rajghat
-
మహాత్ముడికి మోడీ నివాళి
-
ఘనంగా మహాత్మ గాంధీ 154వ జయంతి వేడుకలు
-
గాంధీ జయంతి.. ప్రధాని మోదీ, ఖర్గే నివాళులు
న్యూఢిల్లీ: అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సోమవారం పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదే విధంగా విజయ్ ఘాట్‌లో లాల్ బహదూర్‌శాస్త్రీకి మోదీ నివాళులు అర్పించారు. VIDEO | PM Modi pays floral tributes to Mahatma Gandhi at Rajghat in Delhi on the occasion of #GandhiJayanti. pic.twitter.com/IVe0uhaNGC — Press Trust of India (@PTI_News) October 2, 2023 మరోవైపు జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛతా కీ సేవా’ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలో లాంఛనంగా శ్రీకారం చుట్టారు. స్వయంగా చీపురు చేతపట్టి రహదారిని శుభ్రం చేశారు. ఆయన ఈ శ్రమదాన కార్యక్రమంతో వినూత్నంగా ఫిట్నెస్, ఆరోగ్య సంరక్షణను కూడా జోడించారు. ప్రముఖ ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్ అంకిత్ బైయాన్‌పూరియాతో కలిసి శ్రమదానంలో పాల్గొన్నారు. I bow to Mahatma Gandhi on the special occasion of Gandhi Jayanti. His timeless teachings continue to illuminate our path. Mahatma Gandhi's impact is global, motivating the entire humankind to further the spirit of unity and compassion. May we always work towards fulfilling his… — Narendra Modi (@narendramodi) October 2, 2023 -
రాజ్‌ఘాట్ వద్ద ప్రముఖులు - ఆనంద్ మహీంద్రా ట్వీట్ ఇలా..
ప్రముఖ పారిశ్రామిక వేత్త మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగానే తాజాగా జీ20 సమావేశాలను ఉద్దేశించి ఒక పోస్ట్ షేర్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మండే మోటివేషన్ అనే ట్యాగ్‌తో జీ20 సమ్మిట్‌కి సంబంధించిన ఒక ఫోటో షేర్ చేశారు. ఇందులో ప్రపంచంలోని చాలా దేశాధినేతలు రాజ్‌ఘాట్‌లో బాపుకి నివాళులు అర్పిస్తున్న చూడవచ్చు. భారతదేశం ప్రపంచ వేదికపై ఎదుగుతున్నప్పుడు, మహాత్ముని బోధనలు ఎల్లప్పుడూ మనకు గౌరవాన్ని మాత్రమే కాకుండా ప్రశంసలను పొందేలా చేస్తాయని వెల్లడించాడు. ఇదీ చదవండి: ఈవీ ఛార్జింగ్ కోసం ఏ దేశం ఎంత డబ్బు వసూలు చేస్తుంది? వివరాలు సెప్టెంబర్ 9, 10న జరిగిన ఈ సమావేశాలను భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైభవంగా నిర్వహించింది. ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, బంగ్లాదేశ్ ప్రధానితో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నాయకులు హాజరైనట్లు సమాచారం. Many #MondayMotivation stories & images today, especially after the #G20 But this photo, of all world leaders paying homage to Bapu at Rajghat, will be the one, enduring image I will carry in my mind. As India grows on the world stage, I think the Mahatma’s teachings will always… pic.twitter.com/BXUB7haGER — anand mahindra (@anandmahindra) September 11, 2023 -
మహాత్ముని పలుకులే భారత్–అమెరికా మైత్రికి మూలం
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీజీ ప్రబోధించిన సంరక్షణ సూక్తులే భారత్–అమెరికా మధ్య సత్సంబంధాలకు మూలమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మహాత్ముని సమాధి ‘రాజ్‌ఘాట్’లో నివాళులరి్పంచిన సందర్భంగా బైడెన్ పలు ట్వీట్లు చేశారు. ‘ గాం«దీజీ ప్రవచించిన సంరక్షణ సూక్తులే ఇరు దేశాల మధ్య దృఢ బంధానికి మూలం. మన రెండు దేశాలు మధ్య నెలకొన్న పరస్పర నమ్మకం, సంరక్షణ బాధ్యతలే మన పుడమి సంరక్షణకూ దోహదపడుతున్నాయి’ అని అన్నారు. ‘మోదీతో విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు ఫలవంతంగా ముగిశాయి. 31 అధునాతన డ్రోన్ల కొనుగోలు, భారత్‌లో జీఈ జెట్ ఇంజిన్ల సంయుక్త తయారీసహా పలు కీలక ఒప్పందాలు కుదిరాయి’ అని చెప్పారు. ‘ఈ రోజు ఇక్కడికి(రాజ్‌ఘాట్)కు తీసుకొచ్చిన మీకు(ప్రధాని మోదీ) నా కృతజ్ఞతలు. అద్భుతంగా అతిథ్యమిచి్చ, జీ20 సదస్సును సజావుగా నిర్వహించి, కూటమికి విజయవంతంగా సారథ్యం వహించారు. రాజ్‌ఘాట్‌కు రావడం నిజంగా గర్వంగా ఉంది. గాం«దీజీ ఆచరించి చూపిన సత్యం, అహింసా మార్గాలు ప్రపంచానికి ఆచరణీయాలు. ఇవి ఎల్లప్పుడూ ప్రపంచదేశాలకు స్ఫూర్తిదాయకాలు. ఇదే మన రెండు దేశాల బంధానికి పునాది రాళ్లు’ అని మోదీనుద్దేశిస్తూ బైడెన్ ట్వీట్‌చేశారు. జీ20 సదస్సు ముగిశాక భారత్‌కు బైబై చెప్పిన బైడెన్.. వియత్నాంకు పయనమయ్యారు. మహాత్మునికి జీ20 నేతలంతా పుష్పగుచ్ఛాలతో నివాళులర్పిస్తున్న ఫొటోను, కార్యక్రమానికి సంబంధించిన 19 సెకన్ల వీడియోను బైడెన్ ట్వీట్ చేశారు. జీ20 దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు కూటమే స్వయంగా పరిష్కార మార్గాలు కనిపెట్టగలదని బైడెన్ ధీమా వ్యక్తంచేశారు. మహాత్మునికి నేతల నివాళి జీ20 సదస్సుకు విచ్చేసిన నేతలంతా ఆదివారం రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మాగాం«దీకి నివాళులరి్పంచారు. మొదట వారంతా వర్షం నీరు నిలిచిన రాజ్‌ఘాట్ లోపలికొచ్చారు. 1917 నుంచి 1930 వరకు గాం«దీజీ నివసించిన సబర్మతి ఆశ్రమం ఫొటో ఉన్న ప్రాంతం వద్ద నిల్చుని విడివిడిగా ఒక్కో నేతకు మోదీ స్వాగతం పలికారు. ఫొటో చూపిస్తూ ఆశ్రమం ప్రత్యేకతలను వివరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ అంగవస్త్రం బహూకరించారు. మోదీ, సునాక్ పాదరక్షలు లేకుండా రాజ్‌ఘాట్ లోపలికి ప్రవేశించగా, మిగతా నేతలు.. నిర్వాహకులు సమకూర్చిన తెల్లని పాదరక్షలు ధరించారు. తర్వాత నేతలంతా కలిసి గాం«దీజీ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. అక్కడి శాంతికుడ్యంపై సంతకాలు చేశారు. -
మహాత్మునికి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ 75వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాన మంత్రి మోదీ సోమవారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని మహాత్ముని సమాధి రాజ్‌ఘాట్ వద్ద పుష్పగుచ్ఛాలుంచారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. గన్ సెల్యూట్ , సర్వమత ప్రార్థనలు, గాంధీకి ఇష్టమైన గేయాలాపన జరిగాయి. ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు నివాళులర్పించారు. ‘బాపుకు నా నివాళులు. దేశ సేవలో ప్రాణాలర్పించిన ఎందరో అమరుల త్యాగాలు దేశం కోసం పనిచేయాలనే సంకల్పాన్ని మరింత పెంచుతాయి’ అని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీతో కొరోసీ భేటీ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ (యూఎన్జీఏ) అధ్యక్షుడు సాబా కొరోసీ మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్‌తో భేటీ అయ్యారు. పలు అంతర్జాతీయ సవాళ్లపై చర్చలు జరిపారు. జల సంరక్షణ, నీటి వనరుల సమర్థ వినియోగం ఆవశ్యకత కూడా ప్రస్తావనకు వచ్చినట్లు అనంతరం మోదీ ట్వీట్ చేశారు. ఉక్రెయిన్ సంక్షోభం, జీ20 ఎజెండాతోపాటు ఐరాస సంస్కరణలపై చర్చించినట్లు జై శంకర్ పేర్కొన్నారు. పలు అంశాలపై వారి అవగాహన, స్పందన అద్భుతమని కొరోసీ కొనియాడారు. భారత్‌తోపాటు పలు దేశాలు సీమాంతర ఉగ్రవాదంతో బాధ పడుతున్న విషయం తనకు తెలుసునన్నారు. -
గాంధీజీ, శాస్త్రిలకు ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిలకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఇద్దరు నేతల జయంతిని పురస్కరించుకుని ప్రధాని ఆదివారం వారి సమాధులున్న రాజ్‌ఘాట్, విజయ్‌ఘాట్‌లను సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ప్రతి ఒక్కరూ ఖాదీ, హస్తకళల ఉత్పత్తులను కొనుగోలు చేసి గాంధీజీకి నివాళులర్పించాలని ప్రధాని ప్రజలను కోరారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ గాంధీ జయంతి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. బాపు సిద్ధాంతాలను అన్ని వేళలా ఆచరించాలి’అని ట్వీట్ చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబరత, స్థిరమైన నిర్ణయాలు తీసుకోగల శక్తి దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. ‘కీలకమైన సమయంలో శాస్త్రి నాయకత్వ పటిమ దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను’ అని మరో ట్వీట్లో పేర్కొన్నారు. శాస్త్రి జీవన ప్రయాణం, సాధించిన విజయాలపై ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’లో ఉంచిన కొన్ని చిత్రాలను ప్రధాని షేర్ చేశారు. గాంధీజీకి కాంగ్రెస్ నేత రాహుల్ ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. ‘అన్యాయానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసిన గాంధీజీ మాదిరిగా దేశాన్ని ఐక్యంగా ఉంచుతామంటూ ప్రతిన బూనుదాం. సత్యం, అహింసా మార్గంలో నడవాలని ఆయన మనకు నేర్పించారు. ప్రేమ, కరుణ, సామరస్యం, మానవత్వం అర్థాన్ని బాపు వివరించారు’ అని ట్వీట్ చేశారు. -
బాపూజీకి జాతి నివాళి
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌లో జాతిపితకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతిపిత ఆలోచనలను ప్రాచుర్యంలోకి తీసుకురావడం మన బాధ్యత అని ప్రధాని ట్వీట్ చేశారు. అమరజవాన్ల దినోత్సవం సందర్భంగా దేశం రక్షణ కోసం వీరోచితంగా పోరాడిన అమర సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు. వారి సేవ, ధైర్యసాహసాలు మరువలేనివని ప్రధాని కొనియాడారు. అహ్మదాబాద్: మహాత్మాగాంధీ ‘స్వదేశీ’ ఉద్యమానికి అసలైన నిర్వచనం.. తమ ప్రభుత్వం కార్యక్రమాలైన మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. స్వాతంత్య్రం తరువాత భారత్‌ను పునర్నిర్మించాలన్న ఆయన ఆలోచన ఏళ్లపాటు పక్కన పెట్టారని, తాము అధికారంలోకి వచ్చాక దాన్ని అమల్లోకి తెచ్చామని అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా అహ్మదాబాద్‌లోని సబర్మతి నదీతీరాన ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) ఏర్పాటు చేసిన కుడ్య చిత్రాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఈ కుడ్యచిత్రం బాపూజీకి నిజమైన నివాళి అని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ రాణే, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు. నిజం బతికున్నంత కాలం గాంధీ సజీవం మహాత్మాగాంధీ లేరని హిందుత్వ వాదులు భావిస్తున్నారని, కానీ సత్యం బతికున్నంత కాలం జాతిపిత సజీవంగా ఉంటారని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. బాపూజీ 74వ వర్ధంతి సందర్భంగా ట్విట్టర్లో ‘ఫరెవర్ గాంధీ’ హ్యాష్‌ట్యాగ్‌తో నివాళులర్పించారు. రాజ్‌ఘాట్ దగ్గరా రాహుల్ ఆదివారం జాతిపితకు అంజలి ఘటించారు. హిందుత్వవాదీ అయిన గాడ్సే మహాత్ముడిని కాల్చి చంపాడని ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘నేను నిరాశకు గురైనప్పుడు... సత్యం, ప్రేమ మాత్రమే గెలుస్తుందన్న చరిత్రను గుర్తు చేసుకుంటాను. కొంతకాలం పాటు అది కనిపించకుండా ఉండొచ్చు... హంతకులు, నిరంకుశులు మాత్రమే ఉండొచ్చు. కానీ చివరికి వాళ్లు ఓడిపోతారు. అది నిత్యం మనసులో ఉంచుకోండి’’ అన్న మహాత్ముడి కోట్ని రాహుల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా మహాత్మాగాంధీకి ట్విట్టర్లో నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ తన అధికార ట్విట్టర్ ఖాతాలో మహాత్ముడికి ఘన నివాళులర్పించింది. కాళీచరణ్‌కు ‘గాడ్సే భారత రత్న’ రాయ్‌పూర్‌లో జరిగిన ధర్మసంసద్‌లో మహాత్ముడిని కించపరిచే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో గత డిసెంబర్లో అరెస్టయి, గ్వాలియర్ జైల్లో ఉన్న మత నాయకుడు కాళీచరణ్ మహారాజ్‌కు, మరో నలుగురు హిందూ మహాసభ నేతలకు ‘గాడ్సే–ఆప్టే భారతరత్న’ అవార్డును ప్రదానం చేసింది. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా హిందూమహాసభ జాతిపితను హత్య చేసిన నాథురామ్ గాడ్సేకి నివాళులర్పించింది. గాంధీ హత్యకేసులో గాడ్సే సహనిందితుడు అయిన నారాయణ ఆప్టేకు నివాళిగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఆదివారం ‘గాడ్సే–ఆప్టే స్మృతి దివస్’ను నిర్వహించింది. 1948 జనవరి 30న గాడ్సే, ఆప్టేల అరెస్టుకు వ్యతిరేకంగా ‘గాడ్సే–ఆప్టే స్మృతి దివస్’ నిర్వహిస్తున్నామని హిందూ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు జైవీర్ భరద్వాజ్ తెలిపారు. మహాత్మాగాంధీకి జాతిపిత ఇవ్వడమేంటని మీరట్‌లోని హిందూ మహాసభ నేతలు ప్రశ్నించారు. -
యమున నది తీరాన భారీగా మంటలు
న్యూఢిల్లీ: యమున నది తీరాన.. మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్ సమీపంలో భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకుని మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. అటవీ ప్రాంతంలో మంటలు రావడంతో కార్చిచ్చుగా భావించారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుంది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక వాహనాలు తీవ్రంగా శ్రమించాయి. యమున నది ఒడ్డున ఉన్న అటవీ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ సమీపంలోనే మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్ ఉంది. ఈ మంట వ్యాప్తితో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 12 అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను ఆర్పివేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే దట్టమైన పొగలు రావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ముందే కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్న ఢిల్లీలో ఈ పొగ తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. నది ఒడ్డున మంటలు ఎలా వచ్చాయనేది ఇంకా తెలియడం లేదు. దీనిపై అధికారులు వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ మంటలు వ్యాపించిన ప్రాంతానికి సమీపంలోనే ఇందిరా గాంధీ స్టేడియం, రాజ్‌ఘాట్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. @abpnewstv @DelhiPolice Fire at Raj ghat, police at the location but effort seem very poor. pic.twitter.com/TJ31jdGuQV — Bohraj Gupta (@RajCT) February 25, 2017 -
మహాత్ములకు ఘన నివాళి
-
మహాత్ముడికి ఘన నివాళి
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ మంగళవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీ స్మారక స్థలాన్ని సందర్శించారు. మహాత్ముడి సమాధి దగ్గర పుష్పగుచ్ఛాలను ఉంచి, పూలతో అర్చించి నివాళులర్పించారు. అనంతరం ట్రంప్ సందర్శకుల పుస్తకంలో గాంధీజీని కొనియాడుతూ సందేశాన్ని రాశారు. ‘‘మహాత్ముడి ఆలోచనల నుంచి రూపు దిద్దుకున్న అత్యంత అద్భుతమైన సార్వభౌమ భారత్‌కు అమెరికా ప్రజలు బలమైన మద్దతు ఇస్తారు. ఇది నాకు దక్కిన అపూర్వమైన గౌరవం’’అని ఆ పుస్తకంలో రాశారు. ట్రంప్ సబర్మతి ఆశ్రమం సందర్శించినప్పుడు మహాత్ముడి ప్రస్తావన లేకుండా సందేశం రాయడంతో ట్విట్టర్లో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్ అసలు గాంధీ పేరు విన్నారా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాజ్‌ఘాట్‌లో ట్రంప్ రాసే సందేశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సందేశం దగ్గర ట్రంప్‌తో పాటు మెలానియా కూడా సంతకాలు చేశారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్రంప్‌ను రాజ్‌ఘాట్‌కు తోడ్కొని వెళ్లారు. రాజ్‌ఘాట్ వద్ద మొక్కను నాటుతున్న ట్రంప్, మెలానియా -
మహాత్ముడికి ట్రంప్ నివాళి..
-
ప్రధాని మోదీతో భేటీ అయిన బ్రెజిల్ అధ్యక్షుడు
ఢిల్లీ : బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో నాలుగురోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం భారత్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. 71వ గణతంత్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా వచ్చిన విషయం విదితమే. ఈ సందర్భంగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో జైర్ బొల్సొనారో అధికారికంగా బేటీ అయ్యారు. కాగా ఈ పర్యటనలో బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో 15 ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ఆయిల్, గ్యాస్, మైనింగ్, సైబర్ భద్రత ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు రాష్ట్రపతిభవన్ వద్ద ఘన స్వాగతం లభించింది.ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ ఆయనతో కరచాలనం చేసి ఆహ్వానించారు.అనంతరం త్రివిద దళాల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుంచి ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు వెళ్లిన జైర్ బొల్సొనారో మహాత్మగాంధీకి ఘనమైన నివాళులు అర్పించారు. -
రేపు రాజ్‌ఘాట్ వద్ద కాంగ్రెస్ ‘సత్యాగ్రహం’
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ నేతృత్వంలో ఈ నెల 23న (సోమవారం) ఢిల్లీలోని గాంధీ సమాధి రాజ్‌ఘాట్ వద్ద సత్యాగ్రహం కార్యక్రమం చేపట్టనున్నారు. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 వరకూ ఈ ధర్నా కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలు పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆదివారమే ఈ ధర్నా చేపట్టాలని ముందుగా భావించినప్పటికీ అనుమతులు పొందే క్రమంలో ఆలస్యం వల్ల సోమవారం నిర్వహించనున్నట్లు వేణుగోపాల్ చెప్పారు. -
రాజ్‌ఘాట్ వద్ద స్వాతి మలివాల్ దీక్ష
సాక్షి, న్యూఢిల్లీ : మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న దోషులకు తక్షణ శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన దీక్షను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ కొనసాగిస్తున్నారు. మంగళవారం జంతర్‌మంతర్ వద్ద దీక్షను ప్రారంభించగా పోలీసులు అనుమతి లేదంటూ ఆమెను అక్కడి నుంచి తరలించారు. దీంతో స్వాతి తన ఆమరణ నిరాహార దీక్షను బుధవారం నుంచి రాజ్‌ఘాట్ వద్ద కొనసాగిస్తున్నారు. ఆమె మట్లాడుతూ.. దిశ ఘటన యావత్తు దేశాన్ని షాక్‌కు గురి చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో అనేక ప్రాంతాల్లో ప్రతి రోజూ మహిళలపై తీవ్రమైన అఘాయిత్యాలు జరుగుతున్నాయని, గత మూడేళ్ల కాలంలో ఇలాంటి 55 వేల ఘటనలు ఢిల్లీ మహిళా కమిషన్ దృష్టికి వచ్చాయని తెలిపారు. దిశ ఘటనలో దోషులకు తక్షణ శిక్ష విధింపు, చట్టాల అమలు, పోలీసుల్లో బాధ్యత పెంపు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు, నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేసే వరకు తన దీక్ష విరమించబోనని ఆమె తెలిపారు. -
గాంధీజీ ఆత్మ క్షోభిస్తుంది: సోనియా గాంధీ
న్యూఢిల్లీ : కుట్రపూరిత రాజకీయాలు చేసే వారు మహాత్మా గాంధీ సిద్ధాంతాలైన శాంతి, అహింస గురించి ఎన్నటికీ అర్థం చేసుకోలేరని కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. భారత జాతిపిత మహత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా బుధవారం రాజ్‌ఘాట్ వద్ద సోనియా బాపూజీకి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... గత ఐదేళ్లుగా దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలకు గాంధీ ఆత్మ ఎంతగానో క్షోభించి ఉంటుందని మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. తమను తాము గొప్పవాళ్లుగా భావించుకునే వ్యక్తులు.. దేశం కోసం గాంధీజీ చేసిన త్యాగాలను ఏనాటికీ అర్థంచేసుకోలేరని విమర్శించారు. ‘ఇండియా, గాంధీ పర్యాయపదాలు. అయితే కొంతమంది మాత్రం ఆరెస్సెస్, భారత్ పర్యాయపదాలు అని ప్రచారం చేసే పనిలో పడ్డారు. నయవంచక రాజకీయాలు చేస్తున్నారు. శాంతి, అహింస అన్న మాటలు వాళ్లకు ఎన్నటికీ అర్థం కావు అని బీజేపీ మాతృ సంస్థ ఆరెస్సెస్‌పై సోనియా విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా గాంధీ సిద్ధాంతాలను, ఆదర్శాలను ప్రతీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఆచరించాలని సోనియా విఙ్ఞప్తి చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా సోనియాతో పాటు రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. ఆమె మాట్లాడుతూ..‘ సత్యనిష్ఠతో ఉండమని.. సత్యమార్గంలో నడవాలని మహాత్మా గాంధీ బోధించారు. బీజేపీ కూడా బాపూ చెప్పిన బాటలో నడవాల్సిన ఆవశ్యకత ఉంది అని పేర్కొన్నారు. ఇక గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ.. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో లక్నోలో నిర్వహించనున్న పాదయాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. -
గాంధీ, వాజ్‌పేయిలకు మోదీ నివాళి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రధానిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ గురువారం ఉదయం రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు. రాజ్‌ఘాట్ నుంచి నేరుగా అటల్ మెమోరియల్‌కు చేరుకున్న మోదీ దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. మహాత్మ గాంధీ, వాజ్‌పేయిలకు నివాళులు అర్పించిన అనంతరం దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల స్మృతి చిహ్నంగా ఇండియా గేట్ వద్ద నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్‌కు వెళ్లి అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధాని వెంట బీజేపీ చీఫ్ అమిత్ షా, పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, మేనకా గాంధీ, స్మృతి ఇరానీ, జేపీ నడ్డా తదితరులున్నారు. కాగా గురువారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ, విదేశీ నేతలు సహా దాదాపు 8000 మంది అతిధులు హాజరు కానున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు,పార్టీల నేతలు, పరిశ్రమ వర్గాలు, దౌత్యవేత్తలు, రాయబారులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు అతిధుల జాబితాలో ఉన్నారు. -
ఎన్నికల బరిలో ‘చౌకీదార్’
నిజమేనండీ.. గుర్గావ్ లోక్‌సభ స్థానం నుంచి ఈ చౌకీదార్ పోటీ చేస్తున్నారు. అదేంటీ.. ఈ దేశపు చౌకీదార్ మోదీ వారణాసి నుంచి కదా పోటీ చేస్తోంది అని ఆశ్చర్యపోతున్నారా?. ఈ చౌకీదార్ మీరనుకుంటున్న చౌకీదార్ కాదు. ఈయన ఢిల్లీలోని గాంధీ సమాధి (రాజ్‌ఘాట్)ని కాపలా కాసే చౌకీదార్. ఈయన పేరు జై కవార్ త్యాగి. వయసు 64 ఏళ్లు. సైన్యంలో పని చేసిన త్యాగి 19 ఏళ్ల నుంచి రాజ్‌ఘాట్‌లో కాపలాదారుగా ఉంటున్నారు. ‘గాంధీజీ సమాధి దగ్గర పని చేస్తుండగా.. ఈ దేశానికి, సమాజానికి ఏదైనా చేయాలన్న ప్రేరణ కలిగింది. వ్యవస్థను బాగు చేయాలంటే దాంట్లో దిగాలన్న జ్ఞానోదయం కలిగింది. నా సర్వీసులో కాంగ్రెస్, బీజేపీ.. ఇలా ఎన్నో ప్రభుత్వాలను చూశాను. పేరు తేడా కాని తీరు అందరిదీ ఒక్కటే. దేశం ఎదుర్కొంటున్న అన్ని అనర్థాలకీ మూలం అవినీతి, ఆశ్రిత పక్షపాతమే. నిరుద్యోగం, అవినీతి యువతను, సమాజాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో కళ్లారా చూస్తున్నాను. వీటిని అరికట్టడం కోసమే నేను ఎన్నికల్లో దిగుతున్నాను’ అంటూ తన లక్ష్యాన్ని స్పష్టం చేశారు త్యాగీ. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయని, సర్కారు ఉద్యోగాలను తగ్గించేస్తున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన దక్ష పార్టీ తరఫున త్యాగీ నామినేషన్ దాఖలు చేశారు. దాన్ని ఎన్నికల అధికారులు ఆమోదించారు కూడా. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఐదేళ్ల నుంచి తన పింఛను సొమ్మును దాచుకుంటున్నానని త్యాగి చెప్పారు. -
టైట్లర్, సజ్జన్లకు సొంత పార్టీ ఝలక్
న్యూఢిల్లీ : నరేంద్రమోదీ సర్కారు హయాంలో దళితులపై అకృత్యాలు పెరిగిపోయాయని, సామాజిక సామరస్యం దెబ్బతింటోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక రోజు నిరాహార దీక్షకు దిగారు. అయితే రాహుల్ గాంధీ దీక్షా స్థలానికి రావడానికి ముందే ఇద్దరు వివాదాస్పద కాంగ్రెస్ నాయకులు జగదీశ్ టైట్లర్, సజ్జన్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. వారిని వేదికపైకి అనుమతించకుండా పార్టీ కార్యకర్తలతో పాటు కింద కూర్చోవాలంటూ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయమై ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. ‘ఆ ఇద్దరు నాయకులను వేదికపైకి అనుమతించకపోవడానికి ప్రత్యేక కారణాలేవీ లేవు. ఈ నిరసనలో పార్టీ కార్యకర్తలంతా పాల్గొనవచ్చు. మాజీ ఎంపీలకు వేదికపై కూర్చునేందుకు సీటింగ్ ఏర్పాటు చేయలేదని’ వివరణ ఇచ్చారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో ప్రధాన పాత్ర పోషించారని జగదీశ్ టైట్లర్, సజ్జన్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే మత సామరస్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో చేపట్టిన దీక్షలో వీరు పాల్గొంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని, బీజేపీకి ఇది ఒక అస్త్రంగా మారుతుందనే కారణంగానే వారిని పక్కకు పెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సీబీఎస్ఈ పరీక్షా పత్రాలు లీక్ కావడం, పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం, పార్లమెంటు సమావేశాలు పూర్తిగా స్తంభించిపోవడం, దళిత సంఘాలు ఈనెల 2న నిర్వహించిన భారత్ బంద్‌లో హింస చోటుచేసుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో మోదీ సర్కారును, బీజేపీ విధానాలను ఎండగట్టేందుకు రాహుల్ ఈ నిరసన దీక్షకు పూనుకున్నారు. కాగా, ఈ విషయంపై స్పందించిన జగదీశ్ టైట్లర్ మీడియాతో మాట్లాడుతూ... ‘నన్నెవరూ వెళ్లిపొమ్మని చెప్పలేదు. నేనెప్పుడూ కార్యకర్తలతో పాటే కూర్చుంటాను. పార్టీలో నన్నెవరూ వ్యతిరేకించే వాళ్లు లేర’న్నారు. -
రాహుల్ గాంధీ నిరాహార దీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు హయాంలో దేశంలో దళితులపై అకృత్యాలు పెరిగిపోయాయని, సామాజిక సామరస్యం దెబ్బతింటోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం ఒక రోజు నిరాహార దీక్షకు దిగారు. రాజ్‌భవన్‌లోని మహాత్మాగాంధీ సమాధికి నివాళులర్పించిన అనంతరం అక్కడే నిరాహార దీక్ష చేపట్టారు. మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు తమ రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో నిరసన నిరాహార దీక్షలు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరాహార దీక్షను కొనసాగిస్తున్నాయి. సీబీఎస్ఈ పరీక్షా పత్రాలు లీక్ కావడం, పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం, పార్లమెంటు సమావేశాలు పూర్తిగా స్తంభించిపోవడం, దళిత సంఘాలు ఈ నెల 2న నిర్వహించిన భారత్ బంద్‌లో హింస చోటుచేసుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో మోదీ సర్కారును, బీజేపీ విధానాలను ఎండగట్టేందుకు రాహుల్ ఈ నిరసన దీక్షకు పూనుకున్నారు. నిరాహార దీక్షలో భాగంగా ఆయన మోదీ సర్కారు తీరుపై ధ్వజమెత్తే అవకాశముంది. -
అది జాతిపితను అవమానించటమే!
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ స్మారకం (రాజ్‌ఘాట్) వద్ద విరాళాల హుండీని ఉంచటంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ చర్య జాతిపితను అవమానించినట్లేనని పేర్కొంది. సేకరించిన నిధులను వేటికోసం వినియోగిస్తున్నారో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. అయితే మహాత్ముడు స్థాపించిన ‘హరిజన్ సేవక్ సంఘ్’ ఈ హుండీని ఏర్పాటు చేసిందని.. ఈ సంస్థ అవసరాలకే నిధులు వినియోగిస్తున్నట్లు రాజ్‌ఘాట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కమిటీ వివరించింది. దీనిపై కోర్టు మండిపడింది. ‘ఇదేనా మనం జాతిపితకు ఇచ్చే గౌరవం. భారతీయులతోపాటు వేలసంఖ్యలో విదేశీయులూ రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తారు. అక్కడ విరాళాల హుండీలు పెట్టడం గాంధీని అవమానించటమే’ అని స్పష్టం చేసింది. రాజ్‌ఘాట్‌లో కనీస ఏర్పాట్లపై వివరాలివ్వాలని సీపీడబ్ల్యూడీ చీఫ్ ఇంజనీర్‌ను ఆదేశించింది. -
రాజ్‌ఘాట్ వద్ద రజాక్ నివాళులు
న్యూఢిల్లీ: మలేసియా ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ భారత్‌లో పర్యటిస్తున్నారు. శనివారం మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ను సందర్శించిన ఆయన అక్కడ పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అంతకు మందు రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మలేసియా ప్రధానిని మోదీ సాదరంగా ఆహ్వానించారు. ఇవాళ సాయంత్రం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో రజాక్ సమావేశం కానున్నారు. Malaysian Prime Minister Najib Razak pays tribute at Rajghat in New Delhi pic.twitter.com/5uw893FwfW — ANI (@ANI_news) 1 April 2017 -
గాంధీ, శాస్త్రిలకు ఘన నివాళి
-
రాజ్ ఘాట్‌లో మహాత్ముడికి ఘన నివాళి
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, త్రివిధ దళాధిపతులు రాజ్ ఘాట్‌లో నివాళులు అర్పించారు. గాంధీ విగ్రహం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి, రెండు నిమిషాలపాటూ మౌనం వహించారు. మరో వైపు హైదరాబాద్‌లో బాపూ ఘాట్‌లో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయలు గాంధీజీకి ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీజీ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని అమరవీరులకు నివాళులు అర్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా రెండు నిమిషాల పాటూ మౌనం పాటించారు. వాహనదారుల కోసం అన్ని ట్రాఫిక్ సిగ్నల్‌లను 11 గంటలనుంచి రెండు నిమిషాలు రెడ్ సిగ్నల్ వేయడంతో ప్రయాణికులు కూడా అమరవీరులలకు నివాళులు అర్పించారు. -
మహాత్మగాంధీకి మోదీ, ప్రణబ్ నివాళులు
న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మాగాంధీకి జాతి ఘనంగా నివాళులు అర్పించింది. గాంధీజీ 67వ వర్థంతి సందర్భంగా న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్రమంత్రి పారికర్ తదితరులు అంజలి ఘటించారు. గాంధీజీ సమాధి మీద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. మరోవైపు మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా హూదరాబాద్లోని బాపూఘాట్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ నివాళులు అర్పించారు. అలాగే కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రలు హరీష్ రావు, ఈటెల రాజేందర్, కడియం శ్రీహరి, మహేందర్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ ఎంపీ వీ హనుమంతరావు తదితరులు బాపూజీకి నివాళులు అర్పించారు.