న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మాగాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దేశం యావత్తూ ఘనంగా నివాళి అర్పిస్తోంది. గాంధీజీ 144వ జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ప్రధాని మన్మోహన్‌సింగ్, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ, బాపూజీకి ఘన నివాళి అర్పించారు. మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు. జాతిపిత జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరు కాలేదు.