‘ప్రత్యేక హోదా-ఏపీ హక్కు’ అనే నినాదంతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష శనివారం నాలుగోరోజుకు చేరింది.
గుంటూరు: ‘ప్రత్యేక హోదా-ఏపీ హక్కు’ అనే నినాదంతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష శనివారం నాలుగోరోజుకు చేరింది. వైఎస్ జగన్ చేపట్టిన దీక్షకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. విద్యార్థినీ, విద్యార్థులు, నిరుద్యోగ యువకుల కోలాహలం దీక్షా వేదిక వద్ద ఎక్కువగా కనిపిస్తోంది. బీపీ, షుగర్, పల్స్ సాధారణ స్థితిలోనే ఉన్నాయని శుక్రవారం రాత్రి వైద్యులు వెల్లడించారు. విద్యావేత్తలు స్వచ్ఛందంగా తమ మద్దతు ప్రకటించి, ప్రత్యేకహోదా ద్వారానే అభివృద్ధి సాధ్యమన్న వైఎస్ జగన్ అభిప్రాయంతో గొంతు కలుపుతున్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోను ధర్నాలు, రాస్తారొకోలు, బైక్‌ర్యాలీలు, కేంద్ర కార్యాలయాల ముట్టడి వంటి నిరసన కార్యక్రమాలు గత మూడు రోజులుగా కొనసాగుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం గుంటూరులోని నల్లపాడులో బుధవారం నాడు వైఎస్ జగన్ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన విషయం అందరికి విదితమే.