పింప్రి, న్యూస్‌లైన్: రిమోట్ కంట్రోల్‌తో నడిచే ప్రధానమంత్రి మనకు వద్దని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ పేర్కొన్నారు. స్థానిక సర్ పరుశురాం భావ్ కళాశాల మైదానంలో శనివారం రాత్రి ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘ప్రస్తుత పీఎం యాక్సిడెంటల్ ప్రధాని, ఏదైనా ప్రమాదం జరిగితే కొందరు మరణిస్తారు. అయితే ప్రధాని మన్మోహన్‌సింగ్ చేస్తున్న యాక్సిడెంట్ల (పరిపాలన) వల్ల మొత్తం దేశమే మరణించే స్థితి దాపురించింది. రిమోట్ కంట్రోల్‌తో నడిచే ప్రధాని మనకు వద్దు’ అని అన్నారు. ఒకరు చెప్పిందే వేదంగా నడిచే పాలన ఎక్కువ రోజులు సాగదన్నారు. మీడియా సలహాదారుడైన సంజయ్ బారు తన పుస్తకంలో పేర్కొన్న వివిధ అంశాలపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జాతికి జవా బు చెప్పాలన్నారు.
ప్రధాని కార్యకలాపాల్లో మరొకరి జోక్యం ఎంతవరకు అవసర మనే ఆమెకే తెలి యాలంటూ ఎద్దేవా చేశారు. సోనియా చెప్పుచేతుల్లోనే దేశ పాలన మొత్తం నడిచేదని, ప్రధాని కేవ లం నామమాత్రమేననీ అంటూ సంజయ్ బారు పేర్కొనడంపై సమాధానం ఇవ్వకుండా సోనియా తన నోటికి తాళం వేసుకుంటే ఎలా? అని ప్రశ్నించా రు. సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఎన్ని చీవాట్లు పెట్టినా తుడుచుకు పోయే ప్రధానిని ఇంతవరకు దేశప్రజలు చూడలేదన్నారు. బొగ్గు కుంభకోణం లో సుప్రీం ప్రమేయాన్ని ఈ సందర్భంగా మోడీ గుర్తు చేశారు. చట్టబద్ధమైన ప్లానింగ్ కమిషన్, కాగ్, సీబీఐ, మిలిటరీ, జాతీయ సలహా మండలి స్వతంత్రంగా పనిచేయాల్సి ఉందని, అయితే వాటి విషయంలో తమ ఇష్టానుసారం వ్యవహరించారన్నా రు.
ఈ సంస్థలు దేశంలో జరుగుతున్న అవినీ తిపై మొరపెట్టుకున్నా తిరిగి వారినే ప్రశ్నించడం ప్రభుత్వానికే చెల్లిందన్నారు. కామన్వెల్త్ క్రీడల అవకతవకలపై షీలా దీక్షిత్‌ను ప్రజలు తిరస్కరించారని, అయితే ఆమెకు గవర్నర్ బాధ్యతలను అప్పగించడంలోని ఔచిత్యమేమిటన్నారు. ‘ప్రభుత్వంలో ఎవరికి ఏ పదవి అనే విషయం సోనియానే నిర్ణయించిన తర్వాతే రాజముద్ర పడుతుంది. కేబినెట్, ప్రధాన మంత్రి నిర్ణయాలను ప్రశ్నించే అధికారం రాహూ ల్ గాంధీకి ఎవరు ఇచ్చారు ’అని మోడీ ప్రశ్నించారు.
దేశంలోనే పుణే మహత్తరమైనదనీ, కాశీ తర్వాత పుణేకు ప్రాముఖ్యం ఉం దని, ఇటువంటి గొప్ప ప్రాంతంలో కాంగ్రెస్ అధిష్టానం బయటివాళ్లను బరిలోకి దించిందని, అసలు ఎవరిని బరిలోకి దిం చాలనే విషయం వారికి తెలియదా? అని ప్రశ్నిం చారు. ‘ఈ ఎన్నికలు కాంగ్రెస్‌ను ఓడించేవి మాత్ర మే కాదు. దేశ స్వరూపాన్ని మార్చేవి. నేను సమస్యలకు సమాధానాన్ని వెదుకుతున్నా. దానికి పరిష్కా రం తప్పకుండా దొరుకుతుంది’ అని అన్నారు. శరద్ పవార్ ఇన్నాళ్లూ తనపై విమర్శలు చేయలేదని, అయితే సోనియా ఏ మంత్రం వేసిం దోగాని ప్రతి రోజూ అదే పనిగా పెట్టుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పుణే లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ, శివసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనీల్ శిరోలేతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రిమోట్ ప్రధాని మనకొద్దు
Published Sun, Apr 13 2014 10:39 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement