ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర విషయంలో బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కౌంటర్ పడింది. ఇంతకీ ఢిల్లీ ప్రభుత్వం తరపున ట్యాక్స్ ఫ్రీ ఉందా? లేదా? అని నిలదీశారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.
‘మమ్మల్ని అవమానించడమో, కించపర్చడమో చేసే హక్కు మీకు లేదు. ఇంతకీ మీ రాష్ట్రం తరపున కశ్మీర్ ఫైల్స్ సినిమాకు ట్యాక్స్ మినహాయింపులు ఇస్తున్నారా? లేదా? అని ప్రశ్నించారు సీఎం హిమంత. ‘‘ఏం చేయాలనుకుంటున్నారో చేయండి.. అంతేకానీ హిందూ వ్యతిరేకిగా మారకండి’’ అంటూ కేజ్రీవాల్‌కు హితవు పలికారు హిమంత.
మన హిందూ సమాజం (సమాజం) ఈ స్థితిలో ఉందంటే.. హిందూ కుటుంబంలో ఎక్కువ హిందూ వ్యతిరేకులుగా ఉండడమే కారణం. లేకుంటే.. ఒకప్పటిలా హిందూ నాగరికత.. ప్రపంచానికి మార్గాన్ని చూపేదే అంటూ పేర్కొన్నారు హిమంత. గతంలో కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా ఎన్నో సినిమాలకు ట్యాక్స్ ఫ్రీ ప్రకటించింది. ఆ టైంలో మరి ఆయన ఆ సినిమాలను యూట్యూబ్‌లో ఎందుకు అప్‌లోడ్ చేయమని అడగలేదు? కేవలం కశ్మీర్ ఫైల్స్ విషయంలోనే ఆయన అక్కసు ఎందుకు? అంటూ నిలదీశారు అస్సాం సీఎం హిమంత.
సంబంధిత వార్త: కశ్మీర్ ఫైల్స్‌ను యూట్యూబ్‌లో పెట్టండి
Comments
Please login to add a commentAdd a comment