో భాగంగానే జిల్లాలో గాంధీ నడియాడిన ప్రాంతాలు, విశేషాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం అనంతలో మహాత్ముడి అడుగుజాడలు సాక్షి , అనంతపురం : స్వాతంత్య్రోద్యమ కాలంలో గాంధీజీ చాలా పర్యాయాలు అనంతలో పర్యటించారు. 1921లో లోకమాన్య తిలక్ నిధి వసూలు కార్యక్రమంలో, 1929లో ఖద్దరునిధి వసూలు కార్యక్రమంలో, 1933లో హరిజన చైతన్య యాత్రలో భాగంగా జిల్లాలో గాంధీజీ విస్తృతంగా పర్యటించారు. ఆయన ఎప్పుడు వచ్చినా జిల్లావాసులు హార్థికంగా, ఆర్ధికంగా ఆదరించారు. భక్తి నీరాజనాలర్పిస్తూ ఆయన అడుగుజాడల్లో నడిచారు. గ్రామాల నుంచి బండ్లు కట్టుకుని ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చేవారు. దురాచారాలు రూపుమాపండి 1921, సెప్టెంబర్ 20న గాంధీజీ మద్రాసు నుంచి తాడిపత్రికి వచ్చారు. కలచవీడు వెంకటరమణాచార్యులు గాంధీజీని పద్యాలతో స్తుతించారు. హిందూముస్లింల ఐక్యత గురించి, జూదం, తాగుడు, వ్యభిచారం మానమని, అస్పృశ్యతను విడనాడాలని ఆ రోజుల్లో గాంధీజీ బోధించారు. ఆ సభలో వేలాది మంది స్త్రీలు తమ ఆభరణాలను స్వాతంత్ర సమరానికి విరాళంగా ఇచ్చారు. సెప్టెంబరు 30న గాంధీజీని అరెస్టు చేస్తారన్న వదంతులు వ్యాపించడంతో బ్రిటీష్‌వారిని అడ్డుకోవడానికి కల్లూరు సుబ్బారావు ఆయన వెన్నంటే నడిచారు. అప్పుడే ఖద్దరు కట్టారు.. 1929, మే 16న మరోసారి అనంత పర్యటనకు గాంధీజీ వచ్చారు. కదిరి, కుటాగుళ్ల, ముదిగుబ్బ, దంపెట్ల గ్రామాలు తిరిగి రాత్రికి ధర్మవరం చేరుకున్నారు. దంపెట్ల గ్రామ ప్రజలు చిత్రావతి నది ఇసుకలో ఇరుక్కుపోయిన గాంధీజీ కారును దాటించారు. ధర్మవరంలో ప్రసగించిన అనంతరం ఆయన అనంతపురానికి చేరుకున్నారు. గాడిచర్ల హరి సర్వోత్తమ రావు ఆయన వెంట ఉన్నారు. ఖద్దరు కట్టండని గాంధీజీ ఇచ్చిన పిలుపుతో బ్రిటీష్ వస్త్రాలు తగలబెట్టి అనంతవాసులందరూ భారతీయత ఉట్టిపడే ఖద్దరు కట్టారు. అనంతరం గాంధీజీ తాడిపత్రికి వెళ్లారు. అక్కడ హైస్కూలు డ్రాయింగ్ మాస్టర్ ‘107’ అక్షరాలు రాసి బహుకరించిన బియ్యపు గింజ వేలం వేశారు. రూ.5,330లు నిధి వసూలైంది. అడుగడుగునా విరాళాల వెల్లువ.. 1934లో గుత్తి హైస్కూలు మైదానంలో జరిగిన సభలో కొందరు విద్యార్థులు గాంధీజీని పద్యాలతో సత్కరించారు. అనంతరం గుత్తి నుండి గుంతకల్లు వెళ్లే మార్గంలో తిమ్మన దర్గాలో ఒక తోళ్ల యజమాని కొడుకు మహదేవ (ఏడేళ్ల కుర్రాడు) గాంధీజీకి బంగారు ఉంగరం ఇచ్చాడు. అక్కడ నుండి ఉరవకొండ చేరుకున్న గాంధీజీ అందరిలోనూ హృదయ పరివర్తన రావాలని అప్పుడే స్వాతంత్య్రం త్వరగా సిద్ధిస్తుందని చైతన్యపరిచారు. అక్కడ ఇద్దరు రైతులు విడివిడిగా కానుకలివ్వడంతో అందరూ ఐకమత్యంగా ఉంటేనే కానుకలు స్వీకరిస్తానని వారందరినీ సంఘటితపరిచారు. అక్కడ నుండి అనంతపురం చేరుకున్న గాంధీజీ హరిజన కాలనీలో కొళాయి ప్రారంభించారు. ఆ తర్వాత హిందూపురం వెళ్లారు. హిందూపురంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ హరిజనుల పట్ల బేధభావం రూపుమాపాలని పిలుపునిచ్చారు. అంటరానితనం పోయేంత వరకూ తనకు మనశ్శాంతి లేదని పేర్కొన్నారు. గాంధీ పేరుతో వీధులు గాంధీజీ అడుగుపెట్టిన జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్యులు గాంధీజీ స్మారక చిహ్నాలను ఏర్పాటు చేసుకుని ప్రతి ఏటా ఘనంగా నివాళులర్పించడం పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా మారింది. గాంధీజీ తిరిగిన స్థ«లంగా భావించి పాతూరు ప్రధాన వీధికి గాంధీ బజారుగా నామకరణం చేశారు. నాలుగు కూడళ్ల మధ్యన నిలువెత్తు గాంధీజీ విగ్రహం అందరిని పలకరిస్తున్నట్లు అగుపిస్తుంది. ముఖ్యంగా కొత్తూరు ఆర్యవైశ్య సంఘం గోపా మచ్చా నరసింహులు ఆధ్వర్యంలో టవర్‌క్లాక్ సమీపంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ముందున్న గాంధీ విగ్రహాన్ని పోలిన విధంగా భారీ ఎత్తున మహాత్ముని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గాంధీ 150 జయంతిని పురస్కరించుకుని బుధవారం రక్తదాన శిబిరం, సేవా కార్యక్రమాలు చేపట్టారు. శాంతి ర్యాలీలు, మానవహారాలు, స్వచ్ఛభారత్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉరవకొండలో మహాత్ముడు జాతిపిత మహత్మాగాంధీ పాదస్పర్శతో 1934, మార్చిన ఉరవకొండ పునీతమైంది. విరాళాల సేకరణకు గాంధీజీ ఉరవకొండకు వచ్చారు. అప్పట్లో మహత్మ గాంధీ వెంట మాఘం సుబ్బరాయుడు, ఉప్పరగోవిందప్ప,ఎంసీ నరసింహులు, రామప్ప, బాబా సాహెబ్, నరసింహరెడ్డిలు ఉన్నారు. గాంధీ నడియాడిన పాత బజారుకు గాంధీ బజారు అని నేటికీ పిలుస్తున్నారు. ఆ రోజుల్లో గాంధీ ప్రసంగించిన చోటున స్వాతంత్య్ర సమరయోధుల చిహ్నం ఏర్పాటు చేశారు. గుత్తి కోటలో 1946, అక్టోబర్ 2న గాంధీ పుట్టిన రోజును జరుపుతున్న దృశ్యం మహాత్ముడు ప్రసంగించిన వేదిక దండి సత్యాగ్రహంలో భాగంగా 1925లో తాడిపత్రి పట్టణానికి మహాత్మా గాంధీ వచ్చారు. ఆ సమయంలో బాపూజీ సందేశాన్ని వినేందుకు పెద్ద ఎత్తున వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా స్థానిక నాయకులు పరిశీలించి ఓ ప్రాంతానికి ఎన్నుకుని అరుగు నిర్మించారు. ఆ అరుగుపై నుంచి గాంధీ ప్రసంగించారు. అప్పటి నుంచి ఆ అరుగుకు గాంధీ కట్ట అని పిలుస్తూ వచ్చారు. – తాడిపత్రి మధుర జ్ఞాపకం స్వాతంత్య్ర సమరం ఊపందుకున్న 1934లో పెద్దవడుగూరు గ్రామాన్ని గాంధీజీ సందర్శించారు. గ్రామానికి చెందిన కుమ్మెత చిన్నారపరెడ్డి ఆహ్వానం మేరకు గాంధీజీ ఇక్కడకు రావడం చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. గుత్తి నుంచి ప్రత్యేకంగా తన కారులో చిన్నారపరెడ్డి ఆయనను ఇక్కడకు పిలుచుకువచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమానికి మద్దతు తెలుపుతూ స్థానికులు విరాళాలు అందజేశారు. ఆ సమయంలో తన వంతు విరాళంగా రూ.1,116ను చిన్నారపరెడ్డి అందజేశారు. ఆ డబ్బును కీర్తి శేషులు కేశవపిళై స్మతి చిహ్నంగా హరిజనుల కోసం నిర్మించబడే కేశవ విద్యాలయానికి విరాళంగా గాంధీ ప్రకటించారు. ఈ అంశాలను నాటి ఆంధ్రపత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఆ పత్రిక నేటికీ చిన్నారపరెడ్డి కుటుంబసభ్యలు భద్రంగా దాచి ఉంచారు. – పెద్దవడుగూరు గుత్తి రైల్వే స్టేషన్లో గాంధీ స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ప్రజలను చైతన్య పరుస్తూ 1931, నవంబర్ 21న గుత్తి రైల్వే స్టేషన్లో మహాత్మ గాంధీ అడుగుపెట్టారు. ఖద్దర్ నిధి వసూలు కార్యక్రమంలో భాగంగా పెద్దవడుగూరుకు వెళ్లడానికి ఆయన రైలు వస్తూ గుత్తిలో దిగారు. గుత్తి, పెద్దవడుగూరు ప్రాంతాలకు చెందిన స్వాతంత్య్ర సమరయో«ధులు గుత్తి కేశవపిళ్లై, పీజే శర్మ, కుమ్మెత చిన్న నారప్పరెడ్డి, పామిడి తిరుపతిరావు, శరభారెడ్డి(చిన్న శరబయ్య), తదితరులు రైల్వే స్టేషన్లో ఆయనకు స్వాగతం పలికారు. పెద్దవడుగూరుకు చెందిన చిన్న నారప్పడ్డి తన సొంత కారులో గాంధీజీని ఎక్కించుకుని స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ తన గ్రామానికి పిలుచుకెళ్లారు. అక్కడ ఖద్దర్ నిధి కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. గాంధీజీ జోలి పట్టి అడగడంతో మొత్తం రూ. 27వేలు వసూలైంది. ఆ సమయంలో తమ శరీరంపై ఉన్న బంగారాన్ని కూడా మహిళలు స్వచ్ఛందంగా అందజేశారు. – గుత్తి -
బాపూ ఆశయాలకు గ్రేటర్ ఆమడదూరం
సాక్షి, సిటీబ్యూరో: సత్యం, అహింస, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, మద్యపాన నిషేధం, కుల, మత, జాతి అంతరాలు లేని, నేరాలు ఘోరాలు లేని సమాజం, అందరికీ అన్నీ సమానంగా అందే సమసమాజ స్థాపన కోసం జాతిపిత మహాత్మాగాంధీ జీవితాంతం కృషి చేశారు. ఆయా అంశాలపై ఆయన చేసిన ప్రయోగాల సారమే బాపూ జీవితం. నేడు ఆ రుషి, మహార్షి 150వ జయంతి. మరి ఆయన ఆశయాలను మనం ఎంత వరకు అందిపుచ్చుకుంటున్నాం? మహాత్ముడు చెప్పిన మాటలను ఎంత మేరకు ఆచరిస్తున్నాం? బాపూ బాటలో ఏ మేరకు నడుస్తున్నాం? ఇప్పుడివన్నీ చర్చనీయాంశాలే. చీకటి భారతంలో వెలుగులు నింపిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన అడుగుజాడల్లో గ్రేటర్ ఏ మేరకు పయనించిందో ఓసారి అవలోకనం చేసుకుందాం. వనం.. మాయం నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారింది. చెట్లు మాయమై బహుళ అంతస్తుల భవంతులు వెలిశాయి. ఫలితంగా కాలుష్యం పెరిగిపోయింది. వాయు, జల, నేల కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. నగరంలో 50 లక్షల వాహనాలకు గాను 15 లక్షలు కాలం చెల్లినవి ఉన్నాయి. ఓవైపు వీటి నుంచి వెలువడే ప్రమాదకర వాయువులు, మరోవైపు పరిశ్రమల రసాయనాలతో సిటీజనులకు స్వచ్ఛమైన వాయువు కరువైంది. సిటీలో సుమారు 185 వరకున్న చెరువులు, కుంటలు ఆర్గానిక్ కాలుష్యంతో ఆగమవుతున్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడుతున్న కాలుష్య ఉద్గారాలు ఆయా జలాశయాల్లో చేరడంతో నీరంతా కలుషితమవుతోంది. ఇక బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియట్ కంపెనీల నుంచి వెలువడే ఘన, ద్రవ కాలుష్య ఉద్గారాలను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తుండడంతో వాటిలోని భార లోహాలు, మూలకాలు భూమిలోకి ఇంకుతున్నాయి. ఫలితంగా నేల కాలుష్యం ఏర్పడుతోంది. ప్రధానంగా మెర్క్యురీ, లెడ్, క్రోమియం, ఆర్సినిక్, నికెల్, మాంగనీస్, కాపర్, కోబాల్ట్ తదితర మూలకాలుండడం ఆందోళన కలిగిస్తోంది. మద్యం మత్తు ‘ఫుల్లు’ గ్రేటర్ పరిధిలో మద్యపాన నిషేధం కాగితాలకే పరిమితమైంది. రోజురోజుకు మద్యం అమ్మకాలు ‘ఫుల్లు’గా సాగుతున్నాయి. సుమారు 300 మద్యం దుకాణాలు.. మరో 400 వరకు బార్లున్నాయి. వీటిల్లో నిత్యం సుమారు రూ.25 కోట్ల అమ్మకాలు సాగుతుంటాయి. పండగలు, సెలవుదినాల్లో అమ్మకాలు చుక్కలను తాకుతాయి. అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు, వేతనజీవులు, కార్మికులు మద్యానికి బానిసై తమ సంపాదనలో సింహభాగం ఖర్చు చేస్తుండడంతో వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. మరోవైపు మందుబాబులు అనారోగ్యానికి గురై ఆస్పత్రుల్లో చేరి వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. మద్యపానం నిషేధం విషయంలో ప్రభుత్వం ప్రేక్షకపాత్రకే పరిమితమైందన్నది సుస్పష్టం. అంతటా అ‘స్వచ్ఛ’త మిగతా నగరాలతో పోలిస్తే స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్‌లో సిటీ వెనకబడుతోంది. నగరం పరిధిలో నిత్యం 5వేల టన్నుల మేర ఘన వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని డంపింగ్‌యార్డుకు తరలించే క్రమంలో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతున్నాయి. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో హడావుడి తప్ప ఫలితం లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. తడి, పొడి చెత్త వేర్వేరుగా వేసేందుకు ఇచ్చిన రెండు డబ్బాల విధానం సత్ఫలితాన్నివ్వలేదు. ప్రధాన రహదారులు, వీధుల్లో తరచూ చెత్తాచెదారం దర్శనమిస్తోంది. బహిరంగ మల, మూత్ర విసర్జన కొన్ని ప్రాంతాల్లో యథావిధిగా కొనసాగుతోంది. స్వచ్ఛత విషయంలో ఇటు బల్దియా.. అటు పౌర సమాజం ఉద్యమస్ఫూర్తితో పనిచేసినప్పుడే మహాత్ముడు ఆశించిన లక్ష్యం సాకారమవుతుంది. విద్యాబారం.. ఫీ‘జులుం’ అన్ని వర్గాల వారికీ ఉచితంగా గుణాత్మక విద్య అందించాలన్న మహాత్ముడి లక్ష్యం నెరవేరడం లేదు. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులు వేలల్లోనే. ఇక ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుకునే వారి సంఖ్య లక్షలకు చేరింది. దీంతో గ్రేటర్లో విద్యా వ్యాపారం రూ.కోట్లకు పడగలెత్తింది. అల్పాదాయ, మధ్యతరగతి వర్గం పిల్లల ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, బ్యాగులు కొనుగోలు చేసేందుకు అప్పులపాలు కావాల్సిన దుస్థితి తలెత్తింది. అక్షరాస్యతలో అగ్రభాగాన ఉన్నప్పటికీ ప్రైవేటు ఫీ‘జులు’ంతో అన్ని వర్గాలకు నాణ్యమైన గుణాత్మక విద్య అందని ద్రాక్షగా మారింది. తీవ్రమైన నేరం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో హత్యలు, దొంగతనాలు, దోపిడీలు కొంతమేర తగ్గుముఖం పడుతున్నా... నేర తీవ్రత మాత్రం భయాకరంగా ఉంటోంది. నడిరోడ్డుపై హత్యలు, సమీప బంధువులే నరుక్కోవడం, చైన్ స్నాచింగ్ ఘటనలు మూడేళ్లలో బాగా పెరిగాయి. సొత్తు సంబంధిత హత్యలు తగ్గుముఖం పట్టినా.. నేరం మనుషుల ప్రాణాలు పోయే తీవ్రతలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఇప్పటికీ మూఢనమ్మకాలతో హత్యలు చేస్తుండడం, మానవత్వం మరిచి ప్రవర్తిస్తుండడం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. పోలీసులు నివారణ చర్యలు తీసుకుంటున్నా ఘటనలు జరుగుతుండడం కలవరపెడుతోంది. మహిళా వేదన మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే మూడు కమిషనరేట్లలో బాలికలు, అమ్మాయిలు, మహిళలపై వేధింపులు పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఏకంగా 5,432 కేసులు నమోదు కాగా... 4,830 మేజర్లపైనే ఉండడం వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టం చేస్తోంది. కళాశాల కుర్రాళ్లు, ఉద్యోగులు, వివిధ పనులు చేస్తున్న మరికొందరు వేధింపులకు పాల్పడుతున్నారని షీ బృందాల గణాంకాలు తెలియజేస్తున్నాయి. వీరిలో 602 మంది మైనర్లు కూడా ఉండడం అందరినీ కలవరపెడుతోంది. మరోవైపు మహిళలకు సంబంధించి వరకట్న హత్యలు, ఆత్మహత్యలు, దాడులు, అత్యాచారాలు కొంతమేర తగ్గుముఖం పట్టినా... ఉమెన్ ట్రాఫికింగ్ పెరగడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. -
బాపూజీ అస్థికలు తీసుకురావడానికి తర్జనభర్జన చేశారు
లంగర్‌హౌస్: మహాత్ముడికి మన నగరం ఎంతో గౌరవం ఇచ్చింది. ఆయన స్మృతిలో ఎందరో తరించారిక్కడ. ఈ నేపథ్యంలోనే బాపూజీ సమాధి నగరంలోని లంగర్‌హౌస్ త్రివేణీ సంగమం వద్ద ఏర్పాటైంది. అదే బాపూఘాట్‌గా వర్ధిల్లుతోంది. బాపూజీ అస్థికల నిమజ్జనం... బాపూజీ మరణానంతరం ఆయన అస్థికలను దేశంలోని ఐదు ప్రధాన ప్రాంతాలతో పాటు ప్రపంచంలోని పలుచోట్ల నిమజ్జనం చేశారు. దక్షిణ భారత దేశంలో కేవలం ఒకే ఒక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఆ సమయంలో హైదరాబాద్ రాష్ట్రం నిజాం పరిపాలనలో ఉండటంతో నగరానికి అస్థికలు తీసుకురావడానికి తర్జనభర్జన చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కలుగజేసుకొని విషయాన్ని నిజాం నవాబుకు తెలపడంతో ఆయన సంతోషంగా ఆహ్వానించారు. దీంతో కె.ఎ మున్షి సమక్షంలో హరిశ్చంద్ర హేడా, కుమారి హేడాల ఆధ్వర్యంలో గాంధీజీ అస్థికలను 1948 ఫిబ్రవరి 9 వ తేదీన బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌కు తీసుకువచ్చారు. రెండు రోజులు ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచి...12 వతేదీన లంగర్‌హౌస్ త్రివేణీ సంగమం వద్ద అస్థికలతో కూడిన కలశాన్ని ఉంచి సమాధి నిర్మించారు. మరి కొన్ని అస్థికల్ని త్రివేణీ సంగమంలో నిమజ్జనం చేశారు. దక్షిణ కాశి.. లంగర్‌హౌస్ త్రివేణీ సంగమాన్ని దక్షిణ కాశి అని కూడా అంటారు. కొడంగల్ గుట్టల నుంచి వచ్చే హిమగంగ, అనంతగిరి గుట్టల నుంచి వచ్చే ముచుకుంద, గుప్త గంగ మూడు నదుల కలయికతో ఈ పవిత్ర త్రివేణీ సంగమం ఏర్పడింది. రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ, వాజ్‌పేయి, ఎన్టీ రామారావు, మర్రి చెన్నారెడ్డి, ఆర్మీ అమర వీరులతో పాటు పలువురు ప్రముఖుల అస్థికల్ని కూడా ఇక్కడ నిమజ్జన ం చేశారు. బాపూఘాట్ నిర్మాణం... త్రివేణి సంగమం వద్ద బాపూ సమాధి నిర్మించినా అప్పట్లో ఆ ప్రాంతం అరణ్యంలా ఉండటంతో ప్రజలు వెళ్లేవారు కాదు. లంగర్‌హౌస్ చౌరస్తాలో బాపూ విగ్రహం ఏర్పాటు చేసి, పక్కనే ఉన్న లైబ్రరీలో బాపూ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణకాంత్ రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన సమయంలో..ఆయన చొరవతో ఇక్కడ బాపూఘాట్ నిర్మాణం పూర్తిచేశారు. సమాధికి దగ్గరలో బాపూ ధ్యానమందిరం నిర్మించి అందులో సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చే అవకాశం ఉన్నా...నిర్లక్ష్యం వహిస్తున్నారు. బాపూఘాట్‌ను మరింత అభివృద్ధి పరిస్తే నేటి తరానికి ఎన్నో విషయాలు అవగతమయ్యే అవకాశం ఉంది. నేడు జయంతి వేడుకలు.. మహాత్ముని 150వ జయంతి వేడుకలకు బాపూఘాట్, బాపూ సమాధి, బాపూ ధ్యాన మందిరాలు ముస్తాబయ్యాయి. నూతన గవర్నర్ తమిళిసై గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రముఖులు, విద్యార్థులు బాపూ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించనున్నారు. -
గాంధీ జయంతి : మార్కెట్లకు సెలవు
సాక్షి, ముంబై: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్టాక్‌మార్కెట్లకు ఈ రోజు (అక్టోబరు 2, బుధవారం) సెలవు. బాండ్, కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లు కూడా బుధవారం పనిచేయవు. మరోవైపు గాంధీ 150వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ప్రధానమంత్రి, నరేంద్ర మోదీ,రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళులర్పించారు. అటు ప్రపంచవ్యాప్తంగా కూడా బాపూజీని స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు. కాగా మంగళవారం ఆరంభంలోనే పాజిటివ్‌గా ఉన్నప్పటికీ మిడ్‌సెషన్ తదుపరి అమ్మకాలు ఊపందుకోవడంతో ఒక దశలో సెన్సెక్స్ 600 పాయింట్లు పడిపోయింది. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్, రియల్టీ రంగాలలో అమ్మకాలు షాక్ తగిలింది. చివరికి సెన్సెక్స్ 362 పాయింట్లు పతనమై 38305 వద్ద , నిఫ్టీ 115 పాయింట్లు కోల్పోయి 11359 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. राष्ट्रपिता महात्मा गांधी को उनकी 150वीं जन्म-जयंती पर शत-शत नमन। Tributes to beloved Bapu! On #Gandhi150, we express gratitude to Mahatma Gandhi for his everlasting contribution to humanity. We pledge to continue working hard to realise his dreams and create a better planet. pic.twitter.com/4y0HqBO762 — Narendra Modi (@narendramodi) October 2, 2019 -
బాపూ స్ఫూర్తి.. ప్రగతి దీప్తి
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పౌర సేవల్లో ఒక విప్లవాత్మకమైన సంస్కరణలకు నాంది పలికేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం జిల్లాకు వస్తున్నారు. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సచివాలయ వ్యవస్థకు తొలి అడుగు మహాత్ముని జయంతి రోజైన బుధవారం వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఇప్పటికే రెండు పర్యాయాలు సీఎం జిల్లాకు వచ్చి వెళ్లారు. గోదావరికి వరదలు, కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిపోయినæ విపత్కర పరిస్థితుల్లో బాధితుల పక్షాన నిలిచి మనో ధైర్యాన్ని నింపేందుకు సీఎం వచ్చారు. మూడోసారి జిల్లాకు వస్తున్న జగన్ ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి తెస్తున్న ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఆవిష్కరించేందుకు రానుండటంతో ప్రత్యేకత సంతరించుకుంది. ‘తూర్పు’ సెంటిమెంట్‌ను బలంగా విశ్వసిస్తూ సచివాలయ వ్యవస్థను జిల్లా నుంచే శ్రీకారం చుట్టేందుకు సీఎం వస్తున్న క్రమంలో కరపలో భారీ ఏర్పాట్లు చేశారు. గడచిన వారం రోజులుగా ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్ సహా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి తదితర అధికారులు శ్రమించి కరపలో సీఎం ప్రారంభించనున్న∙ సచివాలయం, సచివాలయ స్థూపం, ఇతర ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు. సీఎం వస్తున్నారనే సమాచారంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలిరానుండటంతో జిల్లా యంత్రాంగం కరప జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇది జిల్లా అదృష్టం దేశంలో మరే ముఖ్యమంత్రికీ సాధ్యం కాని సాహసోపేతమైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను జిల్లా నుంచి ప్రారంభించనుండటంతో జిల్లా ప్రజలు తమ అదృష్టంగా భావిస్తున్నారు. కరప గ్రామ సచివాలయ ఆవరణలో సిద్ధమైన సచివాలయ పైలాన్ (స్థూపం) రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాలోని మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం పడమర కండ్రిగలో రాష్ట్ర వ్యాప్త ‘ఇందిరమ్మ’ ఇళ్ల పథకాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు సీఎం జగన్ మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ వ్యవస్థను కరపలో శ్రీకారం చుడుతుండడంతో తండ్రీ, తనయులు జిల్లాపై ప్రేమను చాటుకున్నారని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. తొలి విడతలో ప్రతి మండల కేంద్రంలోను బుధవారం ప్రారంభం అవుతుండగా, మిగిలిన సచివాలయాలు ఈ నెల 15వ తేదీకల్లా పూర్తిచేసేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి సచివాలయంలో రెండు కంప్యూటర్లు, పది టేబుళ్లు, 30 కుర్చీలు, ఫైళ్లు భద్రపరిచేందుకు ఐరన్ రేక్‌లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా వీటికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించారు. కార్పొరేట్ తరహా ఫ్రంట్ ఆఫీస్.. సచివాలయాల్లో కార్పొరేట్ కంపెనీల తరహాలో ఆఫీస్ తీసుకురాబోతున్నారు. రిసెప్షనిస్ట్ మాదిరిగా డిజిటల్ అసిస్టెంట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. డిజిటల్ అసిస్టెంటే అర్జీని తీసుకుని ప్రాథమిక పరిశీలన చేసి సంబంధిత అధికారికి పంపించాలి. సేవల కోసం వచ్చేవారితో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి. ఏకపక్ష గవాక్ష పద్ధతి (సింగిల్ విండో)లో సేవలు అందించాలి. సేవల కోసం ఎవరు ముందు వస్తారో వారి పనులే జరగాలి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలి. జనన, మరణాల నమోదు, ఆస్తిపన్ను మదింపు, ఇతర పన్నుల వివరాలన్నీ ఆన్లైన్లో పొందుపరుస్తుండాలి. ప్రస్తుతం అమలవుతున్న సాఫ్ట్వేర్లను పంచాయతీ కార్యదర్శి అనుమతితో నిర్వహిస్తుండాలి. సచివాలయ ఉద్యోగులు సంబంధిత శాఖల పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తుండాలి. ఎప్పటికప్పుడు ఆయా శాఖల ఉన్నతాధికారులు వారి పనితీరుపై సమీక్షలు చేస్తుంటారు. 62 మండలాల్లో నేటి నుంచి అందుబాటులోకి గ్రామ సచివాలయాలు సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం దిశగా జిల్లాలో తొలి విడత 62 మండల కేంద్రాల్లో గ్రామ సచివాలయాలు బుధవారం నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నెల 15 నాటికి మిగిలిన సచివాలయాలను ప్రారంభించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సచివాలయాలు ఏర్పాటు చేయడమేకాకుండా ఆ సచివాలయాల్లో ఉద్యోగాలు పూర్తి స్థాయిలో నియమించేందుకు కూడా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లాలోని 62 మండలాల్లో 1,271 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటవుతున్నాయి. వీటి ద్వారా పౌర సేవల కోసం జిల్లావ్యాప్తంగా 13,097 పోస్టుల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలచేసింది. ఇందులో ఇప్పటి వరకూ సుమారు 7,500 మందికి మెరిట్ ఆధారంగా నియామక పత్రాలు అందజేశారు. మిగిలిన 5,597 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. వీటిలో ఏఎన్ఎమ్, మెడికల్ అండ్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు 1527 ఉన్నాయి. రాత పరీక్ష ద్వారా పూర్తి పారదర్శకంగా నిర్వహించిన అనంతరం మెరిట్ ఆధారంగా ఎంపికలు చేశారు. ఈ పరీక్షకు జిల్లాలో రికార్డు స్థాయిలో 2,06,211 మంది హాజరై చరిత్ర సృష్టించారు. ఎంపికైన వారిలో 60 శాతం మందికి సోమవారమే నియామక పత్రాలు అందజేయగా మిగిలిన వారికి బుధవారం అందజేయనున్నారు. ఉద్యోగ ఎంపికలు ఇలా.. జిల్లా వ్యాప్తంగా 14 రకాల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేయగా..వైద్య ఆరోగ్య శాఖ మినహా మిగిలిన వాటి నియామక ప్రక్రియ పూర్తయింది. 13 విభాగాలకు సంబంధించి 7,734 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా..5,190 మందికి కాల్ లెటర్లు పంపారు. ఇందులో 3,855 మంది సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. 1335 మంది గైర్హాజరయ్యారు. మున్సిపాలిటీ పరిధిలో 3,560 పోస్టులకుగాను 2,809 మంది హాజరయ్యారు. మార్కులు కలపడం తదితర సమస్యలున్న కారణంగా 1527 ఏఎన్ఎం, మెడికల్, హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ఆగింది. ఈ సమస్యను త్వరలో పరిష్కరించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కొన్నేళ్లుగా నిరీక్షిస్తున్న పరిస్థితి నుంచి సొంత మండలంలోనే విధులు నిర్వర్తించే అవకాశం రావడంతో ఉద్యోగాలు సాధించిన వారి ఆనందానికి అవధుల్లేకుండా ఉన్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయడం చారిత్రాత్మకమంటున్నారు. -
నాటకంలో గాంధీ బాట
జాతీయోద్యమంలో మహాత్మునిది ఒక శకం. బ్రిటీష్‌వారు ఈ ప్రపంచాన్ని పాలించడానికే పుట్టారన్న భావన ఆయన రాకతో పటాపంచలైంది. దక్షిణాఫ్రికాలో మొదటి తరగతి రైలు బోగీ నుంచి∙గెంటి వేయబడిన ఒక భారతీయుని ఆత్మబలం ఆ తర్వాత రోజుల్లో జాతీయోద్యమానికి నాయకత్వం వహించేలా ప్రజ్వరిల్లింది. అహ్మదాబాద్ కోర్టులో మహాత్మునిపై రాజద్రోహం నేరం మోపబడినప్పుడు ‘నేను నిప్పుతో చెలగాటం ఆడుతున్నానని నాకు తెలుసు. కానీ మీరు స్వేచ్ఛనిచ్చి వదిలేస్తే నేను మళ్లీ అదే పని చేస్తాను’ అన్నాడాయన. గాంధీ ఇచ్చిన ఇలాంటి స్టేట్మెంట్లు భారతీయుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అప్పటివరకు ఉన్నత వర్గాలకు పరిమితమైన స్వాతంత్య్ర పోరాటం కింది వర్గాలకు చేరింది. ఆనాడు జాతి యావత్తు గాంధీ వైపు చూసింది. అతని బాట నడిచింది. కవులు గొంతు కలిపారు. కళాకారులు వంతపాడారు. ఎంతో కవిత్వం, అనేక కథలు, నవలలు, నాటకాలు భారతీయ భాషల్లో వచ్చాయి. స్వరాజ్య సాధనే లక్ష్యంగా గాంధీని, గాంధీతత్త్వాన్ని వస్తువుగా చేసుకొని వచ్చిన నాటకాలు నాడు తెలుగునాట ఉర్రూతలూగించాయి. తెలుగులో మొదట గాంధీజీని కథానాయకుడిగా చేసుకొని రెండు నాటకాలు 1. నవయుగం, 2. గాంధీ విజయం రాసినవారు దామరాజు పుండరీకాక్షుడు. ఈయన గొప్ప గాంధేయవాది. ఇంకా, పండిత సీతారామ రచించిన ‘స్వరాజ్యధ్వజము’, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి ‘గాంధీ విజయ ధ్వజ నాటకం’, పాకురి అంజయ్యగారి రచన ‘భారత దివ్య దర్శనం’, ముద్దా విశ్వనాథంగారి ‘జన్మభూమి’, జాస్తి వెంకట నరసయ్య, ధూళిపాల వెంకట సుబ్రహ్మణ్యం గార్లు కలిసి చేసిన రచన ‘కాంగ్రెస్ విజయం’ ముఖ్యమైనవి. గాంధీ మహాత్మున్ని కథానాయకుడిగా ఈ వ్యాస రచయిత రచించిన ‘గాంధీ జయంతి’ (నాటకం), ‘బాపు చెప్పిన మాట’ (నాటిక) విరివిగా ప్రదర్శితమయ్యాయి. గాంధీ బతికి వచ్చి ఈనాటి రాజకీయ నాయకుల్ని, వారి ప్రవర్తనను, ప్రజలపై వారికున్న అవకాశవాద దృక్పథాన్ని చూసి ఎలా స్పందిస్తారనేది ఇతివృత్తం. గాంధీ చెప్పిన మాటను సూచించిన బాటను అనుసరించని రాజకీ య పక్షాలు అన్నీ ఏకమై కుట్రపన్ని ఆయన్ని ఖూనీ కేసులో ఇరికిస్తారు. గాంధీజీకి ఉరిశిక్ష పడుతుంది. గాంధీ తన చివరి కోరికగా భారతదేశంలో మళ్లీ పుట్టాలని ఉందంటాడు. దేవేంద్రుని సారథి మాతలి తీసుకొచ్చిన పుష్పక విమానంపై తిరిగి స్వర్గానికి వెళ్లిపోతూ.. ‘ఉషోదయపు వెలుగుల్లో జాబిలి వెన్నెల్లో నేనే ఉంటాను.. విరిసిన పుష్పం గా, కురిసే మేఘంగా నేనే వస్తాను.. నింగిన చుక్క నై, నాలుగు దిక్కులై నేనే నిలుస్తాను.. అన్యాయపు కోట లని, అవినీతి బాటల్నిఅంధకా రపు గోడల్ని అం తం చే యడానికి మళ్లీ అవతరిస్తా.. అంతం చేస్తా... అంటూ ఆ నాటకం ముగుస్తుంది. – డాక్టర్ దీర్ఘశి విజయభాస్కర్, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత -
గాంధీ ముస్లిం భాయ్.. భాయ్
మహాత్మాగాంధీ జీవితంలో ముస్లింల ప్ర మేయం ఎంత గాఢంగా పెనవేసుకుపోయిందో ఆయన జీవితం తరచి చూస్తే అర్థమవుతుంది. ముస్లింల సంపూర్ణ మద్దతు లేకపోయి ఉంటే వారిలోని మహా మహా నాయకులు గాంధీజీకి తోడుగా నడవకపోయి ఉంటే గాంధీజీ స్వాతంత్య్రోద్యమం అసంపూర్ణంగా ఉండేదనే చెప్పాలి. గాంధీ–ముస్లింల జమిలీగా సాగింది. అసలు గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్లడానికి ఒక సంపన్న ముస్లిం కారణం అని చాలామందికి తెలియకపోవచ్చు. దక్షిణాఫ్రికాలోని వ్యాపారి దాదా అబ్దుల్లా తన వ్యాపార లావాదేవీలలో స్థానిక న్యాయవాదులకు సహకరించాలని ఆహ్వానించడంతో 1892లో గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ భారతీయులు ఎదుర్కొంటున్న వివక్షను స్వయంగా అనుభవించిన గాంధీ దాదా అబ్దుల్లా ఆయన అనుచరుల వినతితో వివక్షకు వ్యతిరేకంగా పోరాటం ఆరంభించారు. దాదా అబ్దుల్లా గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలోనే ‘నాటల్ ఇండియన్ కాంగ్రెస్’ ఏర్పడింది. ఆ సంస్థ తొలి అధ్యక్షులుగా దాదా అబ్దుల్లా, కార్యదర్శిగా ఎం.కె.గాంధీ వ్యవహరించారు. ‘ఆ కారణంగా ప్రజాసే వ చేయాలన్న తలంపు అక్కడే కలిగింది. అందుకు అక్కడే శక్తి చేకూరింది’ అని స్వయంగా గాంధీజీ తన ఆత్మకథలో రాసుకున్నారు. 21 ఏళ్ల పాటు దక్షిణాఫ్రికాలో ఉన్నపుడు దాదా అబ్దుల్లా గాంధీకి అన్నివిధాలా తోడ్పాటు అందించడంతో ‘దాదా అబ్దుల్లా ఆయనకు తండ్రిలా తోడ్పడ్డారు’ అని చరిత్రకారులు అన్నారు. 1915లో గాంధీ భారత్ వచ్చేటప్పుడు అక్కడి గుర్రాల వ్యాపారి, సంపన్నుడైన అబ్దుల్ ఖాదిర్ కూడా ఆయనతో పాటు తన కుటుంబంతో వచ్చారు. సంపన్న జీవి తాన్ని వదిలి గాంధీతో పాటుగా ఆశ్రమ జీవితం గడిపారు. సబర్మతీ ఆశ్రమంలో ముద్రణాలయం బాధ్యతలను నిర్వహిం చారు. గాంధీ ఈయన ను ‘ఇమాం సాబ్’ అని పిలిచే వారు. ఖాదిర్ కు మార్తె అమనా ఖురేషి పెళ్లికి మహాత్మాగాంధీ వధు వు బాబాయిగా తన పేరుతో ఆహ్వానపత్రాలను వేయించి, సబర్మతీ ఆశ్రమంలో దగ్గరుండి పెళ్లి జరిపించారు. మహాత్ముడు బిహార్ రాష్ట్రం చంపారన్‌కు రాకముందే ఈ పోరాటానికి పునాదులను నిర్మించిన రైతు నాయకులు షేక్ గులాబ్, పాత్రికేయుడు పీర్ ముహమ్మద్ మూనీస్ గాం ధీ వెంట నడిచారు. నీలిమందు కర్మాగారా ల ఆంగ్లేయ యజమానులు గాంధీ కార్యక్రమాలకు అంతరాయం కల్పించేందుకు ప్ర యత్నించడమే కాకుండా ఆయనను అం తం చేయాలని సంకల్పించారు. దీన్ని బట్ట బయలు చేసి గాం«ధీ ప్రాణాలను బతఖ్ మియా అన్సారి అనే సాహసి కాపాడారు. ఈ విషయాన్ని భారత ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ 1950లో బహిర్గతం చేయడమే కాకుండా అన్సారికి భూమిని కేటాయించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈనాటినీ ఆ ఆదేశాలు అమ లుకు నోచుకోకపోవడం ఒక విషాదం. గాంధీ రాజకీయ రంగప్రవేశం చేశాక జాతీయ స్థాయిలో పూనిన అతి పెద్ద ఉద్య మం ఖిలాఫత్ – సహాయ నిరాకరణ ఉద్య మం. ఇందులో ఆయనకు అలీ సోదరులు గా ఖ్యాతిగాంచిన మౌలానా మహమ్మద్ అలీ జౌహార్, మౌలానా షౌకత్ అలీ అండదండలు అం దించారు. అలీ సోదరుల తల్లి అబాది బానో 70 ఏళ్ల వయసులో ఉద్య మ నిధులను సేకరిస్తున్న తీరు, జాతీయోద్యమంలోకి మహిళలను, పురుషులను ఆహ్వానిస్తూ చేస్తున్న ప్రసంగాలు గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను ప్రమాదకర మహిళగా ప్రకటించింది. గాంధీతో పాటు ఇతర జాతీయోద్యమకారులంతా ‘అమ్మాజాన్’, ‘బీబీ అమ్మా’ అంటూ ఆమె ను గౌరవించే వారు. ఈ యోధురాలి కార్యదక్షతను, కార్యశీలతను మహాత్ముడు తన యంగ్ ఇండియాలో ప్రత్యేకంగా ఉటంకించారు. అలాగే జాతీయోద్యమం కోసం ఎంతో ఖ ర్చు చేసిన డాక్టర్ ముఖ్తార్ అహ్మద్అన్సారి, షంషున్నీసా అన్సారి దంపతులపై గాంధీ ఎంతో వాత్సల్యం చూపారు. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ‘సరిహద్దు గాంధీ’గా విఖ్యాతుడైన ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్ 1928లో తొలిసారి గాంధీని చూశారు. ఆయుధం ఆభరణంగా కలిగివుంటూ, మిత్రునికి ప్రాణమివ్వడానికి, శత్రువు ప్రాణం తీయడానికి ఏమాత్రం సంకోచించని పఠాన్ జాతి నాయకుడైన గఫార్‌ఖాన్ మహాత్ముడి అహింసా సిద్ధాంతం పట్ల ఆకర్షితులయ్యారు. మహాత్ముడి కార్యాచరణను య«థాత«థంగా అమలుపర్చుతూ ‘ఖుదా–యే–ఖిద్మత్గార్’(భగవత్సేవకులు) సంస్థను 1929లో స్థాపించాడు. భారత జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొనడం, భారత విభజనను అంగీకరించకపోవడంతో ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్ 30 ఏళ్ల పాటు జైలు జీవితం, ప్రవాస జీవితం గడపాల్సి వచ్చినా గాంధీ బాటను వీడక సంపూర్ణ గాంధేయవాదిగా జీవితాన్ని గడిపారు. గాంధీజీకి పూర్తి తోడుగా నిలిచిన మరో మహనీయుడు జస్టిస్ అబ్బాస్ తయ్యాబ్జీ. భారత జాతీయ కాంగ్రెస్ ప్రారంభించకముందే ‘గుజరాత్ రాజ కీ య పరిషత్’ ద్వారా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిర్వహిస్తున్న తయ్యాబ్జీ మహాత్మాగాంధీ ప్రేరణతో 1919లో అన్ని విలాసాలకు స్వస్తిపలికి స్వదేశీ ఉద్యమంలో పూర్తి భాగస్వామి అయ్యారు. ఎనభై సంవత్సరాల వయసులో ఖద్దరును ప్రోత్సహించేందుకుగాను ఎద్దులబండిలో ‘విముక్తి వస్త్రాన్ని’ విక్రయిస్తూ గుజరాత్‌లోని గ్రామాల్లో తిరిగారు. 1930లో 12 మార్చి నుంచి ఏప్రిల్ 6 వరకు సాగిన దండియాత్ర సందర్భంగా బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని అరెస్టు చేసినపుడు ఆయన స్థానంలో యాత్రకు నాయకత్వం వహించిన వ్యక్తి అబ్బాస్. ఈయన గాంధీజీచే ‘గుజారాత్ వజ్రం’గా ప్రశంసలందుకున్నారు. గాంధీ దంపతుల పుత్రిక బీబీ అమతుస్సలాం మహత్ముని అహింసా సిద్ధాంతం, కార్యచరణకు ఆకర్షితురాలై 1931లో అతి ప్రయాసతో సేవాగ్రాం చేరారు. గాంధీ పర్యటనల్లో ఆమే ఆయన వెంటుంటూ సేవలందించారు. గాంధీజీ జిన్నాకు లేఖ రాస్తున్న సందర్భంగా ఆయనను ఏ విధంగా సంబోధించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతుం డగా, అమతుస్సలాం ‘ఖాయిదే ఆజం’అయితే బాగుంటుందని సూచించారు. ఆ విధంగా గాంధీజీ జిన్నాను సంబోదించడంతో ‘ఖాయిదే ఆజం’ పేరుతో జిన్నా పేరొందారు. గాంధీకి సన్నిహితంగా మెలిగిన వారిలో అగ్రగణ్యుడు అబుల్ కలాం ఆజాద్. 1920 జనవరిలో తొలిసారి గాంధీని కలుసుకున్న ఆజాద్ అప్పటి వరకు తాను అవలంబిస్తున్న విప్లవబాటను వీడి అహింసా మార్గాన ఖిలాఫత్–సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. భారత విభజనను, వేర్పాటు వాదాన్ని వ్యతిరేకించారు. మహాత్ముని సహచరులుగా, అనుచరులుగా పురుషులతోపాటుగా చాలామంది ముస్లిం మహిళలు జాతీయోద్యమంలో పాల్గొన్నారు. మహత్ముని ఆదేశాలతో గుజరాత్లో గాంధేయ మార్గంలో సాగిన అన్ని పోరాట రూపాలకు సారథ్యం వహించిన మహిళ అమీనా తయాబ్జీ. గాంధీజీకి ఉర్దూ భాష నేర్పి ఆయనచే ‘వస్తాద్ బీ’అని అనిపించుకున్న మహిళ రెహనా తయాబ్జీ. అసాధారణ దేశభక్తికి అపూర్వ చిహ్నంగా పేర్కొనబడిన సకీనా లుక్మాని పెద్ద వయసులోనూ గాంధీ మార్గాన్ని అనుసరిస్తూ మహాత్ముని ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించారు. స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల త్యాగాలు గాంధీజీకి సంపూర్ణంగా తెలుసు. హిందూ ముస్లింలు కలిసి ఈ దేశాన్ని ముందుకు నడిపించాలని ఆయన ఎంతగానో భావించారు. – సయ్యద్ నశీర్ అహ్మద్ ముస్లిం స్వాతంత్య్ర సమరయోధుల పరిశోధకుడు -
కొల్లాయిగట్టితేనేమి మా గాంధీ...
తెలుగు సాహిత్యకారుల్లో గాంధీ అధికులకు ప్రియమైన వ్యక్తి. కొందరికి జాతిపిత. కొందరికి భగవంతుడి అపరావతారం. కొందరికి నాయకుడు. కొందరికి ఈనాటికీ అనుసరించవలసిన మార్గదర్శకుడు. ఇటీవల కొందరికి ప్రశ్నించవలసిన, కొండొకచో తిట్టవలసిన సామాన్యుడు. స్థూలదృష్టితో తెలుగు సాహిత్యంలో గాంధీ చిత్రణను చూస్తే మొట్టమొదట గుర్తుకొచ్చేది ‘కొల్లాయిగట్టితేనేమి మా గాంధీ కోమటైతేనేమి’ అన్న బవసరావు అప్పారావు గీతమే. ఈ గేయంలో గాంధీని వర్ణించిన తీరు కమనీయంగా, గాంధీని కళ్లెదుట చూస్తున్నట్లుగా ఉంటుంది. ‘వెన్నపూసా మనసు కన్నతల్లీ ప్రేమ పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు చక చక నడిస్తేను జగతి కంపించేను పలుకు పలికితేను బ్రహ్మ వాక్కేను’ అంటూ అప్పారావు గారు ఈ ఒక్క గీతంలోనే కాదు. ఎన్నో గీతాల్లో గాంధీని ప్రస్తుతించారు. గాంధీ వల్లే హిందూ, ముస్లిం ఐక్యత సాధ్యమైందని అంటూ చెరుకువాడ వెంకటరామయ్య–‘మన పాలి భాగ్యమేమందు హిందూ మహమ్మదీయుల పొందు ఘనతర ధైర్యము గల్గించు నాథుడు గాంధి మహాత్ముడు కైదండౖయెనాడు’ అన్నారు. అప్పట్లో దామరాజు పుండరీకాక్షుడు రాసిన ‘శ్రీగాంధీనామము మరువాం మరువాం’ అన్న గీతం అందరి నోటా తరచూ వినిపించేది.కనుపర్తి వరలక్ష్మమ్మ, బసవరాజు అప్పారావు, తుమ్మల సీతారామమూర్తి, జాషువా మొదలైన వారెందరో గాంధీని, సమాజంపై గాంధీ ప్రభావాన్ని నేరుగా ప్రస్తుతించారు.తుమ్మల సీతారామమూర్తి చౌదరిని ‘మహాత్ముని ఆస్థానకవి’గా చేసినవి ఆయన రాసిన ‘ఆత్మకథ’ (గాంధీ స్వీయచరిత్రకు అనువాదం), ‘మహాత్మకథ’, ‘ధర్మజ్యోతి’, ‘ఆత్మార్పణ’, ‘గాంధీగానం’ వంటి కావ్యాలు. మహాత్మకథలో ఆయనంటారు–‘గాంధీయుగమున బుట్టితి గాంధి నడుపు నుద్యమంబుల నలిగితినోపినంతగాంధి వీక్షించితిని గాంధీ కవిత వ్రాయ గంటి నీ జన్మమునకు నీ పంట చాలు’. గాంధీమీద శతకాలు మొదలుకుని స్మృతికావ్యాలు, చివరికి మంగళహారతులు కూడా వచ్చాయి.‘జయగాంధీ దేవా మంగళం జయమంగళం నీకు, సత్యాగ్రహాశ్రమతాపసా శాంత స్వభావ మానసా’’ వంటివి వింటే గాంధీ సహస్రనామ స్తోత్రం విష్ణు సహస్రనామంలా కూడా ఉందని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గాంధీపై కావ్యాలు, గేయాలతోపాటు హరికథలు, శతకాలు, దండకాలు కూడా వచ్చాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి రేడియో కోసం రాసిన గాంధీ పాటలోని కమ్మదనం ఈనాటికీ తాజాగానే ఉంటుంది.‘కమ్మగా బతికితే గాంధీయుగం– మనిషి కడుపునిండా తింటె గాంధీ జగం.తన కంఠమున దాచి హాలాహలం తలనుంచి కురిపించి గంగాజలం మనిషి శివుడవడమే గాంధీ వరం బాపుననుసరిస్తే చాలు మనమందరం’ అంటారు కృష్ణశాస్త్రి. సంప్రదాయకవులుగా భావించే పుట్టపర్తి నుంచి అభ్యుదయ కవులైన ఆరుద్ర, దాశరథుల వరకూ ఎందరో కవులు గాంధీకి తమ కవిత్వంలో చోటిచ్చారు. ‘కొత్తవిజయాలు’ అనే గేయంలో ఆరుద్ర– ‘బుద్ధదేవుని కాలమందున పుట్టలేదని బాధపొందను గాంధి మెట్టిన ఈయుగమ్మే ఘనతరంబని యెంచెదన్’ అని అంటే, ‘అహింసతో హృదయాలను అవలీలగా జయించిన మహాత్ముడే దేశానికి మహనీయ దయాజ్యోతి’ అన్నారు దాశరథి. చివరకు, ‘గాంధీలాలీ మోహన గాంధీలాలీ కరుణాసాంద్రా మోహనదాసాగాంధీలాలీ’ అంటూ జోలపాట కూడ వచ్చిందంటే గాంధీని తెలుగు వారు తమ సాహిత్యంతో ఎంతగా అక్కున చేర్చుకున్నారో అర్థమవుతుంది. ‘కలి యుగ ప్రహ్లాద చరిత్ర’లో దామరాజు పుండరీకాక్షుడు గాంధీని విష్ణుభక్త పరమాణువుగా భావించారు. పద్యం, వచనం, గేయం మూడు ప్రక్రియల్లోనూ గాంధీని కవిత్వీకరించారు కవులు. ఇక కల్పనా సాహిత్యానికి వస్తే కనుపర్తి వరలక్ష్మమ్మ దగ్గర్నుంచి తల్లావఝల పతంజలి శాస్త్రి వరకూ గాంధీ ప్రస్తావనతో కథలు రాశారు. కథలు, నవలల్లో గాంధీ ఒక పాత్రగా అక్కడక్కడా కనిపించినా, గాంధీ నడిపించిన పోరాట ఘట్టాల చిత్రణే ఎక్కువగా కనిపిస్తుంది. నవలల్లో జాతీయోద్యమాన్ని ప్రస్తావించిన తొలి నవల వేలూరి శివరామశాస్త్రిగారి ‘ఓబయ్య’(1920) పూర్తిగా గాంధీ స్ఫూర్తితో వచ్చిందే. ఆ తర్వాత అడవి బాపిరాజు నుంచి మహీధర రామమోహనరావు వరకూ ఎందరో నవలాకారులు గాంధీ స్ఫూర్తిగా కథానాయకుల జీవితాలను చిత్రించారు. 1921లో వచ్చిన ‘మాలపల్లి’లో ప్రత్యేకంగా గాంధీని ఎక్కువసార్లు ప్రస్తావించకపోయినా గాంధీ సిద్ధాంతాల వ్యాప్తే ప్రధానాంశంగా రామదాసును దానికి ప్రతినిధిగా చూపించారు. అడవి బాపిరాజు నవలలు ‘నారాయణరావు’, ‘కోనంగి’ లో కథానాయకులిద్దరూ గాంధీ పిలుపునందుకుని చదువులు, ఉద్యోగాలు వదిలేసుకున్నవారు. విశ్వనాథ ‘వేయి పడగలు’లో నాయకుడు ధర్మారావు జాతీయోద్యమంలో పాల్గొనకపోయినా, కేశవరావు, రాఘవరావు గాంధీ భక్తులుగా కనిపిస్తారు. గాంధీని కృష్ణుడితో, రాట్నాన్ని వేణువుతో, దేశప్రజలను గోపికలతో పోలుస్తూ విశ్వనాథ.. గాంధీ అప్పటి సమాజంపై ఎంతటి ప్రభావం చూపాడో వర్ణిస్తారు. ధర్మారావు మాత్రం హరిజనోద్యమాన్ని, సహాయ నిరాకరణోద్యమాన్ని వ్యతిరేకించడం, అతనికి గాంధీపై తక్కినవాళ్లకున్నంత గౌరవం లేదని తెలుపుతుంది. అడవి బాపిరాజు సంగతి వేరు. ఆయన స్వయంగా గాంధీ అభిమాని కనక ఆయన నవలానాయకుడు నారాయణరావు అలాగే కనిపిస్తాడు. కోనంగి నవలలో గాంధీకే పరిమితం కాకుండా, కమ్యూనిస్టుల భావజాలం గురించి కూడా రాసి, గాంధీ ఆలోచనలకూ, వారి ఆలోచనలకూ ఉన్న తేడాను చెప్పడం ద్వారా బాపిరాజు గాంధీని సవిమర్శకంగా చూసే ప్రయత్నం చేశారు. ‘చివరకు మిగిలేది’ జాతీయోద్యమానికి సంబంధిం చిన నవల కాకపోయినా, దయానిధి పెళ్లిరోజు రాత్రి ఇల్లు వదిలి వెళ్లడంతో అతని జీవితంలో వచ్చిన మలుపు గొప్పది; అలా వెళ్లిపోవడానికి కారణం ‘ఒక సన్నటి, నల్లటి పొడుగాయన కర్ర పుచ్చుకుని తొందరగా కదిలిపోతున్నాడు. అందరూ ఆయన వెనకాల పడ్డారు. ఆయన పాదాల కింద ఇసుక రేణువులై ఈ ప్రజ, ఒక్కసారి లేచి గంతులేసి నలుదిక్కులా వ్యాపించింది’ అని గాంధీని గొప్పగా వర్ణించాడు బుచ్చిబాబు. – మృణాళిని వ్యాసకర్త రచయిత్రి, విశ్రాంత అధ్యాపకురాలు -
విజయ తీరాల ‘తెర’చాప
అహింసా సిద్ధాంతంతో ప్రపంచవ్యాప్తంగా ఎందరో నాయకులకు ‘హీరో’ అయిన గాంధీజీ వెండితెర మీద మాత్రం హీరో కాకుండా ఉంటాడా?. వెండితెరపై ఆయనను చూసుకోకుండా ఈ దేశం ఎలా ఉంటుంది. అయితే ఈ పని చేసిన ఘనత భారతీయ దర్శకుడికి, గాంధీగా నటించి మెప్పించే అదృష్టం భారతీయ నటుడికి దక్కకపోవడమే ఇందులో విశేషం. ‘గాంధీ’ పేరుతో 1982లో విడుదలైన బయోపిక్కే నేటికీ గాంధీజీకి సంబంధించిన ఉత్కృష్టమైన చిత్రం. దీనిని మించిన చిత్రం నేటి వరకూ భారతీయులు తీయలేదు. బ్రిటిష్‌వారి సినిమా ప్లాన్ గాంధీ స్వాతంత్య్రోద్యమాన్ని నాయకస్థాయి నుంచి ప్రజాస్థాయి వరకు తీసుకెళ్లాడు. ఇది తట్టుకోలేని బ్రిటిష్ ప్రభుత్వం.. గాంధీని దెబ్బ కొట్టాలని, 1923లో డి.డబ్ల్యూ.గ్రిఫిత్ అనే దర్శకుడిని సంప్రదించి గాంధీ వ్యతి రేక చిత్రం తీయమంది. అయితే ఆ పని జరగలేదు. గాంధీజీకి నచ్చని మాధ్యమం గాంధీజీకి సినిమా మాధ్యమంపై సదభిప్రాయం లేదు. ఫాల్కే తీయగా దేశమంతా చూసిన తొలి టాకీ ‘రాజా హరిశ్చంద్ర’ను గాంధీ చూడనే లేదు. 1943లో విజయభట్ తీసిన ‘రామరాజ్య’ అనే సినిమాను కొద్దిరీళ్లు మాత్రమే చూశారు. తన జీవితంలో గాంధీజీ చూసి న ఏకైక సినిమా అది. ‘సినిమాల వల్ల ఏం మేలుందో చె ప్పలేను కానీ, చాలావరకు సినిమాలు నాసిరక భావాలు కలిగినవి’ అనే అర్థంలో ఆయన ‘హరిజన్’ పత్రికలో రాశారు. గాంధీజీకి చార్లీచాప్లిన్ విశేషమైన అభిమాని. 1931లో 2వ రౌండ్‌టేబుల్ సమావేశానికి వెళ్లినప్పుడు గాంధీజీ చాప్లిన్‌ను కలిశారు. చాప్లిన్తో మాట్లాడుతూ ‘యంత్రాలనేవి మనిషి శ్రమను తగ్గించాలి. బానిసత్వం నుంచి విముక్తం చేయాలి. వారిని పని నుంచి తొలగించే, మరింత పని కల్పించే భూతాలు కారాదు’ అని చర్చించారు. ఆ ఆలోచనకు చాప్లిన్ ఇచ్చి న గొప్ప సెల్యులాయిడ్ రూపమే ‘మోడరన్ టైమ్స్’. నెహ్రూ ప్రయత్నాలు దేశానికి స్వాతంత్య్రం వచ్చాక గాంధీజీ మీద ఒక పూర్తి స్థాయి సినిమా తీయాలని నెహ్రూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆశించాయి. 1958లో డేవిడ్ లియాన్ వంటి గొప్ప దర్శకుడు గాంధీజీ మీద రాసుకున్న స్క్రిప్ట్ ను నెహ్రూకు చూపాడు. అది ఓకే కాలేదు. 1962లో లండన్‌లో స్థిరపడ్డ గాంధేయవాది మోతీలాల్ కొఠారి నుంచి ప్రఖ్యాత దర్శకుడు అటెన్ బరోకు పిలుపు వచ్చింది ‘గాంధీ’ సినిమా తీయాలని. అటెన్‌బరో ఈ ప్రయత్నాల్లో ఉండగానే 1963లో గాంధీజీపై సినిమా తీయాలనే ప్రభుత్వ ఆలోచనను విరమించుకుంటున్నట్టు నెహ్రూ చెప్పాడు. 18 ఏళ్ల పాటు శ్రమించి, ‘గాంధీ’ సినిమా తీశాడు. సినిమా ప్రారంభానికి నిధుల సమస్య ఎదురైనప్పుడు ఇందిరాగాంధీ సిఫార్సుపై నేషనల్ ఫిలి మ్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ ప్రాథమిక నిధిని విడుదల చేసింది. ఆ సమయంలో తెలుగువాడైన డీవీఎస్ రాజు కార్పొరేషన్ చైర్మన్. బెన్కింగ్స్లే గాంధీ పాత్ర పోషించే అదృష్టం బ్రిటిష్ నటుడు బెన్కింగ్స్లేకు వరించింది. బెన్కింగ్స్లే ఆ పాత్ర పోషించడానికే జన్మించాడా అన్నట్టు ప్రేక్షకులను మైమరిపించా డు. అదీగాక అతని తండ్రి తరఫు పూర్వీకులు గుజరాత్‌కు చెందినవారన్నది సంతోషపరిచే విషయమైంది. 1982 నవంబర్ 30న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. బెన్కింగ్స్లేను ఆస్కార్ అవార్డు వరించింది. దేశీయతెరపై గాంధీ ఇక తెలుగు, హిందీ భాషల్లో గాంధీ ప్రభావంతో గాంధీ పాత్రధారిగా చాలా సినిమాలు వచ్చాయి. గూడవల్లి రామబ్రహ్మం తొలిరోజుల్లో తీసిన సినిమాలు ‘మాలపిల్ల’, ‘రైతుబిడ్డ’ గాంధీ ప్రభావం కథాంశంగా రూపొందించినవే. 1974లో లక్ష్మీదీపక్ తీసిన ‘గాంధీ పుట్టిన దేశం’ మరో ముఖ్యమైన సినిమా. కె.బాలయ్య ‘ఊరికిచ్చిన మాట’, కె.విశ్వనాథ్ ‘జననీ జన్మభూమి’ సినిమాలు ఎంచదగినవి. గాంధీ కోరిన గ్రామ స్వరాజ్యాన్ని, ఆ స్వరాజ్యం సాధించడానికి పడాల్సిన సంఘర్షణను కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘రుద్రవీణ’ సమర్థంగా చూపించింది. యమున నటించిన ‘మౌనపోరాటం’ గాంధీజీ దీక్షాశక్తిని చూపించేదే. అహింసే అసలైన పోరాటమార్గమని చెప్పడానికి కృష్ణవంశీ ‘మహాత్మ’ తీశాడు. గాంధీజీని ప్రస్తావించే పాటలు కూడా తెలుగులో ఉన్నాయి. ‘గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం’ (గాంధీ పుట్టిన దేశం), ‘గాంధీ పుట్టిన దేశమా ఇది’ (పవిత్రబంధం), ‘భలే తాత మన బాపూజీ’ (దొంగరాముడు), ‘కొంతమంది ఇంటిపేరు కాదురా గాంధీ’ (మహాత్మ).. ఇలా అనేకం. లగే రహో మున్నాభాయ్ గాంధీ ప్రభావంతో హిందీలో అశోక్ కుమార్ తీసిన ‘అఛూత్ కన్య’ మొదటిది. శ్యాం బెనగళ్ ‘గాంధీ సే మహాత్మా తక్’, మహెబూబ్ ఖాన్ ‘మదర్ ఇండియా’, హృషికేశ్ ముఖర్జీ ‘సత్యకామ్’, శాంతారామ్ ‘దో ఆంఖే బారాహాత్’ గాంధీ ప్రభావంతో రూపుదిద్దుకున్నాయి. ‘సర్దార్’లో, ‘బాబాసాహెబ్ అంబేద్కర్’లో, కమల్‌హాసన్ తీసిన ‘హే రామ్’లో గాంధీజీ ఒక పాత్రగా కనపడతాడు. గాంధీ సిద్ధాంతాన్ని వినోదాన్ని ముడిపెట్టి హిట్ కొట్టిన సినిమా ‘లగేరహో మున్నాభాయ్’. రాజ్‌కుమార్ హిరాణి తీసిన ఈ సినిమా ఈ తరానికి గాంధీని మళ్లీ పరిచయం చేసింది. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
గాంధీ జయంతికి సైరా
దాదాపు రెండేళ్లుగా సాగుతున్న వెండితెర ‘సైరా: నరసింహారెడ్డి’ ప్రయాణం తుది దశకు చేరుకుంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో హీరో రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈనెల 14న ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ స్టూడియోలో ఓ పాటను చిత్రీకరించనున్నారు. అలాగే ఈ నెల చివరలో హీరోయిన్ అనుష్కపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇక్కడితో ఈ సినిమా చిత్రీకరణ ఆల్మోస్ట్ పూర్తయిపోతుందని సమాచారం. అనుష్క పాత్రతోనే థియేటర్లో ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమా ఆరంభం అవుతుందని తాజా సమాచారం. ఈ ఏడాది గాంధీ జయంతి రోజున (అక్టోబర్ 2) ‘సైరా’ చిత్రాన్ని విడుదల చేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు, తమన్నా కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. -
మద్యమేవ జయతే..
విశాఖపట్నం, చోడవరం టౌన్: నియమ నిబందలకు విరుద్దంగా మంగళవారం పట్టణంతో పాటు గ్రామాల్లోని చేపలు, మాంసం, మద్యం యథేచ్ఛగా విక్రయించారు. గాంధీజయంతి రోజున, స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్య, మాంస విక్రయాలు చేయకూడదని నిబంధనలు ఉన్నా వ్యాపారులు ఖాతరు చేయడం లేదు. వాటిని అరికట్టాల్సిన పోలీసు యంత్రాంగం చూసీచూడనట్టు వదిలేసింది. ఎకె‡్ష్సౖజ్ పోలీసులు కూడా సోమవారం రాత్రి మద్యం దుకాణాలు సీళ్లు వేసినా వారు వేయక ముందే మద్యం వేరే చోటకు తరలించిన వ్యాపారులు వాటిని పాన్‌షాపుల వద్ద, టీదుకాణాల వద్ద విక్రయించారు. పట్టణంలోని ప్రధాన రహదారిమీద, గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ మాంసం విక్రయించారు. యథేచ్ఛగా మాంసం విక్రయాలు మాడుగుల రూరల్: జాతిపిత మహత్మా గాంధీ జయంతిని రోజున విచ్చలవిడిగా మాంసం, చేపలు, విక్రయాలు జోరుగా సాగాయి. అసలే మంగళవారం దీనికి తోడు జోరుగా మాంసం, చేపలు, విక్రయాలు సాగించారు. ఏజెన్సీ ప్రధాన కేంద్రం అయిన ఘాట్‌రోడ్డు జంక్షన్లో గొర్రె మాంసం, రెండు దుకాణాలల్లో విక్రయించారు. ఎం.కె.వల్లాపురం, సాగరం పంచాయతీ పరిధిలో గల ఈ ఘాట్‌రోడ్డు జంక్షన్లో ఈ విక్రయాలు చేస్తున్నా సరే ఎవరూ స్పందించలేదు. కె.జె.పురంలో మంగళవారం జరిగిన వారపు సంతలో కూడా చేపలు విక్రయాలు చేపట్టారు. చేపలు విక్రయాలు చూసిన పంచాయతీ జూనియర్ సహాయకులు ఎ.శ్రీనివాస్, అప్పడుకప్పుడు విక్రయాలు నిలుపుదల చేయించారు. -
బాపు కుటీర్‌లో ప్లేట్లు కడిగిన రాహుల్, సోనియా
-
ప్లేట్లు కడిగిన సోనియా, రాహుల్!!
వార్ధా : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ భోజనం చేసిన తర్వాత తమ ప్లేట్లను కడిగారు. మహాత్మాగాంధీ 150జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని వార్ధాలో ఉన్న మహాత్మా గాంధీ సేవాగ్రాం ఆశ్రమం (బాపు కుటీర్)లో మంగళవారం పార్టీ వర్కింగ్ కమిటీ శ్రద్ధాంజలి సభను ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి రాహుల్, సోనియాతోపాటు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యులు హాజరయ్యారు. బాపు కుటీర్ మహాత్మాగాంధీ చివరి రోజులో గడిపిన ఇల్లు. రాహుల్ ఈ ఆశ్రమానికి రావడం ఇది రెండోసారి. సభ అనంతరం కాంగ్రెస్ నేతలు ఇక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం అనంతరం రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు తమ ప్లేట్లను తాము కడిగారు. వారు మాత్రమే కాక, ఇతర కాంగ్రెస్ నేతలు కూడా తమ ప్లేట్లను కడిగి.. డిగ్నీటీ ఆఫ్ లేబర్‌ను చాటారు. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రద్ధాంజలి సభలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణస్వామి, మాజీ కేంద్ర మంత్రులు శివ్‌రాజ్ పాటిల్, సుశీల్‌కుమార్ షిండే, ఏకే ఆంటోని, హర్యానా మాజీ ముఖ్యమంత్రి బీఎస్ హుడా, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్‌లు పాల్గొన్నారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత ఈ బాపు కుటీర్‌లో సీడబ్ల్యూసీ సమావేశమైంది. 1942 జూలై 14న క్విట్ ఇండియా ఉద్యమంపై ఇక్కడే తీర్మానం చేశారు. ఆ తర్వాత 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం ముంబైలో ప్రారంభమైంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికాలో చిప్పలు కడిగారంటూ... ఇటీవల కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతల విమర్శలపై సోషల్ మీడియాలో విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా తమ పార్టీ అధ్యక్షుడు, యూపీఐ చైర్‌పర్సనే తమ ప్లేట్లను కడగడం ద్వారా.. ఇదేమీ సిగ్గుపడాల్సిన విషయం కాదని చాటారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏమంటారో చూడాలి. -
నేడు మార్కెట్లకు సెలవు
సాక్షి, ముంబై: అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈతో పాటు బులియన్, ఫారెక్స్, మనీ మార్కెట్లు ఇవాళ పని చేయవు. అక్టోబర్ 1 న సెన్సెక్స్ 299 పాయింట్లు పుంజుకుని 36,526.1 వద్ద ముగిసింది. నిఫ్టీ 77.8 పాయింట్లు లాభపడి 11,008.3 వద్ద ముగిసింది. బాపూజీ 150వ జన్మదినం సందర్భంగా యావద్దేశం ఘన నివాళులర్పిస్తోంది. ముఖ్యంగా దేశాధ్యక్షుడు రామ్‌నాధ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు మహాత్ముడికి శ్రద్ధాంజలి ఘటించారు. -
మాంసంపై మీమాంస!
సాక్షి, హైదరాబాద్: అక్టోబర్ 2, గాంధీ జయంతి.. ఈ రోజున దేశ వ్యాప్తంగా మాంస విక్రయాలు జరగవు. అయితే రైల్వే క్యాంటీన్లలో ఇందుకు విరుద్ధంగా గాంధీ జయంతిన మాంసాహారం వడ్డించే ఏర్పాట్లు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దురంతో, రాజధాని, శతాబ్ది లాంటి ప్రీమియం రైళ్లల్లో ప్రయా ణించే వారందరికీ శాఖాహారమే వడ్డించాలని రైల్వే ఈ ఏడాది జనవరిలో నిర్ణయించింది. ఈసారి గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించాలని ఇండియన్ రైల్వే కేటరింగ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) భావించింది. ఇందుకు ఆహార మెనూలో మార్పులు చేసింది. ఈ రోజున భోజనంలో చపాతీలు, పరోటాలు, పనీర్, కూరగాయలతో చేసిన పలు రకాల వంటకాలనే అందించాలని నిర్ణయించింది. గత నెలలోనే నిర్ణయం.. శాఖాహార భోజనం వాస్తవానికి ఈ ఆలోచన జనవరిలో వచ్చినా.. అధికారిక నిర్ణయం మాత్రం సెప్టెం బర్ తొలివారంలో వెలువడింది. దీన్ని చాలామంది ప్రయాణికులు గమనించలేదు. దీంతో ఆ రోజు రైలు ప్రయాణంలో ఉన్నవారిలో చాలామంది మాంసాహారం ఆర్డర్ చేశారు. ఇప్పుడు తమ మెనూ మార్పు పై గందరగోళంలో ఉన్నట్లు సమాచారం. దక్షిణాది నుంచి ఢిల్లీ, గుజరాత్, రాజస్తాన్ ప్రాంతాలకు 28 నుంచి 32 గంటల ప్రయాణ సమయం పడుతుంది. ప్రయాణికులు అక్టోబర్ ఒకటి రాత్రి ప్రయాణం మొదలుపెడితే, వారికి అక్టోబర్ 2న శాఖాహారం అందించి, తిరిగి 3న వారు కోరిన మాంసాహారం ఇవ్వనున్నారు. ముందస్తు నిర్ణయం తీసుకోవడంలో ఐఆర్సీటీసీ విఫలమవడంతోనే ఇది తలెత్తింది. కావాలంటేనే ఇస్తాం: ఐఆర్సీటీసీ దేశవ్యాప్తంగా రోజూ 7 నుంచి 14 లక్షల వరకు ఐఆర్సీటీసీలో టికెట్లు బుక్ చేస్తారు. దక్షిణ మధ్య రైల్వే నుంచి ఈ సంఖ్య లక్షకు పైగా ఉంటుంది. ప్రీమియం రైళ్లలో ప్రయాణం చేసేవారి సంఖ్య 12 వేలకు పైమాటే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది, దక్షిణ మధ్య రైల్వేలో వేలాదిమంది ఇప్పటికే మాంసం ఆర్డర్ చేశారు. వాస్తవానికి తమ షెడ్యూలు ప్రకారం.. అందరికీ శాఖాహారమే వడ్డిస్తామని ఐఆర్సీటీసీ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఐఆర్సీటీసీ పరిధిలో నడిచే ఫుడ్ కోర్టులు, హోటళ్లు, స్టాళ్లకు ఆదేశాలిచ్చినట్లు పేర్కొంటున్నారు. అయితే అప్పటికే ఆర్డర్‌ఇచ్చిన వారు మరీ ఒత్తిడి చేస్తే మాత్రమే మాంసం వడ్డిస్తామని చెబుతున్నారు. లేదంటే మాంసాహారం ఆర్డర్ చేసిన వారికి కూడా శాఖాహారమే అందిస్తామంటున్నారు. -
చిన్న పెన్సిలు ముక్క పెద్ద పాఠం
చిన్న చిన్న విషయాలే పెద్ద పాఠాలు నేర్పిస్తాయి.పెద్ద పెద్ద ఆదర్శలు చిన్న సాధనతోనే ప్రారంభమవుతాయి.చిన్నది ఏదీ వృధా కాదు.చిన్న చిన్న బిందువులేమహా సింధువును సృష్టిస్తాయి. అందరూ హడావుడిగా వెతుకుతూనే ఉన్నారు. ఆకలి, దాహం కూడా మర్చిపోయారు. ఆ రోజు సబర్మతి ఆశ్రమంలో పశువులు కూడా ఉపవాసం ఉన్నాయి. వాటిని చూసుకునే వాళ్లు కూడా వెతికే పనిలోనే ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలు దాటిపోయింది. వంటగది ఖాళీగా ఉంది. వండి వడ్డించే వాళ్లు కూడా వెతికే పనిలోనే మునిగి ఉన్నారు. ఇక కస్తూర్బా గాంధీ దగ్గరకు వచ్చింది. ‘‘బాపూ.. అది చిన్న పెన్సిలు ముక్క. ఎక్కడో పడిపోయి ఉంటుంది. ఊడ్చేవాళ్లు చిన్నదేలే, బాపూజీ పడేశారేమో అనుకుని ఊడ్చేసుంటారు... ఆ చిన్న ముక్క కోసం ఆశ్రమంలోని చిన్నా పెద్దా అందర్నీ ఇలా బాధపెట్టడం బాగోలేదు. మీరు కాస్త ఆలోచించండి.’’ అంది. ఆమె స్వరంలో చోటు చేసుకున్న తీవ్రతకు గాంధీజీ రాట్నం ఆగింది. ‘‘చూడు బా, ‘చిన్నిముక్క’ అన్న నిర్లక్ష్యం నుండి బయటకు రావడానికే ఈ ఉపవాసం... నువ్వనే బలవంతపు బందిఖానా’’ అని దగ్గరగా కనిపిస్తున్న వ్యక్తితో ‘‘బాలూ, అందరినీ ఇక్కడ సమావేశపరచు’’ అన్నారు. బాపూజీ ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నారేమో, ఆశ్రమవాసులందరూ బిలబిలమంటూ వచ్చేశారు. చివరివ్యక్తి కూడా వచ్చాడని నిర్ధారించుకున్న గాంధీజీ గొంతు సవరించుకున్నారు. ‘దొరికిందా?’ అని క్షణం ఆగారు. అందరి మొహాలూ వాడిపోయి ఉన్నాయి, బా ఏదో అనబోతుంటే బాపూజీ ‘బా నా మీద నేరం మోపుతున్నది, చిన్నముక్క కోసం ఆశ్రమంలో ఉన్న చిన్నాపెద్దలకే కాదు, పశువులకూ శిక్ష విధించానని మనందరి భవిష్యత్తుకూ, మన దేశ భవిష్యత్తుకూ.. ఈ సందర్భంలో మనం ఓపాఠం నేర్చుకుందాం. అదేమంటే, చిన్న చిన్న విషయాల్లో మనం జాగ్రత్త వహించాలి. ఈ రోజు పోయిన ఆ చిన్న పెన్సిలు ముక్కే మనకో ఉపాధ్యాయుడు! ఆ పెన్సిలుతో ఇంకొక గ్రంథం రాయగలను నేను. మీకు తెలుసు, మనకు వచ్చే ఉత్తరాల్లో ఖాళీగా ఉన్న భాగాన్ని నేను జమాఖర్చులు రాసేందుకు ఉపయోగిస్తానని. దేనినైనా వృథాగా పారేయడం మీకు న్యాయమనిపిస్తోందా?’’ క్షణమాగి అందరివైపూ చూశారు గాంధీజీ. అందరూ ‘న్యాయం కాదు’ అన్నట్టు తలలూపారు.‘‘మనం నీటిని చుక్కచుక్క పెద్ద బొక్కెనలా విలువగా వాడడం ఇటీవలనే నేర్చుకున్నాం, అందుకు నేనెంతో తృప్తిపడుతున్నాను. రేపు మీరెవరైనా మీ మీ గ్రామాలకు వెళ్లినప్పుడు నీటిని పొదుపుగా వాడడమేగాక, తోటివారికి కూడా తప్పకుండా అవగాహన కలిగిస్తారు. ఈ చిన్ని పెన్సిలు ముక్క అంతే! చిన్ని చిన్ని ప్రారంభాలే కదా, పెద్ద పెద్ద కార్యాలకు మూలం, చిన్నదే కదా అని అశ్రద్ధ చేస్తే అన్ని రంగాల్లోనూ పెద్ద అవినీతికి దారితీస్తుందని మీకు తెలుసు. సత్యం, అహింస, నీతి – వీటిని చిన్నగా సాధన చేయడం మనం ప్రారంభిస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం. చిన్న పెన్సిలు ముక్క నుండి నేర్చుకునేది అదే కదా’’ అంటూ గాంధీజీ ఉపన్యాసాన్ని, ఉపవాసాన్ని కూడా ముగించారు. కస్తూర్బాతోపాటు ఆశ్రమవాసులందరూ కూడా అక్కడి నుంచి తృప్తిగా తమ తమ విధుల్లోకి కదిలారు. – ఝాన్సీ కె.వి.కుమారి -
ఖైదీల విడుదలకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: ఏళ్లకొద్దీ జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. అలాగే మార్గదర్శకాలు కూడా రూపొందించింది. ఈ మేరకు మంగళవారం జీవో విడుదల చేసింది. ఖైదీల విడుదలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో కమిటీలు ఏర్పాటు చేసి మార్గదర్శకాలు రూపొందించాలన్న కేంద్రం సూచన మేరకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సభ్యుడిగా న్యాయ శాఖ కార్యదర్శి, మెంబర్ సెక్రటరీగా జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్‌ను నియమించింది. ఈ ఏడాది అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మొదటి దఫా, వచ్చే ఏడాది ఏప్రిల్ 6 దండి మార్చ్ సందర్భంగా రెండో దఫా.. 2019 ఆక్టోబర్ 2న మూడో దఫాగా ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రత్యేక రిమిషన్‌పై ఖైదీల విడుదల ఆధారపడి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. శిక్షాకాలంలో పొందిన సాధారణ రిమిషన్‌తో సంబంధం లేకుండా ప్రత్యేక రిమిషన్ ద్వారానే విడుదలు ఉంటుందని పేర్కొంది. మార్గదర్శకాలు ఇవే.. - మహిళల కోటాలో 55 ఏళ్లు, ఆపై వయసు ఉండి 50 శాతం శిక్ష అనుభవించిన వారి విడుదలను కమిటీ పరిశీలిస్తుంది. - ట్రాన్స్‌జెండర్ కోటాలో 55 ఏళ్ల పైబడిన వారు, 50 శాతం శిక్షను అనుభవించిన వారై ఉండాలి. - పురుష ఖైదీల కోటాలో 60 ఏళ్లు, ఆపై ఉన్న వారు 50 శాతం అసలు శిక్ష అనుభవించి ఉండాలి. - 70 శాతం అంగవైకల్యం ఉన్న ఖైదీలు 50 శాతం శిక్ష పూర్తి చేసుకొని ఉండాలి. - తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారినీ పరిగణనలోకి తీసుకోనున్నారు. - శిక్షాకాలంలో 66 శాతం పూర్తి చేసుకున్న వారి విడుదలనూ కమిటీ పరిశీలిస్తుంది. - దేశ భద్రత, ఉగ్రవాదం, పోటా యాక్ట్, టాడా యాక్ట్, యూఏపీఏ, రహస్య సంబంధిత కేసులు, హైజాకింగ్, ఆయుధాల సరఫరా, డ్రగ్స్ కేసులు, ఆర్థిక నేరాల్లో శిక్ష పొందిన వారు విడుదలకు అనర్హులుగా మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. -
జైల్లో ఉండటానికి మాత్రమే చంద్రబాబు అర్హుడు
సాక్షి, హైదరాబాద్: రోజుకో అబద్ధం, నిమిషానికో పేదవాడికి అన్యాయం చేస్తూ ప్రజాధనాన్ని దిగమింగుతూ సీఎం చంద్రబాబునాయుడు మోసపూరిత పాలన సాగిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి పద్మజ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గాంధీ జయంతి రోజున చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తూ తూ.చ. తప్పకుండా పాటిస్తుంటే ఆరోజున కూడా అబద్ధాల్లో అంతులేకుండా మాట్లాడి చంద్రబాబు గిన్నిస్ బుక్ రికార్డుకెక్కుతున్నారని ఎద్దేవా చేశారు. నోటికి వచ్చిన మాటల్ని చంద్రబాబు మాట్లాడటంపై ఆమె అశ్చర్యం వ్యక్తంచేశారు. వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలని చంద్రబాబు చెప్పడాన్ని దుయ్యబట్టారు. తన సొంత ఐదారు నివాసాలకు, గెస్ట్ హౌస్‌లకు మరమ్మతుల పేరుతో వందలకోట్ల ప్రభుత్వ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారే తప్ప బాబు పేదవాడికి ఒక్క ఇళ్లు కట్టించిన పాపాన పోలేదన్నారు. చంద్రబాబు ఇంటికి ప్రజాధనంతో వందల కోట్లు ఖర్చుపెట్టి అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని.. మీడియాను కూడా ఆ ఇంట్లోకి అనుమతించలేదన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో 48 లక్షల ఇళ్లు కట్టించారని.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోనే 27 లక్షల వరకు నిర్మించారని పద్మజ గుర్తుచేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని లక్షల ఇళ్లు కట్టించలేదన్నారు. ఏడాదికి 10వేల ఇళ్లు కూడా కట్టలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న చంద్రబాబు.. రాబోయే ఏడాదిలో 17లక్షల ఇళ్లు కడతానని చెప్పడం పచ్చి మోసం, దగాయేనని చెప్పారు. ఎన్నికల కోసం బాబు మళ్లీ అబద్ధాలు మొదలుపెట్టాడన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా? ఎందుకు పదే పదే అబద్ధాలతో ప్రజలను మోసగిస్తున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. 3సెంట్ల భూమిలో లక్షన్నర ఇళ్లు కట్టిస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా దాని ఊసేలేకపోగా.. నిర్మాణంలో ఉన్న వాటిని కూడా అపేసిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. నాలుగు బడ్జెట్లలో ఇళ్ల నిర్మాణానికి ఏ మాత్రం కేటాయింపులు జరపుకుండా, 2014వరకు జరిగిన ఇళ్ల నిర్మాణాలు కూడా నిలిపేయాలని ఆదేశాలిచ్చిన సీఎం ఒక్క చంద్రబాబు మాత్రమేనని ఆమె మండిపడ్డారు. ఏడాదిలోగా ఎప్పుడైనా ఎన్నికలొచ్చే అవకాశాలున్నాయన్నారు. ప్రభుత్వమే భూములిచ్చి లక్షన్నరతో ఇళ్లు కట్టిస్తామని టీడీపీ మేనిఫెస్టోలో చెప్పి నాలుగేళ్లు అవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. మరోవైపు నిర్మాణదశలో ఉన్న ఇళ్లను కూడా ఆపేసిన చంద్రబాబు.. గాంధీ జయంతి రోజున అబద్ధాలు వల్లె వేయటంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. లక్ష గృహప్రవేశాలు చేశాను, మరో 17లక్షల ఇళ్లు కట్టిస్తామంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కుమారుడు లోకేశ్‌కి మంత్రి పదవి ఇవ్వటంలో చూపిన శ్రద్ధ బాబుకు పేదలపై లేదని పద్మజ విమర్శించారు. సొంత ఆస్తుల మరమ్మతులకు వందల కోట్లు ఖర్చుచేసి.. ఆ ఇంట్లో కుటుంబాన్ని ఉంచకుండా ఫైవ్ స్టార్ హోటల్స్‌లో ప్రభుత్వ ధనంతో అద్దెలు కడుతూ దుర్వినియోగం చేస్తున్నారని పద్మజ నిప్పులు చెరిగారు. పేదల పట్ల చంద్రబాబుకు మొదటి నుంచి చిత్తశుద్దే లేదన్నారు. ఏడాదికి 5లక్షల పైచిలుకు పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టిన వైఎస్ఆర్ పాలనకు, కేవలం 10వేల ఇళ్లు కూడా చేపట్టని బాబు పాలనకు వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు. గ్రాఫిక్స్‌లో రాజధానిని చూపించినట్టే, రాబోయే ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు బాబు మళ్లీ పన్నాగం పన్నుతున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు విజయవాడలో కృష్ణానది ఒడ్డున అక్రమ నిర్మాణంలో నివాసముంటూ నదీ పరిరక్షణ చట్టాలను ఉల్లాంఘించారని పేర్కొన్నారు. కోర్టు నోటీసులు అందుకున్నాక సమాధానం దాటవేశారన్నారు. బాబు ఇళ్లపై, ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ చేపడితే ఆయన బండారం బయటపడుతుందన్నారు. ఏ ఇంట్లో ఉండేందుకు చంద్రబాబు అర్హుడు కాదని, జైలులే ఉండేందుకే ఆయన అర్హుడని పద్మజ విమర్శించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ఏపీ ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని పద్మజ స్పష్టం చేశారు. -
వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, రాష్ట్ర కార్యదర్శి పుత్తా ప్రతాప్‌రెడ్డి, పార్టీ నేత సాగి దుర్గాప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
బాపు, శాస్త్రిలకు జాతి ఘన నివాళి
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ, దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ నాయకులు సోమవారం వారిరువురి సమాధుల వద్ద నివాళులర్పించారు. గాంధీ సిద్ధాంతాలైన సత్యం, అహింసలను ప్రజలంతా అనుసరించాలని వారు పిలుపునిచ్చారు. గాంధీ సమాధి రాజ్‌ఘాట్, శాస్త్రి సమాధి విజయ్ ఘాట్ వద్ద కోవింద్, మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ట్వీటర్‌లోనూ వారు నివాళుర్పించారు. జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్ వద్ద 1.8 మీటర్ల ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించా రు. రామరాజ్యం సాధించాలనేది గాంధీ కల అనీ, దానిని నెరవేర్చేందుకు ప్రజలు కృషి చేయాలని వెంకయ్య పిలుపునిచ్చారు. గాంధీ, శాస్త్రిలకు నివాళులర్పించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మహాత్ముడి సిద్ధాంతాలను చివరి శ్వాస వరకు పాటిస్తామని ప్రజలంతా ప్రతిజ్ఞ చేయాలన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లోనూ స్పీకర్ సుమిత్రా మహాజన్, మోదీ గాంధీ, శాస్త్రిలకు నివాళులు అర్పించారు. చైనా, నెదర్లాండ్స్‌లోనూ గాంధీ జయంతి గాంధీ జయంతిని చైనా బీజింగ్‌లోని చవోయాంగ్ పార్క్‌లో ఘనంగా నిర్వహించారు. నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లో వివిధ దేశాలకు చెందిన 800 మంది గాంధీ మార్చ్ నిర్వహిం చారు. యూకేలోని వేల్స్లో 6 అడుగుల ఎత్తు, 300 కిలోల బరువైన గాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్డిఫ్‌లోని లాయ్డ్ జార్జ్‌లో దీనిని ప్రతిష్టించారు. -
గాంధీ జయంతి.. వైరల్ ఫొటో
సాక్షి, హైదరాబాద్: జాతిపిత మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ఓ చిన్నారి మహాత్మునికి విలువైన నివాళులర్పించింది. అక్టోబర్-2 మహాత్ముని పుట్టిన రోజు సందర్బంగా నోట్‌బుక్‌లో గాంధీ చిత్రాలను అతికించాలని ఇచ్చిన స్కూల్ ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా ఆ చిన్నారి రూ. 500, రూ. 2000 నోట్లలోని గాంధీ చిత్రాలను కట్ చేసి అంటించింది. అయితే ఆ పాప ఎవరో, ఈ ఫోటో నిజమో.. కాదో తెలియదు కానీ ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు మాత్రం ఆ చిన్నారిని టీచర్ మెచ్చుకోవడం ఏమో కానీ ఆ పాప తల్లితండ్రులు చూస్తే కళ్లు తిరిగి పడిపోవడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇలా నోట్లు కట్ చేయడం చట్టరీత్యా నేరం. ఆపాపకు ఈ విషయం తెలియక పోవచ్చు లేదా వారి తల్లితండ్రులు గమనించకపోవచ్చని ఫోటోను చూస్తే తెలుస్తోంది. Such an Innocent and Costly tribute to Mahatma Gandhi. #GandhiJayanti pic.twitter.com/smsQ3zYuOI — Godman Chikna (@Madan_Chikna) 2 October 2017 -
మరో కుటుంబంలో ‘కారు’ చీకట్లు!
-
మరో కుటుంబంలో ‘కారు’ చీకట్లు!
♦ మద్యం మత్తులో తల్లీకూతుళ్లను ఢీకొట్టిన యువకులు ♦ గాంధీ జయంతి రోజున హైదరాబాద్‌లో దారుణం ♦ బ్రెయిన్‌డెడ్ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న చిన్నారి సంజన ♦ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న తల్లి శ్రీదేవి ♦ నిందితుల్లో ఒకరు అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరు హైదరాబాద్: డ్రంకన్ డ్రైవ్ మరో కుటుంబంలో చీకట్లు నింపింది. గాంధీ జయంతి రోజునే తప్పతాగి కారు నడుపుతున్న కొందరు యువకుల సరదా ఐదేళ్ల చిన్నారికి ప్రాణాపాయాన్ని తెచ్చిపెట్టింది. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు రోడ్డు దాటుతున్న తల్లీకూతుళ్లను ఢీకొట్టారు. ఈ ఘటనలో తల్లి తీవ్రంగా గాయపడగా.. చిన్నారి బ్రెయిన్‌డెడ్ స్థితిలో మృత్యువుతో పోరాడుతోంది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని పెద్ద అంబర్‌పేట వద్ద ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు ఈ ప్రమాదానికి కారణమైన వారిలో ఒకరిని సోమవారం రాత్రి అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కొందరు యువకులు మద్యం మత్తులో వాహనం నడిపి బంజారాహిల్స్‌లో ఎనిమిదేళ్ల చిన్నారి రమ్యను బలి తీసుకున్న ఉదంతం పూర్తిగా మరువకముందే ఈ దుర్ఘటన జరగడం విషాదకరం. పుట్టింటికని వెళుతూ.. సికింద్రాబాద్‌లోని మౌలాలి ప్రశాంత్‌నగర్‌లో నివసించే ఎస్వీ శివానంద్ స్థానికంగా బార్బర్ షాపు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య శ్రీదేవి, కుమార్తెలు ప్రవళిక, సంజన. దసరా సెలవులు రావడంతో శ్రీదేవి ఆదివారం సాయంత్రం తన ఇద్దరు కుమార్తెలతో పసుమాములలో కళానగర్‌లోని పుట్టింటికి బయలుదేరింది. పెద్ద అంబర్‌పేట వద్ద రాత్రి 9 గంటల సమయంలో వారు బస్సు దిగారు. శ్రీదేవి సంజనను ఎత్తుకుంది, పక్కన ప్రవళికతో కలసి రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో చౌటుప్పల్ వైపు నుంచి వేగంగా దూసుకువచ్చిన సాంత్రో కారు (ఏపీ29 ఎన్ 5799) వారిని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీదేవి, సంజన తీవ్రంగా గాయపడ్డారు. ముందుగా రోడ్డు దాటిన ప్రవళిక త్రుటిలో తప్పించుకుంది. వారిని ఢీకొట్టిన కారు ఆగకుండా వెళ్లిపోతుండడాన్ని గమనించిన స్థానికులు వెంటపడి ఆపారు. కారు తాళం చెవులు లాక్కుని పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ హడావుడిలోనే కారులోని ముగ్గురు యువకులు తప్పించుకుని పారిపోయారు. స్థానికులు శ్రీదేవి, సంజనలను హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రిలో చేర్చారు. సంజన పరిస్థితి విషమంగా మారడంతో ఎల్బీ నగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ఒక నిందితుడు అరెస్టు కారులో ఉన్న ముగ్గురు యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మత్తులో ఉండడమే కాదు.. కారు నడుపుతూ సైతం వారు మద్యం తాగినట్లు గుర్తించారు. ఆ కారులో మద్యం కలిపిన నీళ్ల బాటిల్‌తో పాటు తినుబండారాలు, గ్లాసులు లభించాయి. ఈ ప్రమాదానికి కారణమైన ముగ్గురు నిం దితుల్లో ఒకరైన వెంకటరమణ (38)ను హయత్‌నగర్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. హయత్‌నగర్‌లోని భాగ్యలత కాలనీలో నివాసముండే వెంకటరమణ మాదాపూర్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను కొత్తపేట్‌లో ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహించే యాదిరెడ్డి, ఎలక్ట్రీషియన్ శ్రీనివాస్‌లతో కలసి కారులో బాటసింగారం పరిసర ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. ముందుగా కొని పెట్టుకున్న మద్యం సీసాలను తమ వెంట తీసుకెళ్లారు. రాత్రి వరకు అక్కడే గడిపిన వారు.. తిరిగి వచ్చే ముందు, కారులోనూ మద్యం తాగారు. ఆ మత్తులో డ్రైవింగ్ చేస్తుండగా రాత్రి 9 గంటలకు పెద్ద అంబర్పేట్ వద్ద తల్లీకూతుళ్లను ఢీకొట్టారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్లు 337, 338, 109లతోపాటు మోటార్ వెహికిల్ యాక్ట్ 185 సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు వనస్థలిపురం ఏసీపీ భాస్కర్‌గౌడ్ తెలిపా రు. మరో ఇద్దరు నిందితులు యాదిరెడ్డి, శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కారులో దొరికిన సీసాలను ల్యాబ్‌కు పంపించి పరీక్షిస్తామని చెప్పారు. బ్రెయిన్‌డెడ్ స్థితిలో చిన్నారి ఈ దుర్ఘటనలో సంజనకు తల, తుంటి, ఛాతీ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. సంజన బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరిందని, పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక కడుపు, ఛాతీ, తలకు తీవ్ర గాయాలైన శ్రీదేవి సన్‌రైజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనతో వారి కుటుంబ సభ్యులంతా ఆవేదనలో మునిగిపోయారు. సంజనకు చికిత్స నిమిత్తం రోజుకు రూ.30 వేలకుపైగా అవుతుందని వైద్యులు చెబుతున్నారని.. నిరుపేదలైన చిన్నారి తల్లిదండ్రులు అంత సొమ్ము చెల్లించలేరని బంధువులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి సాయం చేయాలని కోరుతున్నారు. -
మహత్ముడికి ఇచ్చే గౌరవం ఇదేనా?
గాంధీ జయంతి రోజు జోరుగా మాంసం, మద్యం విక్రయాలు పట్టించుకోని అధికారులు మెదక్ రూరల్: అహింసా మార్గంలో నడిచి తెల్ల దొరల చీకటి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహ పెకిలించి భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించేలా కృషి చేసిన జాతిపిత మహత్మాగాంధీ పుట్టిన రోజున జోరుగా మాంసం, మద్యం విక్రయాలు కొనసాగాయి. దీనిని అరికట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జీవహింస మహపాపం, అహింస చేయరాదన్న మహత్మాగాంధీ సిద్ధాంతానికి తూట్లు పొడిశారు. ఈ తతంగం అంతా గ్రామాల్లో బహిరంగంగానే జరిగినా అధికారులు, ప్రజాప్రతినిదులు పట్టించుకోక పోవడం గమనార్హం. స్వాతంత్య్రోధ్యమంలో ముఖ్యపాత్ర వహించి అహింసా మార్గంలో నడిచి 200ఏళ్లుగా భారతదేశాన్ని పాలించిన బ్రిటీష్ దొరల బానిసత్వపు చెరసాల నుంచి కాపాడిన మహత్మగాంధీ పుట్టినరోజున ఆయన ఆదర్శాలను గంగలో కలిపారు. మెదక్ మండలంలోని కూచన్‌పల్లి, బూర్గుపల్లి, సర్ధనతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం నుంచే మాంసం విక్రయాలు జోరుగా సాగాయి. దీంతో పాటు ఆయా గ్రామాల్లో గల బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలు యథేచ్ఛగా జరిగాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని యావత్ దేశానికే సెలవు ప్రకటించి ఏ జీవిని చంపకూడదని, మద్యం విక్రయించరాదు, సేవించరాదని అధికారులు ప్రకటించినప్పటికీ ఆచరనలో మాత్రం ఎక్కడా అమలు కావడంలేదు. ఏడాదికోసారి మహత్ముడి జయంతిని పురçస్కరించుకుని తూతూమంత్రంగా గాంధీ చిత్రపటానికి, విగ్రహలకు పూలమాల వేస్తున్నారు తప్ప ఆయన ఆశయాలను మన నేతలు ఎక్కడా అమలు పరచడంలేదు. అలాగే మండల పరిధిలోని హవేళిఘణాపూర్ శివారులోని గల మెదక్-బోధన్ ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఓ దాబాలో ఉదయం నుంచే యథేచ్చగా మద్యాన్ని సేవిస్తున్నారు. పట్టణానికి పట్టుమని 5కిలో మీటర్ల దూరంలేని ఈ ప్రాంతాల్లో మాంసం, మద్యం విక్రయాలు జోరుగా కొనసాగినప్పటికీ పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ఇప్పటికైనా అధికారులు అలసత్వం వీడి గాంధీజీ కలలు కన్న ఆశయాలను నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. -
సింగన్నగూడలో మద్యనిషేధం
తాగినా, అమ్మినా జరిమానా గాంధీ జయంతి సందర్భంగా నిర్ణయం గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించిన ఎస్ఐ ములుగు: సంపూర్ణ మద్యనిషేధం దిశగా సింగన్నగూడ అడుగులు వేసింది. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ములుగు మండలం సింగన్నగూడ వాసులు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. మద్యం మానేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో మద్యాన్ని అమ్మినా, తాగినా లక్ష రూపాయల జరిమానా విధించాలని స్థానికులు గ్రామ పంచాయతీ ద్వారా తీర్మానం చేశారు. తీర్మానాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు ఎస్ఐకి రాతపూర్వకంగా వినతిపత్రాన్ని అందజేశారు. మద్యానికి దూరంగా ఉంటామని ఎస్ఐ శ్రీశైలం స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు అమృతవీణ, సర్పంచ్ అనీల, నాయకులు బాలకృష్ణ, భాస్కర్, స్వామిగౌడ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
తిరుపతిలో పోలీసుల ఓవరాక్షన్
తిరుపతి: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించాలకున్న నేతలకు, ప్రజలకు తిరుపతి పోలీసులు షాక్ ఇచ్చారు. తిరుపతి పట్టణంలోని గాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాళులర్పించిన తర్వాతే.. మిగతా నేతలకు అనుమతి ఇస్తామని పోలీసులు తేల్చిచెప్పారు. పోలీసుల తీరుతో వివిధ పార్టీల నాయకులు విస్తుపోయారు. జాతిపితకు నివాళులర్పించకుండా అడ్డుపడుతున్న పోలీసుల తీరుపై వివిధ పార్టీల నేతలు నిరసనకు దిగారు. దీంతో తిరుపతిలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం చంద్రబాబు ఆదివారం తిరుపతి పర్యటన సందర్భంగా పోలీసులు ఇలా ఓవరాక్షన్ చేస్తుండటంపై నేతలు అసహనం వ్యక్తం చేశారు. -
ఆపరేషన్ ధూల్‌పేట్ సక్సెస్!
- గుడుంబా రహిత జిల్లాగా హైదరాబాద్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరంగల్ మినహా ఏ జిల్లాలోనూ గుడుంబా లేదంటున్నారు ఆబ్కారీ అధికారులు. ఆదిలాబాద్ మొదలుకొని ఖమ్మం వరకు ఇప్పటికే 8 జిల్లాలు గుడుంబా రహితమైనవిగా అక్కడి కలెక్టర్లు ప్రకటించారు. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ కూడా ఆ జిల్లాల సరసన చేరబోతోంది. ధూల్‌పేటలో నాటుసారా తయారీ, అమ్మకాలు లేకుండా చేస్తే మాత్రం అది గొప్ప విజయమే. అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని హైదరాబాద్ జిల్లా డిప్యూటీ కమిషనర్ వివేకానంద రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డి చెబుతున్నారు. ఆదివారం(నేడు) గాంధీ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో మంత్రి టి. పద్మారావు సమక్షంలోనే జిల్లా కలెక్టర్ హైదరాబాద్‌ను గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించనున్నారు. ఐదు నెలల్లో నెరవేరింది... ప్రభుత్వం ఏడాది క్రితం గుడుంబా రహిత రాష్ట్రంగా చేయాలని నడుం బిగించింది. ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ దీనిపై భారీ కసరత్తు జరిపి, పకడ్బందీ ప్రణాళికతో హైదరాబాద్, వరంగల్ మినహా 8 జిల్లాల్లో ఫలితాలు సాధించారు. అనంతరం గత మే నెలలో ధూల్‌పేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గుడుంబా నిర్మూలన కోసం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటిండెంట్ నంద్యాల అంజిరెడ్డికి ప్రత్యేక బాధ్యత అప్పగించారు. ఆయన ఈఎస్, డీసీలతో కలసి పక్కా ప్రణాళికతో ఐదు నెలల్లోనే ఫలితాలను సాధించారు. -
నేడు మాంసం విక్రయాలు బంద్
మెదక్ మున్సిపాలిటీ: గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం మెదక్ పట్టణంలో మాంసం, మద్యం విక్రయాలు నిషేధమని మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలో ఎవరైన మటన్, చికెన్, చేపలు, మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
చీపురు పట్టిన గవర్నర్ దంపతులు
-
మురికి కాల్వలో చెత్త తీసిన చంద్రబాబు
విజయవాడ : మహాత్మగాంధీ జన్మించిన అక్టోబర్ 2వ తేదీ పవిత్రమైన రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారని ఆయన గురువారమిక్కడ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా చంద్రబాబు నూతన రాజధాని విజయవాడలో పలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు తిలకం దిద్దుతూ మహిళలు స్వాగతం పలికారు. మరోవైపు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మురికి కాలువలో చెత్త తీశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొన్నారు ఆ తర్వాత స్వచ్ఛ భారత్ ర్యాలీలో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం సింగ్ నగర్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రెండు రూపాయలకే 20 లీటర్ల తాగునీరు పంపిణీ జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. మాకినేని బసవపూర్ణయ్య స్టేడియంలో వికలాంగులు, వృద్ధులకు పెంచిన పింఛన్ పథకం ప్రారంభించారు. -
పాత అలవాట్లు మానుకోవటం కష్టమే...అయితే
న్యూఢిల్లీ : దేశంలో ఉన్న పరిస్థితులను మహాత్మా గాంధీ కళ్లద్దాల ద్వారా చూస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా గురువారమిక్కడ మాట్లాడుతూ మహాత్మాగాంధీ పరిశుభ్ర భారత్ నినాదానికి పిలుపు ఇచ్చారన్నారు. అయితే ఆ నినాదం ఇప్పటికీ అసంపూర్తిగా ఉండిపోయిందన్నారు. బాపూజీ ఆశయ సాధన కోసం మనమంతా చేయాల్సింది ఒక అడుగు ముందుకు వేయటమేనని మోడీ పిలుపునిచ్చారు. భారతీయులంతా కలిసికట్టుగా పనిచేసి ఒక ప్రేరణాత్మక వాతావరణాన్ని సృష్టించాలన్నారు. మనమంతా దేశభక్తితో ఇది చేయాలే కానీ...రాజకీయ ఉద్దేశంతో కాదని ఆయన అన్నారు. సర్పంచ్ల ప్రోత్సాహంతో వందశాతం పరిశుభ్రతంగా మారిన గ్రామాలను అనేకం తాను చూశానన్నారు. పరిశుభ్రత కేవలం సఫాయి కార్మికులదేనా అని మోడీ ప్రశ్నించారు. 125 కోట్ల భారతీయులు ఇక భారతమాతను మురికిగా ఉండాలని అనుకోరని ఆయన అన్నారు. పాత అలవాట్లను మానుకోవటం కొంచెం కష్టమే అని అయితే అందుకు మనకు ఇంకా 2019 వరకూ సమయం ఉందని మోడీ అన్నారు. చెత్త ఉన్న ప్రాంతం ఫోటో తీయండి, ఆ తర్వాత వాటిని శుభ్రం చేశాక ఫోటో తీసి నెట్ లో పెట్టాలని మోడీ అన్నారు. మార్స్ మిషన్ పూర్తి చేసింది ప్రధాని, మంత్రులు కాదని, భరతమాత బిడ్డలని అన్నారు. అతి తక్కువ ఖర్చుతో అంగారకుడిపై మార్స్‌ను ప్రయోగించిన మనం దేశాన్ని శుభ్రం చేసుకోలేమా అని ప్రశ్నించారు. బహిరంగ ప్రదేశాలలో పరిశుభ్రత కార్యక్రమంలో తాను తొమ్మిదిమంది పాల్గొనాలని పిలుపునిచ్చానని...వారు మరో తొమ్మిది మందికి ఆహ్వానం పంపాలని మోడీ కోరారు. అపరిశుభ్రత వల్ల వచ్చే రోగాలకు కుటుంబం ఏటా ఆరువేలు ఖర్చు పెడుతుందని మోడీ గుర్తు చేశారు. పరిశ్రుభతను పాటిస్తే ఆ ఆరువేలు ఆదా చేసినవారు అవుతారన్నారు. అనంతరం ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. -
స్కూల్ లో బెంచీలు తుడిచిన గవర్నర్
హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ దంపతులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్‌భవన్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ దంపతులు గురువారం ఉదయం పాల్గొని రోడ్డును ఊడ్చారు. గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. రాజ్‌భవన్ కాలనీలోని ఓ స్కూల్, కమ్యూనిటీ హాలులో బెంచీలు తుడిచారు.. ఉద్యోగులు చేత క్లీన్ ఇండియా ప్రమాణం చేయించారు. స్వచ్ఛ భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని నరసింహన్ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్నినిర్మిద్దామని ఆయన కోరారు. క్లీన్ అండ్ గ్రీన్ హైదరాబాద్ మన టార్గెట్ కావాలని నరసింహన్ సూచించారు. ప్రతి ఒక్కరూ తమ చుట్టు ఉన్న పరిసరాలను శుభ్రం చేసుకునేందుకు శ్రమదానం చేయడం వల్ల పరిశుభ్రమైన భారత్‌ను సాధించేందుకు వీలుపడతుందన్నారు. -
స్వచ్ఛ భారత నిర్మాణానికి ఇదే మొదటి మెట్టు!
-
క్షమించకు బాపు..
అక్టోబర్ 2 నాడే.. అమర్ రహే గాంధీ ! ‘ముష్టెత్తే జాతిపితలు’ ఏ ప్రగతికి నాంది ? ముక్కుపచ్చలారనోళ్లు... ‘సిల్వర్’ గాంధీలా..! పేదరికపు పంజరాన.. చిక్కిన బందీలా ! పచ్చ నోట్ల మీద చిందు.. గాంధీ చిరునవ్వు బిచ్చమెత్తు బాల్యానికి చెవ్వులోన పువ్వు ! అహింసతో స్వాతంత్రం తెచ్చిన ఓ బాపు... నీ రూపంతో సాగే వ్యాపారాన్నాపు. గాంధీ బొమ్మలు పెట్టాం.. గాంధీ గుడి కట్టాం.. అడుక్కునే వాణ్ని చేసి నడివీధికి నెట్టాం ! ఈశ్వర, అల్లా అంటే నిజమే అనుకున్నాం. పైసాయే పరమాత్మని ఇపుడు తెలుసుకున్నాం. - తనికెళ్ల భరణి -
గాంధీజయంతి సెలవును రద్దుచేసిన కేంద్రం
దేశాన్ని పరిశుభ్రంగా మార్చడానికి చేపట్టిన 'స్వచ్ఛభారత్' కార్యక్రమం కోసం కేంద్రం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి రోజున ఈ కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా ఆరోజు సెలవును రద్దుచేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వేటికీ ఆరోజు సెలవు ఉండబోదు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ అక్టోబర్ రెండోతేదీన ప్రారంభిస్తారు. స్వయంగా తాను సైతం ఆరోజు చీపురు పట్టుకుని శుభ్రపరుస్తానని మోదీ ఇంతకుముందే చెప్పారు. ఆ రోజు కార్యక్రమంలో పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కార్పొరేట్ కార్యాలయాలు కూడా పాల్గొంటాయి. ఇండియా గేట్ వద్ద మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బాపూజీ 150వ జయంతి సందర్భంగా ఈ భారీ కార్యక్రమం చేపట్టారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తదితర సెలబ్రిటీలు కూడా ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. -
బంగారం కొనొద్దు: జయప్రకాష్ నారాయణ
హైదరాబాద్: బంగారం కొనకూడదని ప్రతిఒక్కరూ నిర్ణయం తీసుకోవడం ద్వారా గాంధీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించగలమని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. ఒకవేళ తప్పనిసరిగా కొనాల్సివస్తే మనం అనుకున్నదాంట్లో 50 శాతం మాత్రమే కొనాలని సూచించారు. మౌలికావసరాలకు ఢోకాలేనివారు తమ ఆదాయం, సమయంలో పది శాతం సమాజానికి కేటాయించాలని కోరారు. మహాత్ముడు పుట్టినరోజు సందర్భంగా ప్రజలు ఈ రెండు ప్రతిజ్ఞలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా బుధవారం పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను, పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బంగారం డిమాండ్‌ను తగ్గించి మనకున్నదాంట్లో పది శాతం సమాజానికిస్తే అందరం అభివృద్ధి చెందుతామని, దేశమూ అభివృద్ధి చెందుతుందన్నా రు. బంగారం దిగుమతిని ఆపితే మనకు కరెంట్ ఖాతా లోటు ఉండదన్నారు. -
మద్యపానం నిషేధించాలని మహిళల దీక్ష
ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌లైన్: మద్యపానాన్ని నిషేధించాలన్న డిమాండుతో గాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఎదుట మహిళలు బుధవారం ఒక రోజు దీక్ష చేశారు. తెలంగాణ బీసీ సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వడ్డెబోయిన వరలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్ష శిబిరాన్ని ఖమ్మంలోని రిక్కాబజార్ హైస్కూల్ హెచ్ఎం మంజుల ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. మద్యపానంతో ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. మద్య నిషేధం విధించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు చెవుల వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు గుజ్జరి పండరినాధ్, సోమా అశోక్, మల్లేష్, చింతల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరాన్ని వైఎస్ఆర్ సీపీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ తోట రామారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మార్కం లింగయ్య, సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ కాంపల్లి బాలక్రిష్ణ, కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ సంపెల వెంకటేశ్వర్లు, స్టీరింగ్ కమిటీ సభ్యులు హెచ్.వెంకటేశ్వర్లు, వల్లూరి సత్యనారాయణ, దొడ్డి సాంబయ్య, నగర మహిళా కన్వీనర్ కొత్తకొండ్ల శ్రీలక్ష్మి, జిల్లా నాయకులు కీసర పద్మజారెడ్డి, రమాదేవి, వేముల సీత, జాకప్ ప్రతాప్; టీఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, నాయకులు నందగిరి శ్రీను, రమణయాదవ్, లక్ష్మి నారాయణ, సాగర్; టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరావు; ఉద్యోగ సంఘాల నాయకులు కత్తి నెహ్రూ, షౌకత్ అలి; సీపీఐ నాయకులు మేకల సంగయ్య, మల్లేశం; గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు పిట్టల నాగేశ్వరావు, అక్తర్, మేకల సుగుణారావు, వెంకటస్వామి; ఎంఆర్‌పీస్ జిల్లా ఇంచార్జి కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ; ఎంఎస్ఎఫ్ నాయకులు ఎన్.విజయరాజు మాదిగ, వెంకట్ తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు. -
జాతిపితకు నివాళులు అర్పించిన ప్రధాని, సోనియా
-
జాతిపితకు నివాళులు అర్పించిన ప్రధాని, సోనియా
న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మాగాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దేశం యావత్తూ ఘనంగా నివాళి అర్పిస్తోంది. గాంధీజీ 144వ జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ప్రధాని మన్మోహన్సింగ్, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ, బాపూజీకి ఘన నివాళి అర్పించారు. మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు. జాతిపిత జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరు కాలేదు. -
నేటి నుంచి వైఎస్సార్సీపీ ఆమరణ దీక్షలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : సమైక్య పోరులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం గాంధీ జయంతి రోజున పెద్ద ఎత్తున నాయకులు ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ దీక్షలు జరగనున్నాయి. జిల్లా చరిత్రలో ఈ దీక్షలు సమైక్య ఉద్యమంలో ఒక మైలురాయిగా నిలిచిపోనున్నాయి. ఒకే రోజున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ సుమారు 20 మంది వరకు పార్టీ నేతలు ఈ దీక్షలు చేపట్టనుండటం విశేషంగా చెప్పవచ్చు. గతంలో ఏ ఉద్యమంలోనూ ఇంత మంది నాయకులు వేర్వేరు కేంద్రాల్లో ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టిన సంఘటనలు లేవు. రాష్ట్ర విభజనతో జిల్లా ప్రజానీకం ఎదుర్కోబోయే కష్ట, నష్టాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు దీక్షల్లో పాల్గొంటున్నారు. వారికి సంఘీభావంగా మరి కొందరు నాయకులు కూడా దీక్షల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు సిటీ సమన్వయకర్త పి.అనీల్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో గాంధీబొమ్మ సెంటర్లో, రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆత్మకూరు బస్టాండు సెంటర్లోనూ ఉదయం 10 గంటలకు దీక్షలు ప్రారంభిస్తారు. ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కావలిలో రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి దీక్షలు చేపట్టనున్నారు. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మండల కేంద్రమైన వెంకటాచలంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ సీహెచ్.బాలచెన్నయ్య, పి.సునీల్‌కుమార్ క్లాక్‌టవర్ సెంటర్లోనూ, సూళ్లూరుపేటలో దబ్బల రాజారెడ్డి, కిలివేటి సంజీవయ్య, నెలవసుబ్రమణ్యం, వెంకటగిరిలో కొమ్మి లక్ష్మయ్యనాయుడు దీక్షలు చేపడతారు. కోవూరు నియోజకవర్గానికి సంబంధించి నార్తురాజుపాళెంలో జరిగే దీక్షల్లో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పాల్గొంటారు. కాగా నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ బుధవారం ఉదయం గాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తారు. అనంతరం ఆత్మకూరు వెళ్తారు. ఆత్మకూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగే నేతల దీక్షా శిబిరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఉదయగిరి, కావలి, కోవూరు, నెల్లూరు నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టిన నాయకులకు సంఘీభావం ప్రకటించనున్నారు. -
నేడు గాంధీ జయంతి
భారతదేశంలో కోటానుకోట్ల ప్రజల మనసులను వశం చేసుకున్న మహనీయుడు గాంధీ. అవధిలేని హింసాద్వేషాలకు, అణ్వస్త్రాలకు నెలవైన ప్రపంచంలో వాటికి భిన్నంగా శాంతి సౌహార్ద్రాలను వెలయిస్తూ మహోన్నతంగా నిలిచాడాయన. గాంధీజీ జీవితాన్ని, భావాలను, కృషిని, సాధించిన విజయాలను తలచుకుంటే ఆయన మానవజాతి భవితవ్యాన్ని కమ్ముకున్న కారుమబ్బుల మధ్య మెరసిన కాంతికిరణం వంటి వాడనిపిస్తుంది. పేదలకు సేవ చేయడమే ధ్యేయంగా పెట్టుకుని, దారిద్య్రం, దైన్యం, రోగాలు, అజ్ఞానం ప్రబలి ఉన్న సమాజంలో తోటి మానవుల స్థితిగతులను బాగు చెయ్యడానికి విశ్రాంతి లేకుండా, నిస్పృహ చెందకుండా, ఓటమిని అంగీకరించకుండా గాంధీజీ బద్ధకంకణుడై కృషి చేశాడు. వస్తువ్యామోహం తగదన్నాడు. ఆడంబరాలు వద్దన్నాడు. కేవలం చెప్పడానికే పరిమితం కాలేదు. ఆచరించి చూపాడు. గాంధీజీ కృషి భారతదేశానికి మాత్రమే పరిమితమైనట్టు కనిపిస్తుంది. కానీ, ఆయన ఊహలూ, మాటలూ, చేతలూ వ్యక్తిగతంగానూ, సామూహికంగానూ మానవులందరికీ సమానంగా వర్తిస్తాయి. ఆయన బోధ విశ్వజనీనమైంది. విలువలకు ప్రాణమిచ్చిన నీతిమంతుడాయన.అసత్యానికి సత్యంతో పొత్తు కుదరదు. ద్వేషం ప్రేమలో చేరలేదు. చెడుగు మంచితో సఖ్యం చేయలేదు. అహింసకు ఏ విధంగానూ హింసతో జత కుదరదు. కనుకనే అహింసాయుతమైన ప్రేమమార్గంలో పయనిస్తూ, సత్యాన్ని సాక్షాత్కరింప చేసుకోవాలనుకున్నారు గాంధీజీ. సాధారణ ప్రజలతో అసాధారణ ఉద్యమాలు నడిపాడు. పదవులకన్నా ప్రజల్నే మిన్నగా ప్రేమించాడు. స్వాతంత్య్రానికి పూర్వమే సంపూర్ణ మద్యనిషేధాన్ని కోరుతూ తెల్లదొరల మీద ఒత్తిడి తెచ్చాడు. స్వతంత్రభారతానికి పల్లెసీమలే పునాదులు కావాలన్నాడు. గాంధీజీ డెబ్భై అయిదవ జన్మదినాన్ని పురస్కరించుకుని 1944లో ఆయనను అభినందిస్తూ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ‘ఎట్టి ప్రభుత్వాధికారమూ లేకుండానే తన ప్రజలకు అధినేత అయిన గాంధీజీ, యూరప్ ఖండపు పశుత్వాన్ని సరళ మానవ సహజమైన గాంభీర్యంతో ఎదిరించి, సనాతన ఔన్నత్యాన్ని నిలబెట్టుకున్నారు’ అని ప్రశంసించాడు. శాస్త్రీయ దృక్పథం కలిగి చారిత్రక తత్వాన్ని అర్థం చేసుకున్న జవహర్లాల్ నెహ్రూ, భవిష్యత్తులో మానవాళిపై గాంధీజీ ప్రభావాన్ని గురించి ఉద్ఘాటిస్తూ- ‘మనదేశం ప్రకాశించిన వెలుగు సామాన్యమైన వెలుగు కాదు. వెయ్యేళ్లు గడిచిన తర్వాత కూడా ఈ దేశంలో ఆ వెలుగు ప్రకాశిస్తూనే ఉంటుంది. ప్రపంచానికది కనిపిస్తూనే ఉంటుంది. చిరంతన సత్యాన్ని బోధించిన వెలుగది’ అన్నాడు. గాంధీజీలో గోచరించే అనిర్వచనీయమైన మానవతాపూర్ణమైన లక్షణాలను చూసి, అశేష జనంపై ఆయనకు గల ప్రభావానికి విస్మయం చెంది, కొందరు గాంధీజీ అవతార పురుషుడని విశ్వసించారు. స్వాతంత్య్రప్రియులు అసాధారణ దేశభక్తుడని కొనియాడారు. సంఘసేవా పరాయణులు, సాటిలేని సంఘ సంస్కర్త అని కీర్తించారు. బహుముఖమైన గాంధీజీ భావాలను గ్రహించలేక తికమకపడ్డ జాన్ గంధర్ వంటి కొంతమంది వ్యక్తులు, ఆయనలో క్రీస్తు, చాణుక్యుడు, కృష్ణభగవానుడు విడదీయలేని విధంగా కలిసిపోయారని అభివర్ణించారు. ఎన్ని సమస్యలతో సతమతమవుతున్నా, ఏ రోజూ దైవప్రార్థన మానలేదాయన. ‘ప్రార్థన అంటే కోరికలు కోరడం కాదు. అది భగవంతునిపై ఆత్మకు ఉండే గాఢమైన అనురక్తి. మన బలహీనతలను ప్రతిరోజూ అంగీకరించడం. ప్రార్థనకు హృదయం లేని పదాలకంటే పదాలు లేని హృదయం ముఖ్యం అని చెప్పే గాంధీజీ దైవమే సర్వ సంకల్పాలకు ఆధారమని ప్రగాఢంగా నమ్మారు. తన సమస్తమూ దైవానివేనని భావించి, ఆ భావం మీదనే మనస్సును కేంద్రీకరించి, క్రమంగా దైవానికీ, మానవరూపంలో కనిపించే మాధవునికీ సేవచేయడానికే తన జీవితాన్ని అంకితం చేసిన దివ్యశక్తిమయుడు గాంధీజీ. నేడు భారతీయులందరూ ఆయన అడుగుజాడలనుసరించి పయనించడం par తప్పనిసరి.ఙ- చోడిశెట్టి శ్రీనివాసరావు గాంధీ - రామభక్తుడు తన పినతండ్రి కొడుకు ప్రేరణతో బాల్యం నుంచి రామరక్షాస్తోత్ర పారాయణం చేసేవారు గాంధీజీ బాల్యంలో వారి కుటుంబ ఆచారం ప్రకారం ప్రతి ఏకాదశి నాడూ భాగవత గాథలు వినేవారు రామకథ వినడం, హరిశ్చంద్ర నాటకం చూడటం వల్ల రాముడు, హరిశ్చంద్రుడు లాగ జీవితమంతా సత్యవ్రతాన్ని ఆచరించారు గాంధీ చిన్నప్పుడు గాంధీజీకి చీకటిలోకి వెళ్లాలన్నా, భూతప్రేతాలన్నా భయం ఉండేది. ఆ భయం పోగొట్టుకోవడానికి రామనామం జపించడమే మార్గం అని వారి కుటుంబ దాసి చెప్పిన మాటలు ఆయన మనసులో బలంగా ముద్రించుకుపోయాయి. గాడ్సే తూటా దెబ్బకు నేలపై ఒరిగిపోయే సమయంలో కూడా ఆయన ‘రామ నామ స్మరణ మరువలేదు. తన మనస్సును ఎప్పుడైనా నిరాశనిస్పృహలు ఆవరించినప్పుడు గీతా పారాయణం చేసేవాడినని, ఫలితంగా ఎంతో మనశ్శాంతి లభించేదని గాంధీజీ చెప్పేవారు.