న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాకు పలు రాష్ట్రాలు ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఢిల్లీలో కూడా ఈ మూవీని ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై గురువారం ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.
కశ్మీర్ ఫైల్స్ మూవీని పలు రాష్ట్రాల్లో ఎందుకు ట్యాక్స్ ఫ్రీ సినిమాగా ప్రకటిస్తున్నారని అన్నారు. బీజేపీ నేతలంతా కలిసి ఆ సినిమా దర్శకుడైన వివేక్ అగ్నిహోత్రిని.. కశ్మీర్ ఫైల్స్ మూవీనే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలని అడిగితే బాగుంటుందని కదా అని ఎద్దేవా చేశారు. అలా చేస్తే అందరూ ఉచితంగానే కశ్మీర్ ఫైల్స్ సినిమాను చూస్తారని తెలిపారు.
కొంతమంది కశ్మీర్ పండిట్ల పేరుతో కూడా కోట్ల రూపాయాలు సంపాదిస్తున్నారని మండిపడ్డారు. వాళ్లు(బీజేపీ నేతలు) కశ్మీర్ ఫైల్స్ సినిమా పోస్టర్లను గోడలకు అంట్టించడమే మిగిలి ఉందని విమర్శించారు. మరోవైపు హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, కర్ణాటక, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లతో సహా పలు రాష్ట్రాలు ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీని ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించిన విషయం తెలిసిందే.
RT if you want @vivekagnihotri to upload #TheKashmirFiles on YouTube for FREE 🙏🏻pic.twitter.com/gXsxLmIZ09 https://t.co/OCTJs1Bvly
— AAP (@AamAadmiParty) March 24, 2022
Comments
Please login to add a commentAdd a comment