రాజ్‌ఘాట్ వద్ద ఆంక్షలు హుష్‌కాకి..! | No barrier between us and our CM Arvind Kejriwal, visitor at Rajghat | Sakshi
Sakshi News home page

రాజ్‌ఘాట్ వద్ద ఆంక్షలు హుష్‌కాకి..!

Published Sat, Dec 28 2013 11:22 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

No barrier between us and our CM Arvind Kejriwal, visitor at Rajghat

న్యూఢిల్లీ:  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేముందు రాజ్‌ఘాట్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్న కేజ్రీవాల్ భారీ జనసమూహంతో కలిసి అక్కడికి వెళ్లారు. అయితే అక్కడున్న భద్రతా సిబ్బంది ఎటువంటి ఆంక్షలు విధించకుండా అందరినీ ఘాట్ వద్దకు అనుమతించారు. కేజ్రీవాల్‌తోపాటు వచ్చిన మంత్రులు, ఇతర నేతలను ఎలా అనుమంతించారో సామాన్యులను కూడా అదేవిధంగా లోపలికి వచ్చేందుకు అనుమతించారు. దీంతో అక్కడికి వచ్చినవారు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో తాము ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చామని, అయితే భద్రతా సిబ్బంది ఎప్పుడూ ఇంత స్వేచ్ఛగా తమను లోపలికి రానీయలేదని, కాని కేజ్రీవాల్ బృందంతో కలిసి వచ్చినప్పుడు ఏ ఒక్కరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని చెప్పారు. ఆమ్ ఆద్మీకి మంచి రోజులు వచ్చాయనడానికి ఇదో ఉదాహరణగా చెప్పవచ్చని అభిప్రాయపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement