goud
-
కుల గణన.. కాంగ్రెస్ పార్టీ పేటెంట్
సనత్‌నగర్ (హైదరాబాద్): కులగణన కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని, అది జరగనిదే స్థానిక సంస్థల ఎన్నిక లు జరగవని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. యూనివర్సిటీ వైస్చాన్స్లర్ల నియామకాల్లో కూడా నలుగురు బీసీలకు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీకి అవకాశం ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు. ‘సమగ్ర కుల గణన–బీసీ రిజర్వేషన్ల పెంపుపై’బీసీల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం బుధవారం బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో జరిగింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ ఎంపీ వి.హనుమంతరావుతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ, కులగణన అంశాన్ని తెరమీదకు తీసుకువచి్చన నేత రాహుల్ గాంధీ అన్నారు. ఎవరికి దక్కాల్సిన ఫలాలు వారికి అందాలనే ఉద్దేశంతో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగిందని గుర్తుచేశారు. నాలుగైదు రోజుల్లో కులగణనపై విధి విధానాలను ఖరారు చేసి ఆ దిశగా ముందుకు సాగుతామన్నారు. రాష్ట్ర ఖజానా అధ్వాన్న స్థితిలో ఉందని, నెలసరి ఆదాయం 18 వేల కోట్లు కాగా, గత ప్రభుత్వం చేసిన ఏడున్నర లక్షల కోట్ల అప్పులు తీర్చేందుకే ఎక్కువ శాతం ఆదాయం కేటాయిస్తూ వస్తున్నట్లు చెప్పారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అనవసర ప్రాజెక్టులతో దుబారా చేసి అప్పులపాలు చేసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ కులగణన అంశాన్ని లేవనెత్తగానే బీజేపీ కూడా స్వరం మార్చి ఆర్ఎస్ఎస్తో మద్దతు తెలియజేస్తోందన్నారు. బీజేపీ హయాంలో పెట్టుబడిదారులకు న్యాయం జరిగిందే తప్ప ప్రజలకు జరగలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నష్టాల్లో ఉన్న సంస్థలను ప్రైవేటీకరణ చేసిందే తప్ప లాభాల్లో ఉన్న వాటి జోలికి వెళ్లలేదని, నేడు బీజేపీ లాభాల్లో ఉన్న సంస్థలను కూడా ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ కూడా కులగణనకు మద్దతు అంటూ ఇప్పుడు చెబుతోందని, గత పదేళ్లు ఆ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. కామారెడ్డి డిక్లరేషన్‌కు అనుగుణంగా కులగణన జరిపి తీరుతామని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ కులగణన చేసి తీరాల్సిందేనన్నారు. జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కులగణనపై గత ఆరు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేపట్టామని, చివరిగా హైకోర్టులో కేసు కూడా వేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వడంతోనే తాము కులగణన మార్చ్ చేపట్టాలనే ఆలోచనను విరమించుకున్నామని జాజుల తెలిపారు. -
తొలిరోజు 285 దరఖాస్తులు... 30 పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: పార్టీ కార్యకర్తలు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం ‘మంత్రులతో ముఖాముఖి’కార్యక్రమం ప్రారంభమైంది. తొలిరోజు కార్యక్రమానికి హాజరైన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రజల నుంచి 4 గంటల పాటు దరఖాస్తులు తీసుకున్నారు. దాదాపు 285 దరఖాస్తులు రాగా, అందులో 30కి పైగా సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించారు. ఇందుకోసం బాధితుల సమక్షంలోనే ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతోపాటు పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసిన దామోదర.. వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో దరఖాస్తులు ఇచ్చేందుకు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ముఖ్యంగా 317 జీవో కారణంగా ఇబ్బందులు పడుతున్న గురుకుల ఉపాధ్యాయులు, పలు ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు వచ్చి తమ అర్జీలను అందజేశారు. ఇందిరమ్మ ఇళ్లు కావాలని, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలని, రేషన్‌కార్డులు కావాలని, ఉపాధి కల్పించాలని, చిన్నారుల ఆరోగ్య సమస్యలకు సాయం చేయాలని, 108 సిబ్బందికి ఏఎన్ఎం ఉద్యోగ నోటిఫికేషన్లలో వెయిటేజీ ఇవ్వాలని కోరుతూ పలువురు దరఖాస్తులు సమర్పించారు. గత పదేళ్లలో తమపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయించాలని మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు. తొలిరోజు వచ్చిన దరఖాస్తులన్నింటినీ కంప్యూటరీకరించామని, ఎప్పటికప్పుడు ఈ సమస్యల పరిష్కార దశలను తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెప్పాయి. అద్భుత ఆలోచన: మంత్రి దామోదర గాంధీభవన్‌లో ప్రజావాణి చేపట్టడం అద్భుతమైన ఆలోచన అని మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌ను అభినందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను పరిష్కరించే మాట అటుంచితే కనీసం వారి గోడు వినేవారు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు తాము ప్రజల సమస్యలు విని పరిష్కరించే దిశలో అడుగులు వేస్తున్నామని చెప్పారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఆయా శాఖలకు పంపుతామని, వీలున్న దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్‌రావు, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ కాంగ్రెస్ పారీ్టకి ప్రజలు, కార్యకర్తలంటే ఎంతో గౌరవమని, అందుకే వారి సమస్యల పరిష్కారం కోసం గాంధీభవన్‌లో ప్రజావాణి లాంటి కార్యక్రమాన్ని చేపట్టామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. వారంలో రెండు రోజులు మంత్రులు గాంధీభవన్‌కు వచ్చి ప్రజలు, కార్యకర్తలతో మమేకమవుతారని, వారి సమస్యలపై అర్జీలు తీసుకుంటారని చెప్పారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని ఆయన కార్యక్రమ ప్రారంభ సభలో చెప్పారు. -
77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో హైదరాబాద్ ఫ్యాషన్ డిజైనర్ అరుణా గౌడ్ (ఫొటోలు)
-
నేను మరణించలేదు..! అందరినీ చూస్తున్నా..!!
సంగారెడ్డి: బ్రెయిన్‌డెడ్ అయి ఓ యువకుడు మృతిచెందగా.. పుట్టెడు దుఃఖంలోనూ అతని నేత్రాలను దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు కుటుంబ సభ్యులు. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మజీద్‌పల్లికి చెందిన బబ్బూరి రాజులుగౌడ్(36) ఓ ప్రైవేట్ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఐదేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. మూడు రోజుల కిత్రం బాత్రూంలో స్నానం చేస్తూ కళ్లు తిరిగి కిందపడిపోయాడు. అతన్ని వెంటనే గజ్వేల్‌కు, ఆ తరువాత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి గాంధీకి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి బ్రెయిన్‌డెడ్ అయి రాజులుగౌడ్ మృతి చెందాడు. ఆ బాధను దిగమింగుతూ మృతుడి నేత్రాలు దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు నేత్రాలు తీసుకెళ్లారు. మృతుడు స్వయంగా మజీద్‌పల్లి గ్రామసర్పంచ్ లత భర్త శివరాములుగౌడ్‌కు సోదరుడు. కాగా, సోమవారం టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. -
వివాదాస్పదంగా నీరా కేఫ్ వేదామృతం పేరు
-
శంషాబాద్ లో యువతి ఆత్మహత్య
-
పబ్‌లో వీరంగం; పరారీలో ఆశిష్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: నొవాటెల్‌లోని ఆర్టిస్ట్రీ పబ్‌లో యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి దాడికి యత్నించిన ఘటనలో ఇద్దరు నిందితులను బుధవారం అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ నెల 1న పటాన్చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్, అతని స్నేహితులు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడమేగాక మద్యం బాటిళ్లతో దాడికి యత్నించారని బిగ్‌బాస్–2 కంటెస్టెంట్ అన్నె సంజన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అశిష్ గౌడ్ స్నేహితులు ముత్తంగికి చెందిన గౌండ్ల శ్రీకాంత్ అలియాస్ బిన్ను, ఇస్నాపూర్‌కు చెందిన పూసాని పవన్ కుమార్ గౌడ్‌ను బుధవారం అరెస్ట్ చేశామన్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అశిష్ గౌడ్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు. కాగా బాధితురాలు సంజన బుధ వారం సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి నిందితులను అరెస్ట్ చేసి న్యాయం చేయాలని కోరారు. ఆర్టిస్ట్రీ పబ్‌లోని సీసీ పుటేజీని చూపించాలని కోరినా పోలీసులు స్పందించడం లేదని, తాను గుర్తించకుండా నిందితులను ఎలా అరెస్ట్ చేశారని ఆమె పేర్కొన్నారు. ఒకపక్క దిశ హత్యోందంతో మహిళల భద్రతపై ఆందోళన జరుగుతుండగా పోలీసులు ఈ కేసులో తాత్సారం చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. రాజకీయ నాయకుడి కుమారుడు కావడం వల్లే అశిష్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం లేదన్న వాదనలు విన్పిస్తున్నాయి. అశిష్ గౌడ్‌ను వెంటనే అరెస్ట్ చేసి తమకు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. కాగా, భారతీయ యువ మోర్చా నుంచి ఆశిష్‌ను బీజేపీ ఇప్పటికే తొలగించింది. మహిళల భద్రతకు, సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉందని.. స్త్రీలపై ఎటువంటి దాడులు చేసినా సహించబోమని సంగారెడ్డి బీజేపీ అధ్యక్షుడు ఎం నరేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. సంబంధిత వార్తలు పబ్‌లో మాజీ ఎమ్మెల్యే కుమారుడి వీరంగం మరోసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సంజన ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు: ఆశీష్ గౌడ్ -
మృత్యువుతో పోరాడి...
సాక్షి, పొదలకూరు(నెల్లూరు) : రెక్కాడితే గానీ డొక్కాడని గీత కార్మిక కుటుంబం వారిది. కల్లు గీసుకొని ఉన్నంతలో సంతోషంగా జీవించే వారు. విధి వెక్కిరించి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఉన్నదంతా ఊడ్చిపెట్టి, గ్రామంలో అప్పులు చేసి, గ్రామస్తుల సాయం పొందినా ఇప్పటికీ ఆ కుటుంబం కోలుకోలేకపోతోంది. సీఎం సహాయనిధి నుంచి సాయం కోసం ఎదురుచూస్తోంది. కాటేసిన విద్యుత్ తీగలు మండలంలోని మర్రిపల్లికి చెందిన అయితా శివశంకర్ (30) కల్లుగీత కార్మికుడు. సీజన్లో కల్లుగీసి కుటుంబాన్ని పోషిస్తుంటారు. ఏడాది క్రితం వివాహం కూడా చేసుకున్నారు. నాలుగు నెలల క్రితం తాటిచెట్టెక్కి కల్లు గీస్తున్న సమయంలో చెట్టుకు 11 కేవీ విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో చెట్టుపై ఉన్న శివశంకర్ విద్యుదాఘాతానికి గురై చెట్టుకే అతుక్కుపోయారు. సమీపంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు గమనించి అతికష్టంపై తాళ్లు, కర్రలతో శివశంకర్‌ను కిందికి లాగారు. దీంతో చెట్టుపై నుంచి యువకుడు కిందపడిపోయారు. విద్యుదాఘాతంతో చేతులు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. విద్యుదాఘాతం తగిలిన ప్రతి చోటా మాడిపోయి నల్లగా మారింది. వెంటనే నెల్లూరులోని ఆస్పత్రికి తరలించగా, చెన్నై తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. కుటుంబసభ్యులు చెన్నైలోని విజయా ఆస్పత్రిలో చేర్పించి మూడు నెలల పాటు అక్కడే ఉంచారు. విద్యుదాఘాతంతో శరీరమంతా ఇన్ఫెక్షన్ సోకడంతో శివశంకర్‌కు మొత్తం ఆరు శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. కుడిచేయి వేళ్లు పనిచేయకపోవడంతో వాటిని తొలగించారు. దీని కోసం రూ.10 లక్షల వరకు ఆ పేద కుటుంబం వెచ్చించింది. బిడ్డను బతికించుకునేందుకు తల్లిదండ్రులు, సోదరి అప్పులు చేశారు. చికిత్స పొందుతున్న సమయంలోనే శివశంకర్‌కు ఆడపిల్ల జన్మించింది. కుమార్తెను చూసేందుకు సైతం వీల్లేకుండా ఆస్పత్రిలోనే చికిత్స పొందాల్సి రావడంతో ఆ యువకుడు కుమిలిపోయారు. సీఎం సహాయనిధి నుంచి సాయం అందేలా చూడాలని అభ్యర్థిస్తున్నారు. ఎమ్మెల్యే కాకాణి దృష్టికి తీసుకెళ్లాం గ్రామానికి చెందిన గీత కార్మికుడు శివశంకర్ కష్టాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన వెంటనే స్పందించి సీఎం సహాయ నిధి కోసం యత్నిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా గౌడ సంఘం ద్వారా కొంత మొత్తాన్ని సాయంగా అందజేశాం. చిన్న వయస్సులో శివశంకర్ మంచానికే పరిమితం కావడం ఆవేదన కలిగిస్తోంది. – కోసూరు సుబ్రహ్మణ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మర్రిపల్లి -
అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ వరాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా గౌడ కులస్థులపై వరాలు కురిపించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఆయన కులవృత్తిపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈత, తాటి చెట్లపై పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 5 ఎకరాల్లో రూ.5 కోట్లతో గౌడభవన్ నిర్మాణం ఏర్పాటు చేస్టున్నట్టు తెలిపారు. కల్లుగీత కార్మికుల ఫెన్షన్‌ను రూ.5 వేలకు పెంచుతున్నట్టు చెప్పారు. అదే విధంగా సొసైటీల రెన్యువల్ గడువును ఐదు నుంచి పదేళ్లకు పెంచుతున్నమన్నారు. కులవృత్తిని నమ్ముకున్న వారిలో గౌడ కులస్థులు ముఖ్యులని, గత పాలకులు గీత కార్మికులకు అన్యాయం చేశారని తెలిపారు. గడిచిన మూడేళ్లలో రూ. 6.38 కోట్ల పరిహార బకాయిలు చెల్లించినట్లు వెల్లడించారు. హరితహారంలో భాగంగా చెరువు గట్లు, వాగులు, నదీ ప్రవాహానికి ఇరువైపుల కోటి 70 లక్షల తాటి, ఈత మొక్కలు నాటినట్లు సీఎం పేర్కొన్నారు. -
గీత కార్మికులకు చెట్టు పన్ను రద్దు
సాక్షి, సిద్దిపేట: గీత కార్మికులు ప్రభుత్వానికి చెల్లిస్తున్న చెట్టు పన్నును రద్దు చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్ ప్రకటించారు. పన్ను చెల్లించలేక గీత కార్మికులు ఇబ్బందులు పడుతున్న విషయా న్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. పన్ను రద్దుకు సీఎం అంగీకరించారని, ఈ మేరకు త్వరలోనే జీవో వెలువడుతుందన్నా రు. ఎక్సైజ్ అధికారులు గీత కార్మికుల నుంచి పన్ను వసూళ్లు చేయవద్దన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో రూ.1.5 కోట్లతో నిర్మించనున్న గౌడ ఫంక్షన్ హాల్ భవనానికి మంత్రి టి.హరీశ్‌రావు, ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌తో కలసి పద్మారావు గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. చెట్టు పన్ను రద్దు తో రాష్ట్రవ్యాప్తంగా 2.16 లక్షల మంది గీత కార్మి కులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 4,342 సోసైటీలు, 3,688 టీఎఫ్‌టీల్లో 2,16,785 మంది గీత కార్మికులు సభ్యులుగా ఉన్నారు. గీత కార్మికులు తాటి, ఈత చెట్టు ఒక్కోదానికి ఏడాదికి రూరల్ ప్రాంతం లో అయితే రూ.25, అర్బన్ ప్రాంతంలో రూ.50 పన్ను చెల్లిస్తున్నారు. ఈ పన్ను రూపంలో ప్రభుత్వానికి రూ.15 కోట్లు సమ కూరుతున్నాయి. తమకు ప్రత్యేక నిధులు కేటాయించడంతోపాటు చెట్టు పన్ను రద్దు చేయాలని పలు సందర్భాల్లో గీత కార్మికులు, అనుబంధ సంఘాల నాయకులు ప్రభుత్వా న్ని కోరారు. దీంతో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. -
గౌడ కులస్తులు ఐక్యంగా ఉండాలి
నల్లగొండ టూటౌన్: గౌడ కులస్తులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులు సాధించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక హైదరాబాద్ రోడ్డులోని గౌడ హాస్టల్లో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 366వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తమ కుల వృత్తితో పాటు బడుగ, బలహీనవర్గాల అభ్యున్నతికి పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. బడుగుబలహీనవర్గాలు రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు తండు సైదులుగౌడ్ , ప్రధాన కార్యదర్శి పానుగంటి వెంకన్నగౌడ్ మాట్లాడుతూ గౌడుల ఐక్యత ద్వారానే రాజ్యాధికారం సాధించగలమని, జిల్లాలో ఉన్న 59 మండలాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతకుముందు పలువురు నాయకులు సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు సుంకరి మల్లేష్‌గౌడ్, సోమగాని శంకర్‌గౌడ్, కటికం సత్తయ్యగౌడ్, పల్లె రవికుమార్, మాదగొని శ్రీనివాస్‌గౌడ్, రవీందర్‌గౌడ్, కాశయ్యగౌడ్, యాదగిరిగౌడ్, బాదిని నర్సింహగౌడ్, భిక్షంగౌడ్, టి.యాదగిరిగౌడ్, సోమశేఖర్ గౌడ్, చెనగోని సతీష్ గౌడ్, వర్కాల లక్ష్మీనారాయణగౌడ్, గండుచెర్వు వెంకన్నగౌడ్, బాలనర్సింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘థియేటర్ల లీజు విధానాన్ని రద్దు చేయాలి’
హైదరాబాద్ : చిన్న సినిమాల పాలిట శాపంగా మారిన థియేటర్ల లీజు విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ ప్రొడ్యూసర్స్ గిల్డ్ రామకృష్ణ గౌడ్ శనివారం జూబ్లీహిల్స్‌లోని ఫిలిం చాంబర్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఎన్నో చిన్న సినిమాలు విడుదలకు నోచుకోకపోవడానికి కారణం రాష్ట్రంలోని థియేటర్లన్నీ నలుగురైదుగురు వ్యక్తుల చేతుల్లోనే ఉండడమేనన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫిలించాంబర్లకు తక్షణమే వేరు వేరుగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రామకృష్ణ దీక్షకు మద్దతుగా పలువురు చిన్న సినిమా నిర్మాతలు సంఘీభావం ప్రకటించారు.