'మాకు రాజకీయ ఉద్దేశాలు లేవు.. జాతికోసమే'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తో తమ పార్టీ నేతలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అయిన భేటీ నిర్మాణాత్మకమైనదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు. ఈ భేటీ వెనుక వ్యక్తిగత రాజకీయ ఉద్దేశాలు లేవని చెప్పారు. జీఎస్టీ బిల్లుపై ఉన్న తమ డిమాండ్లు రాజకీయాలకు అతీతమైనవని, జాతీయ ప్రయోజనాలు ఆశించే తాము ఆ డిమాండ్లు చేస్తున్నామని చెప్పారు.
మోదీతో అయిన భేటీలో కాంగ్రెస్ పార్టీ తన డిమాండ్లను చెప్పిందని, కేంద్ర ప్రభుత్వం కూడా వాటిని సీరియస్ గానే విన్నదని, దానికి అనుకూలంగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని తాము భావిస్తున్నామని అన్నారు. ఏదేమైనా మరోసారి తాము పార్టీ అంతర్గతంగా చర్చించుకుంటామని, విస్తృత ఆలోచనలు జరుపుతామని ఆనంద్ శర్మ తెలిపారు.