మహాత్మునికి ఘన నివాళి
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ 145వ జయంతి సందర్భంగా దేశప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రవుంత్రులు వెంకయ్యునాయుుడు, వీకే సింగ్ తదితరులు ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మునికి నివాళులర్పించారు.
ఉదయుం 7.40కి ప్రధాని మోదీ అక్కడికి చేరుకోగానే వెంకయ్యునాయుుడు ఆయునను తీసుకొని గాంధీ సమాధివద్దకు వెళ్లారు. నివాళి అర్పించిన అనంతరం మోదీ,మన్మోహన్ పరస్పరం అభివాదం చేసుకున్నారు. అనంతరం వారు అక్కడ కొద్దిసేపు కూర్చొని సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున స్కూలు పిల్లలు, ప్రజలు, విదేశీయులు కూడా వచ్చి గాంధీకి నివాళులర్పించారు.
లాల్‌బహదుర్ శాస్త్రికి నివాళి : గురువారం మాజీ ప్రధాని లాల్‌బహదుర్ శాస్త్రి 110వ జయుంతి సందర్భంగా పలువురు నాయకులు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజయ్ ఘాట్‌లో శాస్త్రి సమాధివద్ద పుష్పాంజలి ఘటించారు. మహాత్మాగాంధీ సమాధివద్దనుంచి నేరుగా ఆయున ఇక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, లాల్‌బహదుర్ శాస్త్రి ధృఢనిశ్చయూనికి మారుపేరని కొనియడారు.
పార్లమెంట్ హౌస్‌లో నివాళి: గాంధీ, లాల్‌బహదూర్‌ల జయంతిని పురస్కరించుకుని పార్లమెంట్ హౌస్ రీడింగ్ రూమ్ లో వారి చిత్రపటాలవద్ద ప్రధాని మోదీ, స్పీకర్ మహాజన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా పుష్పాంజలి ఘటించారు.
డిజిటల్ రూపంలోకి గాంధీపై డాక్యుమెంటరీ: మహాత్మాగాంధీపై రూపొందించిన ఓ పురాతన డాక్యుమెంటరీ ఇప్పుడు డిజిటల్ రూపం సంతరించుకుంది. ఇది త్వరలోనే ప్రజా వీక్షణానికి అందుబాటులోకి రానుంది. ఇందులో గాంధీ మొట్టమొదటిసారిగా ఓ విదేశీ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూతో పాటు అత్యంత అరుదైన వీడియో ఫుటేజీలు, ఫొటోలు ఉన్నాయి.