Tax free
-
ది కేరళ స్టోరీ: యోగి సర్కార్ కీలక నిర్ణయం
ది కేరళ స్టోరీ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు.. విడుదలకు ముందే రాజకీయ రంగు పులుముకున్న ఈ వివాదం.. రోజులు గడుస్తున్న కొద్దీ తీవ్రతరమవుతోంది. వివిధ పార్టీలు. ప్రభుత్వాల మధ్య చిచ్చు రాజేస్తోంది. ఈ సినిమాను కేరళ ప్రభుత్వం సహా కాంగ్రెస్, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేరళను కించపరిచేలా, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా రూపొందించారంటూ నిరసనలు వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో సినిమాను విడుదల చేస్తే అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని తమిళనాడులోని మల్టిప్లెక్స్ థియేటర్లలో కేరళ స్టోరీ షోలను రద్దు చేశారు. మరోవైపు సమాజంలో అశాంతి. అలజడులను సృష్టించే అవకాశం ఉందని పశ్చిమ బెంగాల్‌లోని కేరళ స్టోరీని నిషేధిస్తున్నట్లు మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఎక్కడైనా ప్రదర్శిస్తున్నట్లు తేలితే కఠిన చర్యలుంటాయని చెప్పారు. చదవండి: ‘ది కేరళ స్టోరీ’కి భారీ షాక్.. అయితే వివాదాస్పద ది కేరళ స్టోరి సినిమాకు బీజేపీ మాత్రం మద్దతు తెలుపుతోంది. బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాల్లో కేరళ స్టోరీకి పన్ను మినహాయింపులు కూడా ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్ సినిమాకు టాక్స్ ఫ్రీ కల్పించగా... తాజాగా ఈ జాబితాలోకి ఉత్తర ప్రదేశ్ సైతం చేరింది. 'ది కేరళ స్టోరీ'ని ఉత్తరప్రదేశ్‌లో పన్ను రహితంగా ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. సీఎం తన క్యాబినెట్‌తో కలిసి ప్రత్యేక స్క్రీనింగ్‌లో సినిమాను వీక్షించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాన మంత్రి మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సినిమాను చూశారు. ఉగ్రవాద ప్రమాదకర కుట్రను ఈ చిత్రం బహిర్గతం చేస్తుందని పేర్కొన్నారు. సినిమాను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన ఆయన.. ప్రతిపక్ష పార్టీ ఓటు బ్యాంకు కోసం ఉగ్రవాదాన్ని కప్పి ఉంచిందని మండిపడ్డారు. ది కేరళ స్టోరీ' ఏ రాష్ట్రం లేదా మతానికి సంబంధించినది కాదని జేపీ నడ్డా పేర్కొన్నారు. కాగా సుదీప్తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విపుల్ అమృత్లాల్ నిర్మించారు. ఆదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించారు. కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతలు ఏమయ్యారు, ఎక్కడున్నారనే ఇతివృత్తంతో తెరకెక్కించారు. కేరళలో తప్పిపోయిన నలుగురు అమ్మాయిలు ఉగ్రసంస్థ ఐఎస్ఐలో చేరి శిక్షణ పొంది పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టిన్నట్లు చూపించడంతో వివాదాలకు దారి తీసింది. -
రూ.37 వేలకే తులం బంగారం! ఇలా చేస్తే మీ సొంతం
భారతీయులకు బంగారం అంటే అత్యంత ప్రీతి. దాన్ని ఒక పెట్టుబడి సాధనంగా కూడా చూస్తారు. ముఖ్యంగా మహిళలయితే బంగారం ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో రోజూ బంగారం ధరలు ఎలా ఉన్నాయో గమనిస్తూ ఉంటారు. ఇదీ చదవండి: Currency Notes: రద్దయిన పాత నోట్లను మార్చుకోవచ్చా..? కేంద్రం కీలక ప్రకటన! దేశంలో బంగారం 90 శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతోంది. 2022 ఏడాదిలో విదేశాల నుంచి దాదాపు 706 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది భారత్. ఇందుకోసం దాదాపు 36.6 బిలియన్ డాలర్లు వెచ్చించింది. బంగారంపై భారతీయులకు ఉన్న ఆసక్తిని గ్రహించిన భూటాన్.. భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫుయంషోలింగ్, థింపులకు వచ్చేవారు ఎలాంటి ట్యాక్స్ లేకుండానే బంగారం కొనుగోలు చేసేందుకు అనుమతిస్తోంది. దీంతో భారత్‌లో కంటే తక్కువ ధరకే అక్కడ బంగారం కొనుక్కోవచ్చు. ఇదీ చదవండి: Ola Holi Offer: తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు! భూటాన్ దేశ నూతన సంవత్సరం, భూటాన్ రాజు జన్మదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 21న ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా తమ పర్యాటక ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు భూటాన్ అధికారిక పత్రిక డైలీ కౌన్సెల్ ప్రచురించింది. భారత్‌తో పోలిస్తే ధరలు కాస్త తక్కువగా ఉండటంతో ప్రస్తుతం చాలా మంది భారతీయులు దుబాయ్ వెళ్లి బంగారం కొంటున్నారు. తులం బంగారం రూ.37 వేలే.. ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం భారత్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.55,600పైగానే ఉంది. అదే భూటాన్‌లో 10 గ్రాముల బంగారం 37,588.49 భూటనీస్ ఎన్‌గూల్ట్రమ్ (బీటీఎన్)గా ఉంది. ఒక బీటీఎన్ భారత రూపాయితో దాదాపు సమానంగా ఉంది. అంటే భారతీయులు రూ.37,588కే తులం బంగారం కొనుక్కోవచ్చన్న మాట. మరి షరతులు? భూటన్లో భారతీయులు పన్ను రహిత బంగారం కొనుగోలు చేయాలంటే సస్టెయినబుల్ డెవలప్మెంట్ ఫీ (ఎస్డీఎఫ్) రూ.1,200 నుంచి రూ.1,800 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఆ దేశ ప్రభుత్వం గుర్తింపు పొందిన టూరిస్ట్ సెర్టిఫైడ్ హోటల్లో ఒక రాత్రి బస చేయాల్సి ఉంటుంది. టూరిస్టులు అమెరికా డాలర్లతోనూ బంగారం కొనుగోలు చేయొచ్చు. ఈ ఎస్డీఎఫ్ టూరిజం ట్యాక్స్‌ను 2022లోనే భూటాన్ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం.. భారతీయులు ఒక వ్యక్తి.. ఒక రోజుకు రూ.1,200 నుంచి రూ.1,800 చెల్లించాలి. ఇతర దేశస్థులయితే 65 నుంచి 200 డాలర్ల వరకు చెల్లించాలి. ఈ ఎస్డీఎఫ్ ట్యాక్స్ కట్టిన వారు మాత్రమే ఈ ట్యాక్స్ ఫ్రీ గోల్డ్ కొనేందుకు అర్హులు. ఈ బంగారాన్ని లగ్జరీ వస్తువులు విక్రయించేడ్యూటీ ఫ్రీ ఔట్‌లెట్స్‌లో కొనుగోలు చేయొచ్చు. ఎంత బంగారం తెచ్చుకోవచ్చు? కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, కస్టమ్స్ విభాగం నిబంధనల ప్రకారం విదేశాల నుంచి భారత్‌లోకి మగవారైతే రూ.50 వేల విలువైన బంగారం, మహిళలయితే గరిష్టంగా రూ.లక్ష విలువైన బంగారం తెచ్చుకోవచ్చు. అంతకు మించి తీసుకువస్తే కస్టమ్స్ సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: Women’s Day 2023: ఈ బ్యాంకును నడిపించేది ఆమే.. ఏకైక మహిళా చీఫ్! In a bid to boost tourism Indian and other SDF fee paying tourists coming to Phuentsholing or Thimphu in Bhutan can now buy tax free gold. The only condition being you have to stay in a tourist certified hotel and pay SDF. The gold will be much more cheaper than in India. — Tenzing Lamsang (@TenzingLamsang) February 24, 2023 -
పన్ను ప్రయోజనాలు కావాలంటే.. ఈ పోస్టాఫీస్ పథకాలపై ఓ లుక్కేయండి!
పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఆలోచించేది, ఆచరించే మంత్రం ‘పొదుపు’. వారికి ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం పోస్టాఫీసు ద్వారా పొదుపు పథకాలను అందిస్తోంది. ఈ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బు పొదుపు చేయడంతో పాటు ఆదాయపు పన్ను ప్రయోజనాలను కూడా పొందొచ్చు.అవేంటో తెలుసుకుందాం! పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఈ పథకంలో 15 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఇందులో కనీసం రూ. సంవత్సరానికి 500, గరిష్ట డిపాజిట్ రూ.ఒకే ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షలు జమ చేసుకోవచ్చు. 5 సంవత్సరాల తర్వాత మాత్రమే నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు. అది కూడా ప్రాణాంతక వ్యాధి, ఉన్నత విద్య , నివాస మార్పు వంటి పరిస్థితులకు లోబడి ఉంటుంది. అయితే, వ్యక్తులు 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే సౌకర్యం ఉంది. 4 సంవత్సరాల తర్వాత రుణాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద చేసిన డిపాజిట్లకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. అదనంగా, సంపాదించిన వడ్డీ పూర్తిగా పన్ను రహితం. ప్రస్తుత పోస్టాఫీసు PPF వడ్డీ రేటు వార్షికంగా 7.1% ఉంది. సుకన్య సమృద్ధి ఖాతా ఆడపిల్లల భవిష్యత్ కోసం ఉద్దేశించిన ప్రత్యేక పథకం ఇది. 10 ఏళ్లలోపు బాలికలకు ఈ ఖాతాను తెరవవచ్చు. ఖాతా తెరిచే సమయంలో అమ్మాయి వయస్సుతో సంబంధం లేకుండా ఈ పథకం 21 సంవత్సరాల కాల వ్యవధిని కలిగి ఉంది. ఉదాహరణకు, ఖాతా తెరిచే సమయంలో ఒక అమ్మాయికి 7 సంవత్సరాలు ఉంటే, ఆ అమ్మాయికి 28 ఏళ్లు వచ్చేసరికి ఆ ఖాతా మెచ్యూర్ అవుతుంది. ఖాతా తెరిచినప్పటి నుంచి 15 సంవత్సరాల పాటు డిపాజిట్లు చేయాలి. ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.60%. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250, గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో ముందస్తు విత్ డ్రా చేసుకోవచ్చు, కాకపోతే కనీసం 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పోస్ట్ ఆఫీస్ పన్ను ఆదా పథకం కింద చేసిన పెట్టుబడులు సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలకు అర్హత పొందుతాయి. ప్రస్తుత పోస్టాఫీసు సుకన్య సమృద్ధి ఖాతా వడ్డీ రేటు సంవత్సరానికి 7.6% అందిస్తుంది. ఆడపిల్లల ఉన్నత చదువుల కోసం, వివాహం కోసం నియమ నిబంధనలను అనుసరించి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పథకంలో చేసే పెట్టుబడులపై కూడా సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే వడ్డీ గానీ, మెచ్యూరిటీ మొత్తంపై గానీ పన్ను వర్తించదు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ అనేది పన్ను మినహాయింపు కోసం ప్రముఖ పోస్టాఫీసు పథకాలలో ఒకటి. ఈ ప్లాన్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. పెట్టుబడిదారులు 1, 2, 3, 5 సంవత్సరాల వంటి వివిధ కాల వ్యవధిలో డిపాజిట్లు చేయవచ్చు ఈ పథకంలో గరిష్ట పదవీకాలం 5 సంవత్సరాలు. టైమ్ డిపాజిట్లో కనీస పెట్టుబడి మొత్తం రూ. 1,000, కాగా దీనికి గరిష్ట పరిమితి లేదు. అయితే, పన్ను ప్రయోజనం రూ. 1.5 లక్షలు ఉంటుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పన్ను ప్రయోజనం కోసం ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలంటే ఖతాదారుడు మొత్తం పెట్టుబడిని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో ఖాతాదారులు అసలు, వడ్డీ రెండు కలిపి మొత్తం కార్పస్‌ను అందుకుంటారు. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో 7% వడ్డీ లభిస్తోంది. ఈ పథకంలో కనీసం రూ.100 నుంచి పెట్టుబడులు పెట్టొచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపునకు అర్హత ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న పెద్దలు, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన 55 నుంచి 60 ఏళ్ల లోపు వయసువారు ఈ పథకంలో చేరవచ్చు. ఇందులో కనీసం రూ.1000 నుంచి గరిష్టంగా రూ.15 లక్షల వరకు.. ఒకేసారి పెట్టుబడి పెట్టాలి. దీని ప్రత్యేకత ఏమనగా.. పోస్టాఫీస్ అందిస్తున్న పథకాల్లో అత్యధిక వడ్డీ రేటుని అందిస్తోంది ఈ పథకం. ప్రస్తుతం వార్షికంగా ఈ పథకం 8% వడ్డీ రేటు అందిస్తోంది. ఇందులో వడ్డీని త్రైమాసికంగా చెల్లిస్తారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, జులై, అక్టోబరు, జనవరి నెలల్లో మొదటి తేదీన వడ్డీ ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకంలో పెట్టిన పెట్టుబడులపై కూడా సెక్షన్ 80సి కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. -
పన్ను ఆదా.. స్థిరమైన రాబడులు పొందాలంటే ఈ స్కీమ్‌లో చేరాల్సిందే!
ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే పన్ను ఆదా సాధనాల్లో ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైనది. కానీ, చాలా మంది దీన్ని ఆచరించలేరు. ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో పన్ను ఆదా సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే వారే ఎక్కువ. ఈ తరుణంలో పన్ను ఆదా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. పన్ను ఆదాకుతోడు మెరుగైన రాబడులను ఇచ్చే సాధనంలో ఇన్వెస్ట్ చేసినప్పుడే అసలైన ప్రయోజనం నెరవేరుతుంది. ఈ విధంగా చూసుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) మెరుగైన సాధనం అవుతుంది. ఒకవైపు సెక్షన్ 80సీ కింద ఈ పథకాల్లో రూ.1.5 లక్షల మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. మరోవైపు మూడేళ్లకు మించి పెట్టుబడులను కొనసాగించడం ద్వారా దీర్ఘకాలంలో ఇతర అన్ని సాధనాల కంటే మెరుగైన రాబడులను వీటిల్లో పొందొచ్చు. ఈఎల్ఎస్ఎస్ విభాగంలో కెనరా రొబెకో ట్యాక్స్ సేవర్ ఫండ్‌ను ఇన్వెస్టర్లు తప్పకుండా పరిగణనలోకి తీసుకోవచ్చు. రాబడులు ఈ పథకానికి మెరుగైన, స్థిరమైన రాబడుల చరిత్ర ఉంది. సాధారణంగా పన్ను ఆదా సాధనం కనుక ఇందులో పెట్టుబడులకు మూడేళ్ల లాకిన్ ఉంటుంది. అంటే పెట్టుబడి పెట్టిన మూడేళ్ల తర్వాతే వెనక్కి తీసుకోగలరు. కనుక ఏడాది రాబడులు కాకుండా మూడేళ్ల కాలంలో రాబడులను చూసినట్టయితే ఏటా 20 శాతం రాబడులను ఇచ్చింది. అలా కాకుండా ఆ పెట్టుబడులను ఐదేళ్ల పాటు కొనసాగించి ఉంటే ఏటా 14 శాతం, ఏడేళ్ల పాటు అయితే ఏటా 14 శాతం, 10 ఏళ్లపాటు ఉంచినప్పుడు ఏటా 14 శాతం రాబడులను ఈ పథకం ఇచ్చినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇదంతా రెగ్యులర్ ప్లాన్‌లో. డైరెక్ట్ ప్లాన్‌లో అయితే 15 శాతంపైనే రాబడులు ఉన్నాయి. బీఎస్ఈ 500టీఆర్ఐ, ఈఎల్ఎస్ఎస్ విభాగం సగటు రాబడి కంటే ఈ పథకంలోనే కాస్త అధిక రాబడులు ఉన్నాయి. మధ్యస్థ రిస్క్ తీసుకునే వారికి ఈ పథకం అనుకూలం. పన్ను ఆదా అవసరం లేని వారు, లాకిన్ ఉన్న సాధనాలు కోరుకునే వారికి కూడా ఇవి అనుకూలమే. పెట్టుబడుల విధానం పెట్టుబడులకు మల్టీక్యాప్ విధానం అనుసరిస్తుంది. అంటే లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అయితే ఎక్కువ పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కంపెనీలకు కేటాయిస్తుంది. కనుక రాబడుల్లో అస్థిరతలు తక్కువగా ఉంటాయి. లార్జ్‌క్యాప్ కేటాయింపులు ఎక్కువ కావడంతో గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో నష్టాలు కేవలం మూడు శాతానికి పరిమితమయ్యాయి. కానీ, గడిచిన ఏడాది కాలంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీలు విడిగా 20–30 శాతం మధ్య దిద్దుబాటుకు గురికావడం గమనార్హం. పరిస్థితులకు అనుగుణంగా లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కేటాయింపులను ఈ పథకం మార్పు చేర్పులు చేస్తుంటుంది. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.4,583 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 97 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా 3 శాతాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విట్లీలోనూ 77 శాతాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే కలిగి ఉంది. మిడ్‌క్యాప్ కంపెనీలకు 21 శాతం కేటాయించగా, స్మాల్‌క్యాప్ పెట్టుబడులు ఒక్క శాతం లోపే ఉండడం గమనించొచ్చు. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 58 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 33 శాతం వీటికే కేటాయించింది. ఆ తర్వాత టెక్నాలజీ కంపెనీల్లో 11 శాతం, ఆటోమొబైల్‌లో 7 శాతం, హెల్త్ కేర్ కంపెనీల్లో 6 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. చదవండి: రూ.61లకే కొత్త ప్లాన్‌తో వచ్చిన రిలయన్స్ జియో.. ఆ కస్టమర్లకు పండగే! -
ఆ ఊరిలో.. ట్యాక్స్ ఫ్రీ
ద్వారకాతిరుమల: ఆ ఊళ్లో కుళాయి పన్ను, ఇంటి పన్ను ఎవరూ కట్టక్కర్లేదు. ఆ గ్రామ పంచాయతీ చెరువులోని చేపలు కూడా గ్రామస్తులకు ఉచితమే. ఇప్పటికే ఓ ఏడాది పాటు అందివచ్చిన ఈ అద్భుతమైన ఆఫర్ మరో నాలుగేళ్ల పాటు కొనసాగనుంది. రాజమహేంద్రవరం కేంద్రంగా కొత్తగా ఏర్పాటైన తూర్పు గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం తిరుమలంపాలెం పంచాయతీలోని గొల్లగూడెం గ్రామం ఏడాది క్రితం నూతన పంచాయతీగా ఏర్పడింది. సుమారు 2 వేల జనాభా, 1,418 మంది ఓటర్లు ఉన్నారు. గత ఏడాది జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రయత్నించారు. ఫలించకపోవడంతో చివరకు పోటీ అనివార్యమైంది. దీంతో శ్రీమంతుడిగా పేరున్న వైఎస్సార్ సీపీ నేత బొండాడ వెంకన్నబాబు తన తండ్రి నాగభూషణాన్ని పోటీకి దింపారు. ఆయనను గెలిపిస్తే ఐదేళ్ల పాటు పంచాయతీకి కుళాయి, ఇంటి పన్నులు ఎవరూ చెల్లించక్కర్లేదని హామీ ఇచ్చారు. దాంతో పాటు ప్రస్తుత బకాయిలను కూడా తానే చెల్లిస్తానన్నారు. చేపల పెంపకానికి వినియోగిస్తున్న మందులు, వ్యర్థాల కారణంగా గ్రామంలోని పంచాయతీ చెరువు దుర్వాసన వెదజల్లుతోందని.. తన తండ్రి సర్పంచ్ అయిన తరువాత చెరువులో ఎటువంటి మందులు, వ్యర్థాలు వేయకుండా చేపలు పెంచి ప్రజలకు ఉచితంగా ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. దీంతో అప్పట్లో గొల్లగూడెంలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. గెలిచిన వెంటనే.. త్రిముఖ పోటీలో బొండాడ నాగభూషణం ప్రత్యర్థులపై 435 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం ఆ ఏడాది పన్నులతో పాటు, అప్పటి వరకూ ఉన్న పన్ను బకాయిల మొత్తం రూ.9.50 లక్షలు పంచాయతీకి చెల్లించారు. గ్రామంలోని చెరువును రూ.1.50 లక్షలకు బహిరంగ వేలం ద్వారా మూడేళ్ల కాల పరిమితికి దక్కించుకుని, అందులో సహజసిద్ధంగా చేపల పెంపకం చేపట్టారు. ఆ చేపలను ఈ ఏడాది ఫిబ్రవరి 17న గ్రామంలోని ప్రతి ఇంటికి ఉచితంగా పంపిణీ చేశారు. సర్పంచ్ పదవీ కాలం మరో నాలుగేళ్లు ఉండటంతో.. అప్పటి వరకూ ఈ ట్యాక్స్ ఫ్రీ కొనసాగనుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాదికి సంబంధించిన కుళాయి, ఇంటి పన్నుల సొమ్ము రూ.5.11 లక్షలను కొద్ది రోజుల క్రితమే పంచాయతీకి చెల్లించారు. రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామం.. రాష్ట్రంలోనే తొలి ట్యాక్స్ ఫ్రీ గ్రామంగా గొల్లగూడెం నిలుస్తోంది. మిగిలిన గ్రామ పంచాయతీలకు ఈ గ్రామం ఆదర్శం. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పంచాయతీ ట్యాక్స్‌లు ప్రజల తరఫున మేమే చెల్లిస్తున్నాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెన్నుదన్నుగా నిలుస్తున్నాం. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సహాయ సహకారాలతోనే ఇవన్నీ చేయగలుగుతున్నాం. – బొండాడ వెంకన్నబాబు, సర్పంచ్ కుమారుడు నూరు శాతం పన్ను వసూలైంది గ్రామంలోని ప్రతి ఒక్కరి కుళా యి, ఇంటి పన్నులను సర్పంచ్ నాగభూషణం, ఆయన కుమారుడు వెంకన్నబాబు చెల్లిస్తున్నా రు. దీనివల్ల మా పంచాయతీలో నూరు శాతం పన్నులు వసూలవుతున్నాయి. ప న్ను వసూలు కోసం ఇంటింటిటీ తిరిగే బాధ తప్పింది. – జక్కంపూడి రాజేష్, పంచాయతీ కార్యదర్శి దుర్గంధం బాధ తప్పింది గతంలో పంచాయతీ చెరువులో చేపల పెంపకం కోసం మందులు, వ్యర్థాలను వాడేవారు. దాంతో చెరువు తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లేది. అటుగా నడవలేకపోయేవాళ్లం. వెంకన్నబాబు, ఆయన తండ్రి నాగభూషణం దయవల్ల చెరువు బాగుపడింది. – ఎర్ర దుర్గ, గ్రామస్తురాలు పన్నుల భారం లేదు ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి వెంకన్నబాబు, ఆయన తండ్రి నాగభూషణం గ్రామంలోని సుమారు 700 గృహాలకు కుళాయి, ఇంటి పన్నులను చెల్లిస్తున్నారు. దీనివల్ల మాకు పన్నుల భారం తప్పింది. చాలా సంతోషంగా ఉంది. – కొడవలూరి పద్మావతి, గ్రామస్తురాలు -
కశ్మీర్ ఫైల్స్.. కేజ్రీవాల్‌కు స్ట్రాంగ్ కౌంటర్
ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర విషయంలో బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కౌంటర్ పడింది. ఇంతకీ ఢిల్లీ ప్రభుత్వం తరపున ట్యాక్స్ ఫ్రీ ఉందా? లేదా? అని నిలదీశారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ. ‘మమ్మల్ని అవమానించడమో, కించపర్చడమో చేసే హక్కు మీకు లేదు. ఇంతకీ మీ రాష్ట్రం తరపున కశ్మీర్ ఫైల్స్ సినిమాకు ట్యాక్స్ మినహాయింపులు ఇస్తున్నారా? లేదా? అని ప్రశ్నించారు సీఎం హిమంత. ‘‘ఏం చేయాలనుకుంటున్నారో చేయండి.. అంతేకానీ హిందూ వ్యతిరేకిగా మారకండి’’ అంటూ కేజ్రీవాల్‌కు హితవు పలికారు హిమంత. మన హిందూ సమాజం (సమాజం) ఈ స్థితిలో ఉందంటే.. హిందూ కుటుంబంలో ఎక్కువ హిందూ వ్యతిరేకులుగా ఉండడమే కారణం. లేకుంటే.. ఒకప్పటిలా హిందూ నాగరికత.. ప్రపంచానికి మార్గాన్ని చూపేదే అంటూ పేర్కొన్నారు హిమంత. గతంలో కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా ఎన్నో సినిమాలకు ట్యాక్స్ ఫ్రీ ప్రకటించింది. ఆ టైంలో మరి ఆయన ఆ సినిమాలను యూట్యూబ్‌లో ఎందుకు అప్లోడ్ చేయమని అడగలేదు? కేవలం కశ్మీర్ ఫైల్స్ విషయంలోనే ఆయన అక్కసు ఎందుకు? అంటూ నిలదీశారు అస్సాం సీఎం హిమంత. సంబంధిత వార్త: కశ్మీర్ ఫైల్స్‌ను యూట్యూబ్‌లో పెట్టండి -
‘కశ్మీర్ ఫైల్స్’ ను యూట్యూబ్‌లో పెట్టమని అడగండి’
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాకు పలు రాష్ట్రాలు ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఢిల్లీలో కూడా ఈ మూవీని ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై గురువారం ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కశ్మీర్ ఫైల్స్ మూవీని పలు రాష్ట్రాల్లో ఎందుకు ట్యాక్స్ ఫ్రీ సినిమాగా ప్రకటిస్తున్నారని అన్నారు. బీజేపీ నేతలంతా కలిసి ఆ సినిమా దర్శకుడైన వివేక్ అగ్నిహోత్రిని.. కశ్మీర్ ఫైల్స్ మూవీనే యూట్యూబ్‌లో అప్లోడ్ చేయాలని అడిగితే బాగుంటుందని కదా అని ఎద్దేవా చేశారు. అలా చేస్తే అందరూ ఉచితంగానే కశ్మీర్ ఫైల్స్ సినిమాను చూస్తారని తెలిపారు. కొంతమంది కశ్మీర్ పండిట్ల పేరుతో కూడా కోట్ల రూపాయాలు సంపాదిస్తున్నారని మండిపడ్డారు. వాళ్లు(బీజేపీ నేతలు) కశ్మీర్ ఫైల్స్ సినిమా పోస్టర్లను గోడలకు అంట్టించడమే మిగిలి ఉందని విమర్శించారు. మరోవైపు హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, కర్ణాటక, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లతో సహా పలు రాష్ట్రాలు ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీని ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించిన విషయం తెలిసిందే. RT if you want @vivekagnihotri to upload #TheKashmirFiles on YouTube for FREE 🙏🏻pic.twitter.com/gXsxLmIZ09 https://t.co/OCTJs1Bvly — AAP (@AamAadmiParty) March 24, 2022 -
డైరెక్టర్ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
A Women Cried After Watching The Kashmir Files Movie: సామాజిక అంశాలను తన సినిమాలతో వేలెత్తి చూపే బాలీవుడ్ దర్శకులలో వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ఆయన డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. బాలీవుడ్ దిగ్గజ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు. 1990లో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో రూపొందింది ఈ సినిమా. ఈ సినిమా మార్చి 11న విడుదలై ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవల ఈ సినిమాకు పన్ను మినహాయింపును ఇచ్చింది హర్యానా ప్రభుత్వం. హర్యానా ప్రభుత్వపు అధికారిక ట్విటర్ హ్యాండిల్లో ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 'ది కశ్మీర్ ఫైల్స్ అనే సినిమాకు హర్యానా ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇస్తుంది' అని ట్వీట్ చేసింది. हरियाणा सरकार ने फिल्म #TheKashmirFiles को राज्य में टैक्स फ्री कर दिया है। #Haryana #DIPRHaryana pic.twitter.com/Zg8XWC8OoV — DPR Haryana (@DiprHaryana) March 11, 2022 बहुत आभार माननीय @mlkhattar जी। corona काल की आर्थिक समस्याओं के बाद सामान्य परिवारों को यह फ़िल्म देखने में आपका यह निर्णय काफ़ी मदद करेगा। साथ ही सिनेमा हॉल का व्यवसाय भी मज़बूती पकड़ेगा। 🙏🙏🙏 https://t.co/VNZNqcai9U — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 11, 2022 ఈ విషయంపై మూవీ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి స్పందించారు. తన సినిమాకు పన్ను మినహాయింపు చేసినందుకు హర్యానా ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ రీట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా చూసిన అనేక మంది ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయి కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెటర్ సురేష్ రైనా తన ట్విటర్ హ్యాండిల్లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక మహిళ వివేక్ పాదాలు తాకడం, సినిమా గురించి తన భావాన్ని వ్యక్తపరుస్తూ బిగ్గరగా ఏడవడం మనం చూడొచ్చు. అనంతరం డైరెక్టర్ వివేక్, నటుడు దర్శన్ కుమార్ ఆ మహిళను ఓదార్చారు. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి డైరెక్టర్, దర్శన్ కుమార్ సైతం కంటతడి పెట్టుకున్నారు. Presenting #TheKashmirFiles It’s your film now. If the film touches your heart, I’d request you to raise your voice for the #RightToJustice and heal the victims of Kashmir Genocide.@vivekagnihotri @AnupamPKher @AdityaRajKaul pic.twitter.com/Gnwg0wlPKU — Suresh Raina🇮🇳 (@ImRaina) March 11, 2022 -
మంత్రిగారు మా గోడు వినండి! ట్యాక్స్–ఫ్రీ డిపాజిట్ల కాలాన్ని తగ్గించండి
న్యూఢిల్లీ: పన్ను రహిత స్థిర డిపాజిట్ల (ట్యాక్స్–ఫ్రీ ఎఫ్డీలు) కాలపరిమితిని ప్రస్తుత ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు 2022–23 వార్షిక బడ్జెట్లో ప్రతిపాదనను ప్రవేశపెట్టాలని కోరింది. వచ్చే నెల ఒకటవ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఐబీఐ చేసిన బడ్జెట్ ముందస్తు సిఫారసుల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► ఈక్విటీ అనుసంధాన పొదుపు పథకాల (ఈఎల్ఎస్ఎస్) వంటి మ్యూచువల్ ఫండ్ ప్రొడక్స్కు అందిస్తున్న పన్ను ప్రయోజనాలను స్థిర డిపాజిట్లకు అందించాలి. ఇందుకు సంబంధించి పన్ను రహిత స్థిర డిపాజిట్ల కాలపరిమితిని మూడేళ్లకు తగ్గించాలి. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ కింద ఐదేళ్ల స్థిర డిపాజిట్ పథకంలో డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. సెక్షన్ 80సీ కింద రూ. 1.50 లక్షల పనున మినహాయింపు ఉంది. ► మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ (ఈక్విటీ అనుసంధాన పొదుపు పథకాల వంటివి) పోలిస్తే, పన్ను ఆదా చేసే ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) తక్కువ ఆకర్షణీయంగా ఉంది. అయితే లాక్–ఇన్ వ్యవధిని తగ్గించినట్లయితే, పన్నుల పరంగా స్థిర డిపాజిట్లు కూడా మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. తద్వారా బ్యాంకులకు సైతం నిధుల లభ్యత పెరగుతుంది. ► బలహీన రంగాలను ప్రోత్సహించడం, వివిధ పథకాలను అమలుచేయడంసహా అందరికీ ఆర్థిక ఫలాలు అందించడం, బ్యాంకింగ్ సేవల విస్తృతి, డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించడం, ఐటీ వ్యయాలవంటి అంశాలకు బ్యాంకులు వివిధ ఖర్చులను బ్యాంకింగ్ భరిస్తోంది. వీటి భర్తీకి కొంతమేర ప్రత్యేక రిబేట్లు, అదనపు ప్రోత్సహకాలను కూడా బ్యాంకింగ్ కోరుతోంది. ► పన్నులకు సంబంధించిన కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక వివాద పరిష్కార యంత్రాంగం బ్యాంకింగ్‌కు అవసరం. ► బ్యాంకుల అప్పీళ్ల వ్యవహారాల్లో గణనీయమైన మొత్తాలు కూడా ఉంటాయి. అయితే విచారణ సందర్భల్లో భారీ మొత్తాలకు సంబంధించిన అంశాలనుకూడా చిన్న మొత్తాలతో కూడిన అప్పీళ్లతో సమానంగా పరిగణిస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ► బ్యాంకులు–ప్రభుత్వ వాఖ మధ్య అప్పీళ్ల వేగంగా పరిష్కారం అయ్యేలా చర్యలు ఉండాలి. ► పన్ను శాఖ– బ్యాంకుల మధ్య వ్యాజ్యాలను తగ్గించడానికి, అప్పీల్ ప్రక్రియ విచారణను వేగవంతంగా పూర్తి చేయడానికి ఖచ్చితమైన సమయపాలనతో ఏర్పాటు చేయబడిన వివాదాల కమిటీ మాదిరిగానే ప్రత్యేక వివాద పరిష్కార యంత్రాంగం అవసరం. చదవండి: కేంద్ర బడ్జెట్లో పేదల సబ్సిడీలు, సంక్షేమానికి కోత..! -
మెడల్స్-నజరానా ఓకే.. కట్టింగ్ల పరిస్థితి ఇది!
కనివినీ ఎరుగని రీతిలో భారత అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాల ద్వారా చరిత్ర సృష్టించారు. ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో పాయింట్ల పట్టికలో 48వ స్థానంలో నిలిచింది మన దేశం. నీరజ్ చోప్రా, బజరంగ్, మీరాబాయ్ చాను, సింధు, భారత హాకీ టీం.. ఇలా పతకాలు తెచ్చిన వీరులను నజరానాలతో ముంచెత్తుతున్నారు. ఈ తరుణంలో వాళ్లకు దక్కబోయే-దక్కుతున్న వాటికి ట్యాక్స్ కట్టింగ్లు వర్తిస్తాయా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్‌లో సెక్షన్ 10(17ఏ) ప్రకారం.. వేటి మీద కోత ఉంటుందో వేటి మీద ఉండదో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) నిర్ణయిస్తుంది. ఇలాంటి విజయాల సమయంలో ఆటగాళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నాకే నజరానాలపై ట్యాక్స్‌లు విధించకూడదని నిర్ణయించుకుంది. 1989 నుంచే ఈ చట్టం ఉన్నప్పటికీ.. 2014లో సీబీడీటీ ఆదేశపూర్వకంగా వీటి వివరాలను వెల్లడించింది. ప్రభుత్వాలు అందించే క్యాష్ ప్రైజ్గానీ మరేయితర రూపమైన నజరానాపైగానీ మెడల్స్ విన్నర్లకు మాత్రమే ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఒలింపిక్స్, కామన్ వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ విజేతలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. వీళ్లకు నో.. అయితే స్థానిక అధికార సంస్థలు, క్రీడా విభాగాలు, పారిశ్రామికవేత్తలు ప్రకటించే నజరానాలపై పన్ను మినహాయింపు ఉండదు. ఈ లెక్కన బల్లెం వీరుడు నీరజ్ చోప్రా(చోప్డా)కు ఆనంద్ మహీంద్ర ప్రకటించిన ఎస్యూవీ వెహికిల్ కోసం 30 శాతం పన్ను ఫీజును తన జేబులోంచి కట్టాల్సి ఉంటుంది నీరజ్. ఇక హరియాణా, పంజాబ్, మణిపూర్ ప్రభుత్వాలు ప్రకటించిన కోట్ల రూపాయల నజరానా మాత్రం ఎలాంటి కట్టింగ్లు లేకుండానే నీరజ్ చేతికి అందుతుంది. చదవండి: వీరులకు బ్రహ్మరథం హాకీ ఉమెన్.. కట్ కేవలం ‘విజేతలకు మాత్రమే’ అనే సీబీడీటీ ఆదేశాలు.. మిగతా టాలెంటెడ్ ఆటగాళ్లకు విఘాతంగా మారాయి. ఒలింపిక్స్‌లో అద్భుతమైన ఆటతీరు కనబరిచిన భారత మహిళా హాకీ టీం 9 మంది ప్లేయర్లకు హరియాణా సర్కార్ రూ.50లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. మెడల్ గెలవనందున ఈ డబ్బు నుంచి ట్యాక్స్ కట్టింగ్లు పోనున్నాయి. కేవలం ప్లేయర్స్‌కే కాదు.. వాళ్ల కోచ్‌కు కూడా ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థల నుంచి ఎలాంటి రివార్డు అందినా.. అదీ కోతకు గురికావాల్సిందేనని చట్టం స్పష్టం చేస్తోంది. 30 శాతం తప్పదు ప్లాట్ రేట్ ప్రకారం.. మినహాయింపులు లేని నజరానాల నుంచి 30 శాతం కోత తప్పనిసరి. కేవలం గెలిచిన వాళ్లే కాదు.. ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు అందించే నజరానాలకు ఈ కోత తప్పదు. ఒకవేళ దాతనే ముందుకొచ్చి ఆ చెల్లింపులు భరిస్తే మాత్రం.. ఆటగాళ్లపై భారం పడదు. ఇక విమాన, రైల్వే, బస్సు ప్రయాణాలంటూ ఆటగాళ్లకు ఉచిత ఆఫర్లను ప్రకటిస్తుంటాయి సంస్థలు. అయితే ప్రభుత్వ-ప్రైవేట్ రంగ పరిధిలోని ఏవైనా సరే ప్రయాణాలకు మాత్రమే ఫ్రీ ఆఫర్‌ను ఇస్తాయి. ఫుడ్, లగేజీ ప్యాకింగ్ తదితర ఛార్జ్‌లపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా.. ఎంతో కొంత ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. -
అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ వరాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా గౌడ కులస్థులపై వరాలు కురిపించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఆయన కులవృత్తిపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈత, తాటి చెట్లపై పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 5 ఎకరాల్లో రూ.5 కోట్లతో గౌడభవన్ నిర్మాణం ఏర్పాటు చేస్టున్నట్టు తెలిపారు. కల్లుగీత కార్మికుల ఫెన్షన్‌ను రూ.5 వేలకు పెంచుతున్నట్టు చెప్పారు. అదే విధంగా సొసైటీల రెన్యువల్ గడువును ఐదు నుంచి పదేళ్లకు పెంచుతున్నమన్నారు. కులవృత్తిని నమ్ముకున్న వారిలో గౌడ కులస్థులు ముఖ్యులని, గత పాలకులు గీత కార్మికులకు అన్యాయం చేశారని తెలిపారు. గడిచిన మూడేళ్లలో రూ. 6.38 కోట్ల పరిహార బకాయిలు చెల్లించినట్లు వెల్లడించారు. హరితహారంలో భాగంగా చెరువు గట్లు, వాగులు, నదీ ప్రవాహానికి ఇరువైపుల కోటి 70 లక్షల తాటి, ఈత మొక్కలు నాటినట్లు సీఎం పేర్కొన్నారు. -
'ఐష్' సినిమాకు పన్ను మినహాయింపు
ముంబై: ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన 'సరబ్ జీత్' సినిమాపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కరుణ చూపింది. ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చింది. తమ విజ్ఞప్తి మేరకు యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఈ నిర్ణయం తీసుకున్నారని సరబ్ జీత్' యూనిట్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ సినిమాకు పన్ను మిహాయింపు ఇచ్చినందు యూపీ సర్కారుకు నిర్మాత జాకీ భగ్నానీ ధన్యవాదాలు తెలిపారు. ఒమాంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 20న విడుదల కానుంది. పాకిస్థాన్ లో జైలులో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన భారతీయ ఖైదీ సరబ్ జీత్ సింగ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సరబ్ జీత్ గా రణదీప్ హుడా, అతడి సోదరి దల్బీర్ పాత్రలో ఐశ్వర్యరాయ్ నటించింది. -
సీఎం మనసు గెలిచిన సినిమా...
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఓ హిందీ మూవీకి భారీ ఆఫర్ ప్రకటించారు. అశ్వినీ అయ్యర్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ మూవీ 'నిల్ బట్టి సన్నాట' పై తమ రాష్ట్రంలో పన్ను విధించడంలేదని ప్రకటించారు. ఈ మూవీని ఆగ్రాలో చిత్రీకరించారు. స్వర భాస్కర్, రత్న పథక్, పంకజ్ త్రిపాఠి ముఖ్యపాత్రధారులుగా ఈ మూవీలో కనిపించనున్నారు. ఈ మూవీ శుక్రవారం విడుదలకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం అఖిలేష్ మూవీపై పన్నును సడలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వివరాలను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అశ్వినీ అయ్యర్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తనకు చాలా నచ్చిందని సీఎం అఖిలేష్ రాసుకొచ్చారు. తల్లీకూతుళ్లకు సంబంధించిన ఈ కథ అందరిని ఆకర్షిస్తుందని, మన కలల్ని సాకారం చేసుకోవడానకి వయసు అనేది అడ్డంకి కాదని పేర్కొన్నారు. చాలా అరుదుగా ఇలాంటి స్టోరీతో మూవీలు వస్తాయంటూ ఆయన మెచ్చుకున్నారు. ఆనంద్ ఎల్ రాయ్, రాంజానా ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. Touched by the story of Nil Battey Sannata, which was filmed in Agra. We have made the film tax free in UP. pic.twitter.com/O658rXIuqx — Akhilesh Yadav (@yadavakhilesh) April 21, 2016 -
సీఎం రమణ్‌సింగ్‌కు సోనం కపూర్ థాంక్స్
ముంబై: తన తాజా చిత్రం 'నీర్జా' సూపర్ హిట్ కావడంతో ఫుల్ హ్యాపీగా ఉంది సోనం కపూర్. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి నీరాజనాలే కాదు.. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది ఈ బాలీవుడ్ అమ్మడు. తొలిసారి తన కెరీర్లో బెస్ట్ యాక్టింగ్ చూపించడమే కాదు.. తన ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్‌ను కూడా ఈ భామ సొంతం చేసుకుంది. 1986లో కరాచీలో హైజాక్ అయిన పాన్ ఆమ్ విమానంలో ఎయిర్ హోస్టెస్ నీర్జా బానోత్ చూపిన తెగువ, చేసిన త్యాగం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాకు భారీ కలెక్షన్లు రావడమే కాదు.. రాష్ట్ర ప్రభుత్వాలు వినోద పన్ను మినహాయింపు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రంలో 'నీర్హా'కు పన్ను మినహాయింపు కల్పించింది. దీంతో ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు హీరోయిన్ సోనం కపూర్ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపింది. 'నీర్హా'కు పన్ను మినహాయింపు కల్పించారు. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ సర్‌కు కృతజ్ఞతలు. ఎంతో ఆనందంగా ఉంది' అని సోనం ట్వీట్ చేసింది. -
సల్మాన్ ఖాన్ సినిమాపై అఖిలేశ్ ఔదార్యం
లక్నో: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తాజా హిట్ చిత్రం బజరంగీ భాయిజాన్‌పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అశిలేశ్ యాదవ్ ఔదార్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 'బజరంగీ..' సినిమాకు వినోదం పన్ను మినహాయిపు కల్పిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఇండియాలో తప్పిపోయిన పాక్ బాలికను ఇంటికి చేర్చడమనే కథాంశంతో గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం 300 కోట్లకు పైగా వసూళ్లను రాబడుతుందని సినీవర్గాల అంచనా. ఈ రోజు ఉదయం బజరంగీ భాయిజాన్ చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్.. సీఎం అఖిలేశ్‌ను కలిసి చిత్ర విశేషాలను వివరించారు. సినీరంగ అభివృద్ధికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న అఖిలేశ్ ఆ మేరకు సల్మాన్ సినిమాకు పన్ను మినహాయిస్తున్నట్లు చెప్పారు. సినిమా షూటింగ్స్‌కు అనువైన లొకేషన్లు ఉత్తరప్రదేశ్ అంతటా ఉన్నాయని, సినిమా రూపకర్తలు ఇక్కడికి వచ్చి సినిమాలు తీయాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా తన సినిమాను చూడాల్సిందిగా భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌లను కోరారు హీరో సల్మాన్ ఖాన్. -
'మేరి కోమ్'కు యూపీ పన్ను మినహాయింపు!
లక్నో: భారత బాక్సర్ మేరీ కోమ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ చిత్రానికి వివిధ రాష్ట్రాల్లో ఆదరణ లభిస్తోంది. మేరీకోమ్ చిత్రానికి ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర బాటలోనే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా చేరింది. 'మేరికోమ్' చిత్రానికి యూపీ కూడా పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. యూపీలోని మహిళలకు స్పూర్తిగా నిలిచే చిత్రంగా 'మేరికోమ్' చిత్రం నిలువాలని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా 'మేరీ కోమ్' పాత్రను పోషిస్తోంది. 'మేరి కోమ్' చిత్రం సెప్టెంబర్ 5 తేదిన విడుదలవుతోంది. -
'భూతం'కు పన్ను మినహాయింపు!
లక్నో: ఓటు హక్కు వినియోగం, ఓటు ప్రాధాన్యత గురించి చెప్పే చిత్రంగా రూపొందిన 'భూత్ నాథ్ రిటర్న్' కు పన్ను మినహాయింపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూత్ నాథ్ రిటర్న్ కు పన్ను మినహాయింపు ఇచ్చేందుకు అత్యున్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన ఈ చిత్రానికి రవి చోప్రా, భూషన్ కుమార్ నిర్మాతలు. ఉత్తర ప్రదేశ్ లో సుమారు 200 థియేటర్లలో ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఎక్కువమంది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడాలనే ఉద్దేశంతోనే పన్ను మినహాయింపు ఇచ్చామని తెలిపారు. ఇటీవల కాలంలో ఉత్తర ప్రదేశ్ లో సల్మాన్ ఖాన్ నటించిన జైహో, మాధురీ దీక్షిత్ చిత్రం 'దేడ్ ఇష్కియా' చిత్రాలకు పన్ను మినహాయింపు ఇచ్చారు. అయితే భూత్ నాథ్ రిటర్న్ చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వడంపై వివాదం నెలకొంది. ములాయంతో అమితాబ్ కుటంబానికి సన్నిహిత సంబంధాలున్న కారణంతో ఆ చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల రాష్ట్రపతి భవన్ లో ప్రణబ్ ముఖర్జీ కూడా భూత్ నాథ్ రిటర్న్ చిత్రాన్ని చూశారు.