indefinite hunger strike
-
క్షీణించిన మంత్రి అతిశీ ఆరోగ్యం.. నిరసన దీక్ష విరమణ
ఢిల్లీ: ఢిల్లీ నీటి సంక్షోభాన్ని పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షను ఆప్ జలవనరుల శాఖ మంత్రి అతిశీ విరమించారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు. నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన మంత్రి అతిశీ ఆరోగ్యం క్షీణించటంతో ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అదే విధంగా హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను అందించాలని ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు తెలిపారు.‘‘మంత్రి అతిశీ ఆరోగ్యం క్షీణించింది. ఆమె బీపీ లెవల్స్ పడిపోయాయి. ఎల్ఎన్జేపీ ఆస్పత్రి వైద్యులు వెంటనే ఆమెను ఆస్పత్రితలో చేరి చికిత్స తీసుకోవాలన్నారు. హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన న్యాయమైన నీటి వాటాను కేటాయించాలని ఆమె గత ఐదు రోజులుగా నిరవధిక నిరాహారదీక్షలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఎల్ఎన్జేపీ ఆస్పత్రి ఐసీయూలో జాయిన్ అయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని ఆయన ‘ఎక్స్’లో తెలిపారు.తీవ్ర నీటీ సంక్షోభ సమయంలో హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటా విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ మంత్రి అతిశీ జూన్ 21 నుంచి నిరవధిక నిరాహారాదీక్ష చేపట్టారు. మంగళవారం ఆమె ఆరోగ్యం క్షీణించటంతో దీక్ష విరమించి హాస్పిటల్లో చేరారు. -
ఢిల్లీలో ఆప్ జలదీక్ష
న్యూఢిల్లీ: నీటి ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కొంటున్న ఢిల్లీ వాసుల కష్టాలు తీర్చాలంటూ ఆప్ నేత, ఢిల్లీ మంత్రి ఆతిశీ సింగ్ శుక్రవారం నిరాహార దీక్ష చేపట్టారు. యమునా నది అదనపు జలాలను హరియాణా తక్షణం ఢిల్లీకి విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. రాజ్‌ఘాట్‌లో గాం«దీజీకి నివాళులరి్పంచి దీక్ష మొదలెట్టారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ తదితరులు ఆమెకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. దీక్షకు మద్దతుగా తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని సునీత చదివి వినిపించారు. ‘‘ఆతిశి తపస్సు విజయవంతమవుతుంది. గొంతెండుతున్న వారి దప్పిక తీర్చడం మన సంప్రదాయం. తీవ్రమైన ఎండకాలంలో పొరుగురాష్ట్రాలు నీళ్లిచ్చి ఆదుకోవాలి. హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం నీటిని విడుదలచేయకుండా ఆపి ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రభుత్వాన్ని తిట్టుకునేలా చేయాలని మోదీ సర్కారు కుట్ర పన్నింది’’ అని అందులో కేజ్రీవాల్ ఆరోపించారు. ‘‘నీటి సమస్యపై మోదీకి లేఖ రాశా. హరియాణా ప్రభుత్వాన్ని వేడుకున్నా. ఢిల్లీ ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, మహిళల నీటి సమస్యలు చూడలేక నీటి సత్యాగ్రహానికి సిద్ధపడ్డా’’ అని ఆతిశి ప్రకటించారు. రోజూ 613 లక్షల గ్యాలెన్ల నీటిని విడుదలచేసే హరియాణా గత రెండు వారాలుగా కేవలం 513 లక్షల గ్యాలెన్ల నీటినే రోజూ విడుదలచేస్తోంది. గత రెండు రోజులుగా మరో 120 లక్షల గ్యాలెన్ల మేర కోత పెట్టింది.విమర్శించిన బీజేపీ దీక్షను రాజకీయ నాటకంగా బీజేపీ అభివరి్ణంచింది. ‘‘ఆతిశి విఫల మంత్రి. నీటి కష్టాలు తప్పవని ఫిబ్రవరిలోనే సూచనలు కనిపించినా ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. ఎగువ హిమాచల్ ప్రదేశ్ నుంచో, ఆప్ పాలిత పంజాబ్ నుంచి ఎందుకు నీళ్లు అడగటం లేదు? ఢిల్లీ నీటి ట్యాంకర్ మాఫియాతో ఆప్ నేతలకు సంబంధముంది’’ అని ఆరోపించింది.నా భర్త ఏమన్నా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదా: సునీతా కేజ్రీవాల్తన భర్త ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అన్నట్లుగా ఈడీ వ్యవహరిస్తోందని కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆయన బెయిల్‌ను హైకోర్టులో సవాలు చేపడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘బెయిల్ ఉత్తర్వు వెబ్సైట్లో అప్లోడ్ కూడా కాకముందే తెల్లవారుజామునే ఈడీ హైకోర్టును ఆశ్రయించిందని ఆక్షేపించారు. కేజ్రీవాల్ ఏమైనా ఉగ్రవాదా?’’ అంటూ దీక్షా స్థలి వద్ద మండిపడ్డారు. -
అశ్వత్థామరెడ్డి నిరశన భగ్నం
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించేవరకు నిరశన కొనసాగిస్తానంటూ స్వీయ గృహ నిర్బంధం చేసుకున్న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. లోపలి నుంచి గడియపెట్టుకుని కొందరు కార్మికులతో కలిసి నిరాహార దీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డిని పోలీసులు ఆదివారం సాయం త్రం చాకచక్యంగా అరెస్టు చేశారు. రెండు రోజుల దీక్షతో ఆయన ఆరోగ్యం స్వల్పంగా క్షీణించిందని వైద్యులు ప్రకటించటంతో, ఆయనను వెంటనే చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అశ్వత్థామరెడ్డి దీక్ష నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఆయన ఇంటివద్దకు చేరుకుంటుండటం, ఆరోగ్యం క్షీణిస్తుండటంతో శాంతిభద్రతల పరంగా ఉద్రిక్తతలు నెలకొనే ప్రమాదం ఉండటంతో దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ఆదివారం ఉదయం నుండి ప్రయత్నించారు. కానీ తలుపులు గడియవేసి ఉండటంతో లోనికి వెళ్లలేకపోయారు. దీక్ష నేపథ్యంలో ఆయన ఉంటున్న అపార్ట్మెంట్ ఫ్లాట్ వద్దకు పోలీసులు మీడియా ప్రతినిధులను తప్ప వేరేవారిని అనుమతించటం లేదు. కానీ అరెస్టు చేయాలంటే తలుపులు తీయాల్సి ఉండటంతో ఆదివారం సాయంత్రం వారు రూటు మార్చారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో బీజేపీ నేతలు జితేందర్‌రెడ్డి, వివేక్‌లు వచ్చారు. అశ్వత్థామరెడ్డి ఇంట్లోకి వెళ్లి ఆయనను కలిసి బయటకు వచ్చే క్రమంలో పోలీసులు చాకచక్యంగా లోనికి ప్రవేశించారు. కార్మికులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని వారించి ఆయనను ఆరెస్టు చేసి ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. కానీ వైద్యులు వచ్చి పరీక్షించి బీపీ, షుగర్ లెవల్స్ పెరిగాయని ప్రకటించారు. వెంటనే చికిత్స తీసుకోని పక్షంలో ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పోలీసులు అరెస్టు చేసినా తన దీక్ష కొనసాగుతుందని, ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తానని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి మానుకుని చర్చలకు సిద్ధం కావాలని కోరారు. మరోసారి రాజిరెడ్డి అరెస్టు జేఏసీ కోకన్వీనర్ రాజిరెడ్డిని పోలీసులు మరోసారి అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. శనివారం ఆయన రెడ్డి కాలనీలోని తన ఇంట్లో దీక్ష నిర్వహిస్తుండగా పోలీసులు అరెస్టు చేసి పహాడీషరీఫ్ స్టేషన్‌కు తరలించి సాయంత్రం వదిలిపెట్టిన విషయం తెలిసిందే. పోలీసు స్టేషన్లో కూడా దీక్ష కొనసాగించిన రాజిరెడ్డి ఇంటికి వచ్చి తిరిగి దీక్షలోనే ఉన్నారు. దీంతో ఉదయం ఆయన ఇంటికి వచ్చిన పోలీసులు దీక్షను విరమించాలని కోరారు. ఇందుకు ఆయన నిరాకరించారు. తలుపు గడియ పెట్టి ఉండటంతో బలప్రయోగంతో రాజిరెడ్డిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన తోటి కార్మికులను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, ప్రభుత్వం తీరును నిరసిస్తూ వ్యాన్‌లో నినాదాలు చేసే క్రమంలో రాజిరెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. వీరిద్దరి అరెస్టులను ఖండిస్తూ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. డిపోల వద్ద సంఘీభావ దీక్షలు కొనసాగించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 68.32 శాతం బస్సులు తిప్పినట్టు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. 1,924 అద్దె బస్సులుసహా 6,114 బస్సులను తిప్పినట్టు వెల్లడించారు. 4,189 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,114 మంది తాత్కాలిక కండక్టర్లు విధులకు హాజరయ్యారని చెప్పారు. 5,864 బస్సుల్లో టిమ్ యంత్రాలు వాడామని, 174 బస్సుల్లో సంప్రదాయ పద్ధతిలో ట్రే టికెట్లు జారీ చేశామన్నారు. ఉస్మానియాలో కొనసాగుతున్న దీక్ష నిన్నటి నుండి తన నివాసంలో నిరాహారదీక్ష చేస్తున్న ఆశ్వత్థామరెడ్డిని వైద్య చికిత్స నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని మెడికల్ ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో ఆయనను డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. బీపీ, షుగర్ ఉన్నందున వైద్యానికి సహకరించాలని వైద్యులు కోరుతున్నా ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, యూరిన్‌లో కీటోన్స్ వచ్చాయని, అవి పెరిగితే పరిస్థితి మరింత విషమంగా మారే అవకాశం ఉందని డ్యూటీ డాక్టర్ రాజ్‌కుమార్ అన్నారు. అశ్వత్థామరెడ్డిని పరామర్శించడానికి ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్న ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని కోరారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దుర్మార్గమైన పాలన కొనసాగుతోందని విమర్శించారు. -
హాజీపూర్ గ్రామస్తుల దీక్ష భగ్నం..!
యాదాద్రి భువనగిరి : ముగ్గురు బాలికలను పొట్టనబెట్టుకున్న సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీయాలంటూ హాజీపూర్ గ్రామస్తులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శనివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో దీక్ష చేస్తున్న30మందిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని జవహర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం (రెండోరోజు) ఆమరణదీక్ష కొనసాగించిన గ్రామస్తులు.. నిందితుడికి పడిన శిక్షలతో సమాజంలో నేరస్తులకు వెన్నులో వణుకు పుట్టాలని భీష్మించుకొని కూర్చున్నారు. బాలికలు శ్రావణి, మనీషా, కల్పన ఆత్మలు శాంతించాలంటే నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని హాజీపూర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేయాలని, బాధిత కుంటుంబాకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలనే నినాదాలతో మండల కేంద్రంలోని గుడిబావి చౌరస్తా మారుమ్రోగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా చర్యగా అరెస్టు చేసినుట్ట వెల్లడించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి : మానవ మృగాన్ని ఉరి తీయాలి..) -
టీఆర్ఎస్ నాయకుల్ని నిలదీసిన గ్రామస్తులు..!
యాదాద్రి భువనగిరి: బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో బాలికల వరస హత్యలతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ.. హాజీపూర్ గ్రామస్తులు బొమ్మలరామారం చౌరస్తాలో గురువారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వారికి సంఘీభావం తెలపడానికి టీఆర్ఎస్ నేతలు రావడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. గత మూడు వారాలుగా గుర్తుకు రాని హాజీపూర్.. ఇప్పుడే గుర్తుకు వచ్చిందా.. అని గ్రామస్తులు, బాధితులు వారిని నిలదీశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రభుత్వం ఏ ప్రకటనా చేయలేకపోయిందని టీఆర్ఎస్ నాయకులు సర్దిచెప్పే యత్నం చేయగా.. ఇప్పుడు కూడా కోడ్ అమలులోనే ఉందికదా అని గ్రామస్తులు ప్రశ్నించారు. ‘మీ సంఘీభావ యాత్రలతో పనిలేదు. స్థానిక ఎమ్మెల్యే, సీఎం కేసీఆర్‌తో సమావేశం ఏర్పాటు చేయాలి’ అని వారు డిమాండ్ చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఇన్నాళ్లు గుర్తుకు రాని హాజీపూర్.. ఇప్పుడే గుర్తుకు వచ్చిందా -
ఇన్నాళ్లు గుర్తుకు రాని హాజీపూర్.. ఇప్పుడే గుర్తుకు వచ్చిందా
-
ఇంట్లోనే దీక్ష కొనసాగిస్తా
అహ్మదాబాద్: రైతు రుణమాఫీ, పటేళ్లకు రిజర్వేషన్ల డిమాండ్లతో గుజరాత్లో పాస్ (పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి) కన్వీనర్ హార్దిక్ పటేల్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది. గత నెల 25 నుంచి ఆయన దీక్ష చేస్తుండగా ఆరోగ్యం క్షీణించడంతో హార్దిక్‌ను శుక్రవారం ఆసుపత్రికి తరలించడం తెలిసిందే. తాజాగా ఆయన వైద్యశాల నుంచి డిశ్చార్జి అయ్యి, తన ఇంటివద్దనే 16వ రోజు దీక్ష కొనసాగించారు. అంతకుముందు హార్దిక్ ఇంటికి వెళ్తుండగా ఆ దారిలో భారీ సంఖ్యలో పోలీసులను ప్రభుత్వం మోహరించింది. హార్దిక్‌ను అనుసరిస్తున్న విలేకరులను పోలీసులు అడ్డుకోవడంతోపాటు కొంతమందిపై లాఠీ చార్జీ కూడా చేశారు. పోలీసుల చర్యను హార్దిక్ ఖండించారు. ఆగస్టు 25న హార్దిక్ పటేల్ దీక్ష ప్రారంభించారు. మంచినీళ్లు తీసుకోవడం కూడా మానేయడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఇంట్లోనే నిరహార దీక్ష కొనసాగిస్తానని ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆయన ప్రకటించారు. -
ఎవరి పట్టు వారిదే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, రేషన్ డీలర్లకు మధ్య వేడి రాజుకుంటోంది. ఓ వైపు జూలై ఒకటి నుంచి తలపెట్టిన సమ్మెపై రేషన్ డీలర్లు వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు డీడీలు కట్టని డీలర్లపై చర్యలకు ప్రభుత్వం వెనుకాడటం లేదు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా డీల ర్లు రోడెక్కగా... డీలర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగిరం చేసింది. జూలై 5లోగా తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్షకు వెనకాడబోమని డీలర్లు హెచ్చరిస్తుంటే.. సరుకుల పంపిణీకి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. వేలమంది డీలర్లకు నోటీసులు రాష్ట్రవ్యాప్తంగా 2.75 కోట్ల మంది లబ్ధిదారులకు వచ్చే నెల నుంచి బియ్యం, కిరోసిన్ సరఫరా చేయాల్సి ఉంది. ఇందుకోసం మీ సేవ కేంద్రాల్లో రేషన్ సరుకుల కోసం డబ్బులు చెల్లించి, ఆర్ఓ (రిలీజ్ ఆర్డర్) తీసుకోవాలి. అయితే ఇంతవరకూ 17 వేల మంది డీలర్లలో 700 మంది వరకు మాత్రమే డీడీలు చెల్లించారు. దీంతో డీడీలు కట్టని డీలర్లపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ కంట్రోలర్ ఆర్డర్–2016 ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏ డీలర్‌నైనా తొలగించే అధికారం, నిత్యావసర సరుకుల పంపిణీకి ఆటంకం కలిగిస్తే ఏ డీలర్‌నైనా తొలగించి, వారి స్థానంలో ఇతరులను నియమించే అధికారం ఉందని చెబుతూ డీలర్లకు నోటీసులు అందిస్తోంది. శుక్రవారం వేల సంఖ్యలో డీలర్లకు అధికారులు నోటీసులు అందించారు. సస్పెన్షన్‌పై ఆచితూచి.. నోటీసులు అందుకున్న డీలర్లను సస్పెండ్ చేసే ఉత్తర్వులపై ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. సస్పెన్షన్‌పై న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఢిల్లీ పర్యటన లో ఉండటంతో శనివారం న్యాయ సలహా తీసుకొని, అనంతరం సస్పెన్షన్ ఉత్తర్వులపై ముం దుకెళ్లే అవకాశాలున్నాయి. డీలర్లు వెనక్కి తగ్గే సూచనలు కనిపించకపోవడంతో సరుకుల పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరం చేసింది. గుర్తించిన మహిళా సంఘాలకు సరుకులను చేరవేసేందుకు రవాణా వాహనాలను, సరుకుల లోడింగ్ కోసం హమాలీలను సిద్ధం చేసుకునే పనుల్లో వేగం పెంచింది. కాంగ్రెస్ మద్దతు డీలర్ల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు లభించింది. ప్రతిపక్ష నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి డీలర్లకు మద్దతు ప్రకటించారు. వారి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్ చేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. రేషన్ డీలర్ల పట్ల కేసీఆర్ క్రూరంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. డీలర్లపై ప్రభుత్వ దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రభుత్వ నిర్వాకం వల్లే డీలర్ వాజిర్ ఖాన్ ఆత్మహత్యయత్నం చేశారని అన్నారు. -
వైఎస్సార్సీపీ ఎంపీల పోరాటం గర్వకారణం
-
‘మా పదవులు గడ్డిపోచలు’
సాక్షి, ఒంగోలు: ఏపీ ప్రజల కష్టాలతో పోల్చుకుంటే తమ పదవులు గడ్డిపోచలని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఢిల్లీలో ఆమరణ దీక్ష తర్వాత తొలిసారిగా ప్రకాశం జిల్లాలోకి అడుగుపెట్టిన వైవీ సుబ్బారెడ్డికి ఘన స్వాగతం లభించింది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ ఎంపీలతో కలిసి వైవీ సుబ్బారెడ్డి చేస్తున్న పోరాటాన్ని కొనియాడారు. స్థానిక సింగరకొండ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో ఎంపీ పదవులకు రాజీనామా చేశామన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు భవిష్యత్ కార్యాచరణ కొనసాగిస్తామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఒకరోజు దీక్ష.. నయవంచన దీక్ష అని విమర్శించారు. టీడీపీ ఎంపీలు పదవులకు రాజీనామా చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు మోసాలవల్లే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం హోదా ఇవ్వట్లేదని అభిప్రాయపడ్డారు. దీక్షతో చంద్రబాబు ప్రజాధనం కాజేయాలని చూస్తున్నారని చెప్పారు. ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధమని, ప్రజాక్షేత్రంలోనే టీడీపీకి బుద్ధి చెప్తామని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. -
వైఎస్సార్సీపీ ఎంపీల పోరాటం గర్వకారణం : వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం తమ పదవులకు రాజీనామా చేసి.. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన తమ పార్టీ ఎంపీలను కలుసుకోవడం చాలా గర్వంగా ఉందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, వైఎస్ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తమ పదవులకు రాజీనామాచేసి.. ఢిల్లీ వేదికగా ఆమరణ నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన ఎంపీలు ప్రజాసంకల్పయాత్రలో ఉన్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై వైఎస్ జగన్ గురువారం ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు నిస్వార్థంగా నిరాహార దీక్ష చేశారని, బలవంతంగా ఆస్పత్రులకు తరలించేవరకు ప్రాణాలకు తెగించి దీక్ష చేశారని వారి పోరాటాన్ని వైఎస్ జగన్ కొనియాడారు. వైఎస్సార్సీపీ ఎంపీల దీక్ష స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ప్రశంసించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని, కొందరి తరహాలో ప్రజలను మోసం చేసి.. మభ్యపెట్టే డ్రామాలు ఆడబోదని పరోక్షంగా చంద్రబాబు దీక్షను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. Proud to have met our 5 MPs who selflessly resigned from the LS for SCS & went on hunger strike, till forcibly hospitalized.Their actions are inspirational. YSRCP will continue its fight for #APSCS, unlike those interested only in hoodwinking, drama & token fasts. — YS Jagan Mohan Reddy (@ysjagan) 19 April 2018 -
వైఎస్సార్ సీపీ ఎంపీల ఆమరణ దీక్ష ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో శుక్రవారం మధ్యాహ్నం 2:02 గంటలకు దీక్ష ప్రారంభమైంది. లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామాలు సమర్పించిన అనంతరం మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డిలు నేరుగా ఏపీ భవన్‌కు వచ్చి దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ‘ఏపీకి తక్షణమే ప్రత్యేక హోదా కల్పించాల’నే నినాదాలు హోరెత్తాయి. అమరుల సాక్షిగా: దీక్షలో కూర్చోవడానికి ముందు.. ఏపీ భవన్ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ ఎంపీలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత.. ఏపీ ప్రత్యేక హోదా కోసం ప్రాణ త్యాగం చేసిన అమర వీరులు మునికోటి, రమణయ్య, లక్ష్మయ్య,ఉదయభాను, లోకేశ్వరరావులకు చిత్రపటాలపై పూలుచల్లి నివాళులు అర్పించారు. అటుపై మహానేత వైఎస్సార్ చిత్రపటానికి నమస్కరించారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక మద్దతు విభజన హామీలు అమలు కోసం వైఎస్సార్ సీపీ పార్లమెంట్ సభ్యులు చేసిన రాజీనామాలను స్వాగతిస్తున్నామని ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ తెలిపారు. ఢిల్లీలో వైఎస్సార్ సీపీ ఎంపీలు చేస్తున్న నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. -
రాజీనామాలు చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
-
మహానేత పాదాల వద్ద రాజీనామాలు..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా పోరాటాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి.. పార్లమెంటు వేదికగా అలుపెరగని పోరాటం సాగించి.. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు అవిశ్రాంతంగా ప్రయత్నించి.. దేశవ్యాప్తంగా చర్చనీయాం శంగా మార్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు అంతిమ పోరాటాన్ని ప్రారంభించింది. హోదా సాధన పోరాటంలో భాగంగా నేడు పదవులకు రాజీనామాలు చేయనున్న ఎంపీలు.. సంతకాలు చేసిన రాజీనామా పత్రాలను మహానేత వైఎస్సార్ పాదాల వద్ద ఉంచి, నమస్కరించారు. అనంతరం పార్లమెంట్‌కు బయలుదేరారు.. స్పీకర్ అపాయింట్మెంట్: ప్రత్యేక హోదా కోసం పదవులు త్యజించేందుకు సిద్ధమైన వైఎస్సార్సీపీ ఎంపీలు ఆమేరకు లోక్‌సభ స్పీకర్‌ను కలవనున్నారు. సభ నిరవధిక వాయిదా పడిన తర్వాత నేరుగా స్పీకర్‌ను కలవనున్న ఎంపీలు.. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించిన అనంతరం నేరుగా ఏపీ భవన్‌కు వెళ్లి ఆమరణ దీక్షలో కూర్చుంటారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శుక్రవారం సభ నిరవధిక వాయిదా ప్రకటన వెలువడగానే రాజీనామాలు సమర్పిస్తామని వైఎస్సార్సీపీ ఎంపీలు తెలిపారు. ఆ వెంటనే ఏపీ భవన్ వేదికగా ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోనున్నారు. ఢిల్లీలో దీక్షకు దిగనున్న వైఎస్సార్సీపీ ఎంపీలకు మద్దతుగా ఏపీ వ్యాప్తంగా అన్ని చోట్లా సంఘీభావ దీక్షలు జరుగనున్నాయి. వైఎస్సీర్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు విద్యార్థులు, యువతకు ఇదివరకే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అటు ఎంపీల దీక్షా శిబిరానికి కార్యకర్తల తాకిడి మొదలైంది. వేలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు వివిధ మార్గాల ద్వారా ఢిల్లీకి పయనం అయ్యారు. వైఎస్సార్ సీపీ ఎంపీల రాజీనామా లేఖలు ఇవే.. -
హోదా కోసం ఐక్యంగా ఉద్యమించాలి
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టం అమలు కోసం ఐక్యంగా ఉద్యమించాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి గురువారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ, వామపక్షాలు మొదటి నుంచీ ప్రత్యేక హోదాపై ఒకే విధమైన అభిప్రాయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ నెల 6 నుంచి వైఎస్సార్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు పూనుకోవడం హర్షణీయమన్నారు. అదే రోజు జాతీయ రహదారులపై పాదయాత్ర పేరుతో మరో ఉద్యమాన్ని చేపట్టడం వల్ల సత్ఫలితాలు రావని అభిప్రాయపడ్డారు. ఒకేరోజు వేర్వేరు పార్టీలు వివిధ రకాల పోరాటాలకు పిలుపునిస్తే సత్ఫలితాలు రావని పేర్కొన్నారు. 25 మంది లోక్‌సభ సభ్యులు రాజీనామా చేసే విధంగా ఒత్తిడి తేవాలని, ఉద్యమానికి ఢిల్లీని కేంద్ర బిందువుగా చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ తీసుకొని ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు కోసం కృషి చేస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను ఆహ్వానించి ఐక్య పోరాటానికి శ్రీకారం చుట్టాలని విజ్ఞప్తి చేశారు. -
ప్రాణాలైనా అర్పిస్తాం: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ప్రాణాలైనా అర్పిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ప్రకటించారు. బడ్జెట్ మలివిడత సమావేశాల్లోపు కేంద్రం దిగి రాకపోతే వైఎస్సార్సీపీ ఎంపీలందరూ మూకుమ్మడిగా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు సమర్పిస్తామని.. అనంతరం ఏపీ భవన్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని చెప్పారు. ఢిల్లీలో ఆ పార్టీ లోక్‌సభ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గురువారం ఇక్కడి కానిస్టిట్యూషన్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. మేకపాటి మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం మా ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. బడ్జెట్ మలివిడత సమావేశాల్లోపు కేంద్రం దిగి రాకపోతే వైఎస్సార్సీపీ ఎంపీలందరూ రాజీనామాలు చేస్తారని మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుగానే ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మా పదవులకు రాజీనామాలు చేసి ఏపీ భవన్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాం. అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టే పేరుతో ఢిల్లీ వచ్చిన చంద్రబాబు గాంధీ విగ్రహం వద్ద, పార్లమెంటు ప్రధాన ద్వారం మెట్ల వద్ద ఫొటోలకు పోజులు ఇచ్చి వెళ్లారు. ఎన్నికల సమయంలో 10 ఏళ్లపాటు హోదా ఇస్తామన్న బీజేపీ.. కాదు 15 ఏళ్లు కావాలన్న చంద్రబాబు కలిసి రాష్ట్రానికి ద్రోహం చేశారు. వీటిని ప్రజలు గమనిస్తున్నారు..’ అని వివరించారు. టీడీపీ, బీజేపీ నిందారోపణలు: వైవీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నాయి. హోదాను విస్మరించిన చంద్రబాబు ఇప్పుడు కొత్తగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని ఎలా అడుగుతారు. ప్రత్యేక హోదా రాష్ట్ర ఊపిరి.. ఆ ఊపిరిని సాధించుకొనేందుకు మా ఊపిరినైనా వదిలేస్తాం..’ అని చెప్పారు. మోసం చేశారు: వరప్రసాదరావు ‘తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, టీడీపీలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మోసగించాయి. ప్రత్యేక హోదా వస్తుందని ఆకాంక్షించి ప్రజలు వారిని గెలిపించారు. నాలుగేళ్లు కాపురం చేశారు. కానీ, ఒక్క సందర్భంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలని అడగలేదు. పార్లమెంటు సమావేశాల్లో రోజుకు ఏడెనిమిది గంటలపాటు మా కాళ్లపై నిలబడి హోదా కోరుతూ నిరసన తెలిపాం. అయినా ఎన్డీయే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి మా నాయకుడు జగన్మోహన్రెడ్డి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. అందులో భాగంగానే కేంద్రంపై అవిశ్వాసం పెట్టాల్సి వచ్చింది. దీంతో టీడీపీ కూడా మమ్మల్ని అనుసరించాల్సి వచ్చింది’ అని వెలగపల్లి ప్రసాదరావు వివరించారు. దర్యాప్తు జరపాలి: మిథున్‌రెడ్డి ‘అవినీతిలో కూరుకుపోవడం వల్ల చంద్ర బాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయారు. అనేక ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడ్డారని కాగ్ నివేదిక చెబుతోంది. మరి బీజేపీ ఎందుకు చర్య తీసుకోలేదు? అసలు బీజేపీకి, టీడీపీకి మధ్య తేడాలు ఎందుకు వచ్చాయో ప్రజలు తెలుసుకోవాల నుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలపై దర్యాప్తు చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే మాతో కలిసి రావాలి. రాజీనామా చేసి దీక్షకు కూర్చోవాలి..’ అని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రానిదే బాధ్యత: అవినాష్‌రెడ్డి ‘ప్రత్యేక హోదా కోసం మా నాయకుడు జగన్మోహన్రెడ్డి ఒక కార్యాచరణ రూపొందించారు. దానిలో భాగంగానే అవిశ్వాస తీర్మానాలకు నోటీసులు ఇచ్చాం. కేంద్రం ప్రభుత్వం దానిని చర్చకు, ఓటింగ్‌కు తీసుకురాకుండా తప్పించుకునే ప్రయత్నం ఏ విధంగా చేస్తోందో చూస్తున్నాం. ఇందుకు కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలి. ప్రధాని పార్లమెంటుకు వచ్చినా లోక్‌సభకు రారు. రేపైనా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతి వస్తుందో రాదో తెలియదు. శుక్రవారం సభ నిరవధిక వాయిదా పడిన తరువాత రాజీనామా చేసి ఆమరణ దీక్ష ప్రారంభిస్తాం.’.. అని అవినాష్‌రెడ్డి చెప్పారు. -
హోదా కోసం..
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సాక్షిగా దేశ రాజధానిలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఐదుకోట్లమంది ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబో తున్నారు. ప్రత్యేక హోదా పోరాటాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి.. పార్లమెంటు వేదికగా అలుపెరగని పోరాటం సాగించి.. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు అవిశ్రాంతంగా ప్రయత్నించి.. దేశవ్యాప్తంగా చర్చనీయాం శంగా మార్చిన ఆ పార్టీ ఇపుడు అంతిమ పోరాటానికి సన్నద్ధమయ్యింది. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం శుక్రవారం కూడా చర్చకు రాకుండా పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడినట్లయితే ఆ మరుక్షణమే వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యులు తమ పదవులను తృణప్రాయంగా త్యజించనున్నారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేసి ఆ లేఖలను కేంద్రం మొఖాన కొట్టి బయటకు రానున్నారు. రాజీనామాలను ఆమోదించాలని కోరనున్నారు. ఆ వెనువెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి అయిన ఏపీభవన్‌లో వారు ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తమ నాలుగేళ్ల ప్రత్యేక హోదా పోరాటాన్ని పతాక స్థాయికి చేర్చిన ఎంపీలు తాజా బడ్జెట్ సమావేశాల్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చగలిగారు. చరిత్రలో మునుపెన్నడూ ఎరుగని రీతిలో కేంద్రంపై 13సార్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. జాతీయ పార్టీల మద్దతు కూడగట్టారు. అవిశ్వాస తీర్మానానికి అందరూ కలసి వచ్చే పరిస్థితి కల్పించారు. అవసరమైతే ప్రాణ త్యాగం చేస్తాం తప్ప ప్రత్యేకహోదా పోరాటాన్ని వదిలేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ప్రకటించారు. ప్రత్యేక హోదా ముందు పదవులు తమకో లెక్క కాదన్నారు. ప్రత్యేక హోదాపై ప్రజల ఆకాంక్షలను బలంగా చాటిచెబుతామని, ప్రజాన్యాయస్థానంలోనే తేల్చుకుంటామని ప్రతిన పూనారు. కాగా పదవులను త్యాగం చేసి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్న ఎంపీలకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీ తరలివచ్చారు. పార్టీ సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, డాక్టర్ అరుణ్‌కుమార్ తదితరులు ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఢిల్లీ చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
వైఎస్సార్సీపీ ఎంపీల ఆమరణ దీక్ష..
సాక్షి, పేరేచర్ల: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా వైఎస్సార్సీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందే ప్రకటించినట్లు పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత రాజీనామాలు చేయనున్న వైఎస్సార్సీపీ ఎంపీలు.. ఆ వెంటనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం గుంటూరు జిల్లా పేరేచర్లలో జరిగిన బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. ఏపీ భవన్లో ఆమరణ నిరశన: ‘‘హోదా విషయంలో ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయి. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని ఇదివరకే చెప్పాం. టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా, చెయ్యకున్నా వైఎస్సార్సీపీ ఎంపీలు మాత్రం స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు సమర్పిస్తారు. అక్కడి నుంచి నేరుగా ఏపీ భవన్‌కు వెళతారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి అయిన ఏపీ భవన్‌లోనే నిరాహార దీక్షకు దిగుతారు’’ అని వైఎస్ జగన్ చెప్పారు. విద్యార్థులకు వైఎస్ జగన్ విజ్ఞప్తి: ‘‘ఢిల్లీలోని ఏపీ భవన్లో వైఎస్సార్సీపీ ఎంపీలు చేపట్టబోయే నిరాహార దీక్షకు విద్యార్థిలోకం, యువతరం సంఘీభావం తెలపాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ‘‘అక్కడ ఢిల్లీలో మన ఎంపీలు ఆమరణ దీక్ష చేస్తారు. వారికి మద్దతుగా ఏపీలోని అన్ని మండలాల్లో విద్యార్థులు వారి వారి కళాశాలల ప్రాంగణాల్లో సంఘీభావ దీక్షలు చేపట్టాలని కోరుతున్నాను. టీడీపీ ఎంపీలు కూడా మనతో కలిసి వస్తే, మొత్తానికి మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలుచేసి ఆమరణ దీక్షకు దిగితే.. వారికి మద్దతుగా రాష్ట్రమంతటా నిరసనలు జరిగితే కేంద్రం తప్పక దిగివస్తుంది. ప్రత్యేక హోదా ఒక్కటే ఏపీకి సంజీవని. హోదా వస్తేనే ప్రతి జిల్లా కేంద్రం హైదరాబాద్ మాదిరి అవకాశాల గనిలా మారుతుంది’’ అని వైఎస్ జగన్ తెలిపారు. -
దీక్షలో ఉండే మూడుముళ్లు వేశాడు!
జైపూర్: నిరాహార దీక్ష శిబిరమే వివాహ వేదికగా మారింది. రిజర్వేషన్ కోటా అమలు చేయాలనే డిమాండ్‌తో దీక్షలో కూర్చున్న యువకుడు.. అక్కడే ఓ యువతి మెడలో మూడుముళ్లు వేశాడు. అనంతరం అతడు తన దీక్ష కొనసాగించగా నూతన వధువు అత్తవారింటికి వెళ్లిపోయింది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. దౌసా జిల్లా సికిందరా ఏరియాకు చెందిన దేవరాజ్ గుజ్జర్(26)తో పాటు మరో పది మంది గత ఏడాది రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో ఎస్బీసీ కోటా కింద లెక్చరర్ల పోస్టులకు ఎంపికయ్యారు. ఇంతలోనే.. ప్రత్యేక వెనుకబడిన కులాల(ఎస్బీసీ) వారికి రిజర్వేషన్ రద్దుచేస్తూ రాజస్థాన్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో లెక్చరర్ల పోస్టుకు ఎంపికైన వీరికి కాల్ లెటర్లు అందలేదు. దీంతో వారు ఈ ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్షకు చేస్తున్నారు. దేవరాజ్ గుజ్జర్‌కు మమత అనే యువతితో ఎనిమిది నెలల క్రితమే వివాహం నిశ్చమయింది. ఈ ఫిబ్రవరిలోనే వివాహం కావాల్సి ఉంది. తమ రిజర్వేషన్ కోటా కోసం దీక్ష చేస్తున్న దేవరాజ్ సూచన ప్రకారం.. దీక్ష శిబిరం వద్దే పెద్దలు వివాహ వేదిక ఏర్పాటు చేశారు. బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి తంతు జరిపించారు. తన వివాహం అనంతరం దేవరాజ్ గుజ్జర్ మీడియాతో మాట్లాడాడు. ఎస్బీసీ కోటా రిజర్వేషన్లు తిరిగి అమలయ్యేలా దాకా దీక్ష కొనసాగిస్తానని చెప్పాడు. ఈ డిమాండ్ కోసం ప్రాణం పోయినా పరవాలేదని తెలిపాడు. నూతన వధువు మమత మాట్లాడుతూ... ఈ పరిస్థితుల్లో తన భర్త దీక్ష చేపట్టడం కాస్త ఇబ్బంది కలిగించే విషయం అయినప్పటికీ ఆయన ఒక మంచి ఆశయ సాధనకు దీక్ష చేపట్టడం గర్వంగా ఉందని తెలిపింది. ప్రభుత్వం స్పందించకుంటే తాను కూడా దీక్షలో కూర్చుంటానని చెప్పింది. అనంతరం వధువు మమత అత్తవారింటికి వెళ్లిపోగా దేవరాజ్ మాత్రం దీక్షలో కూర్చున్నాడు. -
తిలక్‌నగర్‌లో హోంగార్డుల ఆందోళన
-
తిలక్‌నగర్‌లో హోంగార్డుల ఆందోళన
హైదరాబాద్: నగరంలోని తిలక్‌నగర్‌లో హోంగార్డులు ఆందోళనకు దిగారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని ఆదివారం ఉదయం ధర్నాకు దిగారు. స్థానిక హోంగార్డుల కార్యాలయంలో ఆ సంఘం చైర్మన్ సకినాల నారాయణ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చేపట్టిన ఈ ఆందోళనలో సుమారు 200 మంది హోంగార్డులు పాల్గొన్నారు. -
కల్వకుర్తి డివిజన్ చేయకుంటే రాజీనామా
ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధనకు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహారదీక్షకు పూనుకుంటే దాన్ని పోలీసులు భగ్నం చేశారని, తమ ప్రాంత ప్రజల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అన్నారు. తాను టీఆర్ఎస్ లోకి వెళితే రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తారని కొంతమంది సలహాలు ఇస్తున్నారని, తాను పదవికి రాజీనామా చేసినా పార్టీ మరే ప్రసక్తే లేదని చెప్పారు. అవసరమైతే తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పలుకుతానన్నారు. -
రెండోరోజుకు చేరిన మాజీ మంత్రి నిరాహార దీక్ష
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో.... జిల్లాల పునర్ విభజనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. అందులోభాగంగా వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్లలో బంద్ జరగుతుంది. ప్రత్యేక జిల్లా కోసం వికారాబాద్‌లో మాజీ మంత్రి చంద్రశేఖర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష బుధవారం రెండో రోజుకు చేరింది. ఆయన 19 మండలాలతో కూడిన వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ధారూర్ మండలంలో కెరెల్లిలో రాస్తారోకో కొనసాగుతుంది. వికారాబాద్, తాండూరు, పరిగిలోని ఆర్టీసీ డిపోలకు తాళాలు వేశారు. గత మూడు రోజులుగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. చేవెళ్లను జిల్లా కేంద్రంగా చేయాలంటూ స్థానిక ప్రజలు చేపట్టిన ఆందోళనలు బుధవారం నాలుగోరోజుకు చేరాయి. చేవెళ్లలో 144 సెక్షన్ అమలులో ఉంది. -
తిరుపతికి సురేంద్రరెడ్డి తరలింపు
నెల్లూరు(అర్బన్) : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ పెద్దాసుపత్రిలో ఆమరణ దీక్ష చేస్తున్న ఏపీ ప్రజాసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పెళ్లకూరు సురేంద్రరెడ్డిని పోలీసులు ఆదివారం తిరుపతికి తరలించారు. సురేంద్రరెడ్డి హోదా కోసం నెల్లూరులోని కొండాయపాళెం గేటు సమీపంలో ఉన్న తన ఇంటిలో ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఐదు రోజులు గడిచేసరికి ఆరోగ్యం క్షీణించిందని ఆయన దీక్షను శనివారం రాత్రి పోలీసులు భగ్నం చేసి పెద్దాసుపత్రికి తరలించారు. అయితే ఆయన అక్కడ కూడా తన దీక్షను కొనసాగిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో ఆదివారం సురేంద్రరెడ్డిని పెద్దాసుపత్రిలో డాక్టర్లు పరిశీలించారు. గుండెకి సంబంధించి ఈసీజీలో మార్పులు వచ్చాయని, బీపీ సమస్య కూడా ఉందని తెలిపారు. ఈనేపథ్యంలో మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు సూచించారు. గుంటూరు లేదా తిరుపతి ఆసుపత్రికి తీసుకెళ్లాలని పోలీసులకు రెఫర్ చేశారు. దీక్ష కొనసాగిస్తా.. ఫిజిషియన్ శ్రీచందన్ సూచన మేరకు పోలీసులు తిరుపతికి తీసుకెళ్లేందుకు సురేంద్రరెడ్డి వద్దకు వెళ్లారు. ఆయన తిరుపతికి వెళ్లేందుకు అంగీకరించలేదు. తాను ఇదే ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తానని పట్టుపట్టారు. ఐదో నగర పోలీసులు ఎస్సై జగత్ సింగ్ ఆధ్వర్యంలో ఆయన్ను బలవంతంగా తిరుపతికి తరలించబోగా అక్కడున్న కార్యకర్తలు ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు అర్పిస్తాం అంటూ నినదించారు. పోలీసులు బలవంతంగా 108 వాహనంలో ఎక్కించి తిరుపతికి తరలించారు. ఈసందర్భంగా సురేంద్రరెడ్డి మాట్లాడుతూ తాను తిరుపతిలో కూడా దీక్ష కొనసాగిస్తానన్నారు. ఆయన వెంట సమితి జిల్లా అధ్యక్షుడు సాల్మన్‌రాజు, ప్రధాన కార్యదర్శి తిరుపతి యాదవ్ ఉన్నారు. -
ములుగు జిల్లా సాధనకు నిరవధిక నిరాహార దీక్ష
ములుగు : ములుగును జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా సాధన సమితి ప్రధాన కార్యదర్శి నూనె శ్రీనివాస్ మండల కేంద్రంలోని గాంధీచౌక్ ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. పలు రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేముల బిక్షపతి పూల మాల వేసి దీక్ష ప్రారంభించారు. ఈ సంధర్భంగా జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల బిక్షపతిగౌడ్, బిక్షపతి మాట్లాడుతూ జిల్లా సాధనకు ప్రాణాలను లెక్కచేయకుండా దీక్షకు కూర్చోవడం అభినందనీయమన్నారు. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం సమ్మక్క–సారలమ్మ గిరిజన జిల్లా ప్రకటించాలని కోరారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా దీక్ష విరమించేది లేదని శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పల్లె జయపాల్‌రెడ్డి, నాయకులు దూడబోయిన శ్రీనివాస్, బాబాఖాన్, గుండెమీది వెంకటేశ్వర్లు, దేవదాసు, శ్యాం, ప్రవీణ్, హరి, బాబి, షర్పోద్దీన్, అజయ్, రవిపాల్, వంగ రవియాదవ్ పాల్గొన్నారు. -
మణిపురి మహిళ దీక్ష భగ్నం
ఇంఫాల్: మణిపూర్‌లో సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టానికి (ఏఎఫ్ఎస్పీఏ) వ్యతిరేకంగా స్థానిక ‘ఉమెన్ అండ్ క్రైమ్ జర్నల్’ పత్రిక ఎడిటర్ రాంబం రోబితా శనివారం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మణిపూర్ వర్సిటీ ముందున్న కాంచిపురలోని తన ఆఫీసులోనే ఆమె దీక్షకు పూనుకున్నారు. కూతుళ్ల భవిష్యత్తు, భర్త వ్యతిరేకత నేపథ్యంలో దీక్ష చేపట్టవద్దని సహచరులు సూచించినా పట్టించుకోలేదు. అయితే, పోలీసులు దీక్షాశిబిరం వద్దకు వచ్చి ఆమెను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఏఎఫ్ఎస్పీఏ రద్దు కోసం 16 ఏళ్లుగా చేసిన నిరశనను ఇరోం షర్మిల ఇటీవల విరమించడం తెలిసిందే. -
'400 హామీలిచ్చి.. ఒక్కటీ నిలబెట్టుకోలేదు'
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజం కిర్లంపూడి(తూర్పుగోదావరి జిల్లా): ప్రజాస్వామ్యబద్ధంగా తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబంపై ప్రభుత్వం జరిపిన దాడి పాశవికమని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో మంగళవారం రాత్రి ఆయన ముద్రగడను పరామర్శించారు. ఆసుపత్రిలో అధికారులు వ్యవహరించిన తీరును ముద్రగడ వివరించారు. దీనిపై శైలజానాథ్ విస్మయం చెందారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ముద్రగడ శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తుంటే.. ఆయన కుటుంబంపై పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని చంద్రబాబాబు దౌర్జన్యం చేయించడం హేయమైన చర్య అన్నారు. దీని ఫలితాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు అనుభవించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం సుమారు 400 హామీలు ఇచ్చారని, ఏ ఒక్కటీ నిలబెట్టుకోలేదని గుర్తు చేశారు. భవిష్యత్తులో ముద్రగడ చేపట్టబోయే ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తానని శైలజానాథ్ చెప్పారు. -
'ముద్రగడకు ఏమైనా జరిగితే ఊరుకోం'
తెనాలి రూరల్: రాష్ట్రంలో హిట్లర్, మావో పాలన సాగుతోందని.. ప్రభుత్వ పెద్దల కళ్లు, చెవులు మూసుకుపోయాయని కాపు జాగృతి నేత హరిదాసు గౌరీశంకర్ దుయ్యబట్టారు. కాపుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 2019లో టీడీపీని ఏపీలో ఖాళీ చేయించేందుకు కాపులంతా ఐక్యంగా పోరాడతారని చెప్పారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల రిజర్వేషన్ల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని, ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కాపు జాగృతి నేతలు అన్నారు. రాష్ట్ర కన్వీనర్, సుప్రీంకోర్టు న్యాయవాది జల్లా సతీష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో కాపులను ఇళ్ల నుంచి బయటకు రానీయని పరిస్థితులను ప్రభుత్వం కల్పించిందన్నారు. మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బొండా ఉమ తదితర టీడీపీ నాయకులు కాపు కుల ద్రోహులని విమర్శించారు. ముద్రగడ కుటుంబంపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, కాకినాడ ఏఎస్పీ దామోదర్, డీఎస్పీ పల్లంరాజులను వెంటనే సస్పెండ్ చేసి విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. మీడియా మీద ఆంక్షలు విధించడం దారుణమన్నారు. కాపునాడు జిల్లా అధ్యక్షుడు దంతాల కిరణ్‌కుమార్ మాట్లాడుతూ కాపుల రిజర్వేషన్ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతుపై వానపడిన చందంగా వ్యహరిస్తోందని విమర్శించారు. -
ఇంట్లోకి వచ్చారో పురుగు మందు తాగుతా: ముద్రగడ
కిర్లంపూడి : ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించారు. దీంతో ఆగ్రహించిన ముద్రగడ ఇంటి లోపలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. పురుగు మందు డబ్బా చూపిస్తూ... దాన్ని తాగుతానని హెచ్చరికలు చేశారు. కాపు జాతి కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని అన్నారు. కాపుల రిజర్వేషన్లు అమలు చేయమంటే అరెస్ట్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ అయ్యేందుకు తాను సిద్ధమే అని, అయితే అందుకు సరైనా ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. తన ఇంటి వద్ద నుంచి పోలీసులు తక్షణమే వెళ్లిపోవాలని సూచించారు. తమ జీవితాలతో ఆడుకోవద్దని వార్నింగ్ ఇవ్వడంతో, పోలీసులు వెనక్కి తగ్గారు. దీంతో ముద్రగడ అరెస్ట్‌ను పోలీసులు తాత్కాలికంగా విరమించుకున్నారు. ఈ సందర్భంగా ముద్రగడతో పాటు దీక్షకు దిగిన ఆయన సతీమణి ఆందోళనకు గురై, కంటతడి పెట్టారు. ఆమెను ముద్రగడ ఏంకాదంటూ అనునయించారు. అలాగే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు కూడా ముద్రగడ నిరాకరించారు. కాగా ముద్రగడ నివాసం వద్ద ఉన్న మీడియాను పోలీసులు పంపించి వేశారు. మరోవైపు డీఐజీ రామకృష్ణ కిర్లంపూడి చేరుకున్నారు. మరోవైపు ముద్రగడ నివాసానికి కాపులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఆయనకు మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ఆమరణ దీక్ష ప్రారంభించిన ముద్రగడ దంపతులు
కిర్లంపూడి: ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి ప్రభుత్వం మోసం చేస్తోందని కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. తుని ఘటన నేపథ్యంలో నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆయన గురువారం తన నివాసంలో సతీమణితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ అరెస్ట్‌ల పర్వం చాలా బాధాకరమన్నారు. ఆగస్టులోపు కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారని, ప్రతి ఏటా వెయ్యికోట్లు బడ్జెట్లో పెడతామని కూడా హామీ ఇచ్చారన్నారు. అలాగే తుని ఘటనలో కేసులను ఉపసంహరిస్తామన్నారని ముద్రగడ గుర్తు చేశారు. ఈ హామీలను ప్రభుత్వం తుంగలోకి తొక్కిందన్నారు. ఈ అరెస్ట్‌ల పర్వం చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు. రౌడీ షీటర్లు అని ముద్రవేసి అరెస్ట్‌లు చేయడం సరికాదని అన్నారు. కాపు రిజర్వేషన్లతో పాటు, అరెస్ట్ చేసినవారిని వెంటనే విడుదల చేయాలని ముద్రగడ డిమాండ్ చేశారు. అరెస్ట్‌ల పర్వం ఆపాలంటే ప్రాణత్యాగం తప్ప తనకు రెండోదారి లేదని ముద్రగడ పేర్కొన్నారు. తనను కూడా అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, అందుకు భయపడేది లేదన్నారు. తనపై కేసులు పెట్టిన ఘటన చంద్రబాబుదేనని, తాను వెనక్కి తగ్గేది లేదని ముద్రగడ అన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అరెస్ట్ చేసుకోవచ్చన్నారు. కాపులను బీసీల్లో చేర్చుతామని గతంలో మాట ఇచ్చి దీక్షను విరమింప చేశారన్నారు. కాపు జాతి హక్కుల కోసం పోరాడటం తప్పా అని ఆయన ప్రశ్నించారు. జీవితం అంతా జైల్లో ఉండేలా ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని ముద్రగడ స్పష్టం చేశారు. ఒకవేళ తనను జైల్లో పెట్టినా దీక్ష కొనసాగుతుందని ఆయన తెలిపారు. అరెస్ట్‌లకు భయపడి దాక్కోవడం కానీ, ముందస్తు బెయిల్ తెచ్చుకోవటం జరగదన్నారు. తమ జాతి కోసం ప్రాణ త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తన జాతి కోసం ప్రాణాలు అర్పించే అవకాశం ఇచ్చిన సీఎంకు ముద్రగడ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తనను అరెస్ట్ చేయకుండా... తన జాతి కోసం మరణం పొందే అవకాశం ఇవ్వాలని ఆయన సీఎంను కోరారు. అలాగే ఇదే ఆఖరి ప్రెస్‌మీట్ అని, దయచేసి మాట్లాడేందుకు ప్రయత్నించవద్దని ముద్రగడ ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులను కోరారు. -
కిర్లంపూడిలో హై టెన్షన్, పోలీసుల మోహరింపు
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో హై టెన్షన్ నెలకొంది. తుని సంఘటన నేపథ్యంలో కేసులను ఎత్తివేయాలని డిమాండ్ తో కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం నేటి నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిర్లంపూడి పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎర్రవరం, పత్తిపాడు, కిర్లంపూడిలో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కిర్లంపూడి వచ్చే వ్యక్తులను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ముద్రగడకు సంఘీభావంగా కాపులు పెద్ద ఎత్తున కిర్లంపూడికి తరలి వస్తున్నారు. కాగా తునిలో జనవరి 31న కాపు ఐక్యగర్జన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ముద్రగడను ఏ-1గా చేరుస్తూ 76 కేసులు నమోదు చేసినట్టు సమాచారం. -
నేటి నుంచి ముద్రగడ దీక్ష
- ఒక్కడినే దీక్ష చేస్తా: ముద్రగడ - రాయబారానికి ఎవరూ రావద్దని విజ్ఞప్తి సాక్షిప్రతినిధి, కాకినాడ: కాపులను బీసీ జాబితాలో చేర్చాలని, తుని ఘటన నేపథ్యంలో నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ముద్రగడ ఆమరణ దీక్షను బుధవారం రాత్రి ప్రకటించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రిజర్వేషన్లకు ఇచ్చిన గడువు ఆగస్టు సమీపిస్తుండటంతో వేగంపెంచాలని, కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ముద్రగడ బుధవారం వరకు ప్రభుత్వానికి గడువు విధించిన విషయం తెలిసిందే. ఇచ్చిన గడువు పూర్తరుునా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కనిపించకపోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపు నేతలతో పలు దఫాలుగా చర్చించిన అనంతరం ఆమరణ దీక్షను ప్రకటించారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించనున్న దీక్షకు కిర్లంపూడిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు అప్రమత్తమైన ప్రభుత్వం జిల్లా సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. సుమారు ఐదువేల మంది పోలీసులను రంగంలోకి దింపారు. కేసులు ఎత్తేసే వరకు దీక్ష: ముద్రగడ తుని సంఘటన నేపథ్యంలో కేసులను ఎత్తివేసేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని ముద్రగడ స్పష్టం చేశారు. తాను ఒక్కడినే దీక్ష ప్రారంభిస్తానని, రాయబారానికి ఎవరూ రావద్దని కోరారు. కిర్లంపూడిలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కాపు జాతిని చీల్చేందుకు కుట్ర పన్నుతోందని, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను నాలుగు గ్రూపులుగా విడదీయాలనే కుట్రతో తనను ఒంటరిని చేసేయ్యాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. తుని సభను దహనకాండ చేసేందుకు కూడా చంద్రబాబు కుట్ర పన్నారని, వేదికను, పార్కింగ్‌లో ఉన్న కార్లను దహనం చేసేందుకు పెట్రోలు ప్యాకెట్లతో పంపించారన్నారు. ఇటువంటి కుట్రలు చంద్రబాబుకే చేతనవుతాయన్నారు. ఏ-1గా ముద్రగడ కాగా, ముద్రగడపై నమోదైన కేసులకు సంబంధించి హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులు బుధవారం సమీక్షించారు. కాకినాడలో హోంమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు భేటీ అనంతరం డీఐజీ, ఇతర పోలీసు అధికారులతో చినరాజప్ప చర్చించినట్టు సమాచారం. తునిలో జనవరి 31న కాపు ఐక్యగర్జన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ముద్రగడను ఏ-1గా చేరుస్తూ 76 కేసులు నమోదు చేసినట్టు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. రత్నాచల్ దహనం, పోలీసు స్టేషన్‌పై దాడి, పోలీసులపై దాడితోపాటు సెల్ఫోన్లు చోరీ కేసులో కూడా నిందితుడుగా చేర్చినట్టు తెలిసింది. అరెస్టు చేస్తే ఎదురయ్యే పరిణామాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. -
వికారాబాద్ జిల్లా కేంద్రం కాకుంటే..ఆమరణ నిరాహార దీక్ష
♦ సీఎం కేసీఆర్ మాటపై పూర్తి నమ్మకం ఉంది ♦ వీడీడీఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే సంజీవరావు ♦ జిల్లా కేంద్రంపై కాంగ్రెస్ పూర్తి సహకారం : మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ వికారాబాద్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా పశ్చిమ రంగారెడ్డిలోని వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ఖాయమని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే బి.సంజీవరావు అన్నారు. అలా కానీ పక్షంలో ఉద్యమంలో ముందు నడిచి ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకైనా సిద్ధమని ప్రకటించారు. వికారాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు - అభివృద్ధి అనే అంశంపై మంగళవారం స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ సమావేశ మందిరం లో వికారాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఫోరం(వీడీడీఎఫ్) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటపై నిలబడే వ్యక్తి అని, ఇచ్చిన హామీ ప్రకారం తప్పకుండా వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా చేస్తారన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మవద్దని కోరారు. వికారాబాద్ జిల్లా నాలు గు నుంచి ఐదు నియోజకవర్గాలతో ఏర్పడడం ఖాయమన్నారు. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరుపున జిల్లా కేంద్రం కోసం పోరాటం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి వికారాబాద్ జిల్లా కేంద్రం అయ్యేందుకు పూర్తిసహకారం అందిస్తామని చెప్పారు. వికారాబాద్ జిల్లా ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమన్నారు. జిల్లా విషయంలో తేడా వస్తే ఊరుకునే ప్రసక్తే ఉండదన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.. వికారాబాద్ ప్రజలకు ముందు నుంచి పాల కులు అన్యాయం చేస్తూనే ఉన్నారని, గతంలో పార్లమెంట్ స్థానాన్ని చేవెళ్లకు, ప్రభుత్వ ఆసుపత్రిని తాండూరుకు తరలించి తీరని అన్యాయం చేశారని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రం అవుతుందంటే లేనిపోని ఆందోళనల తో ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత నాయకులు ఐక్యంగా ఉండి వికారాబాద్ జిల్లా కేంద్రం ఏర్పాటయ్యే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. లేని పక్షంలో ప్రమాదం పొంచి ఉందన్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటులో తేడా వస్తే ప్రత్యేక రాష్ర్ట తరహాలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ హఫీజ్, వీడీడీఎఫ్ నాయకులు శుభప్రద్‌పటేల్, కె.శ్రీనివాస్, నర్సింహు లు, మారుతి, టీఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షుడు భూమోళ్ల కృష్ణయ్య, టీఆర్ఎస్ నాయకులు రత్నారెడ్డి, రాజు నాయక్, వేణుగోపాల్‌రెడ్డి, బీజేపీ నుంచి శివరాజ్, నాయకులు పెం డ్యాల అనంతయ్య, సురేష్, రవిశంకర్, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యు.విఠల్, పీఆర్టీయూ నర్సింహులు, లక్ష్మయ్య పాల్గొన్నారు. -
ఫైన్ కట్టే ప్రసక్తేలేదు... నిరవధిక దీక్ష చేస్తాం
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) వివాదం రోజురోజుకూ ముదిరిపోతుంది. వర్సిటీ ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీ విద్యార్థినేత కన్హయ్యకుమార్కు రూ.10 వేల జరిమానా విధించిన విషయంతెలిసిందే. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడన్న నేరంతో ఏబీవీపీ నాయకుడు సౌరభ్ శర్మకు కూడా రూ.20 వేల జరిమానా విధించింది. అయితే తాము జరిమానా కట్టే ప్రసక్తేలేదని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. ఉన్నతస్థాయి కమిటీ ఉత్తర్వుల ప్రకారం హాస్టల్ ఖాళీచేసి వెళ్లనున్నట్లు తెలిపారు. ఉత్తర్వులు రద్దుచేయాలంటూ నిరసనగా బుధవారం నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేపట్టబోతున్నట్లు విద్యార్థిసంఘం నేత కన్హయ్యకుమార్ మీడియాకు వివరించారు. తమపై జరుగుతున్న విధానాలు, చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ఆఫ్జల్‌గురు ఉరితీతకు వ్యతిరేకంగా గత ఫిబ్రవరి 9న కార్యక్రమం నిర్వహించిన విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ కు జరిమానా విధించడంతో పాటు, ఉమర్, అనిర్బన్ భట్టాచార్యలు వర్సిటీలో మత హింసకు, మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన కారణంగా ఉమర్‌ను ఒక సెమిస్టర్, ముజీబ్ గట్టూను రెండు సెమిస్టర్లు, భట్టాచార్యను జూలై 15 వరకు సోమవారం నాడు బహిష్కరించింది. -
ప్రభుత్వం ఒక్కమెట్టు కూడా దిగదంటా: ముద్రగడ
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో శనివారం జరిపిన చర్చలు విఫలమైనట్టు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. చర్చల అనంతరం ముద్రగడ మీడియాతో మాట్లాడారు. తన దీక్షను యథావిధిగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక్కమెట్టు కూడా దిగదంటా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఆరోగ్య పరీక్షలు అవసరం లేదని తేల్చి చెప్పారు. మా జాతి కోసం పోరాడతా' అంటూ ముద్రగడ స్పష్టం చేశారు. కాగా, కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష రెండో రోజుకు చేరిన సంగతి తెలిసిందే. -
ముద్రగడ దీక్ష విరమించాలి: నారాయణ
విజయవాడ: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ కోరారు. శనివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ లోగా కమిషన్ నివేదిక వస్తుందని నారాయణ తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ ముద్రగడ ఆమరణ నిరహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఆయన చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ముద్రగడ దీక్షకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రిలే దీక్షలు, ఆందోళనలు ముమ్మరంగా సాగుతున్నాయి. -
ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష
-
కాపు జాతికి న్యాయం కోసమే దీక్ష: ముద్రగడ
* భార్యతో కలసి శుక్రవారం ఉదయం 9 గంటలకు దీక్ష ప్రారంభం * డిమాండ్లు సాధించేవరకు వెనుదిరిగేది లేదన్న ముద్రగడ... నిరాహార దీక్ష విషయంలో ఎలాంటి మార్పూ లేదని ప్రకటన * జాతి కోసం సహధర్మచారిణితోపాటు జీవితం అంకితమిస్తానని వెల్లడి * మధ్యాహ్నం భోజనం మానేసి ఖాళీ కంచాలతో నిరసనలకు పిలుపు * దీక్షపై పోలీసుల ఉక్కుపాదం * జిల్లాయేతరులు తూర్పుగోదావరిలో ప్రవేశించొద్దన్న ఎస్పీ.. జిల్లావాసులు కూడా కిర్లంపూడికి వెళ్లొద్దని సూచన (కిర్లంపూడి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జీవిత భాగస్వామి పద్మావతితో కలిసి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. కాపు జాతికి న్యాయం కోసమే దీక్ష: ముద్రగడ కాపు జాతికి న్యాయం చేయడం కోసమే దీక్ష చేపడుతున్నట్లు ముద్రగడ చెప్పారు. తాను కొత్త డిమాండ్లేమీ పెట్టలేదని, గొంతెమ్మ కోర్కెలేవీ కోరడం లేదని, టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లే నెరవేర్చాలని కోరుతున్నానని చెప్పారు. ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూడకుండా దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు. డిమాండ్లు సాధించేవరకు వెనుదిరిగే ప్రసక్తే లేదని పద్మనాభం అన్నారు. డిమాండ్లను పరిష్కరించే ప్రతిపాదనలతో వస్తే పరిశీలించి తాను తృప్తి చెందితే దీక్ష విరమిస్తానని చెప్పారు. తన దీక్షకు అడ్డుతగలవద్దని తనతో చర్చలకు వచ్చిన వారిని కోరానన్నారు. గత నెల 31న జరిగిన విధ్వంసంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలనీ, అవసరమైతే సీబీఐ చేత విచారణ చేయించాలని కోరినట్లు ముద్రగడ చెప్పారు. కాపు జాతి ప్రయోజనాల కోసం తాను... తన శ్రీమతి పద్మావతి జీవితం అంకితమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. కాపులకు రిజర్వేషన్లు వర్తింపజేసే అంశంపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదన్నారు. దీక్ష చేపడుతున్న తనకు మద్దతు తెలిపే ఉద్దేశంతో పెద్దసంఖ్యలో రావడం వల్ల మరోసారి అసాంఘిక మూకలకు అవకాశం కల్పించినట్లవుతుందన్నారు. ఇది ఆఖరి పోరాటమనీ, ఎవరూ ఆవే శపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. కాకినాడలో జరిగిన సోదరుడి ఆత్మహత్య సంఘటనల వంటివి పునరావృతం కారాదన్నారు. -
ఆమరణ దీక్షకు దిగుదామా?
రెండు మూడ్రోజుల్లో రాష్ట్రపతి వద్దకు టీపీసీసీ నేతలు సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీపై దాడి జరిగినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, వారిపైనే ఎదురుకేసులు నమోదు చేయడంపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలోని అంతర్గత విభేదాలను పక్కనబెట్టి ప్రభుత్వ తీరుపై ఐక్యంగా పోరాడకుంటే రాష్ట్రం టీఆర్ఎస్ రాజకీయ గుత్తాధిపత్యంలోకి పోతుందని పార్టీ ముఖ్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలపై అధికార పార్టీ కక్షసాధింపు ధోరణికి పాల్పడుతోందని, దీన్ని నిరసిస్తూ పీసీసీ చీఫ్ ఆమరణ నిరాహార దీక్షకు దిగితే బాగుంటుందని సూచిస్తున్నారు. పాతబస్తీ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలను తీసుకోవాల్సిన ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోందని అంటున్నారు. ఆమరణ నిరాహారదీక్ష చేయడం ద్వారా ప్రభుత్వ చర్యలను ఎండగడితేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని చెబుతున్నారు. రాష్ట్రపతి వద్దకు... రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని, సెక్షన్ 8ని ఉపయోగించుకుని ప్రతిపక్ష పార్టీల నేతలను కాపాడాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వద్దకు వెళ్లాలని టీపీసీసీ నిర్ణయించింది. అఖిలపక్ష నేతలతో కలసి రెండు, మూడు రోజుల్లో ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. -
నా జాతి కోసం ఏమైనా చేస్తా: ముద్రగడ
కాకినాడ: కాపు గర్జన ఉద్యమం తీవ్రరూపం దాల్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆమరణ దీక్ష ప్రారంభించనున్నట్లు కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనతో పాటు భార్య కూడా ఈ ఆమరణ దీక్షలో కూర్చోనున్నట్లు వెల్లడించారు. కాపులకు రిజర్వేషన్ల సాధనే తన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. తన కాపు జాతి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ముద్రగడ వివరించారు. తనతో చర్చించడానికి ఎవరైనా వస్తే అందుకు తాను సిద్ధమని.. అయితే, కాపులకు న్యాయం జరుగుతుందని భావిస్తే మాత్రమే చర్చల్లో పాల్గొంటానని ముద్రగడ పద్మనాభం వివరించారు. -
డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఆమరణ దీక్ష
వేములవాడ : కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం సంతపల్లి గ్రామ శివారులో బుధవారం మిడ్‌మానేరు ముంపు గ్రామాల ప్రజలు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్షలో సుమారు 12 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ముంపు గ్రామాల ప్రజలు చేపట్టిన దీక్షకు వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. మిడ్‌మానేరు ముంపు గ్రామాల ప్రజలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని, మరో రెండు డిమాండ్లు కూడా నెరవేర్చాలని బాధితులు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
మూడో రోజుకు చేరుకున్న ఆమరణ నిరాహార దీక్ష
సాక్షి, హైదరాబాద్: దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీలు తమ పదవుల నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ సెంట్రల్ యూనివర్సిటీలో ఎనిమిది మంది రీసెర్చ్ స్కాలర్స్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారం మూడో రోజుకు చేరింది. తమకు న్యాయం జరిగే వరకు దీక్షను విరమించబోమని వారు స్పష్టం చేశారు. అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్, ఎన్ఎస్యూఐ, డీఎస్‌యూ, బీఎస్ఎఫ్ తదితర విద్యార్ధి సంఘాలకు చెందిన విద్యార్థులు గుమ్మడి ప్రభాకర్, ఉమామహేశ్వర్, వైఖరి, జయారావు, మనోజన్, కృష్ణయ్య, జైలావ్, రమేశ్ ఈ దీక్షకు దిగారు. జేడీయూ బృందం ఈ రోజు హెసీయూకు చేరుకొని దీక్ష చేస్తున్న విద్యార్థులకు తమ సంఘీభావం తెలుపనున్నారు. దీక్ష చేస్తున్న విద్యార్థుల బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయాయని వైద్యులు తెలిపారు. -
రెండో రోజుకు చేరుకున్న ఆమరణ నిరాహార దీక్ష
సాక్షి, హైదరాబాద్: దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీలు తమ పదవుల నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ సెంట్రల్ యూనివర్సిటీలో ఎనిమిది మంది రీసెర్చ్ స్కాలర్స్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష గురువారం రెండో రోజుకు చేరింది. తమకు న్యాయం జరిగే వరకు దీక్షను విరమించబోమని వారు స్పష్టం చేశారు. అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్, ఎన్ఎస్యూఐ, డీఎస్‌యూ, బీఎస్ఎఫ్ తదితర విద్యార్ధి సంఘాలకు చెందిన విద్యార్థులు గుమ్మడి ప్రభాకర్, ఉమామహేశ్వర్, వైఖరి, జయారావు, మనోజన్, కృష్ణయ్య, జైలావ్, రమేశ్ ఈ దీక్షకు దిగారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం హెచ్సీయూకు రానున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా హెచ్‌సీయూను సందర్శించనున్నారు. రేపు జేడీయూ బృందం హెసీయూకు చేరుకొని దీక్ష చేస్తున్న విద్యార్థులకు తమ సంఘీభావం తెలుపనున్నారు. -
రేపు సీఎం క్యాంపు ఆఫీస్ ముట్టడి
విజయవాడ(గాంధీనగర్) : వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు ఆ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు వీవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. లెనిన్ సెంటర్లో వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష సోమవారం రెండో రోజుకు చేరింది. మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ 50 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ ఎంత కాలమైనా తమ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. -
వీఆర్ఏల దీక్ష భగ్నం.. పరిస్థితి ఉద్రిక్తం
-
వీఆర్ఏల దీక్ష భగ్నం.. పరిస్థితి ఉద్రిక్తం
విజయవాడ: విజయవాడ లెనిన్ సెంటర్లో వీఆర్ఏలు సాగిస్తున్న నిరసన దీక్షలు శనివారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. నాలుగు రోజులుగా నిరాహార దీక్షల్లో పాల్గొంటున్న కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారటంతో పోలీసులు దీక్షలను భగ్నం చేశారు. ఈ నేపథ్యంలో వీఆర్ఏలు పోలీసులను అడ్డుకోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుని ఉద్రికత్త పరిస్థితికి దారితీసింది. ఈ తోపులాటలో పలువురు వీఆర్ఏలకు గాయాలయ్యాయి. ఆరోగ్యం విషమించిన ఐదుగురిని బలవంతంగా ఆస్పత్రికి, దాదాపు 20 మందిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు దీక్ష శిబిరాన్ని ఎత్తివేయటంతో ఆగ్రహానికి గురైన వీఆర్ఏలు పెద్ద సంఖ్యలో ఏలూరు రోడ్డులో రాస్తారోకోకు దిగారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో లక్ష్మణ్ అనే వీఆర్ఏ పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్‌లో తరలించినట్టు తెలిసింది. దాంతో వీఆర్ఏలలో ఆందోళన నెలకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, కనీస వేతనాల కోసం నాలుగు రోజులుగా ఐదుగురు వీఆర్ఏలు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రత్యేకాంధ్ర కోసం ఆమరణ దీక్ష ఆరంభం
ఆ నేడు నిన్నమొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కలిసి ఉన్నట్టే ఆంధ్ర, తమిళనాడు కలిసి ఉండేవి. దానినే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం అనేవారు. అయితే తెలుగు భాష మాట్లాడేవారందరి కోసం ఒక ప్రత్యేక తెలుగు రాష్ట్రం కావాలని కోరుతూ నెల్లూరు జిల్లాకు చెందిన పొట్టి శ్రీరాములు అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంటిలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. అంతకు ముందే ఆయన అనేక పర్యాయాలు అనేక సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్షలు చేసి, వాటిని సాధించారు. ఆ తర్వాత ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ఆయన ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. దాదాపు రెండు నెలలపాటు అంటే 57 రోజుల పాటు ఆయన మరణించే వరకు దీక్ష ను కొనసాగించారు. ఆయన మరణంతో కేంద్రప్రభుత్వం దిగి వచ్చింది. డిసెంబర్ 19న ప్రత్యేక ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నాటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటించారు. ఆయన దీక్షకు గుర్తుగా 2008లో నెల్లూరు జిల్లాను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు మార్చారు. అంతేకాదు, హైదరాబాద్ నాంపల్లిలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరిట యూనివర్శిటీని నెలకొల్పారు. -
ఆసుపత్రి నుంచి వైఎస్ జగన్ డిశ్చార్జి
-
ఆసుపత్రి నుంచి వైఎస్ జగన్ డిశ్చార్జి
ప్రతిపక్ష నేత ఆరోగ్యం మెరుగుపడిందన్న వైద్యులు యూరిక్ యాసిడ్ మినహా రిపోర్టులన్నీ నార్మల్కు చేరుకున్నాయని వెల్లడి హైదరాబాద్‌లోని ఇంటికి చేరుకున్న జగన్ సాక్షి, గుంటూరు/విమానాశ్రయం(గన్నవరం)/ హైదరాబాద్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి(జీజీహెచ్)లో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో డిశ్చార్జి అయ్యారు. తనకు రెండు రోజులుగా వైద్య సేవలందించిన వైద్యుల బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రోడ్డు మార్గంలో కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ వెళ్లారు. జగన్ వెంట మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతి తదితరులు ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం నిరాహార దీక్ష చేస్తున్న జగన్‌ను మంగళవారం తెల్లవారుజామున 4.10 గంటలకు పోలీసులు బలవంతంగా జీజీహెచ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఆసుపత్రికి చేర్చే సమయానికి జగన్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని గుర్తించిన వైద్యులు ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. మంగళవారం 3 ప్లస్‌గా ఉన్న కీటోన్ బాడీస్ బుధవారానికి నెగటివ్‌కు చేరాయి. దీంతో జగన్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు వైద్యుల బృందం నిర్ధారణకు వచ్చింది. ఒక్క యూరిక్ యాసిడ్ మినహా మిగతా రిపోర్టులన్నీ నార్మల్కు చేరుకున్నాయని గుర్తించింది. యూరిక్ యాసిడ్ అదుపులోకి వచ్చేందుకు మందులు వాడాలని జగన్‌కు సూచించామని, అందుకు ఆయన అంగీకరించారని వైద్యులు తెలిపారు. గుంటూరు జీజీహెచ్‌లో వైఎస్ జగన్‌ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కలిశారు. జగన్‌ను చూసేందుకు మహిళలు, వృద్ధులు, విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఆయన వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కొందరు మహిళలు ఆసుపత్రి నుంచి వెళ్తున్న జగన్‌కు గుమ్మడికాయతో దిష్టి తీశారు. నిలకడగా జగన్ ఆరోగ్యం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రిపోర్టులన్నీ నార్మల్‌గా రావడంతో డిశ్చార్జి చేశామని ఆయనకు వైద్య చికిత్సలు అందించిన వైద్యుల బృందం ఇన్చార్జి డాక్టర్ పురుషోత్తమరావు తెలిపారు. బుధవారం జగన్‌కు రెండుసార్లు యూరిన్ పరీక్ష నిర్వహించామని చెప్పారు. మంగళవారం యూరిన్‌లో కీటోన్ బాడీస్ 3 ప్లస్‌గా ఉన్నాయని, బుధవారం పరీక్షించగా నెగటివ్ రిపోర్టులు వచ్చాయని పేర్కొన్నారు. మంగళవారం బీపీ 130/80, పల్స్ రేట్ 55, బ్లడ్ షుగర్ 121, యూరిక్ యాసిడ్ 13.2, బరువు 72.8గా ఉన్నాయని, బుధవారం పరీక్షలు నిర్వహించగా బీపీ 120/80, పల్స్ రేట్ 72, బ్లడ్ షుగర్ 109, యూరిక్ యాసిడ్ 9.9, బరువు 72 కేజీలుగా ఉన్నారని వివరించారు. యూరిక్ యాసిడ్ మినహా మిగతా రిపోర్టులన్నీ నార్మల్‌గా ఉన్నాయన్నారు. యూరిక్ యాసిడ్ తగ్గడానికి కొంత సమయం పడుతుందని, మందులు ఇచ్చామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జగన్ బుధవారం లిక్విడ్స్తోపాటు ఘన పదార్థాలు తీసుకున్నారని తెలిపారు. ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం గన్నవరం విమానాశ్రయం నుంచి బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ జగన్‌కు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం జగన్ లోటస్‌పాండ్‌లోని ఇంటికి చేరుకున్నారు. -
జగన్‌కు ఘన వీడ్కోలు
రాష్ట్ర ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి బుధవారం జిల్లా ప్రజలు ఘన వీడ్కోలు పలికారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుంటూరు వేదికగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఆయనను ఏడవ రోజు మంగళవారం తెల్లవారు జామున పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయనను వైద్యులు బుధవారం సాయంత్రం డిశ్చార్జి చేయడంతో బయలుదేరి హైదరాబాద్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్దకు భారీగా ప్రజలు తరలివచ్చి వీడ్కోలు పలికారు. -సాక్షి, గుంటూరు గుంటూరు : ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరురోజులపాటు చేసిన నిరవధిక నిరాహార దీక్ష పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఉత్తేజాన్ని కలిగించింది. ఆ స్ఫూర్తితో రాజధాని శంకుస్థాపనకు జిల్లాకు రానున్న దేశప్రధాని నరేంద్రమోదీపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు. పార్టీ ప్రకటించిన కార్యాచరణ ప్రణాళికను అమలులోకి తీసుకువచ్చేందుకు గ్రామస్థాయి నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. విషమించిన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీక్షను ఉపసంహరించుకోవాలని వైద్యులు, పార్టీ సీనియర్లు పలుమార్లు విజ్ఞప్తి చేసినా మారని జగన్ వైఖరి మేధావి, విద్యార్థి లోకాన్ని ఆలోచింప చేస్తే, మహిళాలోకాన్ని కదిలించి వేసింది. పార్టీతో సంబంధం లేని కొన్ని వర్గాలు సడలని జగన్ దీక్షా, దక్షతలను కొనియాడాయి. కొన్ని రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలు, ఆశయాలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ జగన్ చేపట్టిన ఈ దీక్షకు సంఘీభావం పలికాయి. ఈ పరిణామాలన్నీ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్‌కు పరామర్శల వెల్లువ ... ఈ నెల 7వ తేదీన గుంటూరు నల్లపాడు రోడ్డులో వైఎస్ జగన్ ప్రారంభించిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు 13 వ తేదీ తెల్లవారుజామున భగ్నం చేశారు. విషమించిన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జగన్‌కు బలవంతంగా ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ ఎక్కించారు. 24 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో స్థానిక ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆస్పత్రిలోనూ జగన్‌ను పరామర్శించేందుకు పార్టీ సీనియర్ నేతలతోపాటు మేథావి వర్గానికి చెందిన లావు రత్తయ్య వంటి ప్రముఖులు తరలివచ్చారు. ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో బుధవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి హైదరాబాద్ వెళ్లారు. అమలులోకి కార్యాచరణ .. పార్టీ ప్రకటించిన కార్యాచరణ ప్రణాళికను నేతలు అమలులోకి తీసుకువచ్చారు. బుధవారం మధ్యాహ్నం విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వరకు తలపెట్టిన ‘నిరసన మార్చ్’ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ నేతృత్యంలో విజయవాడ తరలివెళ్లిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను అక్కడి పోలీసులు అరెస్టుచేశారు. నిరసన మార్చ్‌కు అనుమతి లేదని పోలీసులు ఈ చర్య తీసుకోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో దుర్మార్గ పాలన కొనసాగుతోందని, ముఖ్య మంత్రి చంద్రబాబుకు రాష్ట్ర ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీలే అవసరమని భావిస్తూ ఈ పోరాటాలను అణచివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని గుంటూ రు జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ విజయవాడలో నిరసన మార్చ్ నుంచి సాక్షి ప్రతినిధికి ఫోన్లో వివరించారు. రిలే నిరాహార దీక్షలపై సమావేశాలు ... ఈ నెల 17 నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టనున్న నిరసన కార్యక్రమాల ఏర్పాట్లపై నాయకులు బుధవారం కొన్ని చోట్ల సమావేశం అయ్యారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయవాడలోని నిరసన మార్చ్‌కు హాజరుకావడంతో ఆయన సోదరుడు పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యనేతల సమావేశం జరిగింది. మిగిలిన నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు సమావేశమై నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని పక్కాగా అమలు పరిచి రాజధాని శంకుస్థాపనకు హాజరుకానున్న ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యేక హోదా పట్ల ప్రజల ఆకాంక్షను వివరించేందుకు సమాయత్తం అవుతున్నారు. -
పెల్లుబికిన నిరసన
జగన్‌దీక్ష భగ్నం చేయడాన్ని నిరసిస్తూ గాజువాకలో వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ తిప్పల నాగిరెడ్డితోపాటు పార్టీశ్రేణులు స్టీల్‌ప్లాంట్ గేటు ఎదురుగా కూర్మన్నపాలెం సెంటర్లో ధర్నా చేశారు. మునగపాకలో మంత్రులు కామినేని శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావుల దిష్టిబొమ్మలను చెప్పులతో కొడుతూ ఊరేగించారు. అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ ఇక్కడి ఆందోళనలో పాల్గొన్నారు.యలమంచిలిలోని వైఎస్సార్ కూడలిలో జరిగిన ఆందోళనలో పార్టీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు..పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. జగన్ క్షేమం కోరుతూ పాయకరావు పేటలో శ్రీరాధారుక్మిణి సహిత పాండురంగస్వామి దేవస్థానంలో 101 కొబ్బరి కాయుల కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జెడ్పీ ప్లోర్ లీడర్ చిక్కాల రామారావు తదితరులు పాల్గొన్నారు.నర్సీపట్నంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు.నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ పాల్గొన్నారు.మాకవారపాలెంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి.ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట విద్యార్థులు రాస్తారోకో చేశారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ గత ఏడు రోజులుగా వైఎస్ జగన్ చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షను భగ్నం చేయడం ప్రభుత్వానికి తగదని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అన్నారు. దీక్షను భగ్నం చేయడం పట్ల అరకులో ఆయన నిరసన వ్యక్తం చేశారు.{పభుత్వ తీరుపై పాడేరు ఎంఎల్ఎ గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రకటించారు. హుకుంపేటలో వైఎస్సార్సీపీ శ్రేణులు మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైఎస్ జగన్ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రత్యేక హోదా కోసం ఉద్యమం సాగిస్తారని పార్టీ నేతలు పేర్కొన్నారు. -
జగన్‌కు న్యూడెమోక్రసీ నేతల మద్దతు
గుంటూరు వెస్ట్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీగుంటూరు జిల్లా కమిటీ సోమవారం పూర్తి మద్దతు ప్రకటించింది. ప్రత్యేక హోదా కోరుతూ నగరంలో భారీ ప్రదర్శన జరిపింది. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన సభలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మయ్య మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా కావాల్సిందేనని తెలిపారు. హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మొండి వైఖరిని ఆయన తప్పుపట్టారు. ప్రత్యేక హోదా సాధనకు ఆరు రోజుల నుంచి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న నిరవధిక నిరాహారదీక్ష న్యాయమైనదని తెలిపారు. ఆ దీక్షను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు బలపరచాలని కోరారు. అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకలప్రసాద్, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ర్ట అధ్యక్షురాలు ఎన్.విష్ణు, పార్టీ నాయకులు ఇందుర్తి సుబ్బయ్య, నక్కా పోతురాజు, పీవో డబ్ల్యు నాయకురాలు పి.శివపార్వతి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
దీక్షపై రాజకీయకుట్ర
-
నాలుగోరోజుకు చేరిన వైఎస్ జగన్ నిరవధిక దీక్ష
-
నాలుగోరోజుకు చేరిన వైఎస్ జగన్ నిరవధిక దీక్ష
గుంటూరు: ‘ప్రత్యేక హోదా-ఏపీ హక్కు’ అనే నినాదంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష శనివారం నాలుగోరోజుకు చేరింది. వైఎస్ జగన్ చేపట్టిన దీక్షకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. విద్యార్థినీ, విద్యార్థులు, నిరుద్యోగ యువకుల కోలాహలం దీక్షా వేదిక వద్ద ఎక్కువగా కనిపిస్తోంది. బీపీ, షుగర్, పల్స్ సాధారణ స్థితిలోనే ఉన్నాయని శుక్రవారం రాత్రి వైద్యులు వెల్లడించారు. విద్యావేత్తలు స్వచ్ఛందంగా తమ మద్దతు ప్రకటించి, ప్రత్యేకహోదా ద్వారానే అభివృద్ధి సాధ్యమన్న వైఎస్ జగన్ అభిప్రాయంతో గొంతు కలుపుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోను ధర్నాలు, రాస్తారొకోలు, బైక్‌ర్యాలీలు, కేంద్ర కార్యాలయాల ముట్టడి వంటి నిరసన కార్యక్రమాలు గత మూడు రోజులుగా కొనసాగుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం గుంటూరులోని నల్లపాడులో బుధవారం నాడు వైఎస్ జగన్ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన విషయం అందరికి విదితమే. -
ఉద్యమ స్ఫూర్తి
వైఎస్ జగన్ దీక్షకు వెల్లువెత్తిన వివిధ వర్గాల మద్దతు ► అ నియోజకవర్గాల్లో సంఘీభావ దీక్షలు ప్రారంభించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ► వాషింగ్టన్లో పార్టీ ఎన్ఆర్ఐ విభాగం నిరాహార దీక్షలు ► దర్గాలో ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం పెద్దలు ► ర్యాలీలతో కిక్కిరిసిన గుంటూరు నగర రహదారులు ► జగన్‌తో సెల్ఫీలు తీసుకున్న యువతీయువకులు ► ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పేరుపేరునా పలకరించిన జగన్ జననేత జగన్‌కు మద్దతుగా దారులన్నీ జన ఏరులవుతున్నాయి... అన్ని వర్గాలు ఉద్యమ స్ఫూర్తితో రగులుతున్నాయి... మన కోసమే దీక్ష చేపట్టారంటూ ఉరుకుతున్నాయి... ప్రత్యేక హోదాతోనే ప్రగతి సాధ్యమని నమ్ముతున్నాయి... కదనరంగానికి అన్నట్టు దీక్షాప్రాంగణానికి కదులుతున్నాయి... సంకల్ప సిద్ధిని కాంక్షిస్తూ విపక్ష నేత నుదుట సిందూరం దిద్దుతున్నాయి... మీ పక్షానే మేము... మీ బాటను వీడబోమంటూ బాస చేస్తున్నాయి.. ఈ పోరాటంలో మీ శ్వాసకు ఊపిరిమవుతామంటూ భరోసా నిస్తున్నాయి.. ఆశయ సాధనలో జగన్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాయి... సాక్షి ప్రతినిధి, గుంటూరు : ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారం రెండో రోజుకు చేరుకుంది. ఉదయం 7.30 గంటల సమయంలో దీక్షకు కూర్చున్న జగన్ చెరగని చిరునవ్వుతో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పదేళ్ల చిన్నారుల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు జగన్‌ను కలసిన వారిలో ఉన్నారు. కొందరు తమ కష్టాలు, బాధలు చెప్పుకుంటే, మరికొందరు రాష్ట్ర భవిష్యత్ కోసం జగన్ చేపట్టిన దీక్షకు సంఘీభావం పలికారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ, లోక్‌సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు గద్దె వెంకటేశ్వరరావు, జీజీహెచ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం, జిల్లా రెల్లి కులస్తుల సంఘం, వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు, రాజధాని రైతులు, వ్యవసాయ కార్మికులు జగన్‌ను కలసి తమ సంఘీభావం తెలిపారు. మద్దతు తెలిపిన ముస్లిం పెద్దలు... ముస్లిం పెద్దలు జగన్ ఆరోగ్యం కోసం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయన పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీనేతలు, కార్యకర్తలు నిరాహార దీక్షలు ప్రారంభించారు. మరో వైపు వాషింగ్టన్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్ఆర్ఐ విభాగ ప్రతినిధులు జగన్ దీక్షకు మద్దతుగా నిరాహార దీక్షలు చేపట్టారు. ఎక్కడో ఉండి జగన్ దీక్షకు మద్దతు పలికిన ఎన్ఆర్ఐ విభాగాన్ని పార్టీ సభాముఖంగా అభినందించింది. ఓ చిన్నారికి విజయమ్మగా నామకరణం ఉదయం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వివిధ వర్గాల ప్రజలు జగన్‌ను వ్యక్తిగతంగా కలుసుకున్నారు. కొందరు ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించి దీక్షకు చేరుకోవడంతో నగరంలోని రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. యువతీ యువకులు జగన్‌తో సెల్ఫీలు తీసుకోవడానికి ఉత్సాహం చూపారు. స్థానిక స్వర్ణభారతీ నగర్‌కు చెందిన షేక్ మస్తాన్ బీ తన కుమార్తెకు జగన్‌తో విజయమ్మ అని నామకరణం చేయించుకుంది. ఆకట్టుకున్న వైఎస్సార్ సీపీ నేతల ప్రసంగాలు.. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నా యకులు ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్ర యోజనాలు, చంద్రబాబు మోసపూరిత విధానాలపై చేసిన ప్రసంగాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఉద్యోగం కావాలన్నా, సాగునీరు కావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, వస్తువుల రేట్లు తగ్గాలన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పదని, దాని సాధన కోసం ఐక్యంగా పోరాటం సాగిద్దామన్న నేతల ప్రసంగాలకు ప్రజలు సాను కూలంగా స్పందించి జగన్ వెన్నంటి ఉంటామన్నా రు. నేతల ప్రసంగాలు లేని సమయాల్లో ప్రత్యేకంగా రూపొందించిన జగన్ ప్రసంగాలను ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శిం చారు. చట్టసభల సాక్షిగా మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబా బు ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను మోసగించిన విధానాలను ఈ స్క్రీన్లపై చూపారు. వీటికి స్పందించిన విద్యార్థుల ఈలలు, చప్పట్లు, కేకలతో శిబిరం దద్దరిల్లింది. పార్టీ రూపొందించిన ప్రత్యేక పాటలు, వంగపండు ఉష బృందం సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. దీక్ష రెండవ రోజు కావడంతో ప్రభుత్వ వైద్యుల బృందం జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించింది. పోటెత్తిన జనం ఉదయం నుంచే దీక్షా శిబిరం వద్ద జనం పోటెత్తారు. ఉదయం 7.30 గంటల ప్రాం తంలో దీక్షలో పాల్గొన్న జగన్ అప్పటికే శిబిరంలో వేచి ఉన్న ప్రజలను కలుసుకునే అవకాశం కల్పించారు. వివిధ వర్గా ల ప్రజలు వేదికపై ఉన్న జగన్‌ను కలుసుకుని అభినందనలు తెలిపారు. దీక్ష ముగి సే వరకు ఆయన నాయకులు, కార్యకర్తలు, విద్యార్థినీ, విద్యార్థులను పేరుపేరునా పలకరించారు. పార్టీ సీనియర్లతో చర్చించారు. సాయంత్రం జిల్లాలోని వివిధ ని యోజకవర్గాలతో పాటు నగరంలోని ప్రజలంతా ఒకేసారి శిబిరం వద్దకు చేరుకోవడంతో ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. వేదికపై ఉన్న జగన్‌ను చూసేం దుకు కొందరు అభిమానులు కుర్చీలపైకి ఎక్కడంతో కొన్ని విరిగిపోయాయి. ఒక దశలో పోలీసులు వారిని నియంత్రించలేని పరిస్థితి నెలకొంది. ‘కేంద్రం కదిలివస్తుందనే నమ్మకం ఉంది’.. ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి వచ్చిన బి. వెంకటరమణ ప్రత్యేక హోదా సాధనకు కృషి చేస్తున్న జగన్‌కు మద్దతుగా నిలుస్తానన్నారు. ఆయన దీక్షకు కేంద్రం కదలివస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. కృష్ణాజిల్లా జి.కొండూరుకు చెందిన జి.రంజిత్ మాట్లాడుతూ జగన్ చేస్తున్న దీక్షకు చివర వరకు అండగా ఉంటానని, ఎన్ని ఉద్యమాలు, కార్యక్రమాలు చేసినా పాల్గొంటానని చెప్పారు. ముఖ్యమంత్రి మాటలు ఎవరూ విశ్వసిం చడం లేదన్నారు. శిబిరంలో వైఎస్సార్ సీ పీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, గుం టూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), కోన రఘుపతి, నేతలు మేరుగ నాగార్జున, ఎండీ నసీర్ అహ్మద్, రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము), ఆతుకూరి ఆంజనే యులు, కావటి మనోహరనాయుడు, పోలూరి వెంకటరెడ్డి, లావు శ్రీకృష్ణదేవ రాయులు, నూనె ఉమామహేశ్వరరెడ్డి, షేక్ గులాం రసూల్, మొగిలి మధు, సయ్యద్‌మాబు, బండారు సాయిబాబు, కొత్తా చిన్నపరెడ్డి, తిప్పారెడ్డి రామకృష్ణా రెడ్డి, ఉత్తమ్‌రెడ్డి, దేవళ్ల రేవతి, అంగడి శ్రీనివాసరావు, కొలకలూరి కోటేశ్వరరావు, డైమండ్‌బాబు, శిఖా బెనర్జీ, ఏలికా శ్రీకాంత్‌యాదవ్, కోట పిచ్చిరెడ్డి, ఆతుకూరి నాగేశ్వరరావు, గనిక ఝాన్సీరాణి, పల్లపు రాఘవ, పానుగంటి చైతన్య, షేక్ జానీ, ఆవుల సుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్ పోరాటస్ఫూర్తి అభినందనీయం రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం వై.ఎస్.జగన్ చేస్తున్న నిరాహార దీక్ష, ఆయన పోరాట స్ఫూర్తి అభినందనీయం. చరిత్ర గల గుంటూరులో నిరాహార దీక్ష చేయడం హర్షనీయం. రాష్ట్రం తిరిగి కోలుకోవాలంటే ప్రత్యేక హోదా కచ్చితంగా ఇవ్వాల్సిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవర్చలేదు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి కచ్చితంగా సంజివినే. - గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రాయచోటి ఓటుకు కోట్లు కేసులో బాబు నగ్నంగా దొరికాడు ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నగ్నంగా దొరికారు. దాని నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదా అంశాన్ని మోదీ వద్ద తాకట్టు పె ట్టారు. రాష్ట్రం విడిపోయిన సమయంలో ప్రత్యేక హోదా కల్పిస్తామని పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాన మంత్రి ఇచ్చిన హామీ అమలు చేయకపోతే పార్లమెంటు వ్యవస్థపై నమ్మకం పోతుంది. పార్లమెంటులో ఐదు సంవత్సరాలు ఇస్తామంటే కాదు పది సంవత్సరాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీజేపీ ఇప్పుడు మాట మారుస్తుంది. - జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే , గురజాల చంద్రబాబుది బాధ్యతారాహిత్యం ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల హక్కు. అటువంటి హోదా సంజీవిని కా దని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం హేయం. ప్రత్యేక హోదా కోసం బీజేపీపై పోరాటం చేయాల్సిన చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకే వైఎస్ జగన్ చేస్తున్న దీక్షకు ప్రజలు మద్దతు పలకాలి. హోదా సాధించుకోవాలి. - కొత్తా చిన్నపరెడ్డి, వైఎస్సార్ సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మంత్రులు భాష మార్చుకోకుంటే బుద్ధి చెబుతాం ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్న వై.ఎస్.జగన్ పై రాష్ట్ర మంత్రులు సిగ్గు లేని భాష మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా తీసుకురావడం చేతకాకపోగా, దీక్ష చేస్తున్న జగన్‌ను విమర్శించడం మంత్రుల అవివేకానికి నిదర్శనం. మంత్రి దేవినేనికి వంద జన్మలెత్తినా జగన్‌ను విమర్శించే అర్హత రాదు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చి నిరుద్యోగ సమస్య తీరుతుంది. దీక్షకు లక్షలాది మంది ప్రజలు సంఘీభావం తెలపాలి. - బొల్లా బ్రహ్మనాయుడు, వైఎస్సార్ సీపీ వినుకొండ నియోజకవర్గ ఇన్చార్జి ఇది రాష్ట్రమా.. రావణ కాష్టమా..? ఇది రాష్ట్రమా.. రావణ కాష్టమా.. చంద్రబాబు పాలనా ఫలితమో.. అయ్యగారి జాతకమేమిటోగానీ వస్తూనే కరువు తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేసే నాయకుడి మీద మంత్రులు అవాకులు చెవాకులు పేలుతున్నారు. జగన్ చేస్తున్న దీక్ష దగ్గరకు వచ్చి దీక్ష నాటకమని మాట్లాడితే ప్రజలు చెప్పులతో కొడతారు. చంద్రబాబు క్యాబినెట్ స్వార్ధపరుల గుంపు. వీల్లు రాజకీయ నాయకులు కాదు.. రాజకీయ రాబంధులు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి హెరిటేజ్‌కు లాభాలు వస్తున్నాయి. చంద్రబాబు రోబో లాంటివాడు. - వాసిరెడ్డి పద్మ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి -
హోదాతోనే అభివృద్ధి..
తమ ప్రసంగాల్లో నొక్కిచెప్పిన నేతలు గుంటూరు: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందని పలువురు నేతలు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా సాధన కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష వేదికపై గురువారం పలువురు నేతలు మాట్లాడారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి కచ్చితంగా సంజీవనేనని.. పరిశ్రమలు రావాలన్నా, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలగాలన్నా, ప్రత్యేక హోదా రావాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.ప్రత్యేక హోదా రాదనే ఆందోళనలో ఆత్మ బలిదానాలు చేసుకున్న అమర వీరుల ప్రాణ త్యాగాలు వృథా కాకూడదని లోక్‌సత్తా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గద్దె వెంకటేశ్వరరెడ్డి అన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు లోక్‌సత్తా పార్టీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకపోతే ప్రజాకోర్టులో మొదటి ముద్దాయిగా నిలబడాల్సి ఉంటుందని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేసే నాయకుడి మీద మంత్రులు అవాకులు చెవాకులు పేలుతున్నారని.. జగన్ చేస్తున్న దీక్ష దగ్గరకు వచ్చి దీక్ష నాటకమని మాట్లాడితే ప్రజలు చెప్పులతో కొడతారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు కోసం జగన్ చేస్తున్న నిరవధిక దీక్షను అడ్డుకోవడం చంద్రబాబు తరం కాదుకదా, వాళ్ల బాబు తరం కూడా కాదని ఎమ్మెల్యే రోజా చెప్పారు. ‘ప్రత్యేక హోదా కోసం జగన్ చేస్తున్న దీక్ష తప్పని నిరూపించే ధైర్యం మీకుందా? పబ్లిక్‌గా చర్చకు వస్తారా? ఇది నా సవాల్’ అని అన్నారు. జగన్‌పై మంత్రుల వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. ముఖ్యమంత్రి తనయుడు లోకేష్‌కు జాబ్ లేదని, అయినా ఆయన ఏడాదిన్నర కాలంలోనే రూ. 2.5 లక్షల కోట్లు దోచుకున్నారని పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి విమర్శించారు. రాష్ట్ర రాజధాని శంకుస్థాపన నిర్వహించేందుకు 22న జిల్లాకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటన చేయించాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తెలుగుజాతి భవిష్యత్తు కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జగన్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష చరిత్రలో మిగిలిపోతుందని నటుడు విజయచందర్ చెప్పారు. -
వైఎస్ జగన్ కు మరోసారి వైద్య పరీక్షలు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడం కోసం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గురువారం రాత్రి మరోసారి వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఏపీ ప్రత్యేక హోదా కోరుతూ ఆయన బుధవారం గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. దీంతో వైఎస్ జగన్ చేపట్టిన దీక్ష నేటికి రెండో రోజుకు చేరుకోవడంతో ఆయనకు రెండోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈరోజు ఉదయం వైఎస్ జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
రెండో రోజుకు చేరిన వైఎస్ జగన్ నిరవధిక దీక్ష
-
రెండో రోజుకు చేరిన వైఎస్ జగన్ నిరవధిక దీక్ష
గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఉన్న జాబులను తీసేశారని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై సీఎం పూటకోమాట మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. ప్రత్యేక హాదా కావాలని వీధివిధినా మాట్లాడిన బాబు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో రోజు కూడా దీక్షా స్థలానికి భారీ ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం బుధవారం గుంటూరులోని నల్లపాడులో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం విదితమే. -
హోరెత్తిన యువతరంగం..
- జగన్‌కు మద్దతుగా తరలివచ్చిన యువతీయువకులు - నిరవధిక నిరాహార దీక్షకు పోటెత్తిన జనసందోహం సాక్షి, విజయవాడ బ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు అపూర్వ స్పందన లభించింది. దీక్షకు మొదటి నుంచీ ప్రభుత్వం అడ్డంకులు కల్పించినా, భారీగా జనసందోహం తరలి వచ్చింది. ప్రత్యేకించి ఈ దీక్షలో యువత ఉత్సాహంగా పాలుపంచుకుంది. ప్రత్యేకహోదా ఆవశ్యకతపై అవగాహన ఉన్న యువతీయువకులు జగన్ దీక్షకు మద్దతుగా నిలిచారు. గుంటూరు నగరం బుధవారం ఉదయం నుంచే జనంతో నిండిపోయిం ది. బెజవాడలో కనకదుర్గమ్మ ఆశీర్వాదం తీసుకుని దీక్షాస్థలికి బయలుదేరిన జగన్‌కు గుంటూ రు జిల్లా పెదకాకాని వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీస్థాయిలో మోటార్ సైకిళ్లు, కార్ల ర్యాలీతో జగన్మోహన్రెడ్డిని దీక్షా ప్రాంగణం వరకూ తీసుకొచ్చారు. భారీగా జనం రావడంతో పెదకాకాని నుంచి గుంటూరులో దీక్ష జరిగే నల్లపాడు చేరుకోవడానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. ఆత్మార్పణ చేసుకున్న వారికీ నివాళులు సరిగ్గా మధ్యాహ్నం 2.15 గంటలకు వేదికపైకి వచ్చిన జగన్మోహన్రెడ్డి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతిమకు పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రత్యేక హోదా రాదనే ఆం దోళనతో ప్రాణ త్యాగం చేసిన నెల్లూరు జిల్లాకు చెందిన లక్ష్మయ్య, వల్లం రమణయ్య, తిరుపతికి చెందిన మునికోటి, కడపకు చెందిన ధనుముల లోకేశ్వరరావు, కృష్ణా జిల్లాకు చెందిన సిరిపురపు ఉదయభాను ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక హోదా ఆవశ్యకత, దానివల్ల వల్ల వచ్చే ప్రయోజనాలు, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలు హోదాతో ఎలా అభివృద్ధి చెందాయనే విషయాలను తన ప్రసంగంలో జగన్ వివరించారు. హాజరైన ముఖ్యనేతలు... దీక్షలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, ముఖ్యనాయకులు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెనుమత్స సాంబశివరాజు, ఎంపీలు వై.వి.సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.ఎస్.అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వరప్రసాద్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యానికి ‘చంద్ర’గ్రహణం
రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించుకోగల అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. ప్రజల ఆకాంక్షకు అద్దంపడుతున్న ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను సహించలేకపోతోంది. ‘‘రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవా లని చూసేవారి ఆటలు సాగ వ్. ఎవరైనా సరే... అరాచకా లకు పాల్పడితే అణచివేస్తాం. మీరు రాష్ట్రాభివృద్ధికి కలిసి వస్తే సంతోషం. కోలుకునే పరి స్థితుల్లో రాష్ట్రాన్ని దెబ్బకొట్టవ ద్దు. గతంలో రౌడీలను ఎలా పారద్రోలామో అలాగే వ్యవ హరిస్తాం. రాజీపడం’’ ఇది స్వయానా రాష్ట్ర ముఖ్య మంత్రిగారి బెదిరింపు హెచ్చరిక. ప్రధాన ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం తలపెట్టిన నిరవధిక నిరాహారదీక్షను ఉద్దేశిస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 25న విజయవాడలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వాడిన తీవ్ర పదజాలం. దీనికి ఒక రోజు ముందు, సెప్టెంబర్ 24న న్యూఢిల్లీలో మీడియాతో తీవ్రస్వరంతో దీక్ష చేసి ప్రాణం తీసుకుంటానంటే పర్మిషన్ ఇవ్వాలా? రోడ్డు మీద కూర్చొని దీక్ష చేస్తే ఊరుకోవాలా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆయన మాటలు విన్న ప్పుడు... ఎట్టి పరిస్థితుల్లోనూ వై.ఎస్. జగన్ దీక్ష చేయ టానికి అంగీకరించం అనే పట్టుదల కనిపించింది. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమైన ప్రధాన ప్రతిపక్షనేతను ఉద్దేశిస్తూ బాధ్యతగల సీఎం ఇటువంటి పరుష పదజాలంతో హెచ్చరికలు చేయడం గతంలో ఎప్పుడూ వినలేదు... చూడలేదు. ప్రతిపక్ష నేత ఏ పరిస్థితుల్లో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చోవలసి వచ్చిందో గ్రహించడానికి... అర్థం చేసుకోవడానికి అధికార పార్టీ సిద్ధంగా లేదు. నవ్యాంధ్ర 16 నెలలపసిబిడ్డ అని, ఎన్నోకష్టాలు, ఇబ్బందులు పడు తూ పెంచుకుంటూ వస్తున్నామని, ఇప్పుడు బురదజ ల్లితే రాష్ట్రానికి ప్రజలకు నష్టమని ముఖ్యమంత్రి చంద్ర బాబు అదే మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. సీఎం చెప్పినట్లు కొత్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటోంది. అందులో మరో అభిప్రాయా నికి తావులేదు. అయితే, ఇందులో కొన్ని సమస్యలు విభజనవల్ల సంక్రమిస్తే... మిగతావి తెలుగుదేశం ప్రభు త్వ అనాలోచిత విధానాల వల్ల వచ్చిపడినవి. అటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి ప్రత్యేక హోదా సంజీవనిగా ఉపయోగపడుతుంది. అందుకే రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు చర్చల మేరకు, ఆఖరి యూపీఏ కేబినెట్ నిర్ణయాల మేరకు, ఆనాటి బీజేపీ, టీడీపీల ఎన్నికల వాగ్దానాల మేరకు రావాల్సిన ప్రత్యేక హోదాను సాధించుకుందామని ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే 16 నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న ఉదాసీన వైఖరి, అసలు ప్రత్యేక హోదా అవసరం లేదం టూ చేస్తున్న వాదనల కారణంగా ప్రజాబాహుళ్యంతో ఏర్పడిన భయాందోళనల్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాన ప్రతిపక్షనేత నిరసన దీక్షకు పూనుకుంటే దానిని బురద జల్లుడు కార్యక్రమంగా చిత్రీకరిస్తున్న వైఖరిని ఏ విధం గా అర్థం చేసుకోవాలి? ప్రజల్లో బలంగా ఉన్న ప్రత్యేక హోదా సెంటిమెం టుపై టీడీపీ మౌనం ప్రదర్శించడంపై వైఎస్సార్సీపీ ప్రజల పక్షం నిలిచి పోరాడటం ప్రభుత్వానికి కంటగిం పైంది. ఆత్మరక్షణలో పడిన పాలక ప్రభుత్వం ఎదురుదా డికి దిగే క్రమంలో ప్రజాస్వామ్య విలువలను తోసిరాజ నడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. వ్యక్తిగత కారణాలు, రాజ కీయ ఇబ్బందులు, సంకీర్ణ మొహమాటాలతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోగల అవకాశాన్ని టీడీపీ ప్రభు త్వం చేజేతులా జారవిడుచుకుంది. ప్రత్యేక హోదాకంటే ప్యాకేజీయే మేలు అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్న చంద్ర బాబు చిత్తశుద్ధిని ప్రజలు శంకిస్తున్నారు. ప్రజల విశ్వా సం కోల్పోతున్నామన్న ఉక్రోషంతో ప్రతిపక్ష పార్టీలను చులకన చేసి మాట్లాడటం, తామెలా వ్యవహరించినా, ఏం మాట్లాడినా, ఏ నిర్ణయాలు తీసుకున్నా ప్రశ్నించ డానికి మీరెవరు? అనడం అహంకారానికి, నియంతృత్వ ధోరణికి పరాకాష్ట. ప్రతిపక్ష నేతలకు అభివాదం చేసిన జవహర్లాల్ నెహ్రూ కానీ, ప్రతిపక్ష పార్టీలకు తగిన గౌరవమిచ్చిన దివంగత ఎన్టీఆర్ కానీ ఎన్నడూ అప్రజాస్వామిక చర్య లను ప్రోత్సహించలేదు. ప్రతిపక్షానికున్న ప్రాముఖ్య తను, దాని రాజ్యాంగ హక్కులను గౌరవించే విజ్ఞతను టీడీపీ ప్రభుత్వం కోల్పోయింది. కానీ ప్రజాస్వామ్య సంప్రదాయాలను గాలికొది లేసిన పెడధోరణులు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో చూడగ లుగుతున్నాం. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి అధికా రంలోకి రాగానే... ప్రధాన ప్రతిపక్షం వాణి వినబడ కుండా గొంతు నొక్కేయడానికి ప్రయత్నించడం; అదే సమయంలో, చట్టాన్ని అతిక్రమిస్తున్న సొంత పార్టీ ఎమ్మెల్యేలను, నేతలను పరిరక్షించుకొనేందుకు రాజ్యాం గ విలువలను బాహాటంగా కాలరాస్తున్న తీరును సమా జం గమనిస్తూనే ఉంది. ప్రజల మేలు కోసం రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని అవమానాలు తాత్కాలికంగా భరించకతప్పదు. చరిత్ర అందించే విలువైన పాఠాలను తెలుసుకొని టీడీపీ ప్రభుత్వం, నాయకత్వం... ప్రతిపక్ష పార్టీలకు సముచిత గౌరవం ఇవ్వగలిగితేనే... సమష్టి పోరాటాల ద్వారా రాష్ట్రానికి చెందవలసిన వాటిని సాధించగలిగితేనే... రాష్ట్రంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది తప్ప అణచివేత విధానాల వల్ల, ప్రజాస్వామ్య వెక్కిరింపుల వల్ల ఫలితం ఉండదు. ప్రజాస్వామ్యం మనుగడ సాధిం చదు... ప్రజలు హర్షించరు. రాష్ట్రం పురోగమించదు. వ్యాసకర్త: ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రివర్యులు మొబైల్: 99890 24579 - డా.ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు -
'హోదా' కోసం అక్టోబర్ 7 నుంచి వైఎస్ జగన్ దీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చేనెల 7వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తారని పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. గుంటూరులోనే ఆయన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆయన ఏమన్నారంటే... ఎవరైనా చచ్చిపోతానని దరఖాస్తు పెడితే దానికి అనుమతిస్తామా అని చంద్రబాబు మాట్లాడుతున్నారు ఆయన అవహేళనగా, అహంభావంతో మాట్లాడుతున్నారు ప్రత్యేక హోదా అంశంపై అసలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో ప్రజలు ఆలోచించాలి కేంద్రం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి దీక్ష చేపడితే ఇలా మాట్లాడతారా? 2010లో మీరు హైదరాబాద్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేయలేదా అప్పట్లో ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరలేదా అప్పుడు మీరు చనిపోవడానికి దీక్ష చేశారా, లేదా రోజూ భోజనం చేసి ప్రజలను మోసం చేసి దీక్ష చేసినట్లు చూపించారా అప్పుడు ఏ చట్టం మీకు అనుమతి ఇచ్చిందని ప్రశ్నిస్తున్నా నిరాహార దీక్ష వల్లే, శాంతియుత పోరాటం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని మర్చిపోవద్దు పొట్టి శ్రీరాములు చేసిన దీక్ష వల్లే తెలుగు రాష్ట్రం ఏర్పడింది ఇప్పుడు మనం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో బతుకుతున్నామంటే అప్పటి పెద్దలు చేసిన త్యాగాలే కారణం శాంతియుతంగా, చట్టబద్ధంగా చేస్తున్న కార్యక్రమాన్ని కళ్లు నెత్తికెక్కి అవహేళన చేస్తున్నారు ఎవరైనా సరే ఒకసారి ఎన్నికైతే ఐదేళ్లే సీఎం అవుతారు తప్ప శాశ్వత సీఎం అనుకుంటే కాలగర్భంలో కలిసిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి చంద్రబాబు ఇలాంటి అహంభావపూరితమైన మాటలు మాట్లాడటం మంచిది కాదు ఏది ఏమైనా.. నిరాహార దీక్ష చేయాలని పార్టీ నిర్ణయించుకుంది వచ్చే నెల 7వ తేదీన గుంటూరులో వైఎస్ జగన్ దీక్ష ప్రారంభిస్తారని పార్టీ నిర్ణయించింది నేను, పార్టీ పెద్దలు ఎస్పీ, ఐజీ స్థాయి అధికారులను అనుమతి కోరాం.. వాళ్లు ఇక్కడ కాదు, వేరే స్థలం చూసుకోండి అని చెప్పారు మేం భేషజాలకు పోదలచుకోలేదు. రాష్ట్ర అభివృద్ధే మాకు ముఖ్యం గతంలో మేం ఎంచుకున్న ప్రదేశం అయితే ఇబ్బంది అవుతుందన్నారు కాబట్టి ప్రత్యామ్నాయ స్థలాన్ని వాళ్లకు చూపిస్తాం స్వార్థం, స్వలాభం కోసం మాటలు చెబితే ప్రజలు క్షమించరు స్వార్థం కోసం, మీ అవినీతి కోసం సింగపూర్ బృందాన్ని తీసుకొస్తున్నారు ఈ విషయాన్ని ప్రజలు కూడా త్వరలోనే తెలుసుకుంటారు ప్రధాన ప్రతిపక్షంగా మా వంతు బాధ్యతగా ప్రజల కోసం, ప్రజల తరఫున పోరాడతాం -
నవ్యాంధ్రలో హక్కులకు నగుబాటేనా!
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేటి నుంచి తలపె ట్టిన నిరవధిక నిరాహారదీక్షలు వాయిదా పడి ఉండవచ్చు. కానీ వాయిదాకు ముందు జరి గిన పరిణామాలూ, ప్రభుత్వ చర్యలూ చర్చనీయాంశాలుగా మిగిలి ఉన్నాయి. ముఖ్యంగా విపక్షానికి సైతం పాలక పక్షం మాట్లాడే హక్కు లేకుండా చేసే ప్రయత్నం ఇక్కడ కనిపిస్తుంది. ఇది నియంతృత్వం. అప్రకటిత ఎమర్జెన్సీ. చేసిన వాగ్దానాలను పాలకులు మరచిపోయినప్పు డు పార్లమెంట్లోను, శాసనసభలలోనూ వారిని నిలదీ యడం విపక్షాల పని. అందుకు అవకాశం ఇవ్వనప్పుడు ప్రతిపక్షాలు రోడ్డున పడి పాలకుల వైఖరిని ఎండగట్టడం అనివార్యం. ఎన్డీయే-2, టీడీపీ, టీఆర్ఎస్ ఎన్నికల సమ యంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమై నాయి. అధికారం చేపట్టాక గత పాలకులపై నెపం వేసి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఇలా అధి కారపక్షాలు విఫలమైనప్పుడల్లా ఆ అవకాశాన్ని విప క్షాలు అంది పుచ్చుకుని గళం విప్పాలి. నవ్యాంధ్రప్రదే శ్లో జగన్ దీక్షలు అందులో భాగమే. ప్రత్యేక హోదా ప్రకటించిన రెండు పార్టీలు అధికా రంలోకి వచ్చాక ఆ సంగతి మరిచాయి. ముఖం చాటే శాయి. ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్ర ం చెబుతున్న కుంటిసాకులూ, జగన్ దీక్షకు అనుమతి నిరాకరణకు రాష్ట్ర పోలీసుల ద్వారా చంద్రబాబు చెప్పించిన కారణా లూ ఒక్కలాగే ఉన్నాయి. మేము అనుమతిస్తే ముందుకు వెళ్లాలి, లేదంటే మానుకోవాలి అన్న తీరులో వారి అధి కార దర్పం కనిపిస్తున్నది. రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్ ప్రకారం చూస్తే దీక్ష అనుమతి నిరాకరణకు వారు చెబు తున్నవి కుంటిసాకులే. ఈ ఆర్టికల్ (1) ఏబీసీ నిబం ధనల ప్రకారం దేశ స్వాతంత్య్రానికీ, అఖండతకీ, భద్ర తకీ, విదేశీ సంబంధాలతో పాటు శాంతికి విఘాతం కలు గుతుందనుకుంటే ఒక వ్యక్తి చేయబోయే దీక్షకు అను మతి నిరాకరించవచ్చు. ఇది ప్రభుత్వ బాధ్యత. మర్యా ద, అనైతికత, కోర్టు ధిక్కారం, పరువునష్టం, నేరానికి ప్రేరేపించే చర్యలు ఉన్నా కూడా అనుమతి నిరాకరించ వచ్చు. కాబట్టి కేవలం శాంతిభద్రతలకు విఘాతం అన్న సాకుతో అనుమతిని నిరాకరించడమంటే ఆర్టికల్ 19 ఇచ్చిన స్వేచ్ఛాస్వాతంత్య్రాలను నిరాకరించడమే. దీక్షకు ఎంచుకున్న ఉల్ఫ్‌హాల్ గ్రౌండ్, పరిసరాలను గురించి చూద్దాం. అక్కడ ప్రభుత్వ ఆస్పత్రికి ఇటీవల రెండో గేటు ను నిర్మించిన మాట నిజమే. కానీ ఆ సంగతి చాలా మందికి ఇప్పటికీ తెలియదు. అందువల్ల దీక్ష కారణంగా అక్కడ ప్రాణనష్టం జరుగుతుందని ముందే ఊహించ డం అసందర్భమే. ఉల్ఫ్‌హాల్ గ్రౌండ్ నగరం నడిబొడ్డే. కానీ వ్యాపార కూడలి కాదు. కాబట్టి అనుమతి నిరాక రణ కేవలం గొంతు నొక్కే చర్యే. రాజమండ్రి పుష్కరా లలో జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారకుడైన చంద్ర బాబును ముద్దాయిగా గుర్తించని పోలీసులు, జగన్ దీక్షతో సంభవించనున్న ప్రమాదం గురించి జోస్యం చెప్పడం హాస్యాస్పదం. ఊహాజనితమైన ఆలోచనలతో ఒక వ్యక్తి భావ ప్రక టనా స్వేచ్ఛను శాంతిభద్రతల పేరిట నిలువరించడం సరికాదని ఫతేఘర్ వర్సెస్ డాక్టర్ రామ్మనోహర్ లోహి యా కేసులో (1966 ఎస్సీ 633)సుప్రీంకోర్టు పేర్కొ న్నది. కాబట్టి వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులకు ఉన్న సమా వేశపు హక్కును హరించే అధికారం పాలకులకు లేదు. ఇలాంటి ధోరణి ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు. ఈ అంశం మీద కోర్టులు షరతులతో కూడిన అను మతి ఇచ్చినా, ఇవ్వకున్నా వైఎస్సార్ సీపీ సహా, మిగిలిన విపక్షాలు ఏకం కావలసిన అవసరం ఇప్పుడు ఉంది. వీరంతా కలసి ఇప్పుడు తెలంగాణలో ప్రజలు కోరుతు న్నట్టు చట్టబద్ధ పాలన కోసం ఉద్యమించాలి. ప్రజాస్వా మ్యం కాబట్టి ప్రభుత్వ చర్యల పట్ల నిరసనను ప్రకటించే హక్కును నిలబెట్టుకోవాలి. ప్రజా సంఘాల సమావేశపు హక్కును, స్వేచ్ఛగా మాట్లాడే హక్కును అంతా కాపాడు కోవాలి. అప్పుడే ప్రతిపక్ష నేతలకూ, పార్టీలకూ కూడా ఆ హక్కు మిగిలి ఉంటుంది. (వ్యాసకర్త పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) మొబైల్: 84998 54214 - చిలుకా చంద్రశేఖర్ -
యువభేరి మోగింది
కలసి నడుద్దాం... హోదా సాధిద్దాం... ♦ విద్యార్థి యువభేరి సదస్సులో వైఎస్ జగన్మోహన్రెడ్డి ♦ పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమేమిటి? ... గతంలో 11 రాష్ట్రాలకు ఇచ్చిన హోదా మనకెందుకు ఇవ్వరు? ♦ ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు? ♦ కేంద్రంలో టీడీపీ మంత్రులను ఉపసంహరించుకుంటే కేంద్రం దిగి వస్తుంది ♦ ఓటుకు కోట్లు కేసు మాఫీకోసం హోదా హక్కును పణంగా పెట్టారు ♦ హోదాకోసం వైఎస్సార్సీపీ నిరంతర పోరాటం ♦ 26 నుంచి గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష ♦ మీరూ కలసిరండి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీద్దాం సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రత్యేకహోదా మన హక్కు... దాని సాధనకోసం కలసి ఉద్యమిద్దాం... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి హోదా సాధిద్దాం.. అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేకహోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరకపోతే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేమిటని ప్రశ్నించారు. ఐదేళ్లుకాదు పదేళ్లు ప్రత్యేకహోదా తెస్తామని, ఇస్తామని ఎన్నికలముందు చెప్పిన టీడీపీ, బీజేపీ ఇప్పుడా ఊసెత్తడంలేదని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కేసులను మాఫీ చేసుకునేందుకు ప్రత్యేకహోదా హక్కును కేంద్రానికి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేకహోదా సాధించుకుందామన్నారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థులు మంగళవారం స్థానిక పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో ‘రాష్ట్రానికి ప్రత్యేకహోదా- ఉద్యోగ అవకాశాలు- రాష్ట్రాభివృద్ధ అనే అంశంపై విద్యార్థి యువభేరి సదస్సు నిర్వహించారు. విద్యార్థులు, ప్రొఫెసర్లు, మేధావులు, విద్యావేత్తలు పెద్దసంఖ్యలో హాజరైన ఈ సదస్సుకు వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగాలు చేసిన వారికి మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే... ప్రత్యేకహోదా ఎందుకిచ్చారంటే... అన్ని పార్టీలూ కలసి ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టాయి. అప్పుడు వైఎస్సార్సీపీ తరఫున ఎంపీలుగా ఉన్న నన్ను, మేకపాటి రాజమోహన్‌రెడ్డిని సస్పెండ్ చేసి లోక్‌సభనుంచి గెంటేశారు. లోక్‌సభ తలుపులు మూసివేసి, టీవీ చానళ్ల ప్రసారాలు ఆపివేసి, అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారు. విభజనవల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది. సాఫ్ట్వేర్ రంగంలో 95 శాతం హైదరాబాద్‌లోనే ఉంది. బీటెక్, బీసీఏ, ఎంసీఏ చేసిన విద్యార్థులందరూ ఉద్యోగాలకోసం చూసేది హైదరాబాద్ నగరంవైపే. ఉమ్మడి రాష్ట్రంలోని 70 శాతం పరిశ్రమలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. 70 శాతం ఉద్యోగాలు కూడా అక్కడే ఉన్నాయి. విభజనవల్ల హైదరాబాద్‌లాంటి గొప్ప నగరాన్ని ఏపీ కోల్పోతుంది. అందుకే ఆ నష్టాన్ని వీలైనంత భర్తీ చేసేందుకు రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ప్రకటించారు. ఐదేళ్లు సరిపోదు, పదేళ్లు కావాలని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, టీడీపీ డిమాండ్ చేశాయి. తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని, తెస్తామని బీజేపీ, టీడీపీ నేతలు ఎన్నికల ముందు ఊరూరా ఉపన్యాసాలిచ్చారు. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో ఆ రెండు పార్టీలే అధికారంలో ఉన్నాయి. కానీ ప్రత్యేకహోదా గురించి మాత్రం నోరెత్తడంలేదు. కేసులకు భయపడి హోదా తాకట్టు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకహోదాకోసం కేంద్రాన్ని నిలదీయాల్సి ఉంది. కానీ ఆయన ఎందుకు నోరుమెదపడంలేదు? ఓ 15 రోజులో, నెలరోజులో గడువిచ్చి, ఆలోపు ప్రత్యేకహోదా ఇవ్వకపోతే కేంద్రంలో ఉన్న తమ మంత్రులను ఉపసంహరించుకుంటామని కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు? నాతోపాటు రాష్ట్ర ప్రజలందరికీ ఉన్న సందేహమిది. అయినా చంద్రబాబు నోరు మెదపరు. ఎందుకంటే... పట్టిసీమనుంచి పోలవరం వరకూ కమీషన్లు తీసుకుని, జీవో-22తో కొందరు కాంట్రాక్టర్లకు మేలుచేసి, కొందరికే మద్యం డిస్టిలరీ లెసైన్సులిచ్చి, ఇసుకనుంచి మట్టిదాకా పర్సెంటేజీలు తీసుకుని, బొగ్గు దగ్గరనుంచి పలు స్కాములు చేసి... ఏపీలో అక్రమంగా సంపాదించిన డబ్బుతో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు ఐదునుంచి రూ.20 కోట్ల లంచమిస్తూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోవడం మనమందరం చూశాం. ఆ కేసునుంచి బయటపడేందుకు చంద్రబాబు బీజేపీ మీద ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు. ప్రత్యేకహోదాకోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఓట్లుకు కోట్లు కేసులో తనను జైలుకు పంపుతారేమోనని చంద్రబాబు భయం. అందుకే తన స్వార్థం కోసం, కేసులనుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ఐదుకోట్ల ప్రజలను, ప్రత్యేకహోదాను కేంద్రం కాళ్ల దగ్గర తాకట్టుపెడుతున్నారు. గతంలో ఇదే చంద్రబాబు సోనియాగాంధీతో కలసి నా మీద కేసులు పెట్టారు. కానీ నేను భయపడలేదు. చంద్రబాబు నాయుడులా రెండుకళ్ల సిద్ధాంతం చెప్పలేదు. పోరాటం చేశా. రాష్ట్రాన్ని విభజించవద్దని గట్టిగా నిలదీశా. ప్రత్యేకహోదా గురించి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సభ్యులు అపహాస్యం చేస్తూ, వక్రభాష్యం చెబుతూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రత్యేకహోదాకన్నా ప్రత్యేక ప్యాకేజీ ముద్దని చెబుతున్నారు. తన వాదన సమర్థించుకునేందుకు.. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ అక్కాచెల్లెమ్మలను కించపరిచేలా మాట్లాడారు. ఆడపిల్లలకు తోడుంటానని చెప్పాల్సిన సీఎం మాట్లాడిన తీరిది. తనను తాను కాపాడుకోవడం కోసం ప్రత్యేకహోదాను తాకట్టు పెడుతున్న బాబును మీరంతా ప్రశ్నించండి. అయ్యా చంద్రబాబూ... ప్రత్యేక ప్యాకేజీ పేరుతో మీరు చెప్తున్నవన్నీ, విభజన చట్టంలో హక్కుగా ఇచ్చిన హామీలు కాదా? అని నిలదీయండి. పోలవరం, మెట్రోరైలు, ఐఐఎం, ఐఐటీలన్నీ విభజన చట్టంలో హక్కుగా ఇస్తే... వాటిని కొత్తగా ప్యాక్ చేసి తానేదో సాధించానని మభ్యపెట్టాలని చూస్తున్న బాబును గట్టిగా ప్రశ్నించండి. సాకులు చెబుతున్న ప్రభుత్వాలు... ప్రత్యేకహోదాకు తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర ఒప్పుకోవడంలేదంటారు. అయ్యా... రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఈ రాష్ట్రాలు లేవా? ఈ రాష్ట్రాలు ఒప్పుకోవని అప్పుడు మీకు తెలీదా? ప్రత్యేకహోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోవడంలేదని అబద్ధాలు చెబుతున్నారు. కేంద్రం వసూలు చేసిన పన్నుల మొత్తాన్ని రాష్ట్రాలకు ఎలా పంచాలి, నాన్‌ప్లాన్ గ్రాంట్లు, లోన్లు ఎలా పంచాలన్నదే ఆర్థిక సంఘం పని. ప్రత్యేకహోదాతో దానికి ఎలాంటి సంబంధం లేదు. హోదా ఇవ్వాలా లేదా అన్న నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధానమంత్రి. ఎందుకంటే కేంద్ర మంత్రిమండలి, నీతి ఆయోగ్, ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలి... అన్నింటికీ సారథ్యం వహించేది ప్రధానమంత్రి. ఆదొక ఎగ్జిక్యూటివ్ నిర్ణయం మాత్రమే. కేబినెట్ ఇవ్వాలనుకుంటే ప్రత్యేకహోదా ఇచ్చేయవచ్చు. గతంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చారు. వాటన్నింటికీ కేబినెట్లో నిర్ణయం తీసుకుని అమలు చేశారే తప్ప ఎక్కడా ఒక యాక్ట్ ద్వారా వచ్చింది కానేకాదు. గతంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఉత్తరాఖండ్‌ను విభజించి, ప్రత్యేక హోదా ఇచ్చాక జాతీయ అభివృద్ధి సంఘానికి అనుమతి కోసం పంపారు. అవన్నీ తెలిసినా చంద్రబాబు కావాలని ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రత్యేక హోదా వస్తే లక్షల్లో ఉద్యోగాలు... ప్రత్యేకహోదావస్తే ప్రధానంగా రెండు లాభాలున్నాయి. రాష్ట్రానికి కేంద్రంనుంచి వచ్చే నిధులు 90 శాతం నిధులు గ్రాంటుగా, 10 శాతం రుణాలుగా వస్తాయి. అంటే గ్రాంటును తిరిగి చెల్లించాల్సిన అవసరంలేదు. ప్రత్యేకహోదా లేని రాష్ట్రాలకు 70 శాతం నిధులు రుణాలుగా, 30 శాతం మాత్రమే గ్రాంట్లుగా వస్తాయి. అంటే రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతుంది. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే భారీగా పారిశ్రామిక రాయితీలు వస్తాయి. 100 శాతం ఎక్సైజ్ పన్ను, ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. అలాంటి సదుపాయాలున్నప్పుడు పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తారు, పరిశ్రమలు స్థాపిస్తారు, లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ వెళ్లి చూస్తే ప్రత్యేకహోదావల్ల జరిగిన మేలేమిటో తెలుస్తుంది. ఉత్తరాఖండ్‌లో రెండువేల పరిశ్రమలు వచ్చాయి. రూ.30 వేలకోట్ల పెట్టుబడులతో 130 శాతం అధికంగా పరిశ్రమలు రావడంవల్ల ఉపాధి అవకాశాలు 490 శాతం పెరిగాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పదివేల పరిశ్రమలు వచ్చాయి. ఇవన్నీ చంద్రబాబుకు తెలిసినా ప్రత్యేకహోదా కోసం పట్టుపట్టకుండా పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఎన్నికలకు ముందు రాష్ర్టంలో ఏ టీవీ పెట్టినా.. జాబు రావాలంటే బాబు రావాలంటూ వినిపించేది. జాబు ఇవ్వకపోతే నెలకు రూ.రెండువేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. రాష్ట్రంలో 1.75 కోట్ల ఇళ్లున్నాయి. ఏ ఒక్కరికైనా జాబు వచ్చిందా? నిరుద్యోగ భృతి వచ్చిందా? ఆయన ఉద్యోగాలివ్వరు. ప్రత్యేకహోదా వల్ల పరిశ్రమలు వస్తాయని తెలిసినా పట్టించుకోడు. రాష్ట్రాభివృద్ధితో, బిడ్డల భవిష్యత్తుతో ఆడుకుంటున్న చంద్రబాబు మనిషేనా? హోదావస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్... 972 కిలోమీటర్ల సముద్ర తీరమున్న రాష్ట్రం మనది. ప్రత్యేకహోదా వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది. ఉద్యోగంకోసం మనం వెదుకులాడే పరిస్థితి నుంచి మనకు కావాల్సిన కంపెనీలో ఉద్యోగం చేసే పరిస్థితి వస్తుంది. అందుకే ప్రత్యేకహోదా వల్ల రాష్ట్రానికి, విద్యార్థులకు కలిగే లాభమేమిటో ప్రతి విద్యార్థికీ తెలియాలి. తెలిసినవారు మరో నలుగురికి చెప్పాలి. మనహక్కుకోసం మనం కలసి పోరాడదాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు మంగళగిరిలో దీక్ష చేశాం. ఢిల్లీలో దీక్ష చేశాం. బంద్‌కు పిలుపునిచ్చాం. 26నుంచి గుంటూరులో నిరవధిక దీక్ష చేస్తున్నా. వీటన్నింటితోపాటు మీ సహకారం కావాలి. అందరం కలసి చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వంనుంచి తన మంత్రులను ఉపసంహరించుకుంటానని ఏ రోజైతే చంద్రబాబు చెప్తాడో ఆ రోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగివస్తుంది, ప్రత్యేకహోదా ఇస్తుంది. ఈ పోరాటంలో మనమంతా కలసికట్టుగా కృషిచేస్తే విజయం సాధిస్తాం. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధిస్తాం. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు షేక్ సలాంబాబు, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వి.హరిప్రసాద్‌రెడ్డి, ఎస్వీయూ విశ్రాంత అధ్యాపక సంఘం అధ్యక్షుడు ఎం.సూర్యనారాయణరెడ్డి, తెలుగు అకాడమీ మాజీ అధ్యక్షుడు జె.ప్రతాప్‌రెడ్డి, ఎస్వీయూ అధ్యాపక సంఘం మాజీ అధ్యక్షుడు కె.రాజారెడ్డి, కార్యదర్శి ఎం.రెడ్డిభాస్కర్‌రెడ్డి, పీలేరు డిగ్రీ కళాశాల లెక్చరర్ చంద్రయ్య, రాష్ట్ర ఆడిటింగ్ రిటైర్డ్ అధికారి మునిరాజ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్కే రోజా, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వరప్రసాద్, ఎమ్మెల్యేలు దేశాయ్‌తిప్పారెడ్డి, నారాయణస్వామి, డాక్టర్ సునీల్, కొరముట్ల శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు. విద్యార్థులదే నాయకత్వం ప్రత్యేక హోదా సాధన కోసం విద్యార్థి లోకం కదం తొక్కింది. తిరుపతిలో యువభేరి సదస్సును విజయవంతంగా నిర్వహించింది. సదస్సుకు పలువురు రాజకీయనాయకులు హాజరైనా ఆద్యంతం విద్యార్థులకే ప్రాధాన్యం ఇచ్చారు. వేదికపై కూడా విద్యార్థి నాయకులే ఎక్కువగా కనిపించారు. రాజకీయ నాయకులకు దిశా నిర్దేశం కలిగించేలా విద్యార్థుల ప్రసంగాలు నడిచాయి. విద్యార్థి ప్రతినిధులు లేఖశ్రీ, బి.తేజేశ్‌రెడ్డి ప్రసంగాలు ఆలోచన రేకెత్తిం చాయి. జగన్మోహన్రెడ్డి ప్రసంగానికి విశేష స్పందన లభించింది. విద్యార్థుల కేరింతలు, చప్పట్లు, జై జగన్ నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. ప్రభుత్వం ఆంక్షలు విధించి ఎస్వీయూలో అనుమతి నిరాకరించినా సదస్సుకు వేలాది మంది విద్యార్థులు తరలి వచ్చి ప్రత్యేకహోదా అవసరాన్ని ఎలుగెత్తి చాటారు. హోదాకోసం ఉద్యమిస్తామంటూ, హోదా సాధిస్తామంటూ నినదించారు. రాష్ట్రాభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు హోదా అత్యంత అవసరమని స్పష్టం చేశారు. హోదాకోసం విద్యార్థులు ఉద్యమించాలి మనమంతా యువకులం. ఈ తరానికి చెందినవాళ్లం. పార్లమెంటులో ఏదైనా హామీ ఇస్తే అది నెరవేరుతుందని విశ్వసిస్తాం. పార్లమెంటును చూసి నేర్చుకోవాలనుకుంటాం. కానీ రాష్ర్ట విభజన జరిగిన సమయంలో పార్లమెంటు జరిగిన తంతు చూసి... ఇదా ప్రజాస్వామ్యమని భారతీయులుగా సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. కానీ పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీకి దిక్కూ దివాణం లేకపోతే మనమంతా ఎక్కడికి వెళ్లాలి? ఎవర్ని విశ్వసించాలి? కేంద్ర మంత్రుల్లో కొందరు ప్రత్యేకహోదా ఇస్తామంటారు, కొందరు రాదంటారు. చంద్రబాబు అది సంజీవని కాదంటారు. స్పీకర్ ఇది జిందా తిలిస్మాత్ కాదంటారు. అసలు ప్రత్యేకహోదా ఇస్తారో ఇవ్వరో స్పష్టంగా చెప్పకుండా ప్రజల్ని గందరగోళ పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలో చదువులు పూర్తిచేసి ఉద్యోగాలకోసం ఎదురుచూసే విద్యార్థులు ప్రత్యేకహోదా వల్ల వచ్చే ఉద్యోగావకాశాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే యూనివర్సిటీల్లో ప్రత్యేక హోదాపై చర్చ జరగాలి. విద్యార్థులు అవగాహన పెంచుకుని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పెద్దలకు బుద్ధి వచ్చేలా, గడ్డిపెట్టేలా ఉద్యమించాలి. కానీ ప్రభుత్వం మాత్రం దీనిపై విద్యార్థులకు అవగాహన కలగకూడదంటుంది. యూనివర్సిటీలో హోదాపై చర్చ జరగకూడదంటుంది. జగన్ వస్తున్నాడని తెలిసి వర్సిటీలో ఎలాంటి మీటింగులు జరగకూడదని హుకుం జారీ చేశారు సర్కారు పెద్దలు. అయ్యా చంద్రబాబూ... తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరిగింది ఈ యూనివర్సిటీలో కాదా? ప్రధాని నరేంద్రమోదీతో మీరు సమావేశం పెట్టించింది ఈ వర్సిటీలో కాదా? యూనివర్సిటీలో రాజకీయ సమావేశాలు జరగకూడదని ఆరోజు గుర్తుకురాలేదా? ఈ సమావేశ వేదికపైన ఉన్నది యూనివర్సిటీ ప్రొఫెసర్లు, మేధావులు. వచ్చింది విద్యార్థులు. ఇక రాజకీయం ఎక్కడుంది చంద్రబాబూ? మీ నిరంకుశ పోకడలను ప్రజలు గమనిస్తున్నారు. త్వరలోనే గట్టిగా బుద్ధి చెప్తారు. -
ప్రత్యేక హోదాయే ప్రాణవాయువు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి ఎంతో కీలకమైన ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది గర్జించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్రం ప్రగతి పథంలో పయనించాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని, అదే రాష్ట్రానికి ప్రాణవాయువు అని స్పష్టం చేసింది. తెలుగువాడి గర్జన ఢిల్లీ వరకు వినిపించాలని పేర్కొంది. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే అనేక రూపాల్లో పోరాటం కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 26 నుంచి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలను సోదాహరణంగా వివరిస్తూ వైఎస్సార్సీపీ మంగళవారం ఒక కరపత్రాన్ని విడుదల చేసింది. హోదా వల్ల రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కరపత్రంలో వెల్లడించిం ది. ప్యాకేజీ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న తీరును ఎండగట్టింది. హోదా సంజీవని కాదని, సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ కానేకాదంటూ అధికారంలో ఉన్న నేతల అడ్డగోలు ప్రకటనలు రాష్ట్ర ప్రయోజనాలను కాలరాయడమేనని విమర్శించింది. ఇలాంటి దుస్సాహసానికి ఒడిగడుతున్న పార్టీలు, నాయకులు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన సమయమిదేనని వివరించింది. ప్రత్యేక హోదా ఏపీ హక్కు, దానిని ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత అని గుర్తుచేసింది. ప్రత్యేక హోదాయే సంజీవని, శ్రీరామరక్ష అని స్పష్టం చేసింది. నిరాశ నిస్పృహల్లో ఉన్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని పేర్కొంది. హోదాతో ఎన్నో రకాల రాయితీలు లభించి, రాష్ట్రం పారిశ్రామికంగా ముందుకు వెళుతుందని తెలిపింది. ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 26 నుంచి వైఎస్ జగన్ చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్షకు బాసటగా నిలవాలని వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ప్రభుత్వ తప్పుడు ప్రచారం వల్ల ఇప్పటికే ఐదుగురు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. పోరాడి హోదా సాధించుకోవాలని పేర్కొంది. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కాలయాపన చేయడమే కాకుండా దాన్ని నీరుగార్చే ప్రయత్నాలకు నిరసనగా ఆంధ్రులు చేసే గర్జన ఢిల్లీలో ప్రతిధ్వనించాలని కరపత్రంలో పిలుపునిచ్చింది. హోదా కోసం గర్జించు ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని వైఎస్సార్సీపీ ఉద్ఘాటించింది. హోదా విషయంలో మోసం చేస్తున్న ప్రభుత్వాలపై పోరాడేందుకు అందరూ కలిసికట్టుగా ముం దుకు రావాలని కరపత్రంలో కోరింది. ‘‘రాష్ట్రాన్ని విభజించడమే అన్యాయం. ఆ అన్యాయం చేస్తున్న సమయంలో సాక్షాత్తూ పార్లమెంట్లో అప్పటి ప్రధాని ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లు చాలదు పదేళ్లు కావాలని బీజేపీ అప్పుడు డిమాండ్ చేసింది. తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ఇస్తామని బీజేపీ ఏపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. సీఎం చంద్రబాబు కూడా ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని ఎన్నికలకు ముందు, ఆ తర్వాత చెప్పారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి రాష్ట్రాన్ని విభజించేముందు పార్లమెంట్లో ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే ఇక ఆ చట్టసభకు విశ్వసనీయత ఏముం టుంది?’’ అని కరపత్రంలో సూటిగా ప్రశ్నించింది. ‘‘చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా కంటే తన ముఖ్యమంత్రి హోదా ఊడకుండా చూసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఐదు కోట్ల మంది ప్రజలు, వారి పిల్లల భవిష్యత్తును, ముందు తరాల ప్రయోజనాలను తాకట్టు పెడుతూ ఢిల్లీకి వెళ్లి మరీ ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ దుర్మార్గమైన ప్రకటన చేశారు’’ అని నిప్పులు చెరిగింది. ‘‘గర్జించు ఆంధ్రప్రదేశ్.. ప్రత్యేక హోదా కోసం గర్జించు’’ పేరుతో రూపొందించిన ఈ కరపత్రంలో ప్రత్యేక హోదా వల్ల దక్కే ప్రయోజనాలను తెలియజేశారు. ఈ కరపత్రాన్ని ప్రజల సౌలభ్యం కోసం వైఎస్సార్సీపీ తన వెబ్సైట్లో పొందుపరిచింది. -
‘హోదా’ కోసం 26 నుంచి జగన్ దీక్ష
రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం గుంటూరు వేదికగా పోరాటం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 26వ తేదీ నుంచి గుంటూరు వేదికగా నిరవధిక నిరాహారదీక్ష చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జగన్ అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీక్షను ఈ నెల 15వ తేదీ నుంచే చేపట్టాలని తొలుత భావించినప్పటికీ వినాయక చవితి, నిమజ్జనంతో పాటుగా బక్రీద్ పండుగ కూడా ఉండటంతో 26వ తేదీకి వాయిదా వేసుకున్నారు. గుంటూరు పట్టణంలో ప్రారంభమయ్యే ఈ దీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. పార్టీ సంస్థాగత విషయాలపై కూడా చర్చించారు. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీల నియామకాన్ని పదిహేను రోజుల్లోగా పూర్తి చేయాలని జగన్ ఈ సందర్భంగా పార్టీ నేతలకు సూచించారు. కింది స్థాయి నుంచీ పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినపుడే బలోపేతం అవుతుందన్నారు. ఇప్పటికే చాలా వరకూ మండలాల్లో కమిటీలు పూర్తయ్యాయని సమావేశంలో నేతలు వెల్లడించారు. మిగతా మండలాల్లో కూడా ఆలస్యం చేయకుండా నియామకాలు జరగాలని జగన్ అన్నారు. ఈ సమావేశంలో ఎంవీ మైసూరారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, జ్యోతు ల నెహ్రూ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, అనంత వెంకట్రామిరెడ్డి, కొడాలి నాని, పి.మిథున్‌రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, సుజయ్ కృష్ణరంగారావు, కోలగట్ల వీరభద్రస్వామి, రెడ్డి శాంతితో పాటుగా పలువురు జిల్లా నేతలు పాల్గొన్నారు. దీక్ష పోస్టర్ విడుదల...: 26 నుంచి జగన్ చేయతలపెట్టిన నిరవధిక నిరాహారదీక్షకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్‌ను పార్టీ కార్యాలయంలో ధర్మాన ప్రసాదరావు విడుదల చేశారు. హక్కుగా సాధించుకోవాల్సిన ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెచ్చి తీసుకు రావాల్సిన ప్రత్యేక హోదా అంశాన్ని టీడీపీ నేతలు తమ స్వలాభాల కోసం నీరుగార్చుతున్నారని గ్రహించే జగన్ ఈ దీక్షకు పూనుకుంటున్నారని వివరించారు. ప్రత్యేక హోదా పొందిన అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు పెరిగాయని, వాటి ఆర్థిక స్థితిగతులు బాగుపడ్డాయని ఆయన పేర్కొన్నారు. విభజన వల్ల దారుణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేకహోదా ఒక్కటే పరిష్కారం అని వైఎస్సార్సీపీ గట్టిగా విశ్వసిస్తోందన్నారు. ప్రత్యేక హోదాకు ప్రత్యేక ప్యాకేజీ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కానే కాదని హోదా శాశ్వ తం, ప్యాకేజీ తాత్కాలికమన్నారు. రాష్ట్రం లోని ఐదు కోట్ల మంది ప్రజలు ముఖ్యంగా నిరుద్యోగ యువత ప్రత్యేక హోదా కావాలనే ఆకాంక్షతో ఉన్నారని వారి తరఫున జగన్ పోరాటానికి సిద్ధమవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అంబటి రాంబా బు, కొత్తపల్లి సుబ్బారాయుడు, మేరుగ నాగార్జున, మర్రి రాజశేఖర్, పి.గౌతంరెడ్డి, కత్తెర క్రిస్టినా పాల్గొన్నారు. -
26 నుంచి వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 26 నుంచి గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష చేయనున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ ఏపీలోని అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్టీ నేతలతో వైఎస్ జగన్ చర్చించి దీక్ష తేదీని ఖరారు చేశారు. పార్టీ కమిటీల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని వైఎస్ జగన్ పార్టీ నేతలను ఆదేశించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ నెల 15 నుంచి గుంటూరులో దీక్ష చేపట్టాలని వైఎస్ జగన్ ఇంతకుముందు నిర్ణయించారు. అయితే 17న వినాయక చవితి పండగ ఉండటంతో పార్టీ శ్రేణుల సూచన మేరకు దీక్ష తేదీని వాయిదా వేసుకున్నారు. వైఎస్ జగన్ ఈ రోజు పార్టీ నేతలతో చర్చించి దీక్ష తేదీని ఖరారు చేశారు. -
26 నుంచి వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష
-
హోదా కోసం అఖిలపక్షం అవసరం లేదు
రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నపుడు డెడ్లైన్లు సరికాదు: సీఎం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రోడ్‌మ్యాప్ తయారు చేస్తున్న ఈ సమయంలో డెడ్లైన్లు పెట్టడం సరికాదన్నారు. అసెంబ్లీ గురువారానికి వాయిదా పడిన అనంతరం బుధవారం శాసనసభ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 15 నుంచి చేస్తానంటున్న నిరవధిక నిరాహారదీక్షలో చిత్తశుద్ధి లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిని రాజకీయం చేయాలని ప్రతిపక్షం చూస్తోందన్నారు. గతంలో రాజధాని నిర్మాణానికి వ్యతిరేకించారని, ఇపుడు పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారన్న సీఎం.. సాగునీటి ప్రాజెక్టుల వంటి మంచి అంశాలను రాజకీ యం చేయటం సరికాదన్నారు. పట్టిసీమను పూర్తి చేసి రాయలసీమకు నీరందిస్తామని పునరుద్ఘాటించారు. జగన్ సొంతూరుకు కూడా నీరందిస్తాం, అపుడు ఏం చెప్తారు, మేం వద్దన్నా నీరిచ్చారని చెప్తారా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు సాహసించలే ని వ్యక్తి ఏం సాధిస్తారని అన్నారు. సేవ చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తులు పార్టీలో చేరండి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్న బలమైన మంచి వ్యక్తులకు టీడీపీ ఆహ్వానం పలుకుతోందని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. బుధవారం ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ ఈదర మోహన్ టీడీపీలో చేరారు. వారికి చంద్రబాబు పచ్చ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ప్రసంగించారు. -
15 నుంచి నిరవధిక దీక్ష
15లోగా ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన రాకుంటే గుంటూరు వేదికగా నిరశనకు దిగుతా: వైఎస్ జగన్ హోదాపై బాబుకు చిత్తశుద్ధి లేదు ఓటుకు కోట్లు కేసులో ఆయన అడ్డంగా చిక్కారు దాన్నుంచి తప్పించుకునేందుకు హోదాను తాకట్టు పెట్టారు ఆయన మాటలవల్లే ఐదుగురు బలిదానం చేసుకున్నారు ఇవ్వాళ కూడా మేం పట్టుబడితే తీర్మానం పెట్టారు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే దీక్ష ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 15 నుంచి గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 15 నెలలైందని, ప్రత్యేక హోదాపై ఇంకా ఎంతకాలం సాగదీస్తారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదన్నారు. విభజన జరిగేటపుడు అప్పటి అధికారప్రతిపక్షాలు రెండూ కలసి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీపై 15 నెలలుగా ఏమీ జరగలేదు. ఎప్పటిలోగా చేస్తారంటే సమాధానం రాదు. హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాన్ని ఇంకా తీవ్రతరం చేయాలని, దీనికి అందరూ ఒక్కటై పోరాడాలని జగన్ పిలుపు నిచ్చారు. ప్రత్యేక హోదా కావాలని తాను ఇప్పటికే మంగళగిరిలో, ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. వీటితోపాటు తమ పార్టీ పిలుపు మేరకు జరిగిన రాష్ట్ర బంద్‌ను, కమ్యూనిస్టులు చేసిన బంద్, తాను 15 నుంచి చేయబోతున్న నిరాహారదీక్షను కూడా చూపించి చంద్రబాబు హోదా కోసం పట్టుపట్టాలని జగన్ డిమాండ్ చేశారు. లేకుంటే బాబు మెడలు వంచైనా హోదా సాధిస్తామన్నారు. హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 15వ తేదీ నుంచి గుంటూరులో నిరవధిక నిరాహారదీక్షకు చేపట్టనున్నట్టు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి చేసే క్రమంలో భాగంగా తాను ఈరోజు నుంచి (మంగళవారం) 15 వ తేదీ వరకూ సమయం ఇస్తున్నానని, 15 వ తేదీన నిరాహారదీక్షను ప్రారంభిస్తానని చెప్పారు. ఆయన మంగళవారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో సహచర ఎమ్మెల్యేల సమక్షంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదనేది ఈరోజు శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడిన తీరును బట్టి స్పష్టంగా రుజువైందని, ఆయన నుంచి ఏ మాత్రం సంతృప్తికరమైన సమాధానం రాలేదని విమర్శించారు. హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాన్ని ఇంకా తీవ్రతరం చేయాలని, దీనికి అందరూ ఒక్కటై పోరాడాలని జగన్ పిలుపు నిచ్చారు. ప్రత్యేక హోదా కావాలని తాను ఇప్పటికే మంగళగిరిలో రెండు రోజులపాటు నిరాహారదీక్ష చేశానని, ఆ తరువాత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వేలాదిమంది కార్యకర్తలు, ప్రత్యేక హోదాను వాంఛించే ప్రజలతో కలిసి ఢిల్లీలో ఒక రోజు ధర్నా చేశామని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా కోసం చేసిన ఆందోళన, తమ పార్టీ పిలుపు మేరకు జరిగిన రాష్ట్ర బంద్‌ను, కమ్యూనిస్టులు చేసిన బంద్‌ను చూపించి రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదాను ఎంతగా వాంఛిస్తున్నారో కేంద్రానికి నచ్చజెప్పి తాను 15వ తేదీ నుంచి చేయబోతున్న నిరాహారదీక్షను కూడా చూపించి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కోసం గట్టిగా పట్టుపట్టాలని జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను కేంద్రానికి చూపించి ప్రత్యేక హోదాను సాధించాలని, లేకుంటే చంద్రబాబు మెడలు వంచైనా ఇది సాధిస్తామని తేల్చిచెప్పారు. ఇంకా ఆయనేం చెప్పారంటే... ఎంత కాలమంటే చెప్పరెందుకు? చంద్రబాబు అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. ప్రత్యేక హోదాపై ఇంకా ఎంతకాలం సాగదీస్తారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదు. విభజన జరిగేటపుడు అప్పటి ప్రధానమంత్రి, అధికారప్రతిపక్షాలు రెండూ కలిసి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీపై 15 నెలలుగా ఏమీ జరగలేదు. ఎప్పటిలోగా చేస్తారంటే సమాధానం రాదు. ఇవాళ తీర్మానం కూడా మేము గట్టిగా పట్టుపడితేనే పెటా ్టరు. ఈ తీర్మానానికి బలం రావాలి, కేంద్రంపై ఒత్తిడి పెరగాలి అంటే కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులను ఉపసంహరించుకుంటేనే సాధ్యమవుతుందని చెప్పాం. 15 రోజులో లేదా ఒక నెల రోజులో డెడ్‌లైన్‌ను ఇచ్చి... ఈలోపుగా కేంద్రం ప్రత్యేక హోదాను ప్రకటించకపోతే అందరమూ కలిసి మరో నాలుగడుగులు ముందుకేస్తామని కేంద్రానికి గట్టిగా చెప్పాలని డిమాండ్ చేశా. చంద్రబాబు ఏమీ చేయకపోగా ప్రజలను అయోమయంలో పడేసే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీలో ఒకరకంగా, విజయవాడలో మరో రకంగా మాట్లాడుతున్నారు. ఇక కేంద్ర మం త్రులైతే తలో రకంగా మాట్లాడుతూ గం దరగోళంలో పడేస్తున్నారు. ఇలా అయోమయపరిచే ప్రకటనలవల్ల, ఉద్యోగాలు రావనే భయంతో రాష్ట్రంలో ఐదుగురు మరణించారు. ముగ్గురు ఆత్మబలిదానాలు చేసుకుంటే మరో ఇద్దరు గుండె ఆగి మరణించారు. మరో ఐదుమంది ఆత్మహత్యాయత్నం చేసుకుని చికిత్స పొందుతున్నారు. ఆ బాధిత కుటుంబాలకు ఒక్క దమ్మిడీ కూడా ఆర్థిక సాయం ప్రభుత్వం ఇంతవరకూ చేయలేదంటే... ఆత్మబలిదానాలు చేసుకున్న కుటుం బాలపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. చంద్రబాబు, కేంద్రం మారాలి చంద్రబాబు మారాలి, చిత్తశుద్ధితో ఆయన కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే ప్రత్యేక హోదా వస్తుందనే విషయం ఆయన మర్చిపోకూడదు. అలా కాకుండా లంచాలతో సంపాదించిన డబ్బుతో ఓటుకు కోట్లు ఇస్తూ... అడ్డగోలుగా సంపాదించిన బ్లాక్‌మనీని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ వీడియో, ఆడియో టేపుల్లో దొరికిపోయి, ఆ కేసుల నుంచి బయట పడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి బయటపడే యత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర మంత్రివర్గానికి, నీతి ఆయోగ్‌కు, ప్రణాళికా సంఘం ఉంటే దానికి, ఎన్డీసీకి నేతృత్వం వహించేది ప్రధానమంత్రే. అన్నింటికీ ఆయనే నేతృత్వం వహిస్తున్నప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ నిర్ణయం తీసుకోవడానికి ఎందుకింత ఆలస్యం అయిందంటే... సమాధానం చెప్పేవారు లేరు. అందుకే ప్రత్యేక హోదాకోసం కేంద్రంపై ఒత్తిడి తీవ్రతరం చేసేందుకే నిరాహారదీక్షకు పూనుకుంటున్నా. సెప్టెంబర్ 15 వ తేదీ నిరాహారదీక్షే కాదు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఒత్తిడి చేసే కార్యక్రమాలు చేపడతాం. ప్రత్యేక హోదాపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మెడలు వంచేవరకూ ఈ పోరాటం కొనసాగుతుంది. -
ప్రకటన రాకుంటే నిరవధిక నిరాహార దీక్ష: వైఎస్ జగన్
-
ప్రకటన రాకుంటే నిరవధిక నిరాహార దీక్ష: వైఎస్ జగన్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 15లోపు ప్రత్యేక హోదాపై ప్రకటన రాకుంటే నివరధిక నిరాహార దీక్ష చేపడతామని ఆయన వెల్లడించారు. వైఎస్ జగన్ మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై కేంద్రంపై అందరూ కలిసికట్టుగా ఒత్తిడి తేవాలన్నారు. అప్పటికీ కేంద్రం నుంచి ప్రకటన రాకుంటే ...సెప్టెంబర్ 15వ తేదీన గుంటూరులో నివరధిక నిరాహార దీక్ష చేస్తామని వైఎస్ జగన్ తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నుంచి తన మంత్రులను చంద్రబాబు నాయుడు ఉపసంహరించుకుంటానంటే కేంద్రంలో కదలిక వస్తుందని వైఎస్ జగన్ అన్నారు. కేంద్రంపై ఒత్తిడిని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే.... ప్రత్యేక హోదాపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు హోదాను ఎప్పటిలోగా సాధిస్తారన్న దానిపై మేం చంద్రబాబును పదేపదే అడిగాం కానీ, చంద్రబాబు నోట నుంచి మాట రాలేదు ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చంద్రబాబు ఇచ్చిన వివరణ అస్పష్టంగా ఉంది ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మార్పణ చేసుకున్నవారి పేర్లు కూడా ప్రభుత్వానికి తెలియదు హోదా కోసం ఆత్మార్పణ చేసుకున్న వారికి ఇంతవరకూ ఒక్క దమ్మిడి పైసా కూడా ప్రభుత్వం ఇవ్వలేదు చంద్రబాబు చెప్తున్న మాటల్లో, చేస్తున్న పనుల్లో చిత్తశుద్ధి కనిపించలేదు కేసుల్లోంచి బయటపడేందుకే చంద్రబాబు ఎక్కువ దృష్టి పెడుతున్నారు తప్ప హోదాపై కాదు ప్రత్యేక హోదా కోసం మంగళగిరిలో 2 రోజుల దీక్ష చేశాం. ఢిల్లీలో ధర్నా చేశాం. బంద్ కూడా పాటించాం కమ్యూనిస్టులు బంద్ చేస్తే మద్దతు ఇచ్చాం కేబినెట్, నీతి ఆయోగ్, ప్రణాళికా సంఘం, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్‌కు ప్రధానే అధ్యక్షుడు ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎన్నిరోజులు పడుతుందని అడిగితే ఎవ్వరూ సమాధానం చెప్పడం లేదు బీజేపీ సభ్యులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు తన మంత్రులను ఉపసంహరించుకుంటేనే కేంద్రంపై ఒత్తిడి వస్తుంది అది జరగాలి అంటే ఇక్కడ చంద్రబాబు ఒత్తిడి చేయాల్సి ఉంది ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు, కేంద్రం మెడలు వంచాల్సిన పరిస్థితి ఉంది ఏపీకి ప్రత్యేక హోదా కోసం అంతా ఒక్కటై పోరాడుదాం -
24 నుంచి నిరశన దీక్ష: మాజీ సైనికులు
న్యూఢిల్లీ: రక్షణ శాఖలో ‘ఒకే ర్యాంకు ఒకే పెన్షన్(ఓఆర్ఓపీ)’ అమలు చేయాలన్న డిమాండ్‌తో ఉద్యమిస్తున్న మాజీ సైనికులు తమ ఆందోళనను మరింత తీవ్రం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 24 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నట్టు ‘యునెటైడ్ ఫ్రంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్‌మెన్ మూవ్మెంట్’ మీడియా సలహాదారు కల్నల్(రిటైర్డ్) అనిల్ కౌల్ తెలిపారు. మాజీ జవాన్లు డిమాండ్ చేస్తున్న ఓఆర్ఓపీని ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించిందని పంద్రాగస్టున ప్రధాని చెప్పినప్పటికీ.. దీనిని ఎప్పటినుంచి అమలు చేసేది పేర్కొనకపోవడం వారిని నిరాశకు గురిచేసింది. -
రేపటి నుంచి ఆమరణ దీక్ష
- ఢిల్లీలోని జంతర్‌మంతర్ వేదికగా ప్రారంభం - పార్లమెంటులో రైతుల సమస్యలపై చర్చించేందుకే - మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ వెల్లడి సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రైతు ఆత్మహత్యలు సాగుతున్న నేపథ్యంలో పార్లమెంటులో రైతుల సమస్యలపై చర్చకు అవకాశం కల్పించాలనే డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ వెల్లడించారు. ఢిల్లీలోని జంతర్-మంతర్‌లో సోమవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. శనివారమిక్కడి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దేవేగౌడ మాట్లాడారు. కర్ణాటకతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైతులు అనేక సమస్యలతో సతమతమవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. వీరి సమస్యలపై చర్చించేందుకు పార్లమెంటులో అవకాశం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై చర్చించేందుకు అవకాశం కల్పించాలని తాను ఇప్పటికే స్పీకర్‌కు లేఖ రాశానని, అయితే ఈ అంశంపై స్పీకర్ నుంచి ఎలాంటి సమాధానం లభించలేదన్నారు. అందుకే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. పార్లమెంటులో రైతుల సమస్యలపై చర్చకు అనుమతించే వరకు నిరాహార దీక్షను విరమించబోనని దేవేగౌడ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కేవలం బీజేపీని ఇరకాటంలో పెట్టాలనే వ్యూహంతోనే పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటోందని, ఇక పాలనా విషయంలో పూర్తిగా విఫలమైన బీజేపీ పార్లమెంటు సమావేశాలు కొనసాగకపోవడమే మంచిదన్నట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి సందర్భంలో రైతుల సమస్యలపై అర్ధవంతమైన చర్చ సాగేందుకు పార్లమెంటులో అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన పార్టీలు అధికారం చేజిక్కించుకున్న తర్వాత వారి సంక్షేమాన్ని గాలికొదిలేస్తున్నారని, ఇలాంటి పార్టీలన్నింటికి త్వరలోనే ప్రజలు సరైన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. -
ఎన్నాళ్లీ అక్రమ నిర్బంధం?
మందస: ‘జనజీవన స్రవంతి కలసిపోవాలన్న ఉద్దేశంతో ఆంధ్ర పోలీసు ఉన్నతాధికారుల ముందు లొంగిపోయిన నా కుమారునిపై కేసులు ఉన్నాయంటూ ఒడిశా పోలీసులు తీసుకుపోయారు. ఏళ్ల తరబడి జైలులో నిర్బంధించడంతో మానసికంగా, శారీరకంగా కుంగిపోయాడు. విధి లేక ఈ నెల 23 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. పరామర్శకు వెళ్లిన తనకు ఈ విషయం తెలియజేస్తూ కొన్ని డిమాండ్లతో కూడిన లేఖను నాకు అందజేశాడు. నిరాహార దీక్ష చేస్తే నా కుమారుడి ప్రాణానికి ముప్పు వాటిల్లుతుంది. అందువల్ల ఆంధ్ర, ఒడిశా పోలీసులు కరుణించి నా కుమారుడి విడుదలకు సత్వర చర్యలు చేపట్టాలి’.. ఇదీ మాజీ మావోయిస్టు దున్న కేశవరావు అలియాస్ ఆజాద్ తల్లి కాములమ్మ కన్నీటి నివేదన. తన కుమారుడు ఇచ్చిన లేఖను మంగళవారం తన స్వగ్రామం నల్లబొడ్డులూరులో విలేకరులకు ఆమె అందజేశారు. లొంగిపోయినా నిర్బంధంలోనే.. ఈ సందర్భంగా ఆమె అందజేసిన వివరాల ప్రకారం.. చిన్నతనంలోనే ఇంటి నుంచి వెళ్లిపోయిన కేశవరావు మావోయిస్టు ఉద్యమంలో చేరి అజ్ఞాత జీవితం గడిపాడు. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు 2011 మే 18న అప్పటి పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ద్వారా డీజీపీ అరవిందరావు సమక్షంలో పోలీసులకు లొంగిపోయారు. స్వగ్రామానికి వచ్చిన మూడు రోజులకే పోలీసులు వచ్చి పలాస డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న ఒడిశా పోలీసులు విచారణ జరిపి పంపేస్తామని చెప్పి తీసుకెళ్లారు. పలు కేసుల పెండింగులో ఉన్నాయంటూ భువనేశ్వర్‌లోని జార్పడ్ జైలులో నిర్బంధించారు. లొంగిపోయిన మాజీ మావోయిస్టును మూడున్నరేళ్లకుపైగా జైలులో ఉంచడం, దఫదఫాలుగా కేసులు బనాయిస్తూ వేధింపులకు గురి చేయడానికి నిరసనగా గతంలోనూ ఆజాద్ జైలులోనే నిరాహార దీక్ష చేపట్టాడు. తన కుమారుడిని విడుదల చేయాలని కాములమ్మ పలుమార్లు ఆంధ్ర, ఒడిశా ప్రభుత్వాలను కోరినప్పటికీ స్పందన లేదు. దీంతో విసిగిపోయిన ఆజాద్ తనను కారుణ్య మరణానికి(మెర్సీ కిల్లింగ్) అనుమతించాలని కోరుతూ కేంద్ర హోంశాఖతోపాటు ఆంధ్ర, ఒడిశా ప్రభుత్వాలకు, మానవ హక్కుల కమిషన్, హైకోర్టు, పలు ప్రజా సంఘాలకు లేఖ రాశాడు. లేఖలో నాలుగు డిమాండ్లు కాగా ఇటీవల కుమారుడిని చూసేందుకు జార్పడ్ జైలుకు వెళ్లిన తల్లి కాములమ్మకు అధికారులను ఉద్దేశించి రాసిన నాలుగు డిమాండ్లతో కూడిన లేఖను ఆజాద్ అందజేశాడు. కోర్టుల్లో ఉన్న కేసుల విచారణ ప్రక్రియ వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, ఏళ్ల తరబడి జైలులో ఉన్న సమయంలోనే కొత్త కేసులు కట్టడం, బెయిల్‌పై విడుదలైన తరువాత జైలు గేటు వద్దే అరెస్టు చేసి మళ్లీ కేసులు పెట్టడం మానుకోవాలని డిమాండ్ చేశాడు. అరెస్టు అయిన వ్యక్తిపై ఇతర అభియోగాలు ఉంటే నిర్ధిష్ట సమయంలో కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచాలని, మావోయిస్టు పేరుతో అరెస్టై జైలు జీవితం గడుపుతున్న వారందరినీ రాజకీయ ఖైదీలుగా గుర్తించాలని డిమాండ్ చేశాడు. న్యాయమైన ఈ డిమాండ్లను తీర్చే వరకు ఈ నెల 23 నుంచి ఆమరణ దీక్ష చేస్తానని తెలిపారు. తన కుమారుడితో పాటు ఇటువంటి వేధింపులే అనుభవిస్తున్న మరో ఏడుగురు కూడా జైల్లో దీక్షకు పూనుకున్నారని కాములమ్మ చెప్పారు. కాములమ్మ ఇంటికి పోలీసులు ఈ నేపథ్యంలో నల్లబొడ్డులూరులోని కేశవరావు ఇంటికి మంగళవారం సోంపేట సీఐ సూరినాయుడు, మందస ఎస్సై వి.రవివర్మ వెళ్లారు. ఆయన తల్లి కాములమ్మతో మాట్లాడారు. కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారని అనంతరం కాములమ్మ చెప్పారు. ఈ విషయం సీఐ వద్ద ప్రస్తావించగా మాజీ, ప్రస్తుత మావోయిస్టుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరమార్శించడం సాధారణమేనని చెప్పారు. -
ఐదో రోజుకు చేరిన రవీంద్రనాథ్ రెడ్డి దీక్ష
కడప: తాగు, సాగు నీటి కోసం వైఎస్ఆర్ జిల్లా వీరపునాయునిపల్లెలో కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేటికి ఐదో రోజుకు చేరింది. ‘గాలేరు-నగరి’కి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి త్వరిత గతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని గత అయిదు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఫ్లూయిడ్స్ తీసుకోవాలని, లేదంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు ఆయనకు సూచించారు. పార్టీ నేతల దీక్షకు మద్దతుగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు కమలాపురం మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి నిరవధిక దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. -
క్షీణించిన రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోగ్యం
సాక్షి ప్రతినిధి, కడప: ‘గాలేరు-నగరి’కి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి త్వరిత గతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని నాలుగు రోజులుగా వైఎస్ఆర్ జిల్లా వీరపునాయునిపల్లెలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. బుధవారం సాయంత్రానికి బాగా నీరసించిపోయారు. రక్తంలో చక్కెర నిల్వలు 54కు పడిపోయినట్లు స్థానిక ప్రభుత్వ వైద్యుడు అనిల్‌కుమార్ తెలిపారు. పరీక్షల అనంతరం బిపీ 160/90, పల్స్ రేట్ 52, బరువు 71 కిలోలు ఉన్నట్లు తెలిపారు. ఫ్లూయిడ్స్ తీసుకోవాలని, లేదంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని సూచించారు. పరిస్థితిని దగ్గరుండి చూస్తున్న కార్యకర్తలు, నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయనతోపాటు దీక్షలో ఉన్న కమలాపురం మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి బ్లడ్ షుగర్ 53కు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి బ్లడ్ షుగర్ 51కి పడిపోయింది. దీక్షలో ఉన్న నేతల ఆరోగ్యం క్షీణించడంపై నేతలు, కార్యకర్తలు వీరపునాయునిపల్లెలో రాస్తారోకో నిర్వహించారు. -
ఇరోం షర్మిల విడుదల.. మళ్లీ దీక్ష
ఇంఫాల్: సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టాన్ని రద్దుచేయాలన్న డిమాండ్‌తో 14 ఏళ్లుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఇరోం షర్మిలను గురువారం ఇంఫాల్ జ్యుడీషియల్ కోర్టు విడుదల చేసింది. షర్మిలపై మోపిన ఆత్మహత్యాయత్నం అభియోగాలను కోర్టు తిరస్కరించింది. షర్మిల ఆత్మహత్యకు యత్నించారన్న దానిపై ప్రాసిక్యూషన్ ఎలాంటి ఆధారాలను సమర్పించలేకపోయిందని కోర్టు తెలిపింది. గురువారం సాయంత్రం విడుదలైన షర్మిల స్థానిక మార్కెట్లోని ఓ షెడ్లో తిరిగి నిరాహార దీక్షకు కూర్చున్నారు. -
కేయూ విద్యార్థుల ఆమరణ దీక్ష
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని కామన్మెస్లో నాణ్యమైన భోజనం అందడం లేదని, యూనివర్సిటీ ఆధ్వర్యంలోనే ప్రైవేట్ మెస్‌ను నడిపించాలని డిమాండ్ చేస్తూ గురువారం వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆమరణ దీక్షకు దిగారు. బుధవారం రాత్రి భోజనంలో ప్రైవేట్ కాంట్రాక్టర్ బీరకాయ కర్రి ఇచ్చారు. అది చేదుగా ఉందని కొందరు విద్యార్థులు అప్పుడే నిరసన తెలిపారు. ఈ క్రమంలో గురువారం ఉదయం విద్యార్థులు కామన్మెస్కు తాళం వేశారు. తరగతుల బహిష్కరించి ఆమరణ దీక్షకు దిగారు. సమాచారం అందుకున్న క్యాంపస్ ప్రిన్సిపాల్ ఎన్.రామస్వామి అక్కడికి వచ్చి ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. నాణ్యమైన భోజనం అందడం లేదని, కాంట్రాక్టర్‌ను మార్చాలని కోరామని... ఈ మేరకు హామీ ఇచ్చి మరచిపోయూరంటూ ఆయనతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. బీరకాయ కూర చేదుగా ఉండడంతో వాంతులయ్యే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. నాణ్యమైన భోజనమందించేలా చర్యలు తీసుకుంటామని, ఆందోళన విరమించాలని విద్యార్థులకు ప్రిన్సిపాల్ సూచించారు. వారు ససేమిరా అనడంతో ఆయన వెళ్లిపోయారు. సాయంత్రం కేయూ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ఎంవీ.రంగారావు, ప్రిన్సిపాల్ రామస్వామి ,అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్యాంసన్ ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థుల వద్దకు వచ్చి నచ్చజెప్పేందుకు యత్నించారు. ప్రైవేట్ మెస్‌ను ఎత్తివేసి యూనివర్సిటీ ఆధ్వర్యంలో కోరుతున్నా.. పట్టించుకోకోపోవడంతో ఆమరణ దీక్షకు దిగామని విద్యార్థులు చెప్పారు. యూనివర్సిటీలో ప్రైవేట్ మెస్‌లను ఎత్తివేయడం తమ చేతుల్లో లేదని, రెగ్యులర్ వీసీ వచ్చేవరకు ఆగాలని రంగారావు వారికి సూచించారు. ప్రైవేట్ మెస్‌ను ఎత్తివేయకపోతే యూనివర్సిటీని బంద్‌చేసి ఆందోళనలు చేస్తామని విద్యార్థులు స్పష్టం చేయడంతో వారు వెళ్లిపోయూరు. కాగా, కామన్మెస్ కు తాళం వేసి విద్యార్థులు ఆమరణ దీక్షకు దిగడంతో గురువారం ఉదయం అల్పాహారంతో సహా రెండు పూటల భోజనం బంద్ కావ డంతో పీజీ ఫైనలియర్ విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కాగా, రాత్రి ఇన్చార్జ రిజిస్ట్రార్, క్యాంపస్ ప్రిన్సిపాల్ విద్యార్థులతో చర్చించారు. మూడు ప్రధాన సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో విద్యార్థులు రాత్రి పది గంటలకు దీక్ష విరమించారు.