హైదరాబాద్ : చిన్న సినిమాల పాలిట శాపంగా మారిన థియేటర్ల లీజు విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ ప్రొడ్యూసర్స్ గిల్డ్ రామకృష్ణ గౌడ్ శనివారం జూబ్లీహిల్స్‌లోని ఫిలిం చాంబర్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఎన్నో చిన్న సినిమాలు విడుదలకు నోచుకోకపోవడానికి కారణం రాష్ట్రంలోని థియేటర్లన్నీ నలుగురైదుగురు వ్యక్తుల చేతుల్లోనే ఉండడమేనన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫిలించాంబర్లకు తక్షణమే వేరు వేరుగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రామకృష్ణ దీక్షకు మద్దతుగా పలువురు చిన్న సినిమా నిర్మాతలు సంఘీభావం ప్రకటించారు.