సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా గౌడ కులస్థులపై వరాలు కురిపించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఆయన కులవృత్తిపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈత, తాటి చెట్లపై పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 5 ఎకరాల్లో రూ.5 కోట్లతో గౌడభవన్ నిర్మాణం ఏర్పాటు చేస్టున్నట్టు తెలిపారు. కల్లుగీత కార్మికుల ఫెన్షన్‌ను రూ.5 వేలకు పెంచుతున్నట్టు చెప్పారు.
అదే విధంగా సొసైటీల రెన్యువల్ గడువును ఐదు నుంచి పదేళ్లకు పెంచుతున్నమన్నారు. కులవృత్తిని నమ్ముకున్న వారిలో గౌడ కులస్థులు ముఖ్యులని, గత పాలకులు గీత కార్మికులకు అన్యాయం చేశారని తెలిపారు. గడిచిన మూడేళ్లలో రూ. 6.38 కోట్ల పరిహార బకాయిలు చెల్లించినట్లు వెల్లడించారు. హరితహారంలో భాగంగా చెరువు గట్లు, వాగులు, నదీ ప్రవాహానికి ఇరువైపుల కోటి 70 లక్షల తాటి, ఈత మొక్కలు నాటినట్లు సీఎం పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment