రాజ్‌ఘాట్ వద్ద రజాక్ నివాళులు
న్యూఢిల్లీ: మలేసియా ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ భారత్‌లో పర్యటిస్తున్నారు. శనివారం మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ను సందర్శించిన ఆయన అక్కడ పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు.
అంతకు మందు రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మలేసియా ప్రధానిని మోదీ సాదరంగా ఆహ్వానించారు. ఇవాళ సాయంత్రం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో రజాక్ సమావేశం కానున్నారు.
Malaysian Prime Minister Najib Razak pays tribute at Rajghat in New Delhi pic.twitter.com/5uw893FwfW
— ANI (@ANI_news) 1 April 2017