జాతిపితకు నివాళులు అర్పించిన ప్రధాని, సోనియా | manmohan singh sonia gandhi pay obeisance to mahatma gandhi at rajghat | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 2 2013 11:37 AM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM

జాతిపిత మహాత్మాగాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దేశం యావత్తూ ఘనంగా నివాళి అర్పిస్తోంది. గాంధీజీ 144వ జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ప్రధాని మన్మోహన్‌సింగ్, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, బీజేపీ అగ్రనేత ఎల్‌.కె.అద్వానీ, బాపూజీకి ఘన నివాళి అర్పించారు. మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు. జాతిపిత జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరు కాలేదు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement